Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు జెడ్పీ హైసూ్కలు వద్ద ఓటు వేసేందుకు పెద్ద  సంఖ్యలో బారులుదీరిన మహిళలు
మరోసారి ఫ్యాన్‌ సునామీ

సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వంపై సానుకూలత (పాజిటివ్‌) పోటెత్తింది. ఓటు వేసేందుకు వెల్లువెత్తారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద సోమవారం ఉదయం 6 గంటల నుంచే ఓటర్లు బారులు తీరారు. వృద్ధులు, మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ప్రజలు భారీ ఎత్తున కదలివచ్చారు. సాయంత్రం 5 గంటలకు 68.04 శాతం పోలింగ్‌ నమోదైంది. సాయంత్రం ఆరు గంటల సమయంలో కూడా పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లే కనిపించారు. వారందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. కొన్ని కేంద్రాల్లో రాత్రి పది గంటల వరకూ పోలింగ్‌ కొనసాగింది. మొత్తమ్మీద గత ఎన్నికల తరహాలోనే ఇప్పుడూ పోలింగ్‌ నమోదు 80 శాతానికి చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నగర, పట్టణ ప్రాంతాలతో పోల్చితే గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక శాతం పోలింగ్‌ నమోదైంది. ఇటీవల కురుస్తున్న వర్షాలతో ఎండల ప్రభావం తగ్గడం కూడా పోలింగ్‌ శాతం పెరగడానికి దోహదం చేసింది.నిర్దేశించేది మహిళలు, గ్రామీణ ఓటర్లే..పోలింగ్‌ సరళిపై ఇండియాటుడే ఛానల్‌ కన్సల్టింగ్‌ ఎడిటర్‌ రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ సోమవారం రాత్రి టీవీలో చర్చ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో తాను విస్తారంగా పర్యటించానని.. మహిళలు, గ్రామీణ ప్రాంత ఓటర్లు ఎన్నికల ఫలితాలను నిర్దేశిస్తారని రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ పేర్కొన్నారు. ఈ చర్చలో పాల్గొన్న సెఫాలజిస్ట్, ఎగ్జిట్‌ పోల్స్‌ నిర్వహించే యాక్సి మై ఇండియా సీఎండీ ప్రదీప్‌ గుప్తా దీనిపై ఏకీభవించారు. ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికల ఫలితాలను మహిళలు, గ్రామీణ ప్రాంత ఓటర్లే నిర్ణయిస్తారని చెప్పారు. రోడ్లు గురించి కాకుండా ప్రభుత్వ సేవలు ఎలా ఉన్నాయన్నదే ప్రామాణికంగా తీసుకుని 80 శాతం మంది మహిళలు ఓటు వేస్తారని తెలిపారు.ఇంటింటి అభివృద్ధిని ప్రతిబింబించిన పోలింగ్‌ సరళి..నవరత్నాల పథకాలను గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వం అందిస్తోంది. రాష్ట్రంలో పోలింగ్‌ సరళిని పరిశీలిస్తే మహిళలు, గ్రామీణ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. సంక్షేమాభివృద్ధి పథకాలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలలో విప్లవాత్మక సంస్కరణలు, సుపరిపాలనతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, అగ్రవర్ణ పేదలు సాధికారత దిశగా అడుగులు వేస్తున్నారు. ఇంటింటి అభివృద్ధి మరింతగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ ఓట్లు వేసేందుకు స్వచ్ఛందంగా వచ్చారు. ప్రభుత్వ సానుకూలత సునామీలా ఓటెత్తిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ ఎన్నికలను పెత్తందారులు – పేదలకు మధ్య జరుగుతున్న యుద్ధంగా బడుగు, బలహీన వర్గాలు భావించడం వల్లే భారీగా పోలింగ్‌ నమోదైందని పేర్కొంటున్నారు.

Andhra Voters Back To telangana After Voting
నగరం బాట పట్టిన ఆంధ్రా ఓటర్లు.. దారులన్నీ రద్దీ!

ఎన్టీఆర్‌, సాక్షి: సొంత ఊళ్లకు వెళ్లి ఓట్లేసిన ఏపీ ఓటర్లు.. తిరిగి తెలంగాణ బాట పట్టారు. దీంతో హైదరాబాద్‌ వచ్చే రహదారుల్లో వాహనాల రద్దీ నెలకొంది. సోమవారం సాయంత్రం ఉదయం నుంచే ఇది మొదలుకాగా.. మంగళవారం ఉదయానికి అది మరింతగా పెరిగింది.ఆంధ్రా నుంచి పెద్ద ఎత్తున్న ఓటర్లు తిరిగి తెలంగాణకు వస్తున్నారు. కార్లు, బస్సులు.. ఏ వాహనం దొరికితే అది పట్టుకొని హైదరాబాద్‌కు బయల్దేరారు. పతంగి టోల్‌గేట్‌ వద్ద భారీగా ట్రాఫిక్‌ నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు సుమారు 6 లక్షల మంది తెలంగాణ నుంచి వచ్చినట్లు ఒక అంచనా. ఎన్టీఆర్‌ జిల్లా చిల్లకల్లు టోల్‌గేట్‌ వద్ద సాధారణంగా 24 గంటల వ్యవధిలో 20 వేలకు పైగా వాహనాలు హైదరాబాద్‌ వైపు వెళ్తుంటాయి. అయితే.. సోమవారం మాత్రం సాయంత్రం 6.30 గంటలకు వీటి సంఖ్య 35 వేలకు పైగా చేరింది. ఈ ఉదయం ఆ రద్దీ అంతకంతకు పెరుగుతోంది.ఇక.. ఏపీలో పోలింగ్‌ కోసం ఓటర్లు పోటెత్తారు. సోమవారం ఉదయం నుంచి పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులుతీరి ఓటేశారు. సాయంత్రం సైతం క్యూ లైన్లలో చాలామంది వేచి ఉండడం గమనార్హం. ఏపీలో భారీగా పోలింగ్‌ జరిగిందని ఏపీ సీఈవో ఎంకే మీనా వెల్లడించగా, కడపటి వార్తలు అందేసరికి అది 78.36 శాతంగా నమోదు అయినట్లు తెలుస్తోంది. పోలింగ్‌ శాతం ఇంకా ఎక్కువే నమోదు కావొచ్చని సీఈవో ఎంకే మీనా ఆశాభావం వ్యక్తం చేశారు.

AP Elections 2024: May 14th Politics Latest News Updates Telugu
May 14th: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌

May 14th AP Elections 2024 News Political Updates..7:17 AM, May 14th, 2024నిమ్మాడలో అచ్చెన్న కుటుంబం బరితెగింపువైఎస్సార్‌సీపీ ఏజెంట్‌ అప్పన్నను బెదిరించి మరీ రిగ్గింగ్‌ పలు గ్రామాల్లోని ఓటర్లు పోలింగ్‌ బూత్‌కు రాకుండా అడ్డుకున్న కింజరాపు కుటుంబం ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దువ్వాడ7:07 AM, May 14th, 2024మరోసారి ఫ్యాన్‌ సునామీ పోలింగ్‌ కేంద్రాల వద్ద ఉదయం 6 గంటల నుంచే ఓటర్ల బారులుఉప్పెనలా కదలివచ్చిన వృద్ధులు, మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలుపట్టణాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే అధిక శాతం ఓటింగ్‌ సాయంత్రం 5 గంటలకు 68.04 శాతం పోలింగ్‌ నమోదుగంటల వరకు క్యూలైన్లలో ఉన్న వారందరికీ ఓటేసే అవకాశం కల్పించిన ఈసీపలుచోట్ల రాత్రి 10 వరకూ కొనసాగిన పోలింగ్‌.. 76.50 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఈసీ వర్గాల వెల్లడిఫలితాలను నిర్దేశించేది మహిళలు, గ్రామీణులేనన్న ఇండియాటుడే టీవీ కన్సల్టింగ్‌ ఎడిటర్‌ రాజ్‌దీప్‌.. ప్రభుత్వ సేవలను బట్టే 80శాతం మహిళలు ఓట్లు వేస్తారన్న యాక్సిస్‌ మై ఇండియా సీఎండీ ప్రదీప్‌ గుప్తాసచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటి గుమ్మం వద్దే ప్రజలకు ప్రభుత్వం సేవలుసంక్షేమాభివృద్ధి పథకాలతో ఇంటింటా వచ్చిన విప్లవాత్మక మార్పును ప్రతిబింబించిన పోలింగ్‌ సరళిప్రభుత్వ సానుకూలత సునామీలా ఓటెత్తిందంటున్న రాజకీయ పరిశీలకులు

Bombay High Court refuses to quash case against former AP CM Chandrababu Naidu
చంద్రబాబుకు బాంబే హైకోర్టు షాక్‌

ముంబయి: టీడీపీ అధినేత చంద్రబాబుకు బాంబే హైకోర్టు గట్టి షాక్‌ ఇచి్చంది. 2010 జూలైలో మహారాష్ట్రలో పోలీసు సిబ్బందిపై దాడికి పాల్పడిన వ్యవహారంలో తమపై నమోదైన కేసును కొట్టేయాలని చంద్రబాబు, టీడీపీ నేత నక్కా ఆనందబాబు దాఖలు చేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు ఔరంగాబాద్‌ బెంచ్‌ తోసిపుచి్చంది. ఈ మేరకు న్యాయమూర్తులు మంగేష్‌ పాటిల్, శైలేష్‌ బ్రహ్మేలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ మే 10న తీర్పు వెలువరించింది.పోలీసులతో చంద్రబాబు, నక్కా ఆనంద్‌ బాబు అనుచితంగా వ్యవహరించారనడానికి ఆధారాలున్నాయని పేర్కొంది. ఇందులో ఎలాంటి సందేహం లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా ధర్మాబాద్‌ పోలీసులు తమపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన రెండు పిటిషన్లను హైకోర్టు బెంచ్‌ కొట్టేసింది. పోలీసులపై చంద్రబాబు దాడి ప్రభుత్వోద్యోగిపై దాడి చేయడం, ప్రమాదకరమైన ఆయుధాలతో హాని కలిగించడం, ప్రాణాలకు హాని కలిగించే చర్యలు, శాంతికి భంగం కలిగించే ఉద్దేశంతో పోలీసులను ఉద్దేశపూర్వకంగా అవమానించడం, నేరపూరిత బెదిరింపులకు పాల్పడటం వంటి వాటిపై చంద్రబాబు, నక్కా ఆనంద్‌ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసును విచారించిన బాంబే హైకోర్టు ఔరంగాబాద్‌ బెంచ్‌ మొదటి నిందితుడైన చంద్రబాబు పోలీసులపై దాడికి తన అనుచరులను ప్రోత్సహించారని పేర్కొంది.మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ మధ్య యుద్ధ వాతావరణం సృష్టించారని వెల్లడించింది. సాక్షులు సైతం పోలీసులపై దాడిలో చంద్రబాబు, నక్కా ఆనంద్‌బాబుల పాత్ర ఉందని తెలిపారని ధర్మాసనం గుర్తు చేసింది. ఆ ఘటనలో అనేకమంది పోలీసు అధికారులు గాయపడినట్లు మెడికల్‌ సరి్టఫికెట్లు కూడా ధ్రువీకరిస్తున్నాయని పేర్కొంది. పోలీసు సిబ్బందిపై దాడి చేయాలనే ఈ నేరం చేసినట్లు తెలుస్తోందని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. కేసు ఇదీ.. 2010 జూలైలో చంద్రబాబు, ఆనంద్‌ బాబు తదితరులను కలిపి మొత్తం 66 మందిని రిమాండ్‌కు తరలించి ధర్మాబాద్‌లోని ప్రభుత్వ విశ్రాంతి గృహంలోని తాత్కాలిక జైలులో ఉంచారు. వారి జ్యుడీషియల్‌ కస్టడీని పొడిగించడంతో మహా­రాష్ట్ర జైళ్ల డీఐజీ వారిని ఔరంగాబాద్‌ సెంట్రల్‌ జైలుకు తరలించాలని ఆదేశించారు. అయితే, చంద్రబాబు, ఆనంద్‌ బాబు దీన్ని అడ్డుకోవడంతోపాటు తెలుగు, ఇంగ్లి‹Ùలో పోలీసు అధికారులను దూషించారు.అంతేకాకుండా బస్సు ఎక్కడానికి నిరాకరించడంతోపాటు పోలీసులపై దాడి చేశారు. దీంతో అదనపు బలగాలను రప్పించి చంద్రబాబు, ఆనంద్‌ బాబు తదితరులను ఔరంగాబాద్‌ సెంట్రల్‌ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో తమపై దాఖలైన కేసును కొట్టేయాలని చంద్రబాబు దాఖలు చేసిన రెండు పిటిషన్లను ధర్మాసనం రద్దు చేసింది. అయితే చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూద్రా విన్నపం మేరకు గతంలో వారికిచి్చన మధ్యంతర రక్షణను జూలై 8 వరకు పొడిగించింది.నిబంధనల ప్రకారమే కేసులు: ధర్మాసనం అంతకుముందు సీనియర్‌ న్యాయ­వాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపిస్తూ ఆందోళనలు, నిరసనకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ను పోలీసులు ఉపసంహరించుకున్నారని, ఆ కేసులో నిందితులందరినీ మేజి్రస్టేట్‌ వెంటనే విడుదల చేశారన్నారు. అయితే, దాడి కేసులో పోలీసులు చంద్రబాబును, నక్కా ఆనంద్‌ బాబును ఇరికించారని ఆరోపించారు. జైళ్ల చట్టంలోని నిబంధనల ప్రకారం ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసే అధికారం జైళ్ల సూపరింటెండెంట్‌కు మాత్రమే ఉందన్నారు.ప్రస్తుత కేసులో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది సీనియర్‌ జైలర్‌ అని, ఆయనకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసే అధికారం లేదని లూత్రా అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే కోర్టు ఈ వాదనలను తిరస్కరించింది. నిందితులపై భారతీయ శిక్షాస్మృతిలోని నిబంధనల ప్రకారమే కేసులు నమోదు చేశారని స్పష్టం చేసింది. జైలు ప్రాంగణంలో నేరాలకు సంబంధించి భారతీయ శిక్షాస్మృతి ప్రకారం ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడానికి జైళ్ల చట్టం ఎలాంటి యంత్రాంగాన్ని లేదా విధానాన్ని నిర్దేశించలేదని ధర్మాసనం పేర్కొంది.

పల్నాడు జిల్లా నరసరావుపేటలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి  ఇంటి ముందు ఉన్న కార్లపై కర్రలు, రాళ్లతో దాడిచేస్తున్న టీడీపీ గూండాలు , పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగెడలో  పెట్రోల్‌ బాంబులు విసరడంతో దగ్ధమవుతున్న బైక్‌లు
పచ్చ ముఠాల విధ్వంస కాండ

సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్‌: రాష్ట్రంలో ఓటమి భయంతో టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు ఫ్యాక్షన్‌ , రౌడీ మూకలతో కలిసి బీభత్సం సృష్టించారు. కర్రలతో దండెత్తారు. కత్తులతో విరుచుకుపడ్డారు. ఏకంగా బాంబు దాడులకు దిగారు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, సామాన్య ఓటర్లపై యథేచ్ఛగా దాడులకు పాల్పడ్డారు. పోలింగ్‌ ప్రక్రియను అడ్డుకునేందుకు బరితెగించి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారు. ఇళ్లు, వాహనాలపై దాడులకు తెగబడి విధ్వంస కాండతో చెలరేగిపోయారు. సామాన్య ప్రజానీకాన్ని హడలెత్తించారు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ విధ్వంసానికి దిగారు. ఈ గొడవలన్నింటికీ కర్త, కర్మ, క్రియ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడే. సోమవారం ఉదయం పోలింగ్‌ ప్రారంభమైన కాసేపటికే పోలింగ్‌ సరళి టీడీపీకి వ్యతిరేకంగా ఉందనే విషయం స్పష్టం కావడంతో చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్‌ కళ్యాణ్‌ బెంబేలెత్తిపోయారు. దాంతో ముందస్తు పన్నాగంతో సిద్ధం చేసిన తమ రౌడీమూకలకు పచ్చ జెండా ఊపారు. ఆ వెంటనే టీడీపీ, జనసేన రౌడీలు యథేచ్ఛగా దాడులకు తెగబడి రాష్ట్ర వ్యాప్తంగా బీభ­త్సం సృష్టించారు. ఉదయం మొదలైన ఈ దాడులు, దౌర్జన్య కాండ అర్ధరాత్రి వరకు కొనసాగింది. తెగబడ్డ టీడీపీ, జనసేన సోమవారం ఉదయం పోలింగ్‌ మొదలు కాగానే రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. వారిలో మహిళలు, వృద్ధులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలు అత్యధికంగా ఉండటం విశేషం. అంటే ఓటింగ్‌ సరళి వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉందన్నది స్పష్టమైంది. దాంతో బెంబేలెత్తిన చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లు.. విధ్వంసం సృష్టించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. కర్రలు, కత్తులతోపాటు పెట్రోల్‌ బాంబులు కూడా ముందుగానే సమకూర్చుకోవడం టీడీపీ, జనసేన కుట్రకు నిదర్శనం. చంద్రబాబు ఆదేశించగానే.. టీడీపీ, జనసేన రౌడీలు రాష్ట్ర వ్యాప్తంగా దాడులకు తెగబడ్డారు. చోద్యం చూసిన ఈసీ టీడీపీ, జనసేన గూండాలు బరితెగించి విధ్వంసానికి పాల్పడి పోలింగ్‌కు ఆడ్డంకులు సృష్టించినా ఎన్నికల కమిషన్‌(ఈసీ) నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం నివ్వెర పరుస్తోంది. వారం రోజుల ముందు నుంచే టీడీపీ ఎన్నికల ప్రలోభాలపై వైఎస్సార్‌సీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ప్రధానంగా వుయ్‌ యాప్‌ పేరుతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తుండటంపై పూర్తి ఆధారాలను కూడా సమరి్పంచింది. టీడీపీ గూండాలు దాడులకు పాల్పడిన ఉదంతాలను.. పోలింగ్‌ రోజున విధ్వంసం సృష్టించేందుకు పదును పెడుతున్న కుట్రలను కూడా ఈసీ దృష్టికి తీసుకువెళ్లింది. అయినా సరే పోలింగ్‌ ప్రశాంతంగా, సక్రమంగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవడంలో ఈసీ పూర్తిగా విఫలమైంది. అసలు టీడీపీ, జనసేన గూండాలు వీధుల్లోకి వచ్చి చెలరేగిపోతున్నా, పోలింగ్‌ కేంద్రాల్లో ప్రవేశించి బెదిరింపులకు పాల్పడుతున్నా.. ఈవీఎంలను ధ్వంసం చేసినా.. ఏకంగా బాంబు దాడులకు పాల్పడినా సరే ఈసీ మాత్రం క్రియాశీలంగా స్పందించనే లేదు. పైగా వైఎస్సార్‌సీపీ నేతలనే కట్టడి చేసేందుకు యత్నించడం విభ్రాంతి కలిగిస్తోంది. గుంటూరు జిల్లా తెనాలిలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అన్నబత్తున శివకుమార్‌ను మాత్రమే గృహ నిర్బంధంలో ఉంచాలని పోలీసులను ఏకపక్షంగా ఆదేశించడం విస్మయ పరిచింది. ఆయన్ను దూషించిన టీడీపీ కార్యకర్తపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. పల్నాడు జిల్లా నరసారావుపేటలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నివాసంపై టీడీపీ రౌడీలు దాడికి పాల్పడి, అక్కడ ఉన్న వాహనాలను ధ్వంసం చేశాయి. కానీ ఈసీ మాత్రం ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని గృహ నిర్బంధంలో ఉంచమని పోలీసులను ఆదేశించడం విడ్డూరంగా ఉంది. మచ్చుకత్తితో దాడి శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఓడీ చెరువు మండలం కుసుమవారిపల్లిలో స్లిప్పుల పంపిణీ కోసం టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన శిబిరం వద్దకు వెళ్లకుండా వైఎస్సార్‌సీపీ శిబిరం వద్దకు ఓటర్లు వెళ్లడంతో ఓర్చుకోలేని టీడీపీ కార్యకర్త ఇడగొట్టు రంగప్ప మచ్చుకత్తితో వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఇంద్రప్పను పొడిచాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై పేగులు బయటకు వచ్చాయి. ఈ సంఘటనతో భయబ్రాంతులకు గురైన ఓటర్లు చెల్లాచెదురయ్యారు. హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలం హుస్సేన్‌పురంలో ఎంపీపీ పురుషోత్తంరెడ్డిపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో పురుషోత్తం రెడ్డి కారు ధ్వంసమైంది. వైఎస్సార్‌సీపీ కార్యకర్త నవీన్‌ తలకు తీవ్ర గాయాలయ్యాయి. వైఎస్సార్‌సీపీ ఏజెంట్‌లపై హత్యాయత్నం పల్నాడు జిల్లా కారెంపూడి మండలం ఒప్పిచర్ల పోలింగ్‌ కేంద్రంలో ఎన్నికల రిలీవ్‌ ఏజెంట్‌గా ఉన్న వైఎస్సార్‌సీపీ నేత పాలకీర్తి నరేంద్ర, అతడి తమ్ముడిపై టీడీపీ మూకలు మూకుమ్మడిగా దాడి చేశారు. ప్రాణ భయంతో వారు తప్పించుకుని బయటకు పరుగులు తీశారు. దాదాపు 300 మంది టీడీపీ గూండాలు వెంట పడటంతో కారెంపూడి పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ ఘటన అనంతరం పొట్టి శ్రీరాములు కాలనీలోని ఎన్నికల బూత్‌ల వద్ద వైఎస్సార్‌సీపీ శ్రేణులపై టీడీపీ నాయకులు కవ్వింపు చర్యలకు దిగి రాళ్ల దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో వైఎస్సార్‌సీపీ నాయకుడు ఇరికెదిండ్ల లాజర్‌తో పాటు పలువురికి గాయాలయ్యాయి. కారెంపూడిలోని 288 నెంబర్‌ బూత్‌లో ఎన్నికల ఏజెంట్‌గా ఉన్న గోగుల సాంబశివరావు తమ్ముడిపై టీడీపీ వర్గీయులు దౌర్జన్యానికి పాల్పడడంతో దాడిని అడ్డుకునే యత్నంలో సాంబశివరావు తలకు గాయమైంది. వైఎస్సార్‌ జిల్లా వేముల మండలం మబ్బుచింతలపల్లె పోలింగ్‌ కేంద్రం వద్ద వైఎస్సార్సీపీ వర్గీయులపై టీడీపీ వర్గీయులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. టీడీపీకి ఓటు వేయాలని ప్రచారం చేస్తున్న నూలి భాస్కర్‌రెడ్డిని వైఎస్సార్‌సీపీ శ్రేణులు అడ్డుకోవడంతో టీడీపీ వర్గీయులు పథకం ప్రకారం రాళ్ల దాడి చేశారు. కాగా, టీడీపీ వర్గీయుల రాళ్ల దాడిలో వైఎస్సార్సీపీకి చెందిన లావనూరు హనుమంతురెడ్డి కారు అద్దాలు పగిలాయి. రాళ్ల దాడిలో జల్లా సునంద అనే మహిళకు చేయి విరిగింది. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. పూతలపట్టులో తెలుగు తమ్ముళ్ల వీరంగం చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలోని మూడు పోలింగ్‌ బూత్‌లతో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లపై పచ్చ మూక దాడులకు పాల్పడింది. పేటగ్రహారానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు రవినాయుడు పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లే సమయంలో టీడీపీ నాయకులు కర్రలతో దాడి చేశారు. అనంతరం పేటపల్లిలో వైఎస్సార్‌సీపీ నాయకుడు గురుస్వామినాయుడుపై దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో గురుస్వామి నాయుడు తలకు తీవ్ర గాయాలయ్యాయి. వావిల్‌తోట పంచాయతీ సీఎం కండ్రిగ పోలింగ్‌ బూత్‌లో ఏజెంట్‌గా వున్న హరిబాబుపై టీడీపీ నాయకులు దాడి చేశారు. ఈ దాడిలో అతనికి తీవ్ర గాయాలు కావడంతో చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇదే జిల్లా సోమల మండలం కందూరు పోలింగ్‌ కేంద్రం వద్ద వైఎస్సార్‌సీపీ నాయకుడు సురే‹Ùరెడ్డిపై టీడీపీ మండల అధ్యక్షుడు సుబ్రమణ్యం నాయుడు దాడికి పాల్పడ్డాడు. పోలింగ్‌ కేంద్రంలో వద్ద ఏర్పడిన వివాదంతో సుబ్రమణ్యం నాయుడు తన అనుచరులతో కలసి దాడి చేశాడు. గంగాధర్‌ నెల్లూరు మండలం జంగాలపల్లి పోలింగ్‌ బూత్‌ వద్ద టీడీపీ నాయకులు గ్రామస్తులపై దౌర్జన్యం చేశారు. చిత్తూరు మండలం పెరుమాళ్ళ కండ్రిగలో టీడీపీ నాయకులు రెచ్చిపోయి వైఎస్సార్సీపీ నాయకుడి ఇంటిపై దాడి చేశారు. కారును ధ్వంసం చేసి ఓ నాయకుడిని తీవ్రంగా గాయపరిచారు. తొలుత టీడీపీ నాయకులు ఓటర్లను ఇబ్బందులకు గురిచేస్తూ రోడ్డుకు అడ్డంగా పందిరి వేశారు. దీనిని పోలీసులు తీసి వేయడంతో జీర్ణించుకోలేక వైఎస్సార్‌సీపీ నాయకుడి ఇంటిపై దౌర్జన్యానికి దిగారు. ఇనుప రాడ్లు, కొయ్యలతో పలువురిని తీవ్రంగా గాయపరిచారు. పసుపు కండువాతో ‘గంటా’ హల్‌చల్‌ భీమిలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పసుపు కండువాతో హల్‌చల్‌ చేశారు. తన అనుచరులతో కలిసి పోలింగ్‌ స్టేషన్‌లోకి వెళుతుండగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం గోకర్నపల్లి పోలింగ్‌ బూత్‌లో ఏజెంట్ల మధ్య తలెత్తిన వివాదం టీడీపీ, వైఎస్సార్‌సీపీల మధ్య కొట్లాటకు దారితీసింది. ఈ దాడిలో వైఎస్సార్‌సీపీ నాయకులు చింతాడ జీవరత్నం, యతేంద్ర, సంపతిరావు సూర్యనారాయణలకు తీవ్ర గాయాలయ్యాయి. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పల్లం గ్రామంలో వైఎస్సార్‌సీపీ, టీడీపీ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్‌ కుమార్‌ పోలింగ్‌ బూత్‌ వద్దకు వెళ్లడంతో టీడీపీ నాయకులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో వైఎస్సార్‌సీపీకి చెందిన మల్లాడి చిన ధర్మారావు, మల్లాడి నర్సింహులు, అరదాని శ్రీను తలకు తీవ్ర గాయాలయ్యాయి. కాకినాడ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులపై టీడీపీ నేతలు దాడులు చేశారు. రామకృష్ణారావుపేటలో కొందరు టీడీపీ సానుభూతిపరులు చేసిన దాడిలో మాజీ కార్పొరేటర్‌ రోకళ్ళ సత్యనారాయణతో పాటు మరికొందరు గాయపడ్డారు. రూరల్‌ కరప మండలం పెదకొత్తూరులో పోలింగ్‌ బూత్‌ వద్ద జనసేన కార్యకర్తలు వైఎస్సార్‌ సీపీకి చెందిన చింతా సత్యనారాయణపై దాడి చేసి మొబైల్‌ ఫోన్‌ లాక్కొని వివాదం సృష్టించారు. పిఠాపురం నియోజకవర్గం విరవ, విరవాడ ప్రాంతాల్లో కూడా జనసేన కార్యకర్తలు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. జగ్గంపేట నియోజకవర్గ పరిధిలో గోకవరం మండలం కృష్ణునిపాలెం గ్రామంలో టీడీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై ఘర్షణకు దిగారు.‘చింతమనేని’ వర్గీయులు కత్తెరతో దాడి పెదవేగి మండలం కొప్పులవారిగూడెంలో వైఎస్సార్‌సీపీకి చెందిన చలపాటి రవిపై చింతమనేని అనుచరులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. పోలింగ్‌ బూత్‌లో ఓటు వేయడానికి వచ్చిన రవి భుజంపై కత్తెరతో పొడవడంతో తీవ్రంగా గాయపడిన రవి ఆసుపత్రిలో విషమ పరిస్థితుల్లో ఉన్నాడు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఆసుపత్రికి చేరుకుని రవిని పరామర్శించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని లాలాపేట ప్రభుత్వ బాలికల హైస్కూలులో పోలింగ్‌ సరళిని పరిశీలించేందుకు వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్‌ నూరి ఫాతిమా, ఎమ్మెల్యే మొహమ్మద్‌ ముస్తఫా వచ్చారు. అప్పుడే అక్కడికి చేరుకున్న టీడీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు పాల్పడి గొడవ పెట్టుకునేందుకు ప్రయత్నం చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలపై లాఠీఛార్జి చేశారు. పొన్నూరు రోడ్డులోని అంజుమన్‌ పాఠశాల బూత్‌లో డీఎస్పీ మల్లికార్జునరావు వైఎస్సార్‌ సీపీకి చెందిన బూత్‌ ఏజెంట్లను ఇబ్బందులకు గురిచేశారు. వారి గుర్తింపు కార్డులను లాక్కొని బయటకు వెళ్లాలంటూ ఆదేశించారని బూత్‌ ఏజెంట్లు పలువురు ఆరోపించారు. పొత్తూరివారిపేటలో టీడీపీ నేతలు వైఎస్సార్‌ సీపీ శ్రేణులపై దాడి చేసేందుకు ప్రయత్నించినా పోలీసులు పట్టించుకోలేదు. కత్తిపోటు నుంచి రాళ్ల దాడుల వరకూ..> పోలింగ్‌ మొదలైన కాసేపటికే టీడీపీ రౌడీలు చి­త్తూరు జిల్లాలో వైఎస్సార్‌సీపీ ఏజంట్‌పై కత్తితో దా­డి చేశారు. అనంతరం పోలింగ్‌ శాతం పెరుగుతున్న కొద్దీ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేన దాడుల తీవ్రతను అమాంతం పెంచుకుంటూ పోయాయి. > వైఎస్సార్‌ జిల్లా ఎర్రగుంట్ల 14వ వార్డు వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి షాహీద్‌పై టీడీపీ నేతలు దాడి చేశారు. వీరపునాయునిపల్లె మండలంలోని యు.వెంకటాపురం, బుసిరెడ్డిపల్లె గ్రామాల్లో టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడికి పాల్పడ్డారు. కడపలో ఓట్లు వేసేందుకు క్యూలో ఉన్న ముస్లింలపై టీడీపీ గూండాలు రాళ్ల దాడికి తెగబడ్డాయి. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లి మండలం చౌటపల్లె పోలింగ్‌ కేంద్రం వద్ద వైఎస్సార్‌సీపీ వర్గీయులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశారు. టీడీపీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తన అనుచరులతో అక్కడకు చేరుకుని ఉద్రిక్తతలను మరింతగా రెచ్చగొట్టడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. > రాయచోటి నియోజకవర్గంలోని నక్కవాండ్లపల్లి 175 పోలింగ్‌ కేంద్రంలో టీడీపీ వర్గీయులు దాడికి పాల్పడటంతో వైఎస్సార్‌సీపీ నేత తిరుపాల్‌ నాయుడు తీవ్రంగా గాయపడ్డారు. దప్పేపల్లి గ్రామం మేడిమాకల గుంతరెడ్డివారిపల్లె పోలింగ్‌ కేంద్రంలో వైఎస్సార్‌సీపీ పోలింగ్‌ ఏజంట్లపై టీడీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం చౌటపల్లె పోలింగ్‌ కేంద్రం వద్ద వైఎస్సార్‌సీపీ వర్గీయు­లపై టీడీపీ వర్గీయులు రాళ్లతో దాడి చేశారు. ఇదే సమయంలో రాయచోటి టీడీపీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తన అనుచరులతో అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న అడిషనల్‌ ఎస్పీ హైమావతి, డీఎస్పీ శ్రీధర్, స్పెషల్‌ పార్టీ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. > మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ ప్రైమరీ స్కూల్‌ వద్ద టీడీపీ నాయకులు కండువా, పసుపు చొక్కాలు ధరించి టీడీపీకి ఓటేయాల్సిందిగా ఓటర్లను అభ్యర్ధించారు. దీన్ని ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ నాయకులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు.

Daily Horoscope Rasi Phalalu 14-05-2024 Telugu
Today Horoscope: ఈ రాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది

శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, తిథి: శు.సప్తమి పూర్తి(24 గంటలు), నక్షత్రం: పుష్యమి ప.3.08 వరకు తదుపరి ఆశ్లేష, వర్జ్యం: తె.4.56 నుండి 6.36 వరకు (తెల్లవారితే బుధవారం), దుర్ముహూర్తం: ఉ.8.04 నుండి 8.52 వరకు తదుపరి రా.10.50 నుండి 11.38 వరకు, అమృతఘడియలు: ఉ.8.20 నుండి 10.01 వరకు. వృషభంశుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. దూర బంధువులతో కలుస్తారు. తద్వారా లాభాలు ఉంటాయి. విదేశయాన ప్రయత్నాలు సంపూర్ణంగా నెరవేర్చుకుంటారు. ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. అన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తారు.మిథునంఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు లభిస్తాయి. బంధు, మిత్రులతో కలుస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ప్రతివిషయంలో అభివృద్ధి ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు.కర్కాటకంమానసిక ఆనందం లభిస్తుంది. గతంలో వాయిదా వేయబడిన పనులు పూర్తవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని జఠిలమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.సింహంప్రయత్నకార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో సుఖసంతోషాలు అనుభవిస్తారు. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. శుభవార్తలు వింటారు. ధైర్యసాహసాలు ప్రదర్శిస్తారు. ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది.క‌న్యబంధు, మిత్రులతో కలుస్తారు. నూతన గృహనిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. శతృబాధలు దూరమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది.తుల‌విదేశయాన ప్రయత్నం సులభమవుతుంది. కుటుంబ కలహాలకు తావీయరాదు. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. పిల్లలతో జాగ్రత్త వహించడం మంచిది. వృత్తి, ఉద్యోగరంగంలోని వారికి ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం.వృశ్చికంమానసిక ఆందోళనను తొలగించడానికి దైవధ్యానం అవసరం. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. శారీరక అనారోగ్యంతో బాధపడతారు. కటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువవుతాయి. ధనవ్యయం తప్పదు.ధ‌నుస్సుకొన్నిముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. మానసిక చంచలంతో ఇబ్బంది పడతారు. సోమరితనం ఆవహిస్తుంది. పిల్లలపట్ల మిక్కిలి జాగ్రత్తవహిస్తారు. కొన్ని మంచి అవకాశాలను కోల్పోతారు. ఆర్థిక పరిస్థితిలో మార్పులుండవు.మకరంఅనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం ఉంది. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. రుణప్రయత్నాలు చేస్తారు.కుంభంనూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. ప్రయాణాల వల్ల లాభాన్ని పొందుతారు. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోతారు. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. నూతన కార్యాలు వాయిదా వేసుకోకతప్పదు.మీనంవ్యాపారంలో విశేషలాభాన్ని ఆర్జిస్తారు. మంచివారితో స్నేహం చేస్తారు. అంతటా సుఖమే లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. బంధు, మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఒక ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు. నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు.

TDP leaders attacked YSRCP leaders
మోపిదేవిలంకలో బాలశౌరి తనయుడి వీరంగం 

మోపిదేవి (అవనిగడ్డ): ఓటమి భయంతో టీడీపీ నేతలు దాడులకు తెగబడ్డారు. కృష్ణాజిల్లా మోపిదేవి మండలం మోపిదేవిలంకలో సర్దిచెప్పేందుకు ప్రయత్నించిన వైఎస్సార్‌సీపీ నాయకులపై టీడీపీ నాయకులు రె చ్చిపోయారు. మహిళలు అని కూడా చూడకుండా కిందపడేసి పిడిగుద్దులు గుద్దడమేగాక కాళ్లతో తన్నారు. మచిలీపట్నం పార్లమెంట్‌ జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరి తనయుడు అనుదీప్‌తో వచ్చిన జనసేన నాయకులు కూడా ఈ దాడులకు పాల్పడ్డారు.మోపిదేవిలంకలో ఏజెంట్లు టీ అడగడంతో స్థానికంగా ఉండే యార్లగడ్డ అంకరాజుతో తెప్పించారు. లోపలికి వెళుతున్న అంకరాజుపై జనసేన ఎంపీ అభ్యర్ధి వల్లభనేని బాలశౌరి తనయుడు అనుదీప్‌తో వ చ్చిన జనసేన నాయకులు, కొందరు టీడీపీ నేతలు దాడిచేశారు. సర్దిచెప్పేందుకు ప్రయత్నించిన వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం మోపిదేవి మండల కన్వినర్‌ రాజులపాటి నాగేశ్వరరావు మీద జనసేన నేతలు బల్లా సీతారాంప్రసాద్, బల్లా మునికుమారి, బల్లా దినేష్, శ్రీనివాసరావు, పవన్‌ తదితరులు దాడిచేసి కొట్టారు. నాగేశ్వరరావు కుమార్తె కేశాని తేజశ్రీని కిందపడేసి పిడిగుద్దులు గుద్ది కాళ్లతో తన్నారు. అడ్డువ చ్చిన వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి మోర్ల శ్రీనివాసరావుతో పాటు రాజులపాటి సుజాత, నరసారావు, వినయ్‌బాబు, శివనాగరాజులను తీవ్రంగా కొట్టారు.బాధిత వైఎస్సార్‌సీపీ నాయకులు మోపిదేవి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, అవనిగడ్డ వైద్యశాలలో చేరారు. వీరికంటే ముందే.. దాడిచేసిన టీడీపీ నాయకులు ఆస్పత్రిలో చేరారు. తరువాత వైఎస్సార్‌సీపీ నాయకులు హాస్పటల్‌లో చేరగా అదే వార్డులో ఇరువర్గాలను ఉంచారు. టీడీపీ నాయకురాలు బల్లా మునికుమారిని పరామర్శించేందుకు వ చ్చిన ఆమె సోదరులు అక్కడే చికిత్స పొందుతున్న వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడికి యత్నించారు. ఎస్‌ఐ రమేష్‌ ఇరువర్గాలకు సర్దిచెప్పారు.అనంతరం ఇరువర్గాలను మచిలీపట్నం ఆస్పత్రికి పంపారు. ఎమ్మెల్యే సింహాద్రి రమే‹Ùబాబు, వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జోనల్‌ ఇన్‌చార్జి కడవకొల్లు నరసింహారావు వైద్యశాలకు వెళ్లి వైఎస్సార్‌సీపీ నాయకులను పరామర్శించారు. ఈ దాడుల్ని ఎమ్మెల్యే సింహాద్రి తీవ్రంగా ఖండించారు.

IPL 2024: Gujarat Titans vs Kolkata Knight Riders abandoned due to rain
IPL 2024: గుజరాత్‌ అవుట్‌

అహ్మదాబాద్‌: సొంతగడ్డపైనే గుజరాత్‌ టైటాన్స్‌ పుట్టి మునిగింది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై గెలిచి ప్లే ఆఫ్స్‌ రేసులో నిలవాలనే పట్టుదలతో ఉన్న నిరుటి రన్నరప్‌ టైటాన్స్‌ ఆశల్ని భారీ వర్షం ముంచేసింది. తెరిపినివ్వని వానతో నరేంద్ర మోదీ స్టేడియం తడిసిముద్దయ్యింది. కనీసం 5 ఓవర్ల మ్యాచ్‌గానైనా నిర్వహించేందుకు గ్రౌండ్‌ సిబ్బంది చాలా కష్టపడింది. కానీ ఆగినట్లే ఆగిన వాన మళ్లీ చినుకు చినుకుగా పడటంతో నిర్వాహకులు చేసేదేమీలేక తుది నిర్ణయం తీసుకోవాల్సి వచి్చంది. నిజానికి రాత్రి 10 గంటలైనా అసలు టాస్‌ వేసేందుకే అవకాశం లేకపోయింది. చివరిసారిగా రాత్రి 10.36 గంటలకు మైదానాన్ని పరిశీలించిన ఫీల్డు అంపైర్లు నవ్‌దీప్‌ సింగ్, నిఖిల్‌ పట్వర్దన్‌ మ్యాచ్‌ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇరుజట్లకు చెరో పాయింట్‌ లభించగా, ఆటగాళ్లు పరస్పర కరచాలనంతో మైదానంలోని ప్రేక్షకుల్ని పలుకరిస్తూ డ్రెస్సింగ్‌ రూమ్‌వైపు నడిచారు. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో వర్షంవల్ల రద్దయిన తొలి మ్యాచ్‌ ఇదే కావడం గమనార్హం. పటిష్టస్థితిలో కోల్‌కతా ఫలితం తేలని మ్యాచ్‌తో టాప్‌–2 స్థానాలు మాత్రం తేలిపోయాయి. మ్యాచ్‌ రద్దుతో వచి్చన ఒక పాయింట్‌తో కోల్‌కతా 19 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. కేకేఆర్‌ మిగిలున్న ఆఖరి మ్యాచ్‌లో ఓడినా... తొలి రెండు స్థానాల్లో ఉండటం ఖాయమైంది. ప్రస్తుతం 16 పాయింట్లతో ఉన్న రాజస్తాన్‌ రాయల్స్‌ తమ రెండు లీగ్‌ మ్యాచ్‌ల్లోనూ ఒకవేళ గెలిస్తే 20 పాయింట్లతో అగ్రస్థానంలోకి ఎగబాకుతుంది. అప్పుడు నైట్‌రైడర్స్‌ రెండో స్థానానికి పడిపోయినా ఎలిమినేటర్‌ ఆడే పరిస్థితి అయితే రాదు. ఐపీఎల్‌లోకి ప్రవేశించిన గత రెండేళ్ల నుంచి ఫైనల్‌ చేరిన గుజరాత్‌ ఈసారి ఇంకో మ్యాచ్‌ మిగిలున్నా... లీగ్‌ దశలోనే ని్రష్కమించనుంది. 2022లో టైటిల్‌ గెలిచిన టైటాన్స్‌ గతేడాది రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ప్రస్తుతం 13 మ్యాచ్‌ల్లో ఐదింట గెలిచిన టైటాన్స్‌ ఖాతాలో 11 పాయింట్లున్నాయి. ఒకవేళ ఆఖరిపోరు గెలిచినా... 13 పాయింట్లవద్దే ఆగిపోతుంది. అయితే పట్టికలో ఇప్పటికే కోల్‌కతా (19), రాజస్తాన్‌ (16), చెన్నై (14), హైదరాబాద్‌ (14) ముందు వరుసలో ఉండటంతో గుజరాత్‌ ఖేల్‌ లీగ్‌తోనే ముగిసింది.

మహబూబాబాద్‌ జిల్లా రెడ్యాలలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో బారులుదీరిన ఓటర్లు
TS: 64.93% పోలింగ్‌! ప్రశాంతంగా ముగిసిన లోక్‌సభ ఎన్నికలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు సాధారణ ఎన్నికలు, కంటోన్మెంట్‌ అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్‌ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఎల్రక్టానిక్‌ ఓటింగ్‌ యంత్రాల (ఈవీఎం)లో నిక్షిప్తమైంది. రాత్రి 12 గంటల వరకు వేసిన అంచనాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 64.93 శాతం పోలింగ్‌ నమోదైనట్టు అధికారులు ప్రకటించారు. ఉదయం నుంచే వడివడిగా..: రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఉదయం 7 గంటలకే పోలింగ్‌ ప్రారంభమైంది. 13 మావోయిస్టు ప్రభావిత అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో సాయంత్రం 4 గంటల వరకు, మిగతా అన్నిచోట్లా సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరిగింది. గడువు ముగిసే సమయానికల్లా పోలింగ్‌ కేంద్రాల్లో క్యూలో ఉన్న వారందరికీ ఓటేసే అవకాశం కల్పించారు. దీనితో సాయంత్రం 7 గంటల తర్వాత కూడా సుమారు 1,400 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటింగ్‌ కొనసాగిందని సీఈఓ వికాస్‌రాజ్‌ తెలిపారు. సాయంత్రం ఏడు గంటల తర్వాత ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌ ప్రశాంతంగా జరిగిందని, శాంతిభద్రతలకు సంబంధించి ఎలాంటి సమస్యలు తలెత్తలేదని వికాస్‌రాజ్‌ వివరించారు. 115 పోలింగ్‌ కేంద్రాల్లోని ఈవీఎంలలో సమస్యలు వస్తే.. వాటిని మార్చామని తెలిపారు. కచ్చితమైన పోలింగ్‌ శాతంపై మంగళవారం స్పష్టత వస్తుందన్నారు. జూన్‌ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలను ప్రకటిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో ఎక్కడా రీపోలింగ్‌ నిర్వహించాల్సిన పరిస్థితులు ఏర్పడలేదన్నారు. వాతావరణం సహకరించడంతో.. రాష్ట్రంలో రెండు, మూడు రోజుల నుంచి కురుస్తున్న వానలతో వాతావరణం చల్లబడింది. దీనితో రోజంతా పోలింగ్‌ కొనసాగింది. ఉదయమే వడివడిగా ప్రారంభమై రోజంతా స్థిరంగా కొనసాగింది. ఉదయం 9 గంటల కల్లా 9.4 శాతం, 11 గంటలకు 24.31 శాతం, మధ్యాహ్నం 1 గంటకు 40.38 శాతం, మధ్యాహ్నం 3 గంటలకు 52.34 శాతం, సాయంత్రం 5 గంటలకల్లా 61.16 శాతానికి, రాత్రి 12 గంటలకల్లా 64.93 శాతానికి పోలింగ్‌ పెరిగింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 62.69 శాతం పోలింగ్‌ నమోదైంది, నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 71.97 శాతం పోలింగ్‌ జరిగింది. ఈసారి గత లోక్‌సభ ఎన్నికలన్నా ఎక్కువగా పోలింగ్‌ శాతం నమోదైంది. వందల కొద్దీ ఫిర్యాదులు పోలింగ్‌ రోజైన సోమవారం నేషనల్‌ గ్రీవెన్స్‌ పోర్టల్‌కు 415, టోల్‌ ఫ్రీ నంబర్‌కు 21, సీ–విజిల్‌ యాప్‌ ద్వారా 225 ఫిర్యాదులు వచ్చాయని.. వాటిపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకున్నామని సీఈవో వికాస్‌రాజ్‌ తెలిపారు. పోలింగ్‌ రోజు జరిగిన వేర్వేరు ఘటనలకు సంబంధించి 38 కేసులు నమోదు చేశామన్నారు. ఇంకా కొన్ని ఫిర్యాదులపై పరిశీలన జరుగుతోందని, కేసుల సంఖ్య పెరగవచ్చని తెలిపారు. పోలింగ్‌ కేంద్రంలో ఓటర్ల గుర్తింపును తనిఖీ చేసే అధికారం అభ్యర్థులకు ఉండదని.. ఈ క్రమంలో హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో ఓటర్ల గుర్తింపును తనిఖీ చేసిన ఓ అభ్యర్థి (బీజేపీ అభ్యర్థి మాధవీలత)పై కేసు నమోదు చేశామని చెప్పారు. జహీరాబాద్, నిజామాబాద్‌లలో జరిగిన ఘటనపై సైతం కేసులు పెట్టామన్నారు. ఎన్నికలకు సంబంధించి మార్చి 1 నుంచి ఇప్పటివరకు మొత్తం రూ.330 కోట్ల నగదు, ఇతర వస్తువులను స్వా«దీనం చేసుకున్నామని వెల్లడించారు. స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర సాయుధ బలగాలతో తొలి అంచె, రాష్ట్ర సాయుధ పోలీసు బలగాలతో రెండో అంచె, స్థానిక పోలీసులతో మూడో అంచె బందోబస్తు నిర్వహిస్తారు. స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద పరిస్థితిని సీసీ కెమెరాల ద్వారా నిరంతరం ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించేందుకు అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారు. రాజకీయ పార్టీలు తమ ప్రతినిధులను స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద కాపలాగా పెట్టాలనుకుంటే.. వారికి అవసరమైన ఏర్పాట్లు చేస్తారు. ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ముగిసిన తర్వాత 45 రోజుల వరకు ఈ భద్రతా ఏర్పాట్లు కొనసాగుతాయి. ఎన్నికల ఫలితాల తర్వాత వాటిని సవాల్‌ చేస్తూ 45రోజుల్లోగా కోర్టులో ఎలక్షన్‌ పిటిషన్లు వేయడానికి అవకాశం ఉండటమే దీనికి కారణం. మళ్లీ బద్ధకించిన హైదరాబాదీలు! ఓటేసేందుకు హైదరాబాద్‌–సికింద్రాబాద్‌ జంటనగరాల ప్రజలు మళ్లీ బద్ధకించారు. రాత్రి 12 గంటలకు ప్రకటించిన పోలింగ్‌ శాతం అంచనాల మేరకు.. రాష్ట్రంలోనే అత్యల్పంగా హైదరాబాద్‌ స్థానం పరిధిలో 46.08 శాతం పోలింగ్‌ నమోదైంది. తర్వాత సికింద్రాబాద్‌ పరిధిలో 48.11 శాతం, మల్కాజ్‌గిరి పరిధిలో 50.12 శాతం, చేవెళ్ల పరిధిలో 55.45 శాతం పోలింగ్‌ మాత్రమే నమోదైంది. అత్యధికంగా భువనగిరి లోక్‌సభ స్థానం పరిధిలో 76.47 శాతం, జహీరాబాద్‌ పరిధిలో 74.54 శాతం పోలింగ్‌ నమోదయ్యాయి. అయితే హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం పరిధిలో మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు బారులు తీరారని.. దీనికితోడు సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ సమయం పెంచడంతో.. ఈసారి పోలింగ్‌ శాతం పెరిగే అవకాశం ఉందని సీఈవో వికాస్‌రాజ్‌ పేర్కొన్నారు. నేడు ‘పరిశీలకుల’ఆధ్వర్యంలో ఈవీఎంల తనిఖీలు పోలింగ్‌ ప్రక్రియ ముగిసిన తర్వాత ప్రిసైడింగ్‌ అధికారులు ఈవీఎంలు, పోలింగ్‌ సామాగ్రిని సంబంధిత రిసెప్షన్‌ కేంద్రంలో అందజేస్తారు. అక్కడ అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు ఈవీఎంలు, ఎన్నికల సామాగ్రికి ప్రాథమిక పరిశీలన నిర్వహిస్తారు. ఫారం–17సీ, ఈవీఎం, వీవీ ప్యాట్స్‌ను పరిశీలించి చూస్తారు. మొత్తం ఓట్లు, పోలైన ఓట్లను సరిచూసుకుంటారు. అన్నీ సవ్యంగా ఉన్నట్టు నిర్ధారించుకున్న తర్వాత ఎన్నికల పరిశీలకుడు ఈ అంశాలను ధ్రువీకరిస్తూ సంతకం చేస్తారు. తర్వాత ప్రిసైడింగ్‌ అధికారులను పంపించివేస్తారు. ఈవీఎంలను సంబంధిత నియోజకవర్గ స్ట్రాంగ్‌ రూమ్‌కు తరలిస్తారు. కొన్నిచోట్లలోని రిసెప్షన్‌ కేంద్రాల్లోనే స్ట్రాంగ్‌ రూమ్‌లు ఉండగా.. మరికొన్ని చోట్ల వేరే ప్రాంతాల్లో ఉన్నాయి. అలా ఉన్న చోట కేంద్ర బలగాల భద్రత నడుమ జీపీఎస్‌ సదుపాయమున్న వాహనాల్లో ఈవీఎంలను తరలించి భద్రపరుస్తారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే పోలింగ్‌ బృందాలు.. రిసెప్షన్‌ సెంటర్‌కు వచ్చి, అప్పగింత ప్రక్రియ పూర్తి చేసే సరికి.. మంగళవారం తెల్లవారుజాము 5 గంటల వరకు పట్టే అవకాశం ఉందని సీఈవో వికాస్‌ రాజ్‌ తెలిపారు. తర్వాత మంగళవారం ఉదయం 11 గంటలకు స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద సాధారణ పరిశీలకులు ఈవీఎంలు, పోలింగ్‌ సామాగ్రి, ప్రిసైడింగ్‌ అధికారుల నుంచి వచ్చిన రిపోర్టులు, డైరీలను తనిఖీ చేసి అంతా సవ్యంగా ఉన్నట్టు నిర్ధారిస్తారని వివరించారు. ఏదైనా ప్రాంతంలో రిపోలింగ్‌ అవసరం ఉంటే.. అప్పుడే నిర్ణయం తీసుకుంటారని, ఇప్పటివరకు అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాలేదని వెల్లడించారు.

తనిష్క్ జ్యువెలరీ నెక్లెస్‌
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్

ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన, భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్‌ల నుండి ప్రేరణ పొంది అద్భుతమైన మరియు వైవిధ్యమైన శ్రేణి సమకాలీన, రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్‌లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్‌లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్‌లు, కస్టమర్‌లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా, ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్‌ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్‌ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్, ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్‌లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్‌గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్‌లెట్‌లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్‌లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్‌లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్‌డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్‌లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్ 18కేరట్ మరియు 22కేరట్ బంగారంలో విస్తృతమైన శ్రేణి డిజైన్‌లతో, నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని సంపూర్ణం చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్‌లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్‌లెట్‌లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
 

ఫోటో స్టోరీస్

View all