Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

KSR Comment On AP Elections After Poling
వైఎస్సార్‌సీపీలో ఉన్నంత కాన్ఫిడెన్స్‌.. కూటమిలో లేదు!

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఘట్టం ముగియడంతో సర్వత్రా ఎవరు గెలుస్తారన్నదే చర్చగా సాగుతోంది. ఈ ఎన్నికలు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్రంగా జరిగిన ఎన్నికలు కావడంతో అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఎన్నికలలో జగన్ విజయం సాధిస్తే అది దేశానికి ఒక మోడల్ అవుతుంది.జగన్ తీసుకువచ్చిన పలు వ్యవస్థలను దేశ వ్యాప్తంగా అమలు చేయడానికి వివిధ రాష్ట్రాలు ముందుకు వస్తాయి.జగన్‌ను ఒంటరిగా ఓడించలేమన్న నిశ్చితాభిప్రాయానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కాళ్లావేళ్ల పడి జనసేన, బీజేపీలతో పొత్తు పెట్టుకుంది. అయినా ఎంతవరకు ప్రయోజనం కలిగిందన్నది ప్రశ్నార్దకమే. మూడు పార్టీల కూటమి కావడంతో బలం పెరిగిందని,తెలుగుదేశం పార్టీ నౌ ఆర్ నెవర్ అన్న చందంగా పని చేసిందని, ఆ పార్టీకి జీవన్మరణ సమస్య కావడంతో ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థలు తమను తాము భ్రష్టు పట్టించుకుంటూ కూడా అబద్దాలు ప్రచారం చేశాయని, వాటన్నిటి పలితంగా గెలిచే అవకాశం లేకపోలేదన్నది ఆ పార్టీవారి భావనగా ఉంది.అయినా వైఎస్సార్‌సీపీలో కాన్ఫిడెన్స్ తెలుగుదేశం కూటమిలో కనిపించడం లేదన్నది సత్యం.. నిజంగానే టీడీపీ కూటమి గెలుస్తుందన్న నమ్మకం కలిగి ఉంటే ,ఈనాడు, ఆంధ్రజ్యోతిలు అదే తరహాలో కూటమి గెలుపు ఖాయం అన్న శీర్షిక బ్యానర్‌ ఇచ్చేవని, అలా చేయకపోవడం కూడా టీడీపీ ఓటమికి ఒక సంకేతం అన్న విశ్లేషణ వస్తోంది.నిజానికి ఈనాడుకు ఉన్న నెట్ వర్క్ రీత్యా, సోమవారం సాయంత్రానికి జనాభిప్రాయ సేకరణ పూర్తి చేసి వాస్తవ పరిస్థితిని ఇచ్చి ఉండవచ్చు. అలా చేయలేదంటే వారికి కూటమి విజయంపై సందేహం కలిగి ఉండవచ్చని కొందరు అంటున్నారు. ఒకవేళ మంగళవారం ఏమైనా ఇస్తారేమో తెలియదు. కాని కేవలం టీడీపీ వర్గాల ధీమా పేరుతోనే కథనాలు ఇచ్చారు. వైఎస్ జగన్ ప్రభుత్వ పనితీరుకు ఒక రిఫరెండంగా పరిగణించే ఈ ఎన్నికలలో మహిళలు ,వివిధ సంక్షేమ పధకాల లబ్దిదారులు పెద్ద ఎత్తున తరలిరావడంతో వైఎస్సార్‌సీపీ గెలుపు ఖాయమన్నది ఆయా వర్గాలలో వినిపిస్తున్నమాట.ఓవరాల్‌గా చూసినప్పుడు అత్యధికులు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వస్తుందనే విశ్వసిస్తున్నారు. దీనికి కొన్ని కారణాలు బలీయంగా కనిపిస్తున్నాయి. అవేమిటో చూద్దాం. టీడీపీ కూటమిలో భాగస్వాములుగా ఉన్న బీజేపీ, జనసేనలు కలిసి 31 నియో.జకవర్గాలలో పోటీచేశాయి. వారికి ఉన్న బలాబలాల రీత్యా, టీడీపీ నుంచి వచ్చే ఓట్ల బదలాయింపు వంటి అంశాల కారణంగా ఈ రెండు పార్టీలు కలిసి ఐదు నుంచి పది సీట్లు మాత్రమే గెలవవచ్చన్నది ఒక అంచనా. ఈ లెక్కన వైఎస్సార్‌సీపీ ఇరవై సీట్లను సునాయాసంగా గెలుచుకునే అవకాశం ఉంది. రాయలసీమ ప్రాంతంలో వైఎస్సార్‌సీపీ తిరుగులేని ఆధిక్యత ఉంది.గత ఎన్నికలలో సైతం 52 సీట్లకు గాను నలభై తొమ్మిదింటిని వైఎస్సార్‌సీపీ గెలుచుకుంది. 2024 ఎన్నికలలో సైతం వైఎస్సార్‌సీపీ వేవ్ రాయలసీమ అంతటా ఉంది. అయినప్పటికీ కొన్ని సీట్లు తగ్గుతాయని అనుకున్నా, మినిమమ్ ముప్పై ఐదు నుంచి నలభై సీట్లు రావచ్చని అంతా అంగీకరిస్తున్నారు. అంటే ఇప్పటికి ఏభై సీట్లు వైఎస్సార్‌సీపీ గెలుచుకున్నట్లు లెక్క అవుతుంది. ఉత్తరాంధ్రలో వైఎస్సార్‌సీపీ బలం బాగా ఉంది.అక్కడ ఉన్న ముప్పై నాలుగు సీట్లలో కనీసం పదిహేడు నుంచి ఇరవై సీట్లు వైఎస్సార్‌సీపీ గెలుచుకోవచ్చు. అదే జరిగితే ఇక్కడికి డెబ్బై సీట్లు గెలిచినట్లు అవుతుంది. ఇక ఇరవై సీట్లు తెచ్చుకుంటే వైఎస్సార్‌సీపీ గెలిచినట్లే అవుతుంది.టీడీపీ పొత్తు పెట్టుకున్న కారణంగా ముస్లిం మైనార్టీలు కూటమికి దూరం అయ్యారు. వారు కనీసం నలభై నుంచి ఏభై నియోజకవర్గాలలో ప్రభావం చూపవచ్చు. ముస్లింలకు రిజర్వేషన్లు ఎత్తివేస్తామని బీజేపీ చేసిన ప్రకటన కూడా ముస్లింలలో ఆగ్రహానికి కారణం అయింది. ఈ నేపధ్యంలో రాయలసీమలో అధిక శాతం ఉన్న ముస్లింలు వైఎస్సార్‌సీపీవైపు మొగ్గు చూపుతున్నారు. కోస్తా ఆంధ్రలో సైతం అదే పరిస్తితి ఉంది. నెల్లూరు నుంచి తూర్పుగోదావరి జిల్లా వరకు ఉన్న ఆరు జిల్లాలలో నలభై సీట్లు రావడం కష్టం కాదు. అంటే ఈ లెక్కన కనీసం 110 సీట్లు వైఎస్సార్‌సీపీకి రావడం ,తిరిగి జగన్ ముఖ్యమంత్రి కావడం తధ్యం అనిపిస్తుంది. 2014లో ఉన్న కూటమి పరిస్థితులు ఇప్పుడు లేవు. అప్పుడు నరేంద్ర మోదీ హవా బాగా పనిచేసింది.అలాగే అప్పుడే పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీని పెట్టడం, కాపు వర్గాన్ని బాగా ఆకర్షించడం కారణంగా టీడీపీ అధికారంలోకి రాగలిగింది.ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈ మూడు పార్టీలు 2019 ఎన్నికల సమయంలో ఒకదానిని ఒకటి తిట్టుకున్నాయి. విమర్శించుకున్నాయి. బీజేపీతో పొత్తు కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని తమ అవసరాలకు వాడుకోవడం, ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేయడం కోసమేనన్న సంగతి అందరికి అర్దం అయింది. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలు దాదాపు నెరవేర్చడం , ఆయన ఒంటరిగా ధైర్యంగా ఎన్నికల గోదాలోకి దిగడం, ఒక సిస్టమాటిక్ గా సభలు నిర్వహించడం , ఆచరణ సాధ్యమైన హామీలనే ఇవ్వడం వంటి కారణాల వల్ల ప్రజలలో ఆయన పట్ల ఒక నమ్మకం కుదిరింది. ప్రత్యేకించి పేద, బలహీనవర్గాలలో అది బాగా ప్రస్పుటంగా కనిపించింది. సామాజికంగా కూడా జగన్ పలు ప్రయోగాలు చేసి బిసిలకు ఎక్కువ సీట్లు ఇవ్వగలిగారు.అది కూడా ప్లస్ పాయింట్ గా ఉంది. జగన్ ఎక్కువగా పాజిటివ్ ఓటుపై ఆధారపడితే విపక్ష కూటమి నెగిటివ్ ఓటుపైనే ఆధారపడింది. వారి మానిఫెస్టోని ఎవరూ విశ్వసించడం లేదు. తెలుగుదేశం కు ఓటు వేయాలని అనుకున్నవారు సైతం ఆ ఎన్నికల ప్రణాళిక అయ్యేది కాదని తెలిసినా, ఇతర కారణాల రీత్యానే ఓట్లు వేశారు.గతంలో జగన్ ఈ స్కీములను అమలు చేస్తుంటే శ్రీలంక అయిపోయిందని ప్రచారం చేసిన చంద్రబాబు తన మానిఫెస్టోలో అంతకు మించి రెండు,మూడు రెట్లు సంక్షేమ పధకాలు అమలు చేస్తామని అనడంతో జగన్ గ్రాఫ్ బాగా పెరిగింది. అబద్దాల ప్రచారాన్ని నమ్ముకుని టీడీపీ పనిచేసింది. లేని లాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల భూములను జగన్ లాక్కుంటారంటూ తప్పుడు ప్రచారం చేశారు. అసెంబ్లీలో టీడీపీ మద్దతు ఇచ్చిన బిల్లునే మాటమార్చి వ్యతిరేకిస్తోందని చెప్పడంలో వైఎస్సార్‌సీపీ చాలా వరకు సఫలం అయింది.అది కూడా టీడీపీకి నష్టం చేసిందని చెప్పవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, రెడ్లు, అగ్రవర్ణాలలోని అధికశాతం పేదలు జగన్‌కు మద్దతు ఇస్తున్నారు. ఆ ప్రభావం పోలింగ్ పై స్పష్టంగా కనబడింది. ఈకాంబినేషన్ అలాగే కొనసాగితే జగన్ ను ఓడించడం అసాద్యం. 2019 లో ఇవే సామాజికవర్గాలు జగన్ కు భారీ ఎత్తున మద్దతు ఇచ్చాయి. అవి ఇప్పటికీ అలాగే కొనసాగుతుండడం జగన్‌కు కలిసి వచ్చే పాయింట్. తమ కోసం లక్షల మంది కార్లు వేసుకుని హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి వచ్చారని టీడీపీ వాదిస్తోంది. కార్లలో వెళ్లినవారు పెత్తందార్లకు ప్రతినిధులుగా ఉంటే, బస్‌లు, ట్రైన్లలో వెళ్లినవారు పేద ప్రజలకు ప్రతినిదులగా చెప్పవచ్చు. ఆ రకంగా చూసుకున్నా, ఇలా వెళ్లినవారిలో వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులే ఎక్కువగా కనిపిస్తారు. సామాజికవర్గాల సమీకరణ రీత్యా చూసినా, ప్రాంతాల వారీగా పరిశీలించినా, రాజకీయ కోణాలలో అద్యయనం చేసినా, ఏపీలో మళ్లీ వచ్చేది వైఎస్సార్‌సీపీ కూటమి ప్రభుత్వమేనన్న అభిప్రాయం కలుగుతుంది. పోటీ బాగా టైట్‌గా సాగితే వైఎస్సార్‌సీపీకి కనీసం 100 నుంచి 110 సీట్లు వస్తాయి.అది వేవ్‌గా మారితే వైఎస్సార్‌సీపీ గత ఎన్నికల మాదిరి 150 వరకు రావడం కష్టం కాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

CM YS Jagan Tweet On AP Election Polling
ఏపీ పోలింగ్‌పై సీఎం జగన్‌ ట్వీట్‌

సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ఘట్టం ముగిసింది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా ఏపీలో ఈసారి రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి అత్యధికంగా 80 శాతానికిపైగా పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది.తాజాగా ఏపీలో నమోదైన పోలింగ్‌, ఓటర్లను ఉద్ధేశిస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ట్వీట్‌ చేశారు. మండుటెండల్లోనూ తనకు ఓటువేసి ఆశీర్వదించేందుకు సునామీల తరలివచ్చిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. వైఎస్సార్‌సీపీ గెలుపుకోసం చెమటోడ్చి శ్రమించిన కార్యకర్తలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటి వరకు సాగిన పాలన మరింత మెరుగ్గా కొనసాగుతుందని హామీ ఇచ్చారు.నిన్న జరిగిన ఎన్నికల్లో మండుటెండలు సైతం లెక్కచేయకుండా నాకు ఆశీస్సులు ఇవ్వడానికి సునామీలా తరలివచ్చిన నా అవ్వతాతలకు, నా అక్కచెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, నా రైతన్నలకు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలకు, నా యువతీయువకులందరికీ పేరుపేరునా శిరస్సు వంచి కృతజ్ఞతలు… pic.twitter.com/RQcsHZqWEO— YS Jagan Mohan Reddy (@ysjagan) May 14, 2024

IPL 2024, DC vs LSG: Lucknow Super Giants Win Toss, Opt To Bowl
ఢిల్లీతో ల‌క్నో డూర్ ఆర్ డై మ్యాచ్‌.. తుది జ‌ట్లు ఇవే

ఐపీఎల్‌-2024లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కీల‌క పోరుకు సిద్ద‌మైంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా ల‌క్నో, ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌ల‌ప‌డ‌తున్నాయి.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ల‌క్నో తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇరు జ‌ట్లు ప‌లు మార్పుల‌తో ఈ మ్యాచ్‌లో బ‌రిలోకి దిగాయి. గ‌త మ్యాచ్‌కు దూర‌మైన ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్ రిష‌బ్ పంత్ తిరిగి రీఎంట్రీ ఇచ్చాడు. ల‌క్నో జ‌ట్టులోకి పేస‌ర్లు అర్ష‌ద్ ఖాన్‌, యుద్ద‌వీర్‌, మోహ్షిన్ ఖాన్ వ‌చ్చారు. కాగా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌కు ఈ మ్యాచ్ చాలా కీల‌కం. ప్లే ఆఫ్ రేసులో ఉండాలంటే ఈ మ్యాచ్‌లో ల‌క్నో క‌చ్చితంగా విజ‌యం సాధించాలి. మ‌రోవైపు ఢిల్లీ త‌మ చివ‌రి లీగ్ మ్యాచ్‌లో స‌త్తాచాటాల‌ని భావిస్తోంది. కాగా ఈ మ్యాచ్‌లో ఢిల్లీ గెలిచిన ప్లే ఆఫ్స్ చేరాలంటే అద్భుతాలు జ‌ర‌గాలి.తుది జ‌ట్లుఢిల్లీ క్యాపిటల్స్ : అభిషేక్ పోరెల్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, షాయ్ హోప్, రిషబ్ పంత్(కెప్టెన్‌/ వికెట్ కీప‌ర్‌), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, గుల్బాదిన్ నాయబ్, రసిఖ్ దార్ సలామ్, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్లక్నో సూపర్ జెయింట్స్ : కేఎల్‌ రాహుల్ (వికెట్ కీప‌ర్‌/ కెప్టెన్‌), క్వింటన్ డి కాక్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా, యుధ్వీర్ సింగ్ చరక్, అర్షద్ ఖాన్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొహ్సిన్ ఖాన్

Stone Pelting On Ysrcp Leaders In Tadipatri Constituency
తాడిపత్రిలో ఉద్రిక్తత.. వైఎస్‌ఆర్‌సీపీ నేతలపై రాళ్ల దాడి

తాడిపత్రి,సాక్షి: ఏపీలో సాధారణ ఎన్నికల పోలింగ్‌ ముగిసినా అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. మంగళవారం(మే14) తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వైఎస్సార్‌సీపీ నేతలపై టీడీపీ నేతలు దాడికి యత్నించారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై టీడీపీ నేతలు రాళ్లదాడికి ప్రయత్నించారు. దీంతో వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఇరు పార్టీల నేతలు పరస్పరం రాళ్లదాడికి దిగగా ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి భాష్పవాయువు గోళాలు ప్రయోగించారు. రాళ్ల దాడిలో సీఐ మురళీకృష్ణకు తీవ్ర గాయలవగా ఆస్పత్రికి తరలించారు.

No reserve day for second semifinal, playing conditions announced
టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ 2024.. ఐసీసీ కీల‌క నిర్ణ‌యం!? అలా అయితే క‌ష్ట‌మే

ఐపీఎల్‌-2024 ముగిసిన వారం రోజుల‌కే మ‌రో క్రికెట్ మ‌హాసంగ్రామానికి తెర‌లేవ‌నుంది. జూన్ 1 నంచి అమెరికా, వెస్టిండీస్‌ల వేదిక‌గా టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024 ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డ‌ల్లాస్ వేదిక‌గా అమెరికా, కెన‌డా జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి.అయితే ఈ మెగా ఈవెంట్‌కు స‌బంధించి ఓ ఆస‌క్తికర‌ వార్త తెర‌పైకి వ‌చ్చింది. ఈ మెగా టోర్నీలో సెకెండ్ సెమీఫైన‌ల్‌కు రిజర్వ్ డే ఉండదని ప్ర‌ముఖ క్రికెట్ వెబ్‌సైట్‌ క్రిక్‌బజ్ త‌మ రిపోర్ట్‌లో పేర్కొంది. సాధ‌ర‌ణంగా ఐసీసీ ఈవెంట్‌ల‌లో నాకౌట్ గేమ్‌లకు రిజర్వ్ డే క‌చ్చితంగా ఉంటుంది. కానీ ఈ ఏడాది టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ షెడ్యూల్ ప్ర‌కారం.. రెండో సెమీఫైన‌ల్‌కు, ఫైన‌ల్ పోరుకు మ‌ధ్య కేవ‌లం ఒక రోజు మాత్రమే గ్యాప్ ఉంది. ఈ క్ర‌మంలోనే ఐసీసీ సెకెండ్ సెమీఫైన‌ల్‌కు రిజ‌ర్వ్‌డేను కెటాయించ‌లేద‌ని క్రిక్‌బజ్ తెలిపింది. అయితే రిజ‌ర్వ్ డే బ‌ద‌లుగా 250 నిమిషాల అదనపు సమయాన్ని ఐసీసీ, వెండీస్ క్రికెట్ బోర్డులు కెటాయించిన‌ట్లు తెలుస్తోంది. గ‌యానా వేదిక‌గా రెండో సెమీఫైన‌ల్ జ‌ర‌గ‌నుంది. ఒక‌వేళ ఈ మ్యాచ్‌కు వ‌ర్షం అంత‌రాయం క‌లిగించే నిర్ణీత స‌మ‌యంలో మ్యాచ్ ఫినిష్ కాక‌పోతే.. మ‌రో నాలుగు గంట‌ల స‌మ‌యాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటారు. అంటే అంపైర్‌లు మ్యాచ్‌ను ముగించడానికి దాదాపు ఎనిమిది గంటల స‌మ‌యం ఉంటుంది.

Anchor Rashmi Gautam Responds On Netizens Question On Her Tweet
ఎందుకలా వదిలేశారు?.. మీ బాధ్యత కాదా?.. రష్మి ట్వీట్‌ వైరల్

ప్రముఖ టీవీ యాంకర్, నటి రష్మి గౌతమ్‌ చేసిన ట్వీట్‌ వివాదానికి దారితీసింది. ఇటీవల తాండూరులో చిన్నారిపై పెంపుడు కుక్క దాడి చేసిన ఘటనపై ఆమె ట్వీట్ చేసింది. పెంపుడు కుక్క దాడిలో ఐదు నెలల చిన్నారి మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆ కుక్కను చిన్నారి తల్లిదండ్రులు కొట్టిచంపారు. అయితే పేరేంట్స్‌ తీరును రష్మిక తప్పుపట్టింది. చిన్నపిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా, బాధ్యతగా వ్యవహరించాలని సూచించింది. అయితే దీనిపై ఓ నెటిజన్ స్పందించారు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులపై కేసు పెట్టాలని రష్మిక చెబుతోంది అంటూ కామెంట్ చేశాడు. దీనికి రష్మిక సైతం బదులిచ్చింది.రష్మిక తన ట్వీట్‌లో రాస్తూ..' ఆ చిన్నారిని ఎందుకలా ఒంటరిగా వదిలేశారు. కుక్క దాడి చేస్తుంటే తల్లిదండ్రులు నిద్ర పోతున్నారా? కనీసం ఆ చిన్నారి ఏడుపు కూడా వినిపించలేదా? జంతువులపై ఇలాంటి ప్రచారాన్ని ఆపండి. తెలివి తక్కువగా వ్యవహరించే తల్లిదండ్రులకు సంబంధించి వెయ్యి వీడియోలను షేర్‌ చేయగలను. అసలు పిల్లల జీవితాలను రిస్క్‌లో పెట్టింది ఎవరు? జంతువుల విషయానికొస్తే అన్నీ లాజిక్స్‌ మర్చిపోతారు. ఈ ప్రపంచాన్ని ఇబ్బందులకు గురి చేసి.. మీరు మాత్రం ప్రశాంతతను పొందాలనుకుంటే అది జరిగే పని కాదని' రిప్లై ఇచ్చింది.అయితే దీనిపై మరో నెటిజన్‌ స్పందిస్తూ..' మీకు బుర్ర లేదని అర్థమైందండి.. ఈ మాట అంటున్నందుకు సారీ' అని రాసుకొచ్చాడు. దీనికి రష్మిక బదులిస్తూ..'మీకు బుర్ర ఉంది కదా.. పిల్లలను కనడం మాత్రమే కాదు. వాళ్లను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీపైనే ఉంది. దయచేసి పెంపుడు జంతువులు ఉన్నవాళ్లు పిల్లలను అలా వదిలేయకండి' అని సూచించింది. తల్లిదండ్రులు ఇలాంటి చిన్నచిన్న తప్పులు చేయకుండా ఉండాలని రష్మి హితవు పలికింది. అలాగే బయట వ్యక్తులపై దాడి చేయకుండా పెంపుడు జంతులకు యజమానులే తగిన శిక్షణ ఇవ్వాలని.. దాడి జరిగితే ఆ పెంపుడు జంతువు యజమానిపైనా కేసు పెట్టాలని రష్మి అన్నారు.I would have preferred responsible parents https://t.co/bgm2C3JRbJ— rashmi gautam (@rashmigautam27) May 14, 2024 The article is about a toddler And yes in this day and age of child rapes and molesters Yes the child shud be 24* 7 monitored The chances of your child getting molested by a human is higher than getting bitten by an animal https://t.co/e0Qq8TK4m1— rashmi gautam (@rashmigautam27) May 14, 2024

Going To Be Biggest Loser About Vivek Wadhwa On Elon Musk
త్వరలో మస్క్‌కు ముప్పు.. భారత్‌ సంతతి సీఈవో సంచలన వ్యాఖ్యలు

టెస్లా సీఈవో ఎలోన్‌ మస్క్‌ త‍్వరలో భారీ నష్టాల్ని చవిచూడనున్నారంటూ భారత సంతతి ఆంత్రప్రెన్యూర్‌ వివేక్ వాధ్వా హెచ్చరించారు. ఇటీవల టెస్లా ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ భారత్‌లో కాదని చైనాతో సంత్సంబంధాలు నెరపడంపై ఎక్స్‌ వేదికగా వివేక్‌ వాధ్వా మస్క్‌ను ప్రశ్నించారు.తన ఈవీ కార్యకలాపాల కోసం భారత్‌ను కాదని చైనాని ఎంచుకోవడం మస్క్ భారీ మొత్తంలో నష్టపోనున్నారని వివేక్‌ వాధ్వా అన్నారు. చైనాలో ప్రమాదం అంచున వ్యాపారాలపై మస్క్‌కు మెయిల్‌ చేసినట్లు వెల్లడించారు. చైనా మస్క్‌ను గుడ్డిగా దోచుకుంటుందని నేను అతనిని ముందే హెచ్చరించాను. కార్ల తయారీని చైనా నుంచి భారత్‌కు తరలించాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా సెంటర్ ఫర్ రష్యా యూరప్ ఆసియా స్టడీస్ డైరెక్టర్ థెరిసా ఫాలన్ పోస్ట్‌ను వివేక్‌ వాధ్వా ఉటంకించారు. థెరిసా ఫాలన్‌ తన పోస్ట్‌లో అమెరికా, యూరోపియన్ ఆటోమేకర్స్ చైనాలో ఎందుకు విఫలమవుతున్నారు. స్వల్ప కాలిక లాభాల కోసం టెక్, మేనేజ్‌మెంట్ టెక్నిక్‌ అంశాల్ని అక్కడ అమలు చేయడం ద్వారా చైనా ఎలాంటి ప్రయోజనాల్ని పొందుతుందని నివేదించారు. వాటి ద్వారా కార్ల తయారీ సంస్థలు ఎలా నష్టపోతున్నారని వివరించారు. ఆ అంశాన్ని ప్రధానంగా చర్చించిన వాధ్వా మస్క్‌ గురించి పై విధంగా వ్యాఖ్యానించారు.

What Ramdev Has Done For Yoga Is Good, But: Supreme Court
యోగా విషయంలో రాందేవ్‌ కృషి మంచిదే కానీ: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: యోగా విషయంలో బాబా రాందేవ్‌ చేస్తున్న కృషి మంచిదే కానీ.. ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేయడం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. పతంజలి ఆయుర్వేద సంస్థ, బాబా రాందేవ్‌, ఆచార్య బాలకృష్ణలపై నమోదైన తప్పుడు ప్రకటనల కేసుకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. యోగా గురువు బాబా రామ్‌దేవ్ ప్రభావం అధికంగా ఉందని. దానిని సరైన మార్గంలో ఉపయోగించాలని బెంచ్ సూచించింది. సుప్రీంకోర్టు జస్టిస్‌లు కోహ్లి, అహ్సానుద్దీన్ అమానుల్లాలతో కూడిన ద్విసభ ధర్మాసనం పేర్కొంది. పతంజలి తరపున సీనియర్‌ న్యాయవాది బల్బీర్‌ సింగ్‌ వాదిస్తూ.. తమ ప్రకటనలు ఇంకా ప్రచురిస్తున్న టీవీ ఛానెల్‌లకు పతంజలి లేఖలు రాసిందని, సందేహాస్పద ఉత్పత్తుల అమ్మకాలను పంజలి నిలిపివేసిందని కోర్టు చెప్పారు. రామ్‌దేవ్ యోగా కోసం చాలా చేశాడని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ప్రస్తావించగా.. యోగా కోసం ఆయన ఏం చేశారన్నది మంచిదే కానీ పతంజలి ఉత్పత్తుల విషయం భిన్నమైందని జస్టిస్ హిమ కోహ్లీ తెలిపారు. అలాగే బాబా రామ్‌దేవ్‌, ఆచార్య బాలకృష్ణలకు వ్యక్తిగత హాజరు నుంచి సర్వోన్నత న్యాయస్థానం మినహాయింపును ఇచ్చింది.అనంతరం మూడు వారాల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలని పతంజలిని కోరింది. అఫిడవిట్‌లో తప్పుదోవ పట్టించే ప్రకటనలను వెనక్కి తీసుకోవడానికి పతంజలి ఎలాంటి చర్యలు తీసుకుంది, ఉత్పత్తుల స్టాక్స్‌ గురించి సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. రామ్‌దేవ్, బాలకృష్ణలపై కోర్టు ధిక్కరణ కేసుపై ఉత్తర్వులను రిజర్వ్‌లో ఉంచింది. దీనిపై తదుపరి విచారణ జూలై 9న చేపడతామని పేర్కొంది.

 Anant Ambani Radhika Merchant Second Pre Wedding bash 800 Guests To Join
అనంత్‌ - రాధిక ప్రీవెడ్డింగ్‌ బాష్‌ : 800 మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?

ఆసియా కుబేరుడు రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ, నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ తన లేడీ లవ్‌ రాధిక మర్చంట్‌ మెడలో మూడు ముళ్లు వేసేందుకు సన్నద్ధమవున్నాడు. వచ్చే నెల (జూలై 12న) అనంత్‌-రాధిక వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించేందుకు అంబానీ సిద్ధమ వుతున్నారు. ఈ క్రమంలో మార్చి మూడవ తేదీవరకు జామ్‌నగర్‌లో గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ వేడుకుల సందడి ఇంకా ముగియకముందే రెండో ప్రీ వెడ్డింగ్‌ వేడుకకు సన్నద్ధమవుతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ నెల 28 నుంచి 30 మధ్య దక్షిణ ఫ్రాన్స్‌లో క్రూయిజ్‌ షిప్‌లో రెండో ప్రీ-వెడ్డింగ్ వేడుక జరగనుంది. క్రూయిజ్ ఇటలీ నుండి బయలుదేరి 2365 నాటికల్ మైళ్ల (4380 కి.మీ) దూరం ప్రయాణించి దక్షిణ ఫ్రాన్స్‌లోని గమ్యస్థానానికి చేరుకుంటుందని కూడా పేర్కొంది. ఈ వేడుక కేవలం పెళ్లి చేసుకోబోయే అనంత్‌-రాధికకు మాత్రమేకాదు అతిథులందరికీ కూడా అద్భుతమైన అనుభవంగా మిగలేలా సర్వ హంగులతో ఏర్పాట్లు చేస్తున్నాయిట ఇరు కుటుంబాలు. అతిధులు ఈ వేడుకలో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి స్టార్‌ సెలబ్రిటీలతో సహా మొత్తం 800 మంది అతిథులు హాజరుకానున్నారు. రముఖ్యంగా అనంత్‌ సోదరుడు ఆకాష్ అంబానీ శ్లోకా మెహతా జంటతో సన్నిహితంగా ఉంటే బాలీవుడ్‌ జంట రణబీర్ కపూర్ అలియా భట్ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలవబోతున్నారు. క్రూయిజ్ షిప్‌లో మొత్తం 600 మంది సిబ్బంది అతిథుల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారట. కాగా 2017లో డ్రైవ్‌లో పరస్పర స్నేహితుల ద్వారా పరిచయమైన వీరిద్దరూ లవ్‌బర్డ్స్‌గా మారిపోయారు. కొన్నాళ్ల డేటింగ్‌ తరువాత 2023లో రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారాలోని శ్రీనాథ్‌జీ టెంపుల్‌లో రాధికకు పెళ్లికి ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత ఆంటిలియాలో నిశ్చితార్థం వేడుక, 2024లో జామ్‌నగర్‌లో మూడు రోజుల పాటు ప్రీవెడ్డింగ్‌ హస్తాక్షర్ వేడుకను నిర్వహించిన సంగతి తెలిసిందే.

తనిష్క్ జ్యువెలరీ నెక్లెస్‌
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్

ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన, భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్‌ల నుండి ప్రేరణ పొంది అద్భుతమైన మరియు వైవిధ్యమైన శ్రేణి సమకాలీన, రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్‌లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్‌లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్‌లు, కస్టమర్‌లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా, ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్‌ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్‌ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్, ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్‌లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్‌గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్‌లెట్‌లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్‌లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్‌లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్‌డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్‌లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్ 18కేరట్ మరియు 22కేరట్ బంగారంలో విస్తృతమైన శ్రేణి డిజైన్‌లతో, నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని సంపూర్ణం చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్‌లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్‌లెట్‌లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.

తప్పక చదవండి

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement