Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

CM Jagan Powerful Speech At Ichchapuram Public Meeting
పథకాలు ఆపగలరు కానీ.. మా విజయాన్ని ఆపలేరు: సీఎం జగన్‌

సాక్షి, శ్రీకాకుళం: సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. భోగాపురం ఎయిర్‌పోర్టు విస్తరన పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో కొత్తగా 4 మెడికల్‌ కాలేజీలు కడుతున్నామని వెల్లడించారు. గిరిజన ప్రాంతాల్లో సెల్‌ఫోన్‌ కనెక్టవిటీ పెంచామని అన్నారు.ఎన్నిక ప్రచారంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో సీఎం జగన్‌  భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..జూన్‌ 4న విశాఖ నుంచే ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పారు. మూడు జిల్లాలను ఆరు జిల్లాలను చేశామన్నారు. విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా చేస్తామని పేర్కొన్నారు. ఉద్దాన సమస్యను పరిష్కరించామని, కిడ్నీ ఆసుపత్రి, రీసెర్చ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశామన్నారు.సంక్షేమ పథకాలు అందకుండా చంద్రబాబు  కుట్రలు చేశాడని మండిపడ్డారు సీఎం జగన్‌. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు ఢిల్లీ వాళ్లతో కలిశాడని దుయ్యబట్టారు. బటన్లు నొక్కిన సొమ్ము పేదలకు అందకుండా కుట్రలు చేశాడని ధ్వజమెత్తారు. ఈ పథకాలకు బడ్జెట్‌లో ఆమోదం కూడా తెలిపామని తెలిపారు. పథకాలు ఆపగలరు కానీ.. మా విజయాన్ని ఆపలేరని స్పష్టం  చేశారు.సీఎం జగన్‌పూర్తి  ప్రసంగం 59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం.అక్కచెల్లెమ్మలకు నేరుగా రూ. 2లక్షల 70 వేల కోట్లు అందించాం.2 లక్షల 31 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాం.మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌గా భావించాం.మేనిఫెస్టోని 99 శాతం హామీలను నెరవేర్చాం.నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చాంప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్‌ మీడియం తీసుకొచ్చాం.3వ తరగతి నుంచే టోఫెల్‌ క్లాసులు, సబ్జెక్ట్‌ టీచర్లు .ప్రభుత్వ స్కూళ్లలో 6వ తరగతి నుంచే డిజిటల్‌ బోధన.బడులు తెరిచే నాటికే విద్యాకానుక, గోరుముద్ద.అమ్మ ఒడి, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన ద్వారా మార్పులు.విద్యారంగంలో మేం చేసిన అభివృద్ధి బాబు హయాంలో జరిగిందా?.అక్కాచెల్లెమ్మలకు తోడుగా ఉన్నాంఅక్కాచెల్లెమ్మల కోసం ఆసరా, సున్నావడ్డీ,చేయూత.అక్కాచెల్లెమ్మల కోసం కాపు నేస్తం, ఈబీసీ నేస్తం.అక్కాచెల్లెమ్మల పేరుపై 31 లక్షల ఇళ్ల పట్టాలిచ్చాం.అందులో 22 లక్షల ఇళ్లు కడుతున్నాం.గతంలో ఎప్పుడైనా ఇంత మంచి జరిగిందా?అవ్వాతాతలకు ఇంటి వద్దకే రూ. 3 వేల పెన్షన్‌.ఇంటి వద్దకే పౌరసేవలు, సంక్షేమ పథకాలు.సకాలంలో ఇన్‌పుట్‌ సబ్సిడీ అందిస్తున్నాం.విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్నకు తోడుగా నిలిచాం.గతంలో రైతన్నకు ఇంత మంచి జరిగిందా?.పెట్టుబడి సాయంతో రైతన్నకు తోడుగా ఉన్నాం.రైతులకు పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాం.గ్రామస్థాయిలోనే రైతులను చేయి పట్టుకొని నడిపించే ఆర్‌బీకే వ్యవస్థ.స్వయం ఉపాధికి అండగా వాహనమిత్ర, నేతన్న నేస్తం,మత్స్యకార భరోసా..జగనన్న తోడు, చేదోడుతో చిరువ్యాపారులకు అండగా నిలిచాం.నాడు-నేడు ద్వారా ప్రభుత్వాసుపత్రుల రూపురేఖలు మార్చాం.ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 25 లక్షల వరకు పెంచాం.పేషెంట్‌ విశ్రాంతి సమయంలోనూ ఆర్థిక సాయం అందించాం.ఆరోగ్య ఆసరా, ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్‌.విలేజ్‌ క్లినిక్‌ల ద్వారా పేదవాడిని ఆదుకున్నాంఉత్తరాంధ్ర అభివృద్ధికి అడుగులు వేశాంమూడు జిల్లాలను ఆరు జిల్లాలను చేశాం.ఎగ్జిక్యూటివ్‌క్యాపిటల్‌గా విశాఖనుఉద్దాన సమస్యను పరిష్కరించాం.కిడ్నీ ఆసుపత్రి, రీసెర్చ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశాం.జూన్‌ 4న మీ బిడ్డ అధికారంలోకి వస్తాడు.మీ బిడ్డ అధికారంలో వెంటనే మళ్లీ మొత్తం అందస్తాం.చంద్రబాబు దగ్గర ప్రజల నుంచి దోచేసిన సొమ్ము చాలా ఉంది.దోచేసిన సొమ్ముతో చంద్రబాబు ఓటర్లను ప్రలోభపెడతాడుబాబు డబ్బులిస్తే తీసుకోండి.. కానీ ఓటేసే ముందు ఆలోచించండి.ఎవరి వల్ల మీ కుటుంబానికి మంచి జరిగిందో ఆలోచించండి.మీరు వేసే ఓటుతో ఢిల్లీ పీఠం కదలాలి.ఓటు అనే అస్త్రంతో బాబుకు గట్టిగా బుద్ధి చెప్పాలి 

Untimely rains In Andhra Pradesh Krishna Eluru Some Districts
ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం

సాక్షి, విజయవాడ:  ఏపీలో వాతావరణం చల్లబడింది. పలు జిల్లాల్లో నల్లటి మేఘాలు కమ్మేసి, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. వర్షపు నీటితలో లోతట్లు ప్రాంతాలన్నీ నిటమునిగాయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. బైక్‌లు వర్షపు నీటిలో కొట్టుకుపోయాయి. దురుగాలుల ప్రభావంతో పలు చోట్ల చెట్లు నెలకూలాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిసింది.ఉమ్మడి కృష్ణా జిల్లాలో అకాల వర్షం కురిసింది. నూజివీడు తరువూరు కైకలూరు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏలూరు సిటీ, కైకలూరు, కలిదిండి, ఆచంట ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో రహదారులు జలమయంగా మారాయి. ఏలూరుజిల్లా పోలవరం మండలంలో భారీ వర్షాలు పడుతున్నాయి. వరి, మొక్క జొన్న పంటంతా వర్షపు నీటిపాలు అయ్యింది. రైతులు పరదాలు కప్పి పంట రక్షించుకుంటున్నారు.కృష్ణాజిల్లా :బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ లో అకాల వర్షం.ఉరుములు,మెరుపులతో కూడిన భారీ వర్షం.ఉదయం నుండి భానుడి భగభగలతో అల్లాడిన జనం.భారీ వర్షంతో ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం.ఏలూరు జిల్లానూజివీడు డివిజన్ పరిధిలోని పలు మండలాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం.మధ్యాహ్నం మూడు గంటలకు పట్టపగలే కారుమబ్బులు, నల్లని మబ్బులతో కమ్మేసిన ఆకాశం.అకాల వర్షంతో  సేద తీరుతున్న  నూజివీడు ప్రాంత ప్రజలు.అల్లూరి సీతారామరాజు జిల్లాచింతూరు,కూనవరం, విఆర్ పురం మండలాల్లో ఈదురుగాలల భీభత్సంపలు ప్రాంతాల్లో రోడ్లపై విరిగిపడిన విద్యుత్తు స్థంభాలు, వృక్షాలు.

Kalvakuntla Kavitha Comments On Prajwal Revanna Case
‘ప్రజ్వల్‌ రేవణ్ణ’ పై కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు

సాక్షి,ఢిల్లీ: లిక్కర్‌ కేసులో జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రజ్వల్‌ రేవణ్ణ కేసుపై స్పందించారు. సోమవారం కస్టడీ ముగిసిన సందర్భంగా కవితను రౌస్‌ ఎవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కోర్టు వద్ద కవిత మీడియాతో మాట్లాడారు. ప్రజ్వల్‌ రేవణ్ణ లాంటి వాళ్లను విడిచిపెట్టి దేశం దాటించి తనలాంటి వాళ్లను అరెస్ట్‌ చేశారన్నారు. ఇది అన్యాయమని, దీనిని అందరూ గమనించాలని కవిత కోరారు. లిక్కర్‌ కేసులో కవిత జ్యుడీషియల్‌ కస్టడీని రౌస్‌ ఎవెన్యూ కోర్టు మే 14 దాకా పొడిగించింది.క‌విత కేసులో ఈడీ దూకుడు.. వారం రోజుల్లో ఛార్జ్‌షీట్‌ వేస్తామని వెల్లడిలిక్కర్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)దూకుడు ప్రదర్శిస్తోంది. లిక్కర్‌ కేసులో కవిత పాత్రపై వారంరోజుల్లో చార్జ్‌షీట్‌ దాఖలు చేయనున్నట్లు ఈడీ కోర్టుకు వెల్లడించింది. మార్చి 15న ఈడీ కవితను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.  

Hero Arjun's Daughter Marriage Date Fix Goes Viral
టాలీవుడ్‌ హీరో కూతురి ప్రేమ పెళ్లి.. తేదీ ఫిక్స్!

టాలీవుడ్ నటుడు అర్జున్ సర్జా కూతురు ఐశ్వర్య త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. ఇప్పటికే తమిళ నటుడు ఉమాపతి రామయ్యతో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. వీరిద్దరి వివాహా వేడుక జూన్ 10న చెన్నైలో జరగనుంది. నగరంలోని అంజనసుత శ్రీ యోగాంజనేయ మందిరం పోరుర్‌లో వేదికగా నిలవనుంది.గతేడాది నిశ్చితార్థంకాగా.. గతేడాది ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ఈ జంట జూన్‌లో పెళ్లిబంధంతో ఒక్కటి కానుంది. ఉమాపతి, ఐశ్వర్య ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు. వీరి ప్రేమకు రెండు కుటుంబాలు అంగీకరించడంతో గతేడాది నిశ్చితార్థం ఘనంగా నిర్వహించారు.   వరుడు ఎవరంటే?కోలీవుడ్‌లో ప్రముఖ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న తంబి రామయ్య కుమారుడే ఉమాపతి. తమిళంలో మనియార్ కుటుంబం, తిరుమణం, తన్నే వండి సినిమాల్లో ఉమాపతి నటించారు. అర్జున్ సర్జా కూతురు కూడా తమిళ సినిమాల్లోకి అడుగుపెట్టింది. విశాల్ మూవీ పటతు యానై సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తమిళ చిత్ర పరిశ్రమలో అందాల నటిగా పేరు తెచ్చుకున్న ఐశ్వర్యను ఉమాపతి పెళ్లి చేసుకోనున్నారు.    View this post on Instagram           A post shared by Aishwarya Arjun (@aishwaryaarjun)

China Woman Discovers She Is A Biological Male After Testicle
27 ఏళ్లుగా ఆమె మహిళ..పెళ్లి కుదిరాక వెలుగులోకి షాకింగ్‌ విషయం..!

వైద్యశాస్త్రానికే అంతుపట్టని కొన్ని విషయాలు అందర్నీ ఆందోళనకు గురి చేస్తాయి. ఇది శాపమా? లేక పాపమా? అన్నంత బాధను కలగజేస్తాయి. ఏం చేయాలో తోచని స్థితి. అలాంటి భయానక పరిస్థితినే మహిళగా జీవిస్తున్న చైనాకు చెందిన అమ్మాయి ఎదుర్కొంటోంది. అది కూడా పెళ్లి కుదిరాక ఈ పరిస్థితి ఎదరవ్వడంతో ఆమెతో సహ తల్లిదండ్రలు కూడా నిశ్చేష్టులైపోయారు. ఇలాంటి పరిస్థితి ఎవ్వరికి వద్దు అని విలపిస్తున్నారు ఆమె తల్లిదండ్రులు.ఏం జరిగిందంటే..? చైనాలోని 27 ఏళ్ల మహిళ లీ యువాన్‌కి గత కొద్దిరోజుల ముందే పెళ్లి కుదిరింది. తనకు రుతుక్రమం రాకపోవడంతో ఆందోళన చెంది వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్లింది. ఆమెకు 18 ఏళ్ల సమయంలోనే ఈ పరిస్థితిని ఎదుర్కొంది. అసాధారణ హర్మోన్‌ స్థాయిలు, సంభావ్య అండాశయ వైఫల్యం ఉన్నట్లు గుర్తించి వైద్యులు ఆమెను క్రోమోజోమ్‌ పరీక్ష కూడా చేయించుకోమని సూచించారు. అయితే లీ, ఆమె కుటుంబం ఆ సలహను పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు పెళ్లి కుదరడంతో లీ కుటుంబం ఆమెకు వైద్య పరీక్షలు చేయించింది. ఆ పరీక్షల్లో వాళ్లంతా జీర్ణించుకోలేని నిజం బయటపడింది. వైద్యులు ఆమె పొత్తి కడుపులో వృషణాలు ఉండటా గుర్తించారు. ఆమెకు పుట్టుకతో వచ్చే అడ్రినల్ హైపర్‌ప్లాసియా (CAH) అనే అరుదైన రుగ్మత ఉన్నట్లు పరీక్షల్లో నిర్ధారించారు. ఈ అరుదైన రుగ్మత సుమారు 50 వేల మంది నవజాత శిశువుల్లో ఒకరికి మాత్రమే వస్తుంది. ఇన్నాళ్లు స్త్రీగా జీవిస్తున్న లీ ఇప్పుడూ వైద్య పరీక్షల్లో మగదిగా గైనకాలజిస్ట్‌ డువాన్‌ జీ తేల్చి చెప్పారు. ఆమెలో మగ క్రోమోజోమ్‌లు ఉన్నాయన్నారు. దీంతో లీకి ఒక్కసారిగా తన జీవితం అంతా తలకిందులైనట్లు అనిపించింది. ముఖ్యంగా లీ తల్లిందడ్రుల ఈ విషయం విని జీర్ణించుకోలేని అయోమయానికి గురయ్యారు. నిజానికి ఈ డిజార్డర్‌కి కారణమయ్యే జన్యువులు లీ తల్లిదండ్రులిద్దరు కలిగి ఉన్నారు. కాబట్టే లీకి ఈ పరిస్థితి ఎదురయ్యిందని చెప్పారు వైద్యులు. ఆ వైద్య పరీక్షల్లో లీ బోలు ఎముకల వ్యాధితో విటమిన్‌ డీ లోపంతో బాధపడుతున్నట్లు వెల్లడయ్యింది. అంతేగాదు పొత్తి కడుపులో ఉన్న వృషణాలను తక్షణమే తొలగించాలని, లేనట్లయితే క్యాన్సర్‌కి దారితీస్తుందని చెప్పారు. దీంతో లీకి వైద్యలు ఏప్రిల్‌ మొదటి వారంలోనే శస్త్ర చికిత్స నిర్వహించి పొత్తి కడుపులో ఉన్న వృషణాలను తొలగించారు. ఆమెకు ఇప్పుడు రెగ్యూలర్‌ ఫాలో అప్‌ పరీక్షలు, దీర్ఘకాలిక హార్మోన్‌ థెరపీ చేస్తున్నారు. ప్రస్తుతం లీ కథ ఇప్పుడు చైనాలోని సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవ్వుతుంది. నెట్టింట లీ పట్ల సానుభూతి వెల్లువెత్తడమే గాక ఆమె ధైర్యాన్నికొనియాడుతున్నారు. కాగా, పుట్టకతో వచ్చే ఈ డ్రినల్ హైపర్‌ప్లాసియా (CAH) అనేది మనిషి అడ్రినల్ గ్రంధులను ప్రభావితం చేసే జన్యుపరమైన రుగ్మత. ఈ గ్రంథులు శరీరం సరిగ్గా పనిచేయడానికి అవసరమైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. ఈ హార్మోన్లలో అసమతుల్యత ప్రధానంగా లైంగిక అభివృద్ధిని ప్రభావితం చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. (చదవండి: 'ఇరానీ చాయ్‌'ని పరిచయం చేసిందెవరో తెలుసా! ది బెస్ట్‌ కేఫ్‌లు ఎక్కడ ఉన్నాయంటే..) 

Tesla Job Cuts Continue, Company Sends Layoff Notice To More Employees
అమెరికన్ కంపెనీ కీలక నిర్ణయం.. కొనసాగుతున్న ఉద్యోగాల కోతలు

అమెరికన్ కార్ల తయారీ సంస్థ టెస్లా గత కొన్ని రోజులుగా తమ ఉద్యోగులను తొలగిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే గత వారం ఇలాన్ మస్క్ (Elon Musk) టెస్లాలో ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను తొలగించారు. రానున్న రోజుల్లో మరింత మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం.ఇటీవల టెస్లా తొలగించిన ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లలో ఒకరు సూపర్‌చార్జర్ బిజినెస్ సీనియర్ డైరెక్టర్‌గా పని చేస్తున్న 'రెబెక్కా టినుచీ', మరొకరు న్యూ వెహికల్ ప్రోగ్రామ్ హెడ్ 'డేనియల్ హో' ఉన్నారు. వీరితో పాటు ప‌లువురు ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయినట్లు పేర్కొన్నారు. త‌మ‌కు అందిన ఈమెయిల్ స్క్రీన్‌షాట్‌ను లింక్డిన్‌లో షేర్ చేయ‌డంతో ఈ వివ‌రాలు వెలుగులోకి వచ్చాయి.టెస్లా సీఈఓ మస్క్ ఏప్రిల్ 14న కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులలో 10 శాతానికంటే ఎక్కువ మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో రిక్రూట్‌మెంట్, మార్కెటింగ్, సూపర్‌చార్జింగ్ టీమ్‌తో సహా వివిధ విభాగాలలో పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నారు. ఒక్క సూపర్‌చార్జింగ్ టీమ్‌లోనే సుమారు 500 మంది ఉద్యోగాలను తొలగించినట్లు సమాచారం.ఇప్పటికే మూడు సార్లు లేఆప్స్ ప్రకటించిన టెస్లా మరోమారు ఉద్యోగులను తొలగించడానికి పూనుకుంది. దీంతో ఉద్యోగుల్లో లేఆప్స్ భయం నిండిపోయింది. కంపెనీ ఉద్యోగులను తగ్గించడానికి ప్రధాన కారణం.. అంచనాల కంటే తక్కువ డెలివరీ సంఖ్యలు నమోదు చేయడమనే తెలుస్తోంది.

Rohit Sharma Breaks Down in MI Dressing Room Indian Captain Visuals Viral
కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్‌ శర్మ.. డ్రెస్సింగ్‌ రూంలో అలా!

ఐపీఎల్‌-2024 టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు పెద్దగా కలిసి రావడం లేదు. సీజన్‌ ఆరంభానికి ముందే ముంబై ఇండియన్స్‌  కెప్టెన్‌ పదవిని కోల్పోయిన హిట్‌మ్యాన్‌.. హార్దిక్‌ పాండ్యా సారథ్యంలో ఆటగాడిగా కొనసాగుతున్నాడు.కానీ బ్యాటర్‌గా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 12 ఇన్నింగ్స్‌లో కలిపి రోహిత్‌ శర్మ చేసిన పరుగులు 330. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో పదిహేడో స్థానం(మే 7 నాటికి)లో ఉన్నాడు.ఆ సెంచరీ మినహా!ఈ ఎడిషన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ మీద సాధించిన శతకం(105 నాటౌట్‌) మినహా మిగతా మ్యాచ్‌లలో రాణించలేకపోయాడు. తాజాగా సన్‌రైజర్స్‌తో సోమవారం ముగిసిన మ్యాచ్‌లోనూ రోహిత్‌ శర్మ విఫలమయ్యాడు.భావోద్వేగానికి గురైన రోహిత్‌!వాంఖడే మైదానంలో ఐదు బంతులు ఎదుర్కొన్న రోహిత్‌.. కేవలం ఒక్క ఫోర్‌ కొట్టి అవుటయ్యాడు. రైజర్స్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.ఈ నేపథ్యంలో నిరాశగా మైదానం వీడిన రోహిత్‌ శర్మ డ్రెస్సింగ్‌ రూంలోకి వెళ్లి తీవ్ర భావోద్వేగానికి గురైనట్లుగా కనిపించాడు. దుఃఖాన్ని ఆపుకొంటూ రోహిత్‌ కన్నీళ్లను తుడుచుకుంటున్నట్లుగా కనిపిస్తున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.పాపం రోహిత్‌ఈ వీడియో చూసిన రోహిత్‌ శర్మ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ‘‘టీ20 వరల్డ్‌కప్‌నకు ముందు నిన్నిలా చూడలేకపోతున్నాం హిట్‌మ్యాన్‌. ముంబై ఇండియన్స్‌ ఫ్రాంఛైజీ నిర్ణయం వల్లే ఇదంతా. కెప్టెన్సీ నుంచి అవమానకరంగా తప్పించి అతడిని ఒత్తిడిలోకి నెట్టేశారు.ఐదుసార్లు ట్రోఫీ అందించిన కెప్టెన్‌పై వేటు వేశారు. అందుకు తగిన మూల్యం చెల్లిస్తున్నారు’’ అంటూ ముంబై జట్టు మేనేజ్‌మెంట్‌పై మండిపడుతున్నారు. ఏదేమైనా రోహిత్‌ శర్మ వైఫల్యాలను అధిగమించి రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నారు. కాగా సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా ఈ సీజన్‌లో నాలుగో విజయం అందుకుంది. చదవండి: ధోని గురించి నిజాలు ఇవే! మాజీ క్రికెటర్లకు కౌంటర్‌Rohit Sharma crying in the dressing room. pic.twitter.com/GRU5uF3fpc— Gaurav (@Melbourne__82) May 6, 2024💯 & winning runs in styleSuryakumar Yadav hits a maximum to bring up his century 👏Watch the recap on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #MIvSRH | @mipaltan pic.twitter.com/RlaOZ8l2i0— IndianPremierLeague (@IPL) May 6, 2024

kejriwal judicial Remand Extended Till May 20th
కేజ్రీవాల్‌ కస్టడీ పొడిగింపు.. బెయిల్‌ పిటిషన్‌ విచారణ వాయిదా

న్యూఢిల్లీ: లిక్కర్‌ కేసులో తీహార్‌ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ జ్యుడీషియల్‌  కస్టడీని మే 20దాకా రౌస్‌ న్యూ కోర్టు పొడిగించింది. గతంలో విధించిన జ్యుడీషియల్‌ కస్టడీ ముగియడంతో కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు. దీంతో ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు జడ్జి కావేరీ బవేజా కేజ్రీవాల్‌ కస్టడీని పొడిగించారు. మరోపక్క కేజ్రీవాల్‌కు మధ్యంత బెయిల్‌ ఇచ్చే అంశాన్ని సుప్రీంకోర్టు మంగళవారం(మే7) విచారించింది. ఈ అంశంపై మళ్లీ మే 9వ తేదీన విచారిస్తామని లేదంటే వచ్చే వారం లిస్ట్‌ చేయాలని రిజిస్ట్రీకి అత్యున్నత కోర్టు సూచించింది.  

AP Elections 2024: May 7th Politics Latest News Updates Telugu
May 7th: ఏపీ ఎన్నికల సమాచారం

AP Political And Elections News Updates In Telugu04:51 PM, May 7th, 2024తాడేపల్లి :మీ బిడ్డ జగన్ బటన్ నొక్కిన సొమ్ములు అక్కచెల్లెమ్మలకి అందకుండా ఢిల్లీ వాళ్లతో కలిసి కుట్రలు చేస్తూ అడ్డుకుంటున్నారుఈ ఐదేళ్లలో క్రమం తప్పకుండా పథకాల డబ్బులు ఇచ్చిన జగన్‌ని చివర్లో వీళ్లు కట్టడి చేస్తుంటే నా అక్కచెల్లెమ్మలు ఊరుకుంటారా.?ఓటు అనే అస్త్రంతో చంద్రబాబుకి బుద్ధి చెప్తారు.మీ బిడ్డ జూన్ 4న అధికారంలోకి వచ్చిన వారంలోనే అన్ని పథకాలకి డబ్బులు క్లియర్ చేస్తాడు. - సీఎం వైఎస్ జగన్04:10 PM, May 7th, 2024కాకినాడ:సంక్షేమ పథకాలను చంద్రబాబు అడ్డుకోవడం చాలా దుర్మార్గమైన చర్య: కురసాల కన్నబాబుఐదేళ్ళుగా క్రమం తప్పకుండా అమలు చేస్తున్న సంక్షేమ పధకాలను చివరి విడతలో ఆపేస్తే  మిగిలిన నాలుగేళ్ళ ప్రభావం జగన్‌పై ఉందని చంద్రబాబు అనుకుంటున్నాడా?పేదలపై కక్ష సాధించడం చంద్రబాబుకు అలవాటైపోయిందిప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం అంటే కోర్టులకు వెళ్తాడుపేదలకు ఇళ్ళ స్ధలాలు ఇస్తే కోర్టుకు వెళ్తాడుచంద్రబాబు మార్కు పథకం ఏమీ లేదుపెత్తందార్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు తరపున నిలబడతాడుఏదోలా గెలవలన్న ఒత్తిడితో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తున్నాడుఅధికారులను బదిలీ చేయిస్తున్నాడు.. సంక్షేమ పధకాల నిధుల పంపిణీని అడ్డుకుంటున్నాడుదీంతో చంద్రబాబును చూసి జనం ఒక బలహీనత అని అనుకుంటున్నారుప్రభుత్వ పాఠశాలల్లో పోలింగ్ జరిగితే నాడు-నేడు ద్వారా ఓటర్లకు జగన్ గుర్తోస్తాడన్న స్ధాయికి చంద్రబాబు వచ్చేశాడు 03:56 PM, May 7th, 2024తిరుపతి: మమ్మల్ని తిట్టేందుకే  చంద్రబాబు, పవన్ కల్యాణ్ తిరుపతికి వస్తున్నారు: టీటీడీ చైర్మన్ భూమనఈ రోజు సాయంత్రం నాలుగ్గాళ్ల మండపం వద్ద బూతుల పంచాంగం వినిపించ బోతున్నారుఅభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తిరిగి మాకు అధికారాన్ని కట్టబెట్టనున్నాయిటీటీడీ ఉద్యోగస్తులకు జగనన్న నా చేత చేయించిన మేళ్లు పట్ల అంతా సంతోషంగా ఉన్నారుదార్శనికుడు భూమన అభినయ్ తిరుపతిని మరింత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాడు అనే నమ్మకం తిరుపతి ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోందిఅందరూ ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేసి, భూమన అభినయ్, గురుమూర్తిని గెలిపించాలని స్పష్టమైన అభిప్రాయం తో ఉన్నారుకానీ, కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు మమ్మల్ని తిట్టడానికే సమయం సరిపోతోంది‌‌పవన్ కల్యాణ్‌కి  ముప్పై కోట్ల రూపాయల డబ్బులిచ్చి టికెట్ తెచ్చుకున్నాడుఇలాంటి ఆరణి శ్రీనివాసులు తిరుపతికి ఎలా మంచి చేస్తాడోఆరణి శ్రీనివాసులు గత  కొంత కాలంగా మమ్మల్ని బూతులు తిట్టే పనిలో ఉన్నాడుఇప్పుడు తన కంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్  బాగా తిడుతారని తిరుపతికి పిలిపిస్తున్నాడు శ్రీనివాసులు02:49 PM, May 7th, 2024విజయవాడ: సెంట్రల్‌ నియోజకవర్గంలో ఆగని  బోండా ఉమా కుమారుల అరాచకాలువైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార ఆటో వాహనాన్ని అడ్డుకున్న బోండా ఉమా పెద్ద కుమారుడుసింగ్‌నగర్‌, నందమూరి నగర్‌లలో ప్రచార ఆటోలకు అడ్డంగా కారు పెట్టిన బోండా సిద్ధార్థ, బోండా ఉమా సోదరుడు బోండా శ్రీనుఆటోలో పెన్‌డ్రైవ్‌ను లాక్కున్న బోండా సిద్ధార్థ, శ్రీనువిషయం తెలుసుకుని ఘటనా స్థలికి చేరుకున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులువైఎస్సార్‌సీపీ శ్రేణులతో వాగ్వాదానికి దిగిన బోండా అనుచరులుఘటనా స్థలికి చేరుకున్న పోలీసులుఅజిత్‌ సింగ్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు02:02 PM, May 7th, 2024మీడియాతో ఏపీ సీఈవో ఎంకే మీనాప్రభుత్వం ఇచ్చే పథకాలనేవీ ఆపమని ఎన్నికల సంఘం చెప్పలేదుకొంత కాలం తర్వాత ఇవ్వమని ఎన్నికల సంఘం స్పష్టం చేసిందిపోస్టల్ బ్యాలెట్ వినియోగానికి మరో రోజు గడువు పొడిగింపుకొన్ని చోట్ల 12-డి ఫారాలు అందడంలో జాప్యం జరిగిందిఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోని ఇవాళ, రేపు ఓటేసుకోవచ్చుసెక్యూర్టీకి డ్యూటీకి వెళ్లిన వారికి ఈ నెల 9వ తేదీన కూడా అవకాశంఅలాగే సొంత సెగ్మెంట్లల్లోవి ఫెసిలిటేషన్ సెంటర్లల్లో కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగించుకోవచ్చువచ్చే నెల మూడో తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ గడువు పొడిగించడం కష్టంఇప్పటికే సుమారు 20 రోజుల సమయం ఇచ్చాంకొన్ని ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద ఓటర్లను ప్రలోభ పెడుతున్నారుకొందరు ఓటుకు డబ్బులను డిజిటల్ పేమెంట్లు చేస్తున్నారుఒంగోలులో కొందరు ఉద్యోగులు ఈ ప్రలోభాలకు లోనైనట్టు నిర్థారణకు వచ్చాంకొందరు వచ్చిన మొత్తాన్ని తిప్పి పంపారుదీనిపై విచారణ చేపడుతున్నాంతప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటాంపోలింగ్ సందర్భంగా అక్రమాలకు పాల్పడిన ఓ పోలీస్ కానిస్టేబులును సస్పెండ్ చేశాంలీడర్లకు సెక్యూర్టీగా ఉన్న సిబ్బంది.. రేపటి ప్రధాని బందోబస్తులో ఉన్న వాళ్లకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా వెసులుబాట్లు కల్పిస్తున్నాంపల్నాడులో హోలో గ్రామ్ ద్వారా ఓటర్లను ప్రలోభ పెడుతున్నారుపల్నాడు ఎపిసోడ్ పై విచారణ చేపడుతున్నాం01:54 PM, May 7th, 2024ప్రధాని మోదీకి మంత్రి బొత్స కౌంటర్బీజేపీ ఏపీలో రాదు.. బంగాళాఖాతంలో వస్తుంది: మంత్రి బొత్స కేంద్రంలో మా పార్టీపై ఆధారపడే ప్రభుత్వం రావాలి: మంత్రి బొత్సమోదీ ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారు: మంత్రి బొత్సరైల్వే జోన్ పై మోదీ అవగాహన లేకుండా మాట్లాడారు: మంత్రి బొత్సటీడీపీ, జనసేన, బీజేపీ తోడు దొంగలు: మంత్రి బొత్సఒకడు తానా అంటే ఇంకొకడు తందనా అంటున్నారు: మంత్రి బొత్సమోదీకి స్థానిక సమస్యలు అవసరం లేదు.. అందుకే స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడకుండా వెళ్ళిపోయారు: మంత్రి బొత్సఇప్పుడు బీజేపీ చేస్తున్న అవినీతి.. దేశ చరిత్రలో ఏ పార్టీ చెయ్యలేదు: మంత్రి బొత్సనా రాజకీయ జీవితంలో బీజేపీ అంత అవినీతి పార్టీని ఎప్పుడూ చూడలేదు: మంత్రి బొత్సమోదీ ప్రధాని పదవికి విలువ లేకుండా చేస్తున్నారు: మంత్రి బొత్సమోదీ అంత దిగజారే ప్రధానిని ఎప్పుడూ చూడలేదు: మంత్రి బొత్సరాష్ట్ర ప్రయోజనాల మేరకే బిల్లులకు ఆమోదం తెలిపాం: మంత్రి బొత్స01:32 PM, May 7th, 2024కూటమిది దుర్మార్గపు ఆలోచన: ఏపీ మంత్రి బొత్స2019 ఎన్నికలకు ముందు టీడీపీ పసుపు కుంకుమ ఇచ్చింది మేము అడ్డుకోలేదుకూటమి దుర్మార్గపు ఆలోచనలను ప్రజలు గమనించాలిటీడీపీ ఆపించిన పథకాలకు నిధులు సిద్ధంగా ఉన్నాయిఎన్నికలు అయిన వెంటనే.. లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయికూటమికి ప్రజలు ఖచ్చితంగా బుద్ది చెప్తారుచంద్రబాబు మాటలు సభ్య సమాజం తల దించుకునేలా ఉన్నాయిఒక వేలు నువ్వు చూపిస్తే.. మిగిలిన వేళ్ళు నిన్ను చూపిస్తాయని మర్చిపోవద్దు బాబుబాబు సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారుచంద్రబాబుది మనిషి పుట్టుకేనా..?చంద్రబాబు పేరెత్తడానికే అసహ్యంగా ఉందిఎన్నికల నిబంధనలకు మేము వ్యతిరేకం కాదుఎన్నికల కమిషన్ వాస్తవాలు పరిగనించాలిరైతులకు ఇన్పుట్ సబ్సిడీ అంధక రైతులు నష్టపోతే బాద్యులు ఎవరు..?రీయంబర్స్ మెంట్ అందక విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తితే బాద్యులు ఎవరు?వీటన్నింటికి కూటమే బాధ్యత వహించాలిపింఛను లబ్ధిదారులు కలుగుతున్న ఇబ్బందుల పట్ల ఓపిక పట్టండి15 రోజుల తరువాత ఎలాంటి ఇబ్బందులు ఉండవుభవిష్యత్తులో హక్కుగా పథకాలు అందిస్తాంచంద్రబాబు ఏం చేసాడని ఉద్యోగస్తులు టీడీపీకి ఓటేస్తారు..బాబు ఉద్యోగస్తులను మోసం చేశారుఉద్యోగస్తులు ఎవరి పక్షాన ఉన్నారో జూన్ 4న తెలుస్తుంది 01:11 PM, May 7th, 2024మీడియాతో ఏపీ సీఈవో ఎంకే మీనా  రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా మీడియా సమావేశం పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలో 3,20,000 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చాం.హోం ఓటింగ్ కు 28,000 మంది దరఖాస్తు చేశారు.అత్యవసర సర్వీసులు కింద 31,000 మందికి అవకాశం ఇచ్చాంపోలీసులు 40,000,ఇతరులు కలిపి మొత్తం 4,30,000 మంది ఉన్నారు.3,03,000 మంది ఇప్పటివరకూ ఓటు వేశారుపలు కారణాల తో ఓటు వేయలేని వారి కోసం ఈ రోజు,రేపు మరో అవకాశం ఇచ్చాంఓటు వేయలేకపోయిన ఉద్యోగులు వారి సొంత నియోజకవర్గానికి వెళ్లి పోస్టల్ ఓటు వేయవచ్చుపోస్టల్ బ్యాలెట్ వేసే వారికి నగదు పంపిణీ చేస్తున్నట్లు ఫిర్యాదు వచ్చిందిఉద్యోగులు నగదు తీసుకోవడం చాలా దారుణంపశ్చిమ గోదావరి లో నగదు పంపిణీ చేస్తున్న నలుగురిని అరెస్టు చేశాం01:08 PM, May 7th, 2024ఎన్నికలప్పుడే బాబుకు కాపులు గుర్తొస్తారు: కాపు నేత అడపా శేషుడీబీటీ ద్వారా ఇచ్చే నిధులను కూడా చంద్రబాబు అడ్డుకుంటున్నారుచంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి పథకాలు నిధులు ప్రజలకు చేరకుండా అడ్డుకుంటున్నారు.ఎన్నికల కమిషన్ చంద్ర బాబుకు అనుకూలంగా వ్యవహరిస్తోందికల్లబొల్లి కబుర్లు చెప్పే చంద్రబాబును పవన్ కళ్యాణ్ భుజాన వేసుకుని తిరుగుతున్నాడు.పేదలకు పథకాలు అందడం టీడీపీకి ఇష్టం లేదుపథకాలు ఇళ్లకు చేరకుండా ఎన్నికల కమిషన్ పై ఒత్తిడి తెస్తున్నారు.ఉన్నత వర్గాలకు పవన్ కళ్యాణ్, చంద్ర బాబు దోచిపెట్టడానికి మళ్ళీ సిద్ధం అయ్యారు.పవన్‌ కల్యాణ్‌  చివరికి చంద్రబాబు రాజకీయ క్రీనిడలో  బలిపశువు అయ్యారు.కాపులు ఎదగడం పవన్‌ కల్యాణ్‌ , చంద్రబాబులకు ఇష్టం లేదు.కాపుల్లో ముద్రగడ, వంగవీటి మోహనరంగా కుటుంబాన్ని నాశనం వ్యక్తి చంద్రబాబు.ఒకవైపు వంగవీటి రాధని, మరోవైపు పవన్‌ను అడ్డుపెట్టుకుని కాపులను మోసం చేస్తున్నారు.ఎన్నికలప్పుడే చంద్రబాబుకు కాపులు గుర్తుకు వస్తారుపేదలకు సెంట్ భూమి ఇవ్వని చంద్రబాబు ల్యాండ్ టైట్లింగ్ చట్టం గురించి మాట్లాడే అర్హత లేదు.01:04 PM, May 7th, 2024ఈసీ ఎవరి కోసం పని చేస్తున్నట్లు?:  MLC లేళ్ల అప్పిరెడ్డిఏపీలో ఎన్నికల కమిషన్ విశ్వసనీయతపై ప్రజలకు అనుమానం కలుగుతోందిఒక పార్టీ అధ్యక్షురాలు లేఖ రాస్తే అధికారులను బదిలీ చేస్తారుఇంకొక‌పార్టీ అధ్యక్షుడు లేఖ రాస్తే పేదలకు ఇవ్వాల్సిన నిధులను ఆపేస్తారుఎన్నికల కమిషన్ ఎవరి కోసం పనిచేస్తున్నట్లు?అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వటాన్ని కూడా ఈసీ అడ్డుకుందిఅదే వర్షాలకు నష్టపోయిన తెలంగాణ రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు ఈసీ ఓకే చెప్పిందికానీ ఏపీలో మాత్రం ఇవ్వటానికి వీల్లేదని ఈసీ చెప్తోందిఎన్నికల కమిషన్ ఒక్కోచోట ఒకోలా ఎందుకు వ్యవహరిస్తోంది?విద్యార్థులకు ఇవ్వాల్సిన విద్యాదీవెన, అక్కచెల్లెళ్ళకు ఇవ్వాల్సిన చేయూత నిధులను కూడా ఆపేశారుచంద్రబాబు కూటమిలో చేరగానే వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారువాలంటీర్లతో పెన్షన్ల పంపిణీని ఆపేసి వృద్దుల మరణాలకు కారణమయ్యారుచంద్రబాబు ట్రాప్ లో పడవద్దని ఈసీకి హితవు పలుకుతున్నాంల్యాండ్ టైట్లింగ్ యాక్టుపై చంద్రబాబు, పవన్ నిన్న మోదీని ఎందుకు ప్రశ్నించలేదు?12:48 PM, May 7th, 2024ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో టీడీపీ షాక్టీడీపీ వీడి వైస్సార్‌సీపీలో  చేరిన 50 మంది టీడీపీ కార్యకర్తలుపార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్12:43 PM, May 7th, 2024రాజానగరంలో ఎన్నికల ప్రచారసభలో సీఎం జగన్‌•    క్రమం తప్పకుండా ఇన్ని రోజులు పథకాలిచ్చిన జగన్‌కు ఇప్పుడే ఇబ్బందులు..•    మీ బిడ్డ జగన్‌ను ఇబ్బందులు పెడితే నా అక్కచెల్లెమ్మల కుటుంబాలు ఊరుకుంటాయా?•    ఓటు అనే అస్త్రంతో చంద్రబాబు చేస్తున్న కుట్రలకు గట్టిగా బుద్ధి చెప్పండి..•    వీళ్లు ఎవ్వరు అడ్డుకున్నా కూడా మీ బిడ్డ విజయాన్ని ఏ ఒక్కడూ ఆపలేడు..•    జూన్ 4న అధికారంలోకి వచ్చిన తర్వాత వారం రోజుల్లో ఈ బటన్లన్నీ క్లియర్ చేస్తాం..12:36 PM, May 7th, 2024రాజానగరంలో ఎన్నికల ప్రచారసభలో సీఎం జగన్‌•    చంద్రబాబు ఢిల్లీ వాళ్లతో కలిసి కుట్రలు చేస్తూ పథకాలు ఆపుతున్నారు..•    జగన్‌ను బటన్లు నొక్కిన పథకాల సొమ్మును ప్రజలకు అందకుండా చేస్తున్నారు..•    జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ కోర్టులో కేసులు వేసేలా ప్రజాస్వామ్యం దిగజారిపోయింది..•    ఆన్‌గోయింగ్ స్కీమ్స్ కు మాత్రమే జగన్ బటన్లు నొక్కాడు.. అవేమీ కొత్తవి కాదు..•    అసెంబ్లీలో బడ్జెట్ ద్వారా ఈ పథకాలకు ఆమోదం కూడా తెలిపారు..•    జగన్‌ను కట్టడి చేయడం కోసం ఢిల్లీతో కుట్రలు పన్నిన దౌర్భాగ్యపు పరిస్థితిరాజానగరంలో సీఎం జగన్‌ పూర్తి ప్రసంగం కోసం క్లిక్‌ చేయండి 12:28 PM, May 7th, 2024రాజానగరంలో ఎన్నికల ప్రచారసభలో సీఎం జగన్‌•    2019లో బాబుపై ప్రతీకారంగా ప్రజలంతా సైకిల్‌ను ముక్కలుగా విరిచి పక్కకు పడేశారు•    ఆ తుప్పు పట్టిన సైకిల్‌కు రిపేర్లు చేయాలని చంద్రబాబు చాలా కష్టపడుతున్నాడు•    రిపేర్ చేసే భాగంలో ముందుగా ఎర్ర చొక్కాల దగ్గరకు వెళ్లారు.. ఫలితం లేదు•    దత్తపుత్రుడి సైకిల్ క్యారేజ్‌పై మాత్రమే కూర్చుంటా.. టీ గ్లాస్ పట్టుకుంటా అన్నాడు•    ఆ తర్వాత వదినమ్మను ఢిల్లీ పంపించాడు.. అక్కడి మెకానిక్స్‌ను ఇక్కడికి దింపారు•    ఢిల్లీ మెకానిక్స్ అంతా ఏపీకి వచ్చి తుప్పుపట్టిన సైకిల్ చూశారు•    సైకిల్‌కు హ్యాండిల్, సీటు, పెడల్స్, చక్రాలు లేదని ఢిల్లీ మెకానిక్స్ గుర్తించారు•    ఇంత తుప్పు పట్టిన సైకిల్‌ను ఎలా బాగుచేస్తామని ఢిల్తీ మెకానిక్స్ అడిగారు•    చంద్రబాబు పిచ్చి చూపులు చూసి బెల్ ఒక్కటే మిగిలిందని కొట్టడం మొదలు పెట్టాడు•    చంద్రబాబు కొడుతున్న ఆ బెల్ పేరే అబద్ధాల మేనిఫెస్టో 11:49 AM, May 7th, 2024బోండా ఉమా కొడుకి దౌర్జన్యంYSRCP ఎస్సీ మహిళా కార్యకర్తల పై టీడీపీ అభ్యర్ధి బోండా ఉమా కుమారుడు దాడి  ప్రచారం చేస్తున్న వైస్సార్‌సీపీ మహిళా కార్యకర్తలను దుర్భాషలాడిన బోండా కుమారుడు రవితేజ.నున్నా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుబాధితులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ ,ఎమ్మెల్సీ రుహుల్లాతన ఓటమి ఖాయమని బొండా ఉమా తెలుసుకున్నాడు: వెలంపల్లి శ్రీనివాసరావుగెలుపు కోసం అరాచకాలకు పాల్పడుతున్న బోండా వర్గీయులుప్రజాభిమానం కోల్పోవడంతో గుండాగిరిని నమ్ముకుంటున్న టీడీపీసెంట్రల్ నియోజకవర్గంలో వైసిపి పై టీడీపీ చేసిన రెండో దాడిటీడీపీని చీదరించుకుంటున్న ఓటర్లువైస్సార్‌సీపీ కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ.దౌర్జన్యాలకు పాల్పడుతున్న టీడీపీపై కేసులు నమోదు చేయాలని ఫిర్యాదు 11:37 AM, May 7th, 2024జననేత కోసం జనంఎన్నికల ప్రచారంలో భాగంగా రాజానగరం నియోజకవర్గం కోరుకొండకు చేరుకున్న సీఎం జగన్సీఎం జగన్ సభకు పెద్ద సంఖ్యలో హాజరైన అభిమానులు కార్యకర్తలుమరి కొద్దిసేపట్లో సభ స్థలానికి చేరుకున్న సీఎం జగన్హెలిపాడ్ నుండి సభాస్తలికి మధ్య కిలోమీటర్ రోడ్డు షోసీఎం జగన్ చూసేందుకు రోడ్డుకు ఇరువైపులా నిలబడి బారులు తీరిన అభిమానులు11:11 AM, May 7th, 2024పచ్చ కుట్రలు! ఏపీ కోర్టులో పిటిషన్‌అమల్లో డీబీటీ పథకాలను ఈసీ అడ్డుకోవడంపై హైకోర్టును ఆశ్రయించిన లబ్ధిదారులువిద్యాదీవెన, ఇన్పుట్ సబ్సిడీ నిధులను అడ్డుకోవడంపై కోర్టుకు ఎక్కిన విద్యార్థులు, రైతులుచేయూత కింద నిధుల విడుదలను ఈసీ నిరాకరించడంపై హైకోర్టులో మహిళా సంఘం సభ్యుల పిటిషన్లంచ్‌ మోషన్‌ కింద విచారించనున్న ఏపీ హైకోర్టుచంద్రబాబే ఇలా చేయించాడని మండిపడుతున్న లబ్ధిదారులు11:02 AM, May 7th, 2024షర్మిలపై కేసు నమోదుఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పై కేసు నమోదైంది. కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిల పోటీ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి వివేకా హత్య కేసు ప్రస్తావన కేసు నమోదు చేసిన వైఎస్సార్‌ జిల్లా బద్వేలు పోలీసులు ఎన్నికల వేళ వివేకా హత్య కేసు అంశంపై మాట్లాడొద్దని ఇటీవల షర్మిలను ఆదేశించిన  కడప కోర్టు10:32 AM, May 7th, 2024నంద్యాలలో టీడీపీ శ్రేణుల బరితెగింపుబనగానపల్లె పట్టణంలో బరితెగించిన టీడీపీ నాయకులువైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచార రథం తిరగొద్దు అంటూ టీడీపీ నాయకులు బెదిరింపులు  బనగానపల్లె పట్టణం కూరగాయల మార్కెట్ వద్ద వైఎస్సార్‌సీపీ శ్రేణుల మీద టీడీపీ శ్రేణుల జులుంవైఎస్సార్‌సీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి తరఫున ప్రచారం నిర్వహిస్తున్న ఆయన సతీమణి కాటసాని జయమ్మ, కోడలు మేధా శ్రీ రెడ్డిఅదే సమయంలో కూరగాయల మార్కెట్ లో ప్రచారానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరారెడ్డివైఎస్సార్‌సీపీ ప్రచార రథాలు ఇక్కడ తిరగొద్దంటూ గొడవగాయపడ్డ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఆస్పత్రికి తరలింపు10:29 AM, May 7th, 2024మరోసారి పేదల గొంతు నొక్కిన చంద్రబాబు!ఈసీకి ఫిర్యాదులు చేసిన చంద్రబాబు.ఇప్పటివరకూ కొనసాగుతున్న‌ సంక్షేమ పధకాలైన వైయస్ఆర్ చేయూత, వైయస్ఆర్ ఆసరా, వైయస్ఆర్ ఈబీసీ నేస్తం, రైతులకి ఇన్‌పుట్ సబ్సిడీ, జగనన్న విద్యా దీవెన, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లకు ఈసీ బ్రేక్‌మొన్నటికి మొన్న వాలంటీర్లను అడ్డుకుని అవ్వాతాతల ప్రాణాలతో చెలగాటం. ఇప్పుడు అక్కచెల్లెమ్మలు, విద్యార్థులు, రైతులకి సాయం అందకుండా వారి జీవితాలతో ఆడుకునే కుట్ర.పేదలన్నా.. సంక్షేమ పథకాలన్నా చంద్రబాబుకి ఎంత కడుపుమంటో చూడండి!పొరపాటున చంద్రబాబు అధికారంలోకి వస్తే పేదలకి ఇప్పుడు అందుతున్న ఏ సంక్షేమ పథకం కూడా అందదు!పేదవాళ్లంటే నీకు ఎందుకు అంత కడుపుమంట చంద్రబాబూ?10:19 AM, May 7th, 2024ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌.. TDPకి ఏపీ బీజేపీ షాక్‌ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై టీడీపీ తప్పుడు ప్రచారాన్ని ఖండించిన ఏపీ బీజేపీ!ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై బీజేపీ హాట్ కామెంట్స్దేశంలో భూహక్కుల పరిరక్షణకోసం నీతి అయోగ్ ప్రతిపాదించిన ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ కు తప్పుడు భాష్యం చెప్పడం ద్వారా సాధించేమీ లేదుఎన్నికల వేళ ఇలాంటివి సృష్టించడం వల్ల కూటమికి ప్రయోజనం కంటే నష్టమే జరుగుతుందని విజ్ణులు గుర్తించాలికూటమి అధికారంలోకి వస్తే ఈ చట్టం అమలు చేయాల్సి ఉంటుందిఎక్స్ లో ట్వీట్ చేసిన‌ బీజేపీ సీనియర్ నేత లక్ష్మిపతిరాజు10:00 AM, May 7th, 2024మొన్న వృద్ధుల కడుపు.. ఇవాళ రైతుల కడుపు కొట్టిన చంద్రబాబుచంద్రబాబు మొన్న వృద్ధుల కడుపు కొట్టాడు.. ఇప్పుడు రైతుల కడుపు కొట్టాడు..రైతుల ఉసురు చంద్రబాబుకి కచ్చితంగా తగులుతుంది. ఫీజు రియంబర్స్ రాకుండా అడ్డుకుని విద్యార్థులను రోడ్డున పడేశాడు..ఇంటికొచ్చే పింఛను చంద్రబాబు అడ్డుకున్నారు.. చంద్రబాబు ఇవే చివరి ఎన్నికలు..కావలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి 420..  అయన చేయని అక్రమాలు లేవు..ప్రభుత్వ భూముల కబ్జా దగ్గర నుంచి.. బ్లాక్ మెయిలింగ్ దాకా ఆయన సిద్ధహస్తుడుతెలుగుదేశం పార్టీ కుట్రలపై కావలి ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఫైర్9:49 AM, May 7th, 2024ఏపీలో ఈసీ పని తీరుపై వైస్సార్‌సీపీ ఆగ్రహంకొనసాగుతున్న పథకాల నిధుల విడుదలకు ఈసీ అనుమతి నిరాకరణలెఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే దాకా నిధుల విడుదలకు నోఈసీ అనుమతి ఇవ్వకపోవడం ఏంటి?: YSRCPతెలంగాణలో సబ్సిడీ ఇన్‌ఫుట్‌కు అనుమతి ఈసీ ఎలా ఇచ్చింది అంటూ ప్రశ్నఏపీలో మాత్రమే ఈసీ ఎందుకు వివక్ష చూపుతోంది9:39 AM, May 7th, 2024అన్నమయ్య రాజంపేటలో టీడీపీకి ఎదురుదెబ్బఅన్నమయ్య జిల్లా రాజంపేట మండల పరిధిలోని ఊటుకూరు గ్రామంలో టిడిపికి గట్టి ఎదురు దెబ్బ...టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరిన వంద కుటుంబాలుతెలుగు తమ్ముళ్లకు YSRCP కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానం పలికిన ఎమ్మెల్యే అభ్యర్థి అకేపాటి అమరనాథ్ రెడ్డిజగనన్న అందిస్తున్న జనరంజక పాలన మెచ్చి వైఎస్సార్‌సీపీలో చేరామన్న స్థానికులు9:23 AM, May 7th, 2024డబ్బుతో పట్టుబడ్డ టీడీపీ నేతపెందుర్తి నియోజకవర్గ పరిధిలోని వేపగుంట మీనాక్షి కన్వెన్షన్ వద్ద నగదుతో దొరికిన టీడీపీ నేతటీడీపీ నేత దంతులూరి వెంకట దుర్గ ప్రశాంత్ వర్మ నేతృత్వంలో అక్రమంగా తరలిస్తున్న రూ.10 లక్షలను స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు  ⁠ప్రధాని మోదీ సభకు జనాలను తరలించిన జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు!జనాలకు నగదు పంపిణీ చేయడానికే తరలిస్తున్నారనే సమాచారంతో పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు⁠తనిఖీల్లో వర్మ వద్ద లభించిన రూ.10 లక్షలకు ఎటువంటి ఆధారం లేకపోవడంతో సీజ్ చేసి పెందుర్తి పోలీసులకు అప్పగింత8:50 AM, May 7th, 2024జనంలోకి జగన్‌ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డినేడు మూడు జిల్లాల్లో ప్రచార భేరీరాజమండ్రి రాజానగరం నియోజకవర్గం పరిధిలోని కోరుకొండ జంక్షన్‌లో ప్రచారంమధ్యాహ్నం శ్రీకాకుళం ఇచ్ఛాపురం మున్సిపల్‌ ఆఫీస్‌ సెంటర్‌లో ప్రచారంవిశాఖపట్నం లోక్‌సభ పరిధిలోని గాజువాక నియోజకవర్గం గాజువాక సెంటర్‌లో ప్రచారం8:23 AM, May 7th, 2024నేడు పవన్‌  ప్రచారం ఇలా..ప్రకాశం దర్శిలో పవన్‌ కల్యాణ్‌ ప్రచారంసాయంత్రం తిరుపతిలో చంద్రబాబుతో కలిసి బహిరంగ సభలో పాల్గొననున్న పవన్‌8:01 AM, May 7th, 2024హవ్వా.. ఇదేంది బాబూ!తీవ్రరూపం దాల్చిన చంద్రబాబు బూతు పురాణంపూర్తిగా విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్న చంద్రబాబుతనను ప్రజలు నమ్మట్లేదని  ప్రచారంలో బూతుల పర్వం అందుకున్న టీడీపీ అధినేతసీఎం జగన్ ను కొట్టండి అనే దగ్గర నుంచి.. ఇప్పుడు చంపండి, నరకండి అనే స్థాయికి చేరిన చంద్రబాబుఓటమి భయంతో చంద్రబాబుకు మతి చెడిందన్న అనుమానంలో ప్రజలుబాబు బూతు పురాణంపై ఈసీకి ఫిర్యాదు చేసిన వైస్సార్‌సీపీచంద్రబాబుపై చర్యలకు వెనుకడుగు వేస్తున్న ఎన్నికల కమిషన్7:25 AM, May 7th, 2024తప్పుడు పోస్టులపై ఈసీ సీరియస్‌.. కీలక ఆదేశాలుసోషల్ మీడియా లో తప్పుడు పోస్టులపై ఎన్నికల సంఘం సీరియస్‌ కీలక ఆదేశాలు జారీ చేసిన ఈసీమహిళల్ని కించపరచడం,మైనర్లతో ప్రచారం,జంతువులకు హాని తలపెడుతున్న వీడియోలు,ఫోటోలు నిషేధం.అలాంటి పోస్టులు ఈసీ నోటీసుకు వచ్చిన మూడు గంటల్లో గా తొలగించాలినిబంధనలు పాటించకుంటే ఆయా పార్టీల నాయకులపై కేసులు పెడతామని హెచ్చరిక. 6:59 AM, May 7th, 2024చిలకటూరిపేట పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌.. ఈసీ సీరియస్‌ చిలకలూరిపేటలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో నిర్లక్ష్యంగా  వ్యవహరించిన అధికారులపై చర్యలకు ఈసీ ఆదేశాలు.ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ బదులు ఈవీఎం బ్యాలెట్(టెండర్ బ్యాలెట్) పేపర్లను ఇచ్చిన అధికారులు.అధికారుల నిర్లక్ష్యంతో 1219 మంది ఉద్యోగుల ఓట్లు చెల్లని వైనం.వీరందరికీ తిరిగి రెండు రోజుల్లోగా పోస్టల్ బ్యాలెట్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు.సంబంధిత అధికారులపై ఈనెల 9లోగా క్రమశిక్షణ చర్యలకు ఈసీ ఆదేశాలు6:45 AM, May 7th, 2024చంద్రబాబుపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్సీఎం  జగన్‌ను ఉద్దేశించి చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపై సీఈసీ ఆగ్రహంఎన్నికల్ కోడ్ ను అతిక్రమించటంపై సీరియస్బహిరంగ సభల్లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని వార్నింగ్ఏప్రిల్ 6న పెదకూరపాడు, 10న నిడదవోలు, తణుకు, 11న అమలాపురం, 15న పలాస, 17న పెడనలో జరిగిన సభల్లో సీఎంని ఉద్దేశించి తీవ్ర పదజాలంతో మాట్లాడిన చంద్రబాబు6:37 AM, May 7th, 2024భీమవరంలో టీడీపీ, జనసేన మధ్య రగడ..భీమవరంలో తెలుగు తమ్ముళ్లని ఉతికారేసిన జన సైనికులు!జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి ఆంజనేయులుకి ఏమాత్రం సహకరించని టీడీపీ.ప్రచారంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య కవ్వింపులతో మొదలైన రగడసర్దిచెప్పేందుకు వెళ్లిన టీడీపీ నాయకుల ముందే బాహాబాహీ.చేతికి దొరికిన వాటితో చితక్కొట్టిన జనసైనికులుఈ దెబ్బతో భీమవరంలో జనసేన గెలుపుపై ఆశలు గల్లంతు!6:30 AM, May 7th, 2024అబద్దం.. వాస్తవంఎన్నికల వేళ కూటమి కుట్రలుఏపీపై ఢిల్లీ పెద్దల తప్పుడు ప్రకటనలువాస్తవాలతో వివరించే యత్నం వీడియో పోస్ట్‌ చేసిన వైస్సార్‌సీపీమన రాష్ట్రంపై డిల్లీ పెద్దల తప్పుడు ప్రచారాలు Vs అసలు వాస్తవాలు! 💥#FactCheck#ProgressiveAP#YSJaganDevelopsAP #DevelopmentInAP pic.twitter.com/G2KbNXK9Pl— YSR Congress Party (@YSRCParty) May 6, 2024 

Ksr Comments On AP Power Projects
బెడిసి కొట్టిన ఈనాడు స్టోరీ.. రామోజీ షాక్స్‌!

ఆంధ్రప్రదేశ్‌లో ఇన్ని పరిశ్రమలు వస్తున్నాయా? ఇంత అభివృద్దికి అడుగులు పడుతున్నాయా? నిజంగా ఏపీ ప్రజలకు వీటి గురించి పూర్తి వివరాలు తెలియవంటే ఆశ్చర్యం కాదు. కాని ద్వేష భావంతో, ప్రభుత్వంపై వ్యతిరేకత సృష్టించడం కోసం ఈనాడు మీడియా రాసిన ఒక స్టోరీ అందరూ చదవవలసిందే. బహుశా ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా ఇంత వివరంగా తన ప్రభుత్వం ఇన్ని కొత్త పరిశ్రమలను  తీసుకు వస్తున్న సంగతి ప్రజలకు చెప్పినట్లు అనిపించదు. శుక్రవారం నాడు ఈనాడు దినపత్రికలో "అంతా.. ఆ ఏడు చేపలకే" అంటూ ఒక స్టోరీ ఇచ్చారు. ఈనాడు లక్ష్యం ఏమిటంటే ఏడు పెద్ద కంపెనీలకు జగన్ లబ్ది చేకూర్చే యత్నం చేశారని, ఏపీలో వాటికి పలు భారీ పరిశ్రమలు స్థాపించేందుకు అవకాశం ఇచ్చారని ప్రజలు అనుకోవాలని వారు ఈ కథనాన్ని ఇచ్చారు. అది చదివిన తర్వాత నాకైతే జగన్‌పై మరింత గౌరవం పెరిగింది. ఎందుకంటే ఏపీకి ఇన్ని ముఖ్యమైన పరిశ్రమలు తీసుకు రావడానికి జగన్ చేసిన కృషి ఈ కథనం ద్వారా తెలిసింది. మరి ఇంతకాలం ఇదే ఈనాడు మీడియా ఏమని ప్రచారం చేసింది? ఏపీకి అసలు పరిశ్రమలు రావడం లేదని కదా! పారిశ్రామికవేత్తలు రావడం లేదని కదా? పెట్టుబడులు రావడం లేదని కదా! ఈనాడు తాజాగా ఇచ్చిన కథనం ప్రకారం 2.63 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను ఏడు కంపెనీలవారు చేపట్టారని. ఇది మంచిదే కదా? అసలే పరిశ్రమలే రావడం లేదని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు ముందుకు రావడం, అవన్ని పురోగతిలో ఉండడం స్వాగతించవలసిన విషయం కదా! ఈనాడు మీడియాకు, దాని అధిపతి రామోజీరావుకు ఏపీలో పరిశ్రమలు, కొత్త ప్రాజెక్టులు రావడం ఇష్టం లేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కొన్ని ఎస్‌ఈజెడ్‌లు వచ్చాయి. అప్పుడు ఈ మీడియా కాని, తెలుగుదేశం కాని చేయని యాగీ లేదు. విదేశాలకు ఎగుమతులు చేసే ఉత్పత్తులు తయారు చేసే కంపెనీల ఏర్పాటుకు వీటిని కేంద్రం ప్రతిపాదించింది. అందుకోసం భూములు సేకరిస్తుంటే విపరీతమైన వ్యతిరేక ప్రచారం చేశాయి.టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రకరకాలుగా అడ్డంకులు సృష్టించేవారు. సోనియాగాంధీ, చంద్రబాబు, సీబిఐ కుమ్మక్కై వాన్‌పిక్ రాకుండా చేశారు. చీరాల, రేపల్లె ప్రాంతంలో వాన్‌పిక్ పారిశ్రామికవాడను ఏర్పాటు చేయాలని పదమూడు వేల ఎకరాల భూములను ఆ సంస్థ కొనుగోలు చేసింది. అందులో ఎక్కువ భాగం వ్యవసాయానికి పనికిరాని భూములే. కొంత ప్రభుత్వ భూమి. కాని ఆ భూమిని సేకరించిన నిమ్మగడ్డ ప్రసాద్‌ను జగన్‌పై ఉన్న ద్వేషంతో వీరు కేసులలో ఇరికించి జైలులో పెట్టారు. ఆ భూములలో కొత్త పరిశ్రమలు పెట్టడానికి అడ్డు పడకుండా ఉంటే ఈపాటికి ఆ ప్రాంతం బ్రహ్మాండంగా తయారై ఉండేదేమో! వైఎస్ హయాంలో సూళ్లూరు పేట సమీపంలో శ్రీసిటీ పేరుతో ఒక పారిశ్రామికవాడ నిర్మించాలని తలపెట్టారు. అప్పట్లో ఇదే ఈనాడు మీడియా భూ సేకరణను దోపిడీ కింద అభివర్ణించి పలు కధనాలు రాసేది. సెజ్‌లలో ఉద్యోగాలు ఏవి అంటూ దిక్కుమాలిన విమర్శలు చేసేది. అయినా వైఎస్ రాజశేఖరరెడ్డి వెనక్కి తగ్గకుండా శ్రీసిటీ ఏర్పాటుకు సహకరించారు. ఆ సంస్థ యజమానులు స్థానిక రైతుల సహకారంతో పారిశ్రామిక వాడను రూపొందించారు.ఇప్పుడు అది నిజంగానే శ్రీసిటీ అయింది. అక్కడి ప్రజలకు ఎంతగానో మేలు చేస్తోంది. 2016లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఇదే ఈనాడు మీడియా ఏమని రాసిందో తెలుసా?బతుకు చిత్రాన్ని మార్చిన సిరుల సీమ శ్రీసిటీ అని రాశారు. అంటే వైఎస్ అధికారంలో ఉంటే వ్యతిరేకించడం, చంద్రబాబు సీఎంగా ఉంటే భజన చేయడం. ఇదే ఈనాడు నైజం. ఇప్పుడు కూడా ఏపీలో కొత్త పరిశ్రమలు వస్తుంటే ఈ మీడియా ఏడ్చిపోతోంది. షిర్డి సాయి ఎలక్ట్రికల్ సంస్థ సుమారు 18 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను చేపట్టింది. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌లకు మీటర్లు పెట్టడం వీటిలో ఒకటి. కేంద్ర ప్రుభుత్వం చేసిన సూచనల ప్రకారం స్మార్ట్ మీటర్లు బిగిస్తుంటే, దానివల్ల రైతులకు ఏదో నష్టం జరిగిపోతుందని ఇదే మీడియా ప్రచారం చేసింది. చంద్రబాబు నాయుడు అయితే ఈ మీటర్లు రైతులకు ఉరి అంటూ తప్పుడు ప్రచారం చేశారు. అయినా జగన్ వెనక్కి తగ్గలేదు. దానివల్ల రైతులకు ఎలాంటి నష్టం ఉండదని, ప్రభుత్వం సరపరా చేసే విద్యుత్‌కు లెక్కలు ఉంటాయని, రైతులకు డబ్బు జమ చేస్తామని చెప్పి ముందుకు వెళ్లారు.ఈ ప్రాజెక్టు పై ఎంత అబద్దపు ప్రచారం చేసినా, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విద్యుత్ శాఖ అధికారులు వివరణలు ఇచ్చినా, ఈనాడు ఆరోపణలను ఖండించినా, వీరి పద్దతి మాత్రం మారలేదు. అదే సమయంలో ఈ మీటర్లు బిగించాలని చెప్పిన బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు. ఆయన రెండు నాలుకల ధోరణికి ఇలాంటి ఉదాహరణలు ఎన్నో కనిపిస్తాయి. సీలేరు జల విద్యుత్ ప్రాజెక్టులో 478 కోట్లతో రెండు అదనపు యూనిట్లు స్థాపిస్తున్నారు. ఇది టెండర్ ఆధారంగానే ప్రాజెక్టుల కేటాయింపు జరుగుతుంది.అయినా ఈనాడుకు ఇష్టం లేదు. అలాగే వైఎస్‌ఆర్ కడప జిల్లా సోమశిల వద్ద 900 మెగావాట్ల, ఎర్రవరం వద్ద 1200 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టులను ప్రభుత్వం ఇచ్చింది. ఇందులో ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ ఉండదు. కంపెనీ వారే పెట్టుబడి పెట్టి విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. ఇందులో రామోజీకి వచ్చిన బాధ ఏమిటో తెలియదు. రామోజీ ఫిలింసిటీ స్థాపించినప్పుడు వేల ఎకరాలను కొనుగోలు చేశారు. దానికి ఎవరు అనుమతించారు. అసలు ఆ ప్రాజెక్టు స్థాపనకు ఏమైనా టెండర్ పిలిచారా? అయినా స్థాపించలేదా? అందులో తప్పు లేదు.కాని ఇతర కంపెనీలు ఏవైనా పరిశ్రమలు పెడుతుంటే మాత్రం ఈ మీడియా అడ్డం పడుతుంటుంది. ఈనాడు మీడియా అభివృద్ది నిరోధకంగా మారింది. విచిత్రం ఏమిటంటే షిర్డిసాయి ఎలక్టికల్ కంపెనీ తెలుగుదేశం పార్టీకి నలబై కోట్ల రూపాయల విరాళం ఇచ్చింది. ఈ విషయం మాత్రం గోప్యంగా ఉంచారు. అదే మెఘా కంపెనీ వైఎస్సార్సీపీకి 37 కోట్ల విరాళం ఇచ్చింది. దానిని మాత్రం రాసేశారు. మరి అదే సంస్థ తెలుగుదేశంకు పాతిక కోట్లు ఇచ్చింది. దానిని కప్పిపుచ్చారు. అసలు గుర్తింపేలేని జనసేనకు ఐదు కోట్లు ఇచ్చారు. మరి దీనిని ఏమంటారో రామోజీనే చెప్పాలి. జిందాల్ కంపెనీ 42500 కోట్ల విలువైన ప్రాజెక్టులు చేపట్టడానికి ముందుకు వచ్చింది. కడప స్టీల్ ప్లాంట్, రామాయపట్నం వద్ద రెండు కాప్టివ్ బెర్తుల నిర్మాణం, అనంతపురం, వైఎస్‌ఆర్ కడప జిల్లా. నంద్యాల ప్రాంతాలలో 2500 మెగావాట్ల సౌర విద్యుత్ పదివేల మెగావాట్ల పవన విద్యుత్, 1500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులను ఈ సంస్థ చేపడితే దానిపైన విమర్శలు చేశారు. వీరికి మైనింగ్ లీజులు కేటాయించారన్నది ఈనాడు ఏడుపు. ఖనిజం లేకుండా స్టీల్ ప్లాంట్ ఎలా వస్తుందో వీరే చెప్పాలి.మెఘా కంపెనీ 30445 కోట్ల విలువైన ప్రాజెక్టులు చేపడుతోంది. సీలేరు వద్ద 12264 కోట్లతో పిఎస్‌పి ప్రాజెక్టును ఈ సంస్థ స్థాపిస్తోంది. అది వీరికి కడుపునొప్పిగా మారింది. జెన్‌కో టెండర్ ద్వారానే దీనిని కేటాయించినా, తప్పే నట. మచిలీపట్నం పోర్టు పనులు కూడా టెండర్ ద్వారానే ఈ సంస్థ చేస్తోంది. పోలవరం ప్రాజెక్టును, జల విద్యుత్ ప్రాజెక్టును కూడా నిర్మిస్తున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం కూడా ఈ కంపెనీ అమలు చేస్తోంది. ఇంత అభివృద్ది జరుగుతుంటే, ఈనాడుకు ఇదంతా మింగుడుపడడం లేదు. అందుకే ఇంత బురదచల్లుతూ స్టోరీలు ఇస్తోంది. విశాఖలో అదానికి డేటా సెంటర్ నిర్మాణానికి భూమి ఇవ్వడం కూడా నేరమేనట. అదాని బిజినెస్ పార్క్ ఏర్పాటు చేస్తుంటే వీరు కుళ్ళుతున్నారు. అదే అమరావతి గ్రామాలలో సింగపూర్ రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములను చంద్రబాబు ఇస్తే మాత్రం గొప్ప విషయం అని రామోజీ ప్రచారం చేశారు. తీరా చూస్తే ఈ కంపెనీలను పట్టుకువచ్చిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్ అవినీతి ఆరోపణలతో పదవి పోగొట్టుకున్నారు. అలాగే దుబాయికి చెందిన ఒక సంస్థ పేరుతో వంద ఎకరాలు ఆస్పత్రి నిమిత్తం ఇచ్చారు. ఆస్పత్రి రాలేదు కాని, ఆ కంపెనీ యజమాని అక్కడ చేసిన నేరాలకు జైలుకు వెళ్లారు.ఇలాంటి వాళ్లు చంద్రబాబుకు స్నేహితులు. దేశంలోనే పెద్ద కంపెనీలకు వివిధ ప్రాజెక్టులను అప్పగిస్తే నేరం చేసినట్లు ఈనాడు రామోజీ రాయించేస్తున్నారు. అంటే ఈ కంపెనీలు ఏవీ రాకుండా ఉంటే, ఏపీలో ఉద్యోగాలు పెరగకుండా ఉంటే వీరికి సంతోషం అన్నమాట. ఈ ప్రాజెక్టులను కనుక చంద్రబాబు టైమ్‌లో చేపట్టి ఉంటే అబ్బో అంత గొప్ప, ఇంత గొప్ప అని ప్రచారం చేసేవారు. రామాయపట్నం ఓడరేవు వద్ద ఇండోసోల్ సంస్థ సోలార్‌పానెల్ ప్రాజెక్టును ఆరంభిస్తే, ఎంత దారుణమైన కథనాలు ఈనాడు మీడియా ఇచ్చిందో గమనిస్తే వీళ్లు అసలు మనుషులేనా అన్న అనుమానం వస్తుంది. 43 వేల కోట్ల పెట్టుబడి పెట్టి ఈ కంపెనీ ఏర్పాటు అవుతుంటే సంతోషించాల్సింది పోయి విషం చిమ్ముతున్నారు. పైగా వారి ఖర్చుతో భూములు కొనుగోలు చేస్తుంటే వీరికి తీటగానే ఉంది.అక్కడ రైతులు స్వచ్చందంగా ముందుకు వచ్చి భూములు అమ్ముతున్నారు. అది వీరికి గిట్టడం లేదన్నమాట. అలాగే అరవిందో సంస్థ పలు ప్రాజెక్టులను నిర్మిస్తోంది. వాటిపై కూడా విషం చిమ్మారు. ఈ ప్రాజెక్టులు అన్నీ ప్రజలకు ఉపయోగపడేవి. ప్రభుత్వం ఖర్చు కాకుండా, ప్రభుత్వానికి ఆదాయం ఇచ్చేవి. అయినా ఈనాడు మీడియా అదేదో ఘోరం జరిగినట్లు దారుణమైన కథనాలు ప్రచురిస్తోంది. ఈ మొత్తం కధనం చదివితే ఇన్ని వివరాలను నెగిటివ్‌గా ఇచ్చినా ఈ స్థాయిలో పరిశ్రమలు వస్తున్నాయని తనకు తెలియకుండానే ఈనాడు మీడియా అంగీకరించింది. నిజంగా ఇవన్ని ఆచరణలోకి వస్తే ఏపీకి ఎంతో మేలు జరుగుతుంది. అందుకు ముఖ్యమంత్రి జగన్‌ను అభినందించాలి.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement

ఫోటో స్టోరీస్

View all