Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

AP Elections 2024: May 14th Politics Latest News Updates Telugu
May 14th: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌

May 14th AP Elections 2024 News Political Updates.10:50 AM, May 14th, 2024కూచివారిపల్లిలో టీడీపీ నేతల దాష్టీకంచంద్రగిరి మండలం కూచివారిపల్లిలో టీడీపీ నేతల దాష్టీకంసర్పంచ్‌ చంద్రశేఖర్‌రెడ్డి ఇంటికి నిప్పు పెట్టిన టీడీపీ గూండాలుసర్పంచ్‌ ఇల్లు పూర్తిగా దగ్ధం, పలు కార్లు ధ్వంసంకూచివారిపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు 9:43 AM, May 14th, 2024జేసీ కుటుంబంపై కేసు..టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీ పై కేసు నమోదు చేసిన పోలీసులుపోలింగ్ సందర్భంగా తాడిపత్రి పట్టణంలో విధ్వంసం సృష్టించిన జేసీ కుటుంబ సభ్యులుతాడిపత్రి టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, జేసీ పవన్ రెడ్డి లపై ఎఫ్ ఐ ఆర్జేసీ కుటుంబ సభ్యులతో పాటు 100 మంది టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదుతాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కాన్వాయ్ పై రాళ్లతో దాడి చేసిన టీడీపీ నేతలుఐదు వాహనాలు ధ్వంసం, ఇద్దరు కానిస్టేబుళ్లు సహా పలువురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు గాయాలుఈ ఘటనలపై లోతుగా విచారణ చేపట్టిన పోలీసులు9:20 AM, May 14th, 2024రెచ్చిపోయిన జనసేనకోనసీమ జిల్లాలో రెచ్చిపోయిన జనసేన కార్యకర్తలుకపిలేశ్వరపురం మండలం వల్లూరులో జనసేన కార్యకర్తల వీరంగంవైఎస్సార్‌సీపీ నేత పృథ్వీరాజ్‌ కారును ధ్వంసం చేసిన జనశ్రేణులుఅర్థరాత్రి విధ్వంసం సృష్టించిన జనసేన నేత లీలాకృష్ణలీలాకృష్ణను అదుపులోకి తీసుకున్న పోలీసులు8:41 AM, May 14th, 2024పల్నాడు జిల్లాలో బరితెగించిన టీడీపీ నేతలుతమకు ఓట్లు వేయని వారిని టార్గెట్ చేసి దాడులు నిర్వహిస్తున్న టీడీపీ నేతలుసత్తెనపల్లి నియోజకవర్గం లోని మాదల, తొండపి గ్రామాల్లో రాత్రి విధ్వంసంగురజాల మండలం కొత్త గణేషని పాడులో తెలుగుదేశం విధ్వంసంకర్రలు రాళ్లతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఇళ్లపై దాడిపోలింగ్ అనంతరం మూడు గంటల పాటు నిరంతరాయంగా దాడులుకొత్త గణేష్ ని పాడు లో బీసీల పైన దాడి చేసిన తెలుగుదేశం గుండాలువైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇల్లు ధ్వంసంసీఐ స్థాయి నుంచి డీఐజీ వరకు సమాచారం ఇచ్చిన పట్టించుకోని పోలీసులు7:48 AM, May 14th, 2024పోటెత్తిన ఓటర్లు: ఏపీ సీఈవో ముఖేష్‌కుమార్‌ మీనాఉ.6 గంటల నుంచే భారీ క్యూలైన్లలో ఓటర్లుఎన్నడూలేని విధంగా పెద్దఎత్తున తరలి వచ్చిన మహిళలు, వృద్ధులుసా.6 తర్వాత కూడా 3,500 కేంద్రాల్లో కొనసాగిన పోలింగ్‌గత ఎన్నికల కంటే ఓటింగ్‌ శాతం పెరుగుతుందని అంచనాపలుచోట్ల ఈవీఎంల మొరాయింపు, గాలివాన బీభత్సంతో మందకొడిగా సాగిన పోలింగ్‌చెదురుమదురు సంఘటనలు తప్ప ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలుహింసాత్మక ఘటనల కారకులపై కేసు నమోదుఇప్పటివరకు ఎక్కడా రీపోలింగ్‌ కోరుతూ అభ్యర్థనలు రాలేదురాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా7:32 AM, May 14th, 2024పచ్చ ముఠాల విధ్వంస కాండఓటమి భయంతో వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులు, దౌర్జన్యాలురాళ్లదాడులు, కత్తులతో బీభత్సం, బాంబులతో భయోత్పాతంయథేచ్ఛగా విధ్వంసం సృష్టించిన టీడీపీ, జనసేనచంద్రబాబు పక్కా పన్నాగంతోనే ధ్వంస రచనఎప్పటికప్పుడు ఫిర్యాదు చేసినా ఈసీ ఉదాసీనతశ్రీసత్యసాయి జిల్లా ఓడీ చెరువులో యువకుడికి కత్తిపోట్లువైఎస్సార్‌సీపీ కార్యకర్తపై కత్తెరతో ‘చింతమనేని’ అనుచరుల హత్యాయత్నం.. వైఎస్సార్‌ జిల్లాలో రెచ్చిపోయిన పచ్చ మూకలుఅన్నమయ్య జిల్లాలో బరితెగించి రౌడీయిజంవైఎస్సార్‌ జిల్లా మబ్బు చింతలపల్లెలో కారు అద్దాలు ధ్వంసంజంగాలపల్లి పోలింగ్‌ బూత్‌లో బరితెగించిన టీడీపీ కార్యకర్తలుచిత్తూరు జిల్లా పెరుమాళ్ల కండ్రిగలో ఇళ్లపై దాడులు, కార్లు ధ్వంసంకోనసీమ, కాకినాడ జిల్లాల్లో మితిమీరిన టీడీపీ నేతల ఆగడాలు 7:30 AM, May 14th, 2024పల్నాట పచ్చ మూక బీభత్సకాండఓటమి భయంతో రెచ్చిపోయిన టీడీపీ నేతలు.. ఓటర్లు, వైఎస్సార్‌సీపీ నేతలు, ఏజెంట్లపై దాడులుమాచర్ల ఎమ్మెల్యే పీఆర్కే తనయుడు గౌతమ్, డ్రైవర్‌పై దాడితంగెడలో పెట్రోలు బాంబులతో దాడి.. 8 మందికి తీవ్ర గాయాలుపాల్వాయి, తుమృకోటల్లో ఈవీఎంలు ధ్వంసంముప్పాళ్లలో మంత్రి అంబటి అల్లుడు కారు అద్దాలు ధ్వంసంనూజెండ్ల మండలంలో దళితులపై అరాచకంకేశానుపల్లిలో ఇళ్లకు వెళ్లి వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులపై దాడి.. చోద్యం చూసిన పోలీసులు 7:24 AM, May 14th, 2024ఆగని టీడీపీ అరాచకాలు దొంగ ఓట్లు వేయించేందుకు తీవ్ర యత్నాలుగణబాబు, శ్రీభరత్‌ చిత్రాలతో స్లిప్‌ల పంపిణీఅడ్డుకున్న వైఎస్సార్‌ సీపీ నాయకులుపోలీసుల వ్యవహార శైలిపై విమర్శలు7:15 AM, May 14th, 2024ప్రజాస్వామ్యానికి పచ్చ బ్యాచ్‌ తూట్లుఅడుగడుగునా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలుసీఎం రమేష్‌ ఓవరాక్షన్‌.. పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లి ఎన్నికల ప్రచారంటీడీపీ ఏజెంట్లతో ఫొటో షూట్‌క్యూలో నిల్చున్న ఓటర్లకు ప్రలోభాల ఎర 7:17 AM, May 14th, 2024నిమ్మాడలో అచ్చెన్న కుటుంబం బరితెగింపువైఎస్సార్‌సీపీ ఏజెంట్‌ అప్పన్నను బెదిరించి మరీ రిగ్గింగ్‌ పలు గ్రామాల్లోని ఓటర్లు పోలింగ్‌ బూత్‌కు రాకుండా అడ్డుకున్న కింజరాపు కుటుంబం ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దువ్వాడ7:07 AM, May 14th, 2024మరోసారి ఫ్యాన్‌ సునామీ పోలింగ్‌ కేంద్రాల వద్ద ఉదయం 6 గంటల నుంచే ఓటర్ల బారులుఉప్పెనలా కదలివచ్చిన వృద్ధులు, మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలుపట్టణాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే అధిక శాతం ఓటింగ్‌ సాయంత్రం 5 గంటలకు 68.04 శాతం పోలింగ్‌ నమోదుగంటల వరకు క్యూలైన్లలో ఉన్న వారందరికీ ఓటేసే అవకాశం కల్పించిన ఈసీపలుచోట్ల రాత్రి 10 వరకూ కొనసాగిన పోలింగ్‌.. 76.50 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఈసీ వర్గాల వెల్లడిఫలితాలను నిర్దేశించేది మహిళలు, గ్రామీణులేనన్న ఇండియాటుడే టీవీ కన్సల్టింగ్‌ ఎడిటర్‌ రాజ్‌దీప్‌.. ప్రభుత్వ సేవలను బట్టే 80శాతం మహిళలు ఓట్లు వేస్తారన్న యాక్సిస్‌ మై ఇండియా సీఎండీ ప్రదీప్‌ గుప్తాసచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటి గుమ్మం వద్దే ప్రజలకు ప్రభుత్వం సేవలుసంక్షేమాభివృద్ధి పథకాలతో ఇంటింటా వచ్చిన విప్లవాత్మక మార్పును ప్రతిబింబించిన పోలింగ్‌ సరళిప్రభుత్వ సానుకూలత సునామీలా ఓటెత్తిందంటున్న రాజకీయ పరిశీలకులు

AP Elections 2024: YSRCP In Josh After Huge Polling
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం

గుంటూరు, సాక్షి: ఆనందోత్సాహాలు.. పోలింగ్‌ శాతం పెంచేందుకు పౌరులను తరలించడంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు.. రెట్టించిన జోష్‌తో కదిలాయి. పోలింగ్‌ సరళి, మహిళలు..వృద్ధులు.. దివ్యాంగులు సైతం ఉత్సాహంగా పాల్గొన్న తీరు, యువత, రైతులు ఎక్కువ సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనడం వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలతో వైఎస్సార్‌సీపీలో ఉత్సాహం ఉరకలేసింది. మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమంటూ.. వైఎస్సార్‌సీపీ శ్రేణులు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.సజ్జల రామకృష్ణారెడ్డి సహా పార్టీ ముఖ్య నేతలంతా పోలింగ్ సరళిపై ఒక అంచనాకు వచ్చారు. పోటెత్తిన ఓటర్లు.. మహిళలు, వృద్దులు, గ్రామీణులే విజయాన్ని డిసైడ్ చేశారంటున్నారు. ఏపీ ప్రజలు సీఎం జగన్‌ 59 నెలల సంక్షేమ పాలనను మెచ్చి.. మళ్లీ ఆయన్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని దీని ద్వారా తేటతెల్లమైందని వ్యాఖ్యానిస్తున్నారు. జూన్‌ 4 వరకు ఉత్కంఠ అక్కర్లేదంటూ.. ముందే వారిలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. తమ నేతలకు అభినందనలు చెబుతున్నారు. కార్యాలయాలు, నివాసాలు కార్యకర్తల కేరింతలతో నిండిపోయాయి.ఇదీ చదవండి: ఉప్పెనలా ప్రభుత్వ సానుకూలతఇక.. ‘‘ఓ వైపు కవ్వింపులు.. దాడులు.. మరోవైపు అసహనంతో టీడీపీ-జనసేన శ్రేణుల తీరు. పోలింగ్‌ సరళి మేరకు.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి శ్రేణుల్లో నైరాశ్యం వ్యక్తమవుతోంది. అసహనం పెరిగిన నేపథ్యంలో పలు ప్రాంతాల్లో దాడులకు పాల్పడ్డాయి ఆ పార్టీ కేడర్‌లు. ఇక ఓటర్లు సైతం ప్రలోభాలకు లొంగలేదు. ఓటమి భయంతో పచ్చ మూకల విధ్వంసకాండ దిగినా ఓటర్లు బెదర్లేదు. పోలింగ్ జరిగిన తీరు, ఉదయాన్నుంచే బారులు తీరిన ఓటర్లే వైఎస్సార్‌సీపీ గెలుపునకు సాక్ష్యం అంటున్నాయి ఆ పార్టీ శ్రేణులు, అభిమానులు. పచ్చ ముఠాల విధ్వంసకాండజనసేన కార్యకర్తల దౌర్జన్యంజమ్మలమడుగు ఎమ్మెల్యేపై రాళ్ల దాడిపల్నాట పచ్చ మూక భీభత్సకాండఆగని టీడీపీ అరాచకాలు

Bombay High Court refuses to quash case against former AP CM Chandrababu Naidu
చంద్రబాబుకు బాంబే హైకోర్టు షాక్‌

ముంబయి: టీడీపీ అధినేత చంద్రబాబుకు బాంబే హైకోర్టు గట్టి షాక్‌ ఇచి్చంది. 2010 జూలైలో మహారాష్ట్రలో పోలీసు సిబ్బందిపై దాడికి పాల్పడిన వ్యవహారంలో తమపై నమోదైన కేసును కొట్టేయాలని చంద్రబాబు, టీడీపీ నేత నక్కా ఆనందబాబు దాఖలు చేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు ఔరంగాబాద్‌ బెంచ్‌ తోసిపుచి్చంది. ఈ మేరకు న్యాయమూర్తులు మంగేష్‌ పాటిల్, శైలేష్‌ బ్రహ్మేలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ మే 10న తీర్పు వెలువరించింది.పోలీసులతో చంద్రబాబు, నక్కా ఆనంద్‌ బాబు అనుచితంగా వ్యవహరించారనడానికి ఆధారాలున్నాయని పేర్కొంది. ఇందులో ఎలాంటి సందేహం లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా ధర్మాబాద్‌ పోలీసులు తమపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన రెండు పిటిషన్లను హైకోర్టు బెంచ్‌ కొట్టేసింది. పోలీసులపై చంద్రబాబు దాడి ప్రభుత్వోద్యోగిపై దాడి చేయడం, ప్రమాదకరమైన ఆయుధాలతో హాని కలిగించడం, ప్రాణాలకు హాని కలిగించే చర్యలు, శాంతికి భంగం కలిగించే ఉద్దేశంతో పోలీసులను ఉద్దేశపూర్వకంగా అవమానించడం, నేరపూరిత బెదిరింపులకు పాల్పడటం వంటి వాటిపై చంద్రబాబు, నక్కా ఆనంద్‌ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసును విచారించిన బాంబే హైకోర్టు ఔరంగాబాద్‌ బెంచ్‌ మొదటి నిందితుడైన చంద్రబాబు పోలీసులపై దాడికి తన అనుచరులను ప్రోత్సహించారని పేర్కొంది.మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ మధ్య యుద్ధ వాతావరణం సృష్టించారని వెల్లడించింది. సాక్షులు సైతం పోలీసులపై దాడిలో చంద్రబాబు, నక్కా ఆనంద్‌బాబుల పాత్ర ఉందని తెలిపారని ధర్మాసనం గుర్తు చేసింది. ఆ ఘటనలో అనేకమంది పోలీసు అధికారులు గాయపడినట్లు మెడికల్‌ సరి్టఫికెట్లు కూడా ధ్రువీకరిస్తున్నాయని పేర్కొంది. పోలీసు సిబ్బందిపై దాడి చేయాలనే ఈ నేరం చేసినట్లు తెలుస్తోందని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. కేసు ఇదీ.. 2010 జూలైలో చంద్రబాబు, ఆనంద్‌ బాబు తదితరులను కలిపి మొత్తం 66 మందిని రిమాండ్‌కు తరలించి ధర్మాబాద్‌లోని ప్రభుత్వ విశ్రాంతి గృహంలోని తాత్కాలిక జైలులో ఉంచారు. వారి జ్యుడీషియల్‌ కస్టడీని పొడిగించడంతో మహా­రాష్ట్ర జైళ్ల డీఐజీ వారిని ఔరంగాబాద్‌ సెంట్రల్‌ జైలుకు తరలించాలని ఆదేశించారు. అయితే, చంద్రబాబు, ఆనంద్‌ బాబు దీన్ని అడ్డుకోవడంతోపాటు తెలుగు, ఇంగ్లి‹Ùలో పోలీసు అధికారులను దూషించారు.అంతేకాకుండా బస్సు ఎక్కడానికి నిరాకరించడంతోపాటు పోలీసులపై దాడి చేశారు. దీంతో అదనపు బలగాలను రప్పించి చంద్రబాబు, ఆనంద్‌ బాబు తదితరులను ఔరంగాబాద్‌ సెంట్రల్‌ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో తమపై దాఖలైన కేసును కొట్టేయాలని చంద్రబాబు దాఖలు చేసిన రెండు పిటిషన్లను ధర్మాసనం రద్దు చేసింది. అయితే చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూద్రా విన్నపం మేరకు గతంలో వారికిచి్చన మధ్యంతర రక్షణను జూలై 8 వరకు పొడిగించింది.నిబంధనల ప్రకారమే కేసులు: ధర్మాసనం అంతకుముందు సీనియర్‌ న్యాయ­వాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపిస్తూ ఆందోళనలు, నిరసనకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ను పోలీసులు ఉపసంహరించుకున్నారని, ఆ కేసులో నిందితులందరినీ మేజి్రస్టేట్‌ వెంటనే విడుదల చేశారన్నారు. అయితే, దాడి కేసులో పోలీసులు చంద్రబాబును, నక్కా ఆనంద్‌ బాబును ఇరికించారని ఆరోపించారు. జైళ్ల చట్టంలోని నిబంధనల ప్రకారం ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసే అధికారం జైళ్ల సూపరింటెండెంట్‌కు మాత్రమే ఉందన్నారు.ప్రస్తుత కేసులో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది సీనియర్‌ జైలర్‌ అని, ఆయనకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసే అధికారం లేదని లూత్రా అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే కోర్టు ఈ వాదనలను తిరస్కరించింది. నిందితులపై భారతీయ శిక్షాస్మృతిలోని నిబంధనల ప్రకారమే కేసులు నమోదు చేశారని స్పష్టం చేసింది. జైలు ప్రాంగణంలో నేరాలకు సంబంధించి భారతీయ శిక్షాస్మృతి ప్రకారం ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడానికి జైళ్ల చట్టం ఎలాంటి యంత్రాంగాన్ని లేదా విధానాన్ని నిర్దేశించలేదని ధర్మాసనం పేర్కొంది.

Ex-Minister Anil Kumar Yadav Fires On TDP
టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్‌కుమార్‌ ఆగ్రహం

సాక్షి, నరసరావుపేట: పల్నాడులో టీడీపీ అరాచకాలకు తెగబడిందని వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి అనిల్‌కుమార్‌ యాదవ్‌ మండిపడ్డారు. కొందరు పోలీసులు టీడీపీ అభ్యర్థుల్లా వ్యవహరించారు.. టీడీపీ దాడులపై మేం ఫోన్లు చేసినా పోలీసులు స్పందించలేదన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఓటమి అక్కసుతో టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు.మాచర్లలో టీడీపీ నేతలు విధ్వంసం సృష్టించారని.. పిన్నెళ్లి, ఆయన కుమారుడిపై టీడీపీ నేతలు దాడి చేశారన్నారు. పోలింగ్‌ బూత్‌ లోపలికి వెళ్లి టీడీపీ నేతలు దాడులు చేశారు. వైఎస్సార్‌సీపీకి మద్దతు తెలిపిన గ్రామాలపై దాడులకు దిగారు. పల్నాడు ఎస్పీకి ఫోన్‌ చేసినా స్పందించలేదు పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా పనిచేశారంటూ అనిల్‌ మండిపడ్డారు. టీడీపీ అభ్యర్థులకు ఈసీ రూల్స్‌ వర్తించవా?: గోపిరెడ్డికొందరు అధికారులు టీడీపీకి కొమ్ము కాశారని గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కొందరు పోలీసులు మాకు వ్యతిరేకంగా పనిచేశారు. నన్ను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. టీడీపీ అభ్యర్థులకు ఈసీ రూల్స్‌ వర్తించవా?’’ అంటూ గోపిరెడ్డి ప్రశ్నించారు.

Melinda Gates To Resign From Gates Foundation Tweet Viral
మిలిండా గేట్స్ అనూహ్య నిర్ణయం

ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన బిల్ & మిలిండా గేట్స్ ఫౌండేషన్‌ గురించి అందరికి తెలుసు. ఈ ఫౌండేషన్‌కు కో-చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వహించిన మిలిండా (Melinda Gates) ఎట్టకేలకు తన పదవి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.ఫౌండేషన్‌లో నా చివరి రోజు జూన్ 7 అంటూ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ నిర్ణయాన్ని చాలా తేలిగ్గా తీసుకోలేదు. బిల్, నేను కలిసి ప్రారంభించిన ఈ ఫౌండేషన్‌ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అసమానతలను పరిష్కరించడానికి అసాధారణ కృషి చేసాము. దీనికి నేను ఎంతగానో గర్వపడుతున్నాను. ఈ ఫౌండేషన్‌ను సమర్థుడైన సీఈఓ మార్క్ సుజ్మాన్, ఎగ్జిక్యూటివ్ లీడర్‌షిప్ టీమ్.. సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తారని భావిస్తున్నానని మిలిండా పేర్కొన్నారు.దాతృత్వం తదుపరి అధ్యాయంలోకి వెళ్లడానికి నాకు సరైన సమయం వచ్చింది, అందుకే రాజీనామా చేస్తున్న అంటూ మిలిండా వివరించారు. మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్ గేట్స్ నుంచి విడాకులు తీసుకున్న మూడు సంవత్సరాలకు మిలిండా ఈ నిర్ణయం తీసుకున్నారు.మిలిండా ఫ్రెంచ్ గేట్స్ రాజీనామా తరువాత.. ఆమె దాతృత్వ ప్రయోజనాల కోసం 12.5 బిలియన్ల డాలర్లను అందుకుంటారు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందనే విషయాలను కూడా ఎప్పటికప్పుడు తెలియజేస్తాను అని మిలిండా పేర్కొన్నారు.మిలిండా గేట్స్ ప్రపంచ నాయకత్వం, పనిని ఎప్పటికప్పుడు పూర్తి చేసే బాధ్యత మమ్మల్ని ఎంతగానో ఆకర్శించాయి. ఈమె రాజీనామా నాకు కష్టమైన వార్త. నేను కూడా.. మిలిండాను ఆరాధించే వారిలో ఒకరిని. ఆమెతో కలిసి పనిచేయడం వల్ల ఎంతో నేర్చుకున్నాను అని సీఈఓ మార్క్ సుజ్మాన్ అన్నారు.pic.twitter.com/JYIovjNYKo— Melinda French Gates (@melindagates) May 13, 2024

IPL 2024 playoffs: Six teams Fight for three spots
IPL 2024: ప్లే ఆఫ్స్‌ ఛాన్స్‌లు ఎవరికి ఎక్కువగా ఉన్నాయంటే..

ఈ దఫా ఐపీఎల్‌ సీజన్ మస్త్‌ మజాను పంచబోతోంది. ఫేవరెట్‌గా బరిలో దిగిన ముంబై ఇండియన్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది. ఆ వెంటనే పంజాబ్‌ కింగ్స్‌ జట్టు​ కూడా అవుట్‌ అయ్యింది. తాజాగా.. గుజరాత్‌ టైటాన్స్‌ కథ కూడా ముగిసింది. ఇంకోవైపు ప్లేఆఫ్స్‌కు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అర్హత సాధించింది. ఇక మిగిలిన మూడు బెర్తుల కోసం ఆరు జట్లు పోటీపడనున్నాయి.రాజస్థాన్‌ 12 మ్యాచ్‌లు ఆడి 8 విజయాలు సాధించింది. ఆ జట్టు తొలి 9 మ్యాచ్‌ల్లోనే 8 నెగ్గింది. కానీ తర్వాత వరుసగా మూడు ఓటములు చవిచూసింది. అయినప్పటికీ రాజస్థాన్‌ ప్లేఆఫ్స్‌ బెర్తుకు ఢోకా లేనట్లే. చివరి 2 మ్యాచ్‌ల్లో ఒక్కటి గెలిచినా.. ఆ జట్టుకు బెర్తు ఖాయమవుతుంది. రెండూ గెలిస్తే అగ్రస్థానం ఆ జట్టు సొంతమవుతుంది. పంజాబ్, కోల్‌కతాలతో తన చివరి రెండు మ్యాచ్‌ల్లో ఓడినా రాయల్స్‌ ముందంజ వేస్తుంది. కాకపోతే ఆ మ్యాచ్‌ల్లో చిత్తుగా ఓడిపోకూడదు. తక్కువ తేడాతో ఓడితే ఇప్పుడున్న 16 పాయింట్లతోనే ప్లేఆఫ్స్‌ బెర్తును సొంతం చేసుకుంటుంది.ఆడినవి: 12పాయింట్లు: 16నెట్‌రన్‌రేట్‌: 0.349మిగిలిన మ్యాచ్‌లు: పంజాబ్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌రాజస్థాన్‌ తర్వాత మెరుగైన అవకాశాలున్నది సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కే. ఆ జట్టు 12 మ్యాచ్‌ల్లో 7 విజయాలు సాధించింది. మిగతా రెండు మ్యాచ్‌ల్లో (గుజరాత్, పంజాబ్‌) గెలిస్తే నేరుగా ప్లేఆఫ్స్‌ చేరుతుంది. నెట్‌రన్‌రేట్‌ బాగుంది (+0.406) కాబట్టి ఒకటి నెగ్గినా ముందంజ వేయొచ్చు. రెండు మ్యాచ్‌లూ ఓడితే మాత్రం ఇతర మ్యాచ్‌ల ఫలితాల మీద ఆధారపడాల్సి ఉంటుంది.ఆడినవి:12పాయింట్లు: 14నెట్‌ రన్‌రేట్‌: 0.406మిగిలిన మ్యాచ్‌లు: గుజరాత్‌ టైటాన్స్‌, పంజాబ్‌ కింగ్స్‌లక్నో, ఢిల్లీ చెరో 6 విజయాలు సాధించాయి. కానీ, ఆ రెండు జట్లూ నెట్‌ రన్‌రేట్‌లో మైనస్‌ పాయింట్లతో బాగా వెనుకబడ్డాయి. ఢిల్లీకి ఇంకా ఒకే ఒక్క మ్యాచ్‌ మిగిలే ఉంది. అదీ లక్నోతో. నెట్‌ రన్‌ రేట్‌ ఢిల్లీకి తక్కువగా ఉంది. కాబట్టి 14 పాయింట్లు వచ్చినా ఫ్లే ఆఫ్స్‌కు అర్హత సాధించడం కష్టం. ఒకవేళ సన్‌రైజర్స్‌ భారీ తేడాతో తన రెండు మ్యాచ్‌లలో ఓడితే, సీఎస్కే ఆర్సీబీపై భారీ విజయం సాధిస్తే.. లక్నో ఓడిపోయి రన్‌రేట్‌తో ఢిల్లీ కంటే దిగువన ఉంటే గనుక.. అప్పుడు ఢిల్లీకి ప్లే ఆఫ్స్‌ అవకాశం ఉండొచ్చు. ఇదంతా కష్టమే కాబట్టి ఢిల్లీకి అవకాశాలు తక్కువే అని చెప్పాలి. ఆడినవి:13పాయింట్లు:12నెట్‌రన్‌రేట్‌:-0.482మిగిలిన మ్యాచ్‌: లక్నోలక్నో.. ఢిల్లీ, ముంబై ఇండియన్స్‌తో తలపడాల్సి ఉంది. ఎల్‌ఎస్‌జీ నెట్‌రన్‌రేట్‌ (0.769) ఇప్పటికే చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఏడో విజయం సాధించినా ముందంజ వేయడం కష్టమే.ఆడినవి:12పాయింట్లు:12నెట్‌ రన్‌రేట్‌: -0.769మిగిలిన మ్యాచ్‌లు: ఢిల్లీ, ముంబై ఇండియన్స్‌ బెంగళూరు.. ఐదు మ్యాచ్‌లలో గెలిచి అనూహ్యంగా రేసులోకి వచ్చింది. నెట్‌రన్‌రేట్‌ (+0.387) మెరుగ్గా ఉండడం ఆర్సీబీకి కలిసొచ్చే అంశం. హైదరాబాద్, ఢిల్లీ, లక్నో జట్లలో ఒక్కటే ముందంజ వేసి, రెండు జట్లు నిష్క్రమిస్తే.. అప్పుడు చెన్నైబెంగళూరు మ్యాచ్‌ నాకౌట్‌గా మారుతుంది. ఆర్సీబీ మొదట బ్యాటింగ్‌ చేస్తే 18 పరుగుల తేడాతో, రెండోసారి ఆడితే 18.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదిస్తే.. చెన్నైని వెనక్కి నెట్టి ప్లేఆఫ్స్‌ చేరుతుంది.ఆడినవి:13పాయింట్లు: 12నెట్‌రన్‌రేట్‌: 0.387మిగిలిన మ్యాచ్‌: సీఎస్కే13 మ్యాచ్‌ల్లో 7 నెగ్గిన చెన్నై.. తన చివరి మ్యాచ్‌లో బెంగళూరును ఓడిస్తే ముందంజ వేసినట్లే. ఆ జట్టు నెట్‌ రన్‌రేట్‌ (+0.528) చాలా మెరుగ్గా ఉంది కాబట్టి వేరే ఇతర మ్యాచ్‌ల ఫలితాలతో సంబంధం లేకుండా ప్లేఆఫ్స్‌ బెర్తు సొంతం కావచ్చు.ఆడినవి:13పాయింట్లు:14నెట్‌రన్‌రేట్‌: 0.528మిగిలిన మ్యాచ్‌: ఆర్సీబీ

Aishwarya Rajesh About Her Mother Hurdles
అతి మంచి పనికిరాదని నాన్న నుంచే నేర్చుకున్నా: హీరోయిన్‌

ఐశ్వర్య రాజేశ్‌... దక్షిణాది సినిమాలో స్టార్‌ హీరోయిన్‌. చిన్నచిన్న పాత్రలతో అంచెలంచెలుగా ఎదిగి లేడీ ఓరియంటెెడ్‌ కథా చిత్రాలు చేసే స్థాయికి ఎదిగారు. యంగ్‌ ఏజ్‌లోనే కాక్కా ముట్టై చిత్రంలో ఇద్దరు పిల్లల తల్లిగా నటించి ఆ పాత్రకు జీవం పోశారు. ఆ చిత్రమే ఐశ్వర్య రాజేశ్‌ కేరీర్‌కు పెద్ద టర్నింగ్‌ పాయింట్‌ అయ్యింది.తండ్రి అతి మంచి వల్లఈ హీరోయిన్‌ ఇటీవల మాతృదినోత్సవం సందర్భంగా తన కుటుంబం ఎదుర్కొన్న కష్టాలను, అమ్మ పడ్డ బాధలను వివరించారు. కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయడానికి తన తండ్రి ష్యూరిటీ ఇచ్చి రుణాలు ఇప్పించారన్నారు. అయితే ఆనారోగ్యం కారణంగా తన తండ్రి మరణిస్తే అప్పులు ఎగ్గొట్టిన వారి రుణ భారం అంతా తల్లిపై పడిందన్నారు. దీంతో తమకు ఉన్న ఒకే ఒక్క ప్లాట్‌ను విక్రయించి ఆ అప్పును తీర్చినట్లు చెప్పారు. అమ్మ ఏ లోటూ లేకుండాఅంత కష్టంలోనూ అమ్మ తమను మంచి పాఠశాలలో చదివించారని, ఏ లోటూ లేకుండా చూసుకున్నారన్నారు. తన అన్నయ్యలు ఇద్దరూ చదువు పూర్తి చేసి ఉద్యోగం చేయడానికి సిద్ధమైన సమయంలో ఒక ప్రమాదంలో మరణించారన్నారు. అప్పటికే పుట్టెడు కష్టాల్లో ఉన్న అమ్మను ఆ సంఘటన మరింత కుంగదీసిందన్నారు. అయినా తను ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదని తెలిపారు. అమ్మ నుంచే నేర్చుకున్నావృత్తిపరంగా తాను ఎన్నో ఎత్తుపల్లాలను ఎదుర్కొన్నా, ధైర్యంగా ముందుకు సాగే గుణాన్ని తన తల్లి నుంచే నేర్చుకున్నట్లు చెప్పారు. అలాగే అతి మంచికి పోకూడదన్నది తన తండ్రి జీవితం నుంచి నేర్చుకున్నట్లు ఐశ్వర్య రాజేశ్‌ చెప్పారు.

US Warns Of Sanctions After India Iran Sign Chabahar Port Deal
భారత్‌కు అమెరికా ‘ఆంక్షల’ హెచ్చరిక!

ఇరాన్‌తో ఏ దేశం వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నా ఆంక్షలు తప్పవని అగ్రరాజ్యం అమెరికా హెచ్చరించింది. చాబహార్ పోర్టు నిర్వహణ విషయంలో భారత్, ఇరాన్‌తో సోమవారం ఒప్పదం కుదర్చుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.‘చాబహార్‌ పోర్టుకు సంబంధించి.. భారత్‌-ఇరాన్‌ దేశాలు ఒప్పందం చేసుకున్నట్లు మాకు రిపోర్టుల ద్వారా తెలుసు. భారత్‌ తన విదేశీ విధానంలో భాగంగా చాబహార్‌ పోర్టు విషయంలో ఇరాన్‌తో ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకునే విషయంపై స్పందించాలి. కానీ, నేను ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్పగలను. ఇరాన్‌పై మరిన్ని ఆంక్షలు విధిస్తామని, ఇప్పటికే విధించిన ఆంక్షలు సైతం తీవ్రంగా కొనసాగిస్తాం’ అని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వేదాంత పటేల్‌ అన్నారు.‘ఇప్పటికే చాలా సార్లు మేము ఆంక్షాల విషయాన్ని ప్రస్తావించాం. ఎవరైనా, ఏ దేశమైనా ఇరాన్‌తో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటే కఠిమైన ఆంక్షలు విధిస్తాం. అలా కాదని ఇరత దేశాలు ముందకు వెళ్లితే.. వారికి వారుగా ఆంక్షలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది’అని ఇరాన్‌తో ఒప్పదం చేసుకున్న భారత్‌ను పరోక్షంగా హెచ్చరించారు. ఇక.. సోమవారం ఇరాన్‌లోని చాబహార్ పోర్టును పదేళ్ల పాటు భారత్‌ నిర్వహించేదుకు ఒప్పదం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ప్రాంతీయ అనుసంధానంతో పాటు వాణిజ్య భాగస్వామ్యంపై సానుకూల ప్రభావం చూపనుంది.

Mumbai hoarding collapse: several deceased and injured in Ghatkopar
ముంబైలో ఘోరం.. హోర్డింగ్‌ కూలి 14 మంది మృతి

ముంబై, సాక్షి: ముంబయిలో సోమవారం గాలివాన బీభత్సం సృష్టించింది. ఘాట్‌కోపర్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. ఈదుర గాలుల ధాటికి 100 అడుగుల ఎత్తైన భారీ ఇనుప హోర్డింగ్‌ కూలి 14 మంది దుర్మరణం పాలయ్యారు. వంద మంది దాకా గాయపడ్డారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతుండడంతో.. మృతుల సంఖ్య పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు.Breaking : Death Toll in the Mumbai Hoarding collapse rises to 8. 30 still feared trapped. How is the crushing of 8 people , under a 100 ft hoarding , in India's financial capital NOT a news priority on Prime Time TV ? pic.twitter.com/G29jzn47IH— Shreya Dhoundial (@shreyadhoundial) May 13, 2024 #WATCH | Ghatkopar hoarding collapse incident | Latest visuals from the accident spot; rescue and search operation underway8 people have died and approximately 20-30 are trapped under the hoarding which collapsed in Maharashtra's Ghatkopar. pic.twitter.com/OFCajrg7iT— ANI (@ANI) May 13, 2024 సోమవారం సాయంత్రం 4గం.30 ప్రాంతంలో.. గాలుల ధాటికి ఘాట్‌కోపర్‌లోని సమతా నగర్‌లో భారీ హోర్డింగ్‌ కూలి రైల్వే పెట్రోల్‌ పంపుపై పడింది. సమాచారం అందుకున్న రెస్క్యూ టీంలు రంగంలోకి దిగారు. 14 మంది మృతదేహాల్ని వెలికి తీశాయి. కూలిన హోర్డింగ్‌ కింద కింద ఇంకా పలువురు చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. ఈ హోర్డింగ్‌ ఏర్పాటుకు అనుమతులు తీసుకోలేదని ముంబయి నగరపాలక సంస్థ అధికారులు తెలిపారు.#WATCH | Mumbai: The death toll in the Ghatkopar hoarding collapse incident has risen to 14. There were a total of 88 victims, out of which 74 were rescued injured: NDRF(Morning visuals of the rescue operations from the spot) pic.twitter.com/vggAIlfY3g— ANI (@ANI) May 14, 2024 ఇక దాదర్‌, కుర్లా, మాహిమ్‌, ఘాట్‌కోపర్‌, ములుండ్‌, విఖ్రోలి, దక్షిణ ముంబయిలోని వివిధ ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం తేలికపాటి వర్షంతోపాటు, బలమైన ఈదురు గాలులు వీచాయి. కొన్నిచోట్ల దట్టంగా దుమ్ము ఎగసిపడింది.#WATCH | Ghatkopar hoarding collapse incident | Maharashtra CM Eknath Shinde says, "...Rescuing the people is our priority. Government will take care of the treatment of those who are injured in the incident. Rs 5 lakh will be given to the family of those who have lost their… pic.twitter.com/uMPQjJLQ90— ANI (@ANI) May 13, 2024 వడాలాలోని బర్కత్‌ అలీ నాకాలో శ్రీజీ టవర్‌ సమీపంలో వడాలా-అంటోప్‌ హిల్‌ రోడ్డులో సాయంత్రం నాలుగు గంటలకు నిర్మాణంలో ఉన్న మెటల్‌ పార్కింగ్‌ టవర్‌ రోడ్డుపై కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. ఎనిమిది వాహనాలు ధ్వంసమయ్యాయి. వర్షం, ఈదురుగాలి కారణంగా అనేక ప్రాంతాల్లో స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. కొన్నిచోట్ల వైర్లు తెగిపడ్డాయి. పలు మార్గాల్లో మెట్రో సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. సెంట్రల్‌ రైల్వే రెండు గంటలకుపైగా లోకల్‌ రైలు సేవలను నిలిపివేసింది. అనేక చోట్ల విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.ముంబయి విమానాశ్రయంలో దృగ్గోచరత పడిపోవడంతో గంటా ఆరు నిమిషాల పాటు విమానాల రాకపోకలను నిలిపివేశారు. సుమారు 15 విమానాలను దారి మళ్లించారు. సాయంత్రం 5.03 గంటలకు రన్‌వే కార్యకలాపాలను పునరుద్ధరించినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు.

తనిష్క్ జ్యువెలరీ నెక్లెస్‌
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్

ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన, భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్‌ల నుండి ప్రేరణ పొంది అద్భుతమైన మరియు వైవిధ్యమైన శ్రేణి సమకాలీన, రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్‌లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్‌లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్‌లు, కస్టమర్‌లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా, ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్‌ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్‌ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్, ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్‌లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్‌గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్‌లెట్‌లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్‌లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్‌లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్‌డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్‌లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్ 18కేరట్ మరియు 22కేరట్ బంగారంలో విస్తృతమైన శ్రేణి డిజైన్‌లతో, నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని సంపూర్ణం చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్‌లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్‌లెట్‌లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
 

ఫోటో స్టోరీస్

View all