Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Ceo Sensational Announcement On Pinnelli Video
పిన్నెళ్లి వీడియోపై సీఈవో సంచలన ప్రకటన

సాక్షి, విజయవాడ: పిన్నెళ్లి వీడియోపై సీఈవో సంచలన ప్రకటన చేశారు. ఆ వీడియోను మేము విడుదల చేయలేదని.. ఎన్నికల కమిషన్ నుండి బయటకు వెళ్లలేదు.. అది ఎలా బయటకు వెళ్లిందో తెలుసుకుంటామని సీఈవో ముకేష్ కుమార్ మీనా అన్నారు.‘‘దర్యాప్తు సమయంలో ఎక్కడో, ఎవరి చేతినుండో బయటకు వెళ్లింది పాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్ పీవో, ఏపీవోలను సస్పెండ్ చేశాం. మాచర్లకు టీడీపీ నేతలు వెళ్లడం మంచిది కాదు. ఇప్పుడే మాచర్లలో పరిస్థితి అదుపులోకి వచ్చింది. టీడీపీ నాయకులకు అనుమతి లేదని చెప్పాం. బయట నాయకులు ఎవ్వరూ మాచర్లకు వెళ్లకూడదు ఎవ్వరినీ ఆ గ్రామాల్లోకి వెళ్లనీయొద్దని ఆదేశించాను’’ అని సీఈవో ముకేష్ కుమార్ మీనా చెప్పారు.

Why Indian Students Studying MBBS In Kyrgyzstan? Here's The Reason
కిర్గిస్తాన్‌కు మన వాళ్లు ఎందుకు వెళ్తారంటే?

గత కొన్ని రోజులుగా భారతీయ విద్యార్థులు కిర్గిస్తాన్ దేశంలో జరుగుతున్న ఘటనలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి చాలా వరకు ప్రశాంతంగా ఉంది. అయినా కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్న సూచనలు చేస్తున్నాయి కాలేజీలు. హాస్టళ్ల నుంచి బయటకు రావొద్దని తొలుత ఇండియన్​ ఎంబసీ హెచ్చరికలు జారీ చేసినా.. తర్వాత పరిస్థితిలో మార్పువచ్చింది. అసలు భారతీయ విద్యార్థులు ఈ దేశానికీ ఎందుకు వెళ్తున్నారు? అక్కడి కరెన్సీ విలువ ఇండియా కరెన్సీతో పోలిస్తే ఎలా ఉంటుంది? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.కిర్గిస్తాన్‌లో జరిగింది చిన్న గొడవేకిర్గిస్తాన్‌లోని ఓ యూనివర్సిటీలో ముగ్గురు స్థానిక విద్యార్థులు ఈజిప్ట్‌, బంగ్లాదేశ్‌ విద్యార్థులు ఉండే హాస్టల్‌కు వెళ్లారు. అక్కడ చిన్న గొడవ జరగగా.. స్థానిక విద్యార్థులను ఈజిప్టు విద్యార్థులు కొట్టినట్టు తెలిసింది. దీంతో స్థానికంగా కొన్ని ఆందోళనలు జరిగాయి. అయితే కిర్గిస్తాన్‌ ప్రభుత్వ పెద్దలు అందరూ రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. తమ దేశం శాంతి, సౌభాగ్యాలకు చిహ్నమని, విదేశీ విద్యార్థుల వల్ల ఆర్థిక వ్యవస్థకు ఎంతో ప్రయోజనం ఉందని ప్రకటనలు చేశారు. కిర్గిస్తాన్‌కు మనవాళ్లు ఎందుకు వెళ్తున్నారు?కిర్గిస్తాన్‌.. మధ్య ఆసియా ప్రాంతం. భౌగోళికంగా జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్‌ నుంచి కిర్గిస్తాన్‌కు వెయ్యి కిలోమీటర్ల కంటే తక్కువ దూరం. చాలా కాలం పాటు సోవియట్‌ పాలనలో ఉండడం వలన కిర్గిస్తాన్‌లో యూరోపియన్‌ కల్చర్‌ కనిపిస్తుంది. అందమైన కొండలు, గల గల పారే నదులు, పచ్చిక బయళ్లు, వాటి మధ్య రాజప్రాసాదాలు... ఇలా అందమైన ఈ ప్రాంతం విదేశీ విద్యార్థులను ఆకర్షిస్తోంది. విద్యార్థులు వారి సొంత దేశాలను వదిలి కిర్గిజిస్తాన్‌కు వెళ్లి చదువుకోవడానికి ప్రధాన కారణం.. అక్కడి చదువుకోవడానికి అయ్యే ఖర్చులు తక్కువగా ఉండటమే. మన దేశంలో మెడిసిన్ చేయాలంటే సంవత్సరానికి కనీసం రూ. 20 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకు ఖర్చు అవుతుంది. కిర్గిజిస్తాన్‌లో అయితే ఏడాదికి సుమారు రూ. 15 నుంచి 20 లక్షలు (హాస్టల్.. ఫుడ్‌తో సహా) ఖర్చు పెడితే సరిపోతుందని చెబుతున్నారు.కిర్గిస్తాన్‌ కరెన్సీ విలువఇక కరెన్సీ విషయానికి వస్తే.. కిర్గిస్తాన్‌ కరెన్సీ విలువ, ఇండియన్ రూపాయికి దాదాపు సమానంగా ఉంటుంది. అయితే ఖర్చుల పరంగా చూస్తే మనదేశం కంటే అక్కడ కొంత తక్కువని తెలుస్తోంది. ఈ కారణంగానే ఆ దేశానికి.. పలు దేశాల నుంచి విద్యార్థులు వెళ్లి చదువుకుంటున్నారు.కిర్గిస్తాన్‌కు ఆదాయం ఎలా?కిర్గిస్తాన్‌లో పరిశ్రమలు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు తక్కువ. అయితే ఇక్కడ విలువైన గనులు, ప్రకృతి వనరులు ఉన్నాయి. ఈ దేశానికి అత్యంత ఎక్కువ ఆదాయం వచ్చేది బంగారం నిల్వల నుంచే. బంగారంతో పాటు వెండి, యురేనియం, బొగ్గు నిల్వలు అపారంగా ఉన్నాయి. అయితే వీటితో పాటు పర్యాటకం, విదేశీయుల విద్య ఇప్పుడు కిర్గిస్తాన్‌కు అత్యంత కీలకంగా మారాయి. ఇండియన్‌ మెడిసిన్‌ కేరాఫ్‌ కిర్గిస్తాన్‌కిర్గిస్తాన్‌లో పాతికేళ్ల క్రితమే భారతీయులు మెడిసిన్‌ విద్యకు బాట వేసుకున్నారు. ఇండియా నుంచే ఫ్యాకల్టీని తెస్తున్నారు. ఇక్కడి యూనివర్సిటీలు, కాలేజీల్లో చాలా వరకు ఇండియన్‌ డాక్టర్ల టీచింగ్‌ క్లాసులు ఉంటాయి. దీని వల్ల మన వాళ్లు భారీగా కిర్గిస్తాన్‌కు క్యూ కడుతున్నారు.ప్రస్తుతం కిర్గిస్తాన్‌లో 25వేల మంది భారతీయ విద్యార్థులు ఉండొచ్చని చెబుతున్నారు. వీరితో పాటు పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, ఈజిప్టు లాంటి దేశాల నుంచి కూడా భారీగా విద్యార్థులు వచ్చి కిర్గిస్తాన్‌లో చదువుతున్నారు. ఇక్కడ మెడిసిన్‌ చదివి, ఇండియాలో FMGE అంటే Foreign Medical Graduate Examination పరీక్ష రాయాలి. దీంట్లో అర్హత సాధిస్తే.. వైద్యుడిగా ప్రాక్టీస్‌ చేసుకోవచ్చు. ఇండియాలో మంచి ప్రైవేట్‌ కాలేజీలో మెడిసిన్‌ చదవాలంటే కోటి ఖర్చు. అదే కిర్గిస్తాన్‌లో అయితే పాతిక లక్షల్లో మెడిసిన్‌ పూర్తి చేసుకోవచ్చు. పైగా FMGE పరీక్షకు కూడా కిర్గిస్తాన్‌లోనే కోచింగ్‌ ఇస్తున్నారు. పెరిగిన విద్యార్థుల వల్ల ఇండియన్‌ హాస్టళ్లు, సెక్యూరిటీ, ట్రాన్స్‌పోర్ట్ ఇతర సౌకర్యాలు చాలా వరకు మెరుగుపరిచారు. అందుకే కిర్గిస్తాన్‌ వైపు ఇప్పుడు చాలా మంది చూస్తున్నారు.

Sajjala Suspects EC Behaviour Over Macharla EVM Video Leak
ఆ ఒక్క వీడియోనే లీకైందా?.. ఈసీకి సూటి ప్రశ్నలు సంధించిన సజ్జల

గుంటూరు, సాక్షి: మాచర్ల పాల్వాయి గేట్‌ ఈవీఎం ధ్వంసం ఉదంతంపై తెలుగు రాజకీయాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ వీడియో లీకేజీ వ్యవహారంలో ఎన్నికల సంఘం తీరుపైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే విషయంపై స్పందిస్తూ ఎన్నికల సంఘానికి కొన్ని సూటి ప్రశ్నలు సంధించారు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ‘‘మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారని చెబుతున్న పాల్వాయి గేట్‌ వీడియో నిజమైనదేనని ఎన్నికల సంఘం ప్రకటిస్తుందా?. వీడియో సరైందేనా? కాదా? అనేది నిర్దారించకుండానే ఎన్నికల సంఘం చర్యలకు ఎలా దిగుతుంది?. ఒక వేళ నిజమైనదే అయితే ఆ వీడియో సోషల్‌ మీడియాలోకి ఎలా వస్తుంది?.. A set of questions to the EC in light of how the Commission dealt with the recent Macherla issue - While Pinnelli deals with the charges legally, the @YSRCParty has certain questions which the @ECISVEEP must address.— Sajjala Ramakrishna Reddy (@SRKRSajjala) May 23, 2024 A set of questions to the EC in light of how the Commission dealt with the recent Macherla issue - While Pinnelli deals with the charges legally, the @YSRCParty has certain questions which the @ECISVEEP must address.— Sajjala Ramakrishna Reddy (@SRKRSajjala) May 23, 2024 .. మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్‌ నాడు ఈవీఎంలకు సంబంధించి ఏడు ఘటనలు జరిగాయని ఈసీనే చెబుతుంది కదా.! అలాంటప్పుడు కేవలం ఒక వీడియో మాత్రమే ఎలా లీక్‌ చేస్తుంది?. ఈసీకి చిత్తశుద్ధి ఉంటే మొత్తం వీడియోలను, 7 చోట్ల జరిగిన ఘటనలకు సంబంధించిన ఫుల్‌ వీడియోలను ఎందుకు బయటపెట్టదు?. 3. More importantly, in the videos attached below, there is clear evidence of TDP goons attacking innocent voters. Why has no action been initiated in these instances? pic.twitter.com/iYVvwO5nXj— Sajjala Ramakrishna Reddy (@SRKRSajjala) May 23, 2024అన్ని వీడియోలు బయటకు వచ్చినప్పుడే అసలేం జరిగిందన్నది బయటకు వస్తుంది కానీ.. ఒక చిన్న క్లిప్పింగ్‌ను మాత్రమే బయటకు ఎలా వస్తుంది?తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు, వారిని గుర్తించేందుకు ఈసీ ఎందుకు సరైన పద్ధతిలో నిర్ణయాలు తీసుకోవడం లేదు?. సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అవుతున్న రెండు వీడియోలను పరిశీలిస్తే.. అమాయక ఓటర్లపై టీడీపీ గుండాలు దాడి చేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. వారి మీద ఎన్నికల సంఘం చర్యలెందుకు తీసుకోవడం లేదు? దాని వెనక ఉన్నవారిని ఎందుకు పట్టుకోవడం లేదు? అని సజ్జల ప్రశ్నించారు. వీటికి సమాధానాలేవీ?13న జరిగితే 21వ తేదీన వీడియో బయటకు ఎందుకు వచ్చింది?గుర్తు తెలియని వ్యక్తులని ఎలా ఫిర్యాదు చేయగలిగారు?స్వయంగా ఎమ్మెల్యే ఉంటే ఇంత గోప్యత ఎందుకు? ఇన్నాళ్లూ టీడీపీ వాళ్లు గుర్తించలేదా?పిన్నెల్లి అనుచరులు తమను బెదిరించారనే టీడీపీ వాదన నమ్మేలా ఉందా?ఈ నెల 20న ఫిర్యాదు నమోదు అయ్యిందని ఈసీ వివరణ, అంటే.. ఇంతకాలం సీఈవో ఆఫీస్‌ ఆ ఫుటేజీని చూడలేదా?అసలు ఇంతకాలం ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ ఏం చేశారు?మిగతా వీడియోల సంగతి ఏంటి? అందులో ఎవరు ఇన్‌వాల్వ్‌ అయ్యారనేది ఈసీ ఎందుకు దాస్తోంది?

Lalit Modi Blasts ICC: Is $20000 Per Seat For Ind vs Pak T20 WC 2024 Match
IND vs PAK: ఒక్క టికెట్‌ రూ. 16 లక్షలా?.. ఐసీసీపై లలిత్‌ మోదీ ఫైర్‌

టీ20 ప్రపంచకప్‌-2024 టోర్నీ ఆరంభానికి సమయం సమీపిస్తోంది. జూన్‌ 1 ఈ ఐసీసీ ఈవెంట్‌కు తెరలేవనుంది. ఇక ఈ మెగా టోర్నమెంట్‌కు అమెరికా తొలిసారిగా ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే.వెస్టిండీస్‌తో కలిసి వరల్డ్‌కప్‌ నిర్వహణ హక్కులు దక్కించుకున్న యూఎస్‌ఏ.. ఇప్పటికే మ్యాచ్‌లు జరిగే స్టేడియాలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే పనిలో మునిగిపోయింది.చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆరోజేఇదిలా ఉంటే.. టీమిండియా ఈ ఈవెంట్లో తమ లీగ్‌ మ్యాచ్‌లన్నీ యూఎస్‌ఏలోనే ఆడనుంది. జూన్‌ 5 న ఐర్లాండ్‌తో మ్యాచ్‌ ద్వారా తాజా ఎడిషన్‌లో‌ తమ ప్రయాణం మొదలుపెట్టనున్న రోహిత్‌ సేన.. జూన్‌ 9న తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది.ఇక దాయాదుల పోరు అంటే అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో తెలిసిందే. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా ద్వైపాక్షిక సిరీస్‌లు ఎప్పుడో రద్దు కాగా.. కేవలం ఆసియా కప్‌, ప్రపంచకప్‌ వంటి మెగా ఈవెంట్లలో మాత్రమే టీమిండియా- పాక్‌లు ముఖాముఖి తలపడుతున్నాయి.ఈ నేపథ్యంలో ఈ హైవోల్టేజీ మ్యాచ్‌లకు మరింత ఆదరణ పెరిగింది. ఈ క్రమంలో ఐసీసీ ఈ క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునే క్రమంలో మరీ దారుణంగా ప్రవర్తిస్తోందంటూ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ సృష్టికర్త, మాజీ కమిషనర్‌ లలిత్‌ మోదీ మండిపడ్డాడు.లాభాలు దండుకోడానికి కాదుఇండియా- పాక్‌ మ్యాచ్‌కు వేదికైన న్యూయార్క్‌లోని నసావూ కౌంటీ స్టేడియంలో టికెట్‌ రేట్లు ఆకాశాన్నంటుతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ మేరకు.. ‘‘వరల్డ్‌కప్‌లో ఇండియా- పాక్‌ మ్యాచ్‌ నేపథ్యంలో డైమండ్‌ క్లబ్‌ సీటు టిక్కెట్లను ఏకంగా 20000 డాలర్లకు అమ్ముతున్నారని తెలిసి షాకయ్యాను.అమెరికాలో వరల్డ్‌కప్‌ నిర్వహిస్తోంది క్రికెట్‌కు ఇక్కడ ఆదరణ పెంచడానికి, ఫ్యాన్‌ ఎంగేజ్‌మెంట్‌ కోసం మాత్రమే అనుకున్నాం. కానీ మీరు లాభాలు దండుకోడానికి కాదు’’ అంటూ ఐసీసీ తీరును లలిత్‌ మోదీ ఎక్స్‌ వేదికగా విమర్శించాడు. దాదాపు రూ. 16 లక్షలకు పైనే!కాగా 20 వేల అమెరికన్‌ డాలర్లు అంటే భారత కరెన్సీలో ఈ మొత్తం దాదాపు రూ. 16 లక్షలకు పైనే! ఇక లలిత్‌ మోదీ ట్వీట్‌ చూసిన ఫ్యాన్స్‌ టికెట్‌ ధర తెలిసి ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే, ఈ ధరలకు సంబంధించి ఇంత వరకు అధికారిక సమాచారం మాత్రం లేదు.కాగా క్యాష్‌ రిచ్‌ లీగ్‌ను సృష్టించిన లలిత్‌ మోదీ ఆర్థిక అవకతవకలకు పాల్పడి దేశం నుంచి పారిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతడు లండన్‌లో తలదాచుకుంటున్నట్లు సమాచారం.Shocked to learn that @ICC is selling tickets for Diamond Club at $20000 per seat for the #indvspak WC game. The WC in the US is for game expansion & fan engagement, not a means to make profits on gate collections. $2750 for a ticket It’s just #notcricket #intlcouncilofcrooks pic.twitter.com/lSuDrxHGaO— Lalit Kumar Modi (@LalitKModi) May 22, 2024

Ksr Comments On Exit polls Win Predictions In AP Elections
మళ్లీ అధికారం వైఎస్సార్‌సీపీదే.. అంచనాలు ఇవే

రెండు రోజుల క్రితం జంగారెడ్డి గూడెం నుంచి ఒక మిత్రుడు ఫోన్ చేశారు. ఆయన ఆసక్తికరమైన విషయం చెప్పారు. అక్కడ ఒక గ్రామానికి చెందిన నలుగురైదుగురు యువకులు ఐఏఎస్ పరీక్షల కోసం సిద్ధం అవుతున్నారట. ఏపీలో శాసనసభ ఎన్నికలపై ఆసక్తితో వారు తమంతట తాము సర్వే చేపట్టారట. వారికి ఆశ్చర్యపోయే విషయాలు తెలిశాయట. వారి పరిశీలన ప్రకారం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికు ఏభైఎనిమిది శాతం ఓటర్లు మద్దతు ఇస్తున్నారని తేలిందట. వారు ఆయా ప్రాంతాలలో ఈ స్టడీ చేశారట. వారు ప్రత్యేకంగా ఏ పార్టీపై అభిమానం ఉన్నవారు కాదు. ఇండిపెండెంట్ గా పరిశీలన చేశారు.⇒ ఇది విన్న నాకు కొద్ది రోజుల క్రితం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ప్రభంజనం వస్తుందని 151 సీట్లు మించి వస్తాయని అన్న విషయం గుర్తుకు వచ్చింది. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో వివిధ వర్గాలలో తీవ్రమైన చర్చ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ జనసేన, బీజేపీలతో కూటమి కట్టిన తర్వాత వారి పరిస్థితి మెరుగైందని టీడీపీ అభిమానుల భావన కావచ్చు. కానీ ప్రజలు కూటమిని స్వీకరించారా? లేదా? అన్నది చర్చనీయాంశంగా ఉంది. ఎగ్జిట్ పోల్స్ అని చెప్పడం లేదు కానీ, దాదాపు అదే తరహాలో జరిగిన స్టడీలలో అత్యధిక భాగం వైఎస్సార్‌సీపీ విజయాన్ని అంచనా వేస్తున్నాయి. అందులో అంకెలు కొంచెం అటు, ఇటుగా ఉండవచ్చు కానీ, గెలుపుపై తేడా ఉండడం లేదు.⇒ ఈ నేపథ్యంలో కొన్ని ఫేక్ పోల్స్ సర్వేలు కూడా బయటకు వస్తున్నాయి. అలా చేసిన వాటిలో అత్యధికం తెలుగుదేశం పార్టీవే ఉండడం గమనించదగ్గ అంశం. ఉదాహరణకు హిందుస్తాన్ టైమ్స్ లో ఏదో సర్వే వచ్చిందని, అందులో టీడీపీ కూటమికి అనుకూల ఫలితాలు ఉన్నాయని ప్రచారం చేశారు. ఆ సంగతి తెలిసిన ఆ మీడియా తాము అలాంటి సర్వే ఏదీ ప్రచురించలేదని ఖండన ఇవ్వాల్సి వచ్చింది. అంతేకాదు ఒక తెలుగు వార్తా చానల్ ఇచ్చిందంటూ ఇలాగే టీడీపీ గెలవబోతోందంటూ ప్రచారం చేస్తే, అది కూడా వాస్తవం కాదని వెల్లడైంది.వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా వచ్చిన సర్వేలలో అత్యధిక భాగం కాస్త, కూస్తో అందరికి తెలిసిన సంస్థలవే కావడం విశేషం.⇒ ఇండియా టుడే సీనియర్ పాత్రికేయుడు రాజ్ దీప్ సర్దేశాయ్ ఆ మధ్య ఏపీలో పర్యటించారు. నాయకుల ఇంటర్వ్యూలతో పాటు జనంలో కూడా తిరిగారు. చివరిగా విశాఖ తీరంలో కూర్చుని ఆయన ఒక వ్యాఖ్య చేశారు. మహిళలు, పేదలు ఎటు ఎక్కువ ఓట్లు వేస్తే వారిదే గెలుపు అని వ్యాఖ్యానించడం ద్వారా ఒక స్పష్టమైన పరోక్ష సంకేతం ఇచ్చారు. మహిళలు అత్యధికంగా ఓట్లు వేయడం, వారిలో పలువురు వైఎస్సార్‌సీపీ పట్ల సానుకూల ధోరణితో ఉండడం వంటి అంశాల నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైఎస్సార్‌సీపీ విజయాన్ని సూచిస్తున్నాయన్న భావన ఏర్పడింది.⇒ అలాగే మరో సీనియర్ పాత్రికేయుడు ఇండియా టుడే లో ఒక వ్యాసం రాస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు బాగా ప్రభావితం చేస్తున్నాయని, అవే ఎన్నికల ఫలితాలను నిర్దేశించనున్నాయని అభిప్రాయపడ్డారు. పివిఎన్ శర్మ అనే సీనియర్ జర్నలిస్టు డిల్లీ నుంచి ఒక పోస్టు పెడుతూ వలంటీర్ల వ్యవస్థ వైఎస్సార్‌సీపీకి బాగా ఉపకరించిందని పేర్కొన్నారు. టీడీపీ సృష్టించిన వివాదంతో రాజీనామా చేసిన వేలాది మంది వలంటీర్లు తమ పరిధులలోని వివిధ వర్గాల ప్రజలను ఉదయం, సాయంత్రం ఓటింగ్ నిమిత్తం సమీకరించారని తెలిపారు. సాయంత్రం వేళ పోలింగ్ పెరగడానికి వారే కారణమని ఆయనతో పాటు మరికొందరు విశ్లేషించారు.⇒ వివిధ ప్రాంతాల నుంచి కార్లలో వచ్చిన టీడీపీ మద్దతుదారుల హడావుడిని గమనించిన మీదట అప్పటి వరకు ఓటు వేయకుండా వేచి ఉన్న మహిళలు, పేదవర్గాల వారు సాయంత్రం పోలింగ్ బూత్‌లకు వెళ్లి ఓట్లు వేశారని, దానివల్లే ఓట్ల పోలింగ్ శాతం పెరిగిందని చెబుతున్నారు. ఒక సీనియర్ అధికారి అంచనా ప్రకారం సాయంత్రం నుంచి రాత్రి పొద్దు పోయేవరకు జరిగిన పోలింగ్ శాతం పన్నెండు శాతం వరకు ఉండవచ్చట. ఇది కూడా నిర్ణయాత్మకంగా ఉండవచ్చని భావిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ, టీడీపీ కూటమి పోటాపోటీగా ఓటింగ్ శాతం పెంచడానికి యత్నించాయి. కాగా ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వారికన్నా పేద, బలహీనవర్గాలు అధికంగా ఉండడం వైఎస్సార్‌సీపీకి ప్లస్ అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.⇒ కాగా కొన్నిచోట్ల పోలింగ్ అధికారులలో కొంతమంది వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకంగా ఉన్నారని, వారు కావాలని పోలింగ్‌ను ఆలస్యం చేస్తున్నారని గమనించిన ఓటర్లు ఎంతో ఓపికతో రాత్రి పొద్దు పోయేవరకు నిలబడి మరీ ఓట్లు వేసి వెళ్లారని కొందరు చెప్పారు. ఉదాహరణకు తెనాలి నియోజకవర్గంలో గుదిబండివారి పాలెంలో అర్ధరాత్రి అయినా ఒక్కరు కూడ కదలకుండా ఓట్లు వేసి మరీ వెళ్లారని ఆ గ్రామానికి చెందిన వ్యక్తి తెలిపారు. ఇక బెట్టింగ్‌ల వారిది మరో కథ. వారు కావాలని పందాలకు పలువురిని ఆకర్షించడానికి రకరకాల వ్యూహాలు అమలు చేశారని సమాచారం వస్తోంది. ఉదాహరణకు కొద్ది నెలల క్రితం ఈ బెట్టింగ్ నిర్వాహకులు వైఎస్సార్‌సీపీకి ఏభైమూడు సీట్లు వస్తాయని అంచనా వేస్తే, అది నిజమేనని నమ్మి టీడీపీకి చెందినవారు పందాలు కాయడానికి ఉత్సాహపడ్డారట. ⇒ ఆ తర్వాత క్రమేపి ఆ సంఖ్యను మార్చుతూ వైఎస్సార్‌సీపీకి 86-88 సీట్లు వస్తాయని వారు పేర్కొన్నారట. అంటే ఏమిటి దీని అర్ధం. వైఎస్సార్‌సీపీకి అధికారం వస్తుందని చెప్పడమే కదా! కడప జిల్లాలోని ఒక నియోజకవర్గంకు చెందిన మిత్రుడు ఒకరు కొద్ది రోజుల క్రితం కలిశారు. ఆయన ఇంకో విషయం చెప్పారు. ఆ నియోజకవర్గంలో పోటీ చాలా తీవ్రంగా ఉందని ప్రచారం జరిగింది. అక్కడ పరిస్థితి ఏమిటని అడిగితే అతను జవాబిస్తూ చాలా చోట్ల ఇలాగే ప్రచారం జరుగుతోందని, ఇదంతా బెట్టింగ్ రాయళ్ల పని అని అన్నారు.⇒ తమ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ఇరవైవేలకు పైగా మెజార్టీ వచ్చే అవకాశం ఉందని, కానీ టైట్ అని ప్రచారం చేస్తే రెండు పార్టీలకు చెందినవారు పందాలు కాస్తారన్న ఉద్దేశంతో ఇలాంటి వదంతులు సృష్టిస్తున్నారని అన్నారు. అది నిజమేనని అనిపించింది. ఎందుకంటే ఏపీలో పలు నియోజకవర్గాలపై ఇలాంటి పందాలు సాగుతున్నాయి. కాగా కుప్పంలో చంద్రబాబు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తారా? లేదా అన్నదానిపై కూడా బెట్టింగులు జరుగుతున్నాయని చెబుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఒక నియోజకవర్గంలో ఓటు వేసిన ఒకరు మాట్లాడుతూ కాపు సామాజికవర్గం ఏకపక్షంగా టీడీపీ కూటమికి ఓటు వేశారన్న ప్రచారం వాస్తవం కాదని అబిప్రాయపడ్డారు.⇒ జనసేనను టీడీపీ అధినేత చంద్రబాబు కాళ్ల వద్ద పవన్ కల్యాణ్ పడేశారని బాధ పడుతున్నవారు కూడా గణనీయంగా ఉన్నారని అన్నారు. టీడీపీ నేతలు గంటా శ్రీనివాసరావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రఘురామకృష్ణరాజులు టీడీపీ గెలుపు ఖాయమని చెబుతున్నా, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం పెట్టి ఆ విషయాన్ని ఎందుకు ప్రకటించలేకపోయారని వైఎస్సార్‌సీపీవారు అడుగుతున్నారు. అంతేకాదు టీడీపీకి సలహాదారుగా పనిచేసిన రాబిన్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన సర్వే గురించి సోషల్ మీడియాలో వస్తున్న కధనాలను టీడీపీ ఎందుకు ఖండించలేకపోతోందని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈయన బృందం టీడీపీ గెలుపుపై సందేహాలు వ్యక్తం చేసిందని ప్రచారం జరుగుతోంది. అది నిజమో, కాదో తెలియదు.⇒ ఇంతవరకు సుమారు ముప్పైకి పైగా పోస్ట్ పోల్ అంచనాలను ఇచ్చాయి. వాటిలో ఒకటి, రెండు తప్ప మిగిలినవన్నీ వైఎస్సార్‌సీపీనే గెలుస్తుందని చెబుతున్నాయి. అయినా పందాలు కాయవద్దని, అది చట్టరీత్యా నేరమని ఎవరైనా చెబితే తెలుగుదేశంకు చెందిన కొంతమంది బెట్టింగులు వద్దంటే టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్లే కదా అని వితండ వాదన తెస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల జనం నష్టపోతారు. గతంలో 2009లో ఒక వర్గం, 2014 లో మరో వర్గం, 2019 లో ఇంకో వర్గం బోగస్ సర్వేలను నమ్మి పందాలు కాసి కోట్ల రూపాయల మేర కోల్పోయారు. వీటిని దృష్టిలో పెట్టుకుని పందాల జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది.⇒ ఏది ఏమైనా ప్రజాభిప్రాయం వైఎస్సార్‌సీపీకి, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికు అనుకూలంగా ఉందన్నది ఎక్కువమంది నమ్మకం. బలహీనవర్గాలు, మహిళలు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికు ఓటు బ్యాంకు అయ్యారని వారు చెబుతున్నారు. ఎక్జిట్ పోల్‌ను పర్యవేక్షించిన ఒకరిని దీని గురించి ప్రశ్నిస్తే అలాంటి సమాధానమే ఇచ్చారు. కాగా తాము ఇచ్చిన సూపర్ సిక్స్ కు జనం కొంతైనా ఆకర్షితులు అయి ఉంటారని, అంతేకాక తాము లాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చేసిన అబద్దపు ప్రచారం కొద్దిగానైనా ప్రభావితం చేసి ఉండకపోతుందా అని టీడీపీ మద్దతుదారుడు ఒకరు పేర్కొన్నారు. ఈ మొత్తం ఎన్నిక వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కావాలా? వద్దా? అనే దానిపైనే జరిగిందని, వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి vs చంద్రబాబు కాదని ఆయనే అభిప్రాయపడడం విశేషం. దీనిని బట్టి ఈ ఎన్నికలు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కేంద్రంగా జరిగాయని, ఆయన స్కీములు, ఇతర కార్యక్రమాల చుట్టూనే జరిగాయని తేలుతోంది. అందుకే వైఎస్సార్‌సీపీ వర్గాలు గెలుపుపై అంత ధీమాతో ఉన్నాయని అనుకోవచ్చు.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

KTR Slams Jupally And Congress On Sridhar reddy Assassination
శ్రీధర్‌ రెడ్డి హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి: కేటీఆర్‌

సాక్షి, వనపర్తి: కాంగ్రెస్‌ పార్టీ పేరుకే ప్రజాపాలన.. చేస్తుంది ప్రతీకార పాలన అంటూ మండిపడ్డారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. బీఆర్‌ఎస్‌ నేత శ్రీధర్‌ రెడ్డి హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. జూపల్లి కృష్ణారావు ప్రమేయంతోనే హత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. మంత్రి జూపల్లిని వెంటనే బర్త్‌రఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. వరుస హత్యలపై జ్యుడీషియల్‌ విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. కొల్లాపూర్‌ ప్రాంతాన్ని కల్లోల ప్రాంతంగా ప్రకటించాలన్నారు.వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడు శ్రీధర్‌ రెడ్డి అంతిమయాత్రలో కేటీఆర్‌, శ్రీనివాస్‌ గౌడ్‌తోపాటు మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, గువ్వల బాలరాజు, నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ పాల్గొన్నారు. అనంతరం కేటీఆర్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి హత్యలు ఎప్పుడు జరగలేదని తెలిపారు. తాము అనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇలా ఉండేదా అని ప్రశ్నించారు.రాజకీయ హత్యలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆరోపించారు. ఈ హత్యలు జూపల్లి కృష్ణారావు సహకారం లేకుండ జరగవని అన్నారు. తెలంగాణలో ఎక్కడలేని ఫ్యాక్షని సంస్కృతి కొల్లాపూర్‌లో నెలకొందని, శ్రీధర్ రెడ్డి హత్య విషయంలో నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. హత్యలను ఇలాగే కొనసాగిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు కేటీఆర్‌. మా వాళ్ళని ఎలా రక్షించుకోవాలో తమకు తెలుసని, ఎంతటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. హత్యల సంస్కృతి తెలంగాణకి మంచిది కాదని, శ్రీధర్ రెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని హామీనిచ్చారు.

HD Deve Gowda Warns Prajwal Revanna To 'Surrender Or Face My Anger'
‘లొంగిపో.. లేదంటే’.. ప్రజ్వల్‌కు మాజీ ప్రధాని దేవేగౌడ వార్నింగ్‌

బెంగళూరు: లైంగిక దాడి కేసు నమోదైన తన మనవడు ప్రజ్వల్‌ రేవణ్ణకు మాజీ ప్రధాని దేవెగౌడ వార్నింగ్‌ ఇచ్చారు. ప్రజ్వల్‌ ఎక్కడ ఉన్నా వెంటనే భారత్‌కు వచ్చి పోలీసులకు లొంగి పోవాలన్నారు. లేకపోతే తన ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని దేవెగౌడ తీవ్రంగా హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్‌’లో ఓ లేఖ విడుదల చేశారు.‘‘ప్రజ్వల్‌ రేవణ్ణ ఎక్కడ ఉన్నా వెంటనే ఇండియాకు తిరిగి రావాలి. పోలీసులకు లొంగిపోయి న్యాయ ప్రక్రియను ఎదుర్కొవాలి. ఇది విజ్ఞప్తి చేయటం కాదు. హెచ్చరిక జారీ చేస్తున్నా. ప్రజ్వల్ నా హెచ్చరికను లెక్క చేయకపోతే.. నా ఆగ్రహానికి, కుటుంబ సభ్యులు కోపానికి గురికావాల్సి వస్తుంది. ప్రజ్వల్‌పై వచ్చిన ఆరోపణలను చట్టం చూసుకుంటుంది. కానీ కుటుంబం చెప్పిన మాట వినకపోతే ఒంటరిగా మిగిలిపోయేలా చేస్తుంది. నాపైన అతనికి గౌరవం ఉంటే వెంటనే భారత్‌కు తిరిగి రావాలి’’ అని దేవెగౌడ తాను విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.I have issued a warning to @iPrajwalRevanna to return immediately from wherever he is and subject himself to the legal process. He should not test my patience any further. pic.twitter.com/kCMuNJOvAo— H D Deve Gowda (@H_D_Devegowda) May 23, 2024 ప్రజ్వల్‌ రేవణ్ణపై నమోదైన లైంగిక దాడి కేసు, ఆయనకు సంబంధించిన అసభ్య వీడియోలై దర్యాప్తు చేయడానికి కర్ణాటక ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు సీఎం సిద్ధరామయ్య ప్రజ్వల్‌ రేవణ్ణ దౌత్య పాస్‌పోర్టును రద్దు చేయాలని ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు.

Actor Ravi Krishna Says He Missed Chance In Pushpa 2 Movie
పుష్ప 2 మూవీలో ఛాన్స్‌ వదిలేసుకున్నా: రవి కృష్ణ

మనుషుల మధ్య ప్రేమ ఎప్పుడూ ఉండేదే! అదే దెయ్యాన్ని ప్రేమిస్తే.. దెయ్యాన్ని చూస్తే భయపడతారు కానీ ఎవరైనా ప్రేమిస్తారా? అంటారేమో! ఈ సినిమాలో అంతే.. హీరో ఆశిష్‌ ఘోస్ట్‌తో లవ్‌లో పడతాడు. వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ లవ్‌ మీ. ఇఫ్‌ యూ డేర్‌ అనేది క్యాప్షన్‌. ఈ సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ ఈవెంట్‌లో నటుడు రవికృష్ణ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు.'లవ్‌ మీ సినిమాలో యాక్ట్‌ చేస్తున్నప్పుడు నాకు పుష్ప 2లో నటించే ఛాన్స్‌ వచ్చింది. కానీ డేట్స్‌ క్లాష్‌ అవడం వల్ల ఆ సినిమా చేయలేకపోయాను. అంత పెద్ద సినిమా మిస్‌ చేసుకున్నప్పటికీ ఈ మూవీ నాకొక మైల్‌ స్టోన్‌గా ఉండిపోతుందన్న నమ్మకముంది. నన్ను నమ్మి ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్‌' అని పేర్కొన్నాడు. లవ్‌ మీ సినిమా మే 25న విడుదల కానుంది. చదవండి: పవిత్ర-చందు మరణం.. అదే అసలు కారణమన్న నరేశ్‌

Ap Elections 2024 May 23rd Political Updates Telugu
May 23rd: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌

May 23rd AP Elections 2024 News Political Updates..7:30 PM, May 23rd, 2024పల్నాడు జిల్లాలో భారీగా అరెస్ట్‌లుపోలింగ్‌ రోజు, తర్వాత జరిగిన విధ్వంసం.. పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తల అరెస్ట్‌పిడుగురాళ్లకు చెందిన 47 మంది టీడీపీ నేతల అరెస్ట్‌తంగెడకు చెందిన 11 మంది టీడీపీ కార్యకర్తల అరెస్ట్‌వీరితో పాటు మరో 22 మందిని అరెస్ట్‌ చేసిన పోలీసులు5:56 PM, May 23rd, 2024రాష్ట్రంలో చంద్రబాబు విధ్వంసం సృష్టించారు: ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డిసీఈవో ముఖేష్ కుమార్ మీనాకు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదుఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై టీడీపీ దాడులు చేసిందిపోలింగ్ రోజు నుంచి టీడీపీ అరాచకాలపై మేము ఈసీకి ఫిర్యాదు చేస్తున్నాంమేము 60కి పైగా పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ జరపాలని కోరాంవెబ్ కెమెరాల ఫుటేజీ ఆధారంగా విచారణ జరిపి రీపోలింగ్ జరపాలని కోరాంఈసీ స్పందించకపోతే రిగ్గింగ్‌పై హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు పోరాటం చేస్తాంఓటు వేసిన వారిని టీడీపీ వాళ్లు కొట్టి, చంపాలని చుస్తే పోలీసులు స్పందించలేదుఎన్నికలకు వారం రోజుల ముందు పోలీసులను మార్చారుదాని వల్లనే హింస చెలరేగిందిఈ హింసకి బీజేపీ, టీడీపీ, ఈసీ ఎవరు బాధ్యత వహిస్తారు?ఎన్ని చోట్ల టీడీపీ రిగ్గింగ్ చేసినా ప్రజలు మాత్రం జగన్‌ని గెలిపించాలని నిర్ణయించారుమాచర్లలో తుమ్రకోట, వెల్దుర్తి వంటి చోట్ల టీడీపీ రిగ్గింగ్ చేసిందిటీడీపీ రిగ్గింగ్ చేసినా ఈసీ చర్యలు తీసుకోవడం లేదుఅయినా భద్రత చర్యలు తీసుకోలేదు: ఎమ్మెల్యే మల్లాది విష్ణుసమస్యాత్మక పోలింగ్ కేంద్రాలకు ముందే ఈసీ దృష్టికి తీసుకుని వెళ్లాంముందస్తు భద్రత కల్పించమని అడిగాంఅయినా భద్రత చర్యలు తీసుకోలేదుపురందేశ్వరి అధికారులను మార్చమని ఒత్తిడి తెచ్చారుఆమె చేసిన ఒత్తిడి నిర్ణయంతో హింస జరిగింది4:54 PM, May 23rd, 2024పల్నాడులో హింసాత్మక ఘటనలపై సిట్‌ విచారణరెంటచింతల పీఎస్‌లో కొనసాగుతున్న సిట్‌ విచారణబెట్టిపాలెం, తమృకోట గ్రామస్తులను విచారిస్తున్న సిట్‌హింసకు పాల్పడిన కొంతమందిని గుర్తించిన సిట్‌4:19 PM, May 23rd, 2024ఈసీలో ఇంటిదొంగలెవరు?లోకేష్‌కు చేర్చింది ఈసీలోని ఇంటి దొంగలేనా?ఏపీ ఎలక్షన్‌ కమిషన్‌ తీరుపై అనుమానాలుఈసీ అనుమతి లేకుండా బయటకు వెళ్లిన వీడియో ఫుటేజ్‌రిటర్నింగ్‌ అధికారి పరిధిలో ఉండాల్సిన వీడియోను అమ్మేశారా?నారా, దగ్గుబాటి కుటుంబాలకు ఈసీ దాసోహమైందా?పచ్చ బ్యాచ్‌ కంప్లయింట్‌ చేయడంతో బయటకొచ్చి ప్రెస్‌మీట్‌ పెట్టిన ఎంకే మీనాలోకేష్‌ ట్విట్టర్‌కు వీడియో ఎలా చేరిందన్న దానిపై ఎంకే మీనా మౌనంతాజాగా వీడియో తాము విడుదల చేయలేదంటూ కూల్‌గా చెప్పిన సీఈవో మీనావీడియో ఎవరు రిలీజ్‌ చేశారో మాత్రం చెప్పని సీఈవో4:05 PM, May 23rd, 2024ఏపీ హైకోర్టును ఆశ్రయించిన పిన్నెల్లిహైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ వేసిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికాసేపట్లో విచారణ జరపనున్న హైకోర్టు3:48 PM, May 23rd, 2024అంబటి రాంబాబు ట్వీట్‌వైరల్ అవుతున్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి వీడియో ఎన్నికల కమిషన్‌కు సంబంధం లేదని ప్రకటించింది అంటే పోలీసులు, అధికారులు టీడీపీతో ఎంతగా కుమ్మక్కయ్యారో తెలుస్తోందిపిన్నెల్లిపై ఫేక్‌ వీడియోను ఎక్స్‌లో రిలీజ్‌ చేసిన నారా లోకేష్‌పై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలివైరల్ అవుతున్న మాచర్ల MLA Video ఎన్నికల కమిషన్ కు సంబంధం లేదని ప్రకటించిందంటే పోలీసులు, అధికారులు తెలుగు దేశంతోఎంతగా కుమ్మక్కయ్యారో తెలుస్తుంది!— Ambati Rambabu (@AmbatiRambabu) May 23, 20242:15 PM, May 23rd, 2024పిన్నెల్లి వీడియో మేము విడుదల చేయలేదు: సీఈవో ముఖేష్‌ కుమార్‌ మీనాపిన్నెళ్లి వీడియోపై సీఈవో సంచలన ప్రకటనఆ వీడియోను మేము విడుదల చేయలేదుఎన్నికల కమిషన్ నుండి బయటకు వెళ్లలేదుఅది ఎలా బయటకు వెళ్లిందో తెలుసుకుంటాం. దర్యాప్తు సమయంలో ఎక్కడో, ఎవరి చేతినుండో బయటకు వెళ్లిందిపాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్ పీఓ, ఏపీఓలను సస్పెండ్ చేశాంమాచర్లకు టీడీపీ నేతలు వెళ్లడం మంచిది కాదుఇప్పుడే మాచర్లలో పరిస్థితి అదుపులోకి వచ్చిందిటీడీపీ నాయకులకు అనుమతి లేదని చెప్పాంవాళ్లు వెళితే వైఎస్సార్‌సీపీ నేతలు కూడా వెళతామంటారుమళ్లీ పరిస్థితి అదుపు తప్పే అవకాశముంది. బయట నాయకులు ఎవ్వరూ మాచర్లకు వెళ్లకూడదుఎవ్వరినీ ఆ గ్రామాల్లోకి వెళ్లనీయొద్దని ఆదేశించాను. 2:00 PM, May 23rd, 2024అంబటి పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌ఏపీ హైకోర్టులో మంత్రి అంబటి రాంబాబు పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌ చేసిన ఏపీ హైకోర్టుసత్తెనపల్లిలో రిగ్గింగ్‌ జరిగిందని, రీపోలింగ్‌ జరపాలని పిటిషన్‌ఈ మేరకు ఏపీ హైకోర్టులో పిటిషన్‌ వేసిన అంబటి‌ప్రతివాదులుగా ఈసీ, సీఈవో సహా ఐదుగురిని చేర్చిన అంబటి 1:40 PM, May 23rd, 2024టీడీపీ రిగ్గింగ్ చేస్తోందని పోలీసులకు చెప్పిన స్పందించలేదు: అనిల్ కుమార్ యాదవ్ఓటమి భయంతోనే టీడీపీ దాడులకు పాల్పడింది 8 చోట్ల ఈవీఎంలు ధ్వంసం అయితే ఒక్కటే ఎందుకు బయటకు వచ్చింది ఈవీఎంల ధ్వంసం దృశ్యాలను ఎవరు బయటపెట్టారుఈసీ తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయిఎమ్మెల్యే పిన్నెల్లి, ఆయన కుమారుడి పై కూడా దాడులు చేశారుపల్నాడు జిల్లాలో టీడీపీ నేతలు ఈవీఎంలు పగలగొట్టారు తుమ్మురుకోట, వబుచెర్లలో ఈవీఎంలు ధ్వంసం చేశారు చింతపల్లిలో టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారు పాల్వాయిగేటు ప్రాంతంలో టీడీపీ నేతల విధ్వంసం చేశారు టీడీపీ నేతల అరాచక వీడియోలు ఎందుకు బయటకు రాలేదు? ఎస్సీ, ఎస్టీలను కొడుతున్న వీడియోలు ఈసీకి కనపడలేదా? టీడీపీ రిగ్గింగ్ చేసిన చోట్ల రీపోలింగ్ పెట్టాలి ఈసీ తీరుపై న్యాయ పోరాటం చేస్తాం 1:15 PM, May 23rd, 2024లోకేష్‌, బాబు చెప్పిన దాన్ని పోలీసులు ఫాలో అవుతున్నారు: కోరముట్ల శ్రీనివాసులురైల్వేకోడూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోరముట్ల శ్రీనివాసులు కామెంట్స్‌..ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి ఒక ప్రజానాయకుడుఅలాంటి నాయకుడిపై లుకౌట్ నోటీస్ జారీచేయడం దారుణంఒకరేమో జీవితఖైదు అని, ఇంకోరేమో కనీసం 10 ఏళ్లు శిక్ష పడుతుంది అంటూ పరిధులు దాటి మాట్లాడుతున్నారు..ఏ శిక్ష వేయాలో ఈనాడు, అంధ్రజ్యోతి నిర్ణయిస్తాయా?కూటమి అభ్యర్థి గుప్త గుంతకల్‌లో ఈవీఎంను పగలకొడితే ఈసీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు.పిన్నెల్లిపై లుకౌట్ నోటీస్ జారీ చెయ్యడం కరెక్టా?వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకోబడిన ప్రజానాయకుడు పిన్నెలిమాచర్ల రెంటచింతలలో జరిగిన సంఘటనపై నివేదిక తెప్పించుకోకుండానే లోకేష్‌, బాబు చెప్పిన దాన్ని పోలీసులు ఫాలో అవుతున్నారు.ఆ పోలింగ్ స్టేషన్ లో కూటమి రిగ్గింగ్ చేసింది.పోలింగ్ స్టేషన్‌లోకి వెళ్లి క్షణికావేశంలో ఈవీఎం పగలకొట్టి ఉండవచ్చుదానిపై పోలీసులు స్పందించే తీరు సరికాదు మొదటి నుండి కూటమి సభ్యులు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నా ఒక్కరిపై కూడా ఈసీ ఎటువంటి చర్యలు తీసుకోలేదుఈసీ ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తోంది. 12:45 PM, May 23rd, 2024ఈసీకి సూటిగా ప్రశ్నలు సంధించిన సజ్జలమాచర్ల ఘటనపై స్పందించిన వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిఎన్నికల సంఘానికి సజ్జల రామకృష్ణారెడ్డి సూటి ప్రశ్నలుపాల్వాయి గేట్‌ వీడియో నిజమైనదేనని ఎన్నికల సంఘం ప్రకటిస్తుందా?వీడియో సరైందేనా కాదా అన్నది నిర్దారించకుండానే ఎన్నికల సంఘం చర్యలకు ఎలా దిగుతుంది?ఒక వేళ నిజమైనదే అయితే ఆ వీడియో సోషల్‌ మీడియాలోకి ఎలా వస్తుంది?మాచర్ల నియోజకవర్గంలో ఏడు ఘటనలు (ఈవీఎంలపై) జరిగాయని ఈసీనే చెబుతుంది కదా.!అలాంటప్పుడు కేవలం ఒక వీడియో మాత్రమే ఎలా లీక్‌ చేస్తుంది?ఈసీకి చిత్తశుద్ధి ఉంటే మొత్తం వీడియోలను, ఏడు చోట్ల జరిగిన ఘటనలకు సంబంధించిన ఫుల్‌ వీడియోలను ఎందుకు బయటపెట్టదు?అన్ని వీడియోలు బయటకు వచ్చినప్పుడే అసలేం జరిగిందన్నది బయటకు వస్తుందిఅంతే కానీ.. ఒక చిన్న క్లిప్పింగ్‌ను మాత్రమే బయటకు ఎలా వస్తుంది?తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు, వారిని గుర్తించేందుకు ఈసీ ఎందుకు సరైన పద్ధతిలో నిర్ణయాలు తీసుకోవడం లేదు?సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అవుతున్న రెండు వీడియోలను పరిశీలిస్తే..అమాయక ఓటర్లపై టీడీపీ గూండాలు దాడి చేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.వారి మీద ఎన్నికల సంఘం చర్యలెందుకు తీసుకోవడం లేదు?దాని వెనక ఉన్నవారిని ఎందుకు పట్టుకోవడం లేదు?. 3. More importantly, in the videos attached below, there is clear evidence of TDP goons attacking innocent voters. Why has no action been initiated in these instances? pic.twitter.com/iYVvwO5nXj— Sajjala Ramakrishna Reddy (@SRKRSajjala) May 23, 2024 12:10 PM, May 23rd, 2024మచిలీపట్నంలో మాక్‌ డ్రిల్..కృష్ణాజిల్లా..మచిలీపట్నం కోనేరు సెంటర్ జిల్లా ఎస్పీ అద్నాన నయీం అస్మి ఆధ్వర్యంలో మాక్ డ్రిల్కౌంటింగ్ ప్రక్రియలో అల్లర్లకు పాల్పడితే జరిగే పరిణామాలను మాక్ డ్రిల్ ద్వారా ప్రజలకు చూపించిన పోలీస్ సిబ్బంది.ఎస్పీ అద్నాన్ నయీం అస్మి కామెంట్స్‌..ప్రజలు ఎన్నికల ప్రక్రియలో సహకరించారుకౌంటింగ్‌లో కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాంకౌంటింగ్ సమయంలో డీజేలకు, టపాసులకు, సభలు, సమావేశాలకు అనుమతులు లేవుఅల్లర్లకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు 10:22 AM, May 23rd, 2024సిట్‌ దర్యాప్తు.. కంటిన్యూఏపీలో కౌంటింగ్‌కు సమయం దగ్గర పడుతుండడంతో ముమ్మరంగా తనిఖీలుపోలింగ్‌ టైంలో, తర్వాత అల్లర్లలో పాల్గొనవారిపై నిఘారాష్ట్రవ్యాప్తంగా 168 సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపుఏపీలో ఘర్షణలపై కొనసాగుతున్న సిట్‌ దర్యాప్తుతిరుపతి, తాడిపత్రి, పల్నాడులో సిట్‌ మకాంజిల్లాల పోలీసులు కేసులు విచారిస్తున్న తీరును పర్యవేక్షిస్తున్న సిట్‌ బృందాలుఅవసరమైతే మరోసారి అల్లర్లు జరిగిన ప్రాంతానికి వెళ్లే యోచన9:17 AM, May 23rd, 2024తిరుపతి చంద్రగిరిలో పోలీసుల అలర్ట్‌నారావారిపల్లి,శేషాపురంలో పోలీసుల పికెటింగ్‌చంద్రగిరిలో 144తో పాటు సెక్షన్‌ 30 అమలుసమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాల కవాతుసభలు, సమావేశాలు, ఊరేగింపులను నో పర్మిషన్‌పోలింగ్‌ తర్వాత అల్లర్ల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు 8:10 AM, May 23rd, 2024పల్నాడులో మరో టెన్షన్‌నేడు చలో మాచర్లకు టీడీపీ పిలుపుటీడీపీ సానుభూతిపరులను పరామర్శించేందుకు మాచర్ల యాత్ర చేపట్టిన పచ్చ బ్యాచ్‌మాచర్లలో ఎలాంటి రాజకీయ పర్యటనలకు అనుమతి లేదని తేల్చి చెప్పిన పోలీసులు. 7:45 AM, May 23rd, 2024నేడు అంబటి పిటిషన్‌ విచారణఏపీ హైకోర్టులో ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పిటిషన్‌పై నేడు విచారణసత్తెనపల్లిలో రిగ్గింగ్‌ జరిగిందని, రీపోలింగ్‌ జరపాలని అంబటి డిమాండ్‌ఈ మేరకు ఏపీ హైకోర్టులో పిటిషన్‌ వేసిన అంబటి‌ప్రతివాదులుగా ఈసీ, సీఈవో సహా ఐదుగురిని చేర్చిన అంబటి 7:20 AM, May 23rd, 2024‘గేటు’లో గూండాగిరి.. ఓటర్లను బెదిరించి పచ్చముఠాల రిగ్గింగ్‌పాల్వాయి గేటులో ఓటర్లను బెదిరించి పచ్చముఠాల రిగ్గింగ్‌ వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను చితకబాది బూత్‌ల నుంచి ఈడ్చివేతబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళలపై పోలింగ్‌ బూత్‌లలో దౌర్జన్యం పార్టీ నేతల సమాచారంతో అక్కడకు చేరుకున్న ఎమ్మెల్యే పిన్నెల్లి రిగ్గింగ్‌ను ప్రతిఘటించి స్పందించాలని పలు దఫాలు ఎన్నికల అధికారులకు ఫోన్లు వెబ్‌ కాస్టింగ్‌ పరిశీలించి రిగ్గింగ్‌ అడ్డుకోకుండా అధికార యంత్రాంగం ఉదాశీనత.. పల్నాడులో ఏడు చోట్ల ఈవీఎంలు ధ్వంసమైతే ఒక్క వీడియో మాత్రమే బహిర్గతం అవసరమైన మేరకు ఎడిటింగ్‌.. వారం తరువాత తాపీగా విదేశాల్లో ఉన్న లోకేశ్‌ ఎక్స్‌ ఖాతా నుంచి విడుదల భద్రంగా ఉండాల్సిన వెబ్‌ కాస్టింగ్‌ సమాచారం బయటకు వెళ్లడంపై సందేహాలు రిగ్గింగ్, ఏజెంట్లపై దాడులు, ఓటర్లని బెదిరించిన వారిని పట్టించుకోకుండా ప్రతిఘటించిన వారిపై కేసుల నమోదు పట్ల సర్వత్రా విస్మయం 7:00 AM, May 23rd, 2024ఓటమి బాటలో బాబుకుప్పంలో తప్పిన లెక్కలు.. వికటించిన వ్యూహాలుఇన్నాళ్లూ చంద్రబాబును గెలిపించింది 51 వేల దొంగ ఓట్లే రెండు విడతలుగా ఆ ఓట్ల తొలగింపు దీంతో ఓటమికి దగ్గరవుతూ వచ్చిన బాబుస్థానిక సంస్థల ఎన్నికలన్నింటిలోనూ టీడీపీ ఘోర పరాజయం 35 ఏళ్లుగా కుప్పం ప్రజలను నమ్మించి మోసం చేసిన వైనం వైఎస్సార్‌సీపీ రాకతో ప్రతి ఇంటికీ సంక్షేమం, అభివృద్ది మారుతూ వచ్చిన ఓటర్ల తీర్పు.. గత ఎన్నికల్లో తగ్గిన మెజారిటీ ఈ దఫా ఓటమి ఖాయం అని తేలడంతో కుటుంబ సమేతంగా పరుగులు కుప్పంలో ఓటు, ఇల్లు లేని బాబు.. ఓటమి భయంతో ఇంటి నిర్మాణ పనులు ఓటుకు రూ.2 వేలు పంపిణీ చేసినా విఫల యత్నమే అంటున్న స్థానికులు 6:50 AM, May 23rd, 2024కుట్ర విఫలం వల్లే రాద్ధాంతం ఘోర ఓటమి భయంతో టీడీపీ నేతల దారుణకాండవైఎస్సార్‌సీపీకి దన్నుగా నిలిచే వర్గాల వారు ఓట్లు వేయకుండా అడ్డుకునే కుట్ర పల్నాడు, తాడిపత్రి, జమ్మలమడుగు, చంద్రగిరి సహా రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్‌ రోజున అల్లర్లు పోలింగ్‌ కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బయటకు నెట్టి రిగ్గింగ్‌ చేసిన టీడీపీ రౌడీలు వెబ్‌ కాస్టింగ్‌లో అరాచకపర్వం స్పష్టంగా కన్పిస్తున్నా పట్టించుకోని ఎన్నికల అధికారులు టీడీపీ మూక రిగ్గింగ్‌ను అడ్డుకునేందుకు యత్నించిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లిపోలింగ్‌ రోజున తమ కుట్ర విఫలమవడంతో టీడీపీ అండ్‌ గ్యాంగ్‌ యాగీ 6:40 AM, May 23rd, 2024టీడీపీ రిగ్గింగ్‌.. పూర్తి వీడియో బయటపెట్టాలి: కాసు మహేష్‌రెడ్డిమాచర్లలో చాలా చోట్ల టీడీపీ నేతలు రిగ్గింగ్‌ చేశారుపిన్నెల్లి గెలుపును ఎవరూ ఆపలేరని.. దీనిపై ఎంతవరకైనా పోరాటం చేస్తాంపిన్నెల్లి తప్పు చేశారని టీడీపీ ప్రచారం చేస్తోందిమొత్తం వీడియో బయటపెడితే అసలు వాస్తవాలు బయటకు వస్తాయి.ఒక్కటే వీడియో ఎందుకు రిలీజ్‌ చేశారు?రిగ్గింగ్‌ జరిగిందని చెప్తుంటే... ఎందుకు వీడియో రిలీజ్‌ చేయడం లేదు?మాచర్లలో ఎవరు దాడి చేశారో ప్రజలందరికి తెలియాలిమాచర్లలో అల్లర్లకు కారణం ఎవరు? టీడీపీ కాదా?బీసీలు, ఎస్టీలు వైఎస్సార్‌సీపీకి ఓటేశారనే కారణంతో దాడులు చేశారుఅందరికీ చట్టపరమైన శిక్ష పడేవరకు పోరాడతాంరిగ్గింగ్‌ జరిగిందని మేము చెబుతున్నాం.. మీరు ఎందుకు వీడియో బయటపెట్టడం లేదు?ఎన్నికల అధికారులు ఆరోజు ఏమైందనేది మొత్తం వీడియో బయటపెట్టాలిఈవీఎం ధ్వంసం ఘటనకు ముందు 2, 3 గంటల వీడియో బయటపెట్టాలిమమ్మల్ని హౌస్‌ అరెస్ట్‌ చేసి టీడీపీ నేతలు రిగ్గింగ్‌ చేశారుదాడులకు సంబంధించి ఈసీ పూర్తి వీడియోలు బయటపెట్టాలిఏడు చోట్ల ఈవీఎంల ధ్వంసం జరిగిందని ఈసీనే చెబుతోందిమాచర్ల వీడియోను మాత్రమే బయటపెట్టారుమిగిలిన వీడియోలను ఎందుకు బయటపెట్టడం లేదుఈసీ విశ్వసనీయత కోల్పోతుంది. అవసరమైతే న్యాయ పోరాటం చేస్తాం 6:30 AM, May 23rd, 2024మాచర్ల నియోజకవర్గంలో అరాచకాలు చేసింది టీడీపీ నేతలేమాచర్లలో టీడీపీ నేతల రిగ్గింగ్‌ఒక్కొక్కటిగా బయటపడుతున్న వీడియోలువైఎస్సార్‌సీపీ మద్దతుదారులను ఓటు వేయనివ్వకుండా అడ్డుకున్న టీడీపీ మూకలురెంటచింతల మండలం పాల్వాయి గేటులోని 201, 202 పోలింగ్‌ బూత్‌లో టీడీపీ రిగ్గింగ్‌టీడీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నా పట్టించుకోని ఎన్నికల అధికారులుఓటర్లను ఓటు వేయనివ్వని టీడీపీ నేతలుఓటర్లు బూత్‌ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో దాడులకు తెగబడ్డ టీడీపీ నేతలుటీడీపీ నేతల రిగ్గింగ్‌పై పోలీసులు, ఎన్నికల అధికారులకు పిన్నెల్లి ఫిర్యాదులుఎమ్మెల్యే ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు

Metro CMD Farah Malik Bhanji, India's wealthiest Muslim woman success story
సక్సెస్‌ ఊరికే రాదు : వేలకోట్లతో నెక్ట్స్‌ లెవల్‌ అంతే! ఎవరీ బిలియనీర్‌ మహిళ

విజయవంతమైన వ్యాపార కుటుంబం నుంచి వారసులు చాలామంది వస్తారు. కానీ ఆ విజయాన్ని అంది పుచ్చుకుని అసాధారణ వృద్ధితో ఎదిగిన వ్యాపార దిగ్గజాలు కొంతమందే ఉంటారు. ప్రముఖ ఫుట్‌వేర్ కంపెనీ 'మెట్రో బ్రాండ్స్' మేనేజింగ్ డైరెక్టర్ ఫరా మాలిక్ భాంజీ కథ అలాంటిదే. బిలియనీర్ ఫరా మాలిక్ భాంజీ గురించి ఇంట్రస్టింగ్‌ సంగతులు ఈ కథనంలో తెలుసుకుందాం.దేశంలోనే సంపన్న ముస్లిం మహిళగా గుర్తింపు పొందారు. కంపెనీ సీఎండీగా ఫరా మాలిక్‌ భాంజీ రూ. 28,773 కోట్ల కంపెనీకి నాయకత్వం వహిస్తున్నారు. మెట్రో బ్రాండ్స్ ఛైర్మన్ రఫీక్ మాలిక్ రెండో కుమార్తె. తన నలుగురు సోదరీమణుల మాదిరిగానే, లంచ్ టేబుల్ వద్ద షాప్ టాక్ వింటూ పెరిగింది. కానీ కంపెనీ పగ్గాలు చేపట్టిన తరువాత ఫరా మార్గదర్శకత్వంలో, గతంలో 'మెట్రో షూస్'గా పిలువబడే మెట్రో బ్రాండ్స్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. డిసెంబర్ 8 నాటికి 35,117 కోట్ల చేరడం విశేషం.ముంబై కేంద్రంగా ప్రపంచ వ్యాప్తంగా సేవలందిస్తోంది ఈ కంపెనీ. ఫరా తాత మాలిక్ తేజాని 1955లో తిరిగి స్థాపించారు. మోచి, మెట్రో , వాక్‌వే వంటి విజయవంతమైన బ్రాండ్‌ల రాకకు పునాది. పాదరక్షల పరిశ్రమలో 20 ఏళ్ల చరిత్రను తిరగరాసి ఆధునిక యుగంలో గేమ్ ఛేంజర్‌గా నిలిచింది ఫరా. ఆమె వినూత్న విధానం , ఫార్వర్డ్-థింకింగ్ స్ట్రాటజీలు కంపెనీని నెక్ట్స్‌ లెవల్‌కి చేర్చాయి. ఆస్టిన్‌లోని టెక్సాస్ విశ్వవిద్యాలయంలో ఉ‍న్నత చదువు చదివి కంపెనీలో మార్కెటింగ్ రంగంలో తన వృత్తిని ప్రారంభించింది. ఇదే ఆ తర్వాత మెట్రో బ్రాండ్స్ లిమిటెడ్ సరఫరా గొలుసును పునరుద్ధరించడానికి తోడ్పడింది.2010లో వెబ్‌సైట్‌ ఏర్పాటు చేసి, ఆన్‌లైన్‌ అమ్మకాలు ప్రారంభించారు. దేశీ సంస్థల ఉత్పత్తులను రిటైలింగ్‌ చేసిన మెట్రో విదేశీ పాదరక్షల జోడింపుతో ‘మెట్రో బ్రాండ్స్‌’గా అవతరించింది.మెట్రో బ్రాండ్స్ పాదరక్షల దిగ్గజం క్రాక్స్ ఇండియా లిమిటెడ్ (CIL)తో ఒప్పందం నిబంధనలు, మార్పులతో తన భాగస్వామ్యాన్ని కూడా విస్తరించింది. దీని ప్రకారం భారతదేశంలోని పశ్చిమ , దక్షిణ రాష్ట్రాలలో Crocs "ఫుల్‌ కాస్ట్‌ " దుకాణాలనిర్వహణకు మెట్రో బ్రాండ్‌లకు ప్రత్యేక హక్కులను మంజూరు చేస్తుంది. కంపెనీ భారతదేశం అంతటా 200కి పైగా ప్రత్యేకమైన క్రోక్స్ స్టోర్‌లను నిర్వహిస్తోంది.స్కేచర్స్, క్లార్క్స్ వంటి ఇతర గ్లోబల్ టైటాన్స్‌తో వ్యూహాత్మక ఒప్పందాలున్నాయి. 2021లో మెట్రోని ఐపీవోకు వచ్చింది. రూ.28 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపిస్తూ ఫోర్బ్స్‌ జాబితాలో చోటు సంపాదించుకున్నారు. వ్యాపార రంగంలో ఫరా మాలిక్ భాంజీ చెరగని ముద్ర వేసుకున్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతోపాటు, పరిశ్రమ దిగ్గజాలకు సైతం స్ఫూర్తిగా ఉన్నారు.

తప్పక చదవండి

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement