Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

YS Jagan Tweet On TDP Attacks In AP
టీడీపీ అరాచకాలపై వైఎస్ జగన్ ట్వీట్

సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొందని.. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్‌ చేశారు. ‘‘ప్రభుత్వం ఏర్పాటు కాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది. అధికారపార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది. వెరసి ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి’’ అని వైఎస్‌ జగన్‌ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మండిపడ్డారు.గౌరవ గవర్నర్‌ గారు @governorap వెంటనే జోక్యం చేసుకుని పచ్చమూకల అరాచకాలను అడ్డుకోవాలని, ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని విజ్ఞప్తిచేస్తున్నాం. టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకూ, సోషల్‌ మీడియా సైనికులకు తోడుగా ఉంటాం’’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటుకాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైయస్సార్‌సీపీకి చెందిన నాయకులు,…— YS Jagan Mohan Reddy (@ysjagan) June 6, 2024 సంబంధిత వార్త: టీడీపీ, జనసేన విధ్వంసం.. వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులు

TDP Goons Attack YSRCP Leader At Nuzividu Centre
నూజివీడులో పోలీసుల సమక్షంలో పట్టపగలే దారుణం

ఏలూరు, సాక్షి: రాష్ట్రంలో టీడీపీ అరాచక పాలన ఆరంభం కాకమునుపే.. దమనకాండకు దిగుతోంది. వైఎస్సార్‌సీపీ శ్రేణులపై, సానుభూతిపరులపై రాజకీయ ప్రతీకార చర్యలకు దిగుతోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా దాడులు కొనసాగుతుండగా.. తాజాగా నూజివీడులో పట్టపగలే దారుణం చోటు చేసుకుంది. గెలుపు మదంతో రెచ్చిపోయిన టీడీపీ గూండాలు నూజివీడు టౌన్‌ పెద్ద గాంధీ బొమ్మ సెంటర్‌లో కత్తులతో వైఎస్సార్‌సీపీ నేత మీద దాడికి దిగారు. స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ నడకుదుటి గిరీష్‌పై దాడి చేశారు. దీంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. కొందరు ధైర్యం చేసి ఆ దృశ్యాలను తమ ఫోన్లలో చిత్రీకరించారు. ఈ ఘటనలో గిరీష్‌ తీవ్రంగా గాయపడగా.. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఘటన సమయంలో పోలీసులు అక్కడే ఉన్నా.. అడ్డుకునే ప్రయత్నాలేవీ చేయకపోవడం ఘోరం. పోలీసులు వ్యవహరించిన తీరుపై స్థానికులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదీ చదవండి: టీడీపీ వేధింపులకువైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కన్వీనర్‌ బలి

These World Leaders To Attend PM Modi Oath Ceremony In Delhi
మారిన మోదీ ప్రమాణ స్వీకార తేదీ? ఈ దేశాల అగ్రనేతలకు ఆహ్వానం!

న్యూఢిల్లీ: దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తాజా సమాచారం ప్రకారం మోదీ జూన్‌ 9న ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. తొలుత జూన్‌ 8న మోదీ ప్రమాణ స్వీకార ఉంటుందని వార్తలు వెలువడగా.. తాజాగా ఆ కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రానికి మార్చినట్లు సమాచారం. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.కాగా దేశంలో నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని పదవిని చేపట్టిన వ్యక్తి మోదీనే కావడం విశేషం. మోదీ ప్రమాణ స్వీకారానికి దక్షణాసియా దేశాలకు చెందిన అగ్ర నేతలు తరలిరానున్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా, శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే హాజరు అయ్యే విషయం ఖరారైంది. ఈ మేరకు ప్రమాణ స్వీకారానికి హాజరుకావాల్సిందిగా రణిల్‌ విక్రమసింఘేను ప్రధాని మోదీ ఆహ్వానించారని ఆ దేశ అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. బంగ్లాదేశ్‌ ప్రధాని సైతం శనివారం నాటి కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈవెంట్‌ కోసం ఆమె ఒకరోజు ముందే అంటే శుక్రవారమే ఢిల్లీకి చేరుకోనున్నారు. వీరితోపాటు భూటాన్‌, నేపాల్‌ ప్రధాని పుష్ప కమల్‌ దహాల్‌ ప్రచండ, భూటాన్‌ షెరింగ్ టోబ్గే, మారిషస్‌ ప్రధాని ప్రవింద్ జుగ్నాథ్‌లకు కూడా ప్రధాని మోదీ ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉండగా.. ఇటీవల ప్రకటించిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 240 స్థానాలను గెలుచుకుంది. 2014లో 282 సీట్లు, 2019లో 303 చోట్ల విజయ కేతనం ఎగరవేసి సొంతంగా మేజార్టీ స్థానాలు దక్కించుకున్న బీజేపీ.. ఈసారి ఈసారి మెజార్టీ(272) కంటే తక్కువ స్థానాలకే పరిమితమైంది. కేవలం 240 సీట్లను గెలుచుకున్న బీజేపీ.. ఎన్డీయే కూటమి మిత్రపక్షాల సాయంతో ముచ్చటగా మూడోసారి అధికారాన్ని ఏర్పాటు చేయనుంది. కూటమి నేతల మద్దతుతోే ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

Ksr Comments On The Atrocities Of TDP Leaders
సీఎం పీఠం ఎక్కనేలేదు.. ఈలోపే మరీ ఇంతలానా?

ఆంధ్రప్రదేశ్ లో ఎంతలో ఎంత మార్పు చూడండి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంకా ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టకముందే ఆ పార్టీకి చెందిన కొన్ని అరాచక శక్తులు విజృంభిస్తున్న వైనం ఆందోళన కలిగిస్తుంది. కొన్ని చోట్ల ఇళ్లలోకి చొరబడి మరీ కత్తులతో నరకడం, వైఎస్సార్‌సీపీ జెండానే కనిపించకూడదని బెదిరించడం ఇవన్నీ ప్రజాస్వామ్య స్పూర్తికి విఘాతం కలిగిస్తాయి. ప్రజాస్వామ్యంతో సంబంధం లేదని, తాము అనుకున్నది చేస్తామని అనుకుంటే అది మరింత ఉద్రిక్తతలకు దారి తీస్తుంది.పోలీస్ వ్యవస్థ ఎందుకు ఇంత సడన్ గా నిర్వీర్యం అయిందో అర్థం కావడం లేదు. కొన్ని చోట్ల వైఎస్సార్‌సీపీ నేతల ఇళ్లపైకి దాడులు జరుగుతుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. అసలు ఈ ఎన్నిక ఫలితాలు ఇలా ఉన్నాయేమిటి? ఏమైనా గోల్ మాల్ జరిగిందా అనే అనుమానాలు ఒక వైపు వ్యక్తం అవుతుంటే, మరో వైపు టీడీపీ, జనసేనలకు చెందినవారు చేస్తున్న అరాచకాలతో అట్టుడికే పరిస్థితి ఏర్పడుతుంది. చంద్రబాబు నాయుడు కానీ, ఆయన కుమారుడు లోకేష్ కానీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కానీ ఒక్కసారి కూడా ఇలాంటివాటిని ఖండించినట్లు కనబడలేదు. దాంతో వారు కూడా ఇలాంటి గొడవలను ప్రోత్సహిస్తున్నారని జనం అనుకునే అవకాశం ఉంటుంది.వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఒక చిన్న ఘటన ఏమైనా జరిగినా, వ్యక్తిగత కారణాలతో ఘర్షణలు జరిగినా, వైఎస్సార్‌సీపీకి పులిమి నానా హడావుడి చేసిన టీడీపీ మద్దతు మీడియా ఇప్పుడు ఎక్కడా నోరుమెదపుతున్నట్లు లేదు. ప్రస్తుతం జరుగుతున్న హింసాకాండ వారి దృష్టిలో ప్రజాస్వామ్యబద్దంగా, రాజ్యాంగబద్దంగా జరుగుతున్నదని అనుకుంటున్నారేమో తెలియదు. టీడీపీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి రకరకాల రూపాలలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి యత్నాలు సాగాయి. కాస్త గట్టిగా ఉండే అధికారులను మార్చేయడం, టీడీపీ వైపు నుంచి జరిగే ఘర్షణలను పట్టించుకోకపోవడం, వైఎస్సార్‌సీపీ నుంచి ఏమి జరిగినా వెంటనే స్పందించడం, తీవ్రమైన చర్యలు తీసుకోవడం కనిపించింది. కొన్ని ఏరియాలలో టీడీపీ రిగ్గింగ్ అవకాశం ఉన్నచోట్ల పోలీసులను చాలా తక్కువ సంఖ్యలో పెట్టారట. తద్వారా యథేచ్చగా రిగ్గింగ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారన్నమాట. అదే వైఎస్సార్‌సీపీ వారు రిగ్గింగు చేసే చాన్స్ ఉందని అనుకున్నచోట మొత్తం బలగాలన్నిటినీ కేంద్రీకరించారని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. పోలింగ్ మరుసటి రోజు మాచర్ల, తాడిపత్రి, తిరుపతి మొదలైన చోట్ల టీడీపీ వారు దాడులు చేసి గందరగోళాలు సృష్టించారు. విచిత్రం ఏమిటంటే పోలీసులే తాడిపత్రి అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిలోకి వెళ్లి సిసిటీవీని, కెమెరాలను పగులకొట్టి విద్వంసానికి పాల్పడడం, అయినా వారిపై ఏమి చర్య తీసుకున్నది తెలియదు.వీటిలో అత్యధికం తెలుగుదేశం గూండాలు చేసినవేనని వైఎస్సార్‌సీపీ చెబుతోంది. అది నిజమే అని దృవీకరించే విధంగా కౌంటింగ్ తర్వాత రచ్చ సాగుతోంది. వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ విజయవాడలో ఒక హోటల్ లో టిఫిన్ చేస్తుంటే వచ్చి దాడి చేశారు. లోకేష్ ను విమర్శించే స్థాయి నీదా అని బూతులు తిడుతూ రెచ్చిపోయారు. పలువురు వైఎస్సార్‌సీపీ నేతలకు, వారిని సమర్ధించినవారికి ఫోన్ లు చేసి టీడీపీ మద్దతుదారులు బూతులు తిడుతున్నారు. అసభ్యకర మెస్సేజ్ లు పెడుతున్నారు. టీడీపీ వేధింపులకు తాళలేక ఏలూరు సమీపంలోని విజయరాయి వద్ద ప్రవీణ్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మానాయుడుకు చెందిన కళ్యాణ మండపంపై దాడి చేశారు. మాజీ మంత్రి విడదల రజనీ ఆఫీస్ లో విధ్వంసం సృష్టించారు. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కొండూరు తదితర చోట్ల వైఎస్సార్‌సీపీ వారి ఇళ్లపై కర్రలు, కత్తులతో దాడి చేశారు. వైఎస్సార్‌సీపీవారు ఊళ్లలో ఉండడానికి వీలు లేదని హెచ్చరికలు జారీ చేసి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మాజీ పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. పల్నాడులో ఒక యూట్యూబ్ చానల్ నడిపే వైఎస్సార్‌సీపీ అభిమాని ఇంటిపైకి వెళ్లి కత్తితో దాడిచేస్తే, అతని వృద్ద తల్లిదండ్రులు తల్లడిల్లుతూ ఏడుస్తున్న వీడియో వైరల్ అయింది.ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆఫీస్ పై దాడులు చేశారు. ఈ గొడవలలో టీడీపీతో పాటు, బీజేపీ, జనసేన కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి వద్ద రాళ్లతో వీరంగం సృష్టించారు. రాయచోటి మండలం యండపల్లి అనేచోట మాజీ ఎంపీ పోల సుబ్బారెడ్డి ఇంటిపై పడి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. గుంటూరులో ఒక హాస్టల్ పేరు చివరలో రెడ్డి అని ఉన్నందుకు హాస్టల్ యజమానితో కాళ్లు పట్టించుకున్నారట. కళ్యాణ దుర్గంలో వైఎస్సార్‌సీపీ నేత ఉమామహేశ్వరనాయుడు ఇంటిపై టీడీపీ నేతలు దాడి చేసి కారు, ప్రచార రథం ధ్వంసం చేశారు.ఇలా వివిధ జిల్లాలలో సాగుతున్న ఈ అరాచకాలను పోలీసులు ఎప్పటికి అరికడతారో తెలియదు కానీ, దీనివల్ల సమాజంలో మరింత అన్ రెస్ట్ పెరిగిపోతుంది. ఈ దాడులకు ప్రతిగా వైఎస్సార్‌సీపీవారు కూడా ఏదో రకంగా తిప్పికొట్టడానికి యత్నించే అవకాశం ఉంటుంది. దానిని నివారించడం చాలా అవసరం. అధికారం వచ్చిన తర్వాత చాలా బాధ్యతగా ఉంటామని చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు అనేప్పటికీ, పోలీసులకు ఈ ఘర్షణలపై గట్టి చర్యలు తీసుకోవాలని ఎందుకు సూచించలేదో తెలియదు. లోకేష్ తాము అధికారంలోకి వచ్చాక బదులు తీర్చుకుంటామని అనేమాటలను జనం గుర్తు చేసుకుంటున్నారు. దానికి తగినట్లే ప్రస్తుతం దాడులు సాగుతున్నాయి.గతంలో ఏవో జరిగాయని ప్రతీకారంతో రగిలిపోతున్నారని, అందుకే ఇలా చేస్తున్నారని టీడీపీకి మద్దతు ఇచ్చేవారు, వారి మీడియా ప్రచారం చేయవచ్చు. అందులో ఎంత నిజం ఉందన్నది వేరే విషయం. అధికారంలోకి వచ్చినవారు అన్నిటిని సర్దుబాటు చేసుకుంటూ ముందుకు సాగాలి. అంతేకానీ కక్షపూరితంగా మరింత రెచ్చగూడదని చెప్పక తప్పదు. కానీ అప్పట్లో అరాచక పాలన అని ప్రచారం చేసినవారు ప్రస్తుతం టీడీపీ, జనసేన, బీజేపీల నుంచి జరుగుతున్న అరాచకాలను ఎలా సమర్ధిస్తారు? ఈ దౌర్జన్యాలు, దాడుల ద్వారా టీడీపీ కూటమి ఇకపై ఇంకెంత అరాచకానికి పాల్పడుతుందో అని జనం భయపడుతున్నారు.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు

T20 World Cup 2024: Rohit Sharma fit for Pakistan clash after minor injury scare
పాకిస్తాన్‌తో మ్యాచ్‌.. టీమిండియాకు గుడ్ న్యూస్‌!?

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024ను విజ‌యంతో ఆరంభించిన టీమిండియా మ‌రో ర‌స‌వ‌త్త‌ర పోరుకు సిద్ద‌మైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా జూన్ 9న న్యూయర్క్ వేదిక‌గా చిర‌కాల ప్ర‌త్య‌ర్ధి పాకిస్తాన్‌తో భార‌త్ త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి పాకిస్తాన్‌పై త‌మ ఆధిపత్యాన్ని కొనసాగించాలని భారత్ భావిస్తోంది. అయితే ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు గుడ్‌న్యూస్ అందింది. బుధవారం ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయం కారణంగా రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ.. ఇప్పుడు పూర్తి ఫిట్‌నిస్ సాధించినట్లు తెలుస్తోంది. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 52 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఐరీష్ పేసర్ మార్క్ అడైర్ వేసిన ఓ రాకాసి బౌన్సర్ హిట్‌మ్యాన్ చేతికి తాకింది. దీంతో రోహిత్ నొప్పితో విల్లవిల్లాడు. వెంటనే ఫిజియో చికిత్స అందించినప్పటికి నొప్పి తగ్గకపోవడంతో రోహిత్ మైదానాన్ని వీడాడు.దీంతో భారత అభిమానులు రోహిత్ గాయంపై ఆందోళన చెందారు. అయితే రోహిత్ గాయం అంత తీవ్ర‌మైన‌ది కాద‌ని, అత‌డు ప్ర‌స్తుతం బాగానే ఉన్నాడ‌ని బీసీసీఐ అధికారి ఒక‌రు తెలిపారు. ఈ క్ర‌మంలో అత‌డు పాకిస్తాన్‌తో జ‌రిగే బ్లాక్‌బ్లాస్ట‌ర్ మ్యాచ్‌కు అందుబాటులో ఉండ‌నున్నాడు.

Today Gold and Silver Price 6th May 2024
మళ్ళీ ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి: నేటి కొత్త ధరలు ఇవే..

జూన్ ప్రారంభం నుంచి స్వల్ప తగ్గుదలను నమోదు చేసిన పసిడి ధరలు మళ్ళీ పుంజుకుంటున్నాయి. ఈ రోజు (జూన్ 6) కూడా గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 820 వరకు పెరిగింది. కాబట్టి నేడు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్‌, విజయవాడలలో మాత్రమే కాకుండా గుంటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.67300 (22 క్యారెట్స్), రూ.72110 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 400, రూ. 440 తగ్గాయి.చెన్నైలో కూడా బంగారం ధరలు రూ. 750 నుంచి రూ. 820 వరకు పెరిగాయి. కాబట్టి 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 68000 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 74180 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే.. నిన్నటి ధరల కంటే ఈ రోజు ధరలు పెరిగాయని అవగతమవుతోంది.దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67450 (10 గ్రా), 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73570 (10 గ్రా) వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 700, రూ. 770 పెరిగింది.వెండి ధరలుదేశంలో బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా పెరిగాయి. నిన్న (జూన్ 6) రూ. 2300 తగ్గిన వెండి ధర.. ఈ రోజు (జూన్ 7) రూ. 1800 పెరిగింది. దీంతో ఈ రోజు కేజీ వెండి ధర రూ. 93500లకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్‌టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

AP Congress Leaders Protest Against Chief Sharmila In Vijayawada
భ్రష్టు పట్టించారు.. షర్మిలపై సొంతపార్టీ నేతల ఆగ్రహం

సాక్షి, విజయవాడ: కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పీసీసీ చీఫ్ షర్మిలకు వ్యతిరేకంగా ఆ పార్టీ నాయకులు నిరసన తెలిపారు. షర్మిల కాంగ్రెస్‌ను భ్రష్టు పట్టించిందని వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు.. షర్మిలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ మీడియాతో మాట్లాడారు.‘‘ రాహుల్ గాంధీకి విలువ ఇచ్చి షర్మిలను ఏమీ అనకుండా వదిలేశాం. కక్షపూరిత చర్యల కోసమే షర్మిల ఏపీకి వచ్చిందా?. పార్టీ ఇచ్చిన ఫండ్ దాచుకుని షర్మిల అభ్యర్ధుల్ని గాలికి వదిలేసింది. షర్మిల క్యాడర్‌ను గాలికి వదిలేశారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమయ్యాను. పీసీసీ ప్రెసిడెంట్‌గా పనిచేసిన షర్మిల నైతిక బాధ్యతగా తన పదవికి రాజీనామా చేయాలి. పార్టీ అభ్యర్థులకు కనీసం జెండాలు కూడా అందించలేదు. రాహుల్ గాంధీ ధైర్యంగా మోదీకి ఎదురుగా నిలబడ్డారు’’ అని ఆమె అన్నారు.

Guess This Actress Who Gave 23 Years Break For Movies
23 ఏళ్లుగా సినిమాలకు దూరం.. స్టార్‌ హీరోతో పెళ్లి ఆపై రూ. 300 కోట్లతో..

కోలీవుడ్‌ హీరోయిన్‌ షాలిని చిన్నప్పటి నుంచి తన చురుకైన నటనతో అభిమానులను కట్టిపడేసింది. చిన్న వయసులోనే తమిళం, తెలుగు, మలయాళం ఇలా పలు భాషల్లో బాలతారగా నటించిన షాలినిని బేబీ షాలిని అని ముద్దుగా పిలుచుకునేవారు. అంచెలంచెలుగా ఎదుగుతూ కథానాయికగా వెలుగొందుతున్న షాలిని 1997లో విడుదలైన అనియతి ప్రవు అనే మలయాళ చిత్రం ద్వారా కథానాయికగా తెరంగేట్రం చేసింది. తమిళ్‌లో విజయ్ సరసన 'కాదలుక్కు మరియాధై' చిత్రంతో షాలిని తెరంగేట్రం చేసింది.తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన షాలిని తమిళంలో తన తదుపరి చిత్రంలో అజిత్ సరసన నటించే అవకాశం దక్కించుకుంది. అజిత్‌, షాలినీ కలిసి నటించిన తొలి సినిమా ‘అమర్‌కాలం’. శరణ్‌ దర్శకుడు. 1999 ఆగస్టు 13న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. షూటింగ్ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. సినిమా విడుదలై విజయం సాధించడంతో వారి రొమాన్స్ కూడా అలాగే సాగింది. ఆ తర్వాత 2000 సంవత్సరంలో వచ్చిన సఖి చిత్రంతో ఈ జోడీ మరింత పాపులర్‌ అయింది. సినీరంగంలో టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న సమయంలో అదే ఏడాదిలో అజిత్‌- షాలిని వివాహం చేసుకున్నారు. అలా, 2001లో విడుదలైన ‘ప్రియద వరం వెండూమ్‌’ తర్వాత ఆమె నటనకు స్వస్తి చెప్పారు. బాలనటిగా దక్షిణాదిలో రాణించి ఆపై టాప్‌ హీరోయిన్‌ స్థాయికి షాలినీ చేరుకుంది. అయితే, గత రెండు దశాబ్దాలుగా సినిమాలకు దూరంగానే ఉంది. అలా సినిమా నుంచి తప్పుకున్న 23 ఏళ్ల తర్వాత కూడా శాలినికి సినిమా ఛాన్స్‌లు వచ్చాయి కానీ, సున్నితంగా వాటిని ఆమె తిరష్కరించింది. తన పిల్లలు అనుష్క (16), అద్విక్‌ (09) చదువు విషయంలో ఆమె ఎక్కువగా సమయం కేటాయిస్తుంది. తమిళంలో కేవలం 5 సినిమాల్లోనే షాలిని హీరోయిన్‌గా నటించినా.. ఆ కాలంలో రూ. 50 లక్షల రెమ్యునరేషన్ అందుకుంది. అజిత్, షాలినీల ఆస్తుల విలువ ఏకంగా రూ.300 కోట్లకుపైగా ఉంటుందని చెబుతున్నారు. తక్కువ సినిమాలతోనే తిరుగులేని హీరోయిన్‌గా కొనసాగిన షాలిని చిన్ననాటి ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.

sources: 10 15 MLAs of Ajit Pawar camp in touch with Sharad Pawar
శరద్‌ పవార్‌తో టచ్‌లో.. అజిత్‌ పవార్‌ వర్గం 15 మంది ఎమ్మెల్యేలు

ముంబై: మహరాష్ట్రలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. లోక్‌సభ ఎన్నికల్లో అధికార కూటమి(బీజేపీ, ఎన్సీపీ, శివసేన) బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. మొత్తం 48 స్థానాల్లో కేవలం 17 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ప్రతిపక్ష మహా వికాస్‌ అఘాడీ కూటమి(కాంగ్రెస్‌, శరద్‌ ఎన్సీపీ, ఉద్దవ్‌ శివసేన) 30 స్థానాలను కైవసం చేసుకుంది. ప్రతిపక్ష కూటమికి అత్యధిక సీట్లు రావడంతో ప్రభుత్వం అయోమయంలో పడింది.ఈ క్రమంలో తాజాగా అజిత్‌ పవార్‌ వర్గానికి చెందిన 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు శరద్‌ పవార్‌తో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఏ పార్టీ పేరు చెప్పకుండానే పలువురు నేతలు తమతో టచ్‌లో ఉన్నారని ఎన్సీపీ (శరద్‌చంద్ర పవార్) రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ పేర్కొన్నారు. జూన్ 9న జరిగే సమావేశంలో ఈ ప్రతిపాదనల గురించి ఆలోచిస్తామని.. జూన్ 10న ఎన్సీపీ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటామని చెప్పారు.దీంతో ఆ నేతలు అజిత్‌ పవార్‌ వర్గానికి చెందిన ఎన్సీపీ నేతలేన న్న చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా గురువారం ఉదయం మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ చీఫ్‌ అజిత్‌ పవార్‌ తన వర్గం నేతలు, పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఎన్సీపీ ప్రముఖులైన పార్టీ రాష్ట్ర చీఫ్ సునీల్ తట్కరే, ఛగన్ భుజబల్, దిలీప్ వల్సే పాటిల్, హసన్ ముస్రిఫ్, అదితి తట్కరే తదితర నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పేలవ ప్రదర్శన, పార్టీ భవిష్యత్తు గురించి వారు చర్చించారు.లోక్‌సభ ఎన్నికల్లో అజిత్‌ పవార్‌ ఎన్సీపీ నాలుగు స్థానాల్లో పోటీ చేయగా.. కేవలం ఒక చోటనే గెలిచింది. అంతేగాక అజిత్‌ సతీమణి సైతం ఓటమి చెందింది. శరద్‌ పవార్‌ కూతురు సుప్రియా సూలే చేతిలో లక్ష యాబై వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.కాగా, మహారాష్ట్రలో 48 స్థానాలకు గాను కేవలం 17 స్థానాలు మాత్రమే దక్కించుకుంది. 2019లో 23 సీట్లు గెలిచిన బీజేపీ ఈసారి కేవలం 9 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. సీఎం ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని శివసేన 7 సీట్లు, అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ ఒక్క సీటు గెలుచుకున్నాయి. మరోవైపు మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) కూటమిలో కాంగ్రెస్‌ 13 సీట్లు, ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) 9 సీట్లు, శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) ఎనిమిది సీట్లు గెలుచుకుంది.ఇక ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో లోక్‌సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో రాజకీయాలు మరోసారి మలుపులు తిరుగవచ్చని అంతా భావిస్తున్నారు.

How to Make Correction in Name, KYC and Other Details
ఈపీఎఫ్‌ అకౌంట్‍లో తప్పులున్నాయా? ఇలా సులభంగా మార్చుకోండి..

సాధారణంగా ఉద్యోగం చేసేవారికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్​ (EPF) అకౌంట్ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఈ అకౌంట్ వివరాల్లో ఏవైనా తప్పులు ఉండే అవకాశం ఉంటుంది. గతంలో ఉద్యోగులు తమ జాయింట్ డిక్లరేషన్ ఫారంను నింపి, దానిని ఈపీఎఫ్ఓ కార్యాలయంలో ఇచ్చేవారు. ఇప్పుడు ఏవైనా మార్పులు చేసుకోవాలనుంటే.. ఫిజికల్ ఫారమ్‌తో పనిలేకుండా.. ఆన్‌లైన్‌లో మార్చుకోవచ్చు. ఈ కథనంలో ఈపీఎఫ్ చందాదారులు ఆన్​లైన్​లో తమకు చెందిన 11 వ్యక్తిగత వివరాలను ఎలా మార్చుకోవాలో వివరంగా తెలుసుకుందాం.ఆన్​లైన్​లో మార్చుకోగలిన 11 వ్యక్తిగత వివరాలుపేరుజెండర్పుట్టిన తేదీతండ్రి / తల్లి పేరురిలేషన్​షిప్వైవాహిక స్థితిజాయినింగ్ డేట్రీజన్ ఫర్ క్విట్టింగ్ డేట్ ఆఫ్ క్విట్టింగ్నేషనాలిటీఆధార్ఆన్​లైన్​లో ఎలా మార్చుకోవాలంటే?👉ఉద్యోగి ముందుగా ఈపీఎఫ్ఓ అధికారికి వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి👉హోమ్ పేజీలో మొదట కనిపించే 'సర్వీస్' ట్యాబ్ మీద క్లిక్ చేసిన తరువాత 'ఫర్ ఎంప్లాయిస్' అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి.👉ఆ తరువాత సర్వీస్ సెక్షన్ కింద కనిపించే 'మెంబర్ యూఏఎన్ / ఆన్‌లైన్ సర్వీస్' ఆప్షన్స్ మీద క్లిక్ చేయాలి.👉ఆలా క్లిక్ చేయగానే మీకు ఓ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.👉కొత్త పేజీలో కుడివైపు కనిపించే బాక్సులలో 'యూఏఎన్, పాస్​వర్డ్‌, క్యాప్చా' వంటి వివరాలు ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. 👉ఇవన్నీ పూర్తి చేసిన తరువాత అసలైన ఈపీఎఫ్ఓ అకౌంట్ పేజీ ఓపెన్ అవుతుంది.👉ఈపీఎఫ్ఓ అకౌంట్ పేజీ ఓపెన్ అయినా తరువాత స్క్రీన్ మీద కనిపించే.. 'మేనేజ్' ఆప్షన్ ఎంచుకోవాలి. ఇక్కడ జాయింట్ డిక్లరేషన్ ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ మీ మెంబర్ ఐడీ ఎంటర్ చేసిన తరువాత.. ఏదైతే అప్డేట్ చేయాలనుకుంటున్నారో.. వాటిని ఎంటర్ చేసుకోవాలి.👉అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ అప్​లోడ్‌ చేసిన తరువాత సబ్మిట్ చేయాలి.👉అన్ని సరిగ్గా అప్​లోడ్‌ చేసి సబ్మిట్ చేసిన తరువాత రిక్వెస్ట్ యాక్సెప్ట్ అవుతుంది. ఆ తరువాత వివరాలు మీకు అందుతాయి.ఎంప్లాయర్ చేయాల్సింది..👉ఎంప్లాయ్ వివరాలను అందుకున్న తరువాత ఎంప్లాయర్.. ఈపీఎఫ్ఓ అధికారికి వెబ్‌సైట్‌లో ఎంప్లాయర్ ఐడీతో ఎంటర్ అవ్వాలి. 👉మెంబర్ ట్యాబ్‌ మీద క్లిక్ చేసి.. జాయింట్ డిక్లరేషన్ చేంజ్ రిక్వెస్ట్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి.👉ఉద్యోగి అభ్యర్థను చెక్ చేసిన తరువాత ఎంప్లాయర్ అంగీకరించవచ్చు, తిరస్కరించవచ్చు.👉ఎంప్లాయర్ ఉద్యోగి రిక్వెస్ట్ అంగీకరిస్తే.. అది ఈపీఎఫ్ఓకు చేరుతుంది.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement