Top Stories
ప్రధాన వార్తలు
సీఎం జగన్ రేపటి ప్రచార షెడ్యూల్ ఇలా...
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం( మే11) మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు. ఉదయం 10 గంటలకు నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని చిలకలూరిపేట కళామందిర్ సెంటర్లో జరిగే సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలోని తాలూకా ఆఫీస్ సెంటర్లో జరిగే సభలో పాల్గొంటారు. చివరిగా మధ్యాహ్నం 3 గంటలకు కాకినాడ పార్లమెంట్ పరిధిలో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఉన్న ఉప్పాడ బస్‌స్టాండ్ సెంటర్లో జరిగే సభలో పాల్గొంటారు.
ఎన్నికల సంఘం తీరుపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, విజయవాడ: ఎన్నికల సంఘంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ రఘునందర్రావు ముందుకు డీబీటీ స్కీంలకు నిధుల విడుదల కేసు వచ్చింది. ఈ విషయంలో ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలను హైకోర్టు తప్పుబట్టింది.సంక్షేమ పథకాలకు సంబంధించి (Direct Benefit transfer) డీబీటీ నేరుగా అర్హుల ఖాతాల్లో జమ చేయడానికి ఉద్దేశించిన నిధుల విడుదలకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఎన్నికల సంఘం ఏ అధికారంతో తిరిగి క్లారిఫికేషన్ అడిగిందంటూ హైకోర్టు ప్రశ్నించింది. ‘‘రిట్ అప్పీలు వేయకుండా హైకోర్టు ఆదేశాలను ఈసీ ఏవిధంగా పక్కనపెడుతుంది?. లా పట్ల ఈసీకి ఉన్న అవగాహన ఇదేనా?. తెలంగాణాలో రైతు భరోసాకు ఏ రకంగా అనుమతిచ్చారు? ఈ రాష్ట్రంలో ఈ పథకాలను ఏవిధంగా అడ్డుకుంటారు?’’అంటూ హైకోర్టు సీరియస్ అయ్యింది."హైకోర్టు కన్నా ఎక్కువ అని ఎలక్షన్ కమిషన్ భావిస్తున్నట్టుంది? న్యాయ సమీక్షాధికారం దీన్ని చూడాల్సి వస్తుంది. 2019లో పసుపు కుంకుమ సహా ఇతర పథకాలకు అనుతించినప్పుడు అనుసరించిన కోడ్ నియమాలను ఇప్పుడు పాటించడంలేదని స్పష్టం అవుతోంది. అప్పుడు అమలవుతున్న పథకాల విషయంలో అనుసరించిన కోడ్‌ను ఇప్పుడు అనుసరించలేదని వెల్లడి అవుతోంది’’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. డీబీటీ పథకాల కింద నిధుల విడుదలపై అప్పీలుకు వచ్చిన నవతరం పార్టీకి హైకోర్టు ప్రశ్నలు వేసింది. "ఎన్నికల్లో అసలు నవతరం పార్టీ ఎన్నిచోట్ల పోటీచేస్తోంది? గతంలో ఎన్నిచోట్ల పోటీచేసింది?" అని ప్రశ్నించింది. అప్పీలు వేసిన లాయర్ల తీరు తీవ్ర దిగ్భ్రాంతికరంగా ఉందని వ్యాఖ్యానించిన డివిజన్ బెంచ్.. హౌస్ మోషన్ కింద పిటిషన్ వేయడానికి రిజిస్ట్రీ సిబ్బందిని బెదిరిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ధర్మాసనం వ్యాఖ్యల అనంతరం హైకోర్టుకు పిటిషనర్ తరఫు న్యాయవాది నాదకర్ణి క్షమాపణలు చెప్పారు. డీబీటీ పథకాల కింద నిధుల విడుదలకు సమయం లేనందున ఈ కేసును జూన్‌కు వాయిదా వేసింది హైకోర్టు.ఈ కేసులో ఏం జరిగింది?ఏపీలో ఇన్పుట్ సబ్సిడీ, విద్యా దీవెనతో పాటు మహిళలకు ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం కింద రూ.14,165 కోట్ల నిధులను లబ్దిదారులకు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతిని నిరాకరిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులను హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు చేయొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో 10వ తేదీన నిధుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు వెసులుబాటు నిచ్చినట్లయింది. అయితే నిధుల పంపిణీకి సంబంధించి ఏ రకమైన ప్రచారం చేసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈసీ ఏం చేసింది?హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఏపీ ఎన్నికల సంఘం పరిశీలించింది. దీనికి సంబంధించి సమీక్షించి తమకు ఆదేశాలివ్వాలని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల సంఘం పంపింది. అయితే ఇన్పుట్ సబ్సిడీ, వైఎస్సార్ చేయూత, ఆసరా, జగనన్న విద్యాదీవెన, ఈబీసీ నేస్తం పథకాలకు నగదు పంపిణీ విషయంలో సీఈసీ ముందడుగు వేయలేదు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిఫికేషన్ అడిగింది. ఇవ్వాళే డిబిటి నిధులు విడుదల చేయాల్సిన అవశ్యకత ఏముందంటూ ప్రశ్నించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసే అవకాశం లేకుండా పోయింది.మళ్లీ హైకోర్టు ముందుకు ఓ వైపు డిబిటి పంపిణీ నిలిచిపోయినట్టయింది. ఇదే సమయంలో నవతరం పార్టీ పేరిట హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలయింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు మొత్తం వ్యవహారాన్ని పరిశీలించి ఈసీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
తీహార్ జైలు నుంచి కేజ్రీవాల్ రిలీజ్
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మధ్యంత బెయిల్ ఇచ్చిన గంటల వ్యవధిలోనే శుక్రవారం(మే10) సాయంత్రం ఢిల్లీ సీఎం, ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి బయటికి వచ్చిన ఆయన కారులో నుంచి ఆప్ కార్యకర్తలకు అభివాదం చేశాారు. నియంతృత్వం నుంచి దేశాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. ఇది ప్రజాస్వామ్యం సాధించిన విజయమని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ తరపున ప్రచారం చేయడానికి గాను సుప్రీంకోర్టు కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే మధ్యంతర బెయిల్‌పై ఉన్న సమయంలో సీఎంగా ఎలాంటి బాధ్యతలు నిర్వహించొద్దని, ఫైల్స్ చూసేందుకు వీలులేదని కోర్టు స్పష్టం చేసింది. తిరిగి జూన్2న కేజ్రీవాల్ లొంగిపోవాలని కోర్టు తెలిపింది. మే 25న ఢిల్లీలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుండటంతో ప్రచారం కోసం కేజ్రీవాల్‌కు దేశ అత్యున్నత కోర్టు మధ్యంతర బెయిల్ రూపంలో భారీ ఊరటనిచ్చింది. కాగా, లిక్కర్‌స్కామ్ కేసులో మార్చి 21న అరెస్టయిన కేజ్రీవాల్ అప్పటి నుంచి జైలులో ఉన్న విషయం తెలిసిందే.
RCB Vs PBKS: సారీ చెప్పిన కోహ్లి!.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
ఐపీఎల్-2024లో పంజాబ్ కింగ్స్ కథ ముగిసింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో గురువారం నాటి మ్యాచ్‌లో ఓటమితో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.ఈ నేపథ్యంలో పంజాబ్ అభిమానులతో పాటు ఆ జట్టు మేనేజ్మెంట్కు సైతం భంగపాటు తప్పలేదు. అయితే, జట్టు పరాభవం నేపథ్యంలోనూ పంజాబ్ ఫ్రాంఛైజీ సహ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా వ్యవహరించిన తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది.కోహ్లి వికెట్ పడగానే కాగా ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ను ఆర్సీబీ 60 పరుగులతో చిత్తు చేసింది. ఇక ఈ విజయంలో విరాట్ కోహ్లిదే కీలక పాత్ర అన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 47 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 7 ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో 92 పరుగులు చేశాడు.Going..Going..GONE!Virat Kohli clobbers that delivery into the stands in grand fashion! 💥Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #PBKSvRCB pic.twitter.com/Y5eVp7Q6fN— IndianPremierLeague (@IPL) May 9, 2024అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో రిలీ రొసోవ్‌కు క్యాచ్ ఇవ్వడంతో ఈ ఆర్సీబీ ఓపెనర్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఈ నేపథ్యంలో ప్రీతి జింటా చప్పట్లు కొడుతూ కోహ్లి వికెట్‌ను సెలబ్రేట్ చేసుకుంది. అయితే, ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు.The Punjab Kings bounce back with crucial breakthroughs, especially the big one of Virat Kohli 👏👏#RCB 238/5 with 5 deliveries leftWatch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #PBKSvRCB pic.twitter.com/9mu2bMjrWV— IndianPremierLeague (@IPL) May 9, 2024లక్ష్య ఛేదనలో పంజాబ్ బ్యాటర్లంతా విఫలం కావడంతో ఆ జట్టుకు పరాజయమే ఎదురైంది. ఈ నేపథ్యంలో నిరాశకు లోనైనా ప్రీతి జింటా హుందాగా వ్యవహరించింది.సారీ చెప్పిన కోహ్లి!.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్‌ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న సమయంలో.. మ్యాచ్‌ను తాము లాగేసుకున్నందుకు ప్రీతి జింటాకు సారీ చెప్పాడు. ఇందుకు బదులుగా కోహ్లితో కరచాలనం చేస్తూ... ‘‘మరేం పర్లేదు’’ అన్నట్లుగా నవ్వులు చిందించిందామె.ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో లక్నో యజమాని సంజీవ్ గోయెంకాను ప్రీతి జింటాతో పోలుస్తూ నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు. సంజీవ్ గోయెంకాకు చురకలుమ్యాచ్ ఓడటమే కాదు.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించినా ప్రీతి ఆ బాధ బయటకు తెలియకుండా నవ్వుతూ కవర్ చేసిందని.. ఆమెను చూసి గోయెంకా చాలా నేర్చుకోవాలని చురకలు అంటిస్తున్నారు. కాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో లక్నో ఓటమి నేపథ్యంలో ఆ జట్టు ఓనర్ సంజీవ్ గోయెంకా కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు బహిరంగంగానే చీవాట్లు పెట్టిన విషయం తెలిసిందే. చదవండి: ద్రవిడ్ గుడ్ బై!.. టీమిండియా కొత్త కోచ్‌గా ఫారినర్?.. జై షా కామెంట్స్ వైరల్Preity Zinta with Virat Kohli at the post match presentation ceremony. ❤️ pic.twitter.com/z1G2L1IIr8— Mufaddal Vohra (@mufaddal_vohra) May 10, 2024Virat Kohli said Sorry to Preity Zinta when he met with her in post match award presentation & Preity Zinta smiles.- King Kohli winning the hearts of everyone, He's a pure soul. ❤️🐐 pic.twitter.com/2h2JFnZsyz— Tanuj Singh (@ImTanujSingh) May 10, 2024
పగలు బీజేపీతో, రాత్రి కాంగ్రెస్‌తో బాబు కాపురం చేస్తాడు: సీఎం జగన్
‘వైఎస్సార్ చనిపోయాక ఆయనపై కుట్రలు చేసింది ఎవరు?, మహానేత వైఎస్సార్ పేరు ఛార్జ్‌షీట్‌లో పెట్టింది ఎవరు?, వైఎస్సార్ కుటుంబాన్ని అణగదొక్కాలని కుట్రలు పన్నింది ఎవరు?, వైఎస్సార్ శత్రువులతో చేతులు కలిపిన వీరా వైఎస్సార్ వారసులు.., కాంగ్రెస్‌కు వైఎస్సార్ అభిమానులు ఏనాడో సమాధి కట్టారు..’ అంటూ వైఎస్సార్ కడప జిల్లా ఎన్నికల ప్రచార సభ వేదికగా కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. వైఎస్సార్ పేరును సమాధి చేయాలని కాంగ్రెస్ చూస్తోందని, రాజకీయ స్వలాభం కోసం, ఇన్నేళ్ల తర్వాత ఎన్నికల సమయంలో నాన్న సమాధి దగ్గరకు వెళ్తారంట అంటూ ధ్వజమెత్తారు. వైఎస్సార్ మరణం తర్వాత తనను, తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారని, తనను అన్యాయంగా 16 నెలలు జైల్లో పెట్టారని పేర్కొన్నారు.నోటా ఓట్లు కూడా రాని కాంగ్రెస్‌కు ఎవరైనా ఓటు వేస్తారా అని సీఎం జగన్ ప్రశ్నించారు. రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్‌కు ఎవరైనా ఓటు వేస్తారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే.. మన కళ్లను మనం పొడుచుకున్నట్లేనని అన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే.. టీడీపీని గెలిపించడమేనని పేర్కొన్నారు. వైఎస్సార్ వారసులని వస్తున్న వారి కుట్రలను చూస్తున్నామన్న వైఎస్ జగన్.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు మనిషేనని తెలిపారు. పగలు బీజేపీతో, రాత్రి కాంగ్రెస్‌తో బాబు కాపురం చేస్తాడని మండిపడ్డారు. చంద్రబాబు కోసమే కాంగ్రెస్ పనిచేస్తుందని దుయ్యబట్టారు.సీఎం జగన్ పూర్తి ప్రసంగంవచ్చే ఎన్నికలు అయిదేళ్ల భవిష్యత్తును నిర్ణయించేవి. మరో మూడు రోజుల్లో బ్యాలెట్ బద్దలు కొట్టడానికి సిద్ధమా?ఈ జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేందుకు జరగుతున్న ఎన్నికలు కావు.. రాబోయే అయిదేళ్ల ఇంటింటి అభివృద్ధి, పథకాల కొనసాగింపును నిర్ణయించేవి.ఈ ఎన్నికల్లో జగన్‌కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటికి అభివృద్ధి, పేదవాడి భవిష్యతుకు భరోసా.చంద్రబాబు ఓటేస్తే పథకాలన్నింటికి ముగింపు, మళ్లీ మోసపోవడమే.చంద్రబాబుకు ఓటేయడమంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమే59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాంఎన్నికలయ్యాక మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేస్తాడు.మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావించాం99 శాతం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన వాగ్దానాలను నెరవేర్చాంరాజకీయాల్లో విశ్వసనీయత అనే పదానికి అర్థం తీసుకొచ్చాంవివిధ పథకాలకు మీ బిడ్డ 130 సార్లు బటన్ నొక్కాడు.అక్కాచెల్లెమ్మలను గత ప్రభుత్వం పట్టించుకోలేదు.2 లక్షల 31 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాం.అక్కచెల్లెమ్మలకు నేరుగా రూ.2లక్షల 70 వేల కోట్లు అందించాం.నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చాంప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం3వ తరగతి నుంచే టోఫెల్ క్లాసులు, సబ్జెక్ట్ టీచర్లుప్రభుత్వ స్కూళ్లలో 6వ తరగతి నుంచే డిజిటల్ బోధనబడులు తెరిచే నాటికే విద్యాకానుక, గోరుముద్దఅమ్మ ఒడి, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన ద్వారా మార్పులువిద్యారంగంలో మేం చేసిన అభివృద్ధి బాబు హయాంలో జరిగిందా?అక్కాచెల్లెమ్మలకు తోడుగా ఉన్నాంఅక్కాచెల్లెమ్మల కోసం ఆసరా, సున్నావడ్డీ,చేయూత.అక్కాచెల్లెమ్మల కోసం కాపు నేస్తం, ఈబీసీ నేస్తంఅక్కాచెల్లెమ్మల పేరుపై 31 లక్షల ఇళ్ల పట్టాలిచ్చాంఅందులో 22 లక్షల ఇళ్లు కడుతున్నాంగతంలో ఎప్పుడైనా ఇంత మంచి జరిగిందా?అవ్వాతాతలకు ఇంటి వద్దకే రూ. 3 వేల పెన్షన్‌ఇంటి వద్దకే పౌరసేవలు, సంక్షేమ పథకాలుసకాలంలో ఇన్పుట్ సబ్సిడీ అందిస్తున్నాంవిత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్నకు తోడుగా నిలిచాంగతంలో రైతన్నకు ఇంత మంచి జరిగిందా?పెట్టుబడి సాయంతో రైతన్నకు తోడుగా ఉన్నాంరైతులకు పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాంగ్రామస్థాయిలోనే రైతులను చేయి పట్టుకొని నడిపించే ఆర్బీకే వ్యవస్థస్వయం ఉపాధికి అండగా వాహనమిత్ర, నేతన్న నేస్తం,మత్స్యకార భరోసాన్యాయవాదులకు లా నేస్తంజగనన్న తోడు, చేదోడుతో చిరువ్యాపారులకు అండగానిలిచాంగతంలో ఈ పథకాలు ఉన్నాయా?నాడు-నేడు ద్వారా ప్రభుత్వాసుపత్రుల రూపురేఖలు మార్చాంఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 25 లక్షల వరకు పెంచాంపేషెంట్ విశ్రాంతి సమయంలోనూ ఆర్థిక సాయం అందించాంఆరోగ్య ఆసరా, ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్‌విలేజ్ క్లినిక్‌ల ద్వారా పేదవాడిని ఆదుకున్నాంగతంలో ఇంత అభివృద్ధి జరిగిందాపేదవాడి ఆరోగ్యం కోసం ఇంతగా పరితపించిన ప్రభుత్వం ఉందా?14 ఏళ్లు సీఎంగా చేశానని చెప్పుకునే చంద్రబాబు ఏం చేశాడు?చంద్రబాబు పేరు చెప్తే ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా?6 వందల సేవలు అందిస్తున్న గ్రామ సచివాలయం, వాలంటీర్ వ్యవస్థఅవ్వాతాతలకు ఇంటింటికీ అందుతున్న పెన్షన్, ఇంటి వద్దకే రేషన్, చంద్రబాబుది ఊసరవెళ్లి రాజకీయం చంద్రబాబు బాగా ముదిరిపోయిన తొండముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న బీజేపీతో ఎలా జతకడతారు.మరోవైపు మైనార్టీల ఓట్ల కోసం బాబు దొంగ ప్రేమ కురిపిస్తున్నాడు.ఆరునూరైనా ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు కొనసాగించాల్సిందే. NRC, CAA అంశాల్లోనూ మైనార్టీలకు అండగా ఉంటాంమోదీ సభలో చంద్రబాబు ఇలా చెప్పగలడా?మైనార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని చెప్పిన బాబు.. ఇంకా ఎందుకు ఎన్డీయేలో కొనసాగుతున్నారు?ముస్లింలకు మతప్రాతిపదికన 4శాతం రిజర్లేషన్లు ఇవ్వలేదు.వెనుకబాటుతనం ఆధారంగా ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చారుమైనార్టీల మనోభావాలకు అండగా మీ బిడ్డ తోడుగా ఉంటాడు.రాజకీయం కోసం వారి జీవితాలతో చెలగాటం ఆడటం న్యాయమేనా?మైనార్టీ సోదరి శాసన మండలి ఉపాధ్యక్షురాలిగా కూడా ఉంది.175 స్థానాల్లో మైనార్టీలకు ఏడు అసెంబ్లీ స్థానాలు ఇచ్చాం.నలుగురికి ఎమ్మెల్యేలు,నలుగురు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చాం.కడప రాజకీయాల్లో ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు కడప జిల్లాలో ఉన్న రాజకీయ చైతన్యం ఏపీలో అతికొద్ది జిల్లాల్లోనే ఉంటుందివైఎస్సార్ చనిపోయిన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు పెట్టింది.అదే సమయంలో నేనుు ఎంపీగా నిలబడినప్పుడు నన్ను భారీ మెజార్టీతో గెలిపించారు.నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీలతో, రాష్ట్ర విభజన చేసిన ద్రోహులతో ప్రజలు జతకట్టాలా?రాజకీయంగా వైఎస్సార్ కుటుంబాన్ని అణగదొక్కాలని దేశంలోని అన్ని వ్యవస్థలను మన మీద ప్రయోగించిన వారితో కలిసిపోయి అదే కాంగ్రెస్, అదే టీడీపీతో కలిసిపోయి వైఎస్సార్ అనే పేరే కనపడకుండా చేయాలనే కుట్ర జరుగుతోంది.వైఎస్ అవినాష్ రెడ్డి నాకన్న 13 ఏళ్లు చిన్నవాడు .ఈయన భవిష్యత్తును నాశనం చేయడానికి ఈనాడు, చంద్రబాబు, ఆంధ్రజ్యోతి నుంచి కుట్రలు వేస్తున్నారు. వీళ్లంతా మనుషులేనా?అవినాష్ ఎలాంటి వాడో నాకు, మీ అందరికి తెలుసు.గొప్ప మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నా 2014లో ఆయన చేసిన మోసాలు గుర్తున్నాయా?రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?పొదుపు సంఘాల రుణాలు మాఫీ అన్నాడు.. చేశాడా?ఆడబిడ్డ పుడితే రనూ. 25 వేలు డిపాజిట్ చేస్తానన్నాడు.. చేశాడా?ఇంటింటికీ జాబు.. లేదంటే నిరుద్యోగ భృతి అన్నాడు.. ఇచ్చాడా?పేదలకు 3 సెంట్ల స్థలం అన్నాడు. సెంటు స్థలమైనా ఇచ్చాడా?సింగపూర్‌ను మించి అభివృద్ధి చేస్తానన్నాడు.. చేశాడా?ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తానన్నాడు.. నిర్మించాడా?మళ్లీ ఇప్పుడు కొత్త కొత్త మోసాలతో వస్తున్నారు..నమ్ముతారా?చంద్రబాబు సూపర్ సిక్స్, సెవెన్ అంటున్నాడు, నమ్ముతారా?ఇంటింటికి కేజీ బంగారం, బెంజ్ కారు ఇస్తారంట.. నమ్ముతారా?బాబు జీవితమంతా అబద్దాలు, మోసాలు, కుట్రలు.చంద్రబాబు చేసింది.. దోచుకోవడం, దాచుకోవడం.చంద్రబాబు దగ్గర దోచుకున్న డబ్బులు దండిగా ఉన్నాయి.చంద్రబాబు డబ్బులు ఇస్తే వద్దనకండి.. తీసుకోండి.ఓటేసే ముందు మీకు ఎవరి వల్ల మంచి జరిగిందోదో ఆలోచన చేయండి.వాలంటీర్ల సేవలు కొనసాగాలంటే రెండు బటన్లు ఫ్యాన్‌పై నొక్కాలి.పేదవాడి భవిష్యత్ కోసం రెండు బటన్లు ఫ్యాన్ గుర్తుపై నొక్కాలి.175కు 175 అసెంబ్లీ, 25కు, 25 ఎంపీ సీట్లు గెలవాల్సిందే.
నటి దారుణ హత్య.. 13 ఏళ్ల తర్వాత దోషిని తేల్చిన కోర్టు
దాదాపు 13 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన ప్రముఖ నటి కేసులో సంచలన నిజాలు బయటపడ్డాయి. ఆమెని దారుణంగా హత్య చేసింది ఎవరో తెలిసిపోయింది. ఈ క్రమంలోనే విచారణ పూర్తవగా.. తాజాగా కోర్టు తీర్పు ఇచ్చింది. సవతి తండ్రి ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిసి అందరూ షాకవుతున్నారు. ఇంతకీ అసలేం జరిగింది?1978లో ముంబయిలో పుట్టి పెరిగిన రేష్మా పటేల్.. సినిమాల్లోకి వచ్చేటప్పుడు లైలా ఖాన్ అని తన పేరు మార్చుకుంది. 2002లో కన్నడ మూవీతో హీరోయిన్ అయ్యింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ రాజేశ్ ఖన్నాతో చేసిన 'వాఫా'.. ఈమెకు ఓ మాదిరి గుర్తింపు తీసుకొచ్చింది. 2011లో 'జిన్నాత్' అనే సినిమా చేస్తుండగా.. విరామం రావడంతో కుటుంబంతో కలిసి ట్రిప్‌కి వెళ్లింది. ఆ తర్వాత కనిపించకుండా పోయింది.(ఇదీ చదవండి: రొమాంటిక్ సీన్స్.. నాకు ఒళ్లంతా దద్దుర్లు వచ్చేశాయి: టాలీవుడ్ హీరోయిన్)దీంతో లైలా తండ్రి నాదిర్ పటేల్.. తన కుటుంబ సభ్యులు కనిపించట్లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ మొదలుపెట్టారు. నటి మొబైల్ సిగ్నల్ చివరగా నాసిక్‌లో ఉన్నట్లు గుర్తించారు. లైలాకు అక్కడ ఫామ్ హౌస్ ఉందని తెలిసి పోలీసులు వెళ్లగా.. అది కాస్త కొంతవరకు అగ్ని ప్రమాదానికి గురై ఉంది. కొన్నాళ్ల తర్వాత జమ్ము కశ్మీర్లో వీళ్ల వాహనం దొరకడంతో కేసు క్లిష్టంగా మారింది. అయితే లైలాతో పాటు ఆమె కుటుంబ సభ్యుల ఆచూకీ మాత్రం దొరకలేదు.లైలా సవతి తండ్రి పర్వేజ్ తక్‌పై ఎందుకో పోలీసులకు అనుమానమొచ్చింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆస్తి విషయంలో గొడవ జరిగిందని.. దీంతో భార్య షెలీనాను చంపి ఆ తర్వాత లైలా-ఆమె అక్క అమీనా, కవలలు జారా-ఇమ్రాన్, కజిల్ రేష్మాని హత్య చేసినట్లు ఒప్పుకొన్నాడు. ఆ తర్వాత బంగ్లా నుంచి కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహాలని వెలికి తీశారు. మొత్తంగా 40 మందిని విచారించారు. ఈ క్రమంలోనే తాజాగా ముంబై సెషన్స్ కోర్టు.. పర్వేజ్ని ఈ కేసులో దోషిగా తేల్చింది. మే 14న శిక్ష ఖరారు చేయనుంది.(ఇదీ చదవండి: 20 ఏళ్లకే పెళ్లి.. 'బిగ్‌బాస్' స్టార్ షాకింగ్ నిర్ణయం)
ఆ ముగ్గురు రాజకీయ జోకర్లు.. మాజీ సీఎం సెటైర్లు
బీజేపీ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కాంగ్రెస్, శివసేన నేతలను జోకర్లుగా అభివర్ణించారు. ఆ ముగ్గురు రాజకీయ జోకర్లుకాంగ్రెస్ నేతలు మణిశంకర్ అయ్యర్, శామ్ పిట్రోడా, శివసేన (యూబీటీ) రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ జోకర్లని, వాళ్లని ఎవరూ సీరియస్‌గా తీసుకోరని శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఎన్నికల్లో ఓటమి భయంతో హాస్యాస్పదమైన ప్రకటనలు చేస్తున్నారని, ఇలా చేస్తూనే ఉంటారు. ప్రజలు వాటిని ఎంటర్టైన్గా భావిస్తారని తెలిపారు. ఎవరూ సీరియస్‌గా తీసుకోరువారి స్థాయి కంటే దిగజారి ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారు. ఇలాంటి చౌకబారు ప్రకటనలతో రాజకీయ జోకర్లుగా మారారు. అయ్యర్, పిట్రోడా, రౌత్‌లను ఎవరూ సీరియస్‌గా తీసుకోరు అని చౌహాన్ వ్యాఖ్యానించారు. 56 అంగుళాల ఛాతీ ఉన్న ప్రధాని మోదీ‘ప్రతిపక్ష ఇండియా కూటమి నాయకులు మేధోపరంగా దివాళా తీశారు. ఇది మునుపటి బలహీనమైన యూపీఏ ప్రభుత్వం కాదని, 56 అంగుళాల ఛాతీ ఉన్న ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం’ అని ఇదే విషయాన్ని అయ్యర్ గమనించాలి చౌహాన్ సూచించారు.భారత్ అంటే అభివృద్దికి కేరాఫ్ అడ్రస్‌మోదీపై ప్రశంసల వర్షం కురిపించిన చౌహాన్.. ‘భారత్ అంటే అభివృద్దికి కేరాఫ్ అడ్రస్. దేశాన్ని ప్రపంచ పటంలో పెట్టి అభివృద్ధి బాటలు వేశారని అన్నారు. అదే సమయంలో దేశానికి ఇబ్బంది కలిగించే ఎవరినీ విడిచిపెట్టరని హెచ్చరించారు.ప్రపంచ దేశాలకు భారత్ విశ్వ గురువు ‘ప్రధాని మోదీ ఆధ్వర్యంలో దేశం విశ్వ గురువుగా మారుతుంది. ప్రజలు అభివృద్ధి చెందుతారు. కాంగ్రెస్ మరో ఐదేళ్ల పాటు డ్రామాలు ఆడవలసి ఉంటుంది. కానీ అలా చేయడానికి తగినంత మంది సభ్యులు ఉండరు’ అని చౌహాన్ నొక్కాణించారు.
బ్రిజ్‌భూషణ్‌కు షాక్.. రౌస్ అవెన్యూ కోర్టు కీలక తీర్పు
న్యూఢిల్లీ : జాతీయ రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్‌సింగ్‌కు మరో ఎదురు దెబ్బ తగలింది. లైంగిక వేధింపుల కేసు వ్యవహారంలో బ్రిజ్ భూషణ్ సింగ్‌పై అభియోగాలు మోపాలని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. అందుకు తగిన ఆధారాలు రికార్డుల్లో ఉన్నాయని కోర్టు పేర్కొంది. బ్రిజ్ భూషణ్‌పై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 354 (మహిళల నిరాడంబరతకు భంగం కలిగించడం), 354-ఎ (లైంగిక వేధింపులు), 506 (నేరపూరిత బెదిరింపు) కింద అభియోగాలు మోపాలని ఆదేశించింది. ఫెడరేషన్ మాజీ సహాయ కార్యదర్శి వినోద్ తోమర్‌పై కూడా సెక్షన్ 506 కింద అభియోగాలు మోపాలని పోలీస్ శాఖకు కోర్టు సూచించింది. గత ఏడాది జూన్‌లోలైంగిక వేధింపుల కేసులో గత ఏడాది జూన్‌లో బ్రిజ్ భూషణ్,అతని సహచరుడు వినోద్ తోమర్‌పై ఢిల్లీ పోలీసులు అభియోగాలు మోపారు. ఛార్జిషీట్లో ఐపీసీ సెక్షన్లు 354 (దౌర్జన్యం లేదా నేరపూరిత శక్తి), 354ఏ (లైంగిక వేధింపులు), 354డీ (వెంబడించడం), 109 (ప్రేరేపణ), 506 (నేరపూరిత బెదిరింపు) కింద కేసులు నమోదు చేశారు.1,500 పేజీల ఛార్జిషీట్‌లోపోలీసులు 1,500 పేజీల ఛార్జిషీట్లో బ్రిజ్ భూషణ్‌పై ఆరోపణలకు మద్దతుగా రెజ్లర్లు, ఒక రిఫరీ, ఒక కోచ్, ఫిజియోథెరపిస్ట్‌తో సహా నాలుగు రాష్ట్రాలకు చెందిన 22 మంది సాక్షుల వాంగ్మూలాలను చేర్చారు.నో టికెట్‌ఉత్తర్ ప్రదేశ్ కైసర్‌గంజ్ లోక్‌సభ స్థానానికి వరుసగా మూడు సార్లు బ్రిజ్‌భూషణ్ ప్రాతినిధ్యం వహించారు. అయితే లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ గతేడాది జనవరిలో సాక్షి మలిక్, బజ్రంగ్ పునియా, వినేశ్ ఫొగాట్ సహా అగ్రశ్రేణి రెజ్లర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనపై పార్టీలో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఈ క్రమంలోనే ఈ సారి కైసర్‌గంజ్ స్థానంలో పార్టీ ఆయన కుమారుడు కరణ్ భూషణ్ సింగ్‌కు అవకాశం కల్పించింది. కాగా, గత నెలలో కరణ్ భూషణ్ సింగ్ ఎంపీగా నామినేషన్ వేసే సమయంలో 10 వేలమంది బ్రిజ్‌భూషణ్ అనుచరులు.. 700 వాహనాలతో తరలివచ్చినట్లు జాతీయ మీడియా కథనాలు తెలిపాయి.
నవ్వుతారేమో అనుకున్నా: లాపతా లేడీస్ ప్రతిభ ఇంట్రస్టింగ్ జర్నీ
బాలీవుడ్ దర్శకురాలు కిరణ్‌రావు (బాలీవుడ్ హీరో ఆమీర్ ఖాన్ మాజీ భార్య) దర్శకత్వంలో వచ్చిన లాపతా లేడీస్ ఓటీటీలో మంచి ఆదరణ సంపాదించుకుంది. కుటుంబం, వైవాహిక వ్యవస్థలో మహిళల స్థితిగతులు, అమ్మాయిల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా జరిగే బాల్య వివాహాలు, అమ్మాయిల తెగవును పట్టి ఇచ్చిన సినిమా ఇది. ముఖ్యంగా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన ప్రతిభా రాంటా తన అధ్బుతమైన నటనతో ఆకట్టుకుంది. సిమ్లా టూ బాలీవుడ్ ప్రతిభ రాంటా ఇంట్రస్టింగ్ జర్నీ ఒక సారి చూద్దాం.ఖుర్బాన్ హువా టీవీ సీరియల్‌తో వెలుగులోకి వచ్చింది ప్రతిభా రాంటా. ఆ తరువాత వెబ్ సిరీస్ చేస్తుండగా కిరణ్ రావు దృష్టిలో పడింది. అలాలాపతా లేడీస్‌లో అవకాశం వచ్చింది. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని తానేమిటో నిరూపించుకుంది. బాలీవుడ్‌కి పరిచయం అయిన కొత్త ముఖాల్లో ప్రతిభ రాంటా. నిజంగా తన యాక్టింగ్ ప్రతిభ, ఒకదాని తర్వాత ఒకటి తన ఆన్-స్క్రీన్ పెర్ఫార్మెన్స్తో, ముఖ్యంగా లాపతా లేడీస్ 'జయ' పాత్రలో సత్తా చాటింది. ఇటీవల విడుదలైన వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్లో 'వహీదా' (సంజీదా షేక్) కుమార్తె 'షామా' పాత్రను పోషించింది. 24 ఏళ్ల వయసులో చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అయితే ఈ ప్రయాం అంత సాఫీగా సాగలేదు.ఎవరీ ప్రతిభా రాంటాసందేశనా రాంటా,, రాజేశ్ రాంటా దంపతుల కుమార్తె ప్రతిభా రాంటా. సిమ్లాలో పెరిగింది. చిన్నప్పటి నుంచీ డాన్స్ అంటే ఇష్టం. డాన్స్‌లో గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేసింది. అలా నటించాలనే ఆసక్తి పెరిగింది. ఆ మాటే ఇంట్లో చెబితే యాక్టింగ్ అంటే ఏంటి? అని అడిగారట. ఎందుకంటే కుటుంబంలో చాలా మంది ఉపాధ్యాయులు, అందుకే వారికి నటన గురించి ఏమీ తెలియదట. ఇంజనీర్, డాక్టర్ లేదా మరేదైనా ఇతర ప్రొఫెషనల్‌గా ప్రతిభను చూడాలని ఆశించారు. దీంతో యాక్టింగ్‌లో చేరడం చాలా కష్టమేమో , తనను చూసి నవ్వుతారేమో అనిపించిందని ఒక ఇంటర్య్వూలో వెల్లడించింది.పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత, ప్రతిభ ఎలాగోలా తన తల్లిదండ్రులను ఒప్పించి ఉన్నత చదువుకోసం ముంబైకి చేరింది. ఆడిషన్లు ఇవ్వడం మొదలు పెట్టింది. అందాల పోటీలో పాల్గొంది. 2018లో మిస్ ముంబై టైటిల్‌ను గెలుచుకుంది. నిస్సందే 2018 మిస్ ముంబై అందాల పోటీల్లో మిస్ ముంబై కిరీటం గెలుచుకుంది. దీంతో కేవలం ఆరు నెలలకే ‘ఖుర్బాన్ హువా’ టీవీ సీరియల్ 'చాహత్' పాత్రలో తొలి ఆఫర్ వచ్చింది. తరువాత,ఆధా ఇష్క్ అనే వెబ్ షోలో కూడా కనిపించింది. View this post on Instagram A post shared by Pratibha Rantta (@pratibha_ranta)ఇక లాపతా లేడీస్ ఆఫర్ గురించి మాట్లాడుతూ మొదట్లో కాస్త భయమేసిందని, అయితే సినిమాలో ‘జయ’ కథ ఒక విధంగా నిజ జీవితానికి సరిగ్గా సరిపోతుందని, అందుకే ఆ పాత్రలో పూర్తిగా లీనమైపోయానని చెప్పుకొచ్చింది. మొత్తానికి తన జర్నీ అంతా ఒక మ్యాజిక్‌లా సాగిపోయిందని వెల్లడించింది మెరిసే కళ్లతో.
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్
ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన, భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్ల నుండి ప్రేరణ పొంది అద్భుతమైన మరియు వైవిధ్యమైన శ్రేణి సమకాలీన, రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్లు, కస్టమర్లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా, ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్, ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్లెట్లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్ 18కేరట్ మరియు 22కేరట్ బంగారంలో విస్తృతమైన శ్రేణి డిజైన్లతో, నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని సంపూర్ణం చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్లెట్లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌కు వ్యతిరేకంగా యాడ్ .. బీజేపీ నేత సీరియస్
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
- ‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
- వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
- ఐపీఎల్ మధ్యలోనే దుబాయ్ వెళ్లిన సన్‌రైజర్స్ కెప్టెన్..
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
- టీడీపీ అడ్డంగా బుక్కైంది: సజ్జల కీలక వ్యాఖ్యలు
- పాపం బ్రెజిల్.. ఎటు చూసినా వరదలే..
- కష్టాల్లో 'పద్మ శ్రీ మొగిలయ్య'.. సాయం చేసిన బుల్లితెర నటి
- ఫోటో తీస్తే కవిత రాసే కెమెరా.. ఇది కదా టెక్నాలజీ అంటే!
సినిమా
రొమాంటిక్ సీన్స్.. ఒళ్లంతా దద్దుర్లు వచ్చేశాయి: టాలీవుడ్ హీరోయిన్
శృంగార సన్నివేశాలు చేసేసిన తర్వాత వాటి గురించి మాట్లాడటానికి చాలామంది ఇష్టపడరు. కానీ ఈ మధ్య మాత్రం పలువురు హీరోయిన్లు ఆయా సీన్స్ గురించి ఓపెన్‌గా మాట్లాడుతున్నారు. మొన్నామధ్య సోనాక్షి సిన్హా, దివ్య పిళ్లై ఇలా మాట్లాడారు. ఇప్పుడు యువ హీరోయిన్ శృతి శర్మ కూడా రొమాంటిక్ సీన్స్ వల్ల వచ్చిన కష్టనష్టాల్ని బయటపెట్టింది.బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ.. రీసెంట్గా 'హీరామండి' సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చాడు. స్వాత్రంత్ర్యం రాకముందు పాకిస్థాన్‌లోని హీరామండి అనే వేశ్యవాటికని స్ఫూర్తిగా తీసుకుని ఈ సిరీస్ తీశాడు. ఇందులో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితీ రావ్ హైదరీ తదితరులు నటించారు. 'ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ' హీరోయిన్ శృతి శర్మ కూడా ఈ సిరీస్‌లో సైమా అనే పాత్ర చేసింది. నటిగా తన అనుభవాల్ని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: టాలీవుడ్లో అది చాలా కష్టం.. అసౌకర్యంగా అనిపిస్తుంది: సంయుక్త)'ఈ సిరీస్‌లో రజత్ కౌల్‌తో కొన్ని రొమాంటిక్ సీన్స్ చేశాను. ఇందులో ఇద్దరం చాలా సహజంగా నటించాం. ఇలాంటి సన్నివేశాలు ఇప్పటివరకు చేయలేదు. అయితే ఇవి చేస్తున్నప్పుడు నా శరీరంపై దద్దుర్లు వచ్చాయి. దుమ్ము, ధూళి ఉన్నప్పటికీ ఓ రోజంతా కష్టపడి ఈ సీన్స్ పూర్తి చేశాం. ప్రతిదీ ఫెర్ఫెక్ట్గా వచ్చేవరకు షూటింగ్ జరిగింది. అందుకే వెబ్ సిరీసులో ఈ సీన్లు చాలా అద్భుతంగా అనిపించాయి' అని శృతి శర్మ చెప్పింది.అయితే సైమా పాత్ర చేయడం పట్ల సంతోషంగానే ఉన్నానని, భన్సాలీ ఊహించుకున్న రోల్ కోసం బాగానే కష్టపడ్డానని శృతి శర్మ చెప్పింది. ఇకపోతే నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనూ స్ట్రీమింగ్ 'హీరామండి' వెబ్ సిరీస్‌లో ఎనిమిది ఎపిసోడ్స్ ఉన్నాయి. అయితే కంటెంట్ కాస్త ల్యాగ్ ఉండటంతో తెలుగోళ్లకు పెద్దగా నచ్చలేదు కానీ హిందీ ఆడియెన్స్ మాత్రం బాగానే చూస్తున్నారు.(ఇదీ చదవండి:పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ హీరో.. అమ్మాయి ఎవరంటే?)
అవికా గోర్‌తో స్టార్ క్రికెటర్ డ్యాన్స్.. సోషల్ మీడియాలో వైరల్
ప్రపంచ క్రికెట్లో ఆండ్రూ రస్సెల్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. విధ్వంసకర బ్యాటర్లలో తరచుగా వినిపించే పేర్లలో ఆయన టాప్‌లో ఉంటారు. వెస్టిండీస్‌కు చెందిన ఈ ఆల్‌రౌండర్ ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 17వ సీజన్లో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున రాణిస్తున్నాడు.తాజాగా ఆండ్రూ రస్సెల్ సరికొత్త అవతారం ఎత్తాడు. ఏకంగా హిందీ పాటతో బాలీవుడ్లో తెరంగేట్రం చేశారు. 'లడ్ కీ తూ కమాల్ కీ' అంటూ తన గాత్రంతో మెప్పించాడు. ఉయ్యాలా జంపాలా సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అవికా గోర్‌తో కలసి రస్సెల్ స్టెప్పులేశాడు. ప్రస్తుతం యూట్యూబ్‌లో ఈ పాట ట్రెండ్ అవుతుంది. ఇందులో వారిద్దరి డ్యాన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
ఇంటర్లో టాప్ మార్కులతో అదరగొట్టిన సూర్య కూతురు
సౌత్ ఇండియాలో బ్యూటిఫుల్ కపుల్స్‌గా సూర్య- జ్యోతిక జంట ఉంటుంది. చిత్రసీమలో అత్యంత ప్రజాదరణ పొందిన జోడీగా వీరికి గుర్తింపు ఉంది. వీరి కుమార్తె దియా ఇటీవల ముగిసిన 12వ తరగతి సాధారణ పరీక్షలో మంచి మార్కులు సాధించినట్లు సమాచారం. ఇరు కుటుంబాల అంగీకారంతో 2006లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే, ఈ దంపతలులకు దియా అనే 17 ఏళ్ల కుమార్తెతో పాటు దేవ్ అనే 15 ఏళ్ల కుమారుడు ఉన్నారు.సూర్య కుటుంబం మొత్తం సినిమా రంగంలో ఉన్నప్పటికీ దియా, దేవ్ ఇద్దరు కూడా సినిమాల్లోకి అడుగుపెట్టలేదు. దియా టెన్నిస్, ఫుట్‌బాల్ ఆటలపై దృష్టి సారిస్తుంటూ.. దేవ్ కరాటే వైపు అడుగులు వేస్తున్నాడు. చదువుతో పాటుగా ఆటలపై కూడా వారు ఆసక్తి చూపుతున్నారు.ఇంటర్లో అదరగొట్టిన దియాసూర్య కూతురు దియా ఈ ఏడాది పన్నెండో తరగతి పరీక్షలు రాసింది. తాజాగా ఫలితాలు కూడా విడుదలయ్యాయి. దియా మంచి మార్కులతో పాస్ అయినట్లు సోషల్‌మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆమె సాధించిన మార్కులు ఇవే అంటూ కోలీవుడ్‌లో వైరల్ అవుతుంది. తమిళంలో 100కి 96, ఇంగ్లిష్‌లో 97, గణితంలో 94, ఫిజిక్స్‌లో 99, కెమిస్ట్రీలో 98, కంప్యూటర్ సైన్స్‌లో 97 మార్కులు సాధించినట్లు తెలుస్తోంది. 600 మార్కులకు గాను 581 మార్కులు సాధించినట్లు సమాచారం. దియా ఇన్ని మార్కులు సాధించినందుకు కుటుంబ సభ్యులు ఆనందంగా సంబరాలు చేసుకుంటున్నారట. ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్న ఈ సమాచారం ఎంత వరకు నిజమో తెలియదు.2022లో టెన్త్‌లో కూడా సత్తా చాటిన దియా10వ తరగతి పరీక్షా ఫలితాల్లో కూడా దియా టాప్ మార్క్‌లు సాధించింది. తమిళంలో 95, ఆంగ్లంలో 99, గణితంలో 100, సైన్స్‌లో 98, సోషల్‌లో 95 మార్కులు సాధించింది. 500 మార్కులకు గాను 487 మార్కులు సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది.
ఆ స్టార్ హీరో అమ్మాయిలను ఫూల్ చేస్తాడు.. జన్మలో పెళ్లి చేసుకోడు!
బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సల్మాన్ ఖాన్ హీరోయిన్లతో నడిపిన ప్రేమాయణాలకు లెక్కే లేదు. ఎంతోమంది ముద్దుగుమ్మలను బుట్టలో వేసుకున్న ఇతడు వారితో జీవితాన్ని కొనసాగించాలని మాత్రం ఎన్నడూ ఆలోచించలేదు. అందుకే ఇప్పటికీ సింగిల్‌గానే ఉన్నాడు. అయితే సల్మాన్ పెళ్లి చేసుకోడన్న విషయం తనకెప్పుడో తెలుసంటున్నాడు నటుడు మిథున్ చక్రవర్తి. తాజాగా ఓ షోలో సల్మాన్ తుంటరితనాన్ని వెల్లడించాడు.ఒక్క నిమిషం కూడాసల్మాన్ నన్ను ఎంతగానో అభిమానిస్తాడు. ఎక్కువ ప్రేమను పంచుతాడు. మేము కలిసున్నప్పుడైతే నా వెంటే తిరుగుతాడు. ఒక్క నిమిషం కూడా మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండలేడు. నేను పడుకున్నా సరే నిద్రలో నుంచి లేపి మరీ కబుర్లు చెప్తుంటాడు. ఓసారి సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో రాత్రి రెండు గంటలకు షూటింగ్ ఉంది. నేను ఆ విషయం మర్చిపోయి గదిలో గడియ పెట్టి నిద్రపోయాను. సడన్‌గా కళ్లు తెరిచేసరికి అతడు నా ఎదురుగా నిలబడి నవ్వుతున్నాడు. అతడు లోపలకు ఎలా వచ్చాడో నాకు ఇప్పటికీ అర్థం కాదు. నువ్వేం మనిషివిరా బాబూ అనుకుని లేచాను.పెళ్లి చేసుకోడుతనలో ఆ తుంటరితనం ఎక్కువగా ఉండేది. అతడు ఎప్పటికీ పెళ్లి చేసుకోడు.. అమ్మాయిలందరినీ ఫూల్ చేస్తాడు. నాకింకా పెళ్లవలేదు, తెలుసా అంటూ అమ్మాయిలతో మాట కలుపుతాడు. వాళ్లేమో.. ఇంత హ్యాండ్సమ్ సూపర్ స్టార్‌ను పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ప్రేమలో పడతారు. కానీ అతడు ఎన్నటికీ పెళ్లిపీటలెక్కడని నేను గ్యారెంటీ ఇస్తాను' అని మిథున్ చెప్పుకొచ్చాడు.
ఫొటోలు
తాగుడుకు బానిసైన హీరోయిన్.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)
కడపలో సీఎం జగన్ ఎన్నికల రోడ్ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (10-05-2024)
లాపతా లేడీస్: సిమ్లా టూ బాలీవుడ్, ఎవరీ యాపిల్ బ్యూటీ (ఫొటోలు)
Heeramandi సోనాక్షి లుక్స్: జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్! ఫోటోలు
క్రీడలు
KL Rahul: జట్టు గెలవాలన్న తపనే అది: ఆసీస్ దిగ్గజం.
రెండేళ్ల క్రితం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అడుగుపెట్టింది లక్నో సూపర్ జెయింట్స్. కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో వరుసగా రెండుసార్లు ప్లే ఆఫ్స్ చేరింది. తద్వారా క్యాష్ రిచ్ లీగ్ ఆరంభం నుంచి ఉన్న కొన్ని జట్లకు సాధ్యం కాని ఘనతను లక్నో సాధించింది.ఐపీఎల్-2024లోనూ ప్లే ఆఫ్స్ రేసులో ముందుకు వెళ్లాలని పట్టుదలగా ఉంది. కేఎల్ రాహుల్ వికెట్ కీపర్ బ్యాటర్‌గా, కెప్టెన్‌గా రాణిస్తూ జట్టును టాప్-4లో నిలిపేందుకు తన వంతు కృషి చేస్తున్నాడు.అయితే, టాప్-4లో అడుగుపెట్టాలంటే కీలకమైన మ్యాచ్‌లో లక్నో చిత్తుగా ఓడిపోయింది. సన్‌రైజర్స్ హైదాబాద్తో బుధవారం నాటి మ్యాచ్‌లో పది వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ బ్యాటర్‌గా, సారథిగా విఫలమయ్యాడు.ఈ నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా అందరి ముందే కేఎల్ రాహుల్, కోచ్ జస్టిన్ లాంగర్‌కు గట్టిగా చీవాట్లు పెట్టాడు. దీంతో సంజీవ్ గోయెంకా తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండుసార్లు జట్టును ప్లే ఆఫ్స్ వరకు తీసుకువచ్చిన కెప్టెన్‌కు మీరిచ్చే గౌరవం ఇదేనా అంటూ మహ్మద్ షమీ వంటి ప్రముఖులు ఫైర్ అవుతున్నారు.ఈ క్రమంలో ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్ బ్రెట్ లీ భిన్నంగా స్పందించాడు. ‘‘అందరి ముందు అలా మాట్లాడేకంటే.. లోపలికి వెళ్లిన తర్వాత చర్చించాల్సింది. ఒకవేళ అదే జరిగితే ఈ విషయం గురించి స్పందించమనే ప్రశ్న నాకు ఎదురయ్యేదే కాదు.అయితే, నాణేనికి మరోవైపు కూడా ఆలోచించాలి. ఆట పట్ల జట్ల యజమానులు, కోచ్‌లకు ఉన్న ప్యాషన్‌ను మనం అర్థం చేసుకోవాలి. వాళ్ల జట్టు అత్యుత్తమంగా రాణించాలని కోరుకోవడంలో తప్పు లేదు. బహుశా అందుకే ఈ ఘటన జరిగి ఉంటుంది’’ అని బ్రెట్ లీ ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించాడు. చదవండి: ద్రవిడ్ గుడ్ బై!.. టీమిండియా కొత్త కోచ్‌గా ఫారినర్?.. జై షా కామెంట్స్ వైరల్
దినేష్ కార్తీక్ అరుదైన ఘనత.. ద్రవిడ్ రికార్డు బద్దలు
భారత వెటరన్ వికెట్ కీపర్-బ్యాటర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ దినేష్ కార్తీక్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో ఆర్సీబీ తరపున అత్యధిక పరుగులు చేసిన రెండో ఇండియన్ బ్యాటర్‌గా కార్తీక్ నిలిచాడు. ఐపీఎల్-2024లో భాగంగా గురువారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 పరుగులు చేసిన డీకే.. ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు కార్తీక్ ఐపీఎల్లో బెంగళూరు తరపున 57 మ్యాచ్‌ల్లో 912 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పేరిట ఉండేది. ద్రవిడ్ 43 మ్యాచ్‌ల్లో ఆర్సీబీ తరపున 898 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో ద్రవిడ్ రికార్డును కార్తీక్ బద్దలు కొట్టాడు. ఇక అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి అగ్రస్ధానంలో ఉన్నాడు. కోహ్లి ఇప్పటివరకు ఆర్సీబీ తరపున 249 మ్యాచ్‌ల్లో 7897 పరుగులు చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. హై స్కోరింగ్ మ్యాచ్‌లో పంజాబ్‌ను 60 పరుగుల తేడాతో ఆర్సీబీ చిత్తు చేసింది. దీంతో తమ ప్లే ఆఫ్ ఆశలను ఆర్సీబీ సజీవంగా నిలుపున్‌కుంది..
RCB Vs PBKS: సారీ చెప్పిన కోహ్లి!.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
ఐపీఎల్-2024లో పంజాబ్ కింగ్స్ కథ ముగిసింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో గురువారం నాటి మ్యాచ్‌లో ఓటమితో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.ఈ నేపథ్యంలో పంజాబ్ అభిమానులతో పాటు ఆ జట్టు మేనేజ్మెంట్కు సైతం భంగపాటు తప్పలేదు. అయితే, జట్టు పరాభవం నేపథ్యంలోనూ పంజాబ్ ఫ్రాంఛైజీ సహ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా వ్యవహరించిన తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది.కోహ్లి వికెట్ పడగానే కాగా ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ను ఆర్సీబీ 60 పరుగులతో చిత్తు చేసింది. ఇక ఈ విజయంలో విరాట్ కోహ్లిదే కీలక పాత్ర అన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 47 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 7 ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో 92 పరుగులు చేశాడు.Going..Going..GONE!Virat Kohli clobbers that delivery into the stands in grand fashion! 💥Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #PBKSvRCB pic.twitter.com/Y5eVp7Q6fN— IndianPremierLeague (@IPL) May 9, 2024అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో రిలీ రొసోవ్‌కు క్యాచ్ ఇవ్వడంతో ఈ ఆర్సీబీ ఓపెనర్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఈ నేపథ్యంలో ప్రీతి జింటా చప్పట్లు కొడుతూ కోహ్లి వికెట్‌ను సెలబ్రేట్ చేసుకుంది. అయితే, ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు.The Punjab Kings bounce back with crucial breakthroughs, especially the big one of Virat Kohli 👏👏#RCB 238/5 with 5 deliveries leftWatch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #PBKSvRCB pic.twitter.com/9mu2bMjrWV— IndianPremierLeague (@IPL) May 9, 2024లక్ష్య ఛేదనలో పంజాబ్ బ్యాటర్లంతా విఫలం కావడంతో ఆ జట్టుకు పరాజయమే ఎదురైంది. ఈ నేపథ్యంలో నిరాశకు లోనైనా ప్రీతి జింటా హుందాగా వ్యవహరించింది.సారీ చెప్పిన కోహ్లి!.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్‌ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న సమయంలో.. మ్యాచ్‌ను తాము లాగేసుకున్నందుకు ప్రీతి జింటాకు సారీ చెప్పాడు. ఇందుకు బదులుగా కోహ్లితో కరచాలనం చేస్తూ... ‘‘మరేం పర్లేదు’’ అన్నట్లుగా నవ్వులు చిందించిందామె.ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో లక్నో యజమాని సంజీవ్ గోయెంకాను ప్రీతి జింటాతో పోలుస్తూ నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు. సంజీవ్ గోయెంకాకు చురకలుమ్యాచ్ ఓడటమే కాదు.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించినా ప్రీతి ఆ బాధ బయటకు తెలియకుండా నవ్వుతూ కవర్ చేసిందని.. ఆమెను చూసి గోయెంకా చాలా నేర్చుకోవాలని చురకలు అంటిస్తున్నారు. కాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో లక్నో ఓటమి నేపథ్యంలో ఆ జట్టు ఓనర్ సంజీవ్ గోయెంకా కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు బహిరంగంగానే చీవాట్లు పెట్టిన విషయం తెలిసిందే. చదవండి: ద్రవిడ్ గుడ్ బై!.. టీమిండియా కొత్త కోచ్‌గా ఫారినర్?.. జై షా కామెంట్స్ వైరల్Preity Zinta with Virat Kohli at the post match presentation ceremony. ❤️ pic.twitter.com/z1G2L1IIr8— Mufaddal Vohra (@mufaddal_vohra) May 10, 2024Virat Kohli said Sorry to Preity Zinta when he met with her in post match award presentation & Preity Zinta smiles.- King Kohli winning the hearts of everyone, He's a pure soul. ❤️🐐 pic.twitter.com/2h2JFnZsyz— Tanuj Singh (@ImTanujSingh) May 10, 2024
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్.. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన స్టార్ క్రికెటర్
న్యూజిలాండ్ విధ్వంంసకర ఓపెనర్ కోలిన్ మున్రో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మున్రో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ20 ప్రపంచకప్-2024 కివీస్ జట్టులో చోటు ఆశించిన మున్రోకు సెలక్టర్లు మొండి చేయి చూపించారు. ఈ క్రమంలో జట్టులో చోటు దక్కకపోవడంతోనే మున్రో అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికాడు. "అత్యున్నత స్ధాయిలో న్యూజిలాండ్ క్రికెట్‌కు ప్రాతినిథ్యం వహించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. అన్ని ఫార్మాట్లలోనూ బ్లాక్ క్యాప్స్ జెర్సీని నేను ధరించాను. అది నేను నా జీవితంలో సాధించిన అతి పెద్ద విజయం. మళ్లీ న్యూజిలాండ్ తరపున ఆడేందుకు ఎంతో ఆతృతగా ఎదురు చూశాను. కానీ టీ20 వరల్డ్‌కప్‌లో జట్టులో నా పేరు లేదు. కాబట్టి క్రికెట్‌కు వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయం అని భావించానని మున్రో పేర్కొన్నట్లు ఐసీసీ ఒక ప్రకటన విడుదల చేసింది.న్యూజిలాండ్ క్రికెట్లో మున్రోకు అంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇంటర్ననేషనల్ క్రికెట్లో మున్రో కివీస్ తరపున 100కు పైగా మ్యాచ్‌లు ఆడాడు. 2014, 2016 టీ20 వరల్డ్‌కప్‌లలో న్యూజిలాండ్ జట్టులో మున్రో భాగమయ్యాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో మూడు పైగా సెంచరీలు చేసిన ఏడు మంది ఆటగాళ్లలో మున్రో ఒకడిగా కొనసాగుతున్నాడు. 2012 లో అంతర్జాతీయ క్రికెటలో అడుగుపెట్టిన మున్రో. . తన కెరీర్లో 57 వన్డేలు, 65 టీ20లు, ఒక టెస్టు మ్యాచ్ ఆడాడు. వన్డేల్లో 1271 పరుగులు, టీ20ల్లో 1724 పరుగులు చేశాడు. అదే విధంగా ఎకైక టెస్టులో 15 పరుగులు మాత్రమే చేశాడు. ఇక టీ20ల్లో 47 బంతుల్లో సెంచరీ చేసిన రికార్డు అతడి పేరిట ఉంది. 2018లో వెస్టిండీస్ పై ఈ ఘనత సాధించాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న మున్రో.. ఫ్రాంచైజీ క్రికెట్లో మాత్రం కొనసాగననున్నాడు.
బిజినెస్
ఆదాయాలు రెట్టింపైనా ఉద్యోగాల్లో కోత!
ప్రభుత్వ ఆయిల్, గ్యాస్ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గడిచిన ఆరేళ్లలో ప్రభుత్వ చమురు సంస్థలు సుమారు 15,700 ఉద్యోగాలను తగ్గించాయి. వాటి శ్రామికశక్తిలో ఇది 14 శాతంగా ఉంది. ఈ ఆరేళ్ల కాలంలో ఆయా కంపెనీల ఆదాయాలు మాత్రం రెట్టింపు అయినట్లు తెలుస్తుంది. అయినప్పటికీ వేలసంఖ్యలో ఉద్యోగులను తగ్గించడంపట్ల ఆందోళనలు నెలకొంటున్నాయి.చమురు మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం..ఉద్యోగాల కోత అన్ని విభాగాల్లో ఉంది. ప్రధానంగా నాన్-మేనేజిరియల్ ఉద్యోగాలను భారీగా తగ్గించారు. ప్రభుత్వ చమురు, గ్యాస్ కంపెనీల్లో 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 1,10,000గా ఉన్న శ్రామికశక్తి 94,300కి పడిపోయింది. ఎక్స్‌ప్లోరేషన్, ఉత్పత్తి, మార్కెటింగ్, రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగాల్లో గడిచిన ఆరేళ్లలో 20-24% ఉద్యోగాలను తొలగించారు. రిఫైనరీల్లో మాత్రం కేవలం 3% ఉద్యోగాల కోత విధించారు. ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు 6శాతం, నాన్ మేనేజిరియల్ ఉద్యోగాలు 25 శాతం మేర తగ్గించినట్లు తెలిసింది.కాంట్రాక్ట్ ప్రాతిపదికన కొత్త ఉద్యోగాలు నియమించడం, బౌట్‌సోర్సింగ్ కొలువులపై దృష్టిసారించడంతో రెగ్యులర్ స్థానాలపై వేటు పడుతున్నట్లు తెలిసింది. దాంతోపాటు శ్రామికశక్తి స్థానంలో అవకాశం ఉన్న విభాగాల్లో టెక్నాలజీ వాడకాన్ని పెంచుతున్నారు. పదవివిరమణ చేసిన ఉద్యోగులు స్థానంలో పరిమిత స్థాయిలోనే కొత్త వారికి అవకాశం ఇస్తున్నారు. ఫలితంగా కంపెనీల ఆదాయాలు పెరుగుతున్నా ఉద్యోగుల సంఖ్యలో కోతలు కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదిలాఉండగా, 2022-23 నాటికంటే ముందు ఆరు ఆర్థిక సంవత్సరాల్లో ప్రభుత్వ చమురు కంపెనీలు మూలధన వ్యయంలో భాగంగా సుమారు రూ.6.8 లక్షల కోట్లు వెచ్చించాయి.
గోల్డ్‌ఫైనాన్స్ తీసుకుంటే రూ.20వేలే ఇస్తారట! మిగతా డబ్బు..?
నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ ) నగదు పంపిణీని రూ.20,000కి పరిమితం చేయాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. లోన్కోసం వచ్చిన వినియోగదారులకు ఎన్బీఎఫ్సీలు నగదు రూపంలో గరిష్ఠంగా రూ.20వేలు మాత్రమే అందించేలా ఆర్బీఐ ప్రకటనలో తెలిపింది. తాజా ప్రకటనతో గోల్డ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు గురువారం బలహీనపడ్డాయి. ముత్తూట్ ఫైనాన్స్ షేర్ ధర 3.73%, మణప్పురం ఫైనాన్స్ 7.3%, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ 4% క్షీణించింది. ఆర్బీఐ నిర్ణయంతో బంగారం తాకట్టుపెట్టి నగదు తీసుకోవాలనుకునే వారికి ఇబ్బంది కలుగుతుందని పలువురు భావిస్తున్నారు.ఇదీ చదవండి: ప్రీమియంను మరింత పెంచనున్న బీమా సంస్థలుఎన్నికల నేపథ్యంలో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకోవడం సరైందేనని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రచారంలో భాగంగా ఖర్చులకు డబ్బు సమకూర్చాలంటే ఇంట్లో బంగారం తాకట్టుపెట్టి నగదు తీసుకుంటారు. అలాంటి చర్యలను కట్టడి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకొచ్చినట్లు కొందరు చెబుతున్నారు. కొత్త నిబంధనల ప్రకారం.. బంగారం తాకట్టు పెట్టే వారికి ఇకపై గరిష్ఠంగా రూ.20వేలు నగదు మాత్రమే ఇస్తారు. మిగతా డబ్బు నేరుగా తమ బ్యాంకు అకౌంట్లో జమచేస్తారు. తిరిగి బ్యాంకుకు వెళ్లి నిబంధనల ప్రకారం డబ్బు తీసుకోవాల్సి ఉంటుంది.
లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు శుక్రవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 సమయానికి నిఫ్టీ 93 పాయింట్లు లాభపడి 22,037కు చేరింది. సెన్సెక్స్ 229 పాయింట్లు పెరిగి 72,646 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 105.21 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 84.19 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.46 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.51 శాతం లాభపడింది. నాస్డాక్ 0.27 శాతం పుంజుకుంది.సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇప్పటి వరకు జరిగిన మూడు దశల పోలింగ్‌లో తక్కువ శాతం ఓటింగ్ నమోదు ఇన్వెస్టర్లను కలవరపెట్టింది. ఎన్నికలకు ముందు ఊహించినట్లు ప్రస్తుత అధికార పార్టీ గెలుపు అంత సులువు కాదనే అనుమానాలతో అమ్మకాలకు పాల్పడ్డారు. ఆటో మినహా అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో గురువారం సెన్సెక్స్ 1,062 పాయింట్లు నష్టపోయి 72,404 వద్ద స్థిరపడింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
ప్రీమియంను మరింత పెంచనున్న బీమా సంస్థలు
ఆరోగ్య బీమా రంగ సంస్థలు పాలసీదారులకు షాకివ్వబోతున్నాయి. గతేడాదిగా పాలసీ ప్రీమియంను దాదాపు 50 శాతం వరకు పెంచిన సంస్థలు..మరోసారి పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. బీమా నియంత్రణ మండలి ఐఆర్డీఏఐ తీసుకున్న కొన్ని నిర్ణయాలతో ప్రీమియం ఛార్జీలు పెంచకతప్పడం లేదని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి.గడిచిన ఆర్థిక సంవత్సరంలో ప్రీమియం 25 శాతం నుంచి 50 శాతం వరకు పెరగగా..వచ్చే కొన్ని నెలల్లో మరో 10 శాతం నుంచి 15 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని లోకల్‌సర్కిల్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఈ సర్వేలో 11 వేల మంది పాల్గొన్నారు. వీరిలో 21 శాతం మంది ప్రీమియం 50 శాతం వరకు పెరిగినట్లు వెల్లడించగా..31 శాతం మంది 25-50 శాతం వరకు పెరిగాయని తెలిపారు.ప్రీమియం అధికమవడంతో సామాన్యులు ఆరోగ్య పాలసీ తీసుకోవడానికి ఆసక్తి చూపడంలేదు. 2022లో 62 శాతంగా ఉన్న పాలసీదారులు 2023లో 52 శాతానికి తగ్గారు. మరోవైపు, గత ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్య బీమా కంపెనీలు రికార్డు స్థాయిలో లాభాలు పొందుతున్నాయి. వాటి సరాసరి వార్షిక వృద్ధిరేటు 20 శాతంగా నమోదవుతుంది. కరోనాతో ఆరోగ్య బీమా పాలసీలు తీసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ, క్రమంగా తగ్గుతోంది.
వీడియోలు
ఆరోజు నాన్నను అవమానించి..సీఎం జగన్ ఎమోషనల్ స్పీచ్
అవినాష్ రెడ్డి జీవితం నాశనం చెయ్యాలని..సీఎం జగన్ పచ్చ బ్యాచ్ కు మాస్ వార్నింగ్
వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే
చంద్రబాబుకు దమ్ముంటే మోడీతో 4% రిజర్వేషన్ రద్దు చేయను అని చెప్పించే దమ్ము ఉందా?
స్పీచ్ మధ్యలో ఆపేసిన సీఎం జగన్ ఎందుకో తెలుసా...?
మరో 3 రోజులో బ్యాలెట్ బద్దలు కొట్టడానికి సిద్ధమా
రామోజీ రావుకు బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్
మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే
ఉప్పోగిన ప్రజాభిమానం కిక్కిరిసిన కడప
సీఎం జగన్ ఎంట్రీతో దద్దరిల్లిన కడప
ఫ్యామిలీ
లాపతా లేడీస్: సిమ్లా టూ బాలీవుడ్, ఎవరీ యాపిల్ బ్యూటీ (ఫొటోలు)
Heeramandi సోనాక్షి లుక్స్: జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్! ఫోటోలు
'ఆశకు స్ఫూర్తి ఆమె'!..ఏకంగా 33 వేల అడుగుల ఎత్తు నుంచి విమానం కూలినా..!
మన కళ్లముందే దారుణ ప్రమాదాలను ఫేస్ చేసి మరీ మృత్యుంజయులై బయటపడిన కొందరూ వ్యక్తులును చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. నమ్మశక్యం కానీ నిజంలా అద్భుతంగా కనిపిస్తారు ఆయా వ్యక్తులు. అలాంటి మిరాకిల్ లాంటి ఘటనే ఈ మహిళ జీవితంలో చోటు చేసుకుంది. ఆ సంఘటన కారణంగానే ఆమె వార్తల్లో నిలిచింది. పైగా గిన్నిస్ బుక్ ఆప్ రికార్డులకు కెక్కింది కూడా. ఏంటా మిరాకిల్ సంఘటన అంటే..వివరాల్లోకెళ్తే..ఆ మహిళ పేరు వెన్నా వులోవిచ్. ఫ్లైట్ అటెండెంట్‌గా పనిచేస్తోంది. సరిగ్గా జనవరి 26, 1972న యుగోస్లావ్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 367లో ఫైట్ అటెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఒక భయానక ప్రమాదం జరిగింది. ఓ అనుమానాస్పద బాంబు కారణంగా ఆమె ప్రయాణిస్తున విమానం చెకోస్లోవేయా పర్వతాల మీదుగా కూలిపోయింది. అందులో ప్రయాణిస్తున్న మొత్తం 27 మంది ప్రయాణికులు, సిబ్బంది అక్కడికక్కడే చనిపోయారు. ఒక్క ఫైట్ అటెండెంట్ వులోవిక్ మాత్రమే ప్రాణాలతో బయటపడింది. నిజం చెప్పాలంటే వులోవిక్ ప్రయాణిస్తున్న విమానం గాల్లోనే పేలింది. ఏకంగా 33 వేల అడుగుల నుంచి కూలిపోయింది. ఇక్కడ వులోవిక్ కనీసం పారాచూట్ లేకుండా అంత ఎత్తు నుంచి పడిపోయినా..బతికిబట్టగట్ట గలిగింది. ఇదే అందర్నీ ఒకింత ఆశ్చర్యచకితులను చేసింది. అయితే దర్యాప్తుల బృందం విమానం భూమిపై కూలిపోతున్నప్పుడూ తోక భాగంలోని ఫుడ్ రూమ్‌లో వులోవిక్ చిక్కుపోవడంతో సేఫ్‌గా ఉన్నట్లు తెలిపింది. ఆ తోక భాగం అటవీ ప్రాంతలో పడిపోయి మంచుతో కప్పబడి ఉండటంతో ఆమె అరుపులు అరణ్యరోదనగా మారాయి. ఆమె అదృష్టం కొద్ది అక్కడ పనిచేస్తున్న అటవీ వర్కర్లకు ఆ అరుపులు వినపడ్డాయి. వెంటనే వారు ఆమెను గుర్తించి ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె ఏకంగా పదిరోజులకు పైగా కోమాలోనే ఉండిపోయింది. ఈ ప్రమాదంలో వులోవిక్ పుర్రెకి తీవ్ర గాయం, రెండు వెన్నుపూసలు చితికిపోవడం, కటి, పక్కటెముకలు, రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో నడుము తాత్కలికి పక్షవాతానికి గురయ్యి కొన్ని రోజులు బెడ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. ఇంతటి స్థితిలో కూడా ఆమె ఆశను వదులుకోలేదు. పైగా నిరాశను దగ్గరకు రానివ్వలేదు. నెమ్మదిగా వులోవిక్ పూర్తి స్థాయిలో కోలుకుంది. ఆ తర్వాత ఎయిర్‌లైన్‌లో డెస్క్ జాబ్‌లో విధులు నిర్వర్తించేందుకు తిరిగి వచ్చింది. ఇలా వులోవిక్. మృత్యంజయురాలై నిలవడమే గాక మళ్లీ తన కాళ్లమీద నిలబడి అద్భుతంగా జీవించడంతో .. 1985లో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ల కెక్కింది. ఆశకు అసలైన నిర్వచనం ఇచ్చి.. ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది ఈ సెర్బియా మహిళ వులోవిక్. తనకు దేవుడిచ్చిన మరో జీవితాన్ని విభిన్న నేపథ్యాల ప్రజల మధ్య అవగాహన పెంచి ,శాంతిగా ఉండేలా చేసేందుకు అంకితం చేసింది. ఇక వుల్విక్ 2016లో 66 ఏళ్ల వయసులో మరణించింది. ఇది మాములు మిరాకిల్ స్టోరీ కాదు కదా..!(చదవండి: అమిత్ షా నివాసంలో పద్మగ్రహీతలకు విందు....మెనులో ఎలాంటి రెసిపీలు ఉన్నాయంటే..)
నవ్వుతారేమో అనుకున్నా: లాపతా లేడీస్ ప్రతిభ ఇంట్రస్టింగ్ జర్నీ
బాలీవుడ్ దర్శకురాలు కిరణ్‌రావు (బాలీవుడ్ హీరో ఆమీర్ ఖాన్ మాజీ భార్య) దర్శకత్వంలో వచ్చిన లాపతా లేడీస్ ఓటీటీలో మంచి ఆదరణ సంపాదించుకుంది. కుటుంబం, వైవాహిక వ్యవస్థలో మహిళల స్థితిగతులు, అమ్మాయిల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా జరిగే బాల్య వివాహాలు, అమ్మాయిల తెగవును పట్టి ఇచ్చిన సినిమా ఇది. ముఖ్యంగా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన ప్రతిభా రాంటా తన అధ్బుతమైన నటనతో ఆకట్టుకుంది. సిమ్లా టూ బాలీవుడ్ ప్రతిభ రాంటా ఇంట్రస్టింగ్ జర్నీ ఒక సారి చూద్దాం.ఖుర్బాన్ హువా టీవీ సీరియల్‌తో వెలుగులోకి వచ్చింది ప్రతిభా రాంటా. ఆ తరువాత వెబ్ సిరీస్ చేస్తుండగా కిరణ్ రావు దృష్టిలో పడింది. అలాలాపతా లేడీస్‌లో అవకాశం వచ్చింది. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని తానేమిటో నిరూపించుకుంది. బాలీవుడ్‌కి పరిచయం అయిన కొత్త ముఖాల్లో ప్రతిభ రాంటా. నిజంగా తన యాక్టింగ్ ప్రతిభ, ఒకదాని తర్వాత ఒకటి తన ఆన్-స్క్రీన్ పెర్ఫార్మెన్స్తో, ముఖ్యంగా లాపతా లేడీస్ 'జయ' పాత్రలో సత్తా చాటింది. ఇటీవల విడుదలైన వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్లో 'వహీదా' (సంజీదా షేక్) కుమార్తె 'షామా' పాత్రను పోషించింది. 24 ఏళ్ల వయసులో చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అయితే ఈ ప్రయాం అంత సాఫీగా సాగలేదు.ఎవరీ ప్రతిభా రాంటాసందేశనా రాంటా,, రాజేశ్ రాంటా దంపతుల కుమార్తె ప్రతిభా రాంటా. సిమ్లాలో పెరిగింది. చిన్నప్పటి నుంచీ డాన్స్ అంటే ఇష్టం. డాన్స్‌లో గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేసింది. అలా నటించాలనే ఆసక్తి పెరిగింది. ఆ మాటే ఇంట్లో చెబితే యాక్టింగ్ అంటే ఏంటి? అని అడిగారట. ఎందుకంటే కుటుంబంలో చాలా మంది ఉపాధ్యాయులు, అందుకే వారికి నటన గురించి ఏమీ తెలియదట. ఇంజనీర్, డాక్టర్ లేదా మరేదైనా ఇతర ప్రొఫెషనల్‌గా ప్రతిభను చూడాలని ఆశించారు. దీంతో యాక్టింగ్‌లో చేరడం చాలా కష్టమేమో , తనను చూసి నవ్వుతారేమో అనిపించిందని ఒక ఇంటర్య్వూలో వెల్లడించింది.పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత, ప్రతిభ ఎలాగోలా తన తల్లిదండ్రులను ఒప్పించి ఉన్నత చదువుకోసం ముంబైకి చేరింది. ఆడిషన్లు ఇవ్వడం మొదలు పెట్టింది. అందాల పోటీలో పాల్గొంది. 2018లో మిస్ ముంబై టైటిల్‌ను గెలుచుకుంది. నిస్సందే 2018 మిస్ ముంబై అందాల పోటీల్లో మిస్ ముంబై కిరీటం గెలుచుకుంది. దీంతో కేవలం ఆరు నెలలకే ‘ఖుర్బాన్ హువా’ టీవీ సీరియల్ 'చాహత్' పాత్రలో తొలి ఆఫర్ వచ్చింది. తరువాత,ఆధా ఇష్క్ అనే వెబ్ షోలో కూడా కనిపించింది. View this post on Instagram A post shared by Pratibha Rantta (@pratibha_ranta)ఇక లాపతా లేడీస్ ఆఫర్ గురించి మాట్లాడుతూ మొదట్లో కాస్త భయమేసిందని, అయితే సినిమాలో ‘జయ’ కథ ఒక విధంగా నిజ జీవితానికి సరిగ్గా సరిపోతుందని, అందుకే ఆ పాత్రలో పూర్తిగా లీనమైపోయానని చెప్పుకొచ్చింది. మొత్తానికి తన జర్నీ అంతా ఒక మ్యాజిక్‌లా సాగిపోయిందని వెల్లడించింది మెరిసే కళ్లతో.
న్యూస్ పాడ్‌కాస్ట్
చంద్రబాబుది పెత్తందార్ల కూటమి... ఎన్నికల ప్రచార సభల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం.. ఇంకా ఇతర అప్డేట్స్
దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా కనిపిస్తారు... కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై తీవ్ర దుమారం.. ఇంకా ఇతర అప్డేట్స్
నేడు వేములవాడకు నరేంద్ర మోదీ... రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్న ప్రధానమంత్రి... ఇంకా ఇతర అప్డేట్స్
క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
భూమి లాక్కున్నట్లు ఒక్క రైతయినా చెప్పాడా అంటూ చంద్రబాబు, ఎల్లో మీడియాకు సీఎం జగన్ సూటి ప్రశ్న.. ఇంకా ఇతర అప్డేట్స్
నాకు బిడ్డలు లేరు, ప్రజల బిడ్డల కోసమే నా తపన.. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటన.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం పట్ల ఎన్నికల సంఘం సీరియస్.. తక్షణం దర్యాప్తు చేసి, చర్యలు తీసుకుని నివేదిక ఇవ్వాలని సీఐడీకి ఆదేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
అవ్వాతాతల పెన్షన్లపై చంద్రబాబు పాపిష్టి కళ్లు.. నరసాపురం, క్రోసూరు, కనిగిరి ప్రచార సభల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం.. ఇంకా ఇతర అప్డేట్స్
కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు పాకిస్తాన్ ఆరాటం.. గుజరాత్ ప్రచారంలో ప్రధాని మోదీ విమర్శలు.. ఇంకా ఇతర అప్డేట్స్
తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై నిషేధం.. 48 గంటలపాటు ప్రచారం ఆపేయాలన్న కేంద్ర ఎన్నికల సంఘం .. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
చికాగోలో తెలంగాణ విద్యార్థి అదృశ్యం ఆందోళనలో తల్లిదండ్రులు
అమెరికాలో తెలుగు విద్యార్థి అదృశ్యం కావడం కలకల రేపుతోంది. ఉన్నత విద్య కోసం చికాగో వెళ్లిన తెలంగాణకు చెందిన 25 ఏళ్ల రూపేష్ చంద్ర చింతకింది అదృశ్యం అయ్యాడు. అతని అచూకీ కోసం కుటుంబ సభ్యులు భారత రాయబార వర్గాలను సంప్రదించారు. చికాగోలోని ఎన్ షెరిడాన్ రోడ్ 4300 బ్లాక్ నుంచి అతను తప్పిపోయినట్లు తెలుస్తోంది. టెక్సాస్ నుండి కలవడానికి వచ్చిన ఒకరిని కలవబోతున్నాడని చెప్పినట్లు సమాచారం.‘‘మే 2 మధ్యాహ్నం వాట్సాప్‌లో మాట్లాడాను. ఏదో పని మీద ఉన్నా అని చెప్పాడు. అంతే అప్పటినుంచి ఆఫ్‌లైన్‌లో ఉన్నాడు" రూపేష్ తండ్రి సదానందం తెలంగాణలోని హన్మకొండకు చెందిన రూపేశ్ విస్కాన్సిన్ లోని కాంకార్డియా యూనివర్శిటీలో మాస్టర్స్ చదువుతున్నాడు. వారం రోజులుగా రూపేశ్ ఆచూకీ లభించకపోవడంతో హైదరాబాద్‌లోఉంటున్న అతని తల్లిదండ్రలు ఆందోళనకు గురయ్యారు. తమ కుమారుడి ఆచూకీ కనుగొనాలంటూ భారత విదేశాంగా శాఖను కోరింది. త్వరలోనే రూపేశ్ అచూకీ తెలుస్తుందని ఆశిస్తున్నామని చికాగోలోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది.The Consulate is deeply concerned learning that Indian student Rupesh Chandra Chintakindi is incommunicado since 2nd May. Consulate is in touch with the police and the Indian diaspora hoping to locate/reestablish contact with Rupesh.@IndianEmbassyUS @MEAIndia— India in Chicago (@IndiainChicago) May 8, 2024మే 2 నుంచి రూపేశ్ మిస్సయినట్లు చికాగోలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా తెలిపింది. అతడి ఆచూకి కోసం పోలీసులు ప్రవాస భారతీయులతో నిరంతరం చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. రూపేష్ ఆచూకీ తెలిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని స్థానిక పోలీసులు ప్రకటన విడుదల చేశారు.
రాసలీలల రామ్మోహన్!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ తూర్పు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహనరావు మహిళలపై లైంగిక వేధింపుల వ్యవహారం బట్టబయలైంది. పలువురు మహిళలతో అసభ్యకరంగా చాటింగ్ చేసినట్టు వెల్లడైంది. ప్రస్తుతం వాట్సప్ చాటింగ్, స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విజయవాడలోని వివిధ వాట్సప్ గ్రూపుల్లో, ఫేస్ బుక్ పేజీల్లో, ఇన్‌స్ట్రాగాం వేదికల్లో అవి చక్కెర్లు కొడుతుండటంతో ఆయన లీలలపై తూర్పు నియోజకవర్గ ఓటర్లు ముక్కున వేలేసుకుంటున్నారు. మహిళా ఓటర్లయితే గద్దెకు గుణపాఠం చెబుతామని స్పష్టం చేస్తున్నారు. ఇన్నాళ్లకు గద్దె నిజ స్వరూపం బట్ట బయలైందని టీడీపీ వర్గీయులే వ్యాఖ్యానించిడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయనకు 15 ఏళ్లుగా అనుచరుడిగా ఉన్న ఒకరు ఆయన రాసలీలల వ్యవహారాలను ఆధారాలతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం విజయవాడ నగరంలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల గద్దె ప్రధాన అనుచరుడు మహిళలను వేధింపులకు గురిచేసి, దాడి చేయడంతో పటమట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఏకంగా గద్దె వాట్సప్ చాటింగ్ వెలుగులోకి రావడంతో టీడీపీ ఆత్మరక్షణలో పడింది. ఇప్పటికే తూర్పు నియోజక వర్గంలో గద్దె గ్రాఫ్ పడిపోవడంతో తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వాట్సప్ చాటింగ్స్ వ్యవహారం వెలుగులోకి రావడంతో తూర్పు నియోజకవర్గంలో టీడీపీ ఓటమి ఖాయమని ఆ పార్టీ నాయకులే తేల్చిచెబుతున్నారు.
ఈత సరదా ప్రాణం తీసింది
వైఎస్సార్: లింగాల మండలం తాతిరెడ్డిపల్లెలో ఈత నేర్చుకోవాలని చిన్నారి సరదా పడగా... ప్రమాదవశాత్తూ ఆమె ప్రాణం తీసింది. స్థానికుల వివరాల మేరకు.. తాతిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన తోట రవీంద్రారెడ్డి, మంజుల దంపతుల కుమార్తె మహిత(12) బుధవారం గ్రామంలోని చెరువులో ఈత నేర్చుకునేందుకు తోటి పిల్లలతో కలిసి వెళ్లింది.నడుముకు ఖాళీ క్యాన్ కట్టుకుని చెరువులో ఈత కొట్టేందుకు దిగారు. ఆ సమయంలో నడుముకు ఉన్న క్యాన్ ఊడిపోయింది. అక్కడున్న పిల్లలు, పెద్దలు చూస్తుండగానే భయానికి గురైన మహిత నీటిలో మునగగానే మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. కుమార్తె మృతిచెందడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
యశవంతపుర: అంబులెన్స్– కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన దుర్ఘటన కర్ణాటక– కేరళ సరిహద్దుల్లోని కాసరగోడులో మంగళవారం జరిగింది. మృతులను కేరళ త్రిసూరు జిల్లా గురువాయురుకు చెందిన శ్రీనాథ్ (54), ఆయన కొడుకులు శరత్ (18), మనన్ (15) గుర్తించారు శ్రీనాథ్ దుబాయ్‌లో ఉద్యోగం చేస్తూ సెలవులు పెట్టి ఊరికి వచ్చాడు. ఆయన భార్య స్మిత అక్కడే ఓ ఇంటర్నెట్ సెంటర్ నిర్వహిస్తున్నారు. ఆమెకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో వారితో పాటు రాలేకపోయారు. ఈ క్రమంలో ముగ్గురూ కలిసి బెంగళూరులో బంధువులను కలవాలని బయల్దేరారు. ముగ్గురూ కారులో కొల్లూరు మూకాంబిక ఆలయంలో అమ్మవారి దర్శనం చేసుకుని వెళుతుండగా, మంజేశ్వర వద్ద ఎదురుగా వేగంగా వచ్చిన అంబులెన్స్ ఢీకొట్టింది. ఆ ధాటికి రెండు వాహనాలూ పలీ్టలు కొట్టాయి. తండ్రీ కొడుకులు కారులోనే దుర్మరణం చెందారు. అంబులెన్స్ డ్రైవర్, ఇద్దరికి కూడా గాయాలు తగిలాయి. ప్రమాదం ఊళ్లోనే జరగడంతో పెద్దసంఖ్యలో జనం పోగయ్యారు. పోలీసులు చేరుకుని మృతదేహాలను, బాధితులను ఆస్పత్రులకు తరలించారు. ఘటనాస్థలమంతా రక్తసిక్తమై భీతావహంగా మారింది. ఈ విషయాన్ని ఊళ్లోని శ్రీనాథ్ భార్యకు ఇంకా చెప్పలేదని, ఇంత ఘోరం జరుగుతుందనుకోలేదని మృతుల బంధువుల విలపించారు.