Top Stories
ప్రధాన వార్తలు
AP: ఎన్నికల కౌంటింగ్‌కు కౌంట్ డౌన్ ప్రారంభం
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడికి సర్వం సిద్ధం చేసినట్లు ఇప్పటికే సీఈవో ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్‌ను లెక్కించనున్నారు. తర్వాత ఈవీఎం బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది రేపు ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ , ఉదయం 8.30 నుంచి ఈవీఎం కౌంటింగ్ ప్రారంభంరాష్ట్రవ్యాప్తంగా 3.33 కోట్ల ఓట్లు పోల్ ఫెసిలిటేషన్ సెంటర్ లలో 4.61 లక్షల పోస్టల్ బ్యాలెట్‌లుు పోల్ 26,721 సర్వీస్ ఓట్లు భీమిలి, పాణ్యంలో గరిష్టంగా 26 రౌండ్ల కౌంటింగ్కొవ్వూరు, నరసాపురంలో 13 రౌండ్లు మాత్రమే కౌంటింగ్అయిదు గంటల్లో వెలువడనున్న ఎన్నికల ఫలితాలురాష్ట్రవ్యాప్తంగా 33 సెంటర్ల లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్ సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపులోక్ సభ ఓట్ల లెక్కింపునకు 2,443 ఈవీఎం టేబుళ్లు ఏర్పాటులోక్ సభ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కోసం 443 టేబుళ్లు ఏర్పాటుఅసెంబ్లీ నియోజకవర్గాలకు 2,446 ఈవీఎం, 557 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లుఉదయం ఆరు గంటల నుంచి కౌంటింగ్ ఏజెంట్ల కు అనుమతిమూడంచెల్లో పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తుఈవీఎంల వద్ద కేంద్ర పారా మిలటరీ బలగాల మోహరింపురెండో దశలో కౌంటింగ్ కేంద్రం చుట్టూ ఏపీఎస్పీ బెటాలియన్ పోలీసులుకౌంటింగ్ కేంద్రం బయట లా అండ్ ఆర్డర్ పోలీసులుతుది ఫలితం రాత్రి 10 గంటల తర్వాత వెలువడే అవకాశంగెలుపొందిన వారు ర్యాలీలు, సంబరాలకు అనుమతి లేదు
ఏపీ జడ్జిమెంట్ డే.. కూటమిలో గుబులు
సార్వత్రిక ఎన్నికల సమరంలో.. ఇంకా గంటలే మిగిలి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు రేపు ఉదయం ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. తమ గెలుపు ఖాయమైందని వైఎస్సార్సీపీ.. లోపల ఓటమి భయం ఉన్నప్పటికీ పైగా మాత్రం తాము గెలిచి తీరతామని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రకటనలు పోటాపోటీగా ఇచ్చుకుంటున్నాయి. ఇటు ఏపీ ప్రజానీకం, అటు రాజకీయ శ్రేణులు ఉత్కంఠంగా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాయి.ఏపీ ఎన్నికల ఫలితాల వేళ కూటమికి ఓటమి భయం పట్టుకుంది. వాస్తవానికి సీఎం జగన్ నేతృత్వంలోని సంక్షేమ పాలన, ఆయన ఎన్నికల ప్రచారానికి దక్కిన స్పందన.. తమ సమావేశాలకు జనాదరణ కరువు కావడం చూశాక గెలుపు ఆశలు వదులుకుంది. ఈ ఎన్నికల్లో ఓడితే.. టీడీపీ, జనసేన, బీజేపీలది ప్యాకప్ పరిస్థితి. అందుకే గెలుపు కోసం ప్రతిపక్ష కూటమి ఎంతకైనా తెగించవచ్చని అధికార పక్షం భావిస్తోంది. గెలుపు ధీమా ప్రదర్శిస్తూనే.. ప్రత్యర్థుల కుట్రలను తిప్పి కొట్టేందుకు ప్రతీ క్షణం అప్రమత్తంగా ఉండాలని అభ్యర్థులకు, పోలింగ్ ఏజెంట్లకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు YSRCP కీలక నేతలు.ఎలక్షన్ నాటి హింసాత్మక ఘటనలు, పల్నాడు రీజియన్‌లో పలు చోట్ల రిగ్గింగ్ జరగడం, ఈసీ.. పోలీసులు ఎన్టీయే కూటమికి అనుకూలంగా వ్యవహరిస్తుండడంతో వైఎస్సార్సీపీ నేతలు అప్రమత్తం అయ్యారు. తమ పార్టీ తరఫున ఏజెంట్లగా నియమించినవారితో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. లెక్కింపు సమయంలో ఎంత అప్రమత్తంగా ఉండాలి.. అభ్యంతరం వ్యక్తం చేయాలంటే ఎవరిని సంప్రదించాలి.. ప్రతిపక్ష పార్టీల ఏజెంట్లు అడ్డంకులు సృష్టిస్తే ఏంచేయాలనే విషయమై తమ ఏజెంట్లకు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు.ఇదీ చదవండి: లెక్క ఏదైనా.. 'ఫ్యాన్' పక్కాఇంకోవైపు.. వైఎస్సార్సీపీకే ఎక్కువ విజయవకాశాలున్నట్లు మెజారిటీ సర్వేసంస్థలు వెల్లడించాయి. దీంతో ఆ పార్టీ అభ్యర్థులు, కార్యకర్తల్లో ఫలితాలకు ముందే జోష్ కనిపిస్తోంది. ఇక కూటమి అభ్యర్థులు మాత్రం మేమే వస్తామని గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. లోలోన భయం వెంటాడుతోంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల తర్వాత పందేలు కట్టడానికి కూడా టీడీపీ, జనసేన కార్యకర్తలు సాహసించడం లేదు.సామాన్య వర్గాల్లో ఉత్కంఠేబరిలో నిలిచివారు, అనుచరులు, రాజకీయ శ్రేణులు మాత్రమే కాదు.. సామాన్యుల్లోనూ ఇప్పుడు ఎన్నికల ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. తీర్పు తమదే అయినా.. ఓటర్ నాడి గందరగోళంగా ఉందనే అభిప్రాయాల నడుమ ఫలితం ఎలా ఉండబోతుందా? అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.ఏర్పాట్లు పూర్తి ఈసారి లెక్కింపునకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ సెంటర్‌కు ఇరువైపులా రెండు కి.మీ. రెడ్ జోన్‌గా ప్రకటించారు. లెక్కింపు కేంద్రంలో ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్ వద్ద అభ్యర్థికి ఒక ఏజెంటు చొప్పున అనుమతిస్తారు. కౌంటింగ్ కేంద్రంలోకి ప్రవేశించే ఏజెంట్లకు బ్రీత్ ఎన్‌లైజర్‌తో ముందుగా పరీక్ష చేస్తారు. మద్యం తాగినట్లు తెలితే లోపలికి అనుమతించరు. తెల్లవారుజామున అయిదు గంటల నుంచే తనిఖీలు చేపట్టనున్నారు.కౌంటింగ్ ప్రక్రియకు హాజరయ్యే అభ్యర్థులు, అధికారులు, ఏజెంట్లు జిల్లా ఎన్నికల అధికారి జారీ చేసిన గుర్తింపు కార్డులు ధరించి తనిఖీల్లో చూపించాలి. కేంద్రంలోకి ఒక్కసారి ఏజెంట్ లోపలికి వెళితే పూర్తయ్యే వరకు బయటకు రావడానికి వీలు లేదు.మరోవైపు.. అభ్యర్థులు, ఏజెంట్లు తప్ప మిగిలిన ప్రజలెవరూ కౌంటింగ్ కేంద్రాల వద్ద గుమిగూడడానికి వీల్లేదు. అలాగే.. పోలింగ్ నాటి పరిస్థితుల దృష్ట్యా విజయోత్సవ ర్యాలీలకు కొన్నిచోట్ల అనుమతుల్లేవని పోలీసులుస్పష్టం చేస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. కేంద్రాల వద్ద మీడియా కమ్యూనికేషన్ కేంద్రం ఏర్పాటు చేశారు. రౌండ్లు వారీగా ఫలితాలు వెల్లడిస్తారు.ఏపీ ప్రజల తీర్పు ఎలా ఉండబోతోంది?.. రేపు ఉదయం 6గం. నుంచి మినిట్ టు మినిట్ అప్డేట్స్ మీ సాక్షిలో..
వైఎస్ఆర్సీపీదే గెలుపు: స్వామి పరిపూర్ణానంద
సాక్షి,సత్యసాయిజిల్లా: కాకినాడ శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానందస్వామి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై కీలక కామెంట్స్ చేశారు. ఏపీలో వైఎస్ఆర్సీపీ 123 సీట్లు గెలుస్తుందని చెప్పారు.వైఎస్జగన్మోహన్రెడ్డి ఏపీకి మరోసారి ముఖ్యమంత్రి అవడం ఖాయమన్నారు. హిందూపురం నియోజకవర్గంలోనూా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరబోతోందన్నారు. నిబద్ధత గల వ్యక్తి ఆరా మస్తాన్ ఎగ్జిట్‌పోల్ ఫలితాల్లో చెప్పినట్లుగా ఏపీలో వైఎస్ఆర్సీపీ మరోసారి పగ్గాలు చేపడుతుందన్నారు. ప్రధానిగా మోదీ మూడోసారి, ఏపీలో సీఎంగా వైఎస్జగన్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారని స్పష్టం చేశారు.
చంద్రబాబు అందరినీ భయపెడుతున్నారు: సజ్జల
గుంటూరు, సాక్షి: దేశమంతా ఒక నిబంధన.. ఏపీలో మరో నిబంధన. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో మాత్రమే పోస్టల్ బ్యాలెట్‌కు సంతకం ఉంటే చాలని నిబంధనలు పెట్టారని అసంతృప్తి వ్యక్తం చేశారు వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. సోమవారం మధ్యాహ్నాం వైఎస్సార్సీపీ పార్టీ కేంద్రకార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆయన మండిపడ్డారు.‘‘చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు. అందరినీ భయపెడుతున్నారు. అధికార యంత్రాంగాల పట్ల పట్టు సాధించే ప్రయత్నాలూ చేశారు అని సజ్జల అన్నారు. ప్రతిపక్షాలు కుట్రలకు పాల్పడొచ్చు. అందుకే కౌంటింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్సీపీ శ్రేణులకు సూచించాం. కౌంటింగ్ పూర్తై డిక్లరేషన్ పూర్తయ్యే వరకు ఎవరూ బయటకి రావొద్దని చెప్పాం’’ అని సజ్జల మీడియాకు వివరించారు.సజ్జల ఇంకా మాట్లాడుతూ..జాతీయ స్థాయిలో ఇచ్చిన ఎగ్జిట్‌పోల్స్ అన్నీ తప్పే. చంద్రబాబుకి బీజేపీతో పొత్తు లేకుంటే అలాంటి ఫలితాలు ఇచ్చుండేవారే కాదు అని సజ్జల అన్నారు.కొన్ని గంటల్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోందిపార్టీ శ్రేణులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించాంఒక్క ఓటు కూడా మిస్ కాకుండా చూడాలని పార్టీ నేతలకు చెప్పాం.10:30 గంటలకు సంబరాలకు సిద్ధం కావాలని మా కార్యకర్తలకు పిలుపునిస్తున్నాం.పోస్టల్ బ్యాలెట్ పై సుప్రీం కోర్టు కొట్టేస్తే తప్పు తప్పు కాకుండా పోతుందా?ఎన్నికల కమిషన్ తమ నిర్ణయాలను తామే ఉల్లంఘించటమేంటి?దేశం అంతా ఒక రూల్, ఏపిలో ఒక రూల్ ఎంటి?పొలింగ్ అయ్యాక పోస్టల్ బ్యాలెట్ పై కొత్త నిబంధనలు తీసుకు రావడం ఎంటి?ఏపీలో ఒక్క చోట మాత్రమే పోస్టల్ బ్యాలెట్ పై ప్రత్యేక వెసులు బాటు ఇవ్వడం ఏంటి.?ఎన్నికల కమిషన్‌ను చంద్రబాబు ప్రభావితం చేస్తున్నారు.వ్యవస్థలను మ్యానేజ్ చేయడం చంద్రబాబుకు కొత్త ఏమీ కాదుఈసీ కోడ్ వచ్చి పొత్తులు పెట్టుకున్న నాటి నుంచి అడ్డగోలుగా నిర్ణయం తీసుకున్నారు.నిబంధనలు ఫాలో అవ్వకుండా ఎలాగోలా విజయం సాధిస్తామనే భ్రమలో ఉన్నారు.చంద్రబాబుకు ఉన్న స్వతహాగా ఉన్న తన బుద్ధిని బయట పెట్టుకున్నారు.బీజేపీ జాతీయ వ్యూహాలను ఎపిలో అమలు చేయాలని చూస్తోందివైసిపి బలమైన పార్టీ ఎవర్నీ రెచ్చగొట్టల్సిన అవసరం లేదు.ప్రతిపక్షంలో ఉన్నపుడు ఎలా ఉన్నామో అధికారంలో ఉన్నప్పుడు కూడా అంతే బాధ్యతా యుతంగా ఉన్నాం.సీఈఓను బెదిరించిన వ్యక్తి చంద్రబాబు.హడావుడి చేసి పబ్లిసిటీ కోసం ప్రయత్నం చేస్తున్నారు.చంద్రబాబుకు ఫుల్ పిక్చర్ అర్థం అయ్యింది.21 సీట్లలో పోటీ చేసిన జనసేన పార్టీకి 7 శాతం ఓటింగ్ శాతం ఎలా వస్తుంది?నేషనల్ మీడియా ఎగ్జిట్ పోల్స్ చూసి జనం నవ్వుతున్నారు.పొంతన లేని ఎగ్జిట్ పోల్స్ చూసి టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.నార్తులో బీజేపీ పోతుంది.అందుకే సౌత్‌లో తెచ్చుకోవాలని ప్రయత్నం చేసింది..సౌత్ లో సీట్లు వస్తున్నట్లు బెదిరించి భయపెట్టి ఎగ్జిట్ పోల్స్ ఇప్పించుకున్నారు.మేము జనంతో ఉన్నాం జనం మాతో ఉన్నారు మళ్ళీ అధికారంలోకి వస్తాం.ఎన్నికల్లో చంద్రబాబు అరెస్టు గురించి ఎక్కడైనా చర్చ జరిగిందా.?చంద్రబాబు అరెస్టు అయితే ఒక్క పిల్లాడు కూడా బయటకు రాలేదు.
రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్
టీమిండియా స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. కేదార్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని కొద్ది సేపటి కిందట ట్విటర్ వేదికగా వెల్లడించాడు. 2014లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన కేదార్.. 2020లో చివరిసారిగా భారత జట్టుకు ఆడాడు. కేదార్ తన ఆరేళ్ల ఆంతర్జాతీయ కెరీర్లో 73 వన్డేలు, 9 టీ20లు ఆడి 2 సెంచరీలు (వన్డేల్లో), 7 అర్దసెంచరీల సాయంతో 1611 పరుగులు చేశాడు. కేదార్ ఖాతాలో 27 వన్డే వికెట్లు కూడా ఉన్నాయి. రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలర్ అయిన కేదార్‌కు వైవిధ్యభరితమైన బౌలర్‌గా గుర్తింపు ఉంది. 39 ఏళ్ల కేదార్‌కు ఐపీఎల్‌లోనూ ఓ మోస్తరు ట్రాక్ రికార్డు ఉంది. 2010 నుంచి 2023 సీజన్ వరకు వివిధ ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించిన కేదార్.. ఐపీఎల్ కెరీర్లో 95 మ్యాచ్‌లు ఆడి 123.1 స్ట్రయిక్‌రేట్‌తో 4 అర్ద సెంచరీల సాయంతో 1208 పరుగులు చేశాడు. మిడిలార్డర్లో ధాటిగా బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉన్న కేదార్‌కు సీఎస్కే తరఫున ఆడినప్పుడు మంచి గుర్తింపు వచ్చింది. ధోని నాయకత్వంలో కేదార్ పలు మ్యాచ్‌ల్లో సీఎస్కే విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. దేశవాలీ క్రికెట్లో మహారాష్ట్రకు ప్రాతినిథ్యం వహించే కేదార్.. ఆ జట్టు తరఫున 87 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 186 లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 163 టీ20లు ఆడాడు. ఇందులో 27 సెంచరీలు, 56 అర్ద సెంచరీల సాయంతో 14 వేల పైచిలుకు పరుగులు సాధించి, 65 వికెట్లు పడగొట్టాడు. Thank you all For your love and support throughout my Career from 1500 hrs Consider me as retired from all forms of cricket— IamKedar (@JadhavKedar) June 3, 20242020 ఫిబ్రవరిలో (న్యూజిలాండ్ పర్యటనలో) జాతీయ జట్టు తరఫున చివరి మ్యాచ్ ఆడిన కేదార్ 2019 వన్డే ప్రపంచకప్ ఆడిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. కేదార్.. తన రిటైర్మెంట్ సందేశంలో ఇలా రాసుకొచ్చాడు. 1500 గంటల కెరీర్లో నాకు మద్దతు నిలిచి, నాపై ప్రేమ చూపిన వారందరికీ ధన్యవాదాలు. నన్ను అన్ని రకాల క్రికెట్ నుంచి రిటైర్డ్‌గా పరిగణించండి అంటూ ట్వీట్లో పేర్కొన్నాడు.
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమ అరెస్ట్
సాక్షి, బెంగళూరు: బెంగళూరు డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నటి హేమ సీసీబీ పోలీసులు ఎదుట సోమవారం హాజరైంది. గత నెల 20న బెంగళూరు శివారులోని ఓ ఫామ్‌హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసిన విషయం తెలిసిందే! మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు దాదాపు వంద మందిని అదుపులోకి తీసుకున్నారు. అందులో టాలీవుడ్ నటి హేమ కూడా ఉంది. బుకాయించినా దొరికిపోయిందిఅయితే మొదట ఆ రేవ్ పార్టీకి, తనకు సంబంధం లేదని బుకాయించింది. కానీ తనకు జరిపిన రక్త పరీక్షల్లో ఆమె డ్రగ్స్ తీసుకుందని రుజువైంది. ఈ కేసు విచారణలో భాగంగా తమ ఎదుట హాజరు కావాలంటూ హేమకు పోలీసులు రెండుసార్లు నోటీసులు పంపించగా వివిధ కారణాలు చెప్పి డుమ్మా కొట్టింది. సీసీబీ పోలీసులు మూడోసారి నోటీసులు పంపగా ఎట్టకేలకు విచారణకు హాజరైంది. ఈ క్రమంలోనే ఈమెని అరెస్ట్ చేశారు. మంగళవారం కోర్టులో హాజరు పరచనున్నారు.మాదకద్రవ్యాల విక్రయంకాగా బెంగళూరు నగరశివారులోని హెబ్బగోడిలో మే 19 రాత్రి నుంచి మే 20 తెల్లవారు జాము వరకు రేవ్ పార్టీ జరిగింది. వాసు అనే వ్యక్తి పుట్టినరోజు పేరు చెప్పి 'సన్‌సెట్ టు సన్‌రైజ్ విక్టరీ' పేరిట పార్టీ ఏర్పాటు చేశాడు. పార్టీలో ఎండీఎంఏ పిల్స్, హైడ్రో గాంజా, కొకైన్ ఇతర మాదకద్రవ్యాలు విక్రయించారు. పార్టీకి ప్రధాన కారకులైన నిందితులు రణధీర్, మహ్మద్ సిద్ధిఖి, వాసు, అరుణ్‌కుమార్, నాగబాబును పోలీసులు ఇదివరకే అరెస్టు చేశారు.చదవండి: ఉపాసన ఇంటికి చేరిన బుజ్జి.. క్లీంకార కోసం స్పెషల్ గిఫ్ట్
తెలంగాణ సెక్రటేరియట్లో మళ్లీ వాస్తు మార్పులు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో మరోసారి వాస్తు మార్పులు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు సెక్రటేరియట్ ప్రధాన ద్వారం నుంచి లోపలికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్.. ఇక నుంచి వెస్ట్ గేట్ నుంచి లోపలికి వచ్చి నార్త్ ఈస్ట్ గేట్ నుంచి బయటకు వెళ్లిపోనున్నట్లు సమాచారం. ఇక సౌత్ ఈస్ట్ గేట్ ద్వారా ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉన్నతాధికారుల రాకపోకలు జరగనున్నాయి.కాగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా వాస్తు మార్పులు చేయించారు. గతంలో ఆరో అంతస్తులో ఉన్న ముఖ్యమంత్రి కార్యాలయాన్ని తొమ్మిదో అంతస్తులోకి మార్చాలని నిర్ణయించారు. ప్రస్తుతం తొమ్మిదో అంతస్తులో సీఎంవో ఏర్పాటు కోసం పనులు కొనసాగుతున్నాయి. వీటితో పాటు సెక్రటేరియట్ లోపల మరికొన్ని మార్పులు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది.
AP Election Update: కౌంటింగ్‌కు కొనసాగుతున్న కౌంట్‌డౌన్
AP Elections Counting Count Down4:37 PM, 3rd June, 2024విజయవాడఉమ్మడి కృష్ణా జిల్లాలో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తిమొత్తం 16 నియోజకవర్గాలకి నాలుగు కౌంటింగ్ కేంద్రాలుకైకలూరు, నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గాలకి ఏలూరు లో కౌంటింగ్ సెంటర్మచిలీపట్నం పార్లమెంట్‌తో పాటు గన్నవరం, పెనమలూరు, పామర్రు, గుడివాడ, పెడన, అవనిగడ్డ, మవిలీపట్నం నియోజకవర్గాలకి మచిలీపట్నం కృష్ణా యూనివర్సిటీలో కౌంటింగ్ సెంటర్విజయవాడ పార్లమెంట్ తో పాటు విజయవాడ తూర్పు, జగ్గయ్యపేట, మైలవరం నియోజకవర్గాలకి ఇబ్రహీంపట్నం నిమ్రా కళాశాలలో కౌంటింగ్విజయవాడ సెంట్రల్, విజయవాడ వెస్ట్, తిరువూరు, నందిగామ నియోజకవర్గాలకి నోవా ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో 15 మంది అభ్యర్ధులు, అసెంబ్లీకి 79 మంది అభ్యర్ధులువిజయవాడ పార్లమెంట్ పరిధిలో 17, అసెంబ్లీకి 96 మంది అభ్యర్ధులుఎన్టీఆర్ జిల్లాలో 79.5 %, కృష్ణా జిల్లాలో 84.45% పోలింగ్విజయవాడ పార్లమెంట్ లో ఓటు హక్కు వినియోగించుకున్న 13,52,964 ఓటర్లుమచిలీపట్నం పార్లమెంట్ లో ఓటుహక్కు వినియోగించుకున్న 12,93,948 ఓటర్లుమచిలీపట్నం, విజయవాడ పార్లమెంట్ పరిధిలో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తిప్రతీ రౌండ్‌కి 14 టేబుళ్లు ఏర్పాటుప్రతీ రౌండ్ ఫలితానికి 25 నిమిషాల సమయంసాయంత్రానికి తుది ఫలితాలు వెల్లడికి అవకాశంఉమ్మడి కృష్ణా జిల్లాలో తొలి ఫలితం మచిలీపట్నం...ఇక్కడ 15 రౌండ్లలో ముగియనున్న కౌంటింగ్గన్నవరం, మైలవరం, విజయవాడ తూర్పు, పెనమలూరులలో చివరి ఫలితాలు..ఇక్కడ 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు2:19 PM, 3rd June, 2024కర్నూలు: కర్నూలు జిల్లా వ్యాప్తంగా భద్రత ఏర్పాటు చేశాం: కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్సెంట్రల్, లోకల్ పోలీసుల ద్వారా నాలుగు అంచుల భద్రత ఏర్పాటు చేశాము.కౌంటింగ్ హల్లో కూడా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశాము.కౌంటింగ్ సిబ్బందికి, ఏజెంట్లు వివిధ రూపాల్లో కౌంటింగ్ పాస్స్ లు కల్పించాముకౌంటింగ్ కేంద్రం వద్ద కేంద్ర బలగాలతో 1000 మంది పోలీసులను ఏర్పాటు చేశాము, జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ కూడా అమలు అవుతుంది188 సమస్యాత్మక గ్రామాలను గుర్తించి పికెట్స్ ఏర్పాటు చేశాము.ఫలితాలు వచ్చిన తరువాత కూడా భద్రత ఏర్పాట్లను చేశాం, ఫలితాలు వచ్చిన తరువాత ర్యాలీలు, సంబరాలు జరుపుకోవడం నిషేధంఎన్నికల తనిఖీలల్లో భాగంగా 11 కోట్లు రూపాయాల విలువ చేసే 80 లక్షల నగదు, బంగారు, వెండి, ఇతర వస్తువులను పట్టుకున్నాము7 వేలు దాకా కర్నూలు జిల్లా వ్యాప్తంగా బైండోవర్ కేసులు నమోదు చేశాంకౌంటింగ్ సంబంధించిన 4 అంచెల భద్రత ఏర్పాటు చేశాం 2:15 PM, 3rd June, 2024ఏపీలో ఈసీ కొత్త నిబంధన ఎందుకు?: సజ్జలదేశమంతా ఒక నిబంధన, ఏపీలో మరో నిబంధనదేశంలో ఎక్కడాలేని నిబంధనలు ఏపీలో మాత్రమే పెట్టారు.అధికార యంత్రాంగంపై చంద్రబాబు పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు.చంద్రబాబు అందరినీ భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.బాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు.ఏపీలో మాత్రమే పోస్టల్ బ్యాలెట్‌కు సంతాకం ఉంటే చాలనే నిబంధన పెట్టారు.కౌంటింగ్ సమయంలో వైఎస్సార్సీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి.చంద్రబాబుకు బీజేపీతో పొత్తు లేకుంటే కరెక్ట్ ఎగ్జిట్‌పోల్స్ వచ్చేవి. 1:50 PM, 3rd June, 2024గీత దాటితే తాట తీస్తాం: డీజీపీ హరీష్ గుప్తా వార్నింగ్‌అమరావతి..డీజీపీ కార్యాలయం ప్రకటనకౌంటింగ్ నేపథ్యంలో సోషల్ మీడియాపై పోలీసు శాఖ ఫోకస్రెచ్చగొట్టే పోస్టులపై వ్యాఖ్యలపై సీరియస్ అయిన ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాడీజీపీ హరీష్ గుప్తా కామెంట్స్..గీత దాటితే తాట తీస్తాం.సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవు.కౌంటింగ్ తర్వాత మీ అంతు చూస్తామంటూ సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థి శిబిరాలకు సవాలు విసురుతున్నారువ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ ఉద్రిక్తలు సృష్టిస్తున్నారుఅలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవుIT act కింద కేసులు నమోదు చేస్తాం రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం.PD ACT ప్రయోగించడం వంటి కఠిన చర్యలు తప్పవు..పోస్టులు ఎవరి ప్రోద్భలంతో పెడుతున్నారో వారిపై కూడా విచారణ చేస్తాం.రెచ్చగొట్టే పోస్టులను, ఫోటోలను, వీడియోలను వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకోవడం, షేర్ చేయడం నిషిద్ధం.గ్రూప్ అడ్మిన్లు అలెర్ట్‌గా ఉండాలి.సోషల్ మీడియా పోస్టులపై పోలీస్ శాఖ నిరంతర నిఘా ఉంటుంది. 1:30 PM, 3rd June, 2024కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి: సీఈవో మీనాఅమరావతి..రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కామెంట్స్..రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభంపార్లమెంటుకు 454 మంది, అసెంబ్లీకి 2387 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారుఅన్ని జిల్లాల్లో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయిముందుగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభమవుతుంది8.30కి ఈవీఎం కౌంటింగ్ ప్రారంభమవుతుందిపోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లేని చోట ఈవీఎంల కౌంటింగ్ 8 గంటలకే ప్రారంభం అవుతుందిపార్లమెంట్ సెగ్మెంట్ల ఈవీఎం కౌంటింగ్ ఎనిమిది గంటలకే ప్రారంభంకౌంటింగ్ కోసం 196 మంది అబ్జర్వర్లను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది 1:00 PM, 3rd June, 2024విజయోత్సవ ర్యాలీలకి అనుమతి లేదు: ఎస్పీ నయీమ్ కృష్ణా జిల్లా ఎస్పీ నయీమ్ అద్మీ ఆస్మి కామెంట్స్..కృష్ణా జిల్లాలో పోలింగ్ ప్రశాంతం జరిగింది. పెనమలూరులో చిన్న చిన్న గొడవలు జరిగాయి.ప్రస్తుతం అంతా ప్రశాంతంగా ఉంది.విజయోత్సవ ర్యాలీలకి అనుమతి లేదు .144 సెక్షన్ అమలులో ఉంది.రాజకీయ నాయకులు ఎన్నికల నిబంధనలు పాటించాలి.50 చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశాం.133 గ్రామాల్లో పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేసాం.70 కేసులు నమోదు చేశాం.40 కేసుల్లో చార్జ్ షీట్స్ కూడా వేశాం.కౌంటింగ్ నేపథ్యంలో ప్రజలు గుంపులుగా ఉండకూడదు.స్పెషల్ ఫోర్స్ ని రంగంలోకి దింపాం.సమస్యాత్మక ప్రాంతాల్లో అదనంగా పోలీసులను మోహరించాం.చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు. 12:45 PM, 3rd June, 2024ఎగ్జిట్‌పోల్స్‌ను ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదు: వైవీ సుబ్బారెడ్డివిశాఖ..వైస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కామెంట్స్..పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో అప్రమత్తంగా ఉండాలి.ఏజెంట్లు నిర్ణీత సమయం కంటే ముందుగానే కౌంటింగ్ సెంటర్లకు చేరుకోవాలి.ఎగ్జిట్‌పోల్స్‌ను ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదు.సర్వేల గురించి ఎవరూ ఆలోచించవద్దు.మహిళలు, వృద్ధులు మళ్లీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డే సీఎం కావాలని కోరుకున్నారు.వైఎస్సార్సీపీ అభ్యర్థులు అన్ని నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నారు. 11:59 AM, 3rd June, 2024పిన్నెల్లిపై కొనసాగుతున్న కుట్రలుమాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై సుప్రీం కోర్టు ఆంక్షలుకౌంటింగ్ రోజు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లొద్దని, పరిసర ప్రాంతాల్లో కనిపించవద్దని ఆదేశంపిన్నెల్లిని ఇరకాటం పెట్టేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్న పచ్చ బ్యాచ్‌ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో పిన్నెల్లికి ముందస్తు బెయిల్‌అనుకూల పోలీసులతో పిన్నెల్లిపై మూడు అక్రమ కేసులుకోర్టు ఆదేశాలతో ఆ కేసుల్లోనూ ఊరట పొందిన పిన్నెల్లితాజాగా తమ నేతలతో సుప్రీంలో కేసులు వేయించిన టీడీపీటీడీపీ పోలింగ్ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు వేసిన పిటిషన్‌పై సుప్రీం తాజా ఆదేశాలుఈ నెల 6న ఈ కేసు పరిష్కరించాలని ఏపీ హైకోర్టును సూచించిన సుప్రీం 11:30 AM, 3rd June, 2024పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో అప్రమత్తత అవసరం: వైవీ సుబ్బారెడ్డివిశాఖ:వైఎస్సార్సీపీ కౌంటింగ్ ఏజెంట్లతో జూమ్ మీటింగ్ నిర్వహించిన ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి.కౌంటింగ్ ప్రక్రియలో అనుసరించాల్సిన విధానాలపై పలు సూచనలు చేసిన వైవీ సుబ్బారెడ్డి.పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో అప్రమత్తంగా ఉండాలి.ఏజెంట్లు నిర్ణీత సమయం కంటే ముందుగానే కౌంటింగ్ సెంటర్లకు చేరుకోవాలని సూచన. 10:40 AM, 3rd June, 2024వైఎస్సార్సీపీదే విజయం: అబ్బయ్య చౌదరిఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి కామెంట్స్‌ఎగ్జిట్‌పోల్స్ సర్వేలన్నీ వైఎస్సార్సీపీదే విజయమని తేల్చేశాయి. సంబరాలు చేసుకునేంటుకు వైఎస్సార్సీపీ శ్రేణులన్నీ సిద్ధంగా ఉండాలి. జూన్ 4న సాయంత్రానికి జగనన్న 2.O సిద్ధం!ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ వైయస్ఆర్సీపీదే విజయమని ఇప్పటికే తేల్చేశాయి-ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి#YSRCPWinningBig#YSJaganAgain#ExitPoll pic.twitter.com/8osnnXHvSf— YSR Congress Party (@YSRCParty) June 3, 2024 10:15 AM, 3rd June, 2024YSRCP పిటిషన్‌కు సుప్రీం గ్రీన్ సిగ్నల్‌నేడు సుప్రీంకోర్టులో ఏపీలో పోస్టల్ బ్యాలెట్ వివాదం కేసు విచారణవిచారణ జరుపనున్న జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనంజాబితాలో 44వ ఐటమ్ గా లిస్ట్ అయిన కేసురేపు కౌంటింగ్ నేపథ్యంలో సత్వరమే విచారణ చేపట్టాలని కోరిన వైఎస్ఆర్సిపీఆ అభ్యర్థనకు అంగీకరించి నేడే విచారణ జరపాలని నిర్ణయించిన సుప్రీంకోర్టుఏపీలో ఈసీ పోస్టల్ బ్యాలెట్ ఉత్తర్వులను సుప్రీం కోర్టులో సవాల్ చేసిన వైఎస్ఆర్సిపీ అధికారిక సీల్, హోదా లేకుండా స్పెసిమెన్ సిగ్నేచర్ తో పోస్టల్ బ్యాలెట్ ను ఆమోదించాలన్న ఈసీ ఉత్తర్వులను సుప్రీంలో సవాల్ చేసిన వైఎస్సార్‌సీపీఎన్నికల సంఘం ప్రస్తుతం అమల్లో ఉన్న నియమ, నిబంధనలే కొనసాగించాలని కోరిన వైఎస్సార్‌సీపీపోస్టల్ బ్యాలెట్ పై హైకోర్టు ఉత్తర్వులను కొట్టేయాలని పిటిషన్కేవలం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే సడలింపు ఉత్తర్వులు ఇవ్వడాన్ని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ9:43 AM, 3rd June, 2024విజయవాడలో కౌంటింగ్‌కు సర్వం సిద్ధంవిజయవాడ పార్లామెంట్ పరిధిలో ఓట్ల లెక్కింపుకి సర్వం సిద్దంసాయంత్రం 5 గంటల లోపు కౌంటింగ్ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేలా ప్రణాళికఇబ్రహీంపట్నంలోని నోవా కళాశాలలో తిరువూరు, విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్, నందిగామ నియోజకవర్గాల కౌంటింగ్నిమ్రా కళాశాలలో విజయవాడ తూర్పు, మైలవరం, జగ్గయ్యపేట నియోజకవర్గాలకి కౌంటింగ్పోస్టల్ బ్యాలెట్, ఇవిఎం కౌంటింగ్ లకి ప్రత్యేక ఏర్పాట్లుఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రతీ రౌండ్ కి 14 టేబుళ్లు ఏర్పాటుఏడు అసెంబ్లీ, పార్లమెంట్ కి కలిపి 198 టేబుళ్లు ఏర్పాటు17596 పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుకి 14 టేబుళ్లు ఏర్పాటురెండు రౌండ్లలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయ్యేలా చర్యలుపోస్టల్ బ్యాలెట్ ఒక్కొక్క రౌండ్ లెక్కింపుకి మూడు గంటల సమయం పట్టే అవకాశంఈవీఎం ఒక్కొక్కరౌండ్ కి 25 నిమిషాల నుంచి అరగంట సమయం పడుతుందని అంచనాఏడు అసెంబ్లీలకి పోలింగ్ బూత్ ల ఆధారంగా 16 నుంచి 22 రౌండ్లలో లెక్కింపుకౌంటింగ్ కేంద్రాల లోపలికి మొబైల్ ఫోన్ లకి అనుమతి లేదుసీసీ టీవీ కెమెరాల నిఘాలో కౌంటింగ్ ప్రక్రియ8:30 AM, 3rd June, 2024నేడు సుప్రీంకోర్టు ముందుకు పోస్టల్ బ్యాలెట్ కేసు..ఢిల్లీ:నేడు సుప్రీంకోర్టు ముందుకు ఏపీలో పోస్టల్ బ్యాలెట్ వివాదం కేసుఏపీలో ఈసీ పోస్టల్ బ్యాలెట్ ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన వైఎస్సార్‌సీపీఅధికారిక సీల్, హోదా లేకుండా స్పెసిమెన్ సిగ్నేచర్‌తో పోస్టల్ బ్యాలెట్‌ను ఆమోదించాలన్నఈసీ ఉత్తర్వులను సుప్రీంలో సవాల్ చేసిన వైఎస్సార్‌సీపీనేడు త్వరగా విచారణ చేపట్టాలని మెన్షన్ చేయనున్న వైఎస్సార్సీపీ తరఫు న్యాయవాదిఎన్నికల సంఘం ప్రస్తుతం అమల్లో ఉన్న నియమ, నిబంధనలే కొనసాగించాలని కోరిన వైఎస్సార్‌సీపీపోస్టల్ బ్యాలెట్ పై హైకోర్టు ఉత్తర్వులను కొట్టేయాలని పిటిషన్కేవలం ఆంధ్రప్రదేశ్‌లోని ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వడాన్ని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ 8:15 AM, 3rd June, 2024నేడు ఈసీ మీడియా సమావేశం..ఢిల్లీ:నేడు మ.12.30కు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశంరేపు దేశవ్యాప్తంగా కౌంటింగ్ నేపథ్యంలో సమావేశం 8:00 AM, 3rd June, 2024కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్ షురూ..ఏపీలో ఎన్నికల కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభంమరో 24 గంటల్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది.కౌంటింగ్‌కు అధికారులు విస్తృత ఏర్పాట్లు.ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు.కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేసిన ఈసీసమస్యాత్మక ప్రాంతాలపై పోలీసుల ఫోకస్‌మాచర్ల, పల్నాడులో 144 సెక్షన్‌ఎన్నికల్లో ఘర్షణలకు పాల్పడిన వారిపై స్పెషల్ ఫోకస్‌ముందస్తు జాగ్రత్తగా పలు చోట్ల కర్ఫ్యూ విధించిన పోలీసులు మధ్యాహ్నం ఒంటి గంటకు సీఈవో ముఖేష్‌కుమార్ మీనా ప్రెస్‌మీట్‌నేడు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం అనంతలో కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తిఅనంతపురం:ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తిఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ రెండు పార్లమెంటు స్థానాలకు ఎన్నికలుఅనంతపురం, హిందూపురం ప్రాంతాల్లో మూడు కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులుకౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలు మోహరింపు144 సెక్షన్, 30 యాక్ట్ అమలుఆరు వేల మంది బైండోవర్400 మందిపై రౌడీషీట్లురేపు ఉదయం 8 గంటలకు ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం.. మధ్యాహ్నానికి ఫలితాలుతిరుపతిలో ఏర్పాట్లు పూర్తి..తిరుపతితిరుపతి పార్లమెంట్ స్థానంతోపాటు, జిల్లా ఏడు అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన జిల్లా ఎన్నికల అధికారులురేపు ఉదయం ఏడు గంటలకు స్ట్రాంగ్ రూమ్‌ను నలుగురు అబ్జర్వర్లు, పోటీలో ఉన్న అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్ల సమక్షంలో తెరుస్తారుఉదయం ఎనిమిది గంటకు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభం,8.30 నిమిషాలకు ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభంకౌంటింగ్ కేంద్రం వద్ద 164 సీసీ కెమెరాలు ఏర్పాటు, మూడు అంచెల భద్రత144 సెక్షన్ అమలులో ఉంది,2 కంపెనీలు సీఐఎస్ఎఫ్ బలగాలు జిల్లాకు కేటాయింపుకౌంటింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్ అనుమతి లేదుఎన్నికల ఫలితాలు తర్వాత ఎలాంటి ర్యాలీ, బాణాసంచా పేల్చరాదు ఏజెంట్లే కీలకంఉదయం 6 గంటలకే కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లాలి ప్రభుత్వ గుర్తింపు కార్డు, ఏజెంట్ నియామక పత్రం ఉండాలి ఫారం 17 సీ తప్పకుండా వెంట తీసుకెళ్లాలి అభ్యంతరాలను కచ్చితంగా లిఖితపూర్వకంగా తెలిపిధ్రువీకరణ తీసుకోవాలి తుది ఫలితం ప్రకటించే దాకా హాల్ విడిచి వెళ్లకూడదు కౌంటింగ్ ప్రక్రియ మొత్తం రికార్డు ప్రత్యర్థులు కవ్వించినా సంయమనంతో వ్యవహరించాలి అవాంతరాలను ఉపేక్షించొద్దు: ముఖేష్‌కుమార్ మీనారాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా కామెంట్స్..ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఆటంకాలు కలిగించే వారిని నిర్దాక్షిణ్యంగా బయటకు పంపండిపోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు విషయంలో ఈసీఐ ఆదేశాలను పాటించండిఫలితాల ప్రకటనకు సంబంధించిన ఫారం–21సి/21ఇ లు మరుసటి రోజే ఈసీఐకి చేరాలి లెక్క ఏదైనా.. ‘ఫ్యాన్’ పక్కాఅసెంబ్లీ ఎన్నికలపై మెజార్టీ జాతీయ, రాష్ట్ర మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్స్ స్పష్టీకరణదేశ వ్యాప్త యంత్రాంగం ఉన్న టైమ్స్, దైనిక్ భాస్కర్ గ్రూప్‌ల ఎగ్జిట్ పోల్స్‌దీ అదే మాట50 శాతం ఓట్లతో 14 లోక్‌సభ సీట్లు వైఎస్సార్‌సీపీవేనన్న టైమ్స్‌నౌ–ఈటీజీ రీసెర్చ్50 శాతం కంటే ఎక్కువ ఓట్లతో 15–17 లోక్‌సభ సీట్లు వైఎస్సార్సీపీ గెలుస్తుందన్న దైనిక్ భాస్కర్(డీబీ)రాష్ట్ర మీడియా, సెఫాలజిస్టులు, సర్వే సంస్థలు చేసిన 32 ఎగ్జిట్ పోల్స్‌లో 24 పోల్స్ వైఎస్సార్సీపీ వైపేబీజేపీ భజన చేసే ఇండియాటుడే గ్రూప్, ఎన్డీటీవీ, జీన్యూస్‌ల ఎగ్జిట్ పోల్స్‌లో మాత్రం భిన్నంగా వెల్లడి‘ఈనాడు’తో భాగస్వామ్యం ఉన్న సీఎన్ఎన్ న్యూస్–18 ఎగ్జిట్ పోల్స్‌దీ అదే దారి2021లో బెంగాల్లో, 2023లో రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో తప్పులో కాలేసిన ఇండియాటుడే ఎగ్జిట్‌పోల్స్‌తాజా ఎగ్జిట్‌పోల్స్‌లో కనీసం వైఎస్సార్సీపీ గుర్తును కూడా ఫ్యాన్‌కు బదులు చీపురుగా చూపిన సంస్థగుర్తు తెలియకుండా, క్షేత్రస్థాయి స్థితిగతులు తెలుసుకోకుండా చేసిన సర్వే అని చెబుతున్న పరిశీలకులుతాను ఏపీలో పర్యటించినప్పుడు సర్వేలో పేర్కొన్న పరిస్థితులు లేవని విభేదించిన జర్నలిస్టు రాజ్‌దీప్ మహిళలు, గ్రామీణ ఓటర్లు వైఎస్సార్సీపీవైపే ఉన్నారని అదే చానెల్లో సర్వే నిర్వాహకుడితో వ్యాఖ్యలుబీజేపీ నినాదమైన ‘400’ సీట్లకు ఆ పార్టీని తీసుకెళ్లటమే లక్ష్యంగా కొన్ని జాతీయ సంస్థల ఎగ్జిట్‌పోల్స్‌రాజస్థాన్, హిమాచల్, హరియాణాలో ఉన్న స్థానాల కంటే అధిక స్థానాల్లో ఎన్డీఏ గెలుస్తుందని వెల్లడిరాజధాని, స్కిల్ స్కామ్‌లో చంద్రబాబును అరెస్టు చేయడం వల్లే కూటమి గెలుస్తోందంటూ వ్యాఖ్యలుకానీ.. ఎన్నికల ప్రచారంలో ఏ పార్టీ కూడా రాజధాని అంశాన్ని ప్రధాన ప్రచార అస్త్రంగా చేసుకోని తీరుబాబును అరెస్టు చేసినప్పుడు రాష్ట్రంలో చిన్నపాటి బంద్‌లు, నిరసనలు కూడా జరిగిన దాఖలాల్లేవుహైదరాబాద్‌లో ‘ఐటీ గ్రూప్’ పేరిట కూపన్లిచ్చి మరీ నిరసన చేయించిన ఒక సామాజిక వర్గం వ్యక్తులువాస్తవానికి రాష్ట్రంలో అన్నివర్గాలకూ మేలు చేసే పాలనతో పటిష్ఠంగా నిలబడ్డ వైఎస్సార్‌సీపీతమ కుటుంబాలు బాగుపడ్డాయనే భావనతో ఆ పార్టీ వెనక అంతే బలంగా నిలబడ్డ ప్రజలుఇవన్నీ వైఎస్సార్సీపీని స్పష్టంగా విజయంవైపు తీసుకెళుతున్నాయని తేల్చిన సర్వే సంస్థలుసెఫాలజిస్టులపై బెదిరింపులకు దిగిన చంద్రబాబు, నారా లోకేశ్
సీనియర్ సిటిజన్లు, మహిళలకు సెల్యూట్: ఈసీ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం చరిత్రలోనే అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. ఓటర్లకు స్టాండింగ్ ఒవేషన్(లేచి చప్పట్లు కొట్టడం) ఇచ్చారు ఈసీ సభ్యులు. రేపు ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో ఇవాళ సీఈసీ రాజీవ్‌కుమార్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా.. ‘దేశంలో జరిగిన ఎన్నికల్లో ఓటు వేసిన సీనియర్ సిటిజన్స్, మహిళలకు తాము సెల్యూట్ చేస్తున్నామని కేంద్రం ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్ చెప్పారు. ఈ క్రమంలో ప్రెస్‌మీట్‌లోనే ఆయన ఓటర్లకు స్టాండింగ్ ఓయేషన్ ఇచ్చారు. #WATCH | Delhi | Election Commission of India gives a standing ovation to all voters who took part in Lok Sabha elections 2024 pic.twitter.com/iwIfNd58LV— ANI (@ANI) June 3, 2024 ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో మొత్తం 642 మిలియన్ల ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏడు విడతలుగా పోలింగ్ విజయవంతంగా జరిగింది. రికార్డు స్థాయిలో ఓటర్లు ఓటు వేశారు. ఓటింగ్‌లో భారత్ వరల్డ్ రికార్డు సృష్టించింది. ప్రపంచంలోనే మన దేశంలో 31 కోట్ల మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మన దేశంలో ఓటేసిన వారి సంఖ్య.. జీ-7 దేశాల జనాభాకు ఒకటిన్నర రేట్లు ఎక్కువ. జమ్మూ కశ్మీర్లో నాలుగు దశాబ్ధాల్లో జరగనంత పోలింగ్ జరిగింది. #WATCH | Delhi | "This is one of the General Elections where we have not seen violence. This required two years of preparation," says CEC Rajiv Kumar on Lok Sabha elections. pic.twitter.com/HL8o0aQvAz— ANI (@ANI) June 3, 2024 పోలింగ్ సందర్భంగా ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందన్నారు. కేవలం రెండు రాష్ట్రాల్లోనే 39 ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. అక్కడే రీపోలింగ్ అవసరముందన్నారు. 27 రాష్ట్రాల్లో రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదన్నారు. మరోవైపు రేపు దేశవ్యాప్తంగా కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశామని, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని చెప్పారాయన.
పసిడి ప్రియులకు శుభవార్త!.. మళ్ళీ తగ్గిన బంగారం, వెండి ధరలు
జూన్ 1 నుంచి తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు.. ఈ రోజు (జూన్ 3) కూడా స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. కాబట్టి నేడు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.66100 (22 క్యారెట్స్), రూ.72110 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 400, రూ. 440 తగ్గాయి.చెన్నైలో కూడా బంగారం ధరలు రూ. 440 నుంచి రూ. 480 వరకు తగ్గాయి. కాబట్టి 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 66660 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 72720 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే.. నిన్నటి ధరల కంటే ఈ రోజు ధరలు కొంత తగ్గినట్లు స్పష్టంగా అర్థమవుతోంది.దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66250 (10 గ్రా), 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72260 (10 గ్రా) వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 400, రూ. 440 తగ్గినట్లు తెలుస్తోంది.వెండి ధరలుదేశంలో బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా గత నాలుగు రోజుల నుంచి తగ్గుతూనే ఉన్నాయి. ఈ రోజు ఒక కేజీ వెండి ధర రూ. 700 తగ్గింది. కాబట్టి రూ. 93500 వద్ద ఉన్న వెండి రూ. 92800లకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).
తప్పక చదవండి
- Hardik- Natasa: హార్దిక్ పాండ్యాతో విడాకులు: ట్విస్ట్ ఇచ్చిన నటాషా!
- రోహిత్, కోహ్లి, సూర్య వంటి వాళ్ల వల్ల నష్టం!
- 2030 నాటికి జాబ్ మార్కెట్ షేక్.. కలవరపెడుతున్న రిపోర్ట్
- రెండోసారి అధికారంపై వైఎస్సార్సీపీ ధీమా!
- ఇలా అయితే.. టీమిండియాలో ఛాన్స్ రానేరాదు!
- బెంగళూరులో కుండపోత.. 133ఏళ్ల రికార్డు బ్రేక్
- జులై 3దాకా తీహార్ జైల్లోనే కవిత!
- కూతుర్ని కోల్పోయా.. అందుకే బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోవట్లేదు: ఇళయరాజా
- ప్రపంచకప్‌లో సంచలనం.. టీ20 చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా
- ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు.. అవి ఏంటంటే?
సినిమా
ఆయన వల్లే ఇక్కడున్నా.. పుష్ప-2 విషయంలో బాధలేదు: అజయ్ ఘోష్
అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఎర్రచందనం సిండికేట్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ మూవీకి సీక్వెల్‌గా పుష్ప-2 త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆగస్టు 15 థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్‌కు ఆడియన్స్ విపరీతమైన స్పందన వస్తోంది.అయితే ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు అజయ్ ఘోష్ కీలక పాత్ర పోషించారు. కొండారెడ్డి పాత్రలో అభిమానులను మెప్పించారు. ప్రస్తుతం ఆయన మ్యూజిక్ షాప్ మూర్తి అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా పుష్ప-2లో తాను లేకపోవడంపై స్పందించారు. సుకుమార్ తన జీవితాన్ని మార్చారని అన్నారు. తన కెరీర్ అయిపోయిందనుకున్న దశలో మళ్లీ ఫామ్‌లోకి వచ్చానని తెలిపారు.అజయ్ ఘోష్ మాట్లాడుతూ..' నా దృష్టిలో సుకుమార్ కేవలం డైరెక్టర్ మాత్రమే కాదు. నేనేంటో తెలిసేలా చేసిన గురువు. కరోనా బారిన పడినప్పుడు కెరీర్ ముగిసిందనుకున్నా. పుష్పలో నటించేందుకు సుకుమార్ అడిగితే నా వల్ల కాదని చెప్పా. అయినా ఆయన వదల్లేదు. చాలాసేపు మాట్లాడి ఒప్పించారు. ఆయన మోటివేషన్‌తోనే నటనకు సిద్ధమయ్యా. పుష్ప-2లో నటించకపోవడంపై నాకే లాంటి బాధలేదు. నా కోసం మరో అద్భుతమైన క్యారెక్టర్ ఇస్తారు సుకుమార్.' అని అన్నారు. కాగా..శివ పాలడుగు దర్శకత్వంలో మ్యూజిక్ షాప్ మూర్తి ఈ నెల 14న థియేటర్లో రిలీజ్ కానుంది.
'ప్రేమలు' హీరోయిన్‌కి చేదు అనుభవం.. ఊపిరాడనివ్వలేదు!
'ప్రేమలు' సినిమాతో మనకు బాగా నచ్చేసిన మలయాళ బ్యూటీ మమిత బైజు. ఈ ఒక్క మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. అప్పటివరకు కేరళలో మాత్రం ఈమెకు ఫ్యాన్ బేస్ ఉండేది. 'ప్రేమలు' తర్వాత దక్షిణాదిలో ఈమెకు చాలామంది అభిమానులు అయిపోయారు. ఈ క్రమంలోనే తాజాగా మమిత, చెన్నై వెళ్లగా ఈమెకు ఊపిరి ఆడనివ్వకుండా చేసి పడేశారు. ఇంతకీ అసలేం జరిగిందంటే?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు.. అవి ఏంటంటే?)గత కొన్నేళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్న మమిత బైజు.. 'ప్రేమలు' మూవీతో లీడ్ యాక్టర్‌గా ఫేమ్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే తాజాగా చెన్నైలోని ఓ జ్యూవెల్లరీ షాప్ ప్రారంభోత్సవానికి వచ్చింది. అయితే ఊహించని విధంగా చాలామంది కుర్ర అభిమానులు అక్కడికి వచ్చేశారు. కనీసం షాప్ లోపలికి కూడా మమిత వెళ్లకుండా ఇబ్బంది పెట్టేశారు.ఎలాగైతేనేం బౌన్సర్ల సహాయంతో షాప్ లోపలికి మమిత వెళ్లింది. కానీ ఆమె మొహంలో ఇదెక్కడి అభిమానం రా బాబు అనే భయం మాత్రం కనిపించింది! ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. కొన్నాళ్ల ముందు కాజల్ అగర్వాల్‌కి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది.(ఇదీ చదవండి: ప్రభాస్ ఇంటి ఫుడ్‌ని మర్చిపోలేకపోతున్న హీరోయిన్.. ఐదేళ్లయినా సరే)'#Premalu' actress #MamithaBaiju mobbed at Chennai mall. pic.twitter.com/3TJMxHLwRL— Films Spicy (@Films_Spicy) June 3, 2024Craze for #MamithaBaiju 💥🥰 pic.twitter.com/GxoPfcqKPM— VCD (@VCDtweets) June 2, 2024
గుర్తు పట్టలేని విధంగా మారిపోయిన బిగ్‌బాస్ బ్యూటీ.. అసలేం జరిగింది?
సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఫేమస్ అయిన బ్యూటీ ఉర్ఫీ జావెద్. ఈ బాలీవుడ్ భామకు బిగ్‌బాస్‌తోనే గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత బోల్డ్ ఫ్యాషన్ దుస్తులతో సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. విచిత్రమైన ఫ్యాషన్ డ్రెస్సులు ధరించి ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఇదిలా ఉండగా.. తాజాగా తన ఇన్‌స్టాలో ఫోటోలు షేర్ చేసింది ముద్దుగుమ్మ. గుర్తు పట్టలేని విధంగా ఉన్న ఫోటోలు పంచుకున్న భామ.. తనకెదురైన సమస్యను ఫ్యాన్స్‌తో పంచుకుంది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.తాను అధికంగా ఫిల్లర్స్ వాడినందు వల్లే మొహం ఇలా మారిపోయిందంటూ ఉర్ఫీ రాసుకొచ్చింది. వాటి వల్లే అలర్జీ బారిన పడినట్లు తెలిపింది. ప్రతి రోజు ఇదే సమస్యతో నిద్ర లేస్తానంటూ ఆవేదన వ్యక్తం చేసింది. వీటితో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నట్లు పేర్కొంది. ఉర్ఫీ తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'అధికస్థాయిలో ఫిల్లర్స్ వల్ల నా ముఖంలో ఇలా మారిపోయింది. నాకు అలెర్జీలు ఉన్నాయి. అంతే కాదు నా ముఖం చాలాచోట్ల ఉబ్బినట్లు కనిపిస్తుంది. నేను ప్రతి రోజు ఇలానే నిద్రలేస్తాను. నా ముఖం ఎప్పుడూ వాచి ఉంటుంది. ఎప్పుడూ తీవ్రమైన అసౌకర్యంగా ఉంటా. ఇవేమీ ఫిల్లర్స్ కాదు అబ్బాయిలు.. అలెర్జీ వల్లే ఏర్పడిందే. ఇమ్యునోథెరపీ తర్వాత ఇలా వాచిపోయిన ముఖంతో చూస్తే.. నేను అలర్జీతో బాధపడుతున్నా. నాకు 18 ఏళ్ల వయస్సు నుంచి ఉపయోగిస్తున్న సాధారణ ఫిల్లర్లు, బొటాక్స్ వల్ల ఏం కాలేదు. కానీ మీకు నా ముఖం ఉబ్బినట్లు కనిపిస్తే, ఎక్కువ ఫిల్లర్స్ తీసుకోమని మాత్రం సలహా ఇవ్వకండి. కాస్తా దయ చూపండి చాలు' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన ఫ్యాన్స్ గెట్ వెల్ సూన్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. View this post on Instagram A post shared by Uorfi (@urf7i)
పెళ్లి చేసుకుంటావా? అన్నాడు.. నో చెప్పానని సినిమాలో నుంచే..
సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ వచ్చిందని సంబరపడేలోపే తనను మూవీలో నుంచే తీసేశారట! ఒక దర్శకుడు పెట్టిన పెళ్లి ప్రపోజల్‌కు ఒప్పుకోలేదని తనను పక్కన పెట్టేశారంటోంది అలనాటి హీరోయిన్ మీనాక్షి చౌదరి. దామిని (1993) సినిమా సమయంలో తనకు ఎదురైన ఇబ్బందులను తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఏకరువు పెట్టింది. పెళ్లి ప్రపోజల్మీనాక్షి శేషాద్రి మాట్లాడుతూ.. 'ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభంలో దర్శకుడు రాజ్‌కుమార్ సంతోషి నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగాడు. నేను కుదరదని తిరస్కరించాను. దాని గురించి పెద్ద రచ్చ కూడా చేయలేదు. సైలెంట్‌గా ఉన్నాను. ఆయన కూడా మౌనంగానే ఉన్నాడు. నా మనసుకు అనిపించింది చెప్పాను. అదే మాట మీద నిలబడ్డాను కూడా! నో చెప్పాను కదా అని నన్ను సినిమాలో నుంచి తీసేయాలని చూస్తే ఎలా? వాళ్లు జోక్యం చేసుకోవడంతో..పరిస్థితులు వర్కవుట్ అయితే టీమ్‌గా కలిసి పని చేస్తాం, లేదంటే లేదు. ఒక గొప్ప సినిమా చేయాలనుకున్నాను. ఆ గొప్ప సినిమా దామిని అవ్వాలనుకున్నాను. ఆ సమయంలో నిర్మాతల మండలి జోక్యం చేసుకుంది. ఆర్టిస్టుల గిల్డ్ కూడా ఈ వ్యవహారంపై స్పందించి నేను మళ్లీ దామిని చిత్రంలో భాగమయ్యేట్లు చేసింది. అలా దామిని సినిమా షూటింగ్ సజావుగా సాగిపోయింది' అని చెప్పుకొచ్చింది.పెళ్లి తర్వాత..కాగా మీనాక్షి.. 1995లో హరీశ్ మైసూర్‌ను పెళ్లాడింది. వీరికి ఒక కూతురు, కుమారుడు సంతానం. మరోవైపు రాజ్‌కుమార్ సంతోషి.. మనీలాను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు. 1996లో మీనాక్షి, రాజ్‌కుమార్ సంతోషి ఘటక్ సినిమాకు కలిసి పని చేశారు.చదవండి: ప్రభాస్ ఇంటి ఫుడ్‌ని మర్చిపోలేకపోతున్న హీరోయిన్.. ఐదేళ్లయినా సరే
ఫొటోలు
Sara Ali Khan: అంబానీ ప్రీవెడ్డింగ్.. ఇటలీలో ఎంజాయ్ చేస్తున్న కుర్ర హీరోయిన్ (ఫోటోలు)
చిరంజీవితో 16 సినిమాల్లో నటించిన హీరోయిన్ బర్త్‌డే (ఫోటోలు)
అనంత్- రాధిక ప్రీవెడ్డింగ్: ఇటలీలో ఎంజాయ్ చేస్తున్న ధోని ఫ్యామిలీ (ఫొటోలు)
AP: కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్.. ఎన్నికల ఫలితాలకు సర్వం సిద్ధం (ఫొటోలు)
హీరో యూనివర్స్ నా వెనకాల అంటున్న శ్యామల (ఫొటోలు)
క్రీడలు
T20 World Cup 2024: సౌతాఫ్రికాతో మ్యాచ్.. టాస్ గెలిచిన శ్రీలంక.. తుది జట్లు ఇవే..!
టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా ఇవాళ (జూన్ 3) సౌతాఫ్రికా, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. న్యూయార్క్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో శ్రీలంక కెప్టెన్ హసరంగ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మెగా టోర్నీకి శ్రీలంక జట్టు క్వాలిఫయర్ పోటీల ద్వారా అర్హత సాధించినప్పటికీ పేపర్‌పై పటిష్టంగా కనిపిస్తుంది. నేటి మ్యాచ్‌కు లంకేయులు ఏడుగురు బ్యాటర్లు, 4 బౌలర్ల ఫార్ములాతో బరిలోకి దిగుతున్నారు. మరోవైపు టోర్నీ హాట్ ఫేవరెట్లలో ఒకటైన సౌతాఫ్రికా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అరివీర భయంకరంగా కనిపిస్తుంది. ఆ జట్టు ఆరుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు, ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగుతుంది. ప్రొటీస్ బౌలింగ్ విభాగంలో కేవలం ఒకే ఒక స్పిన్నర్ (కేశవ్ మహారాజ్) ఉన్నాడు. తుది జట్లు..శ్రీలంక: పతుమ్ నిస్సంక, కుసల్ మెండిస్(వికెట్‌కీపర్), కమిందు మెండిస్, సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ఏంజెలో మాథ్యూస్, దసున్ షనక, వనిందు హసరంగ(కెప్టెన్), మహేశ్ తీక్షణ, మతీషా పతిరణ, నువాన్ తుషారదక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్(వికెట్‌కీపర్), రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రమ్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబడ, అన్రిచ్ నోర్ట్జే, ఒట్నీల్ బార్ట్‌మన్
Rohit-Kohli: ఒక్క మ్యాచ్‌లో ఓపెనర్లు బరిలోకి దిగితేనే ఇలా జరిగింది..!
టీ20 వరల్డ్‌కప్ 2024లో టీమిండియా తరఫున ఓపెనర్‌గా రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి బరిలోకి దిగాలని తారా స్థాయిలో డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది.అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటివరకు తొమ్మిది సార్లు టీమిండియా ఓపెనర్‌గా బరిలోకి దిగిన కోహ్లి.. రోహిత్ శర్మతో కలిసి ఒకే ఒక మ్యాచ్‌లో ఓపెనర్‌గా జత కట్టాడు. ఆ మ్యాచ్‌లో కోహ్లి, రోహిత్ జోడీ చెలరేగిపోయింది.2022 మార్చిలో ఇంగ్లండ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో వీరు కేవలం 54 బంతుల్లోనే 94 పరుగులు జోడించి, భారత ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేశారు. టీ20ల్లో కోహ్లి అప్పటివరకు అడపాదడపా మాత్రమే ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. ఆ సమయంలో కోహ్లి ఓపెనర్‌గా ఎలా రాణిస్తాడో అని అభిమానులు తెగ టెన్షన్ పడ్డారు.అయితే అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ కోహ్లి 52 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేశాడు. అప్పటికే రెగ్యులర్ ఓపెనర్‌గా స్థిరపడిన రోహిత్ సైతం ఆ మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. 34 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 64 పరుగులు చేశాడు.వీరిద్దరితో పాటు సూర్యకుమార్ యాదవ్ (32 నాటౌట్), హార్దిక్ పాండ్యా (39 నాటౌట్) కూడా విజృంభించడంతో ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 224 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. అనంతరం ఛేదనలో ఇంగ్లండ్ చేతులెత్తేయడంతో భారత్ ఆ మ్యాచ్‌లో 36 పరుగుల తేడాతో విజయం సాధించింది.ప్రస్తుతం జరుతున్న టీ20 వరల్డ్‌కప్‌లో కోహ్లి-రోహిత్ ఓపెనర్లుగా జతకట్టాలని డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ మ్యాచ్ స్కోర్ కార్డు నెట్టింట చక్కర్లు కొడుతుంది. కోహ్లి-రోహిత్ జోడీ ఒక్క మ్యాచ్‌లో జతకడితేనే ఈ స్థాయి విధ్వంసం జరిగింది. అదే వీరిద్దరు ప్రతి మ్యాచ్‌లో ఓపెనర్లు బరిలోకి దిగితే వీరిని ఆపడం సాధ్యమా అని క్రికెట్ అభిమానులు చర్చించుకుంటున్నారు.ఇదిలా ఉంటే, ఐపీఎల్లో ఓపెనర్‌గా ఇదివరకే ప్రూవ్ చేసుకున్న విరాట్.. అంతర్జాతీయ టీ20ల్లోనూ ఓపెనర్‌గా అదిరిపోయే ట్రాక్ రికార్డు కలిగి ఉన్నాడు. విరాట్ టీ20ల్లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన 9 మ్యాచ్‌ల్లో 57.14 సగటున, 161.29 స్ట్రయిక్‌రేట్‌తో 400 పరుగులు చేశాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2024 సీజన్లో అరివీర భయంకర ఫామ్‌లో (741 పరుగులతో సీజన్ టాప్ స్కోరర్) ఉన్న కోహ్లి.. రోహిత్‌తో పాటు ఓపెనర్‌గా జతకడితే ఈసారి టీమిండియా ప్రపంచకప్ గెలవడం ఖాయమని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
రోహిత్, కోహ్లి, సూర్య వంటి వాళ్ల వల్ల నష్టం!
టీ20 ప్రపంచకప్-2024 నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టుకు ప్రస్తుతం ఆల్‌రౌండర్ల అవసరం ఎక్కువగా ఉందని పేర్కొన్నాడు.తానే గనుక కోచ్ అయి ఉంటే ప్రతీ బ్యాటర్.. కచ్చితంగా కొన్ని ఓవర్లపాటైనా బౌలింగ్ చేయాలనే నిబంధన ప్రవేశపెట్టేవాడని ఇర్ఫాన్ పఠాన్ తెలిపాడు. 2007 టీ20, 2011 వరల్డ్‌కప్ ఈవెంట్లలో టీమిండియా ఇలాగే విజయాలు సాధించిందని పేర్కొన్నాడు.సచిన్ టెండుల్కర్, యువరాజ్ సింగ్, సురేశ్ రైనా తదితరులు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ తమ వంతు పాత్ర పోషించారని ఇర్ఫాన్ పఠాన్ గుర్తుచేశాడు. కాగా ప్రపంచకప్-2024లో జూన్ 5న టీమిండియా ఐర్లాండ్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.ఈ నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పు జరుగుతున్న తరుణంలో ఇర్ఫాన్ పఠాన్ స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘నేనే గనుక టీమిండియా కోచ్ అయితే.. ప్రతి బ్యాటర్ కూడా జట్టుకు అవసరమైన సమయంలో బౌలింగ్ చేయగలిగే స్థితిలో ఉండాలనే రూల్ పెడతా.ఇంగ్లండ్ జట్టులో లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, విల్ జాక్స్ తదితరులు బౌలింగ్ కూడా చేస్తారు. ఫ్రంట్‌లైన్ బౌలర్లతో పాటు వాళ్లు కూడా రాణిస్తారు.కానీ మన జట్టు పరిస్థితి అలా కాదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్ వంటి ప్యూర్ బ్యాటర్లు అస్సలు బౌలింగ్ చేయరు. కాబట్టి మిగతా వాళ్లతో పోలిస్తే మన జట్టు వెనుకబడినట్లే.ఈ ముగ్గురిలో ఒక్కరు బౌలింగ్ చేసినా జట్టుకు ఉపయోగకరంగా ఉంటుంది. అలాంటపుడు తుదిజట్టు కూర్పులో మనకు ఎక్కువ ఆప్షన్స్ కనిపిస్తాయి’’ అని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు. నలుగురు ఫ్రంట్‌లైన్ బౌలర్లతో పాటు అక్షర్ పటేల్, శివం దూబే, హార్దిక్ పాండ్యా వంటి వారిలో ఒకరు పూర్తిస్థాయిలో బౌలింగ్ చేస్తే జట్టుకు ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నాడు.వరల్డ్‌కప్-2024: టీమిండియారోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.. రిజర్వ్ ప్లేయర్లు: శుబ్‌మన్ గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్.చదవండి: Babar Azam: దమ్ముంటే వరల్డ్‌కప్ గెలవండి: బాబర్‌కు పాక్ మాజీ బ్యాటర్ సవాల్
టీ20 వరల్డ్‌కప్ 2024 ప్రైజ్‌మనీ: విజేతకు ఇన్ని కోట్లా..?
టీ20 వరల్డ్‌కప్ 2024 ప్రైజ్‌మనీ వివరాలను ఐసీసీ ఇవాళ (జూన్ 3) వెల్లడించింది. మెగా టోర్నీలో పాల్గొనే 20 జట్లకు ఈసారి రికార్డు స్థాయిలో భారీ పారితోషికం లభించనుంది. టోర్నీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఈసారి బడ్జెట్ కేటాయింపు జరిగింది. ఓవరాల్‌గా రూ. 93.52 కోట్లను ఐసీసీ పారితోషికంగా పంచనుంది.టోర్నీ విజేతకు ప్రపంచకప్ ట్రోఫీతో పాటు రూ. 20.36 కోట్లు.. రన్నరప్‌కు రూ. 10.64 కోట్లు లభించనున్నాయి. టోర్నీలో పాల్గొనే ప్రతి జట్టుకు కనీసం రూ. 1.87 కోట్లు లభించనున్నాయి. సెమీస్‌లో ఓడే రెండు జట్లకు చెరి రూ. 6.54 కోట్లు.. సూపర్-8లో ఇంటిముఖం పట్టే నాలుగు జట్లకు రూ. 3.17 కోట్లు.. 9, 10, 11, 12 స్థానల్లో నిలిచే జట్లకు రూ. 2.5 కోట్లు.. 13 నుంచి 20 స్థానాల్లో నిలిచే జట్లకు తలో రూ. 1.87 కోట్లు లభించనున్నాయి.ఇదే కాకుండా టోర్నీలో గెలిచే ప్రతి మ్యాచ్‌కు ఆయా జట్టుకు రూ. 25.8 లక్షల రూపాయలు లభించనున్నాయి. పొట్టి ప్రపంచకప్ చరిత్రలోనే ఈస్థాయిలో పారితోషికం గతంలో ఎన్నడూ ఇవ్వలేదు.ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్ 2024 జూన్ 1 నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. 28 రోజుల పాటు సాగే ఈ టోర్నీలో మొత్తం 55 మ్యాచ్‌లు జరుగనున్నాయి. వెస్టిండీస్, యూఎస్ఏ దేశాల్లో మొత్తం తొమ్మిది వేదికల్లో ఈ మెగా టోర్నీ జరుగనుంది. పొట్టి క్రికెట్ చరిత్రలోనే ఇదో భారీ టోర్నీ.
బిజినెస్
అంబానీయా.. మజాకా! సముద్రతీరమంతా బుక్ చేసేశాడుగా!
రాధిక మర్చంట్, అనంత్ అంబానీల ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అంగరంగ వైభాగంగా జరిగాయి. ఈ వేడుకలకు ఎంతో మంది సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. ఇటలీలోని పోర్టోఫినోలో జరిగిన చివరి రోజు ఈవెంట్లో ప్రఖ్యాత ఇటాలియన్ టేనర్ ఆండ్రియా బోసెల్లి మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇటలీలో జరిగిన ఈ వేడుకలకు జెఫ్ బెజోస్, బిల్ గేట్స్ వంటి దిగ్గజ పారిశ్రామిక వేత్తలు సైతం హాజరయ్యారు. మొత్తం ఈ వేడుకలకు 1200 మంది అతిథులు హాజరైనట్లు సమాచారం. ఈ కార్యక్రమం కోసం అంబానీ ఏకంగా పోర్టోఫినో సముద్ర తీరం మొత్తాన్ని బుక్ చేసుకున్నారు. View this post on Instagram A post shared by yourpoookieboo(YPB) (@yourpoookieboo)అంబానీ ఫ్యామిలీ ఇటలీ సెలబ్రేషన్లకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో అంబానీ ఫ్యామిలీతో పాటు.. షారుఖ్ ఖాన్, భార్య గౌరీ ఖాన్, జాన్వీ కపూర్, కియారా అద్వానీ, రణబీర్ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా మొదలైన సెలబ్రిటీలు కూడా కనిపించారు. View this post on Instagram A post shared by yourpoookieboo(YPB) (@yourpoookieboo)
పెరిగిన టోల్ చార్జీలు.. ఈ రోజు నుంచే షురూ
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) సోమవారం నుంచి 5 శాతం టోల్ పెంపును ప్రకటించింది. 2024 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రావాల్సిన కొత్త టోల్ చార్జీలు సార్వత్రిక ఎన్నికల కారణంగా వాయిదా పడ్డాయి. ఇప్పుడు ఎన్నికలు పూర్తైన నేపథ్యంలో కొత్త రేట్లు అమలులోకి వస్తాయి.కొత్త టోల్ చార్జీలు ఈ రోజు నుంచే (జూన్ 3) అమల్లోకి వచ్చినట్లు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సీనియర్ అధికారులు పేర్కొన్నారు. కొత్త ధరలకు సంబంధించిన అధికారిక వివరాలు తెలియాల్సి ఉంది.భారతదేశంలో మొత్తం సుమారు 855 టోల్ ప్లాజాలు ఉన్నాయి. ఇందులో దాదాపు 675 పబ్లిక్ ఫండెడ్ కాగా, మిగిలిన 180 రాయితీదారుల నిర్వహిస్తున్నారు. నేషనల్ హైవే పే రూల్ 2008 ప్రకారం.. టోల్ ఫీజుల పెంపు జరిగిందని సంబంధింత అధికారులు చెబుతున్నారు.NHAI డేటా ప్రకారం.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో టోల్ వసూలు రూ. 50,000 కోట్లను దాటింది (నవంబర్ 2023 వరకు). టోల్ గేట్లు పెరగటం, ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారుల సంఖ్య ఎక్కువ కావడంతో భారీ టోల్ వసూలు జరిగింది. ఇప్పుడు టోల్ చార్జీలు 5 శాతం పెరగడంతో టోల్ వసూలు మరింత పెరుగుతుందని స్పష్టంగా తెలుస్తోంది.
మస్క్ రూ.24వేలకోట్లు తిరిగి ఇచ్చేయాలి.. పిటిషన్ దాఖలు
టెస్లా వ్యవస్థాపకులు ఎలొన్‌మస్క్ ఇన్సైడ్ ట్రేడింగ్ ద్వారా సంపాదించిన దాదాపు 3 బిలియన్ డాలర్లను(సుమారు రూ.24వేలకోట్లు) తిరిగి వాటాదారులకు ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలైంది. మైకేల్ పెర్రీ అనే టెస్లా షేర్ హోల్డర్ ఈమేరకు అమెరికాలోని డెలావేర్ ఛాన్సరీ కోర్టులో పిటిషన్ వేశారు.అందులోని వివరాల ప్రకారం.. 2022లో టెస్లా కార్లకు భారీగానే డిమాండ్ ఉంది. కానీ నవంబర్ నెలలో కంపెనీ అంచనాల కంటే అమ్మకాలు తగ్గిపోయాయి. జనవరి 2023లో వెలువడిన నాలుగో త్రైమాసిక ఫలితాలకంటే ముందే మస్క్ చాకచక్యంగా షేర్లు విక్రయించి లాభాలు పొందారు. కంపెనీ సేల్స్ సహా ఇతర విషయాలు తెలుసుకునేందుకు మస్క్‌కు యాక్సెస్ ఉంటుంది. అందుకే ఇన్సైడ్ ట్రేడింగ్ ద్వారా ఫలితాల ముందే షేర్లు విక్రయించారు. 2022లో మస్క్మొత్తం 7.5 బిలియన్ డాలర్లు(సుమారు రూ.62వేలకోట్లు) విలువ చేసే షేర్లను అమ్మారు. నవంబర్-డిసెంబర్లో ఇన్సైడ్ ట్రేడింగ్ ద్వారా మస్క్ 3 బిలియన్ డాలర్లు(రూ.24వేలకోట్లు) లాభం పొందారు.టెస్లా సీఈఓ పదవిలో ఉన్న ఎలొన్‌మస్క్ నిబంధనలకు విరుద్ధంగా సంపాదించిన లాభాలను వెంటనే వాటాదారులకు తిరిగిచ్చేలా ఆదేశించాలని మైకేల్ పెర్రీ కోర్టును కోరారు. మస్క్ షేర్లను విక్రయించేలా టెస్లా డైరెక్టర్లు కూడా కార్పొరేట్ నియమాలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు. అయితే ఈ విషయంపై రాయిటర్స్ టెస్లాను వివరణ కోరగా ఎలాంటి స్పందన రాలేదని మీడియా కథనాల ద్వారా తెలిసింది.ఇదీ చదవండి: తగ్గిన చమురు ధరలు.. ఒపెక్‌ప్లస్ కూటమి ప్రభావంఇన్సైడ్ ట్రేడింగ్ అంటే..కంపెనీలో పనిచేస్తున్నవారికి రియల్‌టైమ్‌లో సంస్థ ఉత్పత్తులకు డిమాండ్ ఎలా ఉంది..ఉత్పత్తి ఎలా జరుగుతుంది..రాబోయే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి.. భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి అనే అంశాలపై అవగాహన ఉంటుంది. దాన్ని అసరాగా చేసుకుని అప్పటికే తమకు కంపెనీలో ఉన్న పెట్టుబడులపై నిర్ణయం తీసుకుని అక్రమంగా లాభాలు పొందుతారు.
ఫేక్ డిజిటల్ అరెస్ట్ స్కామ్.. రూ.1.2 కోట్లు కోల్పోయిన హైదరాబాద్ వాసి
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో మోసాల చేసేవారి సంఖ్య కూడా ఎక్కువవుతోంది. ఇటీవల కొంతమంది కేటుగాళ్లు పోలీసుల పేరుతో.. పార్శిల్ స్కామ్ / ఫేక్ డిజిటల్ అరెస్ట్ అనే కొత్త స్కామ్‌కు తెరలేపారు. దీనికి బలైన ఓ హదరాబాద్ వాసి 20 రోజుల్లో ఏకంగా రూ. 1.2 కోట్లు పోగొట్టుకున్నారు.మే 7న ఊహించని ఫోన్ కాల్‌తో హైదరాబాద్ వాసి కష్టాలు మొదలయ్యాయి. ఒక వ్యక్తి పోలీస్ అధికారినని నమ్మించి.. అతని పేరు మీద ఉన్న పార్శిల్లో డ్రగ్స్ ఉన్నాయని.. దానిని స్వాధీనం చేసుకున్నట్లు ఫోన్ కాల్ ద్వారా తెలిపారు. హైదరాబాద్ వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత వివరాలు అన్నీ కూడా ఎలాంటి తప్పు లేకుండా చెప్పడంతో.. బాధితుడు నకిలీ వ్యక్తిని పూర్తిగా నమ్మేశాడు.పోలీసుగా పరిచయం చేసుకున్న వ్యక్తి.. బాధితున్ని 24/7 ఆన్లైన్లో ఉండాలని చెప్పాడు. దీంతో ఆ వ్యక్తి 20 రోజులు ఇంటికే పరిమితం అయ్యాడు. ఆ 20 రోజులు సరిగ్గా తిండి లేదు, సరిగ్గా నిద్ర కూడా పోలేదని ఆ వ్యక్తి మీడియాతో చెప్పుకున్నారు.డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేయకుండా ఉండటానికి రూ. 30 లక్షలు పంపాలని నకిలీ పోలీస్ చెప్పాడు. ఇలా వారి ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోయాయి. మొత్తం మీద బాధితుడు రూ.1.2 కోట్లు నష్టపోయినట్లు పేర్కొన్నాడు.డిజిటల్ అరెస్ట్ స్కామ్ లేదా పార్శిల్ స్కామ్ అంటే..డిజిటల్ అరెస్ట్ స్కామ్ లేదా పార్శిల్ స్కామ్ అని పిలువబడే ఈ స్కామ్‌లో నేరస్థులు చట్టాన్ని అమలు చేసేవారిగా నటించి, అనుమానాస్పద వ్యక్తుల నుంచి డబ్బును దోచుకుంటారు. అనుమానాస్పద పార్శిల్ ఆధారంగా బాధితుడు పెద్ద నేరంలో చిక్కుకున్నట్లు నమ్మించి వారిని భయాందోళనలకు గురి చేస్తుంటారు.ఇలాంటి మోసాల నుంచి బయటపడే మార్గం..కాలర్ ఐడెంటిటీ ద్రువీకరించుకోవాలి: తెలియని నెంబర్ నుంచి కాల్స్ వచ్చినప్పుడు దాన్ని తప్పకుండా ద్రువీకరించుకోవాలి. దీనికోసం అధికారిక వెబ్సైట్ లేదా డాక్యుమెంట్స్ ద్వారా సమాచారం తెలుసుకుని అధికారిక సంస్థను నేరుగా సంప్రదించాలి.వ్యక్తి సమాచారం చెప్పకూడదు: మీకు తెలియని నెంబర్ నుంచి కాల్స్ వచ్చినప్పుడు.. మీ వివరాలను ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు. ఇది మీకు చాలా ప్రమాదాన్ని తీసుకువచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా కూడా నష్టపోయే అవకాశం ఉంది.అత్యవసర అభ్యర్థనలు: నిజానికి స్కామర్లు ఎప్పుడూ.. అత్యవసర పరిస్థితులను సృష్టిస్తారు. ఇలాంటి సమయంలో బాధితులు తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి.అనుమానాస్పద కార్యకలాపాలు: గుర్తు తెలియని నెంబర్స్ నుంచి కాల్స్ లేదా మెసేజస్ వస్తే.. వెంటనే పోలీసులను సంప్రదించాలి. బ్యాంకులకు సంబంధించినవైతే.. నేరుగా బ్యాంకుకు వెళ్లి సమాచారం తెలుసుకోవాలి.ప్రస్తుతం ఇలాంటి స్కామ్‌లు ఎక్కువైపోతున్నాయి. పోలీసులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. సైబర్ నేరగాళ్లు కొత్త అవతారాలు ఎత్తుతున్నారు. కాబట్టి ఇలాంటి స్కామ్‌ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులకు కూడా అవగాహన కల్పించాలి.
వీడియోలు
"మళ్ళీ జగనే" ఎలక్షన్ రిజల్ట్స్ పై పరిపూర్ణానంద స్వామి రియాక్షన్
తాజ్ ఎక్స్ ప్రెస్ లో మంటలు దగ్ధమైన నాలుగు భోగీలు
కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి
చంద్రబాబుకు పిక్చర్ అర్థం అయ్యింది..
చంద్రబాబుకు పిక్చర్ అర్థం అయ్యింది..
ఫ్లాష్ ఫ్లాష్ తెలంగాణ ఎలో అలెర్
పూర్తి ఆధారాలతో హేమను అదుపులోకి తీసుకున్న పోలీసులు
కఠినమైన ఆంక్షల మధ్య కౌంటింగ్
ఎగ్జిట్ పోల్స్ పై కృష్ణం రాజు సంచలన వ్యాఖ్యలు
ఎమ్మెల్సీ రఘు రాజుపై అనర్హత వేటు
ఫ్యామిలీ
ఈ డివైజ్‌తో కాళ్లు నొప్పులు మాయం!
తరుచు పెద్దవాళ్లు కాళ్ల నొప్పులతో బాధపడుతుంటారు. ఈ సమస్య ఎక్కువగా రాత్రి సమయాల్లోనే వేధిస్తుంటుంది. అలాగే ఎక్కువ గంటలు నిలబడి పనిచేసే ఉద్యోగులు కూడా ఇలాంటి సమస్యనే ఫేస్ చేస్తుంటారు. ముప్పై దాటిన మహిళలు, కొంతమంది పిల్లలు తరుచుగా కాళ్లు పీకేస్తున్నాయని అంటుంటారు. అలాంటి వాళ్ల కోసం అద్భుతమైన డివైజ్వచ్చింది. దీంతో దెబ్బకు ఈ సమస్య నుంచి ఉపశమనం పొందుతారు. ఈ 8 పిక్స్ లెగ్ మసాజ్ మిషాన్ అలసిన కాళ్లకు చక్కటి రిలీఫ్‌ని ఇస్తుంది. చిటికెలో మీ కాళ్ల నొప్పులు మాయం అవుతాయి. అరికాళ్లు, మోకాళ్లు పీకేస్తున్నట్లు ఉన్నవాళ్లకి ఈ డివైజ్ అద్భుతమైన వరం. కాళ్లకు చాలా సున్నితంగా మసాజ్ చేస్తూ మొత్తం కాళ్లకు రక్తప్రసరణ జరిగేలా చేస్తుంది. ఇది ఒకరకంగా అసౌకర్యాన్ని తెలియని ఒత్తడిని కూడా దూరం చేస్తుంది. కాళ్లు నొప్పులుగా ఇబ్బందిగా ఉంటే ఒక విధమైన అసౌకర్యంగా, ఏమయ్యిందనే టెన్షన్ ఉంటుంది. ఈ మసాజ్ మెషిన్‌తో ఆ సమస్యలు దూరమవ్వడమే గాక మీ కాళ్ల సమస్యలు కూడా మాయం అవుతాయి. ఈ డివైజ్ ఖరీదు రూ. 13 వేలు పైనే ఉంటుందట. (చదవండి: 'జలుబు' ఇంత ప్రమాదకరమైనదా? ఇలా కూడా ఉంటుందా..?)
సీనియర్ ఐఏఎస్ ఇంట్లో విషాదం : చందమామలాంటి కుమార్తె తిరిగి రాని లోకాలకు
భార్యభర్తలిద్దరూ ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు. వీరికి అందమైన కుమార్తె. చదువులో కూడా బాగా రాణిస్తోంది. ఇంతలోనే అనూహ్య పరిణామం వారి జీవితాల్లో తీరని అగాథాన్ని నింపింది. ఉన్నత చదువులు చదువుకుని తమకు మంచి పేరు తెస్తుందనుకున్న కుమార్తె అర్థాంతరంగా తనువు చాలించిన ఘటన కలకలం రేపింది.పోలీసులు అందించిన సమాచారం మహారాష్ట్రలో ఉన్నత పదవుల్లో ఉన్నారు వికాస్రస్తోగి, ఆయన భార్య రాధికా రస్తోగి. వికాస్ రస్తోగి మహారాష్ట్ర విద్యా శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీగా, రాధికా రస్తోగి రాష్ట్ర హోం శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. వీరికి లిపి రస్తోగి (27)అనే కుమార్తె ఉంది. ఈమె హర్యానాలోని సోనేపట్‌లో న్యాయశాస్త్రం చదువుతోంది అయితే పరీక్షలకు సంబంధించిన ఒత్తిడి నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్నారు. ముంబైలోని అపార్ట్మెంట్లోని 10వ అంతస్తు నుంచి దూకింది. లిపిని వెంటనే జిటి ఆసుపత్రికి తరలించి నప్పటికీ అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. తన మరణానికి ఎవరూ బాధ్యులు కాదని మృతికి ఎవరినీ నిందించవద్దంటూ పేర్కొన్న సూసైడ్ నోట్‌ని అక్కడి నుంచి స్వాధీనం చేసుకున్నారు కాగా 2017లో ఇదే తరహాలో మహారాష్ట్ర కేడర్ ఐఏఎస్ అధికారులు మిలింద్, మనీషా మహీస్కర్ జంట 18 ఏళ్ల కుమారుడిని కోల్పోయారు.
మేనరికం పెళ్లి చేసుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి!
హిందూ వివాహ వ్యవస్థలో మేనరికపు వివాహాలు సర్వసాధారణంగా చూస్తుంటాం. కుటుంబాల మధ్య సంబంధాలు నిలిచి ఉండాలనే ఆలోచనతో కొంతమంది, ఆస్తుల పరిరక్షణ కోసంమరికొంతమంది మేనత్త, మేనమామ పిల్లల మధ్య మేనరికపు వివాహాలు జరుగుతుంటాయిం. అయితే ఇలా మేనరికపు పెళ్లిళ్లు చేసుకున్న కొన్ని కుటుంబాల్లో పిల్లలు జెనెటిక్ లోపాలతో పుట్టడం లాంటివి కూడా చూస్తూ ఉంటాం. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20శాతం పెళ్లిళ్లు దగ్గరి బంధువుల్లోనే జరుగుతున్నాయి. ఇలాంటి వివాహాలను వైద్య పరిభాషలో ‘కన్‌సాంగ్వినియస్ మ్యారెజెస్’ అంటారు. అసలు మేనరికపు పెళ్లిళ్లు చేసుకోవచ్చా? చేసుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.బావ మరదలు పెళ్లి, మేనమామ మేనకోడలు పెళ్లి, ఇంకా రెండు కుటుంబాల మధ్య తరాల తరబడి కుండ మార్పిడిఅంటే వీళ్ల అమ్మాయిని, వారి అబ్బాయికి, వారి అబ్బాయిని వీరి అబ్బాయికి ఇచ్చి పెళ్లిళ్లు చేయడం. డా.శ్రీకాంత్ మిర్యాల ఎక్స్‌లో పోస్ట్ చేసిన వివరాలు.సాధారణంగా రక్తసంబందీకులు కాని తల్లిదండ్రులకి పుట్టే పిల్లల్లో సుమారు 2-4శాతం మందికి చిన్న లేదా పెద్ద అవకారాలు పుట్టుకతో ఉండే అవకాశాలు ఉన్నాయి. అది సాధారణం. అయితే ఈ మేనరికపు వివాహాల్లో ఇది రెట్టింపు అవుతుంది. అయితే పిల్లలు అవకారాలతో పుట్టే స్థితి పైన చెప్పిన మూడింట్లో చివరిదాంట్లో ఎక్కువ. మొదటి దాంట్లో తక్కువ. ఈ ఎక్కువ తక్కువలు పెళ్లి చేసుకున్న జంటలో భార్య భర్తల మధ్య జన్యుసారూప్యం ఎంత అన్నదానిబట్టి ఉంటుంది. బావమరదళ్ల కంటే, మేనమామ మేనకోడలి మధ్య జన్యుసారూప్యం ఎక్కువ, అలాగే కుండ మార్పిడిలో అవే జన్యువులు మాటిమాటికీ పంచుకోవడం వలన ఇంకా ఎక్కువ.ఇటువంటి వివాహాలవలన అబార్షన్లు ఎక్కువవటం, మృత శిశువులు జన్మించటం, పుట్టినపిల్లలు తక్కువ బరువుతో పుట్టడం, గుండెలో అవకారాలు, బుద్ధిమాంద్యంతో పాటు ఇతర మానసిక సమస్యలు, మెదడు జబ్బులు, రక్తహీనత మొదలైన రకరకాల సమస్యలు చాలా ఎక్కువగా కలుగుతాయి. కానీ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ అవకారాలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి కానీ పుట్టే పిల్లలందరూ అవకారాలతో పుడతారని కాదు.అయితే ఈ వివాహాలు మిగతా వివాహాల కంటే దృఢంగా ఉండటం, విడాకుల సంఖ్య తక్కువగా ఉండటం, ఆరోగ్య సమస్యలున్నప్పుడు రెండు కుటుంబాలూ సహాయపడటం మొదలైనవి లాభాలు.ఇటువంటి వాళ్లు పెళ్లిచేసుకునేముందు జెనిటిక్ కౌన్సిలింగ్ తీసుకోవాలి. దీనిలో ఇప్పటికే కుటుంబంలో ఉన్న వంశపారంపర్య జబ్బుల్ని కనుక్కుని, అవి పుట్టే పిల్లలకి వచ్చే అవకాశం లెక్కగట్టి చెబుతారు. దాన్ని బట్టి కాల్క్యులేటెడ్ రిస్క్ తీసుకోవచ్చు. ఇప్పటివరకూ కుటుంబంలో పెద్ద సమస్యలు లేనివాళ్లు, అవగాహన ఉంటే, ప్రేమ ఉన్న బావమరదళ్ల వరకూ ఫర్వాలేదు కానీ మిగతావి సమంజసం కాదు.
కాఫీ, టీలకు బ్రేక్: ఇలా ట్రై చేద్దామా..!
ఉదయం లేవగానే ఓ కప్పు వేడి వేడి కాఫీగానీ, టీగానీ పడకపోతే కాలకృత్యాల దగ్గర్నించి ఏ పని కాదు చాలామందికి. ఖాళీ కడుపుతో ఇలాంటి వాటివల్ల దీర్ఘకాలంలో ఆరోగ్యానికి చాలా హాని చేస్తాయి. నిజానికి ఉదయం బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. తద్వారా రోజు చురుకుగా ఉండటానికికావాల్సిన పోషకాలు అందుతాయి. మరి అవేంటో ఒకసారి చూద్దాం.కాఫీ, టీ అయినా అదొక సెంటిమెంట్‌లాగా మనకి అలవాటు అయిపోయింది. కానీ మంచి ఆరోగ్యం కోసం మంచి డైట్ ,కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను చేసుకోవాలి.టీ లేదా కాఫీ ఉదయం పూట టీ, కాఫీలు అలవాటు మానలేని వారు చక్కెరను బాగా తగ్గించేస్తే బెటర్. మధుమేహ వ్యాధిగ్రస్తులు పూర్తిగా మానేయాలి. తాజా పండ్లను, పళ్లతో చేసిన రసాన్ని తీసుకోవచ్చు. క్యారెట్, కీరా, యాపిల్, బీట్రూట్ లాంటివాటితో జ్యూస్ చేసుకోవచ్చు. అయితే ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూస్ జోలికి వెళ్లవద్దు. వీటిల్లో ఫైబర్ ఉండదు,పైగా అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది. జింజర్ టీ, హెర్బల్ టీపొద్దున్నే గోరు వెచ్చని నీళ్లు తాగాలి. అలాగే గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనె కూడా కలుపు కోవచ్చు. ఇందులోని విటమిన్ సీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.అల్లం, తులసి, పుదీనా ఆకులు, తేనెతో చేసిన హెర్బల్. జింజర్ టీతాగవచ్చు. కొబ్బరి నీళ్లు: కొబ్బరి నీళ్లలో అవసరమైన పోషకాలు, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, సోడియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు లభిస్తాయి., అలాగే ఫ్రీ-రాడికల్‌తో పోరాడే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. షుగర్ లెవల్స్‌ను బట్టి దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది.కాఫీ, టీలు రోజులో రెండుసార్లు తీసుకోవడం పెద్ద ప్రమాదం ఏమీకాదు. అయితే ఖాళీ కడుపుతో కాకుండా అల్పాహారం తరువాత తీసుకుంటే మంచిది. అలాగే షుగర్ వ్యాధిగ్రస్తులు చక్కెర వాడకంలో జాగ్రత్త పడాలి. తాగకూడనివిసోడా, కార్బోనేటేడ్ పానీయాలు వీటిల్లో అధిక మొత్తంలో చక్కెర, కెఫిన్ కలిసి ఉంటాయి. ఇంకా వీటిలో ఉండే కార్బన్ డయాక్సైడ్ కడుపులో గ్యాస్, ఉబ్బరం సమస్యలను కలిగిస్తుంది. ఎనర్జీ డ్రింక్స్‌లో అధిక మొత్తంలో కెఫిన్, షుగర్ ఉంటాయి. ఉదయాన్నే వీటిని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. దీని కారణంగా రోజంతా శక్తి లేకపోవడం అలసటగా అనిపిస్తుంది. ఇది కాకుండా ఎనర్జీ డ్రింక్స్ గుండె వేగాన్ని, రక్తపోటును పెంచుతాయనేది గమనించాలి.
న్యూస్ పాడ్‌కాస్ట్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి, రీప్లేస్మెంట్ మనమే.. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెల్లడి.. ఇంకా ఇతర అప్డేట్స్
కేంద్రంలో ఎన్డీఏ హ్యాట్రిక్, 350 నుంచి 400 స్థానాలు ఖాయం, తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటాపోటీ, ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వైఎస్సార్సీపీ ప్రభంజనం... ఎగ్జిట్ పోల్స్ అంచనా.. ఇంకా ఇతర అప్డేట్స్
సార్వత్రిక ఎన్నికల్లో నేడే ఆఖరి విడత పోలింగ్.. చండీగఢ్ సహా ఏడు రాష్ట్రాల్లోని 57 లోక్‌సభ స్థానాల్లో జరుగనున్న పోలింగ్.. ఇంకా ఇతర అప్డేట్స్
మళ్లీ విజయం మనదే, ప్రజలందరి దీవెనలతో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం... ‘ఎక్స్’లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్.. ఇంకా ఇతర అప్డేట్స్
నేడు కేరళకు నైరుతి రుతుపవనాల రాక.. రెండు రోజుల్లో రాయలసీమలో ప్రవేశించే అవకాశం.. ఇంకా ఇతర అప్డేట్స్
ప్రతిపక్ష నాయకులు చల్లే బురదలోనే కమలాలు విరగబూస్తాయి.. ప్రధాని మోదీ ధీమా.. ఇంకా ఇతర అప్డేట్స్
మోదీని ఈడీ అడిగినా దేవుడు పంపాడని చెప్తారేమో అంటూ రాహుల్ గాంధీ ఎద్దేవా.. ఇంకా ఇతర అప్డేట్స్
ఎన్నికల్లో విపక్ష ‘ఇండియా’ కూటమి గెలిస్తే హిందువులు రెండో తరగతి పౌరులే.. ప్రధాని మోదీ ఆందోళన.. ఇంకా ఇతర అప్డేట్స్
సార్వత్రిక ఎన్నికల ఆరో విడతలో 61.11 శాతం ఓటింగ్ నమోదు.. ఇంకా ఇతర అప్డేట్స్
దేశ అభివృద్ధి కోసమే మూడోసారి బీజేపీ ప్రభుత్వం, ఈ ఎన్నికల్లో గెలుపు నా కోసం, నా కుటుంబం కోసం కాదు.. ప్రధాని మోదీ స్పష్టీకరణ.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
‘పాపం..దొంగ గారు.. ఏసీ చూడగానే ఫ్లాట్!’ కట్ చేస్తే..!
దేశంలోఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోద వుతున్నాయి. ఏసీ, ఫ్యాన్లు లేనిదే క్షణం కూడా ఉండలేని పరిస్థితి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లో ఒక వింత ఘటన చోటు చేసుకుంది. చోరీకి వచ్చిన ప్రబుద్ధుడు, ఎంచక్కా ఏసి వేసుకొని ఆదమరిచి నిద్ర పోయిన ఘటన, ఫోటో వైరల్‌గా మారింది.పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలోని ఇందిరానగర్ ప్రాంతంలో ఉన్న ఇంట్లోకి చోరీకి చొరడ్డాడో వ్యక్తి. అసలే పగలూ రాత్రి తేడా లేకుండా మండే ఎండలు పైగా పూర్తిగా మద్యం మత్తులో ఉన్న అతగాడు, ఏసీ చూడగానే మైమరిచిపోయాడు. ఏసీ ఆన్ చేసుకొని, నేలమీదే ఒక దిండు వేసుకుని హాయిగా గుర్రు కొట్టి నిద్ర పోయాడు. తెల్లవారేక ఇంటి ముందు గేటు తెరిచి ఉండడంతో వారణాసిలో విధులు నిర్వహిస్తున్న సదరు ఇంటి యజమాని డాక్టర్ సునీల్ పాండేకు సమాచారం అందించారు పొరుగువారు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి చ్చింది. సంఘటనా చేరుకున్న పోలీసులు కూడా విస్తుపోయారు. చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకుని అలాగే గాఢనిద్రలోకి జారుకున్నాడు. చిత్రం వైరల్‌గా మారింది. దొంగ తనం చేయాలనే ఉద్దేశంతో ఇంట్లోకి ప్రవేశించిన వ్యక్తి నిద్రపోయాడని డీసీపీ నార్త్ జోన్ ఆర్ విజయ్ శంకర్ తెలిపారు. అతణ్ని అరెస్ట్ చేసిన పోలీసులు తదుపరి చర్యలకు ఉపక్రమించారు.
అత్తింటి వేధింపులతో గర్భిణి బలవన్మరణం
పెనమలూరు: కృష్ణాజిల్లా పెనమలూరు మండలం యనమలకుదురులో ఓ గర్భిణి బలవన్మరణానికి పాల్పడింది. వారసుడు కావాలని అత్తింటివారు వేధించడంతో కడుపులో ఉన్న ఆడబిడ్డను చంపలేక తానే ప్రాణాలు తీసుకుంది. సీఐ టి.వి.వి.రామారావు కథనం మేరకు.. యనమలకుదురు పుట్టరోడ్డుకు చెందిన కావ్యశ్రీ (19)కి రెండేళ్ల కిందట విజయవాడ కండ్రికకు చెందిన సందు శ్రీకాంత్‌తో(31) వివాహమైంది. శ్రీకాంత్ సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. పదినెలల కిందట పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన కావ్యశ్రీ, ఇటీవల మళ్లీ గర్భం దాల్చింది. ఆమెకు ప్రస్తుతం ఐదో నెల. భర్త శ్రీకాంత్ నాలుగు రోజుల క్రితం కావ్యశ్రీకి విజయవాడలో స్కానింగ్ చేయించగా, ఆడపిల్ల పుడుతుందని అక్కడి సిబ్బంది చెప్పారు. దీంతో దంపతుల మధ్య గొడవ మొదలైంది. ఆడపిల్ల వద్దు, వారసుడే కావాలని కావ్యశ్రీపై భర్త శ్రీకాంత్‌తోపాటు అత్త వెంకటేశ్వరమ్మ, మామ లక్ష్మణరావు ఒత్తిడి తెచ్చారు. దీంతో భార్యాభర్తలు గత బుధవారం ఆస్పత్రికి వెళ్లగా, అబార్షన్ చేస్తే ప్రమాదమని డాక్టర్ హెచ్చరించడంతో వెనక్కి తగ్గారు. అయితే శ్రీకాంత్ స్నేహితుడు కానిస్టేబుల్ శ్యామ్ తన పరపతితో అబార్షన్ చేయిస్తానని చెప్పడంతో భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవ మొదలైంది. అబార్షన్ చేయించుకోనని కడుపులో బిడ్డను చంపలేనని శుక్రవారం రాత్రి కావ్యశ్రీ తన భర్తకు తేల్చి చెప్పింది. శనివారం ఉదయం భార్యాభర్తలు మళ్లీ అబార్షన్ విషయమై చర్చించుకున్నారు. అనంతరం కావ్యశ్రీ స్నానానికి వెళ్తూ భర్తకు ఫోన్ ద్వారా ఓ మెసేజ్ చేసింది. ‘తాను వారసుడిని ఇవ్వలేనని,..కడుపులోని బిడ్డను చంపలేనని.. తనను ఛీదరించుకోవద్దని.. పదినెలల కుమార్తెను తన తల్లిదండ్రులే పెంచాలని..తనను క్షమించాలని’ ఆ మెసేజ్‌లో పేర్కొంది. కావ్యశ్రీ బాత్రూమ్ నుంచి ఎంతసేపటికీ బయటికి రాకపోవడంతో కటుంబసభ్యులు, భర్త బాత్రూమ్ తలుపులు తెరిచి చూడగా వెంటిలేటర్‌కు కావ్యశ్రీ ఉరేసుకుని కొనఊపిరితో ఉంది. ఆమెను వెంటనే కానూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ పరిస్థితి విషమించడంతో కావ్యశ్రీ ఆదివారం ఉదయం మృతి చెందింది. మృతిరాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కావ్యశ్రీ భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
విద్యార్థినులపై కామాంధుని వల
యశవంతపుర: రాష్ట్రంలో తరచూ ఎక్కడో ఒకచోట కామాంధుల అఘాయిత్యాలు సమాజంలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల పెన్‌డ్రైవ్ సంఘటన ఒకవైపు సంచలనం సృష్టిస్తుండగా, మరోవైపు ఉడుపిలోనూ అదే మాదిరి సంఘటన బయటపడింది. వ్యాపారవేత్త శ్రేయస్ నాయక్ (25) పలువురు బాలికలపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. జిల్లాలోని కుందాపుర తాలూకాలో అమావాస్యె బైలు పోలీసుస్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. శ్రేయస్‌పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేయటంతో పరారయ్యారు. విద్యార్థులపై లైంగిక దాడులు జరిపి అశ్లీల వీడియోలను తీసి తన ల్యాప్లాప్లో ఉంచుకున్నట్లు బయట పడింది.ఎక్కువగా కాలేజీ విద్యార్థులను మాయమాటలు చెప్పి గత సంవత్సరం నుంచి లైంగిక దాడులకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఉడుపిలో హాలాడి రోడ్డులోని హెగ్గూడ్లులోని ప్రాంతానికి తీసుకెళ్లి కారులో లైంగిక దౌర్జన్యాలకు పాల్పడిన్నట్లు అరోపణలు వస్తున్నాయి. వీడియోలు తీసుకున్న నిందితుడు వాటిని చూపి తను పిలిచినప్పుడు రావాలని బ్లాక్మెయిల్ చేసేవాడు. ఒక బాలిక అతని వల్ల గర్భవతి కూడా అయ్యింది. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో మే 18న పోక్సో కేసు నమోదైంది. ఆ తరువాత విచారణలో అతని అకృత్యాలు ఒక్కొక్కటే వెలుగుచూశాయి. అంతలోనే దుండగుడు పరారయ్యాడు. శ్రేయస్ అరెస్ట్‌కు పోలీసు బృందాలు గాలింపు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ డా.కె.అరుణ్ ఆదివారం తెలిపారు. నర్సుపై వైద్యుని అకృత్యం ఉడుపి జిల్లాలో మరో ఘటనలో.. కుందాపుర తాలూకా ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ రాబర్ట్ రెబల్‌పై లైంగిక ఆరోపణలు వచ్చాయి. ఆస్పత్రిలో పని చేస్తున్న నర్సుపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు కుందాపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు రాబర్ట్ రెబల్‌ను సస్పెండ్ చేశారు. గర్భం దాల్చిన చిన్నారిదొడ్డబళ్లాపురం: అత్యాచారానికి గురైన బాలిక గర్భం దాల్చిన కేసులో ముగ్గురిని దక్షిణ కన్నడ జిల్లా బెళ్తంగడి పోలీసులు అరెస్టు చేసారు. బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసి మహమ్మద్ ఇక్బాల్ (26), ఫారూక్ (19), మరో మైనర్ బాలున్ని అరెస్టు చేశారు. నిందితులు కొన్ని నెలల క్రితం బాలికపై అత్యాచారం జరిపారు. బాలిక ఇప్పుడు ఆరునెలల గర్భంతో ఉండడంతో దారుణం వెలుగు చూసింది.
తుపాకీతో కాల్చుకుని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
రాయచోటి: అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆదివారం సెంట్రీ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ వేదవతి (26) గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా తేలిందని, ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారిస్తామని డీఎస్పీ రామచంద్రరావు, అర్బన్ సీఐ సుధాకర్‌రెడ్డి చెప్పారు. వారు తెలిపిన వివరాల మేరకు.. పుంగనూరు సమీపంలోని బింగానిపల్లెకు చెందిన వేదవతి, మదనపల్లెకు చెందిన దస్తగిరి 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఐదేళ్ల పాప ఉంది. దస్తగిరి పుంగనూరులోని ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో ఫ్యాకలీ్టగా పనిచేస్తున్నారు. వేదవతి చిత్తూరు నుంచి ఏడాది కిందట అన్నమయ్య జిల్లాకు బదిలీపై వచ్చారు. రాయచోటిలోనే కాపురం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం సెంట్రీ డ్యూటీలో ఉన్న వేదవతి చేతిలో ఉన్న గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతదేహాన్ని రాయచోటి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.