Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Modi Cabinet 2024:  all eyes now on portfolio allocation
కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు.. మోదీ మార్క్‌!

న్యూఢిల్లీ, సాక్షి: కేం‍ద్రంలో కొత్త కేబినెట్‌ కొలువుదీరే సమయం వచ్చింది. ప్రధాని మోదీ సహా కొత్త మంత్రులంతా ఇప్పటికే ప్రమాణం చేసేశారు కూడా. మరి ఎవరెవరికి ఏ శాఖ ఇస్తారనేదానిపై స్పష్టత వచ్చేది ఎప్పుడు?. మోదీ మార్క​ ఉండనుందా?ఇవాళ(సోమవారం, జూన్‌ 10) సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కొత్త కేంద్ర మంత్రి వర్గం భేటీ కానుంది. ఈ భేటీలోనే కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపుపై స్పష్టత రానుంది. భాగస్వామ్య పక్షాల ఆశిస్తున్న శాఖల అంశాన్ని పరిగణలోకి తీసుకున్న బీజేపీ.. వ్యూహాత్మక నిర్ణయంతోనే ముందుకు సాగనున్నట్లు తెలుస్తోంది. కీలకమైన ఆర్థిక, హోం, రక్షణ, విదేశాంగ, రైల్వే, రవాణా శాఖలను తమ దగ్గరే అంటిపెట్టుకోనుంది బీజేపీ. అలాగే.. మూడో దఫా ప్రభుత్వంలో మ్యానుఫ్యాక్చరింగ్, మౌలిక వసతులపై ప్రధాన ఫోకస్ ఉంటుందనే గతంలోనే ప్రధాని మోదీ ప్రకటించారు. దీంతో.. దీని పరిధిలోకి వచ్చే శాఖలు కూడా బీజేపీ చేతిలోనే ఉండే అవకాశం కనిపిస్తోంది. మంత్రి వర్గ కూర్పులో ప్రధాని మోదీ కులసమీకరణాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. అలాగే.. త్వరలో ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాలకూ ప్రాధాన్యం ఇచ్చారు. ఇక కొత్త మంత్రుల్లో 27 మంది బీసీలు ఉన్నారు. ఐదుగురు మైనారిటీలు, ఏడుగురు మహిళలు ఉన్నారు. యువత, సీనియర్ల కాంబినేషన్‌లో మోదీ మార్క్‌తో బెర్తులు ఉంటాయనేది తెలుస్తోంది. ఇక.. ఎన్డీయే భాగస్వామ్య పార్టీలు సైతం తమ తమ ప్రయోజనాల దృష్ట్యా శాఖల్ని డిమాండ్‌ చేశాయి. జేడీఎస్‌ కుమారస్వామి వ్యవసాయ శాఖ కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్ర ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకునే శాఖల్ని కోరామని మరో మిత్రపక్షం టీడీపీ ఇది వరకే ప్రకటించుకుంది. అలాగే..జేడీయూ, ఇతర పార్టీలు సైతం పలు శాఖల్ని డిమాండ్‌ చేసినట్లు తెలియవస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్డీయే ఎంపీల సమావేశం జరుగుతున్న టైంలోనే.. మరోవైపు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో మిత్రపక్ష నేతలతో మంత్రివర్గ కూర్పు, ఎవరికి ఏయే శాఖల వంటి అంశాలపై చర్చలు జరిగి, ఓ నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.నిన్న రాత్రి 72 మంది మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఇందులో 30 మంది మంత్రివర్గంలోకి, ఐదుగురికి స్వతంత్ర మంత్రులుగా, అలాగే.. 36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. 43 మంది మూడుకంటే ఎక్కువసార్లు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. అలాగే.. ఆరుగురు మాజీ ముఖ్యమంత్రులను తీసుకోవడం గమనార్హం. అలాగే.. తెలుగు రాష్ట్రాల తరఫున తెలంగాణ నుంచి ఇద్దరు, ఏపీ నుంచి ముగ్గురి మంత్రి వర్గంలో చోటు దక్కింది. విశేషం ఏంటంటే.. కేంద్ర కేబినెట్‌లో ఇంకా ఖాళీగానే 9 బెర్తులు ఉండడం.

YSRCP Action Plan To Counter TDP Attacks
ఏపీలో టీడీపీ దాడులు.. YSRCP యాక్షన్‌ ప్లాన్‌

గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు దేశం పార్టీ అరాచక కాండపై పోరాటానికి వైఎస్సార్‌సీపీ సిద్ధం అవుతోంది. దాడులకు కౌంటర్‌ యాక్షన్‌ ప్లాన్‌ను రూపొందించుకుంది. అదే సమయంలో కార్యకర్తలకు ధైర్యం చెబుతూనే.. వారి రక్షణ కోసం కార్యాచరణ అనుసరించాలని నిర్ణయించింది. వైఎస్సార్‌సీపీ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ లీగల్ టీమ్‌లను ఏర్పాటు చేస్తోంది. తద్వారా టీడీపీ శ్రేణుల్లో దాడులకు గురైన బాధితులకు న్యాయం చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో తొలుత బాధితుల్ని తీసుకుని జిల్లా ఎస్పీల వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ఫిర్యాదు చేయిస్తారు. ఆపై కోర్టులో కూడా దావాలు వేయిస్తారు. ఆ తర్వాత జరిగే ప్రొసీజర్లను లీగల్‌ టీం చూసుకునేలా వైఎస్సార్‌సీపీ ప్రణాళిక రూపొందించింది. ఇదిలా ఉంటే.. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణం నుంచే టీడీపీ అరాచకాలు మొదలయ్యాయి. వైఎస్సార్‌సీపీ నేతల్ని, కార్యకర్తల్ని, సానుభూతిపరుల్ని, సాధారణ ఓటర్లను, ఆఖరికి.. వైఎస్సార్‌సీపీ జెండా మోసిన వాళ్లను సైతం వదలడం లేదు. ఈ దాడుల్లో ప్రాణాలు సైతం పోతున్నాయి. మరోవైపు దాడులపై కేసులు సైతం నమోదు చేయకుండా.. పోలీసులు చోద్యం చూస్తూ ఉన్నారు. ఐదేళ్లుగా ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో శాంతి భద్రతలు ఒక్కసారిగా దెబ్బ తినడంపై అటు రాష్ట్రపతి, ఇటు గవర్నర్‌కు వైఎస్సార్‌సీపీ ఇప్పటికే ఫిర్యాదులు చేసింది. మరోవైపు వైఎస్సార్‌సీపీ కేడర్‌కు ధైర్యం చెబుతూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ భరోసా ఇస్తున్నారు పలువురు నేతలు.

apple starts world wide conference facts about apple co
రూ.83 వార్షికవేతనం తీసుకున్న స్టీవ్‌జాబ్స్‌..!

ప్రపంచ నం.1 కంపెనీగా చలామణి అవుతున్న యాపిల్‌ ఉత్పత్తులకు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. టెక్‌ పరిశ్రమలో ఈ కంపెనీ గురించి తెలియని వారు దాదాపుగా ఉండరు. యాపిల్ కంపెనీ 'వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ 2024' (WWDC 2024) కార్యక్రమం సోమవారం (జూన్ 10) నుంచి జరగనుంది. ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను, టెక్నాలజీలను పరిచయం చేసే యాపిల్ ఈసారి కూడా లేటెస్ట్ ఉత్పత్తులను ఆవిష్కరిస్తుంది. అటువంటి సంస్థ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఆదాయం, ఆస్తుల పరంగా యాపిల్ ప్రపంచంలోనే యాపిల్‌ అతిపెద్ద సంస్థ.కంపెనీ ప్రతి నిమిషానికి దాదాపుగా రూ.27 కోట్ల రూపాయలు సంపాదిస్తోంది.యాపిల్‌ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగి సగటు జీతం సంవత్సరానికి రూ.9 కోట్లు.2023 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా యాపిల్ కంపెనీ రోజుకు సగటున 6,32,000 ఐఫోన్ల అమ్మకాలు జరిపింది.యాపిల్ ఐప్యాడ్‌లో వినియోగిస్తున్న రెటీనా డిస్‌ప్లేను శామ్‌సంగ్ కంపెనీ తయారు చేస్తోంది.యాపిల్ కో-ఫౌండర్‌లో ఒకరైన రొనాల్డ్‌వేన్‌ 1976లో తనకు చెందిన కంపెనీ 10శాతం షేర్లను 800 అమెరికన్‌ డాలర్లకే(ప్రస్తుత విలువ 4300 డాలర్లు-రూ.3.5లక్షలు) విక్రయించారు. కానీ ఇప్పుడు ఆ షేర్స్‌ విలువ 35 బిలియన్‌ డాలర్లు(సుమారు రూ.3లక్షలకోట్లు).ప్రతి యాపిల్ ప్రకటనలోని ఫోన్ ఇమేజ్‌లో సమయం 9:41 AM అని ఉంటుంది. స్టీవ్ జాబ్స్ మొట్టమొదటి ఐఫోన్‌ను 09:41 AM కి ఆవిష్కరించాడు. అందుకు గుర్తుగా కంపెనీ అలా చేస్తోంది.యాపిల్ కంపెనీలో జాబ్ సాధించడం కంటే హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో సీట్ సాధించడం తేలికనే వాదనలున్నాయి.యాపిల్ మాక్‌బుక్ (Mac book) బ్యాటరీ మిమ్మల్ని తుపాకీ కాల్పుల నుంచి కాపాడగలదు. ఎలాగంటారా..? అది బుల్లెట్‌ప్రూఫ్.యాపిల్ కంప్యూటర్ల పరిసరాల్లో ధూమపానం చేస్తే దాని వారంటీ తగ్గిపోతుందని చెబుతుంటారు.స్టీవ్ జాబ్స్ సీఈఓగా ఉన్నపుడు తన వార్షిక వేతనం ఎంతో తెలుసా..? కేవలం 1 యూఎస్‌ డాలర్‌(ప్రస్తుతం రూ.83).

emmanuel Macron Dissolves Parliament Calls Snap Election On June 30
ఫ్రాన్స్‌ పార్లమెంట్‌ను రద్దు చేసిన మేక్రాన్‌.. ఈ నెలలోనే ఎన్నికలు

పారిస్‌: ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఫ్రాన్స్‌ పార్లమెంట్‌ను రద్దు చేసినట్లు ఆదివారం ప్రకటించారు. దీంతో నేషనల్‌ అసెంబ్లీకి రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నట్లు ప్రకటించారాయన. జూన్‌ 30న, రెండో విడత ఎన్నికలు జూలై 7న జరగనున్నాయని మేక్రాన్‌ తెలిపారు. ముందస్తు అంచనాల్లో భాగంగా ప్రతిపక్ష నేషనల్ ర్యాలీ (ఎన్‌ఆర్) పార్టీ, రైట్‌ పార్టీలు దాదాపు 40 శాతం ఓట్లను సొంతం చేసుకుంటాయని వెలువడిన నేపథ్యంలో మాక్రాన్ పార్లమెంట్‌ను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లుతున్నారు.‘రైట్‌ పార్టీలు పలు చోట్ల పుంజుకుంటున్నాయి. అయితే నేను రాజీనామా చేసే పరిస్థితి లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. ఈ రాత్రి(ఆదివారం)కే జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తున్నా. ఈ నిర్ణయం చాలా పెద్దది. ఫ్రాన్స్‌ ప్రజలపై ఉ‍న్న నమ్మకంతో, భవిష్యత్తు తరాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నా’ అని మాక్రాన్ అ‍న్నారు.ఇక.. ముందస్తు అంచనాల ప్రకారం మెరైన్ లీ పెన్ నేషనల్‌ ర్యాలీ పార్టీకి.. అధ్యక్షుడు మేక్రాన్‌ రినైజాన్స్‌ పార్టీకి కంటే రెట్టింపు ఓట్లు వస్తాయని వెల్లడైంది.

Nimisha Sajayan Have Cosmetic Surgery
కాస్మెటిక్ సర్జరీ చేయించుకున్న నిమిషా సజయన్‌.. నిజమేనా?

నిమిషా సజయన్.. మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ఈ నల్లకలువ తెలుగు వారందరికి కూడా పరిచయమే. చామనఛాయ, కుదురైన ఆకృతి, నటన తెలిసిన కళ్లు ఆమె ప్రత్యేకత. ముంబైలో పుట్టిపెరిగినా తన మూలాలు మాత్రం మలయాళంలోనే ఉన్నాయి. తన టాలెంట్‌తో సౌత్‌ ఇండియాలోని అన్ని భాషల్లోనూ నటిస్తుంది. 2017లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తక్కువ సమయంలోనే గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్‌గా జిగర్తాండ డబుల్ ఎక్స్, చిన్నా, నాయట్టు (కోట బొమ్మాళి పీఎస్) వంటి చిత్రాలతో టాలీవుడ్‌ వారికి బాగా దగ్గరైంది.తాజాగా ఈ బ్యూటీ కాస్మెటిక్ సర్జరీ చేపించుకున్నారని ప్రచారం జరుగుతుంది. నటి నిమిషా సజయన్ ప్రస్తుతం కాస్మెటిక్ సర్జరీ చర్చల అంశం మలయాళ పరిశ్రమలో చర్చ జరుగుతుంది. కెరీర్ ప్రారంభంలో ఆమెను చూసిన క్షణం నుంచి ప్రస్తుతం ఆమె ముఖం కొద్దిగా మారిపోయిందని వారు అంటున్నారు. దీనిపై కాస్మోటాలజిస్టుల అభిప్రాయం అందరినీ ఆకర్షిస్తోంది. ఇటీవల సోషల్ మీడియా ద్వారా దృష్టిని ఆకర్షించిన డాక్టర్ శిఖా, తాను కాస్మెటిక్ సర్జరీలు చేయించుకోలేదని చెప్పింది. నిమిషా ముఖంలో వచ్చిన మార్పులకు కారణాన్ని కూడా పంచుకున్నారు.నిమిషా సజయన్‌ మునుపటి కంటే ఇప్పుడు ఎక్కువ బరువు తగ్గిందని ఆమె తెలిపింది. రింగులుగా ఉన్న ఆమె జుట్టు స్ట్రెయిట్ చేయబడింది. ఆమె పెదవిలోనూ ఏమీ మార్పులేదు. తన మొహంలో కూడా ఎలాంటి మార్పూ లేదని తాను అనుకుంటున్నట్లు డాక్టర్ శిఖా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తన అందానికి ఫిదా అయిన చాలామంది నిమిషా సోషల్‌మీడియా ఖాతా కామెంట్ బాక్స్‌లో ప్రశంసిస్తున్నారు. సహజ సౌందర్యం ఉన్న గొప్ప నటి నిమిషా అని పలువురు వ్యాఖ్యానించారు. గత కొన్ని రోజులుగా నిమిషాపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సైబర్ ఎటాక్ జరుగుతోంది.మలయాళ ప్రముఖ నటుడు సురేష్ గోపి త్రిసూర్ ఎన్నికల్లో గెలవలేరని ఆమె పబ్లిక్ ఫోరంలోనే కామెంట్‌ చేసింది. అయితే, తాజాగా సురేష్ గోపీ విజయం సాధించారు. దీంతో పాత ప్రస్తావన పేరుతో ఆమెపై ట్రోల్స్ వచ్చాయి. దీంతో ఆమె సోషల్ మీడియా కామెంట్ బాక్స్‌ను ఆఫ్ చేసింది. View this post on Instagram A post shared by NIMISHA BINDU SAJAYAN (@nimisha_sajayan)

AP New Cabinet 2024: Pawan Kalyan Really Demand For Deputy CM
ఆ పదవే కావాలి.. పట్టుబడుతున్న పవన్‌?!

విజయవాడ, సాక్షి: మరో రెండు రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేయనున్నారు. నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం, కేంద్ర కేబినెట్‌లో బెర్తుల కోసం ఢిల్లీ పర్యటనతో బిజిబిజీగా గడిపిన చంద్రబాబు.. ఇప్పుడు రాష్ట్ర కేబినెట్‌ కూర్పు కోసం కసరత్తులు ముమ్మరం చేయబోతున్నారు. టీడీపీతో పాటు మిత్రపక్షాలు జనసేన, బీజేపీలకు ఏయే శాఖలు కట్టబెట్టాలో అనేదానిపై ఆ పార్టీల నేతలతో ఇవాళ్టి నుంచే మంతనాలు కొనసాగించే ఛాన్స్‌ కనిపిస్తోంది.అయితే.. ప్రధాన మిత్రపక్షం జనసేన నాలుగు మంత్రి పదవులకు తగ్గకూడదనే కండిషన్‌ పెట్టినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ఉప ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుబడుతున్నట్లు సమాచారం. మరోవైపు.. డిప్యూటీ సీఎం పోస్ట్‌ కోసం పవన్‌కల్యాణ్‌ సంసిద్ధత వ్యక్తం చేశారంటూ తాజాగా ఓ జాతీయ మీడియా వెబ్‌సైట్‌ కథనం ఇచ్చింది. ఆదివారం మోదీ కేబినెట్‌ ప్రమాణ స్వీకారానికి భార్యతో సహా వెళ్లిన పవన్‌ ఈ మాట అన్నారని సదరు వెబ్‌సైట్‌ ప్రచురించగా.. దానిని బాబు అనుకూల మీడియా సైతం తాజాగా ధృవీకరించడం విశేషం. డిప్యూటీ సీఎం పదవితో పాటు నాలుగు మంత్రి పదవులు ఇవ్వాలన్నది పవన్‌ ప్రధాన డిమాండ్‌గా తెలుస్తోంది. జనసేన కోటాలో సీనియర్‌ ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. నాదెండ్ల మనోహర్, పులవర్తి అంజిబాబు, మండలి బుద్ధ ప్రసాద్, కొణతాల రామకృష్ణ, కందుల దుర్గేష్, బొమ్మిడి నాయకర్, అరణి శ్రీనివాసులు, పంచకర్ల రమేష్, వర ప్రసాద్ లు మంత్రి పదవుల రేసులో ప్రధానంగా ఉన్నారు. మరోవైపు.. చిరు, నాగబాబులతో పవన్‌కు సిఫార్సులు వెళ్తున్నాయనే ప్రచారం ఒకటి నడుస్తోంది. ఈ ఊహాగానాల లెక్కన జనసేనలో పవన్‌తో పాటు ముగ్గురికి మంత్రులుగా అవకాశం దక్కనుందన్నమాట. మరోవైపు.. కొత్త మంత్రి వర్గంలో చోటు కోసం బీజేపీ సైతం కొన్ని షరతులు విధిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం టీడీపీకి రెండు కేబినెట్‌ పోస్టులు ఇచ్చింది బీజేపీ. అలాగే.. ఇక్కడా అదే ఫార్ములా పాటించాలని టీడీపీ అధినేతను కోరినట్లు సమాచారం. దీంతో బీజేపీకి రెండు మంత్రి పదవులు దక్కే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ తరఫున బీసీ కోటాలో ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్‌కు ఆ అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది. ఇక మరో మంత్రి పదవి కోసం తీవ్ర పోటీ తప్పదనే చర్చ మొదలైంది. సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ లలో ఎవరికో ఒక్కరికే ఛాన్స్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకోవైపు.. పార్థసారథి(ఆదోని), ఆదినారాయణ రెడ్డి(జమ్మలమడుగు)లు సైతం ఈ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక చంద్రబాబు టీడీపీ కోటాలోనూ పేర్లను పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో సీనియర్లను అసంతృప్తిపర్చకుండా కేబినెట్‌ను రూపకల్పన చేయాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు స్పష్టం అవుతోంది.

T20 World Cup 2024 IND VS PAK: Hardik Pandya Made Team India To Come Back Into The Game
IND VS PAK: టీమిండియా గెలుపుకు పునాది వేసిన హార్దిక్‌

టీ20 వరల్డ్‌కప్‌ 2024లో భాగంగా పాకిస్తాన్‌తో నిన్న (జూన్‌ 9) జరిగిన ఉత్కంఠ సమరంలో టీమిండియా 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ 120 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకోగలిగింది. ఓటమి తప్పదనుకున్న మ్యాచ్‌లో పేసర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్నందించారు. ముఖ్యంగా బుమ్రా (4-0-13-3), హార్దిక్‌ (4-0-24-2) తమ అనుభవాన్నంత రంగరించి పాక్‌ చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నారు.భారత్‌ను విజయపథాన నడిపించడానికి బుమ్రా ప్రధాన కారకుడైతే.. ఈ గెలుపుకు బీజం పోసింది మాత్రం హార్దిక్‌ పాండ్యా. ఈ మ్యాచ్‌లో తొలి రెండు ఓవర్లలో వికెట్‌ లేకుండా 18 పరుగులు సమర్పించుకున్న హార్దిక్‌.. ఆతర్వాత రెండు ఓవర్లలో కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి అత్యంత కీలకమైన ఫఖర్‌ జమాన్‌, షాదాబ్‌ ఖాన్‌ల వికెట్లు పడగొట్టాడు. ఈ రెండు వికెట్లే భారత్‌ను మ్యాచ్‌లోకి తిరిగి తీసుకొచ్చాయి. హార్దిక్‌ తన తొలి వికెట్‌ (ఫఖర్‌ జమాన్‌) తీసే సమయానికి పాక్‌ గెలుపు దిశగా సాగుతుండింది. ఈ దశలో హార్దిక్‌ ఫఖర్‌ జమాన్‌ వికెట్‌తో పాటు షాదాబ్‌ ఖాన్‌ వికెట్‌ (17వ ఓవర్‌) తీసి పాక్‌ను డిఫెన్స్‌లోకి నెట్టాడు. హార్దిక్‌ దెబ్బకు కోలుకోలేకపోయిన పాక్‌ ఆతర్వాత పరుగులు సాధించేందకు ఇబ్బంది పడటంతో పాటు వరుసగా వికెట్లు కోల్పోయింది. హార్దిక్‌ తన కోటా ఓవర్లు పూర్తి చేసే సమయానికి 17 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసిన పాక్‌.. తర్వాత 3 ఓవర్లలో 30 పరుగులు చేయలేక ఓటమిపాలైంది. చివరి మూడు ఓవర్లలో సిరాజ్‌ (9 పరుగులు), బుమ్రా (3 పరుగులు), అర్ష్‌దీప్‌ (11 పరుగులు) అద్భుతంగా బౌలింగ్‌ చేసి పాక్‌కు శృంగభంగం కలిగించారు. హార్దిక్‌ తన మ్యాజిక్‌ స్పెల్‌తో టీమిండియా గెలుపుకు బీజం వేసిన అనంతరం కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అతన్ని ఆనందంతో కౌగిలించుకుని భుజానికెత్తుకున్నాడు. షాదాబ్‌ ఖాన్‌ వికెట్‌ తీసిన అనంతరం హార్దిక్‌ చేసుకున్న సెలబ్రేషన్స్‌ వైరలయ్యాయి. మ్యాచ్‌ అనంతరం హర్దిక్‌ "నెవర్‌ గివ్‌ అప్‌" అని తన సోషల్‌మీడియా అకౌంట్లలో స్టేటస్‌ పెట్టుకున్నాడు. మొత్తానికి చేజారిందనుకున్న మ్యాచ్‌ను గెలిపించడంలో కీలకపాత్ర పోషించి హార్దిక్‌ మరోసారి హీరో అనిపించుకున్నాడు. హార్దిక్‌కు పాకిస్తాన్‌పై వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ల్లో రాణించడం కొత్తేమీ కాదు. గతంలోనూ చాలా సందర్భాల్లో హార్దిక్‌ పాక్‌కు గెలుపును దూరం చేశాడు. ఈ సీజన్‌ ఐపీఎల్‌ తాలుకా చేదు అనుభవాలను ఇప్పుడిప్పుడే అధిగమిస్తున్న హార్దిక్‌.. ఐర్లాండ్‌తో జరిగిన ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లోనూ అద్భుతంగా బౌలింగ్‌ చేసి ఆకట్టుకున్నాడు. ఆ మ్యాచ్‌లో హార్దిక్‌ 3 ఓవర్లలో 6 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. హార్దిక్‌ స్పెల్‌లో ఓ మొయిడిన్‌ ఓవర్‌ కూడా ఉంది.కాగా, పాక్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. 19 ఓవర్లలో 119 పరుగులకు చాపచుట్టేసింది. పాక్‌ బౌలర్లలో నసీం షా, హరీస్‌ రౌఫ్‌ తలో 3 వికెట్లు, మొహమ్మద్‌ ఆమిర్‌ 2, షాహిన్‌ అఫ్రిది ఓ వికెట్‌ పడగొట్టారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్‌.. భారత పేసర్ల ధాటికి లక్ష్యానికి 7 పరుగుల దూరంలో నిలిచిపోయింది. బుమ్రా, హార్దిక్‌తో పాటు సిరాజ్‌ (4-0-19-0), అర్ష్‌దీప్‌ (4-0-31-1), అక్షర్‌ (2-0-11-1) రాణించారు. పాక్‌ ఇన్నింగ్స్‌లో రిజ్వాన్‌ (31) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. భారత్‌ చేతిలో ఓటమితో పాక్‌ సూపర్‌-8 అవకాశాలు గల్లంతు చేసుకుంది.

Terror Attack On Pilgrims In J and K PM Modi Assures All Help Leaders Condemn
కశ్మీర్‌లో ఉగ్ర ఘాతుకం: ప్రధాని మోదీ సహా ఖండించిన నేతలు.. 10కి చేరిన మృతుల సంఖ్య

శ్రీనగర్‌: జమ్ము-కశ్మీర్‌ రియాసి జిల్లాలో ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం పోలీసులు, భద్రతా బలగాలు ముమ్మరంగా వేట కొనసాగిస్తున్నాయి. ఈ ఉగ్రదాడి వెనక ఇద్దరు పాకిస్తానీయులు ఉ‍న్నట్లు భద్రతా దళాలు సోమవారం గుర్తించాయి. నిందితుల కోసం పోలీసులు, ఇండియన్‌ ఆర్మీ , సీఆర్‌పీఎఫ్‌ జాయింట్‌ ఆపరేషన్‌​ ఏర్పాటు చేశారు. రాజౌరి, పూంచ్‌, రియాసిలోని ఎత్తైన కొండ ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాగి ఉ‍న్నట్లు తెలుస్తోంది. దీంతో కొండ ప్రాంతాల్లో పోలీసులు డ్రోన్లతో ఉగ్రవాదులను గాలిస్తున్నారు. జమ్ము-కశ్మీర్‌ రియాసి జిల్లాలో ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడిన ఘటనలో 10 మంది మృతి చెందారు. జమ్ములోని రాయసి జిల్లాలో ఉన్న శివఖోడి గుహను సందర్శించుకొని తిగిగి వస్తున్న యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు ఒక్కసారిగా విచక్షణా రహితంగా కాల్పులు తెగపడ్డారు. ఆదివారం సాయంత్రం 6.10 గంటలకు చోటుచేసుకున్న ఈ ఘటనలో 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. 53 మంది యాత్రికులు ఉన్న బస్సు శివ్‌ ఖోరి నుంచి కాట్రాలోని మాతా వైష్ణోదేవి ఆలయం వైళ్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో డ్రైవర్ గాయపడటంతో బస్సు పదుపుతప్పి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. గాయపడినవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.#WATCH | Security heightened in Jammu & Kashmir's Reasi.Morning visuals from the area where a bus carrying pilgrims was attacked by terrorists led to the loss of 10 lives. pic.twitter.com/9i93KKbhzc— ANI (@ANI) June 10, 2024 రాజౌరి, పూంచ్‌, రియాసి ప్రాంతాల్లో దాగి ఉ‍న్న ఉగ్రవాదులపై వేట కోసం పోలీసులు, ఇండియన్‌ ఆర్మీ , సీఆర్‌పీఎఫ్‌ జాయింట్‌ ఆపరేషన్‌​ ఏర్పాటు చేశారు. యాత్రికులపై ఉగ్రవాదుల దాడిన జమ్మూకశ్మీర్‌ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్ మనోజ్‌ సిన్హా ‘ఎక్స్‌’ వేదికగా తీవ్రంగా ఖండిచారు.‘ప్రధాని మోదీ దాడి ఘటపై స్పందించారు. ఇక్కడి పరిస్థితులను ఎప్పటికప్పడు పర్యవేక్షించాలన్నారు. బాధితులు, వారి కుటుంబాలకు సాయం అందిచాలని మోదీ ఆదేశించారు. ఈ దాడికి పాల్పడినవారిపై త్వరలోనే చర్యలు తీసుకుంటాం. గాయపడినవారికి మెడికల్‌ సాయం అందించాలని ప్రధాని మోదీ ఆదేశించారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. మృతి చెందిన వారికి కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నా’ అని అన్నారు.దాడిపై స్పందించిన రాష్ట్రపతి‘జమ్ము కశ్మీర్‌లోని రియాసి జిల్లాలో జరిగిన ఉగ్రదాడి ఘటన నన్ను కలచివేసింది. ఈ ఘటనలో మృతిచెందినవారి కుటుంబాలకు, బాధితులకు నా సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎక్స్‌లో స్పందించారు.I am anguished by the terrorist attack on a bus carrying pilgrims in Reasi district of Jammu and Kashmir. This dastardly act is a crime against humanity, and must be condemned in the strongest words. The nation stands with the families of the victims. I pray for the speedy…— President of India (@rashtrapatibhvn) June 9, 2024 కేంద్రమంత్రి అమిత్‌ షా ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. ‘జమ్ము కశ్మీర్ ఎల్జీ, డీజీపీ ద్వారా ఉగ్రదాడి పరిస్థితిని తెలుసుకున్నా. ఈ దాడికి పాల్పడినవారిని వదిపెట్టము. వారిపై కచ్చింతంగా చర్యలు తీసుకుంటాం. మృతిచెందినవారి కుటుంబాలుకు సానుభూతి తెలుపుతున్నా’అని అమిత్‌ షా ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు.ఉగ్రవాద దాడి పరికిపంద చర్య అని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తీవ్రంగా ఖండిచారు. ‘చాలా విషాదకరమైన ఘటన. ఈ దాడితో జమ్ము కశ్మీర్‌లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయే తెలస్తోంది’అని ఎక్స్‌లో స్పందించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ఈ ఘటనపై స్పందిస్తూ తీవ్రంగా ఖండిచారు.जम्मू-कश्मीर के रियासी ज़िले में, शिवखोड़ी मंदिर से तीर्थयात्रियों को ले जा रही बस पर हुआ कायरतापूर्ण आतंकी हमला अत्यंत दुखद है।यह शर्मनाक घटना जम्मू-कश्मीर के चिंताजनक सुरक्षा हालातों की असली तस्वीर है।मैं सभी शोक संतप्त परिजनों को अपनी गहरी संवेदनाएं व्यक्त करता हूं और…— Rahul Gandhi (@RahulGandhi) June 9, 2024యాత్రికుల బస్సుపై ఉగ్రవాదలు దాడి చేయటం ఇది రెండోసారి. 2017లో అమర్‌నాథ్‌ యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో 7 మంది మృతి చెందగా.. 19 మంది తీవ్రంగా గాయపడ్డారు.

TDP Leaders Attack Mangalagiri Man
చంద్రబాబు చెప్పినా.. ఏపీలో ఆగని టీడీపీ దాష్టీకం

అమరావతి, సాక్షి: నోటితో నవ్వి, నొసటితో వెక్కిరించినట్లుంది టీడీపీ తీరు. కవ్వింపు చర్యలకు దిగొద్దని చంద్రబాబు నాయుడు చెబుతున్నా.. అదేదో అధిష్టానం ఇచ్చిన మొక్కుబడి హెచ్చరికగా భావిస్తూ రెచ్చిపోతున్నాయి టీడీపీ శ్రేణులు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులతో సహా ఎవరినీ వదలకుండా.. దాడులు కొనసాగిస్తున్నాయి. తాజాగా మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని పెదవడ్లపూడిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త పట్ల టీడీపీ నాయకులు దాడి చేసి అమానవీయంగా ప్రవర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. వైఎస్సార్‌సీపీ కార్యకర్త కృష్ణవేణి భర్త పాలేటి రాజ్‌కుమార్‌ను గ్రామానికి టీడీపీ నాయకుడు జవ్వాది కిరణ్‌చంద్‌ ఆదివారం తన అనుచరుల ద్వారా ఊరి మధ్యకు రప్పించాడు. అందరూ చూస్తుండగా దారుణంగా దాడి చేశారు. ఒంటిపై దుస్తులు విప్పి మరీ చితకబాదారు. అనంతరం టీడీపీ కార్యకర్తలు లోకేశ్‌ ఫొటో ఉన్న ఫ్లెక్సీ చేత్తో పట్టుకోగా, విలపిస్తున్న రాజ్‌కుమార్‌ను దాని ఎదురుగా మోకాళ్లపై కూర్చోబెట్టారు. ‘నన్ను క్షమించండి.. చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, ఇతరుల గురించి ఏరోజూ ఏం మాట్లాడను’ అని చెప్పించారు. అనంతరం రాజ్‌కుమార్‌.. తనను మన్నించమని టీడీపీ నేత కిరణ్‌చంద్‌ కాళ్లు పట్టుకున్నాడు. అయితే తన కాళ్లు కాదని.. ఫ్లెక్సీలో లోకేశ్‌ కాళ్లు కూడా పట్టుకోమని ఆ టీడీపీ నేత ఆదేశించాడు. బాధితుడు వారు చెప్పినట్లే చేశాడు. తన కుటుంబాన్ని క్షమించాలని పదే పదే విజ్ఞప్తి చేశాడు. పెద్దవడ్లపూడి నుంచి ఐదు వాహనాల్లో బొప్పుడి గ్రామానికి వెళ్లి ఆ భార్యాభర్తల పై దాడి చేసింది జవ్వాది కిరణ్ కుమార్, అతని అనుచరులుగా స్పష్టంగా తేలింది. అంతేకాదు.. బలవంతంగా కారులో ఎక్కించుకుని రాత్రంతా రాజకుమార్ పైన దాడి చేస్తూ తెల్లవారుజామున బోయిపాలెం రోడ్ లో వదిలేసి వెళ్లిపోయారు తెలుగుదేశం నాయకులు. తీవ్రంగా గాయపడిన రాజ్‌ కుమార్‌ను ఆస్పత్రికి తరలించారు. ఈ వీడియో పెద్ద ఎత్తున వైరల్‌ అయినప్పటికీ పోలీసుల నుంచి ఎలాంటి చర్యలూ లేకపోవడం గమనార్హం. అంతేకాదు రాజ్‌కుమార్‌ గతంలో చేసిన పోస్టులంటూ కొన్నింటిని వైరల్‌ చేస్తూ.. దాడిని సమర్థిస్తున్నారు టీడీపీ సానుభూతిపరులు.This is the situation in Andhra Pradesh!Heart-wrenching visuals from Mangalagiri, Andhra Pradesh.@JaiTDP leaders are targeting Dalits in the state who raise their voices against them. They are literally threatening the lives of Dalits, forcing them to apologize to @naralokesh… pic.twitter.com/6Id1s8Lwxt— YSR Congress Party (@YSRCParty) June 9, 2024

Horoscope Today: Rasi Phalalu On 10-06-2024 In Telugu
Rasi Phalalu: ఈ రాశివారికి దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి

శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి: శు.చవితి సా.4.48 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం: పుష్యమి రా.10.35 వరకు, తదుపరి ఆశ్రేష, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ప.12.25 నుండి 1.17 వరకు, తదుపరి ప.3.02 నుండి 3.54 వరకు, అమృతఘడియలు: ప.3.55 నుండి 5.36 వరకు; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 5.28, సూర్యాస్తమయం: 6.29. మేషం: కుటుంబంలో వివాదాలు, సమస్యలు. ధనవ్యయం. శ్రమా«ధిక్యం. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఇంటాబయటా ఒత్తిడులు. ఆరోగ్యభంగం.వృషభం: కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు.మిథునం: మిత్రులతో అకారణంగా వివాదాలు. ఖర్చులు పెరుగుతాయి. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఇంటాబయటా చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.కర్కాటకం: త్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగయత్నాలలో అనుకూలత. ఆలయాలు సందర్శిస్తారు.సింహం: ఆరోగ్యభంగం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. పనుల్లో అవాంతరాలు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.కన్య: పనులు విజయవంతంగా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. ఉద్యోగయోగం. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహం.తుల: ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి. సంఘంలో కీర్తి దక్కుతుంది. ఆహ్వానాలు రాగలవు. విలువైన వస్తువులు సేకరిస్తారు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తినిస్తాయి.వృశ్చికం: దూరప్రయాణాలు. రుణఒత్తిడులు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. నిర్ణయాలలో మార్చుకుంటారు. అదనపు ఖర్చులు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.ధనుస్సు: శ్రమాధిక్యం. పనులు వాయిదా వేస్తారు. బంధువులతో వివాదాలు. ఆరోగ్యభంగం. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.మకరం: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. బంధువులను కలుసుకుంటారు. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలలో కొత్త ఆశలు.కుంభం: నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాల్లో విజయం. పరిచయాలు పెరుగుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. మీనం: కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనులు ముందుకు సాగవు. ప్రయాణాలు వాయిదా పడతాయి. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement