Top Stories
ప్రధాన వార్తలు
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)
పవన్ వ్యూహానికి వంగా గీత కౌంటర్ వ్యూహమిదే..!
పిఠాపురం నియోజకవర్గంలో ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో ఎన్నికల బరిలో తలపడుతున్న వైఎస్సార్సీపీ అభ్యర్ధి వంగా గీత చాలా వ్యూహాత్మకంగా ప్రచారం సాగిస్తున్నారు. ఆమె తన పార్టీ గురించి, తన గురించి, తన ప్రభుత్వ స్కీముల గురించి చెబుతున్నారే తప్ప పవన్‌ను ఏ విధంగాను విమర్శించడం లేదు. అక్కడ ఉన్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఆమె తెలివిగా ప్రచారం చేపట్టారు. వంగా గీత.. గత మూడున్నర దశాబ్దాలుగా రాజకీయాలలో క్రియాశీలకంగా ఉన్నారు. విద్యార్ధి దశలో ఉన్నప్పుడే ఆమె రాజకీయాలపై ఆసక్తితో ఉండేవారు. సామాజిక స్పృహతో ఉండేవారు. పవన్‌తో పోల్చితే పెద్ద ధనికురాలు కూడా కాదు. అయినా స్వయంశక్తితో, రాజకీయాలలోకి వచ్చారు. 1994లో శాసనసభ సీటు కోసం ప్రయత్నించారు కాని సఫలం కాలేదు. తదుపరి కాలంలో జడ్పి చైర్ పర్సన్ గాను, రాజ్యసభ సభ్యురాలిగా, శాసనసభ సభ్యురాలిగా, 2019లో లోక్ సభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు.ఆయా సందర్భంలో ఆమె ప్రజల సమస్యలపై శ్రద్ద వహించేవారు. సాధ్యమైన మేరకు ఆ సమస్యలను తీర్చే యత్నం చేసేవారు. ప్రజలలో కలిసిపోతుంటారు. ఆమె తమకు అందుబాటులో ఉండరన్న మాట రానివ్వరు. కరోనా సమయంలో జబ్బుబారిన పడ్డవారికి ఆమె భయపడకుండా సేవలందించారు. వ్యాధి సోకినవారిని స్వయంగా ఆస్పత్రికి తీసుకువెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఎక్కడైనా రోడ్డు ప్రమాదం జరిగితే, వెంటనే స్పందించి క్షతగాత్రులను ఆస్పత్రులకు పంపించడానికి కృషి చేసేవారు. ఇవన్ని ఆమెకు ఇప్పుడు పాజిటివ్ పాయింట్లుగా ఉన్నాయి. బాగా విద్యాధికురాలు. రెండు పీజీలు, న్యాయశాస్త్ర పట్టభద్రురాలుగా ఉన్నారు. ఆమె లాయర్‌గా కూడా పేదలకు సేవలందించారు. ఆమె భర్త విశ్వనాద్ కూడా చాలా నిరాడంబరంగా ఉంటారు. ఆమెకు చేదోడువాదోడుగా నిలబడడం కూడా కలిసి వచ్చిందని చెప్పాలి. ఎవరైనా ‘పవన్‌తో పోటీ పడుతున్నారు.. మరి గెలవడం సాధ్యమా?’ అని అడిగితే, 'ఆయనకు సినిమా రంగంలో పేరు ఉంది.. నాకు ప్రజాసేవ రంగంలో పేరు ఉంది. పవన్‌కు కూడా ప్రజా సేవ చేయాలని ఉండవచ్చు.. కాని ఆయనకు ఉన్న పరిస్థితులు అందుకు అవకాశం ఇవ్వవు" అని నేర్పుగా సమాధానం చెబుతున్నారు.పవన్ విద్య గురించి ఎవరైనా అడిగితే, దాని గురించి తాను మాట్లాడనని, ఆయన సినిమాలలో స్టార్ అయ్యారు కదా! అంటూ తనకు ఉన్న డిగ్రీలు, ఇతర అర్హతలను మాత్రమే వివరిస్తున్నారు. పవన్ చదువు తక్కువ అనే పాయింట్‌ను కూడా ప్రస్తావించడం లేదు. తాను ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తినని చెప్పడానికి పలు ఉదాహరణలు వివరిస్తుంటారు. ఎవరికైనా నియోజకవర్గ ప్రజలకు ఏదైనా ఇబ్బంది వస్తే, తాను పిఠాపురంలోనే అందుబాటులో ఉంటానని, అదే పవన్ అయితే ఎక్కడో షూటింగ్లలో బిజీగా ఉంటారని, అందువల్ల ఆయన చేయలేరని, ఆయన పీఏలను పెట్టుకున్నా ప్రజలకు సేవలందించడం కష్టమని అంటారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలపట్ల ప్రజలు ఆకర్షితులయ్యారని, ముఖ్యంగా మహిళలు అయితే మరింతగా ఆదరిస్తున్నారని ఆమె చెబుతున్నారు. ప్రచారంలో ఎవరి ఇంటి వద్ద అన్నా ఆగకపోతే ప్రత్యేకించి పిలిచి మరీ తమ ఇళ్లవద్దకు తీసుకు వెళుతున్నారని ఆమె చెప్పారు. ఆయన ప్రచారానికి ఇప్పటికే నాగబాబు, జబర్దస్త్ టీమ్ తదితర నటులు వచ్చారని, బహుశా మెగాస్టార్ చిరంజీవి రాకపోవచ్చని అనుకుంటున్నానని గీత అభిప్రాయ పడ్డారు.లక్ష ఓట్ల మెజార్టీ వస్తుందని చెబుతున్న పవన్ వీరందరిని ఎందుకు తీసుకు వస్తున్నట్లు అని గీత ప్రశ్నిస్తున్నారు. మరో ఆసక్తికరమైన వాదన తెచ్చారు. పిఠాపురంలో ఏదైనా సమస్య ఉంటే తాను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కరించే అవకాశం ఉంటుందని, జనసేనకు ఆ అవకాశం ఉండదని, వారు వేరే పార్టీ వారి దగ్దరకు వెళ్లాల్సి ఉంటుందని, ఆ తేడాను కూడా ప్రజలు గుర్తించారని ఆమె చెబుతున్నారు. కాపు సామాజికవర్గం వారు పవన్ వైపు ఎక్కువగా ఉన్నారా అని ప్రశ్నిస్తే, అలా ఏమీ ఉండదని, తాను కాపువర్గానికి చెందిన వ్యక్తినే కదా అని అంటారు. తాను కాపు సామాజికవర్గానికి ఉపయోగపడే పనులు అనేకం చేయించానని, ప్రత్యేకించి కాపు కళ్యాణమండపాలు నిర్మించడానికి నిధులు సమకూర్చానని ఆమె గుర్తు చేస్తున్నారు. ఎవరైనా అన్ని సామాజికవర్గాల ఆదరణ పొందాలి తప్ప, ఏ ఒక్క వర్గమో సపోర్టు చేస్తే గెలిచే పరిస్థితి ఉండదని అన్నారు. కొంతమంది కావాలని బయట నుంచి వచ్చి అలజడులు సృష్టించడానికి యత్నిస్తున్నారని, ఇది చాలా ప్రశాంతమైన నియోజకవర్గమని, ప్రజలు వీటిని గమనిస్తున్నారని ఆమె అన్నారు.పవన్ కళ్యాణే పెద్ద సినిమా స్టార్ అయినప్పుడు, జబర్దస్త్ టీవీ నటులు వంటివారి ప్రచారంతో ఏమి అవసరం వచ్చిందోనని ఆమె వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా తాను విజయం సాధిస్తానన్న ధీమాను గీత వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో చాలామంది ఒక మాట చెబుతున్నారు. జగన్ చాలా తెలివిగా వంగా గీతను ఎంపిక చేసి పవన్‌ను ఆత్మరక్షణలో పడేశారని అంటున్నారు. సీనియర్ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వంటివారు ఆమెకు మద్దతు ఇవ్వడం కూడా ప్లస్ పాయింట్ అవుతుంది. పిఠాపురంలో సుమారు తొంభైవేల వరకు కాపుల ఓట్లు ఉండవచ్చని అంచనా. వాటి ఆధారంగా గెలవవచ్చన్న ఆశతో పవన్ అక్కడ పోటీలోకి దిగడం, వర్మ వంటి టీడీపీ నేతలను తనను గెలిపించాలని వేడుకున్న వైనం ఇవన్ని ఆయనకు కాస్త మైనస్ అయ్యాయని చెప్పవచ్చు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి తన అభ్యర్ధులను గెలిపించవలసిన నేత, తన గెలుపుకోసమే ఇతరులను అభ్యర్ధించవలసిన పరిస్థితి ఏర్పడడం చాలామందికి నచ్చడం లేదు.జనసేనకు స్వయంగా నియోజకవర్గం అంతటా పోల్ మేనేజ్ మెంట్ యంత్రాంగం లేదన్నది ఒక అభిప్రాయం. తెలుగుదేశం పార్టీవారి మద్దతు ఉన్నా, పిఠాపురాన్ని జనసేనకు ఇస్తారని ప్రకటన రాగానే, టీడీపీ శ్రేణులు భగ్గుమనడం కూడా పవన్‌కు నష్టం చేసింది. పవన్‌కు పిఠాపురం నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో తెలియదని, అక్కడ ఉన్న సమస్యలు తెలియవని, తాను ఏమి చేస్తానో చెప్పలేకపోతున్నారని వైస్సార్సీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కేవలం సినిమా గ్లామర్ ఆకర్షణతో గెలవాలన్నది పవన్ వ్యూహం అయితే, ప్రజాసేవ ద్వారా వచ్చిన గ్లామర్‌తో పాటు జగన్ ప్రభుత్వం అమలు చేసిన స్కీముల ప్రభావంతో విజయం సాధించాలన్నది వంగా గీత వ్యూహంగా ఉంది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
రోహిత్ శర్మకు వెన్నునొప్పి.. ఆందోళనలో ఫ్యాన్స్!
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ స్టార్, టీమిండియా కెప్టెన్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగడం సందేహాలకు తావిచ్చింది. ఐపీఎల్-2024 ఆరంభం నుంచి ముంబై తరఫున అన్ని మ్యాచ్‌లలోనూ మైదానంలోకి దిగాడు హిట్‌మ్యాన్.అయితే, కేకేఆర్‌తో మ్యాచ్‌లో మాత్రం అతడు ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చాడు. కేకేఆర్ ఇన్నింగ్స్ సాగుతున్న సమయంలో విశ్రాంతి తీసుకున్న రోహిత్.. లక్ష్య ఛేదనలో బ్యాటింగ్‌కు వచ్చాడు.కానీ ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. 12 బంతులు ఎదుర్కొని ఒక సిక్స్ సాయంతో 11 పరుగులు మాత్రమే చేసి.. సునిల్ నరైన్ బౌలింగ్‌లో మనీశ్ పాండేకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.ఆందోళనలో అభిమానులుఈ నేపథ్యంలో రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై సందేహాలు తలెత్తాయి. అసలే టీ20 ప్రపంచకప్-2024 ఆరంభానికి సమయం దగ్గరపడుతున్న తరుణంలో కెప్టెన్ సాబ్‌కు ఏమైందంటూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. క్లారిటీ ఇచ్చిన చావ్లాఈ క్రమంలో ముంబై ఇండియన్స్ స్పిన్నర్ పీయూశ్ చావ్లా చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ‘‘రోహిత్ తేలికపాటి వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది’’ అని రోహిత్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా పంపడానికి గల కారణం వెల్లడించాడు.అదే విధంగా.. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ వరుస వైఫల్యాల గురించి ప్రస్తావిస్తూ.. ‘‘పేరు, ప్రఖ్యాతుల కోసం బరిలోకి దిగినపుడు.. పోరాటం కొనసాగిస్తూనే ఉండాలి. ప్లే ఆఫ్స్‌నకు అర్హత సాధిస్తామా లేదా అన్నది పక్కనపెడితే.. జట్టు ప్రయోజనాల కోసం ఆడటమే ఆటగాళ్ల ప్రథమ కర్తవ్యం’’ అని పీయూశ్ చావ్లా చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్-2024లో ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్‌లలో ముంబై ఎనిమిది ఓడిపోయింది.ఇదిలా ఉంటే.. జూన్ 1 నుంచి మొదలుకానున్న టీ20 వరల్డ్‌కప్-2024లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు.. ముంబై ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్యా డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. ఇటు కెప్టెన్‌గా.. అటు ఆల్‌రౌండర్ పాండ్యా విఫలమవుతున్నా బీసీసీఐ అతడిపై నమ్మకం ఉంచింది. గతేడాది అక్టోబరు తర్వాత మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆడకపోయినా.. ఐసీసీ టోర్నీలో ఏకంగా వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించింది.
తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
శ్రీసత్యసాయి, సాక్షి: చంద్రబాబు చేసేవన్నీ మాయలు.. కుట్రలు అని, ఈ 59 నెలల పాలనలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి మీ బిడ్డ మీ ఆశీస్సుల కోసం మీ ముందుకు వచ్చాడని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. హిందూపురం అంబేద్కర్ సెంటర్లో శనివారం మధ్యాహ్నాం జరిగిన ప్రచార భేరిలో సీఎం జగన్ ప్రసంగించారు. మరో 9 రోజుల్లో ఎన్నికల కురుక్షేత్రం జరగబోతోంది. ఇవి కేవలం ఎమ్మెల్యే, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కాదు. మీ ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు. పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. జగన్‌కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగింపు.. ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకి ఓటేస్తే.. పథకాలన్నీ ముగింపు. మళ్లీ మోసపోవడం. పొరపాటున మళ్లీ చంద్రబాబుకి ఓటేస్తే.. కొండచిలువ నోట్లో తలకాయ పెట్టినట్లే. పొరపాటున చంద్రబాబుకి ఓటేస్తే చంద్రముఖి మళ్లీ నిద్రలేస్తుంది. లేచి లకలకలక అంటూ మీ దగ్గరికి వస్తుంది. అందరూ గుర్తుపెట్టుకోండి.దేవుడి దయతో.. ప్రజల చల్లని దీవెనలతో 58 నెలల మీ బిడ్డ పాలనలో రాష్ట్రంలో ఎన్నడూ జరగని విధంగా, ప్రతీ రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడు. గతంలో ఎప్పుడూ చూడని విధంగా, జరగని విధంగా రూ.2 లక్షల 70 కోట్ల వేల రూపాయలు అక్కచెల్లెమ్మల కుటుంబాలకు డీబీటీ ద్వారా బటన్లు నొక్కడం జమ చేశాడు. గతంలో ఇలా ఎప్పుడైనా జరిగిందా?. గతంలో ఎన్నడూ లేనంతగా, రాష్ట్ర చరిత్రలో నాలుగు లక్షల ఉద్యోగాలు ఉంటే.. 2 లక్షల 30 వేల ఉద్యోగాలిచ్చాడు. మేనిఫెస్టోలో ఎప్పుడూ లేనివిధంగా రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా 99 శాతం హామీలు అమలు అయ్యింది మీ బిడ్డ ప్రభుత్వంలోనే. గతంలో.. ఎన్నికలప్పుడు మేనిఫెస్టో తీసుకొచ్చి.. తర్వాత చెత్త బుట్టలో వేస్తారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావిస్తూ.. మేనిఫెస్టో హామీలు నెరవేర్చి, ఇప్పుడు ఇదే మేనిఫెస్టోతో ప్రజల ఆశీస్సులు కోరుతున్న ప్రభుతం మీ బిడ్డ ప్రభుత్వమే.మొట్టమొదటిసారిగా ప్రభుత్వ బడుల పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు కనిపిస్తున్నాయి. గోరుముద్ద, అమ్మ ఒడి, పూర్తి ఫీజులతో ఇబ్బంది పడకూడదని జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన.. అక్కాచెల్లెమ్మలు తమ సొంత కాళ్ల మీద నిలబడేందుకు ఆసరా, వైఎస్సార్ చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, ఇళ్ల పట్టాలు.. అవ్వాతాతలకు ఇంటికే పెన్షన్ కానుక. ఇవేవైనా గతంలో జరిగాయా?. రైతన్నలకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా, ఉచిత బీమా, ఇన్‌ఫుట్ సబ్సిడీ, పగటి పూట 9గం. ఉచిత కరెంట్.. ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా?స్వయం ఉపాధికి అండగా నిలుస్తూ.. ఓ వాహన మిత్ర, నేతన్నలకు నేస్తం, చేదోడు, లాయర్లకు లా నేస్తం.. ఇవన్నీ గతంలో ఎప్పుడైనా చూశామా?. పేదవాడి ఆరోగ్యం గురించి ఇంతలా పట్టించుకున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదేమో. ఆరోగ్యశ్రీని ఉచితంగా రూ.25లక్షలకు విస్తరించడం, గ్రామంలోనే ఫ్యామిలీ క్లినిక్, విలేజ్ డాక్టర్, ఇంటికే సురక్ష.. ఇవేవైనా గతంలో జరిగాయా?..గతంలో ఎన్నడూ లేనివిధంగా.. ఏ గ్రామానికి వెళ్లినా సచివాలయం కనిపిస్తుంది. 600 రకాల సేవలు అక్కడే అందుబాటులోకి వచ్చాయి. వలంటీర్ వ్యవస్థ, ఆర్బీకే, విలేజ్ క్లినిక్, ఫైబర్ గ్రిడ్, నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీ, గ్రామంలో ఓ మహిళా పోలీస్, అక్కచెల్లెమ్మల సంరక్షణ కోసం దిశా యాప్.. ఇవేప్పుడైనా గతంలో చూశారా?.. ఇవన్నీ 59 నెలల పాలనలో జరిగినవి వాస్తవమా కాదా?..మరో వంక.. 75 ఏళ్ల ముసలాయన. 14 ఏళ్లు సీఎంగా చేశాను అంటాడు. మరి ఇదే చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా ఒక్కటైనా ఆయన చేసిన మంచి గుర్తుకు వస్తుందా?. పిండి కొద్ది రొట్టే సామెత.. పిండి ఎక్కువ ఉంటే.. రొట్టెలు ఎక్కువ వేసుకోవచ్చు. తక్కువైతే తగ్గుతాయి. కానీ, పిండి ఎంత ఉన్నా కూడా ఆ రొట్టెలు చేసే అధికారం చంద్రబాబుది అయితే తాను, తన వారు తినేయడమే స్కీమ్‌గా పెట్టుకున్నదే చంద్రబాబు పాలన. పేదల ఖాతాల్లోకి ఒక్క రూపాయి అయినా చంద్రబాబు వేశారా?.. అదే మీ బిడ్డ జగన్.. ఏకంగా రూ.2 లక్షల 70 వేల కోట్ల రూపాయలు నేరుగా బటన్ నొక్కి.. అక్కాచెల్లెమ్మల ఖాతాలోకి నేరుగా వెళ్తున్నాయి. ఎక్కడా లంచాలు లేవు. ఎక్కడా వివక్ష లేదు.చంద్రబాబు హయాంలో ఇదే డబ్బు ఎవరి జేబుల్లోకి పోయింది. దత్తపుత్రుడు, ఈనాడు, టీవీ5, వీళ్ల జన్మభూమి కమిటీల జేబుల్లోకి ఎంత పోయిందో ప్రజలు నిలదీయాలి. అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు, మోసాలు. అది ఎలా ఉంటుందంటే.. 2014లో చంద్రబాబు ప్రతీ ఇంటికి పంపిన మేనిఫెస్టో తెలుస్తుంది.స్వయంగా చంద్రబాబు సంతకం చేసి ముఖ్యమైన హామీలంటూ ప్రతీ ఇంటికి పంపించాడు. ఇందులో ఏ ఒక్కటైనా చేశారా? అని హిందూపురం ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్ ప్రశ్నించారు(లేదు అనే సమాధానం జనం నుంచి వచ్చింది. రుణమాఫీ జరిగిందా?. పొదుపు సంఘాల రుణమాఫీ అన్నారు.. చేశారా?. ఇంటింటికీ ఉద్యోగం.. అది కుదరకపోతే నిరుద్యోగ భృతి అన్నారు. మరి ఇచ్చారా?. అర్హులకు 3 సెంట్ల స్థలం.. పక్కా ఇళ్లు అన్నారు. కనీసం ఒక్కరికైనా సెంట్ స్థలం ఇచ్చారా?. ప్రతీ నగరంలో హైటెక్ సిటీ.. సింగపూర్‌ను మించిన అభివృద్ధి అన్నారు. జరిగిందా?..మళ్లీ ఈ ముగ్గురు కలిశారు. మళ్లీ మేనిఫెస్టో అంట. మేనిఫెస్టో పేరుతో సూపర్ సిక్స్.. సూపర్ సెవెన్ అంట. ఇంటింటికీ కేజీ బంగారం, బెంజ్ కారు అంట. నమ్ముతారా?..మన బతుకులు బాగుపడాలన్నా. పేదల భవిష్యత్తు మారాలన్నా. లంచాలు లేని అవినీతి రహిత పాలన కొనసాగాలన్నా.. రెండు బటన్లు నొక్కాలి. ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలి. 175కి 175.. 25 ఎంపీ సీట్లకు 25 ఎంపీ సీట్లు.. ఒక్కటి కూడా తగ్గేది లేదు.. సిద్ధమేనా?..(సిద్ధం అనే బదులు ప్రజల నుంచి వచ్చింది). మంచి చేసిన ఈ ఫ్యాన్ ఇంట్లో ఉండాలి. చెడు చేసిన సైకిల్.. ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ సింక్‌లోనే ఉండాలి. ఈ విషయాల్ని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలి. హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా మీలో ఒకరైన.. మీ బీసీ కులానికి చెందిన దీపిక నిల్చుంది. గెలిపిస్తే.. ఎప్పుడూ మీ దగ్గరే, మీతోనే ఉంటుంది. ఇంకా చాలా మంచి చేయిస్తా. ఎంపీ అభ్యర్థిగా బోయ శాంత.. అన్ని రకాలుగా మంచి చేస్తుంది. అన్ని రకాలుగా అందుబాటులో ఉంటుంది.. ఓటేసి గెలిపించాలని సీఎం జగన్ కోరారు. ఎండను లెక్క చేయకుండా నాపై ఆప్యాయతను చూపిస్తున్నందుకు కృతజ్ఞతలు అనిరాజకీయాలు దిగజారిపోయాయి. భయంకరమైన అబద్ధాలు చూస్తున్నాం. ఇదే చంద్రబాబు తన మనుషులతో అవ్వాతాతలకు వలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇంటికి రాకుండా చేశారు. ఆ అవ్వాతాతలు తిట్టుకుంటుంటే.. ఆ నెపాన్ని ప్రభుత్వం మీద నెట్టే యత్నం చేస్తున్నారు. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా?. ఈ మధ్య ఇంకో అబద్ధం.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికీ ఐవీఆర్ఎస్ కాల్స్ చేస్తూ దిక్కుమాలిన రాజకీయం చేస్తున్నారు. మీ బిడ్డ జగన్ భూములు ఇచ్చేవాడే కానీ భూములు లాక్కునే వాడు కాదు. దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు అసలు నువ్వు మనిషివేనా?. అసలు ఆ చట్టం ఏంటో చంద్రబాబు తెలుసుకోవాలి. భూమిమీద సంపూర్ణ హక్కులు రైతన్నలకు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రాబోయే రోజుల్లో గొప్ప సంస్కరణ అవుతుంది. భూ వివాదాల వల్ల రైతులు, ప్రజలందరూ కూడా అధికారులు, కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి. కానీ, అలా ఎవరూ కూడా ఎవరి చుట్టూ తిరిగాల్సిన పరిస్థితి రాకూడదు. ఇప్పుడు చేస్తున్న సర్వే పూర్తైన తర్వాత ఈ భూములపై ఎలాంటి వివాదం లేదని ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుంది. ఇలా ఇచ్చే ల్యాండ్ లైటిల్స్కు ఇన్సూరెన్స్కూడా చేస్తుంది. రైతులు తరఫున, భూ యజమానుల తరఫున ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుంది, వారి పక్షాన నిలబడుతుంది. ఇది చేయాలంటే మొదటగా రాష్ట్రవ్యాప్తంగా సర్వే పూర్తి కావాలి. బ్రిటీష్ కాలం తర్వాత.. ఇప్పుడు వందేళ్ల తర్వాత మీ బిడ్డ రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఎకరాను సర్వే చేయిస్తున్నాడు. సరిహద్దు రాళ్లు పెడుతున్నాం.. రికార్డులన్నీ అప్డేట్ చేస్తున్నాం. సబ్ డివిజన్ చేస్తున్నాం. రైతన్నలకే పదిలంగా హక్కు పత్రాలు పంపిణీచేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 17 వేల రెవెన్యూ గ్రామాలు…. ఉన్నాయి. ఇప్పటివరకు 6 వేల రెవెన్యూ గ్రామాల్లో సర్వే పూర్తి అయ్యింది. రాబోయే రోజుల్లో పూర్తిగా 17 వేల రెవెన్యూ గ్రామాల్లో సర్వే పూర్తి చేస్తాం. అప్పుడు ప్రతి రైతన్న దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ల భూములకు సంబంధించిన పక్కా రికార్డులు ఉంటాయి. పూర్తి హక్కులతో రికార్డ్స్ అప్డేట్ అవుతాయి, సబ్ డివిజన్లు కూడా అవుతాయి. ఆ తర్వాత రైతులకు ఇచ్చే సంపూర్ణ హక్కులకు ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుంది.ఇంకో అబద్ధం.. ఫిజికల్ డాక్యుమెంట్లు ఇవ్వడం లేదంటూ మరో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటివరకు కార్డ్-2 సాఫ్ట్ వేర్ తో 9 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి. రిజిస్ట్రేషన్లు చేసిన తర్వాత భూయజమానులకు డాక్యుమెంట్లు ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా కార్డ్-2 సాఫ్ట్ వేర్ అమలు జరుగుతోంది. పత్రాలల్లో తప్పులు ఉండకూడదని ఆన్లైన్లో అందుబాటులోకి ఫార్మాట్ తీసుకొచ్చాం. సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి ఫిజికల్ డాక్యుమెంట్స్ ఇవ్వడం జరుగుతోంది.కాబట్టి చంద్రబాబు చేసే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చెబుతున్నారు. ఇవన్నీ నమ్మొద్దు. మోసపోవద్దు. మీ బిడ్డ వల్ల మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే.. మీరు మీ బిడ్డకు సైనికులుగా నిలవండి అంటూ సీఎం జగన్ ప్రసంగం ముగించారు.
కాంగ్రెస్‌కు షాక్.. ‘ప్లీజ్ పోటీ చేయలేను’
లోక్‌సభ ఎన్నికలవేళ కాంగ్రెస్ పార్టీ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కొందరు నేతలు పార్టీ మారగా.. మరికొందరు పలు కారణాలతో పోటీ నుంచి వైదోలుగుతున్నారు. తాజాగా ఒడిషా రాష్టంలో పూరీ లోక్‌భ స్థానంలో బరిలో ఉన్న సుచరిత మొహంతి.. పోటి నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రచారానికి పార్టీ నుంచి తగిన నిధులు అందకపోవటంతో సుచరిత మొహంతి.. తనకు కేటాయించిన టికెట్‌ను తిరిగి ఇస్తున్నట్లు తెలియజేశారు. పబ్లిక్ డొనేషన్ డ్రైవ్ చేపట్టి, ఎంత ఖర్చ తగ్గించినా.. తాను ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు.‘నాకు పార్టీ నుంచి రావాల్సిన ఎన్నికల ప్రచార నిధులు నిరాకరించారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలహీన అభ్యర్థులకు టికెట్లు కేటాయించారు. ప్రత్యర్థి పార్టీలైన బీజేపీ, బీజేడీ చాలినంత నిధులు, ధన బలంతో ఉన్నారు. ఇది చాలా కష్టమైన పరిస్థితి. ప్రతిచోట చాలా డబ్బు ఖర్చు చేస్తున్నారు. నేను వారిలా పోటీలో ఉండలేను. డబ్బుతో కాకుండా ప్రజలతో ప్రచారం చేయాలనుకున్నా. కానీ, అది కూడా నిధుల కొరతతో సాధ్యపడటం లేదు. కాంగ్రెస్ పార్టీ కూడా బాధ్యత తీసుకోవటం లేదు’ అని సుచరిత తెలిపారు.కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌కు రాసిన లేఖలో సుచరిత.. పార్టీ ప్రచార నిధుల నిరాకరించటంతో తన నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి చాలా ఇబ్బంది అవుతోదని తెలిపారు. ‘‘సాధారణ జర్నలిస్ట్‌గా పనిచేసిన నేను పదేళ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చాను. అన్ని రకాలుగా నేను పూరీలో ప్రచారం చేస్తున్నా. నిధుల కోసం పబ్లిక్ డొనేషన్ డ్రైవ్ కూడా చేట్టాను. చాలా వరకు ప్రచార ఖర్చును కూడా తగ్గించాను. కానీ, ప్రచార నిధుల కొరత కారణంగా విజయావకాశాలు ఉన్న పూరీ నియోజకవర్గంలో వెనకబడి ఉన్నాం. పార్టీ నిధులు లేకుండా ప్రచారం కొనసాగించలేకపోవటంపై చింతిస్తున్నా. అందుకే నాకు కేటాయించిన టికెట్‌ను తిరిగి ఇస్తున్నా’’ అని కేసీ వేణుగోపాల్‌కు రాసిన లేఖలో వివరించారు.
AP Election Updates May 4th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
Andhra Pradesh Election Updates 4th May...2:50 PM, May 4th, 2024విజయవాడమేము అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేశాం: దేవినేని అవినాష్విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీట్ ది ప్రెస్‌లో వైఎస్సార్సీపీ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్10ఏళ్లలో అనేక మార్పులు, చేర్పులు జరిగాయి.. అనేక అనుభవాలు నేర్పిందితూర్పు నియోజకవర్గంలో గత ప్రభుత్వాలు, గత పాలకులు చేయలేని అభివృద్ధి పనులు చేశాం..2వ డివిజన్ నుండి 22 వ డివిజన్ వరకు అన్ని పనులు చేశాంటీడీపీ అధికారంలో ఉండి, మేయర్ ప్రజా ప్రతినిధులు అన్ని ఉన్నా అభివృద్ధి శూన్యంకొండ ప్రాంతాల్లో సమస్యలు పరిష్కరించాం2019, 2020లో వరదలు వచ్చాయికృష్ణ లంక కరకట్ట ప్రాంతాల్లో రిటైనింగ్ వాల్ పూర్తిచేశాంరూ. 150 కోట్లు మొదటి విడతలోనే ఇచ్చాంమేము చేసిన పనిని టీడీపీ వాళ్ళు చేసారని ఎలా చెప్పుకోగలుగుతున్నారు? వీడియోలు ఎలా తీయించుకోగలుతున్నారు?గద్దె రామ్మోహlన్‌రావు ఒక అసమర్థ ఎమ్మెల్యేకేవలం మాటలు, షో రాజకీయాలతో ప్రజలను గద్దె మోసం చేశాడువైఎస్సార్సీపీ కార్పోరేటర్లు గెలిచిన చోట టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయలేదుమేము ఏ పార్టీ అభ్యర్థులు గెలిచారా అని చూడలేదు.. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేశాం4 సంవత్సరాల కాలంలో ప్రతి గడపను 4 సార్లు తిరిగానుటీడీపీ ఒక్కసారి కూడా ప్రజల గడప తొక్కలేదురోడ్లు, మంచినీళ్లు, పార్కు లు ,డ్రైనేజ్ నిర్మించామని ప్రజలే చెపుతున్నారు.. ఇదే గా అభివృద్ధి- ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోకున్న అభివృద్ధికి అడ్డాగా తూర్పు నియోజకవర్గాన్ని చూపిస్తాం2:42 PM, May 4th, 2024అనంతపురం:అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో భగ్గుమన్న టీడీపీ అసమ్మతిటీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి వర్గీయుల మధ్య ఘర్షణఐక్యత కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో రసాభాసపరస్పరం వాగ్వాదం, తోపులాటకు పాల్పడ్డ ఇరువర్గాలుటిక్కెట్ రాకపోవడంతో కొంతకాలంగా అసంతృప్తి గా ఉన్న మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గీయులు 1:00 PM, May 4th, 2024చంద్రబాబుది క్రిమినల్ మైండ్: జోగి రమేష్చంద్రబాబుపై జోగి రమేష్ సీరియస్ కామెంట్స్‌రాజకీయ హాంతకుడు బాబు.డీబీటీ ద్వారా వచ్చే పథకాలను ఆపేయమన్నాడు.ఈసీకి ఫిర్యాదు చేయించిన దుర్మార్గుడు చంద్రబాబు.ఆసరా, చేయూత, విద్యా దీవెన, ఇన్పుట్ సబ్సిడీ పథకాలు ఆపేయాలని ఈసీని కోరారు.అవ్వాతాతలను పొట్టన పెట్టుకున్న వ్యక్తి బాబు.చంద్రబాబు రాక్షసుడు మాదిరిగా ప్రవర్తిస్తున్నాడు.బాబు నిజస్వరూపం ప్రజలు గమనించాలి.రాష్ట్రానికి పట్టిన దరిద్రం చంద్రబాబు.కుప్పంలో చంద్రబాబు చిత్తుచిత్తుగా ఓడించాలి.మంచి చేస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై కుట్రలు పన్నుతున్నాడు.ముఖ్యమంత్రి జగన్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. 12:40 PM, May 4th, 2024బుడి ముత్యాల నాయుడు ఇంటిపై రెక్కీ! బీజేపీ నేతల ఓవరాక్షన్..డ్రోన్‌తో విజువల్స్ తీస్తున్న బీజేపీ నేతలు.అనుమానం వచ్చి ఆరా తీసిన స్థానికులు.పొంతన లేని సమాధానాలు ఇచ్చిన బీజేపీ నేతలు.విజువల్స్ తీస్తున్న వారిని పట్టుకున్న స్థానికులు.పట్టుకున్న వారిని పోలీసులకు అప్పగింత.నిందితులను విచారిస్తున్న పోలీసులు.విజువల్స్ తీసిన వారు స్థానికులు కాదంటున్న వైఎస్సార్సీపీ నేతలు.సీఎం రమేష్ ఆదేశాలతోనే విజువల్స్ తీశారంటున్న వైఎస్సార్సీపీ నేతలు, స్థానికులుదేవరపల్లి పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులుముగ్గురిని విచారిస్తున్న దేవరపల్లి పోలీసులుడ్రోన్ కెమెరాను ఎందుకు ఇంటిపై ఎగురవేస్తున్నారు అని ప్రశ్నించిన పోలీసులుముగ్గురి వద్ద బీజేపీ పార్టీ కండువాలు గుర్తించిన పోలీసులు 12:20 PM, May 4th, 2024సుజనా చౌదరికి వైఎస్సార్సీపీ నేతల కౌంటర్..కేశినేని నాని కామెంట్స్‌మైనారిటీలను, బీసీలను మోసం చేసి పక్క దారిలో పశ్చిమ నియోజకవర్గానికి వచ్చాడు. 12ఏళ్ళు రాజసభ సభ్యుడిగా, మూడేళ్లు కేంద్ర మంత్రిగా ఉన్న నీ వల్ల ఏమైనా అభివృద్ధి జరిగిందా?రాజ్యసభ సభ్యుడిగా 60కోట్లు నిధులు వస్తే ఒక్క అర్ధ రూపాయి అయినా ఖర్చు చేశావా?. పశ్చిమని బెస్ట్ చేస్తానంటే ప్రజలు ఎలా నమ్ముతారుఅసిఫ్, వైస్సార్సీపీ వెస్ట్ అభ్యర్థిచంద్రబాబు ఎలా మాయమాటలు చెప్పాడో.. అలాగే సుజనా కూడా మాయ మాటలు చెపుతున్నాడు.విజయవాడ ప్రజలకు సుజనా చౌదరి మొహం తెలుసా?డబ్బుంటే ఏదైనా చేయొచ్చని సుజనా భ్రమలో ఉన్నాడు.పశ్చిమలో తెలుగుదేశం కండువా కప్పుకొన్నాడు.. ఒక్కడు కూడా సుజనా వెనక లేరు.జెండాలు జత కట్టి వచ్చిన మమ్మల్ని ఢీకొట్టలేరు.. మా జెండా ఏ జెండా రెండు ఒకటే. 12:00 PM, May 4th, 2024గద్దెకు దేవినేని కౌంటర్ దేవినేని అవినాష్ కామెంట్స్.. జగన్ ప్రభుత్వం శంకుస్థాపనలే కాకుండా ప్రారంభోత్సవాలు కూడా చేసింది.రిటేనింగ్ ప్రారంభంతో గద్దె ఓటమి మొదలైందికరకట్టవాసుల కష్టాలు పట్టని టీడీపీ నేతలుప్రతీ ఇంటికే పథకాలు పంపిన జగన్ ప్రభుత్వానికే మా మద్దతు అని ప్రజలు అంటున్నారుటీడీపీ చేసిన అభివృద్ధిని చెప్పుకోలేని స్థితిలో ఉన్నారుటీడీపీ నేతల లాగా కాల్ మనీ సెక్స్ రాకెట్ మా పార్టీ నేతలు లేరు670 కోట్లతో తూర్పు నియోజకవర్గ అభివృద్ధి జరిగిందిగంజాయికి పునాదులు వేసింది టీడీపీ ఎమ్మెల్యే కాదా?.విశాఖలో దొరికిన డ్రగ్స్‌కు గద్దె రామ్మోహన్ కుటుంబానికి సంబంధాలున్నాయినిజానిజాలు వెలికితీయాలిజగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని టీడీపీగా చెప్పుకోడానికి సిగ్గులేదా?.చిల్లర రాజకీయాలు చేయడం టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌కే దక్కుతుందిఅసమర్థ ఎమ్మెల్యే మాకు వద్దు అని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు 11:20 AM, May 4th, 2024బాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గనటీడీపీ హయాంలో చంద్రబాబు చేసిన అప్పు ఆయన కడతారా?.75 ఏళ్లు దాటిన తర్వాత కూడా రాజకీయాలు చేస్తే ఇలాంటి ఆలోచనలే వస్తాయి. కోట్ల సూర్యప్రకాశ్ ఒక్కరోజు నాతో పాటు వచ్చి డోన్‌లో తిరగండి. పుష్కర కాలం ఎంపీ పదవి అనుభవించి మీరేం సాధించారో చెప్పండి.ప్రతీ దానికి ట్యాక్స్‌లు కట్టిన నేడు ఆర్థిక నేరుస్థుడినా? అయితే మరి మిమ్మల్ని ఏమనాలి. ఎన్నికల్లో వేసిన నామినేషన్‌ను కూడా రాజకీయానికి ఉపయోగించుకుంటారా?. ఆస్తులు సహా అని వివరాలు, దానికి సంబంధించిన పత్రాలను పక్కాగా రిటర్నింగ్ ఆఫీసర్‌కి సమర్పించాం. అప్లికేషన్లో రాయనంత మాత్రాన తప్పుడు నామినేషన్ అవుతుందా?. నాకు సంబంధించిన వివరాలన్నీ జతపరిచాం. రైల్వే సహాయ మంత్రిగా ఉండి.. పేకాట ఆడటమేనా అందుబాటులో ఉండటం అంటే? స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్ ఉపసంహరణ ప్రతిపక్షాలకు మేలు జరిగేది కాదా?. డోన్‌ను కర్నూలులో కలుపుతారా అని అంటున్నారే నంద్యాలలో కలుస్తున్నప్పుడు ఏం చేశారు. మిమ్మల్ని, చంద్రబాబును ప్రజలు నమ్మేపరిస్థితి లేదు. 10:40 AM, May 4th, 2024బాబు నీకు పేదల ఉసురు తగులుతుంది: ఎంపీ విజయసాయిమానవత్వం మచ్చుకైనా లేని పచ్చ పాము చంద్రబాబు కాటుకు ఇప్పటి వరకు 30 మంది వృద్ధులు ప్రాణాలు వదిలారు. నెలనెలా ఇంటి దగ్గరే జరిగే పెన్షన్ల పంపిణీని అడ్డుకునేందుకు నిమ్మగడ్డ రమేష్ చౌదరి ద్వారా ఈసీకి ఫిర్యాదుమొదటి ఫిర్యాదుతో వలంటీర్ల సేవలు నిలిచిపోయాయి. ఇప్పుడు పంచాయతీ సెక్రటేరియట్లో సైతం పెన్షన్లు పంపిణీని అడ్డుకున్నారు. బ్యాంకుల్లో పెన్షన్ సొమ్ము జమ చేయించడంతో బ్యాంకుల దగ్గర పడిగాపులుకాస్తూ వడదెబ్బతో వయోవృద్ధులు పిట్టల్లా రాలిపోతున్నారు. బాబు ముఖంలో పశ్చాతాపానికి బదులు మందహాసం కనిపిస్తోంది. పేదల ఉసురు నీకు తప్పక తగులుతుంది బాబూ.మానవత్వం మచ్చుకైనా లేని పచ్చ పాము చంద్రబాబు కాటుకు ఇప్పటి వరకు 30 మంది వృద్ధులు ప్రాణాలు వదిలారు. నెలనెల ఇంటి దగ్గరే జరిగే పెన్షన్ల పంపిణీని అడ్డుకునేందుకు తన నమ్మకస్తుడు నిమ్మగడ్డ రమేష్ చౌదరి ద్వారా ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదులు చేయించాడు. మొదటి ఫిర్యాదుతో వలంటీర్ల సేవలు…— Vijayasai Reddy V (@VSReddy_MP) May 4, 2024 9:20 AM, May 4th, 2024మళ్లీ తప్పులో కాలేసిన లోకేశం! మళ్లీ తప్పులో కాలేసిన మంగళగిరి మాలోకం!ఏపీలో పోలింగ్ ఎప్పుడో కూడా తెలియనివాడు @JaiTDPలో ఎమ్మెల్యే అభ్యర్థి నువ్వెళ్లి మార్చి 13న ఓటు వేసుకో @naralokesh.. ఏపీ ప్రజలంతా మే 13న ఓటు వేస్తారు మంగళగిరి ప్రజలారా ఇలాంటి బుర్రతక్కువ వాళ్ళు మీకు అవసరమా?#TDPJSPBJPCollapse#EndOfTDP pic.twitter.com/b2a2Xj64CR— YSR Congress Party (@YSRCParty) May 4, 2024 ఏపీలో ఎన్నికలు ఎప్పుడో కూడా తెలియని వ్యక్తి నారా లోకేష్మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ కామెడీ ట్రాక్‌మే 13న పోలింగ్ అయితే మార్చి 13న ఓటు వేయమన్న లోకేష్లోకేష్ మాటలతో ఒక్కసారిగా నవ్వుకున్న ప్రజలు 8:50 AM, May 4th, 2024చంద్రబాబు మరో కుట్ర..టీడీపీ అధినేత చంద్రబాబు మరో దారుణ కుట్రపేదలకు ప్రభుత్వ పథకాలు అందకుండా మోకాలడ్డుఇప్పటికే వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇవ్వనీయకపోవటంతో వృద్దులు, వికలాంగుల అవస్థలుబ్యాంకుల చుట్టూ మండుటెంటలో తిరుగుతున్న పెన్షన్ దారులుతాజాగా వైఎస్సార్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, విద్యాదీవెన, ఈబీసీ నేస్తం, ఇన్పుట్ సబ్సిడీ నిధులను ఇవ్వనీయకుండా అడ్డుఇవన్నీ గత ఐదేళ్లుగా అమలవుతున్న పథకాలేఐనాసరే టీడీపీ ఫిర్యాదుతో నిధులను రిలీజ్ చేయనివ్వని ఎన్నికల సంఘంఇప్పటికే అనేకసార్లు ఎన్నికల సంఘాన్ని అనుమతి కోరిన ప్రభుత్వంటీడీపీ ఫిర్యాదుతో ఇంకా అనుమతి ఇవ్వని ఈసీ 7:45 AM, May 4th, 2024ఓటమి భయంలో కూటమి నేతల ఓవరాక్షన్..ఓటమి భయంతో టీడీపీ, జనసేన కూటమి నేతల కుట్ర రాజకీయాలువైఎస్సార్‌సీపీకి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక పోతున్న కూటమి నేతలుప్రచారాలలో వైఎస్సార్సీపీ నేతలపై దాడులకి తెగబడుతున్న టీడీపీ, జనసేన కార్యకర్తలుసీఎం జగన్‌పై వ్యక్తిగత దూషణలతో కార్యకర్తలని రెచ్చగొట్టేలా ప్రచారంలో బాబు, పవన్ వివాదాస్పద వ్యాఖ్యలు.వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులకు ఉసిగొల్పుతున్న టిడిపి, జనసేన నేతలుమచిలీపట్నంలో వైఎస్సార్సీపీ అభ్యర్ధి పేర్ని కిట్టు ప్రచార సమయంలో దాడికి పాల్పడ్డ జనసేన, టీడీపీ నాయకులుదెందులూరు నియోజకవర్గంలో ప్రచారంలో ఉండగా వైఎస్సార్సీపీ కార్యకర్తలపై రాళ్లతో, కర్రలతో చింతమనేని అనుచరుల దాడిచిలకలూరిపేట నియోజకవర్గంలో ఈవూరివారిపాలెంలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా కావటి మనోహర్ నాయుడుపై దాడికి ప్రయత్నం.అదే సమయంలో ప్రచార రథం ధ్వంసంమంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లిలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా మేకా వెంకట్ రెడ్డిపై దాడి.ఎన్నికల ప్రచారంలో నిలదీసిన మహిళని చెప్పుతో కొడతానంటూ రెచ్చిపోయిన గోరంట్ల బుచ్చయ్య చౌదరిసీఎం సభలకి పెరుగుతున్న జనాదరణతో కూటమి నేతలలో ఓటమి భయంఅందుకే వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు.. అసహనంతో ప్రజలపై తిట్ల పురాణం 7:00 AM, May 4th, 2024నేడు సీఎం జగన్ ఎన్నికల ప్రచారం ఇలా..నేడు పలమనేరు నియోజకవర్గం బహిరంగ సభలో పాల్గొనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్నేడు హిందూపురం, పలమనేరు, నెల్లూరులో బహిరంగ సభల్లో పాల్గొనున్న సీఎం జగన్సత్యసాయి జిల్లా హిందూపురం నుంచి 12.10 నిమిషాలకు హెలికాప్టర్లో బయలుదేరనున్న సీఎంమధ్యాహ్నం ఒంటి గంటకు పలమనేరుకు చేరుకోనున్న సీఎం జగన్మధ్యాహ్నం 1.30 నుంచి 2.05 వరకు పలమనేరు బహిరంగ సభలో పాల్గొంటారు.మధ్యాహ్నం 2.30 పలమనేరు నుంచి బయలుదేరి 3.50 గంటలకు నెల్లూరు చేరుకోనున్న సీఎం జగన్మధ్యాహ్నం 3.50 నుంచి 4.35 గంటల వరకు నెల్లూరులో పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొంటారు. 6:45 AM, May 4th, 2024ఎన్నికల తర్వాత బీజేపీలో టీడీపీ విలీనం: కేశినేని నానిచంద్రబాబు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోపై పొత్తులో ఉన్న బీజేపీకి నమ్మకం లేదుఅందుకే మేనిఫెస్టోలో బీజేపీ నేతల ఫోటో ఒకటి కూడా లేదు.చంద్రబాబు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ఆచరణ సాధ్యం కానీ మానిఫెస్టోఅందుకే మేనిఫెస్టోని పట్టుకోడానికి కూడా బీజేపీ నేతలు ఇష్టపడలేదురానున్న ఎన్నికలలో ముఖ్యమంత్రిగా సీఎం జగన్‌ను మరోసారి గెలిపించేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారుఈ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం, పార్టీ కార్యాలయానికి తాళం వేయడం ఖాయంటీడీపీని బీజేపీలో విలీనం చేసి చంద్రబాబు హైదరాబాద్‌లో తన ఇంటికి వెళ్లిపోతారుఈ ఎన్నికలలో వైఎస్సార్సీపీ భారీ మెజార్టీతో గెలుస్తుందిదేవినేని ఉమా ఒక చచ్చిన పాము.. అతని గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్ఉమాకు సీటు రాకపోతే ఇంటికి వెళ్లి పరామర్శించలేని ద్రోహి తంగిరాల సౌమ్య 6:30 AM, May 4th, 2024జూనియర్‌ను అణగదొక్కాలని చూస్తున్న టీడీపీని ఓడించాలి: కొడాలి నానిగుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆత్మీయ సమావేశంముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నానిజూనియర్ ఎన్టీఆర్‌ను అణగదొక్కాలని చూస్తున్న టీడీపీని అభిమానులు చిత్తుచిత్తుగా ఓడించాలిపెద్ద ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణలపై నాకు, సీఎం జగన్‌కు అమితమైన ప్రేమఅందుకే విజయవాడకు ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టాముపార్టీ వ్యవస్థాపకుడు అన్న ఎన్టీఆర్‌కు నమ్మక ద్రోహం చేసి.. పార్టీని లాక్కున్న నీచుడు చంద్రబాబుఅన్న ఎన్టీఆర్ వారసులు.. అభిమానులెవరు టీడీపీలో ఉండరు, చంద్రబాబు వెంట నడవరుపదిమంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు జెండా పట్టుకొని టిడిపి కార్యక్రమాలకు వెళితే... ఆ పార్టీ కార్యకర్తలు తన్ని తరిమేసే పరిస్థితి అనేక చోట్ల చూశాంమన కుటుంబ సభ్యుడైన ఎన్టీఆర్ అభిమానులపై దాడులు చేయవద్దని చంద్రబాబు, లోకేష్ తమ కార్యకర్తలకు ఎప్పుడు చెప్పలేదుఅభిమానులందరూ కష్టపడి టిడిపిని గెలిపిస్తే.. ఎన్టీఆర్‌ను తుంగలో తొక్కుతారు. లోకేష్‌ను అందలం ఎక్కిస్తారుఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు పట్టుకున్నప్పుడే.. అభిమానులు ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలిచంద్రబాబు ఆధ్వర్యంలో ఉన్న తెలుగుదేశం పార్టీని చిత్తూ చిత్తుగా ఓడిస్తేనే.. పార్టీ పగ్గాలు ఎన్టీఆర్‌కి వస్తాయిఎవరైతే పెద్ద ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచారో.. పార్టీని కాపాడుకోవడానికి వాళ్లే జూనియర్ ఎన్టీఆర్ కాళ్ల దగ్గరికి వస్తారుపెద్ద ఎన్టీఆర్‌కు దొంగలాంటి చంద్రబాబు మోసం చేస్తే.. జూనియర్ ఎన్టీఆర్‌ను ఐటీడీపీ ద్వారా సోషల్ మీడియాలో తిట్టిస్తున్నారునేను పెద్ద ఎన్టీఆర్ భక్తుడిని.. నందమూరి హరికృష్ణ నా గురువు.. నేను వైసీపీలో ఉన్నా నాకు రాజకీయంగా జన్మనిచ్చింది ఎన్టీఆర్ అని ధైర్యంగా చెబుతాను.నేను తిరిగే కారుకు ఎన్టీఆర్.. వైఎస్సార్ రెండు ఫోటోలు పెట్టుకుని దమ్ముగా ధైర్యంగా తిరుగుతాను.ఎన్టీఆర్ కుటుంబంతో నాకు ఉన్న బాంధవ్యం విడదీయరానిది.. వారికోసం నేను.. నాకోసం వారు అనేక త్యాగాలు చేశారుఎన్టీఆర్, వైఎస్సార్ నాకు రెండు కళ్లుతెలుగుదేశం పార్టీ గౌడ.. యాదవ.. మత్స్యకార.. ఇతర బీసీ సామాజిక వర్గాలను విస్మరించింది.. కనీసం వారికి సీట్లు కూడా కేటాయించని పరిస్థితి.సీఎం జగన్ బీసీ కులాల అభివృద్ధికి కార్పొరేషన్లను ఏర్పాటుచేసి.. అనేక రాజ్యాంగ పదవులు ఇవ్వడమే కాక రాజ్యసభ స్థానాలు ఇస్తూ.. ఎమ్మెల్యే ఎంపీ సీట్లను సగం వారికే కేటాయించారు.ప్రజలను నమ్ముకుని ధైర్యంగా ముందుకు వెళుతున్న సీఎం జగన్‌కు, నాకు అభిమానులు మద్దతుగా నిలవాలి.
రైతులకు గుడ్‌న్యూస్.. రైతుభరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రైతులకు శుభవార్త చెప్పారు. ఈనెల తొమ్మిదో తేదీలోపు రైతుభరోసా నిధులు జమ చేస్తామని రేవంత్ చెప్పారు.కాగా, ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ..‘ఎన్నికల వేళ సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. రైతులకు శుభవార్త అందించారు. ఈనెల తొమ్మిదో తేదీలోపు రైతుభరోసా డబ్బులు జమ చేస్తామన్నారు. అలాగే, ఆగస్ట్ 15వ తేదీలోపు రుణమాఫీ కూడా చేస్తామని ప్రకటించారు. రైతు భరోసా ఏడు లక్షల 60 వేల మందికి ఇప్పటికే వేశాం. మిగిలిన నాలుగు లక్షల మందికి వేస్తాం’ అని కామెంట్స్ చేశారు.ఇదే సమయంలో బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్..‘ఖమ్మం జిల్లా దేశ రాజకీయాలకు దిక్సూచి. కేసీఆర్ నామా నాగేశ్వరరావును బకరాను చేస్తున్నారు. ఏ సంకీర్ణంలో చేరుతావు. ఆ ఇంటి మీది కాకి ఈ ఇంటి మీద వాలితే కాల్చేస్తారు. నామాకు సూచన చేస్తున్నాను. కేసీఆర్ మాటలు వినకు. గత డిసెంబర్ మూడో తేదీన ఫలితాలు సెమీ ఫైనల్స్. ఇప్పుడు జరిగే ఎన్నికల్లో ఫైనల్ తీర్పు రాబోతుంది. గుజరాత్ టీమ్‌ను ఇంటికి పంపించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కాబోతున్నారు’ అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.అయితే, రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో సీఎం రేవంత్ ఇలాంటి ప్రకటన చేయడం కోడ్ ఉల్లంఘనకు కిందకు వస్తుందని ప్రతిపక్ష పార్టీల నేతలు కామెంట్స్ చేస్తున్నారు. అలాగే, ఎన్నికల్లో ఓట్లు పొందడం కోసమే రేవంత్ ఇలాంటి కామెంట్స్ చేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రిజర్వేషన్ల రక్షణకు సీఎం రేవంత్ రెడ్డి పోరాటం చేస్తున్నారు. తప్పుడు కేసులతో ఢిల్లీకి పిలిస్తే భయపడతామా?. రాజ్యాంగాన్ని కాపాడతామని రాహుల్ గాంధీ చెప్పిన మాటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. కాలం చెల్లిన థర్మల్ పవర్ స్టేషన్లను తిరిగి వాడకంలోకి తెస్తాం. కార్మికులకు రావాల్సిన లాభాలు ఇవ్వకుండా, సింగరేణికి బొగ్గు బావులు తవ్వకుండా గత ప్రభుత్వం 10 సంవత్సరాలు మొద్దు నిద్రపోయింది.సింగరేణి పరిసరాల్లోని బొగ్గు బావులన్నీ ప్రైవేటు వ్యక్తులకు కాకుండా సింగరేణికే చెందేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. కొత్తగూడెంలో స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీ తెరిపించి స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తాం. రాబోయే ఐదేళ్లలో డ్వాక్రా సంఘాలకు లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు అందజేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెప్పపాటుసేపు కూడా కరెంటు పోవడం లేదు. ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు పోతున్నాం. ఎన్ని అవరోధాలు ఎదురైనా ఆగిపోయే ప్రసక్తే లేదు. మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. రాహుల్‌ను ప్రధానిని చేయడానికి, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి రఘురామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి’ అని కామెంట్స్ చేశారు.
సంజయ్‌లీలా భన్సాలీ 'హీరామండి' వెబ్ సిరీస్ ఎలా ఉంది..?
టైటిల్ : హీరామండి: ది డైమండ్ బజార్ (వెబ్‌సిరీస్)నటీనటులు: మనీషా కొయిరాలా,అదితిరావు హైదరీ,రిచా చద్దా, సోనాక్షి సిన్హా,షర్మిన్ సెగల్, సంజీదా షేక్, తదితరులునిర్మాణ సంస్థలు: భన్సాలీ ప్రొడక్షన్స్దర్శకత్వం: సంజయ్ లీలా భన్సాలీసంగీతం: సంజయ్ లీలా భన్సాలీ,బెనెడిక్ట్ టేలర్,నరేన్ చందావర్కర్కథ: మొయిన్ బేగ్జానర్: చారిత్రక నాటకంఎపిసోడ్స్: 8 భాషలు: తెలుగుతో పాటు మొత్తంగా 14 భాషల్లో స్ట్రీమింగ్'హీరామండి: ది డైమండ్ బజార్' మే 1న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ పెద్ద సంచలనమే రేపుతుంది. తెలుగులో కూడా అందుబాటులో ఉంది. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా హీరామండి టాపిక్ నడుస్తూనే ఉంది. కథ నిడివి విషయం పక్కన పెడితే ఈ సిరీస్‌కు ఎక్కువగా పాజిటివ్ రివ్యూలే వస్తున్నాయి. బాలీవుడ్లో టాప్ డైరెక్టర్‌గా ముద్ర వేసిన సంజయ్ లీలా భన్సాలీ మొదటిసారిగా ఒక వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ బిగ్ ప్రాజెక్ట్‌ను తన నిర్మాణ సంస్థ నుంచే రూ. 200 కోట్ల బడ్జెట్‌తో నిర్మించాడు. పీరియాడిక్ డ్రామా చిత్రాలకు పేరుగాంచిన సంజయ్ లీలా భన్సాలీ నుంచి ఇప్పటికే పద్మావత్, బాజీరావ్ మస్తానీ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు ఆయన దర్శకత్వం వహించిన తొలి వెబ్‌సిరీస్ 'హీరామండి' సిరీస్ ఎలా ఉందో తెలుసుకుందాం.కథేంటంటే... బ్రిటీష్ పాలన సమయంలో లాహోర్‌లో ఉన్న వేశ్యావాటిక 'హీరామండి'లో ఎలాంటి ఆధిపత్య పోరు జరిగింది. ఈ క్రమంలో అక్కడ ఎలాంటి సంఘర్షణ జరిగింది..? హీరామండిలో ఆధిపత్యం చెలాయించేందుకు ఎవరెన్ని కుట్రలు చేశారు..? స్వాతంత్య్ర ఉద్యమంలో వారి పాత్ర ఎంత..? ఈ కథలోకి వెళ్లాలంటే ముందుగా పాత్రల గురించి పరిచయం తప్పనిసరి. హీరామండిలో ఉండే షాహీ మహల్ నిర్వహణ మొత్తం మల్లికా జాన్ (మనీషా కొయిరాలా) చేతిలో ఉంటుంది. ఆ ప్రాంతంలోని నవాబులంతా ఆమె కనుసన్నలలోనే ఉంటారు. అయితే అదే ప్రాంతంలో ఖ్వాభాగ్ అనే మరో మహల్ ఉంటుంది. అక్కడ ఫరీదాన్ (సోనాక్షి సిన్హా) ఉంటుంది. దీంతో వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. ఈ సిరీస్‌లో మరో మూడు పాత్రలు కీలకంగా ఉంటాయి. వహీదా (సంజీదా షేక్) మల్లికా జాన్‌కు సోదరి. బిబోజాన్ (అదితిరావ్ హైదరి), ఆలంజేబు (షర్మిన్ సెగల్) ఇద్దరూ కూడా మల్లికా జాన్‌కు కుమార్తెలు. లజ్జో (రిచా చద్దా) మల్లికా జాన్ దత్తత తీసుకున్న కూతురు.హీరామండిలో తన మాటకి తిరుగులేదనే స్థాయిలో మల్లికా జాన్ (మనీషా కొయిరాలా) రాజ్యమేలుతూ ఉంటుంది. ఆమె కనుసన్నల్లో ఉన్న వేశ్యలపై ఆధిపత్యం చెలాయిస్తూ.. ఎవరైనా ప్రేమలో పడితే ప్రమాదంలో పడినట్టే అనే మాటతో హెచ్చరిస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలో వేశ్యలుగా ఉంటూనే మల్లికా జాన్ మాట వినిపించుకోకుండా 'జొరావర్' అనే నవాబుతో లజ్జో, ఫిరోజ్ అనే నవాబుతో వహీదా, వలీ ఖాన్ అనే నవాబుతో బిబోజాన్ ప్రేమలో పడతారు. కానీ, మల్లికా జాన్ చిన్న కుమార్తె ఆలంజేబును కూడా వేశ్యలా మార్చాలని చూస్తుంది. అయితే, ఆమె బాలోచి నవాబు తాజ్దార్ (తాహా షా బహదూర్ షా)తో ప్రేమలో పడుతుంది. ఈ విషయం మల్లికా జాన్‌తో పాటు తాజ్దార్ తండ్రికి నచ్చదు. ఆయన ఆంగ్లేయులకు బానిసగా ఉంటాడు. వారి నుంచి విముక్తి కోసం తాజ్ దార్ పోరాడుతూ ఉంటాడు. ఈ క్రమంలో ఆలంజేబును పెళ్లి చేసుకోవాలనే తాజ్ దార్ నిర్ణయాన్ని అతని తండ్రి వ్యతిరేకిస్తాడు. వేశ్య తమ ఇంటికి కోడలిగా రాలేదని తేల్చి చెబుతాడు. మరోవైపు కూతురు ప్రేమ వివాహాన్ని మల్లికా జాన్ కూడా వ్యతిరేఖిస్తుంది. ఈ క్రమంలో మల్లిక వ్యవహారశైలి నచ్చని తన సోదరి వహీదా ఆమెకు గుణపాఠం చెప్పాలని అనుకుంటుంది. దీంతో తన అక్కకు శత్రువుగా ఉన్న ఫరీదాన్ (సోనాక్షి సిన్హా)తో చేతులు కలుపుతుంది. ఇలా హీరామండిలో అనేక సంఘటనలు జరుగుతుండగా బిబోజాన్ (అదితిరావ్ హైదరి) బ్రిటీషర్లకు వ్యతిరేకంగా జరిగే స్వాతంత్య్ర పోరాటంలో గూఢచారిగా ఉంటుంది. ఒక వేశ్యగా ఉన్న ఆమె ఈ పోరాటం ఎందుకు చేస్తుంది..? బ్రిటీషర్లతో సత్సంబంధాలు పెంచుకుని వారి రహస్యాలను ఎందుకు తెలుసుకుంటుంది..? ఫైనల్‌గా బిబోజాన్ ఒక గూఢచారి అని తెలిసిన తర్వాత బ్రిటీష్‌వాళ్లు ఏం చేశారు..? ఇదే సమయంలో షాహీ మహల్‌కు పెద్ద దిక్కుగా ఉన్న మల్లికా జాన్న్ అనచివేసేందుకు ఫరీదాన్ ఎలాంటి కుట్రలకు తెరలేపింది..? వేశ్య కుటుంబానికి చెందిన ఆరుగురు స్త్రీల చుట్టూ.. నవాబులు, బ్రిటీష్ పోలీస్ అధికారులు, తిరుగుబాటుదారుల మధ్య ఎలాంటి సంఘటనలు జరిగాయనేది తెలియాలంటే హీరామండి సిరీస్ చూడాల్సిందే..ఎలా ఉందంటే..పీరియాడిక్ డ్రామా చిత్రాలను డిఫరెంట్‌గా తెరకెక్కించడంలో డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ చాలా ప్రత్యేకం అని చెప్పవచ్చు. స్వాతంత్య్రానికి ముందు అంటే 1930, 1940ల కాలం బ్యాక్‌డ్రాప్‌లో హీరామండి వెబ్ సిరీస్‌ను తెరకెక్కించాడు. 'హీరామండిలో తెల్లదొరల పెత్తనం కాదు.. మల్లికా జాన్ నాణేలు మాత్రమే చెలామణి అవుతాయి' అని మనీషా కొయిరాలా చెప్పిన ఒక్క డైలాగ్ చాలు.. ఈ సిరీస్ డెప్త్ ఏంటో చెప్పడానికి బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా ఎందరో మహిళలు ఎన్నో పోరాటాలు చేశారు. కానీ కొందరు చరిత్ర పుటల్లో కలిసిపోతే.. మరికొందరు మాత్రం నేటికి కూడా వినికిడిలో ఉన్నారు. లాహోర్ నగరంలోని హీరామండి ప్రాంతంలో పడుపు వృత్తి నిర్వహించే మల్లికా జాన్‌కు, బ్రిటీష్‌వాళ్లతో మొదలైన వైరాన్ని సంజయ్‌లీలా చక్కగా చూపించాడు. స్వాతంత్య్ర పోరాటంలో 'హీరామండి' పాత్ర ఎంతవరకు ఉందో చెప్పడానికి భారీగానే డైరెక్టర్ ప్లాన్ చేశాడు. మొత్తం 8 ఎపిసోడ్స్‌లలో తన విజువల్ ఫీస్ట్‌తో ప్రేక్షకులను కట్టిపడేశాడు. హీరామండిలో వేశ్యలుగా ఉన్న వారి జీవితాలను తెరపైన అద్బుతంగా క్రియేట్ చేశాడు. వేశ్యావృత్తితో సమాంతర వ్యవస్థను నడుపుతున్న ఆ మహిళలు స్వతంత్ర సంగ్రామంలోకి ఎందుకు దూకాల్సి వచ్చిందో అదిరిపోయే రేంజ్లో చూపించాడు. ఆంగ్లేయులపై తిరుగుబాటు జరిపి వాళ్ల వెన్నులో వణుకు పుట్టించిన వేశ్యలుగా వారందరినీ తెరపై చూపించి అద్భుతాన్ని ఆవిష్కరించడంలో సంజయ్‌లీలా భన్సాలీ సూపర్ సక్సెస్ అయ్యాడు.తన టేకింగ్, విజువల్ ఫీస్ట్‌తో ప్రతి ప్రేక్షకుడినీ హీరామండి ప్రపంచంలోకి తీసుకెళ్లారు. ఆ కాలంనాటి డిజైన్లను దృష్టిలో పెట్టుకుని అందంగా తీర్చిదిద్దిన భారీ సెట్లతో పాటు చక్కని ఫొటోగ్రఫీ తోడు కావడం ఆపై ప్రతి పాత్రకు సంబంధించిన కాస్ట్యూమ్స్ ఈ సిరీస్‌కు ప్రధానమైన బలంగా నిలిచాయని చెప్పచ్చు. ముఖ్యంగా పాటల చిత్రీకరణ మరిన్ని మార్కులు కొట్టేస్తుంది. ఒక వెబ్ సిరీస్ అంత భారీ స్థాయిలో పాటలు అవసరమా అనేలా ఉంటాయి. ప్రారంభంలో రెండు, మూడు ఎపిసోడ్స్‌లలో కథ పరంగా కాస్త నెమ్మదించినా చివరి రెండు ఎపిసోడ్స్ మాత్రం దుమ్మురేపుతాయి. మల్లికా జాన్ పాత్ర పరిచయం చేసిన ఒక ఎపిసోడ్ కూడా మెప్పిస్తుంది. సొంత కుమార్తెలతో సహా ఎవరిపైనా దయాదాక్షిణ్యాలు లేని కఠినాత్మురాలిగా ఆ పాత్రను క్రియేట్ చేసిన విధానం అందరినీ మెప్పిస్తుంది. వేశ్యల జీవితాల చుట్టూ తిరిగే కథనే అయినప్పటికీ, ఎక్కడా అభ్యంతరకరమైన సన్నివేశాలు కనిపించవు. ఈ వీకెండ్లో చక్కగా కుటుంబ సభ్యులతో కలిసి చూసి ఎంజాయ్ చేసేలా ఈ సిరీస్ ఉంటుంది. బ్రిటీష్ పాలనను దిక్కరించిన హీరామండి చరిత్ర పుటల్లో పెద్దగా కనిపించదు. అలా కనుమరుగైన ఒక చాప్టర్‌ను 'హీరామండి'గా సంజయ్‌లీలా తీసుకొచ్చాడు.ఎవరెలా చేశారంటేరూ. 200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సిరీస్‌లో టాప్ హీరోయిన్లను దర్శకుడు సెలక్ట్ చేసుకున్నాడు. మనీషా కొయిరాలా,అదితిరావు హైదరీ,రిచా చద్దా, సోనాక్షి సిన్హా,షర్మిన్ సెగల్, సంజీదా షేక్ వంటి స్టార్స్ ఇందులో ఉన్నారు. ఈ సిరీస్‌కు ప్రధాన బలం వారే అని చెప్పవచ్చు. షాహీమహల్‌కు పెద్ద దిక్కుగా మల్లికాజాన్ పాత్రలో మనీషా కొయిరాలా దుమ్మురేపిందని చెప్పవచ్చు. తన కడుపున పుట్టిన కూతుర్లను కూడా వేశ్యలుగా మార్చే అంత కఠినాత్మురాలిగా ఆమె చూపించిన నటన అద్భుతమని చెప్పవచ్చు. మరోవైపు ఫరీదాన్‌గా సోనాక్షి సిన్హా నెగెటివ్ పాత్రలో మెప్పించింది. వీరందరికీ ఏమాత్రం తగ్గకుండా అదితిరావు హైదరీ ఎలివేషన్ మామూలుగా ఉండదు. వేశ్యగా కనిపిస్తూనే గూఢచారిగా తన సత్తా ఎంటో చూపించింది. నటనలో ఆమె ఎక్కడా తగ్గలేదు. తన పాత్రకు వంద శాతం న్యాయం చేసిందని చెప్పవచ్చు. ఈ సిరీస్‌కు ప్రధాన బలం విజువల్స్, కాస్ట్యూమ్స్,సినిమాటోగ్రఫీ. ఇవన్నీ కూడా ఓటీటీ స్థాయికి మించి ఉన్నాయి. కానీ, ఇందులో ఎక్కువగా యుద్ధ ఘట్టాలు లేకున్నా ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను మెప్పిస్తాయి. ఆనాటి చరిత్రకు.. సమాజంలోని స్థితిగతులకు దర్పణం పట్టేలా సీన్స్ ఉన్నాయి. కాస్త నిడివి తగ్గించి ఉంటే బాగుండు అనే కామెట్లు కూడా వినిపిస్తున్నాయి.
Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ కంపెనీలలో లేఆఫ్‌ల పరంపర కొనసాగుతూనే ఉంది. ఆర్థిక అనిశ్చితి, ప్రాజెక్ట్‌లు తగ్గిపోవడం వంటి కారణాలతో ఖర్చులు తగ్గించుకునేందుకు అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. టెక్ కంపెనీల్లో లేఆఫ్‌లకు సంబంధించి షాకింగ్ రిపోర్ట్ ఒకటి వెల్లడైంది. ఒక్క ఏప్రిల్ నెలలోనే 21 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి టెక్ కంపెనీలు.layoffs.fyi ప్రచురించిన తాజా డేటా ప్రకారం.. టెక్నాలజీ రంగంలోని 50 కంపెనీల నుండి ఒక్క ఏప్రిల్ నెలలోనే 21,473 మంది ఉద్యోగులు ఉద్వాసనకు గురయ్యారు. ఈ ఏడాది లేఆఫ్‌ల ధోరణికి ఏప్రిల్ నెల తొలగింపులు అద్దం పడుతున్నాయి. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి కనీసం ఇప్పటి వరకూ 271 కంపెనీలు 78,572 మంది ఉద్యోగులను తొలగించాయి. జనవరిలో 122 కంపెనీలలో 34,107 ఉద్యోగాల కోతలు జరిగాయి. ఫిబ్రవరిలో 78 కంపెనీలు 15,589 మందిని తొలగించాయి. ఇక మార్చిలో 37 కంపెనీల్లో 7,403 మంది ఉద్యోగాలను కోల్పోయారు. మార్చి నుంచి ఏప్రిల్‌కు ఒక్క నెలలో ఉద్యోగుల తొలగింపులు మూడు రెట్లు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.ఏప్రిల్‌లో టెక్ తొలగింపులుయాపిల్ ఇటీవల 614 మంది ఉద్యోగులను తొలగించింది. ఇది మొదటి ప్రధాన రౌండ్ ఉద్యోగ కోత.పైథాన్, ఫ్లట్టర్, డార్ట్‌లో పనిచేస్తున్న వారితో సహా వివిధ టీమ్‌లలో గణనీయమైన సంఖ్యలో ఉద్యోగులను గూగుల్ తొలగించింది.అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ విభాగంలో వందలాది ఉద్యోగాలను తగ్గించింది.ఇంటెల్ దాని ప్రధాన కార్యాలయంలోని దాదాపు 62 మంది ఉద్యోగులను లేఆఫ్ చేసింది. ఎడ్టెక్ కంపెనీ బైజూస్ సుమారు 500 మంది ఉద్యోగులను తొలగించింది.ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా అత్యధికంగా 14 వేల మందిని లేఆఫ్ చేసింది.ఓలా క్యాబ్స్ దాదాపు 200 ఉద్యోగాలను తొలగించింది. హెల్త్ టెక్ స్టార్టప్ హెల్తీఫైమ్ దాదాపు 150 మంది ఉద్యోగులను తొలగించింది. గృహోపకరణాలను తయారు చేసే వర్ల్‌పూల్ సుమారు 1,000 మందిని లేఆఫ్ చేసింది.టేక్-టూ ఇంటరాక్టివ్ కంపెనీ తమ వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 5% మందిని తొలగించింది. నార్వేలోని టెలికాం కంపెనీ టెలినార్ 100 మంది ఉద్యోగులను తొలగించింది.
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్
ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన, భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్ల నుండి ప్రేరణ పొంది అద్భుతమైన మరియు వైవిధ్యమైన శ్రేణి సమకాలీన, రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్లు, కస్టమర్లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా, ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్, ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్లెట్లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్ 18కేరట్ మరియు 22కేరట్ బంగారంలో విస్తృతమైన శ్రేణి డిజైన్లతో, నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని సంపూర్ణం చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్లెట్లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.
తప్పక చదవండి
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- అచ్చెన్న దృష్టిలో ఉద్యోగులంటే.. ఊడిగం చేసే వారే!
- భారీ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- మీసాలున్నాయని 80 మందిని తొలగించిన కంపెనీ!
- స్టార్క్ దెబ్బకు ఇషాన్ బౌల్డ్.. రితిక రియాక్షన్ వైరల్
- అగ్ని ప్రమాదం.. చిన్నపాటి ఖర్చుతో మరింత భద్రం!
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- నిజ్జర్ హత్య కేసు.. ముగ్గురు భారతీయుల అరెస్ట్
- ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- YS Jagan Interview: క్లీన్ స్వీప్ ఖాయం
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
సినిమా
సంజయ్‌లీలా భన్సాలీ 'హీరామండి' వెబ్ సిరీస్ ఎలా ఉంది..?
టైటిల్ : హీరామండి: ది డైమండ్ బజార్ (వెబ్‌సిరీస్)నటీనటులు: మనీషా కొయిరాలా,అదితిరావు హైదరీ,రిచా చద్దా, సోనాక్షి సిన్హా,షర్మిన్ సెగల్, సంజీదా షేక్, తదితరులునిర్మాణ సంస్థలు: భన్సాలీ ప్రొడక్షన్స్దర్శకత్వం: సంజయ్ లీలా భన్సాలీసంగీతం: సంజయ్ లీలా భన్సాలీ,బెనెడిక్ట్ టేలర్,నరేన్ చందావర్కర్కథ: మొయిన్ బేగ్జానర్: చారిత్రక నాటకంఎపిసోడ్స్: 8 భాషలు: తెలుగుతో పాటు మొత్తంగా 14 భాషల్లో స్ట్రీమింగ్'హీరామండి: ది డైమండ్ బజార్' మే 1న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ పెద్ద సంచలనమే రేపుతుంది. తెలుగులో కూడా అందుబాటులో ఉంది. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా హీరామండి టాపిక్ నడుస్తూనే ఉంది. కథ నిడివి విషయం పక్కన పెడితే ఈ సిరీస్‌కు ఎక్కువగా పాజిటివ్ రివ్యూలే వస్తున్నాయి. బాలీవుడ్లో టాప్ డైరెక్టర్‌గా ముద్ర వేసిన సంజయ్ లీలా భన్సాలీ మొదటిసారిగా ఒక వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ బిగ్ ప్రాజెక్ట్‌ను తన నిర్మాణ సంస్థ నుంచే రూ. 200 కోట్ల బడ్జెట్‌తో నిర్మించాడు. పీరియాడిక్ డ్రామా చిత్రాలకు పేరుగాంచిన సంజయ్ లీలా భన్సాలీ నుంచి ఇప్పటికే పద్మావత్, బాజీరావ్ మస్తానీ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు ఆయన దర్శకత్వం వహించిన తొలి వెబ్‌సిరీస్ 'హీరామండి' సిరీస్ ఎలా ఉందో తెలుసుకుందాం.కథేంటంటే... బ్రిటీష్ పాలన సమయంలో లాహోర్‌లో ఉన్న వేశ్యావాటిక 'హీరామండి'లో ఎలాంటి ఆధిపత్య పోరు జరిగింది. ఈ క్రమంలో అక్కడ ఎలాంటి సంఘర్షణ జరిగింది..? హీరామండిలో ఆధిపత్యం చెలాయించేందుకు ఎవరెన్ని కుట్రలు చేశారు..? స్వాతంత్య్ర ఉద్యమంలో వారి పాత్ర ఎంత..? ఈ కథలోకి వెళ్లాలంటే ముందుగా పాత్రల గురించి పరిచయం తప్పనిసరి. హీరామండిలో ఉండే షాహీ మహల్ నిర్వహణ మొత్తం మల్లికా జాన్ (మనీషా కొయిరాలా) చేతిలో ఉంటుంది. ఆ ప్రాంతంలోని నవాబులంతా ఆమె కనుసన్నలలోనే ఉంటారు. అయితే అదే ప్రాంతంలో ఖ్వాభాగ్ అనే మరో మహల్ ఉంటుంది. అక్కడ ఫరీదాన్ (సోనాక్షి సిన్హా) ఉంటుంది. దీంతో వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. ఈ సిరీస్‌లో మరో మూడు పాత్రలు కీలకంగా ఉంటాయి. వహీదా (సంజీదా షేక్) మల్లికా జాన్‌కు సోదరి. బిబోజాన్ (అదితిరావ్ హైదరి), ఆలంజేబు (షర్మిన్ సెగల్) ఇద్దరూ కూడా మల్లికా జాన్‌కు కుమార్తెలు. లజ్జో (రిచా చద్దా) మల్లికా జాన్ దత్తత తీసుకున్న కూతురు.హీరామండిలో తన మాటకి తిరుగులేదనే స్థాయిలో మల్లికా జాన్ (మనీషా కొయిరాలా) రాజ్యమేలుతూ ఉంటుంది. ఆమె కనుసన్నల్లో ఉన్న వేశ్యలపై ఆధిపత్యం చెలాయిస్తూ.. ఎవరైనా ప్రేమలో పడితే ప్రమాదంలో పడినట్టే అనే మాటతో హెచ్చరిస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలో వేశ్యలుగా ఉంటూనే మల్లికా జాన్ మాట వినిపించుకోకుండా 'జొరావర్' అనే నవాబుతో లజ్జో, ఫిరోజ్ అనే నవాబుతో వహీదా, వలీ ఖాన్ అనే నవాబుతో బిబోజాన్ ప్రేమలో పడతారు. కానీ, మల్లికా జాన్ చిన్న కుమార్తె ఆలంజేబును కూడా వేశ్యలా మార్చాలని చూస్తుంది. అయితే, ఆమె బాలోచి నవాబు తాజ్దార్ (తాహా షా బహదూర్ షా)తో ప్రేమలో పడుతుంది. ఈ విషయం మల్లికా జాన్‌తో పాటు తాజ్దార్ తండ్రికి నచ్చదు. ఆయన ఆంగ్లేయులకు బానిసగా ఉంటాడు. వారి నుంచి విముక్తి కోసం తాజ్ దార్ పోరాడుతూ ఉంటాడు. ఈ క్రమంలో ఆలంజేబును పెళ్లి చేసుకోవాలనే తాజ్ దార్ నిర్ణయాన్ని అతని తండ్రి వ్యతిరేకిస్తాడు. వేశ్య తమ ఇంటికి కోడలిగా రాలేదని తేల్చి చెబుతాడు. మరోవైపు కూతురు ప్రేమ వివాహాన్ని మల్లికా జాన్ కూడా వ్యతిరేఖిస్తుంది. ఈ క్రమంలో మల్లిక వ్యవహారశైలి నచ్చని తన సోదరి వహీదా ఆమెకు గుణపాఠం చెప్పాలని అనుకుంటుంది. దీంతో తన అక్కకు శత్రువుగా ఉన్న ఫరీదాన్ (సోనాక్షి సిన్హా)తో చేతులు కలుపుతుంది. ఇలా హీరామండిలో అనేక సంఘటనలు జరుగుతుండగా బిబోజాన్ (అదితిరావ్ హైదరి) బ్రిటీషర్లకు వ్యతిరేకంగా జరిగే స్వాతంత్య్ర పోరాటంలో గూఢచారిగా ఉంటుంది. ఒక వేశ్యగా ఉన్న ఆమె ఈ పోరాటం ఎందుకు చేస్తుంది..? బ్రిటీషర్లతో సత్సంబంధాలు పెంచుకుని వారి రహస్యాలను ఎందుకు తెలుసుకుంటుంది..? ఫైనల్‌గా బిబోజాన్ ఒక గూఢచారి అని తెలిసిన తర్వాత బ్రిటీష్‌వాళ్లు ఏం చేశారు..? ఇదే సమయంలో షాహీ మహల్‌కు పెద్ద దిక్కుగా ఉన్న మల్లికా జాన్న్ అనచివేసేందుకు ఫరీదాన్ ఎలాంటి కుట్రలకు తెరలేపింది..? వేశ్య కుటుంబానికి చెందిన ఆరుగురు స్త్రీల చుట్టూ.. నవాబులు, బ్రిటీష్ పోలీస్ అధికారులు, తిరుగుబాటుదారుల మధ్య ఎలాంటి సంఘటనలు జరిగాయనేది తెలియాలంటే హీరామండి సిరీస్ చూడాల్సిందే..ఎలా ఉందంటే..పీరియాడిక్ డ్రామా చిత్రాలను డిఫరెంట్‌గా తెరకెక్కించడంలో డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ చాలా ప్రత్యేకం అని చెప్పవచ్చు. స్వాతంత్య్రానికి ముందు అంటే 1930, 1940ల కాలం బ్యాక్‌డ్రాప్‌లో హీరామండి వెబ్ సిరీస్‌ను తెరకెక్కించాడు. 'హీరామండిలో తెల్లదొరల పెత్తనం కాదు.. మల్లికా జాన్ నాణేలు మాత్రమే చెలామణి అవుతాయి' అని మనీషా కొయిరాలా చెప్పిన ఒక్క డైలాగ్ చాలు.. ఈ సిరీస్ డెప్త్ ఏంటో చెప్పడానికి బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా ఎందరో మహిళలు ఎన్నో పోరాటాలు చేశారు. కానీ కొందరు చరిత్ర పుటల్లో కలిసిపోతే.. మరికొందరు మాత్రం నేటికి కూడా వినికిడిలో ఉన్నారు. లాహోర్ నగరంలోని హీరామండి ప్రాంతంలో పడుపు వృత్తి నిర్వహించే మల్లికా జాన్‌కు, బ్రిటీష్‌వాళ్లతో మొదలైన వైరాన్ని సంజయ్‌లీలా చక్కగా చూపించాడు. స్వాతంత్య్ర పోరాటంలో 'హీరామండి' పాత్ర ఎంతవరకు ఉందో చెప్పడానికి భారీగానే డైరెక్టర్ ప్లాన్ చేశాడు. మొత్తం 8 ఎపిసోడ్స్‌లలో తన విజువల్ ఫీస్ట్‌తో ప్రేక్షకులను కట్టిపడేశాడు. హీరామండిలో వేశ్యలుగా ఉన్న వారి జీవితాలను తెరపైన అద్బుతంగా క్రియేట్ చేశాడు. వేశ్యావృత్తితో సమాంతర వ్యవస్థను నడుపుతున్న ఆ మహిళలు స్వతంత్ర సంగ్రామంలోకి ఎందుకు దూకాల్సి వచ్చిందో అదిరిపోయే రేంజ్లో చూపించాడు. ఆంగ్లేయులపై తిరుగుబాటు జరిపి వాళ్ల వెన్నులో వణుకు పుట్టించిన వేశ్యలుగా వారందరినీ తెరపై చూపించి అద్భుతాన్ని ఆవిష్కరించడంలో సంజయ్‌లీలా భన్సాలీ సూపర్ సక్సెస్ అయ్యాడు.తన టేకింగ్, విజువల్ ఫీస్ట్‌తో ప్రతి ప్రేక్షకుడినీ హీరామండి ప్రపంచంలోకి తీసుకెళ్లారు. ఆ కాలంనాటి డిజైన్లను దృష్టిలో పెట్టుకుని అందంగా తీర్చిదిద్దిన భారీ సెట్లతో పాటు చక్కని ఫొటోగ్రఫీ తోడు కావడం ఆపై ప్రతి పాత్రకు సంబంధించిన కాస్ట్యూమ్స్ ఈ సిరీస్‌కు ప్రధానమైన బలంగా నిలిచాయని చెప్పచ్చు. ముఖ్యంగా పాటల చిత్రీకరణ మరిన్ని మార్కులు కొట్టేస్తుంది. ఒక వెబ్ సిరీస్ అంత భారీ స్థాయిలో పాటలు అవసరమా అనేలా ఉంటాయి. ప్రారంభంలో రెండు, మూడు ఎపిసోడ్స్‌లలో కథ పరంగా కాస్త నెమ్మదించినా చివరి రెండు ఎపిసోడ్స్ మాత్రం దుమ్మురేపుతాయి. మల్లికా జాన్ పాత్ర పరిచయం చేసిన ఒక ఎపిసోడ్ కూడా మెప్పిస్తుంది. సొంత కుమార్తెలతో సహా ఎవరిపైనా దయాదాక్షిణ్యాలు లేని కఠినాత్మురాలిగా ఆ పాత్రను క్రియేట్ చేసిన విధానం అందరినీ మెప్పిస్తుంది. వేశ్యల జీవితాల చుట్టూ తిరిగే కథనే అయినప్పటికీ, ఎక్కడా అభ్యంతరకరమైన సన్నివేశాలు కనిపించవు. ఈ వీకెండ్లో చక్కగా కుటుంబ సభ్యులతో కలిసి చూసి ఎంజాయ్ చేసేలా ఈ సిరీస్ ఉంటుంది. బ్రిటీష్ పాలనను దిక్కరించిన హీరామండి చరిత్ర పుటల్లో పెద్దగా కనిపించదు. అలా కనుమరుగైన ఒక చాప్టర్‌ను 'హీరామండి'గా సంజయ్‌లీలా తీసుకొచ్చాడు.ఎవరెలా చేశారంటేరూ. 200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సిరీస్‌లో టాప్ హీరోయిన్లను దర్శకుడు సెలక్ట్ చేసుకున్నాడు. మనీషా కొయిరాలా,అదితిరావు హైదరీ,రిచా చద్దా, సోనాక్షి సిన్హా,షర్మిన్ సెగల్, సంజీదా షేక్ వంటి స్టార్స్ ఇందులో ఉన్నారు. ఈ సిరీస్‌కు ప్రధాన బలం వారే అని చెప్పవచ్చు. షాహీమహల్‌కు పెద్ద దిక్కుగా మల్లికాజాన్ పాత్రలో మనీషా కొయిరాలా దుమ్మురేపిందని చెప్పవచ్చు. తన కడుపున పుట్టిన కూతుర్లను కూడా వేశ్యలుగా మార్చే అంత కఠినాత్మురాలిగా ఆమె చూపించిన నటన అద్భుతమని చెప్పవచ్చు. మరోవైపు ఫరీదాన్‌గా సోనాక్షి సిన్హా నెగెటివ్ పాత్రలో మెప్పించింది. వీరందరికీ ఏమాత్రం తగ్గకుండా అదితిరావు హైదరీ ఎలివేషన్ మామూలుగా ఉండదు. వేశ్యగా కనిపిస్తూనే గూఢచారిగా తన సత్తా ఎంటో చూపించింది. నటనలో ఆమె ఎక్కడా తగ్గలేదు. తన పాత్రకు వంద శాతం న్యాయం చేసిందని చెప్పవచ్చు. ఈ సిరీస్‌కు ప్రధాన బలం విజువల్స్, కాస్ట్యూమ్స్,సినిమాటోగ్రఫీ. ఇవన్నీ కూడా ఓటీటీ స్థాయికి మించి ఉన్నాయి. కానీ, ఇందులో ఎక్కువగా యుద్ధ ఘట్టాలు లేకున్నా ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను మెప్పిస్తాయి. ఆనాటి చరిత్రకు.. సమాజంలోని స్థితిగతులకు దర్పణం పట్టేలా సీన్స్ ఉన్నాయి. కాస్త నిడివి తగ్గించి ఉంటే బాగుండు అనే కామెట్లు కూడా వినిపిస్తున్నాయి.
భారీ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
టాలీవుడ్లో పెళ్లి సందడి చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయ్యి తనదైన చలాకీ నటనతో సినీ పరిశ్రమ దృష్టిని తన వైపునకు తిప్పుకున్న నటి శ్రీలీల. అలాగే ఆ చిత్రం సక్సెస్ అయినా ఆ వెంటనే మరో అవకాశం రాకపోవడంతో ఈ అమ్మడి పరిస్థితి అంతేనా అనే కామెంట్స్ కూడా దొర్లాయి.అయితే రవితేజ సరసన నటించిన ఢమాకా చిత్రం హిట్ అవడం, ముఖ్యంగా అందులోని పాటల్లో శ్రీలీల తన డా¯న్స్‌తో కుర్రకారును ఫిదా చేసింది. దీంతో ఆమె పేరు మారు మ్రోగింది. ఆ తరువాత మహేష్ బాబు సరసన నటించే అవకాశం రావడంతో మరింత క్రేజ్ వచ్చింది. దీంతో ఇతర భాషల దర్శక నిర్మాతల దృష్టి శ్రీలీలపై పడింది. అలా కోలీవుడ్‌లో భారీ అవకాశాలు తలుపు తడుతున్నాయి. ముందుగా దళపతి విజయ్‌తో స్పెషల్ సాంగ్‌లో నటించే అవకాశం వచ్చింది.విజయ్ ప్రస్తుతం గోట్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఏజీ ఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో నటి మీనాక్షి శేషాద్రి, స్నేహ, లైలా, మైక్ మోహన్, ప్రశాంత్, ప్రభుదేవా, వైభవ్, ప్రేమ్ జీ మొదలగు పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఇందులో నటుడు విజయ్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇందులో ఒకటి విలన్ పాత్ర అనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రష్యాలో జరుగుతోంది. కాగా ఇందులో ఒక స్పెషల్ సాంగ్ చోటు చేసుకుంటుందట. ఆ పాటలో నటి త్రిష నటించనున్నారనే ప్రచారం జరిగింది.ఆ తరువాత కాల్ షీట్స్ సమస్య కారణంగా ఆమె నటించలేని పరిస్థితి అని, దీంతో టాలీవుడ్ యువ స్టార్ కథానాయకి శ్రీలీలను ఆ అవకాశం వరించిందని సమాచారం. అయితే ఆ అవకాశాన్ని శ్రీలీల తిరస్కరించినట్లు తెలిసింది. కారణం కోలీవుడ్‌లో సింగిల్ సాంగ్‌తో ఎంట్రీ అయితే అది కెరీర్ ఎదుగుదలకు బాధింపు ఏర్పడుతుందని భావించడమేనట. ఇది ఆమె బ్రిలియంట్ డెసిషన్ అంటున్నారు సినీ విశ్లేషకులు. కాగా ఇప్పుడు శ్రీలీల త్వరలో మరో స్టార్ హీరో అజిత్ సరసన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో కథానాయికగా నటించడానికి సిద్ధం అవుతున్నట్లు టాక్.
Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
సినిమా ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి.. సుమారు 25ఎళ్లుగా లైమ్‌లైట్‌లో ఒక హీరోయిన్ కొనసాగడమంటే అంత సులభం కాదు. నేడు కొందరు హీరోయిన్లు అలా వచ్చి, ఇలా వెళ్లిపోతున్నారు. తమలో ఎంతో అందంతో పాటు టాలెంట్ దాగి ఉన్నా కూడా సరైనా అవకాశాలు లేక తమ సినిమా కెరియర్‌కు ఫుల్స్టాప్ పెట్టేస్తున్నారు. ఇలాంటి వాటికి చెక్ పెడుతూ నాటి నుంచి నేటి తరం హీరోలతో కూడా పోటీ పడుతూ ఏమాత్రం తగ్గకుండా రెండు దశాబ్ధాలకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. తమిళం తెలుగు హిందీ కన్నడం భాషల్లో ఇప్పటికీ తిరుగులేని హీరోయిన్గా రాణిస్తున్న త్రిష నేడు (మే4న) 41వ పుట్టినరోజు వేడుకను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా త్రిష గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.చెన్నై మహానరంలో కృష్ణన్, ఉమా దంపతులకు 1983లో జన్మించిన త్రిష. బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ) చదువుకున్నారు. తన చదువు పూర్తయిన తర్వాత మోడలింగ్ వైపు అడుగులు వేశారు. అలా 1999 మిస్ చెన్నై పోటీలో విన్నర్‌గా తనేంటో చాటిచెప్పింది. అలా అదే ఏడాదిలో 'జోడి' (తమిళ్) సినిమాతో తెరంగేట్రం చేశారు. అందులో హీరోయిన్ సిమ్రన్‌కు స్నేహితురాలిగా నటించారు. ఈ సినిమా హిట్ కావడంతో త్రిషకు కూడా సరైన గుర్తింపు వచ్చింది. అలా సౌత్ ఇండియాలోని అందరి దృష్టిని ఆమె ఆకర్షించారు. ఈ క్రేజ్‌తో సూర్యతో హీరోయిన్గా నటించే ఛాన్స్ ఆమెకు 'మౌనం పెసియదే' తొలిసారిగా వరించింది. అక్కడి నుంచి 'నీ మనసు నాకు తెలుసు' తో టాలీవుడ్లో అడుగుపెట్టారు. ఇందులోని ఒక సాంగ్‌తో తెలుగు ప్రేక్షకులకు త్రిష బాగా కనెక్ట్ అయ్యారు.వర్షంతో మార్పు2004లో ప్రభాస్‌తో 'వర్షం' సినిమాలో త్రిష హీరోయిన్గా నటించింది. ఈ సినిమా త్రిష కెరీర్‌నే మార్చేసింది. శైలజ అలియాస్ శైలు పాత్రలో కనిపించిన త్రిష ప్రేక్షకులను మాయ చేశారు. అలా తన అందంతో అందరినీ వర్షంలో తడిసేలా చేశారు. ఈ క్రమంలో నువ్వొస్తానంటే నేనొద్దంటానా,అతడు,ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, కృష్ణ,బుజ్జిగాడు వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టారు. సౌత్ ఇండియాలోనే టాప్ హీరోయిన్ల లిస్ట్‌లో త్రిష చేరిపోయారు.త్రిషకు బాగా నచ్చే హీరోలుతెలుగులో సీనియర్ హీరోల నుంచి కొత్త హీరోల వరకు అందరితోనూ నటించే అవకాశం ఆమె దక్కింది. స్టార్‌డమ్‌ని పట్టించుకోను అని చెబుతున్న త్రిష కొత్త హీరోలతో కూడా కలిసి నటించారు. నటిగా కెరీర్ ఆరంభించి ఇన్నేళ్లవుతున్నా అవకాశాలు అందుకోవడంలో త్రిష ముందు వరుసలోనే ఉంటున్నారు. అందుకు ఉదాహరణ రీసెంట్గా లియో సినిమాలో మెప్పించిన త్రిష, ప్రస్తుతం చిరంజీవి, అజిత్, విజయ్ వంటి స్టార్ హీరోలతో నటిస్తూనే లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో కూడా బిజీగా ఉంటున్నారు. త్రిషకు బాగా నచ్చే హీరోలు కమల్ హాసన్, వెంకటేశ్, ఆమీర్ ఖాన్. ఇదే విషయం ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. హీరోయిన్స్‌లలో సిమ్రన్, ఏంజలినా జోలి అంటే ఆమెకు చాలా ఇష్టం.త్రిషపై ఉన్న వివాదాలుఇన్నేళ్ల పాటు త్రిష హీరోయిన్గా ఉన్నా కూడా ఆమెపై పెద్దగా వివాదాలు చుట్టముట్టలేదు. రూమర్స్ విషయంలో కూడా కాస్త తక్కువేనని చెప్పవచ్చు.2016లో ఒకసారి తమిళుల సంప్రదాయమైన జల్లికట్టుకు వ్యతిరేకంగా ఆమె ట్వీట్ చేయడంతో అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. దీంతో ఫైనల్‌గా కమల్‌హాసన్ ఎంట్రీ ఇచ్చి ఆ గొడవకు ఫుల్స్టాప్ పెట్టేశారు. ఆమెను బాధపెట్టొద్దని ఆయన తమిళ ప్రజలను కోరారు. త్రిష వ్యక్తిగతం గురించి కూడా ప్రచారం జరిగింది.ఓ వ్యాపారవేత్తతో నిశ్చితార్థం అయ్యాక పెళ్లికి నో చెప్పిందని గతంలో త్రిష గురించి ప్రచారం జరిగింది. కానీ, ఆమె కుంగిపోలేదు. అది నా వ్యక్తిగత విషయమని చెప్పిన త్రిష వాటన్నింటినీ అధిగమించి సినిమాలపైనే తన దారిని మార్చుకుంది. అయితే, తన వివాహం గురించి ఇప్పటికీ కూడా పలు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎప్పటికైనా ప్రేమ వివాహమే చేసుకుంటానని త్రిష ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. 41 ఏళ్ల ఈ బ్యూటీగా ఆ ఘడియలు ఎప్పుడు వస్తాయో చూడాలి.కోట్ల రూపాయల ఆస్తులుహీరోయిన్గానే కాకుండా వివిధ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా త్రిష ఉన్నారు. ప్రస్తుతం ఆమె ఒక్కొ సినిమాకు సుమారు. రూ. 12 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని ప్రచారం ఉంది. సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం త్రిషకు చెన్నైలో రూ. 15 కోట్లు విలువ చేసే విలాసవంతమైన ఇల్లు ఉంది. హైదరాబాద్‌లో కూడా త్రిషకు రూ. 8 కోట్ల విలువ చేసే ఇల్లు ఉన్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌లో కొన్నిప్లాట్స్ కూడా త్రిషకు ఉన్నాయని సమాచారం. రూ. 5 కోట్ల వరకు విలువ చేసే పలు లగ్జరీ కార్లు ఆమె వద్ద ఉన్నాయట. ఇలా తన 25 ఏళ్ల సినీ కెరియర్లో ఇప్పటి వరకు సుమారుగా రూ. 120 కోట్లకు పైగానే ఆస్తులు కూడాబెట్టినట్లు తెలుస్తోంది.
'జో' సినిమా కాంబో రిపీట్.. ఈసారి ఎలాంటి స్టోరీ అంటే..
గతేడాదిలో ఎలాంటి అంచనాలు లేకుండా కోలీవుడ్‌లో విడుదలైన సినిమా 'జో'. హాట్‌స్టార్‌లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. దీంతో ఈ చిత్రాన్ని చూసిన తెలుగు ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. ఇందులో రియోరాజ్, మాళవిక మనోజ్ జంటగా నటించారు. వారిద్దరి నటనకు మంచి మార్కులే పడ్డాయి. తాజాగా కోలీవుడ్‌లో ఈ కాంబో మరోసారి రిపీట్ కానుంది. కాగా ఇంతకుముందు హరి ముత్తయ్య వంటి దర్శకులతో సక్సెస్ఫుల్ చిత్రాలను నిర్మించిన డ్రమాటిక్స్ ప్రొడక్షన్స్ పతాకంపై మణికంఠన్ కందస్వామి సమర్పణలో రూపొందుతున్న నూతన చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది.ఇందులో నటుడు రియోరాజ్, నటి మాళవిక మనోజ్ హీరో హీరోయిన్గా నటిస్తున్నారు. బ్లాక్ షిప్ కలైయరసన్ తంగవేలు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బ్లాక్ షీప్ ఆర్జె విగ్నేష్, షీలా రాజకుమార్, డైరెక్టర్ ఏ వెంకటేశ్, గజరాజన్, జాన్సన్ దివాకర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మధేశ్ మాణిక్ ఛాయాగ్రహణం, సిద్ధికుమార్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది పెళ్లయిన మగవాళ్ల సమస్యలను స్త్రీలు కూడా అంగీకరించేలా తెరకెక్కిస్తున్న కథాచిత్రమని చెప్పారు. ఇలాంటి కాన్సెప్ట్‌తో రూపొందుతున్న తొలి చిత్రం ఇదే అవుతుందన్నారు. కాగా దీనికి బ్లాక్ షీప్ సంస్థ సహనిర్మాణ బాధ్యతలను నిర్వహిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం కచ్చితంగా జనరంజకంగా ఉంటుందనే అభిప్రాయాన్ని దర్శకుడు వ్యక్తం చేశారు.
ఫొటోలు
ట్రెడిషనల్ డ్రెస్‌లో కవ్విస్తున్న ప్రియమణి.. లేటెస్ట్ ఫోటోలు వైరల్
మీ భూములకు జగన్ గ్యారెంటీ.. హిందూపురం సిద్ధం ప్రచారంలో జనసందోహం (ఫొటోలు)
అదిరే..అదిరే మాధురి స్టయిలే అదిరే!
Actor Nani HD Stills: వారెవ్వా... బ్లాక్ అండ్ వైట్ ఫోటోల్లో నాని.. ఫ్యాన్స్ ఫిదా
Priyanka Singh: వయ్యారి భామ నీ కళ్లు చూస్తే.. రేరాజైనా కుళ్లుకోవాల్సిందే! (ఫోటోలు)
క్రీడలు
మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అనుసరించిన వ్యూహాలను భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తప్పుబట్టాడు. హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్ మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా అంటూ మేనేజ్మెంట్కు చురకలు అంటించాడు.ఐపీఎల్-2024లో భాగంగా వాంఖడే వేదికగా కేకేఆర్‌తో తలపడిన ముంబై ఓడిపోయిన విషయం తెలిసిందే. సొంత మైదానంలో 24 పరుగుల తేడాతో ఓటమి ఈ సీజన్లో ఎనిమిదో పరాజయాన్ని నమోదు చేసింది.ఛేదనలో తడ‘బ్యా’టు టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ముంబై.. కేకేఆర్‌ను 19.5 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌట్ చేసి ఫర్వాలేదనిపించింది. కానీ లక్ష్య ఛేదనలో మాత్రం తడ‘బ్యాటు’కు గురైంది. 18.5 ఓవర్లలో 145 పరుగులకే కుప్పకూలింది.టాపార్డర్ మొత్తం చేతులెత్తేయగా.. మిడిలార్డర్లో సూర్యకుమార్ యాదవ్(35 బంతుల్లో 56) ఒక్కడే రాణించాడు. మిగిలిన వాళ్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.ఇలాంటి తరుణంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా(1) ఏడు, టిమ్ డేవిడ్(24) ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. తర్వాత టెయిలెండర్లు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో ముంబై కథ ముగిసింది.మరీ అంత చెత్తగా ఆడతారా?ఈ నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ క్రిక్‌బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్‌ను ఎందుకు దాచిపెట్టిందో తెలియదు. అలా చేయడం వల్ల మీకు ఏం ప్రయోజనం చేకూరింది?ఇంకా బంతులు మిగిలే ఉన్నాయి. జట్టు మొత్తం ఆలౌట్ అయింది. నిజానికి హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్‌లను ఇంకాస్త ముందుగా బ్యాటింగ్‌కు పంపాల్సింది.కానీ ఛేజ్ చేస్తున్న సమయంలో వరుసగా వికెట్లు పడుతున్నా హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్‌లను ఏడు, ఎనిమిదో స్థానాల్లో ఎందుకు ఆడించారో అర్థం కాలేదు.లోయర్ ఆర్డర్లో వీళ్లు ఇంకాస్త ముందుగా వస్తే మరీ అంత చెత్తగా ఆడతారని అనుకున్నారా?’’ అని ముంబై మేనేజ్మెంట్ను ప్రశ్నించాడు. గుజరాత్ టైటాన్స్‌తో ఉన్నపుడు పాండ్యా నాలుగో స్థానంలో నిలకడగా రాణించిన విషయాన్ని సెహ్వాగ్ ఈ సందర్భంగా ప్రస్తావించాడు.చదవండి: T20 WC: హార్దిక్ బదులు అతడిని సెలక్ట్ చేయాల్సింది: పాక్ దిగ్గజం
హార్దిక్ బదులు అతడిని ఎంపిక చేయాల్సింది: పాక్ మాజీ స్టార్
టీ20 వరల్డ్‌కప్-2024 నేపథ్యంలో బీసీసీఐ ప్రకటించిన జట్టుపై పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. యశస్వి జైస్వాల్ వంటి యంగ్ స్టార్లకు చోటివ్వడం సరైన నిర్ణయమని.. అయితే, రింకూ సింగ్‌కు మాత్రం అనాయ్యం జరిగిందని పేర్కొన్నాడు.లోయర్ ఆర్డర్లో హిట్టింగ్ ఆడగల రింకూను పక్కన పెట్టడం సరికాదని టీమిండియా సెలక్టర్ల తీరును కనేరియా విమర్శించాడు. హార్దిక్ పాండ్యా బదులు రింకూను జట్టుకు ఎంపిక చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు.రింకూ సింగ్‌కు అనాయ్యంకాగా జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా మొదలయ్యే ప్రపంచకప్‌నకు బీసీసీఐ మంగళవారం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలోని ఈ టీమ్‌లో రింకూ సింగ్‌కు స్థానం దక్కలేదు. రిజర్వ్ ప్లేయర్‌గా మాత్రమే అతడు ఎంపికయ్యాడు.వీళ్లంతా భేష్‌ఈ నేపథ్యంలో డానిష్ కనేరియా మాట్లాడుతూ.. ‘‘నాణ్యమైన క్రికెటర్లను ఉత్పత్తి చేస్తుందనే పేరు భారత్‌కు ఉంది. ఇటీవలి కాలంలో దుమ్ములేపుతున్న యశస్వి జైస్వాల్, అంగ్క్రిష్ రఘువంశీ ఇందుకు చక్కని ఉదాహరణలు.మయాంక్ యాదవ్ సైతం తన పేస్ నైపుణ్యాలతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇక అభిషేక్ శర్మ పవర్ హిట్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.పాండ్యాకు ఎందుకు చోటిచ్చారు?రింకూ విషయానికొస్తే.. అతడు కచ్చితంగా టీ20 వరల్డ్‌కప్ జట్టులో ఉండాల్సింది. నా అభిప్రాయం ప్రకారం.. ఐపీఎల్ ప్రదర్శనను గనుక పరిగణనలోకి తీసుకుంటే హార్దిక్ పాండ్యాను ప్రపంచకప్‌నకు ఎంపిక చేయకుండా ఉండాల్సింది.ఇప్పటికే జట్టులో శివం దూబే ఉన్నాడు. అందుకే పాండ్యా బదులు రింకూను ఎంపిక చేస్తే డౌన్ ఆర్డర్లో శక్తిమంతమైన కూర్పు కుదిరి ఉండేది’’ అని స్పోర్ట్స్ నౌ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.కాగా ప్రపంచకప్ ఈవెంట్లో కెప్టెన్ రోహిత్ శర్మకు డిప్యూటీగా హార్దిక్ పాండ్యాను ఎంపిక చేసింది బీసీసీఐ. అయితే, డానిష్ కనేరియా మాత్రం వైస్ కెప్టెన్‌నే పక్కనపెట్టాల్సిందని చెప్పడం గమనార్హం.టీ20 ప్రపంచకప్-2024 టోర్నీకి బీసీసీఐ ప్రకటించిన జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.రిజర్వ్ ప్లేయర్లు: శుబ్‌మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్.చదవండి: అమెరికా వరల్డ్‌కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
స్టార్క్ దెబ్బకు ఇషాన్ బౌల్డ్.. రితిక రియాక్షన్ వైరల్
ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటర్ల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. హార్డ్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ తప్ప మిగిలిన వాళ్లలో ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు.ముఖ్యంగా టాపార్డర్ దారుణంగా విఫలమైంది. ఓపెనర్లు ఇషాన్ కిషన్(13)- రోహిత్ శర్మ(11) పూర్తిగా నిరాశపరచగా.. వన్‌డౌన్ బ్యాటర్ నమన్ ధిర్(11) కూడా చేతులెత్తేశాడు.ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నాలుగో నంబర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్(35 బంతుల్లో 56) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేయగా.. ఆ తర్వాతి స్థానాల్లో వచ్చిన బ్యాటర్లు తిలక్ వర్మ(4), నేహాల్ వధేరా(6), హార్దిక్ పాండ్యా(1) పెవిలియన్‌కు క్యూ కట్టారు.సూర్య ఒంటరి పోరాటం వృథాసూర్య ఈ క్రమంలో ఒంటరి పోరాటం చేస్తున్న సూర్యకు తోడైన టిమ్ డేవిడ్(20 బంతుల్లో 24) నిలదొక్కుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇక టెయిలెండర్లు గెరాల్డ్ కోయెట్జీ(8), పీయూశ్ చావ్లా(0), జస్ప్రీత్ బుమ్రా(1 నాటౌట్) కూడా చేతులెత్తేయడంతో 145 పరుగులకే ముంబై కథ ముగిసిపోయింది.ఫలితంగా కేకేఆర్ విధించిన 170 పరుగుల లక్ష్య ఛేదనలో విఫలమైన ముంబై వాంఖడేలో పన్నెండేళ్ల తర్వాత తొలిసారి కోల్‌కతా చేతిలో 24 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.ఈ పరాజయం ముంబై ఫ్యాన్స్ హృదయాలను ముక్కలు చేస్తే.. పందొమ్మిదో ఓవర్లో మూడు వికెట్లు తీసి పాండ్యా సేన పతనాన్ని శాసించిన మిచెల్ స్టార్క్‌ను చూసి కేకేఆర్ అభిమానులు మురిసిపోయారు.అద్భుత రీతిలో బౌల్డ్ చేసిముంబైతో మ్యాచ్‌లో 3.5 ఓవర్లు బౌల్ చేసిన స్టార్క్ 33 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. ఓపెనర్ ఇషాన్ కిషన్‌ను అద్భుత రీతిలో బౌల్డ్ చేయడం హైలైట్‌గా నిలిచింది. గంటకు 142.3 కిలో మీటర్ల వేగంతో స్టార్క్ విసిరిన బంతి లెగ్ స్టంప్‌ను ఎగురగొట్టింది.అయినప్పటికీ స్టార్క్ పెద్దగా సెలబ్రేట్ చేసుకోలేదు. అయితే.. ఇషాన్ అవుట్ కాగానే ముంబై ఇండియన్స్ కోచ్ మార్క్ బౌచర్‌తో పాటు చీర్ గర్ల్స్.. ముఖ్యంగా రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ వైరల్‌గా మారాయి. ఇక ఇషాన్‌తో పాటు టిమ్ డేవిడ్, కోయెట్జీ, పీయూశ్ చావ్లా వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు స్టార్క్. చదవండి: అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యాStumps dismantled, in vintage Starc style 🔥🫡 #TATAIPL #MIvKKR #IPLonJioCinema #IPLinBhojpuri pic.twitter.com/RcERxhgJps— JioCinema (@JioCinema) May 3, 2024
అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ముంబై ఇండియన్స్‌కు ఉన్న అజేయ రికార్డు శుక్రవారం బద్దలైంది. సొంత మైదానం వాంఖడేలో పన్నెండేళ్ల తర్వాత తొలిసారి ముంబై కేకేఆర్ ముందు తలవంచింది. శ్రేయస్ అయ్యర్ సేన చేతిలో 24 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది.అంతేకాదు ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందిస్తూ పరాజయానికి గల కారణాలు విశ్లేషించాడు.ఓటమికి కారణం అదే ‘‘మేము భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోయాం. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయాం. టీ20లలో భాగస్వామ్యాలు నిర్మించలేకపోతే భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుంది.మా ఓటమికి కారణం ఒక్కటనీ చెప్పలేను. చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను. మా బౌలర్లు ఈరోజు అద్భుతంగా రాణించారు.నిజానికి తొలి ఇన్నింగ్స్ తర్వాత వికెట్ మరింత మెరుగైంది. తేమ కూడా ఉంది. అనుకున్న ఫలితం రాబట్టేందుకు మా వంతు కృషి చేశాం.సవాళ్లంటే ఇష్టంఏదేమైనా చివరి వరకు పోరాడుతూనే ఉండాలని నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ ఉంటా. కఠిన పరిస్థితులు ఎదురవ్వడం సహజం.సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ముందుకు సాగితేనే మనల్ని మనం మరింత మెరుగుపరచుకోగలుగుతాం’’ అని పేర్కొన్నాడు. కేకేఆర్ చేతిలో ఓటమికి బ్యాటింగ్ వైఫల్యమే కారణమని హార్దిక్ పాండ్యా స్పష్టం చేశాడు.పూర్తిగా విఫలంకాగా ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు(2/44) తీయగలిగాడు. అయితే, బ్యాటర్‌గా దారుణంగా విఫలమయ్యాడు. మూడు బంతులు ఎదుర్కొని కేవలం ఒక్క పరుగు మాత్రమే చేశాడు. ఇక కేకేఆర్ బౌలర్లలో పేసర్ మిచెల్ స్టార్క్ అద్భుత ప్రదర్శన(4/33)తో దుమ్ములేపాడు.ముంబై వర్సెస్ కేకేఆర్ స్కోర్లు👉టాస్: ముంబై.. తొలుత బౌలింగ్👉కేకేఆర్ స్కోరు: 169 (19.5)👉ముంబై స్కోరు: 145 (18.5)👉ఫలితం: ముంబైపై 24 పరుగుల తేడాతో కేకేఆర్ ఘన విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: వెంకటేశ్ అయ్యర్(కేకేఆర్- 52 బంతుల్లో 70 రన్స్)👉ముంబై ఇండియన్స్ టాప్ స్కోరర్: సూర్యకుమార్ యాదవ్(35 బంతుల్లో 56 రన్స్)A memorable win for @KKRiders 🥳They wrap up a solid performance to get past the #MI challenge 💜 💪Scorecard ▶️ https://t.co/iWTqcAsT0O#TATAIPL | #MIvKKR pic.twitter.com/YT6MGSdPkj— IndianPremierLeague (@IPL) May 3, 2024
బిజినెస్
రూ.194 డివిడెండ్ ప్రకటించిన కంపెనీ
ప్రముఖ టైర్ల తయారీ కంపెనీ ఎంఆర్ఎఫ్ తన ఇన్వెస్టర్లకు రూ.10 ముఖవిలువ కలిగిన ప్రతి షేరుకు రూ.194 డివిడెండ్ ప్రకటించింది.2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఎంఆర్ఎఫ్ నికరలాభం రూ.2081 కోట్లుగా నమోదైంది. 2022-23 నికరలాభం రూ.769 కోట్లుగా కంపెనీ పోస్ట్ చేసింది. కార్యకలాపాల ఆదాయం కూడా రూ.23,008 కోట్ల నుంచి రూ.25,169 కోట్లకు వృద్ధి చెందినట్లు చెప్పింది.మార్చి త్రైమాసికంలో రూ.396 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.341 కోట్లతో పోలిస్తే ఇది 16% ఎక్కువ. కంపెనీ తాజాగా ప్రకటించిన డివిడెండ్‌తోపాటు ఇప్పటికే మధ్యంతర డివిడెండ్‌ను రెండుసార్లు రూ.3 చొప్పున సంస్థ అందించింది.ఇదీ చదవండి: నేపాల్‌లో నిలిచిన ఇంటర్నెట్ సేవలు.. కారణం..బ్రిటానియా రూ.73.50 డివిడెండ్బ్రిటానియా ఇండస్ట్రీస్ మార్చి త్రైమాసికంలో రూ.536.61 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని ప్రకటించింది. 2022-23 ఇదే కాలంలో నమోదుచేసిన లాభం రూ.557.60 కోట్ల కంటే ఇది తక్కువ. ఇదే సమయంలో కార్యకలాపాల ఆదాయం రూ.4023.18 కోట్ల నుంచి 1.14% పెరిగి రూ.4069.36 కోట్లకు చేరింది. రూ.1 ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు రూ.73.50 చొప్పున డివిడెండ్ ప్రకటించింది.
Income tax: నెల రోజుల్లో 6 లక్షల ఐటీ రిటర్న్స్
ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ స్వీకరణ ప్రారంభమైన నెల రోజుల్లో దాదాపు 6 లక్షల ఐటీ రిటర్న్స్ దాఖలయ్యాయి. వీటిని ఆదాయపన్ను శాఖ అంతే వేగంగా ప్రాసెస్ చేయడం విశేషం. వెరిఫై చేసిన రిటర్న్స్‌లో దాదాపు మూడింట రెండు వంతులు ఇప్పటికే ప్రాసెస్ అయినట్లు బిజినెస్ లైన్ నివేదించింది.2024-25 అసెస్మెంట్ ఇయర్ (FY25) మొదటి నెలలో ఏప్రిల్ 29 నాటికి 5.92 లక్షలకు పైగా రిటర్న్స్ దాఖలయ్యాయి. వీటిలో 5.38 లక్షలకు పైగా వెరిఫై కాగా 3.67 లక్షల వెరిఫైడ్ రిటర్న్స్‌ను ఆదాయపన్ను శాఖ ప్రాసెస్ చేసింది. కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి రోజున అంటే ఏప్రిల్ 1న ఐటీ శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్‌ను ప్రారంభించింది.ముందస్తుగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం వల్ల పన్ను చెల్లింపుదారులు త్వరగా రీఫండ్ పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా పెనాల్టీ లేకుండా రిటర్న్స్‌ను రివైజ్ చేయడానికి లేదా సరిచేయడానికి తగినంత సమయం లభిస్తుంది. అయితే, ఉద్యోగులు మాత్రం కొంత సమయం వేచి ఉంటే మంచిదని సూచిస్తున్నారు. కా 2024-25 అసెస్మెంట్ ఇయర్‌కు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి జూలై 31 చివరి తేదీ.
భారత్‌లో యాపిల్ జోరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ దిగ్గజం యాపిల్ భారత్ మార్కెట్లో జోరు కొనసాగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మార్చి త్రైమాసికంలో కంపెనీ 90.8 బిలియన్ డాలర్ల ఆదాయం సాధించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఆదాయం 4% తగ్గినప్పటికీ భారత్‌లో మాత్రం బలమైన రెండంకెల వృద్ధితో సరికొత్త రికార్డు నమోదు చేయడం విశేషం. అంతర్జాతీయంగా మార్చి త్రైమాసికంలో ఐఫోన్ల విక్రయాలు 10.4 % క్షీణించి 45.9 బిలియన్ డాలర్లకు వచ్చి చేరాయి.
రికార్డు గరిష్టం నుంచి నిఫ్టీ వెనక్కి..
ముంబై: ఆరంభ లాభాలు కోల్పోయిన స్టాక్ సూచీలు శుక్రవారం భారీ నష్టాలతో ముగిశాయి. అధిక వెయిటేజీ రిలయన్స్ ఇండస్ట్రీస్(–2%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్( –1%), భారతీ ఎయిర్టెల్(–2%), ఎల్అండ్టీ (–3%) క్షీణించి సూచీల పతనానికి ప్రధాన కారణమయ్యాయి. వారాంతాపు రోజున సెన్సెక్స్ 733 పాయింట్లు పతనమై 73,878 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 172 పాయింట్లు నష్టపోయి 22,475 వద్ద నిలిచింది. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 484 పాయింట్లు పెరిగి 75,095 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 147 పాయింట్లు బలపడి 22,795 జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్టం(75,095) నుంచి 1630 పాయింట్లు కోల్పోయి 73,465 వద్ద, నిఫ్టీ ఆల్‌టైం హై స్థాయి (22,795) నుంచి 447 పాయింట్లు క్షీణించి 22,348 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచి్చంది. ∗ సెన్సెక్స్ ఒకశాతం పతనంతో బీఎస్ఈలో రూ.2.25 లక్షల కోట్లు హరించుకుపోయాయి. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో కంపెనీల మొ త్తం విలువ రూ.406 లక్షల కోట్లకు దిగివచి్చంది.
వీడియోలు
ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటో చెప్పి చంద్రబాబు కళ్ళు తెరిపించిన జగన్
జగన్ ను కదలనివ్వని జనాభిమానం @హిందుపూర్
చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)
వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి
ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్
కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం
మండుటెండను లెక్కచేయని అభిమానం...!
మండుటెండను లెక్కచేయని అభిమానం..!
విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు
ఫ్యామిలీ
సరైన సమయంలో సరైన పుస్తకం 'మూడు దారులు’!
ప్రజలకు దారి చూపినవాడు నాయకుడవుతాడు. ప్రజలు నడిచే దారిలో తానూ నడిచినవాడే నాయకుడవుతాడు. ప్రజలు నాయకుడి వైపు ఎందుకు చూస్తారు? మా దారిలో కష్టం ఉంది తొలగించు... మా గింజలకు వెలితి ఉంది పూరించు... మాకు జబ్బు చేస్తే వైద్యానికి దోవ లేదు చూపించు... మా పిల్లలకు చదువు చెప్పించు... మా నెత్తిన ఒక నీడ పరువు... మా పిల్లలకు ఒక ఉపాధి చూపించు... ఇలా చెప్పుకోవడానికే కదా.అవి విన్నవాడే నాయకుడవుతాడు. నేను ఉన్నానని అనేవాడే పాలకుడవుతాడు.ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు, రెండు రాష్ట్రాలుగా విడిపోయాక వర్తమాన పరిణామాలకు మూలాలు ఏమిటో తెలియడం తెలుగు ప్రజలకు అవసరం. ఎందుకంటే ప్రజల నొసట రాత పాలకులే రాస్తారు. నాటి మద్రాసు రాష్ట్రంతో మొదలు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు, హైదరాబాద్ స్టేట్ ఆవిర్భావం, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రకటన, తెలంగాణ ఉద్యమాల దరిమిలా తెలుగు రాష్ట్రాల విభజన... వీటన్నింటిలో పాలకుల ఎత్తుగడలకు, ప్రజల ఆకాంక్షలకు జరిగిన ఘర్షణ ఒక క్రమానుగతంగా చదివితే ఎక్కడెక్కడ నాయకుడనేవాడవసరమో అక్కడక్కడ తెలుగు జాతి ఒక నాయకుణ్ణి తయారు చేసుకోగలిగింది అనిపిస్తుంది. అయితే ముందే చెప్పుకున్నట్టుగా ఈ నాయకుల్లో ప్రజల కోసం నిలిచే నాయకులూ ఉన్నారు. ప్రజలను వంచించే నాయకులూ ఉన్నారు.సుదీర్ఘకాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను పాలించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రుల విషయంలో ప్రదర్శించిన అహం, ప్రోత్సహించిన ముఠా రాజకీయాల సంస్కృతి ఆంధ్రరాష్ట్రాన్ని ఒక అనిశ్చితిలోనే ఉంచాయి. స్థిరంగా నిలిచి, బలంగా కొనసాగే నాయకుడు ఉన్నప్పుడే జాతి ముందుకు వెళ్లగలదు. ఈ నేపథ్యంలో ఒకరిద్దరు కాంగ్రెస్ నేతలు ఆంధ్రప్రదేశ్‌కు సమర్థమైన నాయకత్వం వహించినా కుర్చీ కింద పెట్టే మంటలు వారిని కుర్చీ వదులుకునేలా చేశాయి. అసలు తెలుగువారికి ఒక ఆత్మాభిమానం ఉందా అనే సందేహం కలిగించాయి.ఈ సందర్భమే ఎన్.టి.రామారావు పుట్టుకకు కారణమైంది. పార్టీ స్థాపించిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన నాయకుడిగా, చరిష్మా కలిగిన పాలకుడిగా, పేదవాడి గురించి ఆలోచన చేసిన అభిమాన నేతగా ఎన్.టి.రామారావు ప్రజల మెప్పును పొందారు. కాని ఆయన అహం, తొందరపాటు చర్యలు కుట్రలకు తెరలేపాయి. చంద్రబాబు నాయుడు తెలుగుజాతి అవమానపడే రీతిలో ఎన్.టి.ఆర్‌ను వెన్నుపోటు పొడిచి దొడ్డి దారిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. తెలుగుదేశం పార్టీతో పాటు పార్టీ ఫండ్ ఉన్న అకౌంట్‌ను కూడా హస్తగతం చేసుకున్న వార్త అందిన రోజున ఎన్.టి.ఆర్. తీవ్ర మనస్తాపం చెందారు. అదే ఆయన మృతికి కారణమైందన్న భావన ఉంది.‘దేశమంటే మట్టి కాదోయ్.. మనుషులోయ్’ అన్నాడు గురజాడ. ఒక రాష్ట్రాన్ని ప్రజల వారసత్వంగా చూడాల్సిందిపోయి దానినో కార్పొరెట్ ఆఫీసుగా మార్చి, దానికి తాను సి.ఇ.ఓగా భావించి పాలించడం మొదలుపెట్టిన చంద్రబాబు నాయుడు పాలనలో తెలుగు ప్రజలు చులకనను ఎదుర్కొన్నారు. గుండు దెబ్బలు తిన్నారు. నీతి, రీతులే వ్యక్తిత్వమని భావించే మన సంస్కృతిలో వంచనతో వచ్చిన నాయకుడిని నమ్మి మోసపోతున్నామని తెలుగు ప్రజలకు పదేపదే అనిపించిన ఉదంతాలు ఉన్నాయి. వై.ఎస్.రాజశేఖర రెడ్డి వచ్చి పెద్ద గీత గీసే వరకూ చంద్రబాబు ఎంత చిన్న గీతో ప్రజలకు అర్థమైందని విశ్లేషకులు అంటారు.ప్రజల కోసం, ప్రజల వలన, ప్రజల చేత... పాలన చేస్తే ఎలా ఉంటుందో వై.ఎస్.రాజశేఖరరెడ్డి తెలుగు ప్రజలకు చూపారు. విశాలమైన హృదయం, దయ, ఆర్ద్రత ఉన్న నాయకుడు తన పాలనలో ప్రతి వ్యక్తి ఉన్నతి కోసం తపన పడతాడని, పడాలని వై.ఎస్.రాజశేఖరరెడ్డి చూపారు. ఆరోగ్యశ్రీ, ఫీజ్ రియింబర్స్‌మెంట్, రైతులకు ఉచిత కరెంట్, జలయజ్ఞం... రాష్ట్రం మూడుపువ్వులు ఆరుకాయలుగా వర్థిల్లుతున్నదని ప్రజలు పూర్తి సంతృప్తితో, సంతోషంగా ఉన్న కాలమది.కాని రాజశేఖరరెడ్డి హఠాన్మరణం తెలుగుజాతిని స్థాణువును చేసింది. రాజశేఖర రెడ్డిని చూసిన కళ్లు అలాంటి నాయకుడి కోసమే వెతుకులాడాయి. ఆ నాయకుణ్ణి వై.ఎస్.జగన్‌లో చూసుకున్నాయి. అయితే రాజకీయ కుయుక్తులు పన్నడంలో తలపండిన చంద్రబాబు రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, జగన్‌కు మధ్య సైంధవుడిలా నిలిచారు. టక్కుటమార విద్యలు ప్రదర్శించి, అబద్ధాల మేడలు కట్టి మరోసారి జనాన్ని నమ్మించి సి.ఎం. అయ్యారు. కాని చంద్రబాబు పరిపాలనా కాలంలో రాష్ట్రం మన్నుతిన్న పాములా ఉండిపోయింది. చిన్నా చితక పథకాల ప్రయోజనాల కోసం కూడా ప్రజలు అల్లల్లాడారు. ఒక వర్గం ప్రజలు రాజధాని నిర్మాణం వల్ల లబ్ధి పొందుతున్నారని సామన్యులకు అవగతమైంది. మాట ఇస్తే మడమ తిప్పని నాయకుని కోసం వారు తిరగబడ్డారు. వై.ఎస్.జగన్‌ని తమ ముఖ్యమంత్రిని చేసుకున్నారు.రాష్ట్ర విభజన వల్ల అనేక వెసులుబాట్లు కోల్పోయి, నిధుల లోటులో రాష్ట్రం ఉన్నప్పటికీ జగన్ తన విశిష్ట సమర్థతతో ప్రజాహిత పాలన కోసం నవరత్నాలతో ముందుకు వచ్చారు. రెండేళ్ల కరోనా కాలం ప్రపంచాన్ని స్తంభింపచేసినా తెలుగు రాష్ట్రం ముందంజలో ఉండేలా చూసుకున్నారు. విద్య నుంచి వికాసం, వైద్య ఖర్చు నుంచి విముక్తి ప్రధాన అజెండాగా చేసుకున్న జగన్ విస్తృత తెలుగు సమూహాలను గట్టున పడేశారు. తెలుగు ప్రజలు ఎన్నడూ చూడని విధంగా ఇళ్ల స్థలాల పట్టాల పంపిణి జరిగింది. రాజధానిలో పేదలకూ చోటుండాలని భావించిన జగన్ వంటి ముఖ్యమంత్రి ఉన్నారా?దారులు స్పష్టం. ప్రజలు ఏ దారిని ఎంచుకోవాలో తమకు తాముగా నిర్ణయించుకోవాలని అంటారు దేవులపల్లి అమర్. ఆయన రాసిన ‘మూడు దారులు’ గ్రంథం ఆంధ్ర రాష్ట్ర అవతరణ నుంచి మొదలయ్యి ప్రభావవంతమైన ముఖ్యమంత్రులుగా పని చేసిన ఎన్.టి.రామారావు, వై.ఎస్. రాజశేఖర రెడ్డి ధోరణులను తెలియచేస్తూ ఇప్పుడు వై.ఎస్. జగన్‌తో తల పడుతున్న చంద్రబాబు ‘యూ టర్న్’లను, వెన్నుపోట్లను, నమ్మించి వచించిన సంఘటలను విపులంగా తెలియచేసి పారాహుషార్ అంటూ హెచ్చరిస్తుంది.అనుభవజ్ఞుడైన జర్నలిస్టుగా మాత్రమే కాదు, చేయి తిరిగిన జర్నలిస్టుగా కూడా దేవులపల్లి అమర్ ఎంతో సులభంగా, సరళంగా చరిత్రని, వర్తమానాన్ని, తెలుగు నేలకు సంబంధించిన రాజకీయ ఘటనలను ఒక వరుసలో ఉంచి పాఠకులకు గొప్ప అవగాహన కలిగిస్తారు. కొన్ని ఘటనలు జరక్కపోయి ఉంటే తెలుగు జాతి మరింత ముందంజలో ఉండేది కదా అనిపించే విషయాలన్నో ఈ గ్రంథంలో ఉన్నాయి. ఇది నేటి రాజకీయ కార్యకర్తలకు, నిపుణులకే కాదు భావి విద్యార్థులకు కూడా కీలకమైన రిఫరెన్స్ గ్రంథం.‘చరిత్రదేముంది... చింపేస్తే చిరిగి పోతుంది’ అనేది సినిమాలో డైలాగ్. కాని చరిత్ర చిరిగిపోదు. అలాగే ఉంటుంది. మళ్లీ మళ్లీ ఉజ్జీవనం చెందుతూనే ఉంటుంది. చరిత్ర నిర్మింపబడే కాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విభజన అయ్యాక కాళ్లూ చేతులు ఊనుకుని ఒక గొప్ప పురోగమనానికి సిద్ధమవుతున్న ఆంధ్రప్రదేశ్ ఈ సమయంలో ఎటువంటి నాయకుణ్ణి ఎన్నుకోవాలో, తద్వారా ఎటువంటి ఘన చరిత్రకు తెలుగు జాతి ఆలవాలంగా ఉండాలో ఈ ఎన్నికల కాలంలో నిర్ణయించుకోవాలి. దారి స్పష్టం కావాలంటే ఈ గ్రంథం చదవండి.మూడు దారులు– రాజకీయ రణరంగాన భిన్న ధృవాలు; రచన– దేవులపల్లి అమర్; ప్రచురణ– రూప బుక్స్; పేజీలు: 210; వెల–395; ప్రతులకు–రూప పబ్లికేషన్స్, హైదరాబాద్.– వి.ఎన్.ప్రసాద్ (చదవండి: మూడు దారులు– రాజకీయ రణరంగాన భిన్న ధృవాలు)
అదిరే..అదిరే మాధురి స్టయిలే అదిరే!
చిన్న ఉపాయమే ఈ సోలార్ ఫ్యాన్.. నాన్స్టాస్ వ్యాపారం!
ఎండ వేడిని భరించాలంటే ఎవరికీ సాహసపడదు. ఆ వేడినుంచి తప్పుకోడానికే శతవిధాల ప్రయత్నాలు చేస్తుంటాం. కానీ వ్యాపారాలు చేసేవాళ్లు, ఎండలో కష్టించి పనిచేసేవాళ్లు తప్పకుండా ఏదో ఒక ఉపాయమైతే చేస్తారు. అలాంటి ప్రయత్నమే.. ఓ హహిళ చేసింది. అదేంటో చూద్దాం. ఎండ తీవ్రత నుంచి తప్పించుకునేందుకు పండ్లు అమ్ముతున్న ఓ మహిళ వినూత్న ఆలోచన చేసింది. పైన గొడుగు ఉన్నా ఉక్కపోతనుంచి కాపాడుకునేందుకు బుల్లిఫ్యాన్ తెచ్చుకుంది.అందుకు సోలార్‌ప్యానెల్ తెచ్చి పక్కనే పెట్టి దానినుంచి వచ్చే విద్యుత్‌తో ఆ ఫ్యాన్ గిరాగిరా తిరుగుతుండగా చల్లని గాలిలో తన వ్యాపారం చేసుకుంటోంది. ఈ దృశ్యం జనగామ జిల్లాకేంద్రంలోని నెహ్రూ పార్క్ సెంటర్ వద్ద శుక్రవారం కనిపించగా ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది. – ఫొటో: సాక్షి స్టాఫ్‌ఫొటోగ్రాఫర్
షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
మధుమేహం ఒక తీవ్రమైన వ్యాధి. జీవన శైలి మార్పులు,క్రమం తప్పని వ్యాయామం, ఆహార నియమాలు దీనికి పరిష్కారం. ఒకసారి మధుమేహం బారిన పడితే జీవితాంతం జాగ్రత్తలు తీసుకోవల్సిందే. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా తీవ్రమైన సమస్యలు తప్పవు.మధుమేహం వచ్చిందని భయపడుతూ కూర్చుంటే సమస్య పరిష్కారం కాదు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది తెలుసుకోవాలి. ముఖ్యంగా ఒత్తిడికి దూరంగా ఉండాలి. మధుమేహాన్ని నియంత్రించాలంటే తప్పనిసరిగా జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. అవేంటో ఒకసారి చూద్దాం.కొద్దిపాటి నడక, యోగాఉదయాన్నే లేదా రాత్రి నడక, యోగా, ధ్యానం చాలా అవసరం. ముఖ్యంగా డయాబెటిక్ సమస్య ఉన్నవారు యోగా చేయడం అలవాటు చేసుకోవాలి. రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రకుపక్రమించకూడదు. కనీసం పది, ఇరవై నిమిషాలు నడక,వజ్రాసనం వంటి యోగాసనాలను అలవాటు చేసుకోవాలి. దీని బరువు అదుపులో ఉంటుంది. తద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం అనేది షుగర్ లెవల్స్ ఎలివేట్ కావడానికి ముఖ్యం కారణం. కాబట్టి తిన్న తర్వాత కనీస శారీరక శ్రమ చాలా అవసరంస్వీట్లకు, కొన్ని రకాల పండ్లుమామిడికాయ, పనస, అరటి లాంటి పండ్లకు చాలా దూరంగా ఉండాలి. ఒక విధంగా చెప్పాలంటే ఒక్క జామకాయ తప్ప ఏదీ తినకూడదు.. తిన్నా.. చాలాపరిమితంగా తీసుకోవాలి. షుగర్ ఎక్కువగా ఉండే స్వీట్లకు పూర్తిగా దూరంగా ఉండాలి. రాత్రి సమయంలో స్వీట్లు తినకపోవడం మంచిది. మంచి నిద్ర, నీళ్లు ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉంటే రాత్రి నిద్ర కూడా పడుతుంది. డయాబెటిక్ రోగులు కనీసం 8 గంటలు నిద్రపోవాలి.అలాగే రాత్రి భోజనం చేసిన 1 గంట తర్వాత మీరు కనీసం 2 గ్లాసుల నీరు తాగాలి. ఇలా చేయడం వల్ల కూడా రక్తంలో చక్కెర స్థాయి పెరగకుండా నిరోధించవచ్చు.రాత్రిపూట మొబైల్ స్క్రీన్లకు ఎంత దూరంగా ఉంటే మంచింది. రాత్రి పడుకుని టీవీ, మొబైల్ చూడటం వల్ల, మెడ నొప్పులు, తలనొప్పి వస్తాయి. మద్యపానం, ధూమపానం పూర్తిగా నిషేధించాలి. ఎప్పటికపుడు పరీక్షలు, వైద్యుల సలహాలుఒకసారి మన శరీరంలోకి మధుమేహం ఎంటర్ అయిందంటే అదొక హెచ్చరికలాగా భావించాలి. రెగ్యులర్‌గా పరీక్షలు చేయించుకుంటూ, వైద్యుల సలహా మేరకు మందులను వాడుతూ ఉండాలి.నోట్: డయాబెటిక్ వచ్చిందని భయపడకుండా, తగిన జాగ్రత్తలు పాటించాలి. వ్యాయామం, ఆహార నియంత్రణ లాంటి జీవన శైలి మార్పులు ఆరోగ్య జీవనానికి పునాది. ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. పూర్తి సమాచారం, సందేహాలకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
క్రైమ్
Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
బంజారాహిల్స్: జీహెచ్ఎంసీ స్ట్రీట్‌లైట్ విభాగం సిబ్బంది నిర్లక్ష్యం ఓ యువకుడి నిండు ప్రాణాన్ని బలిగొంది. తనకు ఉద్యోగం వచి్చందన్న ఆనందాన్ని జీవిత భాగస్వామితో పంచుకునేందుకు వెళ్తున్న ఓ యువకుడిని కరెంటు స్తంభం రూపంలో మృత్యువు కాటేసింది. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కుమ్మరికుంట గ్రామానికి చెందిన తుమ్మా భవానీ రుషి (35) హార్డ్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. ఆయన భార్య సుజాత స్లేట్ స్కూల్లో టీచర్. యూసుఫ్‌గూడ సమీపంలోని వెంకటగిరిలో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. గురువారం ఉదయం రుషి ఎక్కువ జీతంతో కూడిన మరో ఉద్యోగానికి సంబంధించిన ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. సాయంత్రం తనకు కొత్త సంస్థలో ఉద్యోగం వచ్చిందని భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. రాత్రి 10 గంటల సమయంలో కృష్ణానగర్ నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో మెయిన్ రోడ్డులోని మెట్రో ఫిల్లర్ నంబర్– 1546 వద్ద జీహెచ్ఎంసీ సర్కిల్– 19 వీధిదీపాల కరెంటు స్తంభానికి అతని చేయి తగిలింది. స్ట్రీట్‌లైట్ స్తంభానికి ఉన్న ఫ్యూజ్‌బాక్స్ ఓపెన్ చేసి ఉండడం, విద్యుత్ తీగలు వేలాడుతూ స్తంభానికి ఆనుకుని ఉండడంతో షాక్‌కు గురై రుషి అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం కారణంగానే తన భర్త విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్లు పోలీసులకు రుషి భార్య సుజాత ఫిర్యాదు చేసింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ సర్కిల్–19 స్ట్రీట్‌లైట్ విభాగం అధికారులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ దర్యాప్తు చేస్తాం
సాక్షి, హైదరాబాద్: సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో మళ్లీ విచారణ చేపట్టాలని నిర్ణయించినట్టు డీజీపీ రవిగుప్తా వెల్లడించారు. 2016 జనవరి 17వ తేదీన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థి రోహిత్‌వేముల ఆత్మహత్యపై గచ్చిబౌలి పీఎస్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి శుక్రవారం పలు ఎల్రక్టానిక్, సోషల్ మీడియా చానళ్లలో రకరకాల వార్తలు, కథనాలు ప్రస్తారమయ్యాయి. దీనిపై స్పందించిన డీజీపీ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ‘ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా మాదాపూర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉన్నారు. ఈ కేసుకు సంబంధించిన తుది నివేదిక గత సంవత్సరం అంటే నవంబర్ 2023 కన్నా ముందే నిర్వహించిన దర్యాప్తు ఆధారంగా తయారు చేశారు. ఆ తుది నివేదికనే అధికారికంగా 21.03.2024న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సంబంధిత కోర్టులో దాఖలు చేశారు. అయితే విచారణ, విచారణ జరిగిన విధానంపై రోహిత్ వేముల తల్లితోపాటు మరికొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో కేసు విషయంలో మళ్లీ విచారణ చేపట్టాలని నిర్ణయించామని, తదుపరి దర్యాప్తును అనుమతించాలని మేజి్రస్టేట్‌ను అభ్యర్థిస్తూ సంబంధిత కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తాం’అని డీజీపీ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
రవి మృతదేహం కోసం..
ప్రజల కోసమే ప్రాణమిచ్చిండు 16 ఏళ్ల వయస్సులో విప్లవోద్యమంలోకి వెళ్లిన నా తమ్ముడు రవి 48 ఏళ్ల వయస్సులో ఎన్కౌంటర్లో చనిపోయిండు. ముప్పై ఏళ్లకు పైగా విప్లవోద్యమంలో పన్జేసిండు. ఉద్యమంలోకి పోయిన నుంచి ఒక్కసారి కూడా ఇంటి ముఖం చూడలె. ఎప్పటికై నా క్షేమంగా ఇంటికి వస్తడనుకున్నం. గిట్ల శవమై వస్తడనుకోలె. ప్రజల కోసం పోరుబాట పట్టిండు. ప్రజల కోసమే ప్రాణమిడిసిండు. నా తమ్ముని జన్మ ధన్యమైంది’ ఇది ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో గత మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన దండకారణ్య కమిటీ సభ్యుడు కాసవేణ రవి పెద్దన్న వెంకటేశ్ కన్నీటి వేదన.బెల్లంపల్లి: ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన దండకారణ్య రాష్ట్ర కమిటీ సభ్యుడు, బెల్లంపల్లికి చెందిన కాసవేణ రవి అలియాస్ అశోక్ అలియాస్ వినయ్ (48) మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకురావడానికి కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు పడిన యాతన అంతా ఇంతా కాదు. మంగళవారం ఉదయం ఎన్కౌంటర్ జరగగా శుక్రవారం మధ్యాహ్నం 3గంటలకు రవి మృతదేహాన్ని ఛత్తీస్‌గఢ్ పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆ తర్వాత నారాయణపూర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి నుంచి మృతదేహాన్ని ఇంటికి తీసుకురావడానికి ఇబ్బందులేర్పడ్డాయి. రవి మృతదేహాన్ని తీసుకురావడానికి కుటుంబీకులు, బంధువులు, సన్నిహితులు బుధవారం మధ్యాహ్నం భీమదేవరపల్లి మండలం వంగర స్వస్థలం నుంచి ఛత్తీస్‌గఢ్‌కు బయల్దేరి వెళ్లారు. దట్టమైన అటవీ ప్రాంతం మీదుగా, పోలీసుల తనిఖీల మధ్య 12 గంటల తర్వాత అక్కడికి చేరుకున్నారు. బుధవారం ఉదయం నారాయణపూర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి వెళ్లి మార్చురీలో భద్రపర్చిన రవి మృతదేహాన్ని సోదరుడు వెంకటేశ్, బంధువులు గుర్తించి బోరున విలపించారు.కిడ్నీ నుంచి తూటాలు..కుటుంబ సభ్యులు రవి మృతదేహాన్ని గుర్తించగా వైద్యులు స్కాన్ చేశారు. అతడి శరీరంలోని తూటాలను పరిశీలించిన నారాయణపూర్ ప్రభుత్వాస్పత్రి వైద్యులు పోస్టుమార్టం చేయడం సాధ్యంకాదని చెప్పారు. జగ్దల్పూర్ నుంచి ప్రత్యేక వైద్యులను శుక్రవారం ఉదయం రప్పించి మరోసారి రవి మృతదేహాన్ని స్కాన్ చేసి చూసిన తర్వాత పోస్టుమార్టం చేశారు. కాగా, కిడ్నీని ఆనుకుని మూడు తూటాలు ఉండటంతో నిపుణులైన వైద్యులతో పోస్టుమార్టం చేయించారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అప్పగించడంతో ప్రైవేట్ అంబులెన్స్‌లో స్వస్థలానికి చేరుకున్నారు. కాగా, శనివారం స్వగ్రామం వంగరలో రవి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు అతడి సోదరుడు వెంకటేశ్ తెలిపారు.
రైలు నుంచి పడి గర్భిణి మృతి
కొరుక్కుపేట: చైన్నె నుంచి సీమంతం కోసం తమ స్వగ్రామానికి వవెళుతున్న ఓ గర్భిణి విరుదాచలం సమీపంలో రైలు నుంచి పడి మృతి చెందింది. ఈ సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తెన్‌కాశీ జిల్లా కరంకోవిల్ సమీపంలోని మేలనీలితనల్లూర్ తూర్పు వీధికి చెందిన సురేష్ కుమార్ (25) చైన్నెలోని ఓ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతనికి చైన్నె పెరియార్ నగర్ త్రిశూలానికి చెందిన బిఎస్సీ పట్టభద్రురాలు కస్తూరి (22)తో 9 నెలల క్రితం వివాహమైంది. కస్తూరి ప్రస్తుతం 7 నెలల గర్భిణి. ఈ నేపథ్యంలో కస్తూరి కుటుంబ సభ్యులు సీమంతం చేయాలని నిర్ణయించారు. దీనికితోడు గ్రామంలో ఆలయ వేడుకలు జరుగుతున్నాయని, ఆదివారం సీమంతానికి ఏర్పాట్లు చేశారు. గురువారం సురేష్ కుమార్ తన భార్య, బంధువులు కొల్లాం ఎక్స్‌ప్రెస్ రైలులో స్వగ్రామానికి వెళ్లేందుకు టికెట్లు బుక్ చేశారు. అందరూ ఆ రైలులో ఎస్–9 కోచ్‌లో ప్రయాణిస్తున్నారు. ఈ రైలు రాత్రి 8 గంటలకు ఉలుందూరుపేట వద్దకు వెళ్లే సరికి కస్తూరికి వాంతులు అయ్యాయి. వెంటనే బంధువుల సాయంతో పెట్టెలో చేతులు కడుక్కోవడానికి వచ్చాడు. దానికి దగ్గరగా ప్రవేశ ద్వారం ఉంది. కస్తూరి వాంతులు చేసుకుంటూ అక్కడే నిలబడి ఉంది. ఆ సమయంలో రైలు వేగంగా వెళుతుండడంతో కదలిక రావడంతో కిందపడిపోయింది. ఇది చూసి షాక్‌కు గురైన మహిళ బంధువులు కేకలు వేశారు. వెంటనే బాక్స్‌లోని ప్రమాద గొలుసును లాగి రైలును ఆపేందుకు ప్రయత్నించారు. కానీ గొలుసు పని చేయలేదు. తరువాత అత్యవసర లివర్ని లాగారు. అప్పటికి రైలు దాదాపు 7 కిలోమీటర్లు దూరం వెళ్లి ఆగింది. కుటుంబ సభ్యులందరూ దిగి ఽఆ ప్రాంతానికి నడిచి వెళ్లారు. కానీ రాత్రి సమయం కావడంతో కస్తూరి జాడ తెలియలేదు. అనంతరం రైలులో విరుదాచలం రైల్వేస్టేషన్‌కు వచ్చి, రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు కస్తూరి కోసం గాలిస్తున్నారు. దాదాపు 2 గంటల తర్వాత కస్తూరి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై దక్షిణ రైల్వే సరైన విచారణకు ఆదేశించింది. కస్తూరికి వివాహమై 9 నెలలు కావస్తుండడంతో ఆర్డీఓ. విచారణకు సిఫారసు చేశారు.