Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

T20 World Cup 2024: Team India Defeated Pakistan By 6 Runs
T20 World Cup 2024: ఉత్కంఠ పోరులో పాక్‌ను చిత్తు చేసిన భారత్‌

టీ20 వరల్డ్‌కప్‌ 2024లో భాగంగా న్యూయార్క్‌ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన ఉత్కంఠ సమరంలో టీమిండియా 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. వరుణుడు ఆటంకాల నడుమ ఆలస్యంగా మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. పాక్‌ పేసర్ల ధాటికి 19 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది.పాక్‌ బౌలర్లలో నసీం షా, హరీస్‌ రౌఫ్‌ తలో 3 వికెట్లు, మొహమ్మద్‌ ఆమిర్‌ 2, షాహిన్‌ అఫ్రిది ఓ వికెట్‌ పడగొట్టి టీమిండియా పతనాన్ని శాశించారు. భారత ఇన్నింగ్స్‌లో రిషబ్‌ పంత్‌ (31 బంతుల్లో 42; 6 ఫోర్లు) మినహా అందరూ దారుణంగా విఫలమయ్యారు. రోహిత్‌ శర్మ (12 బంతుల్లో 12; ఫోర్‌, సిక్స్‌), అక్షర్‌ పటేల్‌ (18 బంతుల్లో 20; 2 ఫోర్లు, సిక్స్‌) రెండంకెల స్కోర్‌ చేయగా.. విరాట్‌ కోహ్లి (3 బంతుల్లో 4; ఫోర్‌), సూర్యకుమార్‌ యాదవ్‌ (8 బంతుల్లో 7; ఫోర్‌), శివమ్‌ దూబే (9 బంతుల్లో 3), హార్దిక్‌ పాండ్యా (12 బంతుల్లో 12; ఫోర్‌), రవీంద్ర జడేజా (0), అర్ష్‌దీప్‌ సింగ్‌ (13 బంతుల్లో 9; ఫోర్‌), బుమ్రా (0) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకు పరిమితమయ్యారు.120 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్‌.. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 113 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. బుమ్రా (4-0-14-3), హార్దిక్‌ (4-0-24-2), సిరాజ్‌ (4-0-19-0), అర్ష్‌దీప్‌ సింగ్‌ (4-0-31-1), అక్షర్‌ పటేల్‌ (2-0-11-1) అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. పాక్‌ గెలవాలంటే ఆఖరి ఓవర్‌లో 18 పరుగులు చేయాల్సి ఉండగా.. అర్ష్‌దీప్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి 11 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంతకుముందు ఓవర్‌లో బుమ్రా మ్యాజిక్‌ చేసి కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్‌ పడగొట్టాడు. ఈ గెలుపుతో భారత్‌ ప్రపంచకప్‌ టోర్నీల్లో పాక్‌పై తమ రికార్డును 7-1కి మరింత మెరుగుపర్చుకుంది. పాక్‌ ఇన్నింగ్స్‌లో మొహ​మ్మద్‌ రిజ్వాన్‌ (31) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్‌ చేశాడు. ఈ ఓటమితో పాక్‌ సూపర్‌ 8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

Modi Swearing In Ceremony As 3rd Term India PM Live Updates
మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారం

న్యూఢిల్లీ: దేశ ప్రధానిగా నరేంద్రమోదీ వరుసగా మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఆదివారం(జూన్‌9) ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోదీతో సరిగ్గా 7 గంటల 23 నిమిషాలకు ప్రమాణస్వీకారం చేయించారు. #WATCH | Narendra Modi takes oath for the third straight term as the Prime Minister pic.twitter.com/Aubqsn03vF— ANI (@ANI) June 9, 2024 నరేంద్ర దామోదర్‌దాస్‌ మోదీ అంటూ మోదీ ప్రమాణాన్ని ప్రారంభించారు. ఈ ప్రమాణ స్వీకారంతో మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని పదవి చేపట్టిన రెండో వ్యక్తిగా మోదీ కొత్త రికార్డు క్రియేట్‌ చేశారు. ఓత్‌ ఆఫ్‌ ఆఫీస్‌తో పాటు ఓత్‌ ఆఫ్‌ సీక్రెసీ ప్రమాణాన్ని మోదీతో రాష్ట్రపతి చేయించారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి బంగ్లాదేశ్‌, నేపాల్‌, భూటాన్‌,శ్రీలంక,మాల్దీవులు,మారిషస్‌ ప్రధానులు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు.పలువురు బీజేపీ అగ్ర నేతలకు మళ్లీ చోటు..గతంలో కీలక శాఖలు నిర్వహించిన బీజేపీ అగ్ర నేతలు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌సింగ్‌, పియూష్‌గోయెల్‌, నిర్మలాసీతారామన్‌, నితిన్‌ గడ్కరీ జితేంద్ర సింగ్‌ కేబినెట్‌ మంత్రులుగా మూడోసారి ప్రమాణం చేశారు. బీజేపీ నేషనల్‌ చీఫ్‌ జేపీ నడ్డాను ఈసారి కేంద్ర మం​త్రి వర్గంలోకి తీసుకున్నారు. Amit Shah sworn in as Union minister in Prime Minister Modi's 3.0 CabinetRead @ANI Story | https://t.co/XtFeIoOQz1#AmitShah #Unionminister pic.twitter.com/kba9Jk43u0— ANI Digital (@ani_digital) June 9, 202472 మందితో మోదీ3.0 మంత్రి వర్గం.. 30 మందికి కేబినెట్‌ హోదామోదీ 3.0 ప్రభుత్వ మంత్రి వర్గంలో మొత్తం 72 మంత్రులున్నారు. వీరిలో 30 మంది కేబినెట్‌ మంత్రులుకాగా అయిదుగురు సహాయం(ఇండిపెండెంట్‌), 36 మంది సహాయ మంత్రి పదవులు దక్కాయి. కేబినెట్‌లో బీజేపీ కాకుండా ఎన్డీఏ మిత్రపక్షాలకు 11 మంత్రి పదవులు దక్కాయి. కేబినెట్‌లో సామాజిక వర్గాల వారిగా చూస్తే 20 మంది ఓబీసీలకు, కాగా, ఎస్సీలకు10,ఎస్టీలకు 6 మైనార్టీలకు 5 బెర్తులు కేటాయించారు. 30 మంది కేబినెట్‌ మంత్రులు వీళ్లే... 1.రాజ్‌నాథ్‌ సింగ్‌2.అమిత్‌ షా3.నితిన్‌ గడ్కరీ 4.జేపీ నడ్డా 5.శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ 6.నిర్మలా సీతారామన్‌ 7.జై శంకర్‌ 8.మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ 9.హెచ్‌డీ కుమార్‌ స్వామీ10.పియూష్‌ గోయల్‌11.ధర్మేంద్ర ప్రదాన్‌12.జితిన్‌ రామ్‌ మాంజీ13.రాజీవ్‌ రంజన్‌ సింగ్‌14.శర్వానంద్‌ సోనోవాల్‌15.వీరేంద్రకుమార్‌16.కింజరపు రామ్మోహన్‌ నాయుడు17.ప్రహ్లాద్‌ జోషి18.జువల్‌ ఓరం19.గిరిరాజ్‌ సింగ్‌20.అశ్వినీ వైష్ణవ్‌21.జ్యోతిరాధిత్య సింధియా22.భూపేందర్‌ యాదవ్‌23.గజేంద్ర సింగ్‌ షెకావత్‌24.అన్నపూర్ణాదేవి25.కిరణ్‌ రిజిజు26.హర్దీప్‌ సింగ్‌పూరి27.మన్‌సుఖ్‌ మాండవీయ28.జి.కిషన్‌ రెడ్డి29.చిరాగ్‌ పాశ్వాన్‌ 30.సీఆర్‌ పాటిల్‌తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి పదవులు..తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి నరసాపురం ఎంపీగా గెలుపొందిన బీజేపీ నేత శ్రీనివాస వర్మ, తెలంగాణ నుంచి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగు దేశం పార్టీ తరపున కింజారపు రామ్మోహన్‌ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌కు మంత్రి వర్గంలో చోటు దక్కింది. మోదీ 3.0.. ఏ రాష్ట్రానికి ఎన్ని బెర్తులు.. యూపీ నుంచి 9 మందికి కేంద్ర మంత్రి పదవులు దక్కగా, మహారాష్ట్ర నుంచి ఆరుగురుకి కేంద్రమంత్రి పదవులు దక్కాయి. ఇక గుజరాత్‌ నుంచి ఐదుగురు, కర్ణాటక నుంచి ఐదుగురు, ఒడిశా నుంచి ముగ్గురు చోటు దక్కించుకున్నారు. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లకు నాలుగు చొప్పున మంత్రి పదవులు, జార్ఖండ్‌ ,బెంగాల్‌ నుంచి ఇద్దరికి చొప్పున మంత్రి పదవులు, కేరళ, తమిళనాడు, పంజాబ్‌, జమ్మూ కాశ్మీర్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, ఢిల్లీ, ఉత్తరాఖండ్‌లకు ఒక్కో మంత్రి పదవి దక్కింది.

30 Cabinet Ministers In New Modi Government
మోదీ 3.0లో .. 30 మంది కేబినెట్‌ మంత్రులు వీరే

మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారం చేశారు.ఆదివారం (జూన్‌9) ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మోదీతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం స్వీకారం చేయించారు. మోదీతో పాటు 30 మంది కేబినెట్‌ హోదాలో మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.72 మందితో మోదీ కేబినెట్‌ కొలువు దీరింది. వీరిలో 30 మంది కేబినెట్‌ మంత్రులు,36 మంది సహాయ మంత్రులు, 5 మంది స్వంతంత్ర్య మంత్రులు, ఓబీసీ(27), ఎస్సీలు(10), ఎస్టీలు(6), మైనార్టీలకు (5) మంత్రి పదవులు దక్కాయి. వీరిలో #WATCH | Narendra Modi takes oath for the third straight term as the Prime Minister pic.twitter.com/Aubqsn03vF— ANI (@ANI) June 9, 2024 1.రాజనాథ్‌ సింగ్‌2.అమిత్‌ షా3.నితిన్‌ గడ్కరీ 4.జేపీ నడ్డా 5.శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ 6.నిర్మలా సీతారామన్‌ 7.జై శంకర్‌ 8.మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ 9.హెచ్‌డీ కుమార్‌ స్వామీ10.పియూష్‌ గోయల్‌11.ధర్మేద్ర ప్రధాన్‌12.జితిన్‌ రామ్‌ మాంజీ13.రాజీవ్‌ రంజన్‌ సింగ్‌14.సర్వానంద్‌ సోనోవాల్‌15.వీరేంద్రకుమార్‌16.కింజరపు రామ్మోహన్‌ నాయుడు17.ప్రహ్లాద్‌ జోషి18.జువల్‌ ఓరం19.గిరిరాజ్‌ సింగ్‌20.అశ్వినీ వైష్ణవ్‌21.జోతిరాధిత్య సింధియా22.భూపేందర్‌ యాదవ్‌23.గజేంద్ర సింగ్‌ షెకావత్‌24.అన్నపూర్ణాదేవి25.కిరణ్‌ రిజిజు26.హర్దీప్‌ సింగ్‌పూరి27.మన్‌సుఖ్‌ మాండవీయ28.జి.కిషన్‌ రెడ్డి29.చిరాగ్‌ పాశ్వాన్‌ 30.సీఆర్‌ పాటిల్‌

YS Jagan Congratulations To Narendra Modi
ప్రధాని మోదీకి వైఎస్‌ జగన్‌ అభినందనలు

తాడేపల్లి: దేశ ప్రధానిగా వరుసగా మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోదీకి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు సోషల్‌ మీడియా హ్యాండిల్‌ ‘ఎక్స్‌’లో వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. My heartfelt congratulations to Sri @narendramodi garu on taking oath as the Prime Minister of India for the third consecutive term.— YS Jagan Mohan Reddy (@ysjagan) June 9, 2024 ఆదివారం(జూన్‌9) ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో దేశ ప్రధానిగా నరేంద్రమోదీ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారంతో మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని పదవి చేపట్టిన రెండో వ్యక్తిగా మోదీ కొత్త రికార్డు క్రియేట్‌ చేశారు. ఓత్‌ ఆఫ్‌ ఆఫీస్‌తో పాటు ఓత్‌ ఆఫ్‌ సీక్రెసీ ప్రమాణాన్ని మోదీతో రాష్ట్రపతి చేయించారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి బంగ్లాదేశ్‌, నేపాల్‌, భూటాన్‌,శ్రీలంక,మాల్దీవులు,మారిషస్‌ ప్రధానులు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు.మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారంమోదీ 3.0లో .. 30 మంది కేబినెట్‌ మంత్రులు వీరే

Nine Killed As Terrorists Open Fire At Bus Carrying Pilgrims In Jammu And Kashmir
యాత్రికుల బస్సుపై ఉగ్రదాడి..9 మంది మృతి

జమ్ము-కశ్మీర్‌ రియాసి జిల్లాలో ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. జమ్మూలోని రాయసి జిల్లాలో ఉన్న శివఖోడి గుహను సందర్శించేందుకు వెళ్తున్న యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో 9మంది యాత్రికులు మరణించారు. 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎంతమందికి బుల్లెట్ గాయాలు అయ్యాయో ఇంకా తెలియరాలేదని రియాసి జిల్లా మేజిస్ట్రేట్ విశేష్ మహాజన్ తెలిపారుఉగ్రవాదుల దాడిపై సమాచారం అందుకున్న పోలీసులు,భద్రతా బలగాలు బాధితుల్ని రక్షించేందుకు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రమాదంలో గాయపడ్డ బాధితుల్ని రక్షించేందుకు స్థానికులు సహాయక చర్యల్ని ముమ్మరం చేస్తున్నాయి.

Rahul Gandhi Criticises Modi Over neet row
నీట్‌ పరీక్ష ఫలితాల వివాదం : రాహుల్‌ గాంధీ కీలక వ్యాఖ్యలు

వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌- యూజీ పరీక్ష- 2024లో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. విద్యార్ధుల తరుపున ఇదే అంశంపై పార్లమెంట్‌లో గళమెత్తుతామని స్పష్టం చేశారు. నీట్‌ పరీక్షల్లో లోపాల కారణంగా సుమారు 67మంది ప్రథమ ర్యాంక్‌ రావడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో రాహుల్‌ గాంధీ ఎ‍క్స్‌ వేదికగా స్పందించారు. మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయకముందే నీట్‌ పరీక్షల కారణంగా 24 లక్షమంది విద్యార్ధులు, వారి కుటుంబాలను నాశనం చేసింది. ఒకే పరీక్షా కేంద్రంలోని 6 మంది విద్యార్థులు గరిష్ట మార్కులతో పరీక్షలో ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నారు. చాలా మంది విద్యార్ధులకు టెక్నికల్‌గా సాధ్యం కాని విధంగా మార్కులు వచ్చాయి. అదెలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. అయినప్పటికీ నీట్‌ పేపర్‌ లీక్‌ అయ్యిందని కేంద్రం ఒప్పుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్‌ లీకేజీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్‌ బలమైన ప్రణాళికను రూపొందించింది. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా పేపర్‌ లీకేజీలు కాకుండా ఉండేలా చట్టం చేస్తే.. పేపర్‌ లీకేజీల నుంచి విద్యార్ధులను పేపర్ లీక్ నుండి విముక్తి చేస్తామని హామీ ఇచ్చాము అని ఆయన అన్నారు.లోక్‌సభలో ఈ అంశాన్ని లేవనెత్తుతానని రాహుల్ గాంధీ అన్నారు. ఈ రోజు నేను దేశంలోని విద్యార్థులందరికీ పార్లమెంటులో మీ వాయిస్‌గా మారుతా. మీ భవిష్యత్తుకు సంబంధించిన సమస్యలను గట్టిగా లేవనెత్తుతానని హామీ ఇస్తున్నాను అని రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు.

 Nayanthara Vignesh Shivan Special Post on thier Marriage anniversery
నయన్‌- విఘ్నేశ్‌ వివాహ వార్షికోత్సవం.. భర్త ఎమోషనల్ పోస్ట్!

కోలీవుడ్‌లో మోస్ట్‌ ఫేమ్ ఉన్న ఫేమ్ ఉన్న జంటల్లో నయనతార- విఘ్నేశ్ శివన్ ఒకరు. కొన్నేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న వీరిద్దరు జూన్ 9, 2022లో వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఈ జంట సరోగసి పద్ధతిలో కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. తాజాగా ఇవాళ రెండో వివాహా వార్షికోత్సవం సందర్భంగా నయన భర్త విఘ్నేశ్ శివన్‌ స్పెషల్ పోస్ట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా తన భార్యతో కలిసి చిల్ అవుతోన్న వీడియోను అభిమానులతో పంచుకున్నారు.విఘ్నేశ్ శివన్‌ తన ఇన్‌స్టాలో రాస్తూ..'పదేళ్ల నయనతార.. రెండేళ్ల విక్కీ-నయన్. ఇవాళ మా రెండో వివాహా వార్షికోత్సవం. నిన్ను పెళ్లి చేసుకోవడం, ఉయిర్ ఉలగం రావడం నా జీవితంలోకి అతి గొప్పవిషయం. నా భార్య తంగమేయిని చాలా ప్రేమిస్తున్నా. నీతో మరెన్నో ఆహ్లాదకరమైన సమయాలు, జ్ఞాపకాలు, విజయవంతమైన క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేను. ఎలాంటి పరిస్థితుల్లనైనా నీకు తోడుగా ఉంటా. ఆ భగవంతుడు ఎల్లవేళలా మనకు అండగా నిలవాలని కోరుకుంటున్నా. మన ఉయిర్, ఉలగంతో సంతోషంగా ఉండాలనేదే ఆశయం. ఆలాగే మన పెద్ద పెద్ద ఆశయాలు నెరవేరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా.' అంటూ వీడియోను పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు విషెస్ చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. నయన్ గతేడాది జవాన్‌ మూవీతో సూపర్ హిట్ కొట్టింది. ఆ తర్వాత ఆమె నటించిన అన్నపూరణి చిత్రం విమర్శల పాలైన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial)

Elon Musk Says Thanks To Indian Origin Ashok Elluswamy
టెస్లా విజయం వెనుక ఇండియన్.. థాంక్స్ చెప్పిన మస్క్

గ్లోబల్ మార్కెట్లో అమెరికన్ కంపెనీ టెస్లా ఎంత ఎత్తుకు ఎదిగిందో అందరికి తెలుసు. అయితే ఆ సంస్థ నేడు ఈ స్థాయికి రావడానికి కారణమైన వారిలో భారతీయ సంతతికి చెందిన వ్యక్తి ఒకరు ఉన్నారని బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు. ఆయనే 'అశోక్ ఎల్లుస్వామి'. ఈయనకు మస్క్ కృతజ్ఞతలు చెబుతూ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ట్వీట్ చేశారు.టెక్ బిలియనీర్ అశోక్‌ ఇటీవల తన ఎక్స్ (ట్విటర్) వేదికగా టెస్లా సీఈఓ 'ఇలాన్ మస్క్'ను ప్రశంసించారు. కంపెనీలో ఏఐ / ఆటోపైలెట్ విభాగాలు అభివృద్ధి చెందడం వెనుక మస్క్ పాత్ర అనన్యసామాన్యమని అన్నారు. ప్రారంభంలో ఈ టెక్నాలజీ స్టార్ట్ చెయ్యాలనే ఆలోచనను మస్క్ చెప్పినప్పుడు.. అసలు అది సాధ్యమవుతుందా అని అందరు అనుకున్నారు. కానీ మస్క్ ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా.. టీమ్‌ను ముందుకు నడిపించారు.అనుకున్న విధంగా ముందుకు వెళుతూ 2014లో ఆటోపైలట్‌ను ఓ చిన్న కంప్యూటర్‌తో స్టార్ట్ చేసాము. అది కేవలం 384 KB మెమరీ మాత్రమే కలిగి ఉంది. ఆ తరువాత లేన్ కీపింగ్, లేన్ ఛేంజింగ్, లాంగిట్యూడినల్ కంట్రోల్ ఫర్ వెహికల్స్ వంటి వాటిని అమలు చేయాలని మస్క్ ఇంజనీరింగ్ టీమ్‌కు చెప్పారు. ఇది మాకు చాలా క్రేజీగా అనిపించింది. అయినా పట్టు వదలకుండా 2015లో టెస్లా ప్రపంచంలోనే మొట్టమొదటి ఆటోపైలట్ సిస్టమ్‌ను తీసుకువచ్చాము.https://t.co/yUqvdS7JOf— Ashok Elluswamy (@aelluswamy) June 9, 2024ఆటోఫైలెట్ కోసం ఇతరుల మీద ఆధారపడకుండా.. కంపెనీలోనే చేయడం ప్రారంభించాము. కేవలం పదకొండు నెలల్లోనే ఈ లక్ష్యాన్ని సాధించాం. ఇది టెస్లా బలమైన ఏఐ బృందం సాధించిన గొప్ప విజయం. మస్క్ కేవలం బలమైన ఏఐ సాఫ్ట్‌వేర్ కోసం మాత్రమే కాకుండా, శక్తివంతమైన AI హార్డ్‌వేర్ కోసం కూడా ప్రయత్నించారు. ఇందులో భాగంగానే న్యూరల్ నెట్‌వర్క్‌లను సమర్థవంతంగా అమలు చేయడానికి సిలికాన్‌ను తయారు చేసాము.మొత్తం మీద ఏఐలో టెస్లా విజయానికి మస్క్ కీలకమైన వ్యక్తి. ఇది ఆయనకు టెక్నాలజీ మీద ఉన్న అవగాహన, పట్టుదల వల్ల సాధ్యమైంది. గొప్ప గొప్ప టెక్నాలజీలను ఇతరులు చూడకముందే మస్క్ కనిపెడుతున్నారు. అదే టెస్లాను వాస్తవ ప్రపంచ AIలో అగ్రగామిగా నిలిపింది. రాబోయే రోజుల్లో ఫుల్లీ అటానమస్ కార్లు, హౌస్ హోల్డ్ రోబోట్స్ సర్వ సాధారణమైపోతాయని అశోక్ ఎల్లుస్వామి.. మస్క్‌ను గొప్పగా ప్రశంసించారు.థాంక్యూ అశోక్ అని ప్రారంభించి.. అశోక్ టెస్లా ఆటోపైలట్ బృందంలో చేరిన మొదటి వ్యక్తి. నేడు ఆటోపైలట్ సాఫ్ట్‌వేర్‌లకు నాయకత్వం వహించే స్థాయికి ఎదిగారు. అతడు.. మా అద్భుతమైన టీమ్ లేకుండా మేము విజయాలను సాధించి ఉండేవారము కాదేమో.. అంటూ ఎల్లుస్వామి ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు.Thanks Ashok! Ashok was the first person to join the Tesla AI/Autopilot team and ultimately rose to lead all AI/Autopilot software. Without him and our awesome team, we would just be another car company looking for an autonomy supplier that doesn’t exist. Btw, I never… https://t.co/7eBfzu0Nci— Elon Musk (@elonmusk) June 9, 2024

Vk Pandian Quits Acitve Politics In Odisha
ఒడిశా: పాలిటిక్స్‌కు వీకే పాండియన్‌ గుడ్‌బై

భువనేశ్వర్‌: సాధారణ ఎన్నికల ఫలితాలు ఒడిశా రాజకీయాల్లో పెను మార్పులకు కారణమవుతున్నాయి. మాజీ సీఎం నవీన్‌పట్నాయక్ ఆంతరంగికుడు, బిజూ జనతాదళ్‌(బీజేడీ) కీలక నేత వీకే పాండియన్‌ క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు ఆదివారం(జూన్‌9) ఆయన ఒక వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో వీకే మాట్లాడుతూ ‘క్రియాశీలక రాజకీయాల్లో నుంచి నేను తప్పుకుంటున్నా. నా ఈ ప్రయాణంలో ఎవరినైనా గాయపరిస్తే సారీ. నాపై జరిగిన ప్రచారం వల్లే పార్టీ ఓడిపోతే క్షమించండి. నేను చాలా చిన్న గ్రామం నుంచి వచ్చాను. ఐఏఎస్‌ అయి ప్రజలకు సేవ చేయడం చిన్నతనం నుంచే నాకల.పూరీ జగన్నాథుని ఆశీస్సులతో అది సాధించగలిగాను. మా కుటుంబం ఒడిశాలోని కేంద్రపరకు చెందినది కావడం వల్లే ఒడిశాకు వచ్చాను. నేను ఒడిశాలో అడుగుపెట్టినప్పటి నుంచి ఇక్కడి ప్రజల కోసం కష్టపడి పనిచేశా’అని చెబుతూ వీకే పాండియన్‌ భావోద్వేగానికి గురయ్యారు.

Britain's Sark Island Prison Is The Smallest In The World
ప్రపంచంలోనే అతిచిన్న జైలు.. ఖైదీలు ఎందరో తెలుసా?

ఇది ప్రపంచంలోనే అతిచిన్న చెరసాల. ఇద్దరు ఖైదీల సామర్థ్యం మాత్రమే గల ఈ జైలు బ్రిటన్‌లోని సార్క్‌ దీవిలో ఉంది. ఇంగ్లండ్, ఫ్రాన్స్‌ దేశాల మధ్య ఇంగ్లిష్‌ చానల్‌లోని చానల్‌ దీవుల ద్వీపసమూహంలో ఒకటైన సార్క్‌ దీవి విస్తీర్ణం 5.4 చదరపు కిలోమీటర్లు మాత్రమే! ఈ దీవి జనాభా 562 మంది.ఈ దీవిలో 1856లో ఈ జైలును నిర్మించారు. చెక్కపీపాను దీనికి పైకప్పుగా ఏర్పాటు చేయడం ఇందులోని మరో విశేషం. తొలిరోజుల్లో ఈ జైలుకు విద్యుత్‌ సౌకర్యం కూడా ఉండేది కాదు. జైలు నిర్మించిన దాదాపు శతాబ్దం తర్వాత మాత్రమే దీనికి విద్యుత్తు సౌకర్యం వచ్చింది. ఇందులో ఇద్దరు ఖైదీల కోసం రెండు గదులు, రెండు గదుల మధ్య సన్నని నడవ మాత్రమే ఉంటాయి. ఈ జైలు ఇప్పటికీ వినియోగంలో ఉండటం విశేషం.అయితే, ఈ జైలులో ఖైదీలను ఎక్కువకాలం నిర్బంధంలో ఉంచరు. ఏదైనా నేరారోపణతో పట్టుబడిన నిందితులను ఈ జైలులో రెండు రోజుల వరకు ఉంచుతారు. కోర్టులో హాజరుపరచిన తర్వాత ఇక్కడి నుంచి గ్రంజీ దీవిలోని పెద్ద జైలుకు తరలిస్తారు. సార్క్‌ దీవి అధికార యంత్రాంగానికి బ్రిటిష్‌ రాచరికం పరిమితంగా మాత్రమే న్యాయవిచారణ అధికారాలను ఇచ్చింది.ఇక్కడ పట్టుబడిన ఖైదీలను రెండు రోజులకు మించి నిర్బంధించరాదని, అంతకు మించిన శిక్ష విధించాల్సిన నేరానికి పాల్పడినట్లయితే వారిని గ్రంజీ జైలుకు తరలించాలని 1583లో అప్పటి బ్రిటిష్‌ రాచరికం ఆదేశాలు జారీచేసింది. ఆనాటి ఆదేశాలే ఇక్కడ ఈనాటికీ అమలులో ఉన్నాయి. అయితే, ఈ జైలుకు తరచు ఖైదీల రాక ఉండదు. తక్కువ జనాభా గల ఈ దీవిలో నేరాలు కూడా చాలా తక్కువ.ఇవి చదవండి: 'అపార్ట్‌మెంట్‌ 66బి’ గురించి.. కనీసం మాట్లాడాలన్నా ధైర్యం చాలదు!

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement