Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

AP CM YS Jagan to Visit Bobbili and Payakarao and Eluru on may 1st
నేడు సీఎం జగన్‌ ప్రచార సభలు ఇలా..

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం మూడు నియోజకవర్గాల్లో  ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. సీఎం పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను మంగళవారం ఆయన విడుదల చేశారు.ఆ వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 10 గంటలకు  విజయనగరం లోక్‌సభ స్థానం పరిధిలోని బొబ్బిలిలో ఉన్న మెయిన్‌ రోడ్‌ సెంటర్‌లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్‌ పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు అనకాపల్లి పార్లమెంట్‌ పరిధిలోని పాయకరావుపేటలోని సూర్య మహల్‌ సెంటర్‌లో జరిగే సభలో.. మధ్యాహ్నం 3 గంటలకు ఏలూరులోని ఫైర్‌ స్టేషన్‌ సెంటర్‌లో జరిగే ప్రచార సభలో ముఖ్యమంత్రి జగన్‌ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.

Chandrababu Threat CM Jagan Posani Sad For No One Reacts
ఫేక్‌ వీడియోకున్న విలువ.. సీఎం జగన్‌ ప్రాణానికి లేదా?

హైదరాబాద్‌, సాక్షి: చంద్రబాబు పబ్లిక్‌గా ఏపీ సీఎం జగన్‌ను చంపుతా అంటున్నారని, ఎన్నికల వేళ ఫేక్‌ వీడియోల గురించి తీవ్రంగా స్పందిస్తున్నవాళ్లు.. ఇంత సీరియస్‌ ఇష్యూపై స్పందించకపోవడం బాధాకరమని ఏపీ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ చైర్మన్‌, YSRCP నేత  పోసాని కృష్ణమురళి ఆవేదన వ్యక్తం చేశారు.బుధవారం ఉదయం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఎన్నో రోజులుగా సీఎం జగన్‌ను చంపేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. ‘రేపే నిన్ను(సీఎం జగన్‌ను ఉద్దేశిస్తూ..) చంపితే ఏం చేస్తారు’ అని చంద్రబాబు అడుగుతున్నారు. విశాఖ ఎయిర్‌పోర్టులో దాడి జరిగితే మీరే చేపించుకున్నారంటూ చంద్రబాబు ఆరోపించారు. ఇది దుర్మార్గం కాదా?. దీనిపై ఎవరూ స్పందించరా?. ఒక ఫేక్‌ వీడియోకి ఉన్న విలువ సీఎం జగన్‌ ప్రాణానికి లేదా?.. సుజనా చౌదరి, సీఎం రమేష్‌లు ఆర్థిక నేరస్తులు. ఈ విషయం అందరికీ తెలుసు. అసలు సుజనా చౌదరి బీజేపీలోకి ఎందుకు మారారు? బీజేపీలో ఉంటే వేల కోట్లు తినొచ్చా? అక్రమాలు చేసిన వాళ్లు బీజేపీలో ఉంటే శిక్ష పడదా?. మోదీగారు మీరు నిజాయితీవంతమైన నాయకులు. ఇలాంటి వారిని ప్రొత్సహించి మీ ఇమేజ్‌ను దెబ్బ తీసుకోకండి’’ అని పోసాని అన్నారు.

BJP Key Announcement Over Muslim Reservations
చంద్రబాబు, పవన్‌కు పొలిటికల్‌ ట్విస్ట్‌.. బీజేపీ కీలక ప్రకటన!

సాక్షి, హైదరాబాద్‌: ఏపీలో ఎ​న్నికల వేళ కూటమిలో కొత్త ట్విస్ట్‌ చోటుచేసుకుంది. టీడీపీ, జనసేనకు బీజేపీ ఊహించని షాకిచ్చింది. ముస్లిం రిజర్వేషన్ల రద్దుపై బీజేపీ కట్టుబడి ఉంటుందని.. తెలుగుదేశం, జససేన ని​ర్ణయాలకు అనుకూలంగా ఉండలేమని బీజేపీ చెప్పకనే చెప్పేసింది.ఇక, ముస్లిం రిజర్వేషన్ల అంశంపై ఇప్పటికే డీప్‌ ఫేక్‌ వీడియోల వ్యవహారం సోషల్‌ మీడియా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ ముస్లిం రిజర్వేషన్లపై ట్విట్టర్‌ వేదికగా కీలక ప్రకటన చేసింది. ఈ సందర్భంగా కేంద్ర పార్టీ నిర్ణయాన్ని ఏపీ బీజేపీ మరోసారి పునర్ఘటించింది. ఈ క్రమంలో ముస్లిం రిజర్వేషన్ల రద్దుకే కట్టుబడి ఉన్నామని బీజేపీ స్పష్టం చేసింది. దీంతో.. టీడీపీ, జనసేన నిర్ణయాలకు తాము అనుకూలంగా లేమని బీజేపీ చెప్పకనే చెప్పేసింది. Truth: If BJP comes into power, we will make an end of the unconstitutional Muslim reservations. Meanwhile it's the right of SC, ST & OBC people of Telangana. We will ensure them that they get it. Therefore, We will end the Muslim Reservations.Fake Video: If BJP comes to power,… pic.twitter.com/4OxR8LP9Z9— BJP ANDHRA PRADESH (@BJP4Andhra) April 30, 2024బాబును నమ్మని బీజేపీ ఈ ఎన్నికల్లో మళ్లీ బీజేపీతో పొత్తుకు చంద్రబాబు వెంపర్లాడినప్పటికీ, ఆ పార్టీ జాతీయ నాయకత్వం తొలుత అంగీకరించలేదు. చంద్రబాబు ఢిల్లీలోని తన ఏజెంట్లు, బీజేపీలో ఉన్న తన అనుంగులు, ఇతరత్రా పైరవీలు చేశారు. అయినా బీజేపీ పెద్దలు ఆయన్ని నమ్మలేదు. ఢిల్లీలో రాత్రింబవళ్లు పడిగాపులు గాసి, కాళ్లా వేళ్లా పడి చిట్టచివరకు పొత్తు పెట్టుకోగలిగారు. బీజేపీ పొత్తయితే పెట్టుకొంది కానీ, చంద్రబాబును ఆ పార్టీ పెద్దలు నమ్మడంలేదన్న విషయం ప్రతి సందర్భంలోనూ బయటపడుతోంది. రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన గెలుపే అసాధ్యమైతే, మేనిఫెస్టో విషయంలోనూ మరోసారి అభాసుపాలు కాకూడదని బీజేపీ అధిష్ఠానం భావించింది. దీంతో ఈసారి మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి ఓ పరిశీలకుడిని మాత్రమే పంపి మమ అనిపించింది. కనీసం రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరి, పార్టీ రాష్ట్ర నాయకులు కూడా హాజరుకాలేదు.అంతేకాదు.. మేనిఫెస్టోలో కనీసం ప్రధాని మోదీ ఫొటోగానీ, కమలం గుర్తు గానీ ముద్రించేందుకు బీజేపీ పెద్దలు అంగీకరించలేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, హోంమంత్రి అమిత్‌షా, రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఫొటోలు ముద్రించేందుకు కూడా ఒప్పుకోలేదు. అయితే, చంద్రబాబు తెలివిగా మేనిఫెస్టో కాపీలపై మోదీ, ఇతర నాయకుల ఫొటోలు లేకుండా, కమలం గుర్తును మాత్రం వేయించారు. బీజేపీ దీనికీ అంగీకరించలేదు. దాన్ని మార్చాల్సిందేనని పరిశీలకుడు సిద్ధార్థనాథ్‌సింగ్‌ పట్టుబట్టారు. దీంతో మేనిఫెస్టో ముఖచిత్రంలో అప్పటికప్పుడు మార్పులు చేశారు.

Cricket Australia Announced Their Squad For T20 World Cup 2024
టీ20 వరల్డ్‌కప్‌ కోసం ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. విధ్వంసకర వీరుడికి నో ఛాన్స్‌

వెస్టిండీస్‌, యూఎస్‌ఏ వేదికగా జూన్‌ 1 నుంచి ప్రారంభంకాబోయే టీ20 వరల్డ్‌‍కప్‌ 2024 కోసం 15 మంది సభ్యుల ఆస్ట్రేలియా జట్టును ఇవాళ (మే 1) ప్రకటించారు. విధ్వంసకర వీరులతో నిండిన ఈ జట్టుకు మిచెల్‌ మార్ష్‌ సారథ్యం వహించనున్నాడు. ముందుగా ప్రచారం జరిగినట్లుగా స్టార్‌ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌కు ఈ జట్టులో చోటు దక్కలేదు. ఎలాగైనా జట్టులోకి వస్తాడనుకున్న ఐపీఎల్‌ విధ్వంసకర బ్యాటర్‌ జేక్‌ ఫ్రేసర్‌ మెక్‌గుర్క్‌ను సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. మాట్‌ షార్ట్‌, జేసన్‌ బెహ్రెన్‌డార్ఫ్‌, ఆరోన్‌ హార్డీ, స్పెన్సర్ జాన్సన్‌, జేవియర్‌ బార్ట్‌లెట్‌ లాంటి ఆశావహులకు కూడా మొండిచెయ్యే ఎదురైంది. చివరి వరల్డ్‌కప్‌ అని ముందుగానే ప్రకటించిన డేవిడ్‌ వార్నర్‌ను సెలెక్టర్లు కరుణించారు. ఎండ్‌ ఓవర్స్‌ స్పెషలిస్ట్‌ నాథన్‌ ఎల్లిస్‌ ఎట్టకేలకు జట్టులోకి వచ్చాడు. దాదాపు 18 నెలలుగా టీ20 జట్టుకు దూరంగా ఉన్న ఆస్టన్‌ అగర్‌, కెమరూన్‌ గ్రీన్‌లకు సెలెక్టర్లు అవకాశం కల్పించారు. జోష్‌ ఇంగ్లిస్‌కు ప్రత్యామ్నాయ వికెట్‌కీపర్‌గా మాథ్యూ వేడ్‌ జట్టులోకి వచ్చాడు.  పేస్‌  బౌలింగ్‌ త్రయం పాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌ కొనసాగనున్నారు. మిచ్‌ మార్ష్‌తో పాటు ట్రవిస్‌ హెడ్‌, టిమ్‌ డేవిడ్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, మార్కస్‌ స్టోయినిస్‌ ఆల్‌రౌండర్లుగా ఎంపికయ్యారు. స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌ కోటా ఆడమ్‌ జంపా జట్టులోకి వచ్చాడు. మెగా టోర్నీలో ఆస్ట్రేలియా ప్రయాణం జూన్‌ 5న మొదలవుతుంది. ఆసీస్‌ తమ తొలి మ్యాచ్‌లో పసికూన ఒమన్‌తో తలపడుతుంది. గ్రూప్‌-బిలో ఆసీస్‌.. ఇంగ్లండ్‌, నమీబియా, స్కాట్లాండ్‌, ఒమన్‌లతో పోటీపడుతుంది.టీ20 వరల్డ్‌కప్‌ కోసం ఆస్ట్రేలియా జట్టు: మిచెల్‌ మార్ష్ (కెప్టెన్‌), అష్టన్ అగర్, పాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కెమెరూన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జాంపా

International Criminal Court may Issue arrest warrant To Benjamin Netanyahu
ఇజ్రాయెల్‌ నెతన్యాహుకు ఊహించని షాక్‌!

టెల్‌ అవీవ్‌: గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. యుద్ధ నేరాలకు సంబంధించి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఇతర అగ్రనేతలకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ త్వరలో అరెస్ట్ వారెంట్లు జారీ చేయనున్నట్టు సమాచారం. ఈ మేరకు ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. దీంతో, ఈ అంశం హాట్‌ టాపిక్‌గా మారింది.ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమెన్‌ నెతన్యాహు సంచలన ప్రకటన చేశారు. నెతన్యాహు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. హమాస్‌తో కాల్పుల విరమణ చర్చలు కొనసాగుతున్నాయి. చర్చల్లో భాగంగా ఒప్పందం కుదరినా, కుదరకపోయినా.. హమాస్‌లను అంతం చేయడానికి ఇజ్రాయెల్‌ దళాలు రఫాలోకి ప్రవేశిస్తాయన్నారు. మా లక్ష్యాలను సాధించకుండా యుద్ధం నిలిపివేసే సమస్యే లేదు. హమాస్‌ దళాలను పూర్తిగా తుడిచిపెట్టేస్తాం. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్‌ తప్పకుండా విజయం సాధిస్తుందని కామెంట్స్‌ చేశారు.The International Criminal Court may soon issue arrest warrants for Israeli Prime Minister Benjamin Netanyahu and other top leaders for war crimes. That's according to press reports out of Israel. Capitol Hill Correspondent @ErikRosalesNews reports. pic.twitter.com/lFuboZN6oK— EWTN News Nightly (@EWTNNewsNightly) May 1, 2024 మరోవైపు.. ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం కారణంగా వేలాది మంది పాలస్తీనియన్లు రఫా నగరంలో ఆశ్రయం పొందుతున్నారు. ఈ క్రమంలో బందీల విడుదలకు, కొంత ఉపశమనం పొందడానికి రెండు దేశాల మధ్య కాల్పుల ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. ఇక.. రఫా నగరంపైకి ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు చేసింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి జరిపిన దాడుల్లో మూడు కుటుంబాల్లోని ఆరుగురు మహిళలు, ఐదుగురు చిన్నారులు సహా మొత్తం 22 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఐదు రోజుల వయసున్న పసికందు ఉందని పాలస్తీనా అధికారులు తెలిపారు.

BJP Not involved At ap Alliance Manifesto Release Modi stamp missing
టచ్ మీ నాట్... దూరం జరగండమ్మా

మొత్తానికి రాష్ట్రంలో టీడీపీ సారధ్యంలో ఏర్పడిన ఎన్డీయే కూటమి మనసులు కలవని బలవంతపు కాపురం అని తేలిపోయింది. తప్పనిసరి తంతు తప్ప అందులో తమకేం పెద్ద పాత్ర లేదని బీజేపీ భావిస్తోంది. అందుకే మీ పాట్లేవో మీరు పడండి... అందులో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకండి నాయుడుగారు అని స్పష్టంగా చెబుతోంది. వాస్తవానికి టీడీపీ.. జనసేన... బీజేపీల కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టోను విడుదల చేసే కార్యక్రమానికి చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.దీనికి జాతీయ బీజేపీ నేత సిద్దార్థ నాథ్ సింగ్ సైతం ఢిల్లీ నుంచి వచ్చారు. అయితే ఆ మ్యానిఫెస్టో కాపీ మీద ఎక్కడా మోడీ ఫోటో లేదు. కేవలం చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రమే ఉన్నాయి. అంతేకాకుండా ఆ మ్యానిఫెస్టో కాపీని విడుదల చేసే సమయంలో వరుసగా ఈ ముగ్గురు నాయకులూ నిలబడి ఫోటోలకు.. పత్రికలకు ఫోజులిచ్చారు. అయితే ఆ సందర్భంగా ఆ కాపీని చేత్తో పట్టుకుని బాబు, పవన్ పక్కన నిలబడేందుకు సైతం సింగ్ విముఖత చూపించారు. ఎవరో వచ్చి ఆ కాపీని సింగ్‌కు ఇస్తుండగా అక్కర్లేదు.. అంటూ నేను దాన్ని తాకను అనేలా సంజ్ఞ చేసారు. ఆ తరువాత అయన మీడియాతో మాట్లాడుతూ ఈ మ్యానిఫెస్టో ఈ ఇద్దరిదే.. మా బీజెపికి ఏమీ సంబంధం లేదని చెప్పేసారు. అంతేకాకుండా రాష్ట్ర బిజెపి నుంచి సైతం ఈ కార్యక్రమానికి ఎవరూ.. ఆఖరుకు అధ్యక్షురాలు పురంధేశ్వరి సైతం హాజరు కాలేదు. దీంతో ఇది జస్ట్ పవన్... జనసేనల పొత్తు అని తేలిపోయింది.అసలేం జరిగింది ?గతంలో 2014 లో సైతం ఇలాగే మూడు పార్టీలు పొత్తులో ఎన్నికలకు వెళ్లాయి. అప్పుడు చంద్రబాబు దాదాపు ఆరువందల హామీలు ఇచ్చి.. ఆ తరువాత మాటతప్పి.. మ్యానిఫెస్టోను పార్టీ వెబ్‌సైట్‌ నుంచి మాయం చేసారు. ఇప్పుడు ఆ మ్యానిఫెస్టోను సీఎం వైఎస్ జగన్ బయటకు తీసి.. ఒక్కో హామీని ప్రజలకు గుర్తు చేస్తూ ఈ హామీ ఇచ్చారు. అమలు చేసారా అక్కా.. రుణమాఫీ చేసారా అన్నా.. పెన్షన్ ఇచ్చారా తాతా.. డ్వాక్రా రుణాలు మాఫీ చేసారా చెల్లి.. ఉద్యోగాలు ఇచ్చారా తమ్ముడూ.. చూడండి ఈ హామీలకు అప్పట్లో మోడీ.. పవన్ సైతం గ్యారెంటీలుగా ఉన్నారు. వాళ్ళ ఫోటోలు సైతం ఉన్నాయ్. మళ్ళీ అలాంటి వాళ్లకు ఓట్లెద్దామా అంటూ ఊరూరా ప్రచారం చేయడంతో.. చంద్రబాబు ఇచ్చే అమలుసాధ్యం కానీ హామీలవల్ల మేమెందుకు ప్రజలకు జవాబుదారీ కావాలి...? మేమెందుకు పరువుపోగొట్టుకోవాలని భావించిన బీజేపీ ఈసారి ఆ హామీల విషయంలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయద్దు నాయుడుగారు.. మీరు మీరు.. ఏదోలా తగలడండి అనేసింది. అంతేకాకుండా దానిమీద మోదీ ఫోటో సైతం వేసేందుకు కేంద్రం ఒప్పుకోలేదని తెలిసింది. అందుకే ఈసారి మ్యానిఫెస్టో మీద కేవలం.. చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రమే ఉన్నాయ్. మరోవైపు బాబు ఇస్తున్న హామీలకు మా కేంద్రానికి, బీజేపీకి ఎలాంటి బాధ్యత లేదని వాళ్ళు తేల్చేశారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్ల విషయంలో కూడా చంద్రబాబు తమను మోసం చేసినట్లు కేంద్రం గుర్తించింది. పీవీఎన్ మాధవ్, జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజు వంటివాళ్లకు టిక్కెట్లు ఇవ్వకుండా కేవలం టీడీపీ నాయకులనే బీజెపి నేతలుగా చూపించి టిక్కెట్లు ఇచ్చుకుని అసలైన బీజెపి నేతలను మోసం చేసారని అధిష్టానం గమనించింది. అంటే ఎన్ని చేసినా.. ఎంత చేసినా కుక్కతోక వంకరే అని.. చంద్రబాబులోని మోసపూరిత గుణం మారదని స్పష్టతకు వచ్చిన కేంద్రం.. అసలు ఈ దరిద్రమే మాకువద్దు. మీ చావు మీరు చావండి. మీ ఎన్నికలు.. మ్యానిఫెస్టోలో మాకు ఏమీ సంబంధం లేదని తేల్చేసింది.:::: సిమ్మాదిరప్పన్న 

Gold And Silver Prices Hit Record Highs
ధర పెరిగినా బంగారమే

న్యూఢిల్లీ: భారత్‌ కుటుంబాల్లో బంగారానికి ఉన్న ప్రాధాన్యత తెలిసిందే. దీనిని ప్రతిబింబిస్తూ, ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో 2023 ఇదే కాలంతో  పోలి్చతే భారత్‌ పసిడి డిమాండ్‌ 8 శాతం పెరిగి 136.6 టన్నులకు (ఆభరణాలు, పెట్టుబడులు) పెరిగింది. ధర తీవ్రంగా ఉన్నా ఈ స్థాయి డిమాండ్‌ నెలకొనడం గమనార్హం. సమీక్షా కాలంలో త్రైమాసిక సగటు ధర  (దిగుమతి సుంకం, జీఎస్‌టీ మినహా) 10 గ్రాములకు రూ.49,943.80 నుంచి రూ.55,247.20కి ఎగసింది.  ఇక భారత్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ఇదే కాలంలో ఏకంగా 19 టన్నులు కొనుగోలు చేసింది. 2023 క్యాలెండర్‌ ఇయర్‌ మొత్తంలో ఆర్‌బీఐ కొనుగోళ్లు 16 టన్నులే కావడం గమనార్హం. తాజా ‘క్యూ1 2024, గోల్డ్‌ డిమాండ్‌ ట్రెండ్స్‌ నివేదికలో  ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) ఈ అంశాలను తెలిపింది.ప్రపంచ వ్యాప్తంగా 3 శాతం అప్‌ మార్చి త్రైమాసికంలో ప్రపంచ పసిడి డిమాండ్‌ 3% పెరిగి 1,238 టన్నులకు చేరింది. 2016 తర్వాత ఈ స్థాయి డిమాండ్‌ పటిష్టత ఇదే తొలిసారి. సగటు త్రైమాసిక ధర ఔన్స్‌కు (31.1 గ్రాములు) 2,070 డాలర్లు. వార్షికంగా ఈ రేటు 10% అధికమైతే, త్రైమాసికంగా  5 % ఎక్కువ. సెంట్రల్‌ బ్యాంకులు తమ హోల్డింగ్స్‌ను ఈ కాలంలో 290 టన్నులు పెంచుకున్నాయి.  ∗ మార్చి త్రైమాసికంలో భారత్‌ పసిడి డిమాండ్‌ విలువ రూపాయల్లో వార్షిక ప్రాతిపదికన 20 శాతం పెరిగి రూ.75,470 కోట్లకు చేరింది.∗సమీక్షా కాలం మొత్తం పసిడి డిమాండ్‌లో ఆభరణాల డిమాండ్‌ 4 శాతం పెరిగి 95.5 టన్నులకు చేరగా, పెట్టుబడుల (కడ్డీలు, నాణేల వంటివి) విలువ 19 శాతం పెరిగి 41.1 టన్నులుగా నమోదైంది.∗ విలువల్లో చూస్తే ఆభరణాలకు డిమాండ్‌ 15% పెరిగి రూ.52,750 కోట్లకు చేరింది. పెట్టుబడుల్లో  విలువ 32% పెరిగి రూ.22,720కి ఎగసింది. ∗ మార్చి త్రైమాసికంలో పసిడి దిగుమతులు 25 % పెరిగి 179.4 టన్నులుగా నమోదయ్యాయి.  ∗గోల్డ్‌ రీసైక్లింగ్‌ విలువ 10% పెరిగి 38.3 టన్నులుగా నమోదైంది.∗2024లో 700 నుంచి 800 టన్నుల కొనుగోళ్లు జరుగుతాయన్నది అంచనా. 

మేనిఫెస్టోను పట్టుకోవడానికి నిరాకరిస్తున్న బీజేపీ పరిశీలకుడు సిద్దార్థనాథ్‌ సింగ్‌
మేం టచ్‌ చెయ్యం బాబూ.. మేనిఫెస్టో పట్టుకోవడానికి కూడా బీజేపీ ససేమిరా

సాక్షి, అమరావతి: దేశంలో విశ్వసనీయత లేని నాయకుడు చంద్రబాబు అని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కేంద్ర నాయకత్వం స్పష్టమైన సంకేతాలిచ్చింది. ఈ ఎన్నికల్లో టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకున్నప్పటికీ, ఉమ్మడిగా మేనిఫెస్టో ఇవ్వడానికి మాత్రం అంగీకరించలేదు. తద్వారా చంద్రబాబు హామీలకు బీజేపీ కానీ, ప్రధాని నరేంద్ర మోదీ కానీ గ్యారంటీ కాదని చెప్పింది. ఆ మేనిఫెస్టోపై బీజేపీ ముద్ర ఒక్కటి కూడా లేకుండా జాగ్రత్తపడింది. దానిపై బీజేపీ నేతల ఫొటోలు, గుర్తు ఉండకూడదని ఆ పార్టీ ముందే స్పష్టం చేసింది. చంద్రబాబు కమలం గుర్తు వేయించినా, చివర్లో తొలగించాల్సి వచ్చింది. చివరికి ఆ మేనిఫెస్టోని తాకడానికి కూడా బీజేపీ నేతలు ముందుకు రావడంలేదు. 2014లో టీడీపీతో పొత్తు పెట్టుకొన్న బీజేపీ అప్పట్లో ఉమ్మడి మేనిఫెస్టోకి అంగీకరించింది. ఆ మేనిఫెస్టోలో చంద్రబాబు రైతులు, డ్వాక్రా రుణాల మాఫీ, యువతకు జాబులు అంటూ ఇబ్బడిముబ్బడిగా హామీలిచ్చారు. ఆ మేనిఫెస్టోలో ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు, పవన్‌ ఫొటోలు, మూడు పార్టీల గుర్తులు ఘనంగా ముద్రించారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఒక్కటీ నెరవేర్చకుండా అన్ని హామీలకు మంగళం పాడారు. అడుగడుగునా ప్రజలను వంచించారు. రుణ మాఫీ చేస్తానని చెప్పి రైతులు, మహిళలను నిలువునా మోసం చేశారు. జాబులు లేక యువత అల్లాడారు. పైగా, ఐదేళ్లూ విచ్చలవిడి అవినీతి, దోపిడీ జరగడంతో మరోసారి చంద్రబాబు ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయారు. ఆ నింద బీజేపీ పైనా పడింది. ఆ పార్టీ జాతీయ నేతలూ ఇదే నిర్ధారణకు వచ్చారు.  బాబును నమ్మని బీజేపీ ఈ ఎన్నికల్లో మళ్లీ బీజేపీతో పొత్తుకు చంద్రబాబు వెంపర్లాడినప్పటికీ, ఆ పార్టీ జాతీయ నాయకత్వం తొలుత అంగీకరించలేదు. చంద్రబాబు ఢిల్లీలోని తన ఏజెంట్లు, బీజేపీలో ఉన్న తన అనుంగులు, ఇతరత్రా పైరవీలు చేశారు. అయినా బీజేపీ పెద్దలు ఆయన్ని నమ్మలేదు. ఢిల్లీలో రాత్రింబవళ్లు పడిగాపులు గాసి, కాళ్లా వేళ్లా పడి చిట్టచివరకు పొత్తు పెట్టుకోగలిగారు. బీజేపీ పొత్తయితే పెట్టుకొంది కానీ, చంద్రబాబును ఆ పార్టీ పెద్దలు నమ్మడంలేదన్న విషయం ప్రతి సందర్భంలోనూ బయటపడుతోంది. రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన గెలుపే అసాధ్యమైతే, మేనిఫెస్టో విషయంలోనూ మరోసారి అభాసుపాలు కాకూడదని బీజేపీ అధిష్ఠానం భావించింది. దీంతో ఈసారి మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి ఓ పరిశీలకుడిని మాత్రమే పంపి మమ అనిపించింది. కనీసం రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరి, పార్టీ రాష్ట్ర నాయకులు కూడా హాజరుకాలేదు. అంతేకాదు.. మేనిఫెస్టోలో కనీసం ప్రధాని మోదీ ఫొటోగానీ, కమలం గుర్తు గానీ ముద్రించేందుకు బీజేపీ పెద్దలు అంగీకరించలేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, హోంమంత్రి అమిత్‌షా, రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఫొటోలు ముద్రించేందుకు కూడా ఒప్పుకోలేదు. అయితే, చంద్రబాబు తెలివిగా మేనిఫెస్టో కాపీలపై మోదీ, ఇతర నాయకుల ఫొటోలు లేకుండా, కమలం గుర్తును మాత్రం వేయించారు. బీజేపీ దీనికీ అంగీకరించలేదు. దాన్ని మార్చాల్సిందేనని పరిశీలకుడు సిద్ధార్థనాథ్‌సింగ్‌ పట్టుబట్టారు. దీంతో మేనిఫెస్టో ముఖచిత్రంలో అప్పటికప్పుడు మార్పులు చేశారు. అందుకే 12 గంటలకు జరగాల్సిన మేనిఫెస్టో విడుదల మూడు గంటలు ఆలస్యమైంది. చివరకు టీడీపీ, జనసేన పార్టీల మేనిఫెస్టోగానే చంద్రబాబు, పవన్‌ దాన్ని విడుదల చేశారు. బాబు, పవన్‌ ఫొటోలు, రెండు పార్టీల గుర్తులు మాత్రమే మేనిఫెస్టోలో ఉన్నాయి. మేనిఫెస్టో విడుదల సందర్భంగా కనీసం దాన్ని పట్టుకునేందుకు సైతం బీజేపీ పరిశీలకుడు సిద్ధార్థనాథ్‌సింగ్‌ ఇష్టపడలేదు. పవన్, చంద్రబాబు మేనిఫెస్టోను విడుదల చేసి ఫొటోలకు పోజు ఇస్తూ దాన్ని సిద్ధార్థనాథ్‌ను పట్టుకోవాలని ఒక వ్యక్తి ఇవ్వగా, ఆయన నిర్ద్వందంగా తిరస్కరించడం టీవీల్లో ప్రత్యక్ష ప్రసారంలోనే కనిపించింది. చివరకు ఈ మేనిఫెస్టోకు టీడీపీ, జనసేనదే బాధ్యతని చంద్రబాబు చెప్పడం గమనార్హం. బీజేపీ జాతీయ స్థాయిలో ఒకే మేనిఫెస్టో విడుదల చేస్తుందని, కాబట్టి ఏపీలో కూటమిలో మేనిఫెస్టోకి మద్దతు తెలిపిందని ఆయన సర్దిచెప్పుకున్నారు. సిద్ధార్థనాథ్‌సింగ్‌ కూడా తాము రాష్ట్రానికో మేనిఫెస్టో ఇవ్వడంలేదని చెప్పారు. నిజానికి జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలోనూ వేర్వేరుగా మేనిఫెస్టోలు ప్రకటించే ఆనవాయితీ ఉన్నా కేవలం చంద్రబాబుపై నమ్మకం లేకే బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.   

Manipur women paraded case CBI reveals shocking facts in chargesheet
పోలీసుల కళ్లెదుటే ‘మణిపూర్‌ ఘోరం’

మణిపుర్‌లో మైతీ తెగకు చెందిన మూకల చేతికి చిక్కిన ఇద్దరు కుకీ తెగ మహిళను నగ్నంగా ఊరేగించి.. లైంగిక హింసకు పాల్పడిన ఘటన దేశంలో కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి సీబీఐ ఛార్జిషీట్‌లో షాకింగ్‌ విషయాలను వెల్లడించింది. బాధిత మహిళలు సాయం చేయమని కోరినా.. పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని, వారు ఏమాత్రం పట్టించకోకుండా అల్లరిగుంపుకే సహకరించేలా వ్యవహరించారని తెలిపింది.కాంగ్‌పోక్పీ జిల్లాలో మైతీ అల్లరిగుంపు చేతికి చిక్కిన ఇద్దరు కుకీ మహిళలు ఘటనా ప్రాంతానికి సమీపంలో ఉన్న పోలీసు జీపు వద్దకు వెళ్లి సాయం చేయాలని కోరారు. అయితే పోలీసులే స్వయంగా బాధితులను ఆ అల్లరిగుంపకు అప్పగించినట్లు ఛార్జిషీటులో సీబీఐ పేర్కొంది. దీంతో ఆ అల్లరి మూక​ ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, వరిపొలాల్లో దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు వివరించింది.బాధితురాళ్లలో ఒక మహిళ తమను కాపాడి, సురక్షిత ప్రాంతాని తీసుకుళ్లాలని పోలీసులను కోరారు. అయితే జీపు తాళాలు తమ వద్ద లేవని పోలీసులు అబద్దాలు చెప్పినట్లు సీబీఐ ఛార్జిషీట్‌ పేర్కొంది. మరోవైపు.. అల్లరిగుంపు చేతికి చిక్కిన మూడో మహిళ వారి నుంచి త్రుటిలో తప్పించుకొంది.గతేడాది మే 4న జరిగిన ఈ ఘటన రెండు నెలల తర్వాత జులై నెలలో వైరల్‌గా మారి దేశమంతా కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆరుగురు నిందితులతోపాటు ఓ బాల నేరస్థుడిపై గౌహతి సీబీఐ ప్రత్యేక జడ్జి కోర్టులో అక్టోబరు 16న ఛార్జిషీటు దాఖలు  అయింది.ఈ దాడుల్లో అల్లరిగుంపు చేతిలో మృతిచెందిన కుకీ తెగకు చెందిన తండ్రీకొడుకుల మృతదేహాలను గ్రామ సమీపంలోని నీరులేని నదిలోకి విసిరేసినట్లు తెలిపింది. మైతీ గుంపు జీపు వద్దకు చేరుకోగానే బాధితులను అక్కడే వదిలేసి.. పోలీసులు పారిపోయినట్లు సీబీఐ మూడు పేజీల ఛార్జిషీటులో పేర్కొంది.

Veteran actor Krishna Alluri Sitaramaraj 50 years completes in tollywood
అల్లూరికి అర్ధ శతాబ్దం

‘మా మన్యం దొర సీతారామరాజు వచ్చాడు’.... ప్రజల్లో సంబరం. దొరకు పాదాభివందనం చేశారు. కానీ... అతను నిజమైన దొర కాదు. మన్యం దొర  అల్లూరి సీతారామ రాజు గెటప్‌ వేసుకున్న నటుడు. అప్పటికి నిజమైన అల్లూరి సీతారామరాజుని చూసిన కొందరు వృద్ధులు లొకేషన్లో ఆ గెటప్‌లో ఉన్న నటుడికి పాదాభివందనం చేశారు. వెండితెరపై సీతారామరాజుగా కనిపించక ముందే అలా షూటింగ్‌ లొకేషన్లో ప్రజల చేత ‘భేష్‌’ అనిపించుకున్నారు కృష్ణ. అల్లూరి సీతారామరాజు గెటప్‌ అంటే కృష్ణ తప్ప వేరే ఏ నటుడికీ నప్పదు అనేంతగా ఆ పాత్రలో ఒదిగిపోయారు సూపర్‌ స్టార్‌. 1974 మే 1న విడుదలైన ‘అల్లూరి సీతారామరాజు’ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రం యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కొన్ని విశేషాలు తెలుసుకుందాం... ఎన్టీఆర్‌ హీరోగా నటించిన ‘అగ్గిరాముడు’ సినిమా 1954 ఆగస్టు 5న విడుదలైంది. బుర్రిపాలెంకు చెందిన కృష్ణ తెనాలిలో ఆ సినిమా చూశారు. అందులో అల్లూరి గురించి బుర్రకథగా చెప్పే సీన్‌ కృష్ణను ఆకట్టుకుంది. ఆ తర్వాత ఎన్టీఆర్‌ నటించిన ‘జై సింహ’ని కూడా చూశారు కృష్ణ. ఆ సినిమా పాటల పుస్తకం చివరి పేజీలో ఎన్టీఆర్‌ తర్వాతి చిత్రం ‘అల్లూరి సీతారామరాజు’ అనే ప్రకటనతో పాటు అల్లూరి గెటప్‌లో స్కెచ్‌తో గీసిన ఎన్టీఆర్‌ బొమ్మ ఉంది. ఆ సినిమా కోసం కృష్ణ ఎదురు చూశారు. అయితే ఆ సినిమా ప్రారంభమైనా తర్వాత ఆగిపోయింది. పై చదువుల కోసం ఏలూరు వెళ్లిన కృష్ణకి నాటకాలపై ఆసక్తి కలిగింది. అది కాస్తా సినిమాలవైపు మళ్లడంతో చెన్నైకి చేరుకున్నారు. అప్పుడు ప్రజా నాట్యమండలి రాజారావు బృందం ప్రదర్శించిన ‘అల్లూరి సీతారామరాజు’ నాటకానికి మంత్రముగ్దుడయ్యారు కృష్ణ. ఆ తర్వాత హీరో అయిన కృష్ణ ‘అసాధ్యుడు’లో (1968) అంతర్నాటకంలో భాగంగా సీతారామరాజు వేషం వేశారు. ఆ వేషంలో చక్కగా ఉన్నారంటూ జనాలు కితాబిచ్చారు. దీంతో తాను హీరోగా అల్లూరి చరిత్రతో సినిమా తీస్తే బాగుంటుందనుకున్నారు కృష్ణ. అయితే 1972లో శోభన్‌బాబు హీరోగా సీతారామరాజు మూవీ నిర్మించనున్నట్లు డి. లక్ష్మీ నారాయణ (డీఎల్‌) ప్రకటించారు. కానీ అనారోగ్యం వల్ల ఆ ప్రయత్నం విరమించుకున్నారాయన. కృష్ణ హీరోగా ‘పెద్దలు మారాలి’ సినిమా తీశారు డీఎల్‌. ఆ చనువుతో సీతారామరాజు కథని కృష్ణకి ఇచ్చి, ఆసక్తి ఉంటే సినిమా తీసుకోమన్నారు. అలా ‘అల్లూరి సీతారామరాజు’ చేసే అవకాశం కృష్ణకి వచ్చింది. డేరింగ్‌ అండ్‌ డ్యాషింగ్‌ కృష్ణ కృష్ణకు ‘డేరింగ్‌ అండ్‌ డ్యాషింగ్‌’ అని పేరు. ‘అల్లూరి సీతారామరాజు’ కథలో వాణిజ్యపరమైన అంశాలు ఉండవని, పైగా హీరో చనిపోతాడని ఫైనాన్స్‌ ఇవ్వడానికి ఫైనాన్షియర్లు, పంపిణీ చేయడానికి కూడా ఎవరూ సాహసించలేదు. ‘ఇంత రిస్క్‌ అవసరమా.. ఈ సినిమా వద్దు’ అని శ్రేయోభిలాషులు కృష్ణకు చె΄్పారు. ఎన్టీఆర్‌ కూడా వద్దనే అన్నారు. అయినా తాను ఓ హీరోగా రూపొందిన ‘దేవుడు చేసిన మనుషులు’ శత దినోత్సవంలో అల్లూరి సీతారామరాజు సినిమా తీస్తున్నానని, అది తన నూరో చిత్రంగా ఉంటుందని కృష్ణ ప్రకటించారు. 1973 డిసెంబరులో మద్రాస్‌ వాహినీ స్టూడియోలో షూటింగ్‌ ఆరంభమైంది. అల్లూరి సీతారామరాజు గెటప్‌లో ఉన్న కృష్ణపై ఫస్ట్‌ షాట్‌ తీశారు. సినిమా మొదలుపెట్టినప్పట్నుంచి అనేక ఇబ్బందులు. చింతపల్లి అడవిలో షూటింగ్‌ కాబట్టి అక్కడ గెస్ట్‌ హౌస్‌లు లేకపోవడంతో యూనిట్‌లోని దాదాపు ఐదువందల మందికి ఒక కాలనీలా తాత్కాలిక బస ఏర్పాటు చేశారు. సముద్ర మట్టానికి నాలుగువేల అడుగుల ఎత్తులో కొండ ప్రాంతంలో షూటింగ్‌. భయంకరమైన చలి. దాదాపు 40 రోజుల పాటు షూటింగ్‌ చేశారు. దర్శకుడు రామచంద్రరావు అస్వస్థతకి గురి కావడం ఓ ఊహించని షాక్‌. ఆయన్ను చెన్నైకి తీసుకెళ్లి, మెరుగైన వైద్యం చేయించినా కోలుకోలేదు. ఫిబ్రవరి 14న తుది శ్వాస విడిచారు. మిగతా భాగాన్ని కృష్ణ తెరకెక్కించారు. యుద్ధ సన్నివేశాలను దర్శకుడు కేఎస్‌ఆర్‌ దాస్‌ రూపొందించారు. రామచంద్రరావు మీద గౌరవంతో దర్శకుడిగా ఆయన పేరే ఉంచేశారు కృష్ణ. సినిమా స్కోప్‌.. ఈజీ కాదు తెలుగులో పూర్తి స్థాయిలో రూపొందిన తొలి సినిమా స్కోప్‌ ఈస్ట్‌మన్‌ కలర్‌ చిత్రం ‘అల్లూరి సీతారామరాజు’. అయితే అప్పుడు సినిమా స్కోప్‌ అంత ఈజీ కాదు. ఈ మూవీకి వీఎస్‌ఆర్‌ స్వామి ఛాయాగ్రాహకుడు. అప్పట్లో సినిమా స్కోప్‌ ఫార్మాట్‌లో తీసేందుకు రెండే లెన్స్‌లు ఉండేవట. కాగా సినిమా స్కోప్‌ ఫార్మాట్‌లో తీసే లెన్స్‌కి కెమెరా వ్యూఫైండర్స్‌ ఉండవట. దీంతో ఊహించుకుని ఫ్రేమ్‌ సెట్‌ చేసుకునేవారట. ఈ ప్రక్రియను వీఎస్‌ఆర్‌ స్వామి ముంబైలో అధ్యయనం చేసి రావడంతో ‘అల్లూరి సీతారామరాజు’ ఈజీగా చేయగలిగారు.   అల్లూరి పాటలు అజరామరం ‘అల్లూరి సీతారామరాజు’లోని పాటలన్నీ సూపర్‌ హిట్‌. పి. ఆదినారాయణరావు ఈ సినిమాకు సంగీతదర్శకుడు. సినిమా ఆరంభంలో వచ్చే ‘రగిలింది విప్లవాగ్ని..’, సినిమా చివర్లో వచ్చే.. ‘ఓ విప్లవజ్యోతి...’ పాటలకు ఆరుద్ర సాహిత్యం అందించగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు. ‘వస్తాడు నా రాజు..’ పాటను నారాయణరెడ్డి రాయగా,  ‘హైలెస్సా.. హైలెస్సా..’, ‘కొండ దేవతా నిన్ను కొలిచేవమ్మా..’ పాటలను కొసరాజు రాశారు.‘తెలుగు వీర లేవరా..’ పాటను శ్రీశ్రీ రాశారు. ఈ పాటను ఘంటసాలతోనే పాడించాలన్నది కృష్ణ సంకల్పం. ఆ సమయానికి ఘంటసాల ఆరోగ్యం సరిగా లేదు. ఆ తర్వాత ఘంటసాల ఆరోగ్యం కాస్త కుదుటపడటంతో ఆయన ఈ పాట పాడారు. కానీ ఈ సినిమా విడుదల కాకముందే ఘంటసాల కాలం చేశారు. ఈ పాటకు వి. రామకృష్ణ గొంతు కలిపారు. ఈ పాటకుగాను జాతీయ ఉత్తమ గీత రచయిత అవార్డు శ్రీశ్రీని వరించింది. ఓ తెలుగు సినిమాలోని పాటకు జాతీయ పురస్కారం రావడం అదే తొలిసారి. అలాగే ఇదే సినిమాలోని ‘వందేమాతరం అంటూ నినదించిన..’, ‘హ్యాపీ క్రిస్మస్‌..’ పాట, ‘అరుణాయ శరణ్యాయ..’ శ్లోకం వంటివి కూడా వీనుల విందుగా ఉంటాయి.రికార్డులు భళా ‘అల్లూరి సీతారామరాజు’ సినిమా 19 కేంద్రాల్లో (బెంగళూరుతో కలుపుకుని) వందరోజులు, 2 కేంద్రాల్లో 25 వారాలు, హైదరాబాద్‌లోని సంగం థియేటర్‌లో రజతోత్సవం, అలాగే షిఫ్టింగులతో ఏడాది పాటు ఆడటం విశేషం. ఈ చిత్రం స్వర్ణోత్సవం చెన్నైలోని ఉడ్‌ల్యాండ్స్‌ హోటల్‌లో ఘనంగా జరిగాయి. స్వాతంత్య్ర సమరయోధులు ఇంటూరి వెంకటేశ్వరరావు, అనిసెట్టి సుబ్బారావు, దాశరథి, సుంకర సత్యనారాయణ, కేఎస్‌ గోపాలకృష్ణన్‌ వంటి వారిని సత్కరించారు. అల్లూరి సీతారామరాజు కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం రూ. పదివేలతో ఓ ట్రస్టు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి, అందుకు సంబంధించిన పత్రాలను సీతారామరాజు సోదరుడు సత్యనారాయణరాజుకి అందించారు కృష్ణ. ఇలా ఈ సినిమాకి సంబంధించిన విశేషాలు చాలా ఉన్నాయి.అల్లూరి చేయనన్న ఎన్టీఆర్‌ అల్లూరి సీతారామరాజు సినిమా మొదలుపెట్టి, ఆపినా ఆ సినిమా తీయాలన్న ఎన్టీఆర్‌ ఆకాంక్ష అలాగే ఉండిపోయింది. కృష్ణ ‘అల్లూరి సీతారామరాజు’ వచ్చిన చాలా ఏళ్లకు ఆ సినిమా తీద్దామని పరుచూరి బ్రదర్స్‌తో అన్నారు ఎన్టీఆర్‌. కానీ సోదరులు వద్దని సలహా ఇచ్చి, కృష్ణ చేసిన సినిమా చూడమన్నారు. ఎన్టీఆర్‌ కోరిక మేరకు ‘అల్లూరి సీతారామరాజు’ని ప్రత్యేకంగా చూపించారు కృష్ణ.  ‘‘అద్భుతంగా తీశారు. నేను ‘అల్లూరి సీతారామరాజు’  తీయను’’ అన్నారు ఎన్టీఆర్‌.మహారథి చేతికి స్క్రిప్ట్‌ త్రిపురనేని మహారథి చేతిలో డీఎల్‌ ఇచ్చిన స్క్రిప్ట్‌ పెట్టి, ‘ఈ సబ్జెక్ట్‌లో సినిమా తీయడానికి కావాల్సినంత దమ్ము ఉందా’ అడిగారు కృష్ణ సోదరుడు హనుమంతరావు. ‘చాలా ఉంది’ అన్నారు మహారథి. కానీ, తనకు ఇచ్చిన స్క్రిప్ట్‌లో ఒక్క సన్నివేశం తప్ప మహారథికి వేరే ఏదీ నచ్చలేదు. పరిశోధనలు చేసి, స్క్రిప్ట్‌ తయారు చేశారు. దర్శకుడిగా వి. రామచంద్రరావును తీసుకున్నారు. సినిమా స్కోప్‌  ఈస్ట్‌మన్‌ కలర్‌లో తీయాలని నిర్ణయించింది పద్మాలయా స్టూడియోస్‌ సంస్థ (కృష్ణ సొంత నిర్మాణ సంస్థ). ‘అల్లూరి...’ తర్వాత ‘పాడి పంటలు’తోనే హిట్‌... ‘అల్లూరి సీతారామరాజు’ చూసిన  విజయా వాహిని సంస్థ అధినేతల్లో ఒకరైన దర్శక–నిర్మాత చక్రపాణి అభినందించారు. కానీ ‘ఈ సినిమా తర్వాత నీ సినిమాలు ఆడటం కష్టం’ అని కూడా కృష్ణతో అన్నారు. ఆయన అన్న మాటలు నిజమయ్యాయి. ‘అల్లూరి సీతారామరాజు’ తర్వాత కృష్ణ చేసిన ప్రతి చిత్రాన్నీ ఈ సినిమాతో పోల్చారు ప్రేక్షకులు. దాంతో ఆ తర్వాత కృష్ణ నటించిన çపది సినిమాలకు పైగా ఆశించిన ఫలితాన్ని సాధించలేదు. చివరికి పద్మాలయా స్టూడియోస్‌ నిర్మించిన ‘పాడి పంటలు’ (1976) విజయంతో హీరోగా కృష్ణ పూర్వ వైభవాన్ని పొందారు. 

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement