Top Stories
ప్రధాన వార్తలు
ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణితో వ్యవహరించిందని.. టీడీపీ దాడులు చేస్తున్నా.. పోలీసులు పట్టించుకోలేదని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అసాంఘిక శక్తులు రాజకీయ కక్షతో దాడులు, హింసాకాండ కొనసాగిస్తున్నాయని మండిపడ్డారు.రాజకీయ కక్షతో బడుగు బలహీన వర్గాలపై దాడులకు చేశారు.ఈసీ ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. పోలింగ్ సమయంలో టీడీపీ గూండాలు ఎక్కడికక్కడ తెగబడ్డారు.పోలింగ్ సజావుగా జరగకూడదని టీడీపీ దాడులు చేసింది. టీడీపీ దాడులపై డీజీపీకి, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశాం’’ అని సజ్జల చెప్పారు.‘‘రిగ్గింగ్ చేయాలనే ఆలోచనతో దాడులకు తెగబడ్డారు. కూటమి నేతలు చెప్పినచోటే పోలీసు అధికారులను మార్చారు. ఈసీ నియమించిన పోలీస్ అధికారులకు రాష్ట్రంపై అవగాహన లేదు. టీడీపీ నేతలు ఇచ్చి పార్టీకి పోలీస్ అబ్జర్వర్ హాజరయ్యారు. పోలింగ్‌కు ముందే పోలీస్ ఉన్నతాధికారులను మార్చేశారు. ఎక్కడైతే పోలీస్ అధికారులను మార్చారో అక్కడే హింస జరిగింది. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?’’ అంటూ సజ్జల ప్రశ్నించారు.పోలింగ్ రోజు వైఎస్సార్సీపీ అభ్యర్థులను హౌస్ అరెస్ట్ చేశారు. టీడీపీ అభ్యర్థులు మాత్రం యథేచ్చగా తిరిగారు. గురజాలలో ఓ గుడిలో తలదాచుకున్న దళితులపై దాడులు చేశారు. ఈసీ వైఫల్యం కారణంగానే పల్నాడులో గొడవలు జరిగాయి. వీటన్నిటికి ఎన్నికల కమిషనే బాధ్యత తీసుకోవాలి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.‘‘ఎన్నికల సంఘం విధుల్లో కూడా టీడీపీ దూరింది. పురందేశ్వరి ఎవరిపై ఫిర్యాదు చేశారో వారిని బదిలీ చేశారు. వారు కోరిన అధికారులను వేశారు. మొత్తం 29 మంది అధికారులను ఉన్నట్టుండి ట్రాన్సఫర్ చేశారు. విష్ణువర్ధనరావు అనే రిటైర్డ్ ఆఫీసర్ ఇచ్చిన విందుకు పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రా వెళ్లారు. విష్ణువర్ధన్ రావు టీడీపీ నేత సుజనాచౌదరికి దగ్గరి మనిషి. అలాంటి వ్యక్తి ఇచ్చిన విందుకు పోలీసు అబ్జర్వర్ వెళ్లితే ఇక ఎన్నికలు ప్రశాంతంగా ఎలా జరుగుతాయి?. టీడీపీ ఆఫీసులో రూపు దిద్దుకున్న ప్లాన్ ని దీపక్ మిశ్రా ద్వారా ఈసీ అమలు చేసింది. రెడ్డి, ఎస్సీ, ఎస్టీ అధికారులు అందరినీ వరుసపెట్టి ట్రాన్సఫర్ చేశారు. ఎవరిపై ఫిర్యాదు వచ్చినా విచారణ చేయకుండానే వెంటనే ట్రాన్సఫర్ చేశారు. ప్రకాశం, పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలలో అధికారులను మార్చారు. అక్కడే ఎక్కువ హింస చెలరేగింది’’ అని సజ్జల ధ్వజమెత్తారు.జరుగుతున్న దాడులన్నీ ఒన్ సైడే జరుగుతన్నాయి. మంత్రి అంబటి రాంబాబును అన్యాయంగా హౌస్ అరెస్టు చేశారు. ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి కుటుంబంపై దాడులు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. వెంటనే పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రాని వెంటనే వెనక్కు పిలవాలి. ఎన్నికల కమిషన్ త్వరగా స్పందించి శాంతిభద్రతలను పరిరక్షించాలి. సంక్షేమ పథకాల నిధులను కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. కౌంటింగ్ సందర్భంగా అల్లర్లు చేసేందుకు కూడా టీడీపీ కుట్రలు పన్నుతోంది. కచ్చితంగా రెండోసారి జగన్ పాలన రాబోతోంది’’ అని సజ్జల చెప్పారు.‘‘సీఎస్, డీజీపీని కేంద్ర ఎన్నికల సంఘం పిలిపించటం అసాధారణం. పోలింగ్ తర్వాత కూడా పరిపాలన జరగకుండా చేయటం ఏంటి?. వీటన్నిటిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. పురందేశ్వరి ఇచ్చిన లేఖల ప్రకారం ఈసీ పనిచేయటంపై సీఈసీకి ఫిర్యాదు చేస్తాం. పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రాని నియమించటం వెనుక కుట్ర ఉంది. లేకపోతే రిటైర్డ్ ఆఫీసర్ ని పోలీసు అబ్జర్వర్‌గా నియమించటం ఏంటి?. ఉద్యోగంలో ఉన్న ఆఫీసర్ని నియమిస్తే బాధ్యతతో వ్యవహరిస్తారు. రిటైర్డ్ అధికారిని నియమిస్తే బాధ్యత ఏం ఉంటుంది?’’ అంటూ సజ్జల ప్రశ్నించారు.
టీడీపీ అరాచకం.. డీజీపీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, గుంటూరు: టీడీపీ దాడులు, హింసాత్మక చర్యలపై డీజీపీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. ఆ పార్టీ నేతలు మేరుగు నాగార్జున, అంబటి రాంబాబు, పేర్ని నాని డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు.అనంతరం మంత్రి అంబటి రాంబాబు మంగళగిరి డీజీపీ కార్యాలయం దగ్గర మీడియాతో మాట్లాడుతూ, పోలింగ్ బూత్‌లలో హింస జరుగుతుంటే పోలీసులు అడ్డుకోలేదన్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారన్నారు. కొంతమంది పోలీసులు టీడీపీకి కొమ్ము కాశారని మండిపడ్డారు.‘‘వైఎస్సార్సీపీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్‌లు చేశారు.టీడీపీ నేతలు మాత్రం విచ్చలవిడిగా తిరిగారు. కూటమి ఫిర్యాదుతో ఈసీ పోలీస్ అధికారులను మార్చింది. అధికారులను మార్చిన తర్వాత కూడా హింస ఎందుకు జరిగింది?’’ అంటూ అంబటి రాంబాబు ప్రశ్నించారు.‘‘పోలీసు వ్యవస్థలో కొంతమంది టీడీపీ వారితో కలిసిపోయారు. మాకు బాగా ఓట్లు పడేచోట భారీగా పోలీసులను పెట్టారు. టీడీపీకి బలమైన గ్రామాలలో పోలీసులను పెట్టలేదు. దీంతో వారు పోలింగ్ బూత్‌లను క్యాప్చర్ చేశారు. నన్ను హౌస్ అరెస్టు చేసి, నా ప్రత్యర్థిని యథచ్చగా తిరగనిచ్చారు. చాలా దుర్మార్గపు చర్యలకు దిగారు. పోలీసు అధికారులను ఉన్నట్టుండి మార్చారు. అలా మార్చితే మేలైన పరిస్థితులు ఉండాలి కదా? మరి ఎందుకు హింస జరిగింది?. అధికారులను మార్చిన తర్వాత ఎందుకు హింస జరిగింది?. అవగాహన లేని డీజీపి, ఎస్పీలను పెట్టడం వలన హింస జరిగింది’’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.‘‘ఎన్నికల కమిషన్ తీసుకున్న తప్పుడు నిర్ణయం వలనే ఈ పరిస్థితి ఏర్పడింది. పోలీసు పరిశీలకుడు ఢిల్లీ ఆదేశాలు, పురంధేశ్వరి ఆదేశాలతోనే చేశారు. సీఎస్, డీజీపీలను ఢిల్లీకి పిలిచారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తన నియోజకవర్గంలో రీపోలింగ్ అవసరం లేదని ఈసీ ఎలా చెబుతుంది?. వెబ్ కెమెరాలను విశ్లేషించకుండా ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారు?’’ అంటూ అంబటి రాంబాబు ప్రశ్నించారు.పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దారుణాలు: మాజీ మంత్రి పేర్నిటీడీపీ నేతలు, కార్యకర్తలు యథేచ్చగా కర్రలు, రాడ్లతో దాడులు చేశారు. మా వాళ్లు ఎదురు తిరిగితే మాపై కేసులు పెడుతున్నారు. పోలింగ్ తర్వాత జరుగుతున్న హింసలకు పోలీసుల వైఫల్యమే కారణం. పల్నాడు ఎస్పీకి ఫోన్లు చేసినా పట్టించుకోలేదు?. రిటైర్డ్ అధికారిని పోలీసు అబ్జర్వర్‌ని పెడితే ఏం జవాబుదారీతనం ఉంటుంది. బీజేపి, కూటమికి సహకరించమని పోలీసు అధికారులనే ఆయన బెదిరించారు. మా కార్యకర్తలపై హత్యానేరం కేసులు పెడుతున్నారు. పురంధేశ్వరి చెప్పినట్టు పోలీసు అధికారును మార్చినచోటే హింస జరిగింది. అంటే పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దారుణాలకు పాల్పడ్డారు
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు
బ్రెటిస్లావా: స్లొవేకియా ప్రధాని రాబర్ట్ ఫికోపై దుండగులు బుధవారం(మే15) కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆయన తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. దుండగులు నాలుగు రౌండ్లు జరిపిన కాల్పుల్లో ఫికో కడుపులోకి బుల్లెట్ దూసుకుపోయింది.రాజధాని బ్రెటిస్లావాకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాండ్లోవా నగరంలోని హౌస్ ఆఫ్ కల్చర్ భవనం బయట ఫికోపై కాల్పులు జరిపారు. మద్దతుదారులతో సమావేశమైన సమయంలో కాల్పులు జరిగాయి. కాల్పులు జరిపిన దుండగుల్లో ఒకరిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ప్రధానిపై కాల్పుల ఘటనను డిప్యూటీ స్పీకర్ లుబోస్ బ్లహా ధృవీకరించారు.
కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్.. సాధారణ తీర్పు కాదన్న అమిత్ షా
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే మనీలాండరింగ్ కేసులో జైల్లో ఉన్న కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇవ్వడంపై తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. కేజ్రీవాల్‌కు సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన బెయిల్‌ను ప్రత్యేక ట్రీట్మెంట్గా అమిత్ షా అభివర్ణించారు.ఈ మేరకు జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్రమంత్రి మాట్లాడుతూ.. ఆప్ అధినేతకు లభించిన బెయిల్ సాధారణ తీర్పు కాదని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు ప్రత్యేక సౌలభ్యం కల్పించినట్లు దేశంలో చాలామంది ప్రజలు నమ్ముతున్నారని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ ఇండియా కూటమి మెజారిటీ సాధిస్తే తాను మళ్లీ జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని కేజ్రీవాల్ చేసిన ప్రకటనపై అమిత్ షా మండిపడ్డారు.కేజ్రీవాల్ వ్యాఖ్యలు సుప్రీంకోర్టును ధిక్కరించడమే అవుతుందని అన్నారు. ‘ఎన్నికల్లో విజయం సాధిస్తే.. కేసుల్లో దోషులుగా తేలిన వారిని కోర్టు జైలుకు పంపదని ఆయన చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. బెయిల్ తీర్పును ఎలా ఉపయోగించుకుంటున్నారో లేదా దుర్వినియోగం చేస్తున్నారో మధ్యంతర బెయిల్ ఇచ్చిన న్యాయమూర్తులు ఆలోచించాలి’ అని షా పేర్కొన్నారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీహార్ జైల్లో రహస్య కెమెరాలను ఏర్పాటు చేసి తన కదలికలను పర్యవేక్షిస్తుందంటూ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలపై అమిత్ షా స్పందిస్తూ.. ‘తిహార్ జైలు పాలన అధికారం ఢిల్లీ ప్రభుత్వ పరిధిలో ఉంది. దీనికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖతో ఎలాంటి సంబంధం లేదు. కేజ్రీవాల్ కావాలనే అబద్ధాలు చెబుతున్నారు. బెయిల్ మార్గదర్శకాల ప్రకారం, కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని, సెక్రటేరియట్‌ను కూడా సందర్శించలేరు. కేసు గురించి వ్యాఖ్యానించవద్దని లేదా సాక్షులెవరితోనూ సంభాషించవద్దని కూడా కోర్టు తెలిపింది. జూన్ 2లోగా జైలు అధికారులకు లొంగిపోవాలని కూడా ఆదేశించింది. మళ్లీ ఆయన జైలుకు వెళ్లాల్సిందే.’ అని మండిపడ్డారు.కాగా లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్టై తీహార్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మే 10న మధ్యంతర బెయిల్ లభించిన విషయం తెలిసిందే. ఆప్ పార్టీ అధినేతగా ఉన్న ఆయన..లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వీలు కల్పిస్తూ జూన్ 1 వరకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఏపీలో 81.86 శాతం పోలింగ్ నమోదు.. అక్కడే అత్యధికం: ఎంకే మీనా
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 81.86 శాతం పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా తెలిపారు. 3,500 పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 6 గంటల తర్వాత కూడా పోలింగ్ జరిగిందని పేర్కొన్నారు. ఆఖరి పోలింగ్ కేంద్రంలో అర్థరాత్రి 2 గంటలకు పూర్తైందన్నారు. మొత్తం 350 స్ట్రాంగ్ రూమ్‌లలో ఈవీఎంలు భద్రపరిచినట్లుచెప్పారు.రాష్ట్రంలో తుదిపోలింగ్ శాతం వివరాలను ఏపీ సీఈవో బుధవారం వెల్లడించారు. అయితే అసెంబ్లీకి ఓటేసి కొందరు లోక్‌సభకు ఓటేయలేదని తెలిపారు ఎంకే మీనా. పార్లమెంట్‌కు 3 కోట్ల 33 లక్షల 4560 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు. దర్శిలో అత్యధికంగా 90.91 శాతం.. తిరుపతిలో అత్యల్పంగా 63.32 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. గతంలో కంటే ఈసారి ఎక్కువ పోలింగ్ శాతం జరిగిందని.. నాలుగు దశల్లో ఏ రాష్ట్రంలోనూ ఇంత పోలింగ్ జరగలేదని అన్నారు.‘కుప్పంలో 89.88 శాతం పోలింగ్ నమోదైంది. నాలుగు ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి. ఈవీఎంల ద్వారా 80.66 శాతం పోలింగ్ నమోదు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1.20 శాతం నమోదు. 2014 ఎన్నికల్లో 78.41 శాతం. 2019 ఎన్నికల్లో 79.77శాతం పోలింగ్ నమోదు. అత్యల్పంగా విశాఖ లోక్‌సభ స్థానంలో 71.11 శాతం పోలింగ్. గత ఎన్నికలతో పోలిస్తే 2.09శాతం పోలింగ్ పెరిగిందినాలుగు ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి. అల్లర్లు సృష్టించిన నిందితులను ఒకటి రెండు రోజుల్లో అరెస్ట్ చేస్తాం. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపైనా కఠిన చర్యలు. ఈవీలఎంలు ధ్వంసం చేసిన వారిని జైలుకు పంపిస్తాం. 715 ప్రాంతాల్లో పోలీస్ పికెట్ కొనసాగుతోంది. స్ట్రాంగ్ రూమ్‌ల దగ్గర పార్టీలకు చెందిన ప్రతినిధి 24 గంటలు ఉండవచ్చు’ అని పేర్కొన్నారు.
May 15th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
May 15th AP Elections 2024 News Political Updates9:16 PM, May 15th, 2024మైదుకూరులో టీడీపీ గుండాల దాడివిశ్వనాథ పురానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త భూమిరెడ్డి చంద్ర ఓబుల్ రెడ్డిపై హత్యాయత్నం ఎన్నికల రోజు పోలింగ్ బూత్‌లో ఏజెంట్‌గా కూర్చున్నాడని కోపంతో ఓబుల్ రెడ్డిపై దాడి చేసిన టీడీపీ గూండాలుదాడిలో తీవ్ర గాయాలు.. మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపుఆసుపత్రిలో ఓబుల్ రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి7:30 PM, May 15th, 2024రిగ్గింగ్ చేయాలనే ఆలోచనతోనే దాడులకు తెగబడ్డారు: సజ్జల రామకృష్ణారెడ్డిటీడీపీ అరాచక శక్తులు పోలింగ్ సరిగ్గా జరగకుండా చేయాలని చూశాయిరిగ్గింగ్ చేయాలనీ, మా వారిని అడ్డుకోవాలనీ చూశారుటీడీపీ నేతలు చేసిన అరాచకాలపై ఈసీ, డీజీపీలకు ఫిర్యాదు చేశాంఎన్నికల సంఘం విధుల్లో కూడా టీడీపీ దూరిందిపురంధేశ్వరి ఎవరిపై ఫిర్యాదు చేశారో వారిని బదిలీ చేశారువారు కోరిన అధికారులను వేశారుమొత్తం 29 మంది అధికారులను ఉన్నట్టుండి ట్రాన్సఫర్ చేశారువిష్ణువర్ధనరావు అనే రిటైర్డ్ ఆఫీసర్ ఇచ్చిన విందుకు పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రా వెళ్లారువిష్ణువర్ధన్ రావు టీడీపీ నేత సుజనాచౌదరికి దగ్గరి మనిషిఅలాంటి వ్యక్తి ఇచ్చిన విందుకు పోలీసు అబ్జర్వర్ వెళ్లితే ఇక ఎన్నికలు ప్రశాంతంగా ఎలా జరుగుతాయి?టీడీపీ ఆఫీసులో రూపు దిద్దుకున్న ప్లాన్ ని దీపక్ మిశ్రా ద్వారా ఈసీ అమలు చేసిందిరెడ్డి, ఎస్సీ, ఎస్టీ అధికారులు అందరినీ వరసపెట్టి ట్రాన్సఫర్ చేశారుఎవరిపై ఫిర్యాదు వచ్చినా విచారణ చేయకుండానే వెంటనే ట్రాన్సఫర్ చేశారుప్రకాశం, పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలలో అధికారులను మార్చారుఅక్కడే ఎక్కువ హింస చెలరేగిందిజరుగుతున్న దాడులన్నీ ఒన్ సైడే జరుగుతన్నాయిమంత్రి అంబటి రాంబాబును అన్యాయంగా హౌస్ అరెస్టు చేశారుఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి కుటుంబంపై దాడులు చేసినా పోలీసులు పట్టించుకోలేదువెంటనే పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రాని వెంటనే వెనక్కు పిలవాలిఎన్నికల కమిషన్ త్వరగా స్పందించి శాంతిభద్రతలను పరిరక్షించాలిసంక్షేమ పథకాల నిధులను కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం చేస్తోందికౌంటింగ్ సందర్భంగా అల్లర్లు చేసేందుకు కూడా టీడీపీ కుట్రలు పన్నుతోందికచ్చితంగా రెండోసారి జగన్ పాలన రాబోతోందిసీఎస్, డీజీపిని కేంద్ర ఎన్నికల సంఘం పిలిపించటం అసాధారణంపోలింగ్ తర్వాత కూడా పరిపాలన జరగకుండా చేయటం ఏంటి?వీటన్నిటిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాంపురంధేశ్వరి ఇచ్చిన లేఖల ప్రకారం ఈసీ పనిచేయటంపై సీఈసీకి ఫిర్యాదు చేస్తాంపోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రాని నియమించటం వెనుక కుట్ర ఉందిలేకపోతే రిటైర్డ్ ఆఫీసర్ ని పోలీసు అబ్జర్వర్ గా నియమించటం ఏంటి?ఉద్యోగంలో ఉన్న ఆఫీసర్ ని నియమిస్తే బాధ్యతతో వ్యవహరిస్తారురిటైర్డ్ అధికారిని నియమిస్తే బాధ్యత ఏం ఉంటుంది?ఓటర్లు తమ బాధ్యతగా తీసుకుని పోలింగులో పాల్గొన్నారు6:09 PM, May 15th, 2024పోలింగ్‌లో మహిళా విప్లవం కనిపించింది: ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబుఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఓటింగ్ ద్వారా ప్రజావిప్లవం చూపించారు81.86 శాతం పోలింగ్ నమోదవడం గొప్ప విషయంసమర్థవంతమైన పరిపాలన చేయటం వలనే జనమంతా బయటకు వచ్చి ఓట్లేశారుచివరి ఇంటి వరకు ఎక్కడా అక్రమాలు లేకుండా పాలనా ఫలాలు అందాయిదీన్ని తట్టుకోలేక టీడీపీ నేతలు మారణకాండ సృష్టించారుబడుగు, బలహీన వర్గాలపై దాడులకు దిగారుఓటర్లు బయటకు రాకుండా చేసేందుకు చేయరాని కుట్రలు చేశారుమంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డిలపై కూడా దాడులు చేశారు2019లో పసుపుకుంకుమ కింద డబ్బులిచ్చినందున తామే గెలుస్తామన్నారుచివరికి 23 సీట్లతో సరిపెట్టుకున్నారుఈసారి పురుషుల కంటే ఐదు లక్షలమంది మహిళలు అధికంగా ఓట్లేశారువారంతా జగన్‌కే పట్టం కట్టారుజగన్ చేసిన న్యాయపాలన చూసిన మహిళలు పెద్ద సంఖ్యలో బయటకు వచ్చి ఓట్లేశారుకులం, మతం, ప్రాంతాలతో పని లేకుండా జగన్ పరిపాలన చేశారుహైదరాబాద్ నుండి రౌడీలు, గుండాలను తెచ్చి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తే భయపడతామా?సమస్యాత్మక కేంద్రాల వద్ద ఒక్కొక కానిస్టేబుల్ని మాత్రమే పెట్టారుఅసలు ఎన్నికల కమిషన్ అత్యంత దారుణంగా వ్యవహరించిందిఎల్లోమీడియా ఎంత విషం చిమ్మినా జనం పట్టించుకోలేదు5:31 PM, May 15th, 2024ఏపీ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా అక్రమాలపై వైఎస్సార్సీపీ ఫిర్యాదుటీడీపీ నేతలతో కుమ్మక్కై తెర వెనుక కథ నడిపినట్లు దీపక్ మిశ్రాపై సీఈవో, డీజీపీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదుపోలింగ్ రోజు కూటమికి మద్దతుగా వ్యవహరించాలని పోలీసు అధికారులపై దీపక్ మిశ్రా ఒత్తిడి తెచ్చారన్న వైఎస్సార్‌సీపీపోలింగ్‌కు 3 రోజుల ముందు టీడీపీ నేత విష్ణువర్థన్ ఇచ్చిన పార్టీకి దీపక్ మిశ్రా హాజరైనట్లు గుర్తింపుఆ తర్వాత నుంచి పోలీస్ అధికారుల మార్పులపై అనుమానాలుమాచర్ల,గురజాలలో రాత్రికి రాత్రే సీఐలు, ఎస్ఐల మార్పులుచివరికి సీఎం జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో కూడా దీపక్ మిశ్రా జోక్యం చేసుకున్నారని వైఎస్సార్సీపీ ఫిర్యాదుఈ కేసులో ఏ2 నిందితుడిని అరెస్ట్‌చేయొద్దని విచారణ అధికారిపై దీపక్ మిశ్రా ఒత్తిడి తెచ్చారన్న వైఎస్సార్‌సీపీఆధారాలతో సహా డీజీపీ, ఈసీలకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ5:06 PM, May 15th, 2024నర్సీపట్నం మండలంలో టీడీపీ నేతల దుర్మార్గ చర్యఅనకాపల్లి:ధర్మసాగరంలో మహిళను కొట్టి వివస్త్రను చేసిన టీడీపీ కార్యకర్తలుమహిళకు తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపుఎన్నికల్లో చురుగ్గా పాల్గొన్న బాధితురాలు కుమారిగతంలో వాలంటీర్‌గా విధులు నిర్వహించిన కుమారిఎన్నికలు అయ్యాక ఇంటికెళ్లి దాడి చేసిన టీడీపీ కార్యకర్తలు 4:12 PM, May 15th, 2024పల్నాడు ఎస్పీకి ఫోన్లు చేసినా పట్టించుకోలేదు?: పేర్ని నానిటీడీపీ నేతలు, కార్యకర్తలు యథేచ్చగా కర్రలు, రాడ్లతో దాడులు చేశారుమా వాళ్లు ఎదురు తిరిగితే మాపై కేసులు పెడుతున్నారుపోలింగ్ తర్వాత జరుగుతున్న హింసలకు పోలీసుల వైఫల్యమే కారణంపల్నాడు ఎస్పీకి ఫోన్లు చేసినా పట్టించుకోలేదు?రిటైర్డ్ అధికారిని పోలీసు అబ్జర్వర్ ని పెడితే ఏం జవాబుదారీతనం ఉంటుంది?బీజేపి, కూటమికి సహకరించమని పోలీసు అధికారులనే ఆయన బెదిరించారుమా కార్యకర్తలపై హత్యానేరం కేసులు పెడుతున్నారుపురందేశ్వరి చెప్పినట్టు పోలీసు అధికారును మార్చినచోటే హింస జరిగిందిఅంటే పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దారుణాలకు పాల్పడ్డారు4:09 PM, May 15th, 2024పోలీసు వ్యవస్థలో కొంతమంది టీడీపీతో కుమ్మక్కయ్యారు: మంత్రి అంబటి రాంబాబుపోలీసు వ్యవస్థలో కొంతమంది టీడీపీ వారితో కలిసిపోయారుమాకు బాగా ఓట్లు పడేచోట భారీగా పోలీసులను పెట్టారుటీడీపీకి బలమైన గ్రామాలలో పోలీసులను పెట్టలేదుదీంతో వారు పోలింగ్ బూత్ లను క్యాప్చర్ చేశారునన్ను హౌస్ అరెస్టు చేసి, నా ప్రత్యర్థిని యథేచ్ఛగా తిరగనిచ్చారుచాలా దుర్మార్గపు చర్యలకు దిగారుపోలీసు అధికారులను ఉన్నట్టుండి మార్చారుఅలా మార్చితే మేలైన పరిస్థితులు ఉండాలి కదా? మరి ఎందుకు హింస జరిగింది?అధికారులను మార్చిన తర్వాత ఎందుకు హింస జరిగింది?అవగాహన లేని డీజీపి, ఎస్పీలను పెట్ఠం వలన హింస జరిగిందిఎన్నికల కమిషన్ తీసుకున్న తప్పుడు నిర్ణయం వలనే ఈ పరిస్థితి ఏర్పడిందిపోలీసు పరిశీలకుడు ఢిల్లీ ఆదేశాలు, పురంధేశ్వరి ఆదేశాలతోనే చేశారుసీఎస్, డీజీపిలను ఢిల్లీకి పిలిచారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చుతన నియోజకవర్గంలో రీపోలింగ్ అవసరం లేదని ఈసీ ఎలా చెబుతుంది?వెబ్ కెమెరాలను విశ్లేషించకుండా ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారు?3:51 PM, May 15th, 2024టీడీపీ దాడులపై డీజీపీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదుడీజీపి హరీష్ కుమార్ గుప్తాని కలిసిన వైఎస్సార్సీపీ నేతలురాష్ట్రంలో అనేక చోట్ల టీడీపీ కార్యకర్తల దాడులు, హింసాత్మక చర్యలపై ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ నేతలుడీజీపిని కలిసిన వారిలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మంత్రులు మేరుగ నాగార్జున, అంబటి రాంబాబు, మాజీ మంత్రి పేర్ని నాని తదితరులు3:19 PM, May 15th, 2024ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను ఢిల్లీకి పిలిచిన ఈసీఐఎన్నికల అనంతరం జరిగిన హింసపై సీఎస్, డీజీపీని నివేదిక కోరిన ఈసీఐఈసీఐకి వాస్తవ పరిస్థితులు వివరించనున్న సీఎస్, డీజీపీఎన్నికల పోలింగ్‌కు కొద్దీ రోజులు ముందే డీజీపీ, ఐజీ, ఎస్పీలను మార్చిన ఎన్నికల కమిషన్అకస్మాత్తుగా పోలీస్ అధికారులను మార్చడంతో పెరిగిన హింసాత్మక ఘటనలుపల్నాడు ఎస్పీ, ఐజీ, డీజీపీని పోలింగ్‌కు ముందు మార్చిన ఈసీఐఈసీ ఆకస్మిక నిర్ణయాలతో హింస పెరిగిందని భావిస్తున్న అధికారులు3:15 PM, May 15th, 2024కాసేపట్లో డీజీపి హరీష్ కుమార్ గుప్తాను కలవనున్న వైఎస్సార్సీపీ నేతలురాష్ట్రంలో అనేక చోట్ల టీడీపీ కార్యకర్తల దాడులు, హింసాత్మక చర్యలపై ఫిర్యాదు చేయనున్న వైఎస్సార్సీపీ నేతలుడీజీపిని కలవనున్న వారిలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మంత్రులు మేరుగ నాగార్జున, అంబటి రాంబాబు, మాజీ మంత్రి పేర్ని నాని తదితరులు1:10 PM, May 15th, 2024పల్నాడులో టెన్షన్..!పల్నాడు జిల్లా..పల్నాడులో జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ విధించిన కలెక్టర్మాచర్ల, గురజాల నియోజకవర్గంలో షాపులు ముయించివేస్తున్న పోలీసులు 12:20 PM, May 15th, 2024పల్నాడు ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతితాడేపల్లి :చిలకలూరిపేట బస్సు ప్రమాద ఘటనపై సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతిమరణించినవారి కుటుంబాలకు సంతాపం తెలిపిన సీఎం జగన్వారి కుటుంబాలకు అండగా నిలుస్తామన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్ష 12:00 PM, May 15th, 2024తాడిపత్రిలో పోలీసుల ఓవరాక్షన్..అనంతపురం:తాడిపత్రిలో పోలీసుల తీరు వివాదాస్పదంఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో వీరంగం సృష్టించిన పోలీసులుసీసీ కెమెరాలు, కంప్యూటర్లు, ఫర్నీచర్ ధ్వంసంహార్డ్ డిస్క్, సీపీయూలను మాయం చేసిన పోలీసులుఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పనిమనుషులను బెదిరించిన పోలీసులుతాడిపత్రి నియోజకవర్గంలో 30 మంది వైఎస్సార్సీపీ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులుపోలీసుల తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డివైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు పెడితే సహించేది లేదుఏఎస్పీ రామకృష్ణ సహకారంతో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి రౌడీయిజం చేస్తున్నారుపోలీసుల తీరుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం 11:40 AM, May 15th, 2024పోలీసులు టీడీపీకి కొమ్ము కాశారు: మంత్రి మేరుగ నాగార్జునతాడేపల్లి :మేరుగ నాగార్జున కామెంట్స్.. మంత్రి కామెంట్స్..వైఎస్సార్సీపీ మరోసారి అధికారంలోకి వస్తుంది.ఇది పేదలకు పెత్తందారులకు మద్య జరిగిన యుద్ధం.ప్రజలు నిజమైన నాయకుడికి పట్టం కట్టబోతున్నారు.జూన్ నాలుగోవ తేదిన వైఎస్సార్సీపీ సునామీ రాబోతుంది.చంద్రబాబు ప్రస్టేషన్‌లోకి వెళ్ళాడు.పల్నాడు జిల్లాలో వైఎస్సార్సీపీ నేతలపై దాడులు చేస్తున్నారు.సమస్యాత్మక ప్రాంతాల్లో సెక్యూరిటీ పెంచాలని కోరినా ఎన్నికల కమిషన్ పట్టించుకోలేదుకేంద్రంతో కుమ్మక్కై చంద్రబాబు ఎన్నికలలో అక్రమాలకు పాల్పడ్డారు.పోలీసులు టీడీపీకి కొమ్ము కాశారు.అధికారంలోకి రాగానే ఎన్నికల్లో అక్రమాలకు వంతపాడిన పోలీసు అధికారులపై విచారణ జరిపిస్తాంఘోరాతి ఘోరంగా ఎన్నికల్లో టీడీపీ నేతలు దాడులు చేశారు.జూన్ నాలుగున రాష్ట్ర చరిత్రలో నూతన అధ్యాయం లిఖిస్తాంరాష్ట్రంలో రామరాజ్యం రాబోతుందిపేదలు వైఎస్సార్సీపీకి ఓటు వేశారని దాడులు చేశారు.వైఎస్సార్సీపీకి అండగా నిలిచిన ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలపై పనిగట్టుకొని దాడులకు ఉసిగొల్పారుడీబీటీల ద్వారా నిధులు ప్రజల ఖాతాల్లోకి రాకుండా అడ్డుకున్నది చంద్రబాబే. 9:40 AM, May 15th, 2024టీడీపీ నాయకుల దాష్టీకం..పల్నాడు జిల్లా..దాచేపల్లి మండలం మాదినపాడులో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు దాష్టీకంకర్రలు, ఇనుప రాడులతో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులుబత్తుల ఆదినారాయణ రెడ్డి అనే వైఎస్సార్సీపీ కార్యకర్తపై దాడి చేసిన తెలుగుదేశం నాయకులుతీవ్ర గాయాల కారణంగా ఆసుపత్రికి తరలింపు.గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు 8:51 AM, May 15th, 2024ఏలూరులోనూ టీడీపీ దౌర్జన్యకాండఏలూరు చేపల తూము సెంటర్ 40 డివిజన్ లో రెచ్చిపోయిన టీడీపీ మూకలువైఎస్ఆర్సిపి కార్యకర్తలపై కత్తులతో దాడిగణేష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలుపోలింగ్ కేంద్రాల వద్ద ఇరువర్గాల మధ్య చెలరేగిన గొడవ.. తాజా కొట్లాటకు దారి తీసిన వైనంగాయపడిన వారిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపుఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అర్ధరాత్రి టెన్షన్ వాతావరణంప్రభుత్వ ఆసుపత్రి వద్ద మళ్లీ దాడిరంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులుకొనసాగుతున్న పోలీస్ పహారా 8:25 AM, May 15th, 2024కడపలో అభ్యర్థులకు హైసెక్యూరిటీవైయస్సార్ జిల్లా జమ్మలమడుగులో కొనసాగుతున్న 144 సెక్షన్పట్టణంలో జనాలు ఎక్కువగా గుమికూడి ఉండకూడదంటూ పోలీసుల ఆదేశాలువైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే డాక్టర్ మూలే సుధీర్ రెడ్డితో పాటు కూటమి అభ్యర్ది ఆదినారాయణ రెడ్డి, కడప టిడిపి ఎంపీ అభ్యర్ది భూపేష్ రెడ్డి లకు 2+2 నుండి 4+4 భద్రత పెంపు 7:59 AM, May 15th, 2024ఏపీలో పోలింగ్ శాతం మొత్తంగా ఇలా.. ఏపీలో మొత్తంగా 81.69 శాతం పోలింగ్ నమోదు.ఈవీఎంల ద్వారా 80.59 శాతం పోలింగ్ నమోదు.పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1.10 శాతం నమోదు.అల్లూరి : 70.20అనకాపల్లి : 83.84అనంతపురం : 81.08అన్నమయ్య : 77.83బాపట్ల : 85.15చిత్తూరు : 87.09కోనసీమ : 83.84తూ.గో : 80.93ఏలూరు : 83.67గుంటూరు : 78.81కాకినాడ: 80.31కృష్ణా: 84.05కర్నూలు : 76.42నంద్యాల: 82.09ఎన్టీఆర్: 79.36పల్నాడు : 85.65పార్వతిపురం మన్యం : 77.10ప్రకాశం : 87.09నెల్లూరు : 79.63సత్యసాయి : 84.63శ్రీకాకుళం : 75.59తిరుపతి : 78.63విశాఖ : 68.63విజయనగరం : 81.33ప.గో : 82.59కడప : 79.58 7:45 AM, May 15th, 2024టీడీపీ నేతల దాడులు..పల్నాడు జిల్లామాచవరం గ్రామంలో వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ గుండాలు దాడి.మాచవరం వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు చౌదరి సింగరయ్య పార్టీ నాయకుడు దారం లక్ష్మీ రెడ్డిపై టీడీపీ నాయకుల దాడి.ఇద్దరి కాళ్లు, చేతులపై దాడి. గాయపడిని వారిని స్థానిక ఆసుపత్రికి తరలింపు. 7:20 AM, May 15th, 2024శాంతి భద్రతలకు సహకరిస్తాం: కేతిరెడ్డి పెద్దారెడ్డిఅనంతపురం:ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కామెంట్స్..టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యాలను ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటాంతాడిపత్రిలో వైఎస్సార్సీపీ శ్రేణులు సమన్వయంతో ఉండాలిశాంతి భద్రతల పరిరక్షణకు పూర్తి సహకారం అందిస్తాం. 7:00 AM, May 15th, 2024తాడిపత్రిలో ఉద్రిక్తతలు..అనంతపురం:తాడిపత్రిలో భారీగా పోలీసు బలగాల మోహరింపుతాడిపత్రిలో కర్రలు, రాళ్లతో బీభత్సం సృష్టించిన టీడీపీ నేతలుఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై రాళ్ల దాడికి పాల్పడిన జేసీ వర్గీయులుఅల్లరి మూకలను చెదరగొట్టిన పోలీసులుపోలీసుల విజ్ఞప్తితో తాడిపత్రి నుంచి బయటకు వెళ్లిన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితాడిపత్రిని వీడిన టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో పరిస్థితి ని అదుపులోకి తెచ్చిన పోలీసులునగరంలో 144 సెక్షన్ కొనసాగింపు 6:45 AM, May 15th, 2024డీజీపీకి హోంమంత్రి తానేటి వనిత ఫోన్ టీడీపీ దౌర్జన్యకారుల మీద చర్యలకు డిమాండ్ఏపీ డీజీపీ హరీష్ గుప్తాతో రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత ఫోన్లో మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా పలు చోట్ల తలెత్తిన హింసాత్మక ఘటనలను డీజీపీ దృష్టికి తీసుకెళ్లిన వనిత. చంద్రగిరి, గురజాల, తాడిపత్రి, గోపాలపురం తదితర నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తల హింసాకాండ ఎమ్మెల్యేలపై దాడులు చేస్తుంటే స్థానిక పోలీసులు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారని వనిత సీరియస్. దాడులకు పాల్పడ్డ నాయకులను, కార్యకర్తలను చట్టం ప్రకారం వెంటనే అరెస్టు చేయాలని ఆమె కోరారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో కచ్చితంగా తెలియజేయాలని డీజీపీని కోరారు. 6:30 AM, May 15th, 2024విశాఖ: రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి బ్రహ్మాండంగా వీచింది: బొత్సఅన్ని ప్రాంతాల్లోని ఫ్యాన్ గాలి కనిపించిందిమహిళలు, పెద్ద ఎత్తున బారులు తీరి ఓటింగ్‌లో పాల్గొన్నారుతమకు గౌరవం పెరిగిందని వృద్దులు భావించి ఓటు వేశారు.ఎన్నికల్లో టీడీపీ ఎన్నో కుట్రలు, కుతంత్రాలు పన్నిందిప్రజలు సంక్షేమ పథకాలను అడ్డుకుంది.ల్యాండ్ టైటిల్ యాక్ట్‌పై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేశాయివైఎస్ .జగన్ గెలుస్తారు.. వైజాగ్‌లో ప్రమాణ స్వీకారం చేస్తారుఇచ్చిన హామీలను సీఎం జగన్ నెరవేర్చుతారుమాయ మాటలను ప్రలోభాలను ప్రజలు నమ్మలేదునేను రాజీనామా చేస్తున్నట్లు ఒక మాయ లేఖ సృష్టించిందిఈ లేఖ కూటమి దిగజారుడు రాజకీయాలకు ఒక పరాకాష్టమాయ మాటలతో అధికారంలోకి రావాలని చంద్రబాబు చూశారుచంద్రబాబు మాయ మాటలు ప్రజలు అందరికి తెలుసుమాట ఇస్తే మడమ తిప్పని నేతలు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, సీఎం జగన్సీఎం జగన్ మీద నమ్మకంతో మళ్ళీ ప్రజలు ఓట్లు వేశారుటీడీపీ నేతలు సహనం కోల్పోయారుమా నాయకులు, కార్యకర్తలు ఉద్రేకపడొద్దని సూచన చేశాంఎన్నికల్లో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు
సీఏఏ చట్టం కింద తొలిసారి 14 మందికి భారత పౌరసత్వం
న్యూఢిల్లీ: ‘పౌరసత్వ సవరణ చట్టం-2019’ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో పాకిస్తాన్, అప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లో వేధింపులకు గురైన ముస్లిమేతర వలసదారులకు భారత పౌరసత్వాన్ని మంజూరు చేసే ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసింది. ఈ క్రమంలో భాగంగా తొలిసారి.. 14 మందికి భారత పౌరసత్వం సర్టిఫికెట్‌ను బుధవారం అందజేసింది.సీఏఏ చట్టం కింద ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారిలో తొలి విడతలో భాగంగా 14 మందికి ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌కుమార్ భల్లా పౌరసత్వ సర్టిఫికెట్లను అందజేశారు. సీసీఏ కింద ఢిల్లీలోని 300 మందికి భారత పౌరసత్వ సర్టిఫికెట్లు అందజేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు.కాగా, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్‌లో వేధింపులకు గురై భారత్‌కు వలస వచ్చిన ముస్లిమేతర ప్రజలకు భారత పౌరసత్వాన్ని మంజూరు చేసే ప్రక్రియను 2019లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపట్టింది. దీని కోసం పౌరసత్వ చట్టాన్ని సవరించింది. 2014 డిసెంబర్ 31కు ముందు భారతదేశానికి వచ్చిన ముస్లిమేతర వలసదారులైన హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు, క్రైస్తవులు దీనికి అర్హులని కేంద్రం పేర్కొంది. అలాగే అర్హత వ్యవధిని 11 నుంచి 5 సంవత్సరాలకు తగ్గించింది.2019 డిసెంబర్లో ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య సీఏఏ చట్టం పార్లమెంటు ఉభయసభల్లో ఆమోదం పొందింది. అనంతరం దీనిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం ఆమోద ముద్ర వేశారు. సీఏఏ అమలుపై గత మార్చిలో కేంద్ర ప్రభుత్వం నోటిషికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. భారత పౌరసత్వం మంజూరుకు సంబంధించిన నియమ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే చేసుకోవాల్సి ఉంటుంది.
నా కోసం కొంత డబ్బు కావాలి.. అందుకే నేనే అడిగా: రేణు దేశాయ్ పోస్ట్ వైరల్
గతేడాది రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన నటి రేణు దేశాయ్. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించి అభిమానులను మెప్పించారు. గుంటూరులోని స్టువర్టుపురం గజదొంగ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే తాజాగా రేణు దేశాయ్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. అసలేం జరిగిందో తెలుసుకుందాం.రేణు దేశాయ్ తన ఇన్‌స్టాలో క్యూఆర్ కోడ్‌ను షేర్ చేస్తూ విరాళాలు కావాలంటూ అభ్యర్థించింది. అయితే ఇంత త్వరగా స్పందించి విరాళం అందించి.. మానవత్వం చూపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపింది. నా వంతుగా నేను కూడా సాయం చేస్తున్నప్పటికీ.. మిగిలిన అమౌంట్ కోసం నా ఫాలోవర్స్‌ను అడుగున్నానని రాసుకొచ్చింది. ప్రతిసారీ నా డబ్బును ఇవ్వలేను.. ఎందుకంటే నా దగ్గర కూడా కొంత మాత్రమే డబ్బులు మిగిలి ఉన్నాయని పేర్కొంది. అయితే ఎవరైనా ఆమె అకౌంట్‌ను హ్యాక్ చేసి డబ్బులు డిమాండ్ చేశారా? అని కొందరు అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై రేణుదేశాయ్ క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ఓ వీడియోను పంచుకుంది.రేణు దేశాయ్ మాట్లాడుతూ.. 'ఫుడ్ పాయిజన్ తో కొద్ది రోజులుగా నా ఆరోగ్యం బాగాలేదు. అందుకే వీడియో చేయలేదు. అయితే రూ.3500 కోసం రిక్వెస్ట్ పెట్టింది నేనే. నా అకౌంట్‌ను ఎవరూ హ్యాక్ చేయలేదు. నేను కూడా రెగ్యులర్‌గా డొనేట్ చేస్తూనే ఉంటాను. కానీ అప్పుడప్పుడు నాకు కూడా లిమిట్ ఉంటుంది. డొనేషన్స్‌కి నా డబ్బులంతా ఇచ్చేస్తే నాకోసం.. నా పిల్లల కోసం కావాలి కదా. నా వరకు సాయం చేశాక.. ఏదైనా బ్యాలెన్స్ కావాలంటే ఫాలోవర్స్‌ను అడుగుతున్నా. యానిమల్స్, చిన్నపిల్లల కోసం కూడా నేను విరాళాలు ఇస్తున్నా. అదే నా ఫైనల్ టార్గెట్ కూడా. త్వరలోనే వాటికోసం ఓ షెల్టర్ కూడా నిర్మిస్తాను. అప్పుడు నేనే మిమ్మల్ని అధికారికంగా విరాళాలు సేకరిస్తా. నా రిక్సెస్ట్‌కు స్పందించి రూ.3500 పంపించిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ' అంటూ పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by renu desai (@renuudesai)
కాంగ్రెస్ రైతు వ్యతిరేక చర్యలు.. రాష్ట్రవ్యాప్త నిరసనకు కేసీఆర్ పిలుపు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక చర్యలకు నిరసనగా… గురువారం రాష్ట్రవ్యాప్త నిరసనకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తెల్లారే వరి ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి..ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి వంచించడం,మోసం చేయడం, దగా చేయడమేనని మండిపడ్డారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ రైతువ్యతిరేక విధానాలను కేసీఆర్ ఖండించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 90శాతం రైతులు దొడ్డు వడ్లనే పండిస్తారని, ఈ విషయం తెలిసి రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా ఎలాప్రకటిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం ద్వారా తెలంగాణ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి వచించిందని మండిపడ్డారు. ఓట్లు డబ్బాలో పడంగనే కాంగ్రెస్ వాళ్లకు రైతుల అవసరం తీరిందని, అందుకే నాలిక మడతేసి ఎప్పటి మాదిరిగానే నయవంచనకు పూనుకున్నారని విమర్శించారు. ఇదే సన్న వడ్లకు మాత్రమే అనే మాట ఎన్నికలకు ముందు గనుక చెప్పింటే కాంగ్రెస్ పార్టీని రైతులు తుక్కుతుక్కు చేసేవాళ్లు. ఇప్పటికీ ప్రజలు ఆగ్రహంతోనే ఉన్నారన్నారు.‘రైతుబంధు ఇవ్వకుండ , రైతు భరోసా ఇయ్యకుండా రైతాంగాన్ని అన్నిరకాలుగా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది. అందుకే రైతాంగ హక్కులను హామీలను సాధించేందుకే బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా నిరసన చేపట్టింది బీఆర్ఎస్ కార్యకర్తలు రైతులపక్షాన నిలబడి కొట్లాడాలి. ఇప్పటికీ కొనుగోలు కేంద్రాల్లో వడ్లను కొనడానికి నిర్లక్ష్యం వహిస్తూ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఏడిపిస్తూ గోస పుచ్చుకుంటున్నది. రాష్ట్ర రైతాంగానికి భరోసా కల్పించే దిశగా నిరసన కార్యక్రమాలతో పాటు ప్రతిరోజూ వడ్ల కల్లాలకాడికి బీఆర్ఎస్ శ్రేణులు వెళ్లాలి. వారికి అండగా నిలవాలి. రైతుల హక్కులను కాపాడేందుకు వారికి అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది’ అని అధినేత కేసీఆర్ పేర్కొన్నారు.
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్
ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన, భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్ల నుండి ప్రేరణ పొంది అద్భుతమైన మరియు వైవిధ్యమైన శ్రేణి సమకాలీన, రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్లు, కస్టమర్లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా, ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్, ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్లెట్లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్ 18కేరట్ మరియు 22కేరట్ బంగారంలో విస్తృతమైన శ్రేణి డిజైన్లతో, నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని సంపూర్ణం చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్లెట్లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.
తప్పక చదవండి
- ఎయిరిండియా–విస్తారా విలీన ప్రక్రియలో పురోగతి
- సైన్స్, టెక్నాలజీలో మహిళా గ్రాడ్యుయేట్లు పెరగాలి
- రాజ్యాంగ పరిరక్షణే ప్రధానం: కేజ్రీవాల్
- USCIS: హెచ్1–బీ వీసాదారులకు తీపికబురు
- Amit Shah: కేజ్రీవాల్‌కు స్పెషల్ ట్రీట్మెంట్ !
- USA Presidential Elections 2024: బైడెన్, ట్రంప్ రె‘ఢీ’
- గ్లోబల్ వార్మింగ్‌పై ఫైటర్.. ది మమ్మోత్
- Lok Sabha Election 2024: డ్రమ్స్.. ధూం ధాం
- Lok Sabha Election 2024: మథువాల మద్దతెవరికో!
- Lok Sabha Election 2024: సెన్స్‌క్స్ డౌట్!
సినిమా
పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
అమెజాన్ ప్రైమ్లా బెస్ట్ వెబ్ సిరీస్‌లో లిస్ట్‌లో 'పంచాయత్' తప్పకుండా ఉంటుంది. ఇప్పటి వరకు విడుదలై రెండు సిజన్లూ సూపర్ హిట్ అందుకున్నాయి. సీజన్ 3 కోసం ఎదురుచూస్తోన్న ఫ్యాన్స్ కోసం మేకర్స్ తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. మే 28 నుంచి ఈ సిరీస్ అమెజాన్‌లో విడుదల కానుంది. 2020లో మొదటి సీజన్ విడుదలైతే.. 2022లో సీజన్-2 రిలీజ్ అయింది.కామెడీ డ్రామా సిరీస్‌లో అభిషేక్ త్రిపాఠిగా నటించిన జితేంద్రకుమార్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇండియాలోనే అత్యధిక మంది వీక్షించిన వెబ్‌సిరీస్‌ల లిస్ట్‌లో టాప్ ప్లేస్‌లో ఒకటిగా పంచాయత్ సీజన్ 1, సీజన్ 2 నిలిచాయి. గత సీజన్స్ లాగే సీజన్ 3 కూడా ఎనిమిది ఎపిసోడ్స్‌తో విడుదల కానుంది. మే 28 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో 'పంచాయత్' సీజన్ 3 ఎంట్రీ ఇవ్వనుంది.తాజాగా విడుదలైన ట్రైలర్‌తోనే పంచాయత్ మూడో సీజన్‌పై భారీ అంచనాలను పెంచేశారు. తొలి రెండు సీజన్లు ఎంతటి హిట్ అందుకున్నాయో.. మూడో సీజన్ కూడా ప్రేక్షకులను అలరిస్తుందని అంచనావేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా కామెడీకి ఎక్కువ చోటు కల్పించిన దర్శకుడు రెండో భాగం ముగింపులో కాస్త భావోద్వేగాలను కూడా జోడించడంతో మరింతగా ప్రేక్షకులకు ఈ సిరీస్ దగ్గరైంది.
Buddy First Single: పాటతో రూమర్స్‌కి చెక్ పెట్టిన అల్లు శిరీష్!
‘ఊర్వశివో రాక్షసీవో’(2022) తర్వాత అల్లు శిరీష్ నుంచి ఎలాంటి సినిమా రాలేదు. ఆ సినిమా రిలీజైన కొన్నాళ్లకే బడ్డీ మూవీ అనౌన్స్ చేశాడు. చిన్న గ్లింప్స్ కూడా విడుదల చేశారు. కానీ ఆ తర్వాత ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. ఒకనొక దశలో ఈ సినిమాను పక్కకు పెట్టేసినట్లు వార్తలు వినిపించాయి. తాజాగా ఓ పాటను రిలీజ్ చేసి రూమర్స్ అన్నింటికి చెక్ పెట్టారు మేకర్స్. బుధవారం ఉదయం ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'ఆ పిల్ల కనులే..' రిలీజ్ చేశారు. హిప్ హాప్ తమిళ ఈ పాటను బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు. సాయి హేమంత్ లిరిక్స్ అందించగా హిప్ హాప్ తమిళ తో కలిసి సంజిత్ హెగ్డే, ఐరా, విష్ణు ప్రియ రవి పాడారు. 'ఆ పిల్ల కనులే, చూశాక తననే ఊహల్లో ఎగిరే మైకంలో మునిగే , మైకంలో తేలే, మబ్బులు తాకే, ఇద్దరి కథ ఇక మొదలాయే, నింగి నేల కలిశాయో, ఊసులేవో పలికాయో..' అంటూ మంచి రొమాంటిక్ నెంబర్ గా సాగుతుందీ పాట.శిరీష్, గాయత్రి భరద్వాజ్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు శామ్ ఆంటోన్ దర్శకత్వం వహించగా, స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న "బడ్డీ" సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. రిలీజ్ డేట్ ను త్వరలో అనౌన్స్ చేయబోతున్నారు.
ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సినిమా.. ఉచితంగా స్ట్రీమింగ్
గతేడాదిలో విడుదలైన హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా 'ఆక్వామాన్ అండ్ ద లాస్ట్ కింగ్డమ్' మరో ఓటీటీలోకి రానుంది. ఇప్పటికే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్ ప్రాతిపదికన స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఇప్పుడు జియో సినిమాలో ఈ చిత్రాన్ని ఉచితంగా చూడొచ్చు. 2018లో వచ్చిన ‘ఆక్వామెన్’ తెలుగు ప్రేక్షకులను కూడా అలరించింది. ఆ చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన మరో సూపర్ హీరో ఫిల్మ్ 'ఆక్వామెన్ అండ్ ది లాస్ట్ కింగ్డమ్'.జేమ్స్ వాన్ డైరెక్ట్ చేసిన ఈ ఆక్వామాన్ మూవీలో జేసన్ మొమొవా ఈ ఆక్వామాన్ (ఆర్థర్ కర్రీ) పాత్ర పోషించాడు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి విజయాన్ని అందుకుంది. కామిక్స్ నుంచి పుట్టుకొచ్చిన మరో సూపర్ హీరో 'ఆక్వామెన్'. ఇప్పటికే పలువురు సూపర్‌హీరోలను అందించిన హాలీవుడ్.. అక్వామాన్ను కూడా సూపర్ హిట్ అయింది. మే 21వ తేదీ నుంచి జియో సినిమాలో ఈ చిత్రాన్ని ఫ్రీగా చూడొచ్చు.
పబ్లిసిటీ కోసం వాడుకున్నారు.. అందువల్లే తీవ్రమైన సమస్య: నటి సోదరుడు
బాలీవుడ్ నటి రాఖీ సావంత్ బీ టౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. అయితే ఆమె తల్లి మరణం, భర్తతో వివాదం తర్వాత డిప్రెషన్లోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో తాజాగా రాఖీ సావంత్ తీవ్రమైన గుండె సమస్యతో ముంబయిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని ఆమె బ్రదర్ రాకేశ్ వెల్లడించారు. తన సోదరి డిప్రెషన్లో ఉండడం వల్లే గుండె సమస్య వచ్చిందని ఆమె సోదరుడు రాకేష్ సావంత్ వెల్లడించారు.మా అమ్మ చనిపోయాక అందరూ రాఖీని పబ్లిసిటీ కోసం, డబ్బు కోసం వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. అంతే కాకుండా ఆమెను అందరూ వేధింపులకు గురి చేశారని అన్నారు. ఆదిల్ తన సోదరి వద్ద ఉన్న డబ్బునంతా కాజేసి మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిల్‌పై ఇప్పటివరకు ఛార్జ్‌షీట్ వేయలేదని..డబ్బులతో అందరినీ మేనేజ్ చేస్తున్నాడని అన్నారు. తన సోదరి కోసం ప్రార్థించాలని ఆమె అభిమానులను కోరారు. అందరూ కలిసి రాఖీకి ద్రోహం చేయడంతో దిగ్భ్రాంతికి గురయ్యానని రాకేశ్ పేర్కొన్నారు. రాఖీకి ఏదైనా జరిగితే ఆమె అభిమానులు తనను ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టరని రాకేశ్ సావంత్ అన్నారు. ఆమెకు అపరేషన్ బాగా జరగాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. View this post on Instagram A post shared by Bollywood Khabar (@bollywoodkhabarofficial)
ఫొటోలు
మిస్టర్ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)
International Family Day: ఐపీఎల్ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)
వారి కోసం విరుష్క స్పెషల్ గిఫ్ట్.. ఎందుకంటే? (ఫొటోలు)
Anchor Sreemukhi: ప్లాటినమ్ కలర్ శారీలో ‘రాములమ్మ’ హొయలు.. జింగ్ జింగ్ అమేజింగ్ శ్రీ!
సెలబ్రెటీల స్వీట్ ఫ్యామిలీస్ (ఫోటోలు)
క్రీడలు
WC: నో రిజర్వ్ డే!.. ఒకవేళ టీమిండియా సెమీస్ చేరితే.. జరిగేది ఇదే!
టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియాఒకవేళ సెమీఫైనల్ చేరితే ఆ మ్యాచ్ ‘రిజర్వ్ డే’ లేకుండానే జరగనుంది. తొలి సెమీఫైనల్, ఫైనల్‌కు మాత్రమే ‘రిజర్వ్ డే’ ఉంచుతున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే.కాగా ఈ మెగా టోర్నీలో తొలి సెమీఫైనల్ తరూబా (ట్రినిడాడ్)లో జూన్ 26న స్థానిక కాలమానం ప్రకారం రాత్రి గం. 8:30కు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌కు అంతరాయం కలిగితే తర్వాతి రోజు రిజర్వ్ డే మ్యాచ్ కొనసాగుతుంది. కానీ రెండో సెమీఫైనల్ పరిస్థితి అలా లేదు. పటిష్ట భారత జట్టు సెమీస్ చేరవచ్చని భావిస్తున్న రెండో సెమీస్ ప్రొవిడెన్స్ (గయానా)లో జరుగుతుంది. ఇది జూన్ 27న స్థానిక కాలమానం ఉదయం గం.10:30కి (భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు) ప్రారంభమవుతుంది. టీవీ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకునేభారత్లోని టీవీ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకునే ఈ సమయాన్ని ఖరారు చేశారు. డే మ్యాచ్ కాబట్టి ఆ రోజంతా చాలినంత సమయం ఉంటుంది. దానిని మరుసటి రోజుకు కొనసాగించడంలో అర్థం లేదని ఐసీసీ భావించింది.పైగా జూన్ 29న ఫైనల్ కాబట్టి రెండో సెమీస్‌లో గెలిచిన జట్టు వరుసగా మూడో రోజులు ఆడాల్సిన స్థితి వస్తుంది. ఇది సరైంది కాదని, ఫైనల్‌కు ముందు ఒక రోజు ప్రయాణం ప్లస్ విరామం ఉండాలి కాబట్టి అదే రోజు ఫలితాన్ని తేల్చాలని నిర్ణయించింది.అదనపు సమయం..అయితే ‘రిజర్వ్’కు బదులుగా రెండో సెమీస్‌కు 250 నిమిషాల అదనపు సమయాన్ని ఇస్తారు. వర్షం లేదా ఇతర వాతావరణ పరిస్థితుల కారణంగా ఆట పూర్తిగా జరగకపోతే మరో నాలుగు గంటల పాటు వేచి చూస్తారు. అయితే ఆట జరగకపోతే నిబంధనల ప్రకారం ‘సూపర్ ఎయిట్’లో ఎక్కువ పాయింట్లు సాధించిన టీమ్ ఫైనల్ చేరుతుంది. ఏ గ్రూపులో ఏ జట్టు?👉గ్రూప్-ఏ: కెనడా, ఇండియా(ఏ1), ఐర్లాండ్, పాకిస్తాన్(ఏ2), యూఎస్ఏ👉గ్రూప్-బి: ఆస్ట్రేలియా(బీ2), ఇంగ్లండ్(బీ1), నమీబియా, ఒమన్, స్కాట్లాండ్.👉గ్రూప్-సి: అఫ్గనిస్తాన్, న్యూజిలాండ్(సీ1), పపువా న్యూగినియా, ఉగాండా, వెస్ట్ ఇండీస్(సీ2).👉గ్రూప్-డి: బంగ్లాదేశ్, నేపాల్, నెదర్లాండ్స్, సౌతాఫ్రికా(డీ1), శ్రీలంక(డీ2).సూపర్-8కు అర్హత సాధించిన జట్లు👉ఇండియా, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా, శ్రీలంక. కాగా జూన్ 1 నుంచి మొదలుకానున్న టీ20 వరల్డ్‌కప్-2024కు అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే బీసీసీఐ ఈ మెగా టోర్నీకి రోహిత్ శర్మ సారథ్యంలో 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది.చదవండి: అతడి కంటే చెత్త కెప్టెన్ ఇంకొకరు లేరు.. పైగా హార్దిక్‌ను అంటారా?.. గంభీర్ ఫైర్
T20 WC: సంజూ వద్దు.. పంత్ బెటర్!.. తుదిజట్టులో ఆడించినా..
ఐపీఎల్-2024 ముగిసిన తర్వాత టీ20 ప్రపంచకప్-2024 రూపంలో మరో మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా ఐసీసీ టోర్నీ ఆరంభం కానుంది.ఈసారి ఏకంగా 20 జట్లు ప్రపంచకప్ టోర్నమెంట్లో భాగం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయా దేశాల క్రికెట్ బోర్డులు జట్ల వివరాలను వెల్లడించాయి. ఇందులో భాగంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి సైతం రోహిత్ శర్మ సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.ఈ టీమ్‌లో ఇద్దరు వికెట్ కీపర్ బ్యాటర్లు రిషభ్ పంత్, సంజూ శాంసన్ శాంసన్‌లకు చోటు దక్కింది. ఐపీఎల్-2024లో అదిరే ప్రదర్శనతో కేఎల్ రాహుల్‌ను వెనక్కి నెట్టి మరీ ఈ ఇద్దరూ స్థానం సంపాదించారు.అయితే, తుదిజట్టులో పంత్, సంజూలలో ఎవరు ఉండాలన్న అంశంపై టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. వరల్డ్‌కప్ టోర్నీలో వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్‌కు తాను మొదటి ప్రాధాన్యం ఇస్తానని పేర్కొన్నాడు.సంజూ కంటే పంత్ బెటర్ఇందుకు గల కారణాన్ని వెల్లడిస్తూ.. ‘‘ఐపీఎల్లో పంత్ మిడిలార్డర్లో బ్యాటింగ్ చేస్తున్నాడు. సంజూ శాంసన్ టాపార్డర్‌లో వస్తున్నాడు. పంత్ లెఫ్టాండర్. కాబట్టి మిడిలార్డర్లో అతడు ఉంటే జట్టు కూర్పులో వైవిధ్యం ఉంటుంది.టాపార్డర్‌లో ఇప్పటికే కాంబినేషన్ సెట్ అయింది. కాబట్టి వికెట్ కీపర్ కోటాలో పంత్‌ను తీసుకుంటే మిడిల్ ఆర్డర్లో ఆడించవచ్చు’’ అని గంభీర్ విశ్లేషించాడు. టాపార్డర్‌లో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్‌తో పాటు విరాట్ కోహ్లి ఉన్నారని.. అందుకే సంజూకు ఛాన్స్ దక్కడం కష్టమేనని పేర్కొన్నాడు.ఫినిషర్‌గా రాణించగలడుఒకవేళ పంత్‌తో పాటు సంజూ శాంసన్నూ తుదిజట్టులో ఆడించాలనుకుంటే.. అతడిని ఆరు లేదంటే ఏడో స్థానంలో పంపిస్తే ఫినిషర్ రోల్ పోషించగలడంటూ గంభీర్ భిన్న రీతిలో స్పందించాడు. కాగా జూన్ 5 ఐర్లాండ్‌తో మ్యాచ్‌తో టీమిండియా తమ వరల్డ్‌కప్ ప్రయాణాన్ని మొదలుపెట్టనుంది.కెప్టెన్‌గా, బ్యాటర్‌గా సంజూ హిట్టుఐపీఎల్-2024లో సంజూ శాంసన్ రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా దుమ్ములేపుతున్నాడు. మరోరెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే జట్టును ప్లే ఆఫ్స్‌నకు చేర్చిన ఈ కేరళ బ్యాటర్.. వ్యక్తిగతంగా 12 ఇన్నింగ్స్‌లో కలిపి 486 పరుగులు సాధించాడు.మరోవైపు.. ఢిల్లీ క్యాపిటల్స్ సారథి రిషభ్ పంత్ 13 మ్యాచ్‌లలో కలిపి 446 పరుగులు చేశాడు.అయితే, ఢిల్లీ 14 మ్యాచ్‌లను పూర్తి చేసుకుని కేవలం ఏడింట గెలిచి ప్లే ఆఫ్స్ రేసు నుంచి అనధికారికంగా నిష్క్రమించింది.
కేఎల్ రాహుల్ అవుటైనా సరే.. సంజీవ్ గోయెంక రియాక్షన్ వైరల్!
రెండేళ్ల క్రితం ఐపీఎల్లో అడుగుపెట్టిన లక్నో సూపర్ జెయింట్స్ వరుసగా రెండుసార్లు ప్లే ఆఫ్స్ చేరింది. కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో టాప్-4కు అర్హత సాధించి సత్తా చాటింది. కానీ ఐపీఎల్-2024లో మాత్రం ఈ ఫీట్ పునరావృతం చేసే అవకాశాలు కనిపించడం లేదు.ఢిల్లీ క్యాపిటల్స్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లో లక్నో 19 పరుగుల తేడాతో ఓడిపోయింది. తద్వారా ప్లే ఆఫ్స్ రేసు అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న లక్నో.. మిగిలిన మ్యాచ్‌లో గెలిచినా.. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన దుస్థితి.ఈ నేపథ్యంలో ఢిల్లీతో మ్యాచ్ సందర్భంగా లక్నో యజమాని సంజీవ్ గోయెంక ఇచ్చిన రియాక్షన్స్ వైరల్‌గా మారాయి. కాగా గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో లక్నో చిత్తుగా ఓడిపోయిన విషయం తెలిసిందే.ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌గా, వికెట్ కీపర్ బ్యాటర్‌గా కేఎల్ రాహుల్ విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో సంజీవ్ గోయెంక మైదానంలోనే అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. రాహుల్ వివరణ ఇస్తున్నా పట్టించుకోకుండా కోపంతో ఊగిపోయాడు.ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట విరివిగా చక్కర్లు కొట్టగా సంజీవ్ గోయెంక తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. టీమిండియా స్టార్ పట్ల ఇలా వ్యవహరించడం సరికాదంటూ మాజీ క్రికెటర్లు హితవు పలికారు.ఈ క్రమంలో పొరపాటు గ్రహించిన సంజీవ్ గోయెంక ఢిల్లీతో మ్యాచ్‌కు ముందు రాహుల్‌ను తన ఇంటికి డిన్నర్‌కు పిలిచాడు. ఈ నేపథ్యంలో అతడిని ప్రేమగా హత్తుకున్న ఫొటోను బయటకు వదిలారు. తమ మధ్య అంతా బాగానే ఉందనే సంకేతాలు ఇచ్చారు. Goenka smiling after KL Rahul's wicket pic.twitter.com/R0K4BVteSN— Div🦁 (@div_yumm) May 14, 2024 ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ సందర్భంగా కెమెరాలన్నీ సంజీవ్ గోయెంక వైపే దృష్టి సారించాయి. కేఎల్ రాహుల్ ఐదు పరుగులకే అవుటైనా గోయెంక చిన్నగా నవ్వులు చిందించాడే తప్ప కోపం తెచ్చుకోలేదు. Sanjeev Goenka appreciating KL Rahul's catch. pic.twitter.com/pAeTqjcnTB— Mufaddal Vohra (@mufaddal_vohra) May 14, 2024 అదే విధంగా.. షాయీ హోప్ ఇచ్చిన క్యాచ్‌ను రాహుల్ పట్టగానే లేచి నిలబడి మరీ చప్పట్లు కొడుతూ అతడిని అభినందించాడు. ఇక మ్యాచ్ ఓడిపోయిన తర్వాత మైదానంలో కేఎల్ రాహుల్‌తో నవ్వుతూ మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు బయటకురాగా నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఇంతలో ఎంత మార్పు సార్.. మీరు సూపర్’’ అంటూ సెటైర్లు వేస్తున్నారు.చదవండి: సీజన్ మొత్తం మాకు అదే సమస్య.. అందుకే ఈ దుస్థితి: కేఎల్ రాహుల్ Ishant Sharma x Mukesh Kumar ⚡️⚡️The duo combine to dismiss the #LSG openers 👏👏Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #DCvLSG pic.twitter.com/nuFD7AlK28— IndianPremierLeague (@IPL) May 14, 2024A clinical win at home to finish off their home season 🙌 @DelhiCapitals with a lap of honour for their roaring home fans to extend their gratitude for their love and support 🥳#TATAIPL | #DCvLSG pic.twitter.com/DroMjvb9bU— IndianPremierLeague (@IPL) May 15, 2024KL Rahul with Sanjiv Goenka at the special Dinner in Sanjiv Goenka's home last night in Delhi. [LSG] - All is well at LSG Camp. 🌟 pic.twitter.com/W5BtE0Qmff— Johns. (@CricCrazyJohns) May 14, 2024
అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్‌ను అంటారా?
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా విమర్శకులకు టీమిండియా మాజీ క్రికెటర్, కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్ గౌతం గంభీర్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. పాండ్యా కెప్టెన్సీని తప్పుబట్టిన ఇంగ్లండ్ స్టార్ కెవిన్ పీటర్సన్, సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.కాగా ఐపీఎల్-2024 నేపథ్యంలో ముంబై ఇండియన్స్ గూటికి చేరుకున్న హార్దిక్ పాండ్యా రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. అయితే, ఆల్‌రౌండర్‌గా, సారథిగా అతడు పూర్తిగా నిరాశపరిచాడు.విమర్శల జల్లుగతేడాది రోహిత్ కెప్టెన్సీలో ప్లే ఆఫ్స్ చేరిన ముంబై.. ఈసారి పాండ్యా నాయకత్వంలో టాప్-4 నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది. అందుబాటులో ఉన్న ఆటగాళ్ల సేవలను సరైన విధంగా ఉపయోగించుకోకపోవడం వల్లే ముంబైకి ఈ దుస్థితి ఎదురైందని విమర్శలు వెల్లువెత్తాయి.హార్దిక్ పాండ్యా అతి విశ్వాసం వల్లే ప్రతికూల ఫలితాలు వచ్చాయంటూ విశ్లేషకులు పెదవి విరిచారు. ఈ నేపథ్యంలో కెవిన్ పీటర్సన్, ఏబీ డివిలియర్స్ కూడా పాండ్యాను విమర్శించారు.వాళ్లు పెద్దగా పొడిచిందేమీ లేదుఈ నేపథ్యంలో తాజాగా గౌతం గంభీర్ స్పందిస్తూ.. వీళ్లిద్దరికీ కౌంటర్ ఇస్తూ హార్దిక్ పాండ్యాకు మద్దతునిచ్చాడు. ‘‘వాళ్లు కెప్టెన్‌గా ఉన్నపుడు ఏం సాధించారు? నాకు తెలిసి నాయకులుగా వాళ్లు పెద్దగా పొడిచిందేమీ లేదు.వాళ్ల రికార్డులు పరిశీలిస్తే మరే ఇతర కెప్టెన్‌కు కూడా అంతటి చెత్త రికార్డులు ఉండవు. ఇక ఏబీడీ ఐపీఎల్లో ఒక్క మ్యాచ్‌కైనా సారథ్యం వహించాడా?వ్యక్తిగత స్కోర్లు సాధించాడే గానీ.. జట్టు కోసం అతడి చేసిందేమీ లేదు. తను ఐపీఎల్ విన్నింగ్ కెప్టెన్‌ఇక హార్దిక్ పాండ్యా.. ఇప్పటికే తను ఐపీఎల్ విన్నింగ్ కెప్టెన్. కాబట్టి ఇలాంటి వాళ్లతో అతడికి పోలిక కూడా అవసరం లేదు’’ అంటూ గంభీర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.కాగా పీటర్సన్, ఏబీ డివిలియర్స్ గతంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించారు. పీటర్సన్ 2009లో ఆరు మ్యాచ్‌లలో ఆర్సీబీ కెప్టెన్‌గా వ్యవహరించి కేవలం రెండు విజయాలు అందుకున్నాడు.సారథిగా పీటర్సన్ విఫలంఇక 2014లో ఢిల్లీ ఫ్రాంఛైజీ సారథిగా బాధ్యతలు చేపట్టిన పీటర్సన్ కెప్టెన్సీలో జట్టు కేవలం రెండు విజయాలు సాధించి.. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. మరోవైపు.. గుజరాత్ టైటాన్స్‌ను 2022లో విజేతగా నిలపడంతో పాటు గతేడాది రన్నరప్‌గా నిలిపిన ఘనత హార్దిక్ పాండ్యా సొంతం. ఈ నేపథ్యంలో గంభీర్ స్పోర్ట్స్‌కీడాతో మాట్లాడుతూ.. ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.చదవండి: Virat Kohli: అదే జరిగితే.. ఆర్సీబీ కెప్టెన్‌గా మళ్లీ కోహ్లినే!
బిజినెస్
32 వీడియో లింకులను బ్లాక్ చేసిన యూట్యూబ్!
ప్రముఖ ఆన్లైన్ వీడియో ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ నిషేధిత కంటెంట్‌గా భావించే 32 వీడియో లింకులను బ్లాక్ చేస్తున్నట్లు ప్రకటించింది. హాంకాంగ్ కోర్టు నిర్ణయానికి లోబడి ఈ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పింది.చైనా-హాంకాంగ్ మధ్య కొన్నేళ్లుగా రాజకీయ, బౌగోళిక సమస్య కొనసాగుతోంది. హాంకాంగ్‌లో ప్రత్యేకపాలన ఉంటుంది. అక్కడి ప్రభుత్వాన్ని చైనాకు అనుకూలంగా ఉండే వారికి కట్టబెడుతారు. దాంతో స్థానిక ప్రజలనుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. అందులో భాగంగా 2019లో ‘గ్లోరీ టు హాంకాంగ్’ అనే నిరసన గీతం ప్రాచుర్యంలోకి వచ్చంది. దీన్ని నిషేధించాలని కోరుతూ హాంకాంగ్ అప్పీల్ కోర్టులో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఆ గీతం యూట్యూబ్‌లో వైరల్‌గా మారడంతో దాన్ని తొలగించాలని తాజాగా కోర్టు ఆదేశించింది. ఫలితంగా పాటకు సంబంధించిన 32 వీడియో లింకులను తొలగిస్తున్నట్లు యూట్యూబ్ ప్రకటించింది. చైనా నుంచి హాంకాంగ్ విభజనను కోరుకుంటున్న అసమ్మతివాదులు ఆ పాటను ఉపయోగించుకోవచ్చని న్యాయమూర్తులు హెచ్చరించారు.ఇదీ చదవండి: టీవీ రిమోట్ పనిచేయడం లేదా..? చిట్కా మీ కోసమే..కోర్టు నిర్ణయంతో నిరాశ చెందినట్లు యూట్యూబ్ చెప్పింది. అయినప్పటికీ ఆ తీర్పును పాటిస్తామని స్పష్టం చేసింది. బుధవారం నుంచి ఇకపై యూట్యూబ్‌లో ఆ గీతం కోసం సెర్చ్‌చేస్తే ‘కోర్టు ఆర్డర్ వల్ల ఇందుకు సంబంధించిన కంటెంట్ దేశీయ డొమైన్లో నిషేధించడమైంది’ అనే పాప్అప్ మెసేజ్ వస్తుందని చెప్పింది. ఆన్లైన్లో స్వేచ్ఛగా తమ భావాలను వ్యక్తీకరించానుకునేవారిని కట్టడి చేయడం సరికాదని, ఈ వ్యవహారానికి సంబంధించి ఇతర వర్గాలకు అప్పీల్ చేస్తామని తెలిపింది. ఇప్పటికే మానవ హక్కుల సంస్థలతో తమ భావాలను పంచుకున్నట్లు కంపెనీ పేర్కొంది.
ఫేస్బుక్, ఇన్‌స్టా డౌన్.. యూజర్ల గగ్గోలు
ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్లు ఫేస్బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) స్తంభించాయి. అవుట్‌టేజ్ ట్రాకింగ్ వెబ్సైట్ డౌన్‌డెటెక్టర్ ప్రకారం.. మెటా యాజమాన్యంలోని ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్లు ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది యూజర్లకు పని చేయలేదు.ఇన్‌స్టాగ్రామ్‌ను యాక్సెస్ చేస్తున్నప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు యూజర్ల నుంచి 18,000 కంటే ఎక్కువ ఫిర్యాదులు వచ్చినట్లు డౌన్‌డెటెక్టర్ డేటా చెబుతోంది. వీరిలో 59 శాతం మంది యాప్‌ని యాక్సెస్ చేస్తున్నప్పుడు సమస్యలను ఎదుర్కొన్నారు. 34 శాతం మంది సర్వర్ కనెక్షన్ సమస్యలు, 7 శాతం మంది లాగిన్ చేయడంలో సమస్యలు ఎదుర్కొన్నారు.యూజర్లతోపాటు ఇతర మూలాల ద్వారా పరిస్థితిని తెలుసుకుని డౌన్‌డెటెక్టర్ అంతరాయాలను ట్రాక్ చేస్తుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కొంతమంది యూజర్లు ‘ఎక్స్’ (ట్విటర్)లో అసహనం వ్యక్తం చేశారు. ఇంటర్నెట్ మానిటరింగ్ గ్రూప్ నెట్‌బ్లాక్స్ రెండు సామాజిక వెబ్సైట్లు (ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్) ప్రస్తుతం 'అంతర్జాతీయ అంతరాయాలను' ఎదుర్కొంటున్నాయని ఒక పోస్ట్‌లో పేర్కొంది.
టీవీ రిమోట్ పనిచేయడం లేదా..? చిట్కా మీ కోసమే..
టీవీ రిమోట్..గోడగడియారం..పిల్లల ఆటబొమ్మలు..వంటి బ్యాటరీ ఉన్న వస్తువులు కొన్నిరోజుల తర్వాత పనిచేయకపోవడం గమనిస్తుంటాం. వాటిలో ఏదైనా సాంకేతిక సమస్యా..? లేదా బ్యాటరీ పాడైందా..అనే అనుమానాలు వ్యక్తమవుతాయి. సాంకేతిక సమస్య తలెత్తితే రిపేర్ సెంటర్‌కు తీసుకెళ్తాం. కానీ బ్యాటరీ సమస్య వల్ల పనిచేయకపోతే ఎలా నిర్ధారించుకోవాలనే అంశాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.బ్యాటరీని పరీక్షించండిలా..కొత్త బ్యాటరీని సుమారు 20 సెంటీమీటర్ల(8 ఇంచులు) ఎత్తు నుంచి గట్టి ఉపరితలంపై నిటారుగా జారవిడిచినపుడు అది బౌన్స్ అవ్వదు. ఉపరితలాన్ని తాకినచోటే కిందపడడం గమనిస్తాం. కొత్త ఆల్కలీన్ బ్యాటరీల్లో రసాయన శక్తిని విద్యుత్‌శక్తిగా మార్చే జెల్ వంటి పదార్థం సమృద్ధిగా ఉంటుంది. అది పైనుంచి విసిరిన బలాన్ని నిరోదిస్తుంది. దాంతో బౌన్స్ అవ్వదు. అదే అప్పటికే వాడిన బ్యాటరీలో ఆ జెల్ పదార్థం అంతా అయిపోతుంది. కాబట్టి ఆ జెల్ ఉన్న ప్రాంతమంతా గట్టిగా మారుతుంది. దాంతో పాత బ్యాటరీను పైనుంచి విసిరినపుడు కొంత బౌన్స్ అవుతుంది. అలాజరిగితే అందులో సమస్య ఉన్నట్లు నిర్ధారణకు రావచ్చు. ఈ సాధారణ పరీక్షతో పనిచేయని ఎలక్ట్రానిక్ పరికరంలో బ్యాటరీను మారిస్తే సరిపోతుంది.ఇదీ చదవండి: వినియోగంలోకి రానున్న క్వాంటమ్ కంప్యూటింగ్ఎక్కువకాలం రావాలంటే..చిన్నపిల్లల ఆటవస్తువులు వంటి పరికరాలు ఉపయోగించనపుడు వెంటనే వాటిని స్విచ్ ఆఫ్ చేయాలి. స్టాండ్‌బై మోడ్‌లో కూడా కొన్ని పరికరాలకు ఎనర్జీ అవసరమవుతుంది. దాంతో బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుంది. కాబట్టి వాడిన తర్వాత వెంటనే స్విచ్ఆఫ్ చేయాలి.పరికరాలను ఎక్కువకాలం ఉపయోగించకుంటే అందులోనుంచి బ్యాటరీలను పూర్తిగా తొలగించాలి. అందువల్ల ఎనర్జీ నష్టాన్ని నివారించవచ్చు.అధిక లేదా తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న ప్రదేశాల్లో బ్యాటరీలను నిల్వ చేయరాదు. ఉష్ణోగ్రతల్లోని వ్యత్యాసం వల్ల బ్యాటరీ రసాయన ప్రక్రియలో తేడాలేర్పడుతాయి. వాతావరణంలోని భారీ ఉష్ణోగ్రతల వల్ల జెల్ సామర్థ్యం దెబ్బతింటుంది.పాత బ్యాటరీలను, కొత్తవాటిని కలిపి ఒకేచోట నిల్వచేయకూడదు. ఏదైనా పరికరంలో రెండు బ్యాటరీలు వేయాల్సివస్తే పాత బ్యాటరీ, కొత్త బ్యాటరీను కలిపి వాడకూడదు. దాంతో పాత దానివల్ల కొత్తది త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. కంపెనీలనుబట్టి కూడా సామర్థ్యాల్లో తేడాలుంటాయి. వోల్టేజ్స్థాయుల్లోనూ వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి ఒకే రకమైన బ్యాటరీలను ఉపయోగించడం మేలు.
4 రోజుల తర్వాత ఒక్కసారిగా.. మోత మోగించిన బంగారం!
అక్షయ తృతీయ తర్వాత తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మళ్లీ మోత మోగించాయి. దేశవ్యాప్తంగా పసిడి ధరలు ఈరోజు (మే 15) గణనీయంగా పెరిగాయి. నాలుగు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.రెండు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాలతోపాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.400 పెరిగింది. ప్రస్తుతం రూ.67,150 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం కూడా రూ.430 పెరిగి రూ. 73,250 లను తాకింది.ఇతర ప్రధాన నగరాల్లో ధరలుదేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.400 పెరిగి రూ.67,300 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.430 ఎగిసి రూ.73,400 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.400 పెరిగి రూ.67,150లకు, 24 క్యారెట్ల స్వర్ణం రూ.430 పెరిగి రూ.73,250 లకు చేరుకుంది.ఇక బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.400 పెరిగి రూ.67,150 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.430 పెరిగి రూ.73,250 లకు ఎగిసింది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.350 పెరిగి రూ.67,250లకు చేరింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.380 ఎగిసి రూ.73,360 లను తాకింది.వెండి ధరలుదేశవ్యాప్తంగా బంగారం ధరలతోపాటు వెండి ధరలు కూడా ఈరోజు పెరిగాయి. హైదరాబాద్‌లో వెండి ధర ఈరోజు కేజీకి రూ.300 చొప్పున పెరిగింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.91,000లుగా ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)
వీడియోలు
పోలీస్ ఫెయిల్యూర్.. బాబు, పురందేశ్వరి మేనేజ్..
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన టీడీపీ, జనసేన వీడియో
ఈసీ బదిలీ చేసిన చోటే ఈ దారుణాలు
రాజశ్యామల సహస్ర చండీయాగం వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు
కొంతమంది పోలీసులు టీడీపీ వాళ్ళతో కుమ్మక్కై: అంబటి
ఏపీ సీఎస్, డీజీపీని ఢిల్లీకి పిలిచిన ఈసీఐ
YSRCPకి ఓటు వేశాడని తండ్రిపై కొడుకు దాడి..
8 ఏళ్ల పాప.. ఈ ఘటన మనసును కలిచివేసింది..
రేపటి నుండి AP EAPCET ఎక్సమ్స్
సినిమా లవర్స్‌కి షాక్..2వారాలు థియేటర్స్ బంద్..
ఫ్యామిలీ
'ఇడియట్ సిండ్రోమ్' అంటే ఏంటీ..? ప్రమాదకరమా..?
రోజుకో కొత్త సిండ్రోమ్‌లు వచ్చేస్తున్నాయి. టెక్నాలజీకి తగ్గట్టుగా కొత్త కొత్త వ్యాధులు వచ్చేస్తున్నాయి. మనుషుల పిచ్చి అపోహాలు, నమ్మకాలే వ్యాధుల రూపంలో సిండ్రోమ్లుగా బయటకొస్తున్నాయి. అలాంటి సరికొత్త సిండ్రోమ్ ఒకటి ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. దానిపేరే 'ఇడియట్ సిండ్రోమ్'. ఏంటీ సిండ్రోమ్? ఎందువల్ల వస్తుందంటే..?'ఇడియట్' అంటే "ఇంటర్నేట్ డెరైవ్డ్ ఇన్ఫర్మేషన్ అబ్ర్స్టక్షన్ ట్రీట్మెంట్". ఈ సిండ్రోమ్ ఉన్న వ్యక్తులు అందుబాటులో ఉన్న ఆన్లైన్ హెల్త్ సమాచారానికి ప్రాధాన్యత ఇచ్చి స్వీయ చికిత్స తీసుకుంటారు. అనారోగ్యాన్ని నిర్థారించుకోవడానికి పూర్తిగా ఆన్లైన్ వనరులనే ఆశ్రయిస్తారు. ఈ పరిస్థితిని "ఇడియట్ సిండ్రోమ్"అని పిలుస్తారు. ఈ సిండ్రోమ్ ఉన్న రోగులు ఇంటర్నెట్ సర్చ్‌ల ఆధారంగా వ్యాధులను స్వయంగా నిర్థారణ చేసుకుంటారు. ఆఖరికి డాక్లర్లు సూచించిన చికిత్సలను కూడా పక్కన పెట్టేసి వారు ఆన్లైన్ ద్వారా తెలుసుకున్న చికిత్సను స్వయంగా చేసుకోవడం, ఆ మందులనే వాడడం వంటివి చేస్తారు. ఇక్కడ ఈ వ్యక్తులు రోగ నిర్థారణ కోసం వెబ్ శోధనే సరియైనదని భావించడమే ప్రమాదం. డబ్ల్యూహెచ్ఓ దీన్ని 'ఇన్ఫోడెమిక్' అని పిలుస్తుంది. ఈ విధమైన తీరు రాను రాను మరింత తీవ్రమై వైద్య నిపుణలపై అమనమ్మకానికి దారితీస్తుంది. రోగులు ఇక్కడ ఆరోగ్య సమాచారాన్ని ఆన్లైన్ వంటి సాంకేతికతో తెలుసుకోవడం వరకు మంచిదే తప్పులేదు. అదే సాయంతో తనకు తానుగా ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది ప్రమాదకరం అని వైద్యుల చెబుతున్నారు. ఆరోగ్యానికి ఎలా ప్రమాదమంటే..ఈ విధానం ముదిరిపోతే వారి దృష్టిలో ఆన్లైన్ హెల్త్ సమాచారమే తిరుగలేనిదిగా కనిపిస్తుంది. నిరంతరం ఆన్లైన్ సెర్చ్లకే పరిమితమైపోతారు. దీంతో విపరీతమైన, ఆందోళనకు, ఒత్తిడికి గురవ్వుతారు.ఒకవేళ్ల అది ఇచ్చిన సమాచారాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే అసలుకే మోసం వచ్చి ఆరోగ్యాన్ని చేజేతులారా నాశనం చేసుకునే ప్రమాదం ఉంది. ఈ వైఖరి వైద్య సహాయాన్ని నిరాకరించే స్థితికి తీసుకొస్తుంది. అప్పటి వరకు వాడుతున్న మందులను కూడా ఆపేయడం లేదా వేనే వాటిని వాడేలా చేస్తుంది. దీంతో ఆయా వ్యక్తులు ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిని, లేనిపోని అనారోగ్యల బారినపడతారు.ఇక్కడ వెబ్ అనేది ఒక సాధనం. దీని ద్వారా ఆరోగ్యానికి సంబంధించిన విషయాలపై అవగాహన ఏర్పరుచుకోండి తప్పులేదు. శృతిమించితేనే ప్రమాదం. రోగ నిర్థారణ, చికిత్సల సలహాల కోసం వైద్య నిపుణులను సంప్రదించడమే ఉత్తమం అని గ్రహించండి. (చదవండి: ఆస్ట్రేలియాలో ఏం జరుగుతోంది? ఎందుకలా..?)
మిస్ యూఎస్ఏ విజేతల వరుస రాజీనామాలు! రీజన్ ఏంటో చెప్పిన తల్లులు
మిస్ యూఎస్ విజేతల వరుస రాజీనామాలు అమెరికాను షాక్ గురి చేసింది. అదీకూడా రెండు మూడు రోజుల వ్యవధిలోనే జరగడం పలు రకాల అనుమానాలకు లెవనెత్తింది. అయితే ఆ మోడల్స్ ఇద్దరిలో ముందుగా తన స్థానం నుంచి తప్పకుంటున్నట్లు ప్రకటించిన మిస్ యూఎస్ఏ 2023 నోలియా వోగ్ట్ తన మానసిక ఆరోగ్య నిమిత్త రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించగా, మరో మోడల్ మిస్ టీన్ యూఎస్ఏ 2023 తన వ్యక్తిగత విలువలు సంస్థతో సరిపోవడం లేదని చెబుతూ తప్పుకుంటున్నట్ల ప్రకటించింది. అయితే అసలు ఎందుకు ఆ ఇరువురు అందాల భామలు సడెన్‌గా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటూ రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ఎట్టకేలకు వాటికి ఆ విజేతల తల్లులు వివరణతో తెరపడింది. ఆ బ్యూటీ క్వీన్స్ తల్లులైన బార్బరా, జాక్లైన్ వోగ్ట్, తమ కుమార్తెలు మిస్ యూఎస్ఏ ఆర్గనైజేషన్‌లో చాలా చేదు అనుభవాలను ఎదుర్కొన్నారని చెప్పారు. వారు సంస్థకు సంబంధించిన నాన్ డిస్క్లోజర్ ఒప్పందాల(ఎన్డీఏ) కారణంగా వారు ఎదుర్కొన్న భయానక అనుభవాల గురించి పెదవి విప్పడం లేదని చెప్పారు. తమ కుమార్తెలు సంస్థకు సంబంధించిన కొందరి వ్యక్తుల నుంచి లైంగిక వేధింపులను కూడా ఎదుర్కొన్నారని తెలిపారు. విజేతలుగా కిరీటాన్ని గెలుచుకున్నప్పటికీ వాళ్లు ఏం పొందలేదన్నది చెప్పాలనుకోవడం లేదని అన్నారు. వాళ్లు అక్కడ పలు దుర్భాషలకు, బెదిరింపులకు గురయ్యారు. తాము ఇలా బయటకొచ్చి చెప్పడానికి ప్రధాన కారణం ప్రధాన పోటీల్లో ఉండే వాస్తవాల గురించి మిగతా తల్లిదండ్రులు కూడా తెలసుకోవాలనే ఉద్దేశ్యంతోనేననిన్నారు. కాగా, మిస్ యూఎస్ఏ పోటీలు ఇటీవలి సంవత్సరాలలో అనేక వివాదాలు, కుంభ కోణాల్లో చిక్కుకుంది. అలాగే కొంతమంది పోటీదారులకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు పలు ఆరోపణలు కూడా వచ్చాయి.(చదవండి: డీజిల్‌తో పరాటా చేయడమా? చివరికి యజమాని..)
డీజిల్‌తో పరాటా చేయడమా? చివరికి యజమాని..
ఇటీవల కొందరూ సోషల్ మీడియా స్టార్డమ్ కోసం పిచ్చిపనులు మతిపోయేలా ఉంటాయి. అస్సలు అర్థంపర్థం లేని విధంగా రోతగా ఏవేవో రీల్స్ చేసేస్తుంటారు. చూశావాడి కర్మలే అనో లేక ఇలా చేస్తే వ్యూస్ పెరుగతాయన్న భావమో గానీ ఇలాంటి వాటి వల్ల కొందరూ ప్రాణాలు పోగొట్టుకుంటే మరికొందరూ నెగిటివిటీని తెచ్చుకుని చివరికి వివరణ ఇచ్చుకునే పరిస్థితి తెచ్చుకుంటారు. అలాంటి ఘటనే చండీగఢ్‌లో ఒకటి చోటు చేసుకుంది. చండీగఢ్‌లో ఓ ఆహార విక్రేత డీజిల్‌తో చేసిన పరాఠాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పెద్ద దూమరం రేపింది. ఒక్కసారిగా నెటిజన్లు దీనిపై భారత ఫుడ్ కార్పొరేషన్ తనిఖీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దెబ్బకు సదరు ఫుడ్ యజమాని చన్నీ సింగ్ దిగొచ్చి తాము డీజిల్ పరాటా వంటవి చేయమని వివరణ ఇచ్చారు. అలాగే వీడియోలో చెప్పినట్లుగా కస్టమర్లకు అలాంటి పరాటాలను అందించమని తెలిపారు.True recipe for cancer (petrol diesel wala paratha)Where r we heading? 🤦#AlluArjun #Pithapuram #MondayVibes #MorningVibes #MadhaviLatha #ViralVideo #ElectionDay pic.twitter.com/GyxC1xhQeb— K.P.Brinda Reddy (@kpbrindareddy) May 13, 2024 కేవలం వినోదం కోసం సరదాగా చేసిన రీల్ అని చెప్పుకొచ్చారు. మా కంటెంట్ మిమ్మల్ని ఎంతగానో బాధించిందనందుకు తనని క్షమించండని వేడుకున్నాడు. అలాగే తాము ఈ ఆలు పరాటాలను శుద్దమైన నెయ్యి, నూనెలతోనే తయారు చేస్తామని చెప్పారు. అలాగే ఆ వీడియోని తీసిన అమన్ ప్రీత్ సింగ్ కూడా ఇన్స్టామ్ వేదికగా క్షమాపణ తెలిపాడు. View this post on Instagram A post shared by Amanpreet Singh (@oyefoodiesinghఈ మేరకు సదరు వ్యక్తులు ఇన్‌స్టామ్‌లో.. చండీగఢ్ పరిపాలనా యంత్రాంగానికి, యావత్తు భారతదేశ ప్రజలకు నా హృదయపూర్వక క్షమాపణలు. తాము తీసిని వీడియో కంటెంట్ మిమ్మల్ని ఎంతో భాదించదనందుకు చింతిస్తున్నాం అని అందుకు మమల్ని క్షమించండని వేడుకున్నారు. సరదా కోసి ఇలా ఏదిపడితే అది చేస్తే జనాలు ఊరుకోరు. స్టార్ డమ్, వ్యూస్ మాట పక్కన ఉంచితే ఇలా ప్రజలను తప్పుదోవ పట్టించారని ఎవరైనా కేసు పెడితే ఊచలు లెక్కించా ల్సిందే. సరదా అనేది అందరికీ సంతోషమే తెప్పించాలి గానీ ఆగ్రహం తెప్పించేలా ఉండకూడదు.(చదవండి: నాన్‌స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!)
సెలబ్రెటీల స్వీట్ ఫ్యామిలీస్ (ఫోటోలు)
న్యూస్ పాడ్‌కాస్ట్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో 81.3 శాతం పోలింగ్... వెల్లడించిన సీఈవో కార్యాలయం వర్గాలు.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో పోటెత్తిన ఓటర్లు. కడపటి వార్తలు అందే సమయానికి 76.50 శాతం పోలింగ్.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో వన్స్‌మోర్... రాష్ట్రంలో మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం తథ్యమని జాతీయ మీడియా సంస్థల సర్వేల్లో వెల్లడి.. ఇంకా ఇతర అప్డేట్స్
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 50 సీట్లు కూడా రావు, ప్రతిపక్ష పార్టీ హోదా దక్కదు... తేల్చిచెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని 57 నెలలకే అంతం చేసే కుట్రలు.. ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం.. ఇంకా ఇతర అప్డేట్స్
చంద్రబాబుది పెత్తందార్ల కూటమి... ఎన్నికల ప్రచార సభల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం.. ఇంకా ఇతర అప్డేట్స్
దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా కనిపిస్తారు... కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై తీవ్ర దుమారం.. ఇంకా ఇతర అప్డేట్స్
నేడు వేములవాడకు నరేంద్ర మోదీ... రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్న ప్రధానమంత్రి... ఇంకా ఇతర అప్డేట్స్
క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
భూమి లాక్కున్నట్లు ఒక్క రైతయినా చెప్పాడా అంటూ చంద్రబాబు, ఎల్లో మీడియాకు సీఎం జగన్ సూటి ప్రశ్న.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
పరిచయం పెంచుకొని.. పాపను విడిచి
రాయగడ: రైలులో ప్రయాణించిన ఒక మహిళ పక్కనే తనతో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికురాలితో మాటామాటా కలిపి పరిచయం పెంచుకొని, చివరకు గమ్యం స్థానం చేరేసరికి పాపను విడిచి పరారైంది. మునిగుడలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని చంద్రపూర్ ప్రాంతానికి చెందిన అనంత్ క్రొటింగ్ అనే మహిళ మంగవారం ఏదో పనిమీద రాయగడ వచ్చారు. పనులు ముగించుకున్న అనంతరం తిరిగి తన స్వగ్రామానికి వెళ్లేందుకు రాయగడలో ట్రైన్ ఎక్కింది. జనరల్ కంపార్ట్మెంట్లో కూర్చుంది. పక్కనే మరో మహిళ చంటి పాపతో ప్రయాణం చేస్తోంది. కొద్దిదూరం ప్రయాణం చేసిన తర్వాత వారి మధ్య మాటామాటా కలిసి పరిచయం పెరిగింది. అనంతరం మునిగడు రైల్వేస్టేషన్లో ఇద్దరు మహిళలు దిగారు. ఇంతలో పాపను కాసేపు ఎత్తుకోండి టాయ్‌లెట్స్‌కు వెళ్లి వస్తానని చెప్పి పాపను క్రొటింగ్ అనే మహిళకు అప్పగించింది. పాపను ఎత్తుకున్న క్రొటింగ్ గంటలు తరబడినా ఎదురుచూసిన వాళ్ల అమ్మ రాలేదు. దీంతో కావాలనే పాపను విడిచిపెట్టాలని నిర్ణయించకున్నారని అర్థం చేసుకొని మునిగుడ పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించింది. వెంటనే ఐఐసీ సౌదామిని బెహర వెంటనే స్పందించి జిల్లా శిశుసంరక్షణ కేంద్రం వారికి సమాచారం అందించారు. ప్రస్తుతం పాప శిశు సంరక్షణ కేంద్రంలో సురక్షితంగా ఉంది. అయితే పాపను ఎత్తుకుని ప్రయాణించిన మహిళ ఎవరు, ఎక్కడి నుంచి ప్రయాణించింది, పాపను విడిచిపెట్టి వెళ్లడంపై సమగ్ర దర్యాప్తు చేపడతామని పోలీసులు పేర్కొన్నారు. రైల్వేస్టేషన్లో ఉన్న సీసీ కెమేరాల ఆధారంగా ఆ మహిళను గుర్తించి పట్టుకునే ప్రయత్నం చేస్తామన్నారు.
ఇంటికి చేరే వేళ మృత్యు గంట
ఇంటికి చేరే వేళ మృత్యు గంట ’’ తెల్లారిన కూలీల బతుకులు ట్రాక్టర్‌ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్ రోడ్డు ప్రమాదంలో నలుగురు కూలీల మృతి ధాన్యం బస్తాలు లోడ్ చేస్తుండగా దుర్ఘటన మృతదేహాల వద్ద కుటుంబ సభ్యుల రోదన పి.గన్నవరం/అంబాజీపేట: వారంతా రెక్కాడితేగాని డొక్కాడని పేద కుటుంబాలకు చెందిన కూలీలు. జీవనాధారంలో భాగంగా ట్రాక్టర్ పై ధాన్యం బస్తాలు లోడ్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఆర్టీసీ బస్ రూపంలో మృత్యువు వారిని కాటేసింది. ప్రధాన రహదారి నెత్తురోడింది. మృతుల కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. కూలి పనులకు వెళ్లిన వారు తిరిగి మరో 30 నిమిషాల్లో ఇంటికి చేరతారనుకున్న సమయంలో విగత జీవులు అయారనే వార్త తెలియడంతో వారి కుటుంబాలు శోకసంద్రంలో మునిగాయి. పి.గన్నవరం మండలం, ఊడిమూడి గ్రామం వద్ద ఆర్.పి.రోడ్డుపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఊడిమూడి గ్రామం వద్ద చింతావారిపేట సమీపంలో రోడ్డు పక్కన ట్రాక్టర్ పై ధాన్యం బస్తాలను పది మంది కూలీలు లోడ్ చేసి పగ్గం కడుతున్నారు. అదే సమయంలో రాజోలు నుంచి రావులపాలెం వెళుతున్న ఆర్టీసీ బస్ ట్రాక్టర్‌ను వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్, ట్రాక్టర్ల కింద పడి కూలీలు మృత్యువాత పడ్డారు. జి.పెదపూడికి చెందిన నూకపెయ్యి శివ (35), వాసంశెట్టి సూర్యనారాయణ (45), ఈరి కట్లయ్య (50), ఊడిమూడి శివారు ఆదిమూలంవారిపాలెంకు చెందిన చిలకలపూడి మణిబాబు (30) అక్కడికక్కడే మృతి చెందారు. ఆదిమూలవారిపాలెంకు చెందిన చిలకలపూడి సురే‹Ùకు తీవ్ర గాయాలు కాగా అమలాపురం ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. జి.పెదపూడికి చెందిన బొరుసు నానికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. బొరుసు రాంబాబు, బుజ్జి, వాసంశెట్టి సాయికిరణ్, గూనపాటి పెద్దిరాజులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఆర్టీసీ బస్‌లో 20 మంది ప్రయాణికులున్నారు. ఇద్దరు మహిళలకు స్వల్పగాయాలు అయ్యాయి. బస్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. రెండు గ్రామాల్లో విషాద ఛాయలు... మరో 30 నిమిషాల్లో ఇళ్లకు చేరుకోవల్సిన వారు విగత జీవులుగా మారడంతో జి.పెదపూడి, ఆదిమూలంవారిపాలెం గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యుల రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి. జి.పెదపూడికి చెందిన నూకపెయ్యి శివ కొబ్బరి వలుపు కారి్మకుడిగా, కూలీగా పని చేసేవాడు. మృతునికి భార్య బేబి కుమారి, సుశాంత్, జస్వంత్ అనే చిన్న పిల్లలు ఉన్నారు. భర్త శివ మరణించడంతో ఆ కుటుంబం దిక్కులేనిదయ్యిందని బంధువులు, కుటుంబ సభ్యులు రోదించారు. అదే గ్రామానికి చెందిన వాసంశెట్టి సూర్యనారాయణ మృతి చెందడంతో భార్య దుర్గ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. సూర్యనారాయణ కుమార్తె నాగేశ్వరికి ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. ఇంటిలో శుభకార్యం జరిగి ఏడాది తిరగ కుండానే అందరిని వదలి వెళ్లిపోయాడని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన వీరి కట్లయ్యకు భార్య సుబ్బలక్షి్మ, కుమారులు నాగరాజు, సురే‹Ù, కుమార్తెలు వైష్ణవి, హారికలు ఉన్నారు. అతని మృతితో పెద్ద దిక్కును కోల్పోవడమే కాకుండా జీవనాధారం కోల్పోయామని కుటుంబీకులు విలపిస్తున్నారు. ఆదిమూలంవారిపాలెంకు చెందిన చిలకలపూడి మణిబాబు మృతి చెందడం, అతని అన్న సురేష్ తీవ్ర గాయాలపాలై ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో వారి తల్లితండ్రులు వెంకటేశ్వరరావు, సత్యనారాయణమ్మ రోదనలు గ్రామస్తులకు కంటతడి పెట్టించాయి. అందరితో కలివిడిగా ఉండే మణిబాబు మృతి చెందడం, సురేష్ తీవ్ర గాయాలు పాలవ్వడంతో బంధువులు, స్నేహితులు బోరున విలపిస్తున్నారు. ఆందోళన చేపట్టిన గ్రామస్తులు నిర్లక్ష్యంగా, మితి మీరిన వేగంతో బస్సును నడిపి నలుగురు మృతికి కారణమైన బస్ డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జి.పెదపూడి, ఊడిమూడికి చెందిన నాయకులు, గ్రామస్తులు ఆర్పీ రోడ్డుపై ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. కలెక్టర్, ఎస్పీ, ఆరీ్టవోలు రావాలని నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్తత వాతావారణం నెలకొనడంతో పి.గన్నవరం సీఐ డి.ప్రశాంత్‌కుమార్, ఎస్సై బి.శివకృష్ణ ఆందోళన కారులతో చర్చించారు. ఆర్డీఓ సత్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకుని మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ మొత్తం పెంచాలని మృతుల కుటుంబ సభ్యులు ఆందోళన కొనసాగిస్తున్నారు.
‘బుల్లెట్’ పేలిన ఘటనలో మరొకరి మృతి
హైదరాబాద్: బుల్లెట్ ద్విచక్ర వాహనం పెట్రోల్ ట్యాంక్ పేలిన ఘటనలోఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో వ్యక్తి షౌకత్ అలీ మంగళవారం మృతి చెందాడు. భవానీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం జరిగిన ఈ దుర్ఘటనలో దాదాపు 10 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరు 80 శాతానికి పైగా కాలిన గాయాలతో చికిత్స పొందుతూ.. సోమవారం ఉదయం మహ్మద్ నదీం మృతి చెందాడు. భవానీనగర్ ఇన్స్పెక్టర్ ఎం.బాలస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. జహంగీర్‌నగర్ ప్రాంతానికి చెందిన అబ్దుల్ రహీంఖాన్ ఈ నెల 10న బుల్లెట్ వాహనంపై తన భార్య నేహాతో పని నిమిత్తం బయటికి వెళ్తున్నాడు. నసీర్ ఫంక్షన్ హాల్ సమీపం వద్దకు రాగానే వాహనం నుంచి స్వల్పంగా మంటలు రాసాగాయి. దీంతో అబ్దుల్ రహీం ఖాన్ వాహనాన్ని స్థానికుల సహాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయతి్నంచాడు. ఇంతలోనే బుల్లెట్ వాహనం కింద పడిపోవడంతో పెట్రోల్ ట్యాంక్ ఒక్కసారిగా పేలడంతో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. ఈ ఘటనలో అబ్దుల్ రహీం ఖాన్‌తో పాటు మంటలను ఆర్పేందుకు సహాయం చేసిన స్థానికులు సలేహ, షేక్ అజీజ్, ఖాజా పాషా, చెరుకు బండి యజమాని మహ్మద్ నదీం, ఫలక్‌నుమా జహంగీర్‌నగర్‌కు చెందిన స్క్రాప్ వ్యాపారి షౌకత్ అలీ, మహ్మద్ హుస్సేన్ ఖురేíÙ, షేక్ ఖాదర్, గౌస్ రహమాన్లు మంటల వ్యాప్తి కారణంగా గాయాలకు గురయ్యారు. మంటలను ఆర్పే ప్రయత్నంలో మొఘల్‌పురా పీఎస్ కానిస్టేబుల్ సందీప్ సైతం గాయాలకు గురయ్యాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహ్మద్ నదీమ్ సోమవారం మృతి చెందగా.. ఫలక్‌నుమా జహంగీర్‌నగర్‌కు చెందిన స్క్రాప్ వ్యాపారి షౌకత్ అలీ మంగళవారం మృతి చెందాడు.
Bengal Tiger: అభిమన్యు వెళ్లిపోయాడు
బహదూర్‌పురా: నెహ్రూ జూ పార్క్‌లో అభిమన్యు అనే 8 ఏళ్ల తెల్లపులి కిడ్నీ సంబంధిత వ్యాధితో మంగళవారం మృతి చెందింది. నెహ్రూ జులాజికల్ పార్క్‌లో 2016 సంవత్సరం మే నెలలో బద్రి, సమీరాలకు రెండు తెల్లపులి కూనలు జని్మంచాయి. అందులో ఒకటైన అభిమన్యు జూలోనే పెరిగింది. ఇది మృతి చెందడంతో అధికారులు వీబీఆర్ఐ, లాంకోన్స్తో పాటు ఇతర విభాగాల శాస్త్రవేత్తలు, డాక్టర్లు జూలోనే పోస్టుమార్టం నిర్వహించారు. గత కొన్ని సంవత్సరాలుగా నెహ్రూ జులాజికల్ పార్కులో కిడ్నీ, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో పులులు, సింహాలు, చిరుత పులులు మృతి చెందుతుండటం ఆందోళన కలిగిస్తోంది.