Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

YS Jagan Mohan Reddy Comments After Election Results
పేదల గొంతుకై నిలుస్తాం: వైఎస్‌ జగన్‌

ఏం జరిగిందో తెలియదు కానీ, ఏం చేసినా, ఎంత చేసినా ఇంకా 40 శాతం ఓటు బ్యాంకు మాత్రం తగ్గించలేకపోయారు. కచ్చితంగా గుండె ధైర్యంతో నిలబడి మళ్లీ ఇక్కడి నుంచి లేస్తాం. ప్రతిపక్షంలో ఉండటం కొత్తకాదు. పోరాటాలు చేయడం అంతకన్నా కొత్తకాదు. ఈ ఐదు సంవత్సరాలు తప్ప నా రాజకీయ జీవితమంతా ప్రతిపక్షంలోనే గడిపాను. రాజకీయ జీవితంలో ఎవ్వరూ చూడని కష్టాలు అనుభవించాను. ఇప్పుడు అంతకన్నా కష్టాలు పెట్టినా కూడా సిద్ధంగా ఉన్నాం. ఎదుర్కొంటాం. ప్రభుత్వంలోకి వచ్చిన వాళ్లకు ఆల్‌ ది వెరీ బెస్ట్‌. ఎవరో మోసం చేశారు, ఎవరో అన్యాయం చేశారు.. అని అనొచ్చు. కానీ ఆధారాలు లేవు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. నేనైతే చేయగలిగిందేమీ లేదు. ప్రజల తీర్పు తీసుకుంటాను. మంచి చేయడానికి మాత్రం కచ్చితంగా ప్రజలకు తోడుగా ఉంటాం. వాయిస్‌ ఆఫ్‌ ది వాయిస్‌లెస్‌ కింద ఈ పార్టీ తాను చేయాల్సిన పని తప్పకుండా చేస్తుంది. పేదవాడికి అండగా ఉండే కార్యక్రమంలో ఎప్పుడూ పేదవాడికి తోడుగా ఉంటూ గళం విప్పుతుంది. పెద్దపెద్ద వాళ్ల కూటమి ఇది. ఢిల్లీలో సైతం శాసించే పరిస్థితులు ఉన్న కూటమి ఇది. ఈ కూటమిలో ఉన్న బీజేపీ, చంద్రబాబుకు, పవన్‌ కళ్యాణ్‌కు, అందరికీ కూడా వాళ్ల గొప్ప విజయానికి అభినందనలు. ఓడిపోయినా, నా ప్రతి కష్టంలో తోడుగా, అండగా నిలబడిన ప్రతి నాయకుడికీ, ప్రతి కార్యకర్తకూ, ప్రతి వలంటీర్‌కు, ప్రతి ఇంట్లో నుంచి వచ్చి స్టార్‌ క్యాంపెయినర్‌గా నాకు తోడుగా నిలబడిన నా అక్కచెల్లెమ్మలకు, అన్నదమ్ములకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సాక్షి, అమరావతి: దేశంలో ఏ రాష్ట్రంలో జరగనన్ని సంక్షేమ పథకాలు, ఎక్కడా ఏ పేదవాడికీ దక్కని ప్రయోజనాలు.. అవినీతికి తావు లేకుండా, నేరుగా వారి గుమ్మం వద్దకే తీసుకువెళ్లే వ్యవస్థను ఏర్పాటు చేసినప్పటికీ ఎందుకిలా జరిగిందో తెలియడం లేదని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఫలితాలన్నీ దాదాపుగా కొలిక్కి వస్తున్నాయి. జరిగిన పరిస్థితులు చూస్తే నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఇలా జరుగుతుందని, ఫలితాలు ఇలా వస్తాయని ఊహించలేదు. పిల్లలు బాగుండాలని, వాళ్ల చదువులు బాగుండాలని తాపత్రయపడుతూ.. అమ్మ ఒడి అందుకున్న 53 లక్షల మంది తల్లులకు మంచి చేశాం. వారికి మంచి చేయాలనే తపనతో అడుగులు వేశాం. 31 లక్షల ఇంటి పట్టాలు అక్కచెల్లెమ్మల పేరుతో ఇచ్చాం. వాటిలో 22 లక్షల ఇళ్లు కట్టిస్తున్నాం. మరి ఆ అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలియదు’ అన్నారు. ‘66 లక్షల మంది అవ్వాతాతలకు, వితంతువులకు, వికలాంగులకు గతంలో ఎన్నడూ జరగని విధంగా మంచి చేశాం. వారి కష్టాల్లో తోడుగా ఉంటూ, వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ, వారి ఇంటికే సంక్షేమాన్ని పంపించే వ్యవస్థను సైతం తీసుకువచ్చాం. గతంలో మన ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇస్తున్న చాలీచాలని పెన్షన్‌ నుంచి.. ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఆ అవ్వాతాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘దాదాపు కోటీ 5 లక్షల మంది పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు మంచి చేస్తూ, వారి కష్టాలనే మా కష్టాలుగా భావిస్తూ, ఇచ్చిన ఏ మాటా తప్పకుండా అన్ని రకాలుగా వాళ్లకు అండగా ఉంటూ.. ఆసరా, చేయూతతో తోడున్నాం. సున్నా వడ్డీతో సైతం అండగా నిలిచాం. మరి ఆ కోటీ ఐదు లక్షల అక్కచెల్లెమ్మల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియదు. 26 లక్షల మంది చేయూతను అందుకుంటున్న అక్కచెల్లెమ్మల ఆప్యాయత ఏమైందో తెలియదు’ అని అన్నారు. సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. పిల్లల చదువుల కోసం పరితపించాం ‘పిల్లల చదువుల కోసం ఏ తల్లీ, తండ్రీ ఇబ్బంది పడకూడదని మొట్టమొదటి సారిగా పూర్తి ఫీజు ఇస్తూ అండగా నిలవడం ద్వారా చదువుల్లో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకొచ్చాం. ఏటా దాదాపుæ 12 లక్షల మందికి మంచి చేశాం. ఆ పిల్లలు, తల్లుల అభిమానం ఏమయ్యిందో తెలియదు. 54 లక్షల మంది రైతలన్నలకు గతంలో ఎప్పుడూ చూడని విధంగా, జరగని విధంగా పెట్టుబడికి సహాయం అందించే కార్యక్రమం మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే జరిగింది. అంతగా రైతన్నకు తోడుగా ఉంటూ, రైతన్నలకు రైతు భరోసా ఇవ్వడం గానీ, సీజన్‌ ముగిసేలోగా ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఉచిత ఇన్సూ్యరెన్స్, పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్‌ ఇచ్చే కార్యక్రమం చేశాం. మరి ఆ అరకోటి మంది రైతుల ప్రేమ ఏమైందో తెలియదు. ఆటోలు, టాక్సీలు నడుపుకుంటున్న వాళ్లు ఇబ్బంది పడకూడదని వారికి అండగా నిలుస్తూ వాహనమిత్ర, నేతన్నలకు అండగా ఉంటూ నేతన్న నేస్తం, మత్స్యకారులకు తోడుగా ఉంటూ మత్స్యకార భరోసా ఇచ్చాం. పుట్‌పాత్‌ల మీద చిన్న చిన్న ఇడ్లీ దుకాణాలు, వ్యాపారాలు చేసుకుంటున్న నా అక్కచెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు మంచి జరగాలని ఆరాపడుతూ వాళ్లకు తోడుగా నిలిచాం. నా రజకులకు, నాయీ బ్రాహ్మణులకు, టైలర్లకు అండగా ఉంటూ చేదోడు ఇచ్చాం. ఇన్ని కోట్ల మందికి మంచి చేసి, ఎప్పుడూ జరగని విధంగా మేనిఫెస్టో అంటే చెత్త బుట్టలో పడేసే డాక్యుమెంట్‌ కాదు, మేనిఫెస్టో అంటే ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీత అని మొట్టమెదటి రోజు నుంచీ భావిస్తూ.. ఏకంగా 99 శాతం వాగ్దానాలు అమలు చేశాం. చిత్తశుద్ధితో మేనిఫెస్టోను అక్కచెల్లెమ్మల ఇళ్లకు తీసుకెళ్లి చూపించి మీరే టిక్‌ పెట్టండి అనే నిబద్ధత గల ప్రభుత్వంగా పని చేశాం. ఇంటి వద్దకే సేవలు ఎప్పుడూ జరగని విధంగా, పేదరికం పోవాలంటే.. పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్‌ అవసరం అని ఇంగ్లిష్‌ మీడియంను వ్యతిరేకిస్తున్న పెత్తందార్లతో సైతం యుద్ధం చేసి పిల్లలకు ఇంగ్లిష్‌ మీడియం తీసుకురావడమే కాకుండా, ఆ పేద పిల్లలకు అండగా నిలబడాలని, తోడుగా ఉండాలని, వారి చరిత్రను కూడా మార్చాలని టోఫెల్, ఐబీ లాంటి కలలు కన్నాం. ఎప్పుడూ చూడని విధంగా గ్రామ స్థాయిలోనే సచివాలయం, వలంటీర్‌ వ్యవస్థను తీసుకువచ్చి.. వివక్ష, కరప్షన్‌ లేకుండా ప్రతి ఇంటికీ సేవలందించాం. దాదాపు రూ.2.70 లక్షల కోట్లు ఇంటి వద్దకే అందించగలిగాం. ఎప్పుడూ చూడని మార్పులను తీసుకు రావడమే కాకుండా విద్య, వ్యవసాయం, వైద్య రంగంలో ఏ పేదవాడు ఎప్పుడూ ఇబ్బంది పడకూడదని, ఊహించని మార్పులు తీసుకొస్తూ పేదవాడికి అండగా నిలబడగలిగాం. మహిళా సాధికారత అంటే ఇదీ అని, సామాజిక న్యాయం అంటే ఇదీ అని ప్రపంచానికి చూపించగలిగాం. ఇన్ని గొప్ప మార్పులు చేసిన తర్వాత, ఇన్ని కోట్ల మందికి మంచి చేసిన తర్వాత ఆ అభిమానం ఏమయ్యిందో, ఆ ఆప్యాయత ఏమైందో తెలియదు’ అంటూ ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్‌ తన స్పందనను ముగించారు. అనంతరం సీఎం పదవికి రాజీనామా చేశారు.

Rains and Landslide Wreaks Havoc in Sri Lanka
భారీ వర్షాలకు శ్రీలంక అతలాకుతలం.. 10 మంది మృతి

శ్రీలంకలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ వివరాలను ప్రభుత్వ అధికారులు మీడియాకు తెలియజేశారు. వరదలు, ఇతర విపత్కర ఘటనలలో 10 మంది మృతిచెందారు. మరో ఆరుగురు గల్లంతయ్యారు.భారీ వర్షాల కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో ఇళ్లు నేలకూలాయి. పొలాలు నీట మునిగాయి. పలుచోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. అధికారులు ముందుజాగ్రత్త చర్యగా పలుచోట్ల విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. రాజధాని కొలంబోతో పాటు రతన్‌పురా జిల్లాలో వరదల కారణంగా ఆరుగురు మృతిచెందారు. కొండచరియలు విరిడిపడటంతో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. చెట్టు కూలడంతో ఒకరు మృతి చెందారు. పలు ఘటనల్లో ఆరుగురు అదృశ్యమయ్యారు.ముంపు ప్రాంతాల నుంచి ఐదువేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వివిధ ఘటనల్లో 400కు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో నావికాదళంతో పాటు ఆర్మీ సిబ్బంది సహాయక చర్యలను చేపడుతున్నారు. మే మధ్య నుంచి శ్రీలంకలో వాతావరణం ప్రతికూలంగా మారింది.

Nalgonda-Warangal-Khammam Graduates MLC Polling Results Updates
TG: ‘పట్టభద్రుల’ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు.. కౌంటింగ్‌

Updates ‘పట్టభద్రుల’ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభమైందిఒక్కో హాల్లో 24 లెక్కింపు టేబుళ్ల చొప్పున మొత్తం 96 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఇందుకోసం 2,100 మంది సిబ్బందిని కేటాయించారు.ఈ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్‌ అభ్యర్థిగా రాకేశ్‌రెడ్డి, బీజేపీ నేత ప్రేమేందర్ ఎన్నికల బరిలో నిలవగా, వీరితోపాటు మరో 49 మంది పోటీలో ఉన్నారు. నల్లగొండ జిల్లానేడు నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపుతిప్పర్తి మండలం దుప్పలపల్లి వద్ద ఉన్న ప్రభుత్వ గౌడన్స్ లో లెక్కింపుఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం4 హాల్స్ లలో ఒక్కో హాల్ కు 24 టేబుల్స్ చొప్పున మొత్తం 96 టేబుల్స్ ఏర్పాటుపోస్టల్ బ్యాలెట్ ఓట్లని కలిపి లెక్కింపుఉప ఎన్నిక బరిలో 52 మంది అభ్యర్ధులుమొత్తం ఓటర్లు: 4,63,839పోలైన ఓట్లు: 3,36,013పోలింగ్ శాతం: 72.44రోజుకు మూడు షిఫ్టుల్లో కొనసాగనున్న లెక్కింపుఒక్కో షిఫ్టులో 900 సిబ్బందిమొదటగా బండిల్స్ కట్టే ప్రక్రియఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు బండిల్స్ కట్టే ప్రక్రియ కొనసాగే అవకాశంఆతర్వాత చెల్లుబాటు, చెల్లుబాటు కాని ఓట్లను వేరు చేయనున్న‌ సిబ్బందిచెల్లుబాటైన ఓట్లలో మొదటి ప్రాధాన్యత ఓట్లలో సగం కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన వారు గెలిచినట్లు ప్రకటనమొదటి ప్రాధాన్యత ఓట్లతో ఫలితం తేలకుంటే చివరి నుంచి ఎలిమినేషన్ ప్రక్రియఎలిమినేట్ అయిన అభ్యర్థి రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరికి వేశారో చూసి వారికి యాడింగ్అలా కలిపిన తర్వాత యాభై శాతానికి మించి వస్తే గెలిచినట్లు ప్రకటన నేడు ‘పట్టభద్రుల’ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్‌ బుధవారం ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమై రెండు రోజులపాటు కొనసాగే అవకాశం ఉంది. వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి జిల్లాల పరిధిలోని 605 పోలింగ్‌ స్టేషన్ల పరిధిలో మొత్తం 52 మంది అభ్యర్థులకు వచ్చిన ఓట్లను మూడు విడతల్లో లెక్కించనున్నారు. బ్యాలెట్‌ పద్ధతిలో ఈ ఎన్నికలు నిర్వహించినందున ఓట్ల లెక్కింపు ప్రక్రియ సుదీర్ఘంగా సాగనుంది. బుధవారం ఉదయం 8 గంటలకు ఈ ప్ర క్రియ ప్రారంభం అవుతుంది. నా లుగు హాళ్లలో 96 టేబుళ్లపై పోలైన 3,36,013 ఓట్ల లెక్కింపు చేపడతారు.

Unexpected results in Lok Sabha elections Reduced NDA strength
తగ్గిన ఎన్డీఏ బలం.. పవర్‌ ఖాయం! హ్యాట్రిక్‌!

న్యూఢిల్లీ: పాలక ఎన్డీఏ కూటమి పదేళ్ల జోరుకు బ్రేకులు ఎన్డీఏ సారథి బీజేపీ దూకుడుకు ముకుతాడు విపక్ష ఇండియా కూటమికి నైతిక విజయం కూటమి సారథి కాంగ్రెస్‌కు పునరుజ్జీవం లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లు విలక్షణమైన తీర్పు వెలువరించారు. గత రెండు ఎన్నికల ఆనవాయితీకి భిన్నంగా బీజేపీని ఈసారి మెజారిటీకి ఓ 32 స్థానాల దూరంలోనే ఉంచారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సొంతగానే 303 సీట్లు కైవసం చేసుకున్న కమలం పార్టీ ఏకంగా 63 స్థానాలు తగ్గి 240కే పరిమితమైంది. దాంతో నరేంద్ర మోదీ శకం మొదలయ్యాక తొలిసారిగా ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీఏ భాగస్వాములపై ఆధారపడాల్సిన పరిస్థితిలో పడింది. ఎన్డీఏ కూటమి కూడా కనాకష్టంగా మెజారిటీ మార్కు 272ను దాటింది. 2019లో 353 సీట్లు రాగా ఈసారి 293కే పరిమితమైంది. మరోవైపు 2019లో కేవలం 52 సీట్లతో కుదేలైన కాంగ్రెస్‌ బలం ఈసారి దాదాపు రెట్టింపైంది. 99 సీట్లలో గెలిచి సత్తా చాటింది. కాంగ్రెస్‌ సారథ్యంలో ఇండియా కూటమి కూడా అంచనాలకూ మించి రాణించింది. 233 సీట్లు కైవసం చేసుకుని గౌరవప్రదమైన స్థానంలో నిలిచింది. అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి అనూహ్యంగా కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. 2019లో 62 సీట్లు నెగ్గిన పార్టీ ఈసారి ఏకంగా సగానికి సగం సీట్లు కోల్పోయి 33కే పరిమితమైంది. గత ఎన్నికల్లో చతికిలపడ్డ అఖిలేశ్‌ సారథ్యంలోని సమాజ్‌వాదీ పార్టీ అక్కడ 38 స్థానాలతో దుమ్ము రేపింది. పశ్చిమబెంగాల్లో కూడా బీజేపీ అంచనాలను అందుకోలేక 12 స్థానాలతో సరిపెట్టుకుంది. మమతా సారథ్యంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ 29 సీట్లతో సత్తా చాటింది. స్మృతీ ఇరానీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు ఓటమి చవిచూశారు. ఈసారి లోక్‌సభ ఫలితాలను ఏ ఎగ్జిట్‌ పోల్‌ సర్వే కూడా ప్రతిఫలించలేకపోవడం విశేషం. మొత్తమ్మీద కేంద్రంలో పదేళ్ల ఏక పార్టీ పాలనకు కాలం చెల్లి తిరిగి నిజమైన సంకీర్ణ శకానికి తెర లేచింది. విపక్ష కూటమి కూడా పదేళ్ల తర్వాత గణనీయ శక్తిగా రూపుదిద్దుకుంది. అంతటితో ఆగకుండా కేంద్రంలో అధికారంపైనా కన్నేసినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి...! ఆకట్టుకున్న ఇండియా కూటమి ఏడు విడతల్లో సుదీర్ఘంగా సాగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ జూన్‌ 1తో ముగియడం తెలిసిందే. దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూసిన ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటలకు మొదలైంది. ఎన్డీఏ కూటమి ఆధిపత్యం 300లోపు స్థానాలకు పరిమితం కాగా ఇండియా కూటమి తొలి రౌండ్‌ నుంచే అనూహ్య రీతిలో ముందంజ వేసింది. క్రమంగా పుంజుకుంటూ 200 స్థానాలు దాటేసింది. చూస్తుండగానే 233కు చేరి పరిశీలకులను కూడా ఆశ్చర్యపరిచింది. ప్రధాని మోదీ వారణాసిలో తొలి రౌండ్లో వెనకబడ్డారు! చివరికి ఆయన నెగ్గినా మెజారిటీ మాత్రం బాగా తగ్గింది. 2019లో 4.79 లక్షల మెజారిటీ రాగా ఈసారి లక్షన్నర పై చిలుకుతో సరిపెట్టుకున్నారు. బీజేపీలో మోదీ కంటే కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌సింగ్‌లకు ఎక్కువ మెజారిటీ రావడం విశేషం. మరోవైపు రాహుల్‌గాంధీ మాత్రం పోటీ చేసిన రెండు స్థానాల నుంచీ భారీ విజయం సాధించారు. ఆయనకు కేరళలోని వాయనాడ్‌లో 3.64 లక్షలు, యూపీలోని రాయ్‌బరేలీలో 3.9 లక్షల మెజారిటీ రావడం విశేషం. కీలక రాష్ట్రాల్లో బీజేపీ కుదేలు కీలకమైన యూపీలో ఈసారి బీజేపీకి ఏకంగా 29 సీట్లకు కోత పడింది! మహారాష్ట్రలోనూ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అక్కడి 48 స్థానాల్లో 2019లో 43 సీట్లు ఒడిసిపట్టిన ఎన్డీఏ ఈసారి కేవలం 17కు పరిమితమైంది! బీజేపీ బలం 23 నుంచి ఏకంగా 10కి తగ్గింది. అక్కడ కాంగ్రెస్‌ సీట్ల సంఖ్య 1 నుంచి ఏకంగా 13కు పెరిగింది. దాని భాగస్వాములైన శివసేన (యూబీటీ) 9, ఎన్సీపీ (ఎస్‌పీ) 7 సీట్లు గెలుచుకున్నాయి! బిహార్లోనూ ఎన్డీఏకు 9 సీట్లకు కోతపడింది. బీజేపీ 12, భాగస్వాములు జేడీ(యూ) 12, ఎల్జేపీ(ఆర్‌వీ) 5 సీట్లలో నెగ్గాయి. 2019లో క్లీన్‌స్వీప్‌ చేసిన రాజస్తాన్‌ (25)లో కూడా బీజేపీకి ఈసారి 11 సీట్లకు కోత పడింది. కర్నాటకలోనూ పార్టీ బలం 25 నుంచి 17కు తగ్గింది. బెంగాల్లో 6 స్థానాలు తగ్గాయి. మరో క్లీన్‌స్వీప్‌ రాష్ట్రం హరియాణా (10)లోనూ ఈసారి బీజేపీ ఐదే గెలిచింది. మధ్యప్రదేశ్‌లో మాత్రం మొత్తం 29 సీట్లూ నెగ్గి క్లీన్‌స్వీప్‌ చేసింది. గుజరాత్‌లో ఒక్కటి మినహా 24 సీట్లు గెలుచుకుంది. తూర్పు రాష్ట్రం ఒడిశా బీజేపీ నెత్తిన పాలు పోసింది. అక్కడి 21 లోక్‌సభ స్థానాల్లో బీజేపీకి ఏకంగా 20 దక్కాయి! ఏపీలో కూడా ఎన్డీఏ కూటమికి 21 సీట్లు దక్కాయి. తెలంగాణలోనూ 2019లో 4 సీట్లలో నెగ్గిన బీజేపీ ఈసారి 8 స్థానాలు గెలుచుకుంది. అయితే కేరళలో తొలిసారి బోణీ కొట్టినా తమిళనాట మాత్రం సున్నా చుట్టింది. మరోవైపు ఇండియా కూటమి కీలక రాష్ట్రాల్లో దుమ్ము రేపింది. తమిళనాట మొత్తం 39 స్థానాలూ కూటమి ఖాతాలోనే పడ్డాయి! యూపీలో 2019లో కేవలం 5 స్థానాలతో సరిపెట్టుకున్న ఎస్పీ ఈసారి ఏకంగా 37 సీట్లు ఒడిసిపట్టింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలం కూడా 1 నుంచి 7కు పెరిగింది. బెంగాల్లో టీఎంసీకి 7 సీట్లు, బిహార్లో కూటమికి 9 స్థానాలు పెరిగాయి. రాజస్తాన్లో 2019లో సున్నా చుట్టిన కాంగ్రెస్‌ ఈసారి 8 సీట్లు నెగ్గింది. హరియాణాలోనూ 5 స్థానాలు దక్కించుకుంది. కర్నాటకలో పార్టీ స్థానాలు ఒకటి నుంచి 8కి పెరిగాయి. ఓట్ల శాతం ఇలా... బీజేపీ ఈసారి 36.58 శాతం ఓట్లు సాధించింది. ఇది 2019తో పోలిస్తే 0.72 శాతం తక్కువ. 2019 కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేసినా పార్టీ ఓట్ల శాతం తగ్గిపోవడం విశేషం. కాంగ్రెస్‌ ఓట్ల శాతం మాత్రం 19.46 నుంచి 21.22కు పెరిగింది. యూపీలో దుమ్ము రేపిన సమాజ్‌వాదీ పార్టీ ఓట్ల శాతం 2.55 నుంచి 4.59కు పెరిగింది. మాయావతి సారథ్యంలోని బీఎస్పీ ఓట్లు మాత్రం 2.04 నుంచి 1.58కు తగ్గిపోయింది. పశ్చిమబెంగాల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఓట్ల శాతం 4.06 నుంచి 4.38కు పెరిగింది. జేడీ(యూ) ఓట్ల శాతం 1.45 నుంచి 1.25కి తగ్గింది. ఆప్‌ ఓట్ల శాతం 0.44 నుంచి 1.11కు పెరిగింది. దక్షిణాదిన తమిళనాడులో పాలక డీఎంకే ఓట్ల శాతం 2.34 నుంచి 1.82కు తగ్గింది. హస్తినలో నంబర్‌గేమ్‌! మోదీ కాళ్ల కిందకు నీళ్లు? ఆయనపై ఎన్డీఏలో అభ్యంతరాలు జాతీయ మీడియాలో వార్తలు దేశవ్యాప్తంగా సాధించిన అనూహ్య ఫలితాలతో జోష్‌లో ఉన్న ఇండియా కూటమి ఏకంగా కేంద్రంలో అధికారంపై కన్నేసినట్టు వార్తలొస్తున్నాయి! ఈ దిశగా జేడీ(యూ)తో పాటు పలు ఇతర ఎన్డీఏ భాగస్వాములతో ఇప్పటికే కాంగ్రెస్‌ నేతలు మంతనాలు జరుపుతున్నట్టు చెబుతున్నారు. బీజేపీ కూడా ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోందని సమాచారం. ఎన్డీఏ కూటమి సుస్థిరత కోసం పలు ఇండియా కూటమిలోని పక్షాలతో పాటు స్వతంత్రులు, ఇతర పార్టీలతోనూ బీజేపీ పెద్దలు ఇప్పటికే జోరుగా సంప్రదింపులకు సాగిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తమ్మీద హస్తినలో జోరుగా నంబర్‌గేమ్‌ సాగుతోందంటూ వస్తున్న వార్తలతో జాతీయ రాజకీయాలు ఒక్కసారిగా రంజుగా మారాయి. ఎన్డీఏనే వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసినా, ప్రధానిగా మోదీ అభ్యర్ధిత్వానికి జేడీ(యూ) వంటి భాగస్వామ్య పక్షాలు సుతరామూ అంగీకరించకపోవచ్చని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి! ఈ నేపథ్యంలో హస్తినలో రాజకీయ పరిణామాలు ఎలాంటి మలుపు తీసుకుంటాయన్నది అత్యంత ఆసక్తికరంగా మారింది. 18వ లోక్‌సభలో పార్టీల బలాబలాలు (మొత్తం స్థానాలు 543) ఎన్డీఏ 291 (రంగు మార్చాలి. లేదంటే ఎన్డీఏ, ఇండియా కూటమి పక్కపక్కన విడిగా పెట్టుకోవాలి) బీజేపీ 241 టీడీపీ 16 జేడీ(యూ) 12 శివసేన 7 ఎల్జేపీ (ఆర్‌వీ) 5 జనసేన 2 జేడీ(ఎస్‌) 2 ఆరెల్డీ 2 ఎన్సీపీ 1 అప్నాదళ్‌ 1 ఏజీపీ 1 యూపీపీఎల్‌ 1 ఏజేఎస్‌యూపీ 1 హెచ్‌ఏఎం(ఎస్‌) 1 ఇండియా కూటమి 233 కాంగ్రెస్‌ 99 ఎస్పీ 37 టీఎంసీ 29 డీఎంకే 22 శివసేన (యూబీటీ) 9 ఎన్సీపీ (ఎస్‌పీ) 7 ఆర్జేడీ 4 సీపీఎం 4 ఆప్‌ 3 జేఎంఎం 3 ఐయూఎంఎల్‌ 3 సీపీఐ 2 సీపీఐ(ఎంఎల్‌)(ఎల్‌) 2 ఎన్‌సీ 2 వీసీకే 2 ఆరెస్పీ 1 కేసీ 1 ఆరెలీ్టపీ 1 బీఏడీవీపీ 1 ఎండీఎంకే 1 ఇతరులు 17 వైఎస్సార్‌సీపీ 4 మజ్లిస్‌ 1 అకాలీదళ్‌ 1 ఏఎస్‌పీకేఆర్‌ 1 వీఓటీపీపీ 1 జెడ్‌పీఎం 1 ఎస్‌కేఎం 1 స్వతంత్రులు 7

Spin will play a big role in T20 World Cup 2024: Rohit Sharma
ఐర్లాండ్‌ను తేలికగా తీసుకోము.. ఈ వరల్డ్‌కప్‌లో వారిదే పైచేయి: రోహిత్‌

టీ20 వరల్డ్‌కప్‌-2024లో టీమిండియా తొలి మ్యాచ్‌కు సిద్దమైంది. న్యూయర్క్‌ వేదికగా బుధవారం ఐర్లాండ్‌తో భారత్‌ తలపడనుంది. ఈ మ్యాచ్‌ కోసం టీమిండియా అన్ని విధాల సిద్దమైంది. తొలి మ్యాచ్‌లో గెలిచి టోర్నీని శుభారంభం చేయాలని భారత్‌ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రీ మ్యాచ్‌ కాన్ఫరెన్స్‌లో పాల్గోన్న టీమిండియా కెప్టెన్‌ న్యూయర్క్‌ పిచ్‌కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎటువంటి పరిస్థితులకైనా అనుగుణంగా బలమైన జట్టు తమ వద్ద ఉందని రోహిత్‌ థీమా వ్యక్తం చేశాడు." ఈ ఏడాది వరల్డ్‌కప్‌లో స్నిన్నర్లు ప్రధాన పోషిస్తారని నేను అనుకుంటున్నాను. మా జట్టులో జడేజా, అక్షర్‌ పటేల్‌ రూపంలో స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్లు ఉన్నారు. జట్టు బ్యాలెన్స్‌గా ఉండాలంటే వారిద్దరూ అవసరమే. అదే విధంగా పేస్ బౌలింగ్‌ ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే కూడా మా వద్ద ఉన్నారు. కాబట్టి ఈ మెగా టోర్నీలో వారి సేవలను అన్ని విధాలగా ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తాం. న్యూయర్క్‌ వికెట్‌ గురించి మాకు ఎటువంటి ఆందోళన లేదు.ఎందుకంటే ఎటువంటి పరిస్థితులలోనైనా సత్తాచాటేందుకు మా బాయ్స్‌ సిద్దంగా ఉన్నారు. అదే విధంగా ఐర్లాండ్‌ జట్టును మేము తక్కువగా అంచనా వేయడం లేదు. ఎందుకంటే ఐర్లాండ్‌ వద్ద కూడా పటిష్టమైన జట్టు ఉంది. వారు కూడా ఎక్కువగా టీ20 క్రికెట్ ఆడుతున్నారు. ఐరీష్‌ జట్టులో చాలా మంది ఆటగాళ్ళకి ప్రపంచవ్యాప్తంగా లీగ్‌ క్రికెట్‌లో ఆడిన అనుభవం ఉందని" ప్రీమ్యాచ్‌ కాన్ఫరెన్స్‌లో రోహిత్‌ పేర్కొన్నాడు.

49% of Americans say Trump should suspend 2024 presidential campaign
ప్రెసిడెంట్‌ పోటీ నుంచి ట్రంప్‌ తప్పుకోవాల్సిందే..! : అమెరికన్లు

న్యూయార్క్‌: పోర్న్‌ స్టార్‌ స్టార్మీ డేనియల్స్‌కు 1.30 లక్షల డాలర్లు అక్రమంగా చెల్లించి, బిజినెస్‌ రికార్డులు తారుమారు చేసిన హష్‌ మనీ కేసులో న్యూయార్క్‌ కోర్టు డొనాల్డ్‌ ట్రంప్‌ను దోషిగా తేల్చటం అమెరికా రాకీయంగా చర్చనీయాంశం అయింది. ట్రంప్‌పై నమోదైన 34 తీవ్ర అభియోగాలన్నీ రుజువయ్యాయని కోర్టు వెల్లడించిన విషయం తెలిసిందే. జూలై 11న న్యాయస్థానం తుది తీర్పు ఇవ్వడంతోపాటు శిక్ష ఖరారు చేయనుంది.ఇక.. ఈ వ్యవహారంలో ట్రంప్‌కు జైలు శిక్ష లేదా జరిమానా విధించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. శిక్ష పడినప్పటికీ.. మరో ఆరు నెలల్లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ అభ్యర్థిగా ట్రంప్‌ పోటీ చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు కాబోవని అంచనా వేస్తున్నారు.అయితే ఈ నేపథ్యంలో డొనాల్డ్‌ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పుకోవాలని సగం మంది అమెరికన్లు అభిప్రాయపడినట్లు ఓ సర్వే వెల్లడించింది. ఈ సర్వేను మే 31 నుంచి జూన్‌ 1 వరకు నిర్వహించినట్లు సదరు సర్వే సంస్థ పేర్కొంది. హష్‌ మనీ కేసులో ట్రంప్‌ను కోర్టు దోషిగా ప్రకటించటంపై సరైందేని 50 శాతం అమెరికన్లు అభిప్రాయపడినట్లు సర్వేను బట్టి తెలుస్తోంది. 23 శాతం మంది ఈ కేసులోని సరైందా? కాదా? అనే విషయంలో ఎటువంటి అభిప్రాయాన్ని కలిగిలేరని కూడా తెలిపింది.అదే విధంగా 27 శాతం మంది మాత్రం ట్రంప్‌ను దోషిగా తెల్చటాన్ని తప్పుపడుతున్నారు. ఈ కేసులో ట్రంప్‌పై వచ్చిన ఆరోపణలు 47 శాతం రాజకీయ ప్రేరేపితంగా ఉన్నాయని సర్వేలో పాల్గొన్న అమెరికన్లు వెల్లడించారు. 38 శాతం మంది మాత్రం ఈ అభిప్రాయాన్ని ఏకిభవించలేదు. ముఖ్యంగా ఈ కేసులో ట్రంప్‌ అక్రమానికి పాల్పడినట్లు 51 శాతం మంది అభిప్రాయపడినట్లు సర్వే రిపోర్టు వెల్లడించింది.దీంతో మొత్తంగా 49 శాతం మంది అమెరికన్లు ట్రంప్‌ అధ్యక్ష ఎన్నికల నుంచి వైదొలగాలని సూచించిట్లు తెలిపింది. ట్రంప్‌ పలు ప్రైమరి ఎన్నికల్లో విజయం సాధించి రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధక్ష పదవికి పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఇక.. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు నవంబర్‌లో జరగనున్నాయి. ట్రంప్‌ను దోషిగా ప్రకటించటం అమెరికా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారటం.. ఆయన గెలుపు అవకాశాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

Actor Simbu Comments On Red Card Over Him
నిజాలు మాట్లాడితే కష్టాలే.. ఆ వివాదంపై స్పందించిన హీరో శింబు

తమిళంలో సంచలన నటుడిగా ముద్రవేసుకున్న శింబు చాలా విమర్శలను ఎదుర్కొంటున్నారన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శింబు అంటే వివాదాలు, వివాదాలు అంటే శింబు అనే రీతిలో ఉంటుంది. ఈయనపై నిర్మాతల మండలిలో ఫిర్యాదులు చాలానే ఉన్నాయి. తాజాగా నిర్మాత ఐసరి గణేశ్ కూడా శింబుపై ఫిర్యాదు చేశారు. తాను నిర్మించనున్న 'కరోనా కుమార్' చిత్రంలో నటించడానికి కమిట్ అయిన శింబుకు రూ.4 కోట్లు అడ్వాన్స్ ఇచ్చానని, కానీ ఇప్పుడాయన తన మూవీలో నటించడం లేదని, తన చిత్రాన్ని పూర్తి చేసే వరకు ప్రస్తుతం శింబు చేస్తున్న 'థగ్ లైఫ్' మూవీలో నటించకుండా నిషేధించాలని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.(ఇదీ చదవండి: తెలుగు ఇండస్ట్రీపై కాజల్ షాకింగ్ కామెంట్స్.. హీరోయిన్లకు పెళ్లయితే)దీంతో శింబుపై రెడ్ కార్డ్ విధించినట్లు ప్రచారం హోరెత్తింది. దీనిపై స్పందించిన శింబు.. తాను కమలహాసన్‌ 'థగ్ లైఫ్'లో నటిస్తుండటం సంతోషంగా ఉందన్నారు. ఈ లోకంలో నిజాలు చెప్పేవారు చాలా కష్టపడుతున్నారని.. తాను చాలా నిజాలు మాట్లాడానని చెప్పారు. అయితే తనపై రెడ్ కార్డ్ విధించడం లాంటిదేదీ జరగలేదని పేర్కొన్నారు. చిన్న సమస్య ఉందని, దాన్ని మాట్లాడి పరిష్కరించినట్లు చెప్పారు. కాగా కమల్ హాసన్‌తో కలిసి నటిస్తూనే ఈయన నిర్మిస్తున్న మరో మూవీలోనూ హీరోగా చేస్తున్నాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు.. అవి ఏంటంటే?)

Counting ends peacefully in AP
వైఎస్సార్‌సీపీకి 1.32 కోట్ల ఓట్లు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టీడీపీ కూటమి గెలుపొందినా 1.32 కోట్ల మంది ఓటర్లు వైఎస్సార్‌ సీపీకి మద్దతుగా నిలిచినట్లు ఎన్నికల సంఘం తాజా గణాంకాలను బట్టి తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 4.13 కోట్ల మంది ఓటర్లు ఉండగా మే 13న జరిగిన పోలింగ్‌లో పోస్టల్‌ బ్యాలెట్‌తో కలిపి 3.38 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో టీడీపీకి 45.63 శాతం ఓట్లతో 1,53,56,470 మంది ఓటర్లు మద్దతు తెలుపగా, 39.37 శాతం ఓట్లతో 1,32,57,919 మంది మేం జగన్‌ వెంటే ఉన్నామంటూ వైఎస్సార్‌సీపీకి అండగా నిలిచారు. జనసేనకు సుమారు 8.3 శాతం ఓట్లతో 20 లక్షల మంది మద్దతు తెలుపగా బీజేపీకి 9.53 లక్షల మంది (2.80 శాతం) ఓట్లు వేశారు. 1.72 శాతంతో కాంగ్రెస్‌ పార్టీకి 5.80 లక్షల ఓట్లు పోలవ్వగా నోటాకు 1.09 శాతంతో 3.68 లక్షల మంది ఓటు వేశారు. ఎన్నికల సంఘం ఇంకా తుది ఫలితాలను ప్రకటించకపోవడంతో ఈ గణాంకాల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. గాజువాకలో రికార్డు మెజార్టీ రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో తొలిసారిగా రికార్డు మెజార్టీలు నమోదయ్యాయి. గాజువాక నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన పల్లా శ్రీనివాసరావు సమీప వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్‌పై 95,235 మెజార్టీతో గెలుపొందారు. మంగళగిరి నుంచి నారా లోకేష్‌ 91,413, భీమిలి నుంచి గంటా శ్రీనివాసరావు 92,401 ఓట్ల మెజార్టీతో గెలిచారు. పెందుర్తి, నెల్లూరు సిటీ, తణుకు, కాకినాడ గ్రామీణ, రాజమహేంద్రవరం సిటీ, విశాఖ తూర్పు, పిఠాపురం నియోజకవర్గాల్లో 70 వేలకు పైగా మెజార్టీలు నమోదయ్యాయి. మడకశిర నుంచి వైఎస్సార్‌ సీపీ అభ్యరి్థగా పోటీ చేసిన ఉపాధి హామీ కూలీ ఈర లక్కప్ప కేవలం 25 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి ఎంఎస్‌ రాజు చేతిలో ఓడినట్లు తొలుత ప్రకటించగా దీనిపై రీ కౌంటింగ్‌ కోరడంతో 351 ఓట్లతో వెనుకబడినట్లు ప్రకటించారు. దీనిపై వైఎస్సార్‌ సీపీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఫలితం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. గిద్దలూరులో రౌండు రౌండ్‌కు ఫలితం దోబూచులాడగా చివరకు వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి కుందూరు నాగార్జునరెడ్డి 392 ఓట్లతో గెలిపొందారు. ఫలితాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.మందకొడిగా ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నిర్వహించిన ఓట్ల లెక్కింపు ప్రశాంత వాతావరణంలో ముగిసింది. ప్రభుత్వ ఉద్యోగులు ఉదయం నాలుగున్నర గంటలకే కౌంటింగ్‌ కేంద్రాలకు చేరుకొని తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభించారు. నిర్దేశించుకున్న సమయం కంటే చాలా నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ నెమ్మదిగా కొనసాగింది. రాత్రి పది గంటల సమయానికి 155 నియోజకవర్గాల ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. అర్థరాత్రి లోగా మొత్తం ఫలితాలను ప్రకటించేలా కసరత్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Congress and BJP won 8 seats each Lok Sabha Election 2024
Lok Sabha Election 2024: బీజేపీ.. కాంగ్రెస్‌కు చెరో '8'

సాక్షి, హైదరాబాద్‌/ సాక్షి నెట్‌వర్క్‌: రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ చెరో 8 స్థానాల్లో విజయం సాధించాయి. హైదరాబాద్‌ లోక్‌సభ స్థానాన్ని ఎంఐఎం నిలుపుకొంది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్‌ఎస్‌ ఒక్క స్థానాన్ని కూడా సాధించలేకపోయింది. ఈ ఎన్నికల్లో వివిధ పార్టీల తరఫున మొత్తం 9 మంది సిట్టింగ్‌ ఎంపీలు పోటీచేయగా.. వారిలో ఐదుగురు ఓటమి పాలయ్యారు. ఓడినవారిలో నామా నాగేశ్వర్‌రావు, మాలోతు కవిత, రంజిత్‌రెడ్డి, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, బీబీ పాటిల్‌ ఉన్నారు. అసదుద్దీన్, కిషన్‌రెడ్డి, బండి సంజయ్, అరవింద్‌ మాత్రమే తమ సీట్లను నిలుపుకొన్నారు. ఇక ఈసారి 8 మంది తొలిసారి ఎంపీగా గెలిచి రాష్ట్రం నుంచి లోక్‌సభలో అడుగుపెట్టబోతున్నారు. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్‌ పట్టు.. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ దక్షిణ తెలంగాణ ప్రాంతంలో తన పట్టును నిలుపుకోగా.. ఉత్తర తెలంగాణలో బీజేపీ సత్తా చాటింది. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో ఉన్న మొత్తం 5 లోక్‌సభ సీట్లనూ కాంగ్రెస్‌ గెలుచుకుంది. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని నాలుగు లోక్‌సభ స్థానాల్లో బీజేపీ మూడింటిని గెలుచుకుని ఆ ప్రాంతాల్లో ఆధిపత్యం చాటింది. హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి ఎంఐఎం అధినేత, సిట్టింగ్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ వరుసగా ఐదోసారి విజయం సాధించడంతో పాత నగరంపై ఆ పార్టీ పట్టు నిలుపుకొంది. ఉమ్మడి మహబూబ్‌నగర్, కరీంనగర్, మెదక్‌ జిల్లాల్లో రెండేసి చొప్పున మొత్తం ఆరు లోక్‌సభ సీట్లు ఉండగా.. కాంగ్రెస్, బీజేపీ చెరో మూడు సీట్లను దక్కించుకున్నాయి. అదీ ప్రతి జిల్లాలో చెరో సీటు సాధించడం గమనార్హం. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్‌ జిల్లాల్లోని రెండు సీట్లనూ బీజేపీ కైవసం చేసుకుంది. పట్టుపెంచుకున్న ఇరు పార్టీలు.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 4 స్థానాలను గెలిచిన బీజేపీ.. ఈసారి తన బలాన్ని 8 సీట్లకు పెంచుకుంది. కాంగ్రెస్‌ కూడా 3 సీట్ల నుంర్టీచి 8 సీట్లకు బలాన్ని పెంచుకుంది. గత ఎన్నికల్లో 9 సీట్లు గెలిచిన బీఆర్‌ఎస్‌ ఈసారి ఖాతా తెరవలేకపోయింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీకి.. ఆ ఎన్నికల్లో కేవలం 8 అసెంబ్లీ స్థానాలే గెలిచిన బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో గట్టిపోటీ ఇచ్చి సమ ఉజ్జీగా నిలిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలను గెలుచుకున్న బీఆర్‌ఎస్‌ ఒక్క లోక్‌సభ సీటు గెలవలేదు. గత, ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రధాన పార్టీలకు వచ్చిన సీట్లివీ.. పార్టీ 2014 2019 2024 కాంగ్రెస్‌ 2 3 8 బీజేపీ 1 4 8 ఎంఐఎం 1 1 1 బీఆర్‌ఎస్‌ 11 9 0 నల్లగొండ: రికార్డు స్థాయి మెజారిటీ నల్లగొండ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌ పార్టీ తమ పట్టు నిలుపుకొంది. కౌంటింగ్‌ ఆద్యంతం ఆ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడు కుందూరు రఘువీర్‌రెడ్డి స్పష్టమైన ఆధిక్యత చూపారు. చివరికి ఏకంగా రికార్డు స్థాయిలో 5,59,906 ఓట్ల మెజారిటీ సాధించారు. తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి రెండో స్థానంలో నిలిచారు. భువనగిరి: అంతా తొలిసారి ఎంపీలే.. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో తమకు ఉన్న పట్టును కాంగ్రెస్‌ పార్టీ మరోసారి నిలుపుకొంది. భువనగిరి లోక్‌సభ స్థానంలో ఆ పార్టీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి సమీప బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌పై 2,22,170 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి తొలిసారి లోక్‌సభలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ సెగ్మెంట్‌లో ఇంతకు ముందు ఎన్నికల్లో పోటీచేసి గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా తొలిసారిగా ఎంపీలు అయినవారే కావడం విశేషం. నాగర్‌ కర్నూల్‌: మళ్లీ ‘చేతి’కి.. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లు రవి 94,414 ఓట్ల మెజారిటీతో సమీప బీజేపీ అభ్యర్థి పోతుగంటి భరత్‌ ప్రసాద్‌పై గెలుపొందారు. మల్లు రవి 1991, 1998 ఎన్నికల్లో ఇక్కడి నుంచే ఎంపీగా గెలవడం గమనార్హం. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత విజయం సాధించారు. ఇక ఇక్కడ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ మూడో స్థానానికి పరిమితమయ్యారు. పెద్దపల్లి: మళ్లీ కాంగ్రెస్‌ ఖాతాలోకి.. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని పెద్దపల్లి లోక్‌సభ స్థానాన్ని కాంగ్రెస్‌ తిరిగి చేజిక్కించుకుంది. ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ 1,31,364 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి గోమాసె శ్రీనివాస్‌పై విజయం సాధించారు. కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి(కాకా) మనవడు, చెన్నూర్‌ ఎమ్మెల్యే జి.వివేక్‌ తనయుడే గడ్డం వంశీకృష్ణ. ఈయన తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీ అయ్యారు. ఇక్కడ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ మూడోస్థానానికి పరిమితం అయ్యారు. వరంగల్‌: పార్టీ మారి పోటీచేసినా.. 2009లో జరిగిన పునర్విభజనలో వరంగల్‌ లోక్‌సభ నియోజకవర్గం ఏర్పాటైంది. 2009లో కాంగ్రెస్‌ గెలవగా తర్వాత వరుసగా బీఆర్‌ఎస్‌ అభ్యర్థులే విజయం సాధించారు. మళ్లీ ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌ అభ్యర్ధి, మాజీ మంత్రి కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య గెలిచారు. ఆమె బీజేపీ అభ్యర్థి అరూరి రమేశ్‌పై 2,20,339 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వాస్తవానికి ఈ ఎన్నికల్లో కావ్యకు బీఆర్‌ఎస్‌ పార్టీ టికెట్‌ ఇస్తున్నట్టు ప్రకటించింది. కానీ ఆమె కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. అరూరి రమేష్‌ కూడా ఎన్నికల ముందే బీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలో చేరి పోటీ చేయడం గమనార్హం. మహబూబాబాద్‌: సెగ్మెంట్‌ చరిత్రలో అధిక మెజారిటీ మహబూబాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి పి.బలరాంనాయక్‌ 3,49,165 ఓట్ల మెజారిటీతో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎంపీ మాలోతు కవితపై విజయం సాధించారు. 1957 నుంచీ కొనసాగిన మానుకోట పాత పార్లమెంట్‌ స్థానంలోగానీ, 2009 తర్వాత కొత్తగా ఏర్పడిన మహబూబాబాద్‌ పార్లమెంట్‌ స్థానంలోగానీ.. ఇదే అత్యధిక మెజారిటీ కావడం గమనార్హం. 2009లో కాంగ్రెస్‌ తరఫున ఇదే లోక్‌సభ స్థానం నుంచి గెలిచిన బలరాంనాయక్‌ కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. 2014, 2019 ఎంపీ ఎన్నికల్లో ఓటమి పాలైన ఆయన.. ఈసారి మళ్లీ గెలిచారు. ఖమ్మం: ఆద్యంతం కాంగ్రెస్‌ ఆధిక్యమే.. తొలి రౌండ్‌ నుంచి చివరిదాకా కాంగ్రెస్‌ ఆధిక్యమే కొనసాగింది. చివరికి 4,67,847 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్‌ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి విజయం సాధించారు. ఆయన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వియ్యంకుడు కావడం గమనార్హం. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నామా నాగేశ్వర్‌రావు రెండో స్థానంలో నిలిచారు. ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో 1952 నుంచి ఇప్పటివరకు జరిగిన 18 ఎన్నికల్లో.. ప్రస్తుతం రామసహాయం రఘురాంరెడ్డి సాధించిన మెజారిటీయే రికార్డు. ఇక్కడ బీజేపీ ఓటు బ్యాంక్‌ పెంచుకుంది. ఇక్కడ 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధికి 20,488 ఓట్లే రాగా.. ఈసారి ఆ పార్టీ అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు 1,18,636 ఓట్లు సాధించారు. జహీరాబాద్‌: ఇక్కడా హస్తం హవా ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలోని జహీరాబాద్‌ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి సురేశ్‌ షెట్కార్‌ 46,174 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్ధి/సిట్టింగ్‌ ఎంపీ బీబీ పాటిల్‌పై విజయం సాధించారు. సురేశ్‌ షెట్కార్‌ ఇదే సెగ్మెంట్‌ నుంచి 2009లో ఎంపీగా గెలిచారు. ఇక్కడ బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎంపీ అయిన బీబీ పాటిల్‌ ఎన్నికల ముందే బీజేపీలో చేరి ఆ పార్టీ తరఫున బరిలోకి దిగారు. రెండు జాతీయ పార్టీల అభ్యర్థుల మధ్య గట్టిపోటీనే జరిగింది. ఇక బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌ మూడో స్థానంలో నిలిచారు. నిజామాబాద్‌: పోటాపోటీ మధ్య కమలానికి.. ఇందూరు గడ్డపై మళ్లీ కాషాయ జెండా రెపరెపలాడింది. బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య పోటాపోటీ కొనసాగిన నిజామాబాద్‌ లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి టి.జీవన్‌రెడ్డిపై 1,09,241 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నిజామాబాద్‌ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకుగాను.. అరవింద్‌కు బాల్కొండ, ఆర్మూర్, కోరుట్ల, నిజామాబాద్‌ రూరల్‌లలో ఆధిక్యత వచ్చింది. జీవన్‌రెడ్డికి జగిత్యాల, నిజామాబాద్‌ అర్బన్, బోధన్‌ సెగ్మెంట్లలో ఆధిక్యత వచ్చింది. కరీంనగర్‌: పట్టు పెంచుకున్న జాతీయ పార్టీలు తొలి నుంచీ బీఆర్‌ఎస్‌కు ఆయువుపట్టుగా ఉన్న కరీంనగర్‌ లోక్‌సభ స్థానంలో జాతీయ పార్టీలు పట్టుపెంచుకున్నాయి. ఇక్కడ 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 4,98,276 ఓట్లు, బీఆర్‌ఎస్‌కు 4,08,768 ఓట్లు, కాంగ్రెస్‌కు 1,79,258 ఓట్లు రాగా.. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ 5,85,116 ఓట్లతో విజయం సాధించారు. క్రితంసారితో పోలిస్తే 86,840 ఓట్లు పెరిగాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు 3,59,907 ఓట్లు తెచ్చుకున్నారు. అంటే కాంగ్రెస్‌కు 1,80,649 ఓట్లు అదనంగా వచ్చాయి. ఈసారి బీఆర్‌ఎస్‌కు 2,82,163 ఓట్లు వచ్చాయి. 1.25 లక్షలకుపైగా ఓట్లు తగ్గాయి. మహబూబ్‌నగర్‌: కౌంటింగ్‌ ఆద్యంతం ఉత్కంఠ మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. బీజేపీ అభ్యర్థి డీకే అరుణ, కాంగ్రెస్‌ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి మధ్య విజయం దోబూచులాడింది. చివరికి డీకే అరుణ 4,500 ఓట్ల స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు. గతంలో రాష్ట్ర మంత్రిగా వ్యవహరించిన డీకే అరుణ లోక్‌సభకు ఎన్నికవడం ఇదే తొలిసారి. అయితే ఈ లోక్‌సభ ఎన్నికలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ అసెంబ్లీ స్థానం పరిధిలో కాంగ్రెస్‌ కంటే బీజేపీకి ఎక్కువ ఓట్లు రావడం చర్చనీయాంశంగా మారింది. మల్కాజిగిరి: దేశంలోనే పెద్ద సెగ్మెంట్‌.. తొలిసారి బీజేపీ విజయం దేశంలోనే అత్యధిక ఓట్లున్న లోక్‌సభ సెగ్మెంట్‌ మల్కాజిగిరిలో తొలిసారి కాషాయ జెండా ఎగిరింది. ఆ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్‌రెడ్డిపై 3,91,475 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. బీఆర్‌ఎస్‌లో ప్రముఖ నేతగా కొనసాగి, రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేసిన ఈటల తొలిసారి ఎంపీ అయ్యారు. చేవెళ్ల: కొండా వశం చేవెళ్ల లోక్‌సభ సెగ్మెంట్‌లో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఘన విజయం సాధించారు. ఆయన 2014లో ఇక్కడి నుంచి బీఆర్‌ఎస్‌ తరఫున ఎంపీగా గెలిచారు. 2019లో కాంగ్రెస్‌ నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఇక ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరి పోటీ చేసిన సిట్టింగ్‌ ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. బీఆర్‌ఎస్‌ మూడో స్థానానికి పరిమితమైంది. చేవెళ్ల సెగ్మెంట్‌లో ఏకంగా 43 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. మెదక్‌: గులాబీ కంచుకోటలో కమలం బీఆర్‌ఎస్‌ పార్టీకి మొదటి నుంచీ కంచుకోటగా ఉన్న మెదక్‌లో బీజేపీ విజయం సాధించింది. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్‌ల మధ్య హోరాహోరీ పోరు సాగింది. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు 39,139 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్‌పై గెలిచారు. ఇంతకుముందు ఎమ్మెల్యేగా పనిచేసిన రఘునందన్‌రావు తొలిసారిగా ఎంపీ అయ్యారు. కాంగ్రెస్‌ అభ్యర్థి కంటే సుమారు 35 వేల ఓట్లు తక్కువగా వచ్చిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మూడో స్థానానికి పరిమితం అయ్యారు. ఆదిలాబాద్‌: మళ్లీ కమలమే! ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానంలో కమలం పార్టీ మళ్లీ వికసించింది. ఆ పార్టీ అభ్యర్థి గొడం నగేశ్‌.. కాంగ్రెస్‌ అభ్యర్థి ఆత్రం సుగుణపై 90,652 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2014లో బీఆర్‌ఎస్‌ తరఫున ఎంపీగా గెలిచిన ఆయన.. ఇప్పుడు బీజేపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. బీఆర్‌ఎస్‌ ఇక్కడ కూడా మూడో స్థానంలో నిలిచింది. ఇక్కడ కౌంటింగ్‌ తొలుత ఉత్కంఠగా సాగింది. బీజేపీ అభ్యర్థి తొలి నుంచీ ఆధిక్యంలో ఉన్నా.. కొన్ని రౌండ్లలో కాంగ్రెస్‌ అభ్యర్థి స్వల్ప ఆధిక్యత సాధించారు. చివరికి నగేశ్‌ గెలిచారు. హైదరాబాద్‌: ఐదోసారి లోక్‌సభకు అసదుద్దీన్‌ హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ వరుసగా ఐదోసారి విజయం సాధించారు. ఆయన సమీప బీజేపీ అభ్యర్థి కె.మాధవీలతపై 3,38,087 ఓట్ల మెజారిటీ సాధించారు. ఎన్నికల్లో తన ప్రచార, వ్యవహార శైలితో జాతీయ మీడియాను కూడా ఆకర్షించిన మాధవీలత ఊహించిన స్థాయిలో పోటీ ఇవ్వలేకపోయ్యారు. 2019లో 2.82 లక్షల ఓట్ల మెజారిటీతో అసదుద్దీన్‌ గెలవగా.. మెజారిటీ మరో 50వేలకుపైగా పెరిగింది. సికింద్రాబాద్‌: ఓట్లు మరింత పెంచుకున్న బీజేపీ గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని సికింద్రాబాద్‌ లోక్‌సభ సెగ్మెంట్‌లో బీజేపీ తన ఓట్లశాతాన్ని మరింత పెంచుకుంది. బీజేపీ నుంచి పోటీ చేసిన సిట్టింగ్‌ ఎంపీ, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి దానం నాగేందర్‌పై 49,944 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌లో బీజేపీకి 42.05 శాతం ఓట్లురాగా.. ఈసారి 45.15శాతం వచ్చాయి.

The EVM were changed
ఈవీఎంనే మార్చేశారు

మడకశిర (శ్రీసత్యసాయి జిల్లా): శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం ఓట్ల లెక్కింపులో అధికారులు ఈవీఎంనే మార్చేశారు. ఇందులోనూ ఓట్లు తప్పులతడకగా చూపాయి. ఓట్లలో తేడా ఉండ­టంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అభ్యంతరం చెప్పారు. చివరకు ఈ ఈవీఎం పార్లమెంట్‌ నియోజకవర్గానిదని తేలడంతో అందరూ నివ్వెరపోయారు. దీంతో అధికారులు వీవీ ప్యాట్‌ స్లిప్పులు లెక్కించారు. ఇది బయటపడిన సంఘటన మాత్ర­మే. బయటకు తెలియని ఇటువంటి ఈవీఎం మారి్పడి ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా ఇంకెన్ని జరిగాయోనన్న అనుమానాలు అందరికీ కలుగుతున్నాయి. మంగళవారం మడకశిర అసెంబ్లీ, హిందూపురం ఎంపీ స్థానాల ఓట్ల లెక్కింపు హిందూపురం బిట్‌ కళాశాలలో జరి­గింది. ఒక గదిలో లోక్‌సభ ఓట్లు, పక్క గదిలోనే అసెంబ్లీ అభ్యర్థుల ఓట్ల లెక్కింపు చేపట్టారు. మడకశిర నియోజకవర్గం రొళ్ల మండలం పిల్లిగుండ్లు 131 పోలింగ్‌ బూత్‌ పార్లమెంట్‌ ఓట్ల ఈవీఎంను అధికారులు అసెంబ్లీ ఓట్లు లెక్కిస్తున్న టేబుల్‌ వద్దకు తీసు­కొచ్చారు. ఇందులో బీఎస్పీ అభ్యర్థికి 414, వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి 5, టీడీపీ అభ్యర్థికి 349 ఓట్లు వచ్చినట్లు చూపింది. వైఎస్సార్‌సీపీకి బలమున్న గ్రామంలో ఓట్లు మరీ తక్కువగా రావడంతో అనుమానం వచి్చన రొళ్ల జెడ్పీటీసీ సభ్యుడు అనంతరాజు వైఎస్సార్‌­సీపీ అభ్యర్థి ఈర లక్కప్ప ద్వారా ఆర్‌వోకు ఫిర్యాదు చేయించారు. దీంతో దాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టి చివర్లో పరిష్కారం చూపుతామని ఆర్‌వో చెప్పారు. కౌంటింగ్‌ చివరలో టీడీపీకి 285 ఓట్ల ఆధిక్యం వచ్చింది. దీంతో పక్కన పెట్టిన ఈవీఎం సంగతి తేల్చాలంటూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి లక్కప్ప పట్టుబట్టారు. దీంతో ఆ ఈవీఎంను అధికారులు పరిశీలించగా పార్లమెంట్‌కు సంబంధించి­న­దిగా తేలింది. తప్పును గుర్తించిన అధికారులు తీరిగ్గా ఆ పోలింగ్‌ బూత్‌కు సంబంధించి అసెంబ్లీ ఈవీఎం తీసుకువచ్చారు. అది అసలు ఓపెనే కాలేదు. దీనిపై వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తీవ్ర అభ్యంతరం చెప్పడంతో చివరకు వీవీ ప్యాట్‌ స్లిప్పులు తీసుకొచ్చి లెక్కించారు. అందులో టీడీపీకి 349 ఓట్లు, వైఎస్సార్‌సీపీకి 414 ఓట్లు వచ్చాయి. చివరకు స్వల్ప ఆధిక్యంతో టీడీపీ గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. ఒకవేళ ఈవీ­ఎం మారిన సంగతి బయటపడకుండా, పార్లమెంటు ఈవీఎం ఓట్లే లెక్కించి ఉంటే వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి 414 ఓట్లకు బదులు 5 ఓట్లే వచ్చి ఉండేవి. ఎంతో పకడ్బందీగా జరగాల్సిన ఓట్ల లెక్కింపులో ఈవీఎం మారిపోవడంపై అనుమా­నాలు వ్యక్తమవుతున్నాయి. పైగా, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పట్టుబట్టిన తర్వాత అసెంబ్లీ ఈవీఎం తెచ్చారు. అది కూడా ఓపెన్‌ కాకపోవడం అనుమానాలను మరింత బల­పరుస్తోంది. ఇలా ఈవీఎం మారిన ఘటన ఒక్కటే బయటపడింది. ఎవరికీ తెలియకుండా రాష్ట్ర­వ్యాప్తంగా ఇంకెన్ని ఈవీఎంలు మారి­పోయాయి, వాటిలో ఎన్ని లెక్కలు తేడాలు­న్నా­యన్న అనుమానాలు వ్యక్త­మ­వుతున్నాయి. ఈవీ­ఎం మారిపోవడం, అసెంబ్లీ ఈవీఎం తెరుచుకోకపోవడంపై ఈసీని ఆశ్రయిస్తామని వైఎస్సార్‌సీపీ అభ్యర్థి లక్కప్ప చెప్పారు. ఇలా ఈవీఎంలపై అనుమా­నం ఉన్న అభ్యర్థులు వారంలోగా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఏ అభ్యర్థి నుంచైనా ఫిర్యాదు వస్తే 5% వీవీ ప్యాట్‌ స్లిప్పు­లను లెక్కించాలి. ఈ మేరకు సుప్రీంకోర్టు గతంలోనే తీర్పు ఇచి్చంది. ఈ ఎన్నికల్లో ఆది నుంచి పలు వివాదాలు చోటు చేసుకోవడం, ఇప్పుడు మడకశిరలో ఈవీఎంనే మార్చే­సిన తీరుతో ఓట్ల లెక్కింపుపై అనుమానాలున్న అభ్యర్థు­లు ఈసీకి ఫిర్యాదులు చేయడానికి సిద్ధపడుతున్నారు.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement