Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

AP Elections 2024: CM YS Jagan Election Speech At Chilakaluripet
బాలకృష్ణ, దత్తపుత్రుడికి జిరాక్స్‌ కాపీలిచ్చారా?: సీఎం జగన్‌

పల్నాడు, సాక్షి: లంచాలు,అవినీతి లేని పాలనతో పథకాలు కొనసాగాలన్నా, ఇంటింటి అభివృద్ధి జరగాలన్నా.. జగన్‌కు ఓటేయాలని, పొరపాటున చంద్రబాబుకి ఓటేస్తే పథకాలన్నీ ముగింపుతో పాటు మోసపోతారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. శనివారం ఉదయం చిలకలూరిపేట నియోజకవర్గం పరిధిలో నిర్వహించిన ప్రచార సభలో ఆయన పాల్గొని‌ ప్రసంగించారు.చిలకలూరిపేట సిద్ధమా?.. దేవుడి దయతో ఇవాళ వాతావరణం చల్లగా ఉంది. చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమానురాగాలు, ఇంతటి ఆప్యాయతలు చూపిస్తూ మీ బిడ్డకు అండగా, తోడుగా ఉంటున్న నా ప్రతీ అక్కకూ, నా చెల్లెమ్మకి, నా ప్రతీ అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతీ సోదరుడికి, నా ప్రతి స్నేహితునికీ ..మీ అందరికి మీ బిడ్డ జగన్‌ రెండు చేతులు జోడించి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు.జరగనున్నాయి ఎన్నికల సమరం. బ్యాలెట్‌ బద్దలు కొట్టేందుకు సిద్ధమేనా?. జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. అదే చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే... పథకాలన్నీ ముగింపు. మళ్లీ మోసపోటం. ఇది చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం. సాధ్యం కాని ఆయన మేనిఫెస్టోలకు అర్థం. చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తల పెట్టడమే.దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో మీ బిడ్డ ఈ 59 నెలల పాలనలో గతంలో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకువచ్చాడు. గతంలో ఎప్పుడూ జరగని విప్లవాలను మీ బిడ్డ తీసుకురాగలిగాడు. ఆలోచన చేయండి. గతంలో ఎప్పుడూ జరగని విధంగా రూ.2.70 లక్షల కోట్ల రూపాయిలు బటన్ నొక్కడం...నేరుగా నా అక్కచెల్లమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి. నేరుగా వారి చేతికే డబ్బులు వెళ్లిపోతాయి. ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు.మీ బిడ్డ పాలన కంటే ముందు ఈ మాదిరిగా బటన్లునొక్కడం అన్నది, ఈ మాదిరిగా డబ్బులు నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి ఇన్ని పథకాల ద్వారా వారి చేతికే రావడం అన్నది గతంలో జరిగాయా?గతంలో ఎప్పుడూ చూడని విధంగా 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఈ 59 నెలల పాలనలో మీ బిడ్డ ఇవ్వగలిగాడు. ఇంతకు ముందు మేనిఫెస్టో ఇచ్చేవారు. ఎన్నికలయ్యాక చెత్త బుట్టలో వేసే పరిస్థితిని మీ బిడ్డ మార్చాడు. మేనిఫెస్టోను ఒక బైబుల్ గా ఒక ఖురాన్‌గా ఒక భగవద్గీతగా నిర్వచనమిస్తూ.. ఏకంగా 99% హామీలు నెరవేర్చి, ఆ మేనిఫెస్టోను ప్రతీ అక్కచెల్లెమ్మల ప్రతీ ఇంటికి పంపించాడు. మీరే టిక్కు పెట్టండి అంటూ విశ్వసనీయత పరిస్థితి ఈ 58 నెలల కాలంలోనే జరిగింది.ఇప్పుడు నేను గడగడా గడగడా మచ్చుకు కొన్ని పథకాల పేర్లు చెబుతా. గవర్నమెంట్‌ బడి పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు, మూడో తరగతి నుంచే సబ్జెక్ట్‌ టీచర్లు.. ఐబీ దాకా ప్రయాణం. గవర్నరమెంట్‌ బడుల్లో చదివే పిల్లల కోసం బైలింగువల్‌ టెక్స్ట్‌ బుక్‌లు. బడులు తెరిచేసరికే విద్యాకానుక. బడుల్ పిల్లలకు గోరుముద్ద. చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా.. పిల్లల చదువులకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఓ అమ్మ ఒడి. పెద్ద చదవుల కోసం ఏ తల్లీ తండ్రీ అప్పులపాలు అవ్వకూడదని.. మెడిసిన్‌, డిగ్రీలు చదువుతున్న పిల్లల కోసం 93 శాతం పూర్తి ఫీజులు కడుతూ.. ఒక జగనన్న విద్యాదీవెన, ఓ జగనన్న వసతి దీవెన..గతంలో ఎప్పుడైనా జరిగాయా?నా అక్కచెల్లెమ్మలను వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడాలని, వాళ్లకు ఏదో ఒక ఆదాయాలు ఉండాలని, వాళ్లుకూడా ఎదగాలని.. నా అక్కచెల్లెమ్మల కోసం ఒక ఆసరా, చేయూత, సున్నావడ్డీ, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, నా అక్కచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల స్థలాలు వారిపేరిట రిజిస్ట్రేషన్. అందులో ఏకంగా కడుతున్న ఏకంగా 22 లక్షల ఇళ్లు.. గతంలో ఎప్పుడైనా జరిగాయా?నా అవ్వాతాతలకు ఇంటికే రూ.3000 పెన్షన్‌. ఇంటి వద్దకే రేషన్‌, పౌర సేవలు. పథకాలు.. గతంలో మీ ఇంటి వద్దకే ఎప్పుడైనా వచ్చాయా?. గతంలో ఎప్పుడైనా జరిగిందా?, మొట్టమొదటిసారిగా.. రైతన్నకు చెయ్యి పట్టుకుని నడిపిస్తూ.. పెట్టుబడికి సహాయంగా రైతుభరోసా. మొదటిసారిగా రైతన్నలకు ఓ ఉచిత పంటలబీమా, మొట్టమొదటిసారిగా సీజన్ ముగిసేలోగా ఇన్‌పుట్ సబ్సిడీ, మొట్టమొదటిసారిగా పగటి పూటే 9 గం.ల ఉచిత విద్యుత్, గ్రామంలో ఒక ఆర్బీకే వ్యవస్థ...ఇన్నిన్ని మార్పులు గతంలో ఎప్పుడైనా జరిగాయా? అని అడుగుతున్నాను.వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడుతూ.. సొంతంగా ఆటోలు, టాక్సీలు నడుపుతున్న డ్రైవరన్నలకు ఓ వాహన మిత్ర, నేతన్నలకో నేతన్న నేస్తం, మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసా.. ఫుట్‌పాత్‌ల మీద శ్రమజీవులను గతంలో ఎవరైనా పట్టించుకున్నారా?. ఇవాళ వాళ్లకు ఓ తోడు.. బ్రహ్మణులకు, రజకులకు ఓ చేదోడు, లాయర్లకు ఒక లా నేస్తం. ఇలా స్వయం ఉపాధి రంగంలో ఇంత మందికి తోడుగా ఉంటున్న పరిస్థితి గతంలో ఎప్పుడైనా జరిగాయా?ఏ పేదవాడు వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదని.. ఏకంగా రూ. 25 లక్షలకు విస్తరించిన ఆరోగ్యశ్రీ. రెస్ట్‌ పీరియడ్‌లో పేదవాడికి ఆరోగ్య ఆసరా. గ్రామంలోనే విలేజ్‌ క్లినిక్‌. గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్‌. ఇంటికే టెస్టులు చేస్తూ.. మందులిస్తున్న ఆరోగ్య సురక్ష. ఇంతంగా పేదవాడి ఆరోగ్యం కోసం ఇంతలా చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందా?.గ్రామంలోకి అడుగుపెడుతూనే ఒక సచివాలయ వ్యవస్థ. ఆ సచివాలయ వ్యవస్థ నుంచి నాలుగు అడుగులు ముందుకు వేస్తే రైతన్నను చేయి పట్టుకు నడిపిస్తూ ఓ ఆర్బీకే. మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే ప్రతి పేదవాడికీ వైద్యంపరంగా అండగా ఉంటూ విలేజ్ క్లినిక్‌. ఇంకో నాలుగు అడుగులు ముందుకు వేస్తే నాడునేడు ద్వారా బాగుపడ్డ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌. మరో నాలుగు అడుగులు వేస్తే కనిపిస్తుంది ఫైబర్ గ్రిడ్, గ్రామంలో నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరరీ. మొట్టమొదటిసారి నా అక్కచెల్లెమ్మల రక్షణ కోసం మహిళా పోలీస్. మొట్టమొదటిసారి అక్కచెల్లెమ్మల ఫోన్‌లో దిశ యాప్. ఏ ఆపదలో ఉన్నా.. ఫోన్‌ ఐదుసార్లు షేక్‌ చేసినా చెల్లెమ్మా ఏం జరిగింది అని అడుగుతున్న పరిస్థితి. లంచాలు, అవినీతి లేని పాలన.. నేను చెప్పినవన్నీ కూడా గతంలో లేనివి...మీ బిడ్డ పాలనలో ఈ 59 నెలల్లో జరిగినవి.. నిజమా? కాదా? అని అడుగుతున్నాను.కుట్రలు గమనించాలిజరగబోయేది రెండు కులాల మధ్య యుద్ధం కాదు. రెండు సిద్దాంతాల మధ్య యుద్ధం జరుగుతోంది. పేదవాడు ఒకవైపు.. పెత్తందారు ఒకవైపు ఉన్నారు. జరుగుతున్న కుట్రలు గమనించాలి. రెండు నెలల కింద దాకా అవ్వాతాతలకు పెన్షన్‌ ఇంటికే వచ్చేది. అలాంటిది.. ఎక్కడ మీ బిడ్డకు మంచి పేరు వస్తుందో అని పెన్షన్‌ ఆపేసి.. ఆ అవ్వాతాతల ఉసురు తగిలించుకున్నారు.ఏ ప్రభుత్వమైన 60 నెలల కోసం ప్రజలు ఎన్నుకుంటారు. కానీ, 57 నెలలకే మీ బిడ్డ ప్రభుత్వం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. మీ బిడ్డ బటన్‌లు నొక్కిన సొమ్మును ఆ అక్కాచెల్లెమ్మలకు ఇవ్వకుండా ఢిల్లీతో కలిసి కుట్రలు చేస్తున్నారు. ఈ డబ్బంతా ఎన్నికలయ్యాక ఇస్తారట. 14వ తేదీ ఇస్తారట. ఇది కుట్ర కాదా?. అయినా ఫర్వాలేదు. కారణం ఏంటంటే.. నాకు కావాల్సింది.. నా అక్కాచెల్లెమ్మల ముఖాల్లో సంతోషం. వాళ్ల పిల్లల చదువులు, రైతన్నల ముఖంలో సంతోషం.అలాగే.. ల్యాండ్‌ టైటిలింగ్‌యాక్ట్‌, రిజిస్ట్రేషన్‌ల మీద ఎలాంటి దుష్ప్రచారం చేస్తున్నారో చూస్తున్నాం. ఇదే చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణ విశాఖలో, దత్తపుత్రుడు(పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశించి..) ఏపీలో భూములు కొన్నారు. మరి వారికి ఒరిజినల్‌ ఇచ్చారా?.. మరి జిరాక్స్‌లు ఇచ్చారా? అని అడుగుతున్నా. ఏపీలో 9 లక్షల మంది రిజిస్ట్రేషన్‌ చేయించారు. కానీ, చంద్రబాబు దుష్ప్రచారం ఏ స్థాయిలో ఉందో గమనించాలి అని సీఎం జగన్‌ కోరారు.

Ksr Comments On The Difference In The Governance Of YS Jaganmohan Reddy And Chandrababu Naidu
చంద్రబాబు కొత్త రాగం.. మరో డ్రామాకు పచ్చ బ్యాచ్‌ రెడీ!

ఆంధ్రప్రదేశ్‌లో కీలకమైన పోలింగ్ ఘట్టానికి రంగం సిద్దమైంది. ఒక రకంగా ఇవి అత్యంత కీలకమైన ఎన్నికలు అని చెప్పాలి. ముఖ్యమంత్రి వైఎస్ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌మోహన్‌ రెడ్డికి మళ్లీ ఓటు వేయవలసిన అవసరం ఉందా? లేదా? అన్నదే కీలకమైన చర్చ. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఈ ఐదేళ్లు చేసిన కార్యక్రమాలు, విపక్ష నేతగా చంద్రబాబు అనుసరించిన విధానాలు, ఇద్దరి మధ్య ఉన్న వత్యాసాలు, ప్రజల పట్ల వీరికి ఉండే నిబద్దత, చెప్పిన మాటపై నిలబడే తత్వం మొదలైనవన్నీ ప్రజల ముందుకు పరీక్షకు వస్తాయి. వీటన్నిటిని ఆలోచించి ఓటర్లు ఒక నిర్ణయానికి వస్తే సముచితంగా ఉంటుంది.⇒ బహుశా ఏపీలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికలలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వ పనితీరు గురించి చర్చించుకుంటున్నారు. ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాల గురించి చర్చ జరుగుతోంది. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, చంద్రబాబుల మధ్య ఉన్న తేడా గురించి ఆలోచిస్తున్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఒక విశ్వసనీయతకు నిలువుటద్దంగా కనిపిస్తున్నారు. అదే చంద్రబాబు నాయుడు విశ్వసనీయత అన్న పదమే తన నిఘంటువులో లేనట్లు ప్రజల ముందు నిలబడుతున్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికు అబద్దాలు చెప్పడం చాతకాదు.. చంద్రబాబుకు నిజాలు చెప్పడం చాతకాదు అంటే ఆశ్చర్యం కాదు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజల నుంచి వచ్చిన మనిషి అయితే చంద్రబాబు నాయుడు మానిప్యులేషన్స్, మానేజ్‌మెంట్‌ నైపుణ్యం ద్వారా ఎదిగిన వ్యక్తి.⇒ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికు పేదల పట్ల అపారమైన అనురక్తి ఉందని పలుమార్లు రుజువైంది. తన పాదయాత్రలో కానీ, ముఖ్యమంత్రి అయ్యాక తన టూర్‌లలో కానీ ఆయన పేదలు, వృద్దులు, అనారోగ్యానికి గురైనవారిని దగ్గరకు తీసుకునే తీరు ఇందుకు అద్దం పడుతుంది. అదే చంద్రబాబు నాయుడు అయితే పెత్తందార్లకు ప్రతినిధిగా పెట్టుబడిదారులకు ఇచ్చే ప్రాధాన్యత పేదలకు ఇవ్వరు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీల పట్ల ఎప్పుడూ, ఎక్కడా అనుచితంగా వ్యవహరించలేదు. వ్యాఖ్యలు చేయలేదు. పైగా వారందరిని నా.. నా.. నా.. అని పిలుచుకుంటారు. అదే చంద్రబాబు నాయుడు ఎస్సీలలో ఎవరైనా పుడతారా? అంటూ ప్రశ్నించారు.⇒ నాయి బ్రాహ్మణులు సచివాలయానికి వస్తే పవిత్ర ఆలయంలోకి వచ్చి ప్రశ్నిస్తారా అని మండిపడ్డారు. మత్స్యకారుల తోకలు కట్ చేస్తానని హెచ్చరించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వాగ్దానం ఇస్తే నిలబెట్టుకోవడానికి తాపత్రయపడతారు. చంద్రబాబు అయితే ఎన్నికల తర్వాత అసలు ఆ వాగ్దానం తానెప్పుడు చేశానన్నట్లు మాట్లాడతారు. అవసరమైతే అన్ని హామీలు ఎక్కడ అమలు చేస్తామని ప్రశ్నిస్తారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తను మంచి చేశానని అనుకుంటే ఓటు వేయండని ధైర్యంగా ప్రజలకు పిలుపు ఇస్తారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓటర్లను బెదిరించి ఓటు అడుగుతారు. తాను వేసిన రోడ్డు మీద నడుస్తారు.. తాను ఇచ్చిన టాయిలెట్ వాడతారు.. ఇంకొకరికి ఎలా ఓటు వేస్తారు? అని ప్రశ్నించి అందరిని ఆశ్చర్యపరుస్తారు.⇒ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఐదు కోట్ల మంది ప్రజల శ్రేయస్సు కోసం ఆలోచిస్తే, చంద్రబాబు నాయుడు అమరావతి పేరుతో ఉన్న రాజధాని 29 గ్రామాలలోని తన వర్గం వాళ్లకు, తన పార్టీ వారికి ఎలా ఉపయోగపడాలా? అని ఆలోచిస్తారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిది రియల్ డెవలప్ మెంట్ విజన్ అయితే చంద్రబాబుది రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ విజన్. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముప్పై ఒక్క లక్షలమందికి ఇళ్ళ స్థలాలు, ఇరవై లక్షల ఇళ్లునిర్మించడం ద్వారా సుమారు పది లక్షల కోట్ల సంపదను పేదవారికి సృష్టిస్తే, చంద్రబాబు అమరావతిలో కొద్దివేల మందికి ఇన్ సైడ్ ట్రేడింగ్ ద్వారా కోట్ల రూపాయల సంపద సృష్టించి, అదంతా ఏపీకోసమే అని బుకాయిస్తారు.⇒ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత' రాష్ట్రం కష్టాలలో ఉంది.. నేను అది చేయలేను.. ఇది చేయలేను.. నేను చాలా కష్టపడుతున్నాను.." అంటూ ఇలాంటి సానుభూతి మాటలు చెప్పలేదు. తాను చేయగలిగింది చేసుకుంటూ ఐదేళ్లు ప్రభుత్వాన్ని నడిపారు. అదే చంద్రబాబు విభజిత ఏపీలో తన ఐదేళ్ల పాలనలో నిత్యం రాష్ట్రం ఆర్ధిక కష్టాలలో ఉంది.. తాను ఇరవైనాలుగు గంటలు శ్రమిస్తున్నాను.. ప్రజలు సహకరించాలి.. విరాళాలు ఇవ్వాలి. రాజధానికి ఇటుకలు కొనాలి.. అంటూ ఎప్పుడూ ఆయన ఏడుపుకొట్టు మాటలు మాట్లాడి ప్రజలను విసిగించేవారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మూడు రాజధానుల అభివృద్ది ద్వారా మూడు ప్రాంతాలు వికసించాలని చెబుతారు. చంద్రబాబు ఒక్క అమరావతి గ్రామాలలోనే లక్షల కోట్లు ఖర్చు పెట్టాలని అంటారు.⇒ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఎక్కడైనా రాజధానులపై తన అభిప్రాయాన్ని ఒకే రకంగా చెబుతారు. అదే చంద్రబాబు అయితే ఒక్కోచోట ఒకరకంగా వ్యవహరిస్తారు. ప్రధాని మోదీ వచ్చినప్పుడు కలల రాజధాని అమరావతిని రక్షించడానికే వచ్చారని చంద్రబాబు విజయవాడ పత్రికలలో ప్రకటనలు ఇచ్చారు. విశాఖ, తిరుపతి ప్రాంతాలలో మాత్రం అమరావతి ఊసే లేకుండా జాగ్రత్తపడ్డారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వలంటీర్ల వ్యవస్థను తెచ్చి దానిపైనే కట్టుబడి ఉండి ప్రజలందరికి ఇళ్ల వద్దే సేవలు అందించారు. చంద్రబాబు వలంటీర్లపైన నీచమైన విమర్శలు చేశారు. ఇప్పుడు అదే వలంటీర్ల వ్యవస్తను కొనసాగిస్తానని అంటారు. పైగా పదివేల రూపాయల వేతనం ఇస్తానని మభ్య పెట్టే యత్నం చేస్తారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తన ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చే హామీలకు ఎంత వ్యయం అవుతుందో స్పష్టంగా వివరించారు. చంద్రబాబు పొరపాటున కూడా తన హామీలకు ఎంత వ్యయం అయ్యేది చెప్పకుండా జనాన్ని మాయ చేయాలని చూస్తారు.⇒ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మానిఫెస్టోని అమలు చేస్తుంటే రాష్ట్రం శ్రీలంక అవుతుందని ప్రచారం చేస్తారు. ఎన్నికల సమయం వచ్చేసరికి తాను వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఇచ్చినదానికన్నా మూడు రెట్లు అదనంగా ఇస్తానని ప్రజలను నమ్మించాలని చూస్తారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తన 2019 మానిఫెస్టో, కొత్త మానిఫెస్టో చూపించి తాను ఏమి చేసింది వివరించుతారు. చంద్రబాబు ఎప్పుడూ 2014 నాటి మానిఫెస్టో ఊసే ఎత్తరు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వరు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఎవరిని దూషించరు. ఉదాహరణకు చంద్రబాబుతో కుమ్మక్కై సోనియాగాంధీ దారుణమైన అక్రమ కేసులు పెట్టించినా ఎన్నడూ ఆమెను ఒక్క మాట అనలేదు. అలాగే ప్రధాని మోదీతో కూడా సత్సంబంధాలే కోరుకుంటారు. రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యం అని అంటారు. చంద్రబాబు మాత్రం తాను జాతీయ నాయకుడనని భ్రమపడుతుంటారు.⇒ ఆయా రాష్ట్రాలు ప్రత్యేక విమానాలలో తిరిగి మోదీకి పోటీగా కాంగ్రెస్ తో కలిసి కూటమి కడతారు. కూటమి ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్‌ను గాలికి వదలివేస్తారు. మోదీని టెర్రరిస్టు అని, భార్యను ఏలుకోలేనివాడు దేశాన్ని ఎలా ఎలుతాడని అంటారు. విదేశాలలో సైతం మోదీ వల్ల పరువు పోయిందని చెపబుతారు. కానీ మోదీనే మళ్లీ ప్రధాని అయ్యేసరికి యుటర్న్ తీసుకుని కాళ్లావేళ్లపడి ఆయనతో పొత్తు పెట్టుకుంటారు. అప్పుడు మోదీ విశ్వగురు అయ్యారని పొగుడుతారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తాను చేసిన అభివృద్దిని పూర్తి స్థాయిలో చెప్పుకోరు. ఉదాహరణకు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వంలో నాలుగు ఓడరేవులు, పది ఫిషింగ్ హార్బర్లు, కొప్పర్తి పారిశ్రామికవాడ, శ్రీసిటీలో ఏసీ తయారి ప్లాంట్, బద్వేల్ లో సెంచరీ ప్లై వుడ్ ప్లాంట్, విశాఖలో అదానీ డేటా సెంటర్.. ఇలా అనేక పరిశ్రమలు వచ్చినా ఆయన రోజూ ప్రచారం చేసుకోరు. కానీ చంద్రబాబు మాత్రం అసలు పరిశ్రమలే రాలేదని, అభివృద్ది లేదని డబాయించి ప్రచారం చేస్తుంటారు.⇒ ఆయన టైమ్‌లో వచ్చిన ఒక్క కియా ప్లాంట్‌నే ఎల్లవేళలా ప్రచారం చేసుకుంటారు. చంద్రబాబు టైమ్ లో ఉద్దానం కిడ్నీ బాధితులకు శాశ్వత పరిష్కారం చూపే యత్నం జరగలేదు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఒక పెద్ద ఆస్పత్రి, నిపుణుల నియామకం, పరిశోధనతో పాటు 700 కోట్లతో శుద్ది చేసిన సురక్షిత నీరు సరఫరా స్కీమ్ అమలు చేశారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తానిచ్చిన వాగ్దానాలకు కొనసాగింపుగా మరికొన్ని హామీలు ఇస్తే, చంద్రబాబు ఆకాశమే హద్దుగా ఎన్నికల ప్రణాళికను ప్రకటించి దానికి సూపర్ సిక్స్ అని పేరు పెట్టారు. అందులో కూడా అత్యధికం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పెట్టిన స్కీములనే కొనసాగించి అదనంగా మరింత ఇస్తానని చెబుతారు.⇒ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పేదల విద్యకు, ప్రభుత్వ స్కూళ్ల బాగుచేతకు ప్రాధాన్యం ఇస్తుంటే, చంద్రబాబు నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకు సరఫరా చేస్తానని చెబుతారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చి దిద్దితే, చంద్రబాబు వాటిని పట్టించుకోలేదు. విద్య, వైద్యం ప్రైవేటు రంగానికి అప్పగించి వారికి లాభాలు సమకూర్చారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హయాంలో వచ్చినన్ని స్కీములు, కొత్త వ్యవస్థలు మరే ముఖ్యమంత్రి తీసుకు రాలేకపోయారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్లు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్, ఆరోగ్య శిబిరాలు, ఫ్యామిలీ డాక్టర్ విధానం వంటివి తీసుకువస్తే చంద్రబాబు ఎన్నడూ ఆ దిశగా యోచించలేదు.⇒ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తనకు అంత విజన్ ఉంది.. ఇంత విజన్ ఉంది అని గొప్పలు చెప్పుకోకపోయినా, అనేక వ్యవస్థలను సృష్టించి తన విజన్ ఏమిటో ప్రజలకు తెలియచేశారు. చంద్రబాబు తనకు 2020 విజన్, 2037 విజన్ అంటూ ఆయా చోట్ల కాపీ కొట్టిన విషయాలను తనవిగా ప్రచారం చేసుకుంటూ తాను చాలా గొప్పవాడినని భ్రమపడుతుంటారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తాను తీసుకు వచ్చిన స్కీములన్నిటిని ఆయనే చెప్పలేరు. ఎందుకంటే ఆ స్థాయిలో, అంత సంఖ్యలో పథకాలు తెచ్చి అమలు చేసి తన సమర్థత ఏమిటో ఏపీ ప్రజలకు చూపించారు. అమ్మ ఒడి, చేయూత, ఆసరా, తదితర స్కీముల ప్రస్తావన వస్తే ఠక్కున వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గుర్తుకు వస్తారు. కానీ చంద్రబాబు తనది ఫలానా స్కీము అని చెప్పుకునే పరిస్థితి లేదు.⇒ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా ఐదేళ్లపాటు ప్రశాంతంగా పాలన సాగితే, చంద్రబాబు కక్షపూరిత పాలన అని, విధ్వంసం అని, వినాశనం అని దుర్మార్గ ప్రచారం చేస్తుంటారు. తన టైమ్‌లో అమరావతి పేరుతో ముప్పై ఐదు వేల ఎకరాల మూడు పంటలు పండే భూమిని విధ్వంసం చేస్తే మాత్రం అది గొప్ప విషయం అని ఊదర గొడుతుంటారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఒకరకంగా స్వయం ప్రకాశం అయితే చంద్రబాబు ఎవరో ఒకరిపై ఆధారపడి పదవిలోకి వస్తుంటారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కష్టాలు, నష్టాలకు ఓర్చి, పెద్ద, పెద్ద రాజకీయ తిమింగలాలను ఎదుర్కుని నిలబడితే, చంద్రబాబు కుట్రలు, కుయుక్తులు, కూటమి ఎత్తులు, జిత్తులపై ఆధారపడి రాజకీయం చేస్తుంటారు.⇒ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఒక కష్ట జీవి అయితే, చంద్రబాబు కష్టపడుతున్నట్లు నటించే జీవి అని చెప్పాలి. అబద్దాలు ఆడడానికి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఇష్టపడరు. చంద్రబాబు అలవోకగా అబద్దాలు ఆడగలరు. అసత్యాలను సృష్టించగలరు. అందుకు ఉదాహరణే లాండ్ టైటిలింగ్ చట్టంపై లేనిపోని ఒక మోసపూరిత కల్పిత వదంతులను సృష్టించి జనంలోకి వదిలారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తన ప్రత్యర్థులను కూడా దూషించరు. చంద్రబాబు ప్రతి చోట తన ప్రత్యర్ధి రాజకీయ పార్టీల నేతలను నోటికి వచ్చినట్లు దూషిస్తుంటారు. అదే టైమ్‌లో తనను ఎవరైనా ఏదైనా అంటే ప్రజల కోసం పడతానంటూ కొత్త డ్రామా ఆడుతారు. రాజకీయ అధికారం కోసం ఎంతకైనా దిగజారుతారు. ఎవరితో నైనా కలవడానికి, ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవడానకి సిగ్గుపడరు. అంతకు ముందు బండబూతులు తిట్టుకున్నా, ఏ మాత్రం ఫీల్ కారు.⇒ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వ్యవస్థలు, లేదా వ్యక్తుల మేనేజ్‌మెంట్ తెలియని వ్యక్తి అయితే, చంద్రబాబు అచ్చంగా వ్యవస్థలు, మీడియాను మేనేజ్ చేసే నిపుణుడుగా పేరొందారు. ఒక్క మాటలో చెప్పాలంటే వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజల మనిషి.. చంద్రబాబు మీడియాపై ఆధారపడే మనిషి. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిను ఓడించలేమని భయపడే చంద్రబాబు నాయుడు జనసేన, బీజేపీలతో పొత్తుపెట్టుకున్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మాత్రం ధైర్యంగా తన పార్టీ ఒంటరిగానే పోటీచేస్తుందని జనంతోనే తన పొత్తు అని ధైర్యంగా ప్రకటించి ఎన్నికల బరిలో నిలబడ్డారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మధ్య వయస్కుడైతే, చంద్రబాబు 75 ఏళ్ల వృద్దుడు. ప్రజలు తమకు ఎవరు కావాలో నిర్ణయించుకోవాలి.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

AP Elections 2024: May 11th Politics Latest News Updates Telugu
May 11th: ఏపీ ఎన్నికల సమాచారం

ఏపీ ఎన్నికలకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం..

Road Accident Leads To Seize Crores Of Cash At Nallajarla Highway
తూ.గో.లో వ్యాన్‌ బోల్తా.. కోట్లలో పట్టుబడిన డబ్బు

సాక్షి తూర్పుగోదావరి జిల్లా: ఓ రోడ్డు ప్రమాదంతో అక్రమంగా తరలిస్తున్న డబ్బులు పట్టుబడ్డాయి. ఘటనా స్థలంలో పోలీసులు పరిశీలనలో భారీగా తరలిస్తున్న నగదు గుట్టు బయటపడింది. వివరాలు.. నల్లజర్ల మండలం అనంతపల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. తౌడులో కలిపే కెమికల్‌ బస్తాలతో వెళ్తోన్న వ్యాన్‌ను వెనకనుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్‌ బోల్తా పడగా, క్లీనర్‌, డ్రైవర్‌కు గాయాలయ్యయి. వారిని ఆసుపత్రికి చేర్చి చికిత్స అందిస్తున్నారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ క్రమంలో వ్యాన్‌ అడుగు భాగంలో 7 అనుమానాస్పద బాక్స్‌లను పోలీసులు గుర్తించారు. ఉన్నతాధికారుల సమక్షంలో బాక్స్‌లను అనంతపల్లి టోల్‌ ప్లాజా వద్ద తెరిచి చూడగా భారీగా నగదు బయటపడింది.Cinematic: Accident leads to Rs 7 crore cash seizure packed in 7 cardboard boxes loaded in Tata Ace vehicle going from Vijayawada towards Vizag, that overturned after hitting a truck & one box fell out revealing currency hidden packed in between sacks #AndhraPradesh #EastGodavari pic.twitter.com/OXoy0oaRJI— Uma Sudhir (@umasudhir) May 11, 2024 బాక్స్‌లోని డబ్బులను అధికారులు,ఎలక్షన్‌ ఫ్లైయింగ్‌ స్వ్కాడ్‌ లెక్కిస్తోంది. నగదు మొత్తం రూ. 7 కోట్ల వరకు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. వీటిని రాజమండ్రి నుంచి విజయవాడకు తరలిస్తున్నట్టుగా సమాచారం.ఆ సొమ్ము ఎవరిదై ఉంటుందన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఎన్నికలకు రెండు రోజుల ముందు భారీ గా నగదు లభ్యం కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

Posani Krishna Murali Reacts To Eenadu, ABN Fake News On land Titling Act
బాబును సీఎం చేసేందుకే ఈ లేనిపోని పెంట వార్తలు: పోసాని

సాక్షి, విజయవాడ: ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టంపై ఈనాడు, ఆంధ్రజ్యోతి దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు ఏపీఎఫ్‌డీసీ చైర్మన్‌ పోసాని కృష్ణమురళి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చే వాడే.. కానీ తీసుకునేవాడు కాదని స్పస్టం చేశారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. పేదల భూములు లాక్కుంటే తానే విజయవాడలో ఆత్మహత్య చేసుకుంటానని అన్నారు.తన మాటలను నమ్మాలని, కూటమి విష ప్రచారాన్ని నమ్మవద్దని హితవు పలికారు. చంద్రబాబును నమ్మి మళ్లీ మోసపోవద్దని కోరారు. మీ భూమి మీది కాదంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలు పచ్చి అబద్ధమని అన్నారు. రైతులకు వంశపార​ంపర్యంగా వచ్చే బూములు వారికి కాకుండాపోతాయా? అని ప్రశ్నించారు. చంద్రబాబును సీఎం చేయడానికి లేనిపోని పెంట రాసి జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. సడెన్‌గా రామోజీ భార్య ఆయన భార్య కాకుండాపోతుందా అనిసెటైర్లు వేశారు.‘సీఎం జగన్‌ను తిట్టాలి అని చంద్రబాబు పిలుపు ఇవ్వగానే హైదరాబాద్ నుంి,ఇ ఫ్లైట్ వేసుకొని వచ్చి ఒక పచ్చ మంద దిగుతుంది. ఒక్క రోజు కుిడా ఏపీలో లేనివారు ఇవాళ ఏపీ గురించి మాట్లాడతున్నారు. కరోనా సమయంలో ఇప్పుడు మాట్లాడుతున్న పచ్చమంద ఎవరైనా వచ్చి సాయం చేశారా? అప్పుడు మాట్లాడని వారు ఇప్పుడు మాట్లాడుతున్నారు. కోవిడ్‌ కాలంలో బాబు హైదరాబాద్‌ మదీనాగూడలోని వందల ఎకరాల ఫాంమౌజ్‌లో ఉన్నాడు. కరోనా సమయంలో కనీసం పవన్ కల్యాణ్‌ వస్తాడేమో అని ఎదురు చూశారు. మరి కరోనా సమయంలో కాపులకు అయినా సహాయం చేశాడా పవన్?.కానీ సీఎం జగన్‌ ఒక్కడే రాష్ట్రంలో నిలబడి కరోనా లో ప్రజలకు నిజాయితీగా సేవలు అందించాడు. నేను చెప్పాను అని కాదు జగన్‌ను మీరు కోల్పోతే మీకు ఒక్క పథకం దక్కదు. చంద్రబాబు అన్ని పథకాలు తీసేస్తాడు. ఒక్క పైసా కూడా పేదలకు రానివ్వడు. ప్రజలంతా ఒక్కసారి ఓటు వేసే ముందు ప్రశాంతంగా ఆలోచించండి. ప్రాణం ఉన్నంత వరకు పేదల ప్రాణాలకు అండగా నిలిచే జగన్‌కు మీరు మద్దతుగా ఉండండి’ అని పోసాని పేర్కొన్నారు.

TDP Strategist Robin Sharma Decides TDP Disaster results in AP Elections 2024
చంద్రబాబుకు చివరి పంచ్‌.. బాంబు పేల్చిన శర్మాజీ!

ఎన్నో వైద్యాలు చేస్తున్నాం.. హోమియోపతి.. అల్లోపతి.. నేచురోపతి.. ఆయుర్వేదం.. కేరళ మూలికావైద్యం.. ప్రకృతివైద్యం.. అన్నీ చూశాం. ఎన్ని చేస్తున్నా రోగిలో చలనం లేదు.. కళ్ళలో కళ లేదు.. కాళ్ళూ చేతులూ కదలడం లేదు.. శ్వాస కష్టంగానే ఉంది. నాడీ అందడం లేదు.. గుండె కూడా నీరసంగా కొట్టుకుంటోంది.. నాకైతే నమ్మకంలేదు.. దగ్గరోళ్ళు.. రావాల్సినవాళ్లు ఉంటే పిలిపించుకోండి. పనిలోపనిగా అటు కట్టెలు.. కుండ.. పాడె.. చిల్లర పైసలు సిద్ధం చేసుకోండి.. అని డాక్టర్ చెప్పినమాదిరిగానే టీడీపీ వ్యూహకర్త రాబిన్ శర్మ కూడా చంద్రబాబుకు చెప్పేశాడట.మీకోసం ఎన్నో ప్రోగ్రాములు డిజైన్ చేశాం. బాదుడే బాదుడు.. వస్తున్నా మీకోసం.. సైకో పోవాలి-సైకిల్ రావాలి. ఇదేం ఖర్మ, యువగళం వంటి ఎన్ని ప్రోగ్రాములు చేసినా పార్టీకి మైలేజి రాకపోగా బాబు విశ్వసనీయత మీద ప్రజల్లో సందేహాలు పెరుగుతూ వచ్చాయి తప్ప తగ్గడం లేదు. మరోవైపు సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పనులు ప్రజల్లోకి బాగా వెళ్లాయి. ఆయన చెప్పిందే చేస్తారు అనే అంశాన్ని ప్రజలు బాగా నమ్ముతున్నారు. చంద్రబాబు ఏది చెప్పినా అబద్ధమే అనేది ఒక బ్రాండ్ ప్రజల్లో ఉండిపోయింది.దీంతో ఆయన ఎన్ని హామీలు ఇస్తున్నా నమ్మడం లేదు.. దానికితోడు కూటమి కట్టిన బీజేపీ.. జనసేన మధ్య కెమిస్ట్రీ కూడా కుదిరినట్లు లేదు.. ఎక్కడికక్కడ విభేదాలు పొడసూపుతున్నాయి. లోకేష్ పార్టీకి బలం అని అనుకుంటున్నారు.. తప్ప అయన ఎక్సట్రా లగేజ్ అనే విషయం కూడా రాబిన్ శర్మ చెప్పేసారు. ఇటు తమ పార్టీ ప్రోగ్రాములు డ్యామేజ్ అయిపోగా అటు వైఎస్సార్ కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టేందుకు.. వాలంటీర్లు.. పెన్షన్ల వంటి అంశాలను టీడీపీ నెత్తికి ఎత్తుకుంది. అది కూడా నెత్తి బొప్పి కట్టింది తప్ప ప్రయోజనం లేకపోయింది. ఆసరా... విద్యాదీవెన, ఇన్‌పుట్‌ సబ్సిడీ వంటి పథకాలకు నిధులు విడుదల చేయాలన్న ప్రభుత్వ ఆలోచనను సైతం కోర్టులో కేసువేసి అడ్డుకున్న చంద్రబాబు బొక్కబోర్లా పడ్డారు. దీంతో ఇక ప్లెయిన్ రోడ్లో డ్రైవింగ్ కష్టం అనుకున్న చంద్రబాబు వెనుకడోర్ నుంచి యుద్ధానికి తెగబడ్డారు. కేవలం దుష్ప్రచారం ద్వారా ఓటర్లకు తికమకపెట్టి గెలవాలన్నదే వాళ్ళ ప్లాన్. అందుకే దేశంలో ఎక్కడా.. ఏ రాష్ట్రంలోనూ ఇబ్బందిలేని ల్యాండ్ టైటిలింగ్ చట్టం పేరిట ప్రజలను భయపెట్టి జనాన్ని తమవైపునకు తిప్పుకోవాలన్నది అయన పార్టీ ప్లాన్‌గా మారింది. చంద్రబాబు ఏమి చేస్తాడు.. ఏమి చేయలేదు.. అనేది చెప్పినా ప్రజలు నమ్మేలా లేరు. అందుకే ఇక మ్యానిఫెస్టోను మడిచి పొయ్యిలో పెట్టిన టీడీపీ ఇప్పుడు ఏకంగా కేవలం ల్యాండ్ టైట్లింగ్ చట్టం పేరిట ప్రజలను భయపెట్టి ఓట్లు కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో పదిరోజులుగా అన్ని పత్రికలూ.. ఛానెళ్లలో అదే అంశం మీద తప్పుడు సమాచారంతో పేజీల కొద్దీ ప్రకటనలు కుమ్ముతున్నారు. ఇక గత ఇరవయ్యేళ్ళుగా తెలుగుదేశానికి వచ్చిన సీట్లు చూస్తే ఇలా ఉన్నాయ్.. 2004 - 34 సీట్లు2009 - 54 సీట్లు2014 - 102 సీట్లు2019 - 23 సీట్లుఆంటే జనసేన.. బీజేపీలతో పొత్తుపెట్టుకున్న 2014 లో మాత్రమే మూడంకెల స్కోర్ వచ్చింది తప్ప ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోకి 294 సీట్లు ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం మూడంకెల స్కోర్ చేరలేదు.. అంటే టీడీపీ బలం ఎప్పుడూ యాభై సీట్లకు అటు ఇటుగా ఉంది తప్ప గొప్పగా ఏమి లేదు. ఇప్పుడు కూడా సేమ్ ఆలాగే సీట్లు వస్తాయి తప్ప అధికారం దక్కడం అసాధ్యం అనేది విశ్లేషకుల అంచనాగా ఉంది.

Difference Between YSRCP 2019 Manifesto And TDP Alliance 2014 Manifesto Andhra Pradesh
మీ ఓటు.. విశ్వసనీయతకా? మోసానికా?

వైఎస్సార్‌సీపీ 2019 మేనిఫెస్టో..హామీ: వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా, రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి గిట్టుబాటు ధరలు కలి్పంచి.. రైతులకు దన్నుగా నిలుస్తాం. అమలు: రైతులపై పైసా భారం పడకుండా వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని నీతి ఆయోగ్‌ అత్యుత్తమ పథకంగా ప్రశంసించింది. ఐదేళ్లలో పంటలు దెబ్బతిన్న 54.76 లక్షల మంది రైతులకు రూ.7,802.05 కోట్ల పరిహారాన్ని అందించారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటుచేసి.. మార్కెట్లో ధరలేని పంటల ఉత్పత్తులు 21.73 లక్షల టన్నులను మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు రూ.7,796 కోట్లను వెచ్చించి, రైతులకు అండగా నిలిచారు. తుఫాన్‌లు, అధిక వర్షాల వల్ల తడిచిన, రంగుమారిన, మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచారు. పంట నష్టపోయిన 34.41 లక్షల మంది రైతులకు అదే సీజన్‌లో ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద రూ.3,261.61 కోట్లు అందించారు.హామీ: వార్షికాదాయం రూ.5 లక్షలలోపు ఉన్న వారందరికీ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీని వర్తింపజేస్తాం. వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తాం. చికిత్సల అనంతరం విశ్రాంతి సమయానికి వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరాగా కింద ఆర్థిక సహాయం అందిస్తాం. అమలు: ఆరోగ్యశ్రీ కింద చికిత్స విధానాలను 1059 నుంచి 3,257కు పెంచారు. చికిత్స ఖర్చు రూ.వెయ్యి దాటిన అందరికీ ఆరోగ్యశ్రీని వర్తింపజేశారు. ఐదేళ్లలో 45.10 లక్షల మందికి ఆరోగ్యశ్రీ కింద చికిత్సల కోసం రూ.13,421 కోట్లు ఖర్చు చేశారు. విశ్రాంతి సమయంలో రోగులకు ఆరోగ్య ఆసరా కింద 24.59 లక్షల మందికి రూ.1,465 కోట్లను అందించారు. ఈ రెండు పథకాలను నీతి ఆయోగ్‌ ప్రశంసించింది. మేనిఫెస్టోలో హామీ ఇవ్వకపోయినప్పటికీ మరో అడుగు ముందుకేసి ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య ఖర్చుల పరిమితిని రూ.25 లక్షల వరకూ పెంచారు. గతంలో ఇది రూ.5 లక్షల వరకే ఉండేది.హామీ: పేద విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు వసతి, భోజనం కోసం అదనంగా ఏటా రూ.20 వేలు అందిస్తాం. అమలు:ఇచ్చిన మాట మేరకు జగనన్న విద్యా దీవెన పథకం 29.65 లక్షల మంది విద్యార్థులకు రూ.12,609.68 కోట్లను ఫీజురీయింబర్స్‌మెంట్‌గా చెల్లించారు. 2017–19 మధ్య చంద్రబాబు 16.73 లక్షల మంది విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.1,778 కోట్లను సీఎం జగన్‌ చెల్లించారు. జగనన్న వసతి దీవెన కింద 25.17 లక్షల మంది విద్యార్థులకు రూ.4,275.76 కోట్లను అందించారు. 2022–23 విద్యా సంవత్సరంలో గరిష్టంగా 1.80 లక్షల మందికిపైగా విద్యార్థులు చదువు పూర్తిచేసుకున్న వెంటనే క్యాంపస్‌ ఇంటర్వ్యూల ద్వారా కార్పొరేట్‌ సంస్థల్లో ఉద్యోగాలు పొందారు.హామీ: వైఎస్సార్‌ ఆసరా పథకం కింద ఎన్నికల రోజు వరకూ అక్క చెల్లెమ్మలకు ఉన్న పొదుపు సంఘాల రుణాల మొత్తం సొమ్మును నాలుగు దఫాలుగా వారి చేతికే అందిస్తాం. మళ్లీ సున్నా వడ్డీకే రుణాల విప్లవం తెస్తాం. అమలు: 2019, ఏప్రిల్‌ 11 నాటికి పొదుపు సంఘాల మహిళలు 78.94 లక్షల మందికి ఉన్న రూ.25,570.90 కోట్లను నాలుగు విడతల్లో నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేశారు. సున్నా వడ్డీ కింద పొదుపు సంఘాల మహిళలకు రూ.4,969.04 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశారు.హామీ: జలయజ్ఞం ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. పోలవరాన్ని పూర్తి చేస్తాం. సాగునీటి కలను నిజం చేస్తాం. అమలు: కరోనా మహమ్మారి ప్రభావం వల్ల లాక్‌డౌన్‌తో రెండేళ్లు పనులు చేయలేని పరిస్థితి. మిగతా మూడేళ్లలో రూ.35,268.05 కోట్లతో ఆరు ప్రాజెక్టులు (సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్, లక్కవరం ఎత్తిపోతల, అవుకు సొరంగం, కుప్పం బ్రాంచ్‌ కెనాల్, వెలిగొండ జంట సొరంగాలు–తొలి దశ) పూర్తి చేశారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించి పులిచింతల, సోమశిల, కండలేరు, గండికోట, చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌.. డయాఫ్రమ్‌ వాల్‌తో మట్టికట్ట లీకేజీలకు అడ్డుకట్ట వేసి బ్రహ్మంసాగర్‌లో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేశారు. పోలవరంలో చంద్రబాబు చేసిన తప్పులను సరిదిద్దుతూ.. ప్రాజెక్టులో అత్యంత కీలకమైన స్పిల్‌ వే, స్పిల్‌ చానల్, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లు పూర్తి చేసి.. గోదావరి వరదను మళ్లించారు. చంద్రబాబు చారిత్రక తప్పిదం వల్లే దెబ్బతిన్న డయాఫ్రమ్‌ వాల్‌పై కేంద్రం నిర్ణయం వెల్లడించడమే తరువాయి.. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ పనులు చేపట్టి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సీఎం జగన్‌ సిద్ధంగా ఉన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి ఏటా ఖరీఫ్, రబీలలో కోటి ఎకరాలకు నీళ్లందించి రైతుల సాగునీటి కలను నిజం చేశారు.హామీ: ఇంటి స్థలం లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తాం. ఆ స్థలాలను అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తాం. ఇళ్లు కూడా కట్టిస్తాం. అమలు: ఇచ్చిన మాట మేరకు 31 లక్షల మందికిపైగా అక్క చెల్లెమ్మలకు ఇంటి స్థలాలు పంపిణీ చేసి.. వాటిపై సర్వహక్కులు కల్పిస్తూ వారి పేరుతోనే రిజి్రస్టేషన్‌ చేసి ఇచ్చారు. ఈ స్థలాల మార్కెట్‌ విలువ రూ.76 వేల కోట్లకుపైగానే పలుకుతోంది. అంతే కాకుండా 22 లక్షల ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించి.. ఇప్పటికే 9 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు ఇవ్వడంతోపాటు రూ.35 వేలు పావలా వడ్డీకే రుణంగా అందించారు. ఉచితంగా ఇసుక, సబ్సిడీపై ఇతర నిర్మాణ సామగ్రిని సరఫరా చేసి.. ఒక్కో లబి్ధదారుకు రూ.55 వేల చొప్పున ప్రయోజనం చేకూర్చారు. స్థలం, ఇంటి రూపంలో ఒక్కో లబ్ధిదారుకు రూ.6 లక్షల నుంచి రూ.20 లక్షల వరకూ స్థిరాస్థితిని సమకూర్చారు.హామీ: బీసీల అభ్యున్నతికి ఏడాదికి రూ.15 వేల కోట్లు చొప్పున 5 ఏళ్లలో రూ.75 వేల కోట్లు ఖర్చు చేస్తాం. బీసీల్లోని అన్ని ఉప కులాలకు ప్రత్యేక కార్పొరేషన్‌లు ఏర్పాటు చేసి, వైఎస్సార్‌ చేయూత ద్వారా ఎంత అవసరమైతే అన్ని నిధులు కేటాయించి వారి అభ్యున్నతికి తోడుగా ఉంటాం. నామినేటెడ్‌ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్‌ కలి్పస్తూ చట్టం తెస్తాం. బీసీ జనగణన చేసి.. చట్టసభలో బీసీలకు రిజర్వేషన్‌ కలి్పంచాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతాం. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ ఏర్పాటు చేసి చట్టబద్ధత కల్పిస్తాం. అమలు: బీసీల అభ్యున్నతికి చెప్పిన దాని కంటే అధికంగా నిధులు ఖర్చు చేశారు. డీబీటీ రూపంలో రూ.1.28 లక్షల కోట్లను బీసీ లబి్ధదారుల ఖాతాల్లో నేరుగా జమా చేశారు. నాన్‌ డీబీటీ రూపంలో రూ.52 వేల కోట్ల ప్రయోజనం చేకూర్చారు. డీబీటీ, నాన్‌డీబీటీ కలిపి మొత్తం రూ.1.80 లక్షల కోట్లను బీసీల అభ్యున్నతి కోసం ఖర్చు చేశారు. బీసీల్లోని ఉప కులాలకు 56 కార్పొరేషన్‌లు ఏర్పాటు చేసి, ఆ వర్గాల వారినే చైర్మన్‌లు, డైరెక్టర్‌లుగా నియమించారు. నామినేటెడ్‌ పనుల్లో, పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్‌ చేస్తూ చట్టం చేసి మరీ ఆ వర్గాలకు ప్రయోజనం చేకూర్చారు. బీసీ జనగణన చేయించి.. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్‌ కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపడంతోపాటు ఇదే అంశంపై పార్లమెంట్‌లో ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టారు. శాశ్వత బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసి చట్టబద్ధత కల్పించారు. వెనుకబడిన వర్గాలను సమాజానికి వెన్నెముకగా తీర్చిదిద్దుతానంటూ ఆ వర్గాలకు ఇచ్చిన మాటను సీఎం జగన్‌ నిలబెట్టుకున్నారు.హామీ: షాపులు ఉన్న నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు ఏడాదికి రూ.పది వేలు ఆర్థిక సహాయం చేసి తోడుగా ఉంటాం. అమలు: చెప్పిన మాట మేరకు ఐదేళ్లలో 3.37 లక్షల మందికి జగనన్న చేదోడు పథకం కింద రూ.1,260.17 కోట్లను సహాయంగా అందించి, తోడుగా నిలిచారు.హామీ: మగ్గం ఉన్న చేనేత కారి్మకుల కుటుంబాలకు ఏడాదికి రూ.24 వేలను ప్రోత్సాహకంగా ఇస్తాం. అమలు: వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకం కింద 82,130 మంది మగ్గం ఉన్న చేనేత కారి్మకులకు ఏడాదికి రూ.24 వేల చొప్పున ఐదేళ్లలో రూ.982.98 కోట్లను ప్రోత్సాహకంగా అందించారు.హామీ: కులవృత్తిదారులు, చిరు వ్యాపారులకు సున్నా వడ్డీకే రూ.పది వేలు ఇస్తాం. అమలు: జగనన్న తోడు పథకం కింద 15.87 లక్షల మందికి సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చారు. సున్నా వడ్డీ కింద వారికి రూ.88.33 కోట్లు ఇచ్చారు.హామీ: వైఎస్సార్‌ చేయూత పథకం కింద 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్క చెల్లెమ్మలకు ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగు విడతల్లో రూ.75 వేలు ఇస్తాం. అమలు: చెప్పిన మాట మేరకు 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కలు 33.15 లక్షల మందికి రూ.19,189.59 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశారు. వాటిని సద్వినియోగం చేసుకున్న మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ.. ఆదాయం పొందుతూ ఆర్థిక సాధికారత సాధిస్తూ సొంత కాళ్లపై నిలబడే దిశగా అడుగులు వేస్తున్నారు.హామీ: పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహకంగా ఇస్తున్న రాయితీల (భూమి, పన్ను, విద్యుత్‌)తోపాటు ఏపీఐడీసీని పునరుద్ధరించి.. నిరుద్యోగ యువతకు సబ్సిడీ అందించి కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడతాం. అమలు: అధికారం చేపట్టినప్పటి నుంచి పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక సంస్కరణల ద్వారా సులభతర వాణిజ్యం (ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌)లో ఏటా రాష్ట్రాన్ని దేశంలో నంబర్‌ వన్‌గా నిలుపుతున్నారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ఏటా సగటున రూ.14,896 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. ఏపీఐడీసీని పునరుద్ధరించారు. ప్రభుత్వం ఇచ్చిన తోడ్పాటుతో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) 1.9 లక్షల నుంచి ఏడు లక్షలకు చేరుకున్నాయి. 22.07 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయి. పరిశ్రమల స్థాపనతో గత 59 నెలల్లోనే కొత్తగా 28.92 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. ప్రభుత్వ, ప్రైవేట్, కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ అన్నీ కలిపి ఏకంగా 6,48,087 మందికి ఉద్యోగాలు, ఉపాధి లభించింది. హామీ ఇవ్వకున్నా నాలుగు పోర్టులు, పది ఫిషింగ్‌ హార్బర్లు, ఆరు ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లు, మూడు ఇండస్ట్రియల్‌ కారిడార్లు, పది ఇండ్రస్టియల్‌ నోడ్స్‌ నిర్మాణంతో పారిశ్రామికాభివృద్ధిని పరుగులెత్తిస్తున్నారు.హామీ: పార్లమెంటు నియోజకవర్గం యూనిట్‌గా ఒక జిల్లాను ఏర్పాటు చేసి.. జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీని ఏర్పాటు చేస్తా. అమలు: 13 జిల్లాలను పునర్‌వ్యవస్థీకరించి 26 జిల్లాలను ఏర్పాటు చేశారు. కొత్తగా 17 మెడికల్‌ కాలేజీలు నిరి్మస్తున్నారు. 2023–24లో ఐదు మెడికల్‌ కాలేజీలను ప్రారంభించారు. 2024–25లో మరో ఐదు మెడికల్‌ కాలేజీలు ప్రారంభం కానున్నాయి. మిగిలిన ఏడు 2025–26లో ప్రారంభించనున్నారు.హామీ: ప్రతి గ్రామంలో సచివాలయం ఏర్పాటు చేసి.. అదే ఊరిలోని పది మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం. 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమించి ప్రభుత్వ సేవలను ఇంటి గుమ్మం వద్దకే ప్రజలకు అందిస్తాం. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. అమలు: రాష్ట్రంలో 15,004 గ్రామ, వార్డు సచివాలయాలను సీఎం జగన్‌ ఏర్పాటు చేశారు. ఒకే నోటిఫికేషన్‌ ద్వారా గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.35 లక్షల మంది ఉద్యోగులను నియమించారు. సగటున 50 నుంచి 75 ఇళ్లకు ఒకరు చొప్పున 2.65 లక్షల మంది వలంటీర్లను నియమించి.. ప్రభుత్వ సేవలను ప్రజల ఇంటి గుమ్మం వద్దకే అందించి.. గ్రామ స్వరాజ్యాన్ని సీఎం జగన్‌ ఆవిష్కరించారు. వివిధ శాఖల్లో 2.31 లక్షల ఉద్యోగులను నియమించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే.. ఈ 59 నెలల్లోనే 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగులను నియమించడం గమనార్హం. ప్రభుత్వ, ప్రైవేట్, ఎంఎస్‌ఎంఈలు, స్వయం ఉపాధితో కలిపి 58.22 లక్షల మందికిపైగా ఉద్యోగాలు, ఉపాధి కల్పించారు.హామీ: ప్రభుత్వ పాఠశాలలను నాడు–నేడు కింద అభివృద్ధి చేస్తాం. విద్యా ప్రమాణాలు పెంచుతాం. ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెడతాం. పుస్తకాలు, యూనిఫాంలు సరైన సమయానికి ఇస్తాం. మధ్యాహ్న భోజనం నాణ్యత పెంచుతాం. అమలు: నాడు–నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ స్థాయికి అభివృద్ధి చేసే పనులను రెండు దశల్లో చేపట్టారు. తొలి దశ ఇప్పటికే పూర్తయింది. రెండో దశ పనులు వేగంగా సాగుతున్నాయి. కోర్టులకు వెళ్లి టీడీపీ అడ్డుకున్నా సరే.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంను ప్రవేశపెట్టారు. పాఠశాలలు ప్రారంభమైన రోజే జగనన్న విద్యాకానుక పథకం కింద పాఠ్యపుస్తకాలు, నోటుపుస్తకాలు, యూనిఫాంలు, బూట్లు సాక్స్‌లు అందిస్తున్నారు. జగనన్న గోరుముద్ద పథకం కింద మధ్యాహ్నం నాణ్యమైన భోజనంతోపాటు చిక్కీ ఇస్తున్నారు. సీబీఎస్‌ఈ సిలబస్‌ను అమలు చేస్తున్నారు. 2025–26 విద్యా సంవత్సరం నుంచి ఐబీ సిలబస్‌ను ప్రవేశపెట్టనున్నారు. మూడో తరగతి నుంచే టోఫెల్‌ శిక్షణ ఇస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదవుతున్న పిల్లలు ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్‌), వైట్‌హౌస్‌ వేదికలపై రాష్ట్రంలో అమలవుతున్న విద్యా విధానం, సంస్కరణలపై అనర్గళంగా ప్రసంగించడం దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. హామీ: వైఎస్సార్‌ రైతు భరోసా పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం ఏడాదికి రూ.12,500 అందిస్తాం. అమలు: మేనిఫెస్టోలో చెప్పిన దాని కంటే అధికంగా.. ఏడాదికి ఒక్కో రైతు కుటుంబానికి రూ.13,500 రైతు భరోసా కింద ఇచ్చారు. ఐదేళ్లలో రూ.67,500 రైతు భరోసా కింద ఇచ్చారు. ఈ పథకం కింద ఐదేళ్లలో 53,58,366 మంది రైతులకు రూ.34,378.16 కోట్లను వారి ఖాతాల్లో నేరుగా జమ చేశారు.హామీ: వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే ఆర్థిక సహాయాన్ని రూ.4 వేల నుంచి రూ.పది వేలకు పెంచుతాం. మత్స్యకారులకు ఇచ్చే డీజిల్‌ సబ్సిడీని డెడికేటెడ్‌ పెట్రోల్‌ బంక్‌ల ద్వారా డీజిల్‌ పట్టుకునేటప్పుడు వారి చేతికి అందేటట్టు అమలు చేస్తాం. ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు రూ.పది లక్షలను పరిహారంగా చెల్లిస్తాం. అమలు: వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే ఆర్థిక సహాయాన్ని రూ.పది వేలకు పెంచారు. వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పథకం కింద ఐదేళ్లలో 2.43 లక్షల మందికి రూ.538.06 కోట్లను అందించారు. డీజిల్‌ సబ్సిడీని అమలు చేస్తున్నారు. ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు రూ.పది లక్షలను పరిహారంగా అందిస్తున్నారు.హామీ: అవ్వాతాతలకు పెన్షన్ల అర్హత వయసు 65 నుంచి 60 ఏళ్లకు తగ్గించి.. పెన్షన్‌ను రూ.3 వేల వరకూ పెంచుకుంటూపోతాం. అమలు: ఇచ్చిన మాట మేరకు వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పథకం కింద వృద్ధాప్య పెన్షన్‌ను రూ.2,000 నుంచి రూ.2,250కు పెంచే ఫైలుపై 2019, మే 30న సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక జగన్‌ తొలి సంతకం చేశారు. దశలవారీగా పెన్షన్‌ను రూ.3 వేలకు పెంచి వలంటీర్ల ద్వారా ప్రతి నెలా ఒకటో తేదీనే ఇంటి వద్దే వృద్ధులకు పంపిణీ చేస్తున్నారు. అర్హతే ప్రామాణికంగా ఎలాంటి వివక్ష చూపకుండా 66.34 లక్షల మందికి పెన్షన్‌ పంపిణీ చేస్తున్నారు. గత 59 నెలల్లో పెన్షన్‌ రూపంలో రూ.90,590.6 కోట్లను పంపిణీ చేశారు.టీడీపీ కూటమి 2014 మేనిఫెస్టో..హామీ: అధికారంలోకి రాగానే వ్యవసాయ రుణాల మాఫీపై తొలి సంతకం చేస్తా. అమలు: రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీపై తొలి సంతకం చేయకుండా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే 2014, జూన్‌ 8న చంద్రబాబు మోసం చేశారు. వ్యవసాయ రుణాల మాఫీపై కోటయ్య కమిటీని వేసి.. స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ పేరుతో కోతలు పెట్టి రూ.15,297 కోట్లను మాత్రమే మాఫీ చేశారు. మిగతా రూ.72,315 కోట్లు మాఫీ చేయకుండా రైతులకు చంద్రబాబు టోపీ పెట్టారు.హామీ: డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తా. అమలు: టీడీపీ సర్కార్‌ అధికారంలోకి వచ్చే నాటికి రూ.14,205 కోట్లు పొదుపు సంఘాల మహిళలు బకాయిపడ్డారు. ఆ రుణాల్లో ఒక్క పైసా కూడా మాఫీ చేయకుండా మహిళలను చంద్రబాబు వంచించారు.హామీ: ఇంటికో ఉద్యోగం లేదా నెలకు రూ.2 వేల చొప్పున నిరుద్యోగ భృతి అందజేస్తా. అమలు: 2014, జూన్‌ 8 నుంచి 2019, మే 29 వరకూ కేవలం 32 వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేశారు. రాష్ట్రంలోని కోటికిపైగా ఇళ్ల(కుటుంబాలు)కు ఉద్యోగాలు ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి కింద పైసా కూడా ఇవ్వలేదు. ఒక్కో ఇంటికి నెలకు రూ.2 వేల చొప్పున 60 నెలలకు రూ.1.20 లక్షలు ఇవ్వకుండా ఎగ్గొట్టి చంద్రబాబు మోసం చేశారు.హామీ: ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద బ్యాంకులో రూ.25 వేలు డిపాజిట్‌ చేస్తా. అమలు: ఐదేళ్లలో పుట్టిన ఒక్క ఆడబిడ్డ పేరుతో ఒక్క పైసా కూడా డిపాజిట్‌ చేయకుండా చంద్రబాబు మోసం చేశారు.హామీ: అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం ఇచ్చి.. పక్కా ఇళ్లు కట్టిస్తాం. అమలు: మూడు సెంట్లు స్థలం మాట దేవుడెరుగు.. కనీసం ఏ ఒక్కరికీ సెంటు స్థలం కూడా ఇవ్వకుండా ప్రజలను చంద్రబాబు మోసం చేశారు.హామీ: ఏటా రూ.పది వేల కోట్లతో బీసీ సబ్‌ ప్లాన్‌ను అమలు చేస్తా. అమలు: ఇచ్చిన మాట ప్రకారం ఏడాదికి రూ.పది వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.50 వేల కోట్లను బీసీ సబ్‌ ప్లాన్‌ కింద ఆ వర్గాల సంక్షేమం కోసం ఖర్చు చేయాలి. కానీ.. ఐదేళ్లలో రూ.36 వేల కోట్లను మాత్రమే ఖర్చు చేసి, అందులోనూ అవినీతికి పాల్పడి బీసీలను మోసం చేశారు.హామీ: చేనేత, పవర్‌లూమ్స్‌ రుణాలు మాఫీ చేస్తా. అమలు: ఒక్క రూపాయి రుణాన్ని కూడా మాఫీ చేయకుండా చేనేత, పవర్‌లూమ్స్‌ కారి్మకులకు చంద్రబాబు టోపీ పెట్టారు.హామీ: సింగపూర్‌ను మించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా. ప్రతి నగరంలో, జిల్లా కేంద్రంలో హైటెక్‌ సిటీ నిర్మిస్తా. అమలు: సింగపూర్‌ను మించి అభివృద్ధి మాటేమోగానీ అడ్డగోలు, అవినీతి, అక్రమాలకు పాల్పడి రాష్ట్రంలో చంద్రబాబు విధ్వంసం సృష్టించారు. జిల్లా కేంద్రాల మాట దేవుడెరుగు కనీసం ఏ ఒక్క నగరంలో కూడా హైటెక్‌ సిటీ నిర్మాణానికి పునాదిరాయి కూడా వేసిన పాపాన పోలేదు.హామీ: మహిళల భద్రతకు ఉమెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తా. ఆపదలో ఉన్న మహిళలకు సెలఫోన్ల ద్వారా 5 నిమిషాలలో సహాయం అందించే వ్యవస్థ ఏర్పాటుచేస్తా. అమలు: ఉమెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఏర్పాటుకు చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. విజయవాడలో కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ మహిళల మానప్రాణాలతో చెలగాటమాడటం రాష్ట్రాన్ని కుదిపేసింది. ఇసుక దోపిడీకి అడ్డుతగిలిన తహసీల్దార్‌ వనజాక్షిని అప్పటి టీడీపీ ఎమ్మెల్యే జుట్టుపట్టుకుని లాగి, దాడిచేసినా చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.హామీ: పేద పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్య, కాలేజీ విద్యార్థులకు ఐప్యాడ్, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యా విధానంలో మార్పులు తెస్తా. అమలు: విద్యా విధానంలో మార్పుల మాట దేవుడెరుగు కనీసం ప్రభుత్వ పాఠశాలల ప్రమాణాలను పెంచేందుకు చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాలేజీ విద్యార్థులకు ఐప్యాడ్‌లు ఇవ్వకుండా మోసం చేశారు. ఫీజు ఎంత ఉన్నారూ.35 వేలు మాత్రమే ఫీజురీయింబర్స్‌మెంట్‌ కింద ఇవ్వడం వల్ల విద్యార్థుల తల్లితండ్రులపై తీవ్ర ఆర్థిక భారం పడింది.హామీ: ఆరోగ్యశ్రీ కంటే మెరుగైన వైద్య సేవలు అందిస్తా. అమలు: ఆరోగ్యశ్రీ పేరును ఎనీ్టఆర్‌ వైద్య సేవగా మార్చిన చంద్రబాబు.. బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం చేయడం వల్ల ప్రైవేటు ఆస్పత్రుల్లో రోగులకు చికిత్స అందించడానికి యాజమాన్యాలు నిరాకరించాయి. దాంతో పేదలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పేదల ఆరోగ్యానికి భరోసా ఇచ్చే ఆరోగ్యశ్రీని చంద్రబాబు నీరుగార్చారు. ఆరోగ్యశ్రీ కింద చంద్రబాబు పెట్టిన రూ.600 కోట్ల బకాయిలను సీఎం జగన్‌ చెల్లించారు.హామీ: రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తా.. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్ట నివారణకు రైతుల వారీగా బీమా సౌకర్యం కలి్పస్తా. అమలు: ధరల స్థిరీకరణ నిధి కింద ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. గిట్టుబాటు ధరలు దక్కక ధాన్యం, అపరాలు, ఉల్లి, టమాటా, మామిడి, బత్తాయి తదితర రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా రైతులను మోసం చేశారు.హామీ: ప్రతి జిల్లాకూ, పట్టణానికి, మండలానికి, గ్రామానికి ఒక దార్శనిక పత్రం (విజన్‌ డాక్యుమెంట్‌)ను తయారుచేసి అభివృద్ధి చేస్తాం. అమలు: ప్రతి జిల్లా, పట్టణం, మండలం, గ్రామం అభివృద్ధి మాటేమోగానీ.. అడ్డగోలుగా అవినీతి, అక్రమాలకు పాల్పడిన చంద్రబాబు బ్యాచ్‌ అధోగతిపాలు చేశాయి.హామీ: అవినీతిరహిత సుపరిపాలన, పాలనలో పారదర్శకత తెస్తా. పెరుగుతున్న నిత్యావసరాల ధరల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటా. అమలు: అక్షర క్రమంలో ముందున్న ఆంధ్రప్రదేశ్‌ను అవినీతిలోనూ చంద్రబాబు అగ్రగామిగా నిలిపారు. చంద్రబాబు మానసపుత్రిక అయిన జన్మభూమి కమిటీల్లోని టీడీపీ నేతలు లంచాల కోసం ప్రజలను పీడించాయి.హామీ: కొత్తగా కళింగపట్నం, నరసాపురం ఓడరేవు, నిజాంపట్నం, రామాయపట్నం, దుగరాజపట్నం పోర్టులను నిరి్మంచి, పాత పోర్టులతో అనుసంధానం చేస్తూ ఇండ్రస్టియల్‌ క్లస్టర్స్‌ను అభివృద్ధి చేస్తా. అమలు: ఐదేళ్లలో కొత్తగా ఒక్కటంటే ఒక్క పోర్టు నిర్మాణ పనలు కూడా చంద్రబాబు ప్రారంభించలేదు. ఇండ్రస్టియల్‌ క్లస్టర్స్‌ను ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు.హామీ: వివిధ జిల్లాలను అనుసంధానం చేస్తూ బుల్లెట్‌ ట్రైన్స్‌ (ర్యాపిడ్‌ రైల్వే ట్రాన్స్‌పోర్టు వ్యవస్థ)ను ప్రవేశపెడతాం. అమలు: బుల్లెట్‌ ట్రైన్స్‌ పేరుతో ఎన్నికల్లో అరచేతిలో వైకుంఠం చూపిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక ఎన్నడూ ఆ మాట ఎత్తడానికి కూడా సాహసించలేదు.హామీ: పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తా. గాలేరు–నగరి, హంద్రీ–నీవా, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వెలిగొండ ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేస్తాం. అమలు: కమీషన్ల కక్కుర్తితో జాతీయ పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు విధ్వంసం సృష్టించారు. పోలవరం ప్రాజెక్టును కమీషన్ల కోసం చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారంటూ 2019, ఏప్రిల్‌ 1న రాజమహేంద్రవరంలో ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేయడమే అందుకు నిదర్శనం. గాలేరు–నగరి, హంద్రీ–నీవా, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వెలిగొండ ప్రాజెక్టుల్లో కాంట్రాక్టర్లతో కుమ్మక్కై భారీ ఎత్తున నిధులు దోచేశారు. దాంతో ఆ ప్రాజెక్టులు పూర్తి కాలేదు.హామీ: కేంద్రం రాజధాని లేకుండా విభజించి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టింది. సంక్షోభాన్ని అవకాశంగా మల్చుకుని రాజధానిగా ప్రపంచస్థాయి నగరాన్ని నిర్మిస్తా. అమలు: ప్రపంచస్థాయి నగరం మాటేమోగానీ.. ఆ ముసుగులో ఓత్‌ ఆఫ్‌ సీక్రసీని తుంగలో తొక్కి.. రాజధానిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడి అంతర్జాతీయ స్థాయి భూ కుంభకోణానికి చంద్రబాబు పాల్పడ్డారు. అమరావతిలో ఐదేళ్లలో ఒక్కటంటే ఒక్క శాశ్వత భవనాన్ని నిరి్మంచలేకపోయారు. కనీసం రహదారి సౌకర్యాన్ని కూడా కలి్పంచలేకపోయారు.

KSR Comment On Chandrababu Yellow Media AP Land Titling Act 2023 Goebbels Campaign
ఏపీకి మహా ప్రమాదకారిగా బాబు & కో

ఆంధ్రప్రదేశ్‌లో ఈ మధ్య మా బంధువు ఒకాయన తరచుగా మీ సేవ కేంద్రానికి వెళుతున్నారు. ఎందుకు? అని అడిగితే.. ఆయన చెప్పిన విషయం ఆశ్చర్యం కలిగించింది. తన పొలం, స్థలాల వంటివి తన పేరనే ఉన్నాయా?లేవా? అన్నది చూసుకోవడానికి అని చెప్పారు. ఈసీ తీసుకోవడానికి వెళ్తున్నా అని అన్నారు. అలా ఎందుకు ఒక్కసారి రిజిస్టర్ అయ్యాక ఎక్కడి వెళతాయని అన్నాను. ఆయన చెప్పిన సమాధానం విని ఆశ్చర్యం వేసింది.ప్రభుత్వం ఏదో చట్టం తెచ్చిందట. మా భూములు మాకు ఉండవట. ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకుని కాపీలు ఇస్తారట!.. ఇలా చెబుతూ పోయాడు. అదంతా విని ‘అలా ఎందుకు జరుగుతుంది?’ అని అడిగా. దానికి అతను వివరణ ఇచ్చాడు. అప్పుడు అర్ధం అయింది. ఆయన ఆంధ్రజ్యోతి పత్రికలో రాసిన అబద్దపు వార్తల ప్రభావానికి లోనయ్యాడని. ఒక మంచి పని చేయాలంటే ఒప్పించడానికి చాలా కష్టపడాలి. అదే ఒక వదంతి సృష్టించడం ఎంత తేలికో చూడండి. దేశంలో కాని, ప్రపంచంలోకాని ఏ ప్రభుత్వం అయినా ఎవరి ప్రైవేటు ఆస్తులను లాక్కోవడానికి చట్టం తీసుకు వస్తుందా? విద్యాధికుడు అయిన ఆయనే ఇంత అపోహపడితే ,సామాన్య ప్రజలు ఇంకెత అపార్ధం చేసుకుంటారు.టైటిలింగ్ చట్టం వస్తే ఎవరి భూములు ఉండవని ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి తెలుగుదేశం మీడియా నీచమైన అబద్దాలు రాయడానికి సిగ్గు పడడం లేదు. టీడీపీ మేనిఫెస్టోని జనం నమ్మడం లేదని, ఇలాంటి అబద్దాలు ప్రచారంచేస్తున్నారు. పవన్ కల్యాణ్ అంటే పదో తరగతి మాత్రమే చదివిన వ్యక్తి కనుక ఆయన జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారులే అని అనుకోవచ్చు. కానీ ఎమ్.ఎ. చేసిన చంద్రబాబు నాయుడు వంటివారు కూడా ఇలా ప్రచారం చేయడం ఏమిటి?ఆయన నాయకత్వం వహించే తెలుగుదేశం పార్టీ ఈ అసత్యాలను ప్రజలలో ఎందుకు విస్తరిస్తోంది. సుమారు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా, పదహారు ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు ఇలాంటి దుర్మార్గపు ప్రచారాలు చేయవచ్చా? అంటే ఏమి చెబుతాం. ఔఆయనది ఎప్పుడూ కుట్ర స్వభావమే. తాను అధికారంలో ఉంటే అన్ని సంస్కరణలు తనవే అంటారు.ప్రతిపక్షంలో ఉంటే ఏ సంస్కరణ చేపట్టకూడదని అంటారు.తన వ్యతిరేక ప్రభుత్వం ఉంటే ,ఆ సంస్కరణలపై విషం కక్కుతారు. ఈయన రాజకీయ నేత, కుట్రలకు అలవాటుపడిన మనిషి కనుక ఇలా చేస్తున్నారులే అని అనుకోవచ్చు. కానీ, ఏభై ఏళ్లుగా ప్రజలకు తమ పత్రికల ద్వారా ,ఆ తర్వాత రెండు దశాబ్దాలుగా టీవీల ద్వారా విజ్ఞానం అందిస్తున్నామని ప్రచారం చేసుకునే ఈనాడు అధినేత రామోజీరావు ఇలాంటి దరిద్రపు ప్రచారం చేస్తున్నారు? అబద్దం అని తెలిసి కూడా ఇలాంటి చెత్త వార్తలు రాయవచ్చా? అంటే ఆ విజ్ఞతను రామోజీ ఎప్పుడో కోల్పోయారు. ఏపీ ప్రజలలో జగన్‌పై ఉన్న అభిమానాన్ని ఎలాగొలా మార్చాలని, జగన్ కు అనుకూలంగా ఉన్న ప్రజాభిప్రాయాన్ని మార్చాలన్న దుర్మార్గపు ఆలోచనే రామోజీరావులో ఉండడమే ఇందుకు కారణం. ఇక ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఎప్పుడూ అలాంటి నీచపు ఆలోచనలతో ఉంటారు కనుక చెప్పుకోనవసరం లేదు.వాస్తవం ఏమిటంటే టైటిలింగ్ చట్టం ఇంకా అమలులోకి రాలేదు. కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు ఈ చట్టాన్ని ఆమోదించారు. కానీ ఇంకా మార్గదర్శక సూత్రాలను సిద్దం చేయలేదు. పైగా కోర్టులో స్టే ఉంది. రైతుల,భూ యజమానుల హక్కులను రక్షించి,వారికి అధునాతన టెక్నాలజీలో భూముల వివరాలను నమోదు చేయడానికి ఉద్దేశించినది ఈ చట్టం. కేంద్ర ప్రభుత్వం పలు కమిటీలు వేసి, వారు చేసిన సిఫారసుల మేరకు ఈ మోడల్ చట్టాన్ని రూపొందించింది.దీని ప్రకారం.. రాష్ట్రాలలో ఉన్న భూ వివాదాలు తగ్గించవచ్చు. ఒకసారి భూముల సర్వే జరిగి వివిధ శాఖల సమన్వయంతో రికార్డులలోకి వివరాలు ఎక్కితే భూ యజమానికి పూర్తి రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. అంతే తప్ప ఎవరి భూమి ప్రభుత్వం తీసుకోలేదు.భూములు, రిజిస్ట్రేషన్ ల రంగంలో నిపుణులైన కొందరు దీనిని అధ్యయనం చేసి,ఈ చట్టం తీసుకురావడం దేశానికి ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు. ఒకవేళ ఏవైనా చిన్న,పెద్ద అనుమానాలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవచ్చు.అలాకాకుండా అసలు ఈ చట్టాన్నే వ్యతిరేకిస్తూ ఎన్నికల సమయంలో ప్రజలలో అపోహలు సృష్టించడానికి టిడిపి,ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియాలు ప్రయత్నించడం అంటే ఎపి ప్రజలకు ద్రోహం చేయడమే.ఈ చట్టం వస్తే వీరు తమ బినామీ,కబ్జా భూముల బాగోతం బయటకు సస్తుందని భయపడుతుండవచ్చు.ఒకసారి గతంలో చంద్రబాబు ఏమి చెప్పేవారో గుర్తుకు చేసుకోండి. ఆయన 1995 లో ఎన్టీఆర్‌ను పడగొట్టి అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత తాను సంస్కరణవాదినని ప్రచారం చేసుకున్నారు. సచివాలయంలో కంప్యూటర్లు ప్రవేశపెట్టిన వ్యక్తినని చెప్పుకునేవారు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ శాఖలో భూముల రిజిస్ట్రేషన్ ను కంప్యూటర్ ద్వారా చేసేవారు. ఏ ప్రభుత్వం వచ్చినా ఇలాంటి సంస్కరణలు తీసుకు వచ్చింది. అయితే చంద్రబాబు తన టైమ్ లో ఏమి చేసినా తన ఘనత అని,అదే ఎదుటివారు ఏమైనా చేస్తుంటే బురద చల్లుతుంటారు.ఉదాహరణకు కేంద్రం తీసుకువచ్చిన చట్టం ప్రకారం విద్యుత్ రంగంలో కొన్ని మార్పులు తీసుకురావడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నించింది. అప్పుడు ఆ చట్ట సవరణ చేసిన కేంద్రం కన్నా,తానే అవన్ని కనిపెట్టానని చెప్పుకునేవారు.రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి వీలు లేదని అనేవారు.ప్రభుత్వరంగంలో కార్పొరేషన్ లు వృధా అని చెప్పేవారు. తన మనసులో మాట పుస్తకంలో ఇలాంటివి అనేకం ఉన్నాయి. కాని అదే పెద్దమనిషి ప్రతిపక్షంలోకి రాగానే పూర్తిగా రివర్స్‌గా మాట్లాడుతున్నారు. మరో ఉదాహరణ చూస్తే.. కేంద్రం ఆదేశాల ప్రకారం జగన్ ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్లు పెట్టింది. ఇదే చంద్రబాబు ఏమని ప్రచారం చేశారో తెలుసా?మోటార్లకు మీటర్లు అంటే రైతులకు ఉరి వేయడమే అని అన్నారు. పోనీ దానికే కట్టుబడి ఉన్నారా అంటే అదేమి లేదు. ఆ చట్టం తీసుకు వచ్చిన కేంద్రంలోని బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అప్పటి నుంచి ఆ ఊసు ఎత్తడం లేదు. ఎల్లో మీడియా కూడా దీని గురించి ప్రచారం ఆపేసింది.అలాగే ఇప్పుడు కేంద్రం తీసుకు వచ్చిన ఈ చట్టం ఇంకా ఏపీలో అమలులోకి రాకముందే పచ్చి అబద్దాలను వీరంతా కలిపి ప్రచారం చేసి ప్రజలను తప్పుదారి పట్టించే యత్నం చేస్తున్నారు. అదృష్టవశాత్తు చంద్రబాబు చెప్పేవాటిని ప్రజలు నమ్మడం లేదు కాబట్టి సరిపోయింది. రామోజీ , రాధాకృష్ణలు రాసే వార్తలను జనం విశ్వసించడం లేదు కనుక సరిపోయింది. లేకుంటే ఏపీ సమాజం అంతా తీవ్ర అలజడికి గురి అయ్యేది. అయినా వీరు రాసే అబద్దాలను నమ్మేవారు కొద్ది మంది ఉండకపోరు. ఒక చదువుకున్న వ్యక్తి అనుభవాన్ని గమనిస్తే,ఇలాంటి వారు కూడా ఉండవచ్చన్న భావన కలుగుతుంది. వీరిలో అత్యధికులు తెలుగుదేశం వారే. వారే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి రాసే చెత్తవార్తలు రాసి నమ్మి టెన్షన్‌ పడుతున్నారు.31 లక్షల ఇళ్ల స్థలాలు, కొన్ని లక్షల ఎకరాల చుక్కల భూములు.. తదితరాలను చట్టబద్దం చేసి పేద ప్రజలకు, అర్హులైన వాళ్లకు అందించిన జగన్ భూములు లాక్కొంటారని ఎంత దుర్మార్గపు ప్రచారం చేస్తున్నారో చూడండి.ఏ సంస్కరణ అయినా, ఏ టెక్నాలజీ అయినా ప్రజలకు మంచి చేయడానికే ప్రభుత్వాలు తీసుకు వస్తాయి. అంతే తప్ప వారికి నష్టం చేయాలని ఎందుకు అనుకుంటాయి?. ఒకప్పుడు పీవీ నరసింహారావు ఆర్ధిక సంస్కరణలు తీసుకు వచ్చినప్పుడు వామపక్షాలు సీపీఐ, సీపీఎం వంటివి తీవ్రంగా వ్యతిరేకించేవి. బీజేపీ కూడా విమర్శలు చేసేది. కానీ బీజేపీ ఆధ్వర్యంలోని వాజ్ పేయి ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ సంస్కరణలు అనుసరిస్తున్నట్లు ప్రకటించింది. మోదీ ప్రభుత్వం అయితే ఏకంగా భారతరత్న బిరుదును ఇచ్చింది.ఒకప్పుడు కంప్యూటర్లు లేని రోజుల్లో తెల్ల కాగితాల మీద పెన్నుతో ఏ విషయం అయినా రాయవలసి వచ్చేది. కంప్యూటర్లు వచ్చాక మొత్తం జన జీవితాలే మారిపోయాయి. కంప్యూటర్‌లనే అంతా వాడడం ఆరంభం అయింది. మొదట్లో ఈ కంప్యూటర్లను వ్యతిరేకించినవారు పెద్ద సంఖ్యలో ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ కంప్యూటర్ లేని జీవితాన్ని ఊహించగలమా? ఉమ్మడి ఏపీలో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పౌరులు రిజిస్టర్ చేసుకున్న డాక్యుమెంట్లన్నిటీ స్కాన్ చేసి కంప్యూటర్ లోకి ఎక్కిస్తున్నారు.దీనివల్ల రికార్డులకు భద్రత పెరిగింది.అయితే ఇప్పటికే రిజిస్ట్రేషన్ లలో మోసాలు జరుగుతున్నాయి. వాటిని అరికట్టడానికి ఒకసారి రిజిస్టర్ అయిన భూమిని సంబంధిత యజమానికి సంబంధం లేకుండా మరెవరూ రిజిస్టర్ చేయడానికి వీలులేని విధంగా టైటిలింగ్ చట్టం ఉపయోగపడుతుంది.ప్రతి భూమికి ఒక నెంబర్ ఇస్తారు.దాని ఆధారంగా లావాదేవీలు జరుపుకోవచ్చు. ఇందుకోసం ఇప్పటికే ఏపీలో భూముల సర్వే జరుగుతోంది. ఇదంతా అయిన తర్వాత కాని టైటిలింగ్ చట్టం అమలు చేయవలసి ఉంటుంది. అయినా ప్రజలలో అనవసర అనుమానాలను విపక్షం, ఎల్లో మీడియా కల్పిస్తున్నందున ,అసలు ఈ చట్టాన్ని ఇప్పట్లో అమలు చేయబోమని,దేశం అంతటా దీనిపై అన్ని రాష్ట్రాలు ఒక అభిప్రాయానికి వచ్చాక అమలు చేస్తామని మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. ఇక్కడ కొన్ని ఉదాహరణలు చెప్పాలి.గతంలో బ్యాంకులలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేస్తే, ఆ డిపాజిట్లకు సర్టిఫికెట్ లు ఇచ్చేవారు. వాటిని మనం భద్రపరుచుకోవల్సి ఉండేది. ఇప్పుడు బ్యాంకులు సర్టిఫికెట్ ల బదులు రశీదులు ఇస్తున్నాయి. అవి కేవలం మన సంతృప్తి కోసమే. ఎందుకంటే మనం డిపాజిట్ మెచ్యూర్ అయ్యే డేట్ మర్చిపోయినా, బ్యాంకుల నుంచి ఆటోమాటిక్ గా మెస్సేజ్ రావడం, మనం ఆ డిపాజిట్ తీసుకోవడం జరుగుతోంది. ఎంత మార్పో ఆలొచించండి. ఒకప్పుడు ఏ కంపెనీ షేర్లను అయినా అప్లై చేసుకుంటే అవి సర్టిఫికెట్ రూపంలో వచ్చేవి. ఆ షేర్లను మనం అమ్మితే వాటిని కొనుగోలుదారుకు పంపవలసి ఉండేది. కాని ఇప్పుడు అసలు షేర్లు ఎలా ఉంటాయో కూడా ఎవరూ చూడనక్కర్లేదు. అన్ని డిజిటల్ లాకర్ లలోనే ఉంటున్నాయి. కొన్ని ట్రేడింగ్ కంపెనీలు వీటిని నిర్వహిస్తున్నాయి. మరి నా షేర్ సర్టిఫికెట్ ను ఇవ్వకుండా కాపీ ఇస్తారా? అని ఎవరైనా అడిగితే అతనిని అయోమయం వ్యక్తిగా చూస్తారు.అలాగే.. ఇప్పుడు భూముల రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఒరిజినల్‌వి కాదని కొందరు ప్రచారం చేస్తున్నారు. కంపెనీల షేర్ల మాదిరి భూములు కూడా కంప్యూటర్లలో ఈ చట్టం కింద పరిరక్షణలో ఉంటాయి. మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కాపీ తీసుకోవచ్చు. నిరభ్యంతరంగా లావాదేవీలు జరుపుకోవచ్చు.ఇంకో ఉదాహరణ చెప్పాలి. గతంలో పత్రికలు తమ దిన సంచికలను జాగ్రత్తగా స్టోర్ చేసేవి. అవన్ని దుమ్ముకొట్టుకుపోయేవి.చెదలు పట్టి పాడైపోతుండేవి. మరి ఇప్పుడు వాటన్నిటిని డిజిటలైజ్ చేస్తున్నారు. పలు లైబ్రరీలు కూడా ఇలాగే వివిధ పత్రికలను డిజిటలైజ్ చేసి అందుబాటులో ఉంచుతున్నారు. అలాకాదు.ఒరిజినల్ పాత పేపర్లు కావాలని ఎవరైనా అడిగితే ఏమి చెబుతాం?. పాతకాలపు మనిషి అని నవ్వుకుంటారు.కొన్ని సంవత్సరాలుగా క్షేత్రస్థాయిలో రెవెన్యూ రికార్డులు తయారు చేసేవారు లేకపోవడంతో భూ వివాదాలు పెరిగాయి. నకిలీలు, కబ్జాలు, రాజకీయ జోక్యం పెరిగిపోయింది..వీటన్నింటిని అరికట్టడానికి లాండ్ టైటిలింగ్ చట్టం ఉపయోగపడుతుంది.ఇక ఈ-స్టాంపింగ్ వ్యవస్థపై కూడా ఈనాడు పత్రిక దారుణమైన అబద్దాలు రాసింది. ఇప్పటికే పన్నెండు రాష్ట్రాలలో ఈ-స్టాంపింగ్ వ్యవస్థ అమలులో ఉంది. తెల్గీ స్టాంప్ కుంభకోణం తర్వాత కేంద్రం స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఉన్న స్టాంప్‌ పేపర్ల కంటే ఎక్కువ భద్రత తో ఈ-స్టాంపింగ్ వ్యవస్థను కేంద్రం తెచ్చింది.ఈ ప్రభుత్వం కూడా దీనిపై ప్రయోగాలు చేస్తుంటే ,కొందరు స్వార్ధపరులు దీనికి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీనియర్ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.ఈ స్టాంపులు జిరాక్స్ కాపీలు కావని ,నాన్ జ్యుడిషియల్ స్టాంపు పేపర్ల కంటే ఎక్కువ సేఫ్ అని వారు అంటున్నారు.ఏపీలో ఏ అభివృద్ది జరిగినా, ఏ సంస్కరణ తెచ్చినా ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వాటికి వ్యతిరేకంగా పచ్చి అబద్దాలు రాయడం,దానిని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు అందుకోవడం నిత్యకృత్యం అయింది. వలంటీర్ల వ్యవస్థపై వీరంతా ఎంత విషం చిమ్మారో చూశాం. ఇప్పుడు అదే వ్యవస్థ తాము కొనసాగిస్తామని,ఇంకా ఎక్కువ జీతాలు ఇస్తామని చెబుతున్నారు. గ్రామ ,వార్డు సచివాలయాలతో గ్రామ పంచాయతీలకు నష్టం అని ప్రచారం చేశారు. ఇప్పుడు వృద్దుల పెన్షన్లు వారి ద్వారానే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. ఏ సంస్కరణ తెచ్చినా విషం కక్కుతున్న వీళ్లిద్దరి పట్ల ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఒకసారి ఇలాంటివారిని నమ్మి మోసపోయారు. మరోసారి మోసపోతే కోలుకోవడం కష్టమే అవుతుందని చెప్పక తప్పదు.::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

అమ్మా.. బాగున్నావా? ఆరోగ్యం జాగ్రత్త!
అమ్మా.. బాగున్నావా? ఆరోగ్యం జాగ్రత్త!!

ఇంట్లో ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడుతూ, అందరి బాగోగులూ చూసే తల్లులు తమ ఆరోగ్యాన్ని మాత్రం పట్టించుకోరు. అమ్మ తనని తాను పట్టించుకోదని వదిలేసి ఊరుకోలేము, ఊరుకోకూడదు కూడా. మనకోసం అహరహం తపించే మన కన్నతల్లిని కంటికి రెప్ప లా కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై కూడా ఉంది. అందుకోసం ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం...రేపు అంతర్జాతీయ మాతృదినోత్సవం. ఈ నేపథ్యంలో అమ్మ గురించి, అమ్మ ఆరోగ్యం గురించి కాస్త శ్రద్ధ తీసుకోవడం చాలా మంచిది. రోజంతా రాత్రి, పగలు ఇంట్లోని వారందరి బాగోగులు చూసే తల్లులు తీరా తమ దగ్గరకొచ్చేసరికి అంతగా పట్టించుకోరు. దాంతో వారికి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. వాటిని దూరం చేయాలంటే ఏం చేయాలో, వారు ఆరోగ్యంగా... ఆనందంగా ఉండేందుకు ఏమేం చర్యలు తీసుకోవాలో చూద్దాం...చురుగ్గా ఉండేలా...ఎవరైనా సరే, ఉత్సాహంగా... ఉల్లాసంగా ఉండడం చాలా ముఖ్యం. అమ్మ ఉత్సాహంగా ఉల్లాసంగా లేకపోయినా కనీసం చురుగ్గా అయినా ఉంటోందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత మనదే. ఇందుకోసం రోజుకి 30 నుంచి 40 నిమిషాల పాటు ఆమె వాకింగ్‌ చేసేలా చూడాలి. దాని వల్ల బరువు అదుపులో ఉంటుంది. ఏవిధమైన ఇన్ఫెక్షన్లూ సోకవు. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. కాబట్టి, తల్లులు సులువుగా చేయగలిగే కనీస వ్యాయామాలు చేసేలా చూడాలి. అలా చేయాలంటే మనం కూడా మన బద్ధకాన్ని వదలగొట్టుకుని శరీరానికి కొద్దిపాటి శ్రమ కలిగించే వ్యాయామాలు చేయడం అవసరం. మనల్ని చూసి మన తల్లులూ, మన పిల్లలూ కూడా వ్యాయామాలు చేసి ఆరోగ్యంగా... సరైన ఆకృతిలో ఉండేందుకు తప్పకఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటోందా?అమ్మలు మనం ఇష్టంగా తినేవాటిని ఎంతో శ్రమపడి వండి వారుస్తారు కానీ, వారి విషయానికొచ్చేసరికి సరిగా తినరు. అలా కాకుండా అమ్మ ఏమేం తింటోంది, ఎలా తింటోంది... అసలు సరిగ్గా తింటోందో లేదో పట్టించుకోవాలి. అమ్మ వండింది మనం కడుపునిండా తినడమే కాదు, అమ్మ ఏమైనా తింటోందో లేదో చూస్తూ, ఆమె ఇష్టాన్ని కనిపెట్టి వారికి నచ్చే ఆహారాన్ని బయటినుంచి కొని తీసుకు రావడమో లేదా వీలయితే మీరే ఒకరోజు సరదాగా వండిపెట్టడమో చేయాలి.వారు ఆరోగ్యంగా ఉండేందుకు హెల్దీ ఫుడ్‌ని అందించండి. వారి డైట్‌లో పాలు, గుడ్లు, నట్స్, సోయా వంటి ్రపోటీన్‌ రిచ్‌ ఫుడ్స్‌ని యాడ్‌ చేసుకోండి. తాజా పండ్లు, కూరగాయలు తినే చూడండి. దీంతో పాటు హైడ్రేటెడ్‌గా ఉండేలా నీటితో పాటు, గ్రీన్‌ టీ, హెర్బల్‌ టీలను తాగించండి. వీటితో పాటు హోల్‌ గ్రెయిన్స్‌, బ్రౌన్‌ రైస్, ఓట్స్‌ వంటి ఫుడ్స్, అలానే కాల్షియం, ఫైబర్‌ రిచ్‌ ఫుడ్స్‌ తీసుకునేలా చూడడం తప్పనిసరి.ఆరోగ్య పరీక్షలు చేయిస్తున్నారా? ఆరోగ్యమే మహా భాగ్యం అన్న సూక్తి చాలా పాతదే అయినప్పటికీ అది ఎల్లవేళలా అనుసరించవలసినదే. ఆరోగ్యాన్ని మించిన ధనం లేనేలేదు. అందువల్ల నేటి కాలంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. మనకెవరికైనా ఏమాత్రం ఆరోగ్యం బాగుండకపోయినా సరే, తల్లడిల్లిపోయే తల్లులు తమ ఆరోగ్యం విషయానికి వచ్చేసరికి పట్టించుకోరు.మీరు అలా అని వదిలేసి ఊరుకోవద్దు. అమ్మకి తప్పనిసరిగా హెల్త్‌ చెకప్స్‌ చేయించండి. థైరాయిడ్, హైబీపి, షుగర్‌ వంటి సమస్యలేమైనా ఉంటే అవి ఏ మేరకు అదుపులో ఉన్నాయో ఈ టెస్ట్‌ల ద్వారా తెలుసుకోవచ్చు. ఇందుకోసం ప్రతి 3 నెలలకి ఓ సారి చెకప్స్, ప్రతి సంవత్సరం బ్రెస్ట్‌ క్యాన్సర్‌ చెకప్స్, దీనికి సంబంధించిన సెల్ఫ్‌ టెస్ట్‌ ఇంట్లోనే 6 నెలలకి ఓసారి చేయించడం మంచిది.ప్రేమ పూరితమైన పలకరింపు!అన్నిటినీ మించి అమ్మ దగ్గర రోజూ కాసేపు కూర్చుని అమ్మను ప్రేమగా పలకరించి, ఆమెతో కాసేపు కబుర్లు చెప్పడం వల్ల ఎంతో సంతోషపడుతుంది అమ్మ. అమ్మ ఏమైనా చెప్పడానికి ప్రయత్నించినప్పుడు విసుక్కోవడం, కసురుకోవడం అసలు పనికిరాదు. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం.. ఇలా మదర్స్‌డే, ఫాదర్స్‌డే వంటివి జరుపుకునేది విదేశాలలోనే కానీ, మనకెందుకులే అని పట్టించుకోకుండా ఊరుకోకండి.ప్రచార, ప్రసార మాధ్యమాల ద్వారా, సోషల్‌ మీడియా ద్వారా అమ్మలు కూడా అన్ని విషయాలూ తెలుసుకుంటున్నారనే విషయాన్ని గుర్తించండి. అమ్మకు తప్పనిసరిగా శుభాకాంక్షలు చెప్పి, ఆమె ఆశీర్వాదాన్ని అందుకోవడం మాత్రం మరచిపోవద్దు. విష్‌ యు ఏ హ్యాపీ మదర్స్‌ డే..

తనిష్క్ జ్యువెలరీ నెక్లెస్‌
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్

ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన, భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్‌ల నుండి ప్రేరణ పొంది అద్భుతమైన మరియు వైవిధ్యమైన శ్రేణి సమకాలీన, రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్‌లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్‌లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్‌లు, కస్టమర్‌లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా, ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్‌ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్‌ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్, ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్‌లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్‌గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్‌లెట్‌లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్‌లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్‌లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్‌డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్‌లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్ 18కేరట్ మరియు 22కేరట్ బంగారంలో విస్తృతమైన శ్రేణి డిజైన్‌లతో, నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని సంపూర్ణం చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్‌లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్‌లెట్‌లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement

ఫోటో స్టోరీస్

View all