Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Land Titling Act: Cid Investigation On Tdp Fake Campaign
ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేష్‌.. టీడీపీ ఫేక్‌ ప్రచారంపై సీఐడీ విచారణ

సాక్షి, విజయవాడ: టీడీపీ ఫేక్‌ ప్రచారంపై సీఐడీ విచారణ చేపట్టింది. చంద్రబాబు ఏ1గా, లోకేష్‌ ఏ2గా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌తో టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది. టీడీపీ అసత్య ప్రచారంపై వైఎస్సార్‌సీపీ  ఈసీకి ఫిర్యాదు చేసింది.ఈసీ ఆదేశాలతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన సీఐడీ.. విచారణ చేపట్టింది. చంద్రబాబు, లోకేష్‌తో పాటు 10 మందిపై కేసు నమోదు చేసింది. ఐవీఆర్ఎస్‌ కాల్స్‌ చేసిన ఏజెన్సీలపైనా కేసు నమోదైంది.కాగా, ప్రజలను భయాందోళనకు గురి చేస్తూ తప్పుడు సమాచారంతో ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై తెలుగుదేశం పార్టీ చేస్తున్న దుష్ప్రచారం మీద ఎన్నికల సంఘం (ఈసీ) కొరడా ఝళిపించింది. విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఏప్రిల్‌ 29న ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన ఈసీ టీడీపీ దుష్ప్రచారంపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని, అలా తీసుకున్న చర్యలపై తక్షణం నివేదిక ఇవ్వాలని మంగళగిరి సీఐడీ (సైబర్‌ సెల్‌) అడిషనల్‌ డీజీకి అడిషనల్‌ చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ ఎంఎన్‌ హరీంధర ప్రసాద్‌ ఆదేశించారు.ఎన్నికల ప్రవర్తనా నియమావళికి వ్యతిరేకంగా తప్పుడు సమాచారంతో దురుద్దేశపూర్వకంగా లాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌తో పాటు సామాజిక మాధ్యమాల్లో టీడీపీ ప్రచారం చేస్తోందంటూ  వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది. ఇందుకు తగిన ఆధారాలనూ సమర్పించింది.వివిధ ప్రాంతాల నుంచి వేర్వేరు నెంబర్ల ఐవీఆర్‌ కాల్స్‌ వస్తున్నాయని.. వాటిని లిఫ్ట్‌ చేయగానే.. ‘వైఎస్‌ జగన్‌ అధికారంలోకొస్తే మీ భూములు మీ పేరు మీద ఉండవు, జగన్‌ కాజేస్తాడు, ఒరిజినల్స్‌ ఆయన దగ్గర ఉంచుకుంటాడు, మీకు జిరాక్స్‌ కాపీలు వస్తాయి, కాబట్టి జగన్‌కు ఓటు వేయకుండా తెలుగుదేశంకు ఓటు వేయండి’.. అంటూ రికార్డ్‌ మెసేజ్‌లు వస్తున్నట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.వీటికి సంబంధించిన వాయిస్‌ రికార్డులను వైఎస్సార్‌సీపీ ఈసీకి ఆధారాలుగా సమర్పించింది. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికల సంఘం ఆమోదంలేకుండా ఎలాంటి ప్రచారం చేయడానికి వీల్లేదని.. కానీ ఎటువంటి అనుమతుల్లేకుండా వివిధ చోట్ల నుంచి కాల్స్‌చేస్తూ ఇలా ప్రచారం చేయడం ఉల్లంఘన కిందకే వస్తుందని.. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీచేసింది.ఎన్నికల సమరంలో అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు ఉండేలా చూడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంటుందని, ఈ విధంగా చట్టాలపై తప్పుడు సమాచారంతో దుష్ప్రచారం చేస్తూ ప్రజల్లో భయాందోళనలను రేకెత్తిస్తున్న టీడీపీపై తక్షణం చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ తన ఫిర్యాదులో కోరింది        ‌              

Ksr Comments On TDP, Janasena Manifesto
మోదీ మాస్టర్‌ ప్లాన్‌లో బకరాలైన బాబు, పవన్‌

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమికి ఆత్మ విశ్వాసం సన్నగిల్లుతోంది. తాము ఏమి చేస్తామో చెప్పలేకపోతున్నారు. పాజిటివ్ కాంపెయిన్ కన్నా నెగిటివ్ కాంపెయిన్‌కే ప్రాధాన్యం ఇస్తూ సాగుతున్నారు. దీనివల్ల జనంలో అంత ఆదరణ కనిపించడం లేదు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌‌ కల్యాణ్‌లు సంయుక్త మేనిఫెస్టోని విడుదల చేసినప్పుడు బీజేపీ నేత సిద్దార్ధ్ సింగ్‌ ఆ మేనిఫెస్టోని పట్టుకోవడానికి కూడా ఇష్టపడకపోవడం బాగా డామేజ్ చేసింది. అంతకు మించి ఇప్పుడు మరో అంశం కనబడుతోంది. కూటమి పక్షాన ఇస్తున్న ప్రచార ప్రకటనలు రెండు రకాలుగా ఉంటున్నాయి. ఒకటి టీడీపీ పక్షాన చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలలో ఏదో ఒక దానిని పెట్టి చంద్రబాబును మళ్లీ రప్పిద్దాం అంటూ ప్రకటన ఇచ్చారు. అందులో ఎక్కడా టీడీపీ వాగ్దానాలకు ప్రధాని మోదీ‌, జనసేన అధినేత పవన్‌‌ కట్టుబడి ఉంటామని చెప్పడం లేదు. అంటే ఇది కేవలం టీడీపీ దే తప్ప కూటమిది కాదన్న అర్ధం వస్తుంది. అలాగే పవన్‌‌ మేనిఫెస్టోలో భాగస్వామి అయిఇనప్పటికీ, కొన్నిసార్లు ఆయన ఫోటో కూడా వాడడం లేదు.మరో ప్రచార ప్రకటన గమనించండి. అది బీజేపీ అడ్వర్వైజ్ మెంట్. అందులో పైన ప్రధాని మోదీ‌ ఫోటటో ఉంటే, కింద, చంద్రబాబు, పవన్‌‌ల పోటోలు వేసుకున్నారు. ఆ పక్కనే మోదీ‌ గ్యారంటీకి మేము కట్టుబడి ఉంటాం.. అని స్పష్టంగా తెలిపారు. మోదీ‌ మేనిఫెస్టోకి వీరిద్దరూ గ్యారంటీగా ఉంటారు కాని, చంద్రబాబు మేనిఫెస్టోకి మోదీ‌ గ్యారంటీ ఉండరని తేలిపోతోంది. ఇది టీడీపీ, జనసేనలకు మరింత నష్టం చేకూర్చే అవకాశం ఉందని అంటున్నారు. అసలే బతిమలాడి, బాములాడి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే, ఆ పార్టీ వారేమో తమ మేనిఫెస్టోని అంటరాని పత్రంగా పరిగణించడం బాధాకర అంశమని టీడీపీ నేతలు అంటున్నారు. అదే టైమ్‌లో చంద్రబాబు చేసే పిచ్చి వాగ్దానాలకు, గాలి హామీలకు తాము ఎక్కడ గ్యారంటీ ఇస్తామని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.ఒక రకంగా ఇది చంద్రబాబుకు దయనీయ పరిస్థితి అని చెప్పాలి. ఎందుకంటే మోదీ‌ గ్యారంటీలు, ఎన్నికల ప్రణాళికలో ఎన్‌డీఏ. అధికారంలోకి వస్తే ముస్లీంలకు ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్‌లను రద్దు చేస్తామని విస్పష్టంగా చెబుతున్నారు. దానిని అవుననలేక, కాదనలేక టీడీపీ, జనసేనలు సతమతమవుతున్నాయి. సుమారు ముప్పై నియోజకవర్గాలలో ముస్లీంలు రాజకీయ పార్టీల ఓట్లను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బీజేపీ మేనిఫెస్టోకి అంగీకారం తెలపడం అంటే చంద్రబాబు, పవన్‌లు కూడా ముస్లీంల రిజర్వేషన్‌లను వ్యతిరేకించినట్లే అవుతుంది.వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్పప్పుడు వచ్చిన ఈ హామీని ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కొనసాగించాయి. అందులో చంద్రబాబు ప్రభుత్వం కూడా ఒకటి. కాని ఇప్పుడు చంద్రబాబు దీనిపై ఇరకాటంలో పడ్డారు. ఎవరో కొందరు ముస్లీం  నేతలతో దీని గురించి మాట్లాడిస్తున్నా, జనం నమ్మడం లేదు.ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి.  చంద్రబాబు ఫోటోతో పాటు ఇస్తున్న ప్రచార ప్రకటనలో శనివారం ఇచ్చిన అంశం ప్రకారం ఏపీలో ఉన్న ప్రతి పౌరుడికి ఏభై ఏళ్లు దాటితే పెన్షన్ ఇస్తామని చెబుతున్నారు. అది పచ్చి అబద్దం అని తెలిసిన వారు ప్రజలను మోసం చేయడానికి ఈ ప్రచార ప్రకటన విడుదల చేశారన్న సంగతి అర్దం అవుతుంది. మేనిఫెస్టోలో  వారు ఇచ్చిన హామీ ఏమిటంటే ఎస్‌సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందినవారు ఏభై ఏళ్లు దాటితే పెన్షన్ తీసుకోవచ్చని ఇచ్చారు. కాని ప్రకటనలో మాత్రం మొత్తం జనాభాకు ఈ హామీ ఇచ్చినట్లుగా ఉంది. ఈ హామీ ప్రకారం బలహీనవర్గాలకు వారికి నాలుగువేల రూపాయల చొప్పున పెన్షన్ ఇవ్వాలంటే కనీసం ముప్పైవేల కోట్ల పైబడిన మాటేనని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ప్రజలందరికి పెన్షన్ అని చెబుతున్నారు. అంటే ఈ మొత్తం మరింతగా పెరుగుతుందన్నమాట. సుమారు ఏభైవేల కోట్ల వరకు వ్యయం అయినా ఆశ్చర్యం లేదు. అంటే అది ఆచరణ సాధ్యం కాని హామీ అని తెలిసిపోతుంది.చంద్రబాబు తన ఎన్నికల ప్రణాళికలో ఏ హామీకి ఎంత వ్యయం అవుతుందన్నది చెప్పకుండా జనాన్ని మాయ చేసే  యత్నం చేశారు. వైఎస్సార్‌సీపీ ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసినప్పుడు జగన్  సుమారు రెండుగంటల సేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో ఏ ఏ స్కీమును తమ ప్రభుత్వం అమలు చేసింది, దానికి ఎంత వ్యయం అయ్యింది కూడా తెలిపారు. ఇప్పటికే బడ్జెట్ అంచనాలు దాటిపోతున్నందున, జగన్ కొత్త వాగ్దానాలు దాదాపు చేయకుండా ఎన్నికల ప్రణాళిక ప్రకటించారు. పాత తరం నాయకుడిగా ఉన్న చంద్రబాబు మాత్రం కొత్త-కొత్త హామీలతో సూపర్ సిక్స్ పేరుతో ప్రజల ముందుకు వచ్చారు. వాటిని జనం నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. జగన్ మాదిరి ఆ సూపర్ సిక్స్‌కు ఎంత వ్యయం అయ్యేది చెప్పి ఉంటే ప్రజలకు అర్ధం అయి ఉండేది. చంద్రబాబు, పవన్‌‌లలో ఉన్న నిజాయితీ ఎంతో తెలిసేది. కాని వారు అలా చేయడం లేదు. వారితో పాటు అభ్యర్ధులు ఆకాశమే హద్దుగా అన్నీ చేసేస్తామని చెబుతూ ప్రచారం చేసుకుంటున్నారు. అంతే తప్ప, ఫలానా స్కీముకు ఇంత వ్యయం అవుతుంది.. ఈ డబ్బు ఇలా సమకూర్చుకుంటామని చెప్పే ధైర్యం లేదు. సంపద సృష్టిస్తామని పడికట్టు పదాన్ని వాడి ప్రజలను బురిడి కొట్టించాలన్నది వారి ఉద్దేశం.గతంలో యనమల రామకృష్ణుడు ఆర్ధిక మంత్రిగా ఉన్నప్పుడు ఒక విషయం చెప్పారు. టీడీపీ ప్రభుత్వం అప్పులు చేసే సంక్షేమ స్కీలు అమలు చేస్తోందని, ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి చాలా కష్టంగా ఉందని వివరించారు. చంద్రబాబు కూడా పలుమార్లు తాను చాలా కష్టపడుతున్నానని, ప్రభుత్వంలో డబ్బులు లేకపోయినా, తాను రాత్రింబవళ్లు పనిచేసి కార్యక్రమాలు చేస్తున్నానని అనేవారు. ఈయన నిద్ర లేకుండా ఉంటే డబ్బు ఎలా వస్తుందో ఎవరికి అర్ధం అయ్యేకాదు.. జన్మబూమి కమిటీలతో స్కీములను అమలు చేయడంలో చాలా వరకు కోత పెట్టేవారు. జగన్ ప్రభుత్వంలోకి వచ్చాక, ఎన్నడూ ఆర్ధిక పరిస్థితిపై వాపోతూ మీడియా ముందు మాట్లాడలేదు. తానేదో రేయింబవళ్లు కష్టపడి సంపాదిస్తున్నానని బిల్డప్ ఇవ్వడం లేదు. తన పని తాను చేసుకుంటూ పోయి, ప్రజలకు చెప్పిన విధంగా హామీలు నెరవేర్చడంలో సఫలం అయ్యారు. ఈ నేపద్యంలో జగన్‌పై ప్రజలలో ఒక విశ్వాసం ఏర్పడింది. ఒక నమ్మకం పెరిగింది. చంద్రబాబు 2014 ఎన్నికల మేనిఫెస్టోని ప్రకటించినా, దానిని వెబ్ సైట్ నుంచి తీసివేయడం, అసలు ఎన్ని వాగ్దానాలు చేసింది ఆయనకే గుర్తులేని పిరిస్థితి ఏర్పడడంతో క్రెడిబిలిటి కోల్పోయారు. అందువల్లే చంద్రబాబు, పవన్‌‌లు పెద్దగా తమ ఎన్నికల మేనిఫెస్టో గురించి చెప్పడం లేదు. ఎంత సేపు జగన్‌ను దూషించడానికే యత్నిస్తున్నారు.ఒకవేళ ప్రచార ప్రకటనలు ఇచ్చినా అందులో  అబద్దాలు రాస్తున్నారు. జగన్‌ తన  ప్రసంగాలలో ఎక్కడా టీడీపీ, జనసేన అభ్యర్దులను విమర్శిస్తూ మాట్లాడడం లేదు. చంద్రబాబు, పవన్‌లు మాత్రం వెళ్లిన ప్రతి చోట జగన్‌తో పాటు, వైఎస్సార్‌సీపీ అభ్యర్ధులపై కూడా పలు రకాల దూషణలకు పాల్పడడం, వారు  దీనికి కౌంటర్ ఇవ్వడం నిత్యకృత్యం అయింది. రామోజీ, రాధాకృష్ణలకు కూడా టీడీపీ మేనిఫెస్టోపై భ్రమలు తొలగిపోయాయి. అందుకే వారు దీనికి ప్రాముఖ్యత ఇవ్వకుండా, జగన్ ప్రభుత్వంపై బురద చల్లడానికే వార్తలు రాస్తున్నారు. సంపాదకీయాలు రాస్తున్నారు. ప్రత్యేకించి లాండ్ టైటిలింగ్ యాక్ట్‌కు వ్యతిరేకంగా పెక్కు కధనాలు ఇస్తున్నారు. పేజీలకొద్ది వార్తలను పరుస్తున్నారు. అయితే ఇది కేంద్ర ప్రభుత్వ చట్టం అని మాత్రం రాయకుండా జాగ్రత్తపడుతున్నారు. శనివారం నాటి ఈనాడు  పత్రికలో ఒక పేజీడు చెత్త అంతా తమ పత్రికలో అచ్చేశారు. అందులో అసలు ఈ యాక్ట్ అమలులోకి వచ్చిందని, దీనికోసం ప్రత్యేకంగా కిందిస్థాయిలో అధికారులను నియమించారని నీచమైన అబద్దాన్ని ఎవరో రైతు చెప్పారంటూ  మరీ రాసుకున్నారు.చట్టమే అమలులో లేనప్పుడు ఇదంతా ఎలా జరుగుతుందన్న ఇంగిత జ్ఞానం లేకుండా చెడరాస్తున్నారు. ఇలా ఒకటి కాదు.. అనేక అంశాలపై రాసిన వార్తలనే మళ్లీ-మళ్లీ  రాసి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే పెన్షన్‌లు ఇళ్ల వద్ద పంపిణీ కాకుండా చూసిన చంద్రబాబు, పవన్‌, రామోజీ, రాధాకృష్ణ ప్రభృతులు నాలుక కరుచుకుని యుటర్న్ తీసుకున్నారు. ఇప్పుడు ఎదురుదాడి చేస్తూ జగన్ వల్లే పెన్షన్ దారులకు ఇబ్బందులు వచ్చాయని దుష్ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల సంఘాన్ని తప్పు పట్టకుండా, ఈ పరిస్థితికి కారణమైన నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను ఒక్క మాట అనకుండా ప్రజలను తప్పుదారి పట్టించాలని విశ్వయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా టీడీపీ, జనసేన, బీజేపీలు ఏపీలో కూటమి పెట్టుకున్నా, వాటికి ఒక ప్రామాణికత లేదని, ఒక విశ్వసనీయత లేదని, ప్రజలను మోసగించడమే లక్ష్యంగా ఉన్నారని వారి ప్రకటనల ద్వారా అర్థం అవుతుంది. మోదీ‌ గ్యారంటీకి చంద్రబాబు, పవన్‌లు కట్టుబడి ఉంటారట. అదే చంద్రబాబు, పవన్‌లు ఇచ్చిన గ్యారంటీలకు మోదీ‌ హామీగా ఉండబోరట. బహుశా  ప్రత్యేక హోదా, విభజన హామీలు తదితర అంశాలపై  గతంలో మాట్లాడి ఏపీలో పరువు పోగొట్టుకున్నానని తెలిసి మోదీ‌ తెలివిగా వ్యహరిస్తున్నారని అనుకోవాలి. ఈ మొత్తం వ్యవహారంలో బకరా అయింది చంద్రబాబు, పవన్‌లే అయితే, జనాన్ని  బకరా చేయాలని వీరిద్దరితో పాటు రామోజీ, రాధాకృష్ణలు నానా తంటాలు పడుతున్నారు.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు.

Digvijaya Singh Emotional Appeal For Rajgarh Lok Sabha Elections
దిగ్విజయ్‌ సింగ్‌ భావోద్వేగ లేఖలో ఏముంది?

దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో మూడో దశలో పోలింగ్‌ మే 7న జరగనుంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. రాష్ట్రంలోని రాజ్‌గఢ్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ పోటీ చేస్తున్నారు.  తాజాగా ఆయన ఇవి తన జీవితంలో చివరి ఎన్నికలు అని వ్యాఖ్యానించారు.దిగ్విజయ్‌ సింగ్‌ తాజాగా సోషల్ మీడియా ‘ఎక్స్‌’ హ్యాండిల్‌లో రాజ్‌గఢ్ ‍ప్రజలకు భావోద్వేగ లేఖ రాశారు. దానిలో ఆయన ‘నేను నా తండ్రి మరణించాక ఇంజినీరింగ్‌ పట్టా పుచ్చుకుని రాజ్‌గఢ్‌ వచ్చాను. నాడు ఇక్కడి ప్రముఖుడు కస్తూర్‌ చంద్‌ జీ కఠారీని కలుసుకున్నాను. అప్పుడు ఆయన నాతో ప్రతీ వ్యక్తి జీవితంలో 12 లక్ష్యాలను సాధించాలని పేర్కొన్నారు. కుటుంబాన్ని పోషించేంతటి సంపాదన ప్రతీ వ్యక్తికి అవసరమని, అలాగే పొదుపు చేయాలని, నగలు కొనుగోలు చేయాలని ఆయన తెలిపారు. సొంత ఇంటిని నిర్మించుకోవాలని, ఇవన్నీ సమకూరితే అదృష్టవంతుడివని,  అప్పుడు పేరు సంపాదించుకోవాలని వివరించారు. నా 50 ఏళ్ల రాజకీయ జీవితంలో  ఇలాగే ప్రయత్నించాను. అందులో నేను ఎంతవరకూ సక్సెస్ అయ్యానో నేనే అంచనా వేయలేను. సామాన్యులు మాత్రమే అలా చేయగలరు. ఇవి నా జీవితంలో చివరి ఎన్నికలు. వీటిలో నేను ఎంతవరకు విజయం సాధిస్తానో మీరే నిర్ణయిచాలి’ అని పేర్కొన్నారు.మే 7వ తేదీన రాజ్‌గఢ్ లోక్‌సభ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. దిగ్విజయ్ సింగ్ 10 ఏళ్ల పాటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1980- 90వ దశకంలో రాజ్‌గఢ్ నుండి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు మూడు దశాబ్దాల తర్వాత తన సొంత ప్రాంతం నుంచి ఎన్నికల బరిలో దిగారు. ఈ ఎన్నికలు దిగ్విజయ్ సింగ్ ప్రతిష్టకే కాదు, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ భవిష్యత్తుకు కూడా కీలకం కానున్నాయి. 

మధ్యాహ్నం 12 గంటలకు.. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో నిర్వహించిన సీఎం జగన్‌ ఎన్నికల ప్రచార సభకు మండుటెండను సైతం లెక్కచేయకుండా హాజరైన అశేష జనసందోహంలో ఓ భాగం
మీ భూమికి భద్రత.. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై బాబు దుష్ప్రచారం: సీఎం జగన్‌

సాక్షి, పుట్టపర్తి: ‘చంద్రబాబునాయుడు అవగాహన రాహిత్యంతో ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై అబద్ధాలు వల్లించడం సిగ్గుచేటు. జగన్‌ భూములు లాక్కుంటున్నాడంటూ దుష్ప్రచారం చేయడం ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. పేదలకు భూములిచ్చేది జగన్‌ అయితే.. లాక్కునేది చంద్రబాబు అనే విషయం అందరికీ తెలుసు. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌తో రైతులు ఎవరి చుట్టూ తిరగాల్సిన పని ఉండదు. భూ తగాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు వందేళ్ల తర్వాత భూముల రీ సర్వే చేపట్టాం. రైతుల భూముల భద్రతకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. ఎలాంటి వివాదం లేని టైటిల్స్‌ ప్రతి ఒక్కరి దగ్గరా ఉండాలన్నదే మీ బిడ్డ లక్ష్యం. అందుకనే టైటిల్‌ ఇన్సూరెన్స్‌ కూడా చేస్తున్నాం. రిజిస్ట్రేషన్‌ తర్వాత రైతులకే డాక్యుమెంట్లు అందజేస్తాం. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై అవగాహన లేకుండా చంద్రబాబు మాట్లాడటం దుర్మార్గం’ అని ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం శ్రీసత్య­సాయి జిల్లా హిందూపురంలోని అంబేడ్కర్‌ సర్కిల్‌­లో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్‌ మాట్లాడుతూ ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై ప్రచారంలో ఉన్న అపోహలను తొలగిస్తూ స్పష్టతనిచ్చారు.రిజిస్ట్రేషన్లపైనా చంద్రబాబు బురదరిజిస్ట్రేషన్లకు సంబంధించి కూడా చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్లు చేసేటప్పుడు ఫిజికల్‌ డాక్యుమెంట్లు ఇవ్వడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అయ్యా చంద్రబాబూ..! ఇప్పటివరకు ఏకంగా 9 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి. దేశ­వ్యాప్తంగా అమల­వుతున్న కార్డ్‌ 2 సాఫ్ట్‌వేర్‌ ద్వారా తొమ్మిది లక్షల రిజిస్ట్రేషన్లు చేయడమే కాకుండా ఆ తర్వాత డాక్యుమెంట్లు అన్నీ భూ యజ­మా­నులకే ఇచ్చాం.  దీన్ని మరింత సులభతరం చేస్తూ.. ఏ ఒక్కరికీ సమస్య ఉండకూడదని, పత్రాలు రాసుకునే­టప్పుడు తప్పులు ఉండకూడదని ఆ ఫార్మాట్‌ కూడా ఆన్‌లైన్‌లో అందు­బా­టులో ఉంచాం. ఎవరైనా అమ్మాలను­కున్నా, కొనాలనుకున్నా ఆ ఫార్మాట్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని వివరాలు నింపి డాక్యు­మెంట్లతో వెళితే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాల­యం­లో వేలి ముద్రలు లాంటి మిగతా ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్‌ పూర్తి అయిన తర్వాత ఫిజికల్‌ డాక్యుమెంట్లు రైతులకే ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతోందని చంద్రబాబు తెలుసుకోవాలి.  పెద్ద సంస్కరణ అవుతుంది..ఎన్నికల వేళ చంద్రబాబు యథేచ్ఛగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై అవగాహన లేకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. టీడీపీ నాయకులు ఐవీఆర్‌ఎస్‌ ద్వారా మీ ఇళ్లకు ఫోన్లు చేసి మీ భూములన్నీ జగన్‌ లాక్కుంటాడంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. ఇంత దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు అసలు మనిషేనా? మీ జగన్‌ భూములిచ్చేవాడే కానీ భూములు లాక్కునే వాడు కాదు. నీకు ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ అంటే తెలుసా చంద్రబాబూ? ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ అంటే భూముల మీద సంపూర్ణ హక్కులు ఎల్లవేళలా రైతన్నలకు ఉండేటట్లు చేయడమే. చంద్రబాబు అవగాహన లేకుండా మాట్లాడుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ యాక్ట్‌ రాబోయే రోజుల్లో పెద్ద సంస్కరణ అవుతుంది. ఈరోజు ఎక్కడ భూమి కొనుగోలు చేయాలన్నా వివాదాలు తలెత్తుతు­న్నాయి. విస్తీర్ణం తక్కువ ఉండటం, సబ్‌ డివి­జన్,  సర్వే జరగకపోవడం, రికార్డులు అప్‌డేట్‌ కాకపోవడం తదితర సమస్యలు ఉత్పన్నమవు­తున్నాయి. వీటన్నింటి కారణంగా భూ వివాదాలు పెరిగి రైతన్నలు, ప్రజలు కోర్టులు, అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.వివాదాలు లేకుండా.. టైటిల్‌ ఇన్సూరెన్స్‌రాబోయే రోజుల్లో ఏ రైతూ, ఏ ఒక్కరూ వాళ్ల భూములు కోసం ఎవరి చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండకూడదు. భూ వివాదాలకు సంబంధించి ఏ కోర్టుకూ వెళ్లాల్సిన అవసరం రాకూడదు. ఆ భూముల మీద వారికి సంపూ­ర్ణ హక్కులు కల్పిస్తూ వాటిపై ఏవైనా వివాదాలు ఉంటే ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది. ఆ భూముల మీద ఎలాంటి వివాదం లేదని గ్యారంటీ ఇస్తూ ఒక సంస్కరణ తేవాలన్నదే మీ జగన్‌ ఆలోచన. అందుకనే టైటిల్‌ ఇన్సూరెన్స్‌ కూడా చేస్తున్నాం. ఎలాంటి వివాదం లేని టైటిల్స్‌ ప్రతి ఒక్కరి దగ్గరా ఉండాలన్నదే మీ బిడ్డ లక్ష్యం. కానీ ఇది జరగాలంటే మొదట రాష్ట్రవ్యాప్తంగా జరుగు­తున్న సర్వే పూర్తి కావాలి. దేశంలో వందేళ్ల క్రితం ఆంగ్లేయుల హయాంలో భూముల సర్వే చేశారు. రైతుల కోసం ఈ రోజు మళ్లీ ప్రతి ఎకరా రీ సర్వే చేస్తున్నాం. 15 వేల మంది సర్వేయర్లను నియమించాం. ఉచితంగా సరిహద్దు రాళ్లను నాటి రికార్డులన్నీ అప్‌డేట్‌ చేస్తున్నాం. సబ్‌ డివిజన్‌ చేసి ఆ హక్కు పత్రా­లను పదిలంగా రైతన్నలకు అంద­చేస్తున్నాం. రాష్ట్రంలో 17 వేలకు పైగా రెవెన్యూ గ్రామాలకు­గానూ ఇప్పటివరకు 6 వేల రెవెన్యూ గ్రామాల్లో సర్వే పూర్తయ్యింది. మిగతా చోట్ల ఒకటిన్నర, రెండేళ్లలో సర్వే పూర్తవుతుంది. 

AP Politics And Election Live Updates On May 5th
AP Election Updates May 5th: ఏపీ ఎన్నికల అప్‌డేట్స్‌

Andhra Pradesh Election Updates 5th May...01:42 PM, May 5th, 2024ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేష్‌.. టీడీపీ ఫేక్‌ ప్రచారంపై సీఐడీ విచారణచంద్రబాబు ఏ1గా, లోకేష్‌ ఏ2గా ఎఫ్‌ఐఆర్ నమోదుల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌తో టీడీపీ దుష్ప్రచారంటీడీపీ అసత్య ప్రచారంపై   ఈసీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదుఈసీ ఆదేశాలతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన సీఐడీచంద్రబాబు, లోకేష్‌తో పాటు 10 మందిపై కేసు నమోదుఐవీఆర్ఎస్‌ కాల్స్‌ చేసిన ఏజెన్సీలపైనా కేసు నమోదు12:15 PM, May 5th, 2024చంద్రబాబుపై సీపీఐ రామకృష్ణ సెటైర్లు40 ఏళ్ల సీనియారిటీ అని చెప్పే చంద్రబాబుకి ఉన్న కన్ఫ్యూజన్ ఎవరికి లేదుల్యాండ్ టైటిలింగ్ మాట్లాడుతున్న బాబు.. ఆ చట్టం తీసుకొచ్చింది బీజేపీనే అనే సంగతి మరిచాడా ?సభల్లో వైఎస్సార్‌సీపీపై మాట్లాడుతున్న బాబు.. బీజేపీ గురించి ఎందుకు మాట్లాడం లేదుబీజేపీతో జోడి కట్టి ముస్లిం రిజర్వేషన్లు కొనసాగిస్తానంటే మోసం కదా?నాడు మోదీని తిట్టిన బాబు నేడు పొగుడుతున్నారు.. 4ఏళ్లలో మోదీ ఏం చేశాడో చెప్పాలిమోదీ రాష్టానికి చేసిన మేలు ఏంటో బాబు చెప్పాలికూటమి మ్యానిఫెస్టో విడుదలలో పురందేశ్వరి ఎందుకు లేదుకూటమి మేనిఫెస్టోతో సంబంధం లేదని బీజేపీ నేతలు చెప్పడం దేనికి సంకేతంఅవకాశవాదం, స్వార్థంతో చంద్రబాబు వ్యవహరిస్తున్నాడు10:59 AM, May 5th, 2024సునీత, షర్మిలకు కొండా రాఘవరెడ్డి సవాల్‌ వైఎస్‌ వివేకా హత్య కేసులో ఛార్జ్‌షీట్‌ తీసుకుని రండి..బహిరంగ చర్చకు సిద్ధమా.. ఎక్కడికైనా వస్తాఈ నెల 11 లోపు తన సవాల్‌పై స్పందించాలిషర్మిల స్పష్టంగా తెలుసుకుని వాస్తవాలు మాట్లాడాలినాడు షర్మిలను పాదయాత్ర చేయమని ఎవరూ అడగలేదువైఎస్‌ సోదరి విమలమ్మ మీ వెంట ఎందుకు లేరు?వైఎస్‌ సోదరులు సైతం మీకు మద్దతు ఇవ్వడం లేదువివేకా మృతి తర్వాత ఎన్నిసార్లు ఆయన సమాధి వద్దకు వెళ్లారుషర్మిల దుర్మార్గపు పనులు చేస్తున్నారు కాబట్టే.. కుటుంబం నుంచి కూడా ఆమెకు మద్దతు లేదురూ.వెయ్యి కోట్ల పని చేయనందుకే షర్మిల వ్యతిరేకంగా మారిందివైఎస్‌ పేరును చెడ్డగొట్టడానికి షర్మిల కుట్రలు చేస్తోందిసీఎం జగన్‌, పొన్నవోలుపై షర్మిల వ్యాఖ్యలు సరికాదుషర్మిల ప్రచారానికి స్పందన లేక ఫ్రస్ట్రేషన్‌కు గురవుతుంది. బాబు, పవన్‌ స్క్రిప్ట్‌ షర్మిల చదువుతుందివైఎస్‌ విజయమ్మ మాట పెడచెవిన పెట్టినప్పుడే షర్మిల అంశం ముగిసిందిషర్మిల మోసాలు, అక్రమాలు బయట పెట్టడానికి నేను ఒక్కడిని చాలుతెలంగాణలో షర్మిల వందల కుటుంబాలను మోసం చేశారు. జగన్‌, షర్మిల పెళ్లికి చంద్రబాబును వైఎస్‌ పిలిచారన్నది అబద్ధంబాబు ఆడుతున్న ఆటలో షర్మిల పాచిక అయిందివైఎస్‌ జగన్‌కు అద్ధం చూపడం దుర్మార్గంఒకసారి ఇంటికి వెళ్లి ఆ అద్ధంలో మీ ముఖం చూసుకోండి తెలంగాణలో ఏం మాట్లాడారు. ఏపీలో మాట్లాడారో ఒకసారి చూసుకోండిషర్మిలకు పిచ్చి ముదిరి నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది10:59 AM, May 5th, 2024ల్యాండ్ టైట్లింగ్‌ యాక్ట్‌పై బాబు, పవన్ విష ప్రచారం: ఎమ్మెల్యే మల్లాది విష్ణుప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారుఐవీఆర్ఎల్ సర్వేలో తప్పుడు ప్రచారం చేస్తున్నారుమా ఫిర్యాదు పై ఈసీ స్పందించింది చర్యలకు సీఐడీకి సిఫారసు చేసిందిప్రజల భూమికి భద్రత కల్పించడమే ప్రభుత్వ ధ్యేయంసీఎం జగన్‌ను ఎదుర్కోలేక బాబు, పవన్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు తప్పుడు ప్రచారాలు ఆపకపోతే క్రిమినల్ చర్యలు తప్పవుల్యాండ్ టైటిల్ యాక్ట్ మేం తెచ్చింది కాదునీతి ఆయోగ్ ద్వారా కేంద్రమే అన్ని రాష్ట్రాలకు సూచించింది టీడీపీ, జనసేన నేతలు మాట్లాడుతుంటే ఏపీ బీజేపీ నేతలు ఏం చేస్తున్నారు?కేంద్రం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ బీజేపీ శాఖ ఎందుకు నోరుమూసుకుంది? ఏపీల  ప్రచారానికి వస్తున్న మోదీ, అమిత్ షా సభల్లో చెప్పాలి10:51 AM, May 5th, 2024ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలుల్యాండ్ టైట్లింగ్‌ యాక్ట్‌పై కొన్ని పార్టీలు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నాయిభూ రికార్డుల డిజిటలైజేషన్‌తో సమస్యల పరిష్కరించడానికి ఈ చట్టాన్ని తీసుకువస్తున్నారు.ల్యాండ్ టైట్లింగ్‌ యాక్ట్‌తో ప్రజల ఆస్తులు లాగేసుకుంటారంటూ కావాలనే కొన్ని పార్టీలు ప్రచారం చేస్తున్నాయిల్యాండ్ టైట్లింగ్‌ యాక్ట్ గురించి తెలియకపోతే మమ్మల్ని అడిగితే చెప్పేవాళ్లంఎన్నికల్లో మాతో భాగస్వామ్యం ఉన్న పార్టీలు ఇలా తప్పుడు ప్రచారం చేయడం మంచిది కాదుల్యాండ్ టైట్లింగ్‌ యాక్ట్ ఇతర రాష్ట్రాల్లో అమలవుతుందిఎలా అయినా గెలవాలన్న ఆలోచనతో ప్రజలను భయభ్రాంతులను చేయడం మంచిది కాదుఈ దుష్ప్రచారంపై ఎన్నికల కమిషన్ కూడా సీఐడీ దర్యాప్తు వేసిందిజనసేన, తెలుగుదేశం మేనిఫెస్టో మాకు సంబంధం లేదుచంద్రబాబు చెప్తున్నా సూపర్ సిక్స్ కోసం చాలా డబ్బులు కావాలిచంద్రబాబు చెబుతున్న సూపర్ సిక్స్ పథకాలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయిఆయన వాటిని అమలు చేయకపోతే ఆ నెపం మా పైకి వస్తుందిఅందుకే.. జనసేన, తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోతో మాకు సంబంధం లేదు8:56 AM, May 5th, 2024నేడు ఏపీకి అమిత్‌ షా, రాజ్‌నాథ్‌సింగ్‌ రాకశ్రీసత్యసా­యి జిల్లా ధర్మవరం పట్టణం బత్తలపల్లి రోడ్డులోని సీఎన్‌బీ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన ఎన్ని­క­ల ప్రచార బహిరంగ సభలో ప్రసంగించనున్న అమిత్‌షావైఎ­స్సా­ర్‌ జిల్లా జమ్మలమడుగు, కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో జరిగే ఎన్నికల ప్రచా­ర సభల్లో పాల్గొననున్న రాజ్‌నాథ్‌ సింగ్‌ 8:51 AM, May 5th, 2024అవన్నీ అపోహలేల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టంతో భూములకు మరింత రక్షణఈ చట్టం అమల్లోకి వస్తే భూములు, ఆస్తులకు ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుందిఅన్ని పత్రాలూ యజమానుల వద్దే ఉంటాయి.. ప్రభుత్వం వద్ద కేవలం రికార్డులేఈ చట్టం కోర్టు ద్వారాలు మూసేయదు.. కోర్టులకు వెళ్లే అవసరమే లేకుండా చేస్తుందిహక్కుల నిరూపణకు ఇప్పుడున్న చట్టాలు అంతిమ సాక్ష్యాలు కావుఅందుకే ఈ చట్టం అవసరమవుతోందిభూచట్టాల నిపుణుడు, నల్సార్‌ ప్రొఫెసర్‌ ఎం. సునీల్‌కుమార్‌7:37 AM, May 5th, 2024జనం.. జనం.. ప్రభంజనంసీఎం వైఎస్‌ జగన్‌ ఎన్నికల ప్రచార సభలకు పోటెత్తిన ప్రజానీకంహిందూపురంలో 43 డిగ్రీల ఎండనూ లెక్కచేయని జనంనియోజకవర్గ చరిత్రలో ఏ నాయకుడికి లేని రీతిలో బ్రహ్మరథంఈసారి హిందూపురం వైఎస్సార్‌సీపీదే అంటున్న రాజకీయ పరిశీలకులుపలమనేరులో వర్షాన్ని కూడా లెక్క చేయని ప్రజలునెల్లూరులో జననీరాజనం 7:25 AM, May 5th, 2024ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం వ్యవహారం.. టీడీపీపై ఈసీ కొరడాదుష్ప్రచారంపై సీఐడీ దర్యాప్తుప్రజలను భయాందోళనలకు గురిచేయడంపై ఈసీ సీరియస్‌ ఎన్నికల నిబంధనలకు పాతరేస్తున్నారని మండిపాటు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదుతో చర్యలు తీసుకున్న కమిషన్‌తక్షణం దీనిపై దర్యాప్తుచేసి నివేదిక ఇవ్వాలని ఆదేశం7:16 AM, May 5th, 2024కళ్లు గద్దెపై.. బుద్ధి భూమిలోల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై బరితెగించి అబద్ధాలులేని వ్యక్తులకు అన్యాయం జరిగిందంటూ రామోజీ ఆక్రోశం కల్పిత పాత్రలను సృష్టించి, ఏదో జరిగిపోయిందని ఆక్రందనరిజిస్టరే లేనపుడు అందులో కొందరి పేర్లు లేకపోవటం సాధ్యమా?చట్టం దేవుడెరుగు... చట్టానికి సంబంధించిన రూల్సే రాలేదని తెలీదా?రూల్స్‌ వచ్చాక.. వాటిపై సమగ్ర చర్చ జరిగిన తరవాతే తుది రూపుపైపెచ్చు రీసర్వే పూర్తయ్యాకే ఈ చట్టాన్ని అమలు చేయటం సాధ్యంఇప్పటికి 4 వేల గ్రామాల్లోనే రీ సర్వే పూర్తి.. ఇంకా 13 వేల గ్రామాల్లో పెండింగ్‌అది పూర్తయి.. రూల్స్‌ ఖరారయ్యాక కదా చట్టం అమలు గురించి మాట్లాడేది..అయినా అన్ని రాష్ట్రాలనూ అమలు చేయమంటున్నది కేంద్రమే కదా!అన్ని రాష్ట్రాలూ అమలు చేస్తేనే... ఇక్కడా చేస్తామని చెబుతున్న రాష్ట్రంమోదీ ముందు తల ఊపి.. బయట మాత్రం విష ప్రచారం చేస్తున్న బాబుబాబునెవరూ నమ్మటం లేదని గ్రహించి... మారీచుడి పాత్రలోకి రామోజీజనాన్ని భయపెట్టడానికి అబద్ధాలే అ్రస్తాలుగా మాయా యుద్ధంపోలింగ్‌ వరకూ ఈ ఒక్క అంశంమీదే మాట్లాడాలని ‘ఎల్లో’ తాఖీదుమిగతావన్నీ పక్కనబెట్టి విస్తృతంగా విష ప్రచారం చేస్తున్న పచ్చ మంద7:14 AM, May 5th, 2024బాబుకు భంగపాటు.. బెడిసికొట్టిన టీడీపీ అధినేత పన్నాగంబెడిసికొట్టిన టీడీపీ అధినేత పన్నాగంఓటర్లకు అరచేతిలో వైకుంఠం చూపించేందుకు కుతంత్రంలబ్ధిదారుల నమోదు పేరిట కుట్రఓటర్ల జాబితా వివరాల దుర్వినియోగంతీవ్రంగా స్పందించిన ఎన్నికల కమిషన్‌ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక7:12 AM, May 5th, 2024లాక్కునేవి కాదు..ఇచ్చే చేతులివి..నిషేధిత జాబితా నుంచి 35 లక్షల ఎకరాల తొలగింపుసీఎం జగన్‌ సంస్కరణలతో ‘రెవెన్యూ’లో సులభమైన పాలన  వందల ఏళ్ల నాటి చిక్కుముళ్లకు పరిష్కారంచుక్కల భూములు, సర్విస్‌ ఈనాం, షరతుల గల పట్టా భూములకు విముక్తి27.41 లక్షల ఎకరాల అసైన్డ్‌ భూములకు యాజమాన్య హక్కులులంక భూములకు అసైన్‌మెంట్‌ పట్టాలుకుప్పలు తెప్పలుగా ఉన్న రెవెన్యూ సమస్యలన్నింటికీ పరిష్కారంనిరుపేదలకు 46 వేల ఎకరాల భూముల పంపిణీ  శ్మశాన వాటికలు లేని దళిత వాడల కోసం 951 ఎకరాలుకొత్త రిజిస్ట్రేషన్ల విధానం.. ఆటో మ్యుటేషన్‌చరిత్ర సృష్టించిన 30.61 లక్షల ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్‌  రెవెన్యూ శాఖ స్వరూపాన్ని మార్చిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం  అసైన్డ్‌ భూములపై యాజమాన్య హక్కులు6:59 AM, May 5th, 2024మళ్లీ దోపిడీకి తెరపైకి..మాజీ ఎమ్మెల్యే అరాచకాలెన్నో!గోబెల్స్‌ ప్రచారంలో చంద్రబాబుకు తమ్ముడు   వక్ఫ్‌ ఆస్తులు చెరబట్టి దోచేసిన ఘనుడుటిప్పు షాపింగ్‌ కాంప్లెక్స్‌ కేటాయింపులో చేతివాటంప్రతి పనికీ రేటుగట్టి వసూలు చేసిన చరిత్ర  బెదిరింపులు, దౌర్జన్యాలు షరామామూలేఏకంగా పది క్రిమినల్‌ కేసులు 6:56 AM, May 5th, 2024మీ భూమికి భద్రత.. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై బాబు దుష్ప్రచారం: సీఎం జగన్‌చట్టంపై అవగాహన లేకుండా మాట్లాడటం సిగ్గుచేటుమీ భూములకు ప్రభుత్వం గ్యారంటీ..రిజిస్ట్రేషన్‌ తర్వాత రైతులకే డాక్యుమెంట్లుఅన్నదాతలు ఎవరి చుట్టూ తిరగాల్సిన పని ఉండదుభూ తగాదాలకు శాశ్వత పరిష్కారంగా వందేళ్ల తర్వాత రీసర్వేపేదలకు భూములిచ్చేది జగన్‌.. లాక్కునేది చంద్రబాబే

Shock To Chandrababu, CEO directs CID to probe False propaganda on Land Titling Act
కన్ఫ్యూజ్ చేయబోయి బొక్కబోర్లా పడ్డారు

కన్విన్స్ చేయడం చేతగానపుడు ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం సులువు.. ఇది చంద్రబాబు దశాబ్దాల నుంచి అమలు చేస్తున్న కుట్ర.. తన పాలనా గురించి,. తాను చేసిన అభివృద్ధి గురించి ఏనాడూ ఎప్పుడూ చెప్పుకోలేని చంద్రబాబు..ఎన్నికల సమయంలో అవతలి పార్టీవల్ల మీద దుమ్మెత్తిపోసి ప్రజలను గందరగోళపరిచి లభ్ది పొందుతూ ఎన్నికల్లో గట్టెక్కుతూ వస్తున్నారు. ఇప్పుడు కూడా తాను గత ఐదేళ్ళలో ఏమి చేసిందీ చెప్పుకోలేని చంద్రబాబు సీఎం వైఎస్ జగన్ పాలనలోని గొప్పతనాన్ని గుర్తించే మనసులేక.. ఏకంగా లేని చట్టాన్ని చూపించి ప్రజలను భయపెట్టాలని చూశారు.కేవలం ల్యాండ్ టైట్లింగ్ చట్టం అనే అంశాన్ని చూపించి ప్రజలను భయపెట్టి లబ్ధిపొందాలన్నది చంద్రబాబు కుట్రగా తెలుస్తోంది... ఈ క్రమంలో అయన కొంతమంది కార్యకర్తలు, యువత, రైతులను డబ్బులిచ్చి జనంలోకి పంపించి ఆ చట్టం పేరిట జనాన్ని భయపెట్టాలని చూాశారు. దీంతోబాటు TDP ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ ద్వారా జగన్‌పై, ప్రభుత్వం మీద దుష్ప్రచారం మొదలు పెట్టారు. దీంతోబాటు ప్రజల భూములను ప్రభుత్వం లాక్కోవాలని చూస్తోందని దుష్ప్రచారం మొదలు పెట్టింది. ప్రజలకు లక్షల ఎకరాల అటవీ భూములు, చుక్కల భూములకు సంబంధించి ప్రజలకు శాశ్వత హక్కులు కల్పించిన జగన్ తిరిగి ప్రజల భూములు లాక్కోవడం ఏమిటన్న చర్చ జనంలోకి వచ్చింది. తెలుగుదేశం అనుకూల మీడియా కూడా కేవలం ఇదే అంశాన్ని రాస్తూ..టీవీల్లో...చూపిస్త్తూ ప్రజలను భయపెట్టేందుకు ప్రయతించింది. దీంతో ఈ తప్పుడు ప్రచారాన్ని ఆపాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ను కలిసి టీడీపీ తీరుమీద ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదులో బలం ఉందని గ్రహించిన ఎన్నికల కమిషన్ ఇక ముందు ఈ చట్టం గురించి ఇష్టానుసారం మాట్లాడుతున్నవాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారని రాష్ట్ర సీబీసీఐడీని సైతం ప్రశ్నించింది.. దీంతో తెలుగుదేశం వారి గొంతులో వెలక్కాయపడినట్లు అయింది.. సీఐడీ ని ఎన్నికల సంఘం ఆదేశించడం ఆంటే అందులో నిజం ఉన్నట్లే... ఇకముందు నోటికొచ్చినట్లు మాట్లాడితే కేసులు తప్పవని ఈసీ ఆదేశాలతో టీడీపీ వాళ్లకు అర్థం ఐంది.-సిమ్మాదిరప్పన్న

Aditya Roy Kapur and Ananya Panday BREAK UP After Nearly 2 Years
ప్రియుడితో బ్రేకప్‌ చేసుకున్న లైగర్ భామ!

బాలీవుడ్‌లో మరో స్టార్‌ జంట బ్రేకప్‌ చెప్పుకున్నట్లు తెలుస్తోంది. బీటౌన్‌లో లవ్ బర్డ్స్‌గా ముద్ర వేసుకున్న జంట ఆదిత్య రాయ్ కపూర్, అనన్య పాండే. కొద్ది రోజులుగా వీరిద్దరు త్వరలోనే విడితునట్లు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యం షాకింగ్ విషయం బయటకొచ్చింది. ఈ జంట దాదాపు నెల రోజుల క్రితమే బ్రేకప్‌ చేసుకున్నట్లు వారి సన్నిహితుడు ఒకరు వెల్లడించారు.గతంలో జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ ‍వేడుకలకు వీరిద్దరు హాజరయ్యారు. ఈ వేడుకల తర్వాత ఎక్కడా కూడా జంటగా కనిపించలేదు. ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో పాల్గొని ముంబయికి తిరిగి వచ్చాక తమ రిలేషన్‌కు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అతని తెలిపిన వివరాలప్రకారం మార్చిలోనే ఆదిత్య, అనన్య విడిపోయినట్లు తెలుస్తోంది. బ్రేకప్ తర్వాత అనన్య పాండే తన కొత్త పెంపుడు కుక్కతో ఎక్కువ సమయం గడుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. కాగా.. అనన్య పాండే టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ సరసన లైగర్ చిత్రంలో నటించారు. ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. కాగా.. ఈ జంట రెండేళ్లుగా డేటింగ్‌లో ఉన్నారు.  

IPL 2024: Players Without Expectations Performing Best In This Season
IPL 2024: అంచనాలు లేకుండా బరిలోకి దిగి ఇరగదీస్తున్న చిచ్చరపిడుగులు వీళ్లే..!

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో పలువురు ఆటగాళ్లు ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి ఇరగదీస్తున్నారు. బ్యాటర్ల విషయానికొస్తే.. రాజస్థాన్‌ ఆటగాడు రియాన్‌ పరాగ్‌ ఈ సీజన్‌లో అన్‌ క్యాప్డ్‌ ప్లేయర్‌గా బరిలోకి దిగి మెరుపులు మెరిపిస్తున్నాడు. రియాన్‌ ఈ సీజన్‌లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడి 58.43 సగటున 159.14 స్ట్రయిక్‌రేట్‌తో 409 పరుగులు చేసి నాలుగో లీడింగ్‌ రన్‌స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా బరిలోకి దిగిన ఇరగదీస్తున్న మరో బ్యాటర్‌ అభిషేక్‌ శర్మ. ఈ ఎస్‌ఆర్‌హెచ్‌ ఓపెనర్‌ ఈ సీజన్‌లో అదిరిపోయే ప్రదర్శనలతో అంచనాలకు అందని రీతిలో రెచ్చిపోతూ తన జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. అభిషేక్‌ ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో అదిరిపోయే స్ట్రయిక్‌రేట్‌తో 315 పరుగులు చేశాడు.వద్దనుకున్న ఆటగాడే గెలుపు గుర్రమయ్యాడు..ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఓ ఆటగాడు ప్రత్యేకించి అందరి దృష్టిని ఆకర్శిస్తున్నాడు. శశాంక్‌ సింగ్‌ అనే పంజాబ్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌ ఈ సీజన్‌లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ఈ సీజన్‌లో శశాంక్‌ మెరుపు స్ట్రయిక్‌రేట్‌తో 288 పరుగులు చేసి తన జట్టు సాధించిన ప్రతి విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. శశాంక్‌ను ఈ సీజన్‌ వేలంలో పంజాబ్‌ పొరపాటున సొంతం చేసుకుందని ప్రచారం జరిగింది. పంజాబ్‌ సహ యజమాని ప్రీతి జింటా మరో శశాంక్‌ అనుకుని ఈ శశాంక్‌ను సొంతం చేసుకుందని సోషల్‌మీడియా కోడై కూసింది. అంతిమంగా చూస్తే ఈ వద్దనుకున్న ఆటగాడే పంజాబ్‌ సాధించిన అరకొర విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.ఈ సీజన్‌లో రఫ్ఫాడిస్తున్న మరో ప్లేయర్‌ ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌. ప్రభ్‌సిమ్రన్‌ ఈ సీజన్‌లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి మెరుపు స్ట్రయిక్‌రేట్‌తో 221 పరుగులు చేశాడు. అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా బరిలోకి దిగి సంచలనాలు సృష్టిస్తున్న మరో బ్యాటర్‌ నితీశ్‌కుమార్‌ రెడ్డి. ఈ ఎస్‌ఆర్‌హెచ్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌ ఏ అంచనాలు లేకుండా బరిలోకి దిగి మెరుపు ఇన్నింగ్స్‌లతో తన జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. నితీశ్‌ ఈ సీజన్‌ లభించిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సన్‌రైజర్స్‌ పాలిట గెలుపు గుర్రమయ్యాడు. వీళ్లే కాక చాలామంది అన్‌క్యాప్డ్‌ బ్యాటర్లు  ఈ సీజన్‌లో ఇరగదీస్తున్నారు.బౌలర్ల విషయానికొస్తే.. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి బంతితో సత్తా చాటుతున్న వారిలో సన్‌రైజర్స్‌ పేసర్‌ నటరాజన్‌ ముందు వరుసలో ఉన్నాడు. నటరాజన్‌ గతంలో అద్భుతంగా రాణించినప్పటికీ.. గత కొన్ని సీజన్లలో ఇతని ప్రదర్శన సాధారణ స్థాయికి పడిపోయింది. దీంతో ఈ సీజన్‌కు ముందు ఇతనిపై ఎలాంటి అంచనాలు లేవు. అండర్‌ డాగ్‌గా బరిలోకి దిగిన నట్టూ.. ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడి 15 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం అతను సెకెండ్‌ లీడింగ్‌ వికెట్‌టేకర్‌గా కొనసాగుతున్నాడు. అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లుగా బరిలోకి దిగి ఇరగదీస్తున్న బౌలర్లలో మయాంక్‌ యాదవ్‌, యశ్‌ ఠాకూర్‌, సందీప్‌ శర్మ, హర్షిత్‌ రాణా, వైభవ్‌ అరోరా, రవిశ్రీనివాసన్‌ సాయి కిషోర్‌ నట్టూ తర్వాతి స్థానాల్లో ఉన్నాడు. వీరంతా ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి తమతమ జట్ల పాలిట గెలుపు గుర్రాలయ్యారు.   

Rahul Gandhi Comments At Nirmal Congress Meeting
రిజర్వేషన్లను తొలగించే కుట్ర జరుగుతోంది: నిర్మల్‌ సభలో రాహుల్‌

సాక్షి, నిర్మల్‌: దేశంలో రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ. రిజర్వేషన్లు కూడా తొలగించే ప్రమాదం ఉందన్నారు. ఇండియా కూటమి ప్రజాస్వామ్యాన్ని కాపాడే సమూహమని తెలిపారు. నిర్మల్‌లో కాంగ్రెస్‌ జన జాతర భారీ బహరంగ సభ ఏర్పాటుచ ఏసింది. ఈ సబకు రాహుల్‌ గాంధీ, సీఎం రేవంత్‌, మంత్రి సీతక్క తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా రాహుల్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించామని చెప్పారు. ఆదివాసీ అంటే భూమిపై హక్కులు కలిగిన మొదటి వ్యక్తులు అని అర్థమన్న ఆయన.. ఆదివాసీలకు అన్ని హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో ఉన్న ప్రజా ప్రభుత్వం.. కేంద్రంలో కూడా ఏర్పడబోతోందన్నారు రాహల్‌ గాంధీ.కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే.. ఉపాధి హామీ పథకం ద్వారా రోజుకు రూ. 400 ఇస్తామని తెలిపారు.కాంగ్రెస్‌ దేశంలో కులగణను చేపట్టబోతుందని, కులగణనతో దేశంలో రాజకీయ ముఖచిత్రం మారబోతుందని అన్నారు. ఏ వర్గం వారి దగ్గర ఎంత సొమ్ము ఉందో తెలుసుకోబోతున్నామని చెప్పారు. రిజర్వేషన్లకు మోదీ వ్యతిరేకమని మండిపడ్డారు. 50 శాతం  ఉన్న రిజర్వేషన పరిమితికి కాంగ్రెస్‌ వ్యతిరేకమని స్పష్టం చేశారు. రిజర్వేషన్లు తీసేయడానికే ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటుపరం చేస్తున్నారని విమర్శించారు. ప్రవైవేటీకరణ అంటేను రిజర్వేషన్‌లను తొలగించడమని చెప్పారు.

తనిష్క్ జ్యువెలరీ నెక్లెస్‌
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్

ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన,  భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్‌ల నుండి ప్రేరణ పొంది  అద్భుతమైన మరియు వైవిధ్యమైన  శ్రేణి సమకాలీన,  రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్‌లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్‌లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్‌లు,  కస్టమర్‌లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా,  ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్‌ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్‌ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్,  ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం  వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్‌లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్‌గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్‌లెట్‌లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్‌లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్‌లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్‌డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్‌లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్  18కేరట్  మరియు 22కేరట్  బంగారంలో విస్తృతమైన శ్రేణి  డిజైన్‌లతో,  నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని  సంపూర్ణం  చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్‌లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన  సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను  అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా  కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్‌లెట్‌లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all