Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

AP Elections 2024: May 14th Politics Latest News Updates Telugu
May 14th: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌

May 14th AP Elections 2024 News Political Updates01:15 PM, May 14th, 2024మోసగాడిని ఓడించి, మొనగాడిని గెలిపించనున్నారు: మంత్రి అంబటి రాంబాబుఉదయం 6గంటల నుండి అర్ధరాత్రి వరకూ పోలింగ్ జరిగిందిఇది ప్రతిష్టాత్మకమైన ఎన్నికరాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ ఐదేళ్లపాటు పాలన చేసిన తర్వాత జరిగిన ఎన్నికచంద్రబాబు, జగన్ పాలన చూసినవారు ఓటు వేయడానికి పోటెత్తిన తీరు ఆశ్చర్యం కలిగిందిమహిళలు, వృద్ధులు తెల్లవారుజామునే బూత్ లకు చేరుకున్నారుతమ సంక్షేమ పాలన మళ్ళీ తెచ్చుకోవడానికి ప్రజలు ముందుకు వచ్చారుఓట్లశాతం పెరిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనుకునేవాళ్లం, కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి కోసం తాపత్రయపడి ఓటు వేశారుఈ ఎన్నికల్లో మహిళలే ఎక్కువగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారుమహిళలు 70శాతం ఫ్యాన్ గుర్తుకే ఓటు వేశారుఅమ్మఒడి, ద్వాక్రా రుణమాఫీ, ఇళ్ల పట్టాలు మహిళలకు ఇచ్చి వారి సాధికారతకు కృషి చేసారుఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కడా లేదుజగన్ కోసం ఓటర్లు పడిన తపన, తాపత్రయం స్పష్టంగా కనిపించిందిచంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఎల్లో మీడియా ఎవరు ప్రయత్నాలు చేసినా వైసీపీ వైపే ఉన్నారుసత్తెనపల్లి లోనూ నేను భారీ మెజారిటీ తో గెలవబోతున్నానుఏ ఎన్నికల్లోనూ జరగని హింస ఈ ఎన్నికల్లో జరిగిందిడీజీపీ, ఐజీ, ఐపీఎస్ లను మార్చారుఇంతమందిని మార్చినా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగలేదులా అండ్ ఆర్డర్ ను పోలీసులు కాపాడలేదుగొడవలు జరిగినపుడు పోలీసులకు ఫోన్ చేసినా గంటల తరబడి రీచ్ కాలేదుపోలీసులు అట్టర్ ఫెయిల్ అయ్యారుదాడులు జరిగిన తర్వాత చాలసేపటికి పోలీసులు వచ్చారునకిరేకల్ ఎస్సై నన్ను అక్కడ తిరగటానికి వీల్లేదు అన్నారుఎస్పీకి కాల్ చేస్తే నన్ను ఇంటికి వెళ్ళిపోమన్నారుకానీ నియోజకవర్గంలో నీ చాలా ప్రాంతాల్లో కన్నా లక్ష్మీ నారాయణ తిరిగారుకన్నా కుమారుడు మీ అంతు తేల్చుతా అని ఓటర్లను బెదిరించారురూరల్ సీఐ రాంబాబు టీడీపీతో కలిసిపోయాడుటీడీపీ వద్ద డబ్బులు తీసుకుని వారికి పనిచేశాడుదమ్మాలపాడు బూత్ లో పోలీసులను మేనేజ్ చేసి ఓట్లు వేయించారుఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేసానురీపోలింగ్ కి డిమాండ్ చేస్తున్నానునా అల్లుడు ఉమేష్ కారు పై దాడి చేశారుచీమలమర్రి, దమ్మాలపాడు, నాగనుపాడు, గుల్లపల్లి, మాదల సహా అనేక ప్రాంతాల్లో ఎలక్షన్ సక్రమంగా జరగలేదుఎలక్షన్ కమిషన్ ను అక్కడి కెమెరాలు పరిశీలించాలని కోరుతున్నానుకొన్నిచోట్ల పోలింగ్ ఆఫీసర్స్ కొల్యూడ్ అయిపోయారుఎవరి ఓటు వాళ్ళు వేస్తే సమస్య లేదుఅందరి ఓటు ఒక్కరే వేస్తే అది పద్ధతి కాదు.. ఎలక్షన్ అధారిటీస్ కి ఫిర్యాదు చేసానుచంద్రబాబు మోసగాడు.. ప్రజల్ని 14ఏళ్లు మోసం చేశాడుఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చిన నెరవేర్చిన మొనగాడు జగన్మోసగాడిని ఓడించి, మొనగాడిని గెలిపించనున్నారు 11:37 AM, May 14th, 2024జమ్మలమడుగులో బీజేపీ, టీడీపీ నేతల గూండాగిరిపట్టణ పరిధిలోని పోలింగ్ బూత్ 116,117లో బీజేపీ, టీడీపీ నేతలు డబ్బులు పంచుతున్నారన్న సమాచారంతో బూత్ వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై రాళ్ల దాడి.. వాహనంపైనా దాడిబీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణరెడ్డి, కడప టీడీపీ ఎంపి అభ్యర్ది భూపేష్ రెడ్డిల డైరెక్షన్‌లో దాడిరౌడిల్లా వ్యవహరించిన ఆదినారాయణరెడ్డి, భూపేష్ రెడ్డిపోలీసులు అడ్డుపడినా ఏకంగా వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపైకి దూసుకొచ్చిన కడప టిడిపి ఎంపి అభ్యర్ది భూపేష్ రెడ్డిఅడ్డుపడిన పోలీసులపై భూపేష్ గూండాగిరి10:57 AM, May 14th, 2024టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు.. అనిల్‌కుమార్‌ ఆగ్రహంపల్నాడులో టీడీపీ అరాచకాలకు తెగబడిందికొందరు పోలీసులు టీడీపీ అభ్యర్థుల్లా వ్యవహరించారుటీడీపీ దాడులపై మేం ఫోన్లు చేసినా పోలీసులు స్పందించలేదుఓటమి అక్కసుతో టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారుమాచర్లలో టీడీపీ నేతలు విధ్వంసం సృష్టించారుపిన్నెళ్లి, ఆయన కుమారుడిపై టీడీపీ నేతలు దాడి చేశారుపోలింగ్‌ బూత్‌ లోపలికి వెళ్లి టీడీపీ నేతలు దాడులు చేశారు. వైఎస్సార్‌సీపీకి మద్దతు తెలిపిన గ్రామాలపై దాడులకు దిగారుపల్నాడు ఎస్పీకి ఫోన్‌ చేసినా స్పందించలేదుపోలీసులు టీడీపీ కార్యకర్తల్లా పనిచేశారు టీడీపీ అభ్యర్థులకు ఈసీ రూల్స్‌ వర్తించవా?: గోపిరెడ్డికొందరు అధికారులు టీడీపీకి కొమ్ము కాశారుకొందరు పోలీసులు మాకు వ్యతిరేకంగా పనిచేశారునన్ను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు 10:50 AM, May 14th, 2024కూచివారిపల్లిలో టీడీపీ నేతల దాష్టీకంచంద్రగిరి మండలం కూచివారిపల్లిలో టీడీపీ నేతల దాష్టీకంసర్పంచ్‌ చంద్రశేఖర్‌రెడ్డి ఇంటికి నిప్పు పెట్టిన టీడీపీ గూండాలుసర్పంచ్‌ ఇల్లు పూర్తిగా దగ్ధం, పలు కార్లు ధ్వంసంకూచివారిపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు 9:43 AM, May 14th, 2024జేసీ కుటుంబంపై కేసు..టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీ పై కేసు నమోదు చేసిన పోలీసులుపోలింగ్ సందర్భంగా తాడిపత్రి పట్టణంలో విధ్వంసం సృష్టించిన జేసీ కుటుంబ సభ్యులుతాడిపత్రి టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, జేసీ పవన్ రెడ్డి లపై ఎఫ్ ఐ ఆర్జేసీ కుటుంబ సభ్యులతో పాటు 100 మంది టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదుతాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కాన్వాయ్ పై రాళ్లతో దాడి చేసిన టీడీపీ నేతలుఐదు వాహనాలు ధ్వంసం, ఇద్దరు కానిస్టేబుళ్లు సహా పలువురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు గాయాలుఈ ఘటనలపై లోతుగా విచారణ చేపట్టిన పోలీసులు9:20 AM, May 14th, 2024రెచ్చిపోయిన జనసేనకోనసీమ జిల్లాలో రెచ్చిపోయిన జనసేన కార్యకర్తలుకపిలేశ్వరపురం మండలం వల్లూరులో జనసేన కార్యకర్తల వీరంగంవైఎస్సార్‌సీపీ నేత పృథ్వీరాజ్‌ కారును ధ్వంసం చేసిన జనశ్రేణులుఅర్థరాత్రి విధ్వంసం సృష్టించిన జనసేన నేత లీలాకృష్ణలీలాకృష్ణను అదుపులోకి తీసుకున్న పోలీసులు8:41 AM, May 14th, 2024పల్నాడు జిల్లాలో బరితెగించిన టీడీపీ నేతలుతమకు ఓట్లు వేయని వారిని టార్గెట్ చేసి దాడులు నిర్వహిస్తున్న టీడీపీ నేతలుసత్తెనపల్లి నియోజకవర్గం లోని మాదల, తొండపి గ్రామాల్లో రాత్రి విధ్వంసంగురజాల మండలం కొత్త గణేషని పాడులో తెలుగుదేశం విధ్వంసంకర్రలు రాళ్లతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఇళ్లపై దాడిపోలింగ్ అనంతరం మూడు గంటల పాటు నిరంతరాయంగా దాడులుకొత్త గణేష్ ని పాడు లో బీసీల పైన దాడి చేసిన తెలుగుదేశం గుండాలువైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇల్లు ధ్వంసంసీఐ స్థాయి నుంచి డీఐజీ వరకు సమాచారం ఇచ్చిన పట్టించుకోని పోలీసులు7:48 AM, May 14th, 2024పోటెత్తిన ఓటర్లు: ఏపీ సీఈవో ముఖేష్‌కుమార్‌ మీనాఉ.6 గంటల నుంచే భారీ క్యూలైన్లలో ఓటర్లుఎన్నడూలేని విధంగా పెద్దఎత్తున తరలి వచ్చిన మహిళలు, వృద్ధులుసా.6 తర్వాత కూడా 3,500 కేంద్రాల్లో కొనసాగిన పోలింగ్‌గత ఎన్నికల కంటే ఓటింగ్‌ శాతం పెరుగుతుందని అంచనాపలుచోట్ల ఈవీఎంల మొరాయింపు, గాలివాన బీభత్సంతో మందకొడిగా సాగిన పోలింగ్‌చెదురుమదురు సంఘటనలు తప్ప ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలుహింసాత్మక ఘటనల కారకులపై కేసు నమోదుఇప్పటివరకు ఎక్కడా రీపోలింగ్‌ కోరుతూ అభ్యర్థనలు రాలేదురాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా7:32 AM, May 14th, 2024పచ్చ ముఠాల విధ్వంస కాండఓటమి భయంతో వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులు, దౌర్జన్యాలురాళ్లదాడులు, కత్తులతో బీభత్సం, బాంబులతో భయోత్పాతంయథేచ్ఛగా విధ్వంసం సృష్టించిన టీడీపీ, జనసేనచంద్రబాబు పక్కా పన్నాగంతోనే ధ్వంస రచనఎప్పటికప్పుడు ఫిర్యాదు చేసినా ఈసీ ఉదాసీనతశ్రీసత్యసాయి జిల్లా ఓడీ చెరువులో యువకుడికి కత్తిపోట్లువైఎస్సార్‌సీపీ కార్యకర్తపై కత్తెరతో ‘చింతమనేని’ అనుచరుల హత్యాయత్నం.. వైఎస్సార్‌ జిల్లాలో రెచ్చిపోయిన పచ్చ మూకలుఅన్నమయ్య జిల్లాలో బరితెగించి రౌడీయిజంవైఎస్సార్‌ జిల్లా మబ్బు చింతలపల్లెలో కారు అద్దాలు ధ్వంసంజంగాలపల్లి పోలింగ్‌ బూత్‌లో బరితెగించిన టీడీపీ కార్యకర్తలుచిత్తూరు జిల్లా పెరుమాళ్ల కండ్రిగలో ఇళ్లపై దాడులు, కార్లు ధ్వంసంకోనసీమ, కాకినాడ జిల్లాల్లో మితిమీరిన టీడీపీ నేతల ఆగడాలు 7:30 AM, May 14th, 2024పల్నాట పచ్చ మూక బీభత్సకాండఓటమి భయంతో రెచ్చిపోయిన టీడీపీ నేతలు.. ఓటర్లు, వైఎస్సార్‌సీపీ నేతలు, ఏజెంట్లపై దాడులుమాచర్ల ఎమ్మెల్యే పీఆర్కే తనయుడు గౌతమ్, డ్రైవర్‌పై దాడితంగెడలో పెట్రోలు బాంబులతో దాడి.. 8 మందికి తీవ్ర గాయాలుపాల్వాయి, తుమృకోటల్లో ఈవీఎంలు ధ్వంసంముప్పాళ్లలో మంత్రి అంబటి అల్లుడు కారు అద్దాలు ధ్వంసంనూజెండ్ల మండలంలో దళితులపై అరాచకంకేశానుపల్లిలో ఇళ్లకు వెళ్లి వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులపై దాడి.. చోద్యం చూసిన పోలీసులు 7:24 AM, May 14th, 2024ఆగని టీడీపీ అరాచకాలు దొంగ ఓట్లు వేయించేందుకు తీవ్ర యత్నాలుగణబాబు, శ్రీభరత్‌ చిత్రాలతో స్లిప్‌ల పంపిణీఅడ్డుకున్న వైఎస్సార్‌ సీపీ నాయకులుపోలీసుల వ్యవహార శైలిపై విమర్శలు7:15 AM, May 14th, 2024ప్రజాస్వామ్యానికి పచ్చ బ్యాచ్‌ తూట్లుఅడుగడుగునా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలుసీఎం రమేష్‌ ఓవరాక్షన్‌.. పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లి ఎన్నికల ప్రచారంటీడీపీ ఏజెంట్లతో ఫొటో షూట్‌క్యూలో నిల్చున్న ఓటర్లకు ప్రలోభాల ఎర 7:17 AM, May 14th, 2024నిమ్మాడలో అచ్చెన్న కుటుంబం బరితెగింపువైఎస్సార్‌సీపీ ఏజెంట్‌ అప్పన్నను బెదిరించి మరీ రిగ్గింగ్‌ పలు గ్రామాల్లోని ఓటర్లు పోలింగ్‌ బూత్‌కు రాకుండా అడ్డుకున్న కింజరాపు కుటుంబం ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దువ్వాడ7:07 AM, May 14th, 2024మరోసారి ఫ్యాన్‌ సునామీ పోలింగ్‌ కేంద్రాల వద్ద ఉదయం 6 గంటల నుంచే ఓటర్ల బారులుఉప్పెనలా కదలివచ్చిన వృద్ధులు, మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలుపట్టణాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే అధిక శాతం ఓటింగ్‌ సాయంత్రం 5 గంటలకు 68.04 శాతం పోలింగ్‌ నమోదుగంటల వరకు క్యూలైన్లలో ఉన్న వారందరికీ ఓటేసే అవకాశం కల్పించిన ఈసీపలుచోట్ల రాత్రి 10 వరకూ కొనసాగిన పోలింగ్‌.. 76.50 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఈసీ వర్గాల వెల్లడిఫలితాలను నిర్దేశించేది మహిళలు, గ్రామీణులేనన్న ఇండియాటుడే టీవీ కన్సల్టింగ్‌ ఎడిటర్‌ రాజ్‌దీప్‌.. ప్రభుత్వ సేవలను బట్టే 80శాతం మహిళలు ఓట్లు వేస్తారన్న యాక్సిస్‌ మై ఇండియా సీఎండీ ప్రదీప్‌ గుప్తాసచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటి గుమ్మం వద్దే ప్రజలకు ప్రభుత్వం సేవలుసంక్షేమాభివృద్ధి పథకాలతో ఇంటింటా వచ్చిన విప్లవాత్మక మార్పును ప్రతిబింబించిన పోలింగ్‌ సరళిప్రభుత్వ సానుకూలత సునామీలా ఓటెత్తిందంటున్న రాజకీయ పరిశీలకులు

AP Elections 2024: YSRCP In Josh After Huge Polling
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం

గుంటూరు, సాక్షి: ఆనందోత్సాహాలు.. పోలింగ్‌ శాతం పెంచేందుకు పౌరులను తరలించడంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు.. రెట్టించిన జోష్‌తో కదిలాయి. పోలింగ్‌ సరళి, మహిళలు..వృద్ధులు.. దివ్యాంగులు సైతం ఉత్సాహంగా పాల్గొన్న తీరు, యువత, రైతులు ఎక్కువ సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనడం వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలతో వైఎస్సార్‌సీపీలో ఉత్సాహం ఉరకలేసింది. మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమంటూ.. వైఎస్సార్‌సీపీ శ్రేణులు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.సజ్జల రామకృష్ణారెడ్డి సహా పార్టీ ముఖ్య నేతలంతా పోలింగ్ సరళిపై ఒక అంచనాకు వచ్చారు. పోటెత్తిన ఓటర్లు.. మహిళలు, వృద్దులు, గ్రామీణులే విజయాన్ని డిసైడ్ చేశారంటున్నారు. ఏపీ ప్రజలు సీఎం జగన్‌ 59 నెలల సంక్షేమ పాలనను మెచ్చి.. మళ్లీ ఆయన్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని దీని ద్వారా తేటతెల్లమైందని వ్యాఖ్యానిస్తున్నారు. జూన్‌ 4 వరకు ఉత్కంఠ అక్కర్లేదంటూ.. ముందే వారిలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. తమ నేతలకు అభినందనలు చెబుతున్నారు. కార్యాలయాలు, నివాసాలు కార్యకర్తల కేరింతలతో నిండిపోయాయి.ఇదీ చదవండి: ఉప్పెనలా ప్రభుత్వ సానుకూలతఇక.. ‘‘ఓ వైపు కవ్వింపులు.. దాడులు.. మరోవైపు అసహనంతో టీడీపీ-జనసేన శ్రేణుల తీరు. పోలింగ్‌ సరళి మేరకు.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి శ్రేణుల్లో నైరాశ్యం వ్యక్తమవుతోంది. అసహనం పెరిగిన నేపథ్యంలో పలు ప్రాంతాల్లో దాడులకు పాల్పడ్డాయి ఆ పార్టీ కేడర్‌లు. ఇక ఓటర్లు సైతం ప్రలోభాలకు లొంగలేదు. ఓటమి భయంతో పచ్చ మూకల విధ్వంసకాండ దిగినా ఓటర్లు బెదర్లేదు. పోలింగ్ జరిగిన తీరు, ఉదయాన్నుంచే బారులు తీరిన ఓటర్లే వైఎస్సార్‌సీపీ గెలుపునకు సాక్ష్యం అంటున్నాయి ఆ పార్టీ శ్రేణులు, అభిమానులు. పచ్చ ముఠాల విధ్వంసకాండజనసేన కార్యకర్తల దౌర్జన్యంజమ్మలమడుగు ఎమ్మెల్యేపై రాళ్ల దాడిపల్నాట పచ్చ మూక భీభత్సకాండఆగని టీడీపీ అరాచకాలు

Bombay High Court refuses to quash case against former AP CM Chandrababu Naidu
చంద్రబాబుకు బాంబే హైకోర్టు షాక్‌

ముంబయి: టీడీపీ అధినేత చంద్రబాబుకు బాంబే హైకోర్టు గట్టి షాక్‌ ఇచి్చంది. 2010 జూలైలో మహారాష్ట్రలో పోలీసు సిబ్బందిపై దాడికి పాల్పడిన వ్యవహారంలో తమపై నమోదైన కేసును కొట్టేయాలని చంద్రబాబు, టీడీపీ నేత నక్కా ఆనందబాబు దాఖలు చేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు ఔరంగాబాద్‌ బెంచ్‌ తోసిపుచి్చంది. ఈ మేరకు న్యాయమూర్తులు మంగేష్‌ పాటిల్, శైలేష్‌ బ్రహ్మేలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ మే 10న తీర్పు వెలువరించింది.పోలీసులతో చంద్రబాబు, నక్కా ఆనంద్‌ బాబు అనుచితంగా వ్యవహరించారనడానికి ఆధారాలున్నాయని పేర్కొంది. ఇందులో ఎలాంటి సందేహం లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా ధర్మాబాద్‌ పోలీసులు తమపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన రెండు పిటిషన్లను హైకోర్టు బెంచ్‌ కొట్టేసింది. పోలీసులపై చంద్రబాబు దాడి ప్రభుత్వోద్యోగిపై దాడి చేయడం, ప్రమాదకరమైన ఆయుధాలతో హాని కలిగించడం, ప్రాణాలకు హాని కలిగించే చర్యలు, శాంతికి భంగం కలిగించే ఉద్దేశంతో పోలీసులను ఉద్దేశపూర్వకంగా అవమానించడం, నేరపూరిత బెదిరింపులకు పాల్పడటం వంటి వాటిపై చంద్రబాబు, నక్కా ఆనంద్‌ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసును విచారించిన బాంబే హైకోర్టు ఔరంగాబాద్‌ బెంచ్‌ మొదటి నిందితుడైన చంద్రబాబు పోలీసులపై దాడికి తన అనుచరులను ప్రోత్సహించారని పేర్కొంది.మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ మధ్య యుద్ధ వాతావరణం సృష్టించారని వెల్లడించింది. సాక్షులు సైతం పోలీసులపై దాడిలో చంద్రబాబు, నక్కా ఆనంద్‌బాబుల పాత్ర ఉందని తెలిపారని ధర్మాసనం గుర్తు చేసింది. ఆ ఘటనలో అనేకమంది పోలీసు అధికారులు గాయపడినట్లు మెడికల్‌ సరి్టఫికెట్లు కూడా ధ్రువీకరిస్తున్నాయని పేర్కొంది. పోలీసు సిబ్బందిపై దాడి చేయాలనే ఈ నేరం చేసినట్లు తెలుస్తోందని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. కేసు ఇదీ.. 2010 జూలైలో చంద్రబాబు, ఆనంద్‌ బాబు తదితరులను కలిపి మొత్తం 66 మందిని రిమాండ్‌కు తరలించి ధర్మాబాద్‌లోని ప్రభుత్వ విశ్రాంతి గృహంలోని తాత్కాలిక జైలులో ఉంచారు. వారి జ్యుడీషియల్‌ కస్టడీని పొడిగించడంతో మహా­రాష్ట్ర జైళ్ల డీఐజీ వారిని ఔరంగాబాద్‌ సెంట్రల్‌ జైలుకు తరలించాలని ఆదేశించారు. అయితే, చంద్రబాబు, ఆనంద్‌ బాబు దీన్ని అడ్డుకోవడంతోపాటు తెలుగు, ఇంగ్లి‹Ùలో పోలీసు అధికారులను దూషించారు.అంతేకాకుండా బస్సు ఎక్కడానికి నిరాకరించడంతోపాటు పోలీసులపై దాడి చేశారు. దీంతో అదనపు బలగాలను రప్పించి చంద్రబాబు, ఆనంద్‌ బాబు తదితరులను ఔరంగాబాద్‌ సెంట్రల్‌ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో తమపై దాఖలైన కేసును కొట్టేయాలని చంద్రబాబు దాఖలు చేసిన రెండు పిటిషన్లను ధర్మాసనం రద్దు చేసింది. అయితే చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూద్రా విన్నపం మేరకు గతంలో వారికిచి్చన మధ్యంతర రక్షణను జూలై 8 వరకు పొడిగించింది.నిబంధనల ప్రకారమే కేసులు: ధర్మాసనం అంతకుముందు సీనియర్‌ న్యాయ­వాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపిస్తూ ఆందోళనలు, నిరసనకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ను పోలీసులు ఉపసంహరించుకున్నారని, ఆ కేసులో నిందితులందరినీ మేజి్రస్టేట్‌ వెంటనే విడుదల చేశారన్నారు. అయితే, దాడి కేసులో పోలీసులు చంద్రబాబును, నక్కా ఆనంద్‌ బాబును ఇరికించారని ఆరోపించారు. జైళ్ల చట్టంలోని నిబంధనల ప్రకారం ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసే అధికారం జైళ్ల సూపరింటెండెంట్‌కు మాత్రమే ఉందన్నారు.ప్రస్తుత కేసులో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది సీనియర్‌ జైలర్‌ అని, ఆయనకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసే అధికారం లేదని లూత్రా అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే కోర్టు ఈ వాదనలను తిరస్కరించింది. నిందితులపై భారతీయ శిక్షాస్మృతిలోని నిబంధనల ప్రకారమే కేసులు నమోదు చేశారని స్పష్టం చేసింది. జైలు ప్రాంగణంలో నేరాలకు సంబంధించి భారతీయ శిక్షాస్మృతి ప్రకారం ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడానికి జైళ్ల చట్టం ఎలాంటి యంత్రాంగాన్ని లేదా విధానాన్ని నిర్దేశించలేదని ధర్మాసనం పేర్కొంది.

Elections 2024: Pm Narendra Modi Filed Nomination
నామినేషన్‌ వేసిన ప్రధాని మోదీ

ఢిల్లీ: బీజేపీ అగ్రనేత, దేశ ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభ ఎన్నికల కోసం నామినేషన్‌ వేశారు. మంగళవారం ఉదయం ఉత్తర ప్రదేశ్‌ వారణాసి కలెక్టర్‌ కార్యాలయానికి చేరుకున్న ఆయన.. ఎన్నికల అధికారులకు నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. నామినేషన్‌ సమర్పించే టైంలో మోదీ వెంట సాధువులు, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ ఉన్నారు. మోదీ నామినేషన్‌ను నలుగురు నేతలు బలపర్చారు. వాళ్లలో అయోధ్య ఆలయ పూజారి, ఒకరు దళితుడు, మరో ఇద్దరు ఓబీసీ నేతలు ఉన్నారు.మోదీ నామినేషన్‌ కార్యక్రమానికి 18 మంది కేంద్ర మంత్రులు హాజరయ్యారు. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ సహా 12 రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. ఎన్టీయే నేతలతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా రాజకీయ ప్రముఖులు వెళ్లారు.#WATCH | Prime Minister Narendra Modi files nomination from Varanasi Lok Sabha seat for #LokSabhaElections2024 pic.twitter.com/lSgGcPiNjR— ANI (@ANI) May 14, 2024 #WATCH | Prime Minister Narendra Modi files nomination from Varanasi Lok Sabha seat for #LokSabhaElections2024Uttar Pradesh CM Yogi Adityanath is also present on the occasion. pic.twitter.com/woWNPgqdiG— ANI (@ANI) May 14, 2024నామినేషన్‌ వేయడానికి ముందు.. దశ అశ్వమేథ ఘాట్‌లో మోదీ ప్రత్యేక పూజలు చేశారు. ఇదిలా ఉంటే.. మోదీ వారణాసి నుంచి పోటీ చేయడం ఇది మూడోసారి. గుజరాత్‌కు చెందిన నరేంద్ర మోదీ.. 2014, 2019 ఎన్నికల్లో వారణాసి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. లోక్‌సభ ఎన్నికలు-2024 చివరి ఫేజ్‌లో భాగంగా జూన్‌ 1వ తేదీన వారణాసి పార్లమెంట్‌ స్థానానికి పోలింగ్‌ జరగనుంది. #WATCH | Uttar Pradesh: PM Narendra Modi offers prayers at Dasaswamedh Ghat in VaranasiPM Narendra Modi will file his nomination for #LokSabhaElections2024 from Varanasi today. PM is the sitting MP and BJP's candidate from Varanasi. pic.twitter.com/tnZNsQCnmV— ANI (@ANI) May 14, 2024

BCCI Criteria For New Team India Head Coach Job This Ex Player Intrest In It
టీమిండియాకు హెడ్‌ కోచ్‌ కావలెను.. ఆ మాజీకి ఛాన్స్‌ దక్కేనా?

టీ20 వరల్డ్ కప్ 2024తో రాహుల్ ద్రవిడ్ టీమిండియా హెచ్‌ కోచ్‌ పదవీ కాలం ముగియనుంది. దీంతో ఆయన మరోసారి దరఖాస్తు చేసుకుంటారా? లేదంటే ఆ అవకాశం మరొకరిని వరిస్తుందా?.. టీమిండియాకు కాబోయే హెడ్ కోచ్ ఎవరు? అనే చర్చ నడుస్తోంది. ఈ లోపే హెడ్ కోచ్ కోసం బీసీసీఐ దరఖాస్తులకు ఆహ్వానించింది.కొత్త కోచ్ ప‌ద‌వీకాలం ఈ ఏడాది జులై 1 నుంచి 2027 డిసెంబ‌ర్ 31వ తేదీ వ‌ర‌కు ఉంటుంద‌ని బీసీసీఐ తాజాగా స్పష్టం చేసింది. అంటే కొత్త‌గా కోచ్ ప‌ద‌వికి ఎంపిక‌యిన వ్య‌క్తి 2027 వ‌న్డే ప్రపంచ‌క‌ప్ వ‌ర‌కు భార‌త జ‌ట్టుకు ప్రధాన కోచ్‌గా కొన‌సాగుతారన్నమాట. అలాగే.. కొత్త కోచ్‌కు దరఖాస్తు చేసుకునేవాళ్ల వయసు 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగి ఉండాలి. పారితోషికం అనుభవాన్ని బ‌ట్టి ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. వీటితో పాటు.. మూడు ఫార్మాట్లలో జట్టుకు హెడ్‌ కోచ్ గా కొన‌సాగుతాడు. కోచ్‌కు 14-16 మంది సహాయక సిబ్బంది ఉంటారు. టీమ్‌ ప్రదర్శన, నిర్వహణకు ప్రధాన కోచ్ పూర్తి బాధ్యత వహిస్తాడు. అలాగే స్పెషలిస్ట్ కోచ్‌లు, సహాయక సిబ్బంది బృందానికి నాయకత్వం వహిస్తాడు. భారత జట్టులోని క్రమశిక్షణా కోడ్‌లను సమీక్షించడం, నిర్వహించడం, అమలు చేయడం ప్రధాన కోచ్ బాధ్యతఅర్హతలుకనీసం 30 టెస్ట్ మ్యాచ్‌లు లేదా 50 వ‌న్డేలు ఆడి ఉండాలి. లేదంటే.. టెస్టు క్రికెట్ ఆడే దేశానికి ప్రధాన కోచ్‌గా కనీసం 2 సంవత్సరాల పాటు ప‌నిచేసిన అనుభ‌వం ఉండాలి.ఐపీఎల్‌ జట్టు లేదా సమానమైన ఇంటర్నేషనల్ లీగ్/ఫస్ట్ క్లాస్ జట్లకు/ జాతీయ అ జ‌ట్ల‌కు ప్రధాన కోచ్‌గా కనీసం మూడేళ్లు ప‌నిచేసి ఉండాలి.బీసీసీఐ లెవల్ 3 సర్టిఫికేషన్ కలిగి ఉండాలి.పై కండిష‌న్ల‌లో ఏది ఉన్నా స‌రే.. ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.ఉవ్విళ్లూరుతున్న మాజీ ప్లేయర్‌టీమిండియా హెడ్‌ కోచ్‌ దరఖాస్తుల నేపథ్యంలో.. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జస్టిన్ లాంగర్ ఈ పదవిపై ఆసక్తి చూపిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ఈ ఐపీఎల్ సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ హెడ్ కోచ్ గా ఉన్నాడు‘‘టీమిండియా హెచ్‌ కోచ్‌ పదవిపై నేను ఆసక్తిగా ఉన్నాను. దీని గురించి ఎప్పుడూ నేను ఆలోచించలేదు. ప్రతి అంతర్జాతీయ కోచ్ పై నాకు అమితమైన గౌరవం ఉంది. ఎందుకంటే అందులో ఉండే ఒత్తిడి నాకు తెలుసు. కానీ ఇండియన్ టీమ్ కోచింగ్ అద్భుతమైన జాబ్. ఈ దేశంలో ఉన్న టాలెంట్ చూసిన తర్వాత కోచ్ పదవి అనేది ఆకర్షణీయంగా కనిపిస్తోంది’’ అని లాంగర్ ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు.లాంగర్‌ కెరీర్‌జస్టిన్ లాంగర్ ఆస్ట్రేలియా తరఫున 105 టెస్టులు ఆడాడు. 45 సగటుతో 7696 రన్స్ చేశాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా టీమ్ కోచ్ గా ఉన్నాడు. అతని కోచింగ్ లోనే 2021లో ఆస్ట్రేలియా తొలిసారి టీ20 వరల్డ్ కప్ గెలిచింది. ఇక ఇప్పుడు ఐపీఎల్ ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్ కు కూడా కోచ్ గా ఉన్నాడు. గత రెండు సీజన్లలోనూ ఆ టీమ్ ప్లేఆఫ్స్ చేరుకుంది.ఫారినర్‌కు ఛాన్స్‌ దక్కేనా?డంకన్ ఫ్లెచర్ తర్వాత గత పదేళ్లలో మరో విదేశీ కోచ్ ను నియమించలేదు. కుంబ్లే, రవిశాస్త్రి, రాహుల్ ద్రవిడ్ ఈ బాధ్యతను చేపట్టారు. దీంతో.. బీసీసీఐ మరోసారి విదేశీ కోచ్ ను నియమిస్తుందా లేదా అన్నది చూడాలి. అయితే ఈసారి ఓ విదేశీ కోచ్ ను నియమించే అవకావాలను కూడా కొట్టిపారేయలేం అన్నట్లుగా బీసీసీఐ సెక్రటరీ జై షా మాటలను బట్టి అర్థమవుతోంది.

Ex-Minister Anil Kumar Yadav Fires On TDP
టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్‌కుమార్‌ ఆగ్రహం

సాక్షి, నరసరావుపేట: పల్నాడులో టీడీపీ అరాచకాలకు తెగబడిందని వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి అనిల్‌కుమార్‌ యాదవ్‌ మండిపడ్డారు. కొందరు పోలీసులు టీడీపీ అభ్యర్థుల్లా వ్యవహరించారు.. టీడీపీ దాడులపై మేం ఫోన్లు చేసినా పోలీసులు స్పందించలేదన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఓటమి అక్కసుతో టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు.మాచర్లలో టీడీపీ నేతలు విధ్వంసం సృష్టించారని.. పిన్నెళ్లి, ఆయన కుమారుడిపై టీడీపీ నేతలు దాడి చేశారన్నారు. పోలింగ్‌ బూత్‌ లోపలికి వెళ్లి టీడీపీ నేతలు దాడులు చేశారు. వైఎస్సార్‌సీపీకి మద్దతు తెలిపిన గ్రామాలపై దాడులకు దిగారు. పల్నాడు ఎస్పీకి ఫోన్‌ చేసినా స్పందించలేదు పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా పనిచేశారంటూ అనిల్‌ మండిపడ్డారు. టీడీపీ అభ్యర్థులకు ఈసీ రూల్స్‌ వర్తించవా?: గోపిరెడ్డికొందరు అధికారులు టీడీపీకి కొమ్ము కాశారని గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కొందరు పోలీసులు మాకు వ్యతిరేకంగా పనిచేశారు. నన్ను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. టీడీపీ అభ్యర్థులకు ఈసీ రూల్స్‌ వర్తించవా?’’ అంటూ గోపిరెడ్డి ప్రశ్నించారు.

Melinda Gates To Resign From Gates Foundation Tweet Viral
మిలిండా గేట్స్ అనూహ్య నిర్ణయం

ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన బిల్ & మిలిండా గేట్స్ ఫౌండేషన్‌ గురించి అందరికి తెలుసు. ఈ ఫౌండేషన్‌కు కో-చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వహించిన మిలిండా (Melinda Gates) ఎట్టకేలకు తన పదవి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.ఫౌండేషన్‌లో నా చివరి రోజు జూన్ 7 అంటూ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ నిర్ణయాన్ని చాలా తేలిగ్గా తీసుకోలేదు. బిల్, నేను కలిసి ప్రారంభించిన ఈ ఫౌండేషన్‌ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అసమానతలను పరిష్కరించడానికి అసాధారణ కృషి చేసాము. దీనికి నేను ఎంతగానో గర్వపడుతున్నాను. ఈ ఫౌండేషన్‌ను సమర్థుడైన సీఈఓ మార్క్ సుజ్మాన్, ఎగ్జిక్యూటివ్ లీడర్‌షిప్ టీమ్.. సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తారని భావిస్తున్నానని మిలిండా పేర్కొన్నారు.దాతృత్వం తదుపరి అధ్యాయంలోకి వెళ్లడానికి నాకు సరైన సమయం వచ్చింది, అందుకే రాజీనామా చేస్తున్న అంటూ మిలిండా వివరించారు. మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్ గేట్స్ నుంచి విడాకులు తీసుకున్న మూడు సంవత్సరాలకు మిలిండా ఈ నిర్ణయం తీసుకున్నారు.మిలిండా ఫ్రెంచ్ గేట్స్ రాజీనామా తరువాత.. ఆమె దాతృత్వ ప్రయోజనాల కోసం 12.5 బిలియన్ల డాలర్లను అందుకుంటారు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందనే విషయాలను కూడా ఎప్పటికప్పుడు తెలియజేస్తాను అని మిలిండా పేర్కొన్నారు.మిలిండా గేట్స్ ప్రపంచ నాయకత్వం, పనిని ఎప్పటికప్పుడు పూర్తి చేసే బాధ్యత మమ్మల్ని ఎంతగానో ఆకర్శించాయి. ఈమె రాజీనామా నాకు కష్టమైన వార్త. నేను కూడా.. మిలిండాను ఆరాధించే వారిలో ఒకరిని. ఆమెతో కలిసి పనిచేయడం వల్ల ఎంతో నేర్చుకున్నాను అని సీఈఓ మార్క్ సుజ్మాన్ అన్నారు.pic.twitter.com/JYIovjNYKo— Melinda French Gates (@melindagates) May 13, 2024

Woman On Wheelchair Who Successfully Runs Own Spice Business In Kashmir
వీల్‌చైర్‌కి పరిమితమైన వెనక్కి తగ్గలేదు..వ్యాపారవేత్తగా..!

పెద్ద చదువులు చదువుకుని ఏ ఉద్యోగం లేక ఇంకా తల్లిదండ్రులపై ఆధారపడే యువత ఎంతోమంది ఉన్నారు. కనీసం తమ వ్యక్తిగత ఖర్చులకు కూడా తమ పెద్దవాళ్ల ముందు చేయిచాపనిదే పని అవ్వదు. కనీసం అవయవాల్ని సక్రమంగా ఉన్నాయి కదా అని ఏదోక పనిచేసే యత్నం కానీ ఆలోచన కానీ అస్సలు చెయ్యరు. పైగా అనుకున్నది కాలేదని నిరాశనిస్పృహలకు లోనై అక్కడితో ఆగిపోతారు. కానీ అ మహిళ చిన్నతనంలో వచ్చిన వ్యాధి నడవకుండా చేసి వీల్‌చైర్‌కే పరిమితం చేసినా..భయపడలేదు. ఒక కష్టం మీద మరో కష్టం వస్తూనే ఉన్నా వెనక్కి తగ్గలేదు. పైగా సమర్థవంతమైన వ్యాపారవేత్తగా విజయాలను సాధిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. ఆమె ఎవరంటే..కాశ్మీర్‌లోని విశాలమైన వ్యాలీ లోయల్లో పుట్టి పెరిగిన సదాఫ్‌కి పదేళ్ల వయసులో తీవ్ర జ్వరం వచ్చింది. డాక్టర్‌ వద్దకు వెళ్లగా ఆమె ఇక ఎప్పటికి మళ్లీ నడవలేదని తేల్చి చెప్పేశారు. దీంతో చదువుకి దూరమవ్వాల్సి వచ్చింది. అయినప్పటికీ ఏదో ఆశతో తల్లిదండ్రులు ఆమెను అనేకమంది వైద్యుల వద్దకు తిప్పేవారు. ఆమెకు శస్త చికిత్స చేసి ప్రత్యేకంగా నడిచే బూట్లను పెట్టించాలని ప్రయాసపడ్డారు ఆమె తల్లిదండ్రులు. కానీ బరువు ఎక్కువగా ఉండటంతో అది సాధ్యం కాదని చెప్పేశారు. పొరుగున ఉన్న పిల్లలు పాఠశాలకు వెళ్తుంటే తానెందుకు వెళ్లలేకపోతున్నాను అనేది కూడా తెలియని స్థితిలో ఉంది సదాఫ్‌. అయినపటికీ.. ఆమెలో మనోబలం తగ్గకుండా ఉండేలా ధైర్యాన్ని నూరిపోసేవాడు తండ్రి. ఆ తండ్రినే విధి సదాఫ్‌ నుంచి దూరం చేసింది. దీంతో ఆయన మరణం కారణంగా సదాఫ్‌పై కుటంబ బాధ్యత పడ్డాయి. ఆమె తండ్రి మాత్రమే తనలోని శక్తి సామర్థ్యాను నమ్మేవారు, మిగతావారందరూ కించపరుస్తూనే ఉండేవారు. తన కాళ్ల మీద నిలబడే క్రమంలో అడగడున అవమానాలే ఎదుర్కొంది. వాటన్నింటిని తన తండ్రి ఇచ్చిన ధైర్యాన్ని స్ఫూరణకు తెచ్చుకుని అధిగమించే యత్నం చేసింది. అలా మసాలా వ్యాపారాన్ని పెట్టకునే స్థాయికి ఎదిగింది. అలా అంచెలంచెలుగా ఎదగుతూ సక్సెస్‌ఫుల్‌ వ్యాపారవేత్తగా విజయాలను అందుకుంది. అక్కటితో ఆగలేదు బొటిక్‌ లాంటి పెద్ద వ్యాపారాన్ని కూడా సొంత చేసుకుని సమర్థవంతంగా రన్‌ చేస్తోంది. ఈ క్రమంలో తాను ఎన్నో రోజులు ఒంటరిగా కూర్చొని ఏడ్చిన రోజులు లెక్కలేనన్నీ ఉన్నాయని అంటోంది సదాఫ్‌. వీల్‌ చైర్‌లో ఉండే తాను ఏం చేయగలను, కుటుంబానికి ఏ విధంగా తోడ్పడగలననేది ఆమెలో తలెత్తిన సందేహాలు, భయాలు. ఇలా ఆలోచించి..ఒక్కోక్కసారి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయేది. అయినప్పటికీ వాటన్నింటిని తన చేతులతో ఎందుకు చేయలేనన్న మొండి తెగింపు లోలోపల ఎక్కువగా ఉండేది. అదే ఈ రోజు సక్సెస్‌ఫుల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మీ ముందు నిలబడేలా చేసిందని చెబుతోంది సదాఫ్‌. ఆమె విజయపరంపర అక్కడితో ఆగిపోలేదు సదాప్‌ మంచి‌ బాస్కెట్‌ బాల్‌ ప్లేయర్‌ కూడా. జమ్మూ కాశ్మీర్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ద్వారా ఎన్నో అవార్డులను అందుకుంది. నాడు హేళన చేసి బాధ పెట్టిన వ్యక్తులే ఈ రోజు తన విజయగాథను తమ పిల్లలకు చెబుతూ స్ఫూర్తిగా తీసుకోమనడం తనకు ఎంతో గర్వంగా ఉంటుందని ఆనందంగా చెబుతోంది సదాఫ్‌. చివరిగా ఆమె వీల్‌చైర్‌లపై ఉన్న వ్యక్తులు లేదా దివ్యాంగులను ఎప్పుడూ అనుమానించొద్దని చెబుతోంది. వీలైతే నమ్మకాన్ని, దైర్యాన్ని అందివ్వండి గానీ జాలీ మాత్రం చూపించి శాపగ్రస్తులుగా నిలబెట్టొదని కోరుతోంది సదాఫ్‌.(చదవండి: పూర్వకాలంలో అరటిపండ్లను అలా ముగ్గబెట్టేవారా!నెటిజన్లు ఫిదా)

Aishwarya Rajesh About Her Mother Hurdles
అతి మంచి పనికిరాదని నాన్న నుంచే నేర్చుకున్నా: హీరోయిన్‌

ఐశ్వర్య రాజేశ్‌... దక్షిణాది సినిమాలో స్టార్‌ హీరోయిన్‌. చిన్నచిన్న పాత్రలతో అంచెలంచెలుగా ఎదిగి లేడీ ఓరియంటెెడ్‌ కథా చిత్రాలు చేసే స్థాయికి ఎదిగారు. యంగ్‌ ఏజ్‌లోనే కాక్కా ముట్టై చిత్రంలో ఇద్దరు పిల్లల తల్లిగా నటించి ఆ పాత్రకు జీవం పోశారు. ఆ చిత్రమే ఐశ్వర్య రాజేశ్‌ కేరీర్‌కు పెద్ద టర్నింగ్‌ పాయింట్‌ అయ్యింది.తండ్రి అతి మంచి వల్లఈ హీరోయిన్‌ ఇటీవల మాతృదినోత్సవం సందర్భంగా తన కుటుంబం ఎదుర్కొన్న కష్టాలను, అమ్మ పడ్డ బాధలను వివరించారు. కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయడానికి తన తండ్రి ష్యూరిటీ ఇచ్చి రుణాలు ఇప్పించారన్నారు. అయితే ఆనారోగ్యం కారణంగా తన తండ్రి మరణిస్తే అప్పులు ఎగ్గొట్టిన వారి రుణ భారం అంతా తల్లిపై పడిందన్నారు. దీంతో తమకు ఉన్న ఒకే ఒక్క ప్లాట్‌ను విక్రయించి ఆ అప్పును తీర్చినట్లు చెప్పారు. అమ్మ ఏ లోటూ లేకుండాఅంత కష్టంలోనూ అమ్మ తమను మంచి పాఠశాలలో చదివించారని, ఏ లోటూ లేకుండా చూసుకున్నారన్నారు. తన అన్నయ్యలు ఇద్దరూ చదువు పూర్తి చేసి ఉద్యోగం చేయడానికి సిద్ధమైన సమయంలో ఒక ప్రమాదంలో మరణించారన్నారు. అప్పటికే పుట్టెడు కష్టాల్లో ఉన్న అమ్మను ఆ సంఘటన మరింత కుంగదీసిందన్నారు. అయినా తను ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదని తెలిపారు. అమ్మ నుంచే నేర్చుకున్నావృత్తిపరంగా తాను ఎన్నో ఎత్తుపల్లాలను ఎదుర్కొన్నా, ధైర్యంగా ముందుకు సాగే గుణాన్ని తన తల్లి నుంచే నేర్చుకున్నట్లు చెప్పారు. అలాగే అతి మంచికి పోకూడదన్నది తన తండ్రి జీవితం నుంచి నేర్చుకున్నట్లు ఐశ్వర్య రాజేశ్‌ చెప్పారు.

తనిష్క్ జ్యువెలరీ నెక్లెస్‌
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్

ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన, భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్‌ల నుండి ప్రేరణ పొంది అద్భుతమైన మరియు వైవిధ్యమైన శ్రేణి సమకాలీన, రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్‌లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్‌లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్‌లు, కస్టమర్‌లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా, ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్‌ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్‌ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్, ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్‌లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్‌గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్‌లెట్‌లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్‌లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్‌లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్‌డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్‌లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్ 18కేరట్ మరియు 22కేరట్ బంగారంలో విస్తృతమైన శ్రేణి డిజైన్‌లతో, నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని సంపూర్ణం చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్‌లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్‌లెట్‌లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
 

ఫోటో స్టోరీస్

View all