Top Stories
ప్రధాన వార్తలు
నేడు సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం ఇలా..
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. శనివారం ఉదయం 10 గంటలకు హిందూపురంలోని అంబేడ్కర్ సెంటర్లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు చిత్తూరు లోక్‌సభ స్థానం పరిధిలోని పలమనేరులోని బస్టాండ్ సెంటర్లో జరిగే సభకు ముఖ్యమంత్రి హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు లోక్‌సభ స్థానం పరిధిలోని నెల్లూరు సిటీలో ఉన్న గాంధీ విగ్రహం సెంటర్లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.
YS Jagan Interview: క్లీన్ స్వీప్ ఖాయం
సాక్షి, అమరావతి : ‘రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేలా సుపరిపాలన అందించాం. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశాం. అర్హతే ప్రామాణికంగా, వివక్ష చూపకుండా.. అవినీతికి తావులేకుండా.. అత్యంత పారదర్శకంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాం. దేశ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో డీబీటీ రూపంలో పేదల ఖాతాల్లో రూ.2.70 లక్షల కోట్లు జమ చేశాం. విప్లవాత్మక సంస్కరణలతో విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో ప్రగతి సాధించాం. గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలు అందిస్తున్నాం. ప్రభుత్వం వల్ల మంచి జరిగి ఉంటేనే ఓటు వేసి ఆశీర్వదించాలని ప్రజలను కోరుతున్నాం’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. ప్రజల్లో తమ ప్రభుత్వంపై ఉన్న విశ్వసనీయత, నమ్మకమే.. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేయడానికి దారితీస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో, దేశంలో రాజకీయ పరిణామాలపై సీఎం వైఎస్ జగన్‌ను టైమ్స్ నౌ గ్రూప్ ఎడిటర్–ఇన్–చీఫ్ నవికా కుమార్ ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ వివరాలు ఇలా ఉన్నాయి.నవికా: రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఒకవైపు టీడీపీ, బీజేపీ, జనసేన.. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి మీ చెల్లెళ్లు మీ మీద పోరాటానికి వస్తున్నారు. ఈ క్రమంలో ఎవరితో పోరాడేందుకు మీరు సిద్ధంగా ఉన్నారు? సీఎం జగన్: మా ప్రభుత్వంపై పోరాటానికి వస్తున్న ప్రతి ఒక్కరితో పోరాటానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇక్కడ ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ రిమోట్ కంట్రోల్ కూడా చంద్రబాబు చేతుల్లోనే ఉంది. రేవంత్‌రెడ్డి ద్వారా చంద్రబాబు నా చెల్లెలు షర్మిలను ప్రభావితం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో నా చెల్లిని అడ్డుపెట్టుకుని వైఎస్సార్సీపీ ఓటర్లలో చీలిక తెచ్చి లబ్ధి పొందాలని వాళ్లు భావిస్తు న్నారు. మా ప్రభుత్వంపై ప్రజల్లో ఎక్కడా వ్యతి రేకత లేదు. ప్రజాస్వామ్యంలో 50 శాతానికి పైగా ఓట్లతో గెలిచాం. చెప్పినవి చేసి చూపించాం. అందువల్ల ప్రజలు మాతోనే ఉన్నారు. దేవుడి దయతో మేం స్వీప్ చేయబోతున్నాం.నవికా: కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబుతో చేతులు కలిపారని మీరు అంటున్నారు. ఈ విషయం బీజేపీకి తెలియదంటారా?సీఎం జగన్: ఈ ప్రశ్న మీరు ఆ పార్టీ వాళ్లను అడగాలి.నవికా: మీరు పరాజయం పాలవ్వబోతున్నారనే బీజేపీ మీతో పొత్తు పెట్టుకోలేదా? టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుందని మీరేమైన నిరాశకు గురయ్యారా?సీఎం జగన్: పొత్తు పెట్టుకుంటానని నేను ఏ పార్టీని కోరలేదు. గొప్ప పరిపాలనను మేం అందించాం. ఈ క్రమంలో మేం పొత్తులు పెట్టుకుని ఎన్నికలకు పోవాల్సిన అవసరం లేదు. మా రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ ఈ రెండు జాతీయ పార్టీలు అప్రధానం. వాళ్ల పార్టీ, వాళ్లకు ఇష్టం వచ్చినట్టు పొత్తులు పెట్టుకున్నారు. మా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే కొన్ని సందర్భాల్లో ఎన్డీఏ ప్రభుత్వానికి కొన్ని బిల్లుల విషయంలో మద్దతు ఇచ్చాం. ప్రజల ప్రయోజనాలకు ఇబ్బంది అనిపించినప్పుడు ఆ బిల్లులకు మేం మద్దతు ఇవ్వలేదు. ఉదాహరణకు మైనార్టీల హక్కులకు విఘాతం కలిగించే బిల్లులకు మేం మద్దతు ఇవ్వలేదు. సీఏఏకు వ్యతిరేకంగా మేం అసెంబ్లీలో తీర్మానం కూడా చేశాం.నవికా: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కోసమే మీరు ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారనే వాదన ఉంది. ఈ క్రమంలో హోదా అంశంపై ఏదైనా భరోసా లభించిందా?సీఎం జగన్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఒప్పుకుంది. కానీ.. అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కల్పించే అంశాన్ని విభజన చట్టంలో చేర్చకుండా అన్యాయం చేసింది. పార్లమెంట్లో కేంద్రం చేసిన ప్రకటన మేరకు ప్రత్యేక హోదా రాష్ట్రానికి వస్తుందని మేం నమ్మాం. కానీ.. చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించి, ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించే విషయంలో బీజేపీ, కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలు చెలగాటం ఆడాయి. ప్రత్యేక హోదాను సాధించడమే ప్రధాన అజెండాగా మేం అడుగులు ముందుకు వేశాం, వేస్తున్నాం. మా మీద ఆధారపడిన ప్రభుత్వం కేంద్రంలో వస్తే కచ్చితంగా ప్రత్యేక హోదాను సాధిస్తాం.నవికా: పూర్తి మెజార్టీతో కాకుండా కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తేనే హోదా వస్తుందని భావిస్తున్నారా?సీఎం జగన్: ఇది నిజం. అందరికీ ఇది తెలిసిన అంశమే.నవికా: మెజార్టీ లేక సంకీర్ణం.. కేంద్రంలో ఏ ప్రభుత్వం రాబోతుందని మీరు భావిస్తున్నారు? సీఎం జగన్: జాతీయ స్థాయిలో రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయో అంచనా వేయడం సాధ్యం కాకపోవచ్చు. జాతీయ మీడియా చేసిన సర్వేలు కొన్ని సార్లు నిజం కావచ్చు. కాపోవచ్చు. నవికా: రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని మీరు అనుకుంటున్నారా?సీఎం జగన్: రాహుల్ గాంధీ, నరేంద్ర మోదీ ఇద్దరిని నేను దగ్గరగా చూశాను. వ్యక్తిగతంగా రాహుల్ గాంధీ, మోదీతో పోల్చి చూస్తే.. మైనార్టీలకు వ్యతిరేకం అని తప్పితే మిగతా అంశాల్లో మోదీనే మంచివారు. కాంగ్రెస్ పార్టీకి ఎంతో విధేయుడిగా ఉన్న నా తండ్రి మరణించాక నా కుటుంబాన్ని ఏ విధంగా వేధింపులకు గురి చేశారో అందరికీ తెలుసు. ఆ వేధింపులకు నేనే సాక్షి. ఈ క్రమంలో ఏ విధంగా రాహుల్ గాంధీ మంచివాడని అనాలి?నవికా: రాజకీయాల్లో ఉన్నత ఆశయాలు ఉన్నాయని చెబుతున్నారు మీరు.. అందుకే మీ చెల్లెళ్లు్ల మీ నుంచి దూరమయ్యారా? మీరు పార్టీలోకి రానివ్వకపోవడంతోనే వేరే పార్టీల వైపు వెళ్లారా?సీఎం జగన్: వాళ్లను తీసుకొస్తే అది కుటుంబ రాజకీయంగా మారిపోతుంది. ఒకే కుటుంబలోని ఒక జనరేషన్ నుంచి ఎక్కువ మంది రాజకీయాల్లో ఉంటే అది పార్టీ అవ్వదు. మరేదో అవుతుంది. నాకు స్పష్టమైన విజన్ ఉంది. పార్టీ వారసత్వానికి వచ్చిన ఇబ్బంది లేదు. ప్రజలకు మంచి చేసేందుకు నాకు సుదీర్ఘ భవిష్యత్తు ఉంది. వారసత్వం అనేది వేరే ప్రస్తావన. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు ఎలా ఉండాలంటే.. ఎవరైనా వస్తే సంతోషంగా మాట్లాడుకోగలగాలి. అందరూ కలిసి ఒకేచోట కూర్చుని సరదాగా ఉండాలి. అంతేగానీ ప్రతి చోట రాజకీయం అంటే ఎలా? ఒక కుటుంబం నడిపే పార్టీ ఎప్పటికీ బతకదు.నవికా: మీ చెల్లెలితో మీ అనుబంధం ఎలా ఉండేది?సీఎం జగన్: దురదృష్టవశాత్తు ఆమె చంద్రబాబుతో కలిసింది. ఆయన చెప్పినట్టే రాజకీయాలు చేస్తోంది. మా కుటుంబానికి తీవ్ర అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీలో చేరి.. ఆ పార్టీకి రాష్ట్రంలో నాయకత్వం వహిస్తోంది. (నవికా: ఆమె మీ కుటుంబమే కదా..) మా కుటుంబ సభ్యురాలు అయి ఉండి కూడా.. బయటకు వెళ్లడం, రాజకీయ శత్రువులతో చేతులు కలపడం నాకు బాధ కలిగిస్తోంది.నవికా: మీ ఇద్దరి విషయంలో.. రెండు వైపులా మీ తల్లి ఎలా మేనేజ్ చేస్తున్నారు?సీఎం జగన్: ఈ రోజు రాజకీయాల్లో ఎవరు పోటీ చేస్తున్నారు.. ఎవరు చేయట్లేదు అనేది కాదు. రాష్ట్రంలో మా ప్రభుత్వం చేసిన మంచిని మేము చెబుతున్నాం. ఇక్కడ జగన్ ఒక వైపు.. మిగిలిన వారందరూ మరో వైపు ఉన్నారు. ప్రజలు ఓటు ద్వారా తమ మద్దతు తెలుపుతారు. అలాంటి రాజకీయమే నడుస్తోంది. కుటుంబ రాజకీయాలు ఇక్కడ పని చేయవు.నవికా: చంద్రబాబు చెప్పినట్టే.. ఆయనకు ఏమి అవసరమో అదే.. మీ చెల్లెలు చేస్తున్నారని ఎలా చెబుతున్నారు? కాంగ్రెస్ పార్టీలోని సభ్యులు ఆమెకు ఆశలు కల్పించి ఉండొచ్చుకదా?సీఎం జగన్: ఇక్కడ వాస్తవం ఏమంటే.. ఏమి జరుగుతుందో నాకు స్పష్టంగా తెలుసు. (నవికా: మీరేమైనా ఫోన్ ట్యాపింగ్ చేశారా? తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేశారని చెబుతున్నట్టు) ఎవరైనా ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేయాలి. ఆమె నా సొంత చెల్లెలు. అందుకే ఏం జరిగిందో ఏం జరుగుతోందో నాకు తెలుసు. ఎవరు ఆడిస్తున్నారో.. ఎవరు నీచ రాజకీయాలు చేస్తున్నారో నాకు తెలుసు.నవికా: నారీ శక్తిని విశ్వసిస్తున్న దేశంలో.. తండ్రి వారసత్వం వాటా కొడుకులకు మాత్రమే కాదు.. కూతుళ్లకు వర్తిస్తుందంటే మీరు ఏమంటారు?సీఎం జగన్: దీనినే సరిగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ వారసత్వం కోసం పోరాటం జరగట్లేదు. మా నాన్న 2009లో అందరినీ విడిచి వెళ్లిపోయారు. మనం 2024లో మాట్లాడుకుంటున్నాం. దాదాపు 15 ఏళ్లు అవుతుంది నాన్న వెళ్లిపోయి. ఇక్కడ ముఖ్యమంత్రిగా నా ఐదేళ్ల పాలనను ప్రజలు చూశారు. నా పాలనను విశ్వసిస్తే వారే ఓటు రూపంలో నాకు మద్దతుగా నిలుస్తారు. లేకుంటే వేరే వైపు చూస్తారు. ఆ పోరాటమే నడుస్తోంది గానీ, వారసత్వం ఎక్కడి నుంచి వస్తుంది?నవికా: ఏపీలో కాంగ్రెస్, ఎన్డీఏ, జగన్ ముక్కోణపు పోటీలో ఉన్నారు? ఏమైనా మీ ఓటు బ్యాంకుపై ప్రభావం చూపుతారా?సీఎం జగన్: ఈ రోజు నేను చెప్పే మాటలను (మార్క్) గుర్తు పెట్టుకోండి. ఎన్నికలు ముగిసిన తర్వాత మళ్లీ రండి. కాంగ్రెస్‌కు నోటా కంటే ఒక్క ఓటు కూడా ఎక్కువ రాదు. వైఎస్సార్సీపీ, టీడీపీ నేతృత్వంలోని కూటమి మధ్యే పోటీ.నవికా: 2019 ఎన్నికల్లో మీరు రికార్డు విజయం సాధించారు. 175 శాసనసభ స్థానాల్లో 151 స్థానాలు, 25లో 22 పార్లమెంట్ స్థానాలు గెలుచుకున్నారు. ఇప్పుడు ఎన్ని స్థానాలను మీరు గెలవబోతున్నారు?సీఎం జగన్: ఎన్నికల్లో 50 శాతం ఓట్లు సాధించడం అనేది ముఖ్యమైనది. గత ఎన్నికల్లో మేము 49.96 శాతం ఓట్లు సాధించాం. ఈ సారి దేవుడి దయతో 2019లో వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ తెచ్చుకుంటామని నాకు బలమైన నమ్మకం ఉంది. మీరు మంచి విశ్లేషణ చేస్తారు.. మీరే ఆ రోజు టీవీలో నంబర్లు చూస్తారు.నవికా: దేశంలో ప్రత్యర్థి పార్టీలు ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నాయి? దీనిపై మీరు ఏమంటారు?సీఎం జగన్: నేను దేశంలో ప్రజాస్వామ్యం బతికి ఉందని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. అలాంటప్పుడు వేరే విషయాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు.నవికా: ఏపీలో బీజేపీ పొత్తును మీరు టార్గెట్ చేశారు. 2014లో కలిసి పోటీ చేసిన వాళ్లు.. తిరిగి 2024లో వస్తున్నారు? మీరు దీనిని అవకాశవాద పొత్తుగా ఎందుకు చూస్తున్నారు?సీఎం జగన్: ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి పార్టీ మేనిఫెస్టో ప్రకటిస్తుంది. అదే పార్టీ విజన్‌ను ప్రజల దగ్గరకు తీసుకెళ్లే మార్గదర్శకంగా ఉంటుంది. పాలనా పని తీరును కూడా మేనిఫెస్టోలో చెప్పిన అంశాలతో నేరవేర్చామా లేదా అని పోల్చి చూడాలి. ఇదే ఎన్నికల్లో ప్రజల దగ్గరకు వెళ్లి ఓట్లను అడిగేందుకు మన అర్హతను నిర్ణయిస్తుంది. ఇప్పుడు కూటమిగా వస్తున్న వాళ్లే.. గతంలో చంద్రబాబు సంతకంతో రకరకాల హామీలతో కరపత్రం ముద్రించి 2014లో ప్రతి ఇంటికీ పంపించారు. కూటమి నాయకుల ఫొటోలతో ముద్రించారు. ఇదే విషయాన్ని నా ప్రతి బహిరంగ సభలోనూ ప్రజలకు చెబుతున్నాను. వాళ్ల మేనిఫెస్టోను చూపించి.. అందులోని వాగ్ద్ధానాలను చదివి.. ఇవన్నీ 2014 ఎన్నికల తర్వాత అమలు చేశారా? లేదా? అంటూ ప్రజలనే అడుగుతున్నాను. అందులో నెరవేర్చిన ఒక్క హామీనైనా చెప్పమంటున్నాను. చెప్పడానికి అందులో ఒక్కటంటే ఒక్కటీ లేదని ప్రజలు స్పష్టం చేస్తున్నారు. అప్పట్లో ఆ కూటమి ప్రజలను మోసం చేసింది. అందుకే 2019 ఎన్నికల్లో చంద్రబాబు అధికారం నుంచి తుడిచి పెట్టుకుపోయాడు. 151 ఎమ్మెల్యే, 22 ఎంపీ స్థానాల్లో మేము గెలిచాం. మళ్లీ అదే కూటమి.. అదే చంద్రబాబు.. కొత్త మేనిఫెస్టోతో వచ్చారు.నవికా: ఐదేళ్ల మీ పాలనను ప్రజలు చూశారు. చంద్రబాబు కంటే మీరు మెరుగైన పాలన అందించారని ప్రజలు నమ్ముతారని అనుకుంటున్నారా?సీఎం జగన్: చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదు. కానీ మేం 2019లో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను త్రికరణశుద్ధితో అమలు చేశాం. మా మేనిఫెస్టోను ప్రతి సంవత్సరం ప్రతి ఇంటికి తీసుకెళ్లి ప్రజలకే ఇచ్చి.. అందులో వారికి ప్రభుత్వం నుంచి ఏమేం అందాయో టిక్ చేయమని చెప్పాం. మొదటి ఏడాదిలోనే దాదాపు 86, 87 శాతం హామీలు అమలు చేస్తే.. ఇప్పటికి 99 శాతం హామీలు అమలు చేశారని ప్రజలే చెబుతున్నారు. అది మా ప్రభుత్వం, మా పార్టీపై ప్రజలకున్న విశ్వసనీయత. అదే మా నమ్మకం.నవికా: చంద్రబాబు జైలుకు వెళ్లి, బెయిల్‌పై బయటకు వచ్చాక సభలు నిర్వహించారు. అదే సమయంలో మీరూ సిద్ధం సభలు పెట్టారు. చంద్రబాబుకు ప్రజల నుంచి సానుభూతి రాకూడదనే మీరు సిద్ధం సభలు నిర్వహించారని ప్రతిపక్షాలు అంటే మీరేమంటారు? సీఎం జగన్: (నవ్వుతూ..) నేను సిద్ధం సభలు పెట్టినట్టే వారూ రాజకీయ సభలు పెట్టారు. కానీ జగన్ సిద్ధం సభలకు ప్రజలు భారీగా తరలి వచ్చారు. వారి సభలకు ఎవరూ రాలేదు. దానికి నేనేం చేయగలను.. ఈ ప్రశ్న వారినే అడగాలి. జగన్ అంత జనాన్ని ఎలా ఆకట్టుకుంటున్నాడు.. మీరెందుకు ప్రజలను ఆకట్టుకోలేకపోయారని వారినే అడగండి.నవికా: మీ చిన్నాన్న వివేకానందరెడ్డి హత్య మీ కుటుంబంలో వివాదాస్పదంగా మారింది. ఆ హత్య కేసులో ఆయన భార్య, మీ చెల్లెళ్లు కూడా గత ఐదేళ్లుగా కేసు దర్యాప్తులో న్యాయం జరగలేదంటున్నారు. సీఎం జగన్: ఈ అంశం మా కజిన్స్ మధ్య ఉంది. మా కజిన్ సిస్టర్ ప్రస్తుతం ఎంపీగా ఉన్న మరో కజిన్ బ్రదర్‌పై ఆరోపణలు చేస్తోంది. ఆరోపణలు కజిన్‌పై చేస్తున్నారు. దురదృష్టం ఏమిటంటే ఘటన జరిగినప్పుడు ఇవేమీ లేవు. కానీ సడెన్‌గా ఈ మార్పు ఎందుకు వచ్చింది? దీనికంతటికీ కారణం చంద్రబాబే.నవికా: ప్రతి సమస్యకు చంద్రబాబుతో సంబంధం ఉంటుందా?సీఎం జగన్: ఇక్కడ జరుగుతున్నది జగన్, చంద్రబాబు మధ్య పోరాటం. జగన్‌ను ఒంటిరిగా ఎదుర్కోలేక చంద్రబాబు నా కుటుంబాన్నే నాకు వ్యతిరేకంగా మార్చాలని చూస్తున్నారు. జగన్ ఎప్పుడూ ఒంటరి కాదు.. నా వెనుక ప్రజలున్నారు. ఇలాంటప్పుడు నాపై వ్యతిరేకత ఎందుకొస్తుంది! ప్రజలకు అవసరమైనవన్నీ చేస్తున్నాను. ఇలాంటప్పుడు ఇతర పార్టీల అవసరం ఏముంది? నవికా: రాజకీయ ప్రతీకారంతో అనుకోండి, లేదా మరేమైనాగానీ మీపై ఉన్న సీబీఐ కేసుల గురించి ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి.. అవి మీ ప్రత్యర్థులకు ఆయుధాలుగా మారతాయనుకుంటున్నారా?సీఎం జగన్: నాపై ఉన్న కేసులు నా ప్రభుత్వంలో, నా పాలనలో నమోదైనవి కాదు. మా నాన్న చనిపోయినప్పుడు.. నేను రాజకీయంగా వారికి ఎక్కడ అడ్డు తగులుతానో అని భయపడి చంద్రబాబు, కాంగ్రెస్ కలిసి కుట్రతో పెట్టిన కేసులు. అత్యంత దురదృష్టకరమైన విషయం ఏంటంటే.. నాపై అక్రమ కేసులు బనాయించడానికి చేసిన ఆరోపణలు ఏ కాలానికి సంబంధించినవి? అప్పటికి నేను ఎమ్మెల్యేను కాను, ఎంపీనీ కాను. పైగా అప్పట్లో నేను హైదరాబాద్‌లో కూడా లేను. ఆ సమయంలో నేను ఏ ఒక్క మంత్రితోగానీ ఏ ఒక్క ఐఏఎస్ ఆఫీసర్‌తోగానీ ఏ ఒక్క ఐపీఎస్ అధికారితో గానీ ఎప్పుడూ మాట్లాడలేదు. ఇది వాస్తవం. నవికా: కాంగ్రెస్ నుంచి బయటకు రావడంతోనే ఇబ్బందులు మొదలయ్యాయా? సీఎం జగన్: అవును, నిజానికి నా జీవితంలో 16 నెలలు ఎవరు చెల్లిస్తారు? నన్ను జైల్లో పెట్టారు, కారణం ఏంటి?నవికా: కేంద్రంలోని బీజేపీ తన ప్రతిపక్షాలను దెబ్బ తీసేందుకు కేంద్ర ఏజెన్సీలను పావుగా వాడుకుంటోందని కాంగ్రెస్ చెబుతోంది, మీరేం చెబుతారు?సీఎం జగన్: అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఏం చేసింది? నాపై నమోదు చేసిన కేసులే అందుకు ఉదాహరణ. 2004 నుంచి 2009 వరకు నా తండ్రి ముఖ్యమంత్రి. ఇప్పుడు 2024 వచ్చింది. కాంగ్రెస్ ఏం చేసింది.. అధికారంలో ఉన్నవారు తమ అధికారాన్ని చెడు కోసం వాడుకుంటున్నారు. ఇలా చేయడం దురదృష్టకరం. ఒక వేలు ఒకరి వైపు చూపిస్తే.. నాలుగు వేళ్లు మనవైపే చూపిస్తాయి, అది అర్థం చేసుకోవడం లేదు.నవికా: ఎన్డీఏ, ఇండియా కూటమిలో మీరు భాగస్వామ్యం కాలేదు ఎందుకు? రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ వంటి ప్రతిపక్ష నేతలు ఉండటం వల్ల ఇండియా కూటమి మీకు అంత అనుకూలం కాదనుకున్నారా?సీఎం జగన్: ఈ రెండు జాతీయ పార్టీలూ ఆంధ్రప్రదేశ్‌లో అప్రధానమైనవి అనేది మనం ముందుగా గుర్తించాలి. ఎవరైనా వాటితో కలిసి ఎందుకు పోటీ చేయాలనేది ప్రాథమిక ప్రశ్న. రాష్ట్ర ప్రయోజనాలు, సమగ్రాభివృద్ధే లక్ష్యంగా అంశాల వారీగా కేంద్రానికి వైఎస్సార్సీపీ మద్దతు ఇస్తుంది. దేనికి మద్దతివ్వాలి.. దేనికి ఇవ్వకూడదనేది మేం ఆలోచించుకుంటాం.నవికా: ఒకవేళ ఎన్ఆర్సీ వస్తే మద్దతిస్తారా?సీఎం జగన్: మద్దతు ఇవ్వం.నవికా: జగన్‌రెడ్డి, వైఎస్సార్సీపీ ఎలాంటి పరిస్థితుల్లోనూ రాజీ పడకుండా తనకంటూ సొంత గుర్తింపుతోనే ముందుకు వెళ్లాలనుకుంటోందా? దానికి మీరు పూర్తిగా కట్టుబడి ఉన్నారా?సీఎం జగన్: కచ్చితంగా. విశ్వసనీయత, నైతిక విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నాం. రాజకీయాలలో విశ్వసనీయత ప్రధానమైనదని నేను గట్టిగా నమ్ముతాను. ప్రజల కోసం ఎవరితోనైనా పోరాటం చేయడానికి సిద్ధం.నవికా: ప్రధాని నరేంద్ర మోదీ గురించి ఏమనుకుంటున్నారు. చాలా సమావేశాల్లో ఆయనతో కలిసి మీరు పాల్గొన్నారు. ఈ మధ్య ఆయన చాలా పొత్తులు పెట్టుకున్నారు. మీరెలా భావిస్తున్నారు?సీఎం జగన్: రాజకీయాల్లో మోదీని, రాహుల్ గాంధీలను చూశాం. అయితే మైనార్టీలకు వ్యతిరేకం వంటి కొన్ని విషయాల్లో మోదీతో మేం విభేదించవచ్చు. కానీ ఆయన మంచి నాయకుడే.నవికా: రాహుల్ గాంధీ గురించి చెప్పాలంటే ఏం చెబుతారు. మీరొక భారతీయ పౌరుడిగా చెప్పండి.సీఎం జగన్: నేను ఇప్పటికే ఈ విషయంపై చెప్పాను. ఒక వేళ రాహుల్ మంచి నాయకుడైతే ప్రజలే ఓట్లేసి గెలిపిస్తారు. కాంగ్రెస్ పార్టీ నాకు చేసిన అన్యాయాన్ని బట్టి రాహుల్‌పై నా అభిప్రాయం నాకుంది. నాకైతే రాహుల్ అంటే వ్యక్తిగతంగా ఇష్టం లేదు.నవికా: మూడు రాజధానుల అంశం గురించి ఏమంటారు?సీఎం జగన్: ఆ నిర్ణయం ఇప్పటికే జరిగిపోయింది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. విశాఖ పరిపాలన రాజధాని, అమరావతి శాసన రాజధాని, కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటాయి. 2024 ఎన్నికల్లో విజయం సాధించి.. సీఎంగా నేను ప్రమాణ స్వీకారం కూడా విశాఖలోనే చేస్తాను.నవికా: ఎన్నికల్లో మీకెన్ని అసెంబ్లీ సీట్లు వస్తాయనుకుంటున్నారు? 151 సంఖ్యను దాటుతామని అనుకుంటున్నారా? బీజేపీకి, టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయని అనుకుంటున్నారు? సీఎం జగన్: మా పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుంది. నన్ను నమ్మండి. నంబర్స్ చూస్తూ ఉండండి.నవికా: ప్రధాన మంత్రి ఎవరవుతారని అనుకుంటున్నారు?సీఎం జగన్: అది ఎన్నికల్లో ప్రజలు నిర్ణయిస్తారు. అందరూ చెబుతున్నది, టీవీల్లో చూస్తున్నదానిని బట్టి మోదీ మళ్లీ అధికారంలోకి వస్తారని అన్పిస్తోంది. ఎవరు అధికారంలోకి వస్తారు.. ఉత్తర్‌ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక ఎన్నికల్లో ఏం జరుగుతుందో చెప్పడానికి నేనేమీ సెఫాలజిస్ట్(విశ్లేషకుడు)ను కాదు. ఒక వేళ ఎవరైనా ఏదైనా చెబితే అది కేవలం ఒక అంచనా మాత్రమే.నవికా: మీరు మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఇంత కంటే గొప్పగా ఏం చేస్తారు? సీఎం జగన్: మేనిఫెస్టోలో చెప్పిన ప్రతిదీ పెద్ద హామీయే. అవన్నీ చేస్తాం.నవికా: మీ సోదరిని మిస్ అవుతున్నారా?సీఎం జగన్: కచ్చితంగా మిస్ అవుతున్నాను(భావోద్వేగంతో). దురదృష్టవశాత్తు ఆమె బయటకు వెళ్లింది. కానీ ప్రేమలు ఎక్కడికిపోతాయి?నవికా: ఆమె విషయంలో అంతా మంచి జరుగుతుందని ఆశిస్తున్నారా?సీఎం జగన్: దురదృష్టవశాత్తు ఆమె ఆ మార్గాన్ని ఎంచుకుంది. ఈ పరిస్థితి మారచ్చు.. మారకపోవచ్చు.నవికా: వారసత్వ రాజకీయాలకు కాలం చెల్లిందని మోదీ అన్నట్టు.. రాజకీయాలు, కుటుంబం మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా?సీఎం జగన్: ఆయన ఏ సందర్భంగా అన్నారో నాకు తెలియదుగానీ మోదీ అన్న మాటలను నేను బలంగా నమ్ముతున్నాను. కుటుంబాన్ని బేలెన్స్‌గా చూసుకోవాలన్నది నా బలమైన నమ్మకం. అయితే కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు వాటిని సమర్థవంతంగా ఎదుర్కోలేకపోతే పార్టీని నడపలేం. అలాంటప్పుడు అప్రమత్తంగా లేకపోతే పార్టీ నష్టపోతుంది. పులివెందులలో నేను నామినేషన్ వేసినప్పుడు ఈ అంశంపై స్పష్టంగా చెప్పాను. కడప నుంచే ఆమె (షర్మిల) ఎంపీగా పోటీ చేస్తోంది. ఇదే స్థానం నుంచి నా కజిన్ ఎంపీగా ఉండి నా పార్టీ తరఫున పోటీలో ఉన్నారు. ముఖ్యమంత్రిగా నేను ఉన్నానంటే అది దేవుడి దయ. ఈ పదవి అణగారిన, వెనుకబడిన వర్గాలు, అగ్రవర్ణ పేదలకు మేలు చేయడానికి లభించిన అవకాశం. నేను డబ్బు సంపాదించుకోవడానికో లేక నా కుటుంబ సభ్యులను కోటీశ్వరులను చేయడానికో కాదు. వారు నా నుంచి అలాంటివి ఆశలు పెట్టుకోకూడదు. ఇదే విషయాన్ని బహిరంగంగానే చెప్పాను.నవికా: ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు మీకు ఎన్నికల్లో పోటీదారు అనుకుంటున్నారా? చంద్రబాబు జైలుకెళ్లి వచ్చిన తర్వాత ప్రజల ఆలోచనలో మార్పు వచ్చిందనుకుంటున్నారా? లేక ఉచిత పథకాలు ఫలితాలిస్తాయని అనుకుంటున్నారా?సీఎం జగన్: ఇవన్నీ కాదు. మా ఐదేళ్ల పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. ప్రజలకు ఇస్తున్నవి ఉచిత పథకాలుగా చూడకూడదు. అవి సామాజిక పెట్టుబడి. పరిపాలన, విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో గొప్ప సంస్కరణలు తెచ్చాం. ప్రభుత్వ స్కూళ్లన్నీ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లుగా మారాయి. స్కూల్స్ అప్‌గ్రేడ్ అయ్యాయి. మూడో తరగతి నుంచే పిల్లలు టోఫెల్ గురించి ఆలోచిస్తున్నారు. ఆరో తరగతి నుంచే డిజిటల్ క్లాస్ రూమ్స్ వచ్చాయి. ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇచ్చాం. ఐబీ సిలబస్ అందిస్తున్నాం. మా రాష్ట్రంలో 2025 నుంచి ఒకటో తరగతిలోనే ఐబీ సిలబస్ బోధిస్తాం. 2035 నుంచి మా పిల్లలు ఐబీ సర్టిఫికెట్ పొందుతారు. ఇవన్నీ ప్రజల కళ్ల ముందు కనిపిస్తున్నాయి. ప్రతి గ్రామంలో మార్పు వచ్చింది. ఏ గ్రామానికి వెళ్లినా దాదాపు 600 రకాల సేవలు ఇంటి వద్దకే అందుతున్నాయి. ప్రతి సర్టిఫికెట్, ప్రతి సంక్షేమ పథకం, ప్రతి సేవ.. వలంటీర్ ద్వారా ఇంటి గుమ్మం ముందుకే వస్తున్నాయి. విలేజ్ క్లినిక్, రైతుల కోసం రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే), ఇంగ్లిష్ మీడియం స్కూల్, నవీకరించిన పాఠశాలలు, నవీకరించిన సిలబస్.. ఇలాంటివేవీ గతంలో లేవు. ఆరోగ్యం, వ్యవసాయం, విద్యలో చాలా మార్పు వచ్చింది. ముఖ్యంగా పాలనలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. నేను అధికారంలోకి రాక ముందు, ఇవన్నీ చేయక ముందు ఏదైనా సంక్షేమ పథకంలో ప్రభుత్వం నుంచి ఒక రూపాయి ప్రజలకు ఎలాంటి అవినీతి లేకుండా, వివక్ష చూపకుండా అర్హులందరికీ చేరుతుందంటే ఎవరూ నమ్మే వారు కాదు.నవికా: మరి మీ చెల్లి వాళ్లతో పనిచేస్తోంది. పవర్ పాలిటిక్స్‌లో ఆమె ఏ విధంగా రాణిస్తుందనుకుంటున్నారు? షర్మిలకు సునీత కూడా తోడయ్యారు.సీఎం జగన్: వాళ్లకు వాళ్ల వ్యక్తిగత కారణాలున్నాయి. అయితే వాళ్లు ఎంచుకున్న మార్గం, సమయం రెండూ సరైనవి కావు. ప్రతి కుటుంబంలో ఒక జనరేషన్లో ఒకరు మాత్రమే రాజకీయాలను లీడ్ చేస్తారు. మిగిలిన వాళ్లు లీడ్ చేసే వారికి మద్దతుగా నిలుస్తారు. రెండో జనరేషన్ రాజకీయాల్లోకి రాకూడదు. దీన్ని నమ్ముతాను. ఈ క్రమంలో వారిని రాజకీయాల్లోకి రావద్దనే సూచించాను. వ్యాపారాలు, ఇంకా వాళ్లకు ఇష్టమైన రంగాల్లో రాణించేలా ప్రోత్సహించాను. రాజకీయాల్లోకి వచ్చి కుటుంబంలో సంబంధాలు దెబ్బతినేలా చేయొద్దని కోరాను. రాజకీయాల్లోకి వస్తే ప్రత్యర్థులు దీన్ని అవకాశంగా మలుచుకుని మన మధ్యే చిచ్చుపెట్టి సంబంధాలను కలుషితం చేస్తారని చెప్పాను. మనలో మనమే ప్రత్యర్థులుగా మారిపోతామని తెలియజేశాను.నవికా: వారి వెనకాల చంద్రబాబు ఉన్నారని మీరు నమ్ముతున్నారా?సీఎం జగన్: అవును. నమ్మాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. చంద్రబాబు వాళ్లను ప్రోత్సహిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. రాజకీయాల్లో ఉన్నప్పుడు విలువలు, సిద్ధాంతాలు ఉండాలి. పార్టీకి ఎంతో విధేయుడిగా ఉన్న నా తండ్రి పేరును కాంగ్రెస్ పార్టీ చార్జిషీట్లలో పెట్టింది. అక్రమ కేసులు పెట్టి నన్ను జైలు పాలు చేసింది. నాపై కేసులు పెట్టింది కూడా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నాయకులే. ఈ కేసులో కో పిటీషన్ వేసింది టీడీపీ. నా తండ్రి బతికి ఉన్నన్ని రోజులు, నేను ఆ పార్టీలో ఉన్నన్ని రోజులు నేను నిజాయితీపరుడిని. నేను ఆ పార్టీ వీడిన వెంటనే నా తండ్రి, నాపైనా అవినీతి మరక వేశారు. నన్ను పార్టీ నుంచి బయటకు పంపేశారు. ఈ రోజుకూ వారు నాపై మోపిన తప్పుడు కేసులపై పోరాటం చేస్తున్నాను.నవికా: అందుకే చంద్రబాబు నాయుడినిజైలుకు పంపించారా?సీఎం జగన్: చంద్రబాబు నాయుడు చేయకూడని పని చేశారు. స్కిల్ స్కామ్‌లో కీలకంగా వ్యవహరించారు. అలా అతను చేసి ఉండకూడదు. ఆయన స్కామ్‌లో ప్రమేయం ఉందనడానికి పూర్తి ఆధారాలు ఉన్నాయి. కోర్టుల్లోనూ చంద్రబాబుకు వ్యతిరేకంగా తగిన సాక్ష్యాలతో వాదనలు జరిగాయి. అందుకే కటకటాల వెనక్కి వెళ్లాడు. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన సాక్ష్యాలతో కోర్టులు ఏకీభవించాయి. అందుకే అతను 52 రోజులు జైలులో ఉన్నాడు.నవికా: చివరికి బెయిల్ వచ్చింది కదా?సీఎం జగన్: బెయిల్ పొందడం అనేది హక్కు. అది జైలులోకి వెళ్లిన ఎవరికైనా.. ఎప్పుడో ఒకప్పుడు రావాల్సిందే. అంతేగానీ, సరైన సాక్ష్యాలు లేకుంటే చంద్రబాబు జైలుకి వెళ్లేవారు కాదేమో! చంద్రబాబుపై కేసుల్లో ఎక్కడా రాజకీయ కోణంలో వ్యవహరించలేదు.నవికా: మీపై ప్రతిపక్షాలు అవినీతి ఆరోపణలు చేస్తున్నాయి.. దానికి మీరేమంటారు?సీఎం జగన్: దాదాపు 2.70 లక్షల కోట్ల రూపాయలు నేరుగా (డీబీటీ) ప్రజల ఖతాల్లో జమ చేశాను. ప్రజల ఆధార్ నంబర్, బ్యాంకు ఖాతా వివరాలతో సహా ఆధారాలు ఉన్నాయి. మరి అవినీతి చేశానని వారు ఎలా అంటారు? 90 శాతం కుటుంబాలకు మేలు జరిగింది.నవికా: వన్ నేషన్.. వన్ ఎలక్షన్‌కు మీరు మద్దతిస్తారా?సీఎం జగన్: కచ్చితంగా మద్దతిస్తాం. ఇప్పటికే మద్దతిచ్చాంనవికా: యూనిఫాం సివిల్ కోడ్‌కు మద్దతిస్తున్నారా? సీఎం జగన్: మేం మద్దతివ్వడం లేదు. సీఏఏను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం కూడా చేశాం.
అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ముంబై ఇండియన్స్‌కు ఉన్న అజేయ రికార్డు శుక్రవారం బద్దలైంది. సొంత మైదానం వాంఖడేలో పన్నెండేళ్ల తర్వాత తొలిసారి ముంబై కేకేఆర్ ముందు తలవంచింది. శ్రేయస్ అయ్యర్ సేన చేతిలో 24 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది.అంతేకాదు ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందిస్తూ పరాజయానికి గల కారణాలు విశ్లేషించాడు.ఓటమికి కారణం అదే ‘‘మేము భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోయాం. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయాం. టీ20లలో భాగస్వామ్యాలు నిర్మించలేకపోతే భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుంది.మా ఓటమికి కారణం ఒక్కటనీ చెప్పలేను. చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను. మా బౌలర్లు ఈరోజు అద్భుతంగా రాణించారు.నిజానికి తొలి ఇన్నింగ్స్ తర్వాత వికెట్ మరింత మెరుగైంది. తేమ కూడా ఉంది. అనుకున్న ఫలితం రాబట్టేందుకు మా వంతు కృషి చేశాం.సవాళ్లంటే ఇష్టంఏదేమైనా చివరి వరకు పోరాడుతూనే ఉండాలని నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ ఉంటా. కఠిన పరిస్థితులు ఎదురవ్వడం సహజం.సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ముందుకు సాగితేనే మనల్ని మనం మరింత మెరుగుపరచుకోగలుగుతాం’’ అని పేర్కొన్నాడు. కేకేఆర్ చేతిలో ఓటమికి బ్యాటింగ్ వైఫల్యమే కారణమని హార్దిక్ పాండ్యా స్పష్టం చేశాడు.పూర్తిగా విఫలంకాగా ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు(2/44) తీయగలిగాడు. అయితే, బ్యాటర్‌గా దారుణంగా విఫలమయ్యాడు. మూడు బంతులు ఎదుర్కొని కేవలం ఒక్క పరుగు మాత్రమే చేశాడు. ఇక కేకేఆర్ బౌలర్లలో పేసర్ మిచెల్ స్టార్క్ అద్భుత ప్రదర్శన(4/33)తో దుమ్ములేపాడు.ముంబై వర్సెస్ కేకేఆర్ స్కోర్లు👉టాస్: ముంబై.. తొలుత బౌలింగ్👉కేకేఆర్ స్కోరు: 169 (19.5)👉ముంబై స్కోరు: 145 (18.5)👉ఫలితం: ముంబైపై 24 పరుగుల తేడాతో కేకేఆర్ ఘన విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: వెంకటేశ్ అయ్యర్(కేకేఆర్- 52 బంతుల్లో 70 రన్స్)👉ముంబై ఇండియన్స్ టాప్ స్కోరర్: సూర్యకుమార్ యాదవ్(35 బంతుల్లో 56 రన్స్)A memorable win for @KKRiders 🥳They wrap up a solid performance to get past the #MI challenge 💜 💪Scorecard ▶️ https://t.co/iWTqcAsT0O#TATAIPL | #MIvKKR pic.twitter.com/YT6MGSdPkj— IndianPremierLeague (@IPL) May 3, 2024
నిజ్జర్ హత్య కేసు.. ముగ్గురు భారతీయుల అరెస్ట్
ఒట్టావా: భారత్-కెనడాల మధ్య దౌత్యపరమైన వివాదం కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు అనుమానితులను శుక్రవారం కెనడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురు భారతీయులే కావడం గమనార్హం. కరణ్ బ్రార్(22), కమల్ ప్రీత్ సింగ్(22), కరణ్ ప్రీత్ సింగ్(28)లను అరెస్ట్ చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ముగ్గురు అనుమానితులు ఎడ్మోంటన్‌లోని అల్బెర్టాలో ఉంటున్నారని.. వారికి అక్కడే అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వీరు 3 నుంచి 5 ఏళ్ల నుంచి కెనడాలో ఉంటున్నారని తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు కొసాగుతోందని పోలీసులు తెలిపారు. మరోవైపు నిజ్జర్ హత్యలో భారత్‌కు ఉన్న సంబంధాలపై కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఈ హత్య కేసులో మరికొందరి ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోందని.. వారిని కూడా అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు.గతేడాది జూన్ 18న కెనడా బ్రిటిష్ కొలంబియా ప్రావిన్సు సర్రే పట్టణంలో ఉన్న గురునానక్ సిక్ గురుద్వారా సాహిబ్ ఆవరణలో నిజ్జర్‌పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపి హత్య చేసిన విషయం తెలిసిందే. నిజ్జర్ హత్య కేసులో భారత్‌కు సంబంధించిన ఏజెంట్ హస్తం ఉందని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేశాడు. ట్రూడో ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే. ట్రూడో ఆరోపణల నేపథ్యంలో ఈ విషయంలో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ దర్యాప్తు చేస్తాం
సాక్షి, హైదరాబాద్: సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో మళ్లీ విచారణ చేపట్టాలని నిర్ణయించినట్టు డీజీపీ రవిగుప్తా వెల్లడించారు. 2016 జనవరి 17వ తేదీన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థి రోహిత్‌వేముల ఆత్మహత్యపై గచ్చిబౌలి పీఎస్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి శుక్రవారం పలు ఎల్రక్టానిక్, సోషల్ మీడియా చానళ్లలో రకరకాల వార్తలు, కథనాలు ప్రస్తారమయ్యాయి. దీనిపై స్పందించిన డీజీపీ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ‘ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా మాదాపూర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉన్నారు. ఈ కేసుకు సంబంధించిన తుది నివేదిక గత సంవత్సరం అంటే నవంబర్ 2023 కన్నా ముందే నిర్వహించిన దర్యాప్తు ఆధారంగా తయారు చేశారు. ఆ తుది నివేదికనే అధికారికంగా 21.03.2024న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సంబంధిత కోర్టులో దాఖలు చేశారు. అయితే విచారణ, విచారణ జరిగిన విధానంపై రోహిత్ వేముల తల్లితోపాటు మరికొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో కేసు విషయంలో మళ్లీ విచారణ చేపట్టాలని నిర్ణయించామని, తదుపరి దర్యాప్తును అనుమతించాలని మేజి్రస్టేట్‌ను అభ్యర్థిస్తూ సంబంధిత కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తాం’అని డీజీపీ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
కందికుంట అడ్డంగా దొరికినా..
సాక్షి ప్రతినిధి, అనంతపురం: శ్రీసత్యసాయి జిల్లా కదిరి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ కారులో సుమారు రూ.2 కోట్ల నగదు పట్టివేత వ్యవహారంలో పోలీసుల తీరు చర్చనీయాంశంగా మారింది. నగదు తరలింపులో కందికుంట పాత్రపై పక్కా ఆధారాలు లభ్యమైనప్పటికీ ఆయనపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు తాత్సారం చేస్తున్నారు. ప్రస్తుత పరిణామాలను గమనిస్తే కేసును పక్కదోవ పట్టించి.. కందికుంటను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కందికుంట వెంకటప్రసాద్ కారులో సుమారు రూ.2 కోట్ల నగదును అనంతపురం నుంచి కదిరికి తరలిస్తుండగా.. నాలుగు రోజుల కిందట అనంతపురం విద్యుత్ నగర్ సర్కిల్లో పోలీసులు పట్టుకున్న విషయం విదితమే. అది కందికుంట డబ్బేనని కారు డ్రైవర్ వాంగ్మూలం కూడా ఇచ్చారు. ఇదే కారుకు ఎన్నికల ప్రచారానికి అనుమతి తీసుకున్నారు. ఇన్ని ఆధారాలున్నప్పటికీ కందికుంటపై చర్యలు తీసుకోవడానికి జాప్యమెందుకన్నది అంతుచిక్కని విషయం. ఈ కేసును నీరుగార్చేందుకు కుట్ర జరుగుతోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నో క్లిష్టమైన కేసులను ఇట్టే ఛేదించిన అనంతపురం పోలీసులు ఈ కేసు విషయంలో ఎందుకో దోబూచులాడుతున్నారు. కేసు నుంచి కందికుంటను తప్పించేందుకు ఏమైనా ప్లాన్ వేస్తున్నారా అన్న అనుమానాలు నెలకొన్నాయి. నాలుగు బైకులు పట్టుకుంటేనే హడావుడిగా ప్రెస్‌మీట్ పెట్టిమరీ వివరాలు వెల్లడించే పోలీసు అధికారులు.. సుమారు రూ.2 కోట్ల నగదు పట్టుబడిన విషయంలో మాత్రం ఎందుకు నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తున్నారో అర్థం కావడంలేదు.రోజుకో మలుపు భారీస్థాయిలో నగదు పట్టుబడిన ఈ కేసు మలుపులు తిరుగుతోంది. దీనిపై కిందిస్థాయి పోలీసులు ముందుకెళ్లకుండా పైస్థాయి అధికారులు బంధనాలు వేసినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే కదిరి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల రిటరి్నంగ్ అధికారి (ఆర్వో)కి సమాచారం ఇచ్చామని పోలీసులు చెప్పారు. వాస్తవానికి వారు ఆర్వోకి సమాచారం ఇవ్వనేలేదు. కందికుంట ఎవరి ద్వారానైనా పోలీసు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నారా? లేదా పోలీసులకే దీనిపై ‘ప్రత్యేక శ్రద్ధ’ ఉందా అన్నది తేలడం లేదు. అనంతపురం పోలీసు ఉన్నతాధికారుల వద్ద ఈ కేసు విషయంపై కిందిస్థాయి పోలీసులు చర్చించడానికి కూడా భయపడుతున్నట్టు తెలుస్తోంది. కందికుంట కారులో మూడు బ్యాగులు ఉన్నట్టు పలు టీవీ చానళ్ల విజువల్స్‌లో స్పష్టంగా కనిపిస్తుండగా, పోలీసులు మాత్రం రెండు బ్యాగులే ఉన్నట్లు చెబుతున్నారు. మూడో బ్యాగులోనూ డబ్బులు ఉన్నాయా, ఒకవేళ ఉంటే ఎక్కడికి వెళ్లాయన్నది తేలాల్సి ఉంది. గతంలో హైదరాబాద్–బెంగళూరు జాతీయ రహదారిపై భారీస్థాయిలో హవాలా నగదు పట్టుబడిన కేసులో రెండురోజుల్లోనే నిందితులను పట్టుకుని కోర్టులో హాజరుపరిచారు. అదే ఈ కేసులో మాత్రం ‘అనంత’ పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై అనుమానాలు కలుగుతున్నాయి. ఆర్వోకి సమాచారం ఇవ్వకుండానే ఇచ్చామని ఒక సీఐ చెప్పడం కూడా అనుమానాలకు తావిస్తోంది.ఆర్వోకి సమాచారం ఇచ్చాం డబ్బుకు సంబంధించి విచారణ చేస్తున్నాం. ఇందులో ఉన్నది రెండు బ్యాగులే. ఒకవేళ ఉంటే మూడో బ్యాగు బట్టల బ్యాగ్ అయి ఉండొచ్చు. ఆర్వో దగ్గరకు మా అధికారులు వెళ్లారు. ఆర్వో నిర్ణయాన్ని బట్టి తదుపరి చర్యలు ఉంటాయి. ఈలోగా మిగతా విచారణ జరుగుతూనే ఉంటుంది. – ఈ నెల 2వ తేదీన అనంతపురం టూటౌన్ సీఐ క్రాంతికుమార్‘సాక్షి’కి చెప్పిన వివరాలు నాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు కందికుంట వెంకటప్రసాద్‌కు సంబంధించి సీజ్చేసిన రూ.2 కోట్ల కేసు వివరాలు ఇప్పటివరకు నాకు అందలేదు. నేను కదిరి ఆర్వోగా ఉన్నాను. కేసు అనంతపురంలో బుక్ చేశారు. అయినా నేను పోలీసులను అడిగాను. కానీ ఇప్పటివరకు వివరాలు ఇవ్వలేదు. పోలీసులు ఇచ్చే వివరాలను బట్టి మాత్రమే చర్యలు తీసుకోగలం. – ఈ నెల 3వ తేదీన కదిరి రిటరి్నంగ్ అధికారి సన్నీ వంశీకృష్ణ వెల్లడి
Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: బ.ఏకాదశి సా.5.58 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం: పూర్వాభాద్ర రా.7.51 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర, వర్జ్యం: ఉ.8.44 నుండి 10.13 వరకు, తిరిగి రా.1.54 నుండి 3.23 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.36 నుండి 7.13 వరకు, అమృతఘడియలు: ప.12.27 నుండి 1.56 వరకు; రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 5.37, సూర్యాస్తమయం: 6.16. మేషం: ప్రయాణాలు వాయిదా. పనుల్లో అవరోధాలు. దైవదర్శనాలు. మిత్రులతో విభేదిస్తారు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. ఆరోగ్యసమస్యలు. కుటుంబంలో ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.వృషభం: ప్రయత్నాలలో అనుకూలత. సోదరుల నుంచి ధనలాభం. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు. కుటుంబసమస్యలు తీరతాయి. ఆస్తుల కొనుగోలలో ఆటంకాలు తొలగుతాయి. విందువినోదాలు.మిధునం: ఉద్యోగయత్నాలు అనుకూలం. బంధువులు, స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు.వృత్తి,వ్యాపారాలలో ఆశించిన ప్రగతి ఉంటుంది. ఆలయ దర్శనాలు. కళాకారుల యత్నాలు సఫలం.కర్కాటకం: అనుకోని ధనవ్యయం. పనుల్లో తొందరపాటు. బంధువులతో మాటపట్టింపులు. విద్యార్థులు కొంత శ్రమపడాలి. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని మార్పులు.సింహం: కుటుంబ, ఆరోగ్యసమస్యలు. వ్యవహారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. దూరప్రయాణాలు.బంధువులతో స్వల్ప వివాదాలు. ధనవ్యయం. వృత్తి, వ్యాపారాలు సామాన్యమే. కళాకారులకు చికాకులు..కన్య: పనులు విజయవంతంగా పూర్తి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.నూతన ఉద్యోగయోగం. ఆలయ దర్శనాలు. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. వృత్తి, వ్యాపారాలలో మరింత అనుకూలత.తుల: కొత్త విషయాలు తెలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. విలువైన వస్తువులు కొంటారు.వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన.వృశ్చికం: రుణఒత్తిడులు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు.ఆలోచనలు స్థిరంగా ఉండవు. ధనవ్యయం. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. అనారోగ్యం.ధనుస్సు: కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. వృత్తి, వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. నిరుద్యోగులకు ఒత్తిడులు. దైవచింతన..మకరం: కొత్త పనులు ప్రారంభిస్తారు. వృత్తి,వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. ధనలబ్ధి. ప్రముఖుల పరిచయం. కళాకారులకు మంచి గుర్తింపు.కుంభం: అనుకోని ధనవ్యయం. అదనపు బాధ్యతలు. వృత్తి, వ్యాపారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యసమస్యలు. నిరుద్యోగుల ప్రయత్నాలు ముంందుకు సాగవు. దూరప్రయాణాలు.మీనం: నూతన ఉద్యోగయోగం. ముఖ్యమైన నిర్ణయాలు. వృత్తి,వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. సోదరులతోసఖ్యత. నూతన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.
మళ్ళీ వచ్చారు...మౌత్ టాక్ మల్లిగాళ్ళు
సినిమా ఎప్పుడైతే చప్పగా ఉన్నట్లు అనిపిస్తుందో... సరిగ్గా అప్పుడే రెండు కామెడీ జోక్స్...లేదా మంచి మసాలా ఐటం సాంగ్ వేస్తారు... దీంతో మళ్ళీ థియేటర్లో ప్రేక్షకులు ఎటెన్షన్లోకి వచ్చి...సినిమాలో లీనమవుతారు... అచ్చం చంద్రబాబు కూడా ఇదే విధానము ఫాలో అవుతున్నారు.టీడీపీ గ్రాఫ్... చంద్రబాబు ప్రతిష్ట ఎప్పుడైతే డౌన్ అవుతోందని గ్రహిస్తారో.... అప్పుడు తన మీడియాను... పచ్చ జనాన్ని... అలవోకగా బొంకగలిగేవాళ్లను జనంలోకి దించుతారు... వీళ్ళే మౌత్ టాక్ మల్లిగాళ్ళు వీళ్ళు జనం ఎక్కువగా ఉండే హోటళ్లు... టీ స్టాళ్లు..బస్సులు...రైల్వే కౌంటర్ల వద్ద అకస్మాత్తుగా ప్రత్యక్షమై ఉన్నఫళంగా ప్రభుత్వాన్ని తిడుతూ అరుస్తూ కేకలు వేస్తారు.. అక్కడ ఉన్నవాళ్ళంతా ఆటే చూసేలా చేస్తారు.ఐదారు నిముషాలు స్క్రిప్ట్ ప్రకారం తమిళ యాక్టర్లు మనోరమ.. శివాజీ గణేష్‌లను మించిపోయేలా యాక్టింగ్ చేసేసి వెళ్ళిపోతారు... చూసేవాళ్ళు మాత్రం...వామ్మో ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత ఉందా అని జనం అనుకోవాలనేది వాళ్ళ ప్లాన్. దీనికోసం టీడీపీ ఎన్నారై విభాగం సైతం గ్రామాల్లోకి దిగింది.తమ చుట్టుపక్కల ఉన్నవాళ్లను ప్రభావితం చేసి తెలుగుదేశానికి ఓటేయించడం వారి విధి.. దీనికోసం కోట్లలో నిధులు సైతం సమీకరించి దేశవిదేశాల్లోని ఎన్నారై యువత సెలవులు పెట్టుకుని మరీ పల్లెల్లో, పట్టణాల్లోని కాలనీల్లో పాగా వేసింది..వాస్తవానికి టీడీపీ మ్యానిఫెస్టో జనంలోకి వెళ్ళకపోవడం, ప్రజలు పెద్దగా నమ్మకపోవడం.. సీఎం వైయస్ జగన్ అందిస్తున్న పథకాలు, అభివృద్ధి పనులను ప్రజలు అర్థం చేసుకుని రాష్ట్రం మరింతగా ప్రగతి సాధించాలంటే మళ్ళీ జగన్ రావాలి..పోర్టులు... మెడికల్ కాలేజీలు... స్కూళ్ళు.. ఇంగ్లిష్ మీడియం చదువులు... ఇప్పుడిప్పుడే ఊపందుకున్న పరిశ్రమలు... ఇవన్నీ పూర్తి కావాలన్నా... ఉద్యోగావకాశాలు పెరగాలన్నా మళ్ళీ జగన్ గెలవాలి...అలాగైతే ఇప్పుడు పురోగతిలో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి అని జనం అనుకుంటున్నారు...దీంతోబాటు గ్రామస్థాయిలో ప్రజల అభిప్రాయం మాత్రం వేరేలా ఉంది. ఇల్లు కదలకుండా తమ గుమ్మం వద్దకే వస్తున్నా సంక్షేమ పథకాలు... ఊరు దాటకుండానే సచివాలయంలో అందుతున్న ప్రభుత్వ సేవలను అందుకుంటున్న తీరు ప్రజల స్మృతిపథంలో కదులుతూనే ఉన్నాయి. . దీనికితోడు మహిళలు... వికలాంగులు... రైతులు ఈ ఐదేళ్లలో సీఎం వైఎస్ జగన్ తమకు ఎంత మేలు ఎంత మేలు చేశారన్నది లెక్కలు వేసుకుని మరీ ప్రజలు ఓటు చేతబట్టుకుని ఎన్నికల తేదీ కోసం సిద్ధంగా ఉన్నారు.మళ్ళీ తమ సోదరుడిని గెలిపించుకోవాలని వాళ్లంతా ఎదురుచూస్తున్నారు... ప్రజల్లో అలా అభిప్రాయం ఉన్నపుడు ఈ మౌత్ టాక్ మల్లిగాళ్ళు ప్రజల మనోభిప్రాయాలను మార్చలేరని అంటున్నారు. ఎన్నిసారు అరిచినా ఇత్తడిని పుత్తడి చేయలేరని.. చంద్రబాబును మళ్ళీ గెలిపించలేరని అంటున్నారు. గట్టిగా అరిచినంతమాత్రాన అబద్ధాలు నిజాలు కాలేవని... గ్రామసింహం సింహం కాలేదని ప్రజలు అంటున్నారు.-- సిమ్మాదిరప్పన్న
కన్నప్పకి బై బై
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ‘కన్నప్ప’కి బై బై చెప్పారు. తన పాత్రకి సంబంధించిన సన్నివేశాలను పూర్తి చేసిన ఆయనకి చిత్ర యూనిట్ వీడ్కోలు పలికింది. విష్ణు మంచు హీరోగా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్‌బాబు పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైన షెడ్యూల్లో అక్షయ్ కుమార్ జాయిన్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా తన సీన్లకు సంబంధించిన షూట్‌ను ఆయన పూర్తి చేశారు. ‘‘అక్షయ్ కుమార్‌గారి నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఈ ప్రయాణం ఎంతో విలువైనది’’ అని సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు విష్ణు మంచు. ‘‘ధైర్యవంతుడైన యోధుడు, శివ భక్తుడైన కన్నప్ప కథతో ఈ చిత్రం అద్భుతంగా రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది’’ అన్నారు మేకర్స్.
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్
ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన, భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్ల నుండి ప్రేరణ పొంది అద్భుతమైన మరియు వైవిధ్యమైన శ్రేణి సమకాలీన, రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్లు, కస్టమర్లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా, ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్, ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్లెట్లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్ 18కేరట్ మరియు 22కేరట్ బంగారంలో విస్తృతమైన శ్రేణి డిజైన్లతో, నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని సంపూర్ణం చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్లెట్లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.
తప్పక చదవండి
- తాతా.. నీకు టాటా..
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్‌వన్
- ముందస్తు బెయిల్ ఇవ్వండి: కోర్టులో రేవణ్ణ పిటిషన్
- చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్‌గా
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- అమెరికా వరల్డ్‌కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
- రగులుతున్న క్యాంపస్‌లు!
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
సినిమా
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
టాలీవుడ్లో హీరోయిన్లు గురించి చెప్పమంటే పోతే రోజులు పట్టేస్తాయి. ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్త వాళ్లు వస్తూనే ఉంటారు. ఉన్నవాళ్లు వెళ్లిపోతూనే ఉంటారు. ఈ బ్యూటీది కూడా అలాంటి స్టోరీనే. తెలుగమ్మాయి కాకపోయినప్పటికీ ఇక్కడ కొన్ని సినిమాలతో అద్భుతమైన హిట్స్ అందుకుంది. కానీ ఎందుకో కెరీర్ ని సరిగా సెట్ చేసుకోలేక ఫేడౌట్ అయిపోయింది. మరి ఇంతలా చెప్పాం కదా ఈమె ఎవరో కనిపెట్టారా? మమ్మల్ని చెప్పేయమంటారా?(ఇదీ చదవండి: 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?)పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ పేరు రిచా పల్లోడ్. అరె.. ఈ పేరు ఎక్కడో విన్నట్లుందే అనుకుంటున్నారా? అవును మీరు ఊహించింది కరెక్టే. దాదాపు 24 ఏళ్ల క్రితం వచ్చిన 'నువ్వే కావాలి' సినిమాలో హీరోయిన్గా చేసింది ఈమెనే. ఈ మూవీతో అద్భుతమైన సక్సెస్ అందుకుంది. కానీ తర్వాత చేసిన హోళీ, చిరుజల్లు, ప్రేమతో రా, నా మనసిస్తా రా, పెళ్లాం పిచ్చోడు, 'ఇంకోసారి' తదితర చిత్రాల్లో నటించింది. కాకపోతే ఇవి అనుకున్నంత హిట్ అవ్వలేదు.చివరగా 2016లో వచ్చిన 'మలుపు' అనే డబ్బింగ్ సినిమాలో రిచా.. సహాయ పాత్రలో నటించింది. రిచా ఫ్యామిలీ విషయానికొస్తే.. బెంగళూరులో పుట్టి పెరిగిన ఈ భామ.. చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో పలు మూవీస్ చేసింది. అయితే సినిమాలు తగ్గడంతో 2011లో హిమాన్షు బజాబ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఓ బాబు కూడా ఉన్నాడు. ప్రస్తుతం భర్తతో కలిసి ఉంటున్న రిచా.. ఒకప్పటితో పోలిస్తే ఛార్మ్ తగ్గిపోయింది. దీంతో గుర్తుపట్టేలేనంతగా మారిపోయింది. (ఇదీ చదవండి: ఆస్పత్రిలో లేడీ కమెడియన్.. కొడుకుని తలుచుకుని ఎమోషనల్) View this post on Instagram A post shared by Richa Pallod (@richapallod)
జితేందర్ రెడ్డి ట్రైలర్ విడుదల
ముదుగంటి క్రియేషన్స్‌పై తెరకెక్కిన జితేందర్ రెడ్డి సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ చిత్రాన్ని ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మాతగా తెరకెక్కిస్తున్నారు. ఉయ్యాల జంపాల, మజ్ను సినిమాలతో దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న విరించి వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రాకేష్ వర్రె లీడ్ రోల్లో నటించిన జితేందర్ రెడ్డి విడుదలకు సిద్ధంగా ఉంది. 1980 కాలంలో జరిగిన వాస్తవిక సంఘటనలు ఆధారంగా పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. వైశాలి రాజ్, రియా సుమన్, చత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్ ఇతర ముఖ్య పాత్రలో నటించారు. గతంలో ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లిమ్స్, టీజర్ సినిమా పైన అంచనాలను పెంచేసాయి. కాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. చిన్నప్పటినుండే సమాజం పట్ల అంకితభావం ఉన్న జితేందర్ రెడ్డి, సమాజానికి ఏదో ఒక మంచి చెయ్యాలి అనే భావంతో పెరుగుతాడు. ఆ లక్షణాలు జితేందర్ రెడ్డితో పాటు పెరిగి, కాలేజీ ఎలక్షన్స్ లో లీడర్ గా ఎదిగి, ఆ తరవాత పోలీసు వ్యవస్థకే దీటుగా, సమాజంలో నక్సలైట్లు చేసే దోర్జన్యాలకు ఎదురు వెళ్తాడు, ట్రైలర్ మద్యలో హిందుత్వం వంటి డైలాగ్ లు మరింత ఆశక్తి పెంచేలా ఉన్నాయి. 1980’s ఒక వ్యక్తి జీవితంలో జరిగే కాలేజీ పాలిటిక్స్, ఆ తరవాత నిజమైన రాజకీయాలు నేపధ్యంలో ఈ కథ సాగుతున్నట్టు ఉంది. మొత్తానికి ప్రేక్షకులను మెప్పించేలా కథ ఉంది. మే 10న ‘జితేందర్ రెడ్డి విడుదల కాబోతుంది అని చిత్ర యూనిట్ ట్రైలర్ ద్వారా తెలిపారు.
రెండో పెళ్లి.. ఇప్పటికీ విడిగానే.. యానివర్సరీ మాత్రం గొప్పగా
ప్రేమ ఎప్పుడు, ఎలా చిగురిస్తుందో ఎవరికీ తెలియదు. ఒక్కసారి మనసులు కలిశాయంటే ఎన్ని అవాంతరాలు ఎదురైనా వాటిని దాటి మరీ ఒక్కటయ్యేందుకు రెడీ అయిపోతారు. బాలీవుడ్ సీనియర్ జంట ధర్మేంద్ర- హేమమాలిని విషయంలో ఇదే జరిగింది. ధర్మేంద్రతో ప్రేమలో పడేనాటికే అతడికి ప్రకాశ్ కౌర్ అనే భార్య ఉంది. ఈ జంటకు నలుగురు పిల్లలు సంతానం. రెండో పెళ్లిఈ బంధాన్ని కాపాడుకుంటూనే మోవైపు హేమమాలినిని రెండో పెళ్లి చేసుకున్నాడు. తాజాగా వీరు 44వ పెళ్లి రోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా హేమమాలిని భర్తతో కలిసున్న ఫోటోలు షేర్ చేసింది. ఇందులో ధర్మేంద్ర, హేమమాలిని దండలు మార్చుకున్నారు. భర్త ప్రేమగా ముద్దుపెడుతుంటే సిగ్గుపడిపోయింది హేమ. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.అప్పుడే చిగురించిన ప్రేమహేమమాలిని, ధర్మేంద్ర 1970లో వారి తుమ్ హసీన్ మెయిన్ జవాన్ చిత్రంలో తొలిసారి నటించారు. అప్పుడే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పెళ్లికి రెడీ అయ్యారు. అయితే హేమ తల్లిదండ్రులు ధర్మేంద్రను వివాహం చేసుకోవడాన్ని వ్యతిరేకించారు. అయినా వినకుండా 1980లో ఈ జంట పెళ్లి పీటలెక్కింది. వీరికి ఈషా, అహనా అని ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే ధర్మేంద్ర తన మొదటి భార్యతో కలిసి ఒకే ఇంట్లో ఉండగా హేమమాలిని తన పిల్లలతో వేరుగా ఉంటోంది. Photos from today at home pic.twitter.com/JWev1pemnV— Hema Malini (@dreamgirlhema) May 2, 2024More photos for you pic.twitter.com/20naRKL8gA— Hema Malini (@dreamgirlhema) May 2, 2024చదవండి: ప్రియుడితో పెళ్లికి రెడీ.. ఎంగేజ్మెంట్ వీడియో షేర్ చేసిన బ్యూటీ
16 ఏళ్ల వయసులో ఛాన్సుల కోసం వెళ్తే.. అమ్మ ముందే ఇలా అడిగారు: వితికా
టాలీవుడ్లో తక్కువ సినిమాలే చేసినప్పటికీ వితికా షెరు అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. భీమవరంలో జన్మించిన ఈ బ్యూటీ మొదట కన్నడ చిత్ర సీమలో ఎంట్రీ ఇచ్చింది. తన 15వ ఏట 2008లో 'అంతు ఇంతు ప్రీతి బంతు' (తెలుగు సినిమా ఆడవారి మాటలకు అర్థాలే వేరులేలో కలర్స్ స్వాతి పాత్ర) కన్నడ చిత్రంతో సినీరంగ ప్రవేశంచేసింది. ఆ తర్వాత తెలుగు చిత్ర సీమలో రాణించాలని టాలీవుడ్‌వైపు అడుగులు వేసింది. తనకు 16 ఏళ్ల వయసులో తెలుగు సినిమా ఆడిషన్స్ కోసం వెళ్తే తనకు ఎదురైన అనుభవాలను పంచుకుంది.కన్నడ సినిమా తర్వాత తెలుగులో అవకాశాల కోసం చాలా ఆఫీసుల చుట్టూ తిరిగినట్టు అప్పటి రోజులను వితికా గుర్తుచేసుకుంది. కానీ ప్రస్తుతం మాత్రం ఇన్‌స్టాలో ఫోటోలు,రీల్స్ పెట్టినా ఛాన్సులు వస్తున్నాయని ఆమె తెలిపింది. కొంతమంది తన కలర్ తక్కువని కూడా రిజక్ట్ చేశారని ఇలా తెలిపింది. 'నా పేరు వితికా షెరు.. వినగానే కాస్త డిఫరెంట్‌గా ఉండటంతో అందరూ నన్ను నార్త్ అమ్మాయి అనుకుని ఆడిషన్స్‌కు పిలిచేవారు. కానీ, అక్కడికి వెళ్లిన తర్వాత ఓహ్.. తెలుగు అమ్మాయివేనా అంటూ కాస్త చులకన చేసి మాట్లాడేవారు. నాకు 16 ఏళ్లు ఉన్నప్పుడు మా అమ్మతో కలిసి ఆడిషన్స్ ఇచ్చేందుకు వెళ్లాను. ఆ ప్రాజెక్ట్ కోసం నన్ను ఎంపిక కూడా చేశారు. అమ్మతో మాట్లాడాలి అంటూ కొంత సమయం తర్వాత నన్ను బయటకు పంపించారు. అమ్మాయికి సినిమాలో ఛాన్సు కావాలంటే నిర్మాతల సైడ్ నుంచి కమిట్మెంట్ విషయంలో చాలా ఒత్తిడి ఉంటుంది అన్నారు. దాని గురించి అమ్మకు తెలియకపోవడంతో పాపను పిలవండి అని చెప్పింది. దీంతో నేను కూడా అతని ముందుకు వచ్చాను. కమిట్మెంట్ అంటున్నారు ఎంటో తెలియడం లేదు మాట్లాడు అని నాతో అమ్మ చెప్పింది. వారి ప్రపోజల్‌కు నేను నో చెప్పాను. సార్, రెమ్యునరేషన్ ఇవ్వకపోయినా పర్వాలేదు ఛాన్స్ ఇవ్వండి అని కోరాను. కానీ, ఇలాంటి కమిట్మెంట్ వంటి కండీషన్‌కు ఒప్పుకోను అని చెప్పాను. అలా 16 ఎళ్ల వయసులోనే నేను ఇలాంటి సంర్భాన్ని ఎదుర్కొన్నాను. వాళ్ల సినిమా ఆఫీస్ కూడా హైదరాబాద్‌లోని శ్రీనగర్‌లోనే ఉండేది. మాకు బాగా తెలిసిన వారే నన్ను కమిట్మెంట్ అడిగారు.' అని వారి పేర్లు చెప్పకుండా వితికా దాటవేసింది. ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడం కష్టమని సినిమాల నుంచి తాను దూరం అయినట్లు ఆమె పేర్కొంది. కొంత కాలం తర్వాత యంగ్ హీరో వరుణ్ సందేశ్‌ను ప్రేమించి 2016, ఆగస్టు 19న వితిక వివాహం చేసుకుంది. ప్రస్తుతం తను పూర్తిగా కుటుంబ బాధ్యతలతో లీడ్ చేస్తుంది.
ఫొటోలు
క్రీడలు
పుష్కర కాలం తర్వాత...
ముంబై: వాంఖెడే మైదానంలో 12 సంవత్సరాల తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) మెరిసింది. 2012లో చివరిసారిగా ఈ వేదికపై ముంబై ఇండియన్స్ జట్టును ఓడించిన కోల్‌కతా ఇప్పుడు మళ్లీ గెలుపు బావుటా ఎగురవేసింది. శుక్రవారం జరిగిన ఈ పోరులో కేకేఆర్ 24 పరుగుల తేడాతో ముంబైని ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 19.5 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది. వెంకటేశ్ అయ్యర్ (52 బంతుల్లో 70; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా... మనీశ్ పాండే (31 బంతుల్లో 42; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం ముంబై 18.5 ఓవర్లలో 145 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. సూర్యకుమార్ యాదవ్ (35 బంతుల్లో 56; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, కోల్‌కతా పేసర్ స్టార్క్‌కు 4 వికెట్లు దక్కాయి. ఆదుకున్న వెంకటేశ్... కోల్‌కతా ఇన్నింగ్స్‌లో 6.1 ఓవర్లు ముగిసేసరికే సగం జట్టు అవుట్! తుషార బౌలింగ్ జోరుతో మొదలైన జట్టు పతనం వేగంగా సాగింది. తన తొలి ఓవర్లోనే సాల్ట్ (5)ను అవుట్ చేసి శుభారంభం అందించిన తుషార... రెండో ఓవర్లో రఘువంశీ (13), శ్రేయస్ అయ్యర్ (6)లను వెనక్కి పంపాడు. పాండ్యా తొలి ఓవర్లోనే నరైన్ (8) కూడా పెవిలియన్ చేరగా, రింకూ సింగ్ (9) విఫలమయ్యాడు. ఈ దశలో వెంకటేశ్, పాండే కలిసి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఆశించిన స్థాయిలో భారీ షాట్లు కొట్టకపోయినా ఇన్నింగ్స్ కుప్పకూలిపోకుండా వీరు కాపాడారు. ఆరో వికెట్‌కు 62 బంతుల్లో 83 పరుగులు జత చేసిన అనంతరం పాండే వెనుదిరిగాడు. సమన్వయలోపంతో రసెల్ (7) రనౌట్ కావడం చివరి ఓవర్లలో కేకేఆర్ స్కోరింగ్ అవకాశాలను దెబ్బ తీసింది. 36 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న వెంకటేశ్ తర్వాతి 16 బంతుల్లో 20 పరుగులే చేయగా... ఆఖరి 5 ఓవర్లలో 41 పరుగులే చేసి నైట్‌రైడర్స్ 5 వికెట్లు చేజార్చుకుంది. సూర్యకుమార్ అర్ధసెంచరీ... ఛేదనలో ముంబై కూడా తడబడింది. కేకేఆర్ బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శించడంతో పవర్‌ప్లే ముగిసేసరికి ఇషాన్ కిషన్ (13), నమన్ (11), రోహిత్ శర్మ (11) వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత 10 పరుగుల వ్యవధిలో తిలక్ వర్మ (4), నేహల్ వధేరా (6), హార్దిక్ పాండ్యా (1) కూడా వెనుదిరిగారు. అయితే ఈ దశలో సూర్యకుమార్ దూకుడైన బ్యాటింగ్ ముంబై విజయంపై ఆశలు రేపింది. అరోరా వేసిన ఓవర్లో 3 ఫోర్లు, సిక్స్ బాదిన సూర్య 30 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. విజయానికి 28 బంతుల్లో 50 పరుగులు కావాల్సిన స్థితిలో సూర్య అవుట్ కావడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. చివర్లో టిమ్ డేవిడ్ (20 బంతుల్లో 24; 1 ఫోర్, 1 సిక్స్) కొంత పోరాడినా లాభం లేకపోయింది. 19వ ఓవర్లో స్టార్క్ 3 వికెట్లు తీసి మ్యాచ్‌ను ముగించాడు. స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) తిలక్ (బి) తుషార 5; నరైన్ (బి) పాండ్యా 8; రఘువంశీ (సి) సూర్యకుమార్ (బి) తుషార 13; శ్రేయస్ (సి) డేవిడ్ (బి) తుషార 6; వెంకటేశ్ (బి) బుమ్రా 70; రింకూ సింగ్ (సి అండ్ బి) చావ్లా 9; పాండే (సి) (సబ్) బ్రెవిస్ (బి) పాండ్యా 42; రసెల్ (రనౌట్) 7; రమణ్‌దీప్ (సి) కొయెట్జీ (బి) బుమ్రా 2; స్టార్క్ (బి) బుమ్రా 0; అరోరా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (19.5 ఓవర్లలో ఆలౌట్) 169. వికెట్ల పతనం: 1–7, 2–22, 3–28, 4–43, 5–57, 6–140, 7–153, 8–155, 9–155, 10–169. బౌలింగ్: తుషార 4–0–42–3, బుమ్రా 3.5–0–18–3, కొయెట్జీ 2–0–24–0, పాండ్యా 4–0–44–2, నమన్ 3–0–25–0, చావ్లా 3–0–15–1. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: ఇషాన్ కిషన్ (బి) స్టార్క్ 13; రోహిత్ శర్మ (సి) పాండే (బి) నరైన్ 11; నమన్ (బి) వరుణ్ 11; సూర్యకుమార్ (సి) సాల్ట్ (బి) రసెల్ 56; తిలక్ (సి) నరైన్ (బి) వరుణ్ 4; వధేరా (బి) నరైన్ 6; పాండ్యా (సి) పాండే (బి) రసెల్ 1; డేవిడ్ (సి) శ్రేయస్ (బి) స్టార్క్ 24; కొయెట్జీ (బి) స్టార్క్ 8; చావ్లా (సి) నరైన్ (బి) స్టార్క్ 0; బుమ్రా (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (18.5 ఓవర్లలో ఆలౌట్) 145. వికెట్ల పతనం: 1–16, 2–38, 3–46, 4–61, 5–70, 6–71, 7–120, 8–144, 9–144, 10–145. బౌలింగ్: అరోరా 3–0–35–0, స్టార్క్ 3.5–0–33–4, వరుణ్ 4–0–22–2, నరైన్ 4–0–22–2, రసెల్ 4–0–30–2. ఐపీఎల్లో నేడుబెంగళూరు X గుజరాత్ వేదిక: బెంగళూరురాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం
పదేళ్ల తర్వాత దక్షిణాఫ్రికాతో టెస్టు
బెంగళూరు: భారత్‌లో దక్షిణాఫ్రికా మహిళల క్రికెట్ జట్టు పర్యటన ఖరారైంది. వచ్చే జూన్, జూలైలో పూర్థిసాయి ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా భారత్‌తో దక్షిణాఫ్రికా ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్‌లు ఆడుతుంది. ముందుగా బెంగళూరులో జూన్ 16న వన్డే సిరీస్ మొదలవుతుంది. 19న రెండో వన్డే, 23న మూడో వన్డేతో 50 ఓవర్ల ఫార్మాట్ ముగుస్తుంది. వన్డే సిరీస్ ముగిశాక ఏకైక టెస్టు పోరు జూన్ 28 నుంచి చెన్నైలో జరుగుతుంది. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఇది కేవలం మూడో టెస్టు కానుంది. దక్షిణాఫ్రికాలోని పార్ల్ వేదికగా ఈ రెండు జట్ల మధ్య తొలి టెస్టు 2002లో... భారత్‌లోని మైసూరు వేదికగా రెండో టెస్టు 2014లో జరిగాయి. ఆ తర్వాత ఈ రెండు జట్లు టెస్టు ఫార్మాట్లో మరో మ్యాచ్ ఆడలేదు. దక్షిణాఫ్రికాతో ఆడిన రెండు టెస్టుల్లోనూ భారతే నెగ్గింది. ఏకైక టెస్టు ముగిశాక బెంగళూరులో ఈ రెండు జట్ల మధ్య జూలై 5, 7, 9 తేదీల్లో మూడు టి20ల సిరీస్ జరుగుతుంది.
కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
ఐపీఎల్-2024లో దాదాపుగా ముంబై ఇండియన్స్ కథ ముగిసింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా వాంఖడే వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 24 పరుగుల తేడాతో ముంబై ఓటమి పాలైంది. దీంతో తమ ప్లే ఆఫ్ అవకాశాలను ముంబై మరింత సంక్లిష్టం చేసుకుంది. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. 18.5 ఓవర్లలో 145 పరుగులకే ఆలౌటైంది. ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్(56) ఒక్కడే పర్వాలేదన్పించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. కేకేఆర్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 4 వికెట్లు పడగొట్టగా.. సునీల్ నరైన్, రస్సెల్, చక్రవర్తి తలా రెండు వికెట్లు సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. 169 పరుగులకు ఆలౌటైంది. కేకేఆర్ బ్యాటర్లలో వెంకటేశ్ అయ్యర్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 52 బంతుల్లో అయ్యర్ 70 పరుగులు చేశాడు. అయ్యర్‌తో పాటు ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన మనీష్ పాండే కూడా తన వంతు పాత్ర పోషించాడు. 31 బంతులు ఎదుర్కొన్న పాండే 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42 పరుగులు చేశాడు. ఇక ముంబై బౌలర్లలోతుషారా, బుమ్రా తలా 3 వికెట్లతో చెలరేగగా.. హార్దిక్ పాండ్యా రెండు, చావ్లా ఒక్క వికెట్ సాధించారు. ఇక ఈ ఏడాది సీజన్లో 11 మ్యాచ్‌లు ఆడిన కేవలం 3 మ్యాచ్‌ల్లోనే విజయం సాధించిన ముంబై.. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్ధానంలో నిలిచింది.
అమెరికా వరల్డ్‌కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
టీ20 వరల్డ్‌కప్-2024కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును యూఎస్ఏ క్రికెట్ బోర్డు శుక్రవారం ప్రకటించింది. ఈ జట్టుకు మోనాంక్ పటేల్ నాయకత్వం వహించనున్నాడు. ఈ జట్టులో న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ కోరీ అండర్సన్‌కు చోటు దక్కింది. 2014, 2016 టీ20 వరల్డ్‌కప్‌లో కివీస్‌కు ప్రాతినిథ్యం వహించిన అండర్సన్.. గతేడాది న్యూజిలాండ్ క్రికెట్ నుంచి ఎన్వోసీ తీసుకుని అమెరికాకు మకాం మార్చాడు. ఇప్పుడు అతడికి ఏకంగా సెలక్టర్లు వరల్డ్‌కప్ జట్టులో ఛాన్స్ ఇచ్చారు. అదేవిధంగా ఈ జట్టులో భారత సంతతికి చెందిన ఐదుగురు ఆటగాళ్లకు చోటు దక్కింది. కెప్టెన్ మోనాంక్ పటేల్, సౌరభ్ నేత్రవల్కర్, మిలింద్ కుమార్, నిసర్గ్ పటేల్, నితీష్ కుమార్ భారత మూలాలు కలిగి ఉన్నారు.ఈ జట్టులో భారత మాజీ అండర్-19 కెప్టెన్ ఉన్ముక్త్ చంద్‌కు చోటు దక్కలేదు. ఈ మెగా టోర్నీకి అమెరికా, వెస్టిండీస్‌లు సంయుక్తం ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. అమెరికా తమ తొలి మ్యాచ్‌లో జూన్ 1న డల్లాస్ వేదికగా కెనడాతో తలపడనుంది.అమెరికా వరల్డ్‌కప్ జట్టు..మోనాంక్ పటేల్ (కెప్టెన్), ఆరోన్ జోన్స్ (వైస్ కెప్టెన్), ఆండ్రీస్ గౌస్, కోరీ ఆండర్సన్, అలీ ఖాన్, హర్మీత్ సింగ్, జెస్సీ సింగ్, మిలింద్ కుమార్, నిసర్గ్ పటేల్, నితీష్ కుమార్, నోష్టుష్ కెంజిగే, సౌరభ్ నేత్రవల్కర్, షాడ్లీ వాన్ షాల్క్విక్, స్టీవెన్ టేలర్, షయాన్ జహంగీర్.
బిజినెస్
నేపాల్‌లో నిలిచిన ఇంటర్నెట్ సేవలు.. కారణం..
నేపాల్ ప్రైవేట్ ఇంటర్నెట్ ప్రొవైడర్లు భారతీయ కంపెనీలకు చెల్లింపులు చేయకపోవడంతో ఇంటర్నెట్ సేవలు నిలిచాయి. నేపాల్‌కు చెందిన అప్‌స్ట్రీమ్ భాగస్వాములు బకాయిలు చెల్లించకపోవడంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు నేపాల్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అసోసియేషన్ (ఇస్పాన్) తెలిపింది.నేపాల్‌లోని ప్రైవేట్ ఇంటర్నెట్ కంపెనీలు గురువారం రాత్రి తమ సేవలను నిలిపేసినట్లు ఇస్పాన్ పేర్కొంది. ఇంటర్నెట్ మానిటర్ సంస్థ నెట్‌బ్లాక్స్ విడుదల చేసిన డేటా ప్రకారం..18 నేపాలీ ఇంటర్నెట్ ప్రొవైడర్లు ఐదు గంటలపాటు సర్వీసులను తగ్గించినట్లు, అందులో కొన్ని బ్యాండ్ విడ్త్‌ను పూర్తిగా తగ్గించినట్లు తేలింది. ఇంటర్నెట్ అంతరాయం కొనసాగవచ్చని, ఈ అంశం తమ పరిధిలో లేదని ఇస్పాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సువాష్ ఖడ్కా తెలిపారు. ప్రస్తుతం ఇంటర్నెట్ సేవలకు అధికప్రాధాన్యం ఉందన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.ఇదీ చదవండి: భారత కంపెనీపై ‘టెస్లా’ ఫిర్యాదు.. ఏం జరిగిందంటే..స్థానిక బ్రాడ్‌బ్యాండ్ ప్రొవైడర్లు భారతీయ కంపెనీలకు సుమారు మూడు బిలియన్ నేపాలీ రూపాయలు (రూ.187 కోట్లు) బకాయిపడ్డారు. అయితే బయటిదేశాలకు డబ్బు బదిలీ చేయడానికి అక్కడి ప్రభుత్వం అనుమతించడం లేదు. ఇంటర్నెట్ ప్రొవైడర్లు పాత బకాయిలు చెల్లిస్తేనే సర్వీసులు అందిస్తామని కంపెనీలు చెబుతున్నాయి. కొంతకాలంగా ఈ సమస్య పరిష్కారం కాకపోవడంతో ఇటీవల ఇంటర్నెట్ సర్వీసులు నిలిపేసినట్లు తెలిసింది. నేపాల్ టెలికమ్యూనికేషన్స్ అథారిటీ లెక్కల ప్రకారం ప్రైవేట్ ఇంటర్నెట్ కంపెనీలకు 10 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లున్నారని సమాచారం.
అమెజాన్ సేల్‌లో ఆఫర్ల జాతర.. 95 శాతం వరకు డిస్కౌంట్
కొనుగోలు దారులకు శుభవార్త. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ సమ్మర్ సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్‌లో స్మార్ట్‌వాచ్‌లపై 95 శాతం, బ్లూటూత్ ఇయర్‌బడ్స్‌పై 95శాతం, ఇయర్ఫోన్లపై 95శాతం, నెక్ బ్యాండ్ ఇయర్‌ఫోన్స్‌పై 95 శాతం డిస్కౌంట్ పొందవచ్చారు.అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2024తో ప్రారంభమైన ఈ సేల్‌లో అన్నీ రకాల ప్రొడక్ట్‌లపై డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తున్నట్లు తెలిపింది. దీంతో పాటు రూ.15,000, రూ.25,000 సెగ్మెంట్ ధరల్లో ఉన్న ఫోన్లపై ప్రత్యేక ఆఫర్లను కొనుగోలు దారులు సొంతం చేసుకోవచ్చంటూ అమెజాన్ ప్రతినిధులు తెలిపారు.మే 2 అర్ధరాత్రి నుంచి ప్రారంభమై మే 7 వరకు కొనసాగుతున్న ఈ సేల్‌లో స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ శాంసంగ్, షావోమీ, వన్‌ప్లస్‌తో పాటు ఇతర ఫోన్లపై తగ్గింపు ధరకే కొనుగోలు చేసే అవకాశాన్ని అమెజాన్ కొనుగోలు దారులకు కల్పిస్తుంది. ఈ ఫోన్లలో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, లార్జ్ డిస్ప్లే, పెద్ద బ్యాటరీ, పవర్ఫుల్ ప్రాసెసర్లుతో వస్తున్నట్లు అమెజాన్ వెల్లడించింది.మీరు ఐసీసీఐ, వన్ కార్డ్, బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డ్‌ల ద్వారా కొనుగోలు చేస్తే.. ప్రతి కొనుగోలుపై 10 శాతం డిస్కౌంట్లు పొందవచ్చు.దీంతో పాటు ఎక్ఛేంజ్ ఆఫర్లు, ఈఎంఐలు, కూపన్లు వినియోగించుకోవచ్చని అమెజాన్ వెల్లడించింది.
ఎడారి దేశంలో మళ్లీ వర్షం.. విమాన సర్వీసులు రద్దు
ఎడారి దేశం దుబాయ్‌లో ఇటీవల భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. యూఏఈలో గురువారం మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. దుబాయ్ వాతావరణ శాఖ శుక్రవారం ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. దాంతో అనేక విమాన సర్వీసులు రద్దయ్యాయి. దుబాయ్‌లో బస్సు సర్వీసులను కూడా నిలిపేస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు.ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. దుబాయ్, షార్జా, రస్ అల్ ఖైమా, అబుదాబి అంతటా ఇండిగో, విస్తారా, స్పైస్‌జెట్ వంటి విమాన సర్వీసుల రాకపోకలకు అంతరాయం కలుగుతుందని ముందే నివేదించాయి. ‘ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దుబాయ్, అబుదాబి, షార్జాలలో విమాన సర్వీసుల్లో మార్పులుంటాయి. వర్షాల కారణంగా స్థానికంగా రోడ్డు ప్రయాణాల్లో అవాంతరాలు కలుగొచ్చు. అందుకు తగ్గట్టుగా ప్రయాణికులు సిద్ధంకావాలి’ అని ఇండిగో ఎయిర్‌లైన్ తన ఎక్స్ ప్లాట్ఫామ్లో పోస్ట్ చేసింది.ఇదీ చదవండి: భారత కంపెనీపై ‘టెస్లా’ ఫిర్యాదు.. ఏం జరిగిందంటే..బుధవారం రోజునే దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లు స్థానిక విమానయాన సంస్థలతోపాటు ప్రయాణికులకు సలహాలు జారీ చేశాయి. అక్కడి జాతీయ దినపత్రిక ఖలీజ్ టైమ్స్ కథనాల ప్రకారం..గురువారం రాత్రి దుబాయ్‌కి వెళ్లే ఐదు ఇన్‌బౌండ్ విమానాలను దారి మళ్లించగా, తొమ్మిది అరైవల్, నాలుగు అవుట్‌బౌండ్ సర్వీసులను రద్దు చేసినట్లు తెలిసింది.#6ETravelAdvisory: Due to bad weather in #Dubai #Sharjah #RasAlKhaimah #AbuDhabi, our flight operations are impacted. Road blockages may disrupt local transport. Plan accordingly and allow extra time for airport travel. Check flight status at https://t.co/F83aKzsIHg— IndiGo (@IndiGo6E) May 2, 2024
కరుణించిన కనకమహాలక్ష్మి! దిగొచ్చిన బంగారం
దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. క్రితం రోజున భారీ పెరుగుదలను చూసిన బంగారం నేడు (మే 3) గణనీయంగా తగ్గింది. ఏకంగా రూ.1090 మేర తగ్గడంతో ఈరోజు కొనుగోలు చేస్తున్నవారికి పెద్ద ఊరట కలిగింది.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖపట్నంలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.500 తగ్గి రూ.65,750 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల పసిడి కూడా ధర రూ.540 తగ్గి రూ. 71,730 లకు దిగొచ్చింది.ఇతర నగరాల్లో..ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.500 తగ్గి రూ.65,900 లకు, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.540 తగ్గి రూ.71,880 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.500 క్షీణించి రూ.65,750 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.540 తగ్గి రూ.71,730 వద్దకు క్షీణించింది.చెన్నైలో భారీగా..చెన్నైలో ఈరోజు బంగారం ధర భారీగా తగ్గింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఏకంగా రూ.1000 తగ్గి రూ.66,150 లకు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం రూ.1090 తగ్గి రూ.72,160గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.500 క్షీణించి రూ.65,750 వద్దకు, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.540 తగ్గి రూ.71,730 లకు తగ్గింది.
వీడియోలు
దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి
డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు
గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం
లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..
బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే
సింగరేణిపై కుట్ర..
నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం
నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు
లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..
ఫ్యామిలీ
Health: ఇంతకీ.. పనీర్ స్వచ్ఛమైనదేనా? ఏం కొంటున్నామో! ఏం తింటున్నామో!!
పనీర్‌తో ఎన్ని రకాలు వండవచ్చో తెలుసా! అలాగే ఒక కేజీ పనీర్ తయారు కావాలంటే ఎన్ని పాలు కావాలో తెలుసా? పాలను విరగ్గొట్టి నీరు మొత్తం కారిపోయే వరకు బరువు పెట్టి ఎదురు చూసే సమయం ఎవరికీ ఉండడం లేదు. పైగా మనం ఇంట్లో తయారు చేసే పనీర్ మెషీన్లో చేసినట్లు క్యూబ్స్‌గా రావడం కష్టం. రెస్టారెంట్లో తిన్న పనీర్లాగ ముక్కలుగా ఉంటే తప్ప పిల్లలు ఇష్టపడరు. ఇంకేం చేస్తాం... రెడీమేడ్‌గా మార్కెట్లో దొరికే పనీర్ తెచ్చుకుని సింపుల్‌గా వండేస్తాం.పనీర్ ఆరోగ్యానికి మేలు చేస్తుందని తెలిసిన తర్వాత ఇటీవల పనీర్ వాడకం పెరిగింది. అయితే వాడకం పెరిగినంత వేగంగా పనీర్ తయారీ పెరుగుతోందా? పనీర్ లభ్యత పెరుగుతోంది కానీ సహజమైన పనీర్ తయారీ జరగడం లేదు. మార్కెట్లో దొరికే పనీర్‌లో అసలు కంటే నకిలీ ఎక్కువ.ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఇటీవల ఢిల్లీ– ముంబయి ఎక్స్‌ప్రెస్ హైవే మీద ఉన్న ఫుడ్ స్టాల్స్‌ను తనిఖీ చేసినప్పుడు 13వందల కిలోల నకిలీ పనీర్ దొరికింది. దొరికింది గోరంతే, నిజానికి నకలీ పనీర్ వ్యాపారం కొండంత జరుగుతోంది. మనం ఇంట్లో వండుకోవడానికి కొనుక్కున్న పనీర్ అసలుదా కల్తీదా అని తెలుసుకోవడానికి ఇంట్లోనే పరీక్షించుకోవడానికి మూడు పద్ధతులను తెలియచేసింది ఎఫ్ఎస్ఎస్ఏఐ.పనీర్ కొద్దిగా ఒక పాత్రలోకి తీసుకుని నీరు పోసి వేడి చేసి అందులో నాలుగైదు చుక్కల అయోడిన్ వేయాలి. పనీర్ నీలం రంగులోకి మారితే అది కల్తీ అని అర్థం. అసలైన పనీర్ అయితే రంగు మారదు.పనీర్‌ని నీటిలో ఉడికించిన తర్వాత చల్లటి నీటిలో వేయాలి. అదే నీటిలో కందిపప్పు పది గింజలు వేయాలి. పది నిమిషాల సేపు కదిలించకుండా ఉంచాలి. నీరు లేత ఎరుపు రంగులోకి మారితే ఆ పనీర్ కల్తీ అని అర్థం. రంగు మారకపోతే నిర్భయంగా ఆ పనీర్‌ను వాడుకోవచ్చు.ఇంత ప్రక్రియ లేకుండా వాసన ద్వారా కూడా పనీర్ స్వచ్ఛతను గుర్తించవచ్చు. కంపెనీ ప్యాకింగ్, ఎఫ్ఎస్ఎస్ఏఐ ముద్ర లేకుండా లూజ్‌గా అమ్ముతుంటారు. ఆ పనీర్‌ను కొద్దిగా చేతిలోకి తీసుకుని వాసన చూడాలి. పాల వాసన వస్తే అది మంచి పనీర్. అప్పుడు రుచి చూడవచ్చు. మెత్తగా పాల రుచిని గుర్తు చేస్తుంటే కొనుక్కోవచ్చు. అలా కాక నమిలినప్పుడు రబ్బర్లాగ సాగుతుంటే దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ కొనవద్దు. అలాగే పాలతో చేసిన పనీర్ అయినా సరే పుల్లటి వాసన వస్తుంటే అది సహజమైనదే అయినా తాజాగా లేదని అర్థం. దానిని కూడా కొనకూడదు.నిర్ధారిత అధీకృత ముద్ర, కంపెనీ ప్యాకింగ్ ఉన్న పనీర్ కొనేటప్పుడు కూడా దాని కాల పరిమితిని సరి చూసుకోవాలి. ఎక్స్పైరీ డేట్ చూడకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ కొనకూడదు.పాల ఉత్పత్తిని మించిన పాల ఉత్పత్తులు మార్కెట్లో రాజ్యమేలుతున్నాయి. పాల వ్యాపారులు ఒకప్పుడు పాలను కల్తీ చేసేవాళ్లు. ఇప్పుడు నకిలీ పాలను తయారు చేస్తున్నారు. మనం ఏం తింటున్నామో? ఎక్కడ తింటున్నామో? ఎల్లవేళలా జాగ్రత్తగా ఉండాలి. మన గురించి మనమే నిశితంగా పరిశీంచుకోవాలి, పరీక్షించుకోవాలి.
Shehnaz Habib: 'ప్రయాణాల వెనుక రాజకీయాలు'.. ఉంటాయని తెలుసా..!
వేసవి వస్తే ప్రయాణాలు గుర్తుకు వస్తాయి. విమానం ఎక్కితే మొబైల్ ఫోన్‌ను ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఉంచాలి. కాని ఈ ప్రయాణాల వెనుక చాలా రాజకీయాలు ఉంటాయంటోంది షెహనాజ్ హబీబ్. అమెరికాలో ప్రొఫెసర్‌గా ఉన్న ఈ కేరళ వనిత స్థానిక సంపదను ‘డిస్కవరీ’ చేయడానికే సామ్రాజ్యవాదులు ప్రయాణాలు చేశారని చెబుతుంది. సగటు మనిషి ప్రయాణాలకు ఎన్ని అడ్డంకులున్నాయో ఆమె పుస్తకం ‘ఎయిర్‌ప్లేన్ మోడ్’ విశదంగా తెలియజేస్తోంది. ట్రావెల్ రైటర్ షెహనాజ్ పరిచయం.‘ప్రయాణాల్లో కూడా వివక్ష ఉంటుంది’ అంటుంది షహనాజ్ హబీబ్. ‘మీ ఒంటి రంగు, మీ పాస్‌పోర్ట్ రంగు మీ ప్రయాణం సులభం చేయవచ్చో, జటిలం చేయవచ్చో నిర్ణయిస్తాయి’ అంటుందామె. అమెరికాలోని బే పాత్ యూనివర్సిటీలోప్రొఫెసర్గా పని చేసే షహనాజ్ హబీబ్ కేరళలోని ఎర్నాకుళంలో ఒక సామాన్య కుటుంబంలో జన్మించింది. కాని ఆమె నేర్చిన ఇంగ్లిష్ భాష, ఆమె వ్యక్తీకరణ ఆమెకు విశేషమైన గుర్తింపు తెచ్చి పెట్టింది. అమెరికాలోని వ్యాసకర్తల్లో ఆమెకు గుర్తింపు ఉంది. న్యూయార్క్ టైమ్స్‌లో షహనాజ్ హబీబ్ వ్యాసాలు వస్తాయి.కేరళ రచయిత బెన్యమిన్ రాసిన ఒక నవలను ‘జాస్మిన్ డేస్’ పేరున షహనాజ్ మలయాళంలో అనువదిస్తే ప్రతిష్టాత్మక 25 లక్షల రూపాయల జె.సి.బి. పురస్కారం లభించింది. కవిత్వం, కథలతో పాటు ట్రావెలోగ్స్ కూడా రాసే షహనాజ్ ఇటీవల వెలువరించిన యాత్రా కథనం ‘ఏరోప్లేన్ మోడ్’. అమెరికాలోనూ ఇండియాలోనూ విడుదలైన ఈ పుస్తకం యాత్రల విషయంలో కొత్త చూపును కలిగిస్తోంది.‘ప్రపంచ దేశాల పర్యటనలు తెల్లవాళ్లకు ఒక రకంగానూ రంగు తక్కువ ఆసియా, ఆఫ్రికా దేశాల వారికి ఒక రకంగానూ జరుగుతాయి. అమెరికా, యూరప్ దేశాల వారి తెల్లరంగు చూడగానే వారి ప్రయాణాలకు ఒక విలువ, గౌరవం ఉన్నాయని భావిస్తారు. వారిని అధికారులు చూసే పద్ధతి వేరుగా ఉంటుంది. అదే బ్రౌన్, బ్లాక్ కలర్ ఉన్నవారికి అన్నీ ఆటంకాలే. ఇక అమెరికా పాస్‌పోర్ట్ ఉండి, వారు తెల్లవారైతే వారికి వీసా క్యూలన్నీ లేనట్టే. అమెరికా పాస్‌పోర్ట్ ఉంటే చాలా దేశాలకు అసలు వీసాయే అక్కర్లేదు. అంటే ఒక మనిషికి ప్రయాణ గౌరవం పాస్‌పోర్ట్ వల్లే వస్తోందన్న మాట. దీనినే నేను పాస్పోర్టిజమ్ అంటాను’ అంటుంది షహనాజ్.సంస్కృతి, సంపదల కోసం..‘17, 18 శతాబ్దాల్లో యాత్రీకులకు యూరప్ ప్రభుత్వాలు నిధులు ఇచ్చేవి. అలా ఇచ్చేది యాత్రికులను గౌరవించడానికి కాదు. వారు దేశ దేశాలు తిరిగి అక్కడి సంస్కృతులు, పంటలు, డబ్బు, బంగారం, వస్త్రాలు, మతాలు... వీటన్నింటి గురించి సమాచారం తెస్తే ఏ దేశాన్ని ఏ విధంగా కబళించవచ్చో ఆ ప్రభువులకు తెలిసేది. ఖండాలు, దేశాలు వాటిలోని ప్రజలు అనాదిగా జీవిస్తున్నా ఈ యూరోపియన్ యాత్రికులు వారిని ‘డిస్కవరీ’ చేశామని చరిత్రలు రాసుకున్నారు. కాని ఆ చరిత్రల్లో స్థానికులను ఏ విధంగా తుడిచి పెట్టారో ఉండదు.అలాగే ఇప్పుడు బ్రిటన్, యూరప్, ఆస్ట్రేలియా, జపాన్ల నుంచి ప్రపంచం తిరిగే పర్యాటకులకు వారి దేశాల్లోని పాఠ్య పుస్తకాల్లో తమ దేశాలు ఏయే దేశాలను ఎలా ఆక్రమించాయి, ఎలా దోచుకున్నాయో తెలియజేయరు. యాత్రల వెనుక చాలా చరిత్ర ఉంటుంది. అది తెలుసుకోవడం అవసరం’ అంటుంది షహనాజ్.ఎన్నో అందాలు..‘టూరిజమ్‌ను ఒక వ్యసనంగా మార్చారు. దీని వెనుక చాలా వ్యాపార ఎత్తుగడ ఉంది. కొత్త ప్రాంతాలు చూడకపోతే వెనుకబడతారనే భావజాలం సృష్టించారు. మా నాన్న ఎక్కడికీ తిరగడానికి ఇష్టపడేవాడు కాదు. మా అమ్మకు కొత్త ప్రాంతాలు చూడటం ఇష్టం. ఇద్దరూ కరెక్టే. ఈ టూరిజమ్‌లో కూడా తెల్లవారి దేశాలకే గిరాకీ ఎక్కువ. కాని ఆఫ్రికాలో ఎన్నో అందమైన దేశాలు ఉన్నాయి. ఇథియోపియాలోని అండర్‌గ్రౌండ్ చర్చ్‌లను చూస్తే మతి పోతుంది. కాని వాళ్లకు ప్రమోట్ చేసుకోవడానికి డబ్బు లేదు. ప్రతి దేశంలో సాంస్కృతిక చిహ్నాలుంటాయి. వాటి ఘన చరిత్ర ఉంటుంది. అయితే దానిని వర్తమానంలో ప్రతీకారాలకు ఉపయోగించకూడదు’ అంటుందామె. – షెహనాజ్ హబీబ్
Dr Evita Fernandez: సిజేరియన్లను తగ్గించడమే లక్ష్యం...
‘‘ప్రసవం స్త్రీకి పునర్జన్మ లాంటిది. ఆ మరుజన్మ ఆమెకు ఎంతో ఆనందకరమైన అనుభూతిగా జీవితాంతం మిగిలి΄ోవాలి. అందుకోసమే నా కృషి’ అన్నారుహైదరాబాద్లోని ఫెర్నాండేజ్ హాస్పిటల్స్ చెయిర్‌పర్సన్, ప్రసూతి వైద్యురాలు డాక్టర్ ఎవిటా ఫెర్నాండేజ్. ప్రసవ సమయంలో కీలకమైన మంత్రసానుల ఆవశ్యకతను గుర్తించి చేపట్టిన శిక్షణా కార్యక్రమాలతో ΄ాటు గర్భిణులకు ప్రీ చైల్డ్ బర్త్ అవేర్నెస్ క్లాసులను నిర్వహిస్తున్నారు. భారతదేశంలో మిడ్వైఫరీ వ్యవస్థకు నాయకత్వం వహిస్తున్న ఈ డాక్టర్ 2011లో తెలంగాణలో మొట్టమొదటి ్ర΄÷ఫెషనల్ మిడ్వైఫరీ సర్వీసెస్ ్ర΄ారంభించారు. మే5 ‘ఇంటర్నేషనల్ మిడ్వైఫ్ డే..’ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని డాక్టర్ ఎవిటాను కలిసినప్పుడు మాతాశిశు సంరక్షణలో మంత్రసానుల కీలక ΄ాత్ర, గర్భిణులకు అవగాహన కలిగించే ఎన్నో విషయాలను తెలియజేశారు. ‘‘సాధారణ ప్రసవాలను ్ర΄ోత్సహించాలి. అవసరం లేని సిజేరియన్స్ శాతాన్ని తగ్గించాలి. మాతా, శిశు సంరక్షణే ధ్యేయంగా పనిచేయాలన్నదే మా ప్రధాన ఉద్దేశ్యం. ఈ ఐదేళ్లలో సిజేరియన్ల శాతం బాగా తగ్గించగలిగాం. దీనికి గర్భిణుల్లో అవగాహన కల్పించడానికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నాం. మహిళలు తమ శరీరం గురించి అర్ధం చేసుకుని, భయాలు తొలగి΄ోయేలా, ప్రసవానికి సంబంధించి వీలైనంత అవగాహన పెంచుకుంటే ఒత్తిడిని తగ్గించుకొని ఎన్నో సమస్యల నుంచి బయటపడవచ్చు. గర్భం దాల్చిన ప్రతి స్త్రీకి ప్రసవం గౌరవప్రదంగా, ఆనందకరమైన అనుభవంగా మారాలి. అందుకు తగిన ప్రణాళికలు ఎప్పుడూ చేస్తుంటాం.ప్రసూతి సేవలకు వెన్నెముకమంత్రసాని వ్యవస్థ స్త్రీ చుట్టూ, స్త్రీల కోసం కేంద్రీకృతమైంది. గర్భవతికి మద్దతు, గోప్యత, విశ్వాసం కలిగిస్తుంది. 2007 నాటికి ఏడాదికి 5వేలకు పైగా డెలివరీ చేసేవాళ్లం. ఎంతోమంది గర్భిణులు ముఖ్యంగా చిన్నవయసు వారిలో ప్రసవ సమయంలో వచ్చే సమస్యలు నన్ను బాగా కలిచి వేసేవి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ప్రసూతి మరణాల గురించి చదవడం, తెలుసుకోవడంపై దృష్టి పెట్టాను. అప్పటిదాకా మేం అనుసరించిన ప్రసవ పద్ధతుల్లో మార్పులు అవసరం అని గ్రహించాను. ఈ క్రమంలో ప్రసూతి మరణాల రేటు తక్కువ ఉన్న దేశాలు మిడ్వైఫరీ వ్యవస్థను బలోపేతం చేస్తున్నారని తెలిసింది. అయితే, మన దేశంలో ఆ వెసులుబాటు లేదు. ఒకప్పుడు గ్రామాల్లో ఒక అనుభవం ఉన్న మంత్రసాని ఉండేది. తల్లిలా చూసుకునే అనుభవజ్ఞురాలైన మంత్రసాని దేశంలోని అన్ని ఆసుపత్రులలో ఉండటం అత్యవసరం అనిపించింది. దీని ద్వారా ఎక్కువ మంది మహిళలకు అత్యున్నత స్థాయి గల ప్రసూతి సంరక్షణ అవకాశాన్ని కలిగించవచ్చని అనిపించింది. అలాగే, అనవసరమైన సిజేరియన్లు తగ్గించడానికి కూడా ఈ ప్రక్రియ ఎంతగానో దోహపడుతుంది.తెలంగాణలో..ఈ ఆలోచన చేసిన వెంటనే వెనకడుగు వేయకుండా 2011లో రెండేళ్ల అంతర్గత ్ర΄÷ఫెషనల్ మిడ్వైఫరీ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (పిఎమ్ఇటి) ్ర΄ోగ్రామ్ను ్ర΄ారంభించాం. మొదట పైలట్ ్ర΄ాజెక్ట్ పూర్తి చేశాం. ఆ తర్వాత ప్రభుత్వంతో కలిసి హెల్త్‌కేర్ ఎకో సిస్టమ్‌లో మంత్రసానుల ప్రవేశం మొదలైంది. 2018లో ఫెర్నాండేజ్ ఫౌండేషన్, తెలంగాణ ప్రభుత్వం, యునిసెఫ్ సహకారంతో రాష్ట్ర ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ నుండి నర్సుల కోసం మిడ్‌వైఫరీలో 18 నెలల సర్టిఫికేషన్ కార్యక్రమాన్ని ్ర΄ారంభించాం. మిడ్‌వైఫ్స్ కోసం రూ΄÷ందించిన ఈ కోర్సు తెలంగాణలోనే మొట్టమొదటిది. మొదట తెలంగాణలోని పది మారుమూల ఆసుపత్రుల్లో 30 మంది నర్సులకు మిడ్‌వైఫరీలో శిక్షణ ఇవ్వడం, ప్రసూతి సంరక్షణలో గేమ్ ఛేంజర్‌గా నిరూపించబడింది. ఇప్పుడు తెలంగాణలో సహజ ప్రసవాల శాతం పెరుగుతుంది. ఈ పని ద్వారా ఎంతో సంతృప్తి కలుగుతుంది.ఆంధ్రప్రదేశ్‌లో..ఇటీవలే పీఎమ్టీ ్ర΄ోగ్రామ్ ఆంధ్రప్రదేశ్‌లోనూ ్ర΄ారంభించాం. యునిసెఫ్, డబ్ల్యూహెచ్‌వో, బర్మింగ్హమ్ యూనివర్శిటీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం. మొదటగా తెనాలిలో ఈ ్ర΄ాజెక్ట్ పూర్తయ్యింది. తర్వాత సి–సేఫ్ ్ర΄ాజెక్ట్స్ జిజిహెచ్ రాజమహేంద్రవరం, జిజిహెచ్ ఏలూరు, జిజిహెచ్ మచిలీపట్నం, డిహెచ్ అనకాలపల్లిలో చేయబోతున్నాం.విస్తరణ వైపుగా... నవాబుల కాలంలో హైదరాబాద్‌లో మా అమ్మ నాన్నలు లెస్లీ, లౌర్డెస్ ఫెర్నాంyð జ్లు రెండు పడకలతో ఫెర్నాండెజ్ ఆసుపత్రిని ్ర΄ారంభించారు. ఆ రోజుల్లో మాతా, శిశు మరణాలను చూసి వాటిని అడ్డుకోవాలనే సదాశయంతో ఏర్పాటు చేసిన ఆసుపత్రి ఆ తర్వాత నేను బాధ్యతలు తీసుకునే నాటికి 30 పడకలకు పెరగింది. స్త్రీ వైద్య నిపుణురాలిగా, నిర్వాహకురాలిగా నా బాధ్యతలను విస్తరిస్తూ వస్తున్నాను. ఫలితంగా ఫెర్నాండేజ్ హాస్పిటల్స్ నేడు 300 పడకల సామర్థ్యంతో మూడు ఆసుపత్రులు, రెండు ఔట్ పేషెంట్ క్లినిక్‌లు, నర్సింగ్ స్కూల్‌కి పెరిగింది. ఈ క్రమంలో వారి ఆశయాన్ని నిలబెట్టడానికి ఎంతో కృషి జరిగింది. మాతా, శిశు సంరక్షణపై దృష్టి సారించి వారి ఆరోగ్య సంరక్షణ, వైద్య విద్య, పరిశోధన వైపుగానూ విస్తరించింది’’ అని వివరించారు. – నిర్మలారెడ్డి ఫొటోలు: మోర్ల అనీల్‌కుమార్
ఆస్ట్రాజెనెకాకు మరో షాక్, ఈ వాక్సీన్‌తోనే బిడ్డను కోల్పోయా ఓ తండ్రి కోర్టుకు
కోవిడ్ వ్యాక్సీన్‌ను తయారు చేసిన ప్రముఖ ఫార్మా కంపెనీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత తమ కుమార్తె చనిపోయిందని ఆరోపిస్తూ ఒక యువతి తల్లిదండ్రులు సెరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII)పై దావా వేశారు. బ్రిటన్‌కి చెందిన ఫార్మా దిగ్గజంపై పిటీషన్ దాఖలు చేశారు.ఇటీవల ఫార్మా సంస్థ ఆస్ట్రాజెన్‌కా తమ వ్యాక్సిన్ వల్ల రక్తం గడ్డ కట్టడం, తక్కువ ప్లేట్ లెట్ కౌంట్‌కి సంబంధించి అరుదైన దుష్ప్రభావాల ఆరోపణలు, వీటిని ఆస్ట్రాజెన్‌కా కూడా అంగీకరించిన తరువాత ఈ పరిణామం చోటుచేసుకుంది. కారుణ్య పుట్టిన రోజు మే 1. మా తొలి వివాహ వార్షికోత్సవ గిప్ట్ నా పాప. ఇపుడు అందనంతదూరంలో- వేణుగోపాల్ తమ 20 ఏళ్ల కుమార్తె కారుణ్య కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ తర్వాత జూలై 2021లో మరణించిందని తండ్రి వేణుగోపాలన్ గోవిందన్ ఎక్స్‌లో ఆరోపించారు. డేటా సైన్స్ స్టూడెంట్ కారుణ్య టీకా తీసుకున్న ఒక నెల తర్వాత అనారోగ్యానికి గురైంది. వారం రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన తర్వాత ఆమె మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమెటరీ సిండ్రోమ్ కారణంగా మరణించింది. వ్యాక్సిన్ తీసుకున్న 8 రోజుల తర్వా ఆమె తీవ్రమైన సంస్యల బారినపడిందని, నెల తర్వాత మరణించిందని తండ్రి వేణుగోపాల్ గోవిందన్ ఆరోపించరాఉ. వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందు ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉందని పేర్కొన్నారు.అలాగే ఇంత నష్టం జరిగిన తరువాత ఆస్ట్రాజెన్‌కా తప్పు ఒప్పుకోవడంపై వేణుగోపాలన్ మండి పడ్డారు. రక్తం గడ్డకట్టడం వల్ల సంభవించే మరణాలపై 15 యూరోపియన్ దేశాలు వ్యాక్సీన్ వినియోగాన్ని పరిమితం చేసిన తర్వాత సీరం ఇన్స్టిట్యూట్ వ్యాక్సిన్ సరఫరాని నిలిపేయాల్సి ఉండాల్సిందని ఆయన అన్నారు. తల్లిదండ్రులు న్యాయం కోసం వివిధ న్యాయస్థానాల్లో పోరాడుతున్నప్పటికీ విచారణకు నోచుకోవడం లేదని తన పోస్టులో పేర్కొన్నారు. 8 మంది బాధిత కుటుంబాల తరుపున తమ భావాలను ప్రతిధ్వనిస్తున్నామని వెల్లడించారు. ప్రాణాలు కోల్పోయినందుకు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మరియు అదార్ పూనావాలా వారి పాపాలకు సమాధానం చెప్పవలసి ఉంటుందని అన్నారు. అలాగే వ్యాక్సిన్‌ని వినియోగంలోకి తీసుకువచ్చిన ప్రభుత్వ అధికారులను కూడా ఆయన నిందించారు. ఈ మేరకు వేణుగోపాలన్ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. అయితే దీనిపై సీరం నుంచి ఎలాంటి స్పందన రాలేదు.Thanks to @Teensthack for this article. 🙏I missed to tell Teena that today (May 1st) is Karunya's birthday and she was the first wedding anniversary gift to me and my wife from the heavens. 😭Perhaps due to editorial/space constraints few core points I gave missed to make… pic.twitter.com/bjJjHOc1aM— Venugopalan Govindan (@gvenugopalan) May 1, 2024 2021లో తమ కుమార్తె రితైక(18)ను కోల్పోయిన రచనా గంగూ కుమార్తె మరణంపై విచారణ జరిపేందుకు మెడికల్ బోర్డును నియమించాలని కోరుతూ గతంలో సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలులు చేశారు. ఆస్ట్రాజెనెకా ఇప్పటికే యూకేలో క్లాస్ యాక్షన్ దావాను ఎదుర్కొంటోంది.కాగా వ్యాక్సిన్ వల్ల థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ (TTS)తో థ్రాంబోసిస్‌తో సహా మరణాలు మరియు తీవ్రమైన గాయాలు సంభవించాయని ఆరోపిస్తూ క్లాస్-యాక్షన్ దావా నుండి చట్టపరమైన చర్యను ఎదుర్కొంటోంది ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంతో కలిసి అభివృద్ధి చేసిన కోవిడ్-19 ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను భారతదేశంలో సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) ‘కోవిషీల్డ్’ పేరుతో తయారు చేసి, విక్రయించిన సంగతి తెలిసిందే.
క్రైమ్
ముంబైలో వేట్టయాన్
ముంబైలో అమితాబ్ బచ్చన్‌ను కలిశారు వేట్టయాన్. రజనీకాంత్ హీరోగా ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘వేట్టయాన్’ (వేటగాడు). అమితాబ్ బచ్చన్, ఫాహద్ ఫాజిల్, రానా ఇతర లీడ్ రోల్స్‌లో దుషారా విజయన్, మంజు వారియర్, రితికా సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఇది. తాజాగా ‘వేట్టయాన్’ చిత్రీకరణ ముంబైలో ప్రారంభమైంది.రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ పాల్గొంటుండగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. గతంలో హైదరాబాద్‌లో జరిగిన ‘వేట్టయాన్’ షూటింగ్ షెడ్యూల్లో రజనీ, అమితాబ్ కాంబినేషన్ సీన్స్ తీశారు. ఇప్పుడు ముంబైలో వీరిద్దరి కాంబినేషన్ సీన్స్‌ను తీస్తున్నారు. బూటకపు ఎన్కౌంటర్స్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టాక్.
ఎన్నికల తనిఖీలు: భారీగా బంగారం, వెండి పట్టివేత
సాక్షి,హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో పోలీసులు భారీగా బంగారం, వెండి జ్యువెల్లరీని పట్టుకున్నారు. శుక్రవారం(మే3)న పోలీసులు విమానాశ్రయం సమీపంలో తనిఖీలు చేస్తుండగా ఓ కారులో 34 కిలోల బంగారం, 40 కిలోల వెండి ఆభరణాలు పట్టుబడ్డాయి.సరైన పత్రాలు లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆభరణాలను ముంబై నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు గుర్తించారు.
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. మరో వ్యక్తి అరెస్ట్
గత కొన్ని రోజులుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో అంశం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ‘డీప్ ఫేక్ మార్ఫింగ్ వీడియో’ కేసులో అరుణ్ రెడ్డిని ఢిల్లీ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.అరుణ్ రెడ్డిని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'స్పిరిట్ ఆఫ్ కాంగ్రెస్' అనే ఎక్స్ (ట్విటర్) అకౌంట్ హ్యాండిల్ చేసేవారు. ఇటీవల విడుదలైన డీప్ ఫేక్ మార్ఫింగ్ వీడియో దేశంలోని రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బీజేపీ నిలుస్తుందని కేంద్ర హోం మంత్రి చెప్పినట్లు వినిపిస్తోంది. ఈ వైరల్ వీడియో క్లిప్ ఫేక్ అని బీజేపీ స్పష్టం చేసింది.డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన తరువాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ)లోని వివిధ సెక్షన్ల కింద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు నలుగురు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) సభ్యులకు (శివ కుమార్ అంబాల, అస్మా తస్లీమ్, సతీష్ మన్నె, నవీన్) పోలీసులు గతంలో సమన్లు జారీ చేశారు.అయితే కేంద్ర హోం మంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియో పోస్ట్ చేసి అరెస్టయిన ఐదుగురు కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులకు నాంపల్లి కోర్టు బెయిల్ ఈ రోజు (శుక్రవారం) కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇప్పుడు అరుణ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.Delhi Police arrest Arun Reddy, who handles the 'Spirit of Congress' X account, in the Union Home Minister Amit Shah doctored video case: Delhi Police pic.twitter.com/gB5L6Pzcbp— ANI (@ANI) May 3, 2024
ముందస్తు బెయిల్ ఇవ్వండి: కోర్టులో రేవణ్ణ పిటిషన్
బెంగళూరు: ఒక మహిళ కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి హెచ్డి రేవణ్ణ ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. బెయిల్ కోసం బెంగళూరు సెషన్స్‌కోర్టులో శుక్రవారం(మే3) పిటిషన్ వేశారు. తన తల్లిని రేవణ్ణ ఎత్తుకుపోయారని రేవణ్ణ ఫామ్‌హౌజ్‌లో పనిచేసే యువకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బెంగళూరులోని కేఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో రేవణ్ణపై ఎఫ్ఐఆర్ నమోదైంది. కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల(సెక్స్ స్కాండల్) వీడియోల కేసులో రేవణ్ణ శుక్రవారం సిట్ ముందుకు రావాల్సి ఉండగా ఆయన గైర్హాజరయ్యారు.