Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Cm jagan Reaction On TDP Janasena Manifesto Slams Chandrababu
టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు

సాక్షి, అన్నమయ్య జిల్లా: టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హామీలన్నీ మోసమేనని బీజేపీ వైఖరితో అర్థమైందన్నారు. టీడీపీ, జనసేన మేనిఫెస్టోలో తమ ఫోటో వద్దని బీజేపీ గట్టిగా చెప్పిందని పేర్కొన్నారు. బాబు డిక్లేర్ చేసిన మేనిఫెస్టోలో మోదీ ఫోటో పెట్టొద్దని బీజేపీ తేల్చేసిందన్నారు.చారు. ముగ్గురు కూటమిలో ఉండి ముగ్గురు ఫోటోలను మేనిఫెస్టోలో పెట్టుకునే పరిస్థితి చంద్రబాబుకు లేదని ఎద్దేవా చేశారు.అవ్వాతాతలకు ఇంటివద్దకే అందే పెన్షన్‌ను ఆపిన దుర్మార్గుడు చంద్రబాబని ధ్వజమెత్తారు. మీ బిడ్డకు(జగ్‌) మంచి పేరు వస్తుందనే బాబు పెన్షన్లను అడ్డుకున్నాడని మండిపడ్డారు. తన మనిషిని నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి పనెన్షన్‌ను అడ్డుకున్నాడని.. ప్రజల్లో వ్యతిరేకత రావడంతో తన కుట్రలను మనపై నెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ పూర్తి ప్రసంగంఈ ఎన్నికలు.. రాబోయే అయిదేళ్ల భవిష్యత్‌.జగన్‌కు ఓటేస్తే..పథకాలు కొనసాగింపు.చంద్రబాబుకు ఓటేస్తే పథకాలు ముగింపే.పొరపాటున బాబుకు ఓటేస్తే..పసుపుపతి నిద్రలేస్తాడు.వదల బొమ్మాళి అంటూ పేదల రక్తం తాగుతాడు..బాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమే.2014లో చంద్రబాబు చేసిన మోసాలు గుర్తున్నాయా?.రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?రూ. 87,612 కోట్ల రుణాలు మాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?పెట్టుబడి సాయం కింద బాబు ఏనాడు ఒక్క రూపాయి ఇవ్వలేదు.బాబు ఏనాడైనా రైతుభరోసా కింద ఒక్క రూపాయి అయినా ఇచ్చాడా.14 ఏళ్లలో బాబు ఏనాడు రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వలేదు.డ్వాక్రా రుణాలు రద్దు చేస్తానన్నాడు..చేశాడా?.రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?అక్కాచెల్లెమ్మలను మోసం చేసి రోడ్డుపై నిలబెట్టాడుఆడబిడ్డ పుడితే రూ. 25 వేలు డిపాజిట్‌ చేస్తానన్నాడు.. చేశాడా?గర్భిణీ స్త్రీలకు రూ. 10 వేలు ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?గ్యాస్‌ సిలిండర్‌పై రూ. 100 సబ్సిడీ ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని విడిపిస్తానన్నాడు.. విడిపించాడా?ఉమెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేస్తానన్నాడు.. చేశాడా?మీ బిడ్డ జగన్‌ రైతన్నకు అండగా నిలబడ్డాడు.పెట్టుబడి సాయం కింద మీ బిడ్డ ప్రతియేటా రూ. 13, 500 ఇచ్చాడు.జగన్‌కు, చంద్రబాబుకు ఉన్న తేడా గమనించండని కోరుతున్నా.అక్కా చెల్లెమ్మలకు మీ బిడ్డ జగన్‌ తోడుగా ఉన్నాడుఅక్కాచెల్లెమ్మల కోసం మేనిఫెస్టోలోని ప్రతి హామీని నెరవేర్చా.అక్కాచెల్లెమ్మల కోసం ఆసరా, సున్నా వడ్డీ, చేయూతతో ఆదుకున్నాం.అక్కాచెల్లెమ్మల కోసం కాపు నేస్తం, ఆబీసీ నేస్తం తీసుకొచ్చా.31 లక్షల ఇళ్లపట్టాలు అక్కా చెల్లెమ్మల పేరుపై రిజిస్ట్రేషన్‌.ఇంటి వద్దకే అవ్వాతాతలకు పెన్షన్‌ అందిస్తున్నాం.పెన్షన్‌ రూ. 3 వేల నుంచి రూ, ,500లకు పెంచుకుంటూ పోతాం.14 ఏళ్లలో చంద్రబాబు ఏనాడైనా పెన్షనర్లను పట్టించుకున్నాడా? చంద్రబాబు మోసాలను ఓడించడానికి మీరంతా సిద్ధమేనా.రైతుభరోసాగా ఏడాదికి రూ.16 వేలు.. ఐదేళ్లకు రూ.80 వేలు ఇస్తాడు మీ జగన్.చంద్రబాబు వల్ల రాష్ట్రంలోని మహిళలందరికీ కొన్ని రూ.వేల కోట్ల నష్టం జరిగింది. పిల్లలను బడులకు పంపే తల్లులకు ఇచ్చే అమ్మఒడిని రూ.17 వేలుకు పెంచాం.

Team India T20 World Cup Squad Announced
టీ20 వరల్డ్‌కప్‌ కోసం భారత జట్టు ‍ప్రకటన.. స్టార్‌ ఆటగాళ్లకు దక్కని చోటు

కరీబియన్‌ దీవులు, యూఎస్‌ఏ వేదికలుగా జూన్‌ 1 నుంచి జరుగబోయే టీ20 వరల్డ్‌‍కప్‌ 2024 కోసం భారత జట్టును ఇవాళ (ఏప్రిల్‌ 30) ప్రకటించారు. ముందుగా చెప్పినట్లుగానే ఈ జట్టుకు రోహిత్‌ శర్మ నాయకత్వం వహించనుండగా.. హార్దిక్‌ పాండ్యా వైస్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఐపీఎల్‌ ప్రదర్శనల ఆధారంగా రిషబ్‌ పంత్‌, సంజూ శాంసన్‌, శివమ్‌ దూబే వరల్డ్‌కప్‌ జట్టులో చోటు దక్కించుకోగా.. స్టార్‌ ఆటగాళ్లు కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌పై వేటు పడింది. చాలాకాలం తర్వాత చహల్‌ టీ20 జట్టులోకి రాగా.. సిరాజ్‌, అర్ష్‌దీప్‌ తమ స్థానాలు నిలుపుకున్నారు. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో సెంచరీ మినహా చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయని యశస్వి జైస్వాల్‌పై సెలెక్టర్లు విశ్వాసముంచగా.. వరల్డ్‌కప్‌ బెర్త్‌పై గంపెడాశలు పెట్టుకున్న  రింకూ సింగ్‌ ట్రావెలింగ్‌ రిజర్వ్‌గా ఎంపియ్యాడు.  శుభ్‌మన్‌ గిల్‌, ఖలీల్‌ అహ్మద్‌, ఆవేశ్‌ ఖాన్‌ కూడా ట్రావెలింగ్‌ రిజర్వ్‌గా ఎం​పియ్యారు.టీ20 వరల్డ్‌కప్‌ కోసం టీమిండియా: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), హార్దిక్‌ పాండ్యా (వైస్‌ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషబ్‌ పంత్‌, సంజూ శాంసన్‌, శివమ్‌ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌, యుజ్వేంద్ర చహల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, మొహమ్మద్‌ సిరాజ్‌, జస్ప్రీత్‌ బుమ్రాట్రావెలింగ్‌ రిజర్వ్‌: శుభ్‌మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్

Big Blow For Congress In Madhya Pradesh Ramniwas Rawat Joined Bjp
ఓ వైపు రాహుల్‌ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్‌ కీలక నేత

లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ తరుణంలో మధ్యప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఓ వైపు రాష్ట్రంలో రాహుల్‌ గాంధీ ఎన్నికల ప్రచారం చేస్తుంటే.. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ కీలక నేత, మాజీ హోమంత్రి రాంనివాస్‌ రావత్‌ బీజేపీలో చేరడం చర్చాంశనీయంగా మారింది.ఆరుసార్లు ఎమ్మెల్యేగామధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ మంత్రి, ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన రాంనివాస్ రావత్ రాహుల్‌గాంధీ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో సుమారు వెయ్యి మంది మద్దతుదారులతో బీజేపీలో చేరారు. సీఎం మోహన్ యాదవ్, రాష్ట్ర పార్టీ చీఫ్ వీడీ శర్మ, మాజీ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. రావత్ విజయపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే, గ్వాలియర్-చంబల్ ప్రాంతంలోని ప్రముఖ కాంగ్రెస్ నాయకులలో ఒకరు.బీజేపీలోకి కమల్‌ నాథ్‌ సన్నిహితుడు కాగా,ఎన్నికలు ప్రకటించిన తర్వాత బీజేపీలో చేరిన రెండో సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రావత్. మార్చి 29న మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌కు అత్యంత సన్నిహితుడు, అమర్‌వాడ ఎమ్మెల్యే కమలేష్ షా బీజేపీలో చేరారునామినేషన్‌ ఉపసంహరణ.. ఆపై బీజేపీలోకి జంప్‌మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లో మే 13న లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో ఏప్రిల్‌ 29న ఇండోర్‌ లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్ధి అక్షయ్‌ కాంతి బామ్‌ తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. కొన్ని గంటల్లోనే బీజేపీలో చేరారు. కాగా, బీజేపీ సిట్టింగ్‌ ఎంపీ శంకర్‌ లాల్వానీపై కాంగ్రెస్‌ నేత అక్షయ్‌ కాంతి బామ్‌ను రంగంలోకి దించింది. అనూహ్యంత్‌ అక్షయ్‌ కాంతి బామ్‌ బీజేపీ చెంతకు చేరడం మధ్యప్రదేశ్‌ రాజకీయం రసవత్తరంగా మారింది. 

Allu Arjun Pushpa 2 First Single Release Date and Time Reveiled
పుష్ప-2 ఫస్ట్‌ సింగిల్.. రిలీజ్‌ టైమ్ ఇదే!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ నటిస్తోన్న పుష్ప-2 మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, టీజర్‌ సరికొత్త రికార్డులు క్రియేట్‌ చేశాయి. పుష్ప పార్ట్-1కు సీక్వెల్‌గా సుకుమార్‌ డైరెక్షన్‌లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా పుష్ప-2 మరో క్రేజీ అప్‌డేట్‌ వచ్చేసింది. ఈ చిత్రంలోని ఫస్ట్‌ సింగిల్‌ను రిలీజ్‌ డేట్‌ అండ్‌ టైమ్‌ను ప్రకటించారు మేకర్స్‌.మే 1వ తేదీన ఫస్ట్‌ సింగిల్‌ను రిలీజ్ చేయనున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో రిలీజ్‌ చేయన్నట్లు ప్రకటించారు. ఏకంగా ఆరు భాషల్లో ఫస్ట్‌ సింగిల్‌ విడుదల చేయనున్నారు. అల్లు అర్జున్ ప్రత్యేక పోస్టర్‌ను షేర్ చేస్తూ ట్విటర్‌లో పోస్ట్ చేసింది.కాగా.. ఈ చిత్రంలో నేషనల్‌ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఫాహద్ ఫాజిల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎర్రచందన సిండికేట్‌ నేపథ్యంలో వచ్చిన పుష్ప బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలుకొట్టిన సంగతి తెలిసిందే. దీంతో పుష్ప-2పై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.  S̶e̶n̶s̶a̶t̶i̶o̶n̶a̶l̶ s̶u̶r̶p̶r̶i̶s̶e̶Sensational song ✅🔥🔥#Pushpa2FirstSingle out tomorrow at 5.04 PM in Telugu, Hindi, Tamil, Kannada, Malayalam & Bengali.#PushpaPushpa chant all the way 💥💥A Rockstar @ThisIsDSP Musical 🎵#Pushpa2TheRule Grand release worldwide on… pic.twitter.com/3fuyv9GFlA— Mythri Movie Makers (@MythriOfficial) April 30, 2024

Ap: Bjp Distanced From The Alliance Manifesto
బాబు అలవికాని హామీలు.. మేనిఫెస్టోకు బీజేపీ దూరం

సాక్షి, విజయవాడ: చంద్రబాబు అలవికాని హామీలకు మేం బాధ్యులం కాదంటూ బీజేపీ తప్పించుకుంది. కూటమి మేనిఫెస్టోకు బీజేపీ దూరంగా ఉంది. మేనిఫెస్టోలో మోదీ, బీజేపీ ఫొటోలు వేయొద్దని ఆ పార్టీ అల్టిమేటం జారీ చేసింది.మోదీ, నడ్డా, అమిత్‌, పురేందేశ్వరి ఫొటోలు లేకుండా కూటమి మేనిఫెస్టోను విడుదల చేశారు. మూడు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో ఇస్తామని ఇన్నాళ్లూ   టీడీపీ చెప్పింది. మీడియాను మూడు పార్టీల మేనిఫెస్టో అంటూ పిలిచారు. బీజేపీ ఒప్పుకోకపోవడంతో చంద్రబాబు, పవన్‌ ఫొటోలతో మేనిఫెస్టో విడుదల చేశారు.​మేనిఫెస్టో కాపీని ముట్టుకోవడానికి కూడా బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌ సిద్ధార్థనాథ్‌ సింగ్‌ ఒప్పుకోలేదు. కూటమి మేనిఫెస్టోకు టీడీపీ, జనసేనదే బాధ్యత అని చంద్రబాబు చెబుతున్నారు. 2014లో మేనిఫెస్టోలో చంద్రబాబు.. మోదీ ఫొటో పెట్టారు.. హామీలు అమలు కాకపోవడంతో మోదీకి చంద్రబాబు చెడ్డపేరు తెచ్చారని బీజేపీ నేతలు అంటున్నారు. బీజేపీ వద్దని గట్టిగా చెప్పడంతోనే మోదీ ఫొటో పెట్టేందుకు చంద్రబాబు సాహసించలేదు.తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న బీజేపీ అగ్రనేతలు స్పష్టంగా ముస్లిం రిజర్వేషన్లపై ప్రకటనలు చేస్తున్నారు. తాము అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటున్నారు. ఆ విషయంలో బీజేపీ, టిడిపి మధ్య పొసగడం లేదని తెలుస్తోంది. అందుకే చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోకు బీజేపీ అధికారికంగా దూరం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. 

Sisodia Bail Petition Dismissed In Liquor Case By Delhi Court
లిక్కర్‌ కేసు: మనీష్‌ సిసోడియాకు మళ్లీ చుక్కెదురు

న్యూఢిల్లీ: లిక్కర్‌ కేసులో అరెస్టయి జైలులో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియాకు కోర్టులో మళ్లీ చుక్కెదురైంది. సిసోడియాకు బెయిల్‌ ఇచ్చేందుకు కేసు విచారిస్తున్న రౌస్‌ ఎవెన్యూ కోర్టు నిరాకరించింది. సిసోడియాకు బెయిల్‌ ఇవ్వకూడదని సీబీఐ,ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) కోర్టులో వాదనలు వినిపించాయి. దీంతో కోర్టు సిసోడియాకు బెయిల్‌ నిరాకరించింది. కాగా, లిక్కర్‌ స్కామ్‌ కేసులో సిసోడియాను సీబీఐ గతేడాది ఫిబ్రవరి26న అరెస్టు చేసింది. అప్పటి నుంచి సిసోడియా జైలులోనే ఉంటున్నారు.  సీబీఐతో పాటు ఈడీ పెట్టిన కేసుల్లో సిసోడియా రెగ్యులర్‌ బెయిల్‌ కోర్టు డిస్మిస్‌ చేయడం ఇది రెండవసారి. గతేడాది సిసోడియా వేసిన బెయిల్‌ పిటిషన్లను ట్రయల్‌కోర్టుతో పాటు హైకోర్టు,సుప్రీంకోర్టు డిస్మిస్‌ చేసిన విషయం తెలిసిందే. 

IPL 2024: KKR Bowler Harshit Rana Fined 100 Percent Of His Match Fees And Suspended For One Match
IPL 2024: కేకేఆర్‌ స్టార్‌ ప్లేయర్‌కు భారీ షాక్‌.. జరిమానాతో పాటు నిషేధం

కేకేఆర్‌ స్టార్‌ బౌలర్‌ హర్షిత్‌ రాణాకు భారీ షాక్‌ తగిలింది. నిన్న (ఏప్రిల్‌ 29) ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా కోడ్‌ ఉల్లంఘనకు పాల్పడినందుకుగాను అతని మ్యాచ్‌ ఫీజ్‌లో 100 శాతం కోత విధించబడింది. ప్రస్తుత సీజన్‌లో రాణా రెండోసారి కోడ్‌ ఉల్లంఘనకు పాల్పడటంతో అతనిపై ఓ మ్యాచ్‌ నిషేధం కూడా పడింది. ఢిల్లీతో మ్యాచ్‌ సందర్భంగా ఆ జట్టు బ్యాటర్‌ అభిషేక్‌ పోరెల్‌ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినందుకు రాణాపై కఠిన చర్యలు తీసుకున్నారు. అభిషేక్‌  ఔటైన తర్వాత రాణా శృతిమించిన సంబురాలు (అభిషేక్‌ను డగౌట్‌ వైపు వెళ్లాలని కోపంగా ఆదేశించాడు) చేసుకుని తగిన మూల్యం చెల్లించుకున్నాడు. రాణా కొద్ది రోజుల కిందట ​కూడా ఇలాగే ప్రవర్తించి జరిమానాను ఎదుర్కొన్నాడు. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మయాంక్‌ అగర్వాల్‌ను ఔట్‌ చేశాక ఓవరాక్షన్‌ (ఫ్లయింగ్‌ కిస్‌ ఇస్తూ కోపంగా చూశాడు) చేశాడు. అందుకు మ్యాచ్‌ ఫీజ్‌లో 60 శాతం జరిమానాను ఎదుర్కొన్నాడు. ఢిల్లీతో మ్యాచ్‌లో రాణా అతి చేసినా బౌలింగ్‌లో ఆట్టున్నాడు. 4 ఓవర్లలో 28 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌ ఢిల్లీపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు మాత్రమే చేయగా.. కేకేఆర్‌ 16.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి, ఈ సీజన్‌లో ఆరో విజయాన్ని నమోదు చేసింది. ఫిలిప్‌ సాల్ట్‌ (68) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి కేకేఆర్‌ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. అంతకుముందు కేకేఆర్‌ బౌలర్లు చెలరేగడంతో ఢిల్లీ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. కుల్దీప్‌ యాదవ్‌ (35 నాటౌట్‌) ఆ జట్టులో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. వరుణ్‌ చక్రవర్తి 4 ఓవర్లలో 16 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. హర్షిత్‌ రాణా, వైభవ్‌ అరోరా తలో 2 వికెట్లు, స్టార్క్‌, నరైన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.  

South Africa Announce T20 WC 2024 Squad 2 Uncapped Players In
T20 WC SA Squad: సౌతాఫ్రికా జట్టు ప్రకటన.. ఇద్దరు అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లకు ఛాన్స్‌

టీ20 ప్రపంచకప్‌-2024 కోసం సౌతాఫ్రికా తమ జట్టు ప్రకటించింది. మెగా టోర్నీ నేపథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను మంగళవారం వెల్లడించింది. ఐసీసీ ఈవెంట్లో ఐడెన్‌ మార్క్రమ్‌ సారథ్యంలో తలపడే టీమ్‌లో అన్రిచ్‌ నోర్జే, క్వింటన్‌ డికాక్‌లకు చోటు ఇవ్వడం గమనార్హం.కాగా ఇటీవలే వీరిద్దరిని సౌతాఫ్రికా సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ నుంచి బోర్డు తప్పించిన విషయం తెలిసిందే. వెన్నునొప్పి కారణంగా పేసర్‌ ఆన్రిచ్‌ నోర్జే గతేడాది సెప్టెంబరు నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉండగా.. వరల్డ్‌కప్‌-2023 టోర్నీ తర్వాత వన్డేలకు కూడా రిటైర్మెంట్‌ ప్రకటించాడు డికాక్‌.అన్‌క్యాప్ట్‌ ప్లేయర్ల పంట పండింది!ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సత్తా చాటిన ఇద్దరు అన్‌క్యాప్ట్‌ ప్లేయర్ల పంట పండింది. ఇంతవరకు జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించని రియాన్‌ రికెల్టన్‌, ఒట్‌నీల్‌ బార్ట్‌మన్‌లు ఏకంగా ప్రపంచకప్‌ జట్టులో చోటు సంపాదించారు.  ఎంఐ కేప్‌టౌన్‌ తరఫున రికెల్టన్‌ 530 పరుగులతో సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. సన్‌రైజర్స్‌ ఈస్టర్న్‌కేప్‌ తరఫున బరిలోకి దిగిన బార్ట్‌మన్‌ 18 వికెట్లతో రాణించి జట్టును వరుసగా రెండోసారి చాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు.ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు యువ ఆటగాళ్లకు సౌతాఫ్రికా పెద్దపీటవేయడం గమనార్హం. ఇక ఐపీఎల్‌-2024లో దుమ్ములేపుతున్న పవర్‌ హిట్టర్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌, డేవిడ్‌ మిల్లర్‌, ట్రిస్టన్‌ స్టబ్స్‌లు కూడా మెగా ఈవెంట్లో భాగం కానున్నారు. కాగా జూన్‌ 1న ప్రపంచకప్‌నకు తెరలేవనుండగా.. జూన్‌ 3న సౌతాఫ్రికా న్యూయార్క్‌ వేదికగా శ్రీలంకతో తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది.టీ20 ప్రపంచకప్‌-2024 కోసం సౌతాఫ్రికా జట్టు ఇదే:ఐడెన్‌ మార్క్రమ్‌(కెప్టెన్‌), ఒట్‌నీల్‌ బార్ట్‌మన్‌, గెరాల్డ్‌ కొయోట్జీ, క్వింటన్‌ డికాక్‌, జోర్న్‌ ఫార్చూన్‌, రీజా హెండ్రిక్స్‌, మార్కో జాన్సెన్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, కేశవ్‌ మహరాజ్‌, డేవిడ్‌ మిల్లర్‌, అన్రిచ్‌ నోర్జే, కగిసో రబడ, రియాన్‌ రికెల్టన్‌, తబ్రేజ్‌ షంసీ, ట్రిస్టన్‌ స్టబ్స్‌.ట్రావెలింగ్‌ రిజర్వ్స్‌: నండ్రీ బర్గర్‌, లుంగి ఎంగిడి. 

CM jagan Slams Chandrababu At mydukur Meeting
75 ఏళ్లు వచ్చినా చం‍ద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్‌

సాక్షి, కడప: చంద్రబాబు అంటేనే వెన్నుపోట్లు, మోసాలు, అబద్దాలు, కుట్రలే గుర్తొస్తాయని మండిపడ్డారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. చంద్రబాబు వయసు 75 ఏళ్లు దాటినా.. కనీసం పశ్చాతాపం కూడా కనిపించడం లేదని ధ్వజమెత్తారు. పేదలకు, బాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి అని తెలిపారు. వైఎస్‌ జగన్‌కు ఓటేస్తే పథకాలు కొనసాగుతాయని.. పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలు ముగింపేనని అన్నారు.కడప జిల్లా మైదుకూరులో సీఎం జగన్‌ మంగళవారం ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. 14 ఏళ్లుగా సీఎంగా ఉన్న చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం అయినా గుర్తొస్తుందా అని ప్రశ్నించారు. 2014లో మేనిపెస్టోను అమలు చేశావా అంటే బాబుకు కోమొస్తుందని విమర్శించారు.  మన ప్రభుత్వ స్కీముల లిస్టు చదువుతుంటే చంద్రబాబుకు పిచ్చి కోపం వస్తోందని దుయ్యబట్టారు. 14 ఏళ్ల ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు చేసిన స్కీములేమిటని ప్రశ్నించారు. చంద్రబాబును ప్రశ్నలడిగితే ఈనాడుకు, ఆంధ్రజ్యోతికి, టీవీ5కు, దత్తపుత్రుడికి, వదినమ్మకు పిచ్చిపిచ్చిగా కోపం వస్తోంది.  వీరితోపాటు చంద్రన్న కాంగ్రెస్‌కు  కూడా కోపం వస్తోంది. నేను స్కీమ్ల లిస్ట్ చదివితే వాళ్లు నా మీద తిట్లు, శాపనార్థాలు, బెదిరింపులు, బూతులు, అబద్ధాల లిస్టులు గడగడా చదవుతున్నారు.జగన్‌ను ఎందుకు చంపకూడదని ఈ బాబు అంటున్నాడు.చంద్రబాబు సంస్కారానికి ఒక నమస్కారం.చేతకాని వాడికి కోపం ఎక్కువ అనే సామేత ఉంది. పేదలకు చేసిన మంచి ఏంటి అంటే సమాధానం లేదు. జగన్‌ను తిడితే ఏం ప్రయోజనమయ్యా చంద్రబాబు. ఇదే అసత్యాల హరిశ్చంద్రులంతా కలిసి 2014 లో ఇచ్చిన ఎన్నికల వాగ్దాలను ఒక్కటి కూడా నెరవేర్చలేదు.బాబు కొత్త మేనిఫెస్టోకు విలువ, విశ్వసనీయత లేదు.మళ్లీ ఇదే కూటమి కొత్త కొత్త మోసాలతో వస్తుంది. ఇంటింటికి కేజీ బంగారం, బెంజ్‌కారు ఇస్తారంట.. నమ్ముతారా?  వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోలో 99 శాతం అమలు చేశాం. ఇంటి వద్దకే పౌరసేవలు, సంక్షేమం అందిస్తున్నాం.గతంలో ఎప్పుడూలేనన్ని స్కీమ్‌లు తీసుకొచ్చాం.రూ. 2లక్షల 70 వేల కోట్లు అక్కాచెల్లెమ్మల ఖాతాల్లో వేశాం.2 లక్షల 31 వేల ఉద్యోగాలిచ్చాం.విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం.నాడు-నేడుతో ప్రభుత్వ  ఆత్రుల రూపురేఖలుర్చాంఅవ్వాతాతలకు ఇంటి వద్దకే పెన్షన్‌..ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్‌ మీడియం తీసుకొచ్చాం.ఉన్నత చదువుల కోసం విద్యా దీవెన, వసతి దీవెన.ప్రతి ఇంటికి సంక్షేమం అందించాం.రూ. 2 లక్షల 70 వేల కోట్లు అక్కా చెల్లెమ్మల ఖాతాల్లో వేశాం. రైతులకు పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్‌. కాలంలో ఇన్‌పుట్‌ సబ్సిడీ అందిస్తున్నాం.31 లక్షల ఇళ్ల పట్టాలు అక్కాచెల్లెమ్మల పేరుపై రిజస్ట్రేషన్‌.ప్రతి గ్రామంలోనూ విలేజ్‌ క్లినక్‌ పెట్టాం.ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ సైతం తీసుకొచ్చాం.పేషెంట్‌ విశ్రాంతి సమయంలోనూ ఆర్థిక సాయం.పేదవారికి అండగా ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, ఆరోగ్య సురక్ష.కాపు నేస్త,ఈబీసీ నేస్తం, ఆసరా అందిస్తున్నాం.మహిళల రక్షణ కోసం మహిళా పోలీస్‌ స్టేషన్లు.గ్రామ స్వరాజ్యానికి ప్రతీక గ్రామ సచివాలయాలు.క్లాస్‌రూమ్‌లో డిజిటల్‌ బోర్డులు, విద్యార్థుల చేతిలో ట్యాబ్స్‌ కనిపిస్తున్నాయి.వాలంటీర్ల సేవలు కొనసాగాలంటే రెండు బటన్లు ఫ్యాన్‌పై నొక్కాలి.పేదవాడి భవిష్యత్‌కోసం రెండు బటన్లు ఫ్యాన్‌ గుర్తుపై నొక్కాలి.175, 175 అసెంబ్లీ, 3\25కు 25 ఎంపీ సీట్లు గెలవాల్సిందే.

Pm Modi Attacks Congress Ncp In Maharashtra Loksabha Campaign
ప్రచార వేడి: కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ సెటైర్లు

సోలాపూర్‌: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ విపక్షాలపై మాటల దాడి పెంచారు. మంగళవారం(ఏప్రిల్‌30) మహారాష్ట్రలోని సోలాపూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మాట్లాడారు. కాంగ్రెస్‌ కనీసం ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమయ్యే సీట్లలో కూడా పోటీ చేయడం లేదని ఎద్దేవా చేశారు.విదర్భ ప్రాంతంలో రైతుల దుస్థితికి ఎన్సీపీ(శరద్‌పవార్‌), కాంగ్రెస్‌ పార్టీయే కారణమని మండిపడ్డారు.‘దేశం కాంగ్రెస్‌ పార్టీకి 60 ఏళ్లు చాన్స్‌ ఇచ్చింది. ఈ 60 ఏళ్లలో ఎన్నో దేశాల రూపురేఖలు మారిపోయాయి. ఇక్కడ మాత్రం కాంగ్రెస్‌ కనీసం పొలాలకు నీళ్లు ఇవ్వలేకపోయింది. ఈ ప్రాంతం నుంచి ఒక పెద్ద లీడర్‌ 15 సంవత్సరాల క్రితం సీఎంగా చేశారు.కరువు ప్రాంతాలకు నీళ్లిస్తానని చెప్పి పదవిలోకి వచ్చాడు. కానీ ఆయన చెప్పినవేవీ జరగలేదు. ఇప్పుడు ఆయనను శిక్షించాల్సిన సమయం వచ్చింది’అని మాజీ సీఎం సుశీల్‌కుమార్‌షిండేను ఉద్దేశించి ప్రధాని పరోక్షంగా వ్యాఖ్యానించారు. ప్రస్తుత ఎన్నికల్లో సుశీల్‌షిండే కుమార్తె ప్రణతి షిండే సోలాపూర్‌ నుంచి కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.  

తప్పక చదవండి

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement