Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

AP Elections 2024: May 16th Politics Latest News Updates Telugu
May 16th: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌

May 16th AP Elections 2024 News Political Updates8:10 AM, May 16th, 2024ఎమ్మెల్సీ జాంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటువిజయవాడఫిరాయింపు ఎమ్మెల్సీ జాంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటుఅనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్న శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజుటీడీపీలో చేరిన జాంగా కృష్ణ మూర్తివైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు మేరకు విచారణ జరిపి అనర్హుడిగా ప్రకటించిన శాసన మండలి చైర్మన్ 7:45 AM, May 16th, 2024వైఎస్సార్‌సీపీ అనుకూల వర్గాలే టార్గెట్‌.. మహిళలపై పచ్చ మూకల దాష్టీకాలునర్సీపట్నంలో దుశ్శాసన పర్వం ఒంటరి మహిళను జుట్టు పట్టుకొని ఈడ్చి కాళ్లతో తన్నిన అయ్యన్న అనుచరులుకృష్ణా జిల్లాలో దమనకాండమహిళను ట్రాక్టర్‌తో తొక్కి చంపడానికి ప్రయత్నించిన టీడీపీ నేతమహిళలపై హత్యాయత్నాలు చేస్తున్నా ఏమీ పట్టనట్లు ఈసీ నిర్లిప్తత గ్రామాలు వీడి దూరంగా తలదాచుకుంటున్న బీసీ, ఎస్సీ, ఎస్టీలు చేష్టలుడిగి చూస్తున్న అధికార యంత్రాంగం ఓట్ల లెక్కింపు దాకా కొనసాగించేలా చంద్రబాబు పన్నాగం.. రాష్ట్రవ్యాప్తంగా దాడులకు పురిగొల్పుతూ భయానక వాతావరణం రాజకీయ ప్రత్యర్థులపై గ్రామాల్లో విచ్చలవిడిగా దాడులు.. కౌంటింగ్‌కు వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను దూరంగా ఉంచడమే లక్ష్యం 7:20 AM, May 16th, 2024నేడు విజయవాడకు సీఎం జగన్‌ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నేడు విజయవాడకు రానున్నారు.ఈ సందర్భంగా బెంజి సర్కిల్‌లో ఉన్న ఐ-ప్యాక్‌ కార్యాలయాన్ని సందర్శించనున్నారు. సుమారు అర గంట పాటు ఐ-‍ప్యాక్‌ ప్రతినిధులతో సీఎం జగన్‌ భేటీ కానున్నారు. 7:00 AM, May 16th, 2024నేడు ఈసీఐని కలవనున్న ఏపీ సీఎస్‌ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాఎన్నికల అనంతరం జరిగిన హింసపై సీఎస్, డీజీపీని నివేదిక కోరిన ఈసీఐఈసీఐకి వాస్తవ పరిస్థితులు వివరించనున్న సీఎస్, డీజీపీఎన్నికల పోలింగ్‌కు కొద్దీ రోజులు ముందే డీజీపీ, ఐజీ, ఎస్పీలను మార్చిన ఎన్నికల కమిషన్అకస్మాత్తుగా పోలీస్ అధికారులను మార్చడంతో పెరిగిన హింసాత్మక ఘటనలుపల్నాడు ఎస్పీ, ఐజీ, డీజీపీని పోలింగ్‌కు ముందు మార్చిన ఈసీఐఈసీ ఆకస్మిక నిర్ణయాలతో హింస పెరిగిందని భావిస్తున్న అధికారులు 6:50 AM, May 16th, 2024ఏపీ పోలీస్‌ అబ్జర్వర్‌ దీపక్‌ మిశ్రా అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ఫిర్యాదుటీడీపీ నేతలతో కుమ్మక్కై తెర వెనుక కథ నడిపినట్లు దీపక్‌ మిశ్రాపై సీఈవో, డీజీపీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదుపోలింగ్‌ రోజు కూటమికి మద్దతుగా వ్యవహరించాలని పోలీసు అధికారులపై దీపక్‌ మిశ్రా ఒత్తిడి తెచ్చారన్న వైఎస్సార్‌సీపీపోలింగ్‌కు 3 రోజుల ముందు టీడీపీ నేత విష్ణువర్థన్‌ ఇచ్చిన పార్టీకి దీపక్‌ మిశ్రా హాజరైనట్లు గుర్తింపుఆ తర్వాత నుంచి పోలీస్‌ అధికారుల మార్పులపై అనుమానాలుమాచర్ల,గురజాలలో రాత్రికి రాత్రే సీఐలు, ఎస్‌ఐల మార్పులుచివరికి సీఎం జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో కూడా దీపక్‌ మిశ్రా జోక్యం చేసుకున్నారని వైఎస్సార్‌సీపీ ఫిర్యాదుఈ కేసులో ఏ2 నిందితుడిని అరెస్ట్‌చేయొద్దని విచారణ అధికారిపై దీపక్‌ మిశ్రా ఒత్తిడి తెచ్చారన్న వైఎస్సార్‌సీపీఆధారాలతో సహా డీజీపీ, ఈసీలకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ 6:40 AM, May 16th, 2024రిగ్గింగ్‌ చేయాలనే ఆలోచనతోనే దాడులకు తెగబడ్డారు: సజ్జల రామకృష్ణారెడ్డిటీడీపీ అరాచక శక్తులు పోలింగ్ సరిగ్గా జరగకుండా చేయాలని చూశాయిరిగ్గింగ్ చేయాలనీ, మా వారిని అడ్డుకోవాలనీ చూశారుటీడీపీ నేతలు చేసిన అరాచకాలపై ఈసీ, డీజీపీలకు ఫిర్యాదు చేశాంఎన్నికల సంఘం విధుల్లో కూడా టీడీపీ దూరిందిపురంధేశ్వరి ఎవరిపై ఫిర్యాదు చేశారో వారిని బదిలీ చేశారువారు కోరిన అధికారులను వేశారుమొత్తం 29 మంది అధికారులను ఉన్నట్టుండి ట్రాన్సఫర్ చేశారువిష్ణువర్ధనరావు అనే రిటైర్డ్ ఆఫీసర్ ఇచ్చిన విందుకు పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రా వెళ్లారువిష్ణువర్ధన్ రావు టీడీపీ నేత సుజనాచౌదరికి దగ్గరి మనిషిఅలాంటి వ్యక్తి ఇచ్చిన విందుకు పోలీసు అబ్జర్వర్ వెళ్లితే ఇక ఎన్నికలు ప్రశాంతంగా ఎలా జరుగుతాయి?టీడీపీ ఆఫీసులో రూపు దిద్దుకున్న ప్లాన్ ని దీపక్ మిశ్రా ద్వారా ఈసీ అమలు చేసిందిరెడ్డి, ఎస్సీ, ఎస్టీ అధికారులు అందరినీ వరసపెట్టి ట్రాన్సఫర్ చేశారుఎవరిపై ఫిర్యాదు వచ్చినా విచారణ చేయకుండానే వెంటనే ట్రాన్సఫర్ చేశారుప్రకాశం, పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలలో అధికారులను మార్చారుఅక్కడే ఎక్కువ హింస చెలరేగిందిజరుగుతున్న దాడులన్నీ ఒన్ సైడే జరుగుతన్నాయిమంత్రి అంబటి రాంబాబును అన్యాయంగా హౌస్ అరెస్టు చేశారుఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి కుటుంబంపై దాడులు చేసినా పోలీసులు పట్టించుకోలేదువెంటనే పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రాని వెంటనే వెనక్కు పిలవాలిఎన్నికల కమిషన్ త్వరగా స్పందించి శాంతిభద్రతలను పరిరక్షించాలిసంక్షేమ పథకాల నిధులను కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం చేస్తోందికౌంటింగ్ సందర్భంగా అల్లర్లు చేసేందుకు కూడా టీడీపీ కుట్రలు పన్నుతోందికచ్చితంగా రెండోసారి జగన్ పాలన రాబోతోందిసీఎస్, డీజీపిని కేంద్ర ఎన్నికల సంఘం పిలిపించటం అసాధారణంపోలింగ్ తర్వాత కూడా పరిపాలన జరగకుండా చేయటం ఏంటి?వీటన్నిటిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాంపురంధేశ్వరి ఇచ్చిన లేఖల ప్రకారం ఈసీ పనిచేయటంపై సీఈసీకి ఫిర్యాదు చేస్తాంపోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రాని నియమించటం వెనుక కుట్ర ఉందిలేకపోతే రిటైర్డ్ ఆఫీసర్ ని పోలీసు అబ్జర్వర్ గా నియమించటం ఏంటి?ఉద్యోగంలో ఉన్న ఆఫీసర్ ని నియమిస్తే బాధ్యతతో వ్యవహరిస్తారురిటైర్డ్ అధికారిని నియమిస్తే బాధ్యత ఏం ఉంటుంది?ఓటర్లు తమ బాధ్యతగా తీసుకుని పోలింగులో పాల్గొన్నారు. 6:30 AM, May 16th, 2024మైదుకూరులో టీడీపీ గుండాల దాడివిశ్వనాథ పురానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త భూమిరెడ్డి చంద్ర ఓబుల్ రెడ్డిపై హత్యాయత్నం ఎన్నికల రోజు పోలింగ్ బూత్‌లో ఏజెంట్‌గా కూర్చున్నాడని కోపంతో ఓబుల్ రెడ్డిపై దాడి చేసిన టీడీపీ గూండాలుదాడిలో తీవ్ర గాయాలు.. మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపుఆసుపత్రిలో ఓబుల్ రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి

YSR Congress accuses Election Commission of bias
టీడీపీ గూండాగిరికి పోలీసుల వత్తాసు

సాక్షి, అమరావతి: యథేచ్ఛగా సాగుతున్న టీడీపీ శ్రేణుల దాడులు, దౌర్జన్యాలు, విధ్వంసాన్ని అరిక­ట్టేం­దుకు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌ సీపీ డిమాండ్‌ చేసింది. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా పక్కా పన్నాగంతో జరుగుతున్న దాడులను డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా దృష్టికి తెచ్చింది. పార్టీ నేతలు అంబటి రాంబాబు, మేరుగు నాగార్జున, పేర్ని వెంకట్రామయ్య(నాని), లేళ్ల అప్పిరెడ్డి తదితరులు బుధవారం రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీని కలసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో టీడీపీ గూండాలు దాడులకు తెగబడిన 21 ఘటనలకు సంబంధించి పూర్తి ఆధా­రా­లను అందచేశారు. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించినప్పటి నుంచి టీడీపీ విధ్వంసం సృష్టించే పన్నా­గాన్ని అమలు చేస్తోందన్నారు. వైఎస్సార్‌సీపీ నేత­లు శాంతియుతంగా వ్యవహరిస్తున్నా కవ్వింపు చర్య­ల­కు పాల్పడుతూ దాడులకు దిగుతోందని తెలిపారు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యుల భద్రతకు తగిన చర్యలు తీసుకో­వాలని విజ్ఞప్తి చేశారు. హింసాత్మక ఘటనలపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి కారకులపై కఠిన చర్యలు చేపట్టి వీటికి అడ్డుకట్ట వేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం వైఎస్సార్‌సీపీ నేతలు డీజీపీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు.దౌర్జన్యాలకు కొమ్ముకాసిన పోలీసులు: అంబటి టీడీపీ గూండాలు బరితెగించి దాడులకు పాల్పడు­తుంటే పోలీసులు చోద్యం చూశారు. రాజకీయ ఒత్తిళ్లతో పోలీసు అధికారులను ఈసీ హఠాత్తుగా బదిలీ చేసింది. వారిని మార్చిన తరువాత కూడా హింసాత్మక సంఘటనలు యథేచ్ఛగా సాగుతు­న్నాయి. దీనికి ఈసీ ఏం సమాధానం చెబుతుంది? అవగాహనలేని డీజీపీ, డీఐజీలు, ఎస్పీలు, ఇతర అధికారులను నియమించడంతోనే హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. ఈసీ తీసుకున్న తప్పు­డు నిర్ణయాలతో రాష్ట్రం రావణ కాష్టంలా మారింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాలు, పురందేశ్వరి సూచ­నల ప్రకారం ఈసీ అడ్డగోలుగా వ్యవహరించింది. అసలు పోలీసు వ్యవస్థ ఉందా? అనే సందేహం కలుగుతోంది. కొందరు పోలీసు అధికారులు టీడీపీ­తో కుమ్మక్కయ్యారు. టీడీపీ గూండాలు పోలింగ్‌ బూత్‌లలో దౌర్జన్యం చేస్తున్నా, వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తల ఇళ్లపై పడి దాడులు చేస్తున్నా పోలీసు యంత్రాంగం ఏమాత్రం అడ్డుకోలేక­పోయింది. ఎన్నికలు సక్రమంగా నిర్వహించడంలో పోలీసు యంత్రాంగం విఫలమైంది. వైఎస్సార్‌సీపీ నేతలను హౌస్‌ అరెస్ట్‌లు చేసిన పోలీసులు టీడీపీ శ్రేణులు స్వైర విహారం చేసినా కన్నెత్తి చూడలేదు. నన్ను హౌస్‌ అరెస్ట్‌ చేసి నా ప్రత్యర్థిని మాత్రం యథేచ్ఛగా తిరగనిచ్చారు. నా నియోజకవర్గంలో రీపోలింగ్‌ అవసరం లేదని ఈసీ ఎలా చెబుతుంది? వెబ్‌ కెమెరా రికార్డింగ్‌లను పరిశీలించకుండా ఏకపక్షంగా నిర్ణయాన్ని ఎలా ప్రకటిస్తుంది? ఇందుకు ఈసీ సమాధానం చెప్పాలి.దాడులు.. ఆపై కేసులు: పేర్ని నానిటీడీపీ పక్కా పన్నాగంతో దాడులకు పురిగొల్పుతోంది. కర్రలు, కత్తులు, రాడ్లు చేతబట్టుకుని పచ్చ ముఠాలు దాడులకు పాల్పడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. దీన్ని ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై తిరిగి కేసులు బనాయించడం దారుణం. పోలింగ్‌ అనంతరం హింసకు పోలీసుల వైఫల్యమే కారణం. పల్నాడు ఎస్పీకి ఎన్నిసార్లు ఫోన్లు చేసినా పట్టించుకోలేదు. రిటైర్డ్‌ అధికారిని పోలీస్‌ పరిశీలకుడిగా ఈసీ నియమించడం ఏమిటి? ఆయనకు ఏం జవాబుదారీతనం ఉంటుంది? బీజేపీ, టీడీపీ నేతలకు సహకరించాలంటూ ఆయన పోలీసు అధికారులను బెదిరించారు. మా కార్యకర్తలపై హత్యాయత్నం కేసులు పెడుతున్నారు. పురందేశ్వరి చెప్పిన విధంగా పోలీసు అధికారులను మార్చిన చోటే హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. పక్కా కుట్రతో పోలీసు అధికారులను బదిలీ చేసి టీడీపీ, బీజేపీ, జనసేన విధ్వంసానికి పాల్పడుతున్నట్లు స్పష్టమవుతోంది. దీనికి పోలీసులతోపాటు ఈసీ కూడా సమాధానం చెప్పాలి. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తల భద్రత కోసం ప్రజాస్వామ్యయుతంగా పోరాడతాం.చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని ఈసీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు’రాష్ట్రంలో హింస, దాడులు, అల్లర్లలో ప్రధాన ముద్దాయి చంద్రబాబేనని, ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్‌ చేసింది. మంత్రులు అంబటి రాంబాబు, మేరు­గు నాగార్జున, జోగి రమేష్, వైఎస్సార్‌సీపీ ఎమ్మె­ల్యేలు పేర్ని నాని, నంబూరు శంకరరావు, ఎమ్మె­ల్సీ లేళ్ల అప్పిరెడ్డి బుధవారం ఎన్నికల సంఘం కార్యాలయంలో ప్రధాన ఎన్నికల అధికారి ము­ఖేష్‌­కుమార్‌ మీనాను కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. గొడవలకు సంబంధించిన ఆధారాలు అందజేశారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ ఇటీవల చేసిన హింసాకాండపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. ముఖ్యంగా పల్నాడులో ఉద్దేశపూర్వకంగా, ప్లాన్‌ ప్రకారం దాడులు చేశారని తెలిపారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, కూటమి పార్టీలకు కొమ్ముకాస్తున్నారని వారు వివరించారు.

Daily Horoscope: Rasi Phalalu 16-05-2024 In Telugu
Today Horoscope: ఈ రాశి వారికి ఇంటిలో వివాదాలు తీరతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: శు.అష్టమి ఉ.7.22 వరకు, తదుపరి నవమి, నక్షత్రం: మఖ రా.7.12 వరకు, తదుపరి పుబ్బ, వర్జ్యం: ఉ.6.06 నుండి 7.50 వరకు, తదుపరి తె.4.02 నుండి 5.46 వరకు(తెల్లవారితే శుక్రవారం), దుర్ముహూర్తం: ఉ.9.47 నుండి 10.35 వరకు, తదుపరి ప.2.58 నుండి 3.46 వరకు, అమృతఘడియలు: సా.4.31 నుండి 5.56 వరకు. మేషం: ఆదాయానికి మించి ఖర్చులు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. మానసిక అశాంతి. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు.వృషభం: దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. కార్యక్రమాలలో ఆటంకాలు. అనారోగ్యం. కుటుంబసమస్యలు. వృత్తి, వ్యాపారాలలో సమస్యలు.మిథునం: ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ఆస్తిలాభ సూచనలు. వృత్తి, వ్యాపారాలలో అనుకూల పరిస్థితి.కర్కాటకం: దూరప్రయాణాలు. బంధువులతో విభేదాలు. పనుల్లో జాప్యం. ఆరోగ్యభంగం. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు.సింహం: నూతన విద్యావకాశాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.కన్య : రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో అవాంతరాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.తుల: ఇంటిలో వివాదాలు తీరతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవహారాలలో విజయం. భూలాభాలు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.వృశ్చికం: కార్యజయం. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాల రీత్యా ఖర్చులు. సన్మానాలు. ప్రముఖులతో పరిచయాలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు అధిగమిస్తారు.ధనుస్సు: పనుల్లో అవాంతరాలు. రాబడికి మించిన ఖర్చులు. బంధువులతో తగాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు కొద్దిపాటి చికాకులు.మకరం: ఆస్తి వివాదాలు. ఆర్థిక లావాదేవీలలో ఒడిదుడుకులు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.కుంభం: కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.మీనం: ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. పనులు విజయవంతంగా సాగుతాయి. స్థిరాస్తివృద్ధి. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం.

Betting On andhra pradesh elections
‘హలో అప్పారావ్‌.. ఏంటి పరిస్థితి!’

హలో.. అప్పారావ్‌!.. నేను రాజుబాబుని మాట్లాడుతున్నాను. ఏంటి పరిస్థితి? మీ దగ్గర ఎవరు గెలుస్తారు? ఎన్ని ఓట్ల మెజార్టీ వస్తుందనుకుంటున్నారు? అవతల పార్టీ అభ్యర్థికి ఎన్ని పడుంటాయ్‌? అయితే మన పార్టీ కేండిడేట్‌ గెలుపు గ్యారంటీ అన్న మాట! అది సరే.. స్టేట్‌లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారు? నీకున్న సమాచారం ఓ సారి చెప్పు!’ అని అడిగే సరికి ఆ రాజుబాబు తనకు తెలిసినవి కొన్ని, తెలియనివి మరికొన్నింటిని జోడించి అక్కడ వాళ్లు గెలుస్తున్నారు.. ఇక్కడ వీళ్లు గెలుస్తున్నారంటూ టకటకా చెప్పేస్తున్నాడు. మధ్యమధ్యలో అప్పారావుకొచ్చిన డౌట్‌లను నివృత్తి చేస్తూ ఫలితాలను ముందే ప్రకటిస్తున్నాడు. ఇలాంటి అప్పారావులు, రాజుబాబుల్లాంటి వారు చాలామంది ఈ పనిమీదే ఉన్నారు. ఎక్కడ చూసినా ఇలాంటి చర్చలే సాగిస్తున్నారు. పోలింగ్‌ ముగిశాక అభ్యర్థులు, పార్టీల గెలుపోటములపైనే అందరి దృష్టి ఉంది. ఏ నలుగురు కలిసినా ఇదే చర్చ కనిపిస్తోంది. సాక్షి, విశాఖపట్నం: అంతేకాదు.. ఎక్కడెక్కడో ఉన్న వారు సైతం తమ స్నేహితులు, బంధువులకు ఫోన్లు చేసి ఎన్నికల ఫలితాలెలా ఉంటాయన్న దానిపైనే మాట్లాడుకుంటున్నారు. సాధారణ ప్రజలకంటే ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు, ముఖ్య కార్యకర్తలు వీటిపైనే చర్చించుకుంటున్నారు. ఆయా పార్టీల అభ్యర్థులకు ఎన్ని ఓట్లు పోలై ఉంటాయి? వాటిలో గెలుపు అంశాలు ఎంతవరకు ఉంటాయన్న దానిపై బేరీజు వేస్తున్నారు. మహిళలు, పురుషులు, వృద్ధులు, యువతీ యువకులు ఎవరికి వేశారోనని ఆరా తీస్తున్నారు. దానిని బట్టి ఫలానా అభ్యరి్థ/పార్టీ గెలుస్తుందని, లేదా ఓటమి పాలవుతారని అంచనాకొస్తున్నారు. ఇలా కూడికలు, తీసివేతల్లో నిమగ్నమై ఉన్నారు. లెక్కలు, అంచనాల్లో తలమునకలై ఉన్నారు. మరోవైపు టీవీల్లోను, సోషల్‌ మీడియాలోను, యూట్యూబ్‌ ఛానల్స్‌లోనూ ఇప్పటికే అనధికారికంగా ఎగ్జిట్‌ పోల్స్‌ పేరిట ఏ పార్టీకి ఎన్ని సీట్లొస్తాయన్నది జోస్యం చెప్పేస్తున్నారు. ఆయా పార్టీల శ్రేణులు, రాజకీయాలపై ఆసక్తి ఉన్న వారు వీటిని ఎక్కువగా వీక్షిస్తున్నారు. కొన్ని యూట్యూబ్‌ ఛానల్స్‌లో ఈ ఎన్నికల్లో తమదే శాస్త్రీయమైన సర్వే అని చెప్పుకుంటూ తమ అభిమాన పారీ్టకి అనుకూలంగా ఫలితాలను ఇస్తున్నారు. మరికొందరైతే అధికార వైఎస్సార్‌సీపీకి అనుకూల ఫలితాలనే కూటమికి వస్తున్నట్టు తారుమారుగా చూపిస్తున్నారు. ఇలా సోషల్‌ మీడియా, యూట్యూబ్‌ ఛానల్స్‌లో వ(ఇ)స్తున్న అనధికార అంచనా ఫలితాలు జనాన్ని గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి. దీంతో తమ నమ్మకస్తులకు ఫోన్లు చేసి సందేహ నివృత్తి చేసుకుని ఒకింత ఊరట చెందుతున్నారు. వ్యతిరేక ఫలితాలు వస్తాయన్న సంగతి తెలిస్తే ఆందోళనకు గురవుతున్నారు. టీవీలు, సోషల్‌ మీడియా, యూట్యూబ్‌ ఛానల్స్‌లో వస్తున్న సొంత అంచనాల ఫలితాలతో ఇప్పటికే బెట్టింగులకు దిగిన వారు మరింత టెన్షన్‌ పడుతున్నారు. బెట్టింగులపై కూటమిలో బెరుకు.. మరోవైపు పోలింగ్‌కు ముందు కూటమి అభ్యర్థులదే గెలుపంటూ పందాల కోసం హడావుడి చేసిన వారు ఇప్పుడు వెనక్కి తగ్గారు. తొలుత 1:2,3 బెట్టింగులకు సిద్ధమన్న వారిప్పుడు 1:1కి కూడా ముందుకు రావడం లేదు. ఏదోలా తామే అధికారంలోకి వస్తామని బీరాలు పలుకుతున్నా.. పందాల దగ్గరకు వచ్చేసరికి పలాయనం చిత్తగిస్తున్నారు. మొత్తమ్మీద అసలు ఫలితాలు వెలువడే జూన్‌ నాలుగో తేదీ వరకు ఇలాంటి ఊహాగానాలకు తెరపడే అవకాశం లేదు.

Lok Sabha Election 2024: PM Narendra Modi exposes Congress plan of dividing budget on basis of religion
PM Narendra Modi: మతం ఆధారంగా బడ్జెట్‌ కేటాయింపులా?

నాసిక్‌: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో 15 శాతం నిధులను మైనారీ్టలకే కేటాయించాలని కాంగ్రెస్‌ పార్టీ కుట్రలు పన్నుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. మతం ఆధారంగా బడ్జెట్‌ కేటాయింపులను తాము అనుమతించే ప్రసక్తే లేదని తేలి్చచెప్పారు. అలాగే విద్య, ఉద్యోగాల్లో మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని స్పష్టంచేశారు. 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్‌ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు బడ్జెట్‌లో 15 శాతం నిధులను వారికి ప్రీతిపాత్రమైన ఓటు బ్యాంక్‌కు కట్టబెట్టడానికి ప్రయతి్నంచిందని చెప్పారు. అప్పట్లో బీజేపీ గట్టిగా ప్రతిఘటించడంతో కాంగ్రెస్‌ వెనక్కి తగ్గిందని పేర్కొన్నారు. ఆ సమయంలో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న తాను కాంగ్రెస్‌ ప్రతిపాదనను వ్యతిరేకించానని తెలిపారు.కానీ, మైనారీ్టలకు 15 శాతం నిధుల ఆలోచనను కాంగ్రెస్‌ ఇప్పటికీ విరమించుకోలేదని, ఒకవేళ కేంద్రంలో అధికారంలోకి వస్తే అమలు చేయాలని యోచిస్తోందని విమర్శించారు. బుధవారం మహారాష్ట్రలోని పింపాల్‌గావ్‌ బస్వంత్, థానే పట్టణాల్లో లోక్‌సభ ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. మతం ఆధారంగా బడ్జెట్‌ కేటాయింపులు అనేది చాలా ప్రమాదకరమైన ఆలోచన అని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ మత ఆధారంగా దేశాన్ని ఇప్పటికే ఒకసారి విభజించిందని, మరో సారి అలాంటి పథకమే రచిస్తోందని ధ్వజమెత్తారు. తాము మతాలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. గత పదేళ్లలో తమ ప్రభుత్వం సాధించిన ఘనతలను ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఇప్పుడు జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలు కేవలం ఎంపీలను ఎన్నుకోవడం కోసం కాదని అన్నారు. దేశం కోసం బలమైన నిర్ణయాలు తీసుకొనే సామర్థ్యం గల ప్రధానమంత్రిని ఎన్నుకోవడానికి జరుగుతున్నాయని ఉద్ఘాటించారు. ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని వివరించారు. గత పదేళ్లలో తన పని తీరును ప్రజలు గమనించారని. వికసిత్‌ భారత్‌ కోసం తనను మూడోసారి గెలిపించాలని కోరారు.

Uday Nagaraju From Telangana Picked As Uk Labour Party Parliamentary Candidate
యూకే పార్లమెంట్‌ బరిలో తెలుగు బిడ్డ

సాక్షి, సిద్దిపేట: యూకే పార్లమెంట్‌ ఎన్నికల బరిలో తెలంగాణ బిడ్డ నిలిచారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఉదయ్‌ నాగరాజు లేబర్‌ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. నార్త్‌ బెడ్‌ఫోర్డ్‌షైర్‌ లేబర్‌ పార్టీ నుంచి ఆయనను అభ్యర్థిగా ప్రకటించింది. శనిగరం గ్రామానికి చెందిన ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబంలో ఉదయ్‌ జన్మించారు. తల్లిదండ్రులు హనుమంతరావు, నిర్మలాదేవి. బ్రిటన్‌లోని ప్రఖ్యాత యూనివర్సిటీ కాలేజీ ఆఫ్‌ లండన్‌లో పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో పీజీ చేశారు. కష్టపడేత త్వం కలిగిన ఉదయ్‌ అంచెలంచెలుగా ఎదిగారు. ప్రపంచం, భావితరాలపై ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రభావా న్ని ముందుగానే పసిగట్టి ఏఐ పాలసీ లాబ్స్‌ అనే థింక్‌ ట్యాంక్‌ని నెలకొల్పారు. మంచి వక్తగా పేరు సంపాదించా రు. సర్వే ఫలితాల ప్రకారం ఈ ఎన్నికల్లో ఉదయ్‌ గెలిచే సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నా రు. తెలుగు బిడ్డ బ్రిటన్‌లో ఎంపీగా పోటీ చేస్తుండటం.. విజయం సాధిస్తారనే అంచనాలు ఉండటంతో తల్లి నిర్మలా దేవి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు బిడ్డ ఆ స్థాయికి ఎదగడంతో శనిగరం గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Attack on YSRCP leaders with iron bars in palnadu
రెచ్చిపోతున్న పచ్చమూక పల్నాడులో ఆగని విధ్వంసం

సాక్షి, నరసరావుపేట: ఎన్నికలు ముగిసి మూడు రోజులైనా పల్నాడు జిల్లాలో టీడీపీ మూకల విధ్వంసకాండ కొనసాగుతూనే ఉంది. ఓటమి ఖాయమని తేలిపోవడంతో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై టీడీపీ మూకలు బుధవారం దాడులకు పాల్ప­డ్డా­యి. ఈ దాడుల్లో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. టీడీపీ దాడుల నుంచి తప్పించుకొని గ్రామాలు వదిలివెళ్లిపోయిన వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు ఇంకా ఇళ్లకు పూర్తిగా చేరుకోలేదు. తెలిసిన వారి ఇళ్లల్లో దూరప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. కుటుంబంలోని మహిళలు, పిల్లల బాగోగుల గురించి వార­ంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పోలీసులు రక్షణ కల్పిస్తే గ్రామాలకు తిరిగిరావాలని చూస్తున్నారు. మరోవైపు మాచర్ల, గురజాల, నరసరావుపేట వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాసు మహేశ్‌ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. టీడీపీ మూక స్వైరవిహారం.. మాచవరం మండలం కొత్త గణేషునిపాడులో గ్రామ­ం వదిలి వెళ్లిన ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు ఇంకా గ్రామా­లకు చేరలేదు. పోలీస్‌ పికెటింగ్‌ ఉన్నా మళ్లీ టీడీపీ మూకలు దాడులు చేస్తాయనే అభద్రతాభావంతో గ్రామా­నికి దూరంగా ఉంటున్నారు. పల్నాడు జిల్లా­లో పలు ప్రాంతాల్లో టీడీపీ మూకలు విధ్వంసకాండ కొనసాగిస్తుండటంతో పోలీసులు జిల్లావ్యాప్తంగా మంగళవారం సాయంత్రం నుంచి 144 సెక్షన్‌ విధించారు. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా జిల్లాలోని పలు గ్రామాలు, పట్టణాల్లో దుకాణాలను మూసివేయి­ంచారు. చివరకు కొన్నిచోట్ల మెడికల్, కూరగాయ­లు, పాల దుకాణాలు, టీస్టాల్స్‌ను కూడా తెరవలేదు. బహిరంగ ప్రదేశాల్లో నలుగురికి మించి గుమి­గూడకూడదని పోలీసులు ఆంక్షలు విధించారు. అయినప్పటికీ టీడీపీ నేతల దాడులు ఆగడం లేదు. వైఎస్సార్‌సీపీ నేతలే లక్ష్యంగా స్వైరవిహారం చేస్తున్నారు. తమకు ఓటు వేయని వారిపై దాడులు కొనసాగిస్తున్నారు. గ్రామానికి తిరిగిరాగానే పచ్చ మూకల దాడి.. గురజాల నియోజకవర్గంలో టీడీపీ దౌర్జన్యకాండ కొన­సా­గుతోంది. పల్లెల్లో టీడీపీ ఫ్యాక్షన్‌ చిచ్చురేపు­తోంది. దాచేపల్లి మండలం మాదినపాడులో వైఎస్సార్‌సీపీ కార్యకర్త దొండేటి ఆదిరెడ్డిపై టీడీపీ నేతలు కర్రలు, ఇనుపరాడ్లతో దాడి చేశారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. పోలింగ్‌ రోజునే ఆదిరెడ్డితో టీడీపీ నాయకులు వాగి్వవాదానికి దిగారు. పోలింగ్‌ ముగిశాక గ్రామంలో పరిస్థితి బాగోలేకపోవటంతో రెండు రోజులపాటు వేరే గ్రామంలో ఉన్న బంధువుల ఇంటిలో ఆయన తలదాచుకున్నాడు. బుధ­వారం ఉదయం మాదినపాడు చేరుకున్న వెంటనే 30 మందికిపైగా టీడీపీ కార్యకర్తలు, నాయకులు కర్రలు, ఇనుపరాడ్లతో ఆదిరెడ్డిపై దాడి చేశా­రు. ఈ ఘటనలో ఆయన తలకు బలమైన గాయాలు కావడంతో సొమ్మసిల్లిపడిపోయాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు గ్రామానికి చేరుకుని ఆదిరెడ్డిని పిడుగురాళ్లలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తీసుకెళ్లారు. ఆదిరెడ్డి తలలో నరాలు తెగి రక్తప్రసరణ నిలిచిపోయిందని.. రెండు మేజర్‌ సర్జరీలు చేయాలని వైద్యులు చెబుతున్నారు. వైఎస్సార్‌సీపీ నాయకుడిపై హత్యాయత్నం.. నాదెండ్ల మండలం అప్పాపురంలో వైఎస్సార్‌సీపీ నేతపై టీడీపీ నేతలు హత్యాయత్నానికి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన మాజీ మండల ఉపాధ్యక్షుడు కోవెలమూడి సాంబశివరావుపై కర్రలు, కత్తులతో దాడికి తెగబడ్డారు. పోలింగ్‌ రోజు పన్నెండో బూత్‌లో ఎస్సీ ఓటర్లు ఎక్కువ సంఖ్యలో బారులు తీరి రాత్రి 7 గంటల వరకు ఓట్లేశారు. వీరికి సాంబశివరావు అండగా ఉన్నాడు. ఇది మనసులో పెట్టుకున్న టీడీపీ నేతలు ఆయనపై దాడికి దిగారు. మరికొంతమందిపై కూడా దాడి చేసేందుకు కారులో వెంటపడ్డారు. అలాగే పిడుగురాళ్ల మండలం బ్రాహ్మ­ణç­³ల్లిలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు వెంకయ్య, విజయేంద్రబాబుల ఇళ్లపై దాడి చేశారు. వారిద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో గురజాల ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు.ఎమ్మెల్యేల హౌస్‌ అరెస్ట్‌.. పల్నాడు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులతో పోలీసులు కీలక నేతలను హౌస్‌ అరెస్ట్‌ చేసి వారిని ఇంటికే పరిమితం చేశారు. వైఎస్సార్‌సీపీకి చెందిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలను హౌస్‌ అరెస్ట్‌లో ఉంచారు. మరో­వైపు అల్లర్లకు కారణమైన టీడీపీ, వైఎస్సా­ర్‌సీపీ కార్యకర్తలపై జిల్లావ్యాప్తంగా పోలీసులు కేసులు నమోదు చేశారు. ముందు జాగ్రత్తగా నేరస్వభావం ఉన్న వారిని బైండోవర్‌ చేశారు. దీంతో వందలాది మంది గ్రామాలను వదిలి వేరే ప్రాంతాలకు మకాం మార్చారు.

Nayanthara Upcoming Movie With Gautham Menon: Report
స్టార్‌ డైరెక్టర్‌తో నయనతార కొత్త సినిమా

కోలీవుడ్‌లో తాజాగా ఒక క్రేజీ న్యూస్‌ చక్కర్లు కొడుతోంది. గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో నయనతార నటించబోతున్నారన్నదే ఆ వార్త. దక్షిణాదిలో దర్శకుడు గౌతమ్‌మీనన్‌కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. స్టైలిష్‌ దర్శకత్వంలో పేరు గాంచిన 2001లో మిన్నలే (చెలి) అనే చిత్రం ద్వారా పరిచయమయ్యారు. తొలి చిత్రమే మంచి విజయాన్ని అందుకోవడంతో గౌతమ్‌మీనన్‌కు వరుసగా అవకాశాలు తలుపు తట్టాయి. అలా సూర్య కథానాయకుడిగా కాక్క కాక్క (ఘర్షణ), కమలహాసన్‌ హీరోగా వేట్టైయాడు వంటి పలు హిట్‌ చిత్రాలను తెరకెక్కించారు. తెలుగులో ఈయన దర్శకత్వంలో నాగచైతన్య, సమంత జంటగా నటించిన 'ఏ మాయ చేశావే' చిత్రం సంచలన విజయాన్ని సాధించడమే కాకుండా నటి సమంత కెరీర్‌కు మైలురాయిగా నిలిచింది. కాగా ఈయన దర్శకుడిగా కొనసాగుతూనే నటుడిగాను ఎంట్రీ ఇచ్చారు. పలు చిత్రాల్లో వైవిధ్య భరిత కథాపాత్రలను పోషిస్తున్నారు. గౌతమ్‌మీనన్‌ చివరగా దర్శకత్వం వహించిన చిత్రం వెందు తనిందది కాడు. శింబు కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. కాగా విక్రమ్‌ కథానాయకుడిగా ఈయన దర్శకత్వం వహించిన ధృవనక్షత్రం విడుదల కావాల్సి ఉంది. చిన్న గ్యాప్‌ తరువాత గౌతమ్‌మీనన్‌ మళ్లీ మెగా ఫోన్‌ పట్టడానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. ఇందులో లేడీ సూపర్‌స్టార్‌ నయనతార కథానాయకిగా నటించనున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. అలాగే ఈ క్రేజీ చిత్రంలో మలయాల సూపర్‌స్టార్‌ మమ్మట్టి నటించనున్నారని టాక్‌ స్ప్రెడ్‌ అయ్యింది. అయితే ఇది తమిళ చిత్రమా? లేక మలయాళ చిత్రమా, అది కాకుండా పాన్‌ ఇండియా చిత్రమా అన్నది తెలియాల్సి ఉంది. కాగా నయనతార, మమ్ముట్టి కలిసి 2016లో పుదియ నియమం అనే మలయాళ చిత్రంలో నటించారన్నది గమనార్హం.

Aadhaar based verification for GST registration
జీఎస్టీ నమోదుకు ఆధార్‌ బయోమెట్రిక్‌!

న్యూఢిల్లీ: జీఎస్టీ నమోదుకై ఆధార్‌ బయోమెట్రిక్‌ ధ్రువీకరణను ఆంధ్రప్రదేశ్, గుజరాత్‌తోపాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ప్రయోగాత్మకంగా ప్రారంభించాయి. ఈ నెల ప్రారంభంలో జరిగిన సెంట్రల్, స్టేట్‌ జీఎస్టీ అధికారుల మూడవ జాతీయ సమన్వయ సమావేశంలో బయోమెట్రిక్‌ ఆధారిత ధ్రువీకరణపై చర్చించారు. జీఎస్టీ నమోదు కోసం ఆధార్‌ బయోమెట్రిక్‌ ప్రమాణీకరణను అమలు చేయడానికి తెలంగాణ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలు సైతం ఆసక్తి చూపుతున్నాయని ఒక ఉన్నతాధికారి వెల్లడించారు. ఈ విధానం అమలుకు అయ్యే ఖర్చు, మౌలిక సదుపాయాలు, మానవ వనరుల అవసరాన్ని ఈ రాష్ట్రాలు అంచనా వేయాలని అనుకుంటున్నాయని తెలిపారు. అందుకు కావాల్సిన సమాచారం అందించామని, మూల్యాంకనం ఆధారంగా ఈ రాష్ట్రాలు ఆమోదం కోసం రాష్ట్ర క్యాబినెట్‌ ముందు ప్రతిపాదనను ఉంచాల్సి ఉంటుందన్నారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అధికారులు ప్రస్తుతం రిజిస్ట్రేషన్‌లో భాగంగా దరఖాస్తుదారుల గుర్తింపును నిర్ధారించడానికి ఓటీపీ ఆధారిత ఆధార్‌ ధ్రువీకరణను ఉపయోగిస్తున్నారు.ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ కోసం బూటకపు సంస్థలను సృష్టించడం ద్వారా ఇతరుల గుర్తింపును దుర్వినియోగం చేసిన సందర్భాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండైరెక్ట్‌ ట్యాక్సెస్, కస్టమ్స్‌ (సీబీఐసీ) బయోమెట్రిక్‌ ప్రామాణీకరణ అమలు చేయాలని నిర్ణయించింది. కొన్ని అనుమానాస్పద సందర్భాల్లో రిజిస్ట్రేషన్‌ కోరుకునే వ్యక్తిని బయోమెట్రిక్‌లను ధృవీకరించుకోవడానికి ఆధార్‌ కేంద్రానికి వెళ్లాల్సిందిగా ఆదేశిస్తారు.

తనిష్క్ జ్యువెలరీ నెక్లెస్‌
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్

ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన, భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్‌ల నుండి ప్రేరణ పొంది అద్భుతమైన మరియు వైవిధ్యమైన శ్రేణి సమకాలీన, రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్‌లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్‌లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్‌లు, కస్టమర్‌లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా, ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్‌ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్‌ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్, ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్‌లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్‌గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్‌లెట్‌లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్‌లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్‌లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్‌డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్‌లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్ 18కేరట్ మరియు 22కేరట్ బంగారంలో విస్తృతమైన శ్రేణి డిజైన్‌లతో, నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని సంపూర్ణం చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్‌లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్‌లెట్‌లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement