Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

AP CM YS Jagan to Visit Bobbili and Payakarao and Eluru on may 1st
నేడు సీఎం జగన్‌ ప్రచార సభలు ఇలా..

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం మూడు నియోజకవర్గాల్లో  ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. సీఎం పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను మంగళవారం ఆయన విడుదల చేశారు.ఆ వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 10 గంటలకు  విజయనగరం లోక్‌సభ స్థానం పరిధిలోని బొబ్బిలిలో ఉన్న మెయిన్‌ రోడ్‌ సెంటర్‌లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్‌ పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు అనకాపల్లి పార్లమెంట్‌ పరిధిలోని పాయకరావుపేటలోని సూర్య మహల్‌ సెంటర్‌లో జరిగే సభలో.. మధ్యాహ్నం 3 గంటలకు ఏలూరులోని ఫైర్‌ స్టేషన్‌ సెంటర్‌లో జరిగే ప్రచార సభలో ముఖ్యమంత్రి జగన్‌ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.

సాయంత్రం 4 గంటలకు  చిత్తూరు జిల్లా కలికిరిలో  జరిగిన సీఎం జగన్‌ ఎన్నికల ప్రచార సభకు హాజరైన అశేష జనసందోహంలో ఓ భాగం , 2014లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలిచ్చిన మోసపూరిత హామీల గురించి వివరిస్తున్న సీఎం జగన్‌
మీ మేనిఫెస్టోలో ప్రధాని మోదీ ఫొటో ఎక్కడ చంద్రబాబూ?: సీఎం వైఎస్‌ జగన్‌

ఈ పెద్దమనిషి చంద్రబాబు.. ఇవాళ మేనిఫెస్టో అంటూ ప్రకటించాడు. చంద్రబాబు విశ్వసనీయత, సాధ్యం కాని హామీలు ఏ స్థాయిలో ఉన్నాయంటే.. పైనుంచి బీజేపీ వాళ్లు ఫోన్‌ చేసి నీ ఫొటో మాత్రమే పెట్టుకో! ప్రధాని మోదీ ఫొటోను నీ మేనిఫెస్టోలో పెట్టొద్దు అని తేల్చి చెప్పారు. అంటే ఈయన సాధ్యం కాని హామీలిచి్చనట్లే కదా! అదంతా మోసమే అని రుజువు అవుతోంది కదా? కూటమిలో ఉంటూ ముగ్గురి ఫొటోలు కూడా పెట్టుకునే పరిస్థితిలో చంద్రబాబు లేడంటే ఒక్కసారి గమనించండి. ప్రజల్ని మోసం చేయడం కోసం ఆయన ఏ స్థాయిలో బరి తెగించాడో చూడండి. – ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిచేతగానివాడికే కోపం ఎక్కువ..చంద్రబాబు వయసు 75 ఏళ్లు దాటింది. ఇంత జీవితం.. వెన్నుపోట్లు, మోసాలు, అబద్ధాలు, కుట్రలతోనే గడిచిపోయింది. 75 ఏళ్లు వచ్చాయి కదా..! ఆ మనిషిలో ఇప్పుడైనా పశ్చాత్తాపం కనిపిస్తుందా? అని చూస్తే ఏ కోశానా లేదు. వీళ్లంతా.. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో తెలుసా? జగన్‌ను మనిషి అనాలో రాక్షసుడు అనాలో చంద్రబాబుకు అర్థం కావట్లేదట! జగన్‌ను ఎందుకు చంపకూడదు? అని అడుగుతాడు ఈ పెద్దమనిషి. పనిలో పనిగా జగన్‌ను పాతేస్తానని కూడా అంటాడు. మొన్న నందికొట్కూరు, బుచ్చిరెడ్డిపాలెం, నెల్లూరు, కోవూరులో అన్న మాటలివి. అయ్యా.. మీ సంస్కారానికి ఓ నమస్కారం! చేతగానివాడికే కోపం ఎక్కువ.– మైదుకూరు సభలో సీఎం జగన్‌సాక్షి ప్రతినిధి, ఒంగోలు, సాక్షి ప్రతినిధి, కడప, సాక్షి రాయచోటి: అసత్యాల హరిశ్చంద్రులంతా 2014 తరహాలో మరోసారి కూటమి కట్టి మళ్లీ మోసగించేందుకు తయారయ్యారని ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. తాను వరుసబెట్టి 58 నెలలుగా మనందరి ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీమ్‌ల లిస్టు చదువుతుంటే చంద్రబాబుకు పిచ్చి కోపం వస్తోందని వ్యాఖ్యానించారు. చంద్రబాబూ..! నువ్వు పేదలకు చేసిన మంచి ఏమిటని అడిగితే సమాదా­నం చెప్పకుండా జగన్‌ను తిడితే ఏం ప్రయో­జనమని ప్రశ్నించారు. నాయకుడంటే ప్రజ­లకు నమ్మకం కలిగేలా ఉండాలన్నారు. ‘చంద్ర­బాబుది బోగస్‌ రిపో­ర్టు అయితే మీ జగన్‌ది ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌. ఇద్దరి పాలనలే ఇందుకు నిదర్శనం’ అని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఉదయం ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం టంగుటూరులో, మధ్యాహ్నం వైఎస్సార్‌ జిల్లా మైదుకూరులో, సాయంత్రం అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కలికిరిలో నిర్వహించిన బహిరంగ సభల్లో సీఎం జగన్‌ మాట్లాడారు. నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం..ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకు­నేవి కాదు. ఇది జగన్‌కు, చంద్రబాబుకు మధ్య జరుగుతున్న ఎన్నికల యుద్ధం కాదు. పేద­లకు–చంద్రబాబు మోసాలకు మధ్య జరుగు­తు­న్న యుద్ధం ఇది. మీరు వేసే ఓటు పేదల తలరాతలను మారుస్తుంది. మీ జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా సజావుగా కొనసాగింపు. పొరపా­టున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్లీ మోసపోవటమే. మళ్లీ చంద్రముఖి నిద్ర లేస్తుంది. లకలకా... అంటూ మళ్లీ ఐదేళ్లు మీ అందరి రక్తం తాగేందుకు తలుపు తడుతుంది. చంద్రబాబును నమ్మటం అంటే కొండచిలువ నోట్లో తలకాయ పెట్టడమే. నాయకుడంటే ప్రజల్లో నమ్మకం ఉండాలి. తాను ఒక మాట చెబితే చేస్తాడనే నమ్మకం ఆ నాయకుడిపై ప్రజలకు కలగాలి. మేనిఫెస్టోలో చెప్పిన 99శాతం వాగ్దానాలను అమలు చేసి నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం. ఎవరు మనసున్న మనిషి?చంద్రబాబు హయాంలో ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు ఇచ్చిన పెన్షన్‌ ఎంత? కేవలం రూ.1,000 మాత్రమే. ఈరోజు మీ బిడ్డ ఇస్తున్న పెన్షన్‌ రూ.3,000. మరి ఎవరికి మనసుంది? చంద్ర­బాబు ఏనాడైనా ఆ అవ్వాతాతలకు తోడుగా ఉన్నాడా? ఇంటికే పెన్షన్‌ పంపించాడా? 14 ఏళ్ల పాలనలో ఎన్నడైనా బటన్లు నొక్కి అక్కచెల్లెమ్మలకు మంచి చేశాడా? మరి మీ బిడ్డ 130 సార్లు బటన్లు నొక్కి నేరుగా రూ.2.70 లక్షల కోట్లు ఎక్కడా లంచాలు లేకుండా పారదర్శకంగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లో జమ చేశాడు. అందుకనే మంచి చేసిన ఫ్యాను ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్‌ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్‌ సింక్‌లోనే ఉండాలి. వలంటీర్లు మళ్లీ మీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్తు మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు, మన బడులు, మన చదువులు బాగుపడాలన్నా, మన వ్యవసాయం, మన హాస్పిటల్స్‌ మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ ఫ్యాను గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి.  అక్కచెల్లెమ్మలను ఆదుకున్నాం..18 శాతం ఓవర్‌ డ్యూస్‌తో ఎన్‌పీఏలుగా సీ, డీ గ్రేడ్‌ల్లోకి పడిపోయిన పొదుపు సంఘాలకు మీ జగన్‌ పునరుజ్జీవం కల్పించాడు. ఈరోజు లోన్‌ రీపేమెంట్‌ ఏకంగా 99.7 శాతానికి చేరుకుని దేశానికే ఆదర్శంగా నిలిచాయి. అక్కచెల్లెమ్మల కోసం ఆసరాతోపాటు సున్నావడ్డీ, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, 31 లక్షల ఇళ్ల పట్టాలు, 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు, పిల్లల చదువులకు తోడుగా విద్యాదీవెన, వసతి దీవెన, అమ్మ ఒడి అందించి అండగా నిలిచాం. మహిళా సాధికారతకు అర్థం చెబుతూ ఏకంగా చట్టం చేసి మరీ నామినేటెడ్‌ పదవుల్లో, కాంట్రాక్టుల్లో అక్కచెల్లెమ్మలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించింది మీ బిడ్డ ప్రభుత్వమేనని గర్వంగా చెబుతున్నా. అక్కచెల్లెమ్మలకు రక్షణగా దిశ యాప్, గ్రామంలోనే మహిళా పోలీస్‌ సేవలు అందుబాటులోకి తెచ్చాం. అమ్మ ఒడిని రూ.15వేల నుంచి రూ.17 వేలకు, అవ్వాతాతల పెన్షన్లను రూ.3 వేల నుంచి దశలవారీగా రూ.3,500కి పెంచుకుంటూ వెళతామని మాటిస్తున్నా. రైతన్నలకు జగన్‌ ఏం చేశాడంటే..⇒ ఎన్నడూ లేని విధంగా అన్నదాతలకు రైతు భరోసా ఇచ్చింది మీ బిడ్డ జగన్‌. సీజన్‌ ముగిసేలోగా ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తోంది మీ జగన్‌. ⇒ గ్రామాల్లో ఆర్బీకేలు తేవడంతోపాటు 9 గంటలు పగటిపూటే నాణ్యమైన ఉచిత విద్యుత్, ఈ– క్రాప్, ఉచిత పంటల బీమా, గిట్టుబాటు ధరలు, ఆర్బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, రైతన్నలకు సలహాలు, దళారీలు లేకుండా పంటల కొనుగోళ్లు.. ఇవన్నీ జరిగింది ఎప్పుడంటే మీ బిడ్డ ముఖ్యమంత్రి అయ్యాకే.⇒ మీ జగన్‌ చెప్పిన దాని కంటే మిన్నగా రైతన్నలకు సాయం చేశాడు. రైతు భరోసా ద్వారా ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50 వేలు ఇస్తానని మేనిఫెస్టోలో చెప్పినా అంతకంటే మిన్నగా ఐదేళ్లలో రూ.67,500 పెట్టుబడి సాయంగా అందించాడు.  ⇒ ఈ దఫా అధికారంలోకి వచ్చాక ఏటా రూ.16 వేలు చొప్పున ఐదేళ్లలో రూ.80 వేలు రైతన్నల చేతిలో పెడతామని చెబుతున్నా. మరి మాట తప్పకుండా కచ్చితంగా ఇచ్చే మీ జగన్‌ను నమ్మాలా? లేక ఇస్తానని మోసం చేసే చంద్ర­బాబును నమ్మాలా? డెవలప్‌ చేసిందెవరు?⇒ చంద్రబాబు డెవలప్‌మెంట్‌ కింగ్‌ అంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 బాకా ఊదుతుంటాయి. చంద్రబాబు ఏం డెవలప్‌మెంట్‌ చేశాడో మీరే చెప్పండి. గ్రామాల్లో పౌర సేవల్ని పూర్తిగా మారుస్తూ, గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ ఏకంగా 15 వేల గ్రామ, వార్డు సచివాలయాలు కట్టింది ఎవరు? ఈరోజు 11 వేల విలేజ్, వార్డు క్లినిక్‌లు కనిపిస్తున్నాయంటే వాటిని కట్టింది ఎవరు? మన గ్రామాల్లో 11 వేల రైతు భరోసా కేంద్రాలు కట్టింది ఎవరు? గ్రామానికే ఫైబర్‌ గ్రిడ్, వేగంగా డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణం జరుగు­తున్నది కూడా మీ బిడ్డ హయాంలోనే. నాడు–నేడుతో గవర్నమెంట్‌ బడులు, ఆస్పత్రులు బాగు పడ్డాయంటే కారణం ఎవరు?బాగు చేసింది ఎవరయ్యా?జగన్‌లా 17 మెడికల్‌ కాలేజీలు తెచ్చావా బాబూ? జగన్‌లా 4 కొత్త సీ పోర్టులు కట్టావా? 10 ఫిషింగ్‌ హార్బర్లు కట్టావా? ఆరు ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లు కట్టావా? మీ జగన్‌ సర్ఫేస్‌ వాటర్‌ (రిజర్వాయర్‌ నుంచి ఉపరితల జలాలు) తరలించి ఉద్దానం వాసుల కిడ్నీ కష్టాలను తీర్చాడు. వెలిగొండ నీళ్లను ప్రకాశం జిల్లాకు తెచ్చింది మీ జగన్‌ కాదా? జగన్‌లా ఎయిర్‌పోర్టుల విస్తరణ చేశావా చంద్ర­బాబూ?  భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌­పోర్టు­ను పరుగులు తీయించావా? 3 ఇండస్ట్రియల్‌ కారి­డార్లు, 10 ఇండస్ట్రియల్‌ నోడ్లు.. ఇవన్నీ నువ్వు పరిగెత్తించావా? జగన్‌లా ఎంఎస్‌ఎంఈలకు ఏనాడైనా సపోర్ట్‌ చేశావా? జగన్‌లా స్వయం ఉపాధిని ప్రోత్స­హిస్తూ ఓ రైతు భరోసాగానీ, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, ఆసరా, సున్నా వడ్డీ, వాహన మిత్ర, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, జగనన్న తోడు, జగనన్న చేదోడు, లా నేస్తం వంటి పథకాలను తెచ్చావా చంద్రబాబూ? అన్నింటికీ మించి పేదరి­కం సంకెళ్లను తెంచేలా పిల్లల చదువులను బాగు చేసింది ఎవరయ్యా చంద్రబాబూ? డెవలప్‌మెంట్‌ విషయంలో కూడా బాబుది బోగస్‌ రిపోర్టే. మీ సంస్కారానికి ఓ నమస్కారం..నేను వరుసబెట్టి 58 నెలలుగా మనందరి ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీమ్‌ల లిస్టు చదువుతుంటే చంద్రబాబుకు పిచ్చి కోపం వస్తోంది. మా బాబును ఇలాంటి ప్రశ్నలు అడుగుతావా? అని ఈనాడుకు, ఆంధ్రజ్యోతికి, టీవీ 5, దత్తపుత్రుడికి కోపం వస్తోంది. వదినమ్మకూ కోపం వస్తోంది. వీరందరికీ పిచ్చి­పిచ్చిగా కోపం వస్తోంది. వీరితోపాటు చంద్రన్న కాంగ్రెస్‌కు కూడా కోపం వస్తోంది. మనకు కౌంటర్‌గా వారు లిస్టులు చదువుతున్నారు. కాకపోతే అవి స్కీమ్‌ల లిస్టులు కాదు. అవన్నీ నాపై తిట్లు, శాప­నా­ర్థాలు, బెదిరింపులు, బూతులు, అబద్ధాల లిస్టులు. అవి ప్రతి రోజూ గడగడ చదివేస్తున్నారు. అయ్యా.. మీ అందరి సంస్కారానికి ఓ నమస్కారం.బంగారం వేలం వేయించిన చంద్రబాబుచంద్రబాబూ.. రైతుల రుణ మాఫీపై తొలి సంతకం చేస్తానన్నావు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానన్నావు. మరి రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేశావా? బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని విడిపించకపోగా ఏకంగా వేలం వేయించాడు. చంద్రబాబు రైతులకు ఉచితంగా పంటల బీమా ఏరోజైనా ఇచ్చాడా? సీజన్‌ ముగిసేలోగా ఇన్‌పుట్‌  సబ్సిడీ ఇచ్చిన చరిత్ర ఏ రోజైనా ఉందా? సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చాడా? లేక ఎగరగొట్టారా? పెట్టుబడి సాయంగా చంద్రబాబు ఏ ఒక్క రైతుకైనా రైతు భరోసా అందించారా? ఎన్నికలు రావడంతో జగన్‌ కంటే ఎక్కువ డబ్బులిస్తానంటూ నమ్మబలుకుతున్నాడు. రైతులపై కాల్పులు జరిపించిన బాబువ్యవసాయం దండగ అని నువ్వు మాట్లాడిన మాట నిజం కాదా చంద్రబాబూ? రైతులపై బషీర్‌బాగ్‌లో కాల్పులు జరిపించింది నువ్వు కాదా? రైతులను విచారించేందుకు ఏకంగా ప్రత్యేక పోలీస్‌ స్టేషన్లు, ప్రత్యేక కోర్టులు తెచ్చింది నువ్వు కాదా? రైతన్నలకు ఉచిత కరెంటు ఇస్తే తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందన్న మాటలు నీవి కావా? రైతులను అన్ని రకాలుగా మోసం చేసి నిట్ట నిలువునా ముంచిన నీది బోగస్‌ రిపోర్టు కాదా?పెన్షన్లపై బాబు కుట్రలుఈ బోగస్‌ బాబు చేస్తున్న మరో దుర్మార్గం చూడండి. పెన్షన్ల విషయంలో బాబు కుట్రలను గమనించండి. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఏ ఒక్కరోజైనా అవ్వాతాతల బాధలను పట్టించుకున్నాడా? పెన్షన్లు ఇంటికే పంపించిన చరిత్ర చంద్రబాబు హయాంలో ఉందా? మీ జగన్‌కు ఎక్కడ మంచి పేరు వస్తుందోననే ఆందోళనతో తన మనిషి నిమ్మగడ్డ రమేష్‌ ద్వారా కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఉత్తరం రాయించి ఇంటికి వచ్చే ఆ పెన్షన్లను ఆపించారు. వలంటీర్ల సేవలను రద్దు చేయించిన వ్యక్తి ఈ చంద్రబాబు కాదా? తాను చేసిన వెధవ పనికి ఆ అవ్వా తాతలంతా తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుండటంతో ఆ నెపాన్ని జగన్‌ మీదకు తోస్తున్నాడు. ఇంతకంటే దిగజారుడు రాజకీయం ప్రపంచ చరిత్రలో ఉంటుందా?నీ కళ్లకు పచ్చ కామెర్లా?బడులకు పంపే తల్లులను ప్రోత్సహిస్తూ అమ్మ ఒడి అనే పథకాన్ని నీ హయాంలో ఏ రోజైనా తెచ్చావా బాబూ? పేదింటి పిల్లలకు ఇంగ్లిష్‌ మీడియం, బైలింగ్వల్‌ టెక్ట్స్‌ బుక్స్, 8వ తరగతికి వచ్చే సరికి ట్యాబ్‌లు, 6వ తరగతి నుంచే ఐఎఫ్‌పీలతో డిజిటల్‌ బోధన, సీబీఎస్‌ఈ నుంచి ఐబీ వరకు ప్రయాణం, 3వ తరగతి నుంచే టోఫెల్, బైజూస్‌ కంటెంట్‌ లాంటివి కనిపించడం లేదా చంద్రబాబూ? పచ్చకామెర్లు వచ్చాయా నీ కళ్లకు?  పూర్తి ఫీజులు చెల్లిస్తూ జగనన్న విద్యాదీవెన, ఖర్చులకు ఇబ్బంది పడకుండా వసతి దీవెన, తొలిసారిగా ఆన్‌లైన్‌ సర్టిఫైడ్‌ వర్టికల్స్‌.. ఇవన్నీ వచ్చింది ఈ 58 నెలల కాలంలోనే కాదా? మరి చదువుల విషయంలో చంద్రబాబు రిపోర్టు బోగస్‌ కాదా?బాబుది బోగస్‌ రిపోర్ట్‌.. జగన్‌ది ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ బాబు వస్తే జాబొస్తుందని 2014లో చంద్రబాబు, ఎల్లో మీడియా ఊదరగొట్టాయి. చంద్రబాబు ఐదేళ్లలో ముష్టి వేసినట్లు 32 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తే మీ జగన్‌ 2.31 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశాడు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో గవర్నమెంట్‌ ఉద్యోగాలు నాలుగు లక్షలు మాత్రమే ఉంటే ఈ 58 నెలల కాలంలో మీ బిడ్డ ఏకంగా మరో 2.31 లక్షల గవర్నమెంట్‌ ఉద్యోగాలు భర్తీ చేశాడు. మన చెల్లెమ్మలు, తమ్ముళ్లే గ్రామ సచివాలయాలు, మెరుగుపడిన ఆస్పత్రులు, బాగుపడిన స్కూళ్లలో కనిపిస్తున్నారు. మరి బాబు రిపోర్ట్‌ బోగస్‌ కాదా? ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో మీ జగన్‌ రిపోర్టు కళ్లెదుటే కనిపిస్తున్న వాస్తవం కాదా?మన అభ్యర్థులను ఆశీర్వదించండిఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి, కొండపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూలపు సురేష్, ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్‌. రఘురామిరెడ్డి, రాజంపేట ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, పీలేరు ఎమ్మెల్యే అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డిని మీరంతా ఆశీర్వదించి గొప్ప మెజార్టీతో గెలిపించాలి.రాజోలి మనమే పూర్తి చేస్తాం..మన ప్రభుత్వం మళ్లీ రాగానే రాజోలి ప్రాజెక్టును పూర్తి చేస్తాం. కరోనా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల కారణంగా అనుకున్న సమయానికి చేయలేకపోయాం. నాలుగేళ్లు పుష్కలంగా వర్షాలు పడటంతో అన్ని ప్రాజెక్టులు నిండాయి. ఈ ఏడాది వర్షాలు అంతంత మాత్రంగా పడటంతో రాజోలి ప్రాముఖ్యత తెలుస్తోంది. వచ్చే టర్మ్‌లో కచ్చితంగా రాజోలి ప్రాజెక్టును పూర్తి చేస్తాం.2014లో బాబు ముఖ్యమైన మోసాలివీ..⇒ రూ.87,612 కోట్ల రైతు రుణాలు మాఫీ చేశాడా? రూ.14,205 కోట్లు డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాల్లో కనీసం ఒక్క రూపాయి మాఫీ చేశాడా? ⇒ ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25వేలు బ్యాంకుల్లో వేస్తామని నమ్మబలికిన చంద్రబాబు ఏ ఒక్కరి ఖాతాలోనైనా రూపాయి జమ చేశాడా?⇒ ఇంటికో ఉద్యోగం లేదంటే రూ.2 వేల నిరుద్యోగ భృతి అని హామీ ఇచ్చిన చంద్రబాబు ఆ ప్రకారం ఐదేళ్లలో రూ.1.20 లక్షలు ఎవరికైనా ఇచ్చాడా?⇒ అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇళ్లు ఒక్కరికైనా ఇచ్చాడా? ⇒ రూ.10 వేల కోట్లతో బీసీ సబ్‌ ప్లాన్, చేనేత, పవర్‌ లూమ్స్‌ రుణాల మాఫీ జరిగిందా? ⇒ ఉమెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేశాడా? ⇒ సింగపూర్‌కు మించి అభివృద్ధి, ప్రతి నగరంలోనూ హైటెక్‌ సిటీ అన్నాడు. కొండపి, మైదుకూరులో ఎక్కడైనా కనిపిస్తున్నాయా? ⇒ పోనీ ప్రత్యేక హోదా తెచ్చాడా? అది కూడా అమ్మేశాడు. ⇒ అవే మూడు పార్టీలు ఇప్పుడు సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్, ఇంటింటికీ కేజీ బంగారం, బెంజ్‌ కారు అంటూ మరోసారి మోసాలకు సిద్ధమయ్యాయి.జవాబు చెప్పకుండా జగన్‌ను తిడతావా?చంద్రబాబూ నువ్వు పేదలకు చేసిన మంచి ఏమిటని అడిగితే నీ దగ్గర నుంచి సమాధానం లేదు. పాత మేనిఫెస్టోను అమలు చేశావా? అంటే సమాధానం రాదు. మీ కొత్త మేనిఫెస్టోకు విశ్వసనీయత ఏమిటి? ప్రజలకు జవాబు చెప్పకుండా జగన్‌ను తిడితే ఏం ప్రయోజనం? ఇంటింటికీ ఎవరు మంచి చేశారు? ఎవరు అందరినీ మోసగించారు? వారి చరిత్ర ఏమిటనేది ప్రజలందరికీ తెలుసు. 

PM Narendra Modi Fires On CM Revanth Reddy
డబుల్‌ ఆర్‌ ట్యాక్స్‌ ఢిల్లీకి.. రేవంత్‌ను ఉద్దేశిస్తూ ప్రధాని మోదీ ఫైర్‌

కాంగ్రెస్‌ ఎన్నికల గుర్తు హస్తం... పంజా.. ఆ పార్టీ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ అబద్ధపు వాగ్దానాలు, ఓటు బ్యాంకు రాజకీయం, నేరగాళ్లను పెంచి పోషించడం, కుటుంబపాలన, అవినీతి అనే ఐదు సూత్రాలను నమ్మి రాజకీయం చేస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని దోచుకునేందుకు వారసత్వ సంపద పన్ను తీసుకురావాలని చూస్తోంది. ఇది అమలుచేస్తే మీరు జీవితాంతం కష్టపడి దాచుకున్న సొమ్ము మీ మరణం తర్వాత మీ వారసులకు ఇవ్వలేరు.  సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ఆర్‌ ఆర్‌ (డబుల్‌ ఆర్‌) ట్యాక్స్‌ పేరుతో ప్రజలను దోచుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలుగు వా­ళ్లు తీసిన ‘ట్రిపుల్‌ ఆర్‌’ భారత్‌లోనే సూపర్‌ హిట్‌ సినిమాగా నిలిచి ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని సాధిస్తే... తెలంగాణలో ఈ ‘డబుల్‌ ఆర్‌’ యావద్దేశం సిగ్గుపడేలా చేస్తోందని మండి­పడ్డారు. ఈ ట్యాక్స్‌పై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోందని, పారిశ్రామిక వేత్తలు, వ్యాపా­రులు, కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేసిన డబ్బును నల్లధనం రూపంలో ఢిల్లీకి తరలిస్తున్నారని ఆరోపించారు. ‘మీ అందరికీ ఆ డబు­ల్‌ ఆర్‌ ఎవరో తెలుసు. దానిని వివరించాల్సిన అవసరం లేదు. ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ వసూళ్లకు కళ్లెం వేయకపోతే తెలంగాణ ప్రజలు తిరిగి కోలుకోలేనంతగా దోచేస్తారు. ఐదేళ్లలో రాష్రా­­్టన్ని నాశ­నం చేస్తారు’ అని ధ్వజమెత్తారు. దీనికి కళ్లెం ప­డాలంటే పార్లమెంట్‌ ఎన్నికల్లో 17 సీట్లలోనూ బీజేపీని గెలిపించాలని కోరారు. మంగళవారం జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని చిల్వర్‌ గ్రామం (అల్లాదుర్గ్‌)లో బీజేపీ నిర్వహించిన బహిరంగసభలో ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా మోదీ... ‘నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు’ అంటూ తెలుగులో ఉపన్యాసం ప్రారంభించారు. బసమేశ్వర్, సంగమేశ్వర్, సేవాలాల్‌ మహరాజ్‌లకు నమస్కారాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్‌ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్‌. మెదక్‌ ఎంపీ అభ్యర్థి ఎం.రఘునందన్‌రావు తదితరులు పాల్గొన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ ఒక్క గూటి పక్షులే..  ‘బీఆర్‌ఎస్‌ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు అతిపెద్ద స్కాం కాగా... విపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ దీనిపై విచారణ జరుపుతామని చెప్పింది. కానీ అధికారంలోకి వచ్చాక ఈ కేసుకు సంబంధించిన ఫైళ్లను తొక్కి పెట్టింది. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండగా ఓటుకు కోట్లు కేసులో విచారణను ముందుకు సాగకుండా చర్యలు తీసుకుంది. ఈ రెండు పారీ్టలు ఒకరినొకరిని కాపాడుకోవాలని చూస్తున్నాయి. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ ఒక్క గూటి పక్షులే.. అవి కరప్షన్‌ రాకెట్‌ కమిటీకి చెందిన సభ్యులు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ ద్వారా ఇది అర్థమవుతోంది. బీఆర్‌ఎస్‌.. ఆప్‌తో కలిసి లిక్కర్‌ స్కామ్‌ చేసింది. ఢిల్లీలో లిక్కర్‌ స్కామ్‌ చేసిన పారీ్టతో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకుంది’ అని మోదీ ధ్వజమెత్తారు. ‘కాంగ్రెస్‌.. రైతులకు వెన్నుపోటు పొడవడానికి కూడా వెనుకాడటం లేదు. వంద రోజుల్లో రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు చేయలేదు. క్వింటాల్‌ వరికి రూ.500 బోనస్‌ ఇస్తామన్నారు. ఇప్పుడు ఇవ్వకుండా, కనీసం దానిపై మాట్లాడకుండా నోటికి తాళం వేసుకున్నారు’ అని మోదీ తెలిపారు. కాంగ్రెస్‌ జన్మతః రాజ్యాంగ వ్యతిరేకి..  ‘నేను జీవించి ఉన్నంత కాలం రాజ్యాంగానికి ఏమీ జరగకుండా కాపాడుకుంటాను. రాజ్యాంగాన్ని కదిలించే వ్యక్తి, శక్తి ఎవరూ ఉండరు. కాంగ్రెస్‌కు, వాళ్ల తొత్తులు, చెంచాలకు సవాల్‌ చేస్తున్నా. దీన్ని కాపాడే బాధ్యత నేను తీసుకుంటున్నాను. దళితులు, బంజారా, ఆదివాసీలు, ఓబీసీల రిజర్వేషన్లను మతప్రాతిపదికన ముస్లింలకు ఇచ్చే ప్రయత్నాన్ని ఎట్టిపరిస్థితుల్లో జరగనివ్వను. కాంగ్రెస్‌ పార్టీ జన్మతః రాజ్యాంగ వ్యతిరేకి. మతపర రిజర్వేషన్లు వద్దని రాజ్యాంగంలో ఉంటే.. రాహుల్‌ గాంధీ ఓటుబ్యాంకు రాజకీయాల కోసం ఆ రిజర్వేషన్లను ప్రోత్సహిస్తున్నారు. మోదీకి రాజ్యాంగమంటే పవిత్రగ్రంథం, రాజ్యాంగం రచించి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గుజరాత్‌ సీఎంగా ఏనుగుపై రాజ్యాంగాన్ని ఊరేగించాను. నేను కింద నడిచాను. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టడానికి ముందే ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి ప్రతీక అయిన పార్లమెంట్‌ భవనం ఎదుట సాష్టాంగ ప్రణామం చేశాను. రాజవంశీయులు (నెహ్రూ, ఇందిరాగాంధీ కుటుంబం) అధికార దాహంతో రాజ్యాంగాన్ని అవమానించారు. వాళ్లు ఈవీఎంలు, ఎన్నికల కమిషన్‌ను కూడా నమ్మడం లేదు’ అని మోదీ ధ్వజమెత్తారు.  ఫేక్‌ వీడియో సృష్టించి లబ్ధి పొందాలని చూస్తున్నారు... ‘ఈ ఎన్నికల్లో ఓడిపోతామని భావించి కాంగ్రెస్‌ నాయకులు రిజర్వేషన్లపై ఫేక్‌ వీడియో సృష్టించి లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలతో వివిధ సామాజికవర్గాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీని వెనుక డబుల్‌ ఆర్‌ ఉన్నట్లు తెలుస్తోంది. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఒక ముఖ్యమంత్రి ఇలా చేయొచ్చా? ఇండియా కూటమి నిరాశా నిస్పృహల్లో మునిగిపోయింది. దేశవ్యాప్తంగా ఈ కూటమికి ఈసారి ప్రతిపక్ష హోదా కూడా దక్కే పరిస్థితి లేదు. కాంగ్రెస్‌కు ఓటేస్తే అది పూర్తిగా నిష్ఫలమే. బీజేపీ ఒక్కటే వికల్పం, సంకల్పం. మీరు రఘునందన్‌ రావు, బీబీ పాటిల్‌కు ఓటు వేస్తే నేరుగా మోదీకి వేసినట్లే. తెలంగాణ అభివృద్ధికి మా ప్రభుత్వం లక్షల కోట్లు ఖర్చుచేసింది. 4 వందేభారత్‌ రైళ్లు, 40 రైల్వేస్టేషన్ల ఆధునీకరణ, మెదక్‌–ఎల్లారెడ్డి–బోధన్‌ జాతీయ రహదారిపై నిర్ణయం, సంగారెడ్డి–అకోల–నాందేడ్‌ నేషనల్‌ హైవే పూర్తి, అందోల్‌–నారాయణఖేడ్‌–జుక్కల్‌ రోడ్డులో కనెక్టివిటీ పెంపు...ఇలా ఎన్నో చర్యలు చేపట్టాం’ అని మోదీ చెప్పారు. కాంగ్రెస్‌ను ఒక్క సీట్లో గెలుపైనా అవసరమా? ‘కేంద్రం ఎన్నో ప్రయాసలకు ఓర్చి తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తుంటే... ఇక్కడ కాంగ్రెస్‌ ప్రభుత్వం సంకుచిత రాజకీయాలు చేస్తోంది. సమ్మక్క, సారక్క గిరిజన వర్సిటీ స్థాపనకు కేంద్రం చర్యలు తీసుకుంటే నేటికీ దానికి అవసరమైన భూమి ఇవ్వలేదు. మనోహరాబాద్‌–సిద్దిపేట–కోటపల్లి రైల్వేలైన్‌కు భూమి కేటాయించలేదు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న కాంగ్రెస్‌ను ఒక్క ఎంపీ సీట్లో అయినా ప్రజలు గెలిపించాల్సిన అవసరముందా? కనీసం హైదరాబాద్‌లో పండుగ నిర్వహించుకోవాలంటే కూడా చివరకు శ్రీరామ నవమికి కూడా ఆంక్షలు పెట్టింది. ఒక వర్గం ఓట్ల కోసం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో 2004 నుంచి 2009 వరకు కాంగ్రెస్‌కు రికార్డు స్థాయిలో ఎమ్మెల్యేలు, ఎంపీలను గెలిపించారు.. కానీ కాంగ్రెస్‌ ఏం చేసింది. గెలిచాక ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల హక్కులను కాలరాసింది. ఏపీని ఒక ప్రయోగశాలగా మార్చి ఓబీసీల రిజర్వేషన్లను ముస్లింలకు కట్టబెట్టింది. రాజ్యాంగం, రిజర్వేషన్లపై మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రజలను మోసం చేస్తోంది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు నేను కట్టుబడి ఉన్నాను. మీ కోసం నేను పోరాడతాను’ అని చెప్పారు. నెహ్రూ కాలం నుంచి మోసం ‘కాంగ్రెస్‌ మొదటి నుంచి రాజ్యాంగాన్ని, అంబేడ్కర్‌ను గౌరవించలేదు. దేశ మొదటి ప్రధాని నెహ్రూ రాజ్యాంగాన్ని అవహేళన చేసి పెద్ద తప్పు చేశారు. ఆయన తర్వాత ఇందిరాగాంధీ తన రాజకీయ అవసరాల కోసం రాజ్యాంగానికి తూట్లు పొడిచారు. ఎమర్జెన్సీ విధించారు. రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు మీడియా, పత్రిక స్వేచ్ఛను హరించారు. మన్మోహన్‌ సింగ్‌ కేబినెట్‌ చట్టరూపకంగా బిల్లును తెస్తే.. దాన్ని రాహుల్‌ చింపివేశారు. రాజ్యాంగానికి వారిచ్చే గౌరవమిది. రాజ్యాంగాన్నే కాదు కాంగ్రెస్‌ పార్టీ రాజ్యాంగాన్ని కూడా అవమానించి అప్పటి అధ్యక్షుడు సీతారాం కేసరిని బాత్‌రూంలో బంధించి సోనియాగాం«దీని అధ్యక్షురాలిని చేశారు. వీరికి అధికారమే సర్వస్వం’ అని మోదీ మండిపడ్డారు.  

Chandrababu copied YSRCP schemes in Andhra Pradesh
బూటకపు హామీలకు కేరాఫ్‌ బాబు

సాక్షి, అమరావతి: బూటకపు హామీలు ఇవ్వడం.. వాటిని గాలికొదిలేయడంలో కేరాఫ్‌ అడ్రస్‌ ఎవరిదంటే అందరూ చెప్పేమాట చంద్రబాబు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ అలవికాని హామీలను ఇవ్వడం, ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపడం, ఆ తర్వాత వాటిని మర్చిపోవడం ఆయనకు వెన్నుపోటుతో పెట్టిన విద్య. ఈసారి కూడా ఇదే రీతిలో చంద్రబాబు, తన దత్తపుత్రుడు పవన్‌ కళ్యాణ్‌తో కలిసి ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇందులో కొత్తగా ఒక్కటంటే ఒక్క పథకం చంద్రబాబు ఆలోచనల నుంచిలో అమలవుతున్న పథకాలను యథాతథంగా కాపీ కొట్టి మక్కీకి మక్కీ దించేశారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలను నిస్సిగ్గుగా కాపీ కొట్టి తన మేనిఫెస్టోలో పెట్టుకోవడం చంద్రబాబుకే చెల్లిందని రాజకీయ విశ్లేషకులు, ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.  కాపీ క్యాట్‌ బాబు..  రాష్ట్రంలో ప్రజలకు రూ.25 లక్షల ఆరోగ్య బీమా అందిస్తామని చంద్రబాబు మేనిఫెస్టోలో పేర్కొన్నారు. వాస్తవానికి ఇప్పటికే వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పరిమితిని ఏకంగా రూ.25 లక్షలకు పెంచి పూర్తి స్థాయిలో అమలు చేస్తోంది. ఈ స్థాయిలో ఉచిత వైద్యాన్ని అందిస్తున్న రాష్ట్రం దేశంలోనే ఏపీ ఒక్కటే కావడం గమనార్హం. చంద్రబాబు పాలనలో కేవలం తెల్ల రేషన్‌ కార్డు ఉన్న వారికి మాత్రమే ఆరోగ్యశ్రీ పథకం అందేది.అలాంటిది అధికారంలోకి వచ్చాక సీఎం వైఎస్‌ జగన్‌ రూ.5 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలన్నింటికీ ఈ పథకాన్ని వర్తింపజేశారు. దీంతో రాష్ట్రంలో 90 శాతానికిపైగా కుటుంబాలు ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చాయి. వీరందరికీ రూ.25 లక్షల వరకూ వైద్య సేవలు పూర్తిగా ఉచితమే. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇదే హామీ ఇవ్వడం వల్ల కొత్తగా ప్రజలకు వచ్చే ప్రయోజనమేముందని చర్చ జరుగుతోంది.  డిజిటల్‌ హెల్త్‌ కార్డులూ కాపీయేనా బాబు? ఆరోగ్యశ్రీ పరిమితి పెంపునే కాకుండా మరో దాన్ని కూడా చంద్రబాబు నిస్సిగ్గుగా కాపీ కొట్టి మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. ఇప్పటికే వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రాష్ట్రంలో 4.7 కోట్ల మందికిపైగా డిజిటల్‌ హెల్త్‌ కార్డులు అందజేసింది. ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రతి కుటుంబానికి స్మార్ట్‌ హెల్త్‌ కార్డులు పంపిణీ చేసింది. అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలోనే డిజిటల్‌ వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ అంశంలో దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఇప్పుడు చంద్రబాబు సైతం తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్‌ హెల్త్‌ కార్డులు ఇస్తామని హామీ ఇవ్వడం పట్ల ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.    బాబు దగా మరువని ప్రజలు 2014 ఎన్నికల్లో మేనిఫెస్టోలో వైద్య ఆరోగ్య విధానం పేరిట చంద్రబాబు మొత్తం 14 హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చిన పాపానపోలేదు. జిల్లాకు ఒక నిమ్స్‌ ఆస్పత్రి నిర్మాణం అంటూ దాన్ని కూడా గాలికొదిలేశారు. ఆరోగ్యశ్రీలో కొత్త వ్యాధులను చేర్చి ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఉచిత పరీక్షలు, చికిత్సలు, ఆపరేషన్‌ల సౌకర్యం కలి్పస్తాం అని మేనిఫెస్టోలో ప్రకటించిన బాబు కల్లబొల్లి మాటలతో ప్రజలను వంచించారు.2007లో వైఎస్సార్‌ హయాంలో 942 వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తే.. చంద్రబాబు ప్రభుత్వం ఎనీ్టఆర్‌ వైద్యసేవగా దానిపేరు మార్చి కేవలం 117 వ్యాధులను మాత్రమే పెంచింది. అయినా వాటికి ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స సరిగా అందని దుస్థితి ఉండేది. ఇలా అనేక బూటకపు హామీలతో 2014లో అధికారంలో వచ్చి చంద్రబాబు చేసిన దగాను ప్రజలు ఇప్పటికీ మరిచిపోలేదు.  మందులూ మక్కీకి మక్కీ కాపీ.. తాము అధికారంలోకి వస్తే బీపీ, షుగర్‌ వంటి నాన్‌ కమ్యూనికబుల్‌ వ్యాధులకు ఉచితంగా జనరిక్‌ మందులు పంపిణీ చేస్తామంటూ చంద్రబాబు మరో హామీ ఇచ్చారు.  వాస్తవానికి రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్, వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమాలను ఇప్పటికే పూర్తి స్థాయిలో అమలు చేస్తోంది. ఈ కార్యక్రమాల్లో భాగంగా బీపీ, షుగర్, ఇతర జబ్బులున్న వారిని గుర్తించారు.బాధితులందరికీ సొంత గ్రామాలు, వార్డుల్లోనే ప్రభుత్వ వైద్యులు క్రమం తప్పకుండా ఫాలోఅప్‌ వైద్య సేవలు అందిస్తున్నారు. ఇక మంచానికి పరిమితం అయిన వారి ఇళ్ల వద్దకే వెళ్లి సేవలు అందజేస్తున్నారు. ఉచితంగా మందులూ అందిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వ వైద్యులే ప్రజల ఇంటి ముంగిటకే వెళ్లి సేవలు వైద్య సేవలు అందిస్తుంటే.. తాము అధికారంలోకి వస్తే మందులు ఉచితంగా ఇస్తామంటూ చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అంటున్నారు. 

Lucknow Super Giants win over Mumbai Indians
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో మంగళవారం (ఏప్రిల్‌ 30) జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ బౌలర్లు అదరగొట్టారు.డూ ఆర్‌ డై లా జరిగిన మ్యాచ్‌లో ముంబై కేవలం నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. లక్నో సూపర్‌ జెయింట్స్‌ బౌలర్లు ముంబైకి చుక్కలు చూపించారు. వరుసగా వికెట్లు పడగొట్టడంతో పాటు పరుగులు కూడా రాకుండా కట్టడి చేశారు. ఫలితంగా ముంబై జట్టుపై నాలుగు వికెట్ల తేడాతో లక్నో సూపర్‌ జెయింట్స్‌ విజయం సాధించింది. దాంతో పాయింట్ల జాబితాలో లక్నో మూడో స్ధానానికి చేరింది. ఇక ప్లే ఆఫ్‌ అవకాశాలు ముంబై జట్టు దాదాపు కోల్పోయింది.స్కోర్లు: ముంబై 144/7, 145/6(19.2 ఓవర్లు)ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్(వికెట్‌కీపర్‌), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్‌), నేహాల్ వధేరా, టిమ్ డేవిడ్, మహ్మద్ నబీ, గెరాల్డ్ కోయెట్జీ, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రాఇంపాక్ట్‌ ప్లేయర్స్‌: నువాన్ తుషార, కుమార్ కార్తికేయ, డెవాల్డ్ బ్రెవిస్, నమన్ ధీర్, షమ్స్ ములానీలక్నో సూపర్ జెయింట్స్: కేఎల్‌ రాహుల్ (కెప్టెన్‌/వికెట్‌కీపర్‌), మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, అష్టన్ టర్నర్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొహ్సిన్ ఖాన్, మయాంక్ యాదవ్ఇంపాక్ట్‌ ప్లేయర్స్‌: అర్షిన్ కులకర్ణి, మణిమారన్ సిద్ధార్థ్, కృష్ణప్ప గౌతం, యుధ్వీర్ సింగ్, ప్రేరక్ మన్కడ్

JDS suspends Prajwal Revanna from party over obscene videos
పార్టీ నుంచి ప్రజ్వల్‌ సస్పెండ్‌

బెంగళూరు: లైంగిక దౌర్జన్యం, వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కారణంగా సిట్టింగ్‌ ఎంపీ ప్రజ్వల్‌ను జేడీఎస్‌ తమ పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. మంగళవారం హుబ్బళిలో జేడీఎస్‌ కోర్‌ కమిటీ భేటీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు హెచ్‌డీ దేవెగౌడకు ప్రజ్వల్‌ సస్పెన్షన్‌పై సిఫార్సుచేసిన కొద్ది సేపటికే పార్టీ ప్రజ్వల్‌ను సస్పెండ్‌చేసింది. ‘‘ మహిళలను ప్రజ్వల్‌ లైంగికంగా వేధిస్తున్నట్లు సంబంధిత వీడియోలు సామాజిక మాధ్యమాల్లో, మీడియాలో         విస్తృతంగా షేర్‌ అవుతున్నాయి. ఆ వీడియోలు పార్టీకి, పార్టీ నాయకత్వానికి చెడ్డపేరు తెస్తున్నాయి. పార్టీ నియమావళి, క్రమశిక్షణా నిబంధనావళిని ఉల్లంఘించిన కారణంగా తక్షణం ఆయన్ను సస్పెండ్‌చేస్తున్నాం’ అని సస్పెన్షన్‌ ఉత్తర్వులో పార్టీ పేర్కొంది. కోర్‌ కమిటీ భేటీలో కర్ణాటక రాష్ట్ర జేడీఎస్‌ చీఫ్‌ హెచ్‌డీ కుమారస్వామి కూడా పాల్గొన్నారు. ‘‘ కేసు దర్యాప్తు కోసం ప్రభుత్వం నియమించిన సిట్‌ నివేదిక, ప్రభుత్వ చర్యలను బట్టి సస్పెన్షన్‌ను పొడిగిస్తామని కుమారస్వామి చెప్పారు. 

Trump held in contempt of court in New York trial for gag order violations
మరోసారి ఉల్లంఘిస్తే జైలు తప్పదు..

న్యూయార్క్‌: హష్‌ మనీ కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్ట్‌ట్రంప్‌కు కోర్టు గట్టి వార్వింగిచ్చింది. తాము ఇచ్చిన గ్యాగ్‌ ఉత్తర్వులను 9 పర్యాయాలు ఉల్లంఘించినందుకు 9 వేల డాలర్ల జరిమానా విధించింది. సాక్షులు, జడ్జీలతోపాటు ఈ కేసుకు సంబంధించి మరికొందరిపై మరోసారి ఇలా  వ్యాఖ్యలు చేస్తే జైలుకు పంపక తప్పదని హెచ్చరించింది. న్యూయార్క్‌ జడ్జి జువాన్‌ ఎం మెర్చన్‌ ఈ మేరకు తీర్పు చదువుతున్న సమయంలో ట్రంప్‌ తలదించుకుని నేల చూపులు చూస్తూ ఉండిపోవడం గమనార్హం. శుక్రవారం కల్లా జరిమానా చెల్లించాలని, ట్రంప్‌ సొంత ‘ట్రూత్‌ సోషల్‌’వేదికపై చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలను తొలగించాలని ఆదేశించారు. గ్యాగ్‌ ఉత్తర్వుపై ట్రంప్‌ మరో ఉల్లంఘన ఆరోపణలపై గురువారం విచారణ జరగనుంది. ఓ∙పోర్న్‌ నటితో బంధం బయటికి పొక్కనివ్వరాదంటూ ఆమెకు మాజీ లాయర్‌  ద్వారా డబ్బులు ముట్టజెప్పిన ఆరోపణలపై కోర్టు విచారణ జరుపుతోంది.

Gold And Silver Prices Hit Record Highs
ధర పెరిగినా బంగారమే

న్యూఢిల్లీ: భారత్‌ కుటుంబాల్లో బంగారానికి ఉన్న ప్రాధాన్యత తెలిసిందే. దీనిని ప్రతిబింబిస్తూ, ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో 2023 ఇదే కాలంతో  పోలి్చతే భారత్‌ పసిడి డిమాండ్‌ 8 శాతం పెరిగి 136.6 టన్నులకు (ఆభరణాలు, పెట్టుబడులు) పెరిగింది. ధర తీవ్రంగా ఉన్నా ఈ స్థాయి డిమాండ్‌ నెలకొనడం గమనార్హం. సమీక్షా కాలంలో త్రైమాసిక సగటు ధర  (దిగుమతి సుంకం, జీఎస్‌టీ మినహా) 10 గ్రాములకు రూ.49,943.80 నుంచి రూ.55,247.20కి ఎగసింది.  ఇక భారత్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ఇదే కాలంలో ఏకంగా 19 టన్నులు కొనుగోలు చేసింది. 2023 క్యాలెండర్‌ ఇయర్‌ మొత్తంలో ఆర్‌బీఐ కొనుగోళ్లు 16 టన్నులే కావడం గమనార్హం. తాజా ‘క్యూ1 2024, గోల్డ్‌ డిమాండ్‌ ట్రెండ్స్‌ నివేదికలో  ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) ఈ అంశాలను తెలిపింది.ప్రపంచ వ్యాప్తంగా 3 శాతం అప్‌ మార్చి త్రైమాసికంలో ప్రపంచ పసిడి డిమాండ్‌ 3% పెరిగి 1,238 టన్నులకు చేరింది. 2016 తర్వాత ఈ స్థాయి డిమాండ్‌ పటిష్టత ఇదే తొలిసారి. సగటు త్రైమాసిక ధర ఔన్స్‌కు (31.1 గ్రాములు) 2,070 డాలర్లు. వార్షికంగా ఈ రేటు 10% అధికమైతే, త్రైమాసికంగా  5 % ఎక్కువ. సెంట్రల్‌ బ్యాంకులు తమ హోల్డింగ్స్‌ను ఈ కాలంలో 290 టన్నులు పెంచుకున్నాయి.  ∗ మార్చి త్రైమాసికంలో భారత్‌ పసిడి డిమాండ్‌ విలువ రూపాయల్లో వార్షిక ప్రాతిపదికన 20 శాతం పెరిగి రూ.75,470 కోట్లకు చేరింది.∗సమీక్షా కాలం మొత్తం పసిడి డిమాండ్‌లో ఆభరణాల డిమాండ్‌ 4 శాతం పెరిగి 95.5 టన్నులకు చేరగా, పెట్టుబడుల (కడ్డీలు, నాణేల వంటివి) విలువ 19 శాతం పెరిగి 41.1 టన్నులుగా నమోదైంది.∗ విలువల్లో చూస్తే ఆభరణాలకు డిమాండ్‌ 15% పెరిగి రూ.52,750 కోట్లకు చేరింది. పెట్టుబడుల్లో  విలువ 32% పెరిగి రూ.22,720కి ఎగసింది. ∗ మార్చి త్రైమాసికంలో పసిడి దిగుమతులు 25 % పెరిగి 179.4 టన్నులుగా నమోదయ్యాయి.  ∗గోల్డ్‌ రీసైక్లింగ్‌ విలువ 10% పెరిగి 38.3 టన్నులుగా నమోదైంది.∗2024లో 700 నుంచి 800 టన్నుల కొనుగోళ్లు జరుగుతాయన్నది అంచనా. 

BJP vs Congress party in Haryana
కూటముల కురుక్షేత్రం

కురుక్షేత్ర యుద్ధాన్ని తలదన్నే రాజకీయాలకు హరియాణా ఆలవాలం. కుల సమీకరణాలు, పొత్తులు, కూటములు, వేరుకుంపట్లు ఇక్కడ పరిపాటి. జాతీయ పార్టీలతో పాటు ఒకప్పుడు చక్రం తిప్పిన ప్రాంతీయ పార్టీలూ రాజకీయంగా కీలక పాత్ర పోషిస్తున్నాయి.రెండు దశాబ్దాలుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకే లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆధిపత్యం లభిస్తూ వస్తోంది. 2005 నుండి 2014 దాకా కాంగ్రెస్‌ చక్రం తిప్పగా పదేళ్లుగా బీజేపీ పట్టు బిగించింది. గత ఎన్నికల్లో సింగిల్‌గా పోటీ చేసి 10 సీట్లను క్లీన్‌స్వీప్‌ చేసిన కమలనాథులను రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు కలవరపెడుతున్నాయి. గత ఎన్నికల్లో సున్నా చుట్టిన కాంగ్రెస్‌ ఈసారి ఇండియా కూటమి రూపంలో కాషాయ పార్టీని ఢీకొడుతోంది... – సాక్షి, నేషనల్‌ డెస్క్‌ఇండియా కూటమి, ప్రాంతీయ పార్టీలు సై... రైతు సమస్యలు తదితరాలతో రాష్ట్రంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న బీజేపీపై కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమి రెట్టించిన ఉత్సాహంతో పోరాడుతోంది. పొత్తులో భాగంగా 9 సీట్లలో కాంగ్రెస్, ఒకచోట ఆప్‌ పోటీ చేస్తున్నాయి. మాజీ సీఎం భూపిందర్‌ సింగ్‌ హుడా సారథ్యంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో 31 సీట్లతో బలమైన ప్రతిపక్షంగా నిలిచిన కాంగ్రెస్‌ ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని పట్టుదలగా ఉంది.ధరల పెరుగుదల, కార్పొరేట్లతో మోదీ కుమ్మక్కు, విపక్షాలపై వేధింపులు, నిరుద్యోగం తదితరాలను ఇండియా కూటమి ప్రచారా్రస్తాలుగా చేసుకుంది. రైతు ఆందోళనలకు మద్దతుతో పాటు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కు చట్టబద్ధత హామీలను మేనిఫెస్టోలో చేర్చడం కలిసొస్తుందని ఆశపడుతోంది. ఐఎన్‌ఎల్‌డీ, జేజేపీ కూడా ఒంటరిగా పోటీ చేస్తూ జాతీయ పార్టీలకు సవాలు విసురుతున్నాయి.అయితే జేజేపీ హరియాణా రాష్ట్ర చీఫ్‌ నిషాన్‌ సింగ్‌ ఎన్నికల వేళ పార్టీకి గుడ్‌బై చెప్పి షాకిచ్చారు. కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరిన కార్పొరేట్‌ దిగ్గజం నవీన్‌ జిందాల్‌ కురుక్షేత్రలో ఆప్‌ నేత సుశీల్‌ గుప్తాతో తలపడుతున్నారు. అది హాట్‌ సీట్‌గా అందరినీ ఆకర్షిస్తోంది. 2004, 2009ల్లో కాంగ్రెస్‌ తరఫున ఇక్కడ గెలిచిన జిందాల్‌ 2014లో బీజేపీ చేతిలో ఓడారు. 2019లో పోటీకి దూరంగా ఉన్నారు.బీజేపీకి కొత్త కష్టాలు...2014 లోక్‌సభ ఎన్నికల్లో 7 సీట్లు గెలిచిన ఊపులో ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించింది. మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ సీఎం అయ్యారు. 2019లో 10 లోక్‌సభ సీట్లూ నెగ్గినా అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్‌ పుంజుకోవడంతో హంగ్‌ వచ్చింది. అయినా జేజేపీ, స్వతంత్రుల మద్దతుతో బీజేపీ మళ్లీ గద్దెనెక్కింది. జేజేపీ చీఫ్‌ దుష్యంత్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టింది. ప్రభుత్వ వ్యతిరేకతతో బీజేపీకి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి.లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై విభేదాలతో బీజేపీ, జేజేపీ పొత్తుకు తెరపడింది. దాంతో ఖట్టర్, దుష్యంత్‌ రాజీనామా చేశారు. ఎన్నికల ముందు ఓబీసీ వర్గానికి చెందిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయాబ్‌ సింగ్‌ సైనీ సీఎం అయ్యారు. తాజాగా వెల్లువెత్తిన రైతు ఆందోళనలూ బీజేపీకి ప్రతికూలంగా మారొచ్చని భావిస్తున్నారు. మోదీ కరిష్మా, అయోధ్య రామమందిర నిర్మాణం, హిందుత్వ నినాదం తదితరాలనే పార్టీ నమ్ముకుంది.ప్రాంతీయ పార్టీల్లో చీలికలు... ఐఎన్‌ఎల్‌డీ వ్యవస్థాపకుడు, హరియాణా సీఎంగా, ఉప ప్రధానిగా చేసిన చౌదరి దేవీలాల్‌ అనంతరం పార్టీ పగ్గాలు చేపట్టిన కుమారుడు ఓం ప్రకాశ్‌ చౌతాలా నాలుగుసార్లు సీఎం అయ్యారు. ఉద్యోగ నియామకాల కుంభకోణంలో ఆయన, అవినీతి కేసుల్లో పెద్ద కుమారుడు అజయ్‌ సింగ్‌ చౌతాలా జైలుకెళ్లారు. దాంతో రెండో కుమారుడు అభయ్‌ సింగ్‌ చౌతాలా పార్టీ పగ్గాలు చేపట్టారు. అన్నదమ్ముల కుమ్ములాటతో పార్టీ చీలిపోయింది.అజయ్‌ సింగ్‌ కుమారులైన దుష్యంత్‌ చౌతాలా, దిగ్విజయ్‌ చౌతాలాను పార్టీ నుంచి తొలగించారు. దాంతో తండ్రి, సోదరునితో కలిసి దుష్యంత్‌ జననాయక్‌ జనతా పార్టీ (జేజేపీ)ని స్థాపించారు. జేజేపీ గత లోక్‌సభ ఎన్నికల్లో ఆప్‌తో కలిసి పోటీ చేసినా ఒక్క సీటూ దక్కలేదు. అభయ్‌ సారథ్యంలోని ఐఎన్‌ఎల్‌డీ కూడా ప్రభావం చూపలేకపోయింది.2014లో హరియాణా జనహిత్‌ కాంగ్రెస్‌ (హెచ్‌జేసీ–బీఎల్‌) తో పొత్తు పెట్టుకున్న బీజేపీకి పెద్దగా ప్రయోజనం లభించలేదు. బీజేపీ 8 స్థానాల్లో పోటీ చేసి ఏడింటిని దక్కించుకోగా మూడు చోట్ల పోటీ చేసిన హెచ్‌జేసీకి ఒక్క సీటూ దక్కలేదు. హరియాణా లో మూడుసార్లు కాంగ్రెస్‌ ముఖ్యమంత్రిగా పని చేసిన భజన్‌లాల్‌ 2007లో కుమారుడు కుల్దీప్‌ బిష్ణోయ్‌తో కలిసి ఈ పార్టీని స్థాపించారు. 2016లో కాంగ్రెస్‌లో విలీనం చేశారు.పోలింగ్‌ తేదీ: మే 25 సర్వేలు ఏమంటున్నాయి?!బీజేపీ 8, ఇండియా కూటమి 2 సీట్లలో గెలుస్తాయని తాజా ఎన్నికల సర్వేలు అంచనా వేశాయి. సీఎం మార్పు, ప్రభుత్వ వ్యతిరేకత, రైతు ఆందోళనలు, తదితర పరిణామాలు కమలనాథుల జోరుకు కళ్లెం వేస్తాయని మరికొందరు రాజకీయ పండితులు అంటున్నారు.హరియాణా రాజకీయాలు జాతీయ, ప్రాంతీయ పార్టీల ఎత్తుజిత్తుల నడుమ సాగుతున్నాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఏడు సీట్లు గెలిచిన బీజేపీ 2019లో ఒంటరిగా పోటీ చేసి మొత్తం 10 సీట్లూ ఒడిసిపట్టింది. కాంగ్రెస్‌కు ఒక్క సీటూ దక్కలేదు. ప్రాంతీయ పార్టీ ఇండియన్‌ లోక్‌దళ్‌ (ఐఎన్‌ఎల్‌డీ) 2014లో గెలిచిన 2 సీట్లనూ పోగొట్టుకుంది.   

Young people to music streaming platforms
సెల్ఫ్‌–మేడ్‌ మ్యూజిక్‌ స్టార్స్‌

యువ సంగీతాభిమానులకు అచ్చంగా సరిపోయే మాట... మ్యూజిక్‌ మేక్స్‌ ఎవ్రీ థింగ్‌ బెటర్‌. ఇట్టే మరిచిపోయే లక్షణం నుంచి జ్ఞాపకశక్తి పెరగడం వరకు, క్రియేటివిటీని ఎంజాయ్‌ చేయడం నుంచి క్రియేటివ్‌ పవర్‌ పెంచుకోవడం వరకు, జడత్వం నుంచి నిత్యజీవనోత్సాహం వెల్లివిరియడం వరకు, అనామకత్వం నుంచి ప్రపంచం గుర్తించే స్థాయికి ఎదగడం వరకు ఎన్నోరకాలుగా సంగీతం యువతకు బలం అయింది. సంగీత రత్నాలను వెదుకుతూ మ్యూజిక్‌ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌లలోకి అడుగు పెట్టిన యువతరం ఆ ప్లాట్‌ఫామ్‌లలోనే మ్యూజిక్‌ స్టార్‌లుగా మెరవడం ఈ తరంలో కనిపిస్తున్న ప్రత్యేకత.∗ స్పాటిఫైతో ప్రయాణం ప్రారంభించి స్టార్‌గా ఎదిగిన ఆర్టిస్ట్‌లలో జస్లీన్‌ రాయల్‌ ఒకరు. సింగర్, సాంగ్‌ రైటర్, కంపోజర్‌గా మంచి పేరు తెచ్చుకుంది. హిట్‌ బాలీవుడ్‌ ట్రాక్స్‌ కంపోజ్‌ చేసింది. ‘ప్రపంచ ప్రేక్షకులతో కనెక్ట్‌ కావడానికి, శ్రోతల అభిప్రాయాలను తెలుసుకొని అందుకు అనుగుణంగా మ్యూజిక్‌ కంపోజింగ్‌లో మార్పులు చేయడానికి స్పాటిఫై ఉపయోగపడింది’ అంటుంది జస్లీన్‌ రాయల్‌.∗ ఆరు సంవత్సరాల వయసులో పాటల కోసం గొంతు సవరించింది బెంగళూరుకు చెందిన దియా వదిరాజ్‌. రకరకాల మ్యూజిక్‌ జానర్‌లలో టాలెంటెడ్‌ సింగర్‌గా పేరు తెచ్చుకుంది. కోల్‌కతాకు చెందిన రనితా బెనర్జీ అయిదు సంవత్సరాల వయసులో ‘సింగింగ్‌ స్టార్‌’ షోలో పాల్గొంది. ‘స రే గ మ ప’ లిటిల్‌ ఛాంప్స్‌లో ఫస్ట్‌ రన్నర్‌–అప్‌గా నిలిచింది. ‘స్వీట్‌ వాయిస్‌’ రనిత గొంతు నుంచి వచ్చిన ‘జరాసీ ఆహట్‌’ పాట 6.2 మిలియన్‌ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది.∗ మల్టీ టాలెంటెడ్‌ సింగర్‌గా పేరు తెచ్చుకుంది అంకిత కుందు. రియాల్టీ షోలలో పాడడం ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బిహార్‌కు చెందిన మిథాలీ ఠాకూర్‌ ‘రైజింగ్‌ స్టార్‌’ షోతో ఫేమ్‌ అయింది. భోజ్‌పూరి, క్లాసికల్, ఫోక్‌ సాంగ్స్‌ను పాడడంలో మంచి పేరు తెచ్చుకుంది. యూట్యూబ్‌లో ఆమె వీడియోలు మిలియన్‌ల వ్యూస్‌ను సొంతం చేసుకున్నాయి. ఇండియన్‌–అమెరికన్‌ సింగర్, సాంగ్‌ రైటర్‌ లిశా మిశ్రా పాటలను రికార్డ్‌ చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసేది. బాలీవుడ్‌ సినిమాలలో కూడా పాడింది. ఇండియన్‌ ఐడల్‌ జూనియర్‌గా 2015లో సంగీత ప్రపంచానికి పరిచయం అయింది భువనేశ్వర్‌కు చెందిన అనన్య నందా. బాలీవుడ్‌ పాటల్లోనే కాదుక్లాసికల్‌లోనూ మంచి పేరు తెచ్చుకుంది. మెలోడియస్‌ వాయిస్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది.∗ బోస్టన్‌ (యూఎస్‌)లో పుట్టిన అవంతి నగ్రల్‌కు చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఇష్టం. ముంబైకి వచ్చిన తరువాత తన పాషన్‌నే కెరీర్‌గా చేసుకుంది. మ్యూజిక్‌లో రకరకాల జానర్స్‌ను మిక్స్‌ చేయడంలో గట్టి పట్టు సాధించిన అవంతికి యూట్యూబ్‌ చానల్‌ కూడా ఉంది. ఇందులో తన లైవ్‌ పర్‌ఫార్‌మెన్స్‌ వీడియోలను అప్‌లోడ్‌ చేస్తుంది. అవంతికి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.∗ ఆర్‌ అండ్‌ బీ, హిప్‌–హాప్, సోల్, పాప్‌ మ్యూజిక్‌లలో బహుముఖ ప్రజ్ఞ చాటుకుంటోంది ఇలీన హ్యాట్స్‌. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చింది. ముంబైకి చెందిన సాచి రాజాధ్యక్ష ఆల్ట్‌–పాప్‌ మ్యూజిక్‌లో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది. ఆమె పవర్‌ఫుల్, సోల్‌ వాయిస్‌కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు.∗ దియ నుంచి అవంతి వరకు ఎందరో, ఎందరెందరో యంగ్‌ మ్యూజిషియన్స్‌ సంగీతం పట్ల అంకితభావంతో సెల్ఫ్‌–మేడ్‌ సూపర్‌స్టార్‌లుగా ఎదిగారు. ఎంతోమంది ఔత్సాహికులకు రోల్‌ మోడల్స్‌గా మారారు. 

తప్పక చదవండి

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement