Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Ap Assembly Elections 2024: TDP Cadre Goons Attacks On Polling Day
టీడీపీ నేతల దౌర్జన్యాలు.. ఏపీలో పలు చోట్ల ఉద్రిక్త వాతావరణం

ఆంధ్రప్రదేశ్‌లో పలు పోలింగ్‌ కేంద్రాల వద్ద తెలుగు దేశం నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఏజెంట్లపై దాడులు, కిడ్నాప్‌ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.ప్రకాశందర్శి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యాలుదర్శి మండలం బొట్లపాలెం ఘర్షణ, వైస్సార్సీపీ ,టీడీపీ కార్యకర్తలు కొట్లాట, పరిస్థితి ఉద్రిక్తంఏజెంట్ల తలెత్తిన వివాదంకిందపడిన ఈవీఎంవైస్సార్సీపీ కార్యకర్తలు పై టీడీపీ కార్యకర్తలు దాడిదేవవరంలోనూ ఘర్షణ, ఏజెంట్ ల మధ్య గొడవపల్నాడుమాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేట్ వద్ద టీడీపీ కార్యకర్తల దౌర్జన్యంపోలింగ్ సరళిని పరిశీలించేందుకు వచ్చిన వైఎస్సార్ సీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డితాము లోపలికి వెళ్తామని టీడీపీ కార్యకర్తల ఆందోళనపోలింగ్ కేంద్రం గేట్ల‌ను తోసుకుంటూ లోపలికి వెళ్లే ప్రయత్నంఅడ్డుకున్న పోలీసులతో వాగ్వివాదంపోలీసులను నెట్టేసిన టీడీపీ కార్యకర్తలుఅనంతపురంగుత్తిలో టీడీపీ నేతల దౌర్జన్యంపోలింగ్ కేంద్రం లో ప్రచారం నిర్వహించిన టీడీపీ నేతలుప్రశ్నించిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడిన టీడీపీ నేతలుకర్నూలుకర్నూలు 17వ వార్డు టిడిపి పార్టీ కార్పోరేటర్ పద్మలతా రెడ్డి ప్రలోభాలు...పోలింగ్ కేంద్రం వద్ద చేరుకొని టిడిపికి ఓటు వేయాలని ఓటర్లను ప్రభావితం చేస్తున్న కార్పొరేటర్..ఎన్నికల నిబంధన ఉల్లంఘించి ప్రచారానికి పాల్పడుతున్న టిడిపి కార్పొరేటర్ పద్మలత రెడ్డిచిత్తూరుకుప్పం నియోజవర్గంలో దొంగ ఓటర్లుకుప్పం మున్సిపాలిటీ పాతపేట 163 పోలింగ్ బూత్ లో తన ఓటు వేరే ఎవరో దొంగ ఓటు వేశారని ఆవేదన వ్యక్తం చేసిన గాయత్రీ అనే ఓటర్మొదటి సారి ఓటు హక్కు వినయోగించుకోవాలని చూసిన యువతీ తన ఓటు వేరొకరు వేసేయడంతో కన్నీళ్లు పెట్టుకొన్న యువతీకృష్ణాబాపులపాడులో జనసేన,టీడీపీ నాయకులు ఓవర్ యాక్షన్.పోలింగ్ బూత్ వద్ద ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్న జనసేన,టీడీపీ నాయకులు.జనసేన నాయకుడు చలమలశెట్టి రమేష్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన వైసీపీ నేత గోసుల శివ భరత్ రెడ్డి.ఏలూరు దెందులూరు నియోజకవర్గం పెదవేగి గ్రామంలో టిడిపి నాయకుల దౌర్జన్యం.పోలింగ్ బూత్ నెంబర్ 54 లోకి ఒక్కసారిగా చొచ్చుకుని వెళ్ళే ప్రయత్నం చింతమనేని అనుచరులు.ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో భయభ్రాంతులకు గురైన ఓటర్లువిధుల్లో ఉన్న పోలీసుల అంతు చూస్తామని బెదిరింపులకు పాల్పడిన టిడిపి నాయకులుపారా మిలిటరీ బలగాలు రంగ ప్రవేశం చేయటంతో సద్దుమణిగిన పరిస్థితులు.నంద్యాలనందికొట్కూరు పట్టణంలోని 46,47,48 పోలింగ్ బూత్ వద్ద టీడీపీ నేత మాండ్రా శివనంద రెడ్డి హాల్ చల్ క్యూలైన్లో ఉన్న ఓటర్లపై ఒత్తిడి తెచ్చి ప్రలోభాల పర్వంక్యూలైన్లలో ఉన్న ఓటర్లను పక్కకు పిలిచి ఓటు వేయాలని భయబ్రాంతులకు గురి చేస్తున్న టీడీపీ నేత మాండ్రా శివానంద రెడ్డి,ఓటర్లను ప్రభావితం చేస్తున్న టీడీపీ శివానంద రెడ్డికి పోలీసుల వార్నింగ్‌ 100 మీటర్లు బయటఉండాలని సూచనపోలీసుల మాట లెక్క చేయకుండా నేను చీఫ్ ఎలక్షన్ ఏజంట్ అని బూత్ పరిశీలించి వెళ్తానని పోలీసులతో వాదించారు టీడీపీ నేత చిత్తూరు టీడీపీ గుండాల రౌడీయిజంమండికృష్ణాపురం పంచాయతీ లో టిడిపి గుండాల అరాచకంవైఎస్ఆర్సీపీ బూత్ ఏజెంట్స్ పై కత్తితో దాడి ఆపై పరారీ ఓటమి భయంతో నీచ రాజకీయాలకు తెరతీసిన చిత్తూరు టీడీపీ శ్రేణులువైఎస్సార్‌ జిల్లాబద్వేల్ టీడీపీ కార్యాలయం వద్ద కూటమి నాయకుల ఘర్షణ అగ్రహారం గ్రామానికి సంబంధించి ఓటర్లకు డబ్బు మేము పంచుతాము అంటే మేము పంచుతాము అంటూ గొడవ జనసేన నేత వేలును టీడీపీ నాయకుడు ఇరు వర్గాలు పోలీసుల అదుపులో

AP Assembly Elections 2024 Voting Live Updates And Highlights Telugu
AP Elections 2024 Polling: ఏపీ పోలింగ్‌ డే అప్‌డేట్స్‌

AP Elections 2024 Polling Updatesఏపీ ఎన్నికలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు..

Information About How To Cast Vote
మీ ఓటు పడిందా? ఇలా కన్మర్ఫ్‌ చేస్కోండి

AP Elections 2024: Pawan With Wife At Polling Centre Over Action
మంగళగిరి పోలింగ్‌ బూత్‌లో పవన్‌ ఓవరాక్షన్‌

గుంటూరు, సాక్షి: జనసేన పార్టీ అధినేత, నటుడు పవన్‌ ‍కల్యాణ్‌ ఓవరాక్షన్‌కు దిగారు. సోమవారం ఉదయం తన భార్య అన్నా లెజినోవాను, కొందరు అనుచరులను వెంట పెట్టుకుని పోలింగ్‌ సెంటర్‌లోకి తీసుకెళ్లి హల్‌ చల్‌ చేశారు. మంగళగిరిలోని శ్రీ లక్ష్మి నరసింహ కాలనీలో 197వ బూత్‌లో పవన్‌ ఓటేసేందుకు వచ్చారు. ఆ సమయంలో తన భార్యను వెంటపెట్టుకుని బూత్‌లోకి తీసుకెళ్లారు. అలాగే.. అక్కడ సెంటర్‌లో ఓటే లేని అనుచరుల్ని వెంట తీసుకెళ్లారు. బూత్‌లో కలియ దిరుగుతూ ఫొటోలకు ఫోజులిచ్చారు. పవన్‌ భార్య అన్నా లెజినోవాకు సైతం అక్కడ ఓటు లేదని సమాచారం. అయినా అధికారులు వాళ్లను లోపలికి ఎలా అనుమతించారా? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు కొందరు.మరోవైపు పవన్‌ అలా వాళ్లందరినీ లోపలికి తీసుకెళ్తుంటే.. క్యూ నిల్చున్న కొందరు ఓటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే అక్కడే ఉన్న పోలింగ్‌ సిబ్బంది ఆ అభ్యంతరాల్ని పట్టించుకోకపోవడం గమనార్హం.

Elections 2024: Sakshi Selfie Challange Updates
ఓటేయండి.. సెల్ఫీ పంపండి

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ, అలాగే తెలంగాణలోనూ లోక్‌సభ స్థానాలకు ఎన్నికలకు పోలింగ్‌ జరుగుతోంది. తమ రాష్ట్రం కోసం, తమ భవిష్యత్తు కోసం ప్రజాస్వామ్యంలో ప్రజలంతా సవ్యంగా ఓటు హక్కు ఉపయోగించుకోవాలని ఎన్నికల సంఘాలు కోరుతున్నాయి. అలాగే.. సాక్షి సైతం తన వంతుగా ఓటర్లను చైతన్యం చేస్తోంది. ఈ క్రమంలోనే సెల్ఫీ ఛాలెంజ్‌ను నిర్వహిస్తోంది. మీరు చేయాల్సిందల్లా ఓటేసిన తర్వాత మీ స్మార్ట్‌ఫోన్‌తో సెల్ఫీ తీసుకుని ఈ నంబర్‌కు (9182729310) మీ వివరాలతో వాట్సాప్‌ చేయడమే. అందులోంచి నాణ్యత ఉన్న ఫోటోలను ఎంపిక చేసి సాక్షి. కామ్‌లో పోస్ట్‌ చేయడం జరుగుతుంది. ‘‘నా ఉనికి ఓటుతోనే.., నా ఓటు వజ్రాయుధం’’ అని మీరు సందేశం ఇస్తే.. మీ బాధ్యతను చూపించి మరో నలుగురిని ఓటేసేలా ప్రజాస్వామ్య పరిరక్షణకు మా ప్రయత్నం చేస్తాం.‌గమనిక: పోలింగ్‌ కేంద్రంలోకి సెల్‌ఫోన్‌ను అనుమతించరు. సిబ్బంది కళ్లు కప్పి తీసుకెళ్లి అక్కడ సెల్ఫీలు దిగడం నేరం. కేసు పెడతారు.

Telangana Lok Sabha Elections 2024 Voting Live Updates And Highlights Telugu
TS Lok Sabha Polling 2024 Updates: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ అప్‌డేట్స్‌..

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ అప్‌డేట్స్‌

AP Elections 2024: handicap Woman Emotional Word About CM YS Jagan
జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..

నెల్లూరు, సాక్షి: పోలింగ్‌తో ఏపీలో జన జాతర నడుస్తోంది. దూర సుదూర ప్రాంతాల నుంచి ఓటు హక్కు వినియోగించుకునేందుకు తరలి వస్తున్నారు. ఈ క్రమంలో చెన్నై నుంచి కావలికి వచ్చిన ఓ దివ్యంగురాలి మాటలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.విశ్వోదయ బాయ్స్ హై స్కూల్ లో పోలింగ్ స్టేషన్ వద్ద ఓటేయడానికి కావలి ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వెళ్లారు. ఆ సమయంలో ఆ దివ్యాంగురాలు భావోద్వేగంగా మాట్లాడారు. జగనన్న ద్వారా తాను లబ్ధి పొందానని.. అందుకే కృతజ్ఞతతో జగన్ అన్నకు ఓటు వేసేందుకు ఇక్కడికి వచ్చానని ఆమె తెలిపారు.అన్నా.. సాయం అంటే చాలూ.. అప్పటికప్పుడే అధికారుల్ని పిలిపించుకుని గంటల వ్యవధిలోనే సాయం అందేలా చూడడం సీఎం జగన్‌ నైజం. అలా ఈ 59 నెలల్లో లక్షల మంది వ్యధలను సీఎం జగన్‌ స్వయంగా విని.. వాళ్లకు ప్రభుత్వం తరఫున సాయం అందించడం చూశాం కూడా.

Lok sabha elections 2024: 4th phase polling updates In Telugu
Lok sabha elections 2024: కొనసాగుతున్న నాలుగో విడత పోలింగ్‌

Updates జార్ఖండ్‌:జార్ఖండ్‌ సీఎం చంపయ్‌ సోరెన్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు.జిలింగోరా పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | Jharkhand CM Champai Soren shows the indelible ink mark on his finger after voting at a polling booth in Jilingora, Saraikela Kharsawan District.#LokSabhaElections2024 pic.twitter.com/qw6nn60JBf— ANI (@ANI) May 13, 2024 పశ్చిమ బెంగాల్‌:దుర్గాపూర్‌: బెంగాల్‌ ఘర్షణ చోటుచేసుకుంది.బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.అక్కడే ఉన్న పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు.#WATCH Durgapur, West Bengal: A clash broke out between BJP and TMC workers in Durgapur.#LokSabhaElections2024 pic.twitter.com/alSiQy6ldv— ANI (@ANI) May 13, 2024 ఢిల్లీ:నాలుగో విడత పోలింగ్‌ కొనసాగుతోందిఓటువేయడానికి భారిగా ప్రజలు తరలివస్తున్నారుఉదయం 9 గంటల వరకు మొత్తం 10. 35 శాతం పోలింగ్‌ నమోదైందిఆంధ్రప్రదేశ్‌- 9.05 శాతంతెలంగాణ- 9.51 శాతంబిహార్‌- 10.18 శాతంజమ్మూ కశ్మీర్‌- 5.07 శాతంజర్ఖండ్‌- 11. 78 శాతంమధ్యప్రదేశ్‌- 14. 97 శాతంమహారాష్ట్ర- 6.45 శాతంఒడిశా- 9. 23 శాతంఉత్తరప్రదేశ్‌- 11. 67 శాతంపశ్చిమ బెంగాల్‌- 15. 24 శాతం#LokSabhaElections2024 | 10.35% voter turnout recorded till 9 am, in the fourth phase of elections.Andhra Pradesh 9.05%Bihar 10.18%Jammu And Kashmir 5.07%Jharkhand 11.78%Madhya Pradesh 14.97%Maharashtra 6.45%Odisha 9.23%Telangana 9.51%Uttar Pradesh 11.67%West Bengal… pic.twitter.com/tmtjV4Aluw— ANI (@ANI) May 13, 2024 ఉత్తర ప్రదేశ్‌:యూపీ మంత్రి జితిన్‌ ప్రసాదా ఓటు హక్కు వినియోగించకున్నారు.షహజాన్‌పూర్‌ పోలింగ్‌ కేంద్రంలో ఓటు చేశారు.#WATCH | Uttar Pradesh Minister Jitin Prasada casts his vote at a polling booth in ShahjahanpurINDIA Alliance has fielded SP's Jyotsna Gond here. She faces BJP's sitting MP & candidate Arun Kumar Sagar & BSP's Dod Ram Verma. #LokSabhaElections2024 pic.twitter.com/a933KBvJWW— ANI (@ANI) May 13, 2024 జమ్మూ కశ్మీర్‌:శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ చీఫ్‌ ఫరూఖ్‌ అబ్దుల్లా, వైఎస్‌ ప్రెసిడెంట్‌ ఒమర్‌ అబ్దుల్లా ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | Srinagar, J&K: JKNC Chief Farooq Abdullah and JKNC Vice President Omar Abdullah show their inked fingers after casting their votes for the #LokSabhaElections2024 pic.twitter.com/arYMBqgxBm— ANI (@ANI) May 13, 2024 యూపీ:ఉన్నావ్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి సాక్షి మహారాజ్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | Uttar Pradesh: BJP MP and candidate from Unnao, Sakshi Maharaj casts his vote at a polling booth in the constituency.Samajwadi Party (SP) has fielded Annu Tandon and BSP has fielded Ashok Kumar Pandey here. #LokSabhaElections2024 pic.twitter.com/gW1oFBrui7— ANI (@ANI) May 13, 2024 జమ్మూ కశ్మీర్‌:శ్రీనగర్‌లో నాలుగో విడత పోలింగ్‌ కొనసాగుతోందిపెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు క్యూలైన్లలో నిల్చున్నారుLok Sabha elections 2024: Polling underway in SrinagarRead @ANI Story | https://t.co/gDgPtt9ffZ#JammuKashmir #Srinagar #LokSabhaElection2024 pic.twitter.com/2B9fFIibHg— ANI Digital (@ani_digital) May 13, 2024 తెలంగాణఓటు హక్కు వినియోగించుకున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిబర్కత్‌పూరా పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు.నాలుగోవిడత పోలింగ్‌ కొనసాగుతోందిUnion Minister G Kishan Reddy casts his vote in Telangana's BarkatpuraRead @ANI Story | https://t.co/vmoYK3dewi#GKishanReddy #LokSabhaElection2024 #Telangana pic.twitter.com/Xiwl8pYjcJ— ANI Digital (@ani_digital) May 13, 2024 మధ్యప్రదేశ్‌మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌ యాదవ్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఉజ్జయినిలోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | Madhya Pradesh CM Mohan Yadav casts his vote at a polling station in Ujjain. #LokSabhaElections2024 pic.twitter.com/FxzdPbdYja— ANI (@ANI) May 13, 2024 ఢిల్లీ:కొనసాగుతున్న నాలుగో విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్దేశవ్యాప్తంగా సాధారణ వాతావరణ పరిస్థితులు, హీట్ వేవ్ లేదని వెల్లడించిన ఐఎండిపోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్న ఓటర్లుపది రాష్ట్రాల్లో 96 ఎంపీ సీట్లకు ఎన్నికలుఎన్నికల బరిలో 1717 మంది అభ్యర్థులుప్రతి పార్లమెంటులో సగటున 18 మంది అభ్యర్థులు1.92 లక్షల పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్న 17.7 కోట్ల మంది ఓటర్లు85 ఏళ్లు దాటిన ఓటర్లు12.49 లక్షల మంది, 19.99 లక్షల మంది దివ్యాంగ ఓటర్లుఏపీలో 175 అసెంబ్లీ సీట్లు, ఒడిశాలో 25 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలుతెలంగాణలో పోలింగ్ సమయం పెంపు; ఉదయం ఏడు నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్పోలింగ్ ప్రక్రియలో పాల్గొంటున్న 19లక్షల మంది సిబ్బందిఎన్నికల ప్రక్రియలో 364 మంది అబ్జర్వర్లు1016 అంతర్రాష్ట్ర సరిహద్దులు, 121 అంతర్జాతీయ సరిహద్దులలో నిఘాపోలింగ్ కేంద్రాల వద్ద నీళ్లు, షెడ్, టాయిలెట్స్, ర్యాంప్స్ ఏర్పాటు తెలంగాణఓటు హక్కు వినియోగించుకున్న ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ#WATCH | Telangana: AIMIM candidate from Hyderabad, Asaduddin Owaisi shows his inked finger after casting his vote at a polling booth in Hyderabad. #LokSabhaElections2024 pic.twitter.com/aEg4psMI8A— ANI (@ANI) May 13, 2024 తెలంగాణకేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై సీఈఓ వికాస్ రాజ్‌కు ఫిర్యాధు చేసిన కాంగ్రెస్ఓటు వేసి మీడియాతో మాట్లాడుతూ మోడీ పేరును ప్రస్తావించినందుకు ఫిర్యాధుపోలింగ్ రోజు వ్యక్తుల పేర్లు ప్రస్తావించడం కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందన్న కాంగ్రెస్కిషన్ రెడ్డి పై కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేయాలని ECని కోరిన కాంగ్రెస్ మహారాష్ట్ర:కేంద్ర మంత్రి రావుసాహెబ్ పాటిల్ దాన్వే ఓటు హక్కు వినియోగించుకున్నారు.జాల్నా పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | Union Minister and BJP's candidate from Jalna Lok Sabha seat, Raosaheb Patil Danve casts his vote at a polling booth in Jalna, Maharashtra Danve is sitting MP from this seat. INDIA alliance has fielded Congress leader Kalyan Vaijinathrao Kale from this seat.… pic.twitter.com/cRvRTK4B8b— ANI (@ANI) May 13, 2024 జమ్మూ కశ్మీర్‌:పుల్వామా పోలింగ్‌ కేంద్రంలో బారులు తీరిన ఓటర్లు#WATCH | Jammu and Kashmir: Voters queue up outside a polling booth in PulwamaNational Conference (NC) has fielded Aga Syed Ruhullah Mehdi from the Srinagar Lok Sabha seat, PDP fielded Waheed-ur-Rehman Para, and J&K Apni Party’s fielded Mohammad Ashraf Mir.… pic.twitter.com/VSgGZs9Vki— ANI (@ANI) May 13, 2024 తెలంగాణ:త్రిపురా గవర్నర్‌ ఎన్‌ ఇంద్రసేనా రెడ్డి ఓటు వేశారు.హైదరాబాద్‌ సలీంనగర్‌ పోలింగ్‌ కేంద్రంలో పోలింగ్‌ కొనసాగుతోంది#WATCH | Telangana: Tripura Governor N Indrasena Reddy, along with his family, casts his vote at a polling booth in Saleem Nagar, Hyderabad. #LokSabhaElections2024 pic.twitter.com/tdl5oYHbrs— ANI (@ANI) May 13, 2024 తెలంగాణ:ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దంపతులుహైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఓటు వేశారు.నాలుగో విడత పోలింగ్‌ కొనసాగుతోంది#WATCH | Telangana: Former Vice President M Venkaiah Naidu and his wife Usha Naidu show the indelible ink mark on their fingers after casting their vote at a polling booth in Jubilee Hills, Hyderabad.#LokSabhaElections2024 pic.twitter.com/gUN3v2Ekf2— ANI (@ANI) May 13, 2024 ఢిల్లీ:ఓటు వేయటం ప్రజాస్వామ్య హక్కు: ప్రధాని మోదీకొనసాగుతున్న నాలుగో విడత పోలింగ్‌Lok Sabha election: PM Modi calls for 'democracy duty' as voting begins in fourth phaseRead @ANI Story | https://t.co/6N8RRsDrTD#LokSabaElections2024 #PMModi #democracy pic.twitter.com/IhZJO6sRzR— ANI Digital (@ani_digital) May 13, 2024 తెలంగాణ: హైదరాబాద్‌ బీజేపీ అభ్యర్థి మాధవీ లత ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | Telangana: BJP candidate from Hyderabad, Madhavi Latha casts her vote at a polling booth in the constituency.She faces sitting MP and AIMIM candidate Asaduddin Owaisi and BRS' Gaddam Srinivas Yadav here. #LokSabhaElections2024 pic.twitter.com/E7sMVEZOrj— ANI (@ANI) May 13, 2024 బిహార్‌:కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు.లఖిసారి పోలింగ్‌ కేంద్రంలో ఓటు చేశారు.పోలింగ్‌ కేంద్రానికి ఓటర్లు తరలి వస్తున్నారు.#WATCH | Bihar: After casting his vote in Lakhisari, Union Minister and BJP candidate from Begusarai, Giriraj Singh says, "I want to appeal to the voters of Bihar that they must go out and vote. One vote can cause the fall of the Atal Bihari Vajpayee government and every vote can… pic.twitter.com/X6IiXHe8Qu— ANI (@ANI) May 13, 2024 యూపీ:ఉత్తరప్రదేశ్‌ మంత్రి సురేష్‌ ఖన్నా ఓటు హక్కు వినియోగించుకున్నారు.షహజాన్‌పూర్‌లో పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఓటు వేయడానికి ప్రజలు తరలి వస్తున్నారు.ఓటర్లు క్యూలైన్‌లో నిల్చుంటున్నారు. #WATCH | Uttar Pradesh Minister Suresh Khanna casts his vote at a polling booth in Shahjahanpur. INDIA Alliance has fielded SP's Jyotsna Gond here. She faces BJP's sitting MP & candidate Arun Kumar Sagar & BSP's Dod Ram Verma. #LokSabhaElections2024 pic.twitter.com/fpFLtROJ11— ANI (@ANI) May 13, 2024 ఒడిశా:నాబారంగాపూర్‌లో ఎకో ఫ్రెండ్లీ పోలింగ్ స్టేషన్‌ ఏర్పాటు.#WATCH | Nabarangpur, Odisha: An eco-friendly polling station has been established at the Dandamunda village in Chandahandi Block of the Nabarangpur Lok Sabha constituency.BJP's Balabhadra Majhi, BJD's Pradeep Majhi and Congress' Bhujabala Majhi are contesting the… pic.twitter.com/tWfKsAon3B— ANI (@ANI) May 13, 2024 ప్రారంభమైన నాలుగో విడత పోలింగ్‌పది రాష్ట్రాల్లో 96 ఎంపీ సీట్లకు పోలింగ్‌ ప్రారంభమైంది.క్యూలైన్‌లో నిల్చున్న ఓటర్లుVoting for the fourth phase of #LokSabhaElections2024 begins. Polling being held in 96 constituencies across 10 states and Union Territories (UTs) today. 1717 candidates in fray. pic.twitter.com/GXFjsWMsdQ— ANI (@ANI) May 13, 2024 తెలంగాణతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన మాక్ పోలింగ్రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్ సభ17 పార్లమెంటు స్థానాలకు బరిలో నిలిచిన 525 మంది అభ్యర్థులుఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ స్థానాల్లో సాయంత్రం 4 గంటలకే ముగియనున్న పోలింగ్పోలింగ్ పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా సెలవు ప్రకటించిన ప్రభుత్వంతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 525 మంది అభ్యర్థులు, 475మంది పురుషులు, 50 మంది మహిళా అభ్యర్థులుఎన్నికల విధుల్లో 2లక్షల 80వేల మంది సిబ్బంది విధుల నిర్వహణ160 కేంద్ర కంపెనీల CAPF బలగాలతో బందోబస్తుఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి 20వేల మంది పోలీస్ బలగాలురాష్ట్ర వ్యాప్తంగా 3కోట్ల 32లక్షల 32వేల మంది ఓటర్లుపురుష ఓటర్లు - 1కోటి 65లక్షల 28వేలు, 1కోటి 67లక్షల మహిళా ఓటర్లు18-19 ఏళ్ల వయసు కలిగిన యువ ఓటర్లు 9లక్షల 20వేలు, వికలాంగులు 5లక్షల 27వేలుతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 35వేల 808 పోలింగ్ కేంద్రాలుఅత్యధికంగా మల్కాజ్గిరిలో 3226 పోలింగ్ కేంద్రాలు1లక్ష 9వేల 941 బ్యాలెట్ యూనిట్లు, 44906 కంట్రోల్ యూనిట్లుతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 9900 ఉన్నట్లు గుర్తించిన ఈసీజూన్ 4వ తేదిన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు#WATCH | Hyderabad, Telangana: Mock polling begins at the Jubilee Hills Public School polling booth nos. 163, 164 and 165 from Secundrabad Lok Sabha Constituency. BJP's G Kishan Reddy, Congress' Danam Nagender and BRS' T. Padma Rao Goud are contesting elections from here. G… pic.twitter.com/Q50qyruJ3B— ANI (@ANI) May 13, 2024 లోక్‌సభ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నాలుగో విడత పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. పది రాష్ట్రాల్లో 96 ఎంపీ సీట్లకు ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. 1717 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ప్రతి పార్లమెంటులో సగటున 18 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 1.92 లక్షల పోలింగ్ కేంద్రాల్లో 17.7 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 85 ఏళ్లు దాటిన ఓటర్లు12.49 లక్షలు ఉండగా, 19.99 లక్షల మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నారు. ఏపీలో 175 అసెంబ్లీ సీట్లు, ఒడిశాలో 25 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి.తెలంగాణలో పోలింగ్ సమయం పెంచడంతో ఉదయం ఏడు నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ ప్రక్రియలో 19 లక్షల మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రక్రియలో 364 మంది అబ్జర్వర్లను నియమించారు. 1016 అంతర్రాష్ట్ర సరిహద్దులు, 121 అంతర్జాతీయ సరిహద్దులలో ఈసీ నిఘా ఏర్పాటు చేసింది. పోలింగ్ కేంద్రాల వద్ద నీళ్లు, షెడ్, టాయిలెట్స్, ర్యాంప్స్ ఏర్పాటు చేశారు.

AP Assembly Elections 2024: Allu Arjun Gives Clartiy On Nandyal Tour
అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలు, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ ఎన్నికతో పాటు ఏపీలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌ సభ స్థానాలకు పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఉదయం 7.30 గంటలకే తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. జూబ్లీహిల్స్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్‌ సెంటర్‌ ఉదయం 7.30 గంటలకే ఓటేశాడు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నంద్యాల టూర్‌పై క్లారిటీ ఇచ్చాడు. నంద్యాల అంసెబ్లీ నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ అభ్యర్తి శిల్పా రవిచంద్ర కిశోర్‌ రెడ్డి తన స్నేహితుడని.. అందుకే ఆయనకు మద్దతుగా నంద్యాల వెళ్లాలని చెప్పాడు. ‘శిల్పా రవి నాకు 15 ఏళ్లుగా మిత్రుడు. అతనికి మద్దతు ఇస్తానని గతంలో మాట ఇచ్చాను. రాజకీయాలతో సంబంధం లేకుండా స్నేహితుడిగా మాత్రమే శిల్పారవికి మద్దతుగా నంద్యాల వెళ్లాను. నాకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం అస్సలు లేదు. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను’అని బన్నీ అన్నారు.

తనిష్క్ జ్యువెలరీ నెక్లెస్‌
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్

ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన, భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్‌ల నుండి ప్రేరణ పొంది అద్భుతమైన మరియు వైవిధ్యమైన శ్రేణి సమకాలీన, రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్‌లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్‌లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్‌లు, కస్టమర్‌లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా, ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్‌ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్‌ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్, ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్‌లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్‌గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్‌లెట్‌లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్‌లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్‌లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్‌డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్‌లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్ 18కేరట్ మరియు 22కేరట్ బంగారంలో విస్తృతమైన శ్రేణి డిజైన్‌లతో, నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని సంపూర్ణం చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్‌లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్‌లెట్‌లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement

ఫోటో స్టోరీస్

View all