Sakshi News home page
Advertisement

Top Stories

ప్రధాన వార్తలు

Watch Live: AP CM YS Jagan Public Meeting at Mydukur
Watch Live: మైదుకూరులో సీఎం జగన్‌ ప్రచార సభ

Watch Live: మైదుకూరులో సీఎం జగన్‌ ప్రచార సభ

Telangana SSC Result 2024 Released
TS SSC Results 2024: తెలంగాణ టెన్త్‌ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌, సాక్షి: తెలంగాణ పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. ఫాస్ట్‌గా రిజల్ట్‌ను చూసుకునేందుకు సాక్షి ఎడ్యుకేషన్‌ వెసులుబాటు కల్పిస్తోంది.ఫలితాల కోసం క్లిక్‌ చేయండిఈ ఏడాదికిగానూ ఐదు లక్షల మంది పరీక్ష రాసినట్లు ఎడ్యుకేషన్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం తెలిపారు. ఈ ఏడాది ఫలితాల్లో బాలికలదే పైచేయి అని ఎడ్యుకేషన్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం తెలిపారు. పదో తరగతి ఫలితాల్లో మొత్తం 91.31 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 93.23 శాతం, బాలురు 89.42 శాంత ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. 3927 పాఠశాలలు ఉత్తీర్ణత సాధించాయని.. నిర్మల్ జిల్లా 99.05 శాతంతో మొదటి స్థానం, వికారాబాద్ జిల్లా 65.10 శాతం చివరి స్థానంలో నిలిచిందని చెప్పారు. 4లక్షల 94 వేల 207 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, ఇందులో 4,51, 272 మంది ఉత్తీర్ణత  సాధించారు. జూన్ 3 నుండి 13 వరకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు.  

AP CM YS Jagan Exclusive Interview: Slams Chandrababu And Sharmila Decision
రెండు పార్టీల రిమోట్‌ బాబు చేతిలో.. షర్మిల నిర్ణయం బాధించింది: సీఎం జగన్‌

ఫ్యాన్‌ గుర్తుకు ఓటేస్తేనే రాష్ట్రంలో సంక్షేమం కొనసాగుతుందని, చంద్రబాబు నాయుడు.. కూటమి ఇస్తున్న హామీలతో మోసపోవద్దని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏపీ ప్రజలకు పదే పదే చెబుతున్నారు. ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా ఉన్న ఆయన తాజాగా ఇండియా టుడే రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాజా రాజకీయాలపై ఆయన స్పందించారు.  ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌తో మేం పోరాడుతున్నాం. ఈ రెండు పార్టీల రిమోట్లు చంద్రబాబు చేతిలో ఉన్నాయి. ఈ రెండు పార్టీలను ఆయనే నియంత్రిస్తున్నారు.కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తోన్న తన సోదరి, ఏపీ పీసీసీ చీఫ్‌ షర్మిల గురించి సీఎం జగన్‌కు ప్రశ్న ఎదురైంది. ‘‘షర్మిల ఈ ఎన్నికల్లో పోటీ చేయడం ఒక్కటే కాదు ఆమెకు డిపాజిట్లు కూడా దక్కబోవనే విషయం తనను బాధకు గురి చేస్తోంది. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవడం సరైన నిర్ణయం కాదు... ఏపీలో నాకు పోటీగా రాజకీయాలు చేసేలా.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు, షర్మిలను ప్రభావితం చేశారు. నాపై తప్పుడు కేసులు బనాయించడంతో పాటు, చనిపోయాక నా తండ్రి..దివంగత మహానేత వైఎస్సార్‌ పేరును  ఛార్జిషీట్‌లో చేర్చిన పార్టీతో ఆమె చేతులు కలిపారు. ఇదంతా ఎంతో బాధ కలిగిస్తోంది. ఎవరు ఏమిటనేది ఈ ఎన్నికల ద్వారా ప్రజలే నిర్ణయిస్తారు.తనపై తప్పుడు కేసులు పెట్టారంటూ చంద్రబాబు ఏపీ ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలపైనా సీఎం జగన్‌ స్పందించారు. ‘‘ఒకరు తప్పు చేశారా? లేదా? అనేది న్యాయస్థానాలు నిర్ధారిస్తాయి. జైలుశిక్ష పడిందీ అంటే ఏదో తప్పు చేశారనే అర్థం. చంద్రబాబు తప్పు చేశాడనడానికి అవసరమైనన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి’’ అని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.Was the stone attack on @ysjagan stage managed as his critics allege? Listen here: https://t.co/1Zdr4cbRBU— Rajdeep Sardesai (@sardesairajdeep) April 29, 2024జగన్‌ ముఖ్యమంత్రిగా కొనసాగితేనే ఏపీలో సంక్షేమం ఉంటుందని,  అమ్మ ఒడి, విద్యా దీవెన, విద్యా కానుక, వసతి దీవెన, చేయూత, ఆసరా, రైతు భరోసా వంటి సంక్షేమ పథకాలు, వలంటీర్ల ద్వారా నెలవారీ సామాజిక పింఛన్లు డోర్ డెలివరీ వంటి కార్యక్రమాలు కొనసాగుతాయని సీఎం జగన్‌ ఆ ఇంటర్వ్యూ ద్వారా స్పష్టం చేశారు. 

India T20 WC 2024 Squad: BCCI Jay Shah To Meet For Final Call On Selection
T20 WC: జట్టు ఎంపిక ఫైనల్‌.. అతడిపై వేటు తప్పదా?

టీ20 ప్రపంచకప్‌-2024 జట్టు ప్రకటనకు సమయం ఆసన్నమైంది. ఈ మెగా ఈవెంట్లో పాల్గొనబోయే ఆటగాళ్లు ఎవరన్న చర్చకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది.జూన్‌ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్‌ ఆతిథ్యంలో ఈ ఐసీసీ టోర్నీ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ప్రపంచకప్‌లో భాగమయ్యే ఇరవై జట్ల ఎంపికను మే 1 వరకు ఖరారు చేయాల్సిందిగా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి ఆయా దేశాలను ఆదేశించింది.ఈ క్రమంలో ఇప్పటికే న్యూజిలాండ్‌ తమ జట్టును ప్రకటించగా.. టీమిండియా కూడా అనౌన్స్‌మెంట్‌కు సిద్ధమైంది. జట్టు ఎంపిక గురించి ఇప్పటికే బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌, హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మధ్య చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం.ఢిల్లీలో వీరు ముగ్గురు ఆదివారం సమావేశమై తీసుకున్న నిర్ణయం గురించి బీసీసీఐ కార్యదర్శి జై షాతో మంగళవారం చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాగా హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌ ఫిట్‌నెస్‌, వికెట్‌ కీపర్‌ ఎంపిక గురించి మేనేజ్‌మెంట్‌ తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం.పాండ్యా గనుక బౌలింగ్‌ చేస్తే అదనపు పేసర్‌ అవసరం ఉండదు. కానీ అతడి ఫిట్‌నెస్‌ దృష్ట్యా బౌలర్‌గా పూర్తిస్థాయిలో బరిలోకి దిగే అవకాశం కనిపించడం లేదు. మరోవైపు.. వికెట్‌ కీపర్‌ కోటాలో రిషభ్‌ పంత్‌తో పాటు సంజూ శాంసన్‌, కేఎల్‌ రాహుల్‌ పోటీపడుతున్నారు.వీరిలో సంజూ ఐపీఎల్‌-2024లో దుమ్ములేపుతుండగా.. పంత్‌ కూడా మెరుగ్గా రాణిస్తున్నాడు. రాహుల్‌ కూడా బాగానే ఆడుతున్న నిలకడలేమి ఫామ్‌ కలవరపెడుతోంది.అతడిపై వేటు తప్పదా?మరోవైపు.. ఓపెనింగ్‌ స్లాట్‌లో రోహిత్‌ శర్మతో పాటు విరాట్‌ కోహ్లి పేరు దాదాపుగా ఖరారు కాగా.. బ్యాకప్‌ ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్‌, శుబ్‌మన్‌ గిల్‌ మధ్య పోటీ నెలకొంది. అయితే, మేనేజ్‌మెంట్‌ మాత్రం ఈ విషయంలో జైస్వాల్‌వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. జట్టు ప్రకటన తర్వాతే వరల్డ్‌కప్‌లో పాల్గొనబోయే 15 మంది భారత ఆటగాళ్ల గురించి స్పష్టతరానుంది.

Fake Video Row: Amit Shah Hits Out at Congress
కాంగ్రెస్‌ మరింత దిగజారింది: అమిత్‌ షా మండిపాటు

ఢిల్లీ, సాక్షి: రాజకీయ పార్టీలు ప్రజలకు ఏం చేస్తామో చెప్పి పోరాడాలని, అంతేగానీ తప్పుడు వీడియోలతో కాదని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా అన్నారు. తనపై ఫేక్‌ వీడియో ద్వారా జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించిన ఆయన.. రాహుల్‌ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్‌ రాజకీయాలు మరింత దిగజారిపోయానని మండిపడ్డారు.మంగళవారం ఢిల్లీలో ఆయన పలువురు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. బీజేపీ 400 సీట్ల లక్ష్యంపై కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారం చేస్తోంది. బీజేపీకే గనుక 400 సీట్లు దాటితే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని చెబుతోంది. కానీ,  ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల కోటాల్లో కోత విధించింది కాంగ్రెస్సే. ఆంధ్రా, కర్ణాటకలో రిజర్వేషన్లపై కోత పెట్టింది.మాకు(బీజేపీ) గత రెండు పర్యాయాలు సంపూర్ణ మెజారిటీ వచ్చింది. కానీ, కాంగ్రెస్‌ మాదిరిగా మేం ఎమర్జెన్సీ విధించలేదు. ఆర్టికల్‌ 370, ట్రిపుల్‌ తలాక్‌ రద్దు కోసం ఆ సంపూర్ణ అధికారాన్ని ఉపయోగించాం.  ఈ దఫా బీజేపీ 400 సీట్లు సాధిస్తుంది. ముగిసిన రెండు విడతల ఎన్నికల్లోనే వందకు పైగా సీట్లు వస్తాయని నమ్మకం ఉంది. దక్షిణ భారతంలోనూ బీజేపీకి మంచి ఫలితాలు వస్తాయి అని అమిత్‌ షా ఆశాభావం వ్యక్తం చేశారు.రాహుల్‌ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్‌ మరింతగా దిగజారుడు రాజకీయాలు చేస్తోంది. ఫేక్‌ వీడియోలు సృష్టించి ప్రచారం చేయడం బాధాకరం. కాంగ్రెస్‌ కూటమి ఓటమి భయంలో ఉండి పోయాయి. అందుకే అమేథీలోనూ పోటీకి కాంగ్రెస్‌ భయపడుతోంది అని షా అన్నారు. 

Orthopedic doctor family deceased In vijayawada
విజయవాడలో విషాదం.. ఒకే కుటుంబంలోని ఐదుగురి అనుమానాస్పద మృతి

సాక్షి, విజయవాడ: విజయవాడలోని గురునానక్‌ నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలోని ఐదుగురు అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. బాధిత కుటుంబం ఆర్థోపెడిక్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌ కుటుంబంగా గుర్తించారు పోలీసులు.మృతుల్లో డాక్టర్‌ శ్రీనివాస్‌, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు, ఒక వృద్ధురాలు ఉన్నారు. శ్రీనివాస్‌ కుంటుంబం మృతిపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానిది హత్యా? ఆత్మహత్యా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న సీపీ రామకృష్ణ.. అక్కడ పరిశీలించారు. మృతులు డాక్టర్ శ్రీనివాస్ (40), ఉషారాణి (36), శైలజ (9), శ్రీహాన్(5), శ్రీనివాస్ తల్లి రమణమ్మ (65)గా పోలీసులు గుర్తించారు. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా శ్రీనివాస్‌.. కుటుంబ సభ్యులను హత్యచేసి..   ఆత్మ హత్యకు పాల్పడినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. సాక్షి టీవీతో డాక్టర్ శ్రీనివాస్ స్నేహితులు మాట్లాడారు. ‘శ్రీనివాస్ చాలా సౌమ్యుడు.. ఎవరితోనూ విబేధాలు లేవు. సంవత్సరం క్రితం శ్రీజ హాస్పిటల్ పేరుతో సొంతంగా హాస్పటల్ ఏర్పాటు చేశాడు. కొంతకాలం హస్పటల్ సక్రమంగా నిర్వహించాడు. తరువాత హాస్పటల్ నిర్వహణలో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి.  హాస్పిటల్ నిర్వహణ కోసం ఎదురు పెట్టుబడి పెడుతున్నాడు. కేవలం ఆర్థిక ఇబ్బందులు వల్లే చనిపోయాడని భావిస్తున్నాం. తల్లిని, భార్యను, ఇద్దరి పిల్లలను హత్య చేశాడంటే నమ్మలేకపోతున్నాం’అని  తెలిపారు. 

Ileana Comments On South Indian Movie Chance
అలాంటి 'దర్శకనిర్మాతల' వల్లే తెలుగులో ఛాన్సులు రాలేదు: ఇలియానా

'దేవదాసు'లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు  దగ్గరైన ఇలియానా.. మొదటి సినిమాతోనే ఆకట్టుకున్న ఈ గోవా బ్యూటీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ కాలంలోనే తెలుగునాట టాప్‌ హీరోయిన్‌గా కొనసాగింది.ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాలు చేసి అలరించిన ఈమె కొన్నేళ్లుగా టాలీవుడ్‌కు దూరంగా ఉంది. సుమారు ఎనిమిదేళ్ల గ్యాప్‌లో ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’తో మళ్లీ మెరిసింది. సౌత్‌ ఇండియా చిత్రాలకు ఆమె ఎందుకు దూరంగా ఉన్నారో తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఇలియానా చెప్పింది. ఇక్కడ ఆమెకు ఎందుకు అవకాశాలు రాలేదో కూడా ఓపెన్‌గానే చెప్పింది.2012లో ఇలియానాకు బాలీవుడ్‌లో నటించేందుకు అవకాశం దక్కింది. ఆ సినిమా విడుదల తర్వాత తెలుగులో పెద్దగా కనిపించని ఈ బ్యూటీ.. అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోయింది. ఈ క్రమంలో దక్షిణాది సినిమాలకు దూరమైంది. ఇదే విషయాన్ని ఇలియానా ఇలా చెప్పింది. 'అనురాగ్‌ బసు' దర్శకత్వం నుంచి 2012లో 'బర్ఫీ' సినిమాతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చాను. ఆ సమయానికి దక్షిణాదిలో చాలా సినిమాలతో బిజాగా ఉన్నాను. కానీ 'బర్ఫీ' కథ నచ్చడంతో ఆ ప్రాజెక్ట్‌ను వదలుకోవాలనిపించలేదు. నా అంచనా నిజమైంది. సినిమా సూపర్‌ హిట్‌ అయింది. ఈ వార్తతో ఇక సౌత్‌ ఇండియాలో నేను సినిమాలు చేయనని అందరూ భావించారు. ఆపై నేను బాలీవుడ్‌కు షిఫ్ట్‌ అయ్యానని కూడా అనుకున్నారు. ఈ కారణంతో దక్షిణాది నిర్మాతలతో పాటు దర్శకులు కూడా నా పట్ల ఆసక్తి చూపించలేదు. టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ వరకు ఏ సినిమా అయినా సరే చాలా నిజాయితీగా నేను పనిచేశాను. కానీ నాకు మాత్రం అనుకున్నంత గుర్తింపు రాలేదు. ఈ విషయంపై ఇన్నేళ్లైనా నాకు క్లారిటీ రాలేదు. దో ఔర్ దో ప్యార్, తేరా క్యా హోగా లవ్లీ వంటి బాలీవుడ్‌ చిత్రాలతో ఏడాదిలో ఇలియానా నటించింది.

India slams USA media linking RAW officer to Pannun plot unwarranted
పన్నూ హత్యకు కుట్ర.. యూఎస్‌ మీడియా రిపోర్డును ఖండించిన భారత్‌

ఢిల్లీ: అమెరికాలో ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్ పన్నూను హత్యచేసేందుకు భారత మాజీ ఇంటెలిజెన్స్‌ అధికారి ప్రణాళికా రచించాడని వాషింగ్టన్‌ పోస్ట్‌ వెల్లడించిన నివేదికను భారత్‌ తీవ్రంగా ఖండించింది. భారత రా(RAW)మాజీ అధికారి విక్రమ్‌ యాదవ్‌ అమెరికాలో గురుపత్వంత్ సింగ్‌ను హత్య చేయాలని ఓ బృందాన్ని ఏర్పాటు చేశారని వాషింగ్టన్‌ పోప్ట్‌ తన రిపోర్టులో తెలిపింది. దీనిపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైశ్వాల్ స్పందించారు. ‘వాషింగ్టన్‌ పోస్ట్‌ కథనం పూర్తిగా అసమంజసం, నిరాధారమం. క్రిమినల్‌, ఉగ్రవాద నెట్‌వర్క్‌లకు సంబంధించి అమెరికా లేవనెత్తిన భద్రతా సమస్యలను పరిష్కరించడానికి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ దర్యాప్తు చేస్తుంది. అయినప్పటికీ ఊహాగానాలు, బాధ్యతరహితమైన వ్యాఖ్యలు చేయటం సరికాదు.  ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఎటువంటి ఉపయోగం లేదు’ అని అ‍న్నారు. ఈ కేసులో కుట్రదారుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత్‌కు చెందిన నిఖిల్‌ గుప్తాకు  సీసీ-1 అనే పేరు తెలియని  అధికారి సాయం చేసినట్లు అమెరికా పేర్కొంది. అయితే తాజాగా వాషింగ్టన్‌పోస్ట్‌ ఆ అధికారిని  విక్రమ్‌ యాదవ్‌గా గుర్తించింది. ఈ కేసులో అమెరికా తరచూ చేస్తున్న ఆరోపణలను భారత్‌ తీవ్రంగా ఖండించింది. అమెరికా ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు భారత్‌ 2023 నవంబర్‌లో ఉన్నతస్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Zainab and Uzma Making India Safer for women women only bike taxi service
Dovely Bike Taxi మహిళల కోసం మహిళలే... హైదరాబాదీ అక్కాచెల్లెళ్లు

రాత్రి వేళల్లో మహిళలు, బయటికి వెళ్లాలంటేనే భయపడే రోజులు. మెట్రోలు, క్యాబ్‌ లాంటిసేవలు  ఎన్ని అందుబాటులో ఉన్నా భద్రత ఎపుడూ ఒక  సవాల్‌గానే ఉంటుంది.  ప్రతీ పదిమంది ఏడుగురు వేధింపులకు లోనవుతున్నారు. ఈ తరుణంలో అత్యవసర సమయంలో బయటకు వెళ్లాలనుకునే మహిళల కోసం నగరంలో డోవ్లీ సేవలు విశేషంగా నిలుస్తున్నాయి.  హైదరాబాద్‌ నగరంలో మహిళలు, బాలికల భద్రత, సౌకర్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ ఈ సర్వీసును ప్రారంభించారు సోదరీమణులు. భారతదేశంలోనే తొలిసారిగా మహిళలకోసం మహిళా డ్రైవర్లతో మహిళలే నిర్వహిస్తున్న సేవలు కావడం విశేషం. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త ద్వయం మహిళల కోసమే ఈ  బైక్ టాక్సీ సర్వీస్‌ను ప్రారంభించింది. జైనాబ్‌ కాతూన్‌,ఉజ్మా కాతూన్‌ ప్రత్యేక బైక్టాక్సీ సర్వీస్ ప్లాట్‌ఫారమ్‌ ‘డవ్‌లీ’ సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు.  డోవ్లీలో రైడర్లు, కస్టమర్లు  మహిళలే  ఉంటారు. ఓలా, ర్యాపిడో తరహాలో రెంటల్‌ బైక్‌ (బైక్‌ ట్యాక్సీ) సర్వీసులు డోవ్లీఅందిస్తుంది. వీరికి మహమ్మద్ ఒబైద్ ఉల్లా ఖాన్, మసరత్ ఫాతిమా సహకారం అందించారు.భద్రతకు పెద్ద పీట‘డవ్‌లీ’ వ్యవస్థాపకురాలు,సీఈవో  జైనాబ్ ఖాతూన్  మాటల్లో చెప్పాలంటే నగరంలోని మహిళలు , బాలికలకు రోజువారీ ప్రయాణాన్ని సురక్షితంగా, సులభంగా ,సౌకర్యవంతంగా  సేవలందించడమే ఈ ప్రాజెక్ట్  లక్ష్యం. భద్రతకు పెద్ద పీట వేస్తూ  రైడ్‌ మొదలైనప్పటి నుంచి ఎండ్‌ అయ్యే వరకు ప్రతి క్షణం ప్రయాణాన్ని మానిటర్‌ చేస్తుంటారు. అయితే  రైడర్‌  ప్రయాణం ముగిసేవరకు లైవ్‌ లొకేషన్‌ను ఆన్‌లోనే ఉంచాల్సి ఉంటుంది.  వాట్సాప్‌  వేదికగా మొదలైన డోవ్లీ సేవలు చాలా తక్కువ సమయంలోనే బాగా విస్తరించాయి. వందలమంది మహిళా డ్రైవర్లకు  ఉపాధి లభించింది.  ప్రస్తుతం పరిమిత ప్రాంతాలకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సేవలను పెంచి, భవిష్యత్తులో రైడర్ల సంఖ్య పెంచి వారికి ఉపాధి అవకాశాలను మెరుగుపర్చాలని భావిస్తున్నారు. విరివిగా సేవలు అందించే యోచనలో డోవ్లీ ఫౌండర్లు ఉన్నారు.   దీంతో వీరి స్టార్టప్‌ మరింత విజయం సాధించాలని నెటిజన్లు  వ్యాఖ్యానించారు.  

Kadiri MLA Candidate Kandikunta Venkata Prasad Kabza
కబ్జాల కందికుంట

కదిరి: టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్‌ పేరు వినగానే కదిరి నియోజకవర్గ ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఆయన కన్ను పడితే విలువైన స్థలాలు, పొలాలు కబ్జా కావాల్సిందేనన్న విమర్శలు ఉన్నాయి. బాధితుల్లో ఎంతోమంది ముస్లింలు, ఇతర సామాజిక వర్గం వారు ఉన్నారు. కబ్జాలను ఎవరైనా ప్రశ్నిస్తే అనుచరులతో దాడులు, దౌర్జన్యాలు చేయించడం ఆయన నైజంగా ఉంది. ప్రజాకంఠకుడిగా ఉన్న ఈయనకే ప్రతి ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం ఎమ్మెల్యే టికెట్‌ కేటాయిస్తుండటం చర్చనీయాంశంగా మారుతోంది. మీడియా ముందు మాత్రం కందికుంట నీతి సూక్తులు చెబుతుండడం చూసి ప్రజలు చీదరించుకుంటున్నారు.బొరుగులమ్మి సంపాదించిన స్థలం.. కదిరి పట్టణంలోని జామియా మసీదు వీధికి చెందిన పి.ఖాజామోద్దీన్‌ అలియాస్‌ బొరుగుల ఖాజా కొన్నేళ్ల క్రితం ఊరూరా తిరిగి బొరుగులు అమ్మేవాడు. ఈ వ్యాపారంలో సంపాదించిన డబ్బుతో కదిరి–హిందూపురం రోడ్‌లో అప్పట్లో సర్వే నంబరు 70/3–3లో 4.50 ఎకరాల పొలం కొన్నాడు. కుటుంబ అవసరాల కోసం అందులో 1.50 ఎకరాలు అమ్మేయగా.. మూడెకరాలు అలానే ఉంది. ఖాజామోద్దీన్‌కు ఐదుగురు సంతానం. ఆయన మరణానంతరం ఆ పొలాన్ని కుటుంబ సభ్యులు కొన్నేళ్లుగా సాగుచేస్తూ వచ్చారు. ఆడ పిల్లలందరూ పెళ్లీడుకు రావడంతో వారికి పెళ్లి చేసేందుకు ఆ మూడెకరాల భూమిని అమ్మాలని కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు.డబ్బు చెల్లించకుండానే ఇతరులకు రిజిస్ట్రేషన్ఆ భూమిని అమ్ముతారనే విషయం తన అనుచరుల ద్వారా కందికుంటకు తెలిసింది. వెంటనే వారిని పిలిపించి సెంటు రూ.80 వేల చొప్పున బేరం కుదుర్చుకొని వెంటనే రూ.లక్ష అడ్వాన్స్‌గా ఇచ్చారు. తర్వాత ఆ మిగిలిన డబ్బు ఇచ్చి భూమి రిజి్రస్టేషన్‌ చేయించుకోండని ఖాజామోద్దీన్‌ కుటుంబ సభ్యులు కందికుంట ఇంటి దగ్గర వేచి ఉండటం దినచర్యగా మారింది. కొన్ని రోజులు గడిచాక ఓ రోజు ‘ఆ భూమితో మీకు ఎలాంటి సంబంధమూ లేదు. ఆ భూమి మాది. ఇదిగో మా బంధువుల పేరు మీద ఆ భూమికి సంబంధించి కదిరి రెవెన్యూ వారు మంజూరు చేసిన పట్టాదారు పాసుపుస్తకం’ అంటూ కందికుంట తెలపడంతో వారికి గుండె ఆగినంత పనైంది. ప్రశ్నించే ధైర్యం లేక, తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక కన్నీరుమున్నీరుగా విలపిస్తూ ఇంటి దారి పట్టక తప్పలేదు. ప్రస్తుతం ఆ భూమి విలువ రూ.20 కోట్లు చేస్తుంది.బాధిత యువకుడిపై హత్యాయత్నం ఖాజామోద్దీన్‌ మనవడు అమీర్‌ఖాన్‌ 2018 జూలై 14న జేసీబీని తీసుకెళ్లి పొలం చదును చేయిస్తున్నాడు. ఈ విషయం కందికుంటకు తెలిసి వెంటనే తన అనుచరులను అక్కడికి పంపి ఆ యువకుడిపై రాళ్ల దాడి చేయించాడు. గుండెలపై బండ రాళ్లతో  కొట్టి చంపడానికి కూడా ప్రయత్నించారు. ఈలోగా వారి కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చి ఏడుస్తుంటే జనం పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని బాధితుడిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఆరోజు నుంచి ఈరోజు వరకు ఆ స్థలం వైపు బాధితులు కన్నెత్తి చూడటానికి కూడా భయపడుతున్నారు.  కందికుంట మాత్రం ఆ స్థలం తమదేనని బుకాయించడంతో పాటు మీడియా ముందు తాను సచీ్చలుడినంటూ నీతి సూక్తులు వల్లిస్తున్నాడు.చిత్తుగా ఓడించండి అమాయక ప్రజల భూమిని ఆక్రమించి, దానికి తప్పుడు పత్రాలు సృష్టించి ఆ స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించి అందులోకి ఇతరులెవ్వరూ ప్రవేశించకుండా కందికుంట ప్రస్తుతం దానికి పెద్ద గేట్‌ కూడా ఏర్పాటు చేయించాడు. ఆ స్థలం యజమానులు, వారి కుటుంబ సభ్యులు, బంధువులే కాకుండా ఆ దారిగుండా వెళ్లే ప్రతి ఒక్కరూ కందికుంటకు శాపనార్థాలు పెడుతున్నారు. ఇలాంటి వ్యక్తికి     చంద్రబాబు ప్రతిసారీ ఎందుకు టికెట్‌ ఇస్తున్నాడో అర్థం కావడం లేదని జనం తప్పుబడుతున్నారు. పేదల స్థలాలు కబ్జా చేసే కందికుంటను ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.  

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement