Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

AP Elections 2024: CM Jagan Last Punch At Pawan Pithapuram
పిఠాపురంతోనే సీఎం జగన్‌ లాస్ట్‌ పంచ్‌

గుంటూరు, సాక్షి: లాస్ట్‌ పంచ్‌ మనదైతే ఆ కిక్కే వేరప్పా.. పవన్‌ కల్యాణ్‌ సినిమాలోని డైలాగ్‌ ఇది. కానీ, రియల్‌లైఫ్‌లో పవన్‌కు ఆ పంచ్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రుచిచూపించన్నారా?. ఎన్నికల ప్రచారంలో ఇవాళ ఆఖరు తేదీ కాగా.. వైఎస్సార్‌సీపీ తరఫున చివరి ప్రచార సభను పిఠాపురంతోనే ముగించబోతున్నారు ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌.ఒకవైపు ఓట్ల కోసం కూటమి నేతల పరుగులు.. మరోవైపు 59 నెలల పాలన, జరిగిన సంక్షేమాన్ని వివరిస్తూనే ప్రత్యర్థులపై పంచ్‌లతో సాగిన సీఎం జగన్‌ ప్రసంగాలు.. అన్నీ.. అన్నీ.. ఇవాళ్టి సాయంత్రంతో బంద్‌ కానున్నాయి. ఆ వెంటనే ఏపీలో సైలెంట్‌ పీరియడ్‌ మొదలుకానుంది. అయితే ఈ ఎన్నికల ప్రచారం సీఎం జగన్‌ దూకుడుతో.. ప్రత్యర్థి పార్టీలు ఏమాత్రం పోటీ పడలేకపోయాయన్నది వాస్తవం. ఇక సంక్షేమ పాలనతో దేశ రాజకీయాల్లోనే ట్రెండ్‌ సెట్టర్‌గా మారిన సీఎం జగన్‌.. ప్రచారంలోనూ కొత్త ఒరవడి సృష్టించారు. ‌కనీవినీ ఎరుగని రీతిలో ఈసారి ఏపీలో ఎన్నికల ప్రచారం కొనసాగింది. అందుకు ప్రధాన కారణం.. సీఎం జగన్‌. ఎన్నికల కోసం పార్టీని ముందు నుంచే ‘సిద్ధం’ చేస్తూ వచ్చిన ఆయన.. 44 రోజుల్లో ఏకంగా 118 నియోజకవర్గాల్లో ప్రచారం చేసి రికార్డు సృష్టించారు. సిద్ధం సభలు, మేమంతా సిద్ధం బస్సు యాత్ర, ఆఖరికి ప్రచార సభలతో జనంలోకి వెళ్లి.. అపూర్వ స్పందన దక్కించుకున్నారు. ప్రచార వేదికలపై ర్యాంప్ వాక్‌.. ఏ రాజకీయ నాయకుడి నుంచైనా ఊహించగలమా?. ఈ చర్యతో తన ప్రత్యేకతను చాటుకోవడం మాత్రమే కాదు.. ప్రత్యర్థులు, పచ్చ మీడియా ఎంతగా విషం చిమ్మిన ప్రజలకు ఎప్పుడూ తాను దగ్గరేనని చాటి చెప్పారు. తన సభలకు వచ్చిన ప్రజలకు కృతజ్ఞతలతో ప్రసంగాలను మొదలుపెట్టి.. తనకు ఓటేస్తే పథకాల కొనసాగింపు, అదే చంద్రబాబుని నమ్మి ఓటేస్తే ఏం జరుగుతుందో గతాన్ని గుర్తు చేస్తూ మరి ఏపీ ప్రజలకు వివరించారాయన.బాబుకి ఓటేస్తే.. చంద్రముఖి నిద్రలేచి లక లక అంటూ ప్రజల రక్తం తాగుతుందిబాబుని నమ్మితే కొండచిలువ నోట్లో తలకాయ పెట్టినట్లేజగన్‌కు ఓటేస్తే పథకాల కొసాగింపు.. ఇంటింటా అభివృద్ధిఅదే పొరపాటున చంద్రబాబుకి ఓటేస్తే.. పథకాల ముగింపు, మళ్లీ మోసపోవడమేమంచి చేసిన ఫ్యాన్‌ ఇంట్లో ఉండాలి.. చెడు చేసిన సైకిల్‌ ఇంటి బయటే ఉండాలి.. తాగేసిన టీ గ్లాస్‌ సింక్‌లోనే ఉండాలి 59 నెలల పాలనలో జరిగిన విప్లవాత్మక మార్పులు, బడుల మొదలు గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, అక్కచెల్లెమ్మలకు, అవ్వతాతలకు, అన్ని వర్గాలకు చేకూరిన లబ్ధిని వివరిస్తూ.. డీబీటీ ద్వారా బటన్‌నొక్కి నేరుగా 2 లక్షల 70వేల కోట్ల రూపాయలను ఎలాంటి సంక్షేమానికి ఖర్చు చేశారో వివరిస్తూ వచ్చారు. ‘‘మీ ఇంట మంచి జరిగితేనే నాకు అండగా ఉండాలని.. ఆలోచనతో ఓటు వేయాలి’’ అని కోరిన ఏకైక నాయకుడిగా గుర్తింపు దక్కించుకున్నారు.ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయించే ఈ ఎన్నికలు పేదల తలరాతను మారుస్తాయని, పేదల మీద జగన్‌కు ఉన్నంత ప్రేమ మరెవ్వరికీ ఉండబోదని, పేద లబ్ధిదారులే తనకు స్టార్ క్యాంపెయినర్లు అని ప్రకటించుకుని.. వాళ్ల ద్వారానే జరిగిన సంక్షేమాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.మేనిఫెస్టోను చెత్త బుట్టలో వేసే సంప్రదాయాన్ని చెరిపేసి.. పవిత్రంగా భావిస్తూ 99 శాతం హామీల్ని అమలు చేయడం, ఇప్పుడూ ఆ మేనిఫెస్టోను ఇంటింటికి పంపించి ఆశీర్వదించడమని అడగడం.. అదే మేనిఫెస్టోతో 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రజల్ని ఏ విధంగా మోసం చేసింది పూస గుచ్చినట్లు వివరించారాయన. సంక్షేమం కొనసాగాలన్నా.. వలంటీర్లు పెన్షన్లు అందించాలన్నా.. ఫ్యాన్‌ గుర్తుకే ఓటేయాలని కోరారు. 175 సీట్లకు 175 అసెంబ్లీ సీట్లు, 25 కి 25 ఎంపీ సీట్లలో గెలుపే లక్ష్యంగా.. తగ్గేదేలే అంటూ ఎన్నికల కార్యాచరణ అమలు చేశారాయన.విస్తృత పర్యటనలతో ఎన్నికల ప్రచార భేరిలో దుమ్ము రేపిన సీఎం జగన్‌.. చివరి 12రోజుల్లో 34 సభల్లో పాల్గొని వైఎస్సార్‌సీపీ కేడర్‌లో ఫుల్ జోష్ నింపారు. ముఖ్యంగా.. కూటమి పార్టీల్లోని కీలక నేతల నియోజకవర్గాల్లో ఆయన ప్రచారానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన రావడం గమనార్హం. అదే సమయంలో ప్రత్యర్థుల పేర్లను ప్రస్తావించకుండానే సాగిన ఆయన ప్రసంగాలు ప్రజలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ సీఎం జగన్‌ చివరి మూడు ప్రచార సభలపై ఆసక్తి నెలకొంది. తొలుత చిలకలూరిపేట, కైకలూరు, ఆపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పోటీ చేయబోయే పిఠాపురంలో జరగబోయే ప్రచార సభతో సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో ఆ ఆఖరి ప్రచార సభలో సీఎం జగన్‌ ఎలాంటి పంచులు పేలుస్తారో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

Road Accident Leads To Seize Crores Of Cash At Nallajarla Highway
తూ.గో.లో వ్యాన్‌ బోల్తా.. కోట్లలో పట్టుబడిన డబ్బు

సాక్షి తూర్పుగోదావరి జిల్లా: ఓ రోడ్డు ప్రమాదంతో అక్రమంగా తరలిస్తున్న డబ్బులు పట్టుబడ్డాయి. ఘటనా స్థలంలో పోలీసులు పరిశీలనలో భారీగా తరలిస్తున్న నగదు గుట్టు బయటపడింది. వివరాలు.. నల్లజర్ల మండలం అనంతపల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. తౌడులో కలిపే కెమికల్‌ బస్తాలతో వెళ్తోన్న వ్యాన్‌ను వెనకనుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్‌ బోల్తా పడగా, క్లీనర్‌, డ్రైవర్‌కు గాయాలయ్యయి. వారిని ఆసుపత్రికి చేర్చి చికిత్స అందిస్తున్నారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ క్రమంలో వ్యాన్‌ అడుగు భాగంలో 7 అనుమానాస్పద బాక్స్‌లను పోలీసులు గుర్తించారు. ఉన్నతాధికారుల సమక్షంలో బాక్స్‌లను అనంతపల్లి టోల్‌ ప్లాజా వద్ద తెరిచి చూడగా భారీగా నగదు బయటపడింది. బాక్స్‌లోని డబ్బులను అధికారులు,ఎలక్షన్‌ ఫ్లైయింగ్‌ స్వ్కాడ్‌ లెక్కిస్తోంది. నగదు మొత్తం రూ. 7 కోట్ల వరకు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. వీటిని రాజమండ్రి నుంచి విజయవాడకు తరలిస్తున్నట్టుగా సమాచారం.ఆ సొమ్ము ఎవరిదై ఉంటుందన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఎన్నికలకు రెండు రోజుల ముందు భారీ గా నగదు లభ్యం కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

AP Elections 2024: May 11th Politics Latest News Updates Telugu
May 11th: ఏపీ ఎన్నికల సమాచారం

ఏపీ ఎన్నికలకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం..

Israel Envoy Gilad Erdan Destroys UN Backed Palestinian Bid For Membership
UNO: పాలస్తీనాకు భారత్‌ మద్దతు.. ఇజ్రాయెల్‌ ఏం చేసిందంటే?

ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు సభ్యత్వం కోరుతూ ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానం సందర్భంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ క్రమంలో పాలస్తీనాకు భారత్‌ మద్దతు పలికింది. అయితే ఈ తీర్మానానికి 12 సభ్యదేశాలు ఆమోదం తెలిపినప్పటికీ అమెరికా మాత్రం వీటో చేసింది. ఇక, ఇజ్రాయెల్‌ రాయబారి గిలాడ్‌ ఎర్డాన్‌ మాత్రం పాలస్తీనాకు అదనపు హక్కులు ఇవ్వడాన్ని నిరసిస్తూ చార్టర్‌ కాపీని చించేశారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.కాగా, ఇజ్రాయెల్‌ దాడుల నేపథ్యంలో పాలస్తీనాకు భారత్‌ మద్దతుగా నిలిచింది. ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు సభ్యత్వం కోరుతూ ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానానికి భారత్‌ అనుకూలంగా ఓటు వేసింది. అంతేకాకుండా పాలస్తీనా సభ్యత్వంపై భద్రతామండలి సానుకూలంగా వ్యవహరించాలని కూడా ఈ తీర్మానంలో పేర్కొన్నారు.ఇక, శుక్రవారం ముసాయిదా తీర్మానం ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ముందుకు వచ్చింది. ఐక్యరాజ్య సమితి చార్టర్‌లోని ఆర్టికల్ 4 ప్రకారం, పాలస్తీనాను సభ్యదేశంగా చేర్చుకోవాలని తీర్మానంలో ప్రతిపాదించారు. ఈ తీర్మానానికి భారత్ సహా 143 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. తొమ్మిది దేశాలు వ్యతిరేకించగా మరో 25 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయాయి. దీంతో, ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వానికి పాలస్తీనాకు అన్ని అర్హతలు ఉన్నట్టు ఈ తీర్మానం తేల్చింది. NEW: Israeli Ambassador to the UN Gilad Erdan shreds the UN charter with a mini shredder as the UN General Assembly supported a Palestinian bid to become a UN member.Palestine does *not* have full UN membership, but they are now simply qualified to join.The assembly adopted… pic.twitter.com/Fo1fty1RvW— Collin Rugg (@CollinRugg) May 10, 2024 ఇదిలా ఉండగా.. ఈ తీర్మానంతో పాలస్తీనాకు పూర్తిస్థాయి సభ్యత్వం లభించదు. సభ్యత్వానికి అర్హత సాధించినట్లు గుర్తింపు మాత్రమే లభిస్తుంది. ఈ తీర్మానాన్ని సర్వప్రతినిధి సభ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి పంపుతుంది. అక్కడ తీర్మానం ఆమోదం పొందాల్సి ఉంటుంది. తమకు పూర్తిస్థాయి సభ్యత్వం కావాలంటూ ఏప్రిల్‌లో కూడా ఐరాస భద్రతా మండలిని పాలస్తీనా అథారిటీ కోరింది. అయితే, ఈ తీర్మానానికి 12 సభ్యదేశాలు ఆమోదం తెలిపినా.. అమెరికా వీటో చేసింది. కాగా, ప్రస్తుతం మాత్రం ఈ సెప్టెంబర్ నుంచి మొదలయ్యే 79వ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాలస్తీనా పాల్గొనవచ్చు. ఈ మేరకు పాలస్తీనాకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ తీర్మానం ఆమోదించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. పాలస్తీనాను ఐక్యరాజ్యసమితిలో సభ్యదేశంగా చేయాలని భద్రతా మండలిని అభ్యర్థించారు. అఖండ మెజారిటీతో తీర్మానం ఆమోదం పొందడంతో ఈ సమావేశంలో అందరూ ఆనందం వ్యక్తం చేశారు.

Ravi Teja Movie Offered To Amardeep
ఇచ్చినమాట నిలబెట్టుకున్న రవితేజ

బిగ్ బాస్ 7 తెలుగు సీజన్‌తో అమర్ దీప్ చౌదరి మరింత పాపులర్‌ అయ్యాడు. బిగ్‌ బాస్‌లో అమర్‌ ఆటతీరు పట్ల కొందరు నెటిజన్లు తప్పుపట్టినా.. అతనిలోని ఎమోషనల్‌ కోణం చాలామందికి నచ్చింది. అందుకే బిగ్‌ బాస్‌ ఫైనల్‌ వరకు చేరుకుని రన్నర్‌గా నిలిచాడు. టాలీవుడ్‌ మాస్‌మహారాజా రవితేజ అంటే అమర్‌కు చాలా ఇష్టం. ఇదే విషయాన్ని చాలా సమయాల్లో ఆయన చెప్పిన విషయం తెలిసిందే. అమర్‌ చూపిన అభిమానానికి ఫిదా అయిన రవితేజ కూడా ఒక ఆఫర్‌ ప్రకటించాడు. తన నటించబోయే సినిమాలో ఒక మంచి పాత్ర ఇస్తున్నట్లు బిగ్‌ బాస్‌ వేదికగా ప్రకటించాడు.తాజాగా రవితేజను అమర్‌ దీప్‌ కలుసుకున్నాడు. అందుకు సంబంధించిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. నా డ్రీమ్‌ నిజం అయిందంటూ అమర్‌ చెప్పుకొచ్చాడు. రవితేజతో కలిసి నటించే ఛాన్స్‌ వచ్చినట్లు తెలిపాడు. దీంతో అభిమానులు కూడా అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇచ్చిన మాటను రవితేజ నిలిబెట్టుకున్నారని ఫ్యాన్స్‌ గుర్తుచేస్తున్నారు. బిగ్‌ బాస్‌ టైటిల్‌ రేసు నుంచి తప్పుకుంటే రవితేజ సినిమాలో ఛాన్స్‌ ఇప్పిస్తానని హోస్ట్‌ నాగార్జున చెప్పగానే అమర్‌ కూడా అందుకు రెడీ అంటూ.. బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తాడు. దానిని గమనించిన రవితేజ సినిమాలో ఛాన్స్‌ ఇస్తున్నట్లు అదే స్టేజీ మీద మాట ఇస్తాడు. 105 రోజులు కష్టపడ్డావ్‌ ఆట పూర్తి అయ్యే వరకు ఉండమని రవితేజ కోరుతాడు. దీంతో ఫుల్‌ ఖుషి అయిన అమర్‌కు ఎట్టకేలకు తన అభిమాన హీరోతో కలిసి నటించే ఛాన్స్‌ దక్కింది.రవితేజ ఒకవైపు మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ సినిమా చేస్తూనే మరోవైపు తన బెంచ్ మార్క్ ప్రాజెక్ట్‌ను కూడా లాంచ్ చేశాడు. రవితేజ 75వ సినిమాని ‘సామజవరగమన’ రచయిత భాను బొగ‌వరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై ఈ సినిమా తెరకెక్కుతుంది. రవన్న దావత్ ఇస్తుండు రెడీ అయిపోండ్రి అంటూ ‘RT75’ పేరుతో ఒక పోస్ట‌ర్ కూడా విడుదలైంది. అమర్‌ ఈ రెండు చిత్రాలలో దేనిలో నటిస్తున్నాడు అనేది క్లారిటీ ఇవ్వలేదు. View this post on Instagram A post shared by Amardeep G (@amardeep_chowdary)

మహేంద్ర సింగ్‌ ధోని (PC: CSK X)
మైదానంలోకి దూసుకొచ్చిన అభిమాని.. ‘పారిపోయిన’ ధోని! వైరల్‌

టీమిండియా దిగ్గజ కెప్టెన్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మహేంద్ర సింగ్‌ ధోని మరోసారి మిస్టర్‌ కూల్‌ అని నిరూపించుకున్నాడు. మ్యాచ్‌ మధ్యలో మైదానంలోకి దూసుకువచ్చిన అభిమానిని ఆలింగనం చేసుకుని సాదరంగా వీడ్కోలు పలికాడు.గుజరాత్‌ టైటాన్స్‌- సీఎస్‌కే మధ్య శుక్రవారం నాటి మ్యాచ్‌ సందర్భంగా ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఐపీఎల్‌-2024 ప్లే ఆఫ్స్‌ రేసు ఆశలను సజీవం చేసుకునే క్రమంలో ఇరు జట్లు అహ్మదాబాద్‌ వేదికగా తలపడ్డాయి.సొంతమైదానంలో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ ఓపెనర్ల విధ్వంసకర ఇన్నింగ్స్‌ కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి 231 పరుగుల భారీ స్కోరు సాధించింది.శతకాల మోతసాయి సుదర్శన్‌(103)‌, శుబ్‌మన్‌ గిల్‌(104) శతకాల మోతతో నరేంద్ర మోదీ స్టేడియాన్ని హోరెత్తించారు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై టాపార్డర్‌ కుప్పకూలగా.. మిడిలార్డర్‌ ఆదుకుంది. కానీ ఓటమి నుంచి తప్పించలేకపోయింది.నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు మాత్రమే చేసిన చెన్నై జట్టు టైటాన్స్‌ ముందు తలవంచింది. 35 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోని 11 బంతుల్లో 26 పరుగులతో అజేయంగా నిలిచాడు.అయితే, ఆఖరి ఓవర్లో రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌ తొలి రెండు బంతుల్లో సిక్సర్లు బాది ధోని జోరు మీద ఉండగా... మూడో బంతికి ఎల్బీడబ్ల్యూ అప్పీలు చేసింది ప్రత్యర్థి జట్టు. కానీ బాల్‌ వికెట్స్‌ మిస్‌ చేసినట్లుగా తేలడంతో ధోని నాటౌట్‌గా నిలిచాడు.పాదాలకు నమస్కరించగానేఅయితే, ఇదే సమయంలో ఓ యువకుడు మైదానంలోకి దూసుకువచ్చాడు. అతడి రాకను గమనించిన ధోని తొలుత దూరంగా పారిపోతున్నట్లు నటించాడు. అతడు వచ్చి పాదాలకు నమస్కరించగానే భుజం తట్టిలేపి ఆలింగనం చేసుకుని ఇక వెళ్లు అన్నట్లుగా కూల్‌గా డీల్‌ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. తలా క్రేజ్‌, ఫ్యాన్స్‌ పట్ల అతడు వ్యవహరించే తీరు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.చదవండి: కొడుకు దూరం.. టీమిండియాలో చోటు కరువు.. ఐపీఎల్‌లోనూ అలా! పాపం..Best moments of IPL 🥹💛That Hug and That smile Mahi The Man The Myth The Legend 🥰 Demi God for Millions of Indians 🇮🇳 Ms Dhoni 🐐 #DHONI𓃵#ChennaiSuperKings#CSKvGT #Ahmedabad #TATAIPL2024 #T20WorldCup2024 pic.twitter.com/m8MA8YdKzh— Srinivas Mallya🇮🇳 (@SrinivasMallya2) May 11, 2024Ms Dhoni knows exactly how to make the stadium roar with his mass entry 🥹🔥🔥#CSKvsGT | #DHONI𓃵pic.twitter.com/U5DA5meNaw— 𝑃𝑖𝑘𝑎𝑐ℎ𝑢☆•° (@11eleven_4us) May 10, 2024The Helicopter Shot 🚁A maximum from #CSK's Number 7️⃣💥Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #GTvCSK pic.twitter.com/2QAN3jPjTb— IndianPremierLeague (@IPL) May 10, 2024

Jio bundles 15 apps including Netflix with Rs 888 broadband plan
జియో గుడ్‌న్యూస్‌.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ సహా 15 ఓటీటీ యాప్స్‌

జియో ఫైబర్‌ తమ యూజర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లైట్, డిస్నీ+ హాట్‌స్టార్ ప్రాథమిక సబ్‌స్క్రిప్షన్‌తో సహా 15 యాప్‌ల ప్రీమియం సేవలను రూ. 888 మంత్లీ ప్లాన్‌కే అందిస్తున్నట్లు ప్రకటించింది. ఇది 30 ఎంబీపీఎస్ ఎంట్రీ లెవల్‌ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌.నెట్‌ఫ్లిక్స్ యాక్సెస్ గతంలో రూ. 1,499 ప్లాన్‌ని కలిగి ఉన్న జియోఫైబర్‌ (JioFiber) కస్టమర్‌లకు మాత్రమే అందుబాటులో ఉండేది. ఎంట్రీ లెవల్ 30 ఎంబీపీఎస్‌ ప్లాన్‌తో కస్టమర్‌లకు ఎంటర్‌టైన్‌మెంట్ యాప్‌ల యాక్సెస్ ఉండేది కాదు. అదేవిధంగా, ఎయిర్‌ ఫైబర్‌ (AirFiber) కస్టమర్‌ల కోసం రూ. 1499 లేదా అంతకంటే ఎక్కువ ధర ఉన్న ప్లాన్‌లలో మాత్రమే నెట్‌ఫ్లిక్స్ యాక్సెస్ అందుబాటులో ఉంది.కంపెనీ సమాచారం ప్రకారం.. జియో రూ.888 బ్రాడ్‌ బ్యాండ్‌ ప్లాన్ అందిస్తున్న 15 ఓటీటీ యాప్‌ల సేవల్లో నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ సహా సోనీ లివ్, జీ5, లయన్స్‌గేట్, డిస్కవరీ ప్లస్, ఆల్ట్‌బాలాజీ వంటివి ఉన్నాయి.

India's First Digital Beggar Raju Passes Away
తొలి డిజిటల్‌ బెగ్గర్‌ కన్నుమూత!

రాజు భికారీ పేరెప్పుడైనా మీరు విన్నారా? బీహార్‌లోని బెట్టియా రైల్వే స్టేషన్‌లో బిచ్చమెత్తుకునేవాడు ఈయన. మామూలు బిచ్చగాడైతే ఎవరూ పట్టించుకోకపోదురు కానీ... ఈయన దేశంలోనే తొలి డిజిటల్‌ బెగ్గర్‌! పాపం.. గుండెపోటుతో కాలం చేయడంతో ఈయన గురించి ఇప్పుడు అందరికీ తెలిసింది. ఏమిటబ్బా ఈ డిజిటల్‌ బెగ్గర్‌ కథ అనుకుంటున్నారా? మరి చదివేయండి.బెట్టియా రైల్వే స్టేషన్‌లో చాలాకాలంగా రాజు భికారీ ఓ ప్రత్యేక ఆకర్షణగా ఉండేవాడు. ఎందుకంటే.. మెడలో గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం క్యూర్‌ కోడ్‌లతో కూడిన ట్యాగ్‌లు వేలాడుతూండేవి. వచ్చి పోయే వారిని డబ్బులు అడుక్కునేవాడు. అయితే పేమెంట్‌ మాత్రం డిజిటల్‌ పద్ధతిలోనే చేయాలి. అంటే క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి బిచ్చం వేయాలన్నమాట. ప్రధాని మోడీ డిజిటల్‌ ఇండియా స్ఫూర్తితో తానీ కొత్త తరహా భిక్షాటనకు పూనుకున్నానని బతికుండా రాజు భికారీ చెప్పుకునేవాడు.డిజిటల్‌ పద్ధతులు రాక ముందే.. అంటే దాదాపు 32 ఏళ్లుగా రాజు భికారీకి భిక్షాటనే జీవనోపాధి. మోడీ అంటే అభిమానం ఎక్కువ. ‘మన్‌ కి బాత్‌’ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా వినేవాడట. అంతకు ముందు ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ను తన తండ్రిగా చెప్పుకునేవాడు రాజు. అప్పట్లో ఆయనకు బెట్టియా రైల్వే స్టేషన్‌ క్యాంటీన్‌ నుంచే రోజుకు రెండు పూటల ఆహారం దొరికేది కూడా.డిజిటల్‌ పద్ధతిలో అడుక్కోవడం మొదలుపెట్టిన తరువాత కూడా లాలూ అంటే అభిమానం పోలేదు కానీ.. మతిస్థిమితం సరిగ్గా లేకుండా పోయింది. ఆరోగ్యమూ అంతకంత క్షీణించడం మొదలైంది. చివరకు బెట్టియా రైల్వే స్టేషన్‌లో క్యూఆర్‌ కోడ్‌లు చూపిస్తూ అడుక్కుంటూండగానే... గుండెపోటు వచ్చింది.!!

sakshi special story about International Mothers Day
International Mothers Day: అమ్మ చిరునవ్వును చూద్దామా

ఆమెతో గడపాలి. ఆమె తన పిల్లలకు మనసులోది చెప్పుకునేలా చేయాలి. ఆమె మురిసి΄ోయే కానుక ఇవ్వాలి. ఎదురు చూస్తున్న విహారానికి ఆమెను తీసుకెళ్లాలి. అరె... ఆమెకు ఇష్టమైనది వండితే ఎంత బాగుంటుంది. మనమలు, మనమరాళ్లు ఆమె కాళ్ల దగ్గర చేరితే మరింత బాగుంటుంది. అమ్మకు ఏం కావాలి? చిన్న చిరునవ్వు తప్ప. మే 12 అంతర్జాతీయ మాతృదినోత్సవం. అమ్మను సంతోషపెట్టేందుకు ఇదే సమయం.అమ్మగా ప్రయాణం ప్రసవ వేదనతో మొదలవుతుంది. బిడ్డకు జన్మనివ్వడానికి వేదనకు సిద్ధమయ్యే అమృతమూర్తి అమ్మ. పుట్టాక బిడ్డ కేర్‌మన్నా, కేరింతలు కొట్టినా ఆమె పెదాల మీద చిర్నవ్వు. అంతవరకూ అనుభవించిన బాధను ఆమె మర్చి΄ోతుంది. ఆ తర్వాత ఆమె జీవితమంతా పిల్లల చుట్టే తిరుగుతుంది. వారు నవ్వితే నవ్వుతుంది. ఏడిస్తే ఏడుస్తుంది. సరిగా చదవక΄ోతే బాధ పడుతుంది. పూర్తిగా స్థిర పడక΄ోతే ఆందోళన పడుతుంది. వారి ఎదుగుదల, పెళ్ళిళ్లు, సంసారాలు, సంపాదనలు ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటూ ఉంటుంది. ‘నా పిల్లలు చల్లగా ఉండాలి’ అని ్రపార్థనలు చేస్తుంది. చల్లగా ఉంటే సంతోషపడుతుంది. కాని పిల్లలు పెద్దవాళ్లయ్యాక... తాము తల్లిదండ్రులయిన తర్వాత... తల్లి నుంచి ΄÷ందిన ప్రేమంతా తమ పిల్లలకు ఇస్తారు తప్ప తల్లికి ఇవ్వడానికి బద్దకిస్తారు. ‘అమ్మంటే ప్రేమ కదా మనకు’ అనుకుంటారు తప్ప వ్యక్తీకరించరు. ఒకోసారి అమ్మనే మర్చి΄ోయేంత బిజీ అయి΄ోతారు. అలాంటి వారికి అమ్మను గుర్తు చేసేదే కదా ‘మదర్స్‌ డే’.» అమ్మ ఫోన్‌ ఎత్తుతున్నారా?లోకంలో ఎన్నో ఫోన్లు ఫస్ట్‌ కాల్‌కే ఎత్తుతారు చాలామంది. కాని అమ్మ చేస్తుంటే ‘అమ్మే కదా’ అని ఎత్తరు. అమ్మ ఫోన్‌లో పెద్ద విశేషం లేక΄ోవచ్చు. రొటీన్‌ కాలే కావచ్చు. ‘భోజనం చేశావా నాన్నా’ అనే అదే ప్రశ్నను అడుగుతుండవచ్చు. కాని అమ్మ కదా. కొడుకు ఎంత పెద్దవాడైనా, కూతురు ఎంత పెద్ద సమర్థురాలైనా వారు క్షేమంగా ఇల్లు చేరి నిద్రకు ఉపక్రమిస్తున్నారని తెలుసుకుంటే తప్ప ఆమె నిద్ర΄ోదు. ఆ విషయం తెలిసీ ఫోన్‌ ఎత్తరు. ఒకోసారి విసుక్కుంటారు. పిల్లలే ఫోన్‌ చేసి ‘అమ్మా అన్నం తిన్నావా?’ అని అడగడం ఎందరు అమ్మల విషయంలో జరుగుతున్నదో. పిల్లల పలకరింపే అమ్మకు అసలైన భోజనం.» అమ్మను మాట్లాడనిస్తున్నారా?అమ్మ మనసులో ఎన్నో ఆలోచనలు. ఆమె ఎంతో జీవితం చూసి ఉంటుంది. అనుభవం ఉండి ఉంటుంది. పిల్లల జీవితాల్లో జరుగుతున్న విషయాలు ఆమె చెవిన పడి చూపుకు అందుతుంటాయి. ఏదో చె΄్పాలని ఉంటుంది. తోబుట్టువుల ఫిర్యాదులు, పట్టింపులు ఒకరివి మరొకరికి చేరవేసి ప్రేమలు గట్టి పడాలని పరితపిస్తూ ఉంటుంది. భర్త గురించి కూడా పిల్లలకు ఏదో చెప్పుకోవాలని ఉంటుంది. పిల్లలు వింటున్నారా? నీ మనసులో ఏముందో చెప్పమ్మా అని తీరిగ్గా ఆమె పక్కన కూచుని అడుగుతున్నారా? ఆమెను అర్థం చేసుకుంటూ ఆమె చెప్పింది పాటిస్తున్నారా? పాటించడమే కదా ఆమెకు తెలుపగల కృతజ్ఞత. ఇవ్వగల గౌరవం.» అమ్మకు కానుకఅమ్మ డబ్బు దాచుకోదు. దాచుకున్నా పిల్లల కోసమే. అమ్మ తన కోసం ఏదీ కొనుక్కోదు. కొనుక్కున్నా పిల్లల కోసమే. తమకు పిల్లలు పుట్టాక తమ పిల్లలకు ఏమేమి కొనిపెడదామా అనుకునే తల్లిదండ్రులు తమకు జన్మనిచ్చిన తల్లికి ఏదైనా కొని పెడదామా అనుకోరు. ఒక మంచి స్మార్ట్‌ వాచ్‌ (ఆమె ఆరోగ్యాన్ని సూచించేది), పాటల పెట్టె (సారెగమా కారవాన్‌ రేడియో), మంచి ఫోన్‌ హెడ్‌ఫోన్స్‌తో పాటుగా (ప్రవచనాలు వినడానికి), ఆమెకు నచ్చిన బంగారు ఆభరణం, ఆమెకు ఆసక్తి ఉన్న చానల్స్‌ సబ్‌స్క్రిప్షన్, ఓటీటీల సబ్‌స్క్రిప్షన్, ఏదైనా మంచి ప్రకృతి వైద్యశాలలో రెండు వారాలు ఉండటానికి కావలసిన ఏర్పాట్లు, ఆమె ప్రముఖంగా కనిపించేలా ఫ్యామిలీ ఫొటో... ఇవన్నీ ఆమె మళ్లీ మళ్లీ చూసుకుని ఆనందించే కానుకలు. చిరునవ్వుల మాలికలు. ‘మా పిల్లలు కొనిచ్చారమ్మా’ అని వారికీ వీరికి చెప్పుకునే ఘన విషయాలు.» మనం తప్పఅమ్మకు పిల్లలు తప్ప వేరే ఏ ఆస్తిపాస్తులు పట్టవు. అమ్మకు నిత్యం కళ్ల ముందు పిల్లలు కనిపించాలి. ఆమె మీద ఫిర్యాదులు చేసి, సాకులు చూపి, లేదా తప్పనిసరయ్యి ఆమెకు దూరంగా ఉండాల్సి వస్తే ఆ దూరాన్ని దాని వల్ల వచ్చే లోటును పూర్తిగా పూడ్చేంతగా పిల్లలు అమ్మకు ఇవ్వాలి. ‘అమ్మ’ అని పిలుచుకునే అదృష్టంతో ఒక మనిషి మన కోసం ఉండటం వరం. ఆ వరం అపురూపం. అది గ్రహిస్తే చాలు–ఈ మదర్స్‌ డే రోజున. అమ్మతో ప్రయాణంసెలవులొస్తే అచ్చోటకి వెళ్దాం ఇచ్చోటకి వెళ్దాం అని ΄్లాన్‌ చేసుకునే ఓ పిల్లలూ... మీ ప్రయాణంలో ఎన్నిసార్లు అమ్మను తీసుకెళ్లారు? జీవితం మొత్తం పిల్లల కోసం ఆమె ఇంటికే పరిమితమైంది. ఇప్పుడైనా లోకం చూడాలని అనుకుంటోంది. ‘నువ్వు రాలేవు’, ‘నువ్వు తిరగలేవు’, ‘నిన్ను చూసుకోవడం కష్టం’ అని ఆమెను ఇంటికే పరిమితం చేస్తే ఆమె మనసు ఆహ్లాదం ΄÷ందేదెప్పుడు. ఆమెకు ఆటవిడుపు లభించేదెప్పుడు. ఆమెకు ఏదైనా ఆధ్యాత్మిక యాత్ర చింత ఉంటే అది తీరేదెప్పుడు. శ్రావణ కుమారుడిలా కావడిలో మోయక్కర్లేదు... రెండు రోజులు సెలవు పెట్టి ఆమెతో రైలు ప్రయాణమే ఆమెకు ఇవ్వగల వీక్షణ దరహాసం.

తనిష్క్ జ్యువెలరీ నెక్లెస్‌
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్

ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన, భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్‌ల నుండి ప్రేరణ పొంది అద్భుతమైన మరియు వైవిధ్యమైన శ్రేణి సమకాలీన, రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్‌లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్‌లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్‌లు, కస్టమర్‌లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా, ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్‌ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్‌ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్, ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్‌లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్‌గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్‌లెట్‌లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్‌లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్‌లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్‌డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్‌లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్ 18కేరట్ మరియు 22కేరట్ బంగారంలో విస్తృతమైన శ్రేణి డిజైన్‌లతో, నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని సంపూర్ణం చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్‌లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్‌లెట్‌లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement

ఫోటో స్టోరీస్

View all