Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

AP Elections 2024 Judgement Counting Six More Days
ఏపీ ప్రజా తీర్పు.. ఇంకో 6 రోజులే!

జూన్‌ 4.. సరిగ్గా ఇంకో ఆరో రోజులు మాత్రమే. లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడే రోజది. అదే సమయంలో ఒడిషాతో పాటు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టబోతున్నారు.. ఎలాంటి తీర్పు వెలువడనుందో అని రాజకీయ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.ఏపీలోనూ ఈ రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది. జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపు పైన రాజకీయ వర్గాల్లో, మరోవైపు ఓట్లేసిన ప్రజల్లోనూ టెన్షన్ మొదలైంది. ఇదే అదనుగా గెలుపొటములపై పందేలు జోరుగా సాగుతున్నాయి. కవైపు తమ రాజకీయ భవితవ్యాన్ని తేల్చేవిగా కూటమి ఈ ఎన్నికలు భావిస్తున్నాయి. మరోవైపు వైఎస్సార్‌సీపీ మాత్రం మొదటి నుంచి గెలుపు ధీమా ప్రదర్శిస్తోంది. అయితే.. ప్రధాన పార్టీల మధ్య గెలుపు పైన ఉత్కంఠ కొనసాగుతుంటే.. పోలింగ్ అనంతర పరిణామాలతో ఏర్పడిన ఉద్రిక్తత మరో టెన్షన్ కు కారణమవుతోంది.ఎన్నికల పోలింగ్‌ టైంలో జరిగిన హింసాత్మక ఘటనలు, తమ పార్టీ నేతలను.. కార్యకర్తలను లక్ష్యంగా చేసుకోవడం, తదనంతర పరిణామాలపై వైఎస్సార్‌సీపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఏపీలో పోలీసులు, ఎన్నికల సంఘం తీరును ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కౌంటింగ్‌ రోజున అవాంఛనీయ ఘటనలు జరగవచ్చనే అనుమానాలతో ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో.. ఈసీ అలర్ట్‌ అయ్యింది. మరింత విమర్శలు వెల్లువెత్తకుడా ముందస్తు చర్యలు చేపట్టింది.శాంతి భద్రతలను విఘాతం కల్గకుండా.. ఏపీ ఎలక్షన్ కౌంటింగ్‌ కోసం అన్ని జిల్లాలకు స్పెషల్‌ పోలీసు ఆఫీసర్లను నియమించారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించారు. కృష్ణా జిల్లాకు చిత్తూరు జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్పీగా పని చేస్తున్న లావణ్య లక్ష్మిని.. విజయవాడ పోలీస్ కమిషనరేట్‌కు సీఐడీ డీఎస్పీ సోమన్నను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేకంగా పల్నాడు గురించి చర్చించారు. ఏకంగా ఎనిమిది మంది పోలీసు అధికారులను ప్రత్యేకంగా అక్కడ మోహరించారు.మరోవైపు ఈసీ కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూంల దగ్గర మూడంచెల భద్రత ఏర్పాటు చేసింది. కౌంటింగ్ రోజున భద్రత కోసం ఎన్నికల సంఘం భారీగా కేంద్ర బలగాలను రాష్ట్రానికి రప్పించింది. పూర్తిగా కేంద్రబలగాల నిఘా నీఢలో కౌంటింగ్ జరిగేలా ప్లాన్ చేసుకుంది. కౌంటింగ్ తర్వాత కూడా విజయోత్సవాలు, ఊరేగింపులు, కవ్వింపులు లేకుండా స్పెషల్‌ యాక్షన్‌ తీసుకుంటోంది. మొత్తంగా.. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపడుతున్నట్లు చెబుతోంది.ఇదీ చదవండి: ఈ సడలింపులు.. ‘పచ్చ’సిరాతో! పార్టీల తీరు ఇలా..ఏపీలో వైఎస్సార్‌సీపీలో జోష్‌ కనిపిస్తోంది. మరోసారి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీనే అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ కీలక నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. ఓ అడుగు ముందుకు వేసి జూన్ 9న కాబోయే పాలనా రాజధాని విశాఖలో వైఎస్‌ జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని చెబుతున్నారు. అయితే.. గత ఐదేళ్ల కాలంలో నిత్యం ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్న టీడీపీ మాత్రం.. ఎన్నికల తర్వాత సైలెంట్‌ అయిపోయింది. కూటమికి బాకా ఊదిన ఎల్లో మీడియా ఒకట్రెండు రోజులు విజయం కూటమిదే అంటూ హడావిడి చేసినప్పటికీ.. తర్వాత చల్లబడి పోయింది. బీజేపీ, కాంగ్రెస్‌ల గురించి ప్రస్తావించుకోవడం కూడా అనవసరమేమో!.ఇక.. ఎన్నికలు ముగిసిన తర్వాత సీఎం జగన్‌ అధికారికంగా లండన్‌పర్యటనకు వెళ్తే.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ మాత్రం అత్యంత గోప్యంగా పర్యటనకు వెళ్లడమూ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దగ్గుబాటి పురందేశ్వరి, షర్మిల సంగతి సరేసరి. ఫలితాలను ముందే ఊహించి వాళ్లు ఇలా మౌనంగా ఉండిపోతున్నారా? అనే చర్చా ఏపీలో నడుస్తోంది ఇప్పుడు.

KTR Serious Comments Over Congress Govt
తెలంగాణలో ప్రభుత్వం ఉందా? లేదా?: కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా?.. లేదా? అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో తిరగడం తప్పా? అని ప్రశ్నించారు.కాగా, కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా.. ‘రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా..? లేనట్టా..?విత్తనాల కోసం రైతులకు ఏమిటీ వెతలు?పర్యవేక్షించాల్సిన వ్యవసాయ మంత్రి ఎక్కడ ?ముందుచూపు లేని ముఖ్యమంత్రి జాడేది?ఎన్నికల ప్రచారంలో తిరగడం తప్ప..ఎన్ని ఎకరాలకు విత్తనాలు అవసరమో లెక్కలేదా ?నిన్న.. ధాన్యం అమ్ముకుందామంటే కొనేటోడు లేడు..!నేడు.. విత్తనాలు కొందామంటే అమ్మేటోడు లేడు..!పాలన పూర్తిగా పడకేసిందని చెప్పడానికి.. ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి?సాగునీళ్లు ఇవ్వడం చేతకాక పంటలు ఎండగొట్టారు..ఇప్పుడు విత్తనాలు అందించే విజన్ కూడా లేదా?తెల్లవారుజామున 4 గంటలకు లైన్‌లో నిలబడితే..సాయంత్రం 4 గంటల వరకూ విత్తనాలు ఇవ్వలేరా?గత పదేళ్లపాటు.. 10 నిమిషాల్లో అందిన విత్తనాలు..10 గంటలపాటు పడిగాపులు పడినా అందించలేరా?రంగారెడ్డి నుంచి.. కామారెడ్డి దాకా..రైతులకు ఏమిటీ కష్టాలు.. ఇంకెన్నిరోజులు ఈ కన్నీళ్లు..దేశం కడుపునింపే స్థాయికి ఎదిగిన తెలంగాణ.. అన్నదాతకే తిండితిప్పలు లేకుండా చేస్తారా ?బీఆర్ఎస్ పాలనలో పండుగలా సాగిన వ్యవసాయాన్నిఅధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఆగం చేస్తారా?ఇప్పటికైనా.. సరిపడా విత్తనాల స్టాక్ తెప్పించండి..!బ్లాక్ మార్కెట్‌కు తరలించకుండా కళ్లెం వేయండి..!!కాంగ్రెస్ వచ్చింది.. కాటగలిసినం అంటున్న.. అన్నదాతలను ఇంకా అరిగోస పెట్టకండి..!!లేకపోతే.. రైతుల సంఘటిత శక్తిలో ఉన్న బలాన్ని..కాంగ్రెస్ ప్రభుత్వం చవిచూడక తప్పదు..!!’ అని కామెంట్స్‌ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా..? లేనట్టా..?విత్తనాల కోసం రైతులకు ఏమిటీ వెతలు ??పర్యవేక్షించాల్సిన వ్యవసాయ మంత్రి ఎక్కడ ?ముందుచూపు లేని ముఖ్యమంత్రి జాడేది ??ఎన్నికల ప్రచారంలో తిరగడం తప్ప..ఎన్ని ఎకరాలకు విత్తనాలు అవసరమో లెక్కలేదా ??నిన్న.. ధాన్యం అమ్ముకుందామంటే కొనేటోడు… pic.twitter.com/f22DOOMMDM— KTR (@KTRBRS) May 29, 2024

AP Elections 20204: Amid Results Tough Time To Nara Lokesh In Mangalagiri
సినబాబుకి మరోసారి మంగళమేనా!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మూడు శాఖల మాజీ మంత్రి, మాజీ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌కు పరీక్షా సమయమిది. మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసిన ఆయన ఈసారైనా గట్టెక్కగలిగితే ఊపిరి పీల్చుకున్నట్లే. లేదంటే రాజకీయంగా అధోగతే అనే అనుమానాలు స్వపక్షీయుల్లోని సీనియర్లు, శ్రేణుల నుంచే వినిపిస్తున్నాయి. పోలింగ్‌ అనంతరం విభిన్న కోణాల్లో వేసుకుంటున్న అంచనాలలో అంతర్గత అనుమానాలు అనేకం ఉన్నప్పటికీ బయటకు మాత్రం టీడీపీ గెలుపుపై మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. తొలి అడుగులే తడబాటుతో.. రాష్ట్ర విభజనానంతరం అధికారంలోకి వచ్చి అమరావతిని రాజధాని కేంద్రంగా ప్రకటించి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాన్ని విస్తతపరచిన నాటి పాలకపక్షానికి గుంటూరు, కష్ణా జిల్లా ప్రజలు తగురీతినే బుద్ధి చెప్పారు. 2019 సాధారణ ఎన్నికల్లో, ఆ తరువాత జరిగిన గుంటూరు, విజయవాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీడీపీకి కర్రుకాల్చి వాతపెట్టారు. కరకట్ట వెంట అక్రమ కట్టడంలో నివాసం ఉంటూ వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయకుండానే ఎమ్మెల్సీగా ఎంపికై మూడు శాఖల మంత్రిగా కొనసాగిన లోకేష్‌ మంగళగిరి నియోజకవర్గానికి ప్రత్యేకంగా చేసిందంటూ ఏమీలేదనే విమర్శలు అప్పట్లోనే వెల్లువెత్తాయి. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి ఆళ్ల రామకష్ణారెడ్డి(ఆర్కే) చేతిలో పరాజయం పాలైన లోకేష్‌ ఆ తరువాత అయినా రాజకీయంగా వ్యూహాత్మక అడుగులు వేశారా అంటే అదీ లేదు. టీడీపీ ఆవిర్భావ సమయంలో 1983, 1985 ఎంఎస్‌ఎస్‌ కోటేశ్వరరావు మినహా గెలిచిన దాఖలాలు లేవు. 1994లో సీపీఎం నుంచి రామ్మోహన్‌రావు గెలుపొందారు. బీసీ సామాజికవర్గం నుంచి గోలి వీరాంజనేయులు, మురుగుడు హనుమంతరావు, కాండ్రు కమల విజయం సాధించారు. ఆళ్ల రామకష్ణారెడ్డి రెండు పర్యాయాలు గెలుపొందడానికి పెదకాకాని వాస్తవ్యుడు కావడం, వ్యక్తిగతంగా మంచి గుర్తింపు ఉండటం, అన్నిటికన్నా మించి వై.ఎస్‌. కుటుంబానికి సన్నిహితులు కావడం. బీసీలకు చెందిన నియోజకవర్గంగా గుర్తింపున్న మంగళగిరి నుంచి తాను పోటీ చేయడమంటే సాహసించినట్లేనని లోకేష్‌ అభిప్రాయపడ్డారే తప్ప అందుకు తగిన విధంగా క్షేత్రస్థాయిలో దష్టి సారించిన దాఖలాలు లేవు. వైఎస్సార్‌ సీపీ వ్యూహాత్మక అడుగులు.. వరుసగా రెండు పర్యాయాలు గెలిచిన ఆళ్ల స్థానంలో స్థానికురాలు, విద్యావంతురాలైన మురుగుడు లావణ్యను పోటీకి దింపడమే వైఎస్సార్‌ సీపీ విజయానికి తొలిమెట్టుగా పరిశీలకుల అభిప్రాయం. నియోజకవర్గంలో మెండుగా ఓటర్లు కలిగిన సామాజికవర్గానికి చెందిన లావణ్యది రాజకీయ నేపథ్యమున్న కుటుంబం. తల్లి కాండ్రు కమల మాజీ ఎమ్మెల్యే, మామ రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం ఉన్న వ్యక్తి. ప్రస్తుతం ఎమ్మెల్సీ కూడా. వీటికితోడు ఆ సామాజికవర్గానికి చెందిన స్థానిక సీనియర్‌ నాయకులైన చిల్లపల్లి మోహన్‌రావు, గంజి చిరంజీవి తదితరులకు వైఎస్సార్‌ సీపీ రాష్ట్రస్థాయి పదవులు కట్టబెట్టింది. కార్పొరేషన్ల డైరెక్టర్లుగా, దుర్గగుడి పాలకమండలి సభ్యులుగాను నియమించింది. ఎమ్మెల్యే ఆళ్ల ముందుచూపుతో దుగ్గిరాల (పసుపు) మార్కెట్‌ యార్డు చైర్మెన్‌ పదవిని ఎస్సీ, మైనార్టీలకు, మంగళగిరి ఏఎంసీని యాదవ, పద్మశాలి వర్గీయులకు అప్పగించారు. ఇక పార్టీ నాయకత్వం సోషల్‌ ఇంజినీరింగ్‌లో ఆచితూచి అడుగులేసింది. ఈ విషయంలో టీడీపీ ఎక్కడా సరితూగలేదు. అభివృద్ధికి దిక్సూచిగా.. మంగళగిరి, తాడేపల్లి మండలాలను కలిపి కార్పొరేషన్‌గా చేయడం, ప్రత్యేక గ్రాంటుగా రూ.130 కోట్లను సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కేటాయించడం, ఎవరూ ఊహించని రీతిలో గౌతమబుద్ధ రోడ్డును అభివద్ధి చేయడం, తొమ్మిది అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, సర్వ హంగులతో వై.ఎస్‌.ఆర్‌ క్రీడాప్రాంగణాన్ని తీర్చిదిద్దడం, అంతర్గత రహదారుల విస్తరణ, అభివద్ధి, విభిన్న సామాజికవర్గాల వారికి భవనాలు, కల్యాణ మండపాలను నిర్మించడం, ప్రధానమంత్రి దష్టికి తీసుకెళ్లి అభినందనలు అందుకునేలా పద్మశాలీయులకు మగ్గంలో శిక్షణ ఏర్పాట్లు నెలకొల్పడం తదితరాలు నియోజకవర్గ అభివద్ధికి దిక్సూచిగా నిలిచాయి. పల్లెల్లో డొంకరోడ్లు, సిమెంటు రోడ్లు, అంబేడ్కర్, జగ్జీవన్‌ రామ్, జ్యోతిరావుపూలే, సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ తదితర ప్రముఖుల విగ్రహాల ఏర్పాట్లు నియోజకవర్గానికి అదనపు హంగులుగా మారాయి. ఆర్కే సొంతంగా నిధులు సమకూర్చడం, అవినీతికి తావు లేకుండా పనులు చేయడం, తరతమ భేదం లేకుండా అన్ని సామాజికవర్గాలకు చేరువగా ఉండటం పార్టీకి అన్నివిధాలా కలిసొచ్చింది. కార్పొరేట్‌ తరహాలో లోకేష్‌ బృందం.. మంగళగిరి నుంచే పోటీచేయాలని నిర్ణయించుకున్న లోకేష్‌ అందుకు తగిన ప్రణాళికలతో ముందుకు వెళ్లలేదని స్వపక్షీయులే అంటున్నారు. అధికారంలో ఉన్న సమయంలో కాని, ఆ తరువాతైనా వ్యూహం కొరవడిందంటున్నారు. నియోజకవర్గానికి చుట్టపుచూపుగా రావడం, అతితక్కువ మందిని కలవడం, స్థానికేతరుడు కావడం, ఆయన బందం కార్పొరేట్‌ తరహాలో వ్యవహారాలు నడపడం ప్రజలను అంతగా ఆకట్టుకోలేకపోయాయనే విమర్శలు తొలి నుంచే ఉన్నాయి. తోపుడుబండ్లు, బడ్డీ కొట్లు ఇవ్వడం, పెళ్లికానుక పేరుతో రూ.5,000, సుమారు ఓ ఏడాదిపాటు రెండు చోట్ల అన్న క్యాంటీన్లను నడపడం వలన పెద్దగా ప్రయోజనం లేకుండా పోయిందంటున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే నిత్యం ప్రజల్లోనే తిరుగుతూ ఉండటాన్ని, లోకేష్‌ అందుబాటులో లేకపోవడాన్ని ప్రజలు బేరీజు వేసుకునే స్థితి. కూటమి నేతలతో అంటీముట్టనట్లు.. ఎన్నికలకు కూటమి కట్టినప్పటికీ నియోజకవర్గంలో జనసేన, బీజేపీలతో అంటీముట్టనట్లే పార్టీ వ్యవహరించిందని టీడీపీ ముఖ్యులే అభిప్రాయపడుతూ వచ్చారు. సమన్వయ సమావేశం కూడా జరగకపోవడం గమనార్హం. ముస్లిం, క్రిస్టియ¯Œ ఓటర్లు దూరమవుతారనే భయంతో బీజేపీ వారిని దరిజేరనిచ్చిన దాఖలాలు దాదాపు లేవు. బీజేపీ, జనసేనలకు చెందిన యడ్లపాటి రఘునాథబాబు, పాతూరి నాగభూషణం, జగ్గారపు శ్రీనివాసరావు, పంచుమర్తి ప్రసాదరావు, పూర్ణచంద్రరావు, శివన్నారాయణ, చిల్లపల్లి శ్రీనివాసరావు, గాదె వెంకటేశ్వరరావు తదితర నాయకులు నియోజకవర్గం వారైనప్పటికీ వారితో కలిసి పనిచేసిన సందర్భాలు తక్కువే. వీరిలో జనసేనకు చెందిన ఒకరిద్దరికి కాస్త ప్రాధాన్యం ఇచ్చారే తప్ప బీజేపీని పట్టించుకోలేదు. సీనియర్‌ నాయకులకే లోకేష్‌ అందుబాటులో ఉండరని, సెక్యూరిటీ వారిని దాటుకుని వెళ్లలేమని, కార్పొరేట్‌ తరహా రాజకీయాలు కొనసాగుతున్నప్పుడు తమలాంటి వారి సంగతి ఏంటనే ప్రశ్న సామాన్య ఓటర్ల మధ్య చర్చకు దారితీయడం నష్టదాయకంగా మారిందని అంచనా వేస్తున్నారు. లోకేష్‌ చుట్టూ ఆయన సామాజికవర్గం నేతలు చేరడం, తమ వాడైనందున ఓట్లు వేయండని హెచ్చరిక ధోరణిలో చెప్పడం, పెత్తందారీ పోకడలతో వ్యవహరించడం, మా మాట వినకపోతే మీకు ఉపాధి ఉండదని, కౌలుకు భూములు కూడా ఇచ్చేది లేదని కొందరు భయపెట్టే రీతిలో మాట్లాడటం కూడా ఓట్లకు చేటు తెచ్చేవే అనే వ్యాఖ్యానాలు పరిశీలకుల నుంచి వినిపిస్తున్నాయి.:::సాక్షి, ప్రత్యేక ప్రతినిధి

T20 World Cup 2024: Netherlands Stun Sri Lanka In Warm Up Match
T20 World Cup 2024: లంకేయులకు షాక్‌.. పసికూన చేతిలో పరాభవం

శ్రీలంక క్రికెట్‌ జట్టుకు భారీ షాక్‌ తగిలింది. టీ20 వరల్డ్‌కప్‌ 2024 వార్మప్‌ మ్యాచ్‌లో పసికూన నెదర్లాండ్స్‌ చేతిలో వీరు చిత్తుగా ఓడారు. ఫ్లోరిడాలో జరిగిన ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ 20 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన నెదర్లాండ్స్‌.. మైఖేల్‌ లెవిట్‌ (28 బంతుల్లో 55 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. లెవిట్‌తో పాటు తేజ నిడమనూరు (27), కెప్టెన్‌ స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ (12 బంతుల్లో 27 నాటౌట్‌) సత్తా చాటారు. శ్రీలంక బౌలర్లలో దిల్షన్‌ మధుషంక (4-0-39-2) రాణించగా.. నువాన్‌ తుషార, దునిత్‌ వెల్లలగే, ఏంజెలో మాథ్యూస్‌ తలో వికెట్‌ పడగొట్టారు. Excellent success 🤩 Our first T20 World Cup Warm-up Match ends with a 𝘄𝗶𝗻 🆚🇱🇰Thanks for your enthusiasm 🦁#kncbcricket #nordek #t20worldcup #cricket #srivned #outofthisworld pic.twitter.com/eFKtpiY5V6— Cricket🏏Netherlands (@KNCBcricket) May 28, 2024అనంతరం 182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక ఆదిలోనే తడబడింది. ఆ జట్టు పవర్‌ ప్లేలో 4 వికెట్లు కోల్పోయి కేవలం 30 పరుగులు మాత్రమే చేసింది. ఆతర్వాత కూడా లంక బ్యాటర్లు లయను అందుకోలేకపోయారు. ఏ దశలో గెలుపు దిశగా సాగలేకపోయారు. 18.5 ఓవర్లలో 161 పరుగుల వద్ద లంక ఇన్నింగ్స్‌ ముగిసింది. ఫలితంగా నెదర్లాండ్స్‌ సంచలన విజయం నమోదు చేసింది. లంక ఇన్నింగ్స్‌ చివర్లో కెప్టెన్‌ హసరంగ బ్యాట్‌ ఝులిపించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. హసరంగ 15 బంతుల్లో 43 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు వరుస సిక్సర్లు ఉండటం విశేషం. లంక ఇన్నింగ్స్‌లో హసరంగతో పాటు ధనంజయ డిసిల్వ (31), దసున్‌ షనక (35 నాటౌట్‌) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆర్యన్‌ దత్‌ 3 వికెట్లు తీసి శ్రీలంకను దెబ్బకొట్టగా.. కైల్‌ క్లెయిన్‌ 2, లొగాన్‌ వాన్‌ బీక్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. నెదర్లాండ్స్‌ తమ రెండో వార్మప్‌ మ్యాచ్‌ను మే 30న ఆడనుంది. డల్లాస్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో ఆ జట్టు కెనడాను ఢీకొట్టనుంది. శ్రీలంక తమ రెండో వార్మప్‌ మ్యాచ్‌ను మే 31న ఆడనుంది. ఫ్లోరిడాలో జరిగే ఆ మ్యాచ్‌లో లంకేయులు ఐర్లాండ్‌తో తలపడతారు. ప్రపంచకప్‌లో శ్రీలంక, నెదర్లాండ్స్‌ జట్లు ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. ఈ రెండు జట్లు గ్రూప్‌-డిలో పోటీపడనున్నాయి. వీటితో పాటు సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌, నేపాల్‌ జట్లు గ్రూప్‌-డిలో ఉన్నాయి. భారత్‌, పాకిస్తాన్‌ జట్లు గ్రూప్‌-ఏలో ఉండగా.. ఈ రెండు జట్ల మధ్య సమరం జూన్‌ 9న న్యూయార్క్‌లో జరుగనుంది.

AP Elections 2024: May 29th Political Updates In Telugu
May 29th: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌

May 29th AP Elections 2024 News Political Updates..8:20 AM, May 29th, 2024నేడు హైదరాబాద్‌కు చంద్రబాబుఎన్నికల పోలింగ్‌ తర్వాత విదేశాలకు వెళ్లిన చంద్రబాబు.నేడు తిరిగి హైదరాబాద్‌కు రానున్న చంద్రబాబుఇన్నాళ్లు ఎక్కడున్నారో చెప్పని బాబు. 7:30 AM, May 29th, 2024అల్లర్లకు ప్లాన్‌ చేస్తున్నా టీడీపీ..మంత్రి మేరుగు నాగార్జున కామెంట్స్‌..కౌంటింగ్ రోజున అల్లర్లకి టీడీపీ కుట్ర!పోలింగ్ రోజున పేదలపై దాడులతో అలజడులు సృష్టించిన టీడీపీ గూండాలుఅయినా ఎలాంటి చర్యలు తీసుకోని ఎన్నికల సంఘంచివరకు ఈసీఐ నిబంధనలు కూడా బేఖాతరుఈసీఐకి విరుద్ధంగా సీఈవో ఆదేశాలు ఇవ్వడమేంటని ప్రశ్నించిన మేరుగు నాగార్జున కౌంటింగ్ రోజున అల్లర్లకి టీడీపీ కుట్ర! పోలింగ్ రోజున పేదలపై దాడులతో అలజడులు సృష్టించిన టీడీపీ గూండాలు అయినా ఎలాంటి చర్యలు తీసుకోని ఈసీ. ఆఖరికి ఈసీఐ నిబంధనలు కూడా బేఖాతరుఈసీఐకి విరుద్ధంగా సీఈవో ఆదేశాలు ఇవ్వడమేంటి?-మంత్రి మేరుగు నాగార్జున#TDPLosing#YSRCPWinningBig pic.twitter.com/FLV1NZcVbf— YSR Congress Party (@YSRCParty) May 28, 2024 ఆగని ‘సంక్షేమం’రాష్ట్రంలో పోలింగ్‌ తర్వాత కూడా ఆగని ‘చేయూత’లబ్ధిదారుల ఖాతాల్లో కొనసాగుతున్న డబ్బుల జమ పోలింగ్‌ అనంతరం 18న రూ. 1,513 కోట్లు24న మరో రూ. 200 కోట్లు, 27న ఇంకో రూ. 400 కోట్లు20న ఈబీసీ నేస్తం లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 629 కోట్లుఎన్నికలతో సంబంధం లేకుండా పథకాల లబ్ధి పొందిన మహిళలు 6:50 AM, May 29th, 2024ఈ సడలింపులు.. ‘పచ్చ’సిరాతో!పోస్టల్‌ బ్యాలెట్‌ ఆమోదంపై గతేడాది జూలై 19న కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన మార్గదర్శకాలుదేశవ్యాప్తంగా అవే అమలు కూడా..కానీ, డిక్లరేషన్‌ ఫారంపై అటెస్టింగ్‌ అధికారి స్టాంప్‌ లేకపోయినా.. సంతకం ఉంటే చాలు ఆమోదించాలని టీడీపీ విజ్ఞప్తిఆ మేరకు సడలింపు ఇస్తూ ఈనెల 25న రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఉత్తర్వులుఅటెస్టింగ్‌ ఆఫీసర్‌ సంతకంపై అనుమానం వస్తే ఆర్వో, జిల్లా ఎన్నికల అధికారి వద్ద సంతకంతో సరిపోల్చుకోవాలని ఆదేశాలుఇది పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు సమయంలో వివాదాలకు దారితీస్తుందంటున్న రాజకీయ పక్షాలు.. శాంతిభద్రతల సమస్యగా పరిణమిస్తుందంటూ ఆందోళనరాష్ట్ర ఎన్నికల సంఘం మరీ ఇంత ‘పచ్చ’పాతంపై విస్మయం 6:40 AM, May 29th, 2024ఈసీ అంపైర్‌లా లేదుదానికి చంద్రబాబు వైరస్‌ సోకింది.. వారంలో టీడీపీ పీడ విరగడఅధికారంలోకి వచ్చేది వైఎస్సార్‌సీపీనేగీత దాటిన అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదువైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరికసీఈసీ మార్గదర్శకాలు దేశమంతా ఒకేలా ఉండాలి..పోలీసుల ద్వారా పిన్నెల్లిని అంతమొందించేందుకు బాబు కుట్రఅందుకే ఏడుగురి హత్య కేసులో నిందితుడైన బ్రహ్మారెడ్డికి మాచర్ల టికెట్‌చంద్రబాబు, ఎల్లో మీడియా కంటే ఉగ్రవాదులే నయంగోబెల్స్‌ ప్రచారం చేసి.. వ్యక్తిత్వహననంతో అధికారులను లొంగదీసుకునే యత్నంఅందులో భాగమే సీఎస్‌పై అభూతకల్పనలతో కథనాలు 6:30 AM, May 29th, 2024కౌంటింగ్‌లో అప్రమత్తత అవసరం ఫలితాలు వెలువడే వరకు ఏమరుపాటు పనికిరాదుఅనుమానాలు నివృత్తి చేసుకోవాలి.. కౌంటింగ్‌ ఏజెంట్ల జాబితా 31లోగా అందివ్వాలి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు సజ్జల రామకృష్ణారెడ్డి సూచన

police identified Rajkot game zone Co owner deceased in fire accident
రాజ్‌కోట్‌ గేమ్‌జోన్‌: మిస్సింగ్‌ అనుకున్నారు.. ప్రకాశ్‌ కూడా మృతి

గాంధీనగర్‌: రాజ్‌కోట్‌లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో టీఆర్‌పీ గేమ్‌జోన్‌కు చెందిన ఒక సహ యజమాని మృతి చెందినట్లు పోలీసులు ధ్రువీకరించారు. శనివారం టీఆర్‌పీ గేమ్‌జోన్‌లో చోటుచేకున్న భారీ అగ్ని ప్రమాదంలో 28 మంది మృతి చెందారు. అగ్ని ప్రమాదానికి సంబంధించి టీఆర్‌పీ గేమ్‌జోన్‌ ఓనర్లపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా యజమానుల్లో ఒకరైన ప్రకాశ్‌ హిరాన్‌ అదే అగ్ని ప్రమాదంలో మృతి చెందినట్లు పోలీసులు ధ్రువీకరించారు. అగ్ని ప్రమాదం జరిగినప్పటి నుంచి తన సోదరుడు కనిపించడం లేదని ప్రకాశ్‌ హిరాన్‌ సోదరుడు జితేంద్ర హిరాన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్‌ నంబర్లు కూడా స్వీచ్‌ ఆఫ్‌ వస్తున్నాయిని చెప్పారు. అగ్ని ప్రమాదం జరిగిన స్థలంలోనే ప్రకాశ్‌ కారు ఉన్నట్లు జితేంద్ర పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలో ప్రకాశ్‌ ఉన్న దృశ్యాలు కనిపించాయి. దీంతో డీఎన్‌ఏ టెస్ట్‌ చేసిన అగ్ని ప్రమాదంలో మృతి చెందినవారిలో తన సోదరుడిని కనిపెట్టాలని జీతేంద్ర పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ప్రకాశ్‌ తల్లి డీఎన్‌ఏను తీసుకుని మృతదేహాలతో పోల్చి ప్రకాశ్‌ హిరాన్‌ మృతి చెందినట్లు ప్రకటించారు. టీఆర్‌పీ గేమ్‌జోన్‌లో ప్రకాశ్‌ హిరాన్‌ ప్రధానమైన షేర్‌ హోల్డర్‌గా ఉన్నారు. టీఆర్‌పీ గేమ్‌జోన్‌ను నిర్వహిస్తున్న ధావల్‌ ఠాకూర్‌తోపాటు మరో ఐదుగురిని గుజరాత్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అందులో రేస్‌వే ఎంటర్‌ప్రైజెస్‌ పార్ట్‌నర్లు యువరాజ​సింగ్‌, రాహుల్ రాథోడ్‌, టీఆర్‌పీ గేమ్‌ జోన్‌ మేనేజర్ నితిన్‌ జైన్‌ ఉన్నారు.

Nawaz Sharif says Pakistan violated 1999 Lahore Declaration signed with delhi
లాహోర్‌ ఒప్పందాన్ని ఉల్లంఘించటం పాక్‌ తప్పే: నవాజ్‌ షరీఫ్‌

లాహోర్‌: పాకిస్తాన్‌ మాజీ ప్రధాన మంత్రి నవాజ్‌ షరీష్‌ భారత్‌తో చేసుకున్న ఒప్పదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. 1999లో తాను,అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజపేయి సంతకాలు చేసిన ‘లాహోర్‌ డిక్లరేషన్‌’ఒప్పందం ఉల్లంఘించామని తెలిపారు. ఆయన మంగళవారం పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌(ఎన్‌) పార్టీ సమావేశంలో మాట్లాడారు.‘మే 28, 1998న పాకిస్తాన్ ఐదు అణుబాంబు పరీక్షలు చేపట్టింది. అనంతరం భారత్‌ ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి లాహోర్‌కు వచ్చారు. ఆయన మాతో లాహోర్‌ ఒప్పందం చేసుకున్నారు. అయితే ఆ ఒప్పందాన్ని మేం ఉల్లంఘించాము. అది మా తప్పే. అప్పటి అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ ఉద్దేశపూర్వకంగా అగ్రిమెంట్‌ను అతిక్రమించారు’ అని అన్నారు.మార్చి,1999లో ముషారఫ్‌ పాక్‌ ఆర్మీకి ఫోర్ స్టార్‌ జనరల్‌గా ఉన్నారు. లడ్డాక్‌లోని కార్గీల్‌లో రహస్యంగా చొరబాడటానికి ఆదేశించారు. ఈ విషయంతో అప్రమత్తమైన ఇండియా యుద్ధం చేసి విజయం సాధించింది. ఆ సమయంలోనే తాను ప్రధానిగా ఉ‍న్నానని నవాజ్‌ షరీఫ్‌ గుర్తుచేశారు. పాకిస్తాన్‌ మొదటి అణు బాంబు పరీక్షించి 26 ఏళ్లు అవుతోందని తెలిపారు.‘అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ ఆనాడు పాక్‌.. అణుపరీక్ష ఆపేందుకు 5 బిలియన్‌ డాలర్లను ఇస్తానని ఆఫర్‌ చేశాడు. కానీ, నేను అమెరికా అఫర్‌ను తిరస్కరించాను. ఆ సమయంలో మాజీ ప్రధానిగా ఇమ్రాన్‌ ఉండి ఉంటే క్లింటన్‌ ఆఫర్‌కు అంగీకరించేవాడు’అని ఇమ్రాన్‌పై విమర్శలు గుప్పించారు.లాహోర్‌ డిక్లరేషన్‌ ఇరు దేశాల మధ్య ఏర్పాటు చేసుకున్న శాంతి ఒప్పందం. ఈ ఒప్పందంపై ఇరు దేశాల ప్రధానులు 21, ఫిబ్రవరి 1999లో సంతాకాలు చేశారు. అనంతరం పాకిస్తాన్ జమ్ము కశ్మీర్‌లోని కార్గిల్‌లోకి చొరబడటంతో యుద్ధానికి దారి తీసింది. ఈ యుద్ధంలో భారత్‌ విజయం సాధించింది. ఇక..ద తాజాగా మంగళవారం నవాజ్‌ షరీష్‌ మరోసారి పీఎంఎల్‌-ఎన్‌ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

Lok Sabha Elections 2024 Muslim Vote Bank Factor
ముస్లిం ఓటు బ్యాంకు ప్రభావమెంత? ఏ పార్టీకి ప్రయోజనం?

2024 లోక్‌సభ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. ఆరు దశల ఓటింగ్ పూర్తయ్యింది. ఏడో దశకు జూన్‌ ఒకటిన పోలింగ్‌ జరగనుంది. దేశంలో హిందువుల జనాభా 80 శాతం. ముస్లిం జనాభా 14 శాతం. అసోం, పశ్చిమ బెంగాల్‌లలో అత్యధిక ముస్లిం ఓటు బ్యాంకు ఉంది. ఈ సారి జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో ముస్లిం ఓటు బ్యాంకు ప్రభావం ఏ మేరకు ఉండనుంది?గత మూడు లోక్‌సభ ఎన్నికల్లో ముస్లిం ఓట్లకు సంబంధించిన సీఎస్‌డీఎస్‌ లోక్‌నీతి అందించిన డేటా ప్రకారం 2009 ఎన్నికలలో బీజేపీకి నాలుగు శాతం ముస్లిం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 38 శాతం ముస్లిం ఓట్లు వచ్చాయి. 58 శాతం ముస్లిం ఓటర్లు ఇతర పార్టీలకు ఓటు వేశారు. 2014 ఎన్నికల్లో బీజేపీకి ఎనిమిది శాతం ముస్లిం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 38శాతం ముస్లిం ఓట్లు, ఇతర పార్టీలకు 54 శాతం ముస్లిం ఓట్లు వచ్చాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఎనిమిది శాతం ముస్లిం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 33 శాతం, ఇతరులకు 59 శాతం ముస్లిం ఓట్లు వచ్చాయి.2014 ఎన్నికల్లో 882 మంది ముస్లిం అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. వీరిలో 23 మంది మాత్రమే విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో 819 మంది ముస్లిం అభ్యర్థులు పోటీ చేశారు. వీరిలో 28 మంది మాత్రమే గెలుపొందారు. 2019 ఎన్నికల్లో 27 మంది ముస్లిం ఎంపీలు పార్లమెంటుకు చేరుకున్నారు.ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అమితాబ్ తివారీ తెలిపిన వివరాల ప్రకారం గత రెండు ఎన్నికలను పరిశీలిస్తే ముస్లిం ఓటర్లు తటస్థంగా మారిపోతున్నారు. ఇందుకు పలు కారణాలున్నాయి. 2014కు ముందు అసోంలో ముస్లిం ఓట్లు కేంద్రీకృతమై ఉండేవి. హిందూ ఓట్లు కులాల ప్రాతిపదికన చెల్లాచెదురయ్యాయి. ఫలితంగా అసోం, యూపీ, బీహార్ రాష్ట్రాల్లో బీజేపీకి తక్కువ సీట్లు వచ్చాయి. 2014, 2019 ఎన్నికలను పరిశీలిస్తే ఈ రాష్ట్రాల్లో బీజేపీకి తొమ్మది సీట్లు వచ్చాయి. మొత్తంగా చూస్తే మైనారిటీ ఆధిపత్య స్థానాల్లో బీజేపీ పరిస్థితి బాగానే ఉందని తివారీ పేర్కొన్నారు.

Dangal Actress Zaira Wasim Father Passed Away
'దంగల్' నటి ఇంట్లో విషాదం.. ట్వీట్ వైరల్

'దంగల్' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి జైరా వాసిం ఇంట్లో విషాదం నెలకొంది. ఈమె తండ్రి జహిద్ వాసిం మృతి చెందారు. ఈ విషయాన్ని ఎక్స్ (ట్విట్టర్) ద్వారా జైరా బయటపెట్టింది. ఈ క్రమంలోనే పలువురు నెటిజన్లు, ఆమె అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు.(ఇదీ చదవండి: 'పుష్ప' విలన్‌కి అరుదైన వ్యాధి.. దీని వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే?)ఇకపోతే జమ్ము కాశ్మీర్‌లో పుట్టి పెరిగిన జైరా వాసిం.. ఆమిర్ ఖాన్ 'దంగల్' సినిమాలో గీతా ఫొగట్ పాత్రలో బాలనటిగా ఆకట్టుకుంది. దీని తర్వాత ఆమిర్ ఖాన్‌తో 'సీక్రెట్ సూపర్ స్టార్' అనే మూవీలో మరోసారి కలిసి నటించింది. 'స్కై ఈజ్ పింక్' అనే చిత్రంలోనూ కీలక పాత్ర పోషించింది. నటిగా మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ 2019లో తాను ఇండస్ట్రీకి బైబై చెప్పేసింది. ఇకపై నటించనని క్లారిటీ ఇచ్చేసింది.(ఇదీ చదవండి: హీరోయిన్ నమిత విడాకులు తీసుకోనుందా?)My father, Zahid Wasim, has passed away. Please remember him in your prayers and ask Allah to forgive his shortcomings, make his grave peaceful, protect him from its torment, ease his journey from here ahead and grant him the highest level of Jannah and Maghrirah.— Zaira Wasim (@ZairaWasimmm) May 28, 2024

Anticipatory bail for YSRCP Leader Pinnelli Ramakrishna Reddy in three cases
పిన్నెల్లి ఎపిసోడ్‌.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు

సాక్షి, అమరావతి: పచ్చ బ్యాచ్, పోలీసులకు హైకోర్టు గట్టి షాక్‌ ఇచ్చింది. ఓట్ల కౌంటింగ్‌ ప్రక్రియలో పాల్గొనకుండా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అడ్డుకునేందుకు వారు పన్నిన కుట్రలను పటాపంచలు చేసింది. రామకృష్ణారెడ్డికి మధ్యంతర ముందస్తు బెయిల్‌ రాకుండా చేసేందుకు తెలుగుదేశం పార్టీ, పోలీసులు కుమ్మక్కయినా కూడా ప్రయోజనం లేకపోయింది. రికార్డులను తారుమారు చేసి, బాధితులను ముందు పెట్టి పిన్నెల్లి ముందస్తు బెయిల్‌ను అడ్డుకు­నేందుకు పన్నిన కుట్రలు విఫలమయ్యాయి. రామకృష్ణారెడ్డిపై పోలీసులు నమోదు చేసిన మూడు కేసుల్లో హైకోర్టు ఆయనకు మధ్యంతర ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అరెస్ట్‌తో సహా పిన్నెల్లిపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. కౌంటింగ్‌ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఈ నెల 6వ తేదీ వరకు ఈ బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. జేసీ అస్మిత్‌రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, చింతమనేని ప్రభాకర్, పరిమి సోమశేఖర్‌ నాయుడు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులకు మధ్యంతర ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిన తరహాలోనే పిన్నెల్లికి కూడా బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. పిన్నెల్లికి మధ్యంతర ముందస్తు బెయిల్‌కు పలు షరతులు విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ప్రతాప మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసుల చర్య చాలా తీవ్రమైనదిఈ మూడు కేసుల్లో పోలీసుల తీరును హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. మిగిలిన నిందితులను 16వ తేదీనే అరెస్ట్‌ చేసినప్పటికీ, వారిని 23వ తేదీన నిందితులుగా చేర్చినట్లు రిమాండ్‌ రిపోర్ట్‌లో చెప్పడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఇది చాలా తీవ్రమైన విషయమని స్పష్టం చేసింది. ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే ఇలా చేయడం డీకే బసు కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధమని తేల్చి చెప్పింది. పిన్నెల్లిని 22వ తేదీనే నిందితునిగా చేర్చారని పోలీసులు చెప్పిన విషయాన్ని, కింది కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్ట్‌లో 23వ తేదీ రాత్రి 8 గంటలకు నిందితునిగా చేర్చినట్లు పేర్కొనడాన్ని హైకోర్టు తన ఉత్తర్వుల్లో ప్రముఖంగా ప్రస్తావించింది. దీనిపై తుది విచారణ సమయంలో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మరింత వివరణనివ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.మధ్యంతర ముందస్తు బెయిల్‌ కోసం పిటిషన్లు...ఈవీఎం కేసులో హైకోర్టు ఈ నెల 23న పిన్నెల్లికి మధ్యంతర ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిన వెంటనే పోలీసులు ఆయనపై రెండు హత్యాయత్నం కేసులతో సహా మూడు కేసులు నమోదు చేశారు. కౌంటింగ్‌ ప్రక్రియలో పాల్గొనాల్సి ఉన్నందున మధ్యంతర ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలంటూ రామకృష్ణారెడ్డి హైకోర్టులో వేర్వేరుగా మూడు అనుబంధ వ్యాజ్యాలు దాఖలు చేశారు. పిన్నెల్లి తరఫున సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి, న్యాయవాది ఎస్‌.రామలక్ష్మణరెడ్డి వాదనలు వినిపించారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన జస్టిస్‌ జ్యోతిర్మయి ఆ మూడు అనుబంధ వ్యాజ్యాలను అనుమతిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.ఇవీ షరతులు..పిన్నెల్లిపై నిఘా ఉంచేలా పోలీసులను ఆదేశించాలని ఎన్నికల సంఘానికి హైకోర్టు స్పష్టం చేసింది. ఎలాంటి నేరపూరిత చర్యల్లో పాల్గొనకూడదని, పునరావృతం చేయరాదని పిన్నెల్లిని ఆదేశించింది. జిల్లాలో శాంతిభద్రతల సమస్య సృష్టించకూడదని చెప్పింది. ప్రజాశాంతికి, సాక్షుల రక్షణకు ఎలాంటి విఘాతం కలగకుండా చూడాలని, అనుచరులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడకుండా చూడాలని పిన్నెల్లిని ఆదేశించింది. అనుచరుల బాధ్యత రామకృష్ణారెడ్డిదేనని స్పష్టం చేసింది. ఈ కేసు గురించి ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియాతో మాట్లాడవద్దని ఆదేశించింది. సాక్షులు, బాధితులతో సంభాషించవద్దని, వారిని బెదిరించడం వంటివి చేయరాదని తెలిపింది. పార్లమెంటరీ నియోజకవర్గ ప్రధాన కేంద్రంలో మాత్రమే ఉండాలని, ఒకవేళ కౌంటింగ్‌ కేంద్రం మరో చోట ఉంటే లెక్కింపు రోజున ఆ కేంద్రానికి వెళ్లొచ్చునని తెలిపింది. ప్రతి రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 లోపు పల్నాడు ఎస్‌పీ ముందు హాజరు కావాలని పిన్నెల్లిని ఆదేశించింది. నర్సరావుపేటలో తాను ఎక్కడ ఉంటున్నదీ, తన మొబైల్‌ నంబరు వివరాలను పోలీసులకు తెలియచేయాలని ఆదేశించింది. స్థానిక కోర్టుల్లో పాస్‌పోర్ట్‌ జమ చేయాలని, కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లడానికి వీల్లేదని ఆదేశించింది. బాధితులకు తగిన రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించింది. అయితే, ఓ షరతును కొద్దిగా సవరించాలని పిన్నెల్లి తరఫు సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి అభ్యర్థించారు. కౌంటింగ్‌ రోజున ఎస్‌పీ ముందు హాజరయ్యేంత సమయం ఉండదని, అందువల్ల ఆ రోజున రిటర్నింగ్‌ అధికారి ముందు హాజరవుతారని తెలిపారు. ఇందుకు న్యాయమూర్తి జస్టిస్‌ జ్యోతిర్మయి సమ్మతించి ఆ మేరకు ఆ షరతును సవరించారు. ప్రజా ప్రతినిధులు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ చర్యల విషయంలో చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తన ఉత్తర్వుల్లో న్యాయమూర్తి స్పష్టం చేశారు. ‘న్యాయ చక్రాలు నెమ్మదిగా కదిలినప్పటికీ, అవి గొప్పగా కదులుతాయి,’ అంటూ ఓ తీర్పులో సుప్రీంకోర్టు చెప్పిన కొటేషన్‌తో న్యాయమూర్తి తన ఉత్తర్వులను ముగించారు.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement