Top Stories
ప్రధాన వార్తలు
అదుపుతప్పిన అమిత్ షా హెలికాప్టర్.. నేలను తాకబోయి...
పాట్నా: కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌షాకు పెద్ద ప్రమాదం తప్పింది. షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ అవుతుండగా అదుపుతప్పి నియంత్రణ కోల్పోయింది. బిహార్‌లోని బెగుసరాయ్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్లినపుడు సోమవారం(ఏప్రిల్29) ఈ ఘటన జరిగింది.ప్రచారం ముగించుకుని అమిత్ షా హెలికాప్టర్ ఎక్కారు. హెలికాప్టర్ గాల్లోకి లేచే సమయంలో ఊగిసలాడి కుడివైపుకు వెళ్లింది. ఒక దశలో కిందకు వచ్చి నేలను తాకే దాకా వెళ్లింది. ఇంతలో అప్రమత్తమైన హెలికాప్టర్‌ను పైలట్ నియంత్రణలోకి తీసుకోవడంతో సరైన దిశలో ప్రయాణించింది. ఈ దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.Grateful to #God for His divine intervention today! @AmitShah Ji’s helicopter encountered a balance issue during takeoff, but by God’s grace, the trajectory was corrected, ensuring a safe journey. Our prayers are always with him. pic.twitter.com/RLB9QPLgJT— Dr. Abhishek Verma (@AbhishekVermaX) April 29, 2024
ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
దివంగత సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత ములాయం సింగ్ యాదవ్ కుటుంబాన్ని చూసి అధికార పార్టీ బీజేపీ భయపడుతోందని సమాజ్‌వాదీ పార్టీ నేత శివపాల్ యాదవ్ అన్నారు. బీజేపీ నేతలు ఎస్పీకి వ్యతిరేకంగా ఎంత ఎక్కువ మాట్లాడితే.. లోక్‌సభ ఎన్నికల్లో విజయం అదే స్థాయిలో ఉంటుందని తెలిపారు.సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తరుణంలో శివపాల్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. మూడో దశ సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 10 స్థానాల్లో ఎస్పీ, ఇండియా కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.యూపీలో మొదటి రెండు దశల్లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో పేలవమైన ఓటింగ్‌పై శివపాల్ యాదవ్ మాట్లాడుతూ.. మా ఓటర్లు కూలీలు, రైతులు. వారు, ఎండని వేడిని పట్టించుకోరు. ఓటర్లు వారి ఓటు హక్కును ఉపయోగిస్తున్నారు. కానీ బీజేపీ ఓటర్లు బయటకు రావడం లేదు. అందుకే బీజేపీ నేతల్లో ఆందోళన నెలకొందని అన్నారు. శివపాల్ యాదవ్‌కు వృద్ధాప్యం వచ్చిందని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఎస్పీ నేత శివపాల్ యాదవ్ స్పందించారు. నేను రోజుకు 40 సమావేశాలు నిర్వహిస్తున్నాను. యోగి మాత్రం రోజుకు నాలుగైదు సమావేశాలకు మాత్రమే హాజరవుతున్నారని తెలిపారు.యూపీలో 10లోక్‌సభ స్థానాలకు మే 7న మూడో దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మెయిన్‌పురి, ఫిరోజాబాద్, సంభాల్, బుదౌన్ స్థానాలు ఉన్నాయి. ఈ దశలో ఓటింగ్‌కు వెళ్లే చాలా స్థానాలను ఎస్పీ కంచుకోటలుగా కొనసాగుతున్నాయి.
పెన్షనర్ల ఉసురు చంద్రబాబుకు తగులుతుంది: సజ్జల
సాక్షి, తాడేపల్లి: వాలంటీర్ల సేవలను అడ్డుకున్నది చంద్రబాబేనని,పెన్షన్లు ఇవ్వకుండా కుట్ర చేశారని వైఎస్సార్సీసీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఆయన తాడేపల్లిలో సోమవారం మీడియాతో మాట్లాడారు.‘‘వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ పెన్షన్లు అందించాం. ప్రతి ఇంటికి వాలంటీర్లు పౌరసేవలందించారు. తనపై వ్యతిరేకత వస్తుందనే భయంతో వాలంటీర్లపై చంద్రబాబు మాట మార్చారు. వాలంటీర్ల సేవలను అడ్డుకుని బాబు ఏం సాధించారు?. ఈసీ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. ఎల్లో మీడియాలో దుష్ప్రచారాలు చేయించడమే బాబు పని. చంద్రబాబు ఏజెంట్ ఢిల్లీలో కూర్చుకున్నాడు. ..చంద్రబాబు లెటర్లు రాసి, ఫిర్యాదులు చేయిస్తున్నాడు. అధికారులపై లేనిపోని దుష్ప్రచారాలు చేయిస్తున్నాడు. చంద్రబాబు మనిషి జన్మ ఎలా ఎత్తాడో అర్థం కావటం లేదు. సీఎం జగన్‌ను తిట్టడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నాడు. బ్లూ కలర్ ఎక్కడ కనిపించినా చంద్రబాబుకు పీడ కలలు వస్తాయి...పెన్షనర్ల పరిస్థితికి చంద్రబాబే కారణం. చంద్రబాబు హయాంలో పెన్షన్ల కోసం అవస్థలు పడ్డారు. చంద్రబాబు ఏనాడు సరిగ్గా పెన్షన్లు అందించలేదు. పెన్షనర్ల ఉసురు చంద్రబాబుకు తగులుతుంది. చంద్రబాబు, ఆయన ముఠా కారణంగా పెన్షనర్లకు అవస్థలు. .. 2014-2019 మధ్య ఏం జరిగిందనేది ప్రజలు మరచిపోలేదు. పెన్షనర్ల శాపాలు చంద్రబాబుకు తగులుతాయి. కులాల మధ్య చిచ్చు పెట్టే అలవాటు చంద్రబాబుకు, ఆయన దత్తపుత్రుడికి ఉంది. కూటమి డిపాజిట్లు గల్లంతవ్వడం ఖాయం. .. ప్రభుత్వం మీద, వ్యవస్థల మీద అడ్డగోలుగా చంద్రబాబు మాట్లాడుతున్నాడు. చంద్రబాబు బాధ్యత గల వ్యక్తిగా వ్యవహరించటం లేదు. ఈ దేశంలో ఉండే అర్హత చంద్రబాబు కోల్పోయాడు. సీఎం జగన్ చుక్కల భూముల సమస్యను పరిష్కరించారు. చంద్రబాబు ఏ రోజు ఏం మాట్లాడుతారో తెలియదు’’ అని సజ్జల ధ్వజమెత్తారు.
Asaduddin Owaisi: ముస్లింలు, దళితులకు చంద్రబాబు శత్రువు...
రిపోర్టర్: ఈ సారి దేశవ్యాప్తంగా ఎన్నికలు హిందూ-ముస్లిం, ముస్లిం రిజర్వేషన్లు అనే ఎజెండాపై జరుగుతున్నట్లు కనిపిస్తోంది. దీనిపై మీ అభిప్రాయం…ఓవైసి: సాక్షాత్తు ప్రధాని నరేంద్రమోదీ తన లోపాలను కప్పిపుచ్చేందుకు ఇలాంటి వాతావరణం సృష్టించారు. నిన్నటి దాకా విశ్వగురు, జీ-20, చంద్రయాన్, 5ట్రిలియన్ ఎకానమి అంటూ ఊదరగొట్టారు. ఇప్పుడు అవన్నీ వదిలేసి.. హిందూ-ముస్లిం వివాదం తీసుకువ్చచారు. ఇది చూస్తే అర్ధమవుతోంది… ప్రధాని మోదీకి ముస్లిం మైనారిటీలంటే ఎంత ధ్వేషమో. ముస్లింలను ధ్వేషించడం ఒక్కటే… ప్రధాని మోదీ గ్యారంటీ.రిపోర్టర్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణాతో పాటు ముస్లిం రిజర్వేషన్లు ఉన్న ప్రతీచోటా వాటిని తీసివేయాలనే ప్రయత్నం జరుగుతోంది… దీనిపై మీ అభిప్రాయం.ఓవైసి: 2004లో గులాంనబీ అజాద్ కాంగ్రెస్ పరిశీలకులుగా హైదరాబాద్ వచ్చారు. అప్పుడు కాంగ్రెస్ నేత యూనుస్ సుల్తాన్ ఇంట్లో జరిగిన సమావేశంలో… ముస్లిం రిజర్వేషన్లు ఇస్తామని దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హామీ ఇచ్చారు. హామి ఇచ్చినట్లుగానే అధికారంలోకి రాగానే వైఎస్సార్ ప్రభుత్వం ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించింది.ముందుగా కోర్టు దీనిపై అభ్యంతరం చెప్పింది. దీంతో ప్రముఖ ఆంత్రోపాలజిస్టు కృష్ణన్ ఆధ్వర్యంలో కమిటీ వేసి… ముస్లింలలో కుల ప్రాతిపదికన 4శాతం రిజర్వేషన్లు ఇవ్వడం సహేతుకమే అని తేల్చారు. ఆ తరువాత వేసిన ఎస్ఎల్పీలో ముస్లిం రిజర్వేషన్లను అనుమతిస్తూ సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. చాలామంది ముస్లిం యువకులు, విద్యార్ధులు రిజర్వేషన్ల వల్ల లబ్ది పొందుతున్నారు.ఇప్పుడిప్పుడే ముస్లింలు కాస్త బాగుపడుతున్నారు. డాక్టర్లు, ఇంజనీర్లు, డీఎస్పీలు, ఆర్డీవోలు, టీచర్లుగా ఉద్యోగులు పొందుతున్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ వారికి ముస్లింలు అంటే తీవ్రమైన ధ్వేషం. 4శాతం రిజర్వేషన్ల ద్వారా ముస్లింలు లబ్దిపొందడం బీజేపీకి మింగుడుపడటం లేదు. విద్యా, ఉద్యోగ పరంగా ముస్లింలు స్వావలంబన సాధించడం బీజేపీకి నచ్చక వారు రిజర్వేషన్లు తొలగించేందుకు కుట్రలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో ముస్లింలకు మతం ప్రాతిపదికన రిజర్వేషన్లు లభించడం లేదు. ముస్లింలలోని నిమ్న కులాలు వారికి సమాజంలో ఉన్న సామాజిక, విద్యాపరమైన వెనకబాటు కారణంగా రిజర్వేషన్లు అందుతున్నాయి.ముస్లింల అభివృద్దిని అడ్డుకునేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్లతో కలిసి ఆంధ్రప్రదేశ్‌లు చంద్రబాబునాయుడు, జనసేన పార్టీలు పనిచేస్తున్నాయి. టీడీపీ, జనసేన పార్టీలు ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీల శత్రువులు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు బీజేపీ ఎజెండా ఆధారంగా ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఏపీలో కూటమి అధికారంలోకి వస్తే బీజేపీ, జనసేనతో కలిసి చంద్రబాబు ముస్లిం రిజర్వేషన్లు లేకుండా చేస్తాడు. ముస్లిం రిజర్వేషన్ల తరువాత వీరు దళితులకు కూడా రిజర్వేషన్లు లేకుండా చేస్తారు. ఏపీ ప్రజలంతా ఆలోచించి చంద్రబాబు, బీజేపీ, జనసేనలాంటి మతతత్వ, ఫాసిస్టు పార్టీలను ఓడిస్తారని ఆశిస్తున్నాను.ఏపీ ప్రజలందరితో నేను విజ్ఞప్తి చేస్తున్నాను… మీరంతా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి మద్దతుగా ఓటు వేయండి. జగన్మోహన్రెడ్డి మతతత్వవాది కాదు… జగన్మోహన్రెడ్డి లౌకికవాది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన తరువాత చాలా సమస్యలున్నాయి.రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్రెడ్డి రాజకీయనిర్ణయాలు తీసుకున్నారు. జగన్మోహన్రెడ్డి ఎప్పుడు దళితులు, ముస్లింల ప్రయోజనాలపై రాజీపడలేదు. చంద్రబాబు మాత్రం ముస్లింలు, దళితుల ప్రజయోజనాలను తాకట్టుపెట్టి స్వలాభం ఆలోచించారు. 2002లో గుజరాత్ అల్లర్ల కారణంగా దేశం మొత్తం కాలిపోతుంటే, ముస్లింలపై దౌర్జన్యాలు జరుగుతుంటే చంద్రబాబు మాత్రం బీజేపీకి మద్దతిచ్చాడు. చంద్రబాబును ముస్లింలు ఎన్నటికీ నమ్మరు. ముస్లింల పట్ల చంద్రబాబుకు ఎలాంటి ప్రేమలేదు.
ఢిల్లీతో మ్యాచ్.. కేకేఆర్ స్టార్ బౌలర్ రీ ఎంట్రీ! తుది జట్లు ఇవే
ఐపీఎల్-2024లో మరో కీలక పోరుకు తెరలేచింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్‌లో ఒక మార్పుతో బరిలోకి దిగింది. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కు దూరమైన పృథ్వీ షా తిరిగి జట్టులోకి వచ్చాడు. మరోవైపు కేకేఆర్ రెండు మార్పులు చేసింది. తుది జట్టులోకి మిచెల్ స్టార్క్, వైభవ్ ఆరోరా వచ్చారు. ఇక పాయింట్ల పట్టికలో కేకేఆర్ రెండో స్ధానంలో కొనసాగుతుండగా.. ఢిల్లీ ఆరో స్ధానంలో ఉంది.తుది జట్లుకోల్‌కతా నైట్ రైడర్స్: ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తిఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, అభిషేక్ పోరెల్, షాయ్ హోప్, రిషబ్ పంత్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రసిఖ్ దార్ సలామ్, లిజాద్ విలియమ్స్, ఖలీల్ అహ్మద్
కూటమికి గుచ్చుకున్న గాజు గ్లాసు!
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో కూటమికి మరో తల నొప్పి మొదలైంది. టీడీపీ, జనసేన పార్టీ రెబల్స్ ఇస్తున్న షాక్‌కు కూటమికి గాజు గ్లాసు గుచ్చుకుంటోంది. గాజు గ్లాసుతో టీడీపీ, జనసేన రెబల్స్ పోటీలోకి దిగుతున్నారు. తాజాగా గాజు గ్లాస్‌ను ఫ్రీ సింబల్‌గా వాడుకోవచ్చని ఈసీ వర్గాలు తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈసీపై.. టీడీపీ, బీజేపీ పార్టీల ఒత్తిడి ఫలించదు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు వ్యవహరించింది.దీంతో 21 అసెంబ్లీ చోట్ల జనసేన అభ్యర్థులు గాజు గ్లాస్ గుర్తుపై పోటీ చేస్తుండగా.. ఈసీ ప్రకటనతో మిగిలిన చోట్ల స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ కేటాయించే అవకాశం ఉంది. కాగా, టీడీపీ, జనసేన రెబల్స్.. గాజు గ్లాస్ గుర్తుతోనే కూటమికి ధమ్కీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. విజయనగరం టీడీపీ రెబల్ మీసాల గీతకు, జగ్గంపేట జనసేన రెబల్ సూర్యచంద్రకు ఈసీ గాజు గ్లాస్ కేటాయించింది. ఇక.. ఎస్ కోటలో జనసేన రెబల్ కొట్యాడ లోకాభిరామకోటి గాజు గ్లాస్‌తో పోటీకి దిగుతున్నారు. మరోవైపు.. టీడీపీకి పలు నియోజకవర్గాల్లో రెబెల్స్ బెడద తప్పటం లేదు. విజయనగరం, ఉండి, పోలవరం, పెనుగొండ, హిందూపురంలో బరిలో రెబల్ అభ్యర్థులు పోటీకి దిగుతున్నారు. సినీనటుడు బాలకృష్ణపై పరిపూర్ణానంద స్వామి, పరిటాల సునీతపై ప్రొఫెసర్ రాజేష్, అదితి గజపతిపై మీసాల గీత , జ్యోతుల నెహ్రూపై సూర్యచంద్ర, రఘురామకృష్ణంరాజుపై ఉండిలో మాజీ ఎమ్మెల్యే శివ రామరాజు, పోలవరంలో టీడీపీ రెబల్ మొడియం సూర్యచంద్రరావు బరిలో నిలుస్తున్నారు.
హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. టీమిండియా వైస్ కెప్టెన్‌గా పంత్!?
టీ20 వరల్డ్‌కప్-2024కు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ తమ జట్టును మే 1న ప్రకటించనుంది. ఇక ఇప్పటికే వరల్డ్‌కప్ కోసం తుది జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మెన్ అజిత్ అగార్కర్, భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఖారారు చేసినట్లు తెలుస్తోంది. అయితే వరల్డ్‌కప్ జట్టు ఎంపిక చేసే క్రమంలో బీసీసీఐ సెలక్టర్లు ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టీమిండియా వైస్ కెప్టెన్సీ బాధ్యతలను వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌కు అప్పగించేందుకు సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు రోహిత్ డిప్యూటీగా వ్యవహరించిన హార్దిక్ పాండ్యాపై సెలక్టర్లు వేటు వేసినట్లు సమాచారం. ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా విఫలమయ్యాడు. కెప్టెన్‌గానే కాకుండా వ్యక్తిగత ప్రదర్శన పరంగా హార్దిక్ నిరాశపరుస్తున్నాడు. ఈ క్రమంలోనే సెలక్టర్లు హార్దిక్‌ను వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఇక 14 నెలల తర్వాత తిరిగి రీ ఎంట్రి ఇచ్చిన రిషబ్ పంత్ అదరగొడుతున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్లో పంత్ ఇప్పటివరకు 10 ఇన్నింగ్స్‌లలో 371 పరుగులు చేశాడు. కెప్టెన్సీ పరంగా కూడా పంత్ ఆకట్టుకుంటున్నాడు. అతడి సారథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో ఆరో స్ధానంలో కొనసాగుతోంది.
చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థ ఓలా క్యాబ్స్‌లో కీలక పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. బాధ్యతలు చేపట్టిన మూడు నెలలకే ఆ సంస్థ సీఈఓ పదవికి హేమంత్ బక్షి రాజీనామా చేసినట్లు సమాచారం. దీంతో పాటు సంస్థ పునర్నిర్మాణంలో భాగంగా ఓలా క్యాబ్స్ దాదాపు 200 మంది ఉద్యోగుల్ని తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయిఐపీఓకి ఓలా ఓలా క్యాబ్స్ ఐపీఓ వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. ఇందుకోసం ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్‌తో ఓలా క్యాబ్స్ ఇటీవలే చర్చలు నిర్వహించింది. మరో రెండు మూడు నెలల్లో సెబీకి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఓలా ఎలక్ట్రిక్ ఇప్పటికే ఐపీఓ కోసం సెబీకి దరఖాస్తు చేసుకుంది.ఈ తరుణంలో సీఈఓ రాజీనామా, ఉద్యోగుల తొలగింపు అంశం ఓలా క్యాబ్స్ చర్చాంశనీయంగా మారింది. కాగా, ఓలా క్యాబ్స్ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు.
సీఎం మమత సర్కార్‌కు సుప్రీం కోర్టులో ఊరట
ఢిల్లీ: టీచర్ల నియామకాలకు సంబంధించిన కేసులో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఊరట లభించింది. 24 వేల టీచర్ల నియామకాన్ని పూర్తిగా రద్దు చేసి, సీబీఐ విచారణ చేపట్టాలని కోల్‌కతా హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును టీఎంసీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ఈ క్రమంలో సోమవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. ఈ కేసులో పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్‌కు చెందిన ప్రభుత్వ అధికారులపై లోతుగా దర్యాప్తు చేయాలన్న సీబీఐకి ఇచ్చిన ఆదేశాలపై తాజాగా స్టే విధించింది.2016 నాటి టీచర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్లో అవకతవకలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఇటీవల కోల్‌కతా హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. అప్పటి మొత్తం రిక్రూట్‌మెంట్‌ను రద్దు చేయాలని... ఇప్పటివరకు టీచర్లు తీసుకున్న జీతాలను వడ్డీతో సహా చెల్లించాలని తీర్పు ఇచ్చింది. ఇక ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియపై పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్‌ను మరింత దర్యాప్తు చేయాలని సీబీఐని ఆదేశించిన విషయం తెలిసిందే. కోల్‌కత హైకోర్టు తీర్పుపై దీదీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీంతో తాజాగా సీబీఐ దర్యాప్తుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఈ కేసుపై సుప్రీం కోర్టు తదుపరి విచారణను మే 6 తేదీకి వాయిదా వేసింది. ఇప్పటికే ఈ వ్యవహరంలో సీబీఐ మాజీ విద్యాశాఖ మంత్రి పార్థా చటర్జీ, పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్‌లోని పలువురు అధికారులను సీబీఐ అరెస్ట్ చేయటం గమనార్హం.
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: చంద్రబాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమేనని అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. చంద్రబాబు ఎలాంటివాడో చెప్పడానికి 2014 కూటమి మేనిఫెస్టో సరిపోతుందని మండిపడ్డారు. విలువలు, విశ్వసనీయత లేని బాబు.. ఎన్నికలయ్యాక మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేస్తాడని విమర్శించారు. గుంటూరు పొన్నూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం జగన్.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిపై నిప్పులు చెరిగారు.జననేత రాకతో పొన్నూరులో పండుగ వాతావరం నెలకొంది. సీఎం నినాదాలతో ప్రచార సభ మార్మోగిపోయింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. మరో రెండు వారాల్లో కురుక్షేత్ర సంగ్రామం జరగబోతుందన్నారు. ఈ యుద్ధంలో ఓ వైపు కౌరవ సేన, దృష్ట చతుష్టయం ఉందని విమర్శించారు. గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు అందరినీ మోసం చేసిన చరిత్ర ఆ కూటమిని దుయ్యబట్టారు. ఆయనకు మద్దతుగా రెండు జాతీయ పార్టీలు, ఉన్నాయని ఒక వదినమ్మ, ఒక దత్తపుత్రుడు, ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.పేదవాడికీ మేలు చేసిన చరిత్రలేని వీళ్లంతా కూటమిగా చేరి ఇంటింటికీ మంచి చేసిన ఒకే ఒక్కడైన మీ జగన్‌తో యుద్ధం చేస్తున్నారన్నారు. వైఎస్ జగన్ నమ్ముకున్నది మిమ్మల్ని(ప్రజలు), పైనున్న ఆ దేవుడినే అని తెలిపారు. జగన్ పొత్తు ప్రజలతోనే ఉంన్నారు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్లకు ప్రజల ఇంటి అభివృద్ధిని నిర్ణయించేవన్నారు. పేదల తలరాతలను నిర్ణయించేవని చెప్పారు. వైఎస్ జగన్‌కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగుతాయని.. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పతకాలన్నీ ఆగిపోతాయని తెలిపారు.సీఎం జగన్ పూర్తి ప్రసంగం విశ్వసనీయత ఉన్న ఈ ప్రభుత్వం మీద విలువలు లేని చంద్రబాబు ఎలా నోరుపారేసుకుంటున్నారో వింటున్నారు కదా14 ఏళ్ల ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏం చేశాడో చెప్పకుండా జగన్‌ను తిడుతున్నాడుచంద్రబాబు నన్ను ఒక బచ్చా అంటున్నాడుపోయేకాలం వచ్చినప్పుడు విలన్లందరికీ హోరో బచ్చాలనే కనిపిస్తాడునువ్వు బచ్చా అంటున్న నేను ఎన్నికల్లో ఒంటరిగా నిలబడి ధైర్యంగా పొరాడుతున్నా14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఏం చేశాడో చెప్పుకోలేకపోతున్నాడుచంద్రబాబు పేరు చెబితే గుర్తు వచ్చే ఒక్కమంచి పథకం అయినా ఉందా?14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ప్రజలకు తాను చేసిన మేలు చెప్పి ఓట్లు ఎందుకు అడగలేకపోతున్నాడు?మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేాశా అని చెప్పే చంద్రబాబు పేదవాళ్లకు చేసిన ఒక్కటంటే ఒక్క మంచి అయినా ఉందా?బచ్చా అంటున్న జగన్‌ను చూసి.. బాబు ఎందుకు బయపడుతున్నాడు?బచ్చాను ఎదుర్కొనేందుకు ఇన్ని పార్టీలతో పొత్తు ఎందుకు?చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?అమ్మ ఒడి, చేయూత, ఆసరా, సున్నావడ్డీ, ఈబీసీ నేస్తం, వాహనమిత్ర, పెన్షన్ వంటి పథకాలు నువ్వు ఎందుకు చేయలేదు?ఐదేళ్లలో నేను అమలు చేసిన పథకాలనే అమలు చేస్తానని ఎందుకు చెబుతున్నావు?రుణమాఫీ చేస్తానన్నాడు చేశాడా?గత మేనిఫెస్టోలో చెప్పినవి 99 శాతం హామీలు అమలు చేశాంలంచాలు, వివక్ష లేకుండా రూ. 2 లక్షల 70 వేల కోట్లు అందించాంనాడు-నేడుతో విద్యా, వైద్య రంగంలో మార్పులు తీసుకొచ్చాం.31 లక్షల ఇళ్ల పట్టాలు,. 22 లక్షల ఇళ్ల నిర్మాణం ఈ 58 నెలల కాలంలోనే జరిగింది.నా కేబినెట్లో 68శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నారు.58 నెలల్లోనే 2 లక్షల 31 వేల ఉద్యోగాలిచ్చాం200 స్థానాల్లో 100 టికెట్లు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకే ఇచ్చాపేదల భవిష్యత్తు మరో రెండడుగులు ముందుకు వేసేలా 2024 మేనిఫెస్టో.
తప్పక చదవండి
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్‌కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- T20 WC: సచినే ఓపెనర్‌గా రాలేదు.. నువ్వెందుకు కోహ్లి?
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
- ఈ పాపని గుర్తుపట్టారా? లేటెస్ట్ సెన్సేషన్.. రూ.100 కోట్ల మూవీ హీరోయిన్
- నామినేషన్ దాఖలు చేసిన రాజ్‌నాథ్ సింగ్
- గుడిలో ప్రముఖ నటికి చేదు అనుభవం.. పోస్ట్ వైరల్
- హమ్మయ్య బంగారం దిగొచ్చింది! తులం ఎంతంటే..
- శుభకార్యానికి వెళ్తూ అనంతలోకాలకు..
- పెద్దలను ఎదిరించలేక ప్రేమ జంట ఆత్మహత్య
సినిమా
క్షమించండి.. పోలీసుల విచారణకు రాలేను: తమన్నా
ఐపీఎల్ కేసులో చిక్కుకున్న సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ తమన్నాకు నోటీసులు జారీ అయిన విషయం తెలిసిందే. నిబంధనలకు విరుద్ధంగా ఐపీఎల్ 2023 మ్యాచ్‌లను ‘ఫెయిర్ ప్లే’ యాప్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేసినందుకుగాను మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. నేడు ఎప్రిల్ 29న విచారణకు హాజరుకావాలని ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. ఐపీఎల్ 2023 మ్యాచ్‌లను ‘పెయిర్ ప్లే’ యాప్‌లో స్ట్రీమింగ్ చేయడం కారణంగా తమకు రూ. కోట్లలో నష్టం జరిగిందని ప్రసార హక్కులను సొంతం చేసుకున్న ‘వయాకామ్’ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ యాప్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లను చూడాలంటూ తమన్నా, సంజయ్ దత్తో పాటు పలువురు బాలీవుడ్ నటీనటులు, గాయకులు ప్రచారం చేశారు. ఇదే కేసులో ఈ మధ్యే సంజయ్ దత్‌కి కూడా సమన్లు జారీ అయ్యాయి. తమన్నా నేడు విచారణకు రావాల్సి ఉంది. కానీ ఆమె హాజరుకాలేదు. షూటింగ్ పనుల వల్ల ఆమె అందుబాటులో లేదని, మరో రోజు విచారణకు వస్తారని ఆమె తరపున ఉన్న లాయర్ పేర్కొన్నారు. ప్రస్తుతం సాక్షిగా మాత్రమే ఆమెను విచారణకు పోలీసులు పిలిచారు. ఈ కేసులో నటుడు సాహిల్ ఖాన్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.ఐపీఎల్ 2023 స్ట్రీమింగ్ రైట్స్‌ను రూ. 23 వేల కోట్లకు పైగానే వయాకామ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ సొంతం చేసుకుంది. ఈ హక్కులన్నీ కూడా ఆ సంస్థకు మాత్రమే ఉన్నాయి. కానీ, ఆ నిబంధనలను అతిక్రమిస్తూ ఫెయిర్‌ప్లే బెట్టింగ్ యాప్ తమ ఛానెల్లో ఐపీఎల్ మ్యాచ్‌లను లైవ్ స్ట్రీమింగ్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో తమకు భారీగా నష్టం వాటిల్లిందని మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులకు 'వయాకామ్' వారు ఫిర్యాదుచేశారు. దీంతో ఆ యాప్‌ను ప్రమోట్ చేస్తున్న సినిమా ప్రముఖులకు కూడా నోటీసులు ఇచ్చారు.
ఈ పాపని గుర్తుపట్టారా? లేటెస్ట్ సెన్సేషన్.. రూ.100 కోట్ల మూవీ హీరోయిన్
హీరోయిన్ కావాలంటే గ్లామర్ చూపించాలి. డ్యాన్స్ చేయాలి. అందంగా ఉండాలని చాలామంది అనుకుంటారు. కానీ వాటితో అవసరం లేకుండా కొందరు స్టార్స్ అవుతుంటారు. ఈ పాప కూడా అదే కేటగిరీలోకి వస్తుంది. ఎందుకంటే సహాయ నటిగా కెరీర్ ప్రారంభించి.. ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది. ఈ మధ్య ఓ మూవీతో హిట్ కొట్టి కుర్రాళ్ల క్రష్ అయిపోయింది. మరి ఇంతలా చెప్పాం కదా.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?పైన ఫొటోలో కనిపిస్తున్న పాప పేరు మమిత బైజు. అవును మీరు గెస్ చేసింది కరెక్టే. రీసెంట్గా 'ప్రేమలు' సినిమాలో హీరోయిన్ ఈమెనే. ఇది మమిత చిన్నప్పటి ఫొటో. ఇందులో నాన్నతో కలిసి అమాయకంగా చూస్తోంది కదా! చిన్నప్పటి నుంచి అదే క్యూట్‌నెస్ మెంటైన్ చేస్తూ వచ్చింది. సేమ్ ఇలాంటి ఫొటోనే ఇప్పుడు కూడా ఒకటి తీసుకుంది. దిగువన ఉన్న ఫొటో అదే.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవేంటంటే?)కేరళలోని కిడంగూర్ అనే ఊరిలో పుట్టి పెరిగిన మమిత.. ప్రస్తుతం సైకాలజీ డిగ్రీ చదువుతోంది. ఓవైపు చదువుతూ మరోవైపు సినిమాల్లో నటించేస్తోంది. 2017లో 'సర్వోపరి పాలక్కరన్' అనే మలయాళ మూవీతో నటిగా కెరీర్ మొదలుపెట్టింది. అనంతరం పలు చిత్రాలు చేసింది. కానీ 'కోకో' అనే స్పోర్ట్స్ డ్రామాతో ఈమెకు గుర్తింపు దక్కింది. 'సూపర్ శరణ్య', 'ప్రణయ విలాసం' చిత్రాలతో హీరోయిన్ అయిపోయింది. 'ప్రేమలు'తో సోలో హీరోయిన్గా సూపర్ హిట్ కొట్టింది. ఈ మూవీ ఓవరాల్‌గా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం విశేషం.మమిత బైజు వ్యక్తిగత విషయానికొస్తే.. తండ్రి డాక్టర్, తల్లి హౌస్ వైఫ్, ఓ తమ్ముడు కూడా ఉన్నాడు. ప్రస్తుతం ఈమె వయసు 22 ఏళ్లే. కాబట్టి ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది. అలానే 'ప్రేమలు' హిట్ వల్ల విజయ్ దేవరకొండ కొత్త మూవీలోనూ హీరోయిన్ ఛాన్స్ వచ్చిందని అన్నారు. కానీ అందులో నిజం లేదని తెలిసిపోయింది. (ఇదీ చదవండి: క్యూటెస్ట్ వీడియో.. అక్కతో మహేశ్ బాబు ఫన్ మూమెంట్స్) View this post on Instagram A post shared by Mamitha Baiju (@mamitha_baiju)
గుడిలో ప్రముఖ నటికి చేదు అనుభవం.. పోస్ట్ వైరల్
క్లాసికల్ డ్యాన్సర్, ప్రముఖ నటి కపిల వేణుకు చేదు అనుభవం ఎదురైంది. ఓ గుడిలో తన ఫ్రెండ్ డ్యాన్స్ ఫెర్ఫార్మెన్స్ చూడటానికి వెళ్లగా.. ఊహించని అనుభవం తనకు ఎదురైందని చెప్పుకొచ్చింది. ఈ మేకరు ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. అసలేం జరిగిందో చెబుతూనే తనే ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిందని తనని తాను సముదాయించుకుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవేంటంటే?)'నా స్నేహితురాలి డ్యాన్స్ ఫెర్ఫార్మెన్స్ చూడటం కోసం లోకల్‌గా ఉండే ఓ గుడికి ఒంటరిగా వెళ్లాను. అక్కడ ఆల్రెడీ ఉత్సవం జరుగుతోంది. దారి తెలియక అందరూ బయటకు వచ్చే దారి నుంచి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాను. అయితే అక్కడే ఉన్న ఓ వాలంటీర్.. నన్ను టచ్ చేసి ఆపాడు. చాలా రూడ్‌గా మాట్లాడాడు. ఏమైనా ఉంటే చెప్పొచ్చు కదా ఇలా చేయడం ఏంటని కాస్త గట్టిగానే అడిగాను. ఇద్దరు మధ్య కాస్త వాదన జరిగింది. ఈ టైంలో మరో ఆరుగురు వాలంటీర్లు మేమున్న చోటుకు వచ్చారు. వాళ్లందరూ కూడా నాదే తప్పన్నట్లు చెప్పారు. సీన్ చేయకుండా, వెంటనే వెళ్లిపోవాలని కామెంట్ చేశారు''దీంతో ఏడుస్తూ పోలీసుల దగ్గర వెళ్లాను. ఆ తర్వాత కమిటీ మెంబర్లలో ఒకాయన వచ్చి వాలంటీర్లతో మాట్లాడి, నా తండ్రి పేరు తెలుసుకుని నన్ను లోపలికి పంపించేశాడు. ఇంకేదో జరుగుతుందనుకుంటే నాన్న పేరు తెలుసుకుని లోపలికి పంపేయడం నాకు నిజంగా నచ్చలేదు. అయినా గుడికి ఒంటరిగా వెళ్లాలనుకోవడం నాది తప్పు. జనాలు ఎక్కువగా వచ్చారు. వాళ్లని కంట్రోల్ చేయడం వాలంటీర్లకు కష్టమే. అయినా సరే కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సింది' అని వేణు కపిల ఇన్ స్టాలో రాసుకొచ్చారు.(ఇదీ చదవండి: ముద్దు సీన్ అంత ఈజీ కాదు.. మైండ్‌లో ఉండేది అదొక్కటే: నటి దివ్య) View this post on Instagram A post shared by Kapila Venu (@kapilavenu)
40 ఏళ్లు మాత్రమే బతుకుతాను.. డాక్టర్స్ మాటలతో డిప్రెషన్: గీతూ రాయల్
బిగ్‌బాస్ షో ద్వారా గీతూ రాయల్ చాలా పాపులర్ అయింది. సీజన్ 6లో ఆడుగుపెట్టిన గీతూ ఊహించని విధంగా ఎలిమినేట్ అయింది. వాస్తవంగా ఆమె టిక్‌టాక్ వీడియోలతో వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత తనదైన స్టైల్లో పలు కొటేషన్లు చెబుతూ యూత్‌ను ఆకట్టుకుంది. ఆపై బిగ్ బాస్ సీజన్లకు రివ్యూలు చెప్పే స్థాయి నుంచి ఏడో సీజన్లో బిగ్‌బాస్ బజ్కు వ్యాఖ్యాతగా వ్యవహరించే రేంజ్‌కు చేరుకుని భారీగా ఫ్యాన్స్‌ను సంపాధించుకుంది.తాజాగా గీతూ ఒక వీడియోను షేర్ చేసింది.. సుమారుగా 5 నెలల నుంచి తను ఓ సమస్యతో బాధపడుతున్నట్లు అందుకు సంబంధించి చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో తను పడుతున్న అనారోగ్యానికి కారణాలు చెప్పింది. నేను గత ఐదు నెలలుగా బ్యాక్టిరియల్ ఇన్ఫెక్షన్తో బాధ పడుతున్నాను. 'దీనికి కారణం నేను బ్యాంకాక్ వెళ్లిన సమయంలో అనేక రకాల బొద్దింకలు, పురుగులు వంటి ఆహారపదార్థాలు తిన్నాను. అందువల్లే నేనే అనారోగ్యానికి గురైయాను అనుకుంటున్నాను. ఈ క్రమంలో మరో సందేహం కూడా ఉంది. ఒకసారి విజయవాడకు వెళ్లాను.. అక్కడ అమ్మవారి గుడి దగ్గరకు వెళ్లి కూడా దర్శించుకోకుండా వచ్చేశాను. ఇదీ కూడా కారణం కావచ్చని అనుకుంటున్నాను. ఈ రెండు సంఘటనల తర్వాతే నేను అనారోగ్యానికి గురికావడం జరిగింది. గత ఐదు నెలలుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాను. దీంతో చాలా డిప్రెషన్‌కు గురి కావడం జరిగింది.మొదటగా నాకు ఒక గాయం అయింది. మందులు వాడుతున్నా కూడా అది తగ్గలేదు. ఫైనల్‌గా ఒక పెద్ద ఆసుపత్రికి వెళ్తే ఒక పరీక్ష ద్వారా అసలు విషయం తెలిసింది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చిందని వైద్యులు చెప్పారు. దీనికి రెండేళ్ల పాటు ట్రీట్మెంట్ తీసుకోవాలని వైద్యులు చెప్పారు. ప్రతివారం ఒక ఇంజెక్షన్ కూడా తీసుకోవాలి. డాక్టర్లు చెప్పిన మాటలతో బాగా డిప్రెషన్‌కు వెళ్లిపోయాను. ప్రస్తుతం అయితే కొంతమేరకు బాగానే ఉన్నాను.' అంటూ గీతూ చెప్పింది.అలాంటి పొరపాటు చేస్తే.. 40 ఏళ్లు మాత్రమే బతుకుతానుఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకిన వారు సరైన ఫుడ్,నిద్ర తప్పక పాటించాలని వైద్యులు సూచించినట్లు గీతూ రాయల్ చెప్పింది. పూర్తిగా డాక్టర్స్ చెప్పిన ప్రకారం లైఫ్ స్టైల్ మార్చుకోవాల్సి ఉందని ఆమె తెలిపింది.. వైద్యుల సూచనలు పాటించకుంటే మరింత అనారోగ్యానికి గురికావడం జరుగుతుందట. ఈ క్రమంలో 40 ఏళ్లకు మించి బతకడం కష్టమని డాక్టర్స్ చెప్పినట్లు గీతూ పేర్కొంది. ఫైనల్‌గా తన అనారోగ్య పరిస్థితికి గల కారణాల గురించి ఒక వీడియో ద్వారా పూర్తి వివరాలు పంచుకుంది.
ఫొటోలు
బిజినెస్
హమ్మయ్య బంగారం దిగొచ్చింది! తులం ఎంతంటే..
దేశవ్యాప్తంగా బంగారం ధరలు దిగొచ్చాయి. కొనుగోలుదారులకు ఊరట కలిగించాయి. పసిడి ధరలు ఈరోజు (ఏప్రిల్ 29) మోస్తరుగా తగ్గాయి. నిన్నటి రోజున స్థిరంగా బంగారం ధరలు ఈరోజు తగ్గి ఉపశమనం కలిగించాయి.రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖపట్నంలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 తగ్గి రూ.66,550 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాముల ధర రూ.330 తగ్గి రూ. 72,600 లకు తగ్గింది.ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 తగ్గి రూ.66,700 లకు, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.330 తగ్గి రూ.72,750 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.300 క్షీణించి రూ.66,550 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.330 తగ్గి రూ.72,600 వద్దకు దిగొచ్చింది.అలాగే చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 తగ్గి రూ.67,400 లకు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం రూ.320 తగ్గి రూ.73,530గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 క్షీణించి రూ.66,550 వద్దకు, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.330 తగ్గి రూ.72,600 లకు తగ్గింది.ఇక వెండి విషయానికి వస్తే దేశవ్యాప్తంగా ఈరోజు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.87,500గా ఉంది.
ఏఐ టూల్స్ తయారీ సంస్థల్లో పెట్టుబడి పెంచనున్న ప్రముఖ సంస్థ
సాఫ్ట్వేర్ దిగ్గజం అజీమ్ ప్రేమ్‌జీ కుటుంబం వివిధ విభాగాల్లో దాదాపు రూ.83వేలకోట్లు(10 బిలియన్ డాలర్లు) పెట్టుబడి పెట్టింది. తాజాగా ప్రేమ్‌జీఇన్వెస్ట్ ఆఫీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీల్లో పెట్టుబడులను పెంచేందుకు సిద్ధమవుతున్నట్లు సంస్థతో సంబంధం ఉన్న సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు మీడియాకు తెలియజేశారు.ప్రైవేట్ ఈక్విటీ రంగంలో ఏఐ సాధనాలను ఉపయోగించిన మొట్టమొదటి అతిపెద్ద భారతీయ అసెట్ మేనేజ్మెంట్ సంస్థగా ప్రేమ్‌జీఇన్వెస్ట్ నిలిచింది. కంపెనీ ప్రస్తుతం ఏఐ క్వాంట్ మోడల్‌పై పని చేస్తోందని మేనేజింగ్ పార్ట్నర్, చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ టీకే కురియన్ తెలిపారు. అధికరాబడుల కోసం ఏఐటూల్స్‌ను వినియోగిస్తూ ఆయా కంపెనీల్లో తన పెట్టుబడులను సైతం పెంచుకోవాలనుకుంటుందని ఆయన చెప్పారు.బ్లాక్‌రాక్ ఇంక్., సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కార్ప్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడి సంస్థలు మార్కెట్లోని డేటా స్ట్రీమ్‌లను విశ్లేషించడానికి ఏఐపై ఆధారపడుతున్నాయి. దాంతోపాటు ఈ రంగంలో మరింత పెట్టుబడి పెట్టాలని చూస్తున్నాయి. అందులో భాగంగానే ప్రేమ్‌జీఇన్వెస్ట్ మూడేళ్ల క్రితం ఏఐ ఇన్వెస్ట్మెంట్ సాధనాలను అభివృద్ధి చేయడం ప్రారంభించింది. దానికోసం ఏఐ ఇంజినీర్లను నియమించుకుంది. అదే సమయంలో ఏఐ ఇన్వెస్ట్మెంట్ టూల్స్ తయారుచేసే సంస్థలకు మద్దతుగా నిలవడం మొదలుపెట్టినట్లు తెలిసింది.ఇదీ చదవండి: నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..ప్రపంచవ్యాప్తంగా 10,000 కంటే ఎక్కువ కంపెనీల్లో పెట్టుబడి అవకాశాలను గుర్తించడానికి 600 పారామీటర్లను విశ్లేషించేందుకు ఏఐ సహాయం చేస్తోందని కురియన్ అన్నారు. ఈ కసరత్తు వల్ల తోటివారి కంటే ముందంజలో ఉండేందుకు ఇది దోహదం చేస్తుందన్నారు. కోహెసిటీ ఇంక్-డేటా మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ కంపెనీ, లండన్‌లోని ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ కంపెనీ-హోలిస్టిక్ ఏఐ, ఇకిగాయ్, ఫిక్సిస్ వంటి ప్రముఖ కంపెనీలకు ప్రేమ్‌జీఇన్వెస్ట్ సేవలందిస్తోందని తెలిసింది. దేశంలో అధికంగా పోగవుతున్న కోర్టు కేసులను వేగంగా పరిష్కరించడానికి ఉపయోగపడే ఏఐను అభివృద్ధి చేసేందుకు సంస్థ సహకరిస్తుందని కురియన్ అన్నారు.
లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు సోమవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:19 సమయానికి నిఫ్టీ 70 పాయింట్లు లాభపడి 22,497కు చేరింది. సెన్సెక్స్ 298 పాయింట్లు దిగజారి 74,021 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 106.1 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 88.2 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.67 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1.02 శాతం లాభపడింది. నాస్డాక్ 2 శాతం ఎగబాకింది.ఈవారంలో వెలువడే పెద్ద కంపెనీల ఆర్థిక ఫలితాలు ఉండనున్నాయి. దాంతోపాటు బుధవారం వడ్డీరేట్లపై వెల్లడయ్యే అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు మార్కెట్‌కు దిశానిర్దేశం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఎంపిక చేసిన షేర్లు, రంగాల్లో కదలికలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా మే 1న సెలవు కావడంతో, మార్కెట్లు ఈవారం 4 రోజులే పనిచేయనున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
Bank Holidays in May 2024: బ్యాంక్ ఖాతాదారులకు ముఖ్యమైన సమచారం ఇది. మే నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించింది. దేశవ్యాప్తంగా మే నెలలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు వచ్చాయి.దేశవ్యాప్తంగా బ్యాంకులకు మే నెలలో మొత్తం 12 రోజులు సెలవులు ఉండగా వీటిలో రెండో, నాలుగో శనివారాలు, ఆదివారాలతోపాటు పండుగలు, ప్రత్యేక సందర్భాలు కలిసి ఉన్నాయి. ఇవి రాష్ట్రాలను బట్టి మారే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు నిర్వహించే వారు ఏదో ఒక పని కోసం బ్యాంకులకు వెళ్లాల్సి వస్తుంది. ఆన్లైన్ లో ఎన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినా కొన్ని పనులు బ్యాంకులకు వెళ్లి చేయాల్సి ఉంటుంది. అటువంటివారి కోసం బ్యాంకు సెలవుల సమాచారాన్ని ఇక్కడ ఇస్తున్నాం.మే నెలలో బ్యాంకు సెలవులు ఇవే..మే 1: మహారాష్ట్ర దినోత్సవం/ మే డే (కార్మిక దినోత్సవం) మే 5: ఆదివారం.మే 8: రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా పశ్చిమ బెంగాల్లో బ్యాంకుల బంద్మే 10: బసవ జయంతి/ అక్షయ తృతీయమే 11: రెండో శనివారంమే 12: ఆదివారం.మే 16: సిక్కిం రాష్ట్ర దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్రంలో బ్యాంకులకు సెలవుమే 19: ఆదివారం.మే 20: లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా బేలాపూర్, ముంబైలో బ్యాంకుల మూతమే 23: బుద్ధ పూర్ణిమ మే 25: నాలుగో శనివారం. మే 26: ఆదివారం.
వీడియోలు
పోయేకాలం వచ్చినప్పుడు విలన్లకి హీరో ఎప్పుడూ బచ్చానే..!
ఇదొక్కటి చాలు.. చంద్రబాబు మోసాలు చెప్పడానికి
జనసేన రెబల్స్ కు గాజుగ్లాసు గుర్తు పవన్ కళ్యాణ్ కు భారీ షాక్..!
అయ్యా చంద్రబాబు నువ్వు పుడింగి అయితే..బాబు ను ఏకిపారేసిన సీఎం జగన్
మరో రెండు వారాల్లో కురుక్షేత్రం..!
యాదవుల కోసం ప్రత్యేక జీవో..!
పొన్నూరు చేరుకున్న సీఎం జగన్
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ పొన్నూరు (గుంటూరు జిల్లా)
ఒకరి గురించి ఒకరు భజన ఈ భజన బ్యాచ్ మనకు అవసరమా
మెగా ఫ్యామిలీపై రామానుజం సంచలన విషయాలు..!