Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Sajjala RamaKrishna Reddy Key Instructions YSRCP Polling Agents
కౌంటింగ్‌లో ప్రతీ క్షణం అప్రమత్తంగా ఉండాలి: సజ్జల

సాక్షి, తాడేపల్లి: ఎన్నికల్లో డ్రామాలు ఆడటంలో టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధహస్తుడు. కౌంటింగ్‌ సందర్భంగా ప్రత్యర్థులు కుట్రలకు తెరతీస్తారు. ​కాబట్టి మన వాళ్లు ఎక్కడా సంయమనం కోల్పోవద్దు అని సూచించి వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.కాగా, ఎన్నికల కౌంటిగ్‌ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ కౌంటింగ్‌ ఏజెంట్లకు శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి జూమ్‌ మీటింగ్‌లో సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ..‘ఎన్నికల్లో నిబంధనల ప్రకారం మనకు రావాల్సిన ప్రతీ ఓటు వచ్చేలా చూడాలి. కౌంటింగ్‌ సందర్భంగా ప్రత్యర్థులు కుట్రలకు తెరతీస్తారు. ఎక్కడా సంయమనం కోల్పోవద్దు. ఏదైనా తప్పు జరిగితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. ప్రతీ క్షణం అప్రమత్తంగా ఉండాలి.పోస్టల్ బ్యాలెట్‌పై ఉన్న అధికారి సంతకం విషయంలో అనుమానుం ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. ప్రత్యర్థులు రెచ్చగొట్టి మీ ఫోకస్‌ను దెబ్బ తీసేలా వ్యవహరిస్తున్నారు. అలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలి. కచ్చితంగా మనం గెలుస్తున్నాం. నేషనల్‌ మీడియా ఇచ్చిన సర్వేలను చూస్తుంటే నవ్వు వస్తోంది. తమిళనాడులో 9 సీట్లలో పోటీ చేస్తే 14 చోట్ల గెలుస్తుందని చెప్పారు. ఇలా నాలుగైదు రాష్ట్రాల్లో తప్పుడు లెక్కలేసి బీజేపీ కూటమి గెలుస్తుందని చెబుతున్నారు.ఇలాంటి డ్రామాలు చేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధహస్తుడు. ఈసీనే బెదిరించి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. అందుకే కౌంటింగ్‌ సమయంలో ఏజెంట్లు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సమస్య ఉంటే వెంటనే పార్టీ దృష్టికి తీసుకురావాలి’ అని సూచనలు చేశారు.

Ysrcp Petition In Supreme Court On Postal Ballot
పోస్టల్‌ బ్యాలెట్‌పై సుప్రీంలో వైఎస్సార్‌సీపీ న్యాయ పోరాటం

సాక్షి, ఢిల్లీ: పోస్టల్‌ బ్యాలెట్‌పై సుప్రీంకోర్టులో వైఎస్సార్‌సీపీ న్యాయ పోరాటానికి దిగింది. ఈసీ పోస్టల్‌ బ్యాలెట్‌ ఉత్తర్వులను సుప్రీంలో సవాల్‌ చేసింది. అధికారిక సీల్‌, హోదా లేకుండా స్పెసిమెన్‌ సిగ్నేచర్‌తో ఆమోదించాలన్న ఈసీ ఉత్తర్వులను వైఎస్సార్‌సీపీ సవాల్‌ చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నియమ, నిబంధనలే కొనసాగించాలన్న వైఎస్సార్‌సీపీ.. పోస్టల్‌ బ్యాలెట్‌పై హైకోర్టు ఉత్తర్వులను కొట్టివేయాలని పిటిషన్‌ వేసింది. కేవలం ఏపీలోనే ఇలాంటి ఉత్తర్వులను ఇవ్వడాన్ని వైఎస్సార్‌సీపీ ప్రశ్నించింది.కాగా, పోస్టల్‌ బ్యాలెట్‌ డిక్లరేషన్‌ ఫారమ్‌పై అటెస్టింగ్‌ అధికారి సంతకం ఉండి.. పేరు, హోదా, సీల్‌ లేకపోయినా కూడా వాటిని ఆమోదించాలని రిటర్నింగ్‌ అధికారులను ఆదేశి­స్తూ కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్త­ర్వులను సవాలు చేస్తూ వైఎస్సార్‌ సీపీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు పరిష్కరించింది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల విషయంలో అభ్యంతరా­లుంటే వాటిని ప్రస్తావించేందుకు ప్రత్యా­మ్నాయ వేదికలున్నాయని పేర్కొంది.ఆ ప్రత్యా­మ్నాయ మార్గాలకు అనుగుణంగా పోస్టల్‌ బ్యాలె­ట్‌ ఓట్ల వివాదంపై ఎన్నికలు పూర్తయిన తరు­వాత ఎన్నికల పిటిషన్లు (ఈపీ) దాఖలు చేసుకోవాలని వైఎస్సార్‌ సీపీకి సూచించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ మండవ కిరణ్మయి, జస్టిస్‌ న్యాపతి విజయ్‌ల ధర్మాసనం శనివారం తీర్పు వెలువరించింది. కేంద్రం ఎన్నికల సంఘం గురువారం జారీ చేసిన ఉత్తర్వులను చట్ట విరుద్ధంగా ప్రకటించి వాటిని రద్దు చేయాలని అభ్యర్థిస్తూ వైఎస్సార్‌ సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.ఆ ఉత్తర్వుల అమలును నిలిపివేసి మధ్యంతర ఉత్త­ర్వులు జారీ చేయా­లంటూ ఓ అనుబంధ పిటిషన్‌ కూడా దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై శుక్రవారం వాదనలు విన్న జస్టిస్‌ కిరణ్మయి ధర్మా­సనం శనివారం తీర్పు వెలువరించింది. ఎన్నికల ప్రక్రియ మొదలైన తరువాత అందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదన్న కేంద్ర ఎన్నికల సంఘం వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది.పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు కూడా ఎన్నికల ఫలితాల కిందకే వస్తుందని, ఫలితాలపై అభ్యంతరం ఉంటే ఎన్నికల పిటిషన్‌ (ఈపీ) దాఖలు చేసుకోవాలే కానీ హైకోర్టును ఆశ్రయించరాదన్న వాదనను ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాల ఫలితాలను సవాల్‌ చేస్తూ ఈపీలు దాఖలు చేయడం ఆచరణ సాధ్యం కాదన్న వైఎస్సార్‌సీపీ వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే వర్తించేలా ఈ ఆదేశాలు ఇచ్చిందని, ఇది అన్యాయమన్న వాదనను సైతం కోర్టు పరిగణలోకి తీసుకోలేదు.

Rahul gandhi Responded On Exit Polls
ఎగ్జిట్‌పోల్స్‌పై రాహుల్‌గాంధీ సంచలన కామెంట్స్‌

న్యూఢిల్లీ: ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ స్పందించారు. అవి ఎగ్జిట్‌పోల్‌ ఫలితాలు కాదని మోదీ మీడియా పోల్స్‌ అని రాహుల్ మండిపడ్డారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పార్టీ కార్యాచరణ ఎలా ఉండాలనేదానిపై చర్చించడానికి ఇండియా కూటమి నేతలు సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం రాహుల్‌ గాంధీ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి 295 సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మెజార్టీ ఎగ్జిట్‌ పోల్స్‌ కేంద్రంలో ఎన్డీఏ కూటమి తిరిగి అధికారంలోకి వస్తుందని తేల్చాయి. ఇండియా కూటమి ప్రతిపక్ష హోదాతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుందని చెప్పాయి.

Success Story About MobiKwik Founder Upasana Taku
ఉన్న ఉద్యోగం వదిలి.. రూ.8000 కోట్ల కంపెనీ స్థాపించి..

ధైర్యం, దృఢ సంకల్పం ఉంటే.. జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని ఎంతోమంది నిరూపించారు. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు 'మొబిక్విక్‌' (Mobikwik) కో ఫౌండర్ 'ఉపాసన టకు'. ఇంతకీ ఈమె ఎవరు? ఈమె మొబిక్విక్‌ ఎప్పుడు స్థాపించారు? నెట్‍వర్త్ ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ఉపాసన టకు.. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. చదువు పూర్తయిన తరువాత 17 సంవత్సరాలు విదేశాలలో పని చేశారు. సొంతంగా ఏదైనా సంస్థ స్థాపించాలనే ఉద్దేశ్యంతో అమెరికాలో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి భారతదేశానికి వచ్చేసారు.కుటుంబ పరిస్థితి, వ్యాపారంలో వచ్చే ఆటుపోట్ల గురించి తెలిసినప్పటికీ.. ధైర్యంగా నిర్ణయం తీసుకుని, ఆమె భర్త బిపిన్ ప్రీత్ సింగ్‌తో కలిసి మొబైల్ పేమెంట్ / డిజిటల్ వాలెట్ సంస్థ 'మొబిక్విక్‌'ను 2009లో స్థాపించారు. ఇది అతి తక్కువ కాలంలోనే అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో కంపెనీ ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇవ్వగలిగింది.మొబిక్విక్‌ సీఈఓగా ఉపాసన టకు బాధ్యతలు స్వీకరించి కంపెనీని లాభాల బాటలో పయనించేలా చేశారు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలో ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ సైన్స్ & ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన ఉపాసన సంస్థను ఉన్నత శిఖరాలకు చేరవేయడానికి కావాల్సిన ప్రయత్నాలను చేశారు.మొబిక్విక్‌ ప్రారంభించడానికి ముందే ఉపాసన.. పేపాల్, హెచ్‍ఎస్‍బీసీ సంస్థల్లో ప్రొడక్ట్ మేనేజర్‌గా చేశారు. ఈ అనుభవం మొబిక్విక్‌ ఎదుగుదలకు ఉపయోగపడింది. అమెరికాలో ఉద్యోగాన్ని వదిలి.. సొంతంగా సంస్థను స్థాపించిన ఉపాసన ఎంతోమంది యువ పారిశ్రామిక వేత్తలకు ఆదర్శంగా నిలిచారు.ఇదీ చదవండి: ఒకప్పుడు చెప్పులు కొనలేని స్థితి!.. నేడు రూ.3000 కోట్ల సామ్రాజ్యంఏదైనా పనిని ధైర్యంతో చేస్తే తప్పకుండా విజయం సాధించవచ్చని ఉపాసన టకు నిరూపించారు. మొబిక్విక్‌ అనేది చిన్న స్టార్టప్ నుంచి ఫిన్‌టెక్ పవర్‌హౌస్‌గా మారింది. నేడు ఈ సంస్థ రూ. 8000 కోట్ల ఆదాయంతో ముందుకు దూసుకెళ్తోంది.

Sunil Gavaskar Meets Babar Azam At Dining Area
సునీల్‌ గవాస్కర్‌ను కలిసిన బాబర్‌ ఆజం.. వీడియో వైరల్‌

టీ20 వరల్డ్‌కప్‌-2024కు పాకిస్తాన్‌ సన్నద్దమవుతోంది. ఈ మెగా టోర్నీ ఆరంభానికి ముందు ఇంగ్లండ్‌ చేతిలో సిరీస్‌ ఓటమి చవిచూసిన పాక్‌.. తమ లోపాలను సరిదిద్దుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే న్యూయార్క్‌ చేరుకున్న పాకిస్తాన్‌ ప్రాక్టీస్‌లో బీజీబీజీగా ఉంది.ఈ మెగా ఈవెంట్‌లో పాకిస్తాన్‌ తమ తొలి మ్యాచ్‌లో డల్లాస్‌ వేదికగా అమెరికాతో తలపడనుంది. ఇక ఇది ఇలా ఉండగా పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం.. న్యూయర్క్‌లోని ఓ హోటల్‌లో భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్ గవాస్కర్‌ కలిశాడు.హోటల్‌లోని డైనింగ్ ఏరియాలో అనుకోకుండా ఒకరికొకరు ఎదురయ్యారు. ఈ క్రమంలో ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించారు. ఇందుకు సంబంధించిన వీడియోను పీసీసీ ఎక్స్‌లో షేర్‌ చేసింది. కాగా ఈ మెగా టోర్నీకి సంబంధించి కామెంటరీ ప్యానల్‌లో గవాస్కర్‌ సభ్యునిగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక టీ20 వరల్డ్‌కప్‌-2024 సందడి షురూ అయింది. ఆదివారం(జూన్‌ 2) అమెరికా-కెనడా మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి తెరలేచింది. తొలి మ్యాచ్‌లో కెనడాపై 7 వికెట్ల తేడాతో యూఎస్‌ఎ ఘన విజయం సాధించింది. Babar Azam interacts with cricketing icon Sunil Gavaskar 🤝🏏#T20WorldCup pic.twitter.com/YZMRkDBXWV— Pakistan Cricket (@TheRealPCB) June 1, 2024

Southwest Monsoon Winds Have Entered Ap
ఏపీలోకి ప్రవేశించిన నైరుతి రుతు పవనాలు

సాక్షి, గుంటూరు: నైరుతి రుతుపవనాలు శరవేగంగా కదులుతున్నాయి. రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలోకి నైరుతి రుతు పవనాలు ఈ రోజు(ఆదివారం) ప్రవేశించాయని.. ఏపీ అంతటా రుతు పవనాలు మరింత విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిందినేడు రాయలసీమలోకి ప్రవేశించగా, ఆపై క్రమంగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తాయి. అనంతపురం, శ్రీసత్యసాయి, నెల్లూరు, కడప, ఒంగోలు మీదుగా పయనిస్తాయి. అనంతరం దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర కోస్తాంధ్రల్లోకి ప్రవేశించే అవకాశాలున్నాయి.మరోవైపు కోస్తాంధ్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. దీని ప్రభా­వంతో ప్రస్తుతం రాష్ట్రంలో చెప్పుకోదగిన స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. రానున్న నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి.

Ex CM KCR Key Comments On Telangana Formation Day
చిల్లర రాజకీయాల కోసం కొందరు ఉద్యమాన్ని వాడుకున్నారు: కేసీఆర్‌

సాక్షి, తెలంగాణభవన్‌: తెలంగాణ రాష్ట్ర సాధన అసాధ్యమన్నారు. కొందరు చిల్లర రాజకీయాల కోసం తెలంగాణ ఉద్యమాన్ని వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ సీఎం కేసీఆర్‌. బీఆర్‌ఎస్‌ ఖతమైంది అంటూ కొందరు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా మేము మళ్లీ అధికారంలోకి వస్తాం అంటూ వ్యాఖ్యలు చేశారు.కాగా, తెలంగాణభవన్‌లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరికీ దశాబ్ది ఉత్సవ వేడుకల శుభాకాంక్షలు. మనకు మనమే కాదు, ప్రతీ ఒక్కరికీ శుభాకాంక్షలు చెప్పుకోవాలి. కొన్ని క్షణాల గొప్పగా ఉంటాయి, కొన్ని క్షణాలు బాధగా ఉంటాయి. ఊహించుకుంటే ఇప్పుడు కూడా దుఃఖం వచ్చేలా ఉంది. అన్ని పదవుల్లో నేను అనేక రోజులు చేశాను.1969 ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. మంచైనా చెడైనా మీతోనే ఉంటాము అని పనిచేసింది టీఎన్జీవో సంఘం. మన భాష మాట్లాడుతుంటే నవ్వుతారో ఏమో అనుకునే స్థాయి ఉండేది ఆనాడు. వలసలు పోతుంటే కనీసం ఆపలేదు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, నాయకులు. స్ట్రీట్ ఫైట్ కాదు స్టేట్ ఫైట్ అయితేనే చేస్తా అని ఉద్యమంలోకి వచ్చాను. ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఆజన్మ తెలంగాణవాది. జయశంకర్‌ వంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు.మళ్ళీ ఉద్యమం నేను మొదలు పెట్టాను. చావనైనా చావాలి లేదంటే చంపాలి అని నేను ముందున్నాను. పాతాళంలో ఉన్న తెలంగాణపైకి తీసుకొచ్చాం. పాటతో మొత్తం తెలంగాణ చరిత్ర తెలిసేది. చరణంలోనే మొత్తం తెలువాలే. అందుకే తెలంగాణ పాటతో పుట్టింది. 25ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం ఈ గులాబీ జెండాది. బీఆర్ఎస్ ఖతం అయితది అంటున్నాడు. ఖతం అయితదా?. మళ్ళీ నేను బస్సెక్కితే చూసారు కదా నా వెంట వచ్చారు మొత్తం. వందకు వంద శాతం మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. మొన్న నాదగ్గరికి ఒకరు వచ్చి చెప్పాడు ఇప్పటికీ ఇప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్‌కు 105 స్థానాలు వస్తాయని చెప్పారు.రైతు బంధు అనేది ఊరికనే ఇవ్వలేదు. స్థిరీకరణ కోసం ఇచ్చాం. చేప పిల్లలు, గొర్రెలు ఇస్తుంటే కూడా అవమానించారు. ఎన్ని చేసినా కొంత విష గాలి వస్తుంది. ఆ గాలికి జనం కొంత అటు వైపు మొగ్గు చూపారు. గులాబీ జెండా పుట్టిందే తెలంగాణ రక్షణ కోసం. ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలో పని చేయాలి. ఈరోజు ప్రభుత్వం చేస్తున్న పనులు, వెర్రిమొర్రి వేషాలు అన్ని కనిపిస్తున్నాయి. కరెంట్ విషయంలో ప్రభుత్వం తీరు బాధాకరం. కరెంట్ లేక జనం చనిపోతున్నారు. ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. ఎక్కువ రోజులు ఉండవు. కాంగ్రెస్ ప్రభుత్వం స్టెప్ డౌన్ అవుతుంది. గత పదేళల్లో రైతులకు విత్తనాలను సక్రమంగా ఇచ్చాం. మళ్ళీ పాత రోజులు తీసుకొచ్చి లైన్లో నిల్చోవాలన్సిన పరిస్థితి వచ్చింది.మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ స్థానం గెలిచాం. వరంగల్‌లో హీరో రాకేష్ రెడ్డి కూడా గెలుస్తున్నాడు. పార్లమెంట్‌లో ఎన్నైనా రావొచ్చు. ఎక్కువ సీట్లు వస్తే పొంగి పోయేది లేదు. తక్కువ వస్తే కుంగి పోయేది లేదు. ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి పార్టీ ప్లీనరీ సమావేశం చేసుకోలేదు. పార్టీ వార్షికోత్సవాన్ని రెండు రోజులపాటు ఘనంగా అద్భుతంగా చేసుకుందాం’ అని కామెంట్స్‌ చేశారు.

Sikkim And Arunachal Pradesh Assembly Poll Counting Updates
అరుణాచల్, సిక్కిం అసెంబ్లీ ఫలితాలు: 44 సీట్లలో బీజేపీ విజయం

Counting Updates అరుణాచల్‌ ప్రదేశ్‌లో బీజేపీ ఘన విజయంఅరుణాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల బీజేపీ 44 సీట్లలో విజయం2 స్థానాల్లో లీడింగ్‌ కొనసాగుతోందినేషనల్‌ పీపుల్స్‌ పార్టీ 5 సీట్లలో గెలుపు10 స్థానాలు ఏకగ్రీవంగా గెలిచిన బీజేపీమేజిక్‌ ఫిగర్‌ స్థానాలు 30పీపుల్స్‌ పార్టీ ఆఫ్‌ అరుణాచల్‌ 2 సీట్లలో గెలుపునేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ 1 స్థానం గెలుపు , 2 ముందంజ ఇండిపెండెంట్లు 3 గెలుపు సిక్కింలో అధికార కాంత్రికారి మోర్చా ఘన విజయంసి​క్కింలో సిక్కిం కాంత్రికారి మోర్చా పార్టీ 26 సీట్లలో విజయం5 స్థానాల్లో సీకేఎం లీడింగ్‌మేజిక్‌ ఫిగర్‌ 17 సీట్లుసిక్కిం డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ 1 స్థానం గెలుపుసిక్కిం సీఎం, ఎస్‌కేఎం చీఫ్‌ సీఎస్‌ ప్రేమ్‌ సింగ్‌ తమంగ్ రెనోక్ స్థానంలో 7044 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సి​క్కింలో సిక్కిం కాంత్రికారి మోర్చా పార్టీ దూసుకుపోతోంది11 సీట్లలో సీకేఎం పార్టీ విజయం20 స్థానాల్లో సీకేఎం లీడింగ్‌సిక్కిం డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ ఒక్కస్థానంలో లీడింగ్‌ అరుణాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల బీజేపీ 20 సీట్లలో విజయం సాధించింది26 స్థానాల్లో లీడింగ్‌ కొనసాగుతోంది10 స్థానాలు ఏకగ్రీవంగా గెలిచిన బీజేపీనేషల్‌ పీపుల్స్‌ పార్టీ 6 స్థానాల్లో లీడిండ్‌ అరుణాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల బీజేపీ 18 సీట్లలో విజయం సాధించింది28 స్థానాల్లో లీడింగ్‌ కొనసాగుతోందినేషల్‌ పీపుల్స్‌ పార్టీ 6 స్థానాల్లో లీడిండ్‌నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ 3 స్థానాల్లో ముందంజపీపుల్స్‌ పార్టీ ఆఫ్‌ అరుణాచల్‌ 2 స్థానాల్లో లీడింగ్‌10 స్థానాలు ఏకగ్రీవంగా గెలిచిన బీజేపీ#WATCH | Celebration begins at the BJP office in Itanagar as the party is set to return to power in Arunachal Pradesh The ruling BJP crossed the halfway mark; won 17 seats leading on 29. National People's Party is leading on 6 seats. The majority mark in the State Assembly is… pic.twitter.com/GEEfXggrEO— ANI (@ANI) June 2, 2024 సిక్కింలో కౌంటింగ్‌ కొనసాగుతోందిసిక్కిం క్రాంతికారి మోర్చా రెండు స్థానాల్లో​ గెలుపు29 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది. సిక్కిం డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ ఒక్క స్థానంలో లీడింగ్‌లో ఉంది.#WATCH | Sikkim: Pintso Namgyal Lepcha from the Sikkim Krantikari Morcha (SKM) wins from the Djongu Assembly constituency He says, "I thank all the voters who supported me and made me win with a huge margin. I also thank my party president who gave me the ticket..." pic.twitter.com/BHVMQJvwB2— ANI (@ANI) June 2, 2024 సిక్కింలో కౌంటింగ్‌ కొనసాగుతోందిఏకపక్షంగా దూసుకుపోతున్న ఎస్‌కేఎంసిక్కిం సీఎం, ఎస్‌కేఎం చీఫ్‌ సీఎస్‌ తమంగ్ గోలే.. సోరెంగ్-చకుంగ్, రెనోక్ నియోజకవర్గాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.తమంగ్‌ గోలే భార్య కృష్ణ కుమారి రాయ్ నామ్చి-సింగితాంగ్‌లో ముందంజలో ఉన్నారు.Sikkim CM and Sikkim Krantikari Morcha (SKM) chief Prem Singh Tamang, who is contesting the Assembly elections from Rhenock and Soreng-Chakung seats, is leading on both the seats.SKM crossed the halfway mark; leading on 29 seats. The majority mark in the Sikkim Assembly is 17… pic.twitter.com/1NIYCEmihZ— ANI (@ANI) June 2, 2024 అరుణాచల్ ప్రదేశ్ లో దూసుకుపోతున్న కమలం10 స్థానాలు ఏకగ్రీవంగా గెలిచిన బీజేపీమిగిలిన 50 స్థానాల్లో 29 చోట్ల కమలం హవామొత్తం 39 సీట్లలో బీజేపీ ఆధిక్యం8 చోట్ల లీడింగ్ లో ఉన్న నేషనల్ పీపుల్స్ పార్టీకాంగ్రెస్ ఒకచోట మాత్రమే ఆధిక్యంసిక్కింలో మరోసారి అధికారం దిశగా సిక్కిం క్రాంతికారి మోర్చాఏకపక్షంగా దూసుకుపోతున్న ఎస్‌కేఎంసిక్కింలో క్లీన్ స్వీప్ చేసే దిశగా క్రాంతికారి మోర్చా పార్టీమొత్తం 32 సీట్లకుగాను 29 స్థానాల్లో ఎస్‌కేఎం ఆధిక్యంఒక స్థానంలో ఎస్ డీఎఫ్ లీడింగ్ అరుణాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది.సంగం సీట్లలో బీజేపీ ముందంజఇప్పటికే 10 సీట్లలో ఏకగ్రీవం, 27 స్థానాల్లో లీడింగ్‌నేషల్‌ పీపుల్స్‌ పార్టీ 8 స్థానాల్లో లీడిండ్‌నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ 3 స్థానాల్లో ముందంజమ్యాజిక్‌ ఫిగర్‌ 31 స్థానాల్లో గెలుపు#WATCH | Arunachal Pradesh: Counting of votes for Assembly elections underway; visuals from a counting centre in Yingkiong The ruling BJP crossed the halfway mark; won 10 seats leading on 27. National People's Party is leading on 8 seats, Nationalist Congress Party on 3 seats.… pic.twitter.com/z53MEaw4aI— ANI (@ANI) June 2, 2024 అరుణాచల్‌ ప్రదేశ్‌లో బీజేపీ 33 స్థానాల్లో ముందంజ నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ( ఎన్‌పీఈపీ) 8 సీట్లలో లీడింగ్‌పీపుల్స్‌ పార్టీ ఆఫ్‌​ అరుణాల్‌( పీపీఏ) 3 స్థానాల్లో లీడింగ్‌కాంగ్రెస్‌ పార్టీ 2 స్థానాల్లో లీడింగ్‌ఇండిపెండెంట్లు 2 స్థానాల్లో లీడింగ్‌Counting of votes underway for the Arunachal Pradesh Assembly elections. The ruling BJP crossed the halfway mark; won 10 seats leading on 23. National People's Party is leading on 8 seats, People's Party of Arunachal on 3 seats. The majority mark in the State Assembly is 31… pic.twitter.com/b1buWSfVIo— ANI (@ANI) June 2, 2024 అరుణాచల్‌ ప్రదేశ్‌లో బీజేపీ 23 స్థానాల్లో ముందంజ నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ( ఎన్‌పీఈపీ) రెండు సీట్లలో లీడింగ్‌పీపుల్స్‌ పార్టీ ఆఫ్‌​ అరుణాల్‌( పీపీఏ) రెండు స్థానాల్లో లీడింగ్‌కాంగ్రెస్‌ పార్టీ ఒక స్థానంలో లీడింగ్‌ఇండిపెండెంట్‌ ఒక స్థానంలో లీడింగ్‌Counting of votes underway for the Arunachal Pradesh Assembly elections. As per ECI, the BJP is leading on 13 seats. National People's Party is leading on 2 seats, People's Party of Arunachal on 2 seats. The majority mark in the State Assembly is 31 out of 60 Assembly seats.… pic.twitter.com/1gF6b7q5O9— ANI (@ANI) June 2, 2024 సిక్కింలో కౌంటింగ్‌ కొనసాగుతోంది. ఎస్‌కేఏం భారీ లీడింగ్‌లో దూసుకుపోతోంది.సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్‌కేఏం) 24 స్థానాల్లో ముందంజలో ఉంది.సిక్కిం డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (ఎస్‌డీఎఫ్‌) ఒక స్థానంలో లీడింల్‌ ఉంది. ఇక్కడ మ్యాజిక్‌ ఫిగర్‌ 17 కాగా మొత్తం సీట్లు 32Counting of votes underway for the Sikkim Assembly electionsRuling Sikkim Krantikari Morcha (SKM) crosses the halfway mark; leading on 24 seats. The majority mark in the Sikkim Assembly is 17 out of 32 Assembly seats. pic.twitter.com/6cvVzrSsYl— ANI (@ANI) June 2, 2024 అరుణాచల్‌ ప్రదేశ్‌లో కౌంటింగ్‌ కొనసాగుతోందిబీజేపీ ఆరు స్థానాల్లో ముందంజలో కొగనసాగుతోంది.నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పీఈపీ) 2 సీట్లలో లీడింగ్‌లో ఉంది.స్వతంత్ర అభ్యర్థి స్థానం ఒకటి లీడింగ్‌లో కొనసాగుతోందిCounting of votes underway for the Arunachal Pradesh Assembly elections. As per ECI, BJP is leading on 6 seats. National People's Party is leading on 2 seats. The majority mark in the State Assembly is 31 out of 60 Assembly seats.The BJP has already won 10 seats unopposed. pic.twitter.com/ysB0JSFmQo— ANI (@ANI) June 2, 2024 సిక్కింలో కౌంటింగ్‌ కొనసాగుతోంది. సిక్కిం క్రాంతికారి మోర్చా( ఎస్‌కేఏం) ఏడు స్థానాల్లో ముందంజలో ఉంది.ఇక్కడ మ్యాజిక్‌ ఫిగర్‌ 17 కాగా మొత్తం సీట్లు 32Counting of votes underway for the Sikkim Assembly electionsRuling Sikkim Krantikari Morcha (SKM) crosses the halfway mark; leading on 24 seats. The majority mark in the Sikkim Assembly is 17 out of 32 Assembly seats. pic.twitter.com/6cvVzrSsYl— ANI (@ANI) June 2, 2024 అరుణాచల్‌ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్‌ కొనసాగుతోంది. మొదట పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు రెండు రోజుల ముందే అరుణాచల్‌ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్‌ ప్రారంభమైందిCounting of votes underway for the Assembly elections in Arunachal Pradesh and Sikkim.In Arunachal Pradesh, the BJP has already won 10 seats unopposed in the 60-member assembly pic.twitter.com/Sq96QH4cnS— ANI (@ANI) June 2, 2024సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు రెండు రోజుల ముందే అరుణాచల్‌ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.ఆదివారం ఉదయం ఆరు గంటల కల్లా ఓట్ల లెక్కింపు మొదలయ్యేలా కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది.60 స్థానాలున్న అరుణాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీలో ఇప్పటికే 10 చోట్ల బీజేపీ ఏకగ్రీవంగా గెలిచింది. మిగిలిన 50 స్థానాలకు ఓట్ల లెక్కింపు జరగనుంది. దీంతో ఈవీఎంలలో నిక్షిప్తమైన 133 మంది అభ్యర్థుల భవితవ్యం నేటితో తేలనుంది. తక్కువ స్థానాలు కావడంతో ఆదివారం మధ్యాహ్నంకల్లా తుది ఫలితాలు వెల్లడికానున్నాయని రాష్ట్ర చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌(సీఈఓ) పవన్‌కుమార్‌ సైన్‌ శనివారం చెప్పారు. సిక్కింలోనూ.. సిక్కింలోని 32 అసెంబ్లీ స్థానాలకు ఆదివారం ఉదయం ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. మరోసారి అధికారం చేపట్టాలని అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా(ఎస్‌కేఎం) ఉవ్విళ్లూరుతుండగా ఎలాగైనా విజయం సాధించాలనిసిక్కిం డెమొక్రటిక్‌ ఫ్రంట్‌(ఎస్‌డీఎఫ్‌), బీజేపీ, కాంగ్రెస్, సిటిజెన్‌ యాక్షన్‌ పార్టీ–సిక్కిం ఆశపడుతున్నాయి. ఈసారి ఏప్రిల్‌ 19న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 80 శాతం పోలింగ్‌ నమోదైంది. మొత్తం 146 మంది అభ్యర్థులు ఈసారి పోటీపడ్డారు.

YSRCP Victory In AP Assembly Elections says Majority Exit Polls 2024
వైఎస్సార్‌సీపీదే ఏపీ.. మెజార్టీ ఎగ్జిట్‌ పోల్స్‌ స్పష్టీకరణ

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టిస్తూ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని సింహభాగం మీడియా, సర్వే సంస్థల ఎగ్జిట్‌ పోల్స్‌ తేల్చి చెప్పాయి. సంక్షేమాభివృద్ధి పథకాలు.. సుపరిపాలనతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెచి్చన విప్లవాత్మక మార్పులకు జనం జై కొట్టారని స్పష్టం చేశాయి. టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి కంటే మహిళలు 12 శాతం అధికంగా వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేసి, ఫ్యాన్‌ ప్రభంజనం సృష్టించడానికి దోహదం చేశారని ఆరా (మస్తాన్‌), చాణక్య (పార్థదాస్‌) తేల్చాయి. జాతీ­య, రాష్ట్ర మీడియా, సర్వే సంస్థలు, సెఫాలజిస్టు­లు నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్, పోస్ట్‌ పోల్స్‌ సర్వేలను క్రోడీకరించి శనివారం ఫలితాలను వెల్లడించా­యి. తెలుగు రాష్ట్రాల్లో ఆరా సంస్థ అధినేత మస్తాన్‌ నిర్వహించే సర్వే, ఎగ్జిట్‌ పోల్స్‌కు అత్యంత విశ్వసనీయత ఉంది. గతేడాది ఆఖర్లో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందని.. కామారెడ్డిలో అప్పటి సీఎం కేసీఆర్, ఇప్పటి సీఎం రేవంతరెడ్డిలు ఇద్దరూ ఓడిపోతారని.. బీజేపీ అభ్యర్థి కె.వెంకటరమణారెడ్డి విజయం సాధిస్తారని ఎగ్జిట్‌ పోల్, పోస్ట్‌ పోల్‌ సర్వేలో బల్లగుద్ది చెప్పారు. ఎన్నికల ఫలితాల్లో అదే వెల్లడైంది. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఎగ్జిట్‌ పోల్స్, పోస్ట్‌ పోల్స్‌ సర్వేను ఆరా మస్తాన్‌ విస్తృత స్థాయిలో నిర్వహించారు. 49.41 శాతం (మహిళలు 54.76 శాతం, పురుషులు 45.35 శాతం) ఓట్లతో 94 నుంచి 104 శాసనసభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించి, మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని తాము నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్, పోస్ట్‌ పోల్‌ సర్వేల్లో వెల్లడైందని ఆరా మస్తాన్‌ వెల్లడించారు. టీడీపీ నేతృత్వంలోని కూటమి 47.55 శాతం ఓట్లతో 71–81 శాసనసభ స్థానాలకే పరిమితం అవుతుందని తేల్చి చెప్పారు. లోక్‌సభ స్థానాల్లో 13–15 సీట్లలో వైఎస్సార్‌సీపీ, 10–12 స్థానాల్లో ఎన్‌డీఏ కూటమి విజయం సాధిస్తుందని వెల్లడించారు. సీఎం జగన్‌ సంక్షేమాభివృద్ధి పథకాలు.. వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవలను ఇంటి గుమ్మం వద్దకే ప్రజలకు అందించడం వైఎస్సార్‌సీపీ ఘన విజయానికి దోహదం చేశాయని ఆరా మస్తాన్‌ స్పష్టం చేశారు. మహిళలు సీఎం జగన్‌ నాయకత్వానికి బ్రహ్మరథం పట్టడం వల్ల ఫ్యాన్‌ ప్రభంజనం సృష్టిస్తుందని తేల్చి చెప్పారు. ప్రతిష్టాత్మక చాణక్య సంస్థ అధినేత పార్థదాస్‌ నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌లోనూ అదే వెల్లడైంది. 50 శాతం ఓట్లతో 110–120 శాసనసభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించి, అధికారంలోకి రావడం ఖాయమని తేల్చి చెప్పా­రు. ఎన్‌డీఏ కూటమి 55–65 స్థానాలకే పరిమితమవు­తుందని స్పష్టం చేశారు. ఆత్మసాక్షి, రేస్, ఆపరేషన్‌ చాణక్య, పోల్‌ స్ట్రాటజీ, అగి్నవీర్, పోల్‌ లాబొరేటరీ, జన్మత్‌ పోల్, సీపీఎస్‌ తదితర సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌లోనూ వైఎస్సార్‌సీపీ విజ­యం సాధించడం ఖాయమని వెల్లడైంది. కాగా, టైమ్స్‌ నౌ ఈటీజీ సంస్థ రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లలో వైఎస్సార్‌సీపీ 11 సీట్లలో కూటమి విజయం సాధిస్తుందని స్పష్టం చేసింది. ఏపీలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 120కి పైగా అసెంబ్లీ స్థానాలు కైవసం చేసు­కుని మరోమారు అధికారం చేపట్టడం ఖాయ­మ­ని క్యూ మెగా అమేజీ పొలిటికల్‌ సొల్యూషన్స్‌ సీఈవో ఖాదర్‌ ఖాన్‌ పఠాన్‌ తెలిపారు. 22 పార్లమెంట్‌ స్థానాలు పక్కాగా కైవసం చేసుకుంటుందని.. మరో రెండు స్థానాల్లో గట్టి పోటీ ఉందని.. అవి కూడా వ­చ్చే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. శనివా­­రం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏపీ ఎగ్జిట్‌ పోల్‌ సర్వే 2024 రిపోర్టును ఆయన వెల్లడించారు.ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తప్పిన జాతీయ మీడియా లెక్కలు గతేడాది నవంబర్‌లో ఛత్తీస్‌గఢ్‌ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు పూర్తిగా తప్పాయి. ఛత్తీస్‌గడ్‌లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని ఇండియాటుడే–యాక్సిస్‌ మై ఇండియా, ఎన్‌డీటీవీ, ఈటీజీ, జన్‌కీ భాత్, పోల్‌స్టార్, టుడేస్‌ చాణక్య, మ్యాట్రిజ్, సీ ఓటర్, సీఎన్‌ఎక్స్, దైనిక్‌ భాస్కర్‌ తదితర సంస్థలు తేల్చి చెప్పాయి. కానీ ఆ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి, అధికారంలోకి వచ్చింది. జాతీయ మీడియా సంస్థలు రాష్ట్రంలో ప్రజల నాడి పట్టడంలో పూర్తిగా విఫలమయ్యాయన్నది ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల ఫలితాలతో నిరూపితమైంది. ఫలితాలు వెల్లడించొద్దంటూ సెఫాలజిస్ట్‌లపై ఒత్తిళ్లు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ.. ఏ పార్టీ బలం పుంజుకుంది.. ఏ పార్టీ విజయం సాధిస్తుందన్నది కచి్చతంగా అంచనా వేయగలిగే సెఫాలజిస్ట్‌లు పదుల సంఖ్యలో ఉన్నారు. వారు తమ సంస్థల ద్వారా రాష్ట్రంలో ఎగ్జిట్‌ పోల్స్‌ నిర్వహించి, శనివారం ఫలితాలను వెల్లడించేందుకు సిద్ధమయ్యారు. ఆ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తుందని వెల్లడైందని తెలుసుకున్న టీడీపీ నేతలు.. వాటిని వెల్లడించవద్దంటూ సెఫాలజిస్ట్‌లపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. ఆ ఒత్తిళ్లకు తలొగ్గిన ఓ సెఫాలజిస్టు ఫలితాలను తారుమారు చేసి వెల్లడించారు. వైఎస్సార్‌సీపీ 93 స్థానాల్లో, టీడీపీ కూటమి 80 స్థానాల్లో, ఇతరులు రెండు స్థానాల్లో విజయం సాధిస్తారని తాము నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌లో వెల్లడైతే.. టీడీపీ నేతల ఒత్తిడి తాళలేక వాటిని తారుమారు చేసి చెప్పాల్సి వచ్చిందని వాపోయినట్లు ఆయన సన్నిహితులు వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే కౌంటింగ్‌ కేంద్రాల్లో అక్రమాలకు పాల్పడైనా సరే దొడ్డిదారిన విజయం సాధించడానికి టీడీపీ కుట్రలు చేస్తోందని మరోసారి నిరూపితమైంది.బీజేపీ వాణి విన్పించిన జాతీయ మీడియా దేశ వ్యాప్తంగా పార్లమెంట్‌ స్థానాల్లో జాతీయ మీడియా బీజేపీ వాణి వినిపించింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ సింహభాగం స్థానాల్లో విజయం సాధిస్తుందని.. మోదీ మూడోసారి ప్రధాని అవుతారని జోస్యం చెప్పాయి. ఇండియా టుడే, ఎన్‌డీటీవీ, న్యూస్‌–18 వంటి జాతీ­య మీడియా సంస్థలు ఎన్‌డీఏకే పట్టం కడుతూ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను వెల్లడించాయి. ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఎన్‌డీఏకు 400 లోక్‌సభ స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తే.. ఒకట్రెండు జాతీయ మీడియా సంస్థలు ఎన్‌డీఏకు 401 స్థానాలు వస్తాయని ఎగ్జిట్‌ పోల్స్‌లో వెల్లడించడం గమనార్హం.

Raveena Tandon And Driver Face Backlash After Rash Driving Incident In Bandra
ప్లీజ్‌.. నన్ను కొట్టొద్దు.. వేడుకున్న రవీనా టండన్‌

గతేడాది కేజీఎఫ్‌-2లో అలరించిన స్టార్‌ నటి రవీనా టాండన్‌. ఆ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. చివరిసారిగా పట్నా శుక్లా అనే చిత్రంలో లాయర్‌గా కనిపించింది. ప్రస్తుతం రవీనా గుడ్ చాడి, వెల్‌కమ్ బ్యాక్ చిత్రాల్లో నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ బాలీవుడ్‌ నటి వివాదంలో చిక్కుకుంది. తన కారు డ్రైవర్ చేసిన పనికి రవీనాపై దాడికి యత్నించారు. ‍‍దీంతో తనను కొట్టవద్దంటూ వారిని వేడుకున్నారామె. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలుసుకుందాం. ముంబయిలో రవీనా టాండన్‌, తన డ్రైవర్‌లో కలిసి వెళ్తుండగా రోడ్డుపై వెళ్లున్న కొందరిని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో రోడ్డుపై వెళ్తున్న వారిలో ఒక్కరు గాయపడ్డారు. దీంతో వారి కుటుంబసభ్యులంతా కలిసి డ్రైవర్‌పై గొడవకు దిగారు. అ తర్వాత రవీనా టాండన్‌ కారు దిగి గాయపడిన వారిపై వాగ్వావాదానికి దిగింది. దీంతో వారంతా ఒక్కసారిగా రవీనా టాండన్‌పైకి దూసుకొచ్చారు. దీంతో ఆమె దయచేసి నన్ను కొట్టవద్దని వారిని వేడుకుంది. వీడియోలను రికార్డ్ చేయవద్దని అక్కడున్న వారిని కోరింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట విస్తృతంగా వైరలవుతోంది.అయితే మరోవైపు గాయపడిన కుటుంబసభ్యులు రవీనా టాండన్‌ తమపై దాడి చేసిందని ఆరోపిస్తున్నారు. తమపై అన్యాయంగా దాడి చేసిందని అన్నారు. పోలీసులు కూడా మాకు న్యాయం చేయలేదని..రవీనా టాండన్‌ మా అమ్మను కొట్టారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. మా అమ్మ తలకు తీవ్ర గాయాలయ్యాయని బాధితుడు పేర్కొన్నారు. చివరికీ ఈ వ్యవహారం పోలీస్‌ స్టేషన్‌కు చేరింది. Actress Raveena Tandon's driver accused of rash driving & crashing into 3 women in Bandra, Mumbai. Injured's family claim Raveena in an inebriated state got off the car along with her driver & further assaulted the victims on the road. Crowds turned aggressive leading to heated… pic.twitter.com/PdbgLMueFz— Nabila Jamal (@nabilajamal_) June 2, 2024What's this #RaveenaTondon aunty!? pic.twitter.com/qA1IWAB1qf— 𝙍𝙎𝙆 (@RSKTheMonsters) June 2, 2024

తప్పక చదవండి

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement