Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

AP Elections 2024: May 15th Politics Latest News Updates Telugu
May 15th: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌

May 15th AP Elections 2024 News Political Updates1:10 PM, May 15th, 2024పల్నాడులో టెన్షన్‌..!పల్నాడు జిల్లా..పల్నాడులో జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ విధించిన కలెక్టర్మాచర్ల, గురజాల నియోజకవర్గంలో షాపులు ముయించివేస్తున్న పోలీసులు 12:20 PM, May 15th, 2024పల్నాడు ఘటనపై సీఎం జగన్‌ దిగ్భ్రాంతితాడేపల్లి :చిలకలూరిపేట బస్సు ప్రమాద ఘటనపై సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతిమరణించినవారి కుటుంబాలకు సంతాపం తెలిపిన సీఎం జగన్‌వారి కుటుంబాలకు అండగా నిలుస్తామన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్ష 12:00 PM, May 15th, 2024తాడిపత్రిలో పోలీసుల ఓవరాక్షన్‌..అనంతపురం:తాడిపత్రిలో పోలీసుల తీరు వివాదాస్పదంఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో వీరంగం సృష్టించిన పోలీసులుసీసీ కెమెరాలు, కంప్యూటర్లు, ఫర్నీచర్ ధ్వంసంహార్డ్ డిస్క్, సీపీయూలను మాయం చేసిన పోలీసులుఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పనిమనుషులను బెదిరించిన పోలీసులుతాడిపత్రి నియోజకవర్గంలో 30 మంది వైఎస్సార్సీపీ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులుపోలీసుల తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డివైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు పెడితే సహించేది లేదుఏఎస్పీ రామకృష్ణ సహకారంతో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి రౌడీయిజం చేస్తున్నారుపోలీసుల తీరుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం 11:40 AM, May 15th, 2024పోలీసులు టీడీపీకి కొమ్ము కాశారు: మంత్రి మేరుగ నాగార్జునతాడేపల్లి :మేరుగ నాగార్జున కామెంట్స్‌.. మంత్రి కామెంట్స్..వైఎస్సార్సీపీ మరోసారి అధికారంలోకి వస్తుంది.ఇది పేదలకు పెత్తందారులకు మద్య జరిగిన యుద్ధం.ప్రజలు నిజమైన నాయకుడికి పట్టం కట్టబోతున్నారు.జూన్ నాలుగోవ తేదిన వైఎస్సార్‌సీపీ సునామీ రాబోతుంది.చంద్రబాబు ప్రస్టేషన్‌లోకి వెళ్ళాడు.పల్నాడు జిల్లాలో వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులు చేస్తున్నారు.సమస్యాత్మక ప్రాంతాల్లో సెక్యూరిటీ పెంచాలని కోరినా ఎన్నికల కమిషన్ పట్టించుకోలేదుకేంద్రంతో కుమ్మక్కై చంద్రబాబు ఎన్నికలలో అక్రమాలకు పాల్పడ్డారు.పోలీసులు టీడీపీకి కొమ్ము కాశారు.అధికారంలోకి రాగానే ఎన్నికల్లో అక్రమాలకు వంతపాడిన పోలీసు అధికారులపై విచారణ జరిపిస్తాంఘోరాతి ఘోరంగా ఎన్నికల్లో టీడీపీ నేతలు దాడులు చేశారు.జూన్ నాలుగున రాష్ట్ర చరిత్రలో నూతన అధ్యాయం లిఖిస్తాంరాష్ట్రంలో రామరాజ్యం రాబోతుందిపేదలు వైఎ‍స్సార్‌సీపీకి ఓటు వేశారని దాడులు చేశారు.వైఎస్సార్సీపీకి అండగా నిలిచిన ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలపై పనిగట్టుకొని దాడులకు ఉసిగొల్పారుడీబీటీల ద్వారా నిధులు ప్రజల ఖాతాల్లోకి రాకుండా అడ్డుకున్నది చంద్రబాబే. 9:40 AM, May 15th, 2024టీడీపీ నాయకుల దాష్టీకం..పల్నాడు జిల్లా..దాచేపల్లి మండలం మాదినపాడులో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు దాష్టీకంకర్రలు, ఇనుప రాడులతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులుబత్తుల ఆదినారాయణ రెడ్డి అనే వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై దాడి చేసిన తెలుగుదేశం నాయకులుతీవ్ర గాయాల కారణంగా ఆసుపత్రికి తరలింపు.గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి హౌస్ అరెస్ట్‌ చేసిన పోలీసులు 8:51 AM, May 15th, 2024ఏలూరులోనూ టీడీపీ దౌర్జన్యకాండఏలూరు చేపల తూము సెంటర్ 40 డివిజన్ లో రెచ్చిపోయిన టీడీపీ మూకలువైఎస్ఆర్సిపి కార్యకర్తలపై కత్తులతో దాడిగణేష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలుపోలింగ్ కేంద్రాల వద్ద ఇరువర్గాల మధ్య చెలరేగిన గొడవ.. తాజా కొట్లాటకు దారి తీసిన వైనంగాయపడిన వారిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపుఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అర్ధరాత్రి టెన్షన్ వాతావరణంప్రభుత్వ ఆసుపత్రి వద్ద మళ్లీ దాడిరంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులుకొనసాగుతున్న పోలీస్‌ పహారా 8:25 AM, May 15th, 2024కడపలో అభ్యర్థులకు హైసెక్యూరిటీవైయస్సార్ జిల్లా జమ్మలమడుగులో కొనసాగుతున్న 144 సెక్షన్పట్టణంలో జనాలు ఎక్కువగా గుమికూడి ఉండకూడదంటూ పోలీసుల ఆదేశాలువైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే డాక్టర్ మూలే సుధీర్ రెడ్డితో పాటు కూటమి అభ్యర్ది ఆదినారాయణ రెడ్డి, కడప టిడిపి ఎంపీ అభ్యర్ది భూపేష్ రెడ్డి లకు 2+2 నుండి 4+4 భద్రత పెంపు 7:59 AM, May 15th, 2024ఏపీలో పోలింగ్‌ శాతం మొత్తంగా ఇలా.. ఏపీలో మొత్తంగా 81.69 శాతం పోలింగ్ నమోదు.ఈవీఎంల ద్వారా 80.59 శాతం పోలింగ్ నమోదు.పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1.10 శాతం నమోదు.అల్లూరి : 70.20అనకాపల్లి : 83.84అనంతపురం : 81.08అన్నమయ్య : 77.83బాపట్ల : 85.15చిత్తూరు : 87.09కోనసీమ : 83.84తూ.గో : 80.93ఏలూరు : 83.67గుంటూరు : 78.81కాకినాడ: 80.31కృష్ణా: 84.05కర్నూలు : 76.42నంద్యాల: 82.09ఎన్టీఆర్: 79.36పల్నాడు : 85.65పార్వతిపురం మన్యం : 77.10ప్రకాశం : 87.09నెల్లూరు : 79.63సత్యసాయి : 84.63శ్రీకాకుళం : 75.59తిరుపతి : 78.63విశాఖ : 68.63విజయనగరం : 81.33ప.గో : 82.59కడప : 79.58 7:45 AM, May 15th, 2024టీడీపీ నేతల దాడులు..పల్నాడు జిల్లామాచవరం గ్రామంలో వైఎస్సార్‌సీపీ నాయకులపై టీడీపీ గుండాలు దాడి.మాచవరం వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు చౌదరి సింగరయ్య పార్టీ నాయకుడు దారం లక్ష్మీ రెడ్డిపై టీడీపీ నాయకుల దాడి.ఇద్దరి కాళ్లు, చేతులపై దాడి. గాయపడిని వారిని స్థానిక ఆసుపత్రికి తరలింపు. 7:20 AM, May 15th, 2024శాంతి భద్రతలకు సహకరిస్తాం: కేతిరెడ్డి పెద్దారెడ్డిఅనంతపురం:ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కామెంట్స్‌..టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యాలను ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటాంతాడిపత్రిలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు సమన్వయంతో ఉండాలిశాంతి భద్రతల పరిరక్షణకు పూర్తి సహకారం అందిస్తాం. 7:00 AM, May 15th, 2024తాడిపత్రిలో ఉద్రిక్తతలు..అనంతపురం:తాడిపత్రిలో భారీగా పోలీసు బలగాల మోహరింపుతాడిపత్రిలో కర్రలు, రాళ్లతో బీభత్సం సృష్టించిన టీడీపీ నేతలుఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై రాళ్ల దాడికి పాల్పడిన జేసీ వర్గీయులుఅల్లరి మూకలను చెదరగొట్టిన పోలీసులుపోలీసుల విజ్ఞప్తితో తాడిపత్రి నుంచి బయటకు వెళ్లిన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితాడిపత్రిని వీడిన టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో పరిస్థితి ని అదుపులోకి తెచ్చిన పోలీసులునగరంలో 144 సెక్షన్ కొనసాగింపు 6:45 AM, May 15th, 2024డీజీపీకి హోంమంత్రి తానేటి వనిత ఫోన్ టీడీపీ దౌర్జన్యకారుల మీద చర్యలకు డిమాండ్ఏపీ డీజీపీ హరీష్ గుప్తాతో రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత ఫోన్లో మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా పలు చోట్ల తలెత్తిన హింసాత్మక ఘటనలను డీజీపీ దృష్టికి తీసుకెళ్లిన వనిత. చంద్రగిరి, గురజాల, తాడిపత్రి, గోపాలపురం తదితర నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తల హింసాకాండ ఎమ్మెల్యేలపై దాడులు చేస్తుంటే స్థానిక పోలీసులు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారని వనిత సీరియస్‌. దాడులకు పాల్పడ్డ నాయకులను, కార్యకర్తలను చట్టం ప్రకారం వెంటనే అరెస్టు చేయాలని ఆమె కోరారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో కచ్చితంగా తెలియజేయాలని డీజీపీని కోరారు. 6:30 AM, May 15th, 2024విశాఖ: రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్‌ గాలి బ్రహ్మాండంగా వీచింది: బొత్సఅన్ని ప్రాంతాల్లోని ఫ్యాన్‌ గాలి కనిపించిందిమహిళలు, పెద్ద ఎత్తున బారులు తీరి ఓటింగ్‌లో పాల్గొన్నారుతమకు గౌరవం పెరిగిందని వృద్దులు భావించి ఓటు వేశారు.ఎన్నికల్లో టీడీపీ ఎన్నో కుట్రలు, కుతంత్రాలు పన్నిందిప్రజలు సంక్షేమ పథకాలను అడ్డుకుంది.ల్యాండ్ టైటిల్ యాక్ట్‌పై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేశాయివైఎస్‌ .జగన్‌ గెలుస్తారు.. వైజాగ్‌లో ప్రమాణ స్వీకారం చేస్తారుఇచ్చిన హామీలను సీఎం జగన్‌ నెరవేర్చుతారుమాయ మాటలను ప్రలోభాలను ప్రజలు నమ్మలేదునేను రాజీనామా చేస్తున్నట్లు ఒక మాయ లేఖ సృష్టించిందిఈ లేఖ కూటమి దిగజారుడు రాజకీయాలకు ఒక పరాకాష్టమాయ మాటలతో అధికారంలోకి రావాలని చంద్రబాబు చూశారుచంద్రబాబు మాయ మాటలు ప్రజలు అందరికి తెలుసుమాట ఇస్తే మడమ తిప్పని నేతలు దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి, సీఎం జగన్సీఎం జగన్ మీద నమ్మకంతో మళ్ళీ ప్రజలు ఓట్లు వేశారుటీడీపీ నేతలు సహనం కోల్పోయారుమా నాయకులు, కార్యకర్తలు ఉద్రేకపడొద్దని సూచన చేశాంఎన్నికల్లో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు

AP Politics: After Election Day Violence Police Over Action in Tadipatri
ఎమ్మెల్యే ఇంట్లోకి చొరబడి.. తాడిపత్రిలో పోలీసుల ఓవరాక్షన్‌

అనంతపురం, సాక్షి: జిల్లాలో పోలింగ్‌ వేళ నుంచి పోలీసులు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారింది. తాజాగా.. తాడిపత్రి నియోజకవర్గంలో పోలీసులు ఓవరాక్షన్‌కు దిగారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లోకి చొరబడిన పోలీసులు వీరంగం సృష్టించారు.కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులు.. పని మనుషుల్ని బెదిరించారు. అంతేకాదు.. సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, ఫర్నీచర్‌ ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు హార్డ్‌ డిస్క్‌, సీపీయూలను పోలీసులు మాయం చేశారని ఎమ్మెల్యే వర్గీయులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఇంతటితో ఆగలేదు.తాడిపత్రివ్యాప్తంగా 30 మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామాలపై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులపై అక్రమ కేసులు పెడితే సహించేది లేదంటూ హెచ్చరించారాయన.ఏఎస్పీ రామకృష్ణ సహకారంతో టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి రౌడీయిజం చేస్తున్నారని, పోలీసుల తీరుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఎమ్మెల్యే పెద్దారెడ్డి చెబుతున్నారు. శాంతి భద్రతలకు సహకరించాలనే ఉద్దేశంతోనే తాము తాడిపత్రిని వీడి బయటకు వచ్చామని, అయితే పోలీసులు మాత్రం మరోలా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడుతున్నారు.

AP Elections 2024: TDP Attacks YSRCP Cadre May 15 News Updates
టీడీపీ రాక్షస మూకల రక్తదాహం

హైదరాబాద్‌, సాక్షి: పోలింగ్‌ ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా తెలుగు దేశం పార్టీ రాక్షస మూకల రక్తదాహం తీరలేదు. మంగళవారం రెండో రోజూ రాష్ట్రంలో అనేక చోట్ల తీవ్ర స్థాయిలో హింసాకాండకు, విధ్వంసానికి పాల్పడ్డారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులపై దాడులకు దిగారు. బుధవారం కూడా బీతావాహ వాతావరణం కొనసాగుతోంది. పల్నాడు, తాడిపత్రి లాంటి చోట్ల తెలుగు దేశం ముఖ్య నేతలను ముందుండి.. తమ శ్రేణులను, అరాచక మూకలను రెచ్చగొడుతూ దాడులు చేయించి, బీభత్సం సృష్టించారు. ఎన్నికల్లో తమకు ఓటేయలేదన్న కక్షతో.. దొరికినవారిని దొరికినట్లుగా తీవ్రంగా కొట్టారు. రక్తాలు కారేలా గాయపరిచారు. ఆస్తులు ధ్వంసం చేశారు.టీడీపీ మూకలు పేట్రేగిపోవడంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతో పాటు, స్థానిక ప్రజలూ భీతావహులయ్యారు. అంత విధ్వంసం జరుగుతుంటే... వారిని అడ్డుకోవడంలోనూ పోలీస్‌ యంత్రాంగం ఘోరంగా విఫలమైంది.పల్నాడుదాచేపల్లి మండలం మాదినపాడు లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు దాస్టికంకర్రలు ఇనుప రాడులతో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలపై దాడులుబత్తుల ఆదినారాయణ రెడ్డి అనే కార్యకర్తపై దాడి చేసిన తెలుగుదేశం నాయకులుతీవ్ర గాయాలు హాస్పిటల్ తరలింపుకాళ్లు చేతులు నరికేశారు!పల్నాడు మాచవరంలో టీడీపీ శ్రేణులు కత్తులతో విచక్షణా రహితంగా దాడులు చేశాయి. వైఎస్సార్‌సీపీ నేతలు సింగరయ్య, లక్ష్మీరెడ్డి కాళ్లు చేతులు నరికేశారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు.తాడిపత్రిలోనూ ఉద్రిక్తతలుతాడిపత్రి లో కర్రలు, రాళ్లతో బీభత్సం సృష్టించిన టీడీపీ నేతలు. జేసీ వర్గీయులు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. అల్లరి మూకలను చెదరగొట్టిన పోలీసులు.. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసుల విజ్ఞప్తి తో తాడిపత్రి నుంచి బయటకు వెళ్లిపోయారు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. మరోవైపు పోలీసుల ఆదేశాల మేరకు.. టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సైతం తాడిపత్రి వదిలి బయటకు వెళ్లారు. తాడిపత్రి లో 144 సెక్షన్ కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. జేసీ దౌర్జన్యాల్ని ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటాంతాడిపత్రి ఉద్రిక్తతలకు కారణమైన జేసీ ప్రభాకర్‌రెడ్డి కుటుంబంపై పెద్దారెడ్డి మండిపడ్డారు. జేసీ దౌర్జన్యాలను ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటామని, తాడిపత్రిలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు సంయమనం పాటించలని పిలుపు ఇచ్చారు. అలాగే.. నియోజకవర్గంలో శాంతి భద్రతల పరిరక్షణకు సహకరిస్తామని తెలిపారాయన.పల్నాడులో 144పోలింగ్‌ సందర్భంగా పల్నాడు జిల్లాలో చెలరేగిన హింసాత్మక సంఘటనలు కొనసాగుతుండడం.. విమర్శలు వెల్లువెత్తడంతో అధికార యంత్రాంగం కదిలింది. పల్నాడు వ్యాప్తంగా 144 సెక్షన్‌ అమలుకు ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు జిల్లా పాలనాధికారి శివశంకర్‌ పోలీసు శాఖకు ఉత్తర్వులిచ్చారు. నరసరావుపేట లోక్‌సభ స్థానంతో పాటు నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి, పెదకూరపాడు, గురజాల, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి తదుపరి ఆదేశాలు జారీచేసే వరకు 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని, ముగ్గురికి మించి ఎక్కువ మంది గుమికూడొద్దని, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని, అనుమానాస్పదంగా సంచరించకూడదని పోలీసు అధికారులు హెచ్చరించారు.

Facebook Instagram down for many users globally
ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా డౌన్‌.. యూజర్ల గగ్గోలు

ప్రముఖ సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లు ఫేస్‌బుక్‌ (Facebook), ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) స్తంభించాయి. అవుట్‌టేజ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ డౌన్‌డెటెక్టర్ ప్రకారం.. మెటా యాజమాన్యంలోని ఈ సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లు ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది యూజర్లకు పని చేయలేదు.ఇన్‌స్టాగ్రామ్‌ను యాక్సెస్ చేస్తున్నప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు యూజర్ల నుంచి 18,000 కంటే ఎక్కువ ఫిర్యాదులు వచ్చినట్లు డౌన్‌డెటెక్టర్ డేటా చెబుతోంది. వీరిలో 59 శాతం మంది యాప్‌ని యాక్సెస్ చేస్తున్నప్పుడు సమస్యలను ఎదుర్కొన్నారు. 34 శాతం మంది సర్వర్ కనెక్షన్ సమస్యలు, 7 శాతం మంది లాగిన్ చేయడంలో సమస్యలు ఎదుర్కొన్నారు.యూజర్లతోపాటు ఇతర మూలాల ద్వారా పరిస్థితిని తెలుసుకుని డౌన్‌డెటెక్టర్ అంతరాయాలను ట్రాక్ చేస్తుంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ సేవల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కొంతమంది యూజర్లు ‘ఎక్స్‌’ (ట్విటర్‌)లో అసహనం వ్యక్తం చేశారు. ఇంటర్నెట్ మానిటరింగ్ గ్రూప్ నెట్‌బ్లాక్స్ రెండు సామాజిక వెబ్‌సైట్‌లు (ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌) ప్రస్తుతం 'అంతర్జాతీయ అంతరాయాలను' ఎదుర్కొంటున్నాయని ఒక పోస్ట్‌లో పేర్కొంది.

Ntr Donated 12 Lakhs To Andhra Pradesh Jaggannapeta Temple
ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం

జూ.ఎన్టీఆర్ మరోసారి వార్తల్లో నిలిచాడు. మొన్నీమధ్యే ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్‌లో తారక్ ఓటు వేశాడు. అయితే అతడు వేసుకున్న చొక్కా రంగు గురించి సోషల్ మీడియాలో ఓ రేంజ్ డిస్కషన్ నడిచింది. దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు మాత్రం ఎన్టీఆర్ తన గొప్ప మనసు చాటుకుని వార్తల్లోకెక్కాడు. ఇప్పుడు ఈ విషయం వైరల్ అవుతోంది. ఇంతకీ తారక్ చేసిందేంటి?(ఇదీ చదవండి: నో రెమ్యునరేషన్.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన ప్రభాస్?)చిన్న సాయం చేసినా సరే గొప్పగా చెప్పుకునే రోజులివి. అలాంటిది ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలోని జగ్నన్నపేట ఊరిలో వీరభద్ర స్వామి ఆలయానికి ఎన్టీఆర్ కుటుంబం రూ.12.5 లక్షలు విరాళం ఇచ్చింది. కానీ ఈ విషయం పెద్దగా బయటకు రాలేదు. తాజాగా కొందరు నెటిజన్లు శిలా ఫలకానికి సంబంధించిన ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తారక్ ఉదారత నలుగురికి తెలిసింది.ఇక సినిమాల విషయానికొస్తే.. 'ఆర్ఆర్ఆర్' తర్వాత 'దేవర' చేస్తున్నాడు. అక్టోబరులో పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. ఈ నెల 20న తారక్ బర్త్ డే సందర్భంగా తొలి లిరికల్ సాంగ్ రాబోతుందని సమాచారం. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్.(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'దసరా' నటుడి హిట్ సినిమా)NTR @tarak9999 Anna Family Donated 12.5 Lakhs For Temple 👌👌❤️❤️.Mogalikuduru, Jaggannapeta, East Godavari. #JrNTR pic.twitter.com/MKs0dCg6ZV— Sai Mohan 'NTR' (@Sai_Mohan_999) May 14, 2024

Dont Think He Has Achieved Anything In IPL Gambhir Blasts RCB Great Support Hardik
అతడి కంటే చెత్త కెప్టెన్‌ ఎవరూ లేరు.. పైగా హార్దిక్‌ను అంటారా?

ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా విమర్శకులకు టీమిండియా మాజీ క్రికెటర్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మెంటార్‌ గౌతం గంభీర్‌ గట్టి కౌంటర్‌ ఇచ్చాడు. పాండ్యా కెప్టెన్సీని తప్పుబట్టిన ఇంగ్లండ్‌ స్టార్‌ కెవిన్‌ పీటర్సన్‌, సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.కాగా ఐపీఎల్‌-2024 నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌ గూటికి చేరుకున్న హార్దిక్‌ పాండ్యా రోహిత్‌ శర్మ స్థానంలో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. అయితే, ఆల్‌రౌండర్‌గా, సారథిగా అతడు పూర్తిగా నిరాశపరిచాడు.విమర్శల జల్లుగతేడాది రోహిత్‌ కెప్టెన్సీలో ప్లే ఆఫ్స్‌ చేరిన ముంబై.. ఈసారి పాండ్యా నాయకత్వంలో టాప్‌-4 నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది. అందుబాటులో ఉన్న ఆటగాళ్ల సేవలను సరైన విధంగా ఉపయోగించుకోకపోవడం వల్లే ముంబైకి ఈ దుస్థితి ఎదురైందని విమర్శలు వెల్లువెత్తాయి.హార్దిక్‌ పాండ్యా అతి విశ్వాసం వల్లే ప్రతికూల ఫలితాలు వచ్చాయంటూ విశ్లేషకులు పెదవి విరిచారు. ఈ నేపథ్యంలో కెవిన్‌ పీటర్సన్‌, ఏబీ డివిలియర్స్‌ కూడా పాండ్యాను విమర్శించారు.వాళ్లు పెద్దగా పొడిచిందేమీ లేదుఈ నేపథ్యంలో తాజాగా గౌతం గంభీర్‌ స్పందిస్తూ.. వీళ్లిద్దరికీ కౌంటర్‌ ఇస్తూ హార్దిక్‌ పాండ్యాకు మద్దతునిచ్చాడు. ‘‘వాళ్లు కెప్టెన్‌గా ఉన్నపుడు ఏం సాధించారు? నాకు తెలిసి నాయకులుగా వాళ్లు పెద్దగా పొడిచిందేమీ లేదు.వాళ్ల రికార్డులు పరిశీలిస్తే మరే ఇతర కెప్టెన్‌కు కూడా అంతటి చెత్త రికార్డులు ఉండవు. ఇక ఏబీడీ ఐపీఎల్‌లో ఒక్క మ్యాచ్‌కైనా సారథ్యం వహించాడా?వ్యక్తిగత స్కోర్లు సాధించాడే గానీ.. జట్టు కోసం అతడి చేసిందేమీ లేదు. తను ఐపీఎల్‌ విన్నింగ్‌ కెప్టెన్‌ఇక హార్దిక్‌ పాండ్యా.. ఇప్పటికే తను ఐపీఎల్‌ విన్నింగ్‌ కెప్టెన్‌. కాబట్టి ఇలాంటి వాళ్లతో అతడికి పోలిక కూడా అవసరం లేదు’’ అంటూ గంభీర్‌ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.కాగా పీటర్సన్‌, ఏబీ డివిలియర్స్‌ గతంలో రాయల్‌ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించారు.‌ పీటర్సన్‌ 2009లో ఆరు మ్యాచ్‌లలో ఆర్సీబీ కెప్టెన్‌గా వ్యవహరించి కేవలం రెండు విజయాలు అందుకున్నాడు.సారథిగా పీటర్సన్‌ విఫలంఇక 2014లో ఢిల్లీ ఫ్రాంఛైజీ సారథిగా బాధ్యతలు చేపట్టిన పీటర్సన్‌ కెప్టెన్సీలో జట్టు కేవలం రెండు విజయాలు సాధించి.. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. మరోవైపు.. గుజరాత్‌ టైటాన్స్‌ను 2022లో విజేతగా నిలపడంతో పాటు గతేడాది రన్నరప్‌గా నిలిపిన ఘనత హార్దిక్‌ పాండ్యా సొంతం. ఈ నేపథ్యంలో గంభీర్‌ స్పోర్ట్స్‌కీడాతో మాట్లాడుతూ.. ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.చదవండి: Virat Kohli: అదే జరిగితే.. ఆర్సీబీ కెప్టెన్‌గా మ‌ళ్లీ కోహ్లినే!

poll percentage increased AP elections 2024 winning chances To ysrcp
పోటెత్తిన ఏపీ ఓటర్లు.. అప్పట్లో ఏం జరిగిందంటే..!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఒక ట్వీట్ చేస్తూ తన విజయాన్ని ధృవీకరించుకున్నారు. సునామీలా తరలివచ్చిన నా అవ్వతాతలకు, అక్కచెల్లెమ్మలకు అంటూ వివిధ వర్గాలను ప్రస్తావిస్తూ ‘ఎక్స్’ లో ట్వీట్ చేశారు. ఆ కామెంట్ చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ మళ్లీ ఏపీ శాసనసభ ఎన్నికలలో గెలవబోతున్నదన్న స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఇప్పటివరకు సాగిన సుపరిపాలన మరింత మెరుగ్గా సాగుతుందని ఆయన పేర్కొన్నారు. ఓట్ల పోలింగ్ పెరగడాన్ని ఆయన పాజిటివ్ ఓటింగ్‌గా భావిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లు కూడా తమ కూటమి ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీరి దృష్టిలో పెరిగిన ఓట్ల శాతం ప్రభుత్వంపై ఉండే వ్యతిరేకత. ఓట్ల శాతం పెరిగినంతమాత్రాన అది పాజిటివ్ అనో, నెగిటివ్ అనో నిర్ధారించవచ్చా? గతంలో జరిగిన ఎన్నికలలో పోలైన ఓట్ల శాతాలను పరిశీలిస్తే పలు ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. వాటిని కూడా పరిశీలిద్దాం.ఏపీలో సుమారు ఎనభై ఒక్క శాతం వరకు ఓట్ల పోలింగ్ నమోదు అయింది. ఇంత పెద్ద ఎత్తున ఓట్లు పోలైతే ఎవరికి అడ్వాంటేజ్ అన్నదానిపైనే అందరి ఆలోచన. ప్రతిపక్ష తెలుగుదేశం కూటమివారు ఇందుకు ఒక భాష్యాన్ని చెబుతూ, ప్రజలలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత వల్లే ఇంత పెద్ద ఎత్తున ప్రజలు ఓట్లు వేయడానికి తరలివచ్చారని ప్రచారం చేసుకుంటున్నారు.మహిళలు, వృద్దులు ఉదయానే వచ్చి ఓట్లు వేయడంపై స్పందిస్తూ, మద్య నిషేధం చేయలేదన్న అసంతృప్తితో వారు అలా వచ్చారని చెప్పేవరకు వెళ్లారు. మిగిలిన 99 శాతం హామీలు అమలు చేయడన్ని విస్మరించి ఈ ఒక్క కారణంకోసం వ్యతిరేకత వచ్చిందంటే అది హాస్యాస్పదం.నిజంగానే ప్రభుత్వ వ్యతిరేక ఎక్కువగా ఉంటేనే పోలింగ్ అదికంగా జరుగుతుందా అన్నది ప్రశ్న! కొన్నిసార్లు అది వాస్తవం కావచ్చు. మరికొన్నిసార్లు అది నిజంకాదు అని చెసప్పడానికి అనేక దృష్టాంతాలు ఉన్నాయి. 1967లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత పార్టీలో సిండికేట్ నాయకుల నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కున్నారు. ఆమె చేయదలచుకున్న బ్యాంకుల నేషనలైజేషన్ , రాజభరణాల రద్దు వంటి వివిధ సంస్కరణలను సిండికేట్ నేతలు వ్యతిరేకించారు. ఆ నేపధ్యంలో రాష్ట్రపతి ఎన్నికలలో అధికారిక కాంగ్రెస్ అభ్యర్ధి నీలం సంజీవరెడ్డిని వ్యతిరేకించి, తిరుగుబాటు అభ్యర్ధి వి.వి.గిరిని బలపరిచారు. దాంతో పార్టీ కూడా కొత్త కాంగ్రెస్, పాత కాంగ్రెస్ గా చీలిపోయింది. 1971లో ఆమె పార్లమెంటు ఎన్నికలకు వెళ్లినప్పుడు గరీబీ హటావో నినాదం ఇచ్చారు. అప్పుడు విపరీతమైన స్పందన ఆమెకు లభించింది. అప్పుడు ప్రజలలో సానుకూల ఓటింగ్ పడింది. 1967లో 61 శాతం ఓట్లు పోలైనా కాంగ్రెస్ పార్టీకి 283 సీట్లు మాత్రమే వచ్చాయి. పార్టీ చీలికతో ఇందిరాగాంధీ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. అయినా ఆమె డి.ఎమ్.కె.,వామపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నారు. 1971లో ఎన్నికలకు వెళ్లినప్పుడు 55 శాతం ఓట్లే పోలైనప్పటికీ, ఇందిరాగాంధీ ఆద్వర్యంలోని కొత్త కాంగ్రెస్‌కు 352 సీట్లు రావడం విశేషం. అలాగే 1967 కాంగ్రెస్‌కు 40 శాతం ఓట్లు వస్తే, 1972లో ఇందిరాగాంధికి 43 శాతం ఓట్లు లబించాయి. అంటే ఓట్ల శాతం తగ్గినా, పెరిగినా, ఆనాటి రాజకీయ పరిస్థితులు, పరిణామాలు, నాయకత్వం వీటన్నిటి ఆదారంగా గెలుపు, ఓటములు ఉంటాయని తేలుతుంది.ఇక ఆంధ్ర ప్రదేశ్ విషయం చూద్దాం. 1982 లో టీడీపీ ఆవిర్బావం తర్వాత రెండు పార్టీల వ్యవస్థ వేళ్ళూనుకుంది. 1983 లో జరిగిన ఎన్నికలలో 67.70 శాతం ఓట్లు పోల్ కాగా, కొత్తగా ఆవిర్భవించిన టిడిపి అధికారంలోకి వచ్చింది. అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.ఆర్. 1985లో శాసనసభను రద్దు చేసి మద్యంతర ఎన్నికలకు వెళ్లారు. అప్పుడు కూడా దాదాపు ఇదే శాతం ఓట్లు పోలయ్యాయి.ఆ ఎన్నికలలో 67.60 శాతం ఓట్లు పోల్ కాగా టిడిపి మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఎన్.టి.ఆర్.ప్రభుత్వాన్ని పడగొట్టడానికి 1984లో జరిగిన ప్రయత్నాల కారణంగా ఆయనకు సానుభూతి వచ్చి మళ్లీ గెలిచారు. 1989 లో జరిగిన ఎన్నికలలో టీడీపీ ఓటమిపాలైంది. ఆ ఎన్నికలలో 70.40 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ కొంత ప్రభుత్వ వ్యతిరేకత ప్రస్పుటించిందనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ కి 181 సీట్లు, టీడీపీకి 74 సీట్లు వచ్చాయి. 1994లో జరిగిన ఎన్నికలలో పోలైన ఓట్ల శాతం పెద్దగా పెరగలేదు. ఆ ఎన్నికలలో కేవలం 0.60 శాతం పోలింగ్ పెరిగింది. అయినా టిడిపికి 216 సీట్లు, మిత్రపక్షాలకు మరో 34 సీట్లు వచ్చాయి. దీనిని ఏ విధంగా అర్దం చేసుకోవచ్చు. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, టీడీపీ వామపక్షాల కూటమిని ప్రజలు ఆదరించారు. ఆనాడు ఎన్.టి.ఆర్.ఇచ్చిన రెండు రూపాయలకే కిలో బియ్యం, మద్య నిషేధం వంటి హామీలు బాగా పనిచేశాయి. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ కు కేవలం 26 సీట్లే వచ్చాయి. తదుపరి 1995లో ఎన్.టి.ఆర్.ప్రభుత్వాన్ని కూలదోసి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు . ఆ తర్వాత 1999 ఎన్నికలలో సుమారు రెండు శాతం పోలింగ్ తగ్గినా టిడిపి 180 సీట్లతో అధికారంలోకి రాగా, కాంగ్రెస్ కు 91 సీట్లు వచ్చాయి. చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక్కడ టీడీపీ వ్యూహాత్మకంగా బిజెపితో పొత్తు పెట్టుకోవడం కలిసి వచ్చింది. అంతే తప్ప అది ప్రభుత్వానికి పూర్తి సానుకూల ఓటు కాదని చెప్పవచ్చు. కాంగ్రెస్ అంతకుముందున్న 26 సీట్లనుంచి 91 సీట్లకు పెరగడమే నిదర్శనం. 2004 శాసనసభ ఎన్నికలలో గతంలో కన్నా పోలింగ్ పెద్దగా పెరగలేదు. 69.8 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. అంటే కేవలం 0.7 శాతం పోలింగ్ పెరిగిందన్నమాట. కాని ఈసారి కాంగ్రెస్ 185 సీట్లతో అధికారంలోకి రాగా, మిత్ర పక్షమైన టిఆర్ఎస్ కు 26 సీట్లు, వామపక్షాలకు 15 సీట్లు లబించాయి. టీడీపీకి కేవలం 47 సీట్లే వచ్చాయి. పోలింగ్ శాతం పెద్దగా పెరగకపోయినా టిడిపి ఎందుకు అంత తక్కువ సీట్లకు పడిపోయిందన్నది పరిశీలిస్తే, దానికి కారణం ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు కాంగ్రెస్,టిఆర్ఎస్,వామపక్షాలు పొత్తు పెట్టుకోవడమే అని చెప్పవచ్చు.వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర,రైతులకు ఉచిత విద్యుత్ వంటివి ఉపకరించాయి.2009 నాటి అనుభవం మరింత ఆసక్తికరమైంది.ఆ ఎన్నికలలో కొత్తగా వచ్చిన ప్రజారాజ్యం, లోక్ సత్తా వంటి పార్టీలు స్వతంత్రంగా పోటటీచేశాయి. టీడీపీ, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం లు మహాకూటమిగా ఏర్పడి అధికారంలో ఉన్న కాంగ్రెస్ తో తలపడ్డాయి. ఈ ఎన్నికలలో ఓట్ల శాతం 72,70 శాతంగా ఉంది. అంటే అంతకు ముందు ఉన్న పోలింగ్ శాతం కన్నా మూడు శాతం పెరిగిందన్నమమాట. అయినా వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 156 సీట్లను సాధించింది. తెలుగుదేశంకు 92, టీఆర్ఎస్‌కు పది, వామపక్షాలకు ఆరు సీట్లు వచ్చాయి. ప్రజారాజ్యం కు 18 సీట్లు రాగా, లోక్ సత్తా ఒక సీటుకే పరిమితం అయింది. ఓట్ల శాతం పెరిగితే అది ప్రభుత్వ వ్యతిరేకత అని వాదించేవారికి ఇది సమాధానం అవుతుంది. ఓట్ల శాతం పెరిగినా అది పాజిటివ్ ఓటు కావచ్చనడానికి ఈ ఫలితం ఒక ఉదాహరణ అవుతుంది. అయితే ఇది పూర్తి పాజిటివ్ ఓటా అంటే ఔనని చెప్పలేం. ఎందుకంటే ఇక్కడ టీడీపీ 47 నుంచి 92 కి పెరిగింది. కాని ప్రజారాజ్యం, లోక్ సత్తా వంటి పార్టీల వల్ల కాంగ్రెస్, టీడీపీలు కొంత నష్టపోయాయి. నాలుగు పార్టీలు కూటమి కట్టాయి. అయినా దానిని తట్టుకుని కాంగ్రెస్ కొంత పాజిటివ్ ఓటు సాదించడం వల్ల బయటపడిందని చెప్పాలి. 2014 లో విభజిత ఏపీలో 76.80 శాతం ఓట్ల పోలింగ్ జరిగింది. అప్పటికి కాంగ్రెస్ పూర్తిగా ప్రజా మద్దతు కోల్పోవడం టీడీపీకి కలిసి వచ్చింది. గతంతో పోల్చితే నాలుగు శాతం ఓట్లు పెరిగినా, టీడీపీ, బిజెపి కూటమికి 106 సీట్లే వచ్చాయి. ప్రతిపక్షంగా వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు 67 సీట్లు దక్కాయి. టీడీపీకి పాజిటివ్ ఓటు అయి ఉంటే ప్రతిపక్షానికి ఈ స్థాయిలో సీట్లు రావడానికి తక్కువ ఆస్కారం ఉంటుంది. నరేంద్ర మోదీ ప్రదాని అభ్యర్ధిగా రావడం, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని పెట్టి కాపు వర్గాన్ని ఆకర్షించడం, చంద్రబాబు రైతుల రుణమాఫీ వంటి ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడం వంటి వాటివల్ల అధికారంలోకి రాగలిగారు. వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ అప్పట్లో రుణమాఫీ హామీ ఇచ్చినా, కొందరు కీలక నేతలుపార్టీలో చేరడానికి వచ్చినప్పుడు అంగీకరించినా, ఆయనకే ప్రజలు పట్టం కట్టేవారన్న అభిప్రాయం కూడా ఉంది. 2019 ఎన్నికలలో 79.80 శాతంం ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికలలో చంద్రబాబు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత చాలా స్పష్టంగా కనిపించింది. అదే టైమ్‌లో జగన్ ఇచ్చిన హామీలు కూడా పనిచేశాయని చెప్పవచ్చు. అందువల్లే వైఎస్సార్‌సీపీకి 151 సీట్లు, టీడీపీకి కేవలం 23 సీట్లు వచ్చాయి. 2024 శాసనసభ ఎన్నికలలో గతంలో కన్నా సుమారు రెండు శాతం పెరిగినట్లు లెక్కలు గడుతున్నారు. దీనివల్ల వైఎస్సార్‌సీపీకి నష్టం అని టీడీపీ కూటమి మద్దతుదారులు వాదిస్తున్నా, ఓట్ల పోలింగ్ శాతం పెరిగినంతమాత్రాన అన్నిసార్లు అది ప్రభుత్వ వ్యతిరేకత అని అనుకోనవసరం లేదనడానికి పైన ఇచ్చిన గణాంకాలు తెలుపుతాయి. పైగా ప్రభుత్వంపై సానుకూలత ఉన్నప్పుడు కూడా ఓట్ల శాతం పెరగవచ్చు. ప్రస్తుత ప్రభుత్వం కనుక గెలవకపోతే పేదవర్గాలకు నష్టం కలుగుతుందన్న భావన బాగా ప్రబలితే కూడా ఓట్ల శాతం పెరుగుతుంది. అయితే ప్రభుత్వం మీద అసలు వ్యతిరేకత ఉండదని ఎవరూ చెప్పరు. కాని దానికన్నా ప్రభుత్వంపై సానుకూలత ఎక్కువగా ఉందనడానికి పలు ఆధారాలు కనిపిస్తాయి. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని పేదవర్గాలు అధికంగా ఓటింగ్‌లో పాల్గొన్నట్లు కనిపిస్తుంది. అలాగే మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. టీడీపీకి పట్టణ ప్రాంతాలలో కొంత అనుకూలత ఉన్నా, అక్కడ కూడా ఉండే పేద వర్గాలు సీఎం జగన్ వైపే మొగ్గుచూపుతాయి. దానికితోడు ఎస్సి, బిసి, ఎస్టి, మైనార్టీ, రెడ్డి వర్గాలు బలంగా ఉంటే వైఎస్సార్‌సీపీ ఓడించడం కూటమికి సాధ్యం కాదనిపిస్తుంది. 2019లో ఏ సామాజిక సమీకరణలు ఉన్నాయో,దాదాపు అవే ఇప్పటికే కొనసాగుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన ద్వారా కాపు వర్గాన్ని కొంత ఆకర్షించినా, అధికారంలోకి రావడానికి అది సరిపోదనిపిస్తుంది. జగన్ పేదలు vs పెత్తందార్ల స్లోగన్ బాగా పనిచేసినట్లు కనిపిస్తుంది. అది కరెక్టు అయితే సీఎం జగన్‌కు వేవ్ వచ్చినా ఆశ్చర్యపడనవసరం లేదు. ఒకవేళ వేవ్ రాకపోయినా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి జగన్‌కు డోకా ఉండదన్న అభిప్రాయం ఏర్పడుతోంది. స్థూలంగా చెప్పాలంటే ఆయా ఎన్నికలలో అప్పటి పరిస్థితులు, రాజకీయ పరిణామాలు, వాగ్దానాలు, సామాజిక సమీకరణలు, నాయకత్వంపై విశ్వాసం మొదలైన అంశాలు కూడా ప్రభావితం చేస్తాయి. ఇవి ఈ ఎన్నికలలో సీఎం జగన్‌కు ఎక్కువగా అనుకూలంగా ఉండడం వల్లే ఆయన మళ్లీ ముఖ్యమంత్రి అవుతారన్న భావన బలీయంగా ప్రజలలో నెలకొంది. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

BJP Full Focus On MLC By Election In Telangana
ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌.. మరో కొత్త ప్లాన్‌!

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోపు ఉప ఎన్నికకు రంగం సిద్థమైంది. పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలను ప్రధాన పార్టీలు సీరియస్‌గా తీసుకుంటున్నాయి. ఇక, బీజేపీ కూడా ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్‌ పెట్టింది. ఈ క్రమంలో అసెంబ్లీ నియోజకవ‍ర్గాలవారీగా ఇన్‌చార్జ్‌లను నియమించనున్నట్టు తెలుస్తోంది. కాగా, తెలంగాణలో వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీజేపీ పూర్తి స్థాయిలో ఫోకస్‌ పెట్టింది. ఈ క్రమంలో అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా ఇన్‌చార్జ్‌ల నియామకం చేపట్టనున్నారు. ఇక, ఇన్‌చార్జ్‌లను నియమించే బాధ్యతను రాష్ట్ర నేతలకు అప్పగించింది బీజేపీ హైకమాండ్‌. దీంతో, ఇన్‌చార్జ్‌లు ఎవరు అనే అంశంపై చర్చ జరుగుతున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా ప్రేమందర్‌ రెడ్డి బరిలో ఉన్నారు. ఇక, కాంగ్రెస్‌ నుంచి తీన్మార్‌ మల్లన్న, బీఆర్‌ఎస్‌ నుంచి ఏనుగుల రాకేష్‌ రెడ్డి పోటీలో నిలిచారు. ఇక, ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. రాష్ట్రంలో ఎంపీ ఎన్నికలు ముగియడంతో ప్రధాన పార్టీలు ఎమ్మెల్సీ ఉపఎన్నికపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవీ కాలం 2027 మార్చి వరకు ఉంది. మరోవైపు.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 52 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు 63 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేయగా, 11 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారం ముగియడంతో 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

Supreme Court Orders Release Of NewsClick Founder Details
NewsClick Row: ప్రబీర్‌ తక్షణ రిలీజ్‌కు సుప్రీం కోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: న్యూస్‌క్లిక్‌ పోర్టల్‌ వ్యవస్థాపకుడు ప్రబీర్‌ పుర్కాయస్థ అరెస్ట్‌ చెల్లదని, ఆయన్ని తక్షణమే విడుదల చేయాలని సుప్రీం కోర్టు బుధవారం ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. ఈ న్యూస్‌ పోర్టల్‌కు విదేశీ నిధులు అందుతున్నాయంటూ.. ఉగ్రవాద నిరోధక చట్టం కింద కిందటి ఏడాది అక్టోబర్‌లో పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే.. అరెస్టుకు సరైన కారణాలు చెబుతూ రిమాండ్‌ కాపీని సమర్పించడంలో ఢిల్లీ పోలీసులు విఫలమయ్యారు. దీంతో.. రిమాండ్‌ కాపీ తమకు అందకపోవడంతో ఈ అరెస్ట్‌ చెల్లదని, వెంటనే ఆయన్ని రిలీజ్‌ చేయాలని జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతాలతో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా పంకజ్‌ బన్సాల్‌ కేసును కోర్టు ప్రస్తావించింది. అరెస్టుకు గల కారణాలేంటో నిందితులకు కూడా రాతపూర్వకంగా పోలీసులు తెలియజేయాల్సి ఉంటుందని పంకజ్‌ బన్సాల్‌ కేసులో సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఇప్పుడు ఈ కేసులోనూ అదే వర్తిస్తుంది అని బెంచ్‌ స్పష్టం చేసింది. చైనా అనుకూల ప్రచారానికి నిధులు అందుకున్నారనే ఆరోపణలు రావడంతో ఉపా చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. అక్టోబర్‌ 3వ తేదీన న్యూస్‌క్లిక్‌పోర్టల్‌లో పని చేసే జర్నలిస్టుల ఇళ్లలో సోదాలు చేశారు. డిజిటల్‌ పరికరాలు, పలు డాక్యుమెంట్లను సీజ్‌ చేశారు. అదే రోజు ప్రబీర్‌ పుర్కాయస్థతో పాటు ఆ సంస్థ హెచ్‌ఆర్‌ హెడ్‌ అమిత్ చక్రవర్తిని అరెస్టు చేసినట్టు ఢిల్లీ పోలీస్‌ అధికార ప్రతినిధి సుమన్‌ నల్వా వెల్లడించారు. ‘న్యూస్‌క్లిక్‌’ సంస్థకు చైనా నుంచి నిధులు అందుతున్నాయంటూ గత ఏడాది ఆగస్టులో ‘న్యూయార్క్‌ టైమ్స్’లో కథనం ప్రచురితమైంది. చైనా ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే అమెరికా మిలియనీర్‌ నెవిల్‌ రాయ్‌సింగం నుంచి గ్లోబల్‌ నెట్‌వర్క్‌లో భాగంగా ఉన్న న్యూస్‌క్లిక్‌ నిధులు పొందినట్టు ఆ కథనంలో పేర్కొంది. దీంతో చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA)లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు దిల్లీ పోలీసులు.ఈ క్రమంలోనే న్యూస్‌క్లిక్‌ ఆఫీస్‌తో పాటు ఆ సంస్థలో పనిచేసే జర్నలిస్టుల ఇళ్లు సహా మొత్తం 30 చోట్ల సోదాలు జరిపి ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. పోలీసుల తీరుపై ప్రెస్‌క్లబ్‌ ఆఫ్‌ ఇండియా తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ఇంకోవైపు.. ‘న్యూస్‌క్లిక్‌’పై దాడులను విపక్ష కూటమి ‘ఇండియా’ నేతలు తీవ్రంగా ఖండించారు. వాస్తవాలు మాట్లాడేవారి గళాన్ని అణచివేసేందుకే కేంద్రం సోదాలు చేపట్టిందని విమర్శించారు. బిహార్‌లో కులగణనలో బయటపడిన విషయాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కేంద్రం న్యూస్‌క్లిక్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిందని విపక్షాలు ఆ సమయంలో మండిపడ్డాయి.

తనిష్క్ జ్యువెలరీ నెక్లెస్‌
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్

ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన, భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్‌ల నుండి ప్రేరణ పొంది అద్భుతమైన మరియు వైవిధ్యమైన శ్రేణి సమకాలీన, రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్‌లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్‌లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్‌లు, కస్టమర్‌లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా, ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్‌ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్‌ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్, ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్‌లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్‌గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్‌లెట్‌లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్‌లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్‌లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్‌డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్‌లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్ 18కేరట్ మరియు 22కేరట్ బంగారంలో విస్తృతమైన శ్రేణి డిజైన్‌లతో, నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని సంపూర్ణం చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్‌లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్‌లెట్‌లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement