Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Sajjala Ramakrishna Reddy Key Suggestion To YSRCP Polling Agents
అవతలి పార్టీల ఆటలు సాగనివ్వద్దు: సజ్జల

సాక్షి, తాడేపల్లి: ఏపీలో ఎన్నికల కమిషన్‌ రూల్స్‌ ప్రకారం కౌంటింగ్‌ సమయంలో వైఎస్సార్‌సీపీ పోలింగ్‌ ఏజెంట్లు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. అలాగే, ప్రత్యర్థి పార్టీ పోలింగ్‌ ఏజెంట్లతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.కాగా, వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం కౌంటింగ్‌ ఏజెంట్లకు వర్క్‌షాప్‌ కార్యక్రమం జరిగింది. ఈ సమావేశానికి సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ..‘ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం కౌంటింగ్ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కౌంటింగ్ జరిగేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ప్రత్యర్థి పార్టీ ఏజెంట్లతో అప్రమత్తంగా వ్యవహరించాలి. అవతలి పార్టీల ఆటలు సాగనివ్వద్దు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే కచ్చితంగా మళ్లీ అధికారంలోకి వస్తుంది. జూన్‌ తొమ్మిదో తేదీన ప్రమాణ స్వీకారం ఉంటుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు’ అని వ్యాఖ్యలు చేశారు.

Ysrcp Complaint To Central Election Commission On Ceo Memo
సీఈవో మెమోపై కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు

సాక్షి, ఢిల్లీ: సీఈఓ మీనా ఇచ్చిన మెమోపై కేంద్ర ఎన్నికల సంఘానికి వై ఎస్సార్ కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఈసీఐ కార్యదర్శి రాజీవ్ కుమార్‌కి ఆ పార్టీ ఎంపీ నిరంజన్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై ఇచ్చిన మెమో ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధమని వైఎస్సార్‌సీపీ పేర్కొంది.అటెస్టేషన్‌ అధికారుల స్పెసిమెన్ సంతకాల సేకరణ ఈసీఐ నిబంధనలకు విరుద్ధమని.. ఇది పోస్టల్ బ్యాలెట్ ఓట్లను తిరస్కరించేందుకు దారితీసేలా ఉందని ఫిర్యాదు చేశారు. సీఈఓ ముఖేష్‌కుమార్‌ మీనా ఇచ్చిన మెమోను తక్షణమే సమీక్షించి, పునరాలోచన చేయాలని వైఎస్సార్‌సీపీ విజ్ఞప్తి చేసింది.

Telangana Phone Tapping Case: Praneeth Rao Sensational Confession
1,200 మంది ఫోన్లు ట్యాప్‌ చేశాం.. ట్యాపింగ్‌ ఆపింది అప్పుడే!

హైదరాబాద్‌, సాక్షి: తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చేదాకా ఫోన్లు ట్యాప్‌ చేశామని ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు, మాజీ పోలీస్‌ అధికారి ప్రణీతరావు వాంగ్మూలం ఇచ్చాడు. మొత్తం 1,200 మంది ఫోన్లను ట్యాప్‌ చేసినట్లు అంగీకరించాడు. వాంగ్మూలం నివేదిక దర్యాప్తు అధికారులు బయటకు విడుదల చేయగా.. అందులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. జడ్జీలు, రాజకీయ నేతలు, ప్రతిపక్ష నేతలు, కుటుంబ సభ్యులు, మీడియా పెద్దలు, జర్నలిస్టులు.. ఇలా మొత్తం 1200 మంది ఫోన్లు ట్యాప్‌ చేసినట్లు ప్రణీత్‌ రావు చెప్పాడు. వీళ్లతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వ్యాపారవేత్తలు ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేస్తున్న వారి ఫోన్లు సైతం టాప్ చేసినట్లు పేర్కొన్నాడు. ప్రభాకర్ రావు సహాయంతో 17 సిస్టం ద్వారా ట్యాపింగ్‌కు పాల్పడ్డాం. రెండు లాగర్ రూమ్ లో 56 మంది సిబ్బందిని వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ట్యాపింగ్‌ కొనసాగించాం. ఎనిమిది ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు సిబ్బందితో టచ్‌లో ఉన్నా. అధికారికంగా మూడు ఫోన్లు వినియోగించా. అనధికారికంగా ఐదు ఫోన్లతో ఎప్పటికప్పుడు ట్యాపింగ్‌ను మానిటరింగ్‌ చేశాం. ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేస్తున్న వాళ్ళ డబ్బులు ఎప్పటికప్పుడు పట్టుకున్నాం.పట్టుకున్న డబ్బు మొత్తాన్ని కూడా ఎవరికి అనుమానం రాకుండా హవాలా నగదు అంటూ రికార్డుల్లో చూపించాం.ఇక.. ఫోన్ టాపింగ్ ల కోసం కన్వర్జెన్సీ ఇన్నోవేషన్ ల్యాబ్ సహాయం తీసుకున్నాం. ఈ ల్యాబ్ కు సంబంధించిన శ్రీనివాస్, అనంత్ లో సహాయంతో టాపింగ్ ని విస్తృతంగా చేసాం. సరిగ్గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు నుంచి టాపింగ్‌ని ఆఫ్ చేసాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే టాపింగ్ మొత్తాన్ని ఆపివేయాలని ప్రభాకర్ రావు చెప్పాడు. ఇదీ చదవండి: బీఆర్‌ఎస్‌ కోసం ఏ ఒక్కరినీ వదల్లేదు!ప్రభాకర్ రావు ఆదేశాలతో 50 కొత్త హార్డ్ డిస్క్‌లను తీసుకొచ్చాం. పాత వాటిలో కొత్త హార్డ్ డిస్క్‌లు ఫిక్స్‌ చేశాం. అందులో 17 హార్డ్ డిస్క్ లో అత్యంత కీలకమైన సమాచారం ఉంది. ఆ 17 హార్డ్ డిస్క్ లను కట్టర్ తో కట్ చేసి ధ్వంసం చేశాం. పెద్ద ఎత్తున ఉన్న సీడీఆర్ తో ఐడీపీఆర్(Inter-Domain Policy Routing) డాటా మొత్తాన్ని కూడా కాల్చివేసాం. పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్, ల్యాప్‌ట్యాప్స్‌.. ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులో ఉన్న డాటా మొత్తాన్ని ఫార్మేట్ చేశాం. ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్‌లు అన్నింటిని కూడా నాగోల్, మూసారంబాగ్ వద్ద మూసీ నదిలో పడవేశాం. ధ్వంసం చేసిన సెల్ ఫోన్లు పెన్ డ్రైవ్లు అన్నిటిని కూడా బేగంపేట నాలాలో పడేశాం. ప్రభాకర్ రావు రాజీనామా చేసి వెళ్ళిపోతూ టాపింగ్ సంబంధించిన సమాచారం ధ్వంసం చేయాలని ఆదేశించాడు. ఆ ఆదేశాల ప్రకారమే ట్యాపింగ్‌ వ్యవహారం నడిచింది అని ప్రణీత్‌రావు వాంగ్మూలం ఇచ్చాడు.స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ)లో ఆధారాల ధ్వంసం కేసుకు సంబంధించి మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావును మార్చి రెండో వారంలో ప్రత్యేక బృందం సిరిసిల్లలో అరెస్ట్‌ చేసింది.

T20 World Cup 2024: If India Tops In Group A, Their Super 8 Opponents Will Be NZ, SL And AUS
T20 World Cup 2024: సూపర్‌-8లో టీమిండియా ప్రత్యర్థులు వీరే..!

క్రికెట్‌ మహా సంగ్రామం టీ20 వరల్డ్‌కప్‌ 2024 జూన్‌ 1 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈసారి పొట్టి ప్రపంచకప్‌లో రికార్డు స్థాయిలో 20 జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్‌కు ఐదు జట్ల చొప్పున జట్లన్నీ నాలుగు గ్రూప్‌లుగా విభజించబడి పోటీపడతాయి. గ్రూప్‌ దశలో ప్రతి జట్టు సొంత గ్రూప్‌లోని మిగతా నాలుగు జట్లతో ఓ మ్యాచ్‌ ఆడుతుంది. గ్రూప్‌ దశ అనంతరం గ్రూప్‌లో మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సూపర్‌-8 దశకు అర్హత సాధిస్తాయి. ఈ దశలో ప్రతి జట్టు తమ సొంత గ్రూప్‌లోని జట్టు మినహా మిగతా మూడు గ్రూప్‌ల్లోని ఒకటి లేదా రెండు స్థానాల్లో నిలిచే ఏదో ఒక జట్టుతో (ప్రత్యర్ధి ఎవరో గ్రూప్‌ దశలో స్థానంపై ఆధారపడి ఉంటుంది) పోటీపడుతుంది. సూపర్‌-8 దశ ముగిసిన అనంతరం తొలి నాలుగు స్థానాల్లో నిలిచే జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. రెండు సెమీస్‌ల్లో గెలిచే జట్లు జూన్‌ 29న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ రకంగా ప్రపంచకప్‌ పోటీలు జరుగుతాయి.టీమిండియా సూపర్‌-8కి చేరితే..ఈ ప్రపంచకప్‌లో భారత్‌ పాకి​స్తాన్‌, ఐర్లాండ్‌, యూఎస్‌ఏ, కెనడా జట్లతో గ్రూప్‌-ఏలో పోటీపడుతుంది. ఈ గ్రూప్‌లో పాక్‌ మినహా మిగతా జట్లన్నీ పసికూనలే కావడంతో భారత్‌ సూపర్‌-8కు చేరడం దాదాపుగా ఖాయమనే చెప్పాలి. టీమిండియాకు పాక్‌పై కూడా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో భారత్‌ గ్రూప్‌ టాపర్‌గా నిలవడం ఖాయం.ఈ నేపథ్యంలో సూపర్‌-8లో భారత్‌ ప్రత్యర్దులు ఎవరయ్యే అవకాశం ఉందనే అంశంపై ఓ అంచనా వేద్దాం. సూపర్‌-8 దశలో టీమిండియా ప్రత్యర్దులుగా గ్రూప్‌-బిలో రెండో స్థానంలో ఉండే జట్టు.. గ్రూప్‌-సిలో తొలి స్థానంలో నిలిచే జట్టు.. గ్రూప్‌-డిలో రెండో స్థానంలో నిలిచే జట్టు ఉంటుంది.ఈ లెక్కన గ్రూప్‌-బి నుంచి సూపర్‌-8 దశలో టీమిండియా ‍ప్రత్యర్ది ఇంగ్లండ్‌ లేదా ఆస్ట్రేలియా అయ్యే అవకాశం ఉంది. ఈ గ్రూప్‌లో ఈ రెండు జట్లు మినహా మిగతా జట్టన్నీ (నమీబియా, స్కాట్లాండ్‌, ఒమన్‌) ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ క్రికెట్‌లో ఓనమాలు నేర్చుకుంటున్నాయి. కాబట్టి ఆ జట్లకు సూపర్‌-8 దశకు చేరుకునే అవకాశాలు చాలా తక్కువ.గ్రూప్‌-సి విషయానికొస్తే.. ఈ గ్రూప్‌లో న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌ పటిష్టమైన జట్లుగా చెప్పవచ్చు. కాబట్టి ఈ గ్రూప్‌ నుంచి టీమిండియా ప్రత్యర్దిగా న్యూజిలాండ్‌ లేదా వెస్టిండీస్‌ అయ్యే అవకాశం ఉంది. ఈ గ్రూప్‌లో సంచలనాల జట్టైన ఆఫ్ఘనిస్తాన్‌ కూడా ఉంది. ఈ జట్టును కూడా తక్కువ అంచనా వేయడానికి వీళ్లేదు. మరో రెండు జట్లైన ఉగాండ, పపువా న్యూ గినియా ఒక్క మ్యాచ్‌లో గెలిచినా ఆశ్చర్యమే అని చెప్పాలి.గ్రూప్‌-డి విషయానికొస్తే.. ఈ గ్రూప్‌ను గ్రూప్‌ ఆఫ్‌ డెత్‌గా పరిగణించవచ్చు. ఎందుకంటే ఈ గ్రూప్‌లో అన్ని జట్లకు సంచలనాలు సృష్టించే సామర్థ్యం ఉంది. బలాబలాల ప్రకారం సౌతాఫ్రికా ఈ గ్రూప్‌ టాపర్‌ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మిగతా నాలుగు జట్లు శ్రీలంక, బంగ్లాదేశ్‌, నెదర్లాండ్స్‌, నేపాల్‌ ఏ మ్యాచ్‌లో ఎలా ఆడతాయో అంచనా వేయలేని పరిస్థితి. కాబట్టి ఈ గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచే జట్టు ఏదో అంచనా వేయడం చాలా కష్టం. ఒకవేళ టీమిండియా గ్రూప్‌లో టాపర్‌గా నిలిస్తే.. గ్రూప్‌-డిలో రెండో స్థానంలో నిలిచే జట్టునే ఢీకొట్టాల్సి ఉంటుంది.సూపర్‌-8లో టీమిండియా ప్రత్యర్దులు (అంచనా)..గ్రూప్‌-బి- ఆస్ట్రేలియా (జూన్‌ 24)గ్రూప్‌-సి- న్యూజిలాండ్‌ (జూన్‌ 20)గ్రూప్‌-డి- శ్రీలంక (జూన్‌ 22)

 Balakrishna Behaviour With Anjali In Gangs Of Godavari Pre Release Event
హీరోయిన్‌ని తోసేసిన బాలకృష్ణ.. అందరిముందు మద్యం తాగుతూ!

హీరో బాలకృష్ణ మరోసారి అనుచితంగా ప్రవర్తించారు. స్టేజీపై తన పక్కనే నిలబడి ఉన్న హీరోయిన్ అంజలిని తోసేశారు. అయితే ఆమె తమాయించుకుని నిలబడింది. అదే టైంలో లోపల ఇబ్బందిగా ఉన్నప్పటికీ బయటకు నవ్వుతూ కవర్ చేసింది. ఇప్పుడు ఇది కాస్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.(ఇదీ చదవండి: నన్ను వాళ్లు మోసం చేశారు: నటుడు జగపతిబాబు)విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమా మే 31న థియేటర్లలోకి రాబోతుంది. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. దీనికి చీఫ్ గెస్ట్‌గా వచ్చిన బాలకృష్ణ చాలా చీప్‌గా ప్రవర్తించాడు. హీరోయిన్ అంజలిని నెట్టేయడంతో పాటు అందరిముందు వాటర్ బాటిల్‌లో మద్యం సేవించారు. ఈ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.బాలకృష్ణని చేసిన దాన్ని ఆయన ఫ్యాన్స్ సమర్ధించుకుంటారేమో! కానీ ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌లో ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించడం, నోటీ దురుసుతో ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేయడం గతంలోనూ పలుమార్లు జరిగింది. అమ్మాయిలు, నర్సులపై గతంలో చౌకబారు కామెంట్స్.. 'అక్కినేని తొక్కినేని' అని ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో అనడం లాంటివి బాలకృష్ణ ఎలాంటి వాడో చెప్పకనే చెబుతుంటాయి. కొన్నాళ్ల ముందు తమిళ హీరోయిన్ విచిత్ర కూడా ఇతడు పేరు చెప్పకుండా తనని ఓసారి అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పింది. ఇలా చెప్పుకొంటూ పోతే బాలకృష్ణ బాగోతాలెన్నో!(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)

 Nita Ambani Drinks Water From A Water Bottle Worth Rs 49 Lakhs check how
నీతా అంబానీ తాగే వాటర్‌ అంత ఖరీదా? మరి రూ.49 లక్షల బాటిల్‌ సంగతేంటి?

రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌, ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ అత్యంత స్టైలిష్ ఫ్యాషన్ ఐకాన్‌లలో ఒకరు. అందానికితోడు, వ్యాపార దక్షతకూడా ఆమె సొంతం. వివిధ దాతృత్వ , సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా ఉంటారు. అయితే నీతా బ్యూటీ సీక్రెట్‌ ఏంటి అనేది ఎపుడూ హాట్‌ టాపికే. ఇటీవల బ్యూటీ విత్ పర్పస్ హ్యుమానిటేరియన్ అవార్డు'కూడా దక్కించుకున్నారు. తాజాగా నీతా అంబానీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నీటిని తాగుతారట. అదేంటి బంగారంతో చేశారా ఏంటి, విడ్డూరం అనుకుంటున్నారా? అయితే మీరీ స్టోరీ చదవాల్సిందే.నీతా అంబానీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నీటిని వాడతారని పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. తన సౌందర్యాన్ని కాపాడుకోవడానికి ప్రత్యేకంగా తయారు చేసిన నీళ్లను వాడతారు. 750 మిల్లీలీటర్ల వాటర్ బాటిల్ ధర 27 వేల రూపాయలకు పైమాటే. ప్రపంచంలోనే ఖరీదైన నీళ్లు ఇవేనట. ఈ నీటిని తాగితే ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు బరువు నియంత్రణలోఉండి, చర్మం నిగారింపును సంతరించుకుంటుందని ఒత్తిడి దూరం అవుతుందని విశ్వసిస్తారు. ఈ నీరు ఎక్కడ పడితే అక్కడ దొరకదు. వసంతకాలంలో ఫిజి, ఫ్రాన్స్, ఫిన్లాండ్ దేశంలో ఏర్పడే గ్లాసియర్‌ల నుంచి సేకరిస్తారు. దాంతోపాటు ఖనిజ లవణాలు కూడా ఎక్కువ మోతాదులో ఉంటాయట. అందుకే ఈ వాటర్‌కు అంత క్రేజ్‌.రూ. 49 లక్షల వాటర్‌ బాటిల్‌ కథకాగా 2015లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఆమె సాధారణ వాటర్ బాటిల్‌లోతో కనిపించారు. కానీ నీతా సేవించే అతి ఖరీదైన వాటర్‌ బాటిల్‌ ఇదే. ఈ బాటిల్‌ ధర సుమారు రూ.49 లక్షలు అంటూ మార్ఫింగ్ ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అసలు కథ ఏంటంటే ప్రముఖ మెక్సికన్ డిజైనర్, ఫెర్నాండో అల్టామిరానో ఈ బాటిల్‌ను నిజమైన బంగారంతో చేశారు. దాని పేరే అక్వాడి క్రిస్టల్లో ట్రిబ్యూటో ఎ మొడిగ్లియాని. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది.

BJP Candidate Brij Bhushan Sharan Singh convoy Hit Bike
బ్రిజ్‌భూషణ్‌ కుమారుడు కరణ్‌ కాన్వాయ్‌ బీభత్సం.. ఇద్దరు మృతి

లక్నో: లోక్‌సభ ఎన్నికల వేళ యూపీ విషాదకర ఘటన చోటుచేసుకుంది. బీజేపీ అభ్యర్థి కరణ్‌ భూషణ్‌ సింగ్‌ కాన్వాయ్‌లోని ఓ కారు అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు.వివరాల ప్రకారం.. బీజేపీ సిట్టింగ్‌ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ కుమారుడు, కైసర్‌గంజ్ లోక్‌సభ స్థానం బీజేపీ అభ్యర్థి కరణ్ భూషణ్ సింగ్ కాన్వాయ్‌లోని ఫార్చ్యూనర్ కారు(UP 32 HW 1800) బుధవారం అతి వేగంతో వెళ్తూ ఓ బైక్‌ను ఢీకొట్టింది. హుజూర్‌పూర్-బహ్రైచ్ రైల్వే క్రాసింగ్ సమీపంలో గోండా వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా బైక్‌పై ప్రయాణిస్తున్న రెహాన్, షెహజాద్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు పాదచారులు గాయపడ్డారు. కాగా, కారుపై పోలీస్ ఎస్కార్ట్ అని రాసి ఉంది. BREAKING: Two killed as a car in Brijbhushan Singh’s son Karan Bhushan’s convoy runs over a motorcycle in Gonda. Two deaths confirmed, one grievously injured and hospitalised. pic.twitter.com/50K3CWcdi6— Prashant Kumar (@scribe_prashant) May 29, 2024 ఇక, ఈ ప్రమాదంలో ఫార్చ్యూనర్ కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే కారులోకి ఎయిర్‌బ్యాగ్‌లు తెరుకుకోవడంలో డ్రైవర్‌, అందులో ప్రయాణిస్తున్న వారు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదం అనంతరం కారు వదిలేసి వారు పారిపోయారు. కాగా, సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. గాయపడిన వారిని స్థానికంగా ఉన్న సీహెచ్‌సీకి తరలించి వైద్య చికిత్స అందించారు. కారును పోలీసులు స్వాధీనం చేసుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే, ప్రమాదం సందర్భంగా కరణ్‌ భూషణ్‌ కాన్వాయ్‌ ఉన్నాడా? లేదా? అనేది తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు.మరోవైపు.. ప్రమాదం అనంతరం ప్రజలు ఆగ్రహంతో సీహెచ్‌సీని ముట్టడించారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ప్రమాదంలో మృతుడు రెహాన్‌ ఖాన్‌ తల్లి చందాబేగం కల్నల్‌గంజ్‌ కొత్వాలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో, పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఇదిలా ఉండగా.. గతంలో కూడా కరణ్‌ భూషణ్‌ ఇదే తీరుగా వ్యవహరించిన విషయం తెలిసిందే. యూపీలో అతి వేగంగా కారు నడిపి రైతుల మీదకు దూసుకెళ్లాడు. ఈ సందర్భంగా పలువురు రైతులు మృతిచెందారు. ఈ ఘటన అప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

today Gold and silver rates in bullion market
పెరుగుతున్న బంగారం ధరలు.. రూ.లక్ష మార్కు చేరిన వెండి

కొంతకాలంగా ఈక్విటీమార్కెట్‌లు భారీగా పుంజుకున్నాయి. దాంతో బంగారం ధరలు పడిపోయాయి. ఇటీవల మళ్లీ మార్కెట్‌లో అనిశ్చితులు నెలకొంటున్నాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మార్కెట్లు పడిపోతున్నాయి. దాంతో తిరిగి బంగారం ధరలు పెరుగుతున్నాయి. పెట్టుబడిదారులు సేఫ్డ్‌ అసెట్స్‌లో భాగంగా పసిడిని ఎంచుకుంటారు. కాబట్టి బుధవారం గోల్డ్‌రేట్లు స్వల్పంగా పెరిగాయి. వివిధ ప్రాంతాల్లో పసిడిధరలు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.67,100 (22 క్యారెట్స్), రూ.73,200 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. మంగళవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల ధరలు వరుసగా రూ.250, రూ.270 పెరిగింది.చెన్నైలో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.350, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.380 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.67,750 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.73,910 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో కూడా నేడు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు రూ.67,250.. 24 క్యారెట్ల ధర రూ.73,350కు చేరింది.ఇదీ చదవండి: వ్యాధుల నియంత్రణకు ఏఐ సహాయంవెండి ధరలువెండి ధర మార్కెట్‌లో భారీగా పెరుగుతోంది. బుధవారం కేజీ వెండి ధర ఏకంగా రూ.1200 పెరిగి రూ.1,02,200కు చేరింది. దాంతో లక్షమార్కును దాటినట్లయంది. వెండి తయారీలో ప్రధానపాత్ర పోషిస్తున్న, స్టాక్‌మార్కెట్‌లో లిస్ట్‌ అయిన ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్‌ జింక్‌ స్టాక్‌ ధర నెల రోజులుగా భారీగా పెరిగింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

Rachakonda Police For Child Trafficking Gang in Delhi
చైల్డ్‌ ట్రాఫికింగ్‌ కేసులో నిందితులుగా పేరెంట్స్‌!

పాపం పసివాళ్లు. అభం శుభం తెలియని పసి మనసులు.. అటు కన్నవారికి ఇప్పుడు ఇటు పెంచిన మమకారానికి దూరం కావడంతో తల్లడిల్లిపోతున్నాయి. ఇంతకాలం తమ బిడ్డలేనని మురిసిపోయిన ఆ తల్లులు బరువెక్కిన హృదయంతో కంటతడి పెడుతున్నారు. పోలీసులు ఆ చిన్నారుల్ని తీసుకెళ్తుంటే వాహనాల వెంట పరుగులు పెడుతున్న దృశ్యాలు బాధ కలిగిస్తున్నాయి. హైదరాబాద్‌, సాక్షి: నగరంలో కలకలం రేపిన చైల్డ్‌ ట్రాఫికింగ్‌ వ్యవహారంలో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఇందుకోసం ఢిల్లీ వెళ్లిన రాచకొండ కమిషనరేట్‌ బృందాలు.. విక్రయ ముఠా కోసం గాలింపు చేపట్టాయి. పోలీసుల అదుపులో ఉన్న ముఠా సభ్యులు అందించిన సమాచారం ప్రకారం.. కిరణ్‌, ప్రీతిలను కీలక సూత్రధారులుగా నిర్ధారించుకున్నారు. ఈ ముఠా ఇప్పటివరకు 50 మందికి విక్రయించినట్లు తేలింది. గుంటూరు, విజయవాడ, కరీంనగర్‌.. తెలుగు రాష్ట్రాల్లో ఆ పిల్లల్ని అమ్మేసినట్లు గుర్తించింది. అయితే.. ఇప్పటివరకు 16 మంది చిన్నారులను రక్షించిన పోలీసులు.. ఇటు నిందితులతో పాటు అటు మిగిలిన 34 మంది చిన్నారుల ఆచూకీ కోసం, ఇంకోవైపు ఈ పిల్లల అసలు తల్లిదండ్రులు ఎవరు? అనే అంశాలపై విడివిడిగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అదే సమయంలో 13 మంది పిల్లల్ని కొనుగోలు చేసిన తల్లిదండ్రులపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు. చైల్డ్‌ ట్రాఫికింగ్‌ కేసులో ఆ పేరెంట్స్‌ను నిందితులుగా ఈ కేసులో చేర్చారు. దీంతో వాళ్లంతా లబోదిబోమంటున్నారు.ఇదీ చదవండి: వాట్సాప్‌లో ఫొటోలు.. ముహూర్తం రోజున డెలివరీ..

AP Elections 2024 Judgement Counting Six More Days
ఏపీ ప్రజా తీర్పు.. ఇంకో 6 రోజులే!

జూన్‌ 4.. సరిగ్గా ఇంకో ఆరో రోజులు మాత్రమే. లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడే రోజది. అదే సమయంలో ఒడిషాతో పాటు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టబోతున్నారు.. ఎలాంటి తీర్పు వెలువడనుందో అని రాజకీయ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.ఏపీలోనూ ఈ రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది. జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపు పైన రాజకీయ వర్గాల్లో, మరోవైపు ఓట్లేసిన ప్రజల్లోనూ టెన్షన్ మొదలైంది. ఇదే అదనుగా గెలుపొటములపై పందేలు జోరుగా సాగుతున్నాయి. కవైపు తమ రాజకీయ భవితవ్యాన్ని తేల్చేవిగా కూటమి ఈ ఎన్నికలు భావిస్తున్నాయి. మరోవైపు వైఎస్సార్‌సీపీ మాత్రం మొదటి నుంచి గెలుపు ధీమా ప్రదర్శిస్తోంది. అయితే.. ప్రధాన పార్టీల మధ్య గెలుపు పైన ఉత్కంఠ కొనసాగుతుంటే.. పోలింగ్ అనంతర పరిణామాలతో ఏర్పడిన ఉద్రిక్తత మరో టెన్షన్ కు కారణమవుతోంది.ఎన్నికల పోలింగ్‌ టైంలో జరిగిన హింసాత్మక ఘటనలు, తమ పార్టీ నేతలను.. కార్యకర్తలను లక్ష్యంగా చేసుకోవడం, తదనంతర పరిణామాలపై వైఎస్సార్‌సీపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఏపీలో పోలీసులు, ఎన్నికల సంఘం తీరును ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కౌంటింగ్‌ రోజున అవాంఛనీయ ఘటనలు జరగవచ్చనే అనుమానాలతో ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో.. ఈసీ అలర్ట్‌ అయ్యింది. మరింత విమర్శలు వెల్లువెత్తకుడా ముందస్తు చర్యలు చేపట్టింది.శాంతి భద్రతలను విఘాతం కల్గకుండా.. ఏపీ ఎలక్షన్ కౌంటింగ్‌ కోసం అన్ని జిల్లాలకు స్పెషల్‌ పోలీసు ఆఫీసర్లను నియమించారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించారు. కృష్ణా జిల్లాకు చిత్తూరు జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్పీగా పని చేస్తున్న లావణ్య లక్ష్మిని.. విజయవాడ పోలీస్ కమిషనరేట్‌కు సీఐడీ డీఎస్పీ సోమన్నను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేకంగా పల్నాడు గురించి చర్చించారు. ఏకంగా ఎనిమిది మంది పోలీసు అధికారులను ప్రత్యేకంగా అక్కడ మోహరించారు.మరోవైపు ఈసీ కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూంల దగ్గర మూడంచెల భద్రత ఏర్పాటు చేసింది. కౌంటింగ్ రోజున భద్రత కోసం ఎన్నికల సంఘం భారీగా కేంద్ర బలగాలను రాష్ట్రానికి రప్పించింది. పూర్తిగా కేంద్రబలగాల నిఘా నీఢలో కౌంటింగ్ జరిగేలా ప్లాన్ చేసుకుంది. కౌంటింగ్ తర్వాత కూడా విజయోత్సవాలు, ఊరేగింపులు, కవ్వింపులు లేకుండా స్పెషల్‌ యాక్షన్‌ తీసుకుంటోంది. మొత్తంగా.. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపడుతున్నట్లు చెబుతోంది.ఇదీ చదవండి: ఈ సడలింపులు.. ‘పచ్చ’సిరాతో! పార్టీల తీరు ఇలా..ఏపీలో వైఎస్సార్‌సీపీలో జోష్‌ కనిపిస్తోంది. మరోసారి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీనే అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ కీలక నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. ఓ అడుగు ముందుకు వేసి జూన్ 9న కాబోయే పాలనా రాజధాని విశాఖలో వైఎస్‌ జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని చెబుతున్నారు. అయితే.. గత ఐదేళ్ల కాలంలో నిత్యం ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్న టీడీపీ మాత్రం.. ఎన్నికల తర్వాత సైలెంట్‌ అయిపోయింది. కూటమికి బాకా ఊదిన ఎల్లో మీడియా ఒకట్రెండు రోజులు విజయం కూటమిదే అంటూ హడావిడి చేసినప్పటికీ.. తర్వాత చల్లబడి పోయింది. బీజేపీ, కాంగ్రెస్‌ల గురించి ప్రస్తావించుకోవడం కూడా అనవసరమేమో!.ఇక.. ఎన్నికలు ముగిసిన తర్వాత సీఎం జగన్‌ అధికారికంగా లండన్‌పర్యటనకు వెళ్తే.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ మాత్రం అత్యంత గోప్యంగా పర్యటనకు వెళ్లడమూ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దగ్గుబాటి పురందేశ్వరి, షర్మిల సంగతి సరేసరి. ఫలితాలను ముందే ఊహించి వాళ్లు ఇలా మౌనంగా ఉండిపోతున్నారా? అనే చర్చా ఏపీలో నడుస్తోంది ఇప్పుడు.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement