Top Stories
ప్రధాన వార్తలు
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కడప (వైఎస్ఆర్ కడప జిల్లా)
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కడప (వైఎస్ఆర్ కడప జిల్లా)
చంద్రబాబు అరువు మేనిఫెస్టో.. ఆ రాష్ట్రాల్లో పరిస్థితి ఇదే..
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది తెలుగుదేశం కూటమి అబద్దాలకు అంతు లేకుండా పోతోంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా ఇక అసత్యాలే గత్యంతరం అన్నట్లుగా ప్రచారాన్ని పెంచాయి. టీడీపీ భారీ ఎన్నికల వాగ్దానాలు చేసినా, జనం వాటిని నమ్మడం లేదు. అందుకే లాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటూ పచ్చి మోసపూరిత ప్రచారానికి కూటమి దిగింది. ఫుల్ పేజీ ప్రకటనలే కాకుండా, అవే అబద్దాలతో ఈనాడు మీడియా పెద్ద ఎత్తున కథనాలు కూడా వండివార్చింది.దీనికి ఒకటే కారణం కనిపిస్తుంది. సూపర్ సిక్స్ అంటూ టీడీపీ, జనసేనలు ఇచ్చిన హామీలు అయ్యేవి, పోయేవి కాదని ప్రజలు నిశ్చితాభిప్రాయానికి రావడమే. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ, కర్నాటక వంటి రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికల సందర్భంగా దాదాపు ఇవే తరహా వాగ్దానాలు చేసి, అధికారంలోకి వచ్చినా వాటిని అమలు చేయలేక సతమతమవుతున్నాయి. ఆ రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ ఇచ్చిన మానిఫెస్టోలలోని వాగ్దానాలతో పాటు, ఏపీ ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న నవరత్నాలలోని అంశాలను జోడించి చంద్రబాబు కాపీ మానిఫెస్టోని తయారు చేసుకున్నారు. జగన్ ఇచ్చే స్కీముల కన్నా ఇంకా ఎక్కువ ఇస్తామని చెబుతున్నారు. అందుకు అయ్యే వ్యయం ఎంతో మాత్రం టీడీపీ చెప్పడం లేదు.ఆరు గ్యారంటీల అమలు సంగతేంటి?ఈ నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ హామీలు ఎన్ని అమలు అవుతున్నాయో తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. విశేషం ఏమిటంటే హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం బీఆర్ఎస్ స్వీప్ చేస్తే, గ్రామీణ ప్రాంతాలలో కాంగ్రెస్ స్వీప్ చేసింది. తద్వారా అవసరమైన మెజార్టీకన్నా కాంగ్రెస్‌కు కొద్దిగా ఎక్కువ సీట్లు వచ్చాయి. ఫలితంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలలో చాలావరకు అమలు చేశామన్న అభిప్రాయం ప్రజలలో కలిగించడానికి గట్టి కృషి చేస్తున్నారు. రేవంత్‌ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు తదితరులు, అలాగే బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వంటివారు కార్నర్ చేస్తున్నారు.నోరు జారిన రాహుల్కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో నిర్మల్‌లో జరిగిన సభలో మాట్లాడుతూ.. మహిళలకు ప్రతి నెల ఇస్తామని చెప్పిన 2500 రూపాయల హామీని అమలు చేసినట్లు చెప్పారు. దీనిపై కేసీఆర్ మండిపడ్డారు. నిజానికి కాంగ్రెస్ ఇచ్చిన మానిఫెస్టోలో అనేకం ఆచరణ సాధ్యం కానివని అప్పట్లో అందరూ గుర్తించినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది. అందుకు ప్రధాన కారణం కేసీఆర్ అనుసరించిన అహంభావ పూరిత ధోరణి అన్నది ఎక్కువ మంది రాజకీయ విశ్లేషకుల అబిప్రాయం. పలు అబియోగాలు ఎదుర్కుంటున్న ఎమ్మెల్యేలకు కూడా టిక్కెట్లు ఇచ్చి ఆయన నష్టపోయారు. అది వేరే కథ.ఏపీలో తెలుగుదేశం కూటమి అనేక వాగ్దానాలు చేసి ప్రజలను ఓట్లు అడుగుతోంది. జనం వాటిని నమ్మకపోవడంతో కొత్తగా లాండ్ టైటిలింగ్ యాక్ట్ పై అబద్దాలను సృష్టించి టీడీపీ కేసులలో చిక్కుకుంది. అయినా వదలకుండా అదే అంశంపై ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే, కాంగ్రెస్ పార్టీ స్త్రీలకు ఉచిత బస్ ప్రయాణం హామీని అమలు చేసింది. దీనివల్ల ఆర్టీసీకి వచ్చే నష్టాల సంగతి ఎలా ఉన్నా, అమలు వరకు ఓకే. కానీ దీని ఫలితంగా ఆటోలపై ఆధారపడి బతుకుతున్న లక్షలాది మంది చాలా నష్టపోయారు. మొదట వ్యక్తం అయినంత ఆశాభావ స్థితి ఇప్పుడు ఉన్నట్లు లేదు. పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, గ్యాస్ సిలిండర్లకు సబ్సీడీ వంటి స్కీములు అమలు చేసినట్లు చెబుతున్నా, ఎంతమందికి అవి అందుతున్నది చెప్పడం కష్టమే.వంద రోజుల్లో వాగ్దానాలు అమలు.. ఎన్నికల ఫలితాలు వచ్చాక 2023 డిసెంబర్ తొమ్మిదిన రైతుబంధు నిధులను ఎక్కువ చేసి మరీ చెల్లిస్తామని పీసీసీ అధ్యక్ష హోదాలో ప్రకటించారు. ఆ తేదీన చెల్లించలేదు. ఎవరైనా అడిగితే ఇప్పుడేగా ప్రభుత్వం ఏర్పడిందని కాంగ్రెస్ నేతలు దబాయించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉందని, కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల సుడిగుండంలోకి నెట్టేసిందని చెప్పేవారు. అయినా వంద రోజుల్లో అన్ని వాగ్దానాలు అమలు చేస్తామని అనేవారు. ఆ వంద రోజులు దాటిపోయింది. కానీ చాలా వాగ్దానాలు అలాగే ఉండిపోయాయి. ఉదాహరణకు రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ అంశం తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలలో రాజకీయ పార్టీల మధ్య వాద, ప్రతివాదాలకు కారణం అవుతోంది.రాజీనామాల సవాల్మాజీ మంత్రి హరీష్ రావు ఈ హామీలు అమలు చేశారని రుజువు చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాలు చేశారు. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ బదులు ఇస్తూ రుణమాఫీని ఆగస్టు పదిహేనులోగా చేస్తామని, హరీష్ రాజీనామాకు సిద్దంగా ఉండాలని అంటున్నారు. నిజంగా దీనికి అయ్యే వేల కోట్లు సిద్దం చేసుకుని అమలు చేస్తే రేవంత్‌కు రైతులలో మంచిపేరే వస్తుంది. కానీ చేయలేకపోతే ఎన్నికల కోసం చెప్పినట్లవుతుంది. కేసీఆర్ రైతు బంధు ఎకరాకు పదివేలు ఇస్తుంటే దానిని పదిహేను వేలు చేసి ఇస్తామని రేవంత్ ప్రకటించారు. కానీ ఆ ప్రకారం ప్రభుత్వం ఇవ్వలేకపోతోంది.విమర్శల వెల్లువకొంతమందికి పాత రైతు బంధు ప్రకారం డబ్బులు జమ అయినా, కాంగ్రెస్ చెప్పినట్లు మాత్రం జరగడం లేదు. అలాగే రాష్ట్రంలో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు చొప్పున ఇస్తామన్నది కాంగ్రెస్ వాగ్దానం. ఏఐసీసీ ప్రకటించిన లక్ష రూపాయల సాయానికి ఇది అదనమని రాహుల్ అన్నారు. అక్కడితో ఆగకుండా 2500 రూపాయల చొప్పున స్త్రీలకు చెల్లిస్తున్నట్లు రాహుల్ చెప్పడం విమర్శలకు దారి తీసింది. కేసీఆర్ దీనిని అందుకుని రాహుల్ మాటల వీడియోని జనానికి వినిపించి విమర్శలు గుప్పిస్తున్నారు. రైతుభరోసా కింద రూ.15 వేలు ఇవ్వకపోగా, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన రూ.పది వేలు కూడా ఇవ్వకుండా రైతులను ముప్పు తిప్పలు పెడుతున్నదని, అందరికీ రైతుబంధు జమ చేశామని ఒకసారి, ఇక నాలుగు లక్షల మందికే ఇవ్వాల్సి ఉన్నదని మరోసారి చెబుతూ కాలయాపన చేస్తున్నదని బీఆర్ఎస్ చెబుతోంది.స్పష్టత ఇవ్వలేని అయోమయంఎన్నికల తరుణంలో కొంతవరకు ఈ డబ్బు వేసినట్లు తాజాగా అంటున్నారు. మరి రైతు రుణమాఫీని ఎలా చేస్తారు? ఎవరెవరికి వర్తింపజేస్తారు? విధివిధానాలేమిటి? అనే అంశాలపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేని అయోమయం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏ ఊరి వెళ్తే ఆ ఊరి దేవుళ్లు, దేవతల మీద ఒట్టు మీద ఒట్టు పెడుతూ రైతులను నమ్మించేందుకు నానా తంటాలు పడుతున్నారని విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. రైతులు పండించిన పంటలకు రూ.500 బోనస్ హామీ బోగస్ ముచ్చటగా మిగిలిందని విపక్షం వ్యంగ్యాస్త్రాలు సంధిస్తోంది. నెలకు రూ.3వేలు నిరుద్యోగ భృతి చెల్లిస్తామంటూ ప్రియాంకాగాంధీ చేత యూత్ డిక్లరేషన్ ప్రకటింపజేసి అధికారంలోకి రాగానే మాట మార్చింది. అసలు తాము నిరుద్యోగ భృతి హామీయే ఇవ్వలేదంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిరుద్యోగ యువతను వెక్కిరించారు.ఒట్టుల సీఎం..రైతు రుణమాఫీపై రోజుకో దేవుడిపై ఒట్టు పెడుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం నిర్మల్ జనజాతర సభలో మాట్లాడుతూ.. ఇంద్రవెల్లి అమరవీరుల సాక్షిగా ఒట్టు పెట్టారు. ఎర్రవెల్లి జనజాతరలో మాట్లాడుతూ.. జోగుళాంబ అమ్మవారి సాక్షిగా ఒట్టు పెట్టారు. ఆగస్టు 15లోపు రూ.2 లక్షల రుణమాఫీ, ఈ నెల 9 లోపు రైతు భరోసా అందజేస్తామని చెప్పారు. ఇప్పటికే ఐదు గ్యారెంటీలను అమలు చేశామని, రాబోయే రోజుల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని అన్నారు. ఆయన చెప్పిన దాని ప్రకారం పరిశీలిస్తే అవి అర్ధ సత్యాలేనని తేలుతుంది. వృద్దులకు పెన్షన్ నాలుగువేల రూపాయలు చేస్తామని కాంగ్రెస్ తెలిపింది. కాని ఆ దిశగా ఇప్పటికీ అడుగులు పడలేదు. దళితులకు కేసీఆర్ పది లక్షల చొప్పునే ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే పన్నెండు లక్షల చొప్పున ఉపాది కల్పన స్కీము కింద ఇస్తామని కాంగ్రెస్ తెలిపింది. ప్రస్తుతం ఆ ఊసే రావడం లేదు.కర్ణాటకలోనూ ఇదే పరిస్థితికర్ణాటకలో సిద్ధరామయ్య సర్కారు ఇచ్చిన పలు హామీల పరిస్థితి ఇలాగే ఉంది. అధికారం కోసం ఎన్నికలలో ఇష్టం వచ్చినట్లు హామీలు ఇవ్వడం, ఆ తర్వాత కళ్లు తేలేయడం ఎక్కువ రాజకీయ పార్టీలకు అలవాటైంది. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు దేశంలోనే ఒక రికార్డు సృష్టించారని చెప్పవచ్చు. 2014 ఎన్నికలలో లక్ష కోట్ల రైతుల రుణాలు, డ్వాక్ర మహిళల రుణాలు మాపి చేస్తామని చెప్పి ,చివరికి అరకొరగా చేసి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను మూట కట్టుకున్నారు. అప్పట్లో కాపు రిజర్వేషన్లతో సహా 400 పైగా హామీలు ఇచ్చి, వైఎస్ ఆర్ కాంగ్రెస్ పదే,పదే గుర్తు చేస్తోందని మానిఫెస్టోని టీడీపీ వెబ్ సైట్లో నుంచి తొలగించారు.వాగ్దానాల హామీ పూర్తి2019లో విశ్వసనీయత దారుణంగా దెబ్బ తినడంతో చంద్రబాబు ఘోర పరాజయాన్ని మూట కట్టుకున్నారు. అదే సమయంలో 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ ముఖ్యమంత్రి అయి తాను ఇచ్చిన నవరత్నాల వాగ్దానాలను పూర్తిగా అమలు చేయడం ద్వారా ప్రజల ఆదరణ చూరగొన్నారు. వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు బరోసా కేంద్రాలు, వృద్దుల ఇళ్లకే పెన్షన్లు, చేయూత, ఆసరా, విద్యా దీవెన తదితర పెక్కు హామీలను అమలు చేసి చూపించారు. పోర్టులు, మెడికల్ కాలేజీలు, ఉద్దానం బాదితులకు రక్షిత నీటి పథకం వంటివి నిర్మించారు.99 శాతం హామీలను తాను అమలు చేశానని, మీకు మంచి జరిగి ఉంటేనే తనకు మద్దతు ఇవ్వండని ధైర్యంగా జగన్ చెబుతున్నారు.చంద్రబాబుకు పవన్ సరెండర్అదే చంద్రబాబునాయుడు 2014 నుంచి 2019 వరకు బాగా పాలించానని, ఫలానా రకంగా వ్యవస్థలు మార్చానని, సంక్షేమం అందించానని చెప్పలేకపోతున్నారు. ముఖ్యమంత్రి జగన్ మాత్రం కొత్త, పాత మానిఫెస్టోలను చూపుతూ ప్రజల ముందుకు దైర్యంగా వెళ్లగలుగుతున్నారు. చంద్రబాబు అలా చేయలేకపోతున్నారు. చంద్రబాబుకు పూర్తిగా సరెండర్ అయిపోయిన పవన్ కల్యాణ్ తన పార్టీ తరపున ఒక మానిఫెస్టోని కూడా తయారు చేసుకోలేకపోయారు. టీడీపీ మానిఫెస్టోనే భుజాన వేసుకున్నారు. భారతీయ జనతా పార్టీ అయితే టీడీపీ, జనసేనల మానిఫెస్టోని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు. చంద్రబాబు ఆచరణ సాద్యం కాని హామీలు ఇచ్చినందునే తాము ఆ మానిఫెస్టోలో భాగస్వాములు కాలేదని బీజేపీ సీనియర్ నేత యడ్లపాటి రఘునాధ బాబు తెలిపారు.చంద్రబాబువి అన్నీ అబద్దాలేప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తదితరులు ఏపీలో ప్రచారం చేసినా, టీడీపీ, జనసేనల మానిఫెస్టోకి మద్దతు ఇవ్వలేదు. అసలు ఆ ప్రస్తావనే తేలేదు. ముస్లిం రిజర్వేషన్ల వంటి అంశాలలో టీడీపీ మానిఫెస్టోలో క్లారిటీ ఇవ్వలేకపోయింది. తెలంగాణ, తదితర రాష్ట్రాలలో ముస్లిం రిజర్వేషన్లు ఎత్తివేస్తామని చెప్పిన బీజేపీ, ఏపీలో మాత్రం ఆ ప్రస్తావన తేకుండా జాగ్రత్తపడుతూ డబుల్ గేమ్ ఆడుతోంది. మరో వైపు జగన్ తాను గతంలో ఇచ్చిన హామీలనే కొద్దిపాటి మార్పులతో కొనసాగిస్తామని ధైర్యంగా చెప్పారు. దీంతో చంద్రబాబు ఇచ్చిన మానిఫెస్టోకి అసలు విలువ లేకుండా పోయింది. చంద్రబాబు అన్నీ అబద్దాలే చెబుతారన్న అభిప్రాయానికి ప్రజలు ఎక్కువ శాతం వచ్చారు.అసత్యాల ప్రచారంతో రాజకీయ లబ్దితెలంగాణ, కర్నాటకలలో కాంగ్రెస్ వాగ్దానాలు అమలు చేయడం విఫలం అవుతున్న మాదిరే ఏపీలో చంద్రబాబు కూడా అవేవి చేయలేడన్న స్పష్టమైన అభిప్రాయానికి ప్రజలు వచ్చారు. అందుకే రాష్ట్రంలొ చంద్రబాబు వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురద చల్లి, అసత్యాలు ప్రచారం చేసి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారు. కానీ సోషల్ మీడియా వచ్చిన ఈ రోజులలో ఏ రాష్ట్రంలో ఏమి జరుగుతున్నదో ప్రజలు తెలుసుకుంటున్నారు .దాంతో చంద్రబాబు వంటివారి పప్పులు ఉడకడం లేదు. అందుకే చివరి అస్త్రంగా అబద్దాల మీదే చంద్రబాబు, పవన్ కల్యాణ్, రామోజీ, రాధాకృష్ణలు ఆధారపడే దైన్య స్థితికి వచ్చారు.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్టు
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్.. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన స్టార్ క్రికెటర్
న్యూజిలాండ్ విధ్వంంసకర ఓపెనర్ కోలిన్ మున్రో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మున్రో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ20 ప్రపంచకప్-2024 కివీస్ జట్టులో చోటు ఆశించిన మున్రోకు సెలక్టర్లు మొండి చేయి చూపించారు. ఈ క్రమంలో జట్టులో చోటు దక్కకపోవడంతోనే మున్రో అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికాడు. "అత్యున్నత స్ధాయిలో న్యూజిలాండ్ క్రికెట్‌కు ప్రాతినిథ్యం వహించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. అన్ని ఫార్మాట్లలోనూ బ్లాక్ క్యాప్స్ జెర్సీని నేను ధరించాను. అది నేను నా జీవితంలో సాధించిన అతి పెద్ద విజయం. మళ్లీ న్యూజిలాండ్ తరపున ఆడేందుకు ఎంతో ఆతృతగా ఎదురు చూశాను. కానీ టీ20 వరల్డ్‌కప్‌లో జట్టులో నా పేరు లేదు. కాబట్టి క్రికెట్‌కు వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయం అని భావించానని మున్రో పేర్కొన్నట్లు ఐసీసీ ఒక ప్రకటన విడుదల చేసింది.న్యూజిలాండ్ క్రికెట్లో మున్రోకు అంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇంటర్ననేషనల్ క్రికెట్లో మున్రో కివీస్ తరపున 100కు పైగా మ్యాచ్‌లు ఆడాడు. 2014, 2016 టీ20 వరల్డ్‌కప్‌లలో న్యూజిలాండ్ జట్టులో మున్రో భాగమయ్యాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో మూడు పైగా సెంచరీలు చేసిన ఏడు మంది ఆటగాళ్లలో మున్రో ఒకడిగా కొనసాగుతున్నాడు. 2012 లో అంతర్జాతీయ క్రికెటలో అడుగుపెట్టిన మున్రో. . తన కెరీర్లో 57 వన్డేలు, 65 టీ20లు, ఒక టెస్టు మ్యాచ్ ఆడాడు. వన్డేల్లో 1271 పరుగులు, టీ20ల్లో 1724 పరుగులు చేశాడు. అదే విధంగా ఎకైక టెస్టులో 15 పరుగులు మాత్రమే చేశాడు. ఇక టీ20ల్లో 47 బంతుల్లో సెంచరీ చేసిన రికార్డు అతడి పేరిట ఉంది. 2018లో వెస్టిండీస్ పై ఈ ఘనత సాధించాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న మున్రో.. ఫ్రాంచైజీ క్రికెట్లో మాత్రం కొనసాగననున్నాడు.
మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
సాక్షి, చిత్తూరు జిల్లా: మేనిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథంగా భావించి 99 శాతం హామీలను అమలు చేశామని.. హామీలు అమలయ్యాయో లేదో ఇంటింటికి పంపించి అడిగే సంప్రదాయం మొదలుపెట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం పుత్తూరు ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ,59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు.‘‘వివిధ పథకాలకు మీ బిడ్డ 130 సార్లు బటన్ నొక్కాడు. అక్కచెల్లెమ్మలకు నేరుగా 2 లక్షల 70 వేల కోట్లు అందించాం. ఎక్కడా లంచాలు, వివక్ష లేని పాలన అందించాం. సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందడం గతంలో చూశారా?. ఏకంగా 2 లక్షల 31 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన రోజులు గతంలో చూశాం. మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మర్చాం’’ అని సీఎం చెప్పారు‘‘ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం. పేదవాళ్లు ఆరోగ్యం బాగోలేక అప్పులపాలు కాకూడదని రూ.25 లక్షలకు ఆరోగ్యశ్రీని విస్తరించాం. ఇంటి వద్దకే రేషన్, పౌరసేవలు, తలుపుతట్టి పథకాలు.. గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా?. రైతు భరోసా గతంలో ఉండేదా? పెట్టుబడి సాయం అందేదా?. గ్రామ సచివాలయాల్లో 600 రకాల సేవలు అందిస్తున్నాం. చంద్రబాబు పాలనలో చేసిన మంచిపని ఒక్కటైనా గుర్తొస్తుందా?. ఇలాంటి వ్యక్తి సూపర్ సిక్స్ అంటే నమ్మొచ్చా?. అవ్వాతాతల పెన్షన్ ఇంటికే రావాలంటే వైఎస్సార్సీపీకే ఓటేయండి’’ అని సీఎం జగన్ పిలుపునిచ్చారు.‘‘14 ఏళ్లు సీఎంగా చేశానని చెప్పుకునే చంద్రబాబు ఏం చేశాడు?. 2014లో చంద్రబాబు చేసిన మోసాలు గుర్తున్నాయా?. చంద్రబాబు సూపర్ సిక్స్, సెవెన్ అంటున్నాడు నమ్ముతారా?. ఇంటింటికి కేజీ బంగారం, బెంజ్‌కారు ఇస్తారంట.. నమ్ముతారా?’’ అంటూ సీఎం జగన్ ఎద్దేవా చేశారు.ఈ ఎన్నికలు.. ఐదేళ్ల భవిష్యత్ జగన్ కు ఓటేస్తే .. పథకాలు కొనసాగింపు, ఇంటింటా అభివృద్ధి పొరపాటున బాబుకు ఓటేస్తే .. పథకాలు ముగింపే బాబుకు ఓటు వేయడమంటే కొండచిలువ నోట్లో తల పెట్టడమే 59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం వివిధ పథకాలకు మీ బిడ్డ 130 సార్లు బటన్ నొక్కాడు అక్కచెల్లెమ్మలకు నేరుగా రూ. 2 లక్షల 70 వేల కోట్లు అందించాం సంక్షేమ పథకాలు నేరుగా లబ్దిదారులకు అందడం గతంలో చూశారా ? ఏకంగా 2 లక్షల 31 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం మేనిఫెస్టో ను చెత్తబుట్టలో వేసిన రోజులు గతంలో చూశాం మేనిఫెస్టో కు, విశ్వసనీయతకు అర్ధం చెప్పింది మీ బిడ్డే మేనిఫెస్టో లోని 99శాతం హామీలను నెరవేర్చాం నాడు నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చాం ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం 3వ తరగతి నుంచే టోఫెల్ క్లాసులు, సబ్జెక్టు టీచర్లు 6వ తరగతి నుంచే డిజిటల్ బోధన, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ లు ఇంగ్లీష్ మీడియంతో పాటు ఐబీ సిలబస్ వరకు వెళ్లాం బడులు తెరిచే నాటికి విద్యాకానుక, గోరుముద్దపూర్తి ఫీజులు కడుతూ జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ తో 93% విద్యార్థులకు చదువులు ఇంటర్నేషనల్ యూనివర్శిటీలతో సర్టిఫైడ్ కోర్సులు అక్కచెల్లెమ్మల కోసం ఆసరా, సున్నా వడ్డీ, చేయూత అక్కచెల్లెమ్మల కోసం కాపు నేస్తం, ఈబీసీ నేస్తం అక్కచెల్లెమ్మల పేరుపై 31 లక్షల ఇళ్ల పట్టాలిచ్చాం గతంలో లేని విధంగా 22 లక్షల ఇళ్ల నిర్మాణం ఎన్నడూ లేని విధంగా అవ్వాతాతలకు ఇంటి వద్దకే రూ. 3 వేల పెన్షన్ ఇంటి వద్దకే పౌరసేవలు, సంక్షేమ పథకాలు రైతు భరోసాతో రైతన్నకు తోడుగా నిలిచాం రైతులకు పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం సకాలంలో ఇన్ ఫుట్ సబ్సిడీ, రైతన్నలకు తోడుగా ఆర్బీకే వ్యవస్థ విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్నకు తోడుగా నిలిచాం బాబు హయాంలో రైతన్నకు ఇంత మంచి జరిగిందా ? డ్రైవర్ అన్నదమ్ములకు వాహనమిత్ర, నేతన్నలకు నేతన్న నేస్తం మత్య్సకారులకు మత్య్సకార భరోసా, లాయర్ల కు లా నేస్తం జగనన్న తోడు, చేదోడు తో చిరువ్యాపారులకు తోడుగా నిలిచాం పేదవాడి వైద్యం కోసం రూ. 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పేషెంట్ విశ్రాంతి సమయంలో ఆరోగ్య ఆసరాతో ఆదుకున్నాం గ్రామాల్లోనే ఆరోగ్య సురక్ష ఫ్యామిలీ, డాక్టర్ విలేజ్ క్లినిక్ పేదవాడి ఆరోగ్యం కోసం ఇంతగా పరితపించిన ప్రభుత్వం ఉందా ? ఏ గ్రామానికి వెళ్లినా 600 సేవలు అందించే గ్రామ సచివాలయం గ్రామాల్లోనే వాలంటీర్ వ్యవస్థ, ఆర్బీకే వ్యవస్థ గ్రామాల్లోనే ఫైబర్ గ్రిడ్, డిజిటల్ లైబ్రరీలు, విలేజ్ క్లినిక్ 14 ఏళ్లు సీఎం గా చేశానని చెప్పుకునే చంద్రబాబు ఏం చేశాడు?బాబు పేరు చెప్తే ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా ? 2014 లో చంద్రబాబు చేసిన మోసాలు గుర్తున్నాయా ?రూ. 81,612 కోట్ల రైతు రుణమాఫీ చేస్తానన్నాడు .. చేశాడా ? రూ. 14,205 కోట్ల పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేశాడా ? ఆడబిడ్డ పుడితే రూ. 25 వేలు డిపాజిట్ చేస్తానన్నాడు .. చేశాడా ? ఇంటింటికి జాబు .. లేదంటే నిరుద్యోగ భృతి అన్నాడు. ఇచ్చాడా ? రూ. 10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ అన్నాడు .. చేశాడా ? ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి అమ్మేశాడు సింగపూర్ ను మించి అభివృద్ధి చేస్తానన్నాడు .. చేశాడా ? ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తానన్నాడు .. నిర్మించాడా ? చంద్రబాబు సూపర్ సిక్స్, సెవన్ అంటున్నాడు .. నమ్ముతారా ? ఇంటింటికి కేజీ బంగారం, బెంజ్ కారు ఇస్తారంట .. నమ్ముతారా ?చంద్రబాబు చేసేవన్నీ మాయలు, మోసాలేఏమాత్రం ఎండను ఖాతరు చేయకుండా ఆప్యాయత, ఆత్మీయతతో వచ్చిన అందరికీ కృతజ్ఞతలుకేవలం మూడు రోజుల్లో జరగనుంది కురుక్షేత్ర మహా సంగ్రామంజరగబోయేవి ఇంటింటి అభివృద్ధిని నిర్ణయించే ఎన్నికలు14 ఏళ్ల ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా ఒక్కటంటే ఒక్క మంచి కానీ, ఒక్క స్కీమ్ గానీ గుర్తుకు వస్తుందా?అధికారం వస్తే చంద్రబాబు చేసేవన్నీ మాయలు, మోసాలే2014లో ప్రజలు చంద్రబాబు చెప్పిన మేనిఫెస్టో నమ్మి ఓట్లు వేసారుముఖ్యమైన హామీలంటూ చంద్రాబు చెప్పినవాటిలో ఏ ఒక్కటీ చేయలేదురూ.87,612కోట్ల వ్యవసాయరుణాల మాఫీ జరగలేదురూ.14,205 కోట్ల పొదుపు సంఘాల రుణాల మాఫీ జరగలేదుమహాలక్ష్మీ పథకం కింద రూ.25,000 బ్యాంకుల్లో వేస్తామని ఒక్కరికీ ఒక్క రూపాయి కూడా వేయలేదుఇంటికో ఉద్యోగం, లేదా ప్రతినెలా రూ.2000 నిరుద్యోగ భృతి అని చెప్పి ఎవ్వరికీ ఇవ్వలేదు3 సెంట్ల స్థలం, కట్టుకునేందకు పక్కా ఇల్లు అని ఒక్క సెంటు స్థలం కూడా ఎవ్వరికీ ఇవ్వలేదు10వేల కోట్లతో ఏటా బీసీ సబ్ ప్లాన్, చేనేత, పవర్లూమ్ రుణాల మాఫీ, ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్, సింగపూర్ మించి అభివృద్ధి అన్నదిఏదీ జరగలేదుఇలాంటి వాళ్లని నమ్మవచ్చా?సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటున్న చంద్రబాబును నమ్మవచ్చా?గత ఎన్నికలప్పుడు చెప్పిన ఒక్క హామీ నెరవేర్చని చంద్రబాబు ఇప్పుడు మళ్లీ ఇప్పుడు కొత్త హామీలతో వచ్చాడుపేదవాడి భవిష్యత్ మారాలంటే ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి.
కాంగ్రెస్ హామీలన్నీ అబద్ధాలే: ప్రధాని మోదీ
సాక్షి,నారాయణపేట: మోదీ గ్యారెంటీ అంటే అభివృద్ధికి గ్యారెంటీ అని కాంగ్రెస్ అన్నీ అబద్ధపు హామీలిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. శుక్రవారం(మే10) నారాయణపేటలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడారు. ‘దేశ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలివి. రాబోయే ఐదేళ్లలో మూడు కోట్ల ఇళ్ల నిర్మాణానికి మోదీ గ్యారెంటీ. పదేళ్లలో దేశం ఎంతో అభివృద్ధి చెందింది. తెలంగాణకు లక్షల కోట్లు పంపించాం. ఆ డబ్బును బీఆర్ఎస్, కాంగ్రెస్ లూఠీ చేస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నో అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చింది. తెలంగాణప్రజలు డబుల్ ఆర్ ట్యాక్స్ గురించి ఆలోచించాలని నేను చెప్పాను. అందులో ఎవరి పేరు చెప్పలేదు. కానీ ముఖ్యమంత్రి మీడియా ముందుకు వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్‌పై మాట్లాడాడు. అంటే డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్లిందో మీరు అర్థం చేసుకోండి. కాంగ్రెస్ దేశానికి ఇప్పటివరకు చేసిందొక్కటే నమ్మకద్రోహం. కాంగ్రెస్ నేతలు ఎన్నికలు వచ్చాక దేశాన్ని విభజించేలా మాట్లాడుతున్నారు. యువరాజు గురువు దక్షిణాది వారిని ఆఫ్రికన్లలా ఉన్నారంటాడు. యువరాజు ఎన్నికల ముందు ప్రేమ దుకాణం తెరుస్తాడు. కాంగ్రెస్ హిందువులను సొంత దేశంలోనే హిందువులను రెండవ తరగతి పౌరులను చేస్తోంది. నేను గుడికి వెళ్లడాన్ని కూడా తప్పు పడుతున్నారు. రామనవమికి మీరు గుడికి వెళ్లరా. పసిపిల్లలు నాపై చూపే ప్రేము కూడా కాంగ్రెస్ నేతలకు ఇబ్బంది కలిగిస్తోంది. కాంగ్రెస్‌కు దేశంలోని హిందువుల పట్ల ప్రేమ లేదు. కాంగ్రెస్‌ది హిందువుల పట్ల వ్యతిరేక భావన. 2014లో కేసీఆర్‌ను మీరు ఎన్నుకుంటే ఆయన మిమ్మల్ని మరిచిపోయాడు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే చేస్తోంది’అని మోదీ విమర్శించారు.
‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
టైటిల్ : కృష్ణమ్మనటీనటులు: సత్యదేవ్, మీసాల లక్ష్మణ్, నందగోపాల్, కృష్ణ తేజ రెడ్డి, అతిర, అర్చన అయ్యర్, రఘు కుంచె తదితరులునిర్మాత: కొమ్మలపాటి కృష్ణదర్శకత్వం: గోపాలకృష్ణసమర్పణ : కొరటాల శివసంగీతం: కాలభైరవవిడుదల తేది: మే 10, 2024‘కృష్ణమ్మ’కథేంటంటే..ఈ సినిమా కథంతా 2003-2015 మధ్యకాలంలో జరుగుతుంది. విజయవాడలోని వించిపేటకు చెందిన భద్ర(సత్యదేవ్), కోటి(మీసాల లక్ష్మణ్), శివ(కృష్ణ తేజరెడ్డి) అనే ముగ్గురు అనాధలు మంచి స్నేహితులు. చిన్నప్పటి నుంచి ఒకరికొకరు అన్నట్లుగా బతుకుతారు. ఓ కేసు విషయంలో చిన్నప్పుడే జైలుకెళ్లిన శివ..బయటకు వచ్చాక నేరాలు చేయడం తప్పని భావించి ప్రిటింగ్ ప్రెస్ పెట్టుకుంటాడు. భద్ర, కోటి మాత్రం గంజాయి దందా, చిన్న చిన్న నేరాలు చేస్తూ జీవితం గడుపుతుంటారు. వించిపేటలోనే హాస్టల్లో ఉంటూ ప్రింటింగ్ ప్రెస్‌లో పని చేస్తున్న మీనా(అతిర)తో శివ ప్రేమలో పడతాడు. మరోవైపు భద్ర అదే కాలనీలో ఉంటున్న పద్మ(అర్చన అయ్యర్)తో ప్రేమలో పడతాడు. అనాధ అయిన కారణంగా భద్ర ప్రేమను పద్మ తండ్రి ఒప్పుకోరు. మరోవైపు మీనా.. భద్రను సొంత అన్నయ్యలా భావిస్తుంది. మీనా రాకతో అనాధలైన ఈ ముగ్గురికి ఓ ఫ్యామిలీ దొరుకుతంది. భద్ర, కోటి నేరాలు చేయడం మానేసి ఆటో నడుపుకుంటారు. అంతా హ్యాపీగా ఉన్న సమయంలో వీరికి అత్యవసరంగా మూడు లక్షల రూపాయలు కావాల్సి వస్తోంది. దానికి కోసం చివరగా ఓ నేరం చేద్దామనుకుంటారు. అయితే అనుకోకుండా ఈ ముగ్గురు పోలీసులకు పట్టుపడతారు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఈ ముగ్గురు చేసిన నేరం ఏంటి? వీరిపై నమోదైన కేసు ఏంటి? ఈ ముగ్గురిలో ఒకరు ఎలా చనిపోయారు? ఎవరు చంపారు? సీఐ పాండా వెంకట సుబుద్ది వీరిని నమ్మించి ఎలా మోసం చేశాడు? స్నేహితుడి కోల్పోయిన భద్ర.. తన పగను ఎలా తీర్చుకున్నాడు? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. రివెంజ్ డ్రామా సినిమాలు తెలుగు తెరకు కొత్తకాదు. చేయని నేరానికి హీరోకి శిక్ష పడడం.. బయటకు వచ్చాకా రివెంజ్ తీర్చుకోవడం.. ఈ కాన్సెప్ట్ బోలెడు సినిమాలు వచ్చాయి. కృష్ణమ్మ కథ కూడా ఇదే. ఈ రివేంజ్ డ్రామాకి స్నేహబంధం యాడ్ చేసి..డిఫరెంట్‌గా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు గోపాల కృష్ణ. కానీ కథతో పాటు కథనం కూడా రొటీన్‌గా ఉండడంతో.. ఏదో పాత సినిమా చూశామనే ఫీలింగ్ కలుగుతుంది. సినిమాలో వచ్చే ట్విస్టులు ముందే ఊహించొచ్చు. రా అండ్ రస్టిక్ పేరుతో హీరోకి గెడ్డం పెంచడం.. స్లమ్ ఏరియాల్లో జీవించడం.. స్మగ్లింగ్.. ఇవన్నీ గత సినిమాల్లో చూసినట్లుగానే అనిపిస్తుంది. ఫ్రెండ్షిప్ సెంటిమెంట్ కూడా వర్కౌట్ కాలేదు. ఫస్టాఫ్‌లో అసలు కథే ఉండదు. హీరో, అతని స్నేహితుల పాత్రల పరిచయానికే ఎక్కువ సమయం తీసుకున్నాడు. ఆ తర్వాత ఒకే సమయంలో ఇద్దరి ప్రేమకథలు చూపించారు. శివ పాత్ర లవ్‌స్టోరీ కాస్త ఆసక్తికరంగా అనిపించినా.. భద్ర లవ్‌స్టోరీ మాత్రం కథకి అతికినట్లుగా అనిపిస్తుంది. ఏదో హీరో అన్నాక.. హీరోయిన్ ఉండాలి.. ఓ లవ్‌స్టోరీ ఉండాలి అని పద్మ పాత్రను క్రియేట్ చేసినట్లుగా ఉంటుంది. ఆ పాత్రకి సరైన ముగింపు కూడా లేకపోవడం గమనార్హం. ఇంటర్వెల్ బ్యాంగ్ ఇంకాస్త ఆసక్తికరంగా రాసుకుంటే బాగుండేది. సెకండాఫ్‌లో కథంతా సీరియస్ మూడ్‌లో కాస్త ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. ఈ ముగ్గురిపై పెట్టిన దొంగ కేసు ఏంటి అనేది తెలిసిన తర్వాత కథపై ఆసక్తి సన్నగిల్లుతుంది. తర్వాత ఏం జరుగుతుందనేది ఈజీగా తెలిసిపోతుంది. స్నేహితుడిని చంపినందుకు హీరో తీర్చుకునే రివెంజ్ కూడా సినిమాటిక్‌గా అనిపిస్తుంది. క్లైమాక్స్ చాలా సింపుల్‌గా ఉంటుంది.ఎవరెలా చేశారంటే..సత్యదేవ్ మంచి నటుడే అందులో నో డౌట్. కానీ ప్రతి సినిమాకు ఒకే లెవల్ ఎక్స్ప్రెషన్స్.. డైలాగ్ డెలివరీ కూడా ఒకేలా ఉండడంతో ఆయన నటనలో కొత్తదనం కనిపించడం లేదు. ఈ చిత్రంలో కాస్త డిఫరెంట్‌గా ట్రై చేశాడు. కానీ అది పూర్తిగా వర్కౌట్ కాలేదు. విజయవాడ స్లాంగ్‌లో మాట్లాడానికి ట్రై చేశాడు కానీ తెరపై కాస్త ఎబ్బెట్టుగా అనిపించింది. యాక్షన్ సీన్స్‌లో పర్వాలేదు. ఎమోషనల్ సన్నివేశాల్లో చక్కగా నటించాడు. నడి రోడ్డుపై స్నేహితుడు చనిపోయినప్పుడు సత్యదేవ్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అలా గుర్తిండిపోతుంది. ఇక హీరో స్నేహితులు కోటిగా మీసాల లక్ష్మణ్, శివగా కృష్ణతేజ చక్కగా నటించారు. హీరోయిన్గా నటించిన అతిరా రాజ్‌కి ఇది తొలి సినిమా అయినా.. తెరపై చాలా సహజంగా నటించింది. అర్చన అయ్యర్ పాత్ర నిడివి తక్కువే అయినా ఉన్నంతలో బాగానే నటించింది. నందగోపాల్, రఘు కుంచెతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.సాంకేతికంగా సినిమా పర్వాలేదు. కాలభైరవ పాటలు గుర్తుపెట్టుకునేలా ఉండవు కానీ.. బీజీఎం ఓకే. ఎడిటింగ్ ఇంకా షార్ప్‌గా ఉండాల్సింది. సినిమాటోగ్రఫీ ఓకే. నిర్మాత విలువలు బాగున్నాయి.
May 10th: ఏపీ ఎన్నికల సమాచారం
ఏపీ ఎన్నికలకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం..
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్
సాక్షి, అమరావతి/వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): రాష్ట్రంలో చాలాకాలంగా డిమాండ్ చేస్తున్న కాపు రిజర్వేషన్లతో పాటు ముస్లిం రిజర్వేషన్లు అసలు అవసరమేలేదంటూ జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఆ రిజర్వేషన్లనే ఆయన వ్యతిరేకిస్తూ పరోక్షంగా పలు వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంగ్లిష్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ముస్లిం రిజర్వేషన్ల అంశంలో ఇటీవల బీజేపీ జాతీయ నేతలు చేస్తున్న ప్రకటనలకు జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ పూర్తి మద్దతు ప్రకటించడంతో పాటు కోరుకునే వారందరికీ రిజర్వేషన్లు కల్పించడం సాధ్యమేకాదని తన మనస్సులోని మాటను కుండబద్దలు కొట్టారు. ఈ రిజర్వేషన్లకు ప్రత్యామ్నాయ మార్గాలు గురించి ఆలోచన చేయాలన్నారు. ఆ ఇంటర్వ్యూలో సంబంధిత మీడియా ఛానల్ ప్రతినిధి.. ముస్లింలకు సంబంధించి బీజేపీ వైఖరి గురించి పవన్‌ను ప్రశ్నించినప్పుడు, బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం కాదని వ్యాఖ్యానించారు. కానీ, వాళ్లు (బీజేపీ) ముస్లిం రిజర్వేషన్లు అమలుచేయబోమని ఆ పార్టీ నేతలు నేరుగా చెబుతున్నారు కదా.. దానిపై మీరేమీ నిరాశ చెందడంలేదా అన్న ప్రశ్నకు పవన్ బదులిస్తూ.. ముస్లిం రిజర్వేషన్లపై బీజేపీ నేతల ప్రకటనలపట్ల తానేమీ నిరాశ, ఆందోళన చెందడంలేదని చెప్పారు. అయినా, రిజర్వేషన్ల అమలుకన్నా యువతకు ఉపాధి అవకాశాలు, నైపుణ్యాలు పెంచేలా వివిధ అంశాల్లో శిక్షణ ఇవ్వాలని సూచించారు.అందరికీ రిజర్వేషన్లు కూడా కుదరదు..రిజర్వేషన్లు కావాలని కోరుకుంటున్న అన్ని వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలన్నా సాధ్యమయ్యే పరిస్థితి కాదని పవన్ తేల్చిచెప్పారు. ప్రత్యేకంగా తమ సొంత (కాపు) కులం కూడా రిజర్వేషన్ల కోసం కొన్ని దశాబ్దాలుగా పోరాటం చేస్తోందన్నారు. అందరికీ రిజర్వేషన్లు ఇవ్వాలన్నా కుదరదని.. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని సుప్రీంకోర్టు స్పష్టంచేసిందని పవన్ గుర్తుచేశారు. రిజర్వేషన్లు ఇవ్వడానికి సాధ్యంకానప్పుడు, ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఆలోచించాలని ఆయన చెప్పారు.జగన్ ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదు మరోవైపు.. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం విజయవాడలో పవన్ పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ.. రాష్ట్రంలోని యువకుల గళాన్ని అసెంబ్లీలో బలంగా వినిపిస్తానన్నారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదన్నారు. మైనార్టీల ప్రాథమిక హక్కులకు తాను అండగా ఉంటానని.. కాపులకు రిజర్వేషన్లను అడుగుతున్నారని, న్యాయస్థానాల్లో ఉన్న అంశాలపై తాము మాట్లాడకూడదంటూ ఇంగ్లీష్ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూకు భిన్నంగా మాట్లాడారు. ఇక ఇక్కడ తాను పెంచి పెద్దచేసిన నాయకుడు తనపై విమర్శలు చేస్తూ తిటడం బాధ కలిగిస్తోందని పోతిన మహేష్ పేరు ప్రస్తావించకుండా వ్యాఖ్యానించారు. అలాగే, వంగవీటి రాధా చట్టసభలకు వెళ్తానంటే తాను అండగా ఉంటానని పవన్ చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని, పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనాచౌదరి, నాయకులు వంగవీటి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.Video Credits: NDTV
వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
సాక్షి, అమరావతి: వైఎస్ వివేకా హత్య కేసులో నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, సునీత, సీబీఐ అధికారి రాంసింగ్‌కు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగలింది. వీరు వేసిన క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది.కేసు పూర్వపరాలేంటీ? మాజీ మంత్రి వివేకానంద రెడ్డికి పీఏగా పనిచేసిన కృష్ణారెడ్డి 2021 డిసెంబర్లో పులివెందుల కోర్టులో ఒక ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. వివేకా హత్య కేసుకు సంబంధించి కొందరు తనను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో అవినాష్ రెడ్డి, శంకర్ రెడ్డి, భాస్కర్‌రెడ్డి పేర్లు చెప్పాలంటూ సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్ ఒత్తిడి చేస్తున్నారని కోర్టుకు తెలిపారు. వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆరోపణలకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలంటూ ఒత్తిడి చేశారని ఆరోపించారు. కృష్ణా రెడ్డి ఫిర్యాదుపై పులివెందుల కోర్టు 2023 డిసెంబర్ 8న విచారణ జరిపింది. కేసు నమోదు చేసి తుది నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో పోలీసులు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, సునీత, రాంసింగ్‌పై కేసులు నమోదు చేసింది. ఈ కేసును కొట్టేయాలంటూ సునీత, ఆమె భర్త రాజశేఖర్, ఎస్పీ రామ్‌సింగ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు.హైకోర్టు ఏం చెప్పింది?వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి పెట్టిన కేసును కొట్టేయాలన్న సునీత, రాజశేఖర్ రెడ్డి, రాంసింగ్ వాదనలను ఏపీ హైకోర్టు అంగీకరించలేదు. వీరు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. చదవండి : నర్రెడ్డి సునీత, రాజశేఖర్‌రెడ్డి చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలుకృష్ణారెడ్డి ఏం చెబుతున్నారు? "వివేకానందరెడ్డి హత్య కేసులో సునీత దంపతుల పాత్ర అనుమానస్పదంగా ఉంది. ఈ హత్య సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి కుట్ర అని భావిస్తున్నాను. వారిద్దరితోపాటు శివప్రకాశ్‌రెడ్డిల తీరు సందేహాస్పదంగా ఉంది. వివేకా రెండో పెళ్లితోనే ఆ కుటుంబంలో తీవ్ర విభేదాలు తలెత్తాయి. రెండో భార్య షమీమ్‌కు ఆస్తిలో వాటా ఇవ్వాలని వివేకానందరెడ్డి భావించడంతో హత్య జరిగినట్టు భావిస్తున్నాను. వివేకా లెటర్‌ను దాచిపెట్టమని ఆయన అల్లుడు రాజశేఖర్‌రెడ్డి స్వయంగా చెప్పారు. ఆ తర్వాత కూడా అబద్ధం చెప్పాలని సునీత, రాజశేఖర్‌రెడ్డి నన్ను వేధించారు. ఈ హత్యకు కారణం ఎంపీ అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి పేర్లు చెప్పాలని నాపై ఒత్తిడి తెచ్చారు. పోలీసులు, సీబీఐ అధికారులు చిత్రహింసలకు గురిచేశారు. నేను అబద్ధం చెప్పకపోతే నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి జైలుకు వెళ్లాల్సి వస్తుందని సునీత అన్నారు. దస్తగిరి అప్రూవర్‌గా మారడం వెనుక పక్కా కుట్ర ఉంది. అవినాశ్‌రెడ్డిని ఎంపీగా గెలిపించడం కోసం చివరి వరకూ వివేకా కృషి చేశారు" అని వివేకా పీఏ కృష్ణారెడ్డి వెల్లడించారు.చదవండి : వైఎస్ వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి ఇంటర్వ్యూ పూర్తి పాఠం
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్
ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన, భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్ల నుండి ప్రేరణ పొంది అద్భుతమైన మరియు వైవిధ్యమైన శ్రేణి సమకాలీన, రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్లు, కస్టమర్లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా, ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్, ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్లెట్లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్ 18కేరట్ మరియు 22కేరట్ బంగారంలో విస్తృతమైన శ్రేణి డిజైన్లతో, నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని సంపూర్ణం చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్లెట్లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.
తప్పక చదవండి
- ఆదాయాలు రెట్టింపైనా ఉద్యోగాల్లో కోత!
- ‘అద్భుతం కంటే తక్కువేం కాదు’.. కేజ్రీకు మద్యంతర బెయిల్‌పై
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
- నవ్వుతారేమో అనుకున్నా: లాపతా లేడీస్ ప్రతిభ ఇంట్రస్టింగ్ జర్నీ
- రొమాంటిక్ సీన్స్.. ఒళ్లంతా దద్దుర్లు వచ్చేశాయి: టాలీవుడ్ హీరోయిన్
- డాగ్ లవర్స్ బీ అలర్ట్ : ప్రమాదకరమైన కుక్కలపై తమిళనాడు నిషేధం
- ‘సంతోషం’.. కేజ్రీవాల్‌కు మద్యంతర బెయిల్‌పై దీదీ
- రెడ్ లిప్‌స్టిక్‌ను ఉత్తరకొరియా ఎందుకు బ్యాన్ చేసిందో తెలుసా!
- నామినేషన్ దాఖలుకు బీజేపీ అభ్యర్థి పరుగులు.. చివరికి ఏమైందంటే..
- సింపతీ కోసమే కేజ్రీవాల్ అరెస్ట్
సినిమా
20 ఏళ్లకే పెళ్లి.. 'బిగ్‌బాస్' స్టార్ షాకింగ్ నిర్ణయం
ప్రముఖ సింగర్ పెళ్లికి రెడీ అయ్యాడు. అది కూడా కేవలం 20 ఏళ్ల వయసులోనే చేసుకోనుండటంతో అందరూ షాక్ అవుతున్నారు. స్వతహాగా తజికిస్థాన్ సింగర్ అయిన అబ్దు రోజిక్.. హిందీలో బిగ్‌బాస్-16 షోలో పాల్గొని పాపులరిటీ సంపాదించాడు. తనదైన పాటలు, కామెడీ టైమింగ్‌తో బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఇప్పుడు తను కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నట్లు చెప్పి అందరూ అవాక్కయ్యేలా చేశాడు.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ హీరో.. అమ్మాయి ఎవరంటే?)20 ఏళ్ల అబ్దు రజాక్.. షార్జాకు చెందిన అమీరాతో జూలై 7న నిఖా(ముస్లిం పద్ధతిలో పెళ్లి) చేసుకోనున్నాడు. ఈమె అబ్దు కంటే ఏడాది చిన్నది. అయితే వీళ్లిద్దరిది ప్రేమ వివాహం అని తెలుస్తోంది. ఇతడు పెట్టిన ఇన్ స్టా వీడియో చూస్తుంటే అదే అనిపిస్తుంది. ఇంతకీ వీడియో, క్యాప్షన్‌లో ఏముందంటే?'ప్రేమ కంటే విలువైనది నా జీవితంలో ఇంకేది లేదు. పెళ్లికి రెడీ అయ్యాను. జీవితంలో ఇదో కొత్త ప్రయాణం. ఎంతో ఎగ్జైట్మెంట్తో ఎదురుచూస్తున్నాను. నాది ప్రేమ పెళ్లి. అయితే ఈ ప్రేమ నాకు అంత సులభంగా దక్కలేదు. చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఇంతవరకు వచ్చాను. లవ్ జర్నీ నాకు కాస్త సవాలుగానే అనిపించింది. అమీరా-నేను ఒకరిని ఒకరు ఇష్టపడ్డాం. అయితే ఇలా జరుగుతుందని మాత్రం ఎప్పుడూ ఊహించలేదు. జూలై 7వ తేదీని సేవ్ చేసుకోండి' అని అబ్దు తన సంతోషాన్ని పంచుకున్నాడు. (ఇదీ చదవండి: టాలీవుడ్లో అది చాలా కష్టం.. అసౌకర్యంగా అనిపిస్తుంది: సంయుక్త) View this post on Instagram A post shared by Abduroziq Official (@abdu_rozik)
విశ్వక్ సేన్ యాక్షన్ ఎంటర్టైనర్.. బ్యాడ్ సాంగ్ వచ్చేసింది!
టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్సేన్ నటిస్తోన్న యాక్షన్ ఎంటర్టైనర్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. ఈ చిత్రంలో డీజే టిల్లు భామ నేహాశెట్టి, అంజలి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కృష్ణచైతన్య దర్శకత్వంలో తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ నుంచి లిరికల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.'అడవికి గొడ్డలి బ్యాడ్.. కడుపుకి అంబలి బ్యాడ్.. మట్టికి నాగలి బ్యాడ్' అనే సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. తాజాగా రిలీజైన ఈ సాంగ్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ చిత్రం రిలీజ్ తేదీ మరోసారి మారింది. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మే 31 రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా.. మొదట ఈనెల 17న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
కల్యాణ్ రామ్ సినిమా షూటింగ్లో అగ్ని ప్రమాదం!
హీరో కల్యాణ్ రామ్ కొత్త సినిమా షూటింగ్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దాదాపు రూ.4 కోట్లు విలువైన సెట్ కాలి బూడిద అయిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశమవుతోంది. అయితే ఈ సంఘటన వల్ల నిర్మాతకు కూడా భారీ నష్టం వాటిల్లందని టాక్.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ హీరో.. అమ్మాయి ఎవరంటే?)కల్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న సినిమా షూటింగ్.. గత కొన్నిరోజుల నుంచి హైదరాబాద్‌లో జరుగుతోంది. సీబీఐకి సంబంధించిన సీన్స్ తీస్తున్నారు. 9 రోజుల షూటింగ్ ఇప్పటికే పూర్తవగా, మరో రోజు చిత్రీకరణ మిగిలి ఉంది. ఈ క్రమంలోనే ఊహించని విధంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో సెట్ మొత్తం కాలిపోయింది. ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.(ఇదీ చదవండి: టాలీవుడ్లో అది చాలా కష్టం.. అసౌకర్యంగా అనిపిస్తుంది: సంయుక్త)
ఎట్టకేలకు రైతుబిడ్డ చేతికి! తల్లికి తొలి కానుక..
బిగ్‌బాస్ షో పనైపోయిందనుకున్న సమయంలో ఉల్టా పుల్టా అంటూ ఏడో సీజన్‌పై ఆసక్తి పెంచాడు కింగ్ నాగార్జున. ఈ రియాలిటీ షోని మళ్లీ గాడిలో పెట్టే పనిని తన భుజాలపై వేసుకున్నాడు. అలా నాగ్ హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్ బాగానే వర్కవుట్ అయింది. ఈ సీజన్లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలవగా నటుడు అమర్దీప్ చౌదరి రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు.ప్రైజ్‌మనీతో పాటువిన్నర్కు రూ.50 లక్షల ప్రైజ్‌మనీ ఇవ్వాలి. అయితే ఫినాలేలో ప్రిన్స్ యావర్ రూ.15 లక్షల సూట్‌కేసును ఎగరేసుకుపోవడంతో ప్రశాంత్‌కు రూ.35 లక్షలు వచ్చాయి. ఇందులో 30-40 శాతం వరకు ట్యాక్స్‌కే పోతుంది. ఇది కాకుండా లగ్జరీ కారు గెలుచుకున్నాడు. అయితే హౌస్‌లో ఉన్నప్పుడు రూ.15 లక్షల విలువైన డైమండ్ జ్యువెలరీ కూడా ఇస్తామని ప్రకటించారు. అమ్మకు తొలి కానుకషో ముగిసిన ఐదు నెలల తర్వాత ఆ నగను ప్రశాంత్‌కు అందించారు. అక్షయ తృతీయ రోజే జ్యువెలరీ చేతికి రావడంతో రైతుబిడ్డ సంతోషంలో మునిగిపోయాడు. 'అమ్మకు తొలి కానుక.. బిగ్‌బాస్ ఏడో సీజన్‌కు థ్యాంక్స్.. లవ్యూ నాగ్ సర్..' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు. ఇప్పుడా పోస్ట్ వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by MALLA OCHINA (@pallaviprashanth_)చదవండి: బుల్లితెర నటి ఇంట సెలబ్రేషన్స్.. బాబు ఊయల ఫంక్షన్
ఫొటోలు
హీరోయిన్ రాశి సింగ్ లేటెస్ట్ ఫోటో షూట్.. పిక్స్ వైరల్ (ఫోటోలు)
వావ్.. మనసు దోచే టెక్స్టైల్ జ్యుయల్లరీ! (ఫోటోలు)
జగన్ కోసం మంగళగిరి సిద్ధం.. జననేతకు బ్రహ్మరథం (ఫొటోలు)
Priyanka Kholgade: స్టైలిష్ లుక్‌లో ప్రియాంక ఖోల్గడే.. పిక్స్ వైరల్ (ఫొటోలు)
Sreemukhi: ఈమె వాయిస్ ముందు డీజే కూడా తక్కువే.. శ్రీముఖి బర్త్‌డే స్పెషల్ (ఫోటోలు)
క్రీడలు
సారీ చెప్పిన కోహ్లి!.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
ఐపీఎల్-2024లో పంజాబ్ కింగ్స్ కథ ముగిసింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో గురువారం నాటి మ్యాచ్‌లో ఓటమితో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.ఈ నేపథ్యంలో పంజాబ్ అభిమానులతో పాటు ఆ జట్టు మేనేజ్మెంట్కు సైతం భంగపాటు తప్పలేదు. అయితే, జట్టు పరాభవం నేపథ్యంలోనూ పంజాబ్ ఫ్రాంఛైజీ సహ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా వ్యవహరించిన తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది.కోహ్లి వికెట్ పడగానే కాగా ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ను ఆర్సీబీ 60 పరుగులతో చిత్తు చేసింది. ఇక ఈ విజయంలో విరాట్ కోహ్లిదే కీలక పాత్ర అన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 47 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 7 ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో 92 పరుగులు చేశాడు.Going..Going..GONE!Virat Kohli clobbers that delivery into the stands in grand fashion! 💥Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #PBKSvRCB pic.twitter.com/Y5eVp7Q6fN— IndianPremierLeague (@IPL) May 9, 2024అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో రిలీ రొసోవ్‌కు క్యాచ్ ఇవ్వడంతో ఈ ఆర్సీబీ ఓపెనర్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఈ నేపథ్యంలో ప్రీతి జింటా చప్పట్లు కొడుతూ కోహ్లి వికెట్‌ను సెలబ్రేట్ చేసుకుంది. అయితే, ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు.The Punjab Kings bounce back with crucial breakthroughs, especially the big one of Virat Kohli 👏👏#RCB 238/5 with 5 deliveries leftWatch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #PBKSvRCB pic.twitter.com/9mu2bMjrWV— IndianPremierLeague (@IPL) May 9, 2024లక్ష్య ఛేదనలో పంజాబ్ బ్యాటర్లంతా విఫలం కావడంతో ఆ జట్టుకు పరాజయమే ఎదురైంది. ఈ నేపథ్యంలో నిరాశకు లోనైనా ప్రీతి జింటా హుందాగా వ్యవహరించింది.సారీ చెప్పిన కోహ్లి!.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్‌ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న సమయంలో.. మ్యాచ్‌ను తాము లాగేసుకున్నందుకు ప్రీతి జింటాకు సారీ చెప్పాడు. ఇందుకు బదులుగా కోహ్లితో కరచాలనం చేస్తూ... ‘‘మరేం పర్లేదు’’ అన్నట్లుగా నవ్వులు చిందించిందామె.ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో లక్నో యజమాని సంజీవ్ గోయెంకాను ప్రీతి జింటాతో పోలుస్తూ నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు. సంజీవ్ గోయెంకాకు చురకలుమ్యాచ్ ఓడటమే కాదు.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించినా ప్రీతి ఆ బాధ బయటకు తెలియకుండా నవ్వుతూ కవర్ చేసిందని.. ఆమెను చూసి గోయెంకా చాలా నేర్చుకోవాలని చురకలు అంటిస్తున్నారు. కాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో లక్నో ఓటమి నేపథ్యంలో ఆ జట్టు ఓనర్ సంజీవ్ గోయెంకా కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు బహిరంగంగానే చీవాట్లు పెట్టిన విషయం తెలిసిందే. చదవండి: ద్రవిడ్ గుడ్ బై!.. టీమిండియా కొత్త కోచ్‌గా ఫారినర్?.. జై షా కామెంట్స్ వైరల్Preity Zinta with Virat Kohli at the post match presentation ceremony. ❤️ pic.twitter.com/z1G2L1IIr8— Mufaddal Vohra (@mufaddal_vohra) May 10, 2024Virat Kohli said Sorry to Preity Zinta when he met with her in post match award presentation & Preity Zinta smiles.- King Kohli winning the hearts of everyone, He's a pure soul. ❤️🐐 pic.twitter.com/2h2JFnZsyz— Tanuj Singh (@ImTanujSingh) May 10, 2024
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్.. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన స్టార్ క్రికెటర్
న్యూజిలాండ్ విధ్వంంసకర ఓపెనర్ కోలిన్ మున్రో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మున్రో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ20 ప్రపంచకప్-2024 కివీస్ జట్టులో చోటు ఆశించిన మున్రోకు సెలక్టర్లు మొండి చేయి చూపించారు. ఈ క్రమంలో జట్టులో చోటు దక్కకపోవడంతోనే మున్రో అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికాడు. "అత్యున్నత స్ధాయిలో న్యూజిలాండ్ క్రికెట్‌కు ప్రాతినిథ్యం వహించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. అన్ని ఫార్మాట్లలోనూ బ్లాక్ క్యాప్స్ జెర్సీని నేను ధరించాను. అది నేను నా జీవితంలో సాధించిన అతి పెద్ద విజయం. మళ్లీ న్యూజిలాండ్ తరపున ఆడేందుకు ఎంతో ఆతృతగా ఎదురు చూశాను. కానీ టీ20 వరల్డ్‌కప్‌లో జట్టులో నా పేరు లేదు. కాబట్టి క్రికెట్‌కు వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయం అని భావించానని మున్రో పేర్కొన్నట్లు ఐసీసీ ఒక ప్రకటన విడుదల చేసింది.న్యూజిలాండ్ క్రికెట్లో మున్రోకు అంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇంటర్ననేషనల్ క్రికెట్లో మున్రో కివీస్ తరపున 100కు పైగా మ్యాచ్‌లు ఆడాడు. 2014, 2016 టీ20 వరల్డ్‌కప్‌లలో న్యూజిలాండ్ జట్టులో మున్రో భాగమయ్యాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో మూడు పైగా సెంచరీలు చేసిన ఏడు మంది ఆటగాళ్లలో మున్రో ఒకడిగా కొనసాగుతున్నాడు. 2012 లో అంతర్జాతీయ క్రికెటలో అడుగుపెట్టిన మున్రో. . తన కెరీర్లో 57 వన్డేలు, 65 టీ20లు, ఒక టెస్టు మ్యాచ్ ఆడాడు. వన్డేల్లో 1271 పరుగులు, టీ20ల్లో 1724 పరుగులు చేశాడు. అదే విధంగా ఎకైక టెస్టులో 15 పరుగులు మాత్రమే చేశాడు. ఇక టీ20ల్లో 47 బంతుల్లో సెంచరీ చేసిన రికార్డు అతడి పేరిట ఉంది. 2018లో వెస్టిండీస్ పై ఈ ఘనత సాధించాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న మున్రో.. ఫ్రాంచైజీ క్రికెట్లో మాత్రం కొనసాగననున్నాడు.
MS Dhoni: ధోనిని ఎలా వాడుకోవాలో మాకు తెలుసు!
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ మహేంద్ర సింగ్ ధోని ఫిట్నెస్ గురించి ఆ జట్టు ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ప్రస్తుతం బాగానే ఉన్నాడని.. అతడి సేవలను ఎలా ఉపయోగించుకోవాలో తమకు తెలుసునని పేర్కొన్నాడు.అదే విధంగా.. ధోని ఏ స్థానంలోనైనా ఆడగలడని అందుకే గత మ్యాచ్‌లో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడని ఫ్లెమింగ్ తెలిపాడు. కాగా గతేడాది నుంచి ధోని మోకాలి నొప్పితో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే.అయినప్పటికీ 42 ఏళ్ల తలా ఐపీఎల్-2024 బరిలో దిగాడు. ఇప్పటి వరకు 9 ఇన్నింగ్స్ ఆడి 110 పరుగులు చేశాడు. అయితే, ఇటీవల పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా ధోని తన టీ20 కెరీర్లో తొలిసారి తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు.ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్ వంటి మాజీ క్రికెటర్లు ధోని నిర్ణయాన్ని తప్పుబట్టారు. జట్టు కోసం అతడు ఏడో స్థానంలోనే రావాలని.. అలా కాని పక్షంలో తుదిజట్టులో ఉండకూడదని ఘాటు విమర్శలు చేశారు.ఈ క్రమంలో మోకాలి నొప్పి కారణంగానే బ్యాటింగ్ తగ్గించి.. వికెట్ కీపర్‌గా పూర్తి స్థాయిలో సేవలు అందించేందుకు ధోని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయంపై సీఎస్కే హెడ్‌కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తాజాగా స్పందించాడు.గుజరాత్ టైటాన్స్‌తో శుక్రవారం చెన్నై మ్యాచ్ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అతడు కేవలం సిక్సర్లు, ఫోర్లు కొట్టడమే కాదు.. ఏ స్థానంలో వచ్చినా తన అత్యుత్తమ ప్రదర్శన కనబరచగలడు.అతడు తొమ్మిదో స్థానంలో వచ్చినంత మాత్రాన ప్రభావం చూపలేడని భావించవద్దు. జట్టు కోసం తనేం చేయగలడో తప్పకుండా చేస్తాడు.అతడి సేవలను అన్ని రకాలుగా మేము ఉపయోగించుకుంటాం. అయితే, ఒత్తిడి పెంచి అతడు జట్టుకు దూరమయ్యేలా చేసుకోలేం. జట్టు కోసం తను ఎల్లప్పుడూ పరితపిస్తాడు. అభిమానుల కోసం ఏమైనా చేస్తాడు. ప్రస్తుతం తన ఫిట్‌నెస్‌కు వచ్చిన ఇబ్బందులేమీ లేవు’’ అని స్టీఫెన్ ఫ్లెమింగ్ పేర్కొన్నాడు.కాగా ఈ సీజన్లో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో సీఎస్కే ఆడిన 11 మ్యాచ్‌లలో ఆరు గెలిచింది. 12 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. అహ్మదాబాద్‌లో శుక్రవారం గుజరాత్ టైటాన్స్‌తో పోరులో గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో సాఫీగా ముందుకు సాగాలని పట్టుదలగా ఉంది. చదవండి: Mohammed Shami Slams LSG Owner: కాస్తైనా సిగ్గు పడండి.. కెమెరాల ముందు ఇలా చేస్తారా?
శ్రేయస్, ఇషాన్‌ల వేటు పడటానికి కారణం అతడే: జై షా
టీమిండియా స్టార్లు ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ సెంట్రల్ కాంట్రాక్టులు కోల్పోవడానికి తాను కారణం కాదన్నాడు భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా. సెలక్షన్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడం మాత్రమే తన విధి అని తెలిపాడు.కాగా దక్షిణాఫ్రికా పర్యటన నుంచి మధ్యలోనే స్వదేశానికి తిరిగి వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్.. రంజీల్లో ఆడమని బోర్డు ఆదేశించినా లెక్కచేయలేదు. ఆ తర్వాత వెంటనే ఐపీఎల్-2024 కోసం ముంబై ఇండియన్స్ క్యాంపులో చేరాడు.మరోవైపు.. శ్రేయస్ అయ్యర్ సైతం రంజీల్లో ముంబై తరఫున బరిలోకి దిగకుండా ఫిట్నెస్ కారణాలు సాకుగా చూపాడు. అయితే, ఎన్సీఏ అలాంటిదేమీ లేదని కొట్టిపారేసింది. ఈ క్రమంలో తాజా సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో ఈ ఇద్దరి పేర్లు గల్లంతయ్యాయి.ఆ తర్వాత అయ్యర్ ముంబై తరఫున రంజీ బరిలో దిగినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ నేపథ్యంలో వీరిద్దరికి టీ20 వరల్డ్‌కప్-2024 జట్టులోనూ చోటు దక్కలేదు.అతడి నిర్ణయం ప్రకారమేఈ నేపథ్యంలో ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ సెంట్రల్ కాంట్రాక్టులు కోల్పోయిన అంశంపై జై షా తాజాగా స్పందించాడు. ‘‘బీసీసీఐ రాజ్యాంగాన్ని గమనించండి.సెలక్షన్ మీటింగ్‌లో చర్చించిన విషయాల గురించి మీడియాకు తెలియజేసే కన్వీనర్‌ను మాత్రమే నేను.ఆ ఇద్దరిని దేశవాళీ క్రికెట్ ఆడాలని నిర్ణయించిందీ.. అదే విధంగా వారు చెప్పినట్లు వినలేదని సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుంచి తప్పించిందీ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్.అతడు తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడమే నా పని. వాళ్లిద్దరు వెళ్లినా సంజూ శాంసన్ లాంటి వాళ్ల రూపంలో కొత్త ఆటగాళ్లకు చోటు దక్కింది కదా!’’ అని జై షా జాతీయ మీడియాతో వ్యాఖ్యానించాడు.అయ్యర్ అదుర్స్... ఇషాన్ ఫెయిల్‌కాగా ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం ఐపీఎల్-2024తో బిజీగా ఉన్నారు. ముంబై ఇండియన్స్ తరఫున ఓపెనర్‌గా వస్తున్న ఇషాన్ ఇప్పటి వరకు 12 ఇన్నింగ్స్‌లో కలిపి 266 పరుగులు మాత్రమే చేశాడు.మరోవైపు కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాత్రం 11 ఇన్నింగ్స్‌లో 280 పరుగులు చేయడంతో పాటు.. ఈ సీజన్లో జట్టును ప్లే ఆఫ్స్ చేరిన మొదటి జట్టుగా నిలిపే పనిలో ఉన్నాడు. చదవండి: ద్రవిడ్ గుడ్ బై!.. టీమిండియా కొత్త కోచ్‌గా ఫారినర్?.. జై షా కామెంట్స్ వైరల్
బిజినెస్
గోల్డ్‌ఫైనాన్స్ తీసుకుంటే రూ.20వేలే ఇస్తారట! మిగతా డబ్బు..?
నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ ) నగదు పంపిణీని రూ.20,000కి పరిమితం చేయాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. లోన్కోసం వచ్చిన వినియోగదారులకు ఎన్బీఎఫ్సీలు నగదు రూపంలో గరిష్ఠంగా రూ.20వేలు మాత్రమే అందించేలా ఆర్బీఐ ప్రకటనలో తెలిపింది. తాజా ప్రకటనతో గోల్డ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు గురువారం బలహీనపడ్డాయి. ముత్తూట్ ఫైనాన్స్ షేర్ ధర 3.73%, మణప్పురం ఫైనాన్స్ 7.3%, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ 4% క్షీణించింది. ఆర్బీఐ నిర్ణయంతో బంగారం తాకట్టుపెట్టి నగదు తీసుకోవాలనుకునే వారికి ఇబ్బంది కలుగుతుందని పలువురు భావిస్తున్నారు.ఇదీ చదవండి: ప్రీమియంను మరింత పెంచనున్న బీమా సంస్థలుఎన్నికల నేపథ్యంలో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకోవడం సరైందేనని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రచారంలో భాగంగా ఖర్చులకు డబ్బు సమకూర్చాలంటే ఇంట్లో బంగారం తాకట్టుపెట్టి నగదు తీసుకుంటారు. అలాంటి చర్యలను కట్టడి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకొచ్చినట్లు కొందరు చెబుతున్నారు. కొత్త నిబంధనల ప్రకారం.. బంగారం తాకట్టు పెట్టే వారికి ఇకపై గరిష్ఠంగా రూ.20వేలు నగదు మాత్రమే ఇస్తారు. మిగతా డబ్బు నేరుగా తమ బ్యాంకు అకౌంట్లో జమచేస్తారు. తిరిగి బ్యాంకుకు వెళ్లి నిబంధనల ప్రకారం డబ్బు తీసుకోవాల్సి ఉంటుంది.
లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు శుక్రవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 సమయానికి నిఫ్టీ 93 పాయింట్లు లాభపడి 22,037కు చేరింది. సెన్సెక్స్ 229 పాయింట్లు పెరిగి 72,646 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 105.21 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 84.19 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.46 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.51 శాతం లాభపడింది. నాస్డాక్ 0.27 శాతం పుంజుకుంది.సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇప్పటి వరకు జరిగిన మూడు దశల పోలింగ్‌లో తక్కువ శాతం ఓటింగ్ నమోదు ఇన్వెస్టర్లను కలవరపెట్టింది. ఎన్నికలకు ముందు ఊహించినట్లు ప్రస్తుత అధికార పార్టీ గెలుపు అంత సులువు కాదనే అనుమానాలతో అమ్మకాలకు పాల్పడ్డారు. ఆటో మినహా అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో గురువారం సెన్సెక్స్ 1,062 పాయింట్లు నష్టపోయి 72,404 వద్ద స్థిరపడింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
ప్రీమియంను మరింత పెంచనున్న బీమా సంస్థలు
ఆరోగ్య బీమా రంగ సంస్థలు పాలసీదారులకు షాకివ్వబోతున్నాయి. గతేడాదిగా పాలసీ ప్రీమియంను దాదాపు 50 శాతం వరకు పెంచిన సంస్థలు..మరోసారి పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. బీమా నియంత్రణ మండలి ఐఆర్డీఏఐ తీసుకున్న కొన్ని నిర్ణయాలతో ప్రీమియం ఛార్జీలు పెంచకతప్పడం లేదని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి.గడిచిన ఆర్థిక సంవత్సరంలో ప్రీమియం 25 శాతం నుంచి 50 శాతం వరకు పెరగగా..వచ్చే కొన్ని నెలల్లో మరో 10 శాతం నుంచి 15 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని లోకల్‌సర్కిల్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఈ సర్వేలో 11 వేల మంది పాల్గొన్నారు. వీరిలో 21 శాతం మంది ప్రీమియం 50 శాతం వరకు పెరిగినట్లు వెల్లడించగా..31 శాతం మంది 25-50 శాతం వరకు పెరిగాయని తెలిపారు.ప్రీమియం అధికమవడంతో సామాన్యులు ఆరోగ్య పాలసీ తీసుకోవడానికి ఆసక్తి చూపడంలేదు. 2022లో 62 శాతంగా ఉన్న పాలసీదారులు 2023లో 52 శాతానికి తగ్గారు. మరోవైపు, గత ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్య బీమా కంపెనీలు రికార్డు స్థాయిలో లాభాలు పొందుతున్నాయి. వాటి సరాసరి వార్షిక వృద్ధిరేటు 20 శాతంగా నమోదవుతుంది. కరోనాతో ఆరోగ్య బీమా పాలసీలు తీసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ, క్రమంగా తగ్గుతోంది.
అతిపెద్ద ఐటీ కంపెనీ.. సీఈవో జీతం మాత్రం..
దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సీఈవో, ఎండీ కృతివాసన్ 2024 ఆర్థిక సంవత్సరంలో వార్షిక పరిహారంగా రూ. 25.36 కోట్లు తీసుకున్నారు. అతిపెద్ద ఐటీ కంపెనీల సీఈవోల జీతాల్లో ఇదే అత్యంత తక్కువ కావడం గమనార్హం.ఆసక్తికరంగా, బయటకు వెళ్తున్న చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎన్జీ సుబ్రమణ్యం ఇదే సంవత్సరంలో సీఈవో కృతివాసన్ కంటే ఎక్కువ వేతనం అందుకున్నారు. అయితే, సీఈఓగా కృతివాసన్ జీతం 10 నెలల కాలానికి కాగా, సుబ్రమణ్యం వేతనం పూర్తి సంవత్సరానికి. కృతివాసన్ 2023 జూన్ 1న రాజేష్ గోపీనాథన్ నుండి సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. రాజీనామా చేయడానికి ముందు రెండు నెలల స్వల్ప వ్యవధిలో గోపీనాథన్ రూ. 1.1 కోట్లు అందుకున్నారు. అంతకు ముందు ఏడాది అంటే 2023 ఆర్థిక సంవత్సరంలో ఆయన రూ. 29.16 కోట్లు అందుకున్నారు.కృతివాసన్ వేతన పరిహారంలో ప్రాథమిక జీతం, ఇతర ప్రయోజనాలు, అలవెన్సులు, కమీషన్ ఉన్నాయి. టీసీఎస్ వార్షిక నివేదిక ప్రకారం, 2024 ఆర్థిక సంవత్సరంలో ఆయన రూ.21 కోట్ల కమీషన్ అందుకున్నారు. కంపెనీలో కృతివాసన్‌కి 11,232 స్టాక్‌లు ఉన్నప్పటికీ వేతన పరిహారంలో ఎంప్లాయి స్టాక్ పర్చేజ్ స్కీమ్ (ESPS) ఉండదు.2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇతర ఐటీ సంస్థలు తమ వార్షిక నివేదికలను ఇంకా విడుదల చేయలేదు. 2023 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ రూ. 56 కోట్ల వార్షిక రెమ్యునరేషన్ ప్యాకేజీని పొందారు. ఐటీ కంపెనీ సీఈవోల జీతాల్లో ఇదే అత్యధికం. ఈయన తర్వాత విప్రో సీఈఓ శ్రీనివాస్ పల్లియా సుమారు రూ. 50 కోట్ల అత్యధిక వార్షిక ప్యాకేజీ అందుకున్నారు. రూ. 28.4 కోట్లతో హెచ్‌సీఎల్ టెక్ సీఈవో విజయకుమార్ మూడో స్థానంలో ఉన్నారు.
వీడియోలు
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కడప (వైఎస్ఆర్ కడప జిల్లా)
ఏపీకి మళ్లీ జగనే సీఎం: KCR
పచ్చ మందపై విరుచుకుపడ్డ సీఎం జగన్ దద్దరిల్లిన నగరి...
Watch Live: పుత్తూరులో సీఎం జగన్ ప్రచార సభ
నేనంటే భయమెందుకు బాబు
జనం జాగ్రత్త.. వీళ్లు మామూలోళ్లు కాదు
పిఠాపురం వంగా గీత అడ్డా.. పవన్ కళ్యాణ్ కి మాస్ కౌంటర్ సాక్షి
వీళ్ళే మన అభ్యర్థులు.. గెలిపించాల్సిన బాధ్యత మీదే..
లోకేష్ కి ఆళ్ల రామకృష్ణారెడ్డి సవాల్
చంద్రబాబు దోచిన సొమ్ము అంతా ప్రజలదే..
ఫ్యామిలీ
నవ్వుతారేమో అనుకున్నా: లాపతా లేడీస్ ప్రతిభ ఇంట్రస్టింగ్ జర్నీ
బాలీవుడ్ దర్శకురాలు కిరణ్‌రావు (బాలీవుడ్ హీరో ఆమీర్ ఖాన్ మాజీ భార్య) దర్శకత్వంలో వచ్చిన లాపతా లేడీస్ ఓటీటీలో మంచి ఆదరణ సంపాదించుకుంది. కుటుంబం, వైవాహిక వ్యవస్థలో మహిళల స్థితిగతులు, అమ్మాయిల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా జరిగే బాల్య వివాహాలు, అమ్మాయిల తెగవును పట్టి ఇచ్చిన సినిమా ఇది. ముఖ్యంగా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన ప్రతిభా రాంటా తన అధ్బుతమైన నటనతో ఆకట్టుకుంది. సిమ్లా టూ బాలీవుడ్ ప్రతిభ రాంటా ఇంట్రస్టింగ్ జర్నీ ఒక సారి చూద్దాం.ఖుర్బాన్ హువా టీవీ సీరియల్‌తో వెలుగులోకి వచ్చింది ప్రతిభా రాంటా. ఆ తరువాత వెబ్ సిరీస్ చేస్తుండగా కిరణ్ రావు దృష్టిలో పడింది. అలాలాపతా లేడీస్‌లో అవకాశం వచ్చింది. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని తానేమిటో నిరూపించుకుంది. బాలీవుడ్‌కి పరిచయం అయిన కొత్త ముఖాల్లో ప్రతిభ రాంటా. నిజంగా తన యాక్టింగ్ ప్రతిభ, ఒకదాని తర్వాత ఒకటి తన ఆన్-స్క్రీన్ పెర్ఫార్మెన్స్తో, ముఖ్యంగా లాపతా లేడీస్ 'జయ' పాత్రలో సత్తా చాటింది. ఇటీవల విడుదలైన వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్లో 'వహీదా' (సంజీదా షేక్) కుమార్తె 'షామా' పాత్రను పోషించింది. 24 ఏళ్ల వయసులో చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అయితే ఈ ప్రయాం అంత సాఫీగా సాగలేదు.ఎవరీ ప్రతిభా రాంటాసందేశనా రాంటా,, రాజేశ్ రాంటా దంపతుల కుమార్తె ప్రతిభా రాంటా. సిమ్లాలో పెరిగింది. చిన్నప్పటి నుంచీ డాన్స్ అంటే ఇష్టం. డాన్స్‌లో గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేసింది. అలా నటించాలనే ఆసక్తి పెరిగింది. ఆ మాటే ఇంట్లో చెబితే యాక్టింగ్ అంటే ఏంటి? అని అడిగారట. ఎందుకంటే కుటుంబంలో చాలా మంది ఉపాధ్యాయులు, అందుకే వారికి నటన గురించి ఏమీ తెలియదట. ఇంజనీర్, డాక్టర్ లేదా మరేదైనా ఇతర ప్రొఫెషనల్‌గా ప్రతిభను చూడాలని ఆశించారు. దీంతో యాక్టింగ్‌లో చేరడం చాలా కష్టమేమో , తనను చూసి నవ్వుతారేమో అనిపించిందని ఒక ఇంటర్య్వూలో వెల్లడించింది.పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత, ప్రతిభ ఎలాగోలా తన తల్లిదండ్రులను ఒప్పించి ఉన్నత చదువుకోసం ముంబైకి చేరింది. ఆడిషన్లు ఇవ్వడం మొదలు పెట్టింది. అందాల పోటీలో పాల్గొంది. 2018లో మిస్ ముంబై టైటిల్‌ను గెలుచుకుంది. నిస్సందే 2018 మిస్ ముంబై అందాల పోటీల్లో మిస్ ముంబై కిరీటం గెలుచుకుంది. దీంతో కేవలం ఆరు నెలలకే ‘ఖుర్బాన్ హువా’ టీవీ సీరియల్ 'చాహత్' పాత్రలో తొలి ఆఫర్ వచ్చింది. తరువాత,ఆధా ఇష్క్ అనే వెబ్ షోలో కూడా కనిపించింది. View this post on Instagram A post shared by Pratibha Rantta (@pratibha_ranta)ఇక లాపతా లేడీస్ ఆఫర్ గురించి మాట్లాడుతూ మొదట్లో కాస్త భయమేసిందని, అయితే సినిమాలో ‘జయ’ కథ ఒక విధంగా నిజ జీవితానికి సరిగ్గా సరిపోతుందని, అందుకే ఆ పాత్రలో పూర్తిగా లీనమైపోయానని చెప్పుకొచ్చింది. మొత్తానికి తన జర్నీ అంతా ఒక మ్యాజిక్‌లా సాగిపోయిందని వెల్లడించింది మెరిసే కళ్లతో.
ఇల్లు తుడిచే మాప్ కాదు, బీబీక్యూ మాప్ సాస్: వీడియో వైరల్
ఇంటర్నెట్లో ఫుడ్‌కు సంబంధించిన అనేక వీడియోలు సందడి చేస్తూ ఉంటాయి. వీటిల్లో కొన్ని ఆకర్షణీయంగా ఉంటే, మరికొన్ని మాత్రం యాక్.. అనిపిస్తుంటాయి కదా. అలాంటి ఇంట్రస్టింగ్ వీడియోనే ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. View this post on Instagram A post shared by Chef Matt Cooper (@stadiumchef) దోసల పెనం మీద చీపురు కట్టతో తుడవడం చూశాం. మొన్నఒక వ్యక్తి అనేక చికెన్ కాల్చడం కోసం పొడవైన తుడుపుకర్రను వాడేసిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయింది. తాజాగా ఒక మహిళ మాంసాన్ని గ్రిల్ చేస్తూ, మాప్ స్టిక్ వాడడం నెటిజన్లకు షాకిచ్చింది. ఈ మేరకు ఆమె షేర్ చేసిన వీడియో 45 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకంది. 47వేలకు పైగా కామెంట్లు వెల్లువెత్తాయి.stadiumchef ఇన్స్టాగ్రామ్ రీల్లో ఒక మహిళా చెఫ్ సాస్ కంటైనర్‌లో తుడుపుకర్రను ముంచి, తరువాత బీబీక్యూలోని మీట్‌పై పూసింది. బీబీక్యూ మాప్ సాస్ అనే క్యాప్షన్‌తో షేర్ ఈ చేసిన వీడియోపై వివరణ కూడా ఇచ్చింది. ఇలాంటి మాప్స్ గ్రిల్డ్ మాంసాన్ని చేసేందుకు స్పెషల్‌గా తయారు చేస్తారని వివరణ ఇచ్చింది. పెద్దమొత్తంలో స్మోక్డ్ మీట్ చేసేటపుడు ఇవి ఉపయోగపడతాయి. మీరు దక్షిణాదికి చెందినవారు కాకపోతే, అర్థం కాదు అని కూడా ఆమె తెలిపింది. ఇంత వివరణ ఇచ్చినా ఇది చూసి వెంటనే కొంతమంది నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ‘‘అస్సలు హైజీనిక్‌గా లేదు..బాబోయ్ బాక్టీరియా మయం రా బాబూ.. నేను తిన’’ అని ఒక యూజర్ కమెంట్ చేయగా, చాలామంది బీబీక్యూ మాప్‌ను సమర్ధించారు.
వావ్.. మనసు దోచే టెక్స్టైల్ జ్యుయల్లరీ! (ఫోటోలు)
అమిత్ షా నివాసంలో పద్మగ్రహీతలకు విందు....మెనులో ఎలాంటి రెసిపీలు ఉన్నాయంటే..
రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల వేడుక ఘనంగా జరిగింది. గ్రహీతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేయడం జరిగింది. ఈ వేడుకలో రెండు పద్మ విభూషణ్, 9 పద్మ భూషణ్, 56 పద్మశ్రీ పురస్కారాలను ప్రధానం చేశారు. తదనంతరం ఆ గ్రహితలందరికి హోం మంత్రి అమిత్ షా నివాసంలో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో ఎలాంటి వంటకాలు వడ్డించారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అవేంటో చూద్దామా..!ఈ డిన్నర్లో స్వచ్ఛమైన శాకాహార భోజనాన్ని కంచుప్లేట్లలో సర్వ్ చేయడం విశేషం. ఈ విందులో అమిత్ షాకు ఎంతో ఇష్టమైన గుజరాతీ వంటకాలను అతిథులకు సర్వ్ చేశారు. వాటిలో సెవ్‌తో ఉండే పోహా, దోక్లా ఖాండ్వీ, హరేభరే కబాబ్, కేసరి బాత్, మష్రూమ్ కబాబ్, వెజ్ బిర్యానీ, వంటి వంటకాలు ఉన్నాయి. ఇందులో సర్వ్ చేసిన గుజరాతీ వంటకం దోక్లాను బేసిన్ పిండి, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, సూజి, పెరుగు, పసుపు, ఉప్పు, పంచాదర మిశ్రమాలతో తయారు చేస్తారు. మరోవైపు కూరగాయాలతో చేసిన హరే భరే కబాబ్ నోరూరిస్తుండగా..పక్కనే పచ్చి కూరగాయాలు, మొలకెత్తిన పప్పు ధాన్యాలను రోస్టెడ్, మసాలాల కలయికతో చేసిన సలాడ్ కాంబినేషన్ అదిరిపోయింది. ఆ తర్వాత అప్పటి వరకు హాట్ ఐటెమ్స్‌తో స్పైసీగా ఉన్న నోటిని తియ్యగా చేసేలా అన్నం పంచాదర, నెయ్యి, డ్రైఫ్రూట్లతో చేసిన కేసరి భాత్ ఆహుతులకు ఆహ్లాదకరమైన రుచిని అందజేసింది. ఇక ఈ డిన్నర్లో సర్వ్ చేసిన వెజ్ బిరియానీ వివిధ రకాల కూరగాయలతో ఘుమాళించే వాసనతో ఆవురావురమని తినేలా హైలెట్‌గా నిలిచింది. Home Minister @AmitShah ji hosted a dinner for all those extraordinary individuals who have been duly honoured with the #PadmaAwards. PM @narendramodi Ji has honored the unsung heroes of our society who have made tremendous contributions at the ground level. https://t.co/Ddhu5JVRLT pic.twitter.com/RViztp9txH— Kiren Rijiju (मोदी का परिवार) (@KirenRijiju) May 9, 2024ఇక చివరిగా వడ్డించిన ఖాండ్వీ కూడా గుజరాతీ సుప్రసిద్ధ వంటకమే. దీన్ని సెనగపిండి పెరుగు మసాలా దినుసుల కలయికతో తయారు చేస్తారు. ఈ ప్రత్యేక విందులో పాల్గొన్న అతిథులంతా గుజరాతి ప్రసిద్ధ వంటకాలను ఎంజాయ్ చేశారు. కాగా ఈ డిన్నర్ పార్టీకి ప్రముఖ రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, అవార్డు గ్రహీతలు హాజరయ్యారు. ఈ అతిథుల జాబితాలో మెగా కుటుంబం ప్యామిలితో సహా విచ్చేసి సందడి చేసింది. వీరంతా అమిత్ షాతో కలిసి భోజనం చేస్తూ కనిపించారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. Union Home Minister #AmitShah hosts dinner for Padma awardees at his residence....DR.MEGASTAR'S #Chiranjeevi and #RamCharan attend the Dinner along with his Family ❤🔥🤩🤩#PadmaVibhushanChiranjeevi 👑🦁 pic.twitter.com/BHVehp6MXg— 𝐀𝐤𝐚𝐬𝐡𝐡 𝐑𝐂™ (@AlwaysAkashRC) May 9, 2024
న్యూస్ పాడ్‌కాస్ట్
చంద్రబాబుది పెత్తందార్ల కూటమి... ఎన్నికల ప్రచార సభల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం.. ఇంకా ఇతర అప్డేట్స్
దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా కనిపిస్తారు... కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై తీవ్ర దుమారం.. ఇంకా ఇతర అప్డేట్స్
నేడు వేములవాడకు నరేంద్ర మోదీ... రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్న ప్రధానమంత్రి... ఇంకా ఇతర అప్డేట్స్
క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
భూమి లాక్కున్నట్లు ఒక్క రైతయినా చెప్పాడా అంటూ చంద్రబాబు, ఎల్లో మీడియాకు సీఎం జగన్ సూటి ప్రశ్న.. ఇంకా ఇతర అప్డేట్స్
నాకు బిడ్డలు లేరు, ప్రజల బిడ్డల కోసమే నా తపన.. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటన.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం పట్ల ఎన్నికల సంఘం సీరియస్.. తక్షణం దర్యాప్తు చేసి, చర్యలు తీసుకుని నివేదిక ఇవ్వాలని సీఐడీకి ఆదేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
అవ్వాతాతల పెన్షన్లపై చంద్రబాబు పాపిష్టి కళ్లు.. నరసాపురం, క్రోసూరు, కనిగిరి ప్రచార సభల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం.. ఇంకా ఇతర అప్డేట్స్
కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు పాకిస్తాన్ ఆరాటం.. గుజరాత్ ప్రచారంలో ప్రధాని మోదీ విమర్శలు.. ఇంకా ఇతర అప్డేట్స్
తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై నిషేధం.. 48 గంటలపాటు ప్రచారం ఆపేయాలన్న కేంద్ర ఎన్నికల సంఘం .. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
చికాగోలో తెలంగాణ విద్యార్థి అదృశ్యం ఆందోళనలో తల్లిదండ్రులు
అమెరికాలో తెలుగు విద్యార్థి అదృశ్యం కావడం కలకల రేపుతోంది. ఉన్నత విద్య కోసం చికాగో వెళ్లిన తెలంగాణకు చెందిన 25 ఏళ్ల రూపేష్ చంద్ర చింతకింది అదృశ్యం అయ్యాడు. అతని అచూకీ కోసం కుటుంబ సభ్యులు భారత రాయబార వర్గాలను సంప్రదించారు. చికాగోలోని ఎన్ షెరిడాన్ రోడ్ 4300 బ్లాక్ నుంచి అతను తప్పిపోయినట్లు తెలుస్తోంది. టెక్సాస్ నుండి కలవడానికి వచ్చిన ఒకరిని కలవబోతున్నాడని చెప్పినట్లు సమాచారం.‘‘మే 2 మధ్యాహ్నం వాట్సాప్‌లో మాట్లాడాను. ఏదో పని మీద ఉన్నా అని చెప్పాడు. అంతే అప్పటినుంచి ఆఫ్‌లైన్‌లో ఉన్నాడు" రూపేష్ తండ్రి సదానందం తెలంగాణలోని హన్మకొండకు చెందిన రూపేశ్ విస్కాన్సిన్ లోని కాంకార్డియా యూనివర్శిటీలో మాస్టర్స్ చదువుతున్నాడు. వారం రోజులుగా రూపేశ్ ఆచూకీ లభించకపోవడంతో హైదరాబాద్‌లోఉంటున్న అతని తల్లిదండ్రలు ఆందోళనకు గురయ్యారు. తమ కుమారుడి ఆచూకీ కనుగొనాలంటూ భారత విదేశాంగా శాఖను కోరింది. త్వరలోనే రూపేశ్ అచూకీ తెలుస్తుందని ఆశిస్తున్నామని చికాగోలోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది.The Consulate is deeply concerned learning that Indian student Rupesh Chandra Chintakindi is incommunicado since 2nd May. Consulate is in touch with the police and the Indian diaspora hoping to locate/reestablish contact with Rupesh.@IndianEmbassyUS @MEAIndia— India in Chicago (@IndiainChicago) May 8, 2024మే 2 నుంచి రూపేశ్ మిస్సయినట్లు చికాగోలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా తెలిపింది. అతడి ఆచూకి కోసం పోలీసులు ప్రవాస భారతీయులతో నిరంతరం చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. రూపేష్ ఆచూకీ తెలిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని స్థానిక పోలీసులు ప్రకటన విడుదల చేశారు.
రాసలీలల రామ్మోహన్!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ తూర్పు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహనరావు మహిళలపై లైంగిక వేధింపుల వ్యవహారం బట్టబయలైంది. పలువురు మహిళలతో అసభ్యకరంగా చాటింగ్ చేసినట్టు వెల్లడైంది. ప్రస్తుతం వాట్సప్ చాటింగ్, స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విజయవాడలోని వివిధ వాట్సప్ గ్రూపుల్లో, ఫేస్ బుక్ పేజీల్లో, ఇన్‌స్ట్రాగాం వేదికల్లో అవి చక్కెర్లు కొడుతుండటంతో ఆయన లీలలపై తూర్పు నియోజకవర్గ ఓటర్లు ముక్కున వేలేసుకుంటున్నారు. మహిళా ఓటర్లయితే గద్దెకు గుణపాఠం చెబుతామని స్పష్టం చేస్తున్నారు. ఇన్నాళ్లకు గద్దె నిజ స్వరూపం బట్ట బయలైందని టీడీపీ వర్గీయులే వ్యాఖ్యానించిడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయనకు 15 ఏళ్లుగా అనుచరుడిగా ఉన్న ఒకరు ఆయన రాసలీలల వ్యవహారాలను ఆధారాలతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం విజయవాడ నగరంలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల గద్దె ప్రధాన అనుచరుడు మహిళలను వేధింపులకు గురిచేసి, దాడి చేయడంతో పటమట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఏకంగా గద్దె వాట్సప్ చాటింగ్ వెలుగులోకి రావడంతో టీడీపీ ఆత్మరక్షణలో పడింది. ఇప్పటికే తూర్పు నియోజక వర్గంలో గద్దె గ్రాఫ్ పడిపోవడంతో తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వాట్సప్ చాటింగ్స్ వ్యవహారం వెలుగులోకి రావడంతో తూర్పు నియోజకవర్గంలో టీడీపీ ఓటమి ఖాయమని ఆ పార్టీ నాయకులే తేల్చిచెబుతున్నారు.
ఈత సరదా ప్రాణం తీసింది
వైఎస్సార్: లింగాల మండలం తాతిరెడ్డిపల్లెలో ఈత నేర్చుకోవాలని చిన్నారి సరదా పడగా... ప్రమాదవశాత్తూ ఆమె ప్రాణం తీసింది. స్థానికుల వివరాల మేరకు.. తాతిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన తోట రవీంద్రారెడ్డి, మంజుల దంపతుల కుమార్తె మహిత(12) బుధవారం గ్రామంలోని చెరువులో ఈత నేర్చుకునేందుకు తోటి పిల్లలతో కలిసి వెళ్లింది.నడుముకు ఖాళీ క్యాన్ కట్టుకుని చెరువులో ఈత కొట్టేందుకు దిగారు. ఆ సమయంలో నడుముకు ఉన్న క్యాన్ ఊడిపోయింది. అక్కడున్న పిల్లలు, పెద్దలు చూస్తుండగానే భయానికి గురైన మహిత నీటిలో మునగగానే మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. కుమార్తె మృతిచెందడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
యశవంతపుర: అంబులెన్స్– కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన దుర్ఘటన కర్ణాటక– కేరళ సరిహద్దుల్లోని కాసరగోడులో మంగళవారం జరిగింది. మృతులను కేరళ త్రిసూరు జిల్లా గురువాయురుకు చెందిన శ్రీనాథ్ (54), ఆయన కొడుకులు శరత్ (18), మనన్ (15) గుర్తించారు శ్రీనాథ్ దుబాయ్‌లో ఉద్యోగం చేస్తూ సెలవులు పెట్టి ఊరికి వచ్చాడు. ఆయన భార్య స్మిత అక్కడే ఓ ఇంటర్నెట్ సెంటర్ నిర్వహిస్తున్నారు. ఆమెకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో వారితో పాటు రాలేకపోయారు. ఈ క్రమంలో ముగ్గురూ కలిసి బెంగళూరులో బంధువులను కలవాలని బయల్దేరారు. ముగ్గురూ కారులో కొల్లూరు మూకాంబిక ఆలయంలో అమ్మవారి దర్శనం చేసుకుని వెళుతుండగా, మంజేశ్వర వద్ద ఎదురుగా వేగంగా వచ్చిన అంబులెన్స్ ఢీకొట్టింది. ఆ ధాటికి రెండు వాహనాలూ పలీ్టలు కొట్టాయి. తండ్రీ కొడుకులు కారులోనే దుర్మరణం చెందారు. అంబులెన్స్ డ్రైవర్, ఇద్దరికి కూడా గాయాలు తగిలాయి. ప్రమాదం ఊళ్లోనే జరగడంతో పెద్దసంఖ్యలో జనం పోగయ్యారు. పోలీసులు చేరుకుని మృతదేహాలను, బాధితులను ఆస్పత్రులకు తరలించారు. ఘటనాస్థలమంతా రక్తసిక్తమై భీతావహంగా మారింది. ఈ విషయాన్ని ఊళ్లోని శ్రీనాథ్ భార్యకు ఇంకా చెప్పలేదని, ఇంత ఘోరం జరుగుతుందనుకోలేదని మృతుల బంధువుల విలపించారు.