Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

TDP attacks on YSRCP workers
దాడులపై పోలీసులు ప్రేక్షక పాత్ర

మచిలీపట్నం టౌన్‌: కృష్ణా జిల్లాలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ, జనసేన కార్యకర్తలు చేస్తున్న దాడులను నియంత్రించకుండా ప్రేక్షక పాత్ర పోషిస్తున్న పోలీసులపై హైకోర్టులో ప్రైవేటు కేసులు వేస్తామని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), మాజీ మంత్రి కొడాలి శ్రీవేంకటేశ్వరరావు (నాని) వెల్లడించారు. శనివారం వారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. పేర్ని నాని మాట్లా­డుతూ ఓట్ల లెక్కింపు రోజు నుంచి జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ, జనసేన రౌడీ మూకలు ఉద్దేశ పూర్వకంగా, అధికార మదంతో మారణహోమం సాగిస్తున్నా, విధ్వంసం సృష్టిస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నార­న్నారు. చంద్రబాబునాయుడు, జిల్లాలో గెలుపొందిన ఎమ్మెల్యేలు.. వారి కార్యకర్తలు చేస్తున్న దాడు­లపై ప్రేక్షకపాత్ర వహించేలా పోలీసులకు ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. ఆ ఆదేశాలను పోలీసులు తూ­చా తప్పకుండా పాటిస్తుండటం విచారకరం అన్నారు. గతంలో బీహార్, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఉన్న పరిస్థి­తిని చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌లు ఆంధ్రప్రదేశ్‌లోనూ తీసుకొచ్చారని విమర్శించారు. రౌడీ­షీటర్లు స్థానికంగా ఉన్న డీఎస్పీ, సీఐ, ఎస్సైలను ఏరా.. ఉద్యోగం చేయాలని లేదా.. నువ్వు ఇక్కడే ఉంటావా.. లేక వీఆర్‌కు వెళతావా.. అని మాట్లాడు­తున్నా పోలీసులు మిన్నకుండి పోవడం విచారకరం అన్నారు. ఈ ఘటనలకు సంబంధించిన వీడియో­లతో కోర్టుకు వెళతామని స్పష్టం చేశారు. కళ్లెదుటే దాడులు.. అచేతనంగా పోలీసులు‘బందరు గొడుగుపేటలోని ఎంకులు బంకులు ఎదురుగా ఉన్న సందులో ఒక యాదవ కుటుంబం ఇంట్లో సామగ్రి, టీవీని ధ్వంసం చేస్తే, కేసు పెట్టినా ఇనుగుదురుపేట పోలీసులు పట్టించుకోలేదు. బాధి­తు­లను వైఎస్సార్‌సీపీ నాయకులు పరామర్శించి సామగ్రి కొనుగోలుకు ఆర్థిక సాయం చేస్తే మళ్లీ సామగ్రి కొంటే ఇలాగే ధ్వంసం చేస్తామని టీడీపీ నాయకులు, కార్యకర్తలు హెచ్చరిస్తున్నా పోలీసులు పట్టించుకోకపోవడం దారుణం. స్థానిక చిలకలపూడి గోడౌన్స్‌ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్‌ కాలనీలో కూలీ పనులు చేసుకునే భార్యాభర్తలు వైఎస్సార్‌సీపీకి పని చేశారనే కారణంతో వారి ఇంటిపై దాడి చేసి సామగ్రి ధ్వంసం చేశారు. అడ్డుపడిన వీరిద్దరినీ తీవ్రంగా గాయపరిచారు. ఆ దంపతులను ఆసు­పత్రిలో చేర్చుకోకుండా అడ్డుకున్నారు. వైఎస్సార్‌­సీపీ కార్పొరేటర్లు వారిని ఆసుపత్రిలో చేర్చారు. ఆ సమయంలో 25కు పైగా కేసులు ఉన్న రౌడీషీటర్‌ నవీన్‌.. ఆసుపత్రికి వెళ్లి నెలల పిల్లాడిని ఎత్తుకున్న ఆ మహిళను అసభ్య పదజాలంతో దూషించాడు. ఇదంతా పోలీసుల కళ్లెదుటే జరిగింది. అయినా రౌడీ షీటర్‌పై కేసు పెట్టకపోగా, బాధితులపైనే ఎదురు కేసు పెట్టారు. మర్డర్‌ కేసు ముద్దాయిలు, రౌడీలే డీఎస్పీలు, సీఐలుగా భావించేలా చంద్రబాబు తయారు చేశారు. మహేష్‌ అనే వ్యక్తి విచ్చలవిడిగా బరితెగించి కుర్చీలతో ఎస్‌ఐ పైనే దాడి చేశాడు. కార్లు ధ్వంసం చేశాడు. అయినా ఇంత వరకు కేసు నమోదు చేయలేదు. ఇంత జరు­గుతున్నా జిల్లా ఎస్పీ స్పందించకపోవటం విచారక­రం. మాజీ ఎమ్మెల్యేలు అందరం ఎస్పీని కలిసి విన్నవించాలని నిర్ణయం తీసుకున్నాం. విజయవాడ నుంచి బయలుదేరిన వల్లభనేని వంశీ, కైలే అనిల్‌­కుమార్‌లను పోలీసులు రానివ్వకుండా నిర్బంధించారు. రేపో, ఎల్లుండో డీజీపీ, ఎస్పీలను కలిసి దాడుల ఘటనలపై ఆధారాలతో ఫిర్యాదు చేస్తాం. ఈ దాడుల ఘటనలపై వీడియో ఆధారాలతో హైకోర్టులో ప్రైవేటు కేసు వేస్తున్నాం’ అని పేర్ని నాని తెలిపారు.మేం వస్తున్నాం.. ధైర్యంగా ఉండండి...మాజీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ ఎన్నికల ఫలితాల అనంతరం వైఎస్సార్‌సీపీ శ్రేణులను నిర్వీ­ర్యం చేయాలనే ఉద్దేశంతో టీడీపీ, జనసేన నాయ­కులు, కార్యకర్తలు భౌతిక దాడులకు దిగుతూ చేతులు, కాళ్లు విరగ్గొట్టడంతో పాటు గ్రామాల్లో ఉండొద్దని హెచ్చరిస్తున్నార­­న్నారు. ఈ ఘటనలకు పోలీసులే ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారని తెలిపారు. ‘దాడులు జరుగుతుంటే పోలీసులు నిలబడి చూస్తూ ఎంజాయ్‌ చేస్తుండటం దారుణం.స్థానికంగా దాడులు జరుగుతున్న సమయంలో ఆయా ప్రాంతాల పోలీసులకు సమాచారం అందించినా, స్పందించడం లేదు. వచ్చినా ప్రేక్షక పాత్ర వహిస్తు­న్నారు. ఈ ఘటనలపై కేసులు కట్టడం లేదు. దాడులు చేస్తున్న వారే కాకుండా దాడు­లను చూస్తూ మిన్నకుండిపోయిన పోలీసులపై కూడా కేసులు వేస్తాం. వైఎస్సార్‌సీపీ నాయ­కులు, కార్యకర్తలు ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదు. రెండు రోజుల్లో జిల్లాలోని ముఖ్య నాయకు­లందరం ప్రతి నియోజకవర్గానికి వెళ్లి దాడులకు గురైన వారి ఇళ్లకు వెళ్లి ధైర్యం చెబుతాం. ఇకనైనా దాడులు ఆగకుంటే వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్య­కర్తలు రోడ్డు పైకి వస్తారు. లా అండ్‌ ఆర్డర్‌ సమస్య ఎదురైతే దానికి పోలీస్‌ వ్యవస్థే బాధ్యత వహించాలి’ అని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌­బాబు, మచిలీపట్నం, పెడన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు పేర్ని కృష్ణమూర్తి (కిట్టు), ఉప్పాల రమేష్‌ (రాము) పాల్గొన్నారు.పేర్ని కిట్టు, నాయకులను అడ్డుకున్న పోలీసులుటీడీపీ శ్రేణుల దాడిలో గాయపడిన బాబి దంపతులను పరామర్శించేందుకు బయలుదేరిన వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. బందరు పట్టణంలోని చిలకలపూడి ఎన్టీఆర్‌ కాలనీలో నివాసం ఉండే బాబి దంపతులు వైఎస్సార్‌సీపీ పక్షాన నిలిచారనే నెపంతో కూటమి శ్రేణులు వారి నివాసంపై దాడికి పాల్పడ్డారు. సామగ్రి ధ్వంసం చేశారు.ఈ సందర్భంగా శనివారం బాధితులను పరామర్శించేందుకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) తన నివాసం నుంచి నగర మేయర్‌ చిటికిన వెంకటేశ్వరమ్మ, మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ షేక్‌ సలార్‌దాదా, కార్పొరేటర్లతో కలిసి బయలుదేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారి పరామర్శకు వెళ్లేందుకు అనుమతి లేదని అడ్డుకున్నారు.అదనపు బలగాలను రప్పించి దారికి అడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. పరామర్శకు అనుమతి ఏమిటని పేర్ని కిట్టు, తదితరులు పోలీసులను దాటుకుని వెళ్లి బాబి దంపతుల ఇంటికి వెళ్లి పరామర్శించారు. పరామర్శించిన వారిలో కార్పొరేటర్లు మేకల సుబ్బన్న, జోగి చిరంజీవి, ఐనం తాతారావు, మాచవరపు రాంప్రసాద్, పల్లి శేఖర్, పర్ణం సతీష్, శ్రీరాం చిన్నా ఉన్నారు.

Sakshi Editorial On results in evms
‘బలి’ కోరుతున్న సాంకేతిక విజయం!

‘ది హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌’ గోల్‌ గురించి క్రీడా ప్రియులందరూ వినే ఉంటారు. 1986 ఫుట్‌బాల్‌ వరల్డ్‌ కప్‌ సందర్భంగా అర్జెంటీనా – ఇంగ్లండ్‌ మ్యాచ్‌లో డీగో మారడోనా చేసిన తొలి గోల్‌ వివాదాస్పదమైంది. డీగో చేసిన హెడర్‌ గోల్‌ను వాస్తవానికి చేత్తో నెట్టాడని ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో రికార్డింగ్‌ సౌకర్యం లేకపోవడం వల్ల రెఫరీ దాన్ని గోల్‌గానే ప్రకటించాడు. తర్వాత నాలుగు నిమిషాలకే ‘గోల్‌ ఆఫ్‌ ది సెంచరీ’ని కొట్టిన మారడోనా, అదే ఊపులో వరల్డ్‌ కప్‌ను గెలుచుకోవడమే గాక ఫుట్‌బాల్‌ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించారు. వివాదాస్పద గోల్‌పై ఆ తర్వాత స్పందించిన మారడోనా అది ‘సగం మారడోనా హెడ్, సగం హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌’ ఫలితమని ప్రకటించాడు.దుబాయ్‌లో ఇటీవల కురిపించిన కృత్రిమ వర్షం ఎంత బీభత్సాన్ని సృష్టించిందో ప్రపంచమంతా చూసింది. క్లౌడ్‌ సీడింగ్‌ ఓవర్‌డోస్‌కు వాతావరణ మార్పులు కూడా తోడైన ఫలితంగా రెండేళ్లలో కురవాల్సిన వర్షమంతా ఒకేరోజు కురిసి ఎమిరేట్‌ను అతలాకుతలం చేసింది.ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి జరిగిన ఎన్నికల ఫలితాలను చూస్తుంటే ఏదో ‘అదృశ్య హస్తం’ (హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌) పనిచేసినట్టుగా, కృత్రిమ ఓట్ల వర్షం కురిపించినట్టుగా అనిపించక మానదు. లేదంటే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఇటువంటి ఫలితాలు రావాలంటే రష్యా నాయకుడు పుతిన్‌ లేదా తుర్కియే పాలకుడు ఎర్డోగాన్‌ లేదా మయన్మార్‌ మిలిటరీ జుంటా ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగి ఉండాలి. అలా జరగలేదు కాబట్టి ‘హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌’ ప్రమేయం ఉండాలి. ఎవరా గాడ్‌? కేంద్ర ప్రభుత్వమా? ఎన్నికల సంఘమా... ఎవరు? కృత్రిమ ఓట్ల వర్షానికి క్లౌడ్‌ సీడింగ్‌ ఎవరు చేశారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ జనసామాన్యం మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలివి.ఎలక్ట్రానిక్‌ వోటింగ్‌ మెషిన్‌లను ట్యాంపరింగ్‌ చేయడం ద్వారా ఫలితాలను తారుమారు చేయడం సాధ్యమేనని స్వయంగా చంద్రబాబే పలుమార్లు ప్రకటించారు. ఆయన అభిమాని వేమూరి రవి ఇంకొంచెం ముందుకెళ్లి ఈవీఎమ్‌లను ఎలా హ్యాక్‌ చేయవచ్చో మీడియా సమక్షంలోనే ప్రదర్శించి చూపెట్టారు. అందువల్ల ఈవీఎమ్‌ల ట్యాంపరింగ్‌ అనే ఆర్ట్‌పై కూటమికి స్పష్టమైన అవగాహన ఉన్నది.రాష్ట్రవ్యాప్తంగా సాయంత్రం 5 గంటలకు 68 శాతం ఓట్లు పోలయ్యాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. కానీ తుది వివరాలను ప్రకటించడానికి దాదాపు మూడు రోజుల సమయాన్ని తీసుకున్నది. ఈ అసాధారణ జాప్యంపై సందేహాలను లేవనెత్తుతూ ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ పత్రిక సైతం కథనాన్ని ప్రచురించింది. ఆ గడువు ముగిసిన తర్వాత పోలయిన ఓట్ల సంఖ్య కూడా అనుమానాలను రేకెత్తించే విధంగానే ఉన్నది.తుది పోలింగ్‌ శాతాన్ని సుమారు 81గా నిర్ధారిస్తూ మూడు రోజుల తర్వాత ఈసీ తాపీగా ప్రకటన విడుదల చేసింది. మామూలుగా పోలింగ్‌ సమయం ముగిసిన తర్వాత పోలింగ్‌ కేంద్రం ఆవరణలో నిలబడి ఉన్నవారికి స్లిప్స్‌ పంపిణీ చేస్తారు. వారికి మాత్రమే ఓటువేసే అవకాశం కల్పిస్తారు. అలా నిలబడిన వారికి ఈసారి ఎందుకనో స్లిప్స్‌ లేదా టోకెన్లు పంపిణీ చేయలేదనే వార్తలు వినవస్తున్నాయి. ఇది అనుమానించదగ్గ అంశం.పోలింగ్‌ గడువు ముగిసిన తర్వాత ప్రాంగణంలో నిలబడి ఉన్నవారి సంఖ్య మనకున్న సమాచారం మేరకు ఎక్కడా యాభై నుంచి వంద దాటలేదు. వీరు ఓట్లు వేయడానికి ఇంకో రెండు, మూడు గంటలు చాలు. అంటే తొమ్మిది గంటలకల్లా పోలింగ్‌ పూర్తి కావాలి. కానీ అర్ధరాత్రి దాటిందాకా పోలింగ్‌ జరుగుతూనే ఉందట! అంటే ఆ యాభైమందే అంతసేపూ సైక్లింగ్‌ చేస్తున్నారా? వేలాది పోలింగ్‌ బూత్‌లలో గడువు ముగిసే సమయానికి 65 నుంచి 70 శాతం మధ్యనున్న పోలింగ్‌ శాతం తుది ప్రకటన వచ్చేసరికి 85 నుంచి 95 శాతం దాకా ఎగబాకింది.పోలింగ్‌కు ముందు జరిగిన రాజకీయ పరిణామాలను కూడా గమనంలోకి తీసుకోవాలి. ఎన్డీఏ కూటమిలో చేరడం కోసం చంద్రబాబు పడిన పాట్లు, భరించిన అవమానాలు తెలిసినవే. కూటమిగా కుదురుకున్న తర్వాత వారు ‘ఎలక్షనీరింగ్‌’ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. అనేక ప్రాంతాల్లోని ప్రభుత్వాధికారులను బదిలీ చేశారు. కనీవినీ ఎరుగని విధంగా ఏ ప్రాంతంలో ఏ అధికారిని నియమించాలో కూడా ఎన్నికల సంఘానికి సూచించారు. ఈసీ కూడా కూటమి కోర్కెలన్నింటినీ మారుమాట్లాడకుండా నెరవేర్చింది. సాధారణంగా తెలుగు రాష్ట్రాల ఎన్నికలు ఎప్పుడూ తొలి ఫేజ్‌లోనే ఉంటూ వచ్చాయి. కానీ కూటమి కోరిక మేరకు ఈసారి నాలుగో ఫేజ్‌కు నెట్టివేశారు.మొదటి మూడు దశల పోలింగ్‌ తర్వాత జాతీయ స్థాయిలో ఎన్డీఏలో అభద్రతా భావం మొదలైందట. పోలింగ్‌ సరళి తమకు అనుకూలంగా లేదనే నిర్ధారణకు ఎన్డీఏ పెద్దలు వచ్చారు. నాలుగో దశకు ఎన్నికలను వాయిదా వేయించుకున్న చంద్రబాబు అదనంగా లభించిన సుమారు నెల రోజుల సమయాన్ని ప్రత్యేక ‘ఏర్పాట్ల’ కోసం ఉపయోగించుకున్నారు. ఈ ఏర్పాట్లకు ‘హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌’ పూర్తిగా సహకరించింది. దేశవ్యాప్తంగా 19 లక్షల ఈవీఎమ్‌ల మిస్సింగ్‌పై ఇప్పటికీ కేంద్రం నుంచి స్పష్టమైన సమాధానాలు రాలేదు. ఇవెక్కడున్నాయి? ఏ పనికి వినియోగిస్తున్నారు? ఎవరి సేవల కోసం ‘హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌’ వీటిని వినియోగిస్తున్నారో తేలవలసి ఉన్నది.గడచిన ఐదేళ్లుగా ప్రత్యర్థులపై లేని దాడులను ఉన్నట్లుగా చూపించి గగ్గోలు పెట్టినవారు పోలింగ్‌ రోజు సాయంత్రం, మరునాడు – మళ్లీ కౌంటింగ్‌ రోజు నుంచి గత నాలుగు రోజులుగా జరిగిన హింసాకాండపై మౌనం వహించారు. ఈ హింసాకాండ కూడా అప్పటికప్పుడు ఆవేశంతో చెలరేగినట్టు లేదు. జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక క్రమం కనిపిస్తున్నది. కృత్రిమ ఓట్ల వర్షం కురిసే సమయానికి ఎవరూ పోలింగ్‌ కేంద్రాల వైపు వెళ్లకుండా బెదరగొట్టేందుకు దాడులు జరిగాయి. మరుసటి రోజు కూడా చాలాచోట్ల ఇవి కొనసాగాయి. మళ్లీ కౌంటింగ్‌ పూర్తవుతున్న సమయం నుంచి నాలుగు రోజులుగా యథేచ్ఛగా రాష్ట్రవ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి. అసాధారణమైన ఓటింగ్‌ సరళిని సమీక్షించడానికి ప్రత్యర్థులు గ్రామాల్లో పర్యటించే అవకాశం లేకుండా బెదరగొట్టడానికి ఈ దాడులు జరిగాయి. పోలీసు యంత్రాంగం పూర్తిగా కూటమి వ్యూహానికి తోడుగా నిలబడింది.విచక్షణారహితంగా జరుగుతున్న ఈ దాడులు మన ప్రజాస్వామ్య భవిష్యత్తు మీద ప్రశ్నార్థకాన్ని రచిస్తున్నాయి. ఈ దాడులను ఖండించకపోగా ‘వైఎస్సార్‌సీపీ కవ్వింపు చర్యలకు రెచ్చిపోకండ’ని ముఖ్యమంత్రి కాబోయే చంద్రబాబు ట్వీట్‌ చేశారు. గత రెండేళ్లుగా లోకేశ్‌ ఒక రెడ్‌బుక్‌ను సభల్లో ప్రదర్శిస్తూ హెచ్చరికలు జారీ చేసేవారు. తాను రెడ్‌బుక్‌లో పేర్లు ఎక్కించిన వారి సంగతి అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తానని చెప్పేవారు. ఇప్పుడా రెడ్‌బుక్‌ హోర్డింగ్‌లను కూడళ్లలో ఏర్పాటు చేశారు. దాని సందేశమేమిటో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.సందేశం గూండాతండాలకు స్పష్టంగానే అర్థమైంది. టీడీపీ వారికి చాలాచోట్ల జనసైనికులు కూడా తోడయ్యారు. ప్రత్యర్థులపై దాడులు చేస్తున్న సందర్భాల్లో పోలీసులు మౌన ప్రేక్షక పాత్రను పోషించారు. కొన్నిచోట్ల పారిపోతూ కనిపించారు. ఇప్పటివరకు బయటకొచ్చిన వీడియోల్లో ఇటువంటి దృశ్యాలెన్నో కలవరం కలిగించాయి.నూజివీడులో వైసీపీకి చెందిన ముసినిపల్‌ కౌన్సిలర్‌ను వెంబడించి కత్తులతో పొడుస్తున్న దృశ్యం పిండారీల దండయాత్రను తలపించింది. ఒక హాస్టల్‌ నిర్వాహకుడి ఇంటిపై దాడిచేసి గృహాన్ని ఛిద్రం చేసి, ఆ పెద్దమనిషిని మోకాళ్లపై కూర్చోబెట్టి కాళ్లు పట్టించుకున్న పైశాచికత్వం భయానకంగా కనిపించింది. రాళ్ల దాడులు, కర్రలతో దాడులు, కత్తులతో దాడులు, కిడ్నాప్‌లు... ఎన్నెన్ని దృశ్యాలు? వైసీపీకి చెందిన వారి కార్యాలయాలను పెట్రోల్‌ పోసి తగలబెట్టారు. వాహనాలను తగులబెట్టారు. జెండా దిమ్మెలను సుత్తులతో పగులగొట్టారు. శంకుస్థాపన ఫలకాలను ధ్వంసం చేశారు. గ్రామ సచివాలయాల మీద దాడులు చేశారు. వైఎస్సార్‌ విగ్రహాలను తొలగించి ఈడ్చుకుంటూ అవమానించారు.వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయంపై వైఎస్సార్‌ అక్షరాలు తొలగించారు. ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్‌ల వంటి విప్లవాత్మక కార్యక్రమాలను ప్రారంభించిన వైఎస్సార్‌ పేరు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి బాగుంటుందని భావించిన ప్రభుత్వం చట్టసవరణ ద్వారా ఎన్టీఆర్‌ పేరును మార్చి వైఎస్సార్‌ పేరు పెట్టారు. బదులుగా విజయవాడ కేంద్రంగా ఏర్పడిన కొత్త జిల్లాకు ఎన్టీఆర్‌ పేరును పెట్టారు. ఒక అల్లరిమూక దాడి చేసి ఇప్పుడా అక్షరాలను తొలగించింది..విశ్వవిద్యాలయాల మీద కూడా దాడులకు తెగబడ్డారు. వీసీలు, రిజిస్ట్రార్‌లు తప్పుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభు త్వం మారితే యూనివర్సిటీ పాలకవర్గాలను కూడా మార్చాలనే ఓ కొత్త ఆచారానికి శ్రీకారం చుట్టబోతున్నట్టు కనిపిస్తున్నది. నామినేటెడ్‌ పదవుల్లో ఉన్నవారు రాజీనామాలు చేయడం సంప్రదాయం కానీ, ఇవి నామినేటెడ్‌ పదవులు కావు. సెర్చ్‌ కమిటీ సిఫారసుల మేరకు గవర్నర్‌ చేసిన నియామకాలు. అయినా సరే తమ పార్టీవాడే వీసీగా కూర్చోవాలనే దుందుడుకుతనం ప్రజాస్వామిక పద్ధతులను దెబ్బతీస్తున్నది.భయానక వాతావరణాన్ని కల్పించడం ద్వారా ప్రతిపక్షాలను కట్టడి చేయాలని కొత్త ప్రభుత్వం భావిస్తే అది నెరవేరే అవకాశం ఉండదు. నాలుగు రోజులు ఆలస్యమైనా సరే ఎన్నికల అవకతవకలపై వారు దృష్టి సారించకుండా ఉండరు. నిజానిజాలు తవ్వితీయకుండా ఉండరు. అలాగే కొత్త ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం జనంతో కలిసి విపక్షాలు కచ్చితంగా ఉద్యమిస్తాయి. కూటమికి లభించిన విజయం సాంకేతికమైనదే. అయినా సరే, ప్రభుత్వాన్ని అదే ఏర్పాటు చేస్తుంది. అడ్డంకులేమీ ఉండవు. చేసిన హామీలను నెరవేర్చి, ప్రజాస్వామిక వాతావరణాన్ని పునరుద్ధరించితే కొత్త ప్రభుత్వం ప్రజల మన్నన పొందుతుంది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

PM Narendra Modi Set to Take Oath for Record Third Term on 9 june 2024
నేడు మోదీ మూడోసారి

న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ 3.0 ఆదివారం నుంచి మొదలుకానుంది. రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం రాత్రి 7.15 గంటలకు ప్రధానిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మూడుసార్లు ప్రధానిగా చేసిన జవహర్‌లాల్‌ నెహ్రూ రికార్డును సమం చేయనున్నారు. బీజేపీకి సొంతంగా 240 సీట్లు మాత్రమే రాగా... మిత్రపక్షాలతో కలిపి ఎడ్డీయే 293 సీట్లతో మెజారిటీ సాధించింది. సొంతంగా మెజారిటీ లేని నేపథ్యంలో మంత్రిపదవులపై మిత్రుల డిమాండ్లను తీర్చడం బీజేపీకి కత్తిమీద సాములా మారింది. శనివారం కూడా బీజేపీ సీనియర్‌ నేతలు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా మిత్రపక్షాలతో సంప్రదింపులు కొనసాగించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (16 సీట్లు), జేడీయూ అధ్యక్షుడు నితీశ్‌ కుమార్‌ (12 సీట్లు), శివసేన అధ్యక్షుడు, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే (7 సీట్లు)లతో మంత్రి పదవులపై చర్చలు జరిపారు. పెద్దశాఖలైన హోం, ఆర్థిక, రక్షణ, విదేశీ వ్యవహారాలతో పాటు సైద్ధాంతికంగా కీలకమైన విద్య, సాంస్కృతిక శాఖలను బీజేపీయే అట్టిపెట్టుకుంటుందని భావిస్తున్నారు. మొదటి విడతలో మిత్రపక్షాలకు ఐదు నుంచి ఎనిమిది మంత్రి పదవులు దక్కవచ్చని సమాచారం. టీడీపీకి ఒక కేబినెట్, ఒక సహాయమంత్రి టీడీపీ నుంచి కింజారపు రామ్మోహన్‌ నాయుడుకు కేబినెట్‌ పదవి దక్కనుంది. పెమ్మసాని చంద్రశేఖర్‌కు సహాయమంత్రి పదవి లభిస్తుందని విశ్వసనీయవర్గాల సమాచారం. రెండు పారీ్టలు టీడీపీ, జేడీయూలకు ఒక్కో కేబినెట్, ఒక్కో సహాయమంత్రి పదవులు ఇవ్వనున్నారు. జేడీయూ నుంచి లలన్‌ సింగ్, సంజయ్‌ ఝాలలో ఒకరు కేబినెట్‌ మంత్రిగా, రామ్‌నాథ్‌ ఠాకూర్‌ సహాయమంత్రిగా ఆదివారం మోదీతో పాటు ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. లోక్‌ జనశక్తి (రాంవిలాస్‌) నుంచి ఆ పార్టీ ఆధ్యక్షుడు చిరాగ్‌ పాశ్వాన్‌కు కేబినెట్‌లో చోటు దక్కనుంది. ఢిల్లీకి చేరుకున్న హసీనా మోదీ ప్రమాణస్వీకారంలో పాల్గొనేందుకు బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రి షేక్‌ హసీనా, సీషెల్స్‌ ఉపాధ్యక్షుడు అహ్మద్‌ అఫీఫ్‌ శనివారమే ఢిల్లీ చేరుకున్నారు. నేపాల్‌ ప్రధాని ప్రచండ, శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే, మారిషస్‌ ప్రధాని ప్రవింద్‌కుమార్‌ జుగ్నాథ్, భూటాన్‌ ప్రధాని తెర్సింగ్‌ టోబ్గేలు కూడా ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. మోదీ 3.0ను సెలబ్రేట్‌ చేసుకునేందుకు అమెరికాలోని 22 నగరాల్లో బీజేపీ మద్దతుదారులు ఏర్పాటు చేస్తున్నారు. న్యూయార్క్, జెర్సీ సిటీ, వాషింగ్టన్‌ డీసీ, బోస్టన్, అట్లాంటా, హూస్టన్, డల్లాస్, షికాగో, లాస్‌ఏంజెలెస్, శాన్‌ఫ్రాన్సిస్కో తదితర నగరాల్లో విజయోత్సవ ర్యాలీలు నిర్వహించనున్నట్లు ఓవర్సీస్‌ ఫ్రెండ్స్‌ ఆఫ్‌ బీజేపీ– యూఎస్‌ఏ అధ్యక్షుడు అడపా ప్రసాద్‌ తెలిపారు. భారతీయ రైల్వేస్‌కు చెందిన పది మంది లోకో పైలట్లను ప్రమాణస్వీకారానికి ఆహా్వనించారు. ఇందులో భారత తొలి మహిళా లోకోపైలట్‌ సురేఖ యాదవ్‌ ఉన్నారు. రాష్ట్రపతి భవన్‌లో వీవీఐపీలకు, కాబోయే మంత్రులకు ప్రత్యేక ఎన్‌క్లోజర్లు ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకారం ముగిశాక రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అతిథులకు విందు ఇవ్వనున్నారు. పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు చోట్ల నిషేధాజ్ఞలు విధించారు. ఆది, సోమవారాల్లో దేశ రాజధానిని నో ఫ్లయింగ్‌ జోన్‌గా ప్రకటించారు. మాకింకా ఆహ్వానం రాలేదు: కాంగ్రెస్‌ మోదీ ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు ఇంకా ఎలాంటి ఆహ్వానాలు అందలేదని పార్టీ ప్రధాన కార్యదర్శులు జైరాం రమేష్, కేసీ వేణుగోపాల్‌ శనివారం రాత్రి చెప్పారు. ఆహ్వానాలు వస్తే హాజరు కావడంపై ఇండియా కూటమి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.

Israel-Hamas war: Israel rescues 4 hostages, 210 Palestinians reported killed
Israel-Hamas war: గాజాలో భీకర పోరు.. 210 మంది మృతి

జెరూసలెం/గాజా: సెంట్రల్‌ గాజాలో నుసెయిరత్‌లో హమాస్‌ మిలిటెంట్లు, ఇజ్రాయెల్‌ సైన్యం మధ్య పోరు భీకరంగా సాగుతోంది. శనివారం నుసెయిరత్, పరిసర ప్రాంతాల్లో ఇజ్రాయెల్‌ దాడుల్లో 210 మంది చనిపోయినట్టు సమాచారం! 400 మంది దాకా గాయపడినట్లు హమాస్‌ను ఉటంకిస్తూ అల్‌జజీరా పేర్కొంది. మృతుల్లో పలువురు చిన్నారులున్నట్లు తెలిపింది. డెయిర్‌ అల్‌ బలాహ్‌లోని అల్‌–హక్సా ఆస్పత్రి మొత్తం రక్తంతో తడిచి వధశాలగా మారిపోయిందని డాక్టర్స్‌ వితౌట్‌ బోర్డర్స్‌ పేర్కొంది.నలుగురు బందీలకు విముక్తి..ఇలా ఉండగా, హమాస్‌ మిలిటెంట్ల చెర నుంచి బందీలను విడిపించుకునేందుకు గాజాపై యుద్ధం ప్రారంభించిన ఇజ్రాయెల్‌ ఆర్మీ పెద్ద విజయం నమోదు చేసుకుంది. నుసెయిరత్‌లో ఓ భవన సముదాయంపై శనివారం పట్టపగలే ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టిన ఆర్మీ రెండు వేర్వేరు ప్రాంతాల్లో దాచి ఉంచిన నోవా అర్గామని(25), అల్మోగ్‌ మెయిర్‌ జాన్‌(21), ఆండ్రీ కొజ్లోవ్‌(27), ష్లోమి జివ్‌(40) అనే నలుగురు బందీలను సురక్షితంగా తీసుకొచ్చినట్లు తెలిపింది. తాజాగా రక్షించిన నలుగురితో కలిపి ఇజ్రాయెల్‌ ఆర్మీ ఇప్పటి వరకు కాపాడిన బందీల సంఖ్య ఏడుకు చేరుకుంది. అమెరికా అందించిన సమాచారంతోనే బందీలను ఇజ్రాయెల్‌ ఆర్మీ గుర్తించి, రక్షించిందని బైడెన్‌ ప్రభుత్వంలోని ఓ అధికారి వెల్లడించారు. గురు, శుక్రవారాల్లోనూ ఇజ్రాయెల్‌ దాడుల్లో డజన్ల మంది మరణించారు.ఆమె వీడియో వైరల్‌.. శనివారం ఐడీఎఫ్‌ రక్షించిన వారిలో అర్గామని అనే మహిళ ఉన్నారు. మిలిటెంట్లకు చిక్కిన బందీల్లో అర్గామనికి చెందిన వీడియోనే మొదటిసారిగా బయటకు వచి్చంది. ఇద్దరు మిలిటెంట్లు బైక్‌పై తీసుకెళ్తుండగా ‘నన్ను చంపకండి’అని ఆమె రోదిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. బ్రెయిన్‌ కేన్సర్‌ ముదిరి మృత్యుశయ్యపై ఉన్న తనకు కూతురిని చూడాలని ఉందంటూ అర్గామని తల్లి లియోరా ఏప్రిల్‌లో ఒక వీడియో విడుదల చేశారు. చెర నుంచి విడుదలైన అర్గామనితో ప్రధాని నెతన్యాహు ఫోన్‌లో మాట్లాడారు. బందీలందరినీ విడిపించేదాకా యుద్ధం ఆపబోమని స్పష్టం చేశారు.

India and Pakistan match in World Cup today
దాయాది సమరానికి ‘సై’

అక్టోబర్‌ 23, 2022...మెల్‌బోర్న్‌ మైదానంలో భారత్, పాకిస్తాన్‌ మ్యాచ్‌...రవూఫ్‌ బౌలింగ్‌లో కోహ్లి రెండు అద్భుత సిక్సర్లతో టీమిండియాను గెలిపించిన తీరును మన అభిమానులెవరూ మరచిపోలేరు. ‘గ్రేటెస్ట్‌ మూమెంట్‌ ఇన్‌ టి20 వరల్డ్‌ కప్‌ హిస్టరీ’ అంటూ తొలి సిక్స్‌కు కితాబిచ్చింది. ఇప్పుడు మళ్లీ టి20 వరల్డ్‌ కప్‌లో అలాంటి అద్భుత క్షణాల కోసం ఇరు జట్ల మధ్య మరో మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. నాటి పోరు తర్వాత టి20 ఫార్మాట్‌లో ఇరు జట్లు తలపడనుండటం ఇదే తొలిసారి. న్యూయార్క్‌: టి20 వరల్డ్‌ కప్‌లో మాజీ చాంపియన్లు, దాయాది జట్లు భారత్, పాకిస్తాన్‌ మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. గ్రూప్‌ ‘ఎ’లో భాగంగా నాసా కౌంటీ క్రికెట్‌ గ్రౌండ్‌లో జరిగే మ్యాచ్‌లో పాక్‌ను టీమిండియా ఎదుర్కొంటుంది. తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై సునాయాసంగా నెగ్గిన భారత్‌ ఉత్సాహంగా కనిపిస్తుండగా... చిన్న జట్టు అమెరికా చేతిలో ఓడిన పాక్‌పై తీవ్ర ఒత్తిడి ఉంది. అమెరికాలో క్రికెట్‌కు ప్రాచుర్యం కల్పించడంలో భాగంగా ఐసీసీ ఈ మ్యాచ్‌కు భారీ స్థాయిలో ప్రచారం నిర్వహించింది. న్యూయార్క్‌ అభిమానుల కోసం తక్కువ సమయంలో 34 వేల సామర్థ్యం గల స్టేడియాన్ని నిరి్మంచింది. పిచ్‌పై ఇప్పటికే చాలా విమర్శలు వస్తున్నాయి. అక్షర్‌ స్థానంలో కుల్దీప్‌! ఐర్లాండ్‌పై సునాయాసంగా గెలిచిన భారత జట్టులో ఎలాంటి ఆందోళన లేదు. టాపార్డర్‌లో రోహిత్, కోహ్లి, పంత్‌ ఖాయం కాగా...సూర్యకుమార్, దూబే, పాండ్యాలతో బ్యాటింగ్‌ పటిష్టంగా ఉంది. గత మ్యాచ్‌లో విఫలమైనా...అసలు సమయంలో ఎలా చెలరేగాలో కోహ్లికి బాగా తెలుసు. పాండ్యా, జడేజా బ్యాటింగ్‌ అవసరం లేకుండా టీమ్‌ విజయాన్ని పూర్తి చేసుకుంది.టాప్‌–7 వరకు బ్యాటింగ్‌ సామర్థ్యం ఉంది కాబట్టి జట్టు ఒక మార్పు చేయవచ్చు. అక్షర్‌ పటేల్‌ స్థానంలో కుల్దీప్‌ యాదవ్‌ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. గత కొంత కాలంగా కుల్దీప్‌ మంచి ఫామ్‌లో ఉండటంతో పాటు పాక్‌పై మంచి రికార్డు కూడా ఉంది. పిచ్‌ స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉంటే మాత్రం ముగ్గురు పేసర్లు బుమ్రా, సిరాజ్, అర్‌‡్షదీప్‌లలో ఒకరిని తప్పించి కుల్దీప్‌ను ఎంపిక చేస్తారు. గందరగోళంలో... మరో వైపు పాకిస్తాన్‌ పరిస్థితి మాత్రం ఇబ్బందికరంగా ఉంది. యూఎస్‌ చేతిలో అనూహ్యంగా ఓడిపోవడంతో అన్ని వైపులనుంచి విమర్శలు వస్తున్నాయి. ఓటమికంటే ఆ మ్యాచ్‌లో పేలవ ఆటతీరు చూస్తే జట్టులో సమస్య ఏమిటో అర్థమవుతుంది. ఓపెనర్లుగా రిజ్వాన్, బాబర్‌ ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు. అటు కెప్టెన్సీ లో కూడా లోపాలతో బాబర్‌ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. మిడిలార్డర్‌ కూడా బలహీనంగా కనిపిస్తోంది. యూఎస్‌తో కేవలం 159 పరుగులకే పరిమితమైంది. సుదీర్ఘకాలంగా ఈ ఫార్మాట్‌లో ఆడుతున్నా బౌలర్లు షాహిన్‌ అఫ్రిది, రవూఫ్, నసీమ్‌ కనీస స్థాయి ప్రదర్శన ఇవ్వడం లేదు. 2021 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లో మినహాయిస్తే ప్రతీ సారి భారత్‌ చేతిలో భంగపడిన టీమ్‌ ఈ సారి ఏం చేస్తుందనేది చూడాలి. టి20 ప్రపంచకప్‌లో నేడువెస్టిండీస్‌ X ఉగాండావేదిక: ప్రొవిడెన్స్‌; ఉదయం గం. 6 నుంచిఒమన్‌ X స్కాట్లాండ్‌ వేదిక: నార్త్‌ సౌండ్‌; రాత్రి గం. 10:30 నుంచిస్టార్‌ స్పోర్ట్స్, హాట్‌ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Weekly Horoscope 9 June 2024 To15 June 2024 In Telugu
Weekly Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి కాగలవు

మేషం కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక విషయాలు ఉత్సాహాన్నిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. దూరపు బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆలయాలు సందర్శిస్తారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఇంటి నిర్మాణాలు చేపడతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు అనుకోని హోదాలు రాగలవు. కళారంగం వారిని విజయాలు వరిస్తాయి. వారం మధ్యలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. గులాబీ, పసుపు రంగులు. నృసింహస్తోత్రాలు పఠించండి.వృషభంఆర్థిక విషయాలు కొంత నిరాశాజనకంగా ఉంటాయి. మిత్రులతో వివాదాలు ఏర్పడవచ్చు. కొన్ని విషయాలలో చికాకులు ఎదుర్కొంటారు. ముఖ్యమైన పనులు ముందుకు సాగవు. కష్టమే తప్ప ఫలితం అంతగా కనిపించదు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. స్థిరాస్తి వివాదాలు కాస్త గందరగోళం కలిగించవచ్చు. వ్యాపారాలు సామాన్యంగానే ఉంటాయి. ఉద్యోగులకు బాధ్యతలు మరింత పెరుగుతాయి. రాజకీయవర్గాలకు ఒత్తిడులు. వారం మద్యలో శుభవార్తలు. వాహనయోగం. ఎరుపు, నేరేడు రంగులు. శివస్తోత్రాలు పఠించండి.మిథునంఅనుకున్న పనులు సజావుగా పూర్తి చేస్తారు. బంధువుల నుంచి ముఖ్య సమాచారం రాగలదు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. విద్యార్థులకు అనూహ్యమైన ఫలితాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంక్రిమెంట్లు రాగలవు. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్యం. నీలం, లేత ఆకుపచ్చ రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.కర్కాటకంకొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. స్థిరాస్తి వివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. విద్యార్థులు అందరిచేత ప్రశంసలు అందుకుంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులు. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. పారిశ్రామికవేత్తలకు చిక్కులు తొలగుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. నేరేడు, నీలం రంగులు. గణేశాష్టకం పఠించండి.సింహంరుణబాధలు తొలగుతాయి. ఆప్తులు, బంధువులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. స్థిరాస్థి వృద్ధి. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు రాగలవు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో మిత్రులతో కలహాలు. ఇంటాబయటా ఒత్తిడులు. నేరేడు,తెలుపు రంగులు.గణేశ్‌ను పూజించండి.కన్యకొత్త పనులు ప్రారంభించి సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక లావాదేవీలు గతం కంటే మరింత మెరుగుపడతాయి. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. మిత్రులతో వివాదాలు సర్దుకుంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వస్తు, వస్త్రలాభాలు కలుగుతాయి. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలలో గందరగోళం తొలగి లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి సత్కారాలు జరుగుతాయి. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆకుపచ్చ, గులాబీ రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.తులనూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. సంఘంలో విశేషంగా గౌరవమర్యాదలు పొందుతారు. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. పరిచయాలు విస్తరిస్తాయి. విద్యార్థులకు మరింత అనుకూల సమయం. ఆర్థిక ఇబ్బందులు తొలగి ఊరట లభిస్తుంది. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగవర్గాలు ఉత్సాహంగా విధులు నిర్వహిస్తారు. కళారంగం వారు అనుకోని అవకాశాలు లభిస్తాయి. వారం ప్రారంభంలో ఆస్తి వివాదాలు. ఆలయ దర్శనాలు. గులాబీ, నేరేడు రంగులు. లక్ష్మీస్తుతి మంచిది.వృశ్చికంకొన్ని పనులు సాఫీగా పూర్తి చేస్తారు. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయంతో ముందడుగు వేస్తారు.. భూముల వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. రహస్య విషయాలు తెలుసుకుంటారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. కొత్త వ్యక్తుల పరిచయం. క్రీడాకారులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో ఆటుపోట్లు అధిగమిస్తారు. రాజకీయరంగం వారికి కొత్త పదవులు దక్కే అవకాశం. వారం ప్రారంభంలో అనారోగ్యం. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆకుపచ్చ, తెలుపు రంగులు. విష్ణుధ్యానం మంచిది.ధనుస్సుఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. అనుకున్న పనులలో విజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగ యత్నాలు సానుకూలం. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. కొన్ని లక్ష్యాలు సాధిస్తారు. దూరపు బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఊహించని విధంగా హోదాలు దక్కుతాయి. పారిశ్రామికరంగం వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం మద్యలో దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. ఆకుపచ్చ, తెలుపు రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.మకరంఆర్థిక లావాదేవీలు మొదట్లో మందగించినా క్రమేపీ పుంజుకుంటుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి కాగలవు. ఆరోగ్యం కుదుటపడి ఊరట చెందుతారు. బంధువుల సూచనలతో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తి విషయాలలో ఒప్పందాలు చేసుకుంటారు. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. పరిచయాలు మరింత పెరుగుతాయి. నూతన విద్య, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. సంగీత, సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం చివరిలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. పసుపు, గులాబీ రంగులు. గణేశాష్టకం పఠించండి.కుంభంబంధువుల చేయూతతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఎంతటి వారినైనా వాక్పటిమతో ఆకట్టుకుంటారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది, అనుకూల ఫలితాలు సాధిస్తారు. కొత్త వ్యక్తుల పరిచయం. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు, లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో మరింత పురోగతి కనిపిస్తుంది. పారిశ్రామికవర్గాలకు కొన్ని సమస్యలు తీరతాయి. వారం చివరిలో అనుకోని ఖర్చులు. అనారోగ్యం. మిత్రులతో విభేదాలు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. దేవీస్తుతి మంచిది.మీనం...––––క్రమేపీ అనుకూల పరిస్థితులు నెలకొని ఉత్సాహంగా గడుపుతారు. సన్నిహితులు చేదోడుగా నిలుస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. యుక్తితో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో మరింతగా లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో మీకు ఎదురుండదు, పదోన్నతులు రాగలవు. కళారంగం వారికి నూతనోత్సాహం. వారం ప్రారంభంలో ఆస్తి వివాదాలు. అనారోగ్యం. శ్రమ పెరుగుతుంది. ఎరుపు, పసుపు రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

South Indian Actresses Making Bollywood Debut
బాలీవుడ్‌ కాలింగ్‌

ప్రతి ఏడాది బాలీవుడ్‌ తారలు కొంతమంది టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తుంటారు. అలాగే దక్షిణాది హీరోయిన్లు కూడా బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తుంటారు. ఈ ఏడాది కొందరు సౌత్‌ హీరోయిన్లను బాలీవుడ్‌ పిలిచింది. బాలీవుడ్‌ నుంచి కాల్‌ అందుకుని, ప్రస్తుతం అక్కడ సినిమాలు చేస్తున్న దక్షిణాది కథానాయికల గురించి తెలుసుకుందాం. కెరీర్‌లో యాభైకి పైగా సినిమాల్లో నటించి, దక్షిణాదిన స్టార్‌ హీరోయిన్‌ జాబితాలో చేరిపోయారు సమంత. హిందీలో ‘ఫ్యామిలీ మేన్‌’ సీజన్‌ 2 వెబ్‌ సిరీస్‌లో చేసిన రాజ్యలక్ష్మి పాత్రతో ఉత్తరాదిన కూడా పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇదే జోష్‌లో ఇండియన్‌ వెర్షన్‌ ‘సిటాడెల్‌’ వెబ్‌ సిరీస్‌ను కూడా పూర్తి చేశారామె. వరుణ్‌ ధావన్‌ హీరోగా నటించిన ఈ హిందీ సిరీస్‌ త్వరలోనే స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది.ఇలా హిందీలో రెండు వెబ్‌ సిరీస్‌లు చేసిన సమంత ఇంకా అక్కడ ఒక్క సినిమా కూడా చేయలేదు. గతంలో రణ్‌వీర్‌ సింగ్, విక్కీ కౌశల్, రాజ్‌కుమార్‌ రావుల సినిమాల్లో సమంత హీరోయిన్‌గా నటిస్తారనే ప్రచారం సాగింది. కానీ అప్పట్లో ఆమె అనారోగ్య పరిస్థితుల కారణంగా కుదర్లేదట. ఇప్పుడు ఆ సమయం వచ్చిందట. ఓ హిందీ చిత్రం కోసం సమంత ఇటీవల కథ విన్నారని బాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. సో... హిందీలో సమంత నటించే తొలి చిత్రంపై స్పష్టత రావడానికి కొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు.కాస్త ఆలస్యంగా... దక్షిణాదిలో అగ్ర కథానాయికల్లో కీర్తీ సురేష్‌ ఒకరు. నటిగా సౌత్‌లో తన సత్తా ఏంటో సిల్వర్‌ స్క్రీన్‌పై చూపించిన కీర్తీ సురేష్‌ బాలీవుడ్‌లోనూ టాప్‌ హీరోయిన్ల జాబితాలో చోటు సంపాదించుకోవాలని నిర్ణయించుకున్నట్లున్నారు. ఈ క్రమంలోనే హిందీ చిత్రం ‘బేబీ జాన్‌’కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. వరుణ్‌ ధావన్‌ హీరోగా నటించిన ఈ సినిమాలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటించారు. హిందీలో కీర్తీకి ఇది తొలి చిత్రం కాగా ఈ చిత్రదర్శకుడు కాలీస్‌ (తమిళ డైరెక్టర్‌)కు కూడా హిందీలో ఇదే తొలి చిత్రం. తమిళంలో అట్లీ దర్శకత్వం వహించిన ‘తేరీ’ సినిమాకు హిందీ రీమేక్‌గా ‘బేబీ జాన్‌’ తెరకెక్కింది.జ్యోతిదేశ్‌ పాండే, మురాద్‌ ఖేతనీ, అట్లీ, ప్రియా అట్లీ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాను మే 31న రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ వాయిదా పడింది. కొత్త తేదీ పై స్పష్టత రావాల్సి ఉంది. అలాగే కీర్తీ సురేష్, రాధికా ఆప్టే లీడ్‌ రోల్స్‌లో హిందీలో ఓ యాక్షన్‌ వెబ్‌ సిరీస్‌ కూడా రూపొందుతోంది. ఇదిలా ఉంటే... ‘బేబీ జాన్‌’ చిత్రానికన్నా ముందే కీర్తీకి బాలీవుడ్‌ ఆఫర్‌ వచ్చింది. అజయ్‌ దేవగన్‌ హీరోగా నటించిన హిందీ చిత్రం ‘మైదాన్‌’లో ముందు హీరో యిన్‌గా కీర్తీ సురేష్‌ను తీసుకున్నారు ఈ చిత్రదర్శకుడు అమిత్‌ శర్మ. కానీ ఆ తర్వాత కీర్తీ సురేష్‌ ఈ ్రపాజెక్ట్‌ నుంచి తప్పుకోగా, ప్రియమణి నటించారు. ‘మైదాన్‌’ ఈ ఏడాది ఏప్రిల్‌ 10న రిలీజైంది. ఇలా కీర్తీ సురేష్‌ బాలీవుడ్‌ ఎంట్రీ కాస్త ఆలస్యమైంది. ఏక్‌ దిన్‌ హీరోయిన్‌ సాయి పల్లవికి సౌత్‌లో మంచి క్రేజ్‌ ఉంది. ఈ క్రేజ్‌ను బాలీవుడ్‌లోనూ రిపీట్‌ చేయాలనుకుంటున్నారీ బ్యూటీ. బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ ఆమిర్‌ ఖాన్‌ తనయుడు జునైద్‌ ఖాన్‌ నటించిన చిత్రం ‘ఏక్‌ దిన్‌’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌)లో నటించారు సాయి పల్లవి. హిందీలో సాయి పల్లవి నటించిన తొలి చిత్రం ఇదే. ఈ సినిమా మేజర్‌ షూటింగ్‌ జపాన్‌లో జరిగింది. ఆమిర్‌ ఖాన్‌ ఓ నిర్మాతగా ఉన్న ఈ ‘ఏక్‌ దిన్‌’ సినిమా చిత్రీకరణ పూర్తయింది.ఈ ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు. దక్షిణాది భాషల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట ఆమిర్‌ ఖాన్‌. మరోవైపు మరో హిందీ చిత్రం ‘రామాయణ్‌’లో సాయి పల్లవి నటిస్తున్నారు. రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా నటిస్తున్నారు. సీతారాములుగా సాయి పల్లవి, రణ్‌బీర్‌ నటిస్తున్న ఈ భారీ చిత్రానికి నితీష్‌ తివారి దర్శకత్వం వహిస్తున్నారు. యశ్, నమిత్‌ మల్హోత్రా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2025 చివర్లో ఈ సినిమా తొలి భాగాన్ని విడుదల చేయాలని మేకర్స్‌ భావిస్తున్నారని బాలీవుడ్‌ టాక్‌. కబురొచ్చింది ప్రస్తుతం తెలుగులో ట్రెండింగ్‌ హీరోయిన్లలో శ్రీలీల ఒకరు. నటన పరంగా ఈ బ్యూటీకి ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. అందువల్లే రవితేజ ‘ధమాకా’, మహేశ్‌బాబు ‘గుంటూరు కారం’ వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించగలిగారు. తాజాగా శ్రీలీలకు బాలీవుడ్‌ నుంచి కబురొచ్చిందని టాక్‌. బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ తనయుడు ఇబ్రహీం ఆలీఖాన్‌ హీరోగా ‘దిలేర్‌’ అనే సినిమా రూపొందుతోంది. కృణాల్‌ దేశ్‌ముఖ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌ ఫిల్మ్‌లో ఇద్దరు హీరోయిన్లకు చోటు ఉందట. ఓ హీరోయిన్‌ పాత్ర కోసం మేకర్స్‌ శ్రీలీలను సంప్రదించారని సమాచారం. కథ నచ్చడంతో శ్రీలీల కూడా ఓకే చెప్పారని వినికిడి. అదే నిజమైతే శ్రీలీలకు ఇదే తొలి హిందీ చిత్రం అవుతుంది. కేరాఫ్‌ మహారాజ్ఞి ‘బింబిసార, సార్, విరూపాక్ష, డెవిల్‌’ వంటి తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు సంయుక్తా మీనన్‌. అలాగే మలయాళ, తమిళ, కన్నడ చిత్రాల్లోనూ హీరోయిన్‌గా నటించి పాపులర్‌ అయ్యారామె. ఇప్పుడు బాలీవుడ్‌ ఎంట్రీకీ రెడీ అయ్యారు. కానీ హీరోయిన్‌గా కాదు... ఓ లీడ్‌ రోల్‌లో... కాజోల్, ప్రభుదేవా లీడ్‌ రోల్స్‌లో ‘మహారాజ్ఞి: క్వీన్‌ ఆఫ్‌ క్వీన్స్‌’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చరణ్‌తేజ్‌ ఉప్పలపాటి ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీకి దర్శకుడు.ఈ సినిమాలో సంయుక్తా మీనన్‌ ఓ లీడ్‌ రోల్‌లో నటిస్తున్నారు. ఈ సినిమాలో కాజోల్‌కు చెల్లి పాత్రలో కనిపిస్తారట సంయుక్త. నసీరుద్దీన్‌ షా, ఆదిత్య సీల్, చాయా కదమ్‌ వంటివారు ఈ సినిమాలోని ఇతర లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్నారు. వెంకట అనీష్, హర్మాన్‌ బవేజా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇలా బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్న దక్షిణాది కథానాయికల జాబితాలో మరికొంతమంది ఉన్నారు.

newly married couple suicide in hyderabad
కలిసి బతకలేమని కడతేరిపోయారు!

జీడిమెట్ల, జగద్గిరిగుట్ట: వారిద్దరూ ప్రేమించుకున్నారు.. జీవితాంతం కలిసి ఉండాలని బాసచేసి పెళ్లి చేసుకున్నారు.. వీరి కాపురం కొన్నాళ్లు సాఫీగానే సాగింది. ఇటీవల ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఏం జరిగిందో ఏమో భార్య హెచ్‌ఏఎల్‌లోని తల్లి గారింట్లో, భర్త చింతల్‌ హెచ్‌ఎంటీలో ఒకేరోజు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. జీడిమెట్ల, జగద్గిరిగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాజులరామారం హెచ్‌ఏఎల్‌ కాలనీకి చెందిన కృష్ణమూర్తి చిన్న కుమారుడు మంచూరి రెశ్వంత్‌ (26), గాజులరామారం హెచ్‌ఏఎల్‌ కాలనీకి చెందిన సాయిశ్రేయ (22)ను ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. అనంతరం గాజులరామారం ద్వారకా నగర్‌లో కాపురం పెట్టారు. రెశ్వంత్‌ బిగ్‌బాస్కెట్‌లో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. కొన్నాళ్లు దంపతులిద్దరూ బాగానే ఉన్నారు. ఇటీవల ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. శనివారం రెశ్వంత్‌ హెచ్‌ఎంటీ నిర్మానుష్య ప్రదేశంలో చెట్టుకు చున్నీతో ఉరి వేసుకుని మృతిచెందాడు. సాయిశ్రేయ హెచ్‌ఏఎల్‌ కాలనీలోని తల్లిగారింట్లో ఉరి వేసుకుని మృతిచెందింది. మృతుడి సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Jammu girl Arshiya Sharma gets standing ovation at America Got Talent for her spooky dance performance
డ్యాన్సమ్నాస్టిక్‌

నృత్య ప్రదర్శనలో ఆకట్టుకునే అందమైన డ్రెస్‌ అనేది కామన్‌. ఆర్షియా మాత్రం భయపెట్టే డ్రెస్‌తో, హారర్‌ లుక్‌తో స్టేజీ మీదికి వచ్చింది. ‘ఇదేం లుక్కు బాబోయ్‌’ అనుకునేలోపే తన అద్భుత నృత్యప్రతిభతో ప్రేక్షకులను అబ్బురపరిచింది. ‘అమెరికాస్‌ గాట్‌ టాలెంట్‌’ టీవీ షో న్యాయనిర్ణేతలు ‘వావ్‌’ అనుకునేలా చేసింది. జమ్మూ కశ్మీర్‌కు చెందిన 13 ఏళ్ల ఆర్షియా శర్మ స్వదేశం దాటి వేరే దేశానికి రావడం ఇదే తొలిసారి. ఈ ఇంటర్నేషనల్‌ షోలో ΄ాల్గొనడానికి ముందు ఆర్షియా శర్మ లిటిల్‌ మాస్టర్స్, సూపర్‌ డ్యాన్సర్‌ 4 లాంటి షోలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.అంతర్జాతీయ వేదికపై చప్పట్లతో ‘ఆహా’ అనిపించుకున్న ఆర్షియా ప్రత్యేకత ఏమిటి... అనే విషయానికి వస్తే....డాన్స్‌కు జిమ్నాస్టిక్స్‌ జోడించి ‘వారెవ్వా’ అనేలా చేసింది. ఆర్షియ ‘డ్యాన్సమ్నాస్టిక్‌’ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Ramoji Rao entrepreneurial journey began in Visakhapatnam
పెదపారుపూడి టు ఫిలింసిటీ

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయ కుటుంబంలో పుట్టిన రామోజీరావు.. పరస్పరం భిన్నమైన రంగాల్లో వ్యాపారాలను ప్రారంభించి విజయం సాధించారు. యాడ్‌ ఏజెన్సీలో పనిచేయడం మొదలుపెట్టి.. ఎరువుల వ్యాపారం, చిట్‌ఫండ్స్, పచ్చళ్లు, మీడియా వంటి ఎన్నో రంగాలకు విస్తరించారు. రామోజీరావు ఏపీలోని కృష్ణా జిల్లా పెదపారుపూడి గ్రామంలో 1936 నవంబరు 16న జని్మంచారు. ఆయన తండ్రి వెంకట సుబ్బారావు రైతు. తల్లి వెంకట సుబ్బమ్మ గృహిణి. పెదపారుపూడి, గుడివాడలలో పాఠశాల విద్య, ఇంటర్, డిగ్రీ (బీఎస్సీ) గుడివాడలోనే పూర్తి చేశారు. 1961 ఆగస్టు 19న పెనమలూరుకు చెందిన తాతినేని వెంకట సుబ్బయ్య, వాణీదేవిల రెండో కుమార్తె రమాదేవితో రామోజీరావుకు వివాహం జరిగింది. మొదట యాడ్‌ ఏజెన్సీలో చేరి..: బీఎస్సీ పూర్తిచేసిన రామోజీరావు.. తన కుటుంబం చేసే వ్యవసాయానికే పరిమితం కాకుండా వ్యాపార రంగంలోకి రావాలని నిర్ణయించుకున్నారు. అడ్వర్టైజింగ్‌ రంగం వైపు ఆసక్తి కలగడంతో.. ఢిల్లీ వెళ్లి ఓ అడ్వరై్టజింగ్‌ ఏజెన్సీలో చేరారు. అక్కడ మూడేళ్లు పనిచేశాక హైదరాబాద్‌కు వచ్చారు. 1962 అక్టోబర్‌లో హైదరాబాద్‌లో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ సంస్థను, 1965లో కిరణ్‌ యాడ్స్‌ పేరిట అడ్వర్టైజ్‌మెంట్‌ ఏజెన్సీని ప్రారంభించారు. తర్వాత ఇతర వ్యాపారాలవైపు దృష్టి సారించారు. 1967–1969 మధ్య వసుంధర ఫెర్టిలైజర్స్‌ పేరిట ఎరువుల వ్యాపారం చేశారు. ఆ సమయంలోనే వ్యవసాయ సమాచారంతో కూడిన అన్నదాత పత్రికను ప్రారంభించారు.1970లో ఇమేజెస్‌ ఔట్‌డోర్‌ యాడ్‌ ఏజెన్సీని, విశాఖలో డాలి్ఫన్‌ హోటల్‌ను ప్రారంభించారు. అప్పటికే పత్రికారంగంపై ఆసక్తి ఉన్న ఆయన.. విశాఖపట్నం కేంద్రంగా ఈనాడు పత్రికకు శ్రీకారం చుట్టారు. స్థానిక వార్తలకు ప్రాధాన్యమివ్వటం, గ్రామాల్లోనూ ఏజెంట్లను ఏర్పాటు చేసుకోవడం, వేగంగా పంపిణీ చేయడం ద్వారా పత్రికను పాఠకులకు చేరువ చేశారు. ఎల్రక్టానిక్‌ మీడియాతోనూ..: పాత్రికేయ రంగంలో మార్పులను ముందుగానే గుర్తించిన రామోజీరావు.. మొదట్లో వినోదం ప్రధానాంశంగా ఈటీవీ చానల్‌ను ప్రారంభించారు. తర్వాత పూర్తి న్యూస్‌ చానల్‌ ఈటీవీ2ను ప్రారంభించారు. రాష్ట్రం విడిపోయినప్పుడు ఏపీ, తెలంగాణలకు విడివిడి న్యూస్‌ చానళ్లను ఏర్పాటు చేశారు. ఇక ‘ప్రియ’పేరిట రామోజీ ప్రారంభించిన పచ్చళ్ల వ్యాపారం కూడా సక్సెస్‌ అయింది. వివిధ రంగాల్లో రామోజీ సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2016లో పద్మవిభూషణ్‌తో సత్కరించింది. రామయ్య నుంచి రామోజీగా మార్చుకుని..: రామోజీరావు తాత పేరు రామయ్య. ఆయన వ్యవసాయం చేసేవారు. రామోజీ జని్మంచడానికి కొన్నిరోజుల ముందు రామయ్య మరణించారు. దీంతో తాత పేరే మనవడికి పెట్టారు. కానీ రామయ్య అనే పేరు పాతదిగా అనిపించడంతో.. ఆయన తన పేరును రామోజీగా మార్చుకున్నారని చెబుతారు. తెల్ల వ్రస్తాలంటే మక్కువ..: రామోజీరావు ఎప్పుడు చూసినా తెలుపు రంగు వస్త్రధారణతోనే కనిపిస్తారు. ఆయనకు తెలుపు రంగు వ్రస్తాలంటే ప్రత్యేక మక్కువే దీనికి కారణమని చెబుతారు. వదులుగా ఉండే తెలుపు రంగు హాఫ్‌హ్యాండ్స్‌ షర్టు, అదే రంగు ప్యాంటు, మ్యాచింగ్‌గా తెలుపు రంగు షూస్‌ ధరించేవారు. ఎప్పుడైనా ప్రత్యేక సందర్భాల్లో తప్ప ఎప్పుడూ తెలుపు వస్త్రధారణతో ఉండేవారు.పత్రికారంగానికి ఎనలేని సేవలందించారురామోజీరావు మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందివైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌సాక్షి, అమరావతి: రామోజీరావు మర­ణం దిగ్భ్రాంతికి గురిచేసిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలి­పారు. ‘తెలుగు పత్రికారంగానికి దశాబ్దా­లుగా ఆయన ఎన­లేని సేవలందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ­న్నాను. రామోజీరావు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియ­జేస్తున్నాను’ అని వైఎస్‌ జగన్‌ సామాజిక మాధ్యమం ఎక్స్‌(ట్విట్టర్‌)లో శనివారం పోస్టు చేశారు.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement