Top Stories
ప్రధాన వార్తలు
మీ భూమికి భద్రత.. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై బాబు దుష్ప్రచారం: సీఎం జగన్
సాక్షి, పుట్టపర్తి: ‘చంద్రబాబునాయుడు అవగాహన రాహిత్యంతో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై అబద్ధాలు వల్లించడం సిగ్గుచేటు. జగన్ భూములు లాక్కుంటున్నాడంటూ దుష్ప్రచారం చేయడం ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. పేదలకు భూములిచ్చేది జగన్ అయితే.. లాక్కునేది చంద్రబాబు అనే విషయం అందరికీ తెలుసు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌తో రైతులు ఎవరి చుట్టూ తిరగాల్సిన పని ఉండదు. భూ తగాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు వందేళ్ల తర్వాత భూముల రీ సర్వే చేపట్టాం. రైతుల భూముల భద్రతకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. ఎలాంటి వివాదం లేని టైటిల్స్ ప్రతి ఒక్కరి దగ్గరా ఉండాలన్నదే మీ బిడ్డ లక్ష్యం. అందుకనే టైటిల్ ఇన్సూరెన్స్ కూడా చేస్తున్నాం. రిజిస్ట్రేషన్ తర్వాత రైతులకే డాక్యుమెంట్లు అందజేస్తాం. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై అవగాహన లేకుండా చంద్రబాబు మాట్లాడటం దుర్మార్గం’ అని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలోని అంబేడ్కర్ సర్కిల్లో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై ప్రచారంలో ఉన్న అపోహలను తొలగిస్తూ స్పష్టతనిచ్చారు.రిజిస్ట్రేషన్లపైనా చంద్రబాబు బురదరిజిస్ట్రేషన్లకు సంబంధించి కూడా చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్లు చేసేటప్పుడు ఫిజికల్ డాక్యుమెంట్లు ఇవ్వడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అయ్యా చంద్రబాబూ..! ఇప్పటివరకు ఏకంగా 9 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి. దేశవ్యాప్తంగా అమలవుతున్న కార్డ్ 2 సాఫ్ట్వేర్ ద్వారా తొమ్మిది లక్షల రిజిస్ట్రేషన్లు చేయడమే కాకుండా ఆ తర్వాత డాక్యుమెంట్లు అన్నీ భూ యజమానులకే ఇచ్చాం. దీన్ని మరింత సులభతరం చేస్తూ.. ఏ ఒక్కరికీ సమస్య ఉండకూడదని, పత్రాలు రాసుకునేటప్పుడు తప్పులు ఉండకూడదని ఆ ఫార్మాట్ కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉంచాం. ఎవరైనా అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా ఆ ఫార్మాట్ డౌన్లోడ్ చేసుకుని వివరాలు నింపి డాక్యుమెంట్లతో వెళితే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వేలి ముద్రలు లాంటి మిగతా ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ పూర్తి అయిన తర్వాత ఫిజికల్ డాక్యుమెంట్లు రైతులకే ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతోందని చంద్రబాబు తెలుసుకోవాలి. పెద్ద సంస్కరణ అవుతుంది..ఎన్నికల వేళ చంద్రబాబు యథేచ్ఛగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై అవగాహన లేకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. టీడీపీ నాయకులు ఐవీఆర్ఎస్ ద్వారా మీ ఇళ్లకు ఫోన్లు చేసి మీ భూములన్నీ జగన్ లాక్కుంటాడంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. ఇంత దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు అసలు మనిషేనా? మీ జగన్ భూములిచ్చేవాడే కానీ భూములు లాక్కునే వాడు కాదు. నీకు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే తెలుసా చంద్రబాబూ? ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే భూముల మీద సంపూర్ణ హక్కులు ఎల్లవేళలా రైతన్నలకు ఉండేటట్లు చేయడమే. చంద్రబాబు అవగాహన లేకుండా మాట్లాడుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ యాక్ట్ రాబోయే రోజుల్లో పెద్ద సంస్కరణ అవుతుంది. ఈరోజు ఎక్కడ భూమి కొనుగోలు చేయాలన్నా వివాదాలు తలెత్తుతున్నాయి. విస్తీర్ణం తక్కువ ఉండటం, సబ్ డివిజన్, సర్వే జరగకపోవడం, రికార్డులు అప్డేట్ కాకపోవడం తదితర సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వీటన్నింటి కారణంగా భూ వివాదాలు పెరిగి రైతన్నలు, ప్రజలు కోర్టులు, అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.వివాదాలు లేకుండా.. టైటిల్ ఇన్సూరెన్స్‌రాబోయే రోజుల్లో ఏ రైతూ, ఏ ఒక్కరూ వాళ్ల భూములు కోసం ఎవరి చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండకూడదు. భూ వివాదాలకు సంబంధించి ఏ కోర్టుకూ వెళ్లాల్సిన అవసరం రాకూడదు. ఆ భూముల మీద వారికి సంపూర్ణ హక్కులు కల్పిస్తూ వాటిపై ఏవైనా వివాదాలు ఉంటే ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది. ఆ భూముల మీద ఎలాంటి వివాదం లేదని గ్యారంటీ ఇస్తూ ఒక సంస్కరణ తేవాలన్నదే మీ జగన్ ఆలోచన. అందుకనే టైటిల్ ఇన్సూరెన్స్ కూడా చేస్తున్నాం. ఎలాంటి వివాదం లేని టైటిల్స్ ప్రతి ఒక్కరి దగ్గరా ఉండాలన్నదే మీ బిడ్డ లక్ష్యం. కానీ ఇది జరగాలంటే మొదట రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న సర్వే పూర్తి కావాలి. దేశంలో వందేళ్ల క్రితం ఆంగ్లేయుల హయాంలో భూముల సర్వే చేశారు. రైతుల కోసం ఈ రోజు మళ్లీ ప్రతి ఎకరా రీ సర్వే చేస్తున్నాం. 15 వేల మంది సర్వేయర్లను నియమించాం. ఉచితంగా సరిహద్దు రాళ్లను నాటి రికార్డులన్నీ అప్డేట్ చేస్తున్నాం. సబ్ డివిజన్ చేసి ఆ హక్కు పత్రాలను పదిలంగా రైతన్నలకు అందచేస్తున్నాం. రాష్ట్రంలో 17 వేలకు పైగా రెవెన్యూ గ్రామాలకుగానూ ఇప్పటివరకు 6 వేల రెవెన్యూ గ్రామాల్లో సర్వే పూర్తయ్యింది. మిగతా చోట్ల ఒకటిన్నర, రెండేళ్లలో సర్వే పూర్తవుతుంది.
తోడేళ్ళను తరిమే రోజు!
ఒక్కసారి మనం డెబ్బయ్యేళ్లు వెనక్కు వెళ్లాలి. వర్తమాన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మనల్ని ఆ జ్ఞాపకం వైపు బలవంతంగా నెడుతున్నాయి. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి 1953లో ఆంధ్ర రాష్ట్రం విడిపోయింది. తెలంగాణతో కలిసి ఇంకా ఆంధ్ర ప్రదేశ్‌గా అవతరించకముందు 1955లో శాసనసభకు మధ్యంతర ఎన్నికలు జరిగాయి. నాటి ఆంధ్ర రాష్ట్రం, నేటి ఆంధ్ర ప్రదేశ్ల భౌగోళిక స్వరూపం ఒక్కటే!ఆ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో కమ్యూనిస్టుల ప్రభంజనం కనిపించింది. అప్పటిదాకా ప్రపంచంలో ఎక్కడా కూడా కమ్యూనిస్టులు బ్యాలెట్ ద్వారా అధికారంలోకి వచ్చిన ఉదంతాలు లేవు. ఆ విషయంలో ఆంధ్ర రాష్ట్రం రికార్డు సృష్టించ బోతున్నదనే అంచనాలు వెలువడ్డాయి. ముఖ్యమంత్రిగా సుందరయ్య, హోంమంత్రిగా చండ్ర రాజేశ్వరరావు, ఆర్థిక మంత్రిగా మాకినేని బసవపున్నయ్య వగైరా పేర్లతో కేబినెట్ కూర్పుపై కూడా ప్రచారం జరిగింది. సరిగ్గా ఈ దశలోనే పెత్తందారీ ముఠా, వారి అజమాయిషీలోని మీడియా రంగప్రవేశం చేశాయి.అప్పట్లో దున్నేవానికే భూమి అనేది కమ్యూనిస్టుల నినాదం. ఆ మేరకు భూసంస్కరణలు అమలు చేస్తామని వారు వాగ్దానం చేశారు. ఇది చాలు పెత్తందార్లకు! వారి చేతుల్లో వున్న ‘ఆంధ్రపత్రిక’, ‘ఆంధ్రప్రభ’ వంటి ఆనాటి ప్రముఖ పత్రికలు ఆయుధాలు బయటకు తీశాయి. కమ్యూనిస్టులు గెలిస్తే రైతుల భూములను లాక్కుంటారు. కమ్యూనిస్టులు గెలిస్తే ప్రజల ఇళ్లలో ఉన్న డబ్బును, బంగారాన్ని ఎత్తుకుపోతారు. వృద్ధులు పని చేయలేరు కనుక వారిని ప్రత్యేక క్యాంపుల్లో పెడతారు లేదా చంపేస్తారు. రష్యాలో, చైనాలో ఇలాగే చేస్తున్నారు. చివరికి మీ భార్యల్ని కూడా జాతీయం చేస్తారు. కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్న మవుతుంది... ఈ రకమైన అభాండాలను అచ్చేసి అడ్డగోలుగా ప్రచారంలో పెట్టారు.ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేంత పబ్లిసిటీ దన్ను ఆనాడు కమ్యూనిస్టులకు లేదు. వాళ్లకున్నది ‘విశాలాంధ్ర’ ఒక్కటే. పార్టీ ముద్ర కారణంగా దానికీ పరిమితులున్నాయి. ఇటువంటి నిస్సహాయ స్థితిలోనే మహాకవి శ్రీశ్రీ గుండెలోంచి తన్నుకొచ్చిన ఆక్రోశం చాలామందికి గుర్తున్నది. ‘పెట్టుబడికీ కట్టుకథకూ పుట్టిన విషపుత్రిక ఆంధ్రపత్రిక’ అని ఈసడించుకున్నారు. నాటి ‘ఆంధ్రపత్రిక’, ‘ఆంధ్రప్రభ’ల అరాచకాన్ని ఒక లక్షతో హెచ్చ వేస్తే నేటి ‘ఈనాడు’, ‘ఆంధ్రజ్యోతి’, ‘టీవీ5’, ‘ఏబీఎన్’, ‘ఈటీవీ’ల అరాచకం విలువెంతో తెలుస్తుంది. ఆ ప్రత్యేక సందర్భం తర్వాత∙నాటి పత్రికలు మళ్లీ తటస్థ స్థితికి చేరు కున్నాయి. కానీ మన యెల్లో మీడియా మాత్రం గత పదేళ్లుగా ఆదే యజ్ఞంలో తలమునకలై ఉన్నది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని పెత్తందారీ వర్గాల ప్రతినిధిగా, ప్రయోక్తగా, ప్రవక్తగా గడిచిన మూడు దశాబ్దాల్లో చంద్రబాబు ఇంతింతై అన్నట్టుగా ఇనుమడించడం మనకు తెలిసిన సంగతే. ఇదే కాలంలో మన యెల్లో మీడియా చంద్రబాబు తరఫున గ్రామ సింహాల పాత్రను పోషిస్తే, బదులుగా ఆయన వారికి సెక్యూరిటీ గార్డు పాత్రను పోషిస్తూ వస్తున్నారు. ఈ ముప్ప య్యేళ్లలో పధ్నాలుగేళ్లపాటు బాబు ముఖ్యమంత్రి పాత్రను పోషించారు. ఆయనకు వాలతుల్యుడనదగ్గ కిరణ్‌కుమార్ రెడ్డి కాంగ్రెస్ తరఫున నాలుగేళ్లు గద్దె మీద కూర్చున్నారు. రాష్ట్రంలోని పేదల అభ్యున్నతి కోసం, సాధికారత కోసం అమలైన కార్య క్రమాలన్నీ వీరి కాలం మినహా మిగిలిన సమయంలోనే జరగడం ఎవరైనా గమనించవచ్చు.ప్రజలందరికీ విద్య, వైద్యసేవలు అందజేయడం ప్రభుత్వ బాధ్యతగా నాగరిక సమాజం గుర్తిస్తున్నది. ఆ రంగాల్లో సేవలు ప్రభుత్వం బాధ్యత కాదని బాహాటంగా ప్రకటించి, వాటిని ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు నర్తనశాలగా మార్చిన అనాగరిక రాజకీయవేత్త చంద్రబాబు. ఫలితంగా ప్రభుత్వ బడులు కునారిల్లిపోయాయి. పేదలు, మధ్యతరగతి ప్రజలు తమ పిల్లల్ని ప్రైవేట్ బడులకు పంపి అప్పులపాలయ్యారు. నిరు పేదల బిడ్డలు చదువుకు దూరమయ్యారు. ఒక తరం పేద, మధ్యతరగతి వర్గాల కలలను కాటేసిన చరిత్ర చంద్రబాబుది. అలాగే ప్రైవేట్ వైద్యసేవల బలిపీఠాన్నెక్కి లక్షలాది కుటుంబాలు కృశించి, నశించిపోయాయి.వ్యవసాయం దండగనేది ఆయన చేసిన ఒక క్రూర పరిహాసం. ఫలితంగా రైతులు పిట్టల్లా రాలిపోవడం బాబు జమానాలోనే ప్రారంభమైంది. కల్తీ ఎరువులు, కల్తీ విత్తనాలు, నకిలీ మందులకు వ్యవసాయం వేదికైంది. రైతులను భూముల నుంచి వెళ్లగొట్టి వేల ఎకరాల భూములను కార్పొరేట్ శక్తులకు కైంకర్యం చేసే విధానాలను బాబు అవలంబించారు. ఈ క్రమంలోనే ఫిలిం సిటీ పేరుతో రామోజీ దాదాపు మూడువేల ఎకరాలు పోగేశారు. అన్నిరకాల భూచట్టాలూ రామోజీ భూదాహం ముందు చట్టుబండలయ్యాయి. వేలాది ఎకరాల్లో వ్యవసా యాన్ని అటకెక్కించి కార్పొరేట్ సంస్థలు కంచెలు వేసు కున్నాయి. పేదల జీవితాలను కాల్చుకుతింటున్న చంద్ర బాబులో పచ్చమీడియాకు ఓ విజనరీ కనిపించాడు.ఐదేళ్ల కింద ఆంధ్రప్రదేశ్‌లో ఒక తేడా వచ్చింది. చంద్రబాబుకూ, యెల్లో మీడియాకూ అది చిన్న తేడా ఏమీ కాదు. యెల్లో ‘విజనరీ’ విధానాలను కొత్త ముఖ్య మంత్రి జగన్మోహన్రెడ్డి తలకిందులు చేశారు. ప్రజలిచ్చిన అధికారం గుప్పెడుమంది పెత్తందార్ల కోసం కాదు, పురోగ మనం కోసం పోరాడుతున్న విశాల ప్రజానీకం కోసం అనేది ఆయన విధానం. జగన్మోహన్రెడ్డి విధానాలకు, మన పెత్తందారీ ఏజెంట్ల విధానాలకు ఘర్షణ ఏర్పడింది. పెత్తందార్ల కూటమి జగన్ ప్రభుత్వంపై యుద్ధాన్ని ప్రకటించింది. జగన్ ప్రభుత్వ విధానాల వల్ల ఊపిరి పీల్చుకున్న పేదవర్గాల ప్రజలు ఆయన వెనుక సైన్యంగా మోహరించారు. పేదలు – పెత్తందార్ల మధ్య మహాయుద్ధానికి ముహూర్తం ఖాయమైంది.ఈ అయిదేళ్ల కాలంలో జగన్ ప్రభుత్వంపై యెల్లో మీడియా సాగించిన దుష్ప్రచారం అన్ని రికార్డులనూ బద్దలు కొట్టింది. గోబెల్స్ బతికి వుంటే సిగ్గుపడి ఉండేవాడు. శ్రీశ్రీ బతికి ఉంటే ఏమని కామెంట్ చేసేవాడో ఊహించుకోవలసిందే. తిమ్మిని బమ్మిగా, బమ్మిని తిమ్మిగా ప్రచారం చేయని రోజు ఈ అయిదే ళ్లలో ఒక్కటీ లేదు. అయినా ప్రజాభిప్రాయాన్ని యెల్లో మీడియా పెద్దగా ప్రభావితం చేయలేకపోతున్నది. దీంతో వారిలో నిస్పృహ ఆవరించింది. అన్ని విలువల్నీ వదిలేశారు. వస్త్రవిసర్జన చేసి దిగంబర వీధినర్తనం మొదలుపెట్టారు. పోలింగ్ పది రోజులుందనగా తయారుచేసిన రెండు వింత కథల మీద ప్రాణం పెట్టుకుని పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టారు. ఇందులో మొదటిది ఏమాత్రం క్రియేటివిటీ లేకుండా అల్లిన ఓ కట్టుకథ. ‘మీ భూమి మీది కాదు’ అనే పేరుతో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ‘బాధితుల’ కథనాలను ‘ఈనాడు’ అచ్చేసింది. చట్టం పేరులోనే దాని ప్రాముఖ్యత ఉన్నది. భూమిపై రైతుకున్న యాజమాన్య హక్కును గుర్తిస్తూ ప్రభుత్వం హామీ పడి ధ్రువీకరించే చట్టం. ఒకసారి ఈ చట్టం అమలులోకి వస్తే భూ వివాదాలు శాశ్వతంగా పరిష్కారమవుతాయి. దొంగ కాగితాలు సృష్టించి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లిస్తే చార్మినార్‌కు కూడా సేల్ డీడ్ ఇచ్చే అధ్వాన్నమైన పరిస్థితులు ఎన్నిసార్లు ఎదురు కావడం లేదు? నకిలీ డాక్యుమెంట్లతో బ్యాంకులను కొల్లగొట్టే దళారీల వృత్తాంతాలు ఎన్ని బయటకు రావడంలేదు? ఎన్ని వేల భూతగాదాలు కోర్టు వ్యాజ్యాల్లో దశాబ్దాల తరబడి నలిగి పోవడం లేదు? గొడవలతో ఎంత రక్తం పారి ఉంటుంది? ఎన్ని హత్యలు జరిగి ఉంటాయి? ఇదిగో ఇటువంటి వివాదాలను పరిష్కరించే సమగ్ర హక్కులను యజమానికి కల్పించి, అందుకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేదే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్. ఇందులో భాగంగా మొదట భూముల సమగ్ర సర్వే జరుగుతోంది. గ్రామ ప్రజల సమక్షంలో సరిహద్దులను నిర్ధారించి రైతుకు పాస్‌బుక్ ఇవ్వడం జరుగుతుంది. వందేళ్ల తర్వాత సర్వే జరిపి యాజమాన్య హక్కును గుర్తిస్తూ ప్రభుత్వం ఇస్తున్న పాస్‌బుక్ ఇది. ఆ హక్కుకు ప్రభుత్వం ఇస్తున్న గ్యారంటీకి గుర్తుగా సర్వే జరిగిన కాలపు ప్రభుత్వాధినేతగా ముఖ్యమంత్రి ఫోటోను కూడా పాస్‌బుక్‌పై ముద్రిస్తున్నారు. దీన్ని కూడా టీడీపీ – యెల్లో మీడియా వివాదం చేయడం చూస్తున్నాము.అన్ని గ్రామాల్లో సర్వే పూర్తిగా జరిగిన తర్వాత చట్టం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేసి, వాటిపై గ్రామసభల్లో చర్చలు జరిగిన తర్వాత తుది మార్గదర్శకాలు జారీ అవుతాయి. ఆ తర్వాతనే చట్టం అమల్లోకి వస్తుంది.ఇదంతా జరగడానికి ఇంకో ఏడాది పట్టవచ్చు. రెండేళ్లు పట్టవచ్చు. కేంద్ర ప్రభుత్వంలోని ‘నీతి ఆయోగ్’ సూచనలకు అనుగుణంగా ఈ చట్టం రూపకల్పన జరుగుతున్నది. అన్ని రాష్ట్రాల్లోనూ భూయజమానికి మేలు చేసే ఈ చట్టం వచ్చి తీరుతుంది. కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను ముందుకు కదిలించింది. దీన్ని వ్యతిరేకిస్తున్న యెల్లో కూటమి పార్టీ ఎన్డీఏలో భాగంగా ఉన్నది. కానీ ఇంత వరకు ఈ చట్టంపై తమ అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వంతో ప్రస్తావించకపోవడం తెలుగుదేశం అవకాశవాద వైఖరికి పరాకాష్ఠ. పచ్చమీడియా కూడా ఈ చట్టంపై ఒక్క మాటయినా కేంద్రం ప్రస్తావన చేయకపోవడం వెనకనున్న రహస్యమేమిటి?ఇక శనివారం నాడు ‘ఈనాడు’ రాసిన ‘మీ భూమి మీది కాదు’ అనే కల్పిత కథ జర్నలిజం ప్రమాణాలను పాతాళంలోకి తొక్కేసింది. ఇందులో ముగ్గురు బాధితుల పేర్లు రాశారు.అందులో అమలాపురం సుబ్బారావు ఒకరు. ఆయన భూమి ఎక్కడో చెప్పలేదు. సర్వే నెంబర్ తెలియదు. ఆయన భూమి తనదంటూ ఎవరో అధికారులకు దరఖాస్తు చేసుకున్నారట! ఆయనెవరో చెప్పలేదు. ఎవరికి దరఖాస్తు చేశాడో చెప్పలేదు. రెండేళ్ల తర్వాత సుబ్బారావు స్పందించలేదంటూ దరఖాస్తు చేసుకున్న వారి పేరు మీద భూమిని రాసేశారట! ఇదంతా ల్యాండ్ టైట్లింగ్ చట్టం మహత్యమట. అమల్లోకే రాని చట్టం రెండేళ్ల కిందనే పనిచేయడం ప్రారంభించిందని ‘ఈనాడు’ ఉవాచ!ఇక సాంబశివుడిది శ్రీకాకుళం జిల్లాలోని ఒక పల్లెనట! ఈ పల్లె పేరు చెబితే రామోజీ తల వెయ్యి ముక్కలవుతుంది కాబోలు. చెప్పలేదు! ఆయన భూమిని అమ్మడానికి వెళితే, ‘కొత్త రిజిస్టర్లో నీ పేరు లేద’ని అధికారులు చెప్పారట. అసలటు వంటి కొత్త రిజిస్టరు తమ దగ్గర ఏదీ లేదని అధికారులు ప్రకటించారు. గోవిందరెడ్డిది కర్నూలు జిల్లా. ఏ ఊరో చెప్పలేదు. ‘ఈనాడు’ ఆంధ్రా ఎడిషన్‌లోనే ఆయన గోవిందరెడ్డి. తెలంగాణ ఎడిషన్‌లో మాత్రం గోవిందయ్య. అంటే తెలంగాణకు వెళ్లిన ప్పుడల్లా ఆయన కులం తోకను కత్తిరించుకుంటాడు కాబోలు. ఆయన తన భూమిని తనఖా పెట్టాలనుకున్నాడట! బ్యాంకులో ఉండే డిస్ప్యూట్ రిజిస్టర్లో ఆయన పేరు ఉన్నదట! టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గర క్లియరెన్స్ సర్టిఫికెట్ తెమ్మని బ్యాంకు వారు చెప్పారట. దాంతో గోవిందరెడ్డి ఉరఫ్ గోవిందయ్య ఆంధ్రాలో ఒకసారి, తెలంగాణలో ఒకసారి గొల్లుమన్నాడట! అసలు టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అనే పోస్ట్ అమల్లోకే రాలేదు. డిస్ప్యూట్ రిజిస్టరూ లేదు. చదివేవాడు వెర్రి వాడయితే... రాసేవాడు రామోజీ!పెన్షన్ల వ్యవహారంపై తెలుగుదేశం – యెల్లో మీడియాలు నడిపిస్తున్న వ్యవహారంలో మరో వింతకథ. వలంటీర్ వ్యవస్థకే ఈ పెత్తందార్లు వ్యతిరేకం. తమ వ్యతిరేకతను వాళ్లు దాచుకోనూ లేదు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను రాష్ట్ర ప్రజలు గమనించారు. ఇంటి దగ్గరే ఒకటో తారీఖు పొద్దున్నే వలంటీర్లు గత ఐదేళ్లుగా పింఛన్లు అంద జేస్తున్నారు. దాంతో అవ్వాతాతలు, దివ్యాంగులు భరోసాతో బతుకుతున్నారు. వలంటీర్లు విధుల్లో పాల్గొనకుండా చూడాలని తెలుగుదేశం పార్టీ తరఫున వారి ఏజెంటు నిమ్మగడ్డ రమేశ్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనికి యెల్లో మీడియా వంత పాడింది. దాంతో వలంటీర్లు పెన్షన్లు ఇవ్వకూడదని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది.ఈసీ సూచనల మేరకు ఏప్రిల్‌లో విలేజ్ సెక్రటేరియట్లలో పెన్షన్లు అందజేశారు. దీనిపై వృద్ధుల్లో వ్యతిరేకత వచ్చింది. గాభరాపడ్డ తెలుగుదేశం బృందం మళ్లీ నిమ్మగడ్డను పంపించి బ్యాంకు ఖాతాల్లో జమ చేయించాలని ఈసీకి దరఖాస్తు పెట్టారు. ఈసీ సూచనలకు అనుగుణంగా మే నెలలో బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేశారు. ఇక వృద్ధుల బాధలు వర్ణనాతీతం. వారి శాపనార్థాలతో కంగారు పడిన యెల్లో ముఠా వృద్ధుల బాధలకు జగన్ ప్రభుత్వమే కారణమనే విష ప్రచారాన్ని మొదలుపెట్టింది. దొంగతనం చేసినవాడే ‘దొంగా దొంగా’ అని అరిచినట్టు! జగన్మోహన్రెడ్డి సభలకు మండుటెండల్లో కూడా వెల్లువెత్తుతున్న జనప్రవాహంతో కూటమి వణికిపోతున్నది. ఈ రెండు అంశాలపై అబద్ధాలను ప్రచారం చేసి గట్టెక్కాలన్న దింపుడు కల్లం ఆశ దానిలో కనిపిస్తున్నది.ఇంకో వారం రోజుల్లో పోలింగ్ జరగబోతున్నది. ఇది పేద వర్గాలకు అందివచ్చిన అద్భుతమైన అవకాశం. పేద బిడ్డల ఇంగ్లిష్ మీడియంను వ్యతిరేకిస్తున్న, వారి నాణ్యమైన చదువు లను వ్యతిరేకిస్తున్న పెత్తందార్లను చావచితక్కొట్టడానికి ఇదో అవకాశం. పేదల సాధికారతను, మహిళల సాధికారతను సహించలేకపోతున్న పెత్తందార్లను పరుగెత్తించడానికి ఇంకో వారం రోజుల్లో అమూల్యమైన అవకాశం ఉన్నది. బలహీన వర్గాలకు ఉన్నత పదవులు ఇస్తే, ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యే టిక్కెట్లు, ఎంపీ టిక్కెట్లు కేటాయిస్తే ఓర్వలేకపోతున్న పెత్తందార్లకు బుద్ధి చెప్పడానికి ఇదో గొప్ప అవకాశం. అబద్ధాలనూ, అభూత కల్పనలనూ, కట్టుకథలనూ ప్రచారంలో పెడుతూ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమే గాక సమాజంలో అశాంతిని రేకెత్తి స్తున్న పెత్తందారీ తోడేళ్లను తరిమి తరిమి కొట్టడానికి ఇంతకంటే మంచి అవకాశం ఏముంటుంది?వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com
AP Election Updates May 5th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
Andhra Pradesh Election Updates 5th May... 7:37 AM, May 5th, 2024జనం.. జనం.. ప్రభంజనంసీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచార సభలకు పోటెత్తిన ప్రజానీకంహిందూపురంలో 43 డిగ్రీల ఎండనూ లెక్కచేయని జనంనియోజకవర్గ చరిత్రలో ఏ నాయకుడికి లేని రీతిలో బ్రహ్మరథంఈసారి హిందూపురం వైఎస్సార్సీపీదే అంటున్న రాజకీయ పరిశీలకులుపలమనేరులో వర్షాన్ని కూడా లెక్క చేయని ప్రజలునెల్లూరులో జననీరాజనం 7:25 AM, May 5th, 2024ల్యాండ్ టైట్లింగ్ చట్టం వ్యవహారం.. టీడీపీపై ఈసీ కొరడాదుష్ప్రచారంపై సీఐడీ దర్యాప్తుప్రజలను భయాందోళనలకు గురిచేయడంపై ఈసీ సీరియస్ ఎన్నికల నిబంధనలకు పాతరేస్తున్నారని మండిపాటు వైఎస్సార్సీపీ ఫిర్యాదుతో చర్యలు తీసుకున్న కమిషన్‌తక్షణం దీనిపై దర్యాప్తుచేసి నివేదిక ఇవ్వాలని ఆదేశం7:16 AM, May 5th, 2024కళ్లు గద్దెపై.. బుద్ధి భూమిలోల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై బరితెగించి అబద్ధాలులేని వ్యక్తులకు అన్యాయం జరిగిందంటూ రామోజీ ఆక్రోశం కల్పిత పాత్రలను సృష్టించి, ఏదో జరిగిపోయిందని ఆక్రందనరిజిస్టరే లేనపుడు అందులో కొందరి పేర్లు లేకపోవటం సాధ్యమా?చట్టం దేవుడెరుగు... చట్టానికి సంబంధించిన రూల్సే రాలేదని తెలీదా?రూల్స్ వచ్చాక.. వాటిపై సమగ్ర చర్చ జరిగిన తరవాతే తుది రూపుపైపెచ్చు రీసర్వే పూర్తయ్యాకే ఈ చట్టాన్ని అమలు చేయటం సాధ్యంఇప్పటికి 4 వేల గ్రామాల్లోనే రీ సర్వే పూర్తి.. ఇంకా 13 వేల గ్రామాల్లో పెండింగ్‌అది పూర్తయి.. రూల్స్ ఖరారయ్యాక కదా చట్టం అమలు గురించి మాట్లాడేది..అయినా అన్ని రాష్ట్రాలనూ అమలు చేయమంటున్నది కేంద్రమే కదా!అన్ని రాష్ట్రాలూ అమలు చేస్తేనే... ఇక్కడా చేస్తామని చెబుతున్న రాష్ట్రంమోదీ ముందు తల ఊపి.. బయట మాత్రం విష ప్రచారం చేస్తున్న బాబుబాబునెవరూ నమ్మటం లేదని గ్రహించి... మారీచుడి పాత్రలోకి రామోజీజనాన్ని భయపెట్టడానికి అబద్ధాలే అ్రస్తాలుగా మాయా యుద్ధంపోలింగ్ వరకూ ఈ ఒక్క అంశంమీదే మాట్లాడాలని ‘ఎల్లో’ తాఖీదుమిగతావన్నీ పక్కనబెట్టి విస్తృతంగా విష ప్రచారం చేస్తున్న పచ్చ మంద7:14 AM, May 5th, 2024బాబుకు భంగపాటు.. బెడిసికొట్టిన టీడీపీ అధినేత పన్నాగంబెడిసికొట్టిన టీడీపీ అధినేత పన్నాగంఓటర్లకు అరచేతిలో వైకుంఠం చూపించేందుకు కుతంత్రంలబ్ధిదారుల నమోదు పేరిట కుట్రఓటర్ల జాబితా వివరాల దుర్వినియోగంతీవ్రంగా స్పందించిన ఎన్నికల కమిషన్‌ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక7:12 AM, May 5th, 2024లాక్కునేవి కాదు..ఇచ్చే చేతులివి..నిషేధిత జాబితా నుంచి 35 లక్షల ఎకరాల తొలగింపుసీఎం జగన్ సంస్కరణలతో ‘రెవెన్యూ’లో సులభమైన పాలన వందల ఏళ్ల నాటి చిక్కుముళ్లకు పరిష్కారంచుక్కల భూములు, సర్విస్ ఈనాం, షరతుల గల పట్టా భూములకు విముక్తి27.41 లక్షల ఎకరాల అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులులంక భూములకు అసైన్మెంట్ పట్టాలుకుప్పలు తెప్పలుగా ఉన్న రెవెన్యూ సమస్యలన్నింటికీ పరిష్కారంనిరుపేదలకు 46 వేల ఎకరాల భూముల పంపిణీ శ్మశాన వాటికలు లేని దళిత వాడల కోసం 951 ఎకరాలుకొత్త రిజిస్ట్రేషన్ల విధానం.. ఆటో మ్యుటేషన్‌చరిత్ర సృష్టించిన 30.61 లక్షల ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్ రెవెన్యూ శాఖ స్వరూపాన్ని మార్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు6:59 AM, May 5th, 2024మళ్లీ దోపిడీకి తెరపైకి..మాజీ ఎమ్మెల్యే అరాచకాలెన్నో!గోబెల్స్ ప్రచారంలో చంద్రబాబుకు తమ్ముడు వక్ఫ్ ఆస్తులు చెరబట్టి దోచేసిన ఘనుడుటిప్పు షాపింగ్ కాంప్లెక్స్ కేటాయింపులో చేతివాటంప్రతి పనికీ రేటుగట్టి వసూలు చేసిన చరిత్ర బెదిరింపులు, దౌర్జన్యాలు షరామామూలేఏకంగా పది క్రిమినల్ కేసులు 6:56 AM, May 5th, 2024మీ భూమికి భద్రత.. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై బాబు దుష్ప్రచారం: సీఎం జగన్‌చట్టంపై అవగాహన లేకుండా మాట్లాడటం సిగ్గుచేటుమీ భూములకు ప్రభుత్వం గ్యారంటీ..రిజిస్ట్రేషన్ తర్వాత రైతులకే డాక్యుమెంట్లుఅన్నదాతలు ఎవరి చుట్టూ తిరగాల్సిన పని ఉండదుభూ తగాదాలకు శాశ్వత పరిష్కారంగా వందేళ్ల తర్వాత రీసర్వేపేదలకు భూములిచ్చేది జగన్.. లాక్కునేది చంద్రబాబే
నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్‌కు సంబంధంలేదన్న జయశంకర్
ఢిల్లీ: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు భారతీయుల అరెస్ట్‌పై భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జయశంకర్ స్పందించారు. త్వరలో ఎన్నికలు జరగనున్న కెనడాలోని అంతర్గత రాజకీయాల కారణంగా తలెత్తుతున్నవేనని, ఇందులో భారత్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు.కాగా, హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో నిందితులు కరణ్‌ప్రీత్ సింగ్ (28), కమల్‌ప్రీత్ సింగ్ (22), కరణ్ బ్రార్ (22)లను కెనడా పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరి అరెస్ట్‌పై జయశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి జరుగుతున్న పరిణామాలు త్వరలో ఎన్నికలు జరగనున్న కెనడాలోని అంతర్గత రాజకీయాల కారణంగా తలెత్తుతున్నవేనని పేర్కొన్నారు. ఆ విషయాల్లో భారత్‌కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తరచూ భారత్‌ను విమర్శిస్తుండడంపై అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు.మరోవైపు.. కెనడాలో అరెస్టైన ముగ్గురు నిందితుల గురించి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. నిందితులు ముగ్గురికి పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియా కథనాలు ఇచ్చింది. ఈ సందర్భంగా కొంతమంది గ్యాంగ్స్టర్లు కెనడాలో ఉంటూ భారత్‌లో తమ నేర కార్యకలాపాలను సాగిస్తున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) నిందితులుగా పేర్కొన్న చాలా మంది ఆ దేశంలో స్థిరపడ్డారు. భారత వ్యతిరేక, ఖలిస్థానీ అనుకూల కార్యకలాపాలు సాగించేందుకు వారికి పాక్ ఐఎస్ఐ నుంచి నిరంతరం నిధులు అందుతున్నాయి. దీని గురించి మేం చాలా సార్లు అనేక ఆధారాలు ఇచ్చినా.. కెనడా ప్రభుత్వం గానీ, పోలీసుల నుంచి ఎలాంటి మద్దతు లభించలేదు. ఇప్పుడు తాజా కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండానే భారత ప్రభుత్వంపై కెనడా నిందలు మోపుతోంది. అరెస్టయిన ఆ ముగ్గురు డ్రగ్స్ దందా చేస్తున్నారని, వారికి ఐఎస్ఐతో సంబంధాలున్నాయని పేర్కొంది.
Weekly Horoscope: ఈ రాశివారికి ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి
మేషంఅదనపు ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. సమస్యలు ఎదురైనా నేర్పుగా పరిష్కరించుకుంటారు. శ్రమకు ఫలితం దక్కుతుంది. ఆస్తి వ్యవహారాల్లో చికాకులు తొలగుతాయి. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారి చేయూతనందిస్తారు. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ప్రశంసలు. రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు. వారం చివరిలో మనశ్శాంతి లోపం. కుటుంబంలో ఒత్తిడులు. ఎరుపు, బంగారురంగులు, శివపంచాక్షరి పఠించండి.వృషభంకొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పరపతి పెరుగుతుంది. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. వాహనాలు, భూములు కొంటారు. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాల విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. కళారంగం వారికి అన్నింటా విజయం. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో కలహాలు. నలుపు, ఆకుపచ్చరంగులు, అన్నపూర్ణాష్టకం పఠించండి.మిథునంఆర్థిక పరిస్థితి మొదట్లోకొంత నిరాశ కలిగించినా అవసరాలకు డబ్బు అందుతుంది. పనులు నెమ్మదిగా సాగుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు రాగలవు. భూవివాదాలు తీరతాయి. ఆరోగ్యభంగం. వాహనసౌఖ్యం. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వ్యాపారాలు అనుకున్న మేరకు లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. రాజకీయవర్గాలకు ముఖ్య సమాచారం. వారం చివరిలో ఒత్తిడులు. కుటుంబంలో సమస్యలు. ఆకుపచ్చరంగు,లేత గులాబీరంగు, కనకధారా స్తోత్రం పఠించండి.కర్కాటకంపనుల్లో పురోగతి కనిపిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. రుణాలు చేయాల్సి వస్తుంది. ఎరుపు, చాక్లెట్ రంగులు, లక్ష్మీస్తోత్రాలు పఠించండి.సింహంముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. మీ అంచనాలు నిజమవుతాయి. ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. ఆస్తి వివాదాల పరిష్కారం. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు. ఉద్యోగులకు గందరగోళం నుండి విముక్తి. పారిశ్రామికవర్గాలకు కొన్ని సమస్యలు తీరతాయి. వారం ప్రారంభంలో మానసికఅశాంతి. కుటుంబంలో నిరాశ. తెలుపు, చాక్లెట్æరంగులు, రాఘవేంద్రస్తోత్రాలు పఠించండి.కన్యకొన్ని కార్యక్రమాలు నెమ్మదిగా సాగుతాయి. బంధువులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. మీలోని నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ఒక ప్రకటన నిరుద్యోగులు, విద్యార్థులను ఆకట్టుకుంటుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపార విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగులకు విధులు ప్రశాంతంగా సాగిపోతాయి. కళారంగం వారికి యోగదాయకమైన కాలం. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. గులాబీ, పసుపు రంగులు, శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.తులపనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. బంధువులు, మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. నిరుద్యోగుల కల ఫలిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం పొందుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు చిక్కులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు కార్యసిద్ధి. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబంలో కొత్త వివాదాలు. తెలుపు, చాక్లెట్ రంగులు, నవగ్రహస్తోత్రాలు పఠించండి.వృశ్చికంకొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల సలహాలు పొందుతారు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలకు హాజరవుతారు. మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. వాహనయోగం. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఈతిబాధలు తొలగుతాయి. కళారంగం వారికి సన్మానాలు. వారం చివరిలో మానసిక ఆందోళన. కుటుంబంలో ఒత్తిడులు. ఆకుపచ్చ, తెలుపు రంగులు, ఆదిత్య హృదయం పఠించండి.ధనుస్సుఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆలయ దర్శనాలు. ఇంటాబయటా అనుకూలం. ఇంటర్వ్యూలు అందుతాయి. సోదరులు, సోదరీలతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ఆకస్మిక ప్రయాణాలు. అంచనాలలో పొరపాట్లు దొర్లుతాయి. ఆకుపచ్చ, తెలుపురంగులు, శివాలయ దర్శనం మంచిది.మకరంఅనుకున్న పనులు సజావుగా సాగుతాయి. మీపై వచ్చిన అభియోగాల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పరపతి పెరుగుతుంది. గృహ, వాహనయోగాలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. పోటీపరీక్షల్లో విజయం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు విధులలో భారం తగ్గుతుంది. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో కుటుంబంలో ఒత్తిడులు. శ్రమాధిక్యం. నీలం, లేత పసుపు రంగులు. నృసింహస్తోత్రాలు పఠించండి.కుంభంఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబ, ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. బంధువులతో మాటపట్టింపులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి. ప్రత్యర్థుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలలో లాభాలు అంతగా ఉండవు. ఉద్యోగులకు శ్రమాధిక్యం. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. నీలం, తెలుపు రంగులు, గణేశ్‌ను పూజించండి.మీనంఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. ప్రత్యర్థులు అనుకూలురుగా మారతారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. పారిశ్రామికవర్గాలకు మరింత అనుకూల పరిస్థితులు. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆకుపచ్చ, తెలుపు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
ల్యాండ్ టైట్లింగ్ చట్టం వ్యవహారం.. టీడీపీపై ఈసీ కొరడా
సాక్షి, అమరావతి: ప్రజలను భయాందోళనకు గురి చేస్తూ తప్పుడు సమాచారంతో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై తెలుగుదేశం పార్టీ చేస్తున్న దుష్ప్రచారం మీద ఎన్నికల సంఘం (ఈసీ) కొరడా ఝళిపించింది. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఏప్రిల్ 29న ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన ఈసీ టీడీపీ దుష్ప్రచారంపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని, అలా తీసుకున్న చర్యలపై తక్షణం నివేదిక ఇవ్వాలని మంగళగిరి సీఐడీ (సైబర్ సెల్) అడిషనల్ డీజీకి అడిషనల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎంఎన్ హరీంధర ప్రసాద్ ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి వ్యతిరేకంగా తప్పుడు సమాచారంతో దురుద్దేశపూర్వకంగా లాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై ఐవీఆర్ఎస్ కాల్స్‌తో పాటు సామాజిక మాధ్యమాల్లో టీడీపీ ప్రచారం చేస్తోందంటూ వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. ఇందుకు తగిన ఆధారాలనూ సమర్పించింది. వివిధ ప్రాంతాల నుంచి వేర్వేరు నెంబర్ల ఐవీఆర్ కాల్స్ వస్తున్నాయని.. వాటిని లిఫ్ట్ చేయగానే.. ‘వైఎస్ జగన్ అధికారంలోకొస్తే మీ భూములు మీ పేరు మీద ఉండవు, జగన్ కాజేస్తాడు, ఒరిజినల్స్ ఆయన దగ్గర ఉంచుకుంటాడు, మీకు జిరాక్స్ కాపీలు వస్తాయి, కాబట్టి జగన్‌కు ఓటు వేయకుండా తెలుగుదేశంకు ఓటు వేయండి’.. అంటూ రికార్డ్ మెసేజ్‌లు వస్తున్నట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. వీటికి సంబంధించిన వాయిస్ రికార్డులను వైఎస్సార్సీపీ ఈసీకి ఆధారాలుగా సమర్పించింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికల సంఘం ఆమోదంలేకుండా ఎలాంటి ప్రచారం చేయడానికి వీల్లేదని.. కానీ ఎటువంటి అనుమతుల్లేకుండా వివిధ చోట్ల నుంచి కాల్స్‌చేస్తూ ఇలా ప్రచారం చేయడం ఉల్లంఘన కిందకే వస్తుందని.. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీచేసింది. ఎన్నికల సమరంలో అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు ఉండేలా చూడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంటుందని, ఈ విధంగా చట్టాలపై తప్పుడు సమాచారంతో దుష్ప్రచారం చేస్తూ ప్రజల్లో భయాందోళనలను రేకెత్తిస్తున్న టీడీపీపై తక్షణం చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ తన ఫిర్యాదులో కోరింది
బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
తొలి ఎనిమిది మ్యాచ్‌లలో ఒక విజయం, ఏడు పరాజయాలు... అంతా లెక్కలోంచి తీసేసిన వేళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పుంజుకుంది. ప్రత్యర్థి వేదికపై గత రెండు మ్యాచ్‌లు గెలిచిన ఆర్సీబీ ఇప్పుడు సొంతగడ్డపై చెలరేగి విజయాల ‘హ్యాట్రిక్’ సాధించింది. పట్టికలో మూడు స్థానాలు ఎగబాకి పదినుంచి ఏడుకు చేరింది. అయితే తాజా విజయంలో కాస్త ఉత్కంఠను పెంచి చివరకు గెలుపుతీరం చేరింది. ముందుగా తమ పేలవ ఆటను కొనసాగిస్తూ టైటాన్స్ 147 పరుగులకే పరిమితమైంది. సులువైన ల„ ్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్సీబీ స్కోరు 92/0...ఇక మిగిలింది లాంఛనమే అనుకున్న తరుణంలో 25 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు పడ్డాయి. కానీ తడబాటును అధిగమించి మరో 38 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. బెంగళూరు: చిన్నస్వామి మైదానంలో అభిమానులకు ఆర్సీబీ ఆనందం పంచింది. శనివారం జరిగిన కీలక పోరులో బెంగళూరు 4 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 19.3 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌటైంది. షారుఖ్ ఖాన్ (24 బంతుల్లో 37; 5 ఫోర్లు, 1 సిక్స్), రాహుల్ తెవాటియా (21 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్), డేవిడ్ మిల్లర్ (20 బంతుల్లో 30; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) జట్టు స్కోరులో తలా ఓ చేయి వేశారు. అనంతరం బెంగళూరు 13.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. ఫాఫ్ డుప్లెసిస్ (23 బంతుల్లో 64; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), విరాట్ కోహ్లి (27 బంతుల్లో 42; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) తొలి వికెట్‌కు 35 బంతుల్లోనే 92 పరుగులు జోడించి విజయాన్ని సులువు చేశారు. జోష్ లిటిల్‌కు 4 వికెట్లు దక్కాయి. టపటపా... సిరాజ్ బౌలింగ్ ధాటికి గుజరాత్ బ్యాటింగ్ ఆరంభంలోనే తడబడింది. తన తొలి రెండు ఓవర్లలో సాహా (1), గిల్ (2)లను సిరాజ్ అవుట్ చేయగా, సుదర్శన్ (6)ను గిల్ వెనక్కి పంపించాడు. దాంతో పవర్‌ప్లేలో గుజరాత్ 23 పరుగులకే పరిమితమైంది. ఈ దశలో షారుఖ్, మిల్లర్ కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ మిల్లర్‌ను అవుట్ చేసి ఈ 61 పరుగుల భాగస్వామ్యానికి కరణ్ తెర దించగా...లేని పరుగు కోసం ప్రయత్నించి షారుఖ్ రనౌట్ కావడంతో పరిస్థితి మళ్లీ మారిపోయింది. ఆ తర్వాత తెవాటియా కాస్త దూకుడుగా ఆడటంతో గుజరాత్ ఈ మాత్రం స్కోరైనా సాధించగలిగింది. కరణ్ శర్మ వేసిన 16వ ఓవర్లో తెవాటియా వరుసగా 4, 6, 4, 4 బాదాడు. యశ్ దయాళ్ ఒకే ఓవర్లో రషీద్ (18), తెవాటియాను అవుట్ చేసి దెబ్బ కొట్టగా...వైశాక్ వేసిన ఆఖరి ఓవర్ తొలి మూడు బంతుల్లో ఒకే స్కోరు వద్ద గుజరాత్ మూడు వికెట్లు కోల్పోయింది. మెరుపు భాగస్వామ్యం... ఛేదనలో బెంగళూరు చెలరేగిపోయింది. ఓపెనర్లు కోహ్లి, డుప్లెసిస్ బౌండరీలు బాదుతూ వేగంగా లక్ష్యం దిశగా సాగిపోయారు. మోహిత్ వేసిన తొలి ఓవర్లో కోహ్లి 2 సిక్స్‌లు కొట్టగా, లిటిల్ వేసిన తర్వాతి ఓవర్లో డుప్లెసిస్ 3 ఫోర్లు, సిక్స్ కొట్టాడు. మానవ్ వేసిన తర్వాతి ఓవర్లోనూ సిక్స్, ఫోర్ కొట్టిన డుప్లెసిస్...మోహిత్ ఓవర్లో 4 ఫోర్లు బాది 18 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. మానవ్ ఓవర్లో కోహ్లి 2 సిక్స్‌లు కొట్టగా...లిటిల్ వేసిన తర్వాతి ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ బాది అదే జోరులో డుప్లెసిస్ అవుటయ్యాడు. 6 ఓవర్లు ముగిసే సరికి 92 పరుగులు సాధించిన ఆర్సీబీ...ఐపీఎల్లో తమ అత్యుత్తమ పవర్‌ప్లే స్కోరును నమోదు చేసింది. అయితే డుప్లెసిస్ వెనుదిరిగిన తర్వాత బ్యాటింగ్ బృందం తడబడింది. కొంత ఉత్కంఠ నెలకొన్నా... దినేశ్ కార్తీక్ (12 బంతుల్లో 21 నాటౌట్; 3 ఫోర్లు), స్వప్నిల్ సింగ్ (9 బంతుల్లో 15 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ఏడో వికెట్‌కు అభేద్యంగా 35 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. స్కోరు వివరాలు గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా (సి) కార్తీక్ (బి) సిరాజ్ 1; గిల్ (సి) వైశాక్ (బి) సిరాజ్ 2; సుదర్శన్ (సి) కోహ్లి (బి) గ్రీన్ 6; షారుఖ్ (రనౌట్) 37; మిల్లర్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) కరణ్ 30; తెవాటియా (సి) వైశాక్ (బి) దయాళ్ 35; రషీద్ (బి) దయాళ్ 18; విజయ్‌శంకర్ (సి) సిరాజ్ (బి) వైశాక్ 10; మానవ్ (సి) స్వప్నిల్ (బి) వైశాక్ 1; మోహిత్ (రనౌట్) 0; నూర్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (19.3 ఓవర్లలో ఆలౌట్) 147. వికెట్ల పతనం: 1–1, 2–10, 3–19, 4–80, 5–87, 6–131, 7–136, 8–147, 9–147, 10–147. బౌలింగ్: స్వప్నిల్ సింగ్ 1–0–1–0, సిరాజ్ 4–0–29–2, యశ్ దయాళ్ 4–0–21–2, గ్రీన్ 4–0–28–1, విజయ్‌కుమార్ వైశాక్ 3.3–0–23–2, కరణ్ శర్మ 3–0–42–1. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: కోహ్లి (సి) సాహా (బి) నూర్ 42; డుప్లెసిస్ (సి) షారుఖ్ (బి) లిటిల్ 64; జాక్స్ (సి) షారుఖ్ (బి) నూర్ 1; పటిదార్ (సి) మిల్లర్ (బి) లిటిల్ 2; మ్యాక్స్‌వెల్ (సి) మిల్లర్ (బి) లిటిల్ 4; గ్రీన్ (సి) షారుఖ్ (బి) లిటిల్ 1; కార్తీక్ (నాటౌట్) 21; స్వప్నిల్ (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (13.4 ఓవర్లలో 6 వికెట్లకు) 152 వికెట్ల పతనం: 1–92, 2–99, 3–103, 4–107, 5–111, 6–117. బౌలింగ్: మోహిత్ శర్మ 2–0–32–0, జోష్ లిటిల్ 4–0–45–4, మానవ్ సుథర్ 2–0–26–0, నూర్ అహ్మద్ 4–0–23–2, రషీద్ ఖాన్ 1.4–0–25–0. ఐపీఎల్లో నేడుపంజాబ్ X చెన్నైవేదిక: ధర్మశాలమధ్యాహ్నం 3: 30 గంటల నుంచిలక్నో X కోల్‌కతావేదిక: లక్నోరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం
25 కిలోల బంగారం స్మగ్లింగ్.. అఫ్గాన్ రాయబారి జకియా రాజీనామా
న్యూఢిల్లీ: రూ.18.6 కోట్ల విలువైన 25 కిలోల బంగారాన్ని దుబాయ్ నుంచి అక్రమ రవాణా చేస్తూ ముంబై ఎయిర్‌పోర్టులో దొరికిపోయిన అఫ్గానిస్తాన్ సీనియర్ దౌత్యవేత్త జకియా వార్దక్ తన పదవికి రాజీనామా చేశారు. ఆమె తొలుత ముంబైలో అఫ్గాన్ కాన్సూల్ జనరల్‌గా రెండేళ్లు పనిచేశారు. గత ఏడాది ఇండియాలో అఫ్గాన్ రాయబారిగా బాధ్యతలు చేపట్టారు. గత నెల 25వ తేదీన ముంబై ఎయిర్‌పోర్టులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు జకియా వార్దక్ నుంచి 25 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఆమె బంగారాన్ని దుబాయి నుంచి చట్టవిరుద్ధంగా తరలిస్తూ దొరికిపోయినట్లు వార్తలొచ్చాయి. దౌత్యవేత్త కావడంతో ఈ కేసులో అరెస్టు కాకుండా ఆమె మినహాయింపు పొందారు. అయితే, తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు జకియా వార్దక్ తాజాగా ‘ఎక్స్’లో పోస్టు చేశారు. తనపై వ్యక్తిగతంగా విమర్శల దాడి జరుగుతోందని, దీనివల్ల విధులు సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నానని, అందుకే రాజీనామా చేస్తున్నానని పేర్కొన్నారు.
సునీత ‘స్టార్ ట్రెక్’!
ముప్పై ఏళ్లు సాగిన అమెరికన్ స్పేస్ షటిల్స్ శకం 2011లో ముగిసింది. ఇక 1960ల నాటి సోవియట్ సోయజ్ కేప్సూల్ ఓ పాతబడ్డ డొక్కు వ్యోమనౌక. కొద్దిపాటి మార్పులతో ‘ఐదో తరం సోయజ్’తో నెట్టుకొస్తున్నా అదీ ని్రష్కమించే వేళయింది. సొంత నౌకల్లో వ్యోమగాముల్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపడానికి అమెరికా ఆర్థికంగా వెనకడుగు వేసింది. రష్యా సైతం స్పేస్ టూరిస్టులకు టికెట్లమ్మి ఆ సొమ్ముతో ‘ఐఎస్ఎస్ బండి’ నడుపుతోంది. ఈ నేపథ్యంలో మున్ముందు అంతరిక్ష కేంద్రానికి మానవసహిత యాత్రలు, పెట్టుబడులు, పరిశోధన, చంద్ర–అంగారక యాత్రలు... అన్నింట్లోనూ ప్రైవేటైజేషన్‌దే హవా కానుంది! ప్రైవేటు రంగమే రోదసిని ఏలబోతోంది. ప్రభుత్వరంగ పాత్ర క్రమంగా కేవలం ప్రోత్సాహం, సహకారం, కాస్తో కూస్తో నిధులకే పరిమితమవుతోంది. రెండు అధునాతన ప్రైవేటు వ్యోమనౌకలు (స్పేస్ కేప్సూల్స్) అంతరిక్షాన్ని అందుకోవడానికి సిద్ధమయ్యాయి. భూమికి 400 కిలోమీటర్ల ఎత్తున కక్ష్యలో పరిభ్రమిస్తున్న అంతరిక్ష కేంద్రానికి రాకెట్ల సాయంతో వ్యోమగాముల్ని తీసుకెళ్లనున్నాయి. ‘ఎక్స్’ బాస్ ఇలాన్ మస్క్ కంపెనీ ‘స్పేస్ ఎక్స్’ రూపొందించిన ‘క్రూ డ్రాగన్’ కేప్సూల్ ఇప్పటికే ఫాల్కన్ రాకెట్లతో అంతరిక్ష కేంద్రానికి రాకపోకలు సాగిస్తోంది. సరుకులతో పాటు వ్యోమగాములనూ చేరవేస్తోంది. ప్రపంచ అతి పెద్ద ఏరో స్పేస్ కంపెనీల్లో ఒకటైన ‘బోయింగ్’ కూడా తాజాగా ‘సీఎస్టీ–100 స్టార్‌లైనర్’ వ్యోమనౌకతో మే 6న తొలి మానవసహిత రోదసీ యాత్రతో రంగప్రవేశం చేస్తోంది. భారతీయ మూలాలున్న అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ ముచ్చటగా మూడోసారి అంతరిక్ష కేంద్రానికి పయనమవడం ఈ యాత్రలో మరో విశేషం... మన సునీత హ్యాట్రిక్! సునీతా విలియమ్స్. ఇండియన్ అమెరికన్ ఆస్ట్రోనాట్. ముద్దుపేరు సునీ. 11 ఏళ్ల విరామం అనంతరం 58 ఏళ్ల వయసులో మూడోసారి రోదసికి వెళ్లబోతున్నారు. అమెరికన్ నేవీ కెపె్టన్ (రిటైర్డ్) సునీతకు అనుభవమే మనోబలం. ఆమెను నాసా 1998లో వ్యోమగామిగా ఎంపిక చేసింది. సునీత తండ్రి ఇండియన్ అమెరికన్ దీపక్ పాండ్యాది ముంబై. తల్లి అర్సలిన్ బోనీ స్లోవేన్–అమెరికన్. సునీత 1965లో అమెరికాలో జని్మంచారు. యునైటెడ్ లాంచ్ అలయెన్స్ రాకెట్ ‘అట్లాస్–5’ శీర్షభాగంలో అమర్చిన బోయింగ్ ‘స్టార్‌లైనర్’ వ్యోమనౌకలో ఈ నెల 6న రాత్రి 10:34కు (భారత కాలమానం ప్రకారం 7వ తేదీ ఉదయం 8:04కు) ఫ్లోరిడాలోని కేప్ కెనవరల్ నుంచి సునీత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయల్దేరనున్నారు. నాసా వ్యోమగామి బుచ్ విల్మోర్ కూడా ఈ యాత్రలో పాల్గొంటారు. వీరిద్దరూ ఐఎస్ఎస్లో వారం గడిపి తిరిగొస్తారు. సునీత 2006 డిసెంబరు 9న తొలిసారి ఐఎస్ఎస్ కు వెళ్లారు. 2007 జూన్ 22 దాకా రోదసిలో గడిపారు. నాలుగు సార్లు స్పేస్ వాక్ చేసిన మహిళా వ్యోమగామిగా రికార్డు నెలకొల్పారు. రెండోసారి 2012 జులై 14 నుంచి 127 రోజులపాటు ఐఎస్ఎస్లో గడిపారు. మూడుసార్లు స్పేస్ వాక్ చేశారు. రెండు మిషన్లలో మొత్తం 50 గంటల 40 నిమిషాలు స్పేస్ వాక్ చేశారు. బోయింగ్... గోయింగ్! అమెరికా స్పేస్ షటిల్స్ కనుమరుగయ్యాక అంతరిక్ష యాత్రల కోసం రష్యా సోయజ్ రాకెట్–వ్యోమనౌకల శ్రేణిపైనే నాసా ఆధారపడింది. కానీ ఒక్కో వ్యోమగామికి రష్యా ఏకంగా రూ.700 కోట్లు చొప్పు న వసూలు చేస్తోంది. దాంతో వ్యోమనౌకల అభివృద్ధి కోసం నాసా 2014లో బోయింగ్‌కు 4.2 బిలియన్ డాలర్లు, (రూ.35 వేల కోట్లు), స్పేస్ ఎక్స్‌కు 2.6 బిలియన్ డాలర్ల (రూ.21,680 కోట్లు) కాంట్రాక్టులు కట్టబెట్టింది. స్పేస్ ఎక్స్ తన ‘క్రూ డ్రాగన్’ స్పేస్ కేప్సూల్‌లో 2020 నుంచే వ్యోమగాములను తీసుకెళ్తోంది. బోయింగ్ ‘క్రూ స్పేస్ ట్రాన్సో్పర్టేషన్ (సీఎస్టీ)–100 స్టార్ లైనర్’ మాత్రం వెనుకబడింది. ఎట్టకేలకు ఈ నెల 6న తొలి మానవసహిత ప్రయాణ పరీక్షకు సిద్ధమైంది. అంతరిక్ష కేంద్రంతో అనుసంధానం (డాకింగ్), భూమికి తిరుగు పయనం, స్టార్ లైనర్ వ్యవస్థల సామర్థ్యాన్ని ఈ పరీక్షలో పరిశీలిస్తారు. ఈ యాత్ర జయప్రదమైతే మానవసహిత అంతరిక్ష యాత్రలకు దానికి లైసెన్స్ లభిస్తుంది. – జమ్ముల శ్రీకాంత్
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్
ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన, భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్ల నుండి ప్రేరణ పొంది అద్భుతమైన మరియు వైవిధ్యమైన శ్రేణి సమకాలీన, రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్లు, కస్టమర్లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా, ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్, ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్లెట్లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్ 18కేరట్ మరియు 22కేరట్ బంగారంలో విస్తృతమైన శ్రేణి డిజైన్లతో, నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని సంపూర్ణం చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్లెట్లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.
తప్పక చదవండి
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్‌స్టాప్‌గా... జెట్ స్పీడ్‌లో
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
సినిమా
అంతకు మించి...
‘ఇస్మార్ట్ శంకర్’లో హీరో రామ్‌ని ఫుల్ మాస్‌గా చూపించారు దర్శకుడు పూరి జగన్నాథ్. ఈ చిత్రంలో మాస్, కామెడీ, యాక్షన్, రొమాన్స్... ఇలా అన్నీ కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఇప్పుడు ‘డబుల్ ఇస్మార్ట్’లో అంతకు మించి ఉంటాయి. ‘ఇస్మార్ట్ శంకర్’కి సీక్వెల్‌గా రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఈ చిత్రం కోసం రామ్ పూర్తిగా మేకోవర్ అయ్యారు. తొలి భాగంలోకన్నా ఇంకా మాస్‌గా కనిపించ డంతో పాటు స్టయిలిష్‌గానూ కనిపించనున్నారు.‘‘ఈ చిత్రంలో రెట్టింపు యాక్షన్, రెట్టింపు మాస్, ఎంటర్టైన్మెంట్ ఉంటాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ పాన్ ఇండియా చిత్రం తాజా షెడ్యూల్ ముంబైలో ఆరంభమైంది. ఈ లెన్తీ షెడ్యూల్లో చిత్రంలోని ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. దీంతో ఎక్కువ శాతం సినిమా పూర్తవుతుంది. సంజయ్ దత్ పవర్ఫుల్ రోల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నా«థ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’కి స్వరాలు అందించిన మణిశర్మ ఈ చిత్రానికి కూడా సంగీతదర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
రూరల్ యాక్షన్‌కి సై
హీరో విజయ్ దేవరకొండ అంటే సిటీ బ్యాక్‌డ్రాప్ కథలే ఎక్కువగా ఉంటాయి. ఈసారి వినూత్నంగా ప్రయత్నించాలని ఓ రూరల్ యాక్షన్ డ్రామా మూవీ సైన్ చేశారు. ఈ సినిమా కోసం సిటీ నుంచి విలేజ్‌కి వెళ్లనున్నారు విజయ్ దేవరకొండ. అక్కడే ఫుల్ యాక్షన్ చేయనున్నారు.ఈ రూరల్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ మూవీని ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించనున్నారు. ‘రాజావారు రాణిగారు’ సినిమాతో దర్శకుడిగా ప్రతిభ నిరూపించుకున్న రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మించనున్న 59వ సినిమా ఇది. ఈ చిత్రాన్ని శనివారం ప్రకటించారు.
మరింత ఆలస్యంగా ‘ఇండియన్ 2’..?
భారతీయుడి రాక మరింత ఆలస్యం కానుందనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో 1996లో వచ్చిన బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’). పాతిక సంవత్సరాల తర్వాత కమల్‌హాసన్‌తోనే ‘ఇండియన్’ సినిమాకు సీక్వెల్స్‌గా ‘ఇండియన్ 2’, ‘ఇండియన్ 3’ చిత్రాలను తెరకెక్కించారు శంకర్. ‘ఇండియన్ 2’ని ఈ ఏడాది జూన్‌లో రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవల ప్రకటించింది.అయితే ఈ చిత్రం వాయిదా పడే అవకాశం ఉందని సమాచారం. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటిస్తారనే టాక్ కోలీవుడ్‌లో ప్రచారంలోకి వచ్చింది. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్, బాబీ సింహా, ఎస్జే సూర్య కీలక పాత్రల్లో నటించారు. లైకా ప్రోడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ పతాకాలపై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం: అనిరు«ద్ రవిచందర్.
ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
ప్రస్తుతం తెలుగులో చెప్పుకోదగ్గ సినిమాలేం రావట్లేదు. మరోవైపు ఐపీఎల్లో ఈసారి హైదరాబాద్ జట్టు దంచికొట్టే ఫెర్ఫార్మెన్స్ ఇస్తోంది. దీంతో జనాలు దృష్టి క్రికెట్ పైకి మళ్లింది. ఈ క్రమంలోనే థియేటర్లకు ప్రేక్షకులు రావడమే తగ్గించేశారు. ఈ క్రమంలోనే మొన్నీమధ్య ఓ సినిమా ఈవెంట్లో డైరెక్టర్ అనిల్ రావిపూడి కొన్ని కామెంట్స్ చేశారు. అవి కాస్త సోషల్ మీడియాలో చిన్నపాటి దుమారమే రేపాయి. ఇప్పుడు వాటిపై మళ్లీ ఈయనే క్లారిటీ ఇచ్చేశాడు.(ఇదీ చదవండి: నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్)రీసెంట్గా 'కృష్ణమ్మ' సినిమా ఈవెంట్‌కి హాజరైన దర్శకుడు అనిల్ రావిపూడి.. 'ఐపీఎల్ చూడకపోతే కొంపలేం మునిగిపోవు. సాయంత్రం థియేటర్లకు వచ్చి మూవీస్ చూడండి' అని కాస్త ఘాటుగానే చెప్పాడు. దీంతో సినిమాల కంటే ఐపీఎల్ బెస్ట్, సినిమాలు చూడకపోయినా కొంపలేం మునిగిపోవు అని నెటిజన్స్ రిటర్న్ కామెంట్స్ పెడుతున్నారు. దీంతో తాజాగా మరో కార్యక్రమంలో పాల్గొన్న అనిల్ రావిపూడి.. తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇస్తూనే అసలేం జరిగిందో చెప్పుకొచ్చాడు.'మే 19న డైరెక్టర్స్ డే వేడుకలు చేస్తున్నాం. ఆ రోజు కూడా ఐపీఎల్ మ్యాచ్ ఉంది. నేను ఈ మధ్య ఐపీఎల్ గురించి మాట్లాడిన మాటలు మరో రకంగా జనాల్లోకి వెళ్లాయి. నేను ఆ ఈవెంట్ కి వెళ్లే ముందు ఓ డిస్ట్రిబ్యూటర్‌ని కలిశాను. వేసవిలో ఐపీఎల్ వల్ల కూడా సినిమాలు సరిగా ఆడట్లేదని చెప్తే ఆ ఫ్లోలో అలా మాట్లాడేశాను. ఐపీఎల్ చూడండి. సినిమాలు కూడా చూడండి. నేనూ ఐపీఎల్ చూస్తా. నేను మాట్లాడింది అపార్థం చేసుకోవద్దు' అని అనిల్ రావిపూడి.. వివాదాస్పద కామెంట్స్‌కి పుల్‌స్టాప్ పెట్టేశాడు.(ఇదీ చదవండి: ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి)
ఫొటోలు
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
భార్యాభర్తలిద్దరూ స్టార్ క్రికెటర్లే.. అతడు కాస్ట్లీ.. ఆమె కెప్టెన్!(ఫొటోలు)
Pooja Hegde HD Photos: రెడ్ డ్రెస్సులో అగ్గి రాజేస్తున్న బుట్టబొమ్మ (ఫోటోలు)
క్రీడలు
బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
తొలి ఎనిమిది మ్యాచ్‌లలో ఒక విజయం, ఏడు పరాజయాలు... అంతా లెక్కలోంచి తీసేసిన వేళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పుంజుకుంది. ప్రత్యర్థి వేదికపై గత రెండు మ్యాచ్‌లు గెలిచిన ఆర్సీబీ ఇప్పుడు సొంతగడ్డపై చెలరేగి విజయాల ‘హ్యాట్రిక్’ సాధించింది. పట్టికలో మూడు స్థానాలు ఎగబాకి పదినుంచి ఏడుకు చేరింది. అయితే తాజా విజయంలో కాస్త ఉత్కంఠను పెంచి చివరకు గెలుపుతీరం చేరింది. ముందుగా తమ పేలవ ఆటను కొనసాగిస్తూ టైటాన్స్ 147 పరుగులకే పరిమితమైంది. సులువైన ల„ ్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్సీబీ స్కోరు 92/0...ఇక మిగిలింది లాంఛనమే అనుకున్న తరుణంలో 25 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు పడ్డాయి. కానీ తడబాటును అధిగమించి మరో 38 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. బెంగళూరు: చిన్నస్వామి మైదానంలో అభిమానులకు ఆర్సీబీ ఆనందం పంచింది. శనివారం జరిగిన కీలక పోరులో బెంగళూరు 4 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 19.3 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌటైంది. షారుఖ్ ఖాన్ (24 బంతుల్లో 37; 5 ఫోర్లు, 1 సిక్స్), రాహుల్ తెవాటియా (21 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్), డేవిడ్ మిల్లర్ (20 బంతుల్లో 30; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) జట్టు స్కోరులో తలా ఓ చేయి వేశారు. అనంతరం బెంగళూరు 13.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. ఫాఫ్ డుప్లెసిస్ (23 బంతుల్లో 64; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), విరాట్ కోహ్లి (27 బంతుల్లో 42; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) తొలి వికెట్‌కు 35 బంతుల్లోనే 92 పరుగులు జోడించి విజయాన్ని సులువు చేశారు. జోష్ లిటిల్‌కు 4 వికెట్లు దక్కాయి. టపటపా... సిరాజ్ బౌలింగ్ ధాటికి గుజరాత్ బ్యాటింగ్ ఆరంభంలోనే తడబడింది. తన తొలి రెండు ఓవర్లలో సాహా (1), గిల్ (2)లను సిరాజ్ అవుట్ చేయగా, సుదర్శన్ (6)ను గిల్ వెనక్కి పంపించాడు. దాంతో పవర్‌ప్లేలో గుజరాత్ 23 పరుగులకే పరిమితమైంది. ఈ దశలో షారుఖ్, మిల్లర్ కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ మిల్లర్‌ను అవుట్ చేసి ఈ 61 పరుగుల భాగస్వామ్యానికి కరణ్ తెర దించగా...లేని పరుగు కోసం ప్రయత్నించి షారుఖ్ రనౌట్ కావడంతో పరిస్థితి మళ్లీ మారిపోయింది. ఆ తర్వాత తెవాటియా కాస్త దూకుడుగా ఆడటంతో గుజరాత్ ఈ మాత్రం స్కోరైనా సాధించగలిగింది. కరణ్ శర్మ వేసిన 16వ ఓవర్లో తెవాటియా వరుసగా 4, 6, 4, 4 బాదాడు. యశ్ దయాళ్ ఒకే ఓవర్లో రషీద్ (18), తెవాటియాను అవుట్ చేసి దెబ్బ కొట్టగా...వైశాక్ వేసిన ఆఖరి ఓవర్ తొలి మూడు బంతుల్లో ఒకే స్కోరు వద్ద గుజరాత్ మూడు వికెట్లు కోల్పోయింది. మెరుపు భాగస్వామ్యం... ఛేదనలో బెంగళూరు చెలరేగిపోయింది. ఓపెనర్లు కోహ్లి, డుప్లెసిస్ బౌండరీలు బాదుతూ వేగంగా లక్ష్యం దిశగా సాగిపోయారు. మోహిత్ వేసిన తొలి ఓవర్లో కోహ్లి 2 సిక్స్‌లు కొట్టగా, లిటిల్ వేసిన తర్వాతి ఓవర్లో డుప్లెసిస్ 3 ఫోర్లు, సిక్స్ కొట్టాడు. మానవ్ వేసిన తర్వాతి ఓవర్లోనూ సిక్స్, ఫోర్ కొట్టిన డుప్లెసిస్...మోహిత్ ఓవర్లో 4 ఫోర్లు బాది 18 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. మానవ్ ఓవర్లో కోహ్లి 2 సిక్స్‌లు కొట్టగా...లిటిల్ వేసిన తర్వాతి ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ బాది అదే జోరులో డుప్లెసిస్ అవుటయ్యాడు. 6 ఓవర్లు ముగిసే సరికి 92 పరుగులు సాధించిన ఆర్సీబీ...ఐపీఎల్లో తమ అత్యుత్తమ పవర్‌ప్లే స్కోరును నమోదు చేసింది. అయితే డుప్లెసిస్ వెనుదిరిగిన తర్వాత బ్యాటింగ్ బృందం తడబడింది. కొంత ఉత్కంఠ నెలకొన్నా... దినేశ్ కార్తీక్ (12 బంతుల్లో 21 నాటౌట్; 3 ఫోర్లు), స్వప్నిల్ సింగ్ (9 బంతుల్లో 15 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ఏడో వికెట్‌కు అభేద్యంగా 35 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. స్కోరు వివరాలు గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా (సి) కార్తీక్ (బి) సిరాజ్ 1; గిల్ (సి) వైశాక్ (బి) సిరాజ్ 2; సుదర్శన్ (సి) కోహ్లి (బి) గ్రీన్ 6; షారుఖ్ (రనౌట్) 37; మిల్లర్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) కరణ్ 30; తెవాటియా (సి) వైశాక్ (బి) దయాళ్ 35; రషీద్ (బి) దయాళ్ 18; విజయ్‌శంకర్ (సి) సిరాజ్ (బి) వైశాక్ 10; మానవ్ (సి) స్వప్నిల్ (బి) వైశాక్ 1; మోహిత్ (రనౌట్) 0; నూర్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (19.3 ఓవర్లలో ఆలౌట్) 147. వికెట్ల పతనం: 1–1, 2–10, 3–19, 4–80, 5–87, 6–131, 7–136, 8–147, 9–147, 10–147. బౌలింగ్: స్వప్నిల్ సింగ్ 1–0–1–0, సిరాజ్ 4–0–29–2, యశ్ దయాళ్ 4–0–21–2, గ్రీన్ 4–0–28–1, విజయ్‌కుమార్ వైశాక్ 3.3–0–23–2, కరణ్ శర్మ 3–0–42–1. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: కోహ్లి (సి) సాహా (బి) నూర్ 42; డుప్లెసిస్ (సి) షారుఖ్ (బి) లిటిల్ 64; జాక్స్ (సి) షారుఖ్ (బి) నూర్ 1; పటిదార్ (సి) మిల్లర్ (బి) లిటిల్ 2; మ్యాక్స్‌వెల్ (సి) మిల్లర్ (బి) లిటిల్ 4; గ్రీన్ (సి) షారుఖ్ (బి) లిటిల్ 1; కార్తీక్ (నాటౌట్) 21; స్వప్నిల్ (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (13.4 ఓవర్లలో 6 వికెట్లకు) 152 వికెట్ల పతనం: 1–92, 2–99, 3–103, 4–107, 5–111, 6–117. బౌలింగ్: మోహిత్ శర్మ 2–0–32–0, జోష్ లిటిల్ 4–0–45–4, మానవ్ సుథర్ 2–0–26–0, నూర్ అహ్మద్ 4–0–23–2, రషీద్ ఖాన్ 1.4–0–25–0. ఐపీఎల్లో నేడుపంజాబ్ X చెన్నైవేదిక: ధర్మశాలమధ్యాహ్నం 3: 30 గంటల నుంచిలక్నో X కోల్‌కతావేదిక: లక్నోరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం
గాయంతో ఐపీఎల్ మిగతా మ్యాచ్‌కు మయాంక్ దూరం
పదునైన పేస్ బౌలింగ్‌తో ఈ ఐపీఎల్లో వెలుగులోకి వచ్చిచన మయాంక్ యాదవ్ మిగతా సీజన్‌కు దూరమయ్యాడు. పక్కటెముకల గాయంతో బాధపడుతున్న ఈ లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ మిగిలిన మ్యాచ్‌లు ఆడే అవకాశం లేదని జట్టు కోచ్ జస్టిన్ లాంగర్ వెల్లడించాడు. తొలిసారి ఐపీఎల్ బరిలోకి దిగిన 21 ఏళ్ల మయాంక్ తొలి రెండు మ్యాచ్‌లలో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. లక్నో విజయాల్లో కీలక పాత్ర పోషించి ఐపీఎల్లో ఆడిన తొలి రెండు మ్యాచ్‌లలో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ప్రతీ మ్యాచ్‌లో 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బౌలింగ్ చేస్తూ సత్తా చాటిన అతను గాయంతో మూడో మ్యాచ్ మధ్యలో తప్పుకున్నాడు. ఆ తర్వాత లక్నో ఆడిన ఐదు మ్యాచ్‌లకు దూరమైన అతను కోలుకొని ముంబైతో మ్యాచ్‌లో మళ్లీ బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్‌లో తన నాలుగో ఓవర్లో ఒక బంతి వేయగానే గాయం తిరగబెట్టడంతో మెదానం వీడాడు. లక్నో ప్లే ఆఫ్స్‌కు చేరితే మయాంక్ ఆడే అవకాశాలు ఉన్నాయని భావించినా... ఇప్పుడు ఆ అవకాశం లేదని తేలిపోయింది.
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్‌పై ఆర్సీబీ ఘన విజయం
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలుపున్‌కుంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఆర్సీబీ ఏడో స్ధానానికి చేరుకుంది. ఈమ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది.19.3 ఓవర్లలో 147 పరుగులకు గుజరాత్ ఆలౌటైంది. గుజరాత్ బ్యాటర్లలో షారూఖ్ ఖాన్ (37), డేవిడ్ మిల్లర్(30), రాహుల్ తెవాటియా(35) పర్వాలేదన్పించారు. ఇక ఆర్సీబీ బౌలర్లలో మహ్మద్ సిరాజ్, విజయ్ కుమార్, యశ్ దయాల్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. గ్రీన్, కరణ్ చెరో వికెట్ సాధించారు. అనంతరం 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 13.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.ఆర్సీబీ బ్యాటర్లలో ఓపెనర్లు ఫాప్ డుప్లెసిస్(23 బంతుల్లో 64), విరాట్ కోహ్లి(27 బంతుల్లో 42) పరుగులతో తుపాన్ ఇన్నింగ్స్ ఆడారు. ఆ తర్వాత దినేష్ కార్తీక్(21 నాటౌట్), స్వప్నిల్ సింగ్(15) పరుగులతో మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. గుజరాత్ బౌలర్లలో లిటిల్ 4 వికెట్లు పడగొట్టగా.. నూర్ ఆహ్మద్ రెండు వికెట్లు సాధించాడు.No RCB RCB fans will pass without liking this. ❤️🔥💫⭐Vintage RCB | Just RCB is RCBing | Can RCB vs GT | Faf du Plessis | Only RCB #RCBvsGT #GTvsRCB #ViratKohli pic.twitter.com/Ou5XvqxCv1— crazy (@cricrazyNandu) May 4, 2024
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్‌లు ఔట్! వీడియో
ఐపీఎల్-2024లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి అద్బుతమైన ఫీల్డింగ్ ప్రదర్శన పరిచాడు.కళ్లు చెదిరే త్రోతో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ షారూఖ్ ఖాన్‌ను రనౌట్ చేశాడు. గుజరాత్ ఇన్నింగ్స్ 13 ఓవర్ వేసిన విజయ్ కుమార్ బౌలింగ్‌లో రాహుల్ తెవాటియా ఆఫ్‌సైడ్ డిఫెన్స్ ఆడాడు.అయితే నాన్‌స్ట్రైక్‌లో ఉన్న షారూఖ్ ఖాన్ క్విక్ సింగిల్ కోసం ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. కానీ స్ట్రైక్‌లో ఉన్న తెవాటియా మాత్రం నో అంటూ వెనుక్కి వెళ్లమని కాల్ ఇచ్చాడు. అయితే షారూఖ్ ఖాన్ వెనక్కి వెళ్లే ప్రయత్నం చేసే లోపే మెరుపు వేగంతో బంతిని అందుకున్న విరాట్ బౌలర్ ఎండ్‌లో స్టంప్స్‌ను పడగొట్టాడు. వెంటనే ఆర్సీబీ ఆటగాళ్లు సంబరాల్లో మునిగి తేలిపోయారు. ఫీల్డ్ అంపైర్ థర్డ్ రిఫర్ చేయగా.. రీప్లేలో కూడా రనౌట్‌గా తేలింది. కోహ్లి సంచలన త్రో చూసిన అందరూ బిత్తరపోయారు. కామెరాన్ గ్రీన్ అయితే కోహ్లి వైపు చూస్తూ షాకింగ్ రియాక్షన్ ఇచ్చాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బిజినెస్
పాతదాన్ని తుక్కుగా మారిస్తే కొత్త వాహనానికి రాయితీ..ఎంతంటే..
కాలంచెల్లిన వాహనాలను తుక్కుగా మార్చి వాటిస్థానంలో కొత్త వాటిని కొనుగోలు చేసే వారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలను ప్రకటించింది. వెహికల్ స్క్రాపేజ్ పాలసీ ప్రకారం..పాత వ్యక్తిగత వాహనాన్ని తుక్కుగా మార్చి కొత్తది కొనుగోలు చేయాలనుకునే వారు వాహన ధరలో లేదా రోడ్డు పన్నులో 25 శాతం వరకు రాయితీ పొందవచ్చు. అదే వాణిజ్య వాహనాలకు 15 శాతం రాయితీ పొందే వీలుంది.ఫిట్నెస్ లేని, కాలం చెల్లిన వాహనాలను దశలవారీగా తొలగించి వాయు కాలుష్యాన్ని తగ్గించడం, ఆటోమొబైల్ రంగాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా ఈ స్క్రాపేజ్ విధానాన్ని తీసుకొచ్చారు. భారతీయ రోడ్లపై గత 15 ఏళ్లగా 5 కోట్ల ప్రైవేట్ మోటారు వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయని అంచనా. దాంతో గణనీయమైన వాయు కాలుష్యం ఏర్పడుతోంది. కాలంచెల్లిన ఈ వాహనాలను తుక్కుగా మార్చాల్సి ఉంటుంది. వాహనదారులు తిరిగి కొత్తవాటిని కొనుగోలు చేసేలా వారికి ప్రోత్సాహకాలు, రాయితీలు అందిస్తున్నారు. ఇప్పటికే ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు.తుక్కుగా మార్చిన వాహనం విలువలో 10-25శాతం కొత్త వాహన ధరల్లో లేదా రోడ్డు పన్ను చెల్లింపులో రాయితీ ఇస్తున్నట్లు ప్రభుత్వం చెప్పింది. వాణిజ్య, ప్రైవేట్ వాహనాలకు వేర్వేరు కాలాలు నిర్ణయించారు. ప్రభుత్వ వెహికల్ స్క్రాపింగ్ విధానం ప్రకారం.. పెట్రోల్ లేదా డీజిల్ ఇంధనంతో నడిచే వ్యక్తిగత వాహనాలను 15 ఏళ్ల తర్వాత మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తిరిగి రెన్యువల్ అయిన తర్వాత 5 ఏళ్లు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. 20 ఏళ్ల తర్వాత వాహనాన్ని వినియోగించాలనుకుంటే ప్రతి ఐదేళ్లకు ఒకసారి తప్పనిసరిగా ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలి. ఇదీ చదవండి: అగ్ని ప్రమాదం.. చిన్నపాటి ఖర్చుతో మరింత భద్రం!దిల్లీ-ఎన్సీఆర్కు ఈ నిబంధనల్లో మార్పులున్నాయి. అక్కడ పెట్రోల్ వాహనాలకు గరిష్ట వయోపరిమితి 15 ఏళ్లు కాగా, డీజిల్ వాహనాలకు గరిష్ట వయోపరిమితి 10 ఏళ్లు. దిల్లీ రోడ్లపై పరిమితికి మించి పాత కారు కనిపిస్తే రూ.10,000 చెల్లించాల్సి ఉంటుంది. దాంతోపాటు ఆ వాహనాన్ని నేరుగా స్క్రాపింగ్ కోసం పంపించాలి.
Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ కంపెనీలలో లేఆఫ్‌ల పరంపర కొనసాగుతూనే ఉంది. ఆర్థిక అనిశ్చితి, ప్రాజెక్ట్‌లు తగ్గిపోవడం వంటి కారణాలతో ఖర్చులు తగ్గించుకునేందుకు అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. టెక్ కంపెనీల్లో లేఆఫ్‌లకు సంబంధించి షాకింగ్ రిపోర్ట్ ఒకటి వెల్లడైంది. ఒక్క ఏప్రిల్ నెలలోనే 21 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి టెక్ కంపెనీలు.layoffs.fyi ప్రచురించిన తాజా డేటా ప్రకారం.. టెక్నాలజీ రంగంలోని 50 కంపెనీల నుండి ఒక్క ఏప్రిల్ నెలలోనే 21,473 మంది ఉద్యోగులు ఉద్వాసనకు గురయ్యారు. ఈ ఏడాది లేఆఫ్‌ల ధోరణికి ఏప్రిల్ నెల తొలగింపులు అద్దం పడుతున్నాయి. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి కనీసం ఇప్పటి వరకూ 271 కంపెనీలు 78,572 మంది ఉద్యోగులను తొలగించాయి. జనవరిలో 122 కంపెనీలలో 34,107 ఉద్యోగాల కోతలు జరిగాయి. ఫిబ్రవరిలో 78 కంపెనీలు 15,589 మందిని తొలగించాయి. ఇక మార్చిలో 37 కంపెనీల్లో 7,403 మంది ఉద్యోగాలను కోల్పోయారు. మార్చి నుంచి ఏప్రిల్‌కు ఒక్క నెలలో ఉద్యోగుల తొలగింపులు మూడు రెట్లు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.ఏప్రిల్‌లో టెక్ తొలగింపులుయాపిల్ ఇటీవల 614 మంది ఉద్యోగులను తొలగించింది. ఇది మొదటి ప్రధాన రౌండ్ ఉద్యోగ కోత.పైథాన్, ఫ్లట్టర్, డార్ట్‌లో పనిచేస్తున్న వారితో సహా వివిధ టీమ్‌లలో గణనీయమైన సంఖ్యలో ఉద్యోగులను గూగుల్ తొలగించింది.అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ విభాగంలో వందలాది ఉద్యోగాలను తగ్గించింది.ఇంటెల్ దాని ప్రధాన కార్యాలయంలోని దాదాపు 62 మంది ఉద్యోగులను లేఆఫ్ చేసింది. ఎడ్టెక్ కంపెనీ బైజూస్ సుమారు 500 మంది ఉద్యోగులను తొలగించింది.ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా అత్యధికంగా 14 వేల మందిని లేఆఫ్ చేసింది.ఓలా క్యాబ్స్ దాదాపు 200 ఉద్యోగాలను తొలగించింది. హెల్త్ టెక్ స్టార్టప్ హెల్తీఫైమ్ దాదాపు 150 మంది ఉద్యోగులను తొలగించింది. గృహోపకరణాలను తయారు చేసే వర్ల్‌పూల్ సుమారు 1,000 మందిని లేఆఫ్ చేసింది.టేక్-టూ ఇంటరాక్టివ్ కంపెనీ తమ వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 5% మందిని తొలగించింది. నార్వేలోని టెలికాం కంపెనీ టెలినార్ 100 మంది ఉద్యోగులను తొలగించింది.
అగ్ని ప్రమాదం.. చిన్నపాటి ఖర్చుతో మరింత భద్రం!
రూ.లక్షలు ఖర్చుపెట్టి ఇల్లు కట్టుకుంటాం. నచ్చిన విధంగా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసుకుంటాం. భద్రంగా ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. అనుకోకుండా అగ్ని ప్రమాదం జరిగితే విలువైన వస్తువులు కాలిపోవడంతోపాటు కొన్నిసార్లు మనుషుల ప్రాణాలు పోవచ్చు. ఫైరింజన్ సిబ్బందికి సమాచారం అందించినా వారు వచ్చేలోపు ప్రమాదం మరింత తీవ్రస్థాయికి చేరవచ్చు. అసలే వేసవికాలం ఇలాంటి ప్రమాదాలకు ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఇళ్లు నిర్మించుకున్న తర్వాత కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మరింత రక్షణగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంటితోపాటు కంపనీలు, షాపింగ్‌మాల్స్, భవనాల్లో తప్పకుండా ఫైర్ ఎక్స్టింగ్విషర్లు ఉపయోగించాలంటున్నారు. వీటికోసం చేసే చిన్నపాటి ఖర్చుతో ఇంటికి మరింత భద్రత కల్పించవచ్చని చెబుతున్నారు. వాటిని ఎంచుకునేముందు కనీస అవగాహన తప్పనిసరని అభిప్రాయపడుతున్నారు.మంటలను ఆర్పేందుకు ఉపయోగించే ఫైర్ ఎక్స్టింగ్విషర్లు చాలా రకాలుగా ఉంటాయి.స్టాండర్డ్ వాటర్: కాగితం, కార్డ్బోర్డ్, ప్లాస్టిక్, కలప, ఫ్యాబ్రిక్‌కు అంటిన మంటలను అదుపు చేయవచ్చు.డ్రైవాటర్ మిస్ట్: నీటి రేణువులను పొడి సూక్ష్మకణాలుగా మార్చి మంటపై చల్లుతుంది.వెట్ కెమికల్: మంటలపై సబ్బు ద్రావణాన్ని చల్లుతుంది. కొవ్వులు, వంట నూనెల వల్ల సంభవించే మంటలను అదుపు చేయవచ్చు. పౌడర్: పెట్రోల్, డీజిల్, గ్యాసోలిన్ నుంచి వచ్చే మంటలు, మీథేన్, ప్రొపేన్, బ్యూటేన్ వంటి వాయువుల వల్ల ఏర్పడే వాటినిక ఆర్పవచ్చు. కార్బన్ డైయాక్సైడ్: పెట్రో ఉత్పత్తులు, విద్యుత్తు వల్ల కలిగే మంటలు తగ్గించవచ్చు.వాటర్ మిస్ట్ టైప్ ఫైర్: వరండాలు, వంట గదిలో వాడుకోవచ్చు. ఇది మంటపై నీటిని స్ప్రే చేస్తుంది.
రూ.194 డివిడెండ్ ప్రకటించిన కంపెనీ
ప్రముఖ టైర్ల తయారీ కంపెనీ ఎంఆర్ఎఫ్ తన ఇన్వెస్టర్లకు రూ.10 ముఖవిలువ కలిగిన ప్రతి షేరుకు రూ.194 డివిడెండ్ ప్రకటించింది.2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఎంఆర్ఎఫ్ నికరలాభం రూ.2081 కోట్లుగా నమోదైంది. 2022-23 నికరలాభం రూ.769 కోట్లుగా కంపెనీ పోస్ట్ చేసింది. కార్యకలాపాల ఆదాయం కూడా రూ.23,008 కోట్ల నుంచి రూ.25,169 కోట్లకు వృద్ధి చెందినట్లు చెప్పింది.మార్చి త్రైమాసికంలో రూ.396 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.341 కోట్లతో పోలిస్తే ఇది 16% ఎక్కువ. కంపెనీ తాజాగా ప్రకటించిన డివిడెండ్‌తోపాటు ఇప్పటికే మధ్యంతర డివిడెండ్‌ను రెండుసార్లు రూ.3 చొప్పున సంస్థ అందించింది.ఇదీ చదవండి: నేపాల్‌లో నిలిచిన ఇంటర్నెట్ సేవలు.. కారణం..బ్రిటానియా రూ.73.50 డివిడెండ్బ్రిటానియా ఇండస్ట్రీస్ మార్చి త్రైమాసికంలో రూ.536.61 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని ప్రకటించింది. 2022-23 ఇదే కాలంలో నమోదుచేసిన లాభం రూ.557.60 కోట్ల కంటే ఇది తక్కువ. ఇదే సమయంలో కార్యకలాపాల ఆదాయం రూ.4023.18 కోట్ల నుంచి 1.14% పెరిగి రూ.4069.36 కోట్లకు చేరింది. రూ.1 ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు రూ.73.50 చొప్పున డివిడెండ్ ప్రకటించింది.
వీడియోలు
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల కామెంట్స్
భూముల రక్షణకే కొత్త చట్టం..క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్
టీడీపీలో భగ్గుమన్న వర్గపోరు.. తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు
చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు
చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్
పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్
వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి
ఫ్యామిలీ
'విడిపోతామని విపరీతమైన భయం'! అసలు కారణమేంటి?
భారతికి ఇద్దరు పిల్లలు. భర్త భరత్ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. భారతి గతంలో పనిచేసినప్పటికీ, ప్రస్తుతం పిల్లలకోసం ఇంట్లోనే ఉంటోంది. కానీ పిల్లలను స్కూల్‌కు పంపాలంటే విపరీతంగా భయపడుతోంది. వాళ్లు తనకు దూరమవుతారేమోనని ఆందోళన చెందుతోంది. స్కూలుకెళ్తే పిల్లలు దూరమవుతారనే భయమేంటోయ్ అని భరత్ జోక్ చేసినా ఆమె ఆందోళన తగ్గకపోగా, భర్త ఎక్కడ దూరమవుతాడోననే భయమూ మొదలైంది. నీవన్నీ పిచ్చి భయాలని భర్త ఎంత చెప్పినా ఆమెకు ధైర్యం రావడం లేదు. ఏం చేయాలో అర్థంకాని పరిస్థితుల్లో కౌన్సెలింగ్‌కి అటెండ్ అయింది.భారతితో మాట్లాడుతున్న క్రమంలో ఆమె చిన్నప్పుడు తల్లిదండ్రులకు దూరంగా హాస్టల్లో పెరిగిందనే విషయం తెలిసింది. తల్లిదండ్రుల మధ్య గొడవల వల్ల ఆమెను హాస్టల్లో ఉంచారని చెప్పింది. పేరెంట్స్ ఎక్కడ విడిపోతారోనని రోజూ భయపడేదాన్నని, తాను భయపడినట్లు వాళ్లు విడిపోయారని బాధపడింది. అప్పటినుంచీ ఒంటరిగానే ఉంటున్నానని, కానీ ఒంటరితనం విపరీతమైన ఆందోళనను పెంచిందని చెప్పింది. భారతి గురించి పూర్తిగా తెలుసుకున్నాక ఆమె సెపరేషన్ యాంగ్జయిటీ డిజార్డర్‌తో బాధపడుతోందని అర్థమైంది. ఇష్టమైన వ్యక్తి నుంచి విడిపోతామనే భయమే ఈ డిజార్డర్. ఇది పిల్లల్లో సహజం. అయితే భారతిలానే కొందరు పెద్దల్లో కూడా ఉంటుంది.ఎప్పడు మొదలవుతుంది?విడిపోతామనే ఆందోళన సాధారణంగా ఎనిమిది నెలల వయసు నుంచి ప్రారంభమవుతుంది. ఈ వయస్సులో పిల్లలను విడిచిపెట్టి తల్లిదండ్రులు పక్కకు వెళ్లినప్పడు ఆందోళన చెందుతారు. రెండేళ్ల వయసు వచ్చేసరికి తల్లిదండ్రులు తమను వదిలి వెళ్లరని, తిరిగి వస్తారని అర్థం చేసుకోవడం మొదలుపెడ్తారు. అయితే కొందరిలో ఇది ఆ తర్వాత కూడా కొనసాగుతుంది. జీవిత భాగస్వామితో లేదా రక్తసంబంధీకులు, స్నేహితులతో విడిపోతామని ఆందోళన చెందుతుంటారు.పిల్లల్లో సెపరేషన్ యాంగ్జయిటీకి కారణాలు..సెపరేషన్ యాంగ్జయిటీ డిజార్డర్ జన్యుపరమైనది కావచ్చు. ఇది కుటుంబ పరంగానూ రావచ్చు. జీవితంలో జరిగే సంఘటనలూ కారణం కావచ్చు. ఉదాహరణకు..కుటుంబ సభ్యుల మరణంతల్లిదండ్రులు విడిపోవడం తల్లిదండ్రులు లేకపోవడంవలస వెళ్లాల్సి రావడంపాఠశాల మార్పుతల్లిదండ్రుల్లో ఆందోళనతల్లిదండ్రుల మద్య వ్యసనందత్తతకు వెళ్లడంపెద్దల్లో కారకాలు..ప్రియమైన వ్యక్తిని కోల్పోవడంకఠినమైన పెంపకంజీవితంలో నిత్యం సవాళ్లు, ఒత్తిళ్లుచిన్నతనంలో ఆందోళన రుగ్మతపిల్లల్లో కనిపించే లక్షణాలు..పిల్లల్లో తరచుగా ప్రీస్కూల్, డేకేర్ సమయంలో ఇది ప్రారంభమవుతుంది. మిమ్మల్ని వదిలివెళ్లడానికి బిడ్డ నిరాకరించవచ్చు, కోపం ప్రదర్శించవచ్చు. · కుటుంబ సభ్యులకు ఏదైనా చెడు జరుగుతుందనే భయం· ఒంటరిగా మిగిలిపోతానేమోనని భయం· తప్పిపోతామేమో, ఎవరైనా ఎత్తుకెళ్తారేమోననే భయం· పీడ కలలు· నిద్రలో మూత్రం పోయడంపెద్దల్లో కనిపించే ఇతర లక్షణాలు..· ఇష్టమైన వారు దగ్గర లేనప్పుడు భయాందోళనలు · ప్రియమైన వ్యక్తి గాయపడతారనే భయం · ఎవరితోనూ కలవకపోవడం · ఏకాగ్రత కోల్పోవడం.జీవితంపై తీవ్ర ప్రభావం..సెపరేషన్ యాంగ్జయిటీ డిజార్డర్ జీవన నాణ్యతను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అది పాఠశాల, ఉద్యోగ జీవితం పై తీవ్ర ప్రభావం చూపుతుంది. కడుపు నొప్పి, తలనొప్పి, తల తిరగడం, వికారం, వాంతులు, అతిసారం, ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి ఆరోగ్య సమస్యలు రావచ్చు. వీటితో పాటు డిప్రెషన్, ఇతర యాంగ్జయిటీ డిజార్డర్స్, అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్లూ తలెత్తవచ్చు.నివారించడమెలా?సెపరేషన్ యాంగ్జయిటీ డిజార్డర్‌ను నివారించడానికి ఎలాంటి మార్గాలూ లేవు. అయితే పిల్లల్లో ఈ సమస్య రాకుండా ఉండేందుకు తల్లిదండ్రులు కొన్ని చర్యలు తీసుకోవచ్చు. · నమ్మకమైన బేబీ సిట్టర్‌ను ఏర్పాటు చేయడం ద్వారా వేరుగా ఉండటం ప్రాక్టీస్ చేయాలి..· కొద్ది సమయంపాటు విడిగా ఉండటం పిల్లలకు అలవాటు చేయాలి..· ఎక్కడైనా వదిలివెళ్లినప్పుడు, చెప్పిన సమయానికి రావడం ద్వారా నమ్మకాన్ని పెంచాలి.. · అయినప్పటికీ పిల్లల్లో ఆందోళన కనిపిస్తుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్‌ను కలవాలి..· కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ద్వారా ఈ రుగ్మతకు చికిత్సను అందించొచ్చు. · డయలెక్టికల్ బిహేవియరల్ థెరపీతో పాటు ఫ్యామిలీ థెరపీ, గ్రూప్ థెరపీ కూడా ఎమోషనల్ మేనేజ్మెంట్లో సహాయపడతాయి. · అవసరమైతే సైకియాట్రిస్ట్‌ను కలసి మందులు తీసుకోవాల్సి ఉంటుంది.— సైకాలజిస్ట్ విశేష్
రేటే 'బంగార'మాయెనే..!
1990లో 1 కేజీ బంగారం = మారుతీ 800 కారు2000లో 1 కేజీ బంగారం = మారుతీ ఎస్టీమ్2005లో 1 కేజీ బంగారం = టయోటా ఇన్నోవా2010లో 1కేజీ బంగారం = టయోటా ఫార్చూనర్2016లో 1 కేజీ బంగారం = బీఎండబ్ల్యూ ఎక్స్12019లో 1 కేజీ బంగారం = వోల్వో ఎస్602024లో 1 కేజీ బంగారం = ఆడి క్యూ52030 వరకు దాచిపెట్టుకుంటే... ఏకంగా ప్రైవేట్ జెట్‌నే కొనేయొచ్చేమో!అతిశయోక్తిగా ఉంది కదూ! ఆకాశమే హద్దుగా.. రోజు రోజుకు కొత్త రికార్డులతో దూసుకెళ్తున్న పుత్తడి దూకుడు చూస్తే ఏమో.. పసిడి పెరగావచ్చు అనిపించక మానదు!! ఏడాది క్రితం 10 గ్రాములు రూ.60,000 స్థాయిలో ఉన్న బంగారం రేటు తాజాగా రూ. 75,000 స్థాయికి చేరి ధర‘ధగ’లాడిపోతోంది. అసలే రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో అట్టుడుకుతుంటే... పులిమీద పుట్రలా పశ్చిమాసియాలో ఇరాన్–ఇజ్రాయెల్ మిసైళ్ల మోతతో ప్రపంచానికి ముచ్చెమటలు పడుతున్నాయి.అధిక ధరలతో అతలాకుతలం అవుతున్న ఆర్థిక వ్యవస్థలను ఈ యుద్ధభయాలు వెంటాడుతుండటంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు సురక్షిత సాధనమైన బంగారం వైపు పరుగులు తీస్తున్నారు. దీనికితోడు అమెరికా డాలర్ ప్రాభవానికి గండిపడటంతో ప్రభుత్వాలు కూడా కనకాన్నే నమ్ముకుని, ఎగబడి కొంటున్నాయి. మరోపక్క, రేటెంతైనా తగ్గేదేలే అంటూ జనాలు సైతం పసిడి వెంటపడుతున్నారు.ఇలా అన్నివైపుల నుంచి డిమాండ్ పోటెత్తి రేటు ’మిసైల్’లా దూసుకెళ్తోంది. అసలు ఈ స్వర్ణకాంతులకు కారణమేంటి? ప్రపంచవ్యాప్తంగా పసిడి నిల్వల సంగతేంటి? ఈ గోల్డ్ రష్.. పుత్తడిని ఇంకెన్ని కొత్త శిఖరాలకు చేరుస్తుంది? పసిడిలో పెట్టుబడికి ఏ రూటు బెటర్? ఇవన్నీ తెలుసుకోవాలంటే బంగారు‘గని’ అలా తవ్వొద్దాం పదండి!!యుగాలుగా ప్రపంచమంతా కాంతులీనుతున్న లోహం ఏదైనా ఉందంటే నిస్సందేహంగా బంగారమే! అందుకే వేల సంవత్సరాల నుంచి, ఏ నాగరికత చూసినా పసిడి వేట కొనసాగుతూనే ఉంది. అయితే, ప్రస్తుతం భూమ్మీద ఉన్న బంగారం మొత్తంలో దాదాపు 86 శాతం గడచిన 200 ఏళ్లలోనే తవ్వి తీసినట్లు చరిత్రకారులు, జియాలజిస్టులు చెబుతున్నారు. అధునాతన మైనింగ్ టెక్నిక్‌లు అందుబాటులోకి రావడంతో 18వ శతాబ్దం ఆరంభంలో పెద్దయెత్తున పసిడి ఉత్పత్తి ప్రారంభమైంది.కాలిఫోర్నియా గోల్డ్ రష్ అన్నింటిలోకెల్లా ప్రాచుర్యం పొందింది. 1848 నుంచి 1855 నాటికి ఇక్కడ 2 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని వెలికి తీయడం విశేషం. ఇక 1890 వరకు అమెరికా, ఆస్ట్రేలియా, రష్యా టాప్–3 పుత్తడి ఉత్పత్తి దేశాలుగా ఉండేవి. అయితే, 1886లో దక్షిణాఫ్రికాలోని విట్వాటర్స్రాండ్ బేసిన్లో కనుగొన్న నిక్షేపాలు ఆ దేశ ముఖచిత్రంతో పాటు ప్రపంచ పసిడి మార్కెట్‌ను సైతం సమూలంగా మార్చేశాయి. అతిపెద్ద బంగారు క్షేత్రాల్లో ఒకటిగా ఇది చరిత్ర సృష్టించింది.శతాబ్దం పాటు ఉత్పత్తిలో రారాజుగా స్వర్ణకాంతులతో మెరిసిపోయింది. 1970లో దక్షిణాఫ్రికా పసిడి ఉత్పత్తి 1,002 టన్నుల గరిష్ఠ స్థాయిని అందుకుంది. ఇప్పటిదాకా ఏ దేశం కూడా ఒకే ఏడాదిలో ఇంత బంగారాన్ని ఉత్పత్తి చేయలేదు. 1980 నుంచి పసిడి ధరలు అంతకంతకూ పెరగడంతో ప్రపంచంలో చాలా చోట్ల స్వర్ణం కోసం వేట జోరందుకుంది. 2007 నాటికి చైనా ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఆవిర్భవించడం విశేషం. ప్రస్తుతం 40కి పైగా దేశాల్లో పుత్తడి మైనింగ్ జోరుగా సాగుతోంది.ఉత్పత్తి మందగమనం...వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లెక్కల ప్రకారం 2018లో ప్రపంచవ్యాప్తంగా 3,655 టన్నుల బంగారం గనుల నుంచి ఉత్పత్తయింది. ఇదే ఇప్పటిదాకా ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయి. అక్కడి నుంచి తగ్గుముఖం పట్టి, గత మూడేళ్లుగా ఉత్పత్తి ఎదుగూబొదుగూ లేకుండా 3,600 టన్నులకే పరిమితమవుతోంది. ఒకప్పుడు ప్రపంచ బంగారు గనిగా పేరొందిన దక్షిణాఫ్రికా ఇప్పుడు వెలవెలబోతోంది. చైనా 2023లో 370 టన్నులను ఉత్పత్తి చేసి ‘టాప్’లేపింది. తర్వాత టాప్–10లో రష్యా (310 టన్నులు), ఆస్ట్రేలియా (310), కెనడా (200), అమెరికా (170), కజక్‌స్థాన్ (130), మెక్సికో (120), ఇండోనేషియా (110) దక్షిణాఫ్రికా (100), ఉజ్బెకిస్థాన్ (110), పెరూ (90) ఉన్నాయి. రికార్డు ధరల నేపథ్యంలో పాత బంగారం రీసైక్లింగ్ కూడా పుంజుకుంటోంది. 2023లో 9 శాతం పెరిగి 1,237 టన్నులకు చేరింది. ప్రస్తుత ప్రపంచ పసిడి ఉత్పత్తిలో 32 శాతం వాటా చైనా, రష్యా, ఆస్ట్రేలియాలదే కావడం గమనార్హం.తవ్విందెంత.. తవ్వాల్సిందెంత?ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా భూమి నుంచి వెలికితీసిన బంగారం మొత్తం 2,01,296 టన్నులుగా అంచనా. ఇందులో ఆభరణాల రూపంలోనే దాదాపు సగం, అంటే 93,253 టన్నులు ఉంది. దీని విలువ 7.2 ట్రిలియన్ డాలర్లు. ప్రైవేటు పెట్టుబడుల రూపంలో 3.4 ట్రిలియన్ డాలర్ల విలువైన 44.384 టన్నుల (22%) స్వర్ణం వాల్టుల్లో భద్రంగా ఉంది. వివిధ దేశాల (సెంట్రల్ బ్యాంకులు) వద్ద నిల్వలు 34,211 టన్నులు (17%). వీటి విలువ 2.7 ట్రిలియన్ డాలర్లు. పారిశ్రామిక అవసరాల కోసం వినియోగంలో ఉన్నది 29,448 టన్నులు (15%). 2.3 ట్రిలియన్ డాలర్లు. ప్రస్తుత ధర ప్రకారం ఈ బంగారం మొత్తం విలువ 15.6 ట్రిలియన్ డాలర్లు. మన కరెన్సీలో చెప్పాలంటే రూ. 1,303 లక్షల కోట్లు. ఇక భూమిలో ఇంకా నిక్షిప్తమై ఉన్న బంగారం విషయానికొస్తే, ప్రపంచవ్యాప్తంగా మైనింగ్ కంపెనీలు కనుగొన్న కచ్చితమైన నిల్వలు 53,000 టన్నులు మాత్రమే మిగిలాయి. ప్రస్తుత వార్షిక ఉత్పత్తి (3,600 టన్నులు) ప్రకారం చూస్తే, మరో 15 ఏళ్లలో ఈ నిల్వలన్నీ అయిపోతాయి. ఈలోగా కొత్త నిక్షేపాలను కనిపెట్టాలి. లేదంటే ఉత్పత్తి అడుగంటి, రీసైక్లింగ్‌పై ఆధారపడాల్సిందే!రేటెందుకు పరుగులు పెడుతోంది?ఏ వస్తువు (కమోడిటీ) ధరకైనా గీటురాయి డిమాండ్, సరఫరానే. గత కొన్నేళ్లుగా గనుల నుంచి పసిడి ఉత్పత్తి మందగించింది, భూమిలో మిగిలున్న నిల్వలు అడుగంటుతున్నాయి. 2021 నుంచి భారీ నిక్షేపాలేవీ దొరకడం లేదు. దీంతో భవిష్యత్తులో స్వర్ణం మరింత అరుదైన లోహంగా మారనుంది. మరోపక్క ఆభరణాల డిమాండ్ ఏమాత్రం తగ్గడం లేదు. వన్నె తగ్గని సురక్షిత పెట్టుబడి, ద్రవ్యోల్బణానికి విరుగుడుగా ఇన్వెస్టర్లు ఈటీఎఫ్‌ల వంటి సాధనాల ద్వారా పుత్తడిలో మదుపు చేసేందుకు ఎగబడుతున్నారు. ప్రపంచ దేశాలు డాలర్లలో వాణిజ్యానికి క్రమంగా చెల్లు చెప్పడంతో పాటు తమ విదేశీ కరెన్సీ నిల్వల్లో డాలర్ నిధులను తగ్గించుకుంటున్నాయి.ఫలితంగా డీ–డాలరైజేషన్ జోరందుకుంది. ఆంక్షల భయాలకు తోడు కరెన్సీ క్షీణతకు విరుగుడుగా బంగారం నిల్వలను సెంట్రల్ బ్యాంకులు పెంచుకుంటూ పోతున్నాయి. గత పదేళ్లలో సగటున ఏటా 800 టన్నులు కొన్నాయి. ఇటీవల కొనుగోళ్ల జోరు పెంచిన మన ఆర్బీఐ వద్ద 817 టన్నుల బంగారం ఉంది. ఇక పారిశ్రామిక అవసరాలు (ఎలక్ట్రానిక్స్, డెంటిస్ట్రీ, అంతరిక్ష రంగం) ఎగబాకుతున్నాయి. ఇలా సరఫరా మందగించి.. డిమాండ్ పెరిగిపోవడమే బంగారం పరుగుకు ప్రధాన కారణం. ఇక రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి తోడు, ఇరాన్–ఇజ్రాయెల్ దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది.ఈ భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలతో ద్రవ్యోల్బణం ఎగసి జేబుకు చిల్లుపెడుతోంది. దీంతో ఇన్వెస్టర్లు అనిశ్చితుల్లో ఆదుకునే సురక్షిత సాధనాల్లోకి, ముఖ్యంగా బంగారంలోకి తమ పెట్టుబడులను తరలిస్తున్నారు. ఫిబ్రవరిలో 2,000 డాలర్లకు అటూఇటుగా ఉన్న ఔన్స్ బంగారం ధర ఇరాన్–ఇజ్రాయెల్ ఘర్షణలతో భగ్గుమంది. తాజాగా 2,449 డాలర్ల ఆల్‌టైమ్ గరిష్ఠాన్ని తాకింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కొండెక్కి కూర్చున్న వడ్డీరేట్లు ఇకపై దిగొచ్చే అవకాశాలున్నాయి. ఇది పసిడికి మరింత డిమాండ్‌ను పెంచడంతో పాటు ధరలు ఎగిసేందుకు దారితీసే అంశం.స్టోర్ ఆఫ్ వాల్యూలో టాప్..ప్రపంచంలో ఏ అసెట్ (ఆస్తి)కీ లేనంత స్టోర్ ఆఫ్ వాల్యూ బంగారం సొంతం. స్టోర్ ఆఫ్ వాల్యూ అంటే మన దగ్గర ఏదైనా అసెట్ (కరెన్సీ, బంగారం, భూమి, ఇళ్లు, షేర్లు ఇతరత్రా) ఉంటే, ఎన్నాళ్లయినా దాని విలువ పెరగడమే కానీ ఆవిరైపోకుండా ఉండటం అన్నమాట. ఉదాహరణకు లక్ష రూపాయలు పెట్టి బంగారం కొని, అదే సమయంలో లక్ష రూపాయలను దాచామనుకోండి. కొన్నేళ్ల తర్వాత పసిడి విలువ కచ్చితంగా పెరుగుతుందే తప్ప దిగజారదు. కానీ నగదు విలువ మాత్రం పడిపోతుంది. రెండేళ్ల కిందట కేజీ బియ్యం ధర రూ.40 స్థాయిలో ఉంటే ఇప్పుడు 70కి చేరింది. అంటే కరెన్సీకి ఉన్న కొనుగోలు విలువ అంతకంతకూ ఆవిరైపోతోందని అర్థం. స్టోర్ ఆఫ్ వాల్యూ కలిగిన అతి కొద్ది అసెట్లలో భూమి కూడా ఉన్నప్పటికీ, పుత్తడిలా వెంటనే సొమ్ము చేసుకోవడం (లిక్విడిటీ) కష్టం. కాబట్టి అసలుకు మోసం రాకుండా... లిక్విడిటీలోనూ పసిడిని మించింది లేదు. మన పెద్దలు ‘పొలం పుట్రా.. నగా నట్రా’ వెనకేసుకోమన్నది అందుకే!ఎలా కొన్నా.. బంగారమే!ప్రపంచవ్యాప్తంగా ఉన్న బంగారంలో దాదాపు సగం ఆభరణాల రూపంలోనే ఉంది. మగువలకు బంగారమంటే ఎంత మక్కువో చెప్పేందుకు ఇదే నిదర్శనం. రేటు ఎగబాకుతుండటంతో అందకుండా పోతుందేమోనన్న ఆతృత అందరిలోనూ పెరిగిపోతోంది. అందుకే పసిడి పెట్టుబడులూ జోరందుకున్నాయి. మరి ఏ రూపంలో కొంటే మంచిది అనేది చాలా మందికి వచ్చే డౌటు. నిజానికి పెట్టుబడికి కూడా మన దేశంలో ఇప్పటికీ ఆభరణాల రూపంలో కొనేవారే ఎక్కువ. ఎందుకంటే నచ్చినప్పుడు ధరించి, ఆనందించవచ్చనేది వారి అభిప్రాయం.దీనివల్ల తరుగు, మజూరీ పేరుతో కొంత నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి, ధరించేందుకు అవసరమైనంత ఆభరణాలను పక్కనబెడితే, పెట్టుబడికి మాత్రం కాయిన్లు, బార్ల రూపంలో 24 క్యారెట్ల బంగారాన్ని కొనడం బెటర్. అయితే, ఇందులో కూడా అదనపు చార్జీల భారం ఉంటుంది. అంతేకాకుండా భౌతిక రూపంలో బంగారాన్ని కొన్నా, అమ్మినా 3 శాతం వస్తుసేవల పన్ను (జీఎస్టీ) బాదుడు తప్పదు. ఆభరణాలు, నాణేలు, కడ్డీల రూపంలో కొని దాచుకోవడం రిస్కు కూడా. పోనీ లాకర్లలో దాచుకోవాలంటే ఫీజులు కట్టాల్సి ఉంటుంది. వీటన్నింటికీ మెరుగైన ప్రత్యామ్నాయం సార్వభౌమ గోల్డ్ బాండ్లు (ఎస్‌జీబీలు), గోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌లు) తదితర రూపాల్లో లభించే డిజిటల్ గోల్డ్.అయితే, వీటిని కొనాలంటే డీమ్యాట్ ఖాతా ఉండాలి. బంగారం మార్కెట్ ధరకు అనుగుణంగా షేర్ల మాదిరిగానే ఇవి కూడా ట్రేడవుతాయి. నచ్చినప్పుడు విక్రయించుకొని సొమ్ము చేసుకోవచ్చు. ఈటీఎఫ్‌లలో నామమాత్రంగా చార్జీలు ఉంటాయి. కానీ, ఎస్జీబీలకు ఎలాంటి చార్జీలూ లేవు. అంతేకాదు, వార్షికంగా 2.5 శాతం వడ్డీ కూడా లభిస్తుంది. అయితే, ఏ రూపంలో కొన్నాసరే ఇన్వెస్టర్లు తమ తమ పెట్టుబడి మొత్తంలో కనీసం 10–15 శాతాన్ని బంగారానికి కేటాయించడం ఉత్తమమని, క్రమానుగత పెట్టుబడి(సిప్) రూపంలో ఇన్వెస్ట్ చేయాలనేది ఆర్థిక నిపుణుల ‘బంగారు’ మాట!బంగారు భారత్!ఆర్బీఐ దగ్గరున్న 817 టన్నుల బంగారాన్ని పక్కనబెడితే, అనధికారిక లెక్కల ప్రకారం భారతీయుల వద్ద ఆభరణాలు, ఇతరత్రా రూపాల్లో ఉన్న బంగారం మొత్తం 25,000 టన్నులకు పైగానే ఉంటుందని అంచనా. భూమ్మీద ఉన్న మొత్తం బంగారంలో ఇది 13 శాతం. అంటే దాదాపు 1.93 ట్రిలియన్ డాలర్లు. మన కరెన్సీలో రూ. 161 లక్షల కోట్లు. భారత స్థూల దేశీయోత్త్పత్తి (3.7 ట్రిలియన్ డాలర్లు)లో సగానికి సమానమన్నమాట!తులం... రూ. లక్ష!కనకం.. పూనకాలు లోడింగ్ అంటూ నాన్‌స్టాప్ ర్యాలీ చేస్తోంది. ఫిబ్రవరి నుంచి మొదలైన దూకుడుతో ఏకంగా 20 శాతం పైగా ఎగబాకింది. ఇప్పుడు కొనొచ్చా.. తగ్గేదాకా వేచి చూడాలా? ఇంకా పెరిగితే ఏంటి పరిస్థితి? అందరిలోనూ ఇవే సందేహాలు. అయితే, పుత్తడిని ఏ రేటులో కొన్నా దీర్ఘకాలంలో లాభాలే కానీ, నష్టపోయే పరిస్థితైతే ఉండదనేందుకు దాని ‘ధర’ చరిత్రే సాక్ష్యం! ఈ ఏడాదిలోనే అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర ఔన్స్‌కు 2,700 డాలర్లను తాకొచ్చని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ దిగ్గజం గోల్డ్‌మన్ శాక్స్ అంచనా వేసింది. దీని ప్రకారం చూస్తే, దేశీయంగా 10 గ్రాముల మేలిమి బంగారం రేటు రూ. 85,000కు చేరే అవకాశం ఉంది. అంటే తులం (11.6 గ్రాములు) బంగారం కొనాలంటే రూ. లక్ష పెట్టాల్సిందే. అయితే, పశ్చిమాసియా, ఉక్రెయిన్ వివాదాలు శాంతించడం, అమెరికాలో వడ్డీరేట్లు మరింత పెరగడం, లేదంటే యథాతథంగా కొనసాగించడంతో పాటు సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లకు బ్రేక్ పడితే పసిడి ధరలకు కళ్లెం పడుతుందని గోల్డ్‌మన్ శాక్స్ అంటోంది.రూపాయి వాత.. సుంకం మోత!మన దేశంలో మగువలే కాదు పురుషులూ పసిడి ప్రియులే. అయితే, పుత్తడి రేటు విషయంలో మన జేబుకు అటు ప్రభుత్వం, ఇటు ‘రూపాయి’ బాగానే చిల్లుపెడుతున్నాయి. పసిడి దిగుమతులపై ప్రభుత్వం 15 శాతం సుంకం విధిస్తోంది. మరోపక్క, రూపాయి విలువ కూడా అంతకంతకూ బక్కచిక్కుతూ పసిడి ధరకు ఆజ్యం పోస్తోంది. అది ఎలాగంటే, వాస్తవానికి ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఒక ఔన్స్ (31.1 గ్రాములు) పసిడి ధర 2,400 స్థాయిలో ఉంది. ప్రస్తుత రూపాయి విలువ ప్రకారం 10 గ్రాముల మేలిమి బంగారం రేటు దాదాపు రూ.65,000. కానీ రేటు రూ.75,000 స్థాయిని తాకింది. అంటే 15 శాతం సుంకం లెక్కన ప్రభుత్వానికి రూ.10,000 చెల్లించుకోవాల్సి వస్తోంది. ఇక రూపాయి పతనం విషయానికొస్తే, 2022లో డాలరుతో రూపాయి మారకం విలువ 80 వద్ద ఉండేది. ఇప్పుడు 83.5కు పడిపోయింది. రూపాయి 80 స్థాయిలోనే ఉంటే ప్రస్తుత పసిడి ధర రూ.62,400. దీనికి 15 శాతం సుంకం కలిపితే, 71,720 కింద లెక్క!సెంట్రల్ బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు ఎందుకు...ఏ దేశానికైనా ఎగుమతి–దిగుమతులు సజావుగా జరిగేందుకు విదేశీ మారక (ఫారెక్స్) నిల్వలు ఎంత అవసరమో, అందులో బంగారం నిల్వలను తగినంతగా ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే, ఏదైనా అనుకోని ఆర్థిక విపత్తులు తలెత్తినప్పుడు, అంటే ఫారెక్స్ నిధులు అడుగంటి పోవడం వంటి సందర్భాల్లో ప్రభుత్వాలకు దన్నుగా నిలిచేది పుత్తడే! 1991లో దేశంలో ఫారెక్స్ నిల్వలు (డాలర్లు) నిండుకున్నాయి.దిగుమతులకు చెల్లించేందుకు, విదేశీ రుణాలపై వడ్డీ కట్టేందుకు డాలర్లు లేక చెల్లింపుల సంక్షోభం తలెత్తింది. దీంతో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు, ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) వద్దనున్న బంగారాన్ని కుదువపెట్టి విదేశీ రుణాలను సమీకరించారు. దేశం దివాలా తీయకుండా కాపాడారు. అంటే, అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు బంగారం చేతిలో ఉంటే మనకు ఇట్టే అప్పు ఎలా పుడుతుందో.. ప్రభుత్వాలకు సైతం ఆపదలో ఆదుకునే ఆపన్న హస్తం స్వర్ణమే!మరికొన్ని ‘బంగారు’ ముచ్చట్లు...ప్రపంచంలో ఇప్పటిదాకా వెలికితీసిన బంగారం అంతటినీ కరిగించి ముద్దగా చేస్తే ఎటు చూసినా 21.8 మీటర్లుండే క్యూబ్‌లో పట్టేస్తుంది.అత్యధిక సాంద్రత, సాగే గుణం కారణంగా ఔన్సు (31.1 గ్రాములు) బంగారాన్ని 187 చదరపు అడుగుల పలుచని గోల్డ్ లీఫ్‌గా సాగదీయొచ్చట.ప్రతి యాపిల్ ఐఫోన్లో 0.034 గ్రాముల పసిడి ఉంటుందని అంచనా.దక్షిణాఫ్రికాలో కనుగొన్న ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు గని (విట్వాటర్స్రాండ్ గోల్డ్ఫీల్డ్) కార్మికుల కోసం 1900 శతాబ్ది ఆరంభంలో నెలకొల్పిన జొహానస్బర్గ్ సెటిల్మెంట్.. ఇప్పుడు ఆ దేశంలో అతిపెద్ద నగరం.ప్రస్తుతం సాధారణ గ్రేడ్ టన్ను క్వార్ట్›్జ ముడి ఖనిజం నుంచి ఓపెన్ పిట్ గనిలో సగటున 1.4 గ్రాములు, భూగర్భ గనిలో 5–8 గ్రాములు మాత్రమే బంగారం లభిస్తోంది.నేరుగా ముద్దల రూపం (నేటివ్ స్టేట్)లో కూడా దొరికే అతి విలువైన లోహం కూడా బంగారమే. ప్రపంచంలో అతిపెద్ద బంగారం ముద్ద ఆస్ట్రేలియాలోని విక్టోరియా గోల్డ్ ఫీల్డ్స్‌లో 1869లో దొరికింది. ‘వెల్కమ్ స్ట్రేంజర్’గా పేరు పెట్టిన దాని బరువు ఏకంగా 72 కేజీలు! మన కోలార్ గనుల్లోనూ బొప్పాయి, గణేషుడి రూపాల్లో ఇలా పసిడి ముద్దలు లభించాయట.అతిపెద్ద పసిడి భాండాగారాన్ని (వాల్ట్) న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ నిర్వహిస్తోంది. మాన్‌హటన్‌లోని బ్యాంక్ బేస్మెంట్లో ఉన్న భూగర్భ వాల్ట్‌లో ప్రస్తుతం వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు, ఇన్వెస్ట్మెంట్ సంస్థలకు చెందిన 7,000 టన్నుల బంగారం ఉన్నట్లు అంచనా.లండన్ బులియన్ మార్కెట్ పసిడి ట్రేడింగ్‌లో నంబర్ వన్‌గా నిలుస్తోంది. ప్రపంచంలో ట్రేడయ్యే మొత్తం గోల్డ్‌లో 70 శాతం వాటా దీనిదే.భారత్‌లోని మొత్తం బంగారంలో 3,000–4,000 టన్నులు దేవాలయాలకు చెందినవేనని అంచనా. కేరళ పద్మనాభస్వామి గుడిలోని నేలమాళిగల్లో దాదాపు 1,300 టన్నుల బంగారం నిక్షిప్తమై ఉందట. ఇక తిరుపతి వెంకటేశ్వరస్వామి తరఫున టీటీడీ ఇప్పటిదాకా బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన బంగారం 11,329 కేజీలు (11.32 టన్నులు). ఒక్క 2023–24లోనే 1,031 కేజీల బంగారాన్ని డిపాజిట్ చేసింది.కేజీఎఫ్.. మన బంగారు కొండ!భారత్‌లో క్రీస్తు పూర్వం 1వ సహస్రాబ్ది నుంచి దక్కన్ ప్రాంతంలో పసిడి వేట జరుగుతోందని చరిత్ర చెబుతోంది. కర్ణాటకలోని కోలార్ ప్రాంతంలో క్రీస్తు శకం 2–3 శతాబ్దాలకు పూర్వమే బంగారాన్ని వెలికితీశారు. ఆ తర్వాత గుప్తులు, చోళుల కాలంలో ఇక్కడ పుత్తడి మైనింగ్ కార్యకలాపాలు విస్తరించాయి. విజయనగర సామ్రాజ్యంలో, ఆపై టిప్పు సుల్తాన్ హయాంలో పసిడి ఉత్పత్తి జోరందుకుంది. అయితే, బ్రిటిష్ పాలనలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్) దశ తిరిగిపోయింది. జాన్ టేలర్ అండ్ కంపెనీకి బ్రిటిషర్లు దీన్ని అప్పజెప్పారు. అప్పట్లో ఈ ప్రాంతాన్ని ‘లిటిల్ ఇంగ్లండ్’గా పిలిచేవారు.1884–1904 మధ్య చాలా తక్కువ లోతులోనే బంగారం దొరికేది. మొదట్లో ఒక టన్ను క్వార్ట్›్జ ముడి ఖనిజం నుంచి 45 గ్రాముల పసిడి వచ్చేదట. దీంతో ప్రపంచంలో అత్యంత శ్రేçష్ఠమైన పసిడి నిల్వలున్న గోల్డ్ ఫీల్డ్‌గా చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత అమెరికాలోని నెవాడాలో కనుగొన్న ఫైర్ క్రీక్ భూగర్భ బంగారు గనిలో టన్ను ఖనిజం నుంచి గరిష్టంగా 44.1 గ్రాములు లభించింది. కానీ, మన కేజీఎఫ్ ‘గోల్డెన్’ రికార్డును మాత్రం బ్రేక్ చేయలేకపోయింది. కేజీఎఫ్ 120 ఏళ్ల జీవిత కాలంలో సగటున టన్ను ఖనిజాన్ని శుద్ధి చేస్తే 15 గ్రాముల బంగారం లభ్యమైంది.దక్షిణాఫ్రికాలో అతిపెద్ద గోల్డ్ మైన్ విట్ఫాటర్స్రాండ్ బేసిన్లో సగటు ఉత్పత్తి 9 గ్రాములే. 1956లో ప్రభుత్వం కేజీఎఫ్‌ను జాతీయం చేసింది. అప్పటిదాకా జాన్ టేలర్ కంపెనీ చేతిలోనే ఉండేది. కేజీఎఫ్ చరిత్రలో దాదాపు 1,000 టన్నుల బంగారం ఉత్పత్తి అయినట్లు అంచనా. ఇందులో చాలావరకు బ్రిటిషర్లే తన్నుకుపోయారు. అయితే, తలకు మించిన ఉత్పాదక వ్యయం, పర్యావరణ సమస్యలతో కేజీఎఫ్ 2021లో పూర్తిగా మూతబడింది. అప్పటికి ‘చాంపియన్’ రీఫ్ మైన్ భూగర్భంలో 3.2 కిలోమీటర్ల లోతు వరకు మైనింగ్ జరిగింది. ప్రపంచంలోని అత్యంత లోతైన బంగారు గనుల్లో ఒకటిగా చరిత్రి సృష్టించింది.భూగర్భంలో 1,400 కిలోమీటర్ల పొడవైన సొరంగాలు కేజీఎఫ్ కింద విస్తరించి ఉన్నాయట. అప్పుడప్పుడూ అవి కుంగడం వల్ల ఇప్పటికీ కోలార్‌లో భూమి కంపిస్తుంది. ఇక ప్రస్తుతం భారత్‌లో ఉత్పత్తి జరుగుతున్న ఏకైక గోల్డ్ మైన్ హట్టి. ఇదీ కర్ణాటకలోనే (రాయచూరు) ఉంది. ఇప్పటిదాకా 84 టన్నుల బంగాన్ని వెలికితీశారు. టన్ను ఖనిజానికి 3 గ్రాముల బంగారమే లభ్యమవుతోంది. ఏటా 1.5 టన్నుల పసిడి ఇక్కడ లభిస్తోంది. కాగా, దేశంలో కనుగొన్న పసిడి నిల్వల్లో 88 శాతం కర్ణాటకలోనే ఉన్నాయి.వినియోగంలో భారత్, చైనాలే టాప్..2023లో ప్రపంచ బంగారు ఆభరణాల డిమాండ్‌లో 50 శాతం భారత్, చైనాల్లోనే నమోదవుతోంది. దీనికి తోడు పసిడి పెట్టుబడులు కూడా క్రమంగా ఎగబాకుతున్నాయి. 2023లో గనుల నుంచి 3,600 టన్నుల బంగారం వెలికితీయగా అందులో భారత్ దాదాపు 800 టన్నులు, చైనా 824 టన్నులు దిగుమతి చేసుకున్నాయి. తద్వారా వినియోగంలో భారత్‌ను అధిగమించింది చైనా. అయితే, భారత్ పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడుతుండగా. చైనా బంగారు ఉత్పత్తిలో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండటం విశేషం.ద్రవ్యోల్బణానికి విరుగుడు... పెట్టుబడికి నిశ్చింత! ధరల పెరుగుదలకు సరైన విరుగుడు బంగారం. ఎందుకంటే ధరలు పెరిగే కొద్దీ.. కరెన్సీ విలువలు పడిపోతూనే ఉంటాయి. రాబడికి కూడా చిల్లు పడుతుంది. ఉదాహరణకు 5 ఏళ్ల వ్యవధికి ఓ లక్ష రూపాయలు బ్యాంకులో (ఫిక్స్డ్ డిపాజిట్) దాచుకుంటే సగటున 7 శాతం వార్షిక వడ్డీ రేటు ప్రకారం వచ్చే మొత్తం సుమారు రూ.1,41,500. అయితే, ద్రవ్యోల్బణం 7 శాతం గనుక ఉంటే, వచ్చే రాబడి సున్నా. పెట్టుబడి మాత్రమే మిగులుతుంది.ద్రవ్యోల్బణం మరింత పెరిగితే పెట్టుబడికీ చిల్లే! షేర్లు, బాండ్లు, క్రిప్టో కరెన్సీ, చివరికి బంగారం... ఇలా ఏ పెట్టుబడిలోనైనా ద్రవ్యోల్బణ ప్రభావం ఉంటుంది. అయితే, పసిడి పెట్టుబడులు మాత్రం దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణానికి మించిన రాబడులే (రెండంకెల స్థాయిలో) అందిస్తున్నాయి. దానికితోడు ఏమాత్రం రిస్కులేని వ్యవహారం. పసిడి ధర ఐదేళ్లలో రెట్టింపునకు పైగా పెరిగింది. పదేళ్లలో నాలుగు రెట్లు ఎగబాకింది.స్టాక్ మార్కెట్లో (షేర్లలో) ఇంతకుమించి లాభాలొచ్చే వీలున్నా, అనుకోని పరిస్థితుల్లో మనం షేర్లు కొన్న కంపెనీ మూతబడితే అసలుకే మోసం రావచ్చు. నూటికి నూరు శాతం రిస్కుతో కూడుకున్నవి. ఇక భూమి, ఇళ్లు ఇతరత్రా స్థిరాస్తులు కూడా బంగారంలాగే రిస్కులేనివే! అయితే, పసిడి మాదిరిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు విక్రయించుకుని సొమ్ము చేసుకునే అవకాశం వాటికి తక్కువ. అంతేకాదు, అతితక్కువ వడ్డీకే, బంగారంపై ఇట్టే రుణం కూడా పొందొచ్చు. అందుకే బంగారం అంటే భరోసా. పెట్టుబడికి ఢోకా లేకుండా, కష్టకాలంలో ఆదుకోవడంలో బంగారాన్ని మించింది మరొకటి లేదు!‘కంచు మోగినట్లు.. కనకంబు మోగునా’ అన్నట్లు.. ఎన్ని రకాల పెట్టుబడి సాధనాలున్నా పసిడికున్న విలువ, వన్నెకు సాటిరావు. అందుకే బంగారం ఎప్పటికీ బంగారమే! – శివరామకృష్ణ మిర్తిపాటి
World Laughter Day: మీ నవ్వుల చల్లదనాన్ని మంచుకొండ అప్పడిగింది...
ఒకరు జోక్ వేస్తే నవ్వడం చాలా వీజీ. నవ్వించడం మాత్రం నవ్వినంత ఈజీ కాదు. టోటల్‌గా చెప్పొచ్చేదేమిటంటే... నవ్వించడం అనేది అత్యంత కష్టతరమైన టాస్క్. ఈ నవ్వుల మహారాణులు మాత్రం అవలీలగా నవ్వులు పూయిస్తూ సోషల్ మీడియాలో లక్షలాది మంది అభిమానులను సం΄ాదించుకున్నారు.నిఫ్ట్ గ్రాడ్యుయేట్ అయిన కుష కపిల బిల్లీ మసి, సౌత్ దిల్లీ గర్ల్స్లాంటి క్యారెక్టర్లతో నవ్వుల వర్షం కురిపిస్తోంది. ఆమెకు 1.6 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. నిత్యజీవిత సంఘటనల ఆధారంగా దిల్లీకి చెందిన డాలీసింగ్ కామేడినీ మేడ్ ఈజీ చేసింది. ముంబైకి చెందిన ప్రజక్తా కోలి కామెడీ వీడియోలు మోస్ట్ ΄ాపులర్ అయ్యాయి. అబ్జర్వేషనల్ కామెడీకి ఆమె వీడియోలు అద్దం పడతాయి. కోలికి యూట్యూబ్‌లో 6 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. స్టాండ్–అప్ కమెడియన్‌గా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది ప్రశస్తి సింగ్. అమెజాన్ ప్రైమ్ వీడిమో సిరీస్ ‘కామిక్‌స్థాన్’ సూపర్ హిట్ అయింది. ఎంబీఏ చేసిన ప్రశస్తి ‘నవ్వించడం’ తన ΄్యాషన్ అంటోంది. వీరు మాత్రమే కాదు కనీజ్ సుర్క, శ్రిష్ఠి దీక్షిత్, నిహారిక ఎన్ఎం, సుప్రియ జోషి, సుముఖి సురేష్, ఐశ్వర్య మోహన్‌రాజ్, సుమైర... లాంటి ఎంతోమంది నవ్వుల ప్రపంచంలో మహారాణులుగా వెలిగి΄ోతున్నారు.
పొట్ట తగ్గాలంటే.. జిమ్‌కే వెళ్లాలా? ఏంటి?
నేటి ఆధునిక శారీరక శ్రమ బాగా తగ్గిపోయింది. దీనికితోడు జీవనశైలిలో మార్పులు, తీవ్రమైన ఒత్తిడి కారణంగా చాలా మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. దీన్ని తగ్గించుకోవడానికి ఉపవాసాలున్నా, జిమ్ చేస్తున్నా ఫలితం కనిపించడం లేదని వాపోతున్న వారిని చూస్తూ ఉంటాం. అలాగే ఏం తిన్నా ఇక్కడికే.. అంటూ హీరోయిన్ సమంతా తరహాలో అద్దముందు నిలబడి డైలాగులుకొట్టే అమ్మాయిలు కూడా చాలామందే ఉన్నారు. ఈ నేపథ్యంలో జిమ్‌కెళ్లకుండానే, ఇంట్లోనే సింపుల్ చిట్కాలతో, ఊబకాయం, బెల్లీ ఫ్యాట్, ఫ్యాటీ బటక్స్ సమస్యకు చెప్పవచ్చు.గంటల తరబడి ఒకే చోట కూర్చుంటే గండమే!గంటల తరబడి టీవీలకు అతుక్కు పోకూడదు. పనిలో పడి అలాగే 8 నుంచి 10 గంటల పాటు కూర్చుని పని చేయకూడదు. ఎక్కువ సేపు ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల కొవ్వు పేరుకుపోతోంది. అలాగే కడుపు ఉబ్బరం వస్తుంది. కాబట్టి ప్రతి గంటకు 5 నిమిషాలు విరామం తీసుకోవాలి. మెట్లు ఎక్కడం, గుంజీలు తీయడం లాంటివి చేయాలి. దీంతో అవయవాలకు రక్త ప్రసరణ సవ్యంగా జరుగుతుంది. బరువు అదుపులో ఉంటుంది క్రమం తప్పకుండా వ్యాయామంఉదయం, సాయంత్రం లేదా మీకు వీలైన సమయంలో వేగంగా నడవడం, జాగింగ్, యోగా, సైక్లింగ్, స్విమ్మింగ్ తప్పకుండా చేయాలి. స్నేహితులతో కలిసి మీకు నచ్చిన గేమ్స్ (క్రికెట్, టెన్నిస్, కబడ్డీ,ఇ తర) అవయవాలు పూర్తిగా కదిలేలా ఆడండి. శరీరమంతా చెమట పట్టేదాకా శ్రమిస్తే బాడీలో టాక్సిన్స్ అన్నీ బయటికి పోతాయి.ఎముకలు, కండరాలు బలతంతా తయారవుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అతి ముఖ్యమైన డీ విటమిన్ పుష్కలంగా లభిస్తుంది.తగినన్ని నీళ్లు, కంటినిండా నిద్ర: వ్యాయామం చేసేటప్పుడు వీలైనంత ఎక్కువ నీరు త్రాగాలి. ఇది ఆకలిని తగ్గిస్తుంది , బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు త్రాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతారు. నీటిని తాగడం వల్ల పొట్ట, పొత్తికడుపు కొవ్వు తగ్గుతుంది. చక్కటి నిద్ర కూడా మన బరువును ప్రభావితం చేస్తుంది. రోజుకు ఎనిమిది గంటల నిద్ర అవసరం.ఫైబర్ రిచ్ ఫుడ్స్: శరీర బరువు నియంత్రణలో ఉండాలంటే మనం తీసుకునే ఆహారం చాలా ముఖ్యపాత్ర పోషిస్తుంది. బరువు పెరగడం గురించి ఆందోళన మానేసి పౌష్టికాహారాన్ని తీసుకోవాలి.తాజా ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలి. రోజువారీ ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోండి, ఈ రకమైన ఆహారాన్ని తినడం వల్ల మీ కడుపు చాలా సేపు నిండుగా ఉంటుంది. అలాగే రాత్రి 7 గంటల లోపు డిన్నర్ కంప్లీట్ చేయాలి. బరువు క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది.ఇంకా: ఒకేసారి కడుపు నిండా.. ఇక చాలురా బాబూ అనేంతగా తినవద్దు. అలాగే మైదాతో తయారుచేసిన పదార్థాలు, కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. మద్యం, ధూమమానం లాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి. పొట్ట, పిరుదులు, పిక్కలు, భుజాలు లాంటి ప్రదేశాల్లో కొవ్వును కరిగించుకునేందుకు నిపుణుల సలహా మేరకు కొన్ని స్పాట్ రిడక్షన్ ఎక్స్‌ర్‌సైజ్‌లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. యోగాలో కూడా ఇందుకోసం మంచి ఆసనాలు ఉన్నాయి. వాటినా ప్రాక్టీస్ చేయవచ్చు. నిజంగా వీటిని చిత్తశుద్ధిగా ఆచరిస్తే వారంలో బరువు తగ్గడం ఖాయం.నోట్: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే అని గమనించగలరు. ఏదైనా అనారోగ్య సమస్యలున్న వారు వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
క్రైమ్
డిప్యూటీ సీఎం బూడి హత్యకు కుట్ర
దేవరాపల్లి (అనకాపల్లి జిల్లా): డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు ఇంటి వద్ద డ్రోన్ కెమెరాతో నలుగురు రెక్కీ నిర్వహించడం వివాదాస్పదమైంది. గ్రామస్తులు వారిని పట్టుకుని, తమ నేత బూడి ముత్యాలనాయుడుç ßæత్యకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ పోలీసులకు అప్పగించారు. ముత్యాలనాయుడు ప్రత్యరి్థ, బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ జోక్యం చేసుకోవడంతో వివాదం ముదిరింది.రాత్రి వరకు హైడ్రామా నడిచింది. దేవరాపల్లి మండలం తారువలోని బూడి ఇంటి చుట్టూ శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో డ్రోన్‌తో రెక్కీ నిర్వహించారు. అరగంటకు పైగా ముత్యాలనాయుడు ఇంటి పరిసరాల్లో డ్రోన్ చక్కర్లు కొట్టడంతో అనుమానం వచ్చిన గ్రామస్తులు డ్రోన్ ఆపరేటర్లను ఆరా తీశారు. పొంతన లేని సమాధానం చెప్పడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ డి.నాగేంద్ర గ్రామానికి చేరుకుని డ్రోన్, బీజేపీ జెండా సహా హైదరాబాద్‌కు చెందిన డ్రోన్ ఆపరేటర్ చిలకల పాండురంగారావు, అసిస్టెంట్ ఆపరేటర్ పొట్టి సాయికృష్ణ, చొప్ప గంగాధర్, కొమర అప్పారావులను అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. తన హత్యకు కుట్ర పన్నారని, అనుమతులు లేకుండా తన ఇంటి చుట్టూ డ్రోన్‌తో రెక్కీ నిర్వహించారని ముత్యాలనాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం రమేష్ ఎదురుదాడి విషయం తన అనుచరుల ద్వారా తెలుసుకున్న సీఎం రమేష్ డ్రోన్ ఆపరేటర్లను తారువ గ్రామస్తులపై ఎదురు ఫిర్యాదు ఇవ్వాలని సూచించారు. సాయంత్రం 4 గంటల సమయంలో అనుచరులు, టీడీపీ కార్యకర్తలతో దేవరాపల్లి పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. తమ కార్యకర్తలపై దాడి చేసిన బూడి వర్గీయులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ముత్యాలనాయుడు ఇంటి వద్దకు వెళ్లేందుకు సీఎం రమేష్ సిద్ధం కాగా.. పోలీసులు నిరాకరించారు. రౌడీమూకల మాదిరిగా పోలీసులను నెట్టుకుంటూ తన వెంట ఉన్న పచ్చ దండుతో రమేష్ తారువకు వెళ్లారు. ముత్యాలనాయుడి మరో ఇంటి వద్దకు (ఆ ఇంట్లో ఎన్నికల్లో పోటీ చేస్తున్న ముత్యాలనాయుడి కుమారుడు రవికుమార్ ఉంటున్నారు) వెళ్లగా.. రమేష్ వస్తున్న విషయం తెలుసుకుని ముత్యాలనాయుడు ఆ ఇంటి వద్ద తన అనుచరులతో బైఠాయించారు. ఈ ఇల్లు కూడా తన పేరిట ఉందని, ఎవరొస్తారో చూస్తానని హెచ్చరించారు. విషయం తెలుసుకుని అవాక్కయిన సీఎం రమేష్ తన అనుచరులతో కలిసి హనుమాన్ ఆలయం ముందు మెట్లపై కూర్చుండి పోయారు. తారువ గ్రామస్తులు, వైఎస్సార్సీపీ శ్రేణులు అక్కడికి చేరుకుని తమ ఊళ్లో రౌడీ రాజకీయం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. పోలీసులు వెళ్లిపోవాలని కోరడంతో సీఎం రమేష్ పోలీసు జీపు ఎక్కారు. దీంతో రమేష్ ఎక్కిన జీపునకు అడ్డంగా గ్రామస్తులు బైఠాయించారు. గూండాగిరీ చేసిన సీఎం రమేష్ బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. దీంతో అరగంటకు పైగా సీఎం రమేష్ ఎక్కిన పోలీసు వాహనం నిలిచిపోయింది. ఆ వాహనాన్ని గ్రామస్తులు చుట్టముట్టడంతో సీఎం రమే‹Ù, అతని అనుచరవర్గం భయంతో వణికిపోయారు. పోలీసులు అతికష్టంపై రమేష్ ఎక్కిన వాహనాన్ని ముందుకు పంపించగా.. గ్రామస్తులు మాత్రం ఊరి పొలిమేర దాటే వరకు వెంబడించారు.
షా డీప్‌ఫేక్ ప్రసంగం వీడియో సృష్టికర్త అరెస్టు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగ వీడియోను డీప్‌ఫేక్‌గా సృష్టించిన వ్యక్తిని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. అమిత్ షా వీడియోను ఏఐసీసీ సోషల్ మీడియా విభాగం జాతీయ సమన్వయకర్త అరుణ్‌రెడ్డి డీప్‌ఫేక్ చేశారని పోలీసులు నిర్ధారించారు. దీని వెనక కాంగ్రెస్ ప్రముఖుల హస్తం ఏమైనా ఉందా అనే కోణంలో విచారణ చేపట్టారు.సృష్టించి.. సర్క్యులేట్ చేసి..మెదక్‌లో ఏప్రిల్ 23న నిర్వహించిన సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ మళ్లీ అధికారంలోకి వస్తే మతప్రాతిపదికన అమలవుతున్న ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రకటించారు. కానీ ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను అరుణ్‌రెడ్డి ఎడిట్ చేసి తాము అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఎత్తేస్తామని షా అన్నట్లుగా యాడ్ చేశారని ఢిల్లీ పోలీసులు చెప్పారు. అనంతరం ఆ వీడియోను ఏఐసీసీ, ఎన్ఎస్యూఐ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని వాట్సాప్ గ్రూపుల్లో అరుణ్‌రెడ్డి పోస్ట్ చేశారని పేర్కొన్నారు.కేంద్ర హోంశాఖ ఫిర్యాదుతో..షా డీప్‌ఫేక్ వీడియోను వీక్షించిన నెటిజన్లు బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అలాగే దీనిపై ఏఐసీసీ అధ్యక్షు డు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సహా మరికొందరు పార్టీ నేత లు స్పందించారు. బీజేపీ అధికారంలోకి వస్తే కచ్చితంగా ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని వారు బహిరంగ సభల్లో చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర హోంశాఖ ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) ద్వారా ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై గత నెల 28న ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసు లు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నేడు మరో అరెస్టుకు అవకాశం..వీడియో సృష్టికర్త అరుణ్‌రెడ్డి కాగా దాన్ని వైరల్ చేసింది మాత్రం తెలంగాణకు చెందిన వ్యక్తేనంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘ఎక్స్’ ఇప్పటికే ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులకు నివేదించింది. దీంతో ఇందుకు సంబంధించిన ఆధారాలను ఆదివారంలోగా తమకు సమర్పించాలని ‘ఎక్స్’తోపాటు ‘ఫేస్బుక్’ను పోలీసులు కోరారు. ఆదివారంలోగా ఆ డీప్‌ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో తొలిసారి పోస్ట్ చేసిన వ్యక్తిని గుర్తించి అరెస్టు చేయనున్నారు.
రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
వైద్యో నారాయణో హరిః అంటాం. వైద్యులు దేవుళ్లతో సమానమని అర్థం.అలాగే రోగులకు సేవచేసే నర్సులని దైవదూతలుగా భావిస్తాం. నిస్సార్థంగా, కుటుంబ సభ్యులకంటే మిన్నగా వారు చేసే సపర్యలు రోగులకు ఎక్కడలేని ఊరటనిస్తాయి. కానీ ఒక నర్సుమాత్రం దీనికి పూర్తి భిన్నంగా ప్రవర్తించింది. రాక్షసిలా మారి రోగులను పొట్టన బెట్టుకుంది. ఎక్కడ ఏంటి వివరాల కోసం ఈ కథనాన్ని చదవండి..!అమెరికాలోని పెన్సిల్వేనియాలో హీథర్ ప్రెస్డీ (41) అనే నర్సుకు ఏకంగా 760 సంవత్సరాల జైలు శిక్ష పడింది. మూడు హత్య కేసుల్లో దోషిగా తేలడంతో ఆమెకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. మూడు జీవిత కాలాలు అంటే 760 సంవత్సరాల జైలు శిక్షను విధించారు.మూడేళ్ల పాటు ప్రాణాంతకమైన ఇన్సులిన్ ను అధిక మోతాదులతో ఇవ్వడంతో 17 మంది రోగులు ప్రాణాలు కోల్పోయినట్టుప్రెస్డీపై ఆరోపణలు నమోదైనాయి. మూడు హత్యలు, 19 హత్యాయత్నాల్లో నేరాన్ని అంగీకరించింది. ఈ కేసుల్లో దోషిగా తేలడంతో ఆమెకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది కోర్టు.ప్రెస్డీ 22 మంది రోగులకు అధిక మొత్తంలో ఇన్సులిన్ ఇచ్చినట్లు అభియోగాలు మోపారు. వీరిలో చాలా మంది రోగులు మోతాదు తీసుకున్న వెంటనే లేదా కొంత సమయం తరువాత మరణించారు. బాధితులు 43 నుండి 104 ఏళ్ల వయసు ఉంటుంది.ఇద్దరు రోగులను చంపినందుకు ఆమెపై తొలుత గత ఏడాది మేలో అభియోగాలు నమోదు కాగా, తర్వాత జరిగిన పోలీసు విచారణలో మరిన్ని విషయాలు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ప్రాథమిక అభియోగాలు నమోదు చేసిన అనంతరం ఆమె నర్సింగ్ లైసెన్స్ రద్దు చేశారు. ‘‘ఆమెకు ఏ జబ్బూ లేదు. మతిస్థిమితమూ లేదు. ఆమెది దుష్ట వ్యక్తిత్వం. ఆమె నా తండ్రిని చంపిన రోజు ఉదయం ఆమె కూృరమైన ముఖంలోకి చూశాను'’ అంటూ బాధిత కుటుంబ సభ్యుల్లో ఒకరు కోర్టుకు తెలిపారు.రోగులు, సహోద్యోగులు పట్ల కూడా ఆమె దురుసుగా ప్రవర్తించేదని విచారణ అధికారులు గుర్తించారు. అంతేకాదు ప్రెస్డీ తన తల్లికి ఏప్రిల్ 2022 – మే 2023 మధ్య కాలంలో రోగుల పట్ల తన అసంతృప్తిని మెస్సేజ్‌లను పంపించిందట.ఇన్సులిన్ అధిక మోతాదు హైపోగ్లైసీమియాకు దారితీస్తుంది, హృదయ స్పందనను పెంచుతుంది. గుండెపోటుకు కూడా దారితీస్తుంది. చివరికి ప్రాణాలను కూడా తీస్తుంది.
కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
విదేశాల్లో బిడ్డ దగ్గరకు వెళ్లి ఆనందంగా ఉన్న సమయంలో దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన ఘటన విషాదాన్ని నింపింది. కెనడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇండియాకు చెందిన దంపతులు, వారి మూడు నెలల మనవడు దుర్మరణం చెందారు. ఆ కారులో ఉన్న చిన్నారి తల్లిదండ్రులు కూడా తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. టొరంటోకు తూర్పున 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న విట్బీలోని హైవే 401పై ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై విచారాన్ని వ్యక్తం చేసిన ఒట్టావాలోని భారత హైకమిషన్ మృతులకు సంతాపాన్ని తెలియజేసింది.ఏం జరిగిందంటే ఇండియాకు చెందిన మణివణ్ణన్(60) మహాలక్ష్మి(55) దంపతులు ఎజాక్స్‌లో ఉంటున్న మనవడిని చూసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో అందరూ కలిసి బయటికి వెళ్లగా మృత్యువు వారిని కబళించింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం . బోమన్‌విల్లేలో మద్యం దుకాణంలో చోరీ చేసిన ఇద్దరు నిందితులను పోలిసులు వెంబడించారు. పోలీసులను నుంచి తప్పించు కునే క్రమంలో హైవేపై వ్యాన్‌లో రాంగ్రూట్లో వెళుతూ వారు పలు కార్లను ఢీకొట్టారు. ఇందులో బాధితుల కారు కూడా ఉంది. ఈ ఘటనలో నిందితుల్లో ఒకరు ఘటనా స్థలంలోనే మరణించాడు. చిన్నారి తల్లిదండ్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ,తల్లి ఐసీయూలో ఉందని ఒంటారియో స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ యూనిట్ (SIU) తెలిపింది.‘‘ఎప్పటిలాగే ఆ హైవేపై కారులో వెళుతున్నాను ఇంతలో నిందితులు రాంగ్రూట్లో ఎదురుగా వచ్చారు. ఆరు కార్లను ఢీకొట్టారు. ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఆ క్షణం నా కళ్లను నేనే నమ్మలేకపోయాను’’ ఈ ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డ ఓ ప్రత్యక్ష సాక్షి మరోవైపు ఘటనపై కెనడా పోలీసులు ముమ్మర దర్యాప్తు ప్రారంభించారు. యాక్సిడెంట్ ఎలా జరిగిందనేది ఆరా తీస్తున్నారు. ప్రత్యేక బృందాలతో వివిధ కోణాలలో కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషాద ఘటనపై టొరొంటోలోని భారతీయ కాన్సులేట్ విచారం వ్యక్తం చేసింది. బాధిత కుటుంబానికి సంతాపం తెలియజేసింది. ఈ ఘటనపై కెనడా అధికారులతో టచ్‌లో ఉన్నామని బాధిత కుటుంబానికి అన్నిరకాలుగా అండగా ఉంటామని పేర్కొంది.