Sakshi News home page
Advertisement

Top Stories

ప్రధాన వార్తలు

Bjp Is Scared Of Mulayam Family, Shivpal Yadav Claimed
ములాయం సింగ్‌ కుటుంబం అంటే బీజేపీకి భయం

దివంగత సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత ములాయం సింగ్ యాదవ్ కుటుంబాన్ని చూసి అధికార పార్టీ బీజేపీ భయపడుతోందని సమాజ్‌వాదీ పార్టీ నేత శివపాల్ యాదవ్ అన్నారు. బీజేపీ నేతలు ఎస్పీకి వ్యతిరేకంగా ఎంత ఎక్కువ మాట్లాడితే.. లోక్‌సభ ఎన్నికల్లో విజయం అదే స్థాయిలో ఉంటుందని తెలిపారు.సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ తరుణంలో శివపాల్‌ యాదవ్‌ మీడియాతో మాట్లాడారు. మూడో దశ సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 10 స్థానాల్లో ఎస్పీ, ఇండియా కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.యూపీలో మొదటి రెండు దశల్లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో పేలవమైన ఓటింగ్‌పై శివపాల్ యాదవ్ మాట్లాడుతూ.. మా ఓటర్లు కూలీలు, రైతులు. వారు, ఎండని వేడిని పట్టించుకోరు. ఓటర్లు వారి ఓటు హక్కును ఉపయోగిస్తున్నారు. కానీ బీజేపీ ఓటర్లు బయటకు రావడం లేదు. అందుకే బీజేపీ నేతల్లో ఆందోళన నెలకొందని అన్నారు.  శివపాల్ యాదవ్‌కు వృద్ధాప్యం వచ్చిందని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఎస్పీ నేత శివపాల్‌ యాదవ్‌ స్పందించారు. నేను రోజుకు 40 సమావేశాలు నిర్వహిస్తున్నాను. యోగి మాత్రం రోజుకు నాలుగైదు సమావేశాలకు మాత్రమే హాజరవుతున్నారని తెలిపారు.యూపీలో 10లోక్‌సభ స్థానాలకు మే 7న మూడో దశ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. మెయిన్‌పురి, ఫిరోజాబాద్, సంభాల్, బుదౌన్  స్థానాలు ఉన్నాయి. ఈ దశలో ఓటింగ్‌కు వెళ్లే చాలా స్థానాలను ఎస్పీ కంచుకోటలుగా కొనసాగుతున్నాయి. 

Sajjala Ramakrishna Reddy fires Chandrababu Over Pensions Volunteers
పెన్షనర్ల ఉసురు చంద్రబాబుకు తగులుతుంది: సజ్జల

సాక్షి, తాడేపల్లి: వాలంటీర్ల సేవలను అడ్డుకున్నది చంద్రబాబేనని,పెన్షన్లు ఇవ్వకుండా కుట్ర చేశారని వైఎస్సార్‌సీసీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఆయన తాడేపల్లిలో సోమవారం మీడియాతో మాట్లాడారు.‘‘వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ పెన్షన్లు అందించాం. ప్రతి  ఇంటికి వాలంటీర్లు పౌరసేవలందించారు. తనపై వ్యతిరేకత వస్తుందనే భయంతో వాలంటీర్లపై చంద్రబాబు మాట మార్చారు. వాలంటీర్ల సేవలను అడ్డుకుని బాబు ఏం సాధించారు?. ఈసీ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. ఎల్లో మీడియాలో దుష్ప్రచారాలు చేయించడమే బాబు పని. చంద్రబాబు ఏజెంట్‌ ఢిల్లీలో కూర్చుకున్నాడు. ..చంద్రబాబు లెటర్లు  రాసి, ఫిర్యాదులు చేయిస్తున్నాడు. అధికారులపై లేనిపోని దుష్ప్రచారాలు చేయిస్తున్నాడు. చంద్రబాబు మనిషి జన్మ ఎలా ఎత్తాడో అర్థం కావటం లేదు. సీఎం జగన్‌ను తిట్టడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నాడు. బ్లూ కలర్‌ ఎక్కడ కనిపించినా చంద్రబాబుకు పీడ కలలు వస్తాయి...పెన్షనర్ల పరిస్థితికి చంద్రబాబే కారణం. చంద్రబాబు హయాంలో పెన్షన్ల కోసం అవస్థలు పడ్డారు. చంద్రబాబు ఏనాడు సరిగ్గా పెన్షన్లు అందించలేదు. పెన్షనర్ల ఉసురు చంద్రబాబుకు తగులుతుంది. చంద్రబాబు, ఆయన ముఠా కారణంగా పెన్షనర్లకు అవస్థలు. .. 2014-2019 మధ్య  ఏం జరిగిందనేది ప్రజలు మరచిపోలేదు. పెన్షనర్ల శాపాలు చంద్రబాబుకు తగులుతాయి. కులాల మధ్య చిచ్చు పెట్టే అలవాటు చంద్రబాబుకు, ఆయన దత్తపుత్రుడికి ఉంది. కూటమి డిపాజిట్లు గల్లంతవ్వడం ఖాయం. .. ప్రభుత్వం మీద, వ్యవస్థల మీద అడ్డగోలుగా చంద్రబాబు మాట్లాడుతున్నాడు. చంద్రబాబు బాధ్యత గల వ్యక్తిగా వ్యవహరించటం లేదు. ఈ దేశంలో ఉండే అర్హత చంద్రబాబు కోల్పోయాడు. సీఎం జగన్‌ చుక్కల భూముల సమస్యను పరిష్కరించారు. చంద్రబాబు ఏ రోజు ఏం మాట్లాడుతారో తెలియదు’’ అని సజ్జల ధ్వజమెత్తారు.

Asaduddin Owaisi Comments On TDP And BJP Parties
Asaduddin Owaisi: ముస్లింలు, దళితులకు చంద్రబాబు శత్రువు...

రిపోర్టర్‌: ఈ సారి దేశవ్యాప్తంగా ఎన్నికలు హిందూ-ముస్లిం, ముస్లిం రిజర్వేషన్‌లు అనే ఎజెండాపై జరుగుతున్నట్లు కనిపిస్తోంది. దీనిపై మీ అభిప్రాయం…ఓవైసి: సాక్షాత్తు ప్రధాని నరేంద్రమోదీ తన లోపాలను కప్పిపుచ్చేందుకు ఇలాంటి వాతావరణం సృష్టించారు. నిన్నటి దాకా విశ్వగురు, జీ-20, చంద్రయాన్‌, 5ట్రిలియన్‌ ఎకానమి అంటూ ఊదరగొట్టారు. ఇప్పుడు అవన్నీ వదిలేసి.. హిందూ-ముస్లిం వివాదం తీసుకువ్చచారు. ఇది చూస్తే అర్ధమవుతోంది… ప్రధాని మోదీకి ముస్లిం మైనారిటీలంటే ఎంత ధ్వేషమో. ముస్లింలను ధ్వేషించడం ఒక్కటే… ప్రధాని మోదీ గ్యారంటీ.రిపోర్టర్‌: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాతో పాటు ముస్లిం రిజర్వేషన్‌లు ఉన్న ప్రతీచోటా వాటిని తీసివేయాలనే ప్రయత్నం జరుగుతోంది… దీనిపై మీ అభిప్రాయం.ఓవైసి: 2004లో గులాంనబీ అజాద్‌ కాంగ్రెస్ పరిశీలకులుగా హైదరాబాద్ వచ్చారు. అప్పుడు కాంగ్రెస్ నేత యూనుస్ సుల్తాన్ ఇంట్లో జరిగిన సమావేశంలో… ముస్లిం రిజర్వేషన్‌లు ఇస్తామని దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హామీ ఇచ్చారు. హామి ఇచ్చినట్లుగానే అధికారంలోకి రాగానే వైఎస్సార్ ప్రభుత్వం ముస్లింలకు రిజర్వేషన్‌లు కల్పించింది.ముందుగా కోర్టు దీనిపై అభ్యంతరం చెప్పింది. దీంతో ప్రముఖ ఆంత్రోపాలజిస్టు కృష్ణన్ ఆధ్వర్యంలో కమిటీ వేసి… ముస్లింలలో కుల ప్రాతిపదికన 4శాతం రిజర్వేషన్‌లు ఇవ్వడం సహేతుకమే అని తేల్చారు. ఆ తరువాత వేసిన ఎస్‌ఎల్‌పీలో ముస్లిం రిజర్వేషన్‌లను అనుమతిస్తూ సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. చాలామంది ముస్లిం యువకులు, విద్యార్ధులు రిజర్వేషన్‌ల వల్ల లబ్ది పొందుతున్నారు.ఇప్పుడిప్పుడే ముస్లింలు కాస్త బాగుపడుతున్నారు. డాక్టర్లు, ఇంజనీర్లు, డీఎస్పీలు, ఆర్డీవోలు, టీచర్‌లుగా ఉద్యోగులు పొందుతున్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ వారికి ముస్లింలు అంటే తీవ్రమైన ధ్వేషం. 4శాతం రిజర్వేషన్ల ద్వారా ముస్లింలు లబ్దిపొందడం బీజేపీకి మింగుడుపడటం లేదు. విద్యా, ఉద్యోగ పరంగా ముస్లింలు స్వావలంబన సాధించడం బీజేపీకి నచ్చక వారు రిజర్వేషన్‌లు తొలగించేందుకు కుట్రలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాలో ముస్లింలకు మతం ప్రాతిపదికన రిజర్వేషన్లు లభించడం లేదు. ముస్లింలలోని నిమ్న కులాలు వారికి సమాజంలో ఉన్న సామాజిక, విద్యాపరమైన వెనకబాటు కారణంగా రిజర్వేషన్‌లు అందుతున్నాయి.ముస్లింల అభివృద్దిని అడ్డుకునేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లతో కలిసి ఆంధ్రప్రదేశ్‌లు చంద్రబాబునాయుడు, జనసేన పార్టీలు పనిచేస్తున్నాయి. టీడీపీ, జనసేన పార్టీలు ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీల శత్రువులు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు బీజేపీ ఎజెండా ఆధారంగా ముస్లిం, క్రిస్టియన్‌ మైనారిటీలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు.  ఏపీలో కూటమి అధికారంలోకి వస్తే బీజేపీ, జనసేనతో కలిసి చంద్రబాబు ముస్లిం రిజర్వేషన్‌లు లేకుండా చేస్తాడు. ముస్లిం రిజర్వేషన్‌ల తరువాత వీరు దళితులకు కూడా రిజర్వేషన్‌లు లేకుండా చేస్తారు. ఏపీ ప్రజలంతా ఆలోచించి చంద్రబాబు, బీజేపీ, జనసేనలాంటి మతతత్వ, ఫాసిస్టు పార్టీలను ఓడిస్తారని ఆశిస్తున్నాను.ఏపీ ప్రజలందరితో నేను విజ్ఞప్తి చేస్తున్నాను… మీరంతా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతుగా ఓటు వేయండి. జగన్‌మోహన్‌రెడ్డి మతతత్వవాది కాదు… జగన్‌మోహన్‌రెడ్డి లౌకికవాది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విభజన తరువాత చాలా సమస్యలున్నాయి.రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయనిర్ణయాలు తీసుకున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పుడు దళితులు, ముస్లింల ప్రయోజనాలపై రాజీపడలేదు. చంద్రబాబు మాత్రం ముస్లింలు, దళితుల ప్రజయోజనాలను తాకట్టుపెట్టి స్వలాభం ఆలోచించారు. 2002లో గుజరాత్‌ అల్లర్ల కారణంగా దేశం మొత్తం కాలిపోతుంటే, ముస్లింలపై దౌర్జన్యాలు జరుగుతుంటే చంద్రబాబు మాత్రం బీజేపీకి మద్దతిచ్చాడు. చంద్రబాబును ముస్లింలు ఎన్నటికీ నమ్మరు. ముస్లింల పట్ల చంద్రబాబుకు ఎలాంటి ప్రేమలేదు.

IPL 2024 Dc vs KKR: Delhi capitals won the toss elected to bat First
ఢిల్లీతో ​మ్యాచ్‌.. కేకేఆర్‌ స్టార్‌ బౌలర్‌ రీ ఎంట్రీ! తుది జట్లు ఇవే

ఐపీఎల్‌-2024లో మరో కీలక పోరుకు తెరలేచింది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఈ మ్యాచ్‌లో ఒక మార్పుతో బరిలోకి దిగింది. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కు దూరమైన పృథ్వీ షా తిరిగి జట్టులోకి వచ్చాడు. మరోవైపు కేకేఆర్‌ రెండు మార్పులు చేసింది. తుది జట్టులోకి మిచెల్‌ స్టార్క్‌, వైభవ్‌ ఆరోరా వచ్చారు. ఇక పాయింట్ల పట్టికలో కేకేఆర్‌ రెండో స్ధానంలో కొనసాగుతుండగా.. ఢిల్లీ ఆరో స్ధానంలో ఉంది.తుది జట్లుకోల్‌కతా నైట్ రైడర్స్: ఫిలిప్ సాల్ట్ (వికెట్‌ కీపర్‌), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్‌), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తిఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, అభిషేక్ పోరెల్, షాయ్ హోప్, రిషబ్ పంత్(కెప్టెన్‌), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రసిఖ్ దార్ సలామ్, లిజాద్ విలియమ్స్, ఖలీల్ అహ్మద్ 

alliance facing setback for Allocation of Glass Symbol To Janasena Rebels
కూటమికి గుచ్చుకున్న గాజు గ్లాసు!

సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో కూటమికి మరో తల నొప్పి మొదలైంది. టీడీపీ, జనసేన పార్టీ రెబల్స్‌ ఇస్తున్న షాక్‌కు కూటమికి గాజు గ్లాసు గుచ్చుకుంటోంది. గాజు గ్లాసుతో టీడీపీ, జనసేన రెబల్స్‌ పోటీలోకి దిగుతున్నారు. తాజాగా గాజు గ్లాస్‌ను ఫ్రీ సింబల్‌గా వాడుకోవచ్చని ఈసీ వర్గాలు తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈసీపై.. టీడీపీ, బీజేపీ పార్టీల ఒత్తిడి ఫలించదు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు వ్యవహరించింది.దీంతో  21 అసెంబ్లీ చోట్ల జనసేన అభ్యర్థులు గాజు గ్లాస్ గుర్తుపై పోటీ చేస్తుండగా.. ఈసీ ప్రకటనతో మిగిలిన చోట్ల స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ కేటాయించే అవకాశం ఉంది. కాగా, టీడీపీ, జనసేన రెబల్స్‌.. గాజు గ్లాస్ గుర్తుతోనే కూటమికి ధమ్కీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. విజయనగరం టీడీపీ రెబల్ మీసాల గీతకు, జగ్గంపేట జనసేన రెబల్ సూర్యచంద్రకు ఈసీ గాజు గ్లాస్ కేటాయించింది. ఇక.. ఎస్‌ కోటలో జనసేన రెబల్ కొట్యాడ లోకాభిరామకోటి గాజు గ్లాస్‌తో పోటీకి దిగుతున్నారు. మరోవైపు.. టీడీపీకి పలు నియోజకవర్గాల్లో రెబెల్స్ బెడద తప్పటం లేదు. విజయనగరం, ఉండి, పోలవరం, పెనుగొండ, హిందూపురంలో బరిలో రెబల్ అభ్యర్థులు పోటీకి దిగుతున్నారు. సినీనటుడు బాలకృష్ణపై పరిపూర్ణానంద స్వామి, పరిటాల సునీతపై ప్రొఫెసర్ రాజేష్, అదితి గజపతిపై మీసాల గీత , జ్యోతుల నెహ్రూపై సూర్యచంద్ర,  రఘురామకృష్ణంరాజుపై ఉండిలో మాజీ ఎమ్మెల్యే శివ రామరాజు, పోలవరంలో టీడీపీ రెబల్ మొడియం సూర్యచంద్రరావు బరిలో నిలుస్తున్నారు. 

Rishabh Pant holds edge over Hardik Pandya for T20 World Cup vice captaincy role: Reports
హార్దిక్‌ పాండ్యాకు బిగ్‌ షాక్‌.. టీమిండియా వైస్‌ కెప్టెన్‌గా పంత్‌!?

టీ20 వరల్డ్‌కప్‌-2024కు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ తమ జట్టును మే 1న ప్రకటించనుంది. ఇక ఇప్పటికే  వరల్డ్‌కప్‌ కోసం తుది జట్టును బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ చైర్మెన్‌ అజిత్ అగార్కర్, భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఖారారు చేసినట్లు తెలుస్తోంది. అయితే వరల్డ్‌కప్‌ జట్టు ఎంపిక చేసే క్రమంలో బీసీసీఐ సెలక్టర్లు ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టీమిండియా వైస్‌ కెప్టెన్సీ బాధ్యతలను వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌కు అప్పగించేందుకు సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు రోహిత్‌ డిప్యూటీగా వ్యవహరించిన హార్దిక్‌ పాండ్యాపై సెలక్టర్లు వేటు వేసినట్లు సమాచారం. ఐపీఎల్‌-2024లో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యా విఫలమయ్యాడు. కెప్టెన్‌గానే కాకుండా వ్యక్తిగత ప్రదర్శన పరంగా హార్దిక్‌ నిరాశపరుస్తున్నాడు. ఈ క్రమంలోనే సెలక్టర్లు హార్దిక్‌ను వైస్‌ కెప్టెన్సీ నుంచి తప్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ఇక 14 నెలల తర్వాత తిరిగి రీ ఎంట్రి ఇచ్చిన రిషబ్‌ పంత్‌ అదరగొడుతున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో పంత్ ఇప్పటివరకు 10 ఇన్నింగ్స్‌లలో 371 పరుగులు చేశాడు. కెప్టెన్సీ పరంగా కూడా పంత్‌ ఆకట్టుకుంటున్నాడు. అతడి సారథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ పాయింట్ల పట్టికలో ఆరో స్ధానంలో కొనసాగుతోంది.

Ola Cabs Ceo Hemant Bakshi Quits In Three Months
చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్‌ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు

ప్రముఖ క్యాబ్‌ సర్వీస్‌ సంస్థ ఓలా క్యాబ్స్‌లో కీలక పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. బాధ్యతలు చేపట్టిన మూడు నెలలకే ఆ సంస్థ సీఈఓ పదవికి హేమంత్ బక్షి రాజీనామా చేసినట్లు సమాచారం.  దీంతో పాటు సంస్థ పునర్నిర్మాణంలో భాగంగా ఓలా క్యాబ్స్‌ దాదాపు 200 మంది ఉద్యోగుల్ని తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయిఐపీఓకి ఓలా ఓలా క్యాబ్స్‌ ఐపీఓ వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. ఇందుకోసం ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్స్‌తో ఓలా క్యాబ్స్‌ ఇటీవలే చర్చలు నిర్వహించింది. మరో రెండు మూడు నెలల్లో సెబీకి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఓలా ఎలక్ట్రిక్‌ ఇప్పటికే ఐపీఓ కోసం సెబీకి దరఖాస్తు చేసుకుంది.ఈ తరుణంలో సీఈఓ రాజీనామా, ఉద్యోగుల తొలగింపు అంశం ఓలా క్యాబ్స్‌ చర్చాంశనీయంగా మారింది. కాగా, ఓలా క్యాబ్స్ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. 

SC stays CBI probe against Bengal officials teachers recruitment case
సీఎం మమత సర్కార్‌కు సుప్రీం కోర్టులో ఊరట

ఢిల్లీ: టీచర్ల నియామకాలకు సంబంధించిన కేసులో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఊరట లభించింది. 24 వేల టీచర్ల నియామకాన్ని పూర్తిగా  రద్దు చేసి, సీబీఐ విచారణ చేపట్టాలని కోల్‌కతా హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును టీఎంసీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో  సవాల్‌ చేసింది. ఈ క్రమంలో సోమవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. ఈ కేసులో పశ్చిమ బెంగాల్‌ స్కూల్‌ సర్వీస్‌ కమిషన్‌కు చెందిన ప్రభుత్వ అధికారులపై లోతుగా దర్యాప్తు చేయాలన్న సీబీఐకి ఇచ్చిన ఆదేశాలపై తాజాగా స్టే విధించింది.2016 నాటి టీచర్లు, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ రిక్రూట్‌మెంట్‌లో  అవకతవకలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఇటీవల కోల్‌కతా హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. అప్పటి మొత్తం రిక్రూట్‌మెంట్‌ను రద్దు చేయాలని... ఇప్పటివరకు టీచర్లు తీసుకున్న జీతాలను వడ్డీతో సహా చెల్లించాలని తీర్పు  ఇచ్చింది. ఇక ఈ రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియపై పశ్చిమ బెంగాల్‌ స్కూల్‌ సర్వీస్‌ కమిషన్‌ను మరింత దర్యాప్తు చేయాలని సీబీఐని ఆదేశించిన విషయం తెలిసిందే. కోల్‌కత హైకోర్టు తీర్పుపై దీదీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీంతో తాజాగా సీబీఐ దర్యాప్తుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఈ కేసుపై సుప్రీం కోర్టు తదుపరి విచారణను మే 6 తేదీకి వాయిదా వేసింది. ఇప్పటికే ఈ వ్యవహరంలో సీబీఐ మాజీ విద్యాశాఖ మంత్రి పార్థా చటర్జీ, పశ్చిమ బెంగాల్‌ స్కూల్‌ సర్వీస్‌ కమిషన్‌లోని పలువురు అధికారులను సీబీఐ అరెస్ట్‌ చేయటం గమనార్హం.

CM Jagan Serious Comments At Ponnur Meeting Guntur
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్‌

సాక్షి, గుంటూరు: చంద్రబాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమేనని అన్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. చంద్రబాబు ఎలాంటివాడో చెప్పడానికి 2014 కూటమి మేనిఫెస్టో సరిపోతుందని మండిపడ్డారు. విలువలు, విశ్వసనీయత లేని బాబు.. ఎన్నికలయ్యాక మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేస్తాడని విమర్శించారు. గుంటూరు పొన్నూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం జగన్‌.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిపై నిప్పులు చెరిగారు.జననేత రాకతో పొన్నూరులో పండుగ వాతావరం నెలకొంది. సీఎం నినాదాలతో ప్రచార సభ మార్మోగిపోయింది. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. మరో రెండు వారాల్లో కురుక్షేత్ర సంగ్రామం జరగబోతుందన్నారు. ఈ యుద్ధంలో ఓ వైపు కౌరవ సేన, దృష్ట చతుష్టయం ఉందని విమర్శించారు. గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు అందరినీ మోసం చేసిన చరిత్ర ఆ కూటమిని దుయ్యబట్టారు. ఆయనకు మద్దతుగా రెండు జాతీయ పార్టీలు, ఉన్నాయని ఒక వదినమ్మ, ఒక దత్తపుత్రుడు, ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.పేదవాడికీ మేలు చేసిన చరిత్రలేని వీళ్లంతా కూటమిగా చేరి ఇంటింటికీ మంచి చేసిన ఒకే ఒక్కడైన మీ జగన్‌తో యుద్ధం చేస్తున్నారన్నారు. వైఎస్‌  జగన్‌ నమ్ముకున్నది మిమ్మల్ని(ప్రజలు), పైనున్న ఆ దేవుడినే అని తెలిపారు.  జగన్‌ పొత్తు ప్రజలతోనే ఉంన్నారు. ఈ ఎన్నికలు రాబోయే  ఐదేళ్లకు ప్రజల ఇంటి అభివృద్ధిని నిర్ణయించేవన్నారు. పేదల తలరాతలను నిర్ణయించేవని చెప్పారు. వైఎస్‌ జగన్‌కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగుతాయని.. పొరపాటున చంద్రబాబుకు ఓటు  వేస్తే పతకాలన్నీ ఆగిపోతాయని తెలిపారు.సీఎం జగన్‌ పూర్తి ప్రసంగం విశ్వసనీయత ఉన్న ఈ ప్రభుత్వం మీద విలువలు లేని చంద్రబాబు ఎలా నోరుపారేసుకుంటున్నారో వింటున్నారు కదా14 ఏళ్ల ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏం చేశాడో చెప్పకుండా జగన్‌ను తిడుతున్నాడుచంద్రబాబు నన్ను ఒక బచ్చా అంటున్నాడుపోయేకాలం వచ్చినప్పుడు విలన్‌లందరికీ హోరో బచ్చాలనే కనిపిస్తాడునువ్వు బచ్చా అంటున్న నేను ఎన్నికల్లో ఒంటరిగా నిలబడి ధైర్యంగా పొరాడుతున్నా14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు  ఏం చేశాడో చెప్పుకోలేకపోతున్నాడుచంద్రబాబు పేరు చెబితే గుర్తు వచ్చే ఒక్కమంచి పథకం అయినా ఉందా?14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ప్రజలకు తాను చేసిన మేలు చెప్పి ఓట్లు ఎందుకు అడగలేకపోతున్నాడు?మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేాశా అని చెప్పే చంద్రబాబు పేదవాళ్లకు చేసిన ఒక్కటంటే ఒక్క మంచి అయినా ఉందా?బచ్చా అంటున్న జగన్‌ను చూసి.. బాబు ఎందుకు బయపడుతున్నాడు?బచ్చాను ఎదుర్కొనేందుకు ఇన్ని పార్టీలతో పొత్తు ఎందుకు?చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?అమ్మ ఒడి, చేయూత, ఆసరా, సున్నావడ్డీ, ఈబీసీ నేస్తం, వాహనమిత్ర, పెన్షన్‌ వంటి పథకాలు నువ్వు ఎందుకు చేయలేదు?ఐదేళ్లలో నేను అమలు చేసిన పథకాలనే అమలు చేస్తానని ఎందుకు చెబుతున్నావు?రుణమాఫీ చేస్తానన్నాడు చేశాడా?గత మేనిఫెస్టోలో చెప్పినవి 99 శాతం హామీలు అమలు చేశాంలంచాలు, వివక్ష లేకుండా రూ. 2 లక్షల 70 వేల కోట్లు అందించాంనాడు-నేడుతో విద్యా, వైద్య రంగంలో మార్పులు తీసుకొచ్చాం.31 లక్షల ఇళ్ల పట్టాలు,. 22 లక్షల ఇళ్ల నిర్మాణం ఈ 58 నెలల కాలంలోనే జరిగింది.నా కేబినెట్‌లో‌  68శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నారు.58 నెలల్లోనే 2 లక్షల 31 వేల ఉద్యోగాలిచ్చాం200 స్థానాల్లో 100 టికెట్లు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకే ఇచ్చాపేదల భవిష్యత్తు మరో రెండడుగులు ముందుకు వేసేలా 2024 మేనిఫెస్టో.

Entire chiranjeevi family to campaign for Pawan kalyan
ఒక్కడి కోసం ఫ్యామిలీ మొత్తం దిగింది

పార్టీ పెట్టి పుష్కరం దాటినా అసెంబ్లీ  గేటును తాకలేకపోయిన పవన్ కళ్యాణ్ను ఈసారైనా గేటు దాటించేందుకు ఆ ఫ్యామిలీ మొత్తం శ్రమిస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ పలుమార్లు పిఠాపురంలో పర్యటించారు. వర్మ కాళ్ళు పట్టుకోవడం ఒక్కటే తక్కువ.. మొత్తానికి  తనను అసెంబ్లీకి పంపే బాధ్యత వర్మదే అని పూర్తిగా సరెండర్ అయ్యారు పవన్. ఇక నాగబాబు.. ఇంకా జబర్దస్త్ టీమ్ ఆది, గెటప్ శ్రీను ఇలా చాలామంది అక్కడ ప్రచారం చేస్తూనే ఉన్నారు. దీంతోబాటు మొన్న వరుణ్ తేజ్ సైతం రాడ్ షో నిర్వహించి బాబాయ్‌ను గెలిపించాలని కోరారు.ఇది కూడా సరిపోవడం లేదని భావించిన పవన్ ఇక ఏకంగా తన పెద్దన్న చిరంజీవిని సైతం రంగంలోకి దించుతున్నారు. తానూ రాజకీయాలకు దూరమని, అసలు పక్క రాష్ట్ర పాలిటిక్స్ గురించి మాట్లాడాల్సిన అవసరం తనకు లేదని, తానిప్పుడు పూర్తిగా సినిమాల మీద దృష్టిపెట్టానని, తనను పాలిటిక్స్‌లో ఇన్వాల్వ్ చేయవద్దని ఆమధ్య మీడియాముఖంగా ప్రజలకు వివరణ ఇచ్చారు. ఐతే ఇప్పుడు పవన్ పరిస్థితి దారుణంగా ఉందని రిపోర్ట్స్ వస్తున్నా తరుణంలో చిరంజీవి ఎన్డీయే కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబులతో కూర్చుని ఒక వీడియోను సైతం రిలీజ్ చేసారు.ఇక అవనీ కాదు కానీ నేనే వస్తాను అని ఫిక్స్ అయిన చిరంజీవి ఇప్పుడు పిఠాపురం వస్తున్నారు. త్వరలో అయన ప్రచారం చేస్తారు. వాస్తవానికి ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున పవన్ మీద పోటీ చేస్తున్న వంగా గీత 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున గెలిచారు. అప్పట్లో టీడీపీ అభ్యర్థిగా వర్మ పోటీ చేశారు. ఆనాడు చిరంజీవి వంగా గీతకు పిఠాపురంలో ప్రచారం చేశారు. అప్పుడు గీత ఏకంగా వర్మను ఓడించి అసెంబ్లీకి వెళ్లారు.  అయితే ఆ వంగా గీత ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున మళ్ళీ అదే పిఠాపురంలో పోటీ చేస్తున్నారు. ఐతే ఇప్పుడు అదే చిరంజీవి గీతకు వ్యతిరేకంగా తమ్ముడు పవన్ కోసం ప్రచారం చేస్తున్నారు. గతంలో గీతను గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేసిన చిరంజీవి ఇప్పుడు అదే గీతను ఓడించాలంటూ తమ్ముడి కోసం ప్రచారం చేయబోతున్నారు. మొత్తానికి సీఎం వైఎస్ జగన్ ప్రభావంతో పవన్‌కు ఓటమి భయం పట్టుకుంది. దానికితోడు స్థానికురాలు అయిన గీతను ఓడించడం తనకు అసాధ్యం అని పవన్ కు అర్థం కావడంతో కనీసం జీవితంలో ఒకసారి అయినా ఎమ్మెల్యే అవ్వాలన్న జీవితాశయం నెరవేర్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.:::: సిమ్మాదిరప్పన్న

తప్పక చదవండి

Advertisement
Advertisement


Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all
Advertisement
Advertisement
Advertisement