Top Stories
ప్రధాన వార్తలు
ఈ పథకాలు ఎంత అవసరమో ఆలోచించండి: సీఎం జగన్
గుంటూరు, సాక్షి: సాధ్యంకాని హామీలతో టీడీపీ అధినేత చంద్రబాబు మేనిఫెస్టో ఇచ్చారు. కానీ, మేం 99 శాతం హామీలు అమలు చేసి మేనిఫెస్టోకు ఒక విశ్వసనీయత తీసుకొచ్చాం. ఇప్పుడు కూడా మేనిఫెస్టో ఆధారంగానే ఎన్నికల్లో ఓటేయమని అడుగుతున్నాం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గుంటూరు మంగళగిరిలో శుక్రవారం ఉదయం వైఎస్సార్సీపీ నిర్వహించిన ఎన్నికల ప్రచార భేరీలో ఆయన ప్రసంగించారు.‘‘మంగళగిరి సిద్ధమేనా? దేవుడి దయతో వాతావరణం కాస్త చల్లగా ఉంది. మీ చిక్కటి చిరునవ్వుల నడుమ, ఇందరి ప్రేమానురాగాలు, ఇందరి ఆప్యాయతలు, ఇందరి ఆప్యాయతల నడుమ మీ అందరికి కూడా.. నా ప్రతి అక్కకూ, నా ప్రతి చెల్లెమ్మకి, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితునికీ .. మీ బిడ్డ మీ జగన్ రెండు చేతులు జోడించి , హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.జరగబోయే ఎన్నికలు.. కేవలం మూడు రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగనుంది. జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరుగుతున్న ఎన్నికలు కావు. ఈ జరగబోయే ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు. జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. మళ్లీ ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే... పథకాలన్నీ ముగింపు. మళ్లీ మోసపోటమే. ఇదే.. ఇదే.. చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం. ఇదే సాధ్యం కాని హామీలతో చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోలకు అర్థం. ప్రతీ ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. పొరపాటును చంద్రబాబుకి ఓటేయడం అంటే.. కొండచిలువ నోట్లో తల పెట్టడమే అని గుర్తు పెట్టుకోవాలి. అందరికీ ఈ విషయాలు చెబుతూ.. నా మాటలపై ఆలోచన చేయండి. గత 59 నెలల మీ బిడ్డ పాలనలో గతంలో ఎప్పుడూ లేని విధంగా.. ఏకంగా రూ.2.70 లక్షల కోట్ల రూపాయిలు వివిధ పథకాలకు మీ బిడ్డ 130 సార్లు బటన్ నొక్కితే నేరుగా నా అక్కచెల్లమ్మల ఖాతాల్లోకి, వాళ్ల చేతుల్లోకి జమ అవుతున్నాయి. ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు. మీ బిడ్డ బటన్‌నొక్కడం.. నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి వెళ్లడం. మీ బిడ్డ రాక మునుపు, మీ బిడ్డ పాలనకు మునుపు ఈ విధంగా బటన్లు నొక్కడం, నేరుగా ఖాతాల్లోకి వెళ్లడం గతంలో ఎప్పుడైనా జరిగిందా? ఆలోచన చేయండి.ఏకంగా.. గతంలో ఎప్పుడూ చూడని విధంగా 2లక్షల 31 వేల ప్రభుత్వ ఉద్యోగాలు మీ బిడ్డ పాలనలోనే వచ్చాయి. దశాబ్దాలుగా ఉన్న ఉద్యోగాలు 4 లక్షలు. కేవలం 59 నెలల పాలనలోనే రెండు లక్షల ఉద్యోగాలిచ్చాం. గత చరిత్రలో ఇది ఎప్పుడూ జరగలేదని సగర్వంగా చెబుతున్నా. ఇందులో లక్షా 35 వేల మంది మన కళ్లముందు సచివాలయాల్లో కనిపిస్తున్నారు.ఇంతకుముందు అంతా ఎన్నికల మేనిఫెస్టో అంటే ఎన్నికలప్పుడు వస్తారు. రంగురంగుల కాగితాలతో, రంగురంగుల ఆశలకు అబద్ధాలకు రెక్కలు కట్టి చెప్పేవారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే పరిస్థితి. కనీసం వెతికినా దొరికేది కాదు. ఆ సంప్రదాయాన్ని మార్చి, గతంలో ఎప్పుడూ చూడని విధంగా దేశంలోనూ ఎక్కడా చూడని విధంగా.. ఏకంగా 99% హామీలు నెరవేర్చి, ఆ మేనిఫెస్టోను నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకే పంపించి, మీ బిడ్డ పాలనలో ఇవన్నీ జరిగాయా? లేదా? మీరే టిక్కు పెట్టండి, మీ జగన్ ఇవన్నీ చేశాడు.. మీరే మీ బిడ్డకు ఆశీస్సులు ఇవ్వండి అంటూ మేనిఫెస్టోకు విశ్వసనీయత తీసుకొచ్చింది మీ బిడ్డ పాలనలోనే. ఆలోచేన చేయండి.. ఇది మీ బిడ్డ పాలనలో కాదా?.ఇప్పుడు నేను గడగడా కొన్ని పథకాల పేర్లు మచ్చుకు చెబుతాను.. ఈ పథకాలన్నీ గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? ఈ పథకాలన్నీ మీకు అందాయా అని మీరే ఆలోచించండి. గవర్నమెంట్ బడి పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు, ఇంగ్లీష్ మీడియం నుంచి ఐబీ దాకా ప్రయాణం, టోఫెల్ క్లాసులు, బైలింగువల్ టెక్స్ట్ బుక్‌లు మన పిల్లల చేతుల్లోనే కనిపిస్తున్నాయి.బడులు తెరిచేసరికే విద్యాకానుక, బడుల్లో గోరుముద్ద, పిల్లల చదువులకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ చరిత్రలో ఎప్పుడూ జరగని రీతిలో ఓ అమ్మ ఒడి.. గతంలో ఉన్నాయా? గతంలో జరిగిందా?. పూర్తి ఫీజులతో...ఏ అక్కా...ఏ చెల్లెమ్మా తన పిల్లల చదువుల కోసం అప్పులపాలు అవ్వకూడదని, పెద్ద చదువుల కోసం పూర్తి ఫీజులతో ఒక జగనన్న విద్యాదీవెన, ఓ జగనన్న వసతి దీవెన.. ఇంజినీరింగ్, మెడిసిన్ చదువుతున్న వాళ్లు 93 శాతం ఫీజు రియంబర్స్మెంట్ పొందుతున్నది ఈ 59 నెలల కాలంలోనే. ఇంటర్నేషనల్ యూనివర్సిటీలతో ఆన్లైన్ సర్టిఫైడ్ కోర్సులను డిగ్రీ స్థాయిలో.. ఇలా చదువుల్లో మీ బిడ్డ తెచ్చిన విప్లవాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా? ప్రతీ ఒక్కరూ ఆలోచన చేయండి. 15 ఏళ్ల తర్వాత.. ఐబీ సర్టిఫికెట్ పదో తరగతి పాసైతాడు. మరో మూడేళ్లకు డిగ్రీ చేసి.. అంతర్జాతీయ యూనివర్సిటీల నుంచి కోర్సులతో పట్టా పుచ్చుకుంటాడు. అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతూ.. ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది. పేదల భవిష్యత్తు మారాలి.. అందుకు మీ బిడ్డ అడుగులు వేయడం ఎంత అవసరమో ఆలోచన చేయండి.గతంలో ఎన్నడూ జరగని విధంగా, చూడని విధంగా.. నా అక్కచెల్లెమ్మలను వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడాలని, వాళ్లకు ఏదో ఒక ఆదాయాలు ఉండాలని, అక్కచెల్లెమ్మలకు.. ఒక ఆసరా, చేయూత, సున్నావడ్డీ, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, నా అక్కచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల స్థలాలు వారిపేరిట రిజిస్ట్రేషన్ చేయించే కార్యక్రమంతో పాటు అందులో 20 లక్షల ఇళ్లు కడుతున్న కార్యక్రమం కూడా చేపట్టాం. అక్కచెల్లెమ్మల కోసం ఇంతగా ఆలోచన చేసిన ప్రభుత్వం..మహిళా సాధికారత కోసం ఇంతగా పట్టించుకున్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా చూసారా?నా అవ్వాతాతలకు ఇంటికే రూ.3000 పెన్షన్ గతంలో ఎప్పుడైనా జరిగిందా?. ఇంటి వద్దకే రేషన్. ఇంటి వద్దకే పౌర సేవలు. ఇంటి వద్దకే పథకాలు రావడం.. గతంలో ఎప్పుడైనా జరిగాయా?. రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా రైతుభరోసా ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతున్నాను. రైతన్నలకు ఓ ఉచిత పంటలబీమా, సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ, పగటి పూటే 9 గం.ల ఉచిత విద్యుత్, ఒక ఆర్బీకే వ్యవస్థ...ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా? అని అడుగుతున్నాను.స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ.. సొంత ఆటోలు, టాక్సీలు నడుపుతున్న డ్రైవరన్నలకు ఓ వాహన మిత్ర, నేతన్నలకో నేతన్న నేస్తం, మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసాతో పాటు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్లకు, పక్కనే తోపుడు బళ్లలో ఉన్నవాళ్లకు, ఇడ్లీ కొట్టు పెట్టుకున్న వాళ్లకు, శ్రమజీవులకు తోడుగా ఉంటూ ఓ చేదోడు, ఓ తోడు అనే పథకం అందిస్తున్నాం. లాయర్లకు ఒక లా నేస్తం. ఇలా పేదలకు తోడుగా ఉంటూ.. స్వయం ఉపాధి రంగంలో ఇంత మందికి తోడుగా ఉంటున్న పరిస్థితి గతంలో ఎప్పుడైనా జరిగాయా?. ఈ పథకాలు గతంలో ఉండేటివా?..ఏ పేదవాడు అప్పులు పాలవ్వకూడదని.. ఏ పేదవాడు వైద్యం అందక ఇబ్బంది పడకూడదు.. వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఆరోగ్యశ్రీని విస్తరించాం. ఏ పేదవాడికి అయినా వైద్యం కోసం 25 లక్షల దాకా ఉచితంగా వైద్యం. రెస్ట్ పీరియడ్‌లో పేదవాడికి ఆరోగ్య ఆసరా. పేదవాడికి అండగా గ్రామంలోనే విలేజ్ క్లినిక్. గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్. ప్రతీ ఇంటిని జల్లెడ పడుతూ.. ఇంటికే ఆరోగ్య సురక్ష. ఇంతగా ఆరోగ్యం మీద దృష్టి పెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందా?.వీటన్నింటితో పాటు ఏ గ్రామానికి వెళ్లినా కూడా.. 600 రకాల సేవలు అందించే సచివాలయం. ఏ గ్రామానికి వెళ్లినా.. 60-70 ఇళ్లకు ఒక వలంటీర్‌తో కూడిన వ్యవస్థ. నాలుగు అడుగులు ముందుకు వేస్తే రైతన్నను చేయి పట్టుకు నడిపిస్తూ ఓ ఆర్బీకే. మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే ప్రతి పేదవాడికీ వైద్యంపరంగా అండగా ఉంటూ విలేజ్ క్లినిక్. ఇంకో నాలుగు అడుగులు ముందుకు వేస్తే నాడునేడు ద్వారా బాగుపడ్డ ఇంగ్లీష్ మీడియం బడి. గ్రామానికే ఫైబర్ గ్రిడ్, గ్రామంలోనే డిజిటల్ లైబ్రరరీ. ఇవన్నీ కాక గ్రామంలోనే నా అక్కచెల్లెమ్మల రక్షణ కోసం మహిళా పోలీస్. అక్కచెల్లెమ్మల ఫోన్లో దిశ యాప్. ఈ పథకాలు, ఈ మార్పులు, ఈ లంచాలు.. వివక్ష లేని పాలన గతంలో జరిగిందా?.. అక్కచెల్లెమ్మలకు, అవ్వాతాతలకు అండగా నిలిచిన పాలన ఇది. ఆలోచన చేయండి.మరో పక్క చంద్రబాబునే గమనించండి. పద్నాలుగేళ్లు సీఎంగా చేసిన వ్యక్తి.. ఆయన పేరు చెబితే ఒక్కటంటే ఒక్కటైనా పథకం లేదు. ఆయన పాలన ఎలా ఉండేదో గమనించండి. చంద్రబాబు అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు మోసాలు. అధికారం తప్పితే.. ఆయన మాయలు, ఆయన మోసాలు ఎలా ఉంటాయో. ఈ పాంప్లెట్ గుర్తుకు తెచ్చుకోండి. 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు.. ఇదే ముగ్గురితో కలిసి కూటమిగా ఏర్పడ్డాడు. ఈ ఫాంప్లెట్‌ను ముఖ్యమైన హామీలంటూ స్వయంగా సంతకం పెట్టి పంపించాడు. 2014-19 మధ్య ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఈ పాంప్లెట్లో చెప్పినవి ఒక్కటైనా జరిగాయా? నేను మిమ్మల్ని అడుగుతాను మీరే సమాధానం చెప్పండి.రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నారు. మరి రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీ అయ్యాయా? రెండో హామీ.. పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నారు. మరి రూ.14,205 కోట్లు పొదుపు సంఘాల రుణాల్లో.. ఒక్క రూపాయైనా మాఫీ చేశారా?. ఆలోచన చేయండి. మూడో హామీ.. ఆడ బిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు మీ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నారు. నేను అడుగుతున్నా.. రూ.25 వేల కథ దేవుడెరుగు.. ఏ ఒక్కరి అకౌంట్లలో అయినా ఒక్క రూపాయి అయినా వేశారా?. నాలుగో ముఖ్యమైన హామీ.. ఇంటింటికీ ఉద్యోగం.ఉద్యోగం ఇవ్వకపోతే రూ.2 వేలు నిరుద్యోగ భృతి ప్రతి నెలా అన్నారు. ఐదేళ్లు అంటే 60 నెలలు, నెలకు రెండు వేలు చొప్పున ప్రతి ఇంటికీ రూ.1,20,000 ఇచ్చారా?. ఐదో హామీ.. అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. మీ అందరినీ కూడా నేను అడుగుతున్నాను. ఇన్ని వేల మంది ఇక్కడున్నారు కదా. చంద్రబాబు హయాంలో చంద్రబాబు మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. రూ.10,000 కోట్లతో బీసీ సబ్‌ప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ అన్నాడు జరిగిందా?. విమెన్ ప్రొటెక్షన్ ఫోర్సు ఏర్పాటు చేస్తామన్నాడు చేశాడా? సింగపూరుకు మించి అభివృద్ధి చేస్తామన్నాడు చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు జరిగిందా? ఒక్కటంటే.. ఒక్క హామీ నెరవేరిందా?. పోనీ ప్రత్యేక హోదా అయినా ఇచ్చాడా? దాన్నీ అమ్మేశాడు. మరి నేను అడుగుతున్నాను. ఇలాంటి వాళ్లను నమ్మొచ్చా? ఆలోచన చేయండి.మళ్లీ.. కొత్త మేనిఫెస్టో డ్రామా. మళ్లీ ఇదే ముగ్గురూ. మళ్లీ చంద్రబాబూ.. సూపర్ సిక్స్ అంట. నమ్ముతారా?, సూపర్ సెవెన్ అంట. నమ్ముతారా?. ఇంటింటికీ కేజీ బంగారం అంట. నమ్ముతారా?. ఇంటింటికీ బెంజికారు అంట. నమ్ముతారా?. మరి ఆలోచన చేయమని అడుగుతున్నా అని సీఎం జగన్ ప్రసంగించారు.
వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
సాక్షి, అమరావతి: వైఎస్ వివేకా హత్య కేసులో నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, సునీత, సీబీఐ అధికారి రాంసింగ్‌కు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగలింది. వీరు వేసిన క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది.కేసు పూర్వపరాలేంటీ? మాజీ మంత్రి వివేకానంద రెడ్డికి పీఏగా పనిచేసిన కృష్ణారెడ్డి 2021 డిసెంబర్లో పులివెందుల కోర్టులో ఒక ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. వివేకా హత్య కేసుకు సంబంధించి కొందరు తనను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో అవినాష్ రెడ్డి, శంకర్ రెడ్డి, భాస్కర్‌రెడ్డి పేర్లు చెప్పాలంటూ సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్ ఒత్తిడి చేస్తున్నారని కోర్టుకు తెలిపారు. వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆరోపణలకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలంటూ ఒత్తిడి చేశారని ఆరోపించారు. కృష్ణా రెడ్డి ఫిర్యాదుపై పులివెందుల కోర్టు 2023 డిసెంబర్ 8న విచారణ జరిపింది. కేసు నమోదు చేసి తుది నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో పోలీసులు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, సునీత, రాంసింగ్‌పై కేసులు నమోదు చేసింది. ఈ కేసును కొట్టేయాలంటూ సునీత, ఆమె భర్త రాజశేఖర్, ఎస్పీ రామ్‌సింగ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు.హైకోర్టు ఏం చెప్పింది?వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి పెట్టిన కేసును కొట్టేయాలన్న సునీత, రాజశేఖర్ రెడ్డి, రాంసింగ్ వాదనలను ఏపీ హైకోర్టు అంగీకరించలేదు. వీరు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. చదవండి : నర్రెడ్డి సునీత, రాజశేఖర్‌రెడ్డి చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలుకృష్ణారెడ్డి ఏం చెబుతున్నారు? "వివేకానందరెడ్డి హత్య కేసులో సునీత దంపతుల పాత్ర అనుమానస్పదంగా ఉంది. ఈ హత్య సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి కుట్ర అని భావిస్తున్నాను. వారిద్దరితోపాటు శివప్రకాశ్‌రెడ్డిల తీరు సందేహాస్పదంగా ఉంది. వివేకా రెండో పెళ్లితోనే ఆ కుటుంబంలో తీవ్ర విభేదాలు తలెత్తాయి. రెండో భార్య షమీమ్‌కు ఆస్తిలో వాటా ఇవ్వాలని వివేకానందరెడ్డి భావించడంతో హత్య జరిగినట్టు భావిస్తున్నాను. వివేకా లెటర్‌ను దాచిపెట్టమని ఆయన అల్లుడు రాజశేఖర్‌రెడ్డి స్వయంగా చెప్పారు. ఆ తర్వాత కూడా అబద్ధం చెప్పాలని సునీత, రాజశేఖర్‌రెడ్డి నన్ను వేధించారు. ఈ హత్యకు కారణం ఎంపీ అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి పేర్లు చెప్పాలని నాపై ఒత్తిడి తెచ్చారు. పోలీసులు, సీబీఐ అధికారులు చిత్రహింసలకు గురిచేశారు. నేను అబద్ధం చెప్పకపోతే నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి జైలుకు వెళ్లాల్సి వస్తుందని సునీత అన్నారు. దస్తగిరి అప్రూవర్‌గా మారడం వెనుక పక్కా కుట్ర ఉంది. అవినాశ్‌రెడ్డిని ఎంపీగా గెలిపించడం కోసం చివరి వరకూ వివేకా కృషి చేశారు" అని వివేకా పీఏ కృష్ణారెడ్డి వెల్లడించారు.చదవండి : వైఎస్ వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి ఇంటర్వ్యూ పూర్తి పాఠం
May 10th: ఏపీ ఎన్నికల సమాచారం
ఏపీ ఎన్నికలకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం..
ఢిల్లీ హైకోర్టు: కవిత బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
సాక్షి, ఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణను మే 24వ తేదీకి ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది. కవిత బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి కోర్టు నోటీసులు జారీ చేసింది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం విచారణ జరిపింది.తనకు బెయిల్ నిరాకరిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుని హైకోర్టులో కవిత సవాల్ చేసింది. లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో తనకు వ్యతిరేకంగా ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారని,కేసు వాస్తవాలు పరిశీలించి తనకు అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్లో కవిత పేర్కొంది. తనకు పలు అనారోగ్య సమస్యలు ఉన్నాయని పిటిషన్లో ఆమె ప్రస్తావించింది.హైపర్ టెన్షన్, గైనిక్ సమస్యలకు చికిత్స అవసరమని పిటిషన్ లో కవిత కోరారు. తాను జైల్లో ఉండడం వల్ల మైనర్ కుమారుడు షాక్ లో ఉన్నాడని పిటిషన్లో వెల్లడించారు.1149 పేజీలతో కవిత న్యాయవాదులు హైకోర్టులో బెయిల్ అప్లికేషన్ వేశారు. త్వరితగతిన తన పిటిషన్ పై విచారణ జరపాలని కవిత తన పిటిషన్లో పేర్కొన్నారు.
డీబీటీ లబ్ధిదారులతో టీడీపీ ముఠా చెలగాటం
సాక్షి, విజయవాడ: డీబీటీ లబ్ధిదారులతో టీడీపీ ముఠా చెలగాటమాడుతోంది. లబ్ధిదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయనీయకుండా ఈసీపై ఒత్తిళ్లు చేస్తోంది. ఈసీ ఉత్తర్వులను ఇవాళ్టి వరుకూ నిలుపుదల చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. నిన్న అర్థరాత్రి హైకోర్టు తీర్పు ఉత్తర్వులు అందుబాటులోకి వచ్చాయి.హైకోర్టు తీర్పు కాపీతో ఈసీని అధికారులు సంప్రదించారు. క్లారిఫికేషన్ కోసం ఈసీని అధికారులు కోరగా, ఇప్పటివరకూ ఈసీ ఎలాంటి క్లారిఫికేషన్ ఇవ్వలేదు. ఎన్నికల సంఘం పరిధిలో పనిచేస్తున్నందున ఎన్నికల కమిషన్ క్లారిఫికేషన్ ఇస్తే తప్ప ముందుకు వెళ్లలేమని అధికారులు అంటున్నారు. ఈసీ క్లారిఫికేషన్ ఆలస్యమైతే హైకోర్టు ఇచ్చిన గడువు ముగిపోతోందని లబ్ధిదారుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.హైకోర్టు ఉత్తర్వులను అడ్డుకునేందుకు మరో వైపు కోర్టులో టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. నవతరం పార్టీ తరఫున పరోక్షంగా కోర్టులో టీడీపీ అప్పీల్ వేసింది. తమకు ఫిర్యాదులు వచ్చినందునే పథకాలను నిలిపేశామని ఈసీ పేర్కొనగా, దీంతో టీడీపీ బాగోతం బయటపడింది.
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్
సాక్షి, అమరావతి/వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): రాష్ట్రంలో చాలాకాలంగా డిమాండ్ చేస్తున్న కాపు రిజర్వేషన్లతో పాటు ముస్లిం రిజర్వేషన్లు అసలు అవసరమేలేదంటూ జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఆ రిజర్వేషన్లనే ఆయన వ్యతిరేకిస్తూ పరోక్షంగా పలు వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంగ్లిష్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ముస్లిం రిజర్వేషన్ల అంశంలో ఇటీవల బీజేపీ జాతీయ నేతలు చేస్తున్న ప్రకటనలకు జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ పూర్తి మద్దతు ప్రకటించడంతో పాటు కోరుకునే వారందరికీ రిజర్వేషన్లు కల్పించడం సాధ్యమేకాదని తన మనస్సులోని మాటను కుండబద్దలు కొట్టారు. ఈ రిజర్వేషన్లకు ప్రత్యామ్నాయ మార్గాలు గురించి ఆలోచన చేయాలన్నారు. ఆ ఇంటర్వ్యూలో సంబంధిత మీడియా ఛానల్ ప్రతినిధి.. ముస్లింలకు సంబంధించి బీజేపీ వైఖరి గురించి పవన్‌ను ప్రశ్నించినప్పుడు, బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం కాదని వ్యాఖ్యానించారు. కానీ, వాళ్లు (బీజేపీ) ముస్లిం రిజర్వేషన్లు అమలుచేయబోమని ఆ పార్టీ నేతలు నేరుగా చెబుతున్నారు కదా.. దానిపై మీరేమీ నిరాశ చెందడంలేదా అన్న ప్రశ్నకు పవన్ బదులిస్తూ.. ముస్లిం రిజర్వేషన్లపై బీజేపీ నేతల ప్రకటనలపట్ల తానేమీ నిరాశ, ఆందోళన చెందడంలేదని చెప్పారు. అయినా, రిజర్వేషన్ల అమలుకన్నా యువతకు ఉపాధి అవకాశాలు, నైపుణ్యాలు పెంచేలా వివిధ అంశాల్లో శిక్షణ ఇవ్వాలని సూచించారు.అందరికీ రిజర్వేషన్లు కూడా కుదరదు..రిజర్వేషన్లు కావాలని కోరుకుంటున్న అన్ని వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలన్నా సాధ్యమయ్యే పరిస్థితి కాదని పవన్ తేల్చిచెప్పారు. ప్రత్యేకంగా తమ సొంత (కాపు) కులం కూడా రిజర్వేషన్ల కోసం కొన్ని దశాబ్దాలుగా పోరాటం చేస్తోందన్నారు. అందరికీ రిజర్వేషన్లు ఇవ్వాలన్నా కుదరదని.. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని సుప్రీంకోర్టు స్పష్టంచేసిందని పవన్ గుర్తుచేశారు. రిజర్వేషన్లు ఇవ్వడానికి సాధ్యంకానప్పుడు, ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఆలోచించాలని ఆయన చెప్పారు.జగన్ ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదు మరోవైపు.. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం విజయవాడలో పవన్ పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ.. రాష్ట్రంలోని యువకుల గళాన్ని అసెంబ్లీలో బలంగా వినిపిస్తానన్నారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదన్నారు. మైనార్టీల ప్రాథమిక హక్కులకు తాను అండగా ఉంటానని.. కాపులకు రిజర్వేషన్లను అడుగుతున్నారని, న్యాయస్థానాల్లో ఉన్న అంశాలపై తాము మాట్లాడకూడదంటూ ఇంగ్లీష్ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూకు భిన్నంగా మాట్లాడారు. ఇక ఇక్కడ తాను పెంచి పెద్దచేసిన నాయకుడు తనపై విమర్శలు చేస్తూ తిటడం బాధ కలిగిస్తోందని పోతిన మహేష్ పేరు ప్రస్తావించకుండా వ్యాఖ్యానించారు. అలాగే, వంగవీటి రాధా చట్టసభలకు వెళ్తానంటే తాను అండగా ఉంటానని పవన్ చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని, పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనాచౌదరి, నాయకులు వంగవీటి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.Video Credits: NDTV
అభివృద్ధి లేదంటూ అసత్య ప్రచారం.. కారణం ఇదే..
ఆంధ్రప్రదేశ్‌లో 2014 నుంచి 2019 దాకా కనపడని ఎన్నో అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలు ఆ తర్వాత ఒకటొకటిగా కళ్లకు కడుతున్నాయి. కరోనా లాంటి అనూహ్య ఉత్పాతం దాదాపు రెండేళ్ల కాలాన్ని మింగేసినా.. కేవలం మూడేళ్ల కాలంలోనే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, కొన్ని కొనసాగుతుండగా కొన్నింటిని పూర్తి చేయడం జరిగింది. అయినప్పటికీ తెలుగుదేశం ఆ పార్టీ మద్దతుదారులు ‘అభివృద్ధి లేదు’ అనే మాటనే గోబెల్స్‌ను తలదన్నేలా ప్రచారం చేస్తున్నారు. దీనికి కారణం ఏమిటి?ఏ ప్రభుత్వం మీదనైనా పోరాటం చేయాలంటే పేదల సమస్యలనే ప్రతిపక్షాలు తలకెత్తుకోవడం సర్వసాధారణం. పేదరికం పెరిగిందనో..పేదలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేకపోయిందనో, పేదల బ్రతుకులు దుర్భరంగా మారాయనో..విమర్శలతో ఇరుకునపెట్టడం సహజం. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షాలు ఆ పనికి బదులు.. అభివృద్ధి లేదు అంటూ సరికొత్త రాగం ఆలపించడానికి కారణం.. ఈ పాలనలో పేదలకు అన్యాయం జరిగింది అంటే నమ్మేవారు లేకపోవడం.ఇప్పుడు బడుగువర్గాల నుంచి జగన్ ప్రభుత్వంపై ఎటువంటి ఫిర్యాదులు రాకపోవడం, పథకాలు అందడం లేదనో, పక్కదారి పడుతున్నాయనో, ఇబ్బందుల్లో ఉన్నామనో ఉద్యమాలు, ఆందోళనలు వారు చేపట్టకపోవడం.. అడగకుండానే అన్నీ అమర్చిపెడుతున్న వైఎస్ జగన్ పాలన నిరుపేదలకు ఎక్కడ లేని భరోసా ఇచ్చింది. దీంతో పేదల్ని వంచించే, మాటలతో రెచ్చగొట్టి ప్రభుత్వంపై ఉసిగొల్పే ప్రయత్నాలు ఫలించవని ప్రతిపక్షాలకు పూర్తిగా అర్ధమైంది. తత్ఫలితంగానే అభివృద్ధి లేదు అంటూ ఈ ఆరున్నొక్కరాగాలు.నాడు ‘కట్టుబట్టలతో’ కల్లబొల్లి కబుర్లు తప్ప అభివృద్ధి ఏదీ..ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు పాలించిన కాలం ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. ఆ సమయంలో ఎప్పుడు చూసినా ఆయన నోటి వెంట వచ్చే కొన్ని రొడ్డకొట్టుడు వ్యాఖ్యల్లో ‘లోటుబడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని మనకు ఇచ్చారు.. మనల్ని కట్టుబట్టలతో తరిమేశారు. మనకు రాజధాని లేదు. ఇప్పటికి 26 సార్లు ఢిల్లీకి వచ్చాను అయినా ఫలితం లేదు’. ఇవేగా ఆయన తాను ఇచ్చిన రైతు రుణమాఫీ, నిరుద్యోగభృతి.. వగైరా హామీల్ని ఎగవేయడం కోసమే ముందస్తుగా ఇలాంటివన్నీ పాడిందే పాట అన్నట్టు వినిపించేవారు.అలాంటి అబద్ధాలతోనే ఐదేళ్ల పాటు పనికిరాని పాలన సాగించారు. తన హయంలో దాదాపుగా 2.50లక్షల కోట్ల అప్పులు చేసి కూడా ఇచ్చిన హామీల్లో పావుశాతం కూడా అమలు చేయలేదు. ఒక్కటంటే ఒక్కటి కూడా అభివృద్ధి కార్యక్రమం పూర్తి చేసిందీ లేదు. కొత్త రాజధాని పేరుతో రకరకాల డ్రామాలు ఆడారే తప్ప రాజధాని కాదు కదా అక్కడ ఒక్కటంటే ఒక్క శాశ్వత భవనం కూడా కట్టలేకపోయారు.చంద్రబాబులా ఏడుపులు పెడబొబ్బలు లేవు..ఖాళీ ఖజానాకి తోడు రూ.లక్షల కోట్ల రుణభారం ఉన్న రాష్ట్రాన్ని చంద్రబాబు తన తదుపరి ముఖ్యమంత్రికి అందించి వెళ్లారు. తొలిసారి ముఖ్యమంత్రిగా అంత పెద్ద బాధ్యతలు తలకెత్తుకున్నా.. తొణకకుండా బెణకకుండా వైఎస్ జగన్ పాలనను పరుగులు పెట్టించారు. గద్దెనెక్కిన కొన్ని నెలలకే కరోనా మహమ్మారి వచ్చి మీద పడింది. అయినా ఎక్కడా అదరలేదు బెదరలేదు. ఎందరు శ్రేయోభిలాషులు చెప్పినా కరోనా సమయంలో కూడా పథకాలను ఆపలేదు. కట్టుబట్టలతో వచ్చాం, మన పరిస్థితి బాగోలేదు అంటూ చంద్రబాబులాగా ఏ రోజూ రాష్ట్ర ప్రజలను భయపెట్టేలా మాట్లాడలేదు. చుట్టూ సమస్యల్ని ఎదుర్కుంటూనే ఇచ్చిన ప్రతీ హామీని తూచా తప్పకుండా అమలు చేయాలనే సంకల్పంతో ముందుకు సాగారు.ఓ వైపు సరికొత్త శైలి సంక్షేమ పధాన్ని అనుసరిస్తూనే మరోవైపు మూలాల నుంచి అభివృద్ధికి బాటలు వేశారు. ఇప్పుడు వైఎస్ జగన్ పాలనా ఫలాలు ప్రతీ చోటా కళ్లకు కడుతున్నాయి. గ్రామసెక్రటేరియల్స్ కావచ్చు, రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, వైద్య కళాశాలలు కావచ్చు, ఫిషింగ్ హార్బర్స్ కావచ్చు.. చంద్రబాబు పాలనలో కనపడని ఎన్నో అభివృద్ధి సూచికలు ఆంధ్రప్రదేశ్‌లో కళ్లకు కడుతున్నాయి.పదేపదే అదే మాట అందుకే..ఓం భూం హాం ఫట్ అంటే ప్రత్యక్షమైపోవడానికి పైన పేర్కొన్నవేవీ ఇంద్రజాల టక్కుటమార ఫలితాలు కావు. ఎంతో దూరదృష్టితో ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ప్రజల మేలు కోసం కళ్ల ముందుకు తెచ్చిన బంగారు భవిష్యత్తు దీపికలు. అయినప్పటికీ అభివృద్ధి లేదనే పాచిపాట ఎందుకు పాడుతున్నారంటే.. పల్లెల్లో జరిగే అభివృద్ధి పనులు కావచ్చు, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు కావచ్చు.. ఇవన్నీ కళ్లారా చూసి పాలనను బేరీజు వేసుకునేంత తీరిక ఓపిక ప్రజలకు ఉండదని సో.. చంద్రబాబు అండ్ ఎల్లో మీడియా ప్రచార ప్రభావానికి వీరు లోనవుతారనేదే ఈ అభివృద్ధి లేదనే ప్రచారం వెనుక దాగున్న కుయుక్తి.అయితే గతంలోలాగ ఏది పడితే అది నమ్మే అవసరం, పరిస్థితి ఇప్పుడు లేదు. ప్రజల్లో రాజకీయాలపై, నేతల పాలనా దక్షతపై అవగాహన పెరిగింది. ప్రతీ అంశాన్నీ నిశితంగా పరిశీలిస్తున్నారు. చంద్రబాబు– వైఎస్ జగన్ పాలనలోని వ్యత్యాసాలను బేరీజు వేసుకునేందుకు వీలుగా వారికి ఇప్పుడు ఎన్నో రకాల మాధ్యమాలు అందుబాటులోకి వచ్చాయి. అవే చంద్రబాబు నాయుడు అండ్ ఎల్లో మీడియా గోబెల్స్ ప్రయత్నాలను నీరుగారుస్తున్నాయి. నిజాలను నిర్ద్వంద్వంగా గెలిపించనున్నాయి.–సత్యార్థ్.
ద్రవిడ్ గుడ్ బై!.. టీమిండియా కొత్త కోచ్‌గా ఫారినర్?.. జై షా కామెంట్స్ వైరల్
టీ20 ప్రపంచకప్-2024 తర్వాత టీమిండియా హెడ్‌కోచ్ మారబోతున్నాడా? అంటే అవుననే అంటున్నాడు భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా. కొత్త కోచ్‌గా భారతీయ క్రికెటర్ లేదంటే విదేశీ ఆటగాడైనా రావొచ్చని సంకేతాలు ఇచ్చాడు.కాగా పొట్టి వరల్డ్‌కప్-2021 తర్వాత రవిశాస్త్రి స్థానంలో మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ టీమిండియా హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అతడి మార్గదర్శనంలో అన్ని ఫార్మాట్లలో ప్రపంచ నంబర్ వన్‌గా నిలిచిన భారత జట్టు ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేకపోయింది.టైటిల్ పోరులో రాణించలేకటీ20 ప్రపంచకప్-2022లో సెమీస్‌లోనే ఇంటిబాట పట్టిన రోహిత్ సేన.. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23, వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీల్లో ఫైనల్ చేరినా టైటిల్ గెలవకలేకపోయింది. ఆఖరి మెట్టుపై ఆస్ట్రేలియా చేతిలో బోల్తాపడి ట్రోఫీని చేజార్చుకుంది.ఇదిలా ఉంటే.. వాస్తవానికి భారత్ వేదికగా ప్రపంచకప్-2023 పూర్తయ్యేనాటికి రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం పూర్తైంది. ఈ క్రమంలో టీ20 వరల్డ్‌కప్ వరకు ద్రవిడ్‌ను కోచ్‌గా కొనసాగాల్సిందిగా బోర్డు కోరడంతో అతడు సమ్మతించినట్లు వార్తలు వచ్చాయి.ద్రవిడ్ గుడ్‌బై/ ద్రవిడ్‌కు గుడ్‌బై?అయితే, తాజా సమాచారం ప్రకారం ద్రవిడ్ తన పదవీకాలాన్ని పొడిగించుకునేందుకు సుముఖంగా లేనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బీసీసీఐ కొత్త కోచ్ వేటలో పడింది. ఇందుకు సంబంధించి త్వరలోనే ప్రకటన విడుదల చేయనుంది.ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా స్వయంగా వెల్లడించాడు. ఈ మేరకు.. ‘‘రాహుల్ పదవీ కాలం జూన్ వరకు పూర్తవుతుంది. ఒకవేళ అతడు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని భావిస్తే.. అప్లై చేసుకోవచ్చు. ఆ స్వేచ్ఛ అతడికి ఉంది.కొత్త కోచ్‌గా ఫారినర్?ఇక కొత్త కోచ్ ఇండియన్ లేదంటే ఫారినర్ అన్న విషయం గురించి ఇప్పుడే చెప్పలేం. క్రికెట్ అడ్వైజరీ కమిటీ నిర్ణయానుసారమే కోచ్ నియామకం జరుగుతుంది’’ అని జై షా క్రిక్‌బజ్‌తో వ్యాఖ్యానించాడు.అలాంటిదేమీ లేదు!అదే విధంగా.. భిన్న ఫార్మాట్లకు భిన్న కోచ్‌ల గురించి ప్రస్తావన రాగా.. ‘‘ఈ విషయంలో కూడా క్రికెట్ అడ్వైజరీ కమిటీదే తుది నిర్ణయం. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రిషభ్ పంత్.. ఇలా చాలా మంది మూడు ఫార్మాట్లలో ఆడుతున్న క్రికెటర్లు ఉన్నారు. కానీ కోచ్‌ల విషయంలో అలా జరిగే ఆస్కారం లేదు’’ అంటూ కొట్టిపారేశాడు. చదవండి: రోహిత్ ముంబైని వీడటం ఖాయం.. ఆ తర్వాత అయ్యర్ కెప్టెన్సీలో!
‘సత్య’ మూవీ రివ్యూ
టైటిల్: సత్యనటీనటులు: హమరేశ్, ప్రార్ధన సందీప్, ఆడుగాలం మురుగదాస్, సాయిశ్రీ, అక్షయరచన-దర్శకత్వం: వాలీ మోహన్దాస్నిర్మాత: శివ మల్లాల(తెలుగులో)సంగీతం: సుందరమూర్తి కె.యస్సినిమాటోగ్రఫీ: ఐ.మరుదనాయగంఎడిటర్: ఆర్. సత్యనారాయణవిడుదల తేది: మే 10, 2024(తెలుగులో)ఈ మధ్యకాలంలో తమిళ, మలయాళ సినిమాలను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. అందుకే చిన్న సినిమాలను సైతం తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. కొన్ని సినిమాలను అక్కడ, ఇక్కడ ఒకేసారి రిలీజ్ చేస్తే.. మరికొన్నింటిని అక్కడ రిలీజ్ చేసి హిట్ టాక్ వచ్చిన తర్వాత తెలుగులో విడుదల చేస్తున్నారు. అలా తెలుగులోకి వచ్చిన మరో తమిళ్ సినిమానే సత్య. తమిళ్లో ‘రంగోలి’పేరుతో విడుదలైన ఈ చిత్రం అక్కడ మంచి టాక్ని సంపాదించుకుంది. ఇదే చిత్రాన్ని తెలుగులో సత్య పేరుతో విడుదల చేశాడు ప్రముఖ ఫోటో జర్నలిస్ట్, శివమ్ మీడియా అధినేత శివ మల్లాల. అనువాదం సినిమానే అయినా.. స్టైయిట్ సినిమా మాదిరి ప్రమోషన్స్ గట్టిగా చేయడంతో ‘సత్య’పై బజ్ క్రియేట్ అయింది. మంచి అంచనాల మధ్య నేడు(మే 10) తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సత్య ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.‘సత్య’ కథేంటంటే..సత్యమూర్తి అలియాస్ సత్య(హమరేష్) గాజువాకలోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంటాడు. అతని తండ్రి గాంధీ(ఆడుగలం మురుగదాస్) ఇస్త్రీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. కొడుకుని పెద్ద కార్పొరేట్ కళాశాలలో చదివించాలనేది అతని కోరిక. అప్పు చేసి మరీ కొడుకుని ప్రైవేట్ కాలేజీలో జాయిన్ చేయిస్తాడు. సత్యకు మాత్రం అక్కడ చదువుకోవడం అస్సలు నచ్చదు.తండ్రి కోసమే ప్రైవేట్ కాలేజీకి వెళ్తాడు. అక్కడ తోటి విద్యార్థులు అతన్ని చిన్నచూపు చూస్తూ రకరకాల వివక్షకు గురి చేస్తారు. ఓ గ్యాంగ్‌తో ప్రతి రోజు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. మరోవైపు అదే కాలేజీలో చదువుతున్న పార్వతి అలియాస్ పారు(ప్రార్ధన సందీప్)తో సత్య ప్రేమలో పడతాడు. పారుకి కూడా సత్య అంటే ఇష్టమే కానీ.. బయటకు చెప్పదు. ఓ కారణంగా అందరి ముందు సత్యను లాగిపెట్టి కొడుతుంది. అప్పటి నుంచి సత్య ఆ కార్పొరేట్ కళాశాలలో ఇమడలేకపోతాడు. తన చదువు కోసం ఫ్యామిలీ పడుతున్న కష్టాలను చూసి చలించిపోయి ఓ కీలక నిర్ణయం తీసుకుంటాడు. ఆ కీలక నిర్ణయం ఏంటి? పార్వతితో ప్రేమలో పడిన తర్వాత సత్య జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి? కొడుకును కార్పొరేట్ కళాశాలలో చదివించేందుకు గాంధీ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? చివరికి సత్య తన చదువును కార్పొరేట్ కళాశాలలో కొనసాగించారా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..స్కూల్, కాలేజీ లవ్‌స్టోరీలు తెలుగు తెరకు కొత్తేమి కాదు. ఈ కాన్సెప్ట్‌తో గతంలో చాలా సినిమాలు వచ్చాయి.. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. సత్య మూవీ కాన్సెప్ట్ కూడా అదే. కాలేజీ నేపథ్యంలో సాగే లవ్ స్టోరీ ఇది. అయితే ఈ ప్రేమ కథకి తండ్రి కొడుకుల ఎమోషన్ని యాడ్ చేసి ఫ్రెష్ ఫీలింగ్‌ని తీసుకొచ్చాడు దర్శకుడు. ఫాదర్ అండ్ సన్ ఎమోషన్లో కూడా కొత్తదనం ఉండేలా జాగ్రత్త పడ్డాడు. కొడుకు కోసం పేరెంట్స్.. పెరెంట్స్ కోసం కొడుకు ఆలోచించే విధానం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. కథంతా ఎంటర్టైనింగ్గా సాగిస్తూనే...అంతర్లీనంగా ఓ మంచి సందేశాన్ని అందించారు.ప్రభుత్వ కాలేజీల్లో చదివితే చెడిపోతారనే భయంతో కొంతమంది తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ తమ పిల్లలను ప్రైవేట్ కాలేజీల్లో చేర్పించడం.. ఫీజులు కట్టేందుకు వాళ్లు పడే బాధలు, కష్టాలను ఇందులో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఆ సన్నివేశాలకు చాలా మంది కనెక్ట్ అవుతారు. తండ్రి కొడుకుల మధ్య జరిగే సంభాషణలు మనసును తాకుతాయి. అయితే దర్శకుడు ప్రతీది డైలాగ్స్ రూపంలో చెప్పకుండా..విజువల్స్ రూపంలో చూపిస్తూ ప్రేక్షకుడే దాన్ని అర్థం చేసుకొని ఫీల్ అయ్యేలా చేశాడు. విజువల్ స్టోరీ టెల్లింగ్ ఇందులో బాగా వర్కౌట్ అయింది. దర్శకుడికి తొలి సినిమా అయితే.. కొన్ని సన్నీవేశాలను తెరకెక్కించిన విధానం చూస్తే ఎంతో అనుభవం ఉన్న డైరెక్ట్లా అనిపిస్తాడు. స్క్రీన్‌ప్లే విషయంలో చాలా జాగ్రత్త పడ్డాడు. ప్రభుత్వ కాలేజీ వాతావరణం ఎలా ఉంటుందో తెలియజేస్తూ కథను ప్రాంభించాడు. ఆ తర్వాత హీరో ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్.. కార్పొరేట్ కళాశాలలో చదివించేందుకు వారు పడే కష్టాలు.. ఇలా ఎమోషనల్‌గా కథనం సాగుతుంది. హీరో ప్రైవేట్ కాలేజీలో చేరిన తర్వాత లవ్‌స్టోరీ మొదలవుతుంది. అక్కడ నుంచి కథనం సరదాగా సాగిపోతుంది. కాలేజీలో జరిగే చిన్న గొడవలు, ప్రేమలు, లెక్చరర్ల మందలింపులు ఇవన్నీ ప్రతి ఒక్కరికి తమ కాలేజీ డేస్‌ని గుర్తు చేస్తుంది. ఇంటర్వెల్ సీన్ ద్వితియార్థంపై ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్‌లో తండ్రి కొడుకుల మధ్య వచ్చే ఎమోషన్స్ సీన్స్ హృదయాలను హత్తుకుంటాయి. క్లైమాక్స్ ఆకట్టుకుంది. కథనం కాస్త స్లోగా సాగినా.. ఎక్కడా బోర్ కొట్టదు. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే కచ్చితంగా ఆకట్టుకుంటుంది. ఎవరెలా చేశారంటే..సత్యగా హమరేష్ చాలా బాగా నటించారు. పేద కుటుంబానికి చెందిన యువకునిగా ఎంతో ఎమోషన్ చూపించారు. అలాగే ప్రభుత్వ కళాశాలలో చదివిన విద్యార్థి… ఉన్నట్టుండి కార్పొరేట్ కళాశాలకు వెళితే… అక్కడ తోటి విద్యార్థులతో ఎదురయ్యే సమస్యలు, లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడే ఓ సాధారణ కుర్రాడిగా బాగా నటించారు. భవిష్యత్తులో మంచి నటుడుగా రాణించే అవకాశం ఉంది.పారుగా నటించిన ప్రార్థన తెరపై క్యూట్ గా కనిపించింది. హీరో తండ్రిగా ‘ఆడుకలం’ మరుగదాస్ చక్కగా నటించారు. ఓ ఇస్త్రీ పని చేసుకునే వ్యక్తి ఎలా ఉంటారో… అలా కనిపించి మెప్పించారు. తన కుమారుడితో వచ్చే సీన్స్ లోనూ, భార్యతో వచ్చే సన్నివేశాలు, కూతురుతో రిలేషన్, అలాగే బయటి వ్యక్తులతో వ్యవహరించే తీరు అన్నీ…. ఓ సాధారణ కుటుంబ పెద్ద ఎలా ఉంటారో అలా కనిపించారు. హమరేష్ తల్లి పాత్రలో నటించిన నటి కూడా బాగా నటించారు. అలాగే హమరేష్ అక్కగా నటించిన నటి కూడా పర్వాలేదు అనిపించింది. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. సంగీతం బాగుంది. పాటలు అంతంత మాత్రమే అయినా.. నేపథ్య సంగీతం మాత్రం సినిమా స్థాయిని పెంచేసింది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. డబ్బింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు శివ మల్లాల. అచ్చమైన తెలుగు సినిమా చూసినట్లే ఉంటుంది.- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్
ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన, భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్ల నుండి ప్రేరణ పొంది అద్భుతమైన మరియు వైవిధ్యమైన శ్రేణి సమకాలీన, రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్లు, కస్టమర్లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా, ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్, ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్లెట్లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్ 18కేరట్ మరియు 22కేరట్ బంగారంలో విస్తృతమైన శ్రేణి డిజైన్లతో, నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని సంపూర్ణం చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్లెట్లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.
తప్పక చదవండి
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
- ముద్రగడ మరో లేఖ.. కీలక వ్యాఖ్యలు
- నాకోసం ఆ స్టార్ హీరో నెలలతరబడి వెయిట్ చేశాడు: కమెడియన్
- ఏఐ యూనివర్సిటీ.. ఒడిశా మేనిఫెస్టోలో ఆసక్తికర హామీలు
- అతిపెద్ద ఐటీ కంపెనీ.. సీఈవో జీతం మాత్రం..
- మద్యం మత్తుతో ఓటర్ల చిత్తుకు చంద్రబాబు కుట్ర
- అక్కా నన్ను పెళ్లి చేసుకుంటావా?.. యంగ్ హీరోయిన్‌కు ఉహించని ప్రశ్న!
- జనగణన లేకుండా ఈ లెక్కలేల?
- RCB Vs PBKS: ఆర్సీబీ ఘన విజయం.. ఐపీఎల్ నుంచి పంజాబ్ ఔట్
- మారుతీ స్విఫ్ట్ కొత్త మోడల్
సినిమా
యాచకుడిగా మారిన హీరో..
కొన్ని చిత్రాల టైటిల్స్ ప్రారంభంలోనే హైప్ తీసుకొస్తాయి. బ్లడీ బెగ్గర్ టైటిల్ కూడా అదే కోవలోకి వస్తుంది. కోలమావు కోకిల, డాన్, బీస్ట్, జైలర్ వంటి చిత్రాలతో స్టార్ దర్శకుడిగా రాణిస్తున్న నెల్సన్ దిలీప్‌కుమార్ ఈ మూవీతో నిర్మాతగా మారుతున్నారు. ఫిలమెంట్ ఫిక్చర్స్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి తన శిష్యులును, ఇతర ప్రతిభావంతులైన నూతన దర్శకులను ప్రోత్సహించనున్నారు. బ్లడీ బెగ్గర్వారితో కలిసి మంచి కథా చిత్రాలను నిర్మించనున్నట్లు ఆయన మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అందులో భాగంగా తొలి ప్రయత్నంగా బ్లడీ బెగ్గర్ అనే చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇందులో కవిన్ కథానాయకుడిగా నటించనున్నారు. ఈ చిత్రం ద్వారా నెల్సన్ వద్ద చాలా కాలంగా పని చేస్తున్న శివబాలన్ ముత్తుకుమార్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. బిచ్చగాడి గెటప్‌లో ఈ చిత్ర టైటిల్ పోస్టర్‌ను దర్శకుడు నెల్సన్, నటుడు రెడిన్ కింగ్స్లీ, కవిన్, శివబాలన్లు నటించిన ఓ ఫన్నీ వీడియో ద్వారా వెల్లడించారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అలాగే బ్లడీ బెగ్గర్ పేరుతో కవిన్ బిచ్చగాడి గెటప్‌లో ఉన్న పోస్టర్ ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇకపోతే కవిన్ హీరోగా నటించిన స్టార్ మూవీ తమిళనాట నేడే (మే 10న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చదవండి: నేరుగా ఓటీటీకి మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలంటే?
నాకోసం ఆ స్టార్ హీరో నెలలతరబడి వెయిట్ చేశాడు: కమెడియన్
తెలుగు వెండితెరపై టాప్ లేడీ కమెడియన్ ఎవరయా? అంటే అందరూ ముక్తకంఠంతో కోవై సరళ అని టక్కున సమాధానమిస్తారు. ఈ మలయాళ నటి హీరోయిన్గా, సహాయ నటిగా, కమెడియన్‌గా అలరించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో యాక్ట్ చేస్తూ కామెడీ క్వీన్‌గా పేరు తెచ్చుకుంది. తాజాగా ఓ షోలో పాల్గొన్న ఆమె ఆసక్తికర విషయాలు పంచుకుంది.అలా మొదలైంది'మూడుముళ్లు సినిమాను తమిళంలో తెరకెక్కించిన దర్శకుడు మా ఇంటి పక్కన ఉండేవారు. ఒకరోజు ఇంటి దగ్గర షూటింగ్ జరగ్గా అందులో నాకు అవకాశమిచ్చారు. ఆ మూవీ సూపర్ హిట్టయింది. అలా నా జర్నీ మొదలైంది. దాదాపు 15 చిత్రాల్లో హీరోయిన్గా చేశాను. 900కు పైగా సినిమాల్లో నటించాను. కోలీవుడ్ నా పుట్టినిల్లయితే టాలీవుడ్ నా మెట్టినిల్లు.పెళ్లెందుకు చేసుకోలేదు?స్వేచ్చ కోసమే నేను పెళ్లి చేసుకోలేదు. కచ్చితంగా వివాహం చేసుకోవాలని రూలేమీ లేదు కదా.. మనం భూమి మీదకు ఒంటరిగా వచ్చాం. ఇక్కడికి వచ్చాకే అన్ని బంధాలు ఏర్పడుతాయి. ఎంతోమంది పిల్లలు ఉన్నప్పటికీ చివరి రోజుల్లో ఒంటరి జీవితాన్ని గడుపుతుంటారు. మనల్ని చూసేందుకు ఒకరుండాలని ఎదురుచూడకూడదు. ధైర్యంగా ముందుకు సాగిపోవాలంతే!తెలుగులో బిజీసతీ లీలావతి సినిమా కోసం కమల్ హాసన్ పక్కన హీరోయిన్గా అవకాశం వచ్చింది. అప్పుడు నేను నమ్మలేదు. తర్వాత కమల్ ఫోన్ చేసి నా డేట్స్ కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. అయితే తెలుగులో బిజీగా ఉన్నానని చెప్తే నాకోసం ఐదు నెలలు వెయిట్ చేశారు. ఆ మూవీ చాలా బాగా వచ్చింది.ఆరోగ్యం బాగోలేదని రూమర్స్ఈ మధ్య నాకు ఆరోగ్యం బాగోలేదని, ఖర్చులకు డబ్బుల్లేక దీన స్థితిలో ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి. మా అక్కవాళ్లందరూ నన్ను ఇంట్లో నుంచి గెంటేశారని కూడా రాసేశారు. కానీ అలాంటివేమీ జరగలేదు. నేను ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నాను. అలాగే నాకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన కూడా లేదు' అని కోవై సరళ చెప్పుకొచ్చింది.చదవండి: అక్కా నన్ను పెళ్లి చేసుకుంటావా?.. హీరోయిన్‌కు ఊహించని ప్రశ్న!
షూటింగ్‌కు ఆటోలో వెళ్లిన స్టార్ హీరోయిన్.. ఎందుకంటే?
ఇటీవల ఎక్కువగా వార్తల్లో ఉండే నిలిచిన హీరోయిన్ శృతిహాసన్. స్టార్ హీరోయిన్గా ఎదిగిన ఆమె.. ఇటీవల తన బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ చేసుకున్నట్లు వార్తలు వైరలయ్యాయి. అయితే ఈ విషయంపై శృతిహాసన్ ఇప్పటి వరకూ స్పందించలేదు. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు కోలీవుడ్ భామ. కాకపోతే ఆమె చేసిన పనికి నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. అదేంటో చూసేద్దాం.అసలు విషయానికొస్తే శృతి హాసన్ ప్రస్తుతం ముంబాయిలో ఉంటున్నారు. అక్కడే ఓ మూవీ షూటింగ్లో పాల్గొంటున్నారు. అయితే షూటింగ్‌కు బయలుదేరిన ఆమె ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. అది ఎంతసేపటికీ క్లియర్ కాకపోవడంతో.. షూటింగ్‌కు ఆలస్యం అవుతుందని శృతిహాసన్ తాను వెళుతున్న కారును పక్కన నిలిపేసి ఆటో ఎక్కి వెళ్లిపోయారు.ఆమె ఆటోలో వెళుతున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. శృతిహాసన్ ఏ చిత్రం షూటింగ్లో పాల్గొంటున్నారో తెలియదు గానీ ఆమె వృత్తి ధర్మానికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలో ఇలాంటి ఘటనే ఆ మధ్య నటుడు అమితాబ్ బచ్చన్ విషయంలోనూ జరిగింది. ఆయన ఇదే విధంగా కారులో వెళ్తూ ట్రాఫిక్‌లో చిక్కుకోవడంతో కారు దిగి వేరే వ్యక్తి బైక్‌లో షూటింగ్ స్పాట్‌కు వెళ్లడం విశేషం.
అక్కా నన్ను పెళ్లి చేసుకుంటావా?.. యంగ్ హీరోయిన్‌కు ఉహించని ప్రశ్న!
ఒక్కోసారి హీరోయిన్లకు విచిత్రమైన సంఘటనలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా అభిమానుల నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు ఏం చెప్పాలో తెలియని అయోమయ పరిస్థితి ఉంటుంది. తాజాగా నటి తాన్యా రవిచంద్రన్‌కు అలాంటి పరిస్థితే ఎదురైంది. ప్రఖ్యాత నటుడు రవిచంద్రన్ మనవరాలైన తాన్యా రవిచంద్రన్.. ఆయన వారసత్వాన్ని తీసుకుని సినీ రంగప్రవేశం చేశారు. ఆమె 2017లో భలే వెళైదేవా అనే చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయమయ్యారు. శశికుమార్ కథానాయకుడిగా నటించిన ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు. అయినప్పటికీ తాన్నా రవిచంద్రన్‌కు అవకాశాలు తలుపు తడుతూనే ఉన్నాయి. అలా బృందావనం, కరుప్పన్, నెంజుక్కు నీతి, మాయోన్, అకిలన్ వంటి చిత్రాల్లో నటించి తనకుంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు.తాజాగా ఆమె రసవాది అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. ఈ సందర్భంగా తాన్యా రవిచంద్రన్ ఓ భేటీలో అభిమానులతో ముచ్చటించారు. వారితో తన చిత్రాల గురించి.. తాను నటించాలనుకుంటున్న పాత్రల గురించి వివరించారు. అదే సమయంలో తనకు ఎదురైన విచిత్రమైన ప్రశ్న గురించి చెప్పారు. ఒకసారి అభిమాని ఒకరు అనూహ్యంగా అక్కా నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగారన్నారు. అతను అడిగిన విధానం తనకు అర్థం కాలేదన్నారు. అక్కా అన్నాడు.. పెళ్లి చేసుకుంటావా? అని సంబంధమే లేకుండా అడిగిన అతని ప్రశ్నకు బదులేం చెప్పాల్లో తనకు అర్థం కాలేదన్నారు. ఇలాంటి ఫన్నీ సంఘటనలు గుర్తొస్తే నవ్వొస్తుందని తాన్యా రవిచంద్రన్ పేర్కొన్నారు. కాగా రసవాది చిత్రం తనకు మంచి పేరు తెచ్చి పెడుతుందనే నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేశారు.
ఫొటోలు
జగన్ కోసం మంగళగిరి సిద్ధం.. జననేతకు బ్రహ్మరథం (ఫొటోలు)
Priyanka Kholgade: స్టైలిష్ లుక్‌లో ప్రియాంక ఖోల్గడే.. పిక్స్ వైరల్ (ఫొటోలు)
Sreemukhi: ఈమె వాయిస్ ముందు డీజే కూడా తక్కువే.. శ్రీముఖి బర్త్‌డే స్పెషల్ (ఫోటోలు)
Mirnalini Ravi: లవ్ గురు బ్యూటీ కొంటె అందాలు (ఫోటోలు)
Tanya Ravichandran Photos: క్యూట్ క్యూట్ అందాలతో అలరిస్తోన్న తాన్య రవిచంద్రన్…(ఫొటోలు)
క్రీడలు
ద్రవిడ్ గుడ్ బై!.. టీమిండియా కొత్త కోచ్‌గా ఫారినర్?.. జై షా కామెంట్స్ వైరల్
టీ20 ప్రపంచకప్-2024 తర్వాత టీమిండియా హెడ్‌కోచ్ మారబోతున్నాడా? అంటే అవుననే అంటున్నాడు భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా. కొత్త కోచ్‌గా భారతీయ క్రికెటర్ లేదంటే విదేశీ ఆటగాడైనా రావొచ్చని సంకేతాలు ఇచ్చాడు.కాగా పొట్టి వరల్డ్‌కప్-2021 తర్వాత రవిశాస్త్రి స్థానంలో మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ టీమిండియా హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అతడి మార్గదర్శనంలో అన్ని ఫార్మాట్లలో ప్రపంచ నంబర్ వన్‌గా నిలిచిన భారత జట్టు ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేకపోయింది.టైటిల్ పోరులో రాణించలేకటీ20 ప్రపంచకప్-2022లో సెమీస్‌లోనే ఇంటిబాట పట్టిన రోహిత్ సేన.. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23, వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీల్లో ఫైనల్ చేరినా టైటిల్ గెలవకలేకపోయింది. ఆఖరి మెట్టుపై ఆస్ట్రేలియా చేతిలో బోల్తాపడి ట్రోఫీని చేజార్చుకుంది.ఇదిలా ఉంటే.. వాస్తవానికి భారత్ వేదికగా ప్రపంచకప్-2023 పూర్తయ్యేనాటికి రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం పూర్తైంది. ఈ క్రమంలో టీ20 వరల్డ్‌కప్ వరకు ద్రవిడ్‌ను కోచ్‌గా కొనసాగాల్సిందిగా బోర్డు కోరడంతో అతడు సమ్మతించినట్లు వార్తలు వచ్చాయి.ద్రవిడ్ గుడ్‌బై/ ద్రవిడ్‌కు గుడ్‌బై?అయితే, తాజా సమాచారం ప్రకారం ద్రవిడ్ తన పదవీకాలాన్ని పొడిగించుకునేందుకు సుముఖంగా లేనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బీసీసీఐ కొత్త కోచ్ వేటలో పడింది. ఇందుకు సంబంధించి త్వరలోనే ప్రకటన విడుదల చేయనుంది.ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా స్వయంగా వెల్లడించాడు. ఈ మేరకు.. ‘‘రాహుల్ పదవీ కాలం జూన్ వరకు పూర్తవుతుంది. ఒకవేళ అతడు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని భావిస్తే.. అప్లై చేసుకోవచ్చు. ఆ స్వేచ్ఛ అతడికి ఉంది.కొత్త కోచ్‌గా ఫారినర్?ఇక కొత్త కోచ్ ఇండియన్ లేదంటే ఫారినర్ అన్న విషయం గురించి ఇప్పుడే చెప్పలేం. క్రికెట్ అడ్వైజరీ కమిటీ నిర్ణయానుసారమే కోచ్ నియామకం జరుగుతుంది’’ అని జై షా క్రిక్‌బజ్‌తో వ్యాఖ్యానించాడు.అలాంటిదేమీ లేదు!అదే విధంగా.. భిన్న ఫార్మాట్లకు భిన్న కోచ్‌ల గురించి ప్రస్తావన రాగా.. ‘‘ఈ విషయంలో కూడా క్రికెట్ అడ్వైజరీ కమిటీదే తుది నిర్ణయం. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రిషభ్ పంత్.. ఇలా చాలా మంది మూడు ఫార్మాట్లలో ఆడుతున్న క్రికెటర్లు ఉన్నారు. కానీ కోచ్‌ల విషయంలో అలా జరిగే ఆస్కారం లేదు’’ అంటూ కొట్టిపారేశాడు. చదవండి: రోహిత్ ముంబైని వీడటం ఖాయం.. ఆ తర్వాత అయ్యర్ కెప్టెన్సీలో!
క్వార్టర్ ఫైనల్లో మనిక ఓటమి
సౌదీ స్మాష్ వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో భారత స్టార్ మనిక బత్రా పోరాటం ముగిసింది. బుధవారం జెద్దాలో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 39వ ర్యాంకర్ మనిక 11–7, 6–11, 4–11, 11–13, 2–11తో ప్రపంచ ఐదో ర్యాంకర్ హినా హయాటా (జపాన్) చేతిలో ఓడిపోయింది. మనిక బత్రాకు 17,000 డాలర్ల (రూ. 14 లక్షల 18 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 350 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
బజరంగ్‌పై యూడబ్ల్యూడబ్ల్యూ వేటు
భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియాపై యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) కూడా సస్పెన్షన్ వేటు వేసింది. ఈ ఏడాది ముగిసేవరకు నిషేధం కొనసాగుతుందని తెలిపింది. పారిస్ ఒలింపిక్స్ ట్రయల్స్ వేదిక వద్ద బజరంగ్ డోప్ టెస్టుకు నిరాకరించడంతో జాతీయ డోపింగ్ నిరోధక ఏజెన్సీ గత నెల 23న బజరంగ్‌పై తాత్కాలిక నిషేధం విధించింది.
జ్యోతి యర్రాజీకి స్వర్ణం
సెర్టోహన్బాష్ (నెదర్లాండ్స్): కొత్త సీజన్‌ను భారత స్టార్ అథ్లెట్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జ్యోతి యర్రాజీ స్వర్ణ పతకంతో ప్రారంభించింది. గురువారం జరిగిన హ్యారీ షుల్టింగ్ గేమ్స్‌లో బరిలోకి దిగిన జ్యోతి మహిళల 100 మీటర్ల హర్డిల్స్ ఈవెంట్లో విజేతగా నిలిచింది. హ్యారీ షుల్టింగ్ గేమ్స్ వరల్డ్ అథ్లెటిక్స్‌లో ‘ఇ’ కేటగిరీ కిందికి వస్తాయి. 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసును విశాఖపట్నంకు చెందిన జ్యోతి 12.87 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఆమె కెరీర్లో ఇది నాలుగో అత్యుత్తమ సమయం. మిరా గ్రూట్ (నెదర్లాండ్స్; 13.67 సెకన్లు) రెండో స్థానంలో, హనా వాన్ బాస్ట్ (నెదర్లాండ్స్; 13.84 సెకన్లు) మూడో స్థానంలో నిలిచారు. పారిస్ ఒలింపిక్స్ అర్హత ప్రమాణ సమయాన్ని (12.77 సెకన్లు) జ్యోతి ఇంకా అందుకోకపోయినా ర్యాంకింగ్స్ ప్రకారం జ్యోతికి ఒలింపిక్ బెర్త్ ఖరారు కానుంది. ప్రస్తుతం ర్యాంకింగ్స్‌లో జ్యోతి 26వ స్థానంలో ఉంది. మొత్తం 40 మంది ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు. ఇందులో 25 మంది అర్హత ప్రమాణ సమయం ఆధారంగా... మరో 15 మంది వరల్డ్ ర్యాంకింగ్ ఆధారంగా అర్హత సాధిస్తారు.
బిజినెస్
ప్రీమియంను మరింత పెంచనున్న బీమా సంస్థలు
ఆరోగ్య బీమా రంగ సంస్థలు పాలసీదారులకు షాకివ్వబోతున్నాయి. గతేడాదిగా పాలసీ ప్రీమియంను దాదాపు 50 శాతం వరకు పెంచిన సంస్థలు..మరోసారి పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. బీమా నియంత్రణ మండలి ఐఆర్డీఏఐ తీసుకున్న కొన్ని నిర్ణయాలతో ప్రీమియం ఛార్జీలు పెంచకతప్పడం లేదని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి.గడిచిన ఆర్థిక సంవత్సరంలో ప్రీమియం 25 శాతం నుంచి 50 శాతం వరకు పెరగగా..వచ్చే కొన్ని నెలల్లో మరో 10 శాతం నుంచి 15 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని లోకల్‌సర్కిల్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఈ సర్వేలో 11 వేల మంది పాల్గొన్నారు. వీరిలో 21 శాతం మంది ప్రీమియం 50 శాతం వరకు పెరిగినట్లు వెల్లడించగా..31 శాతం మంది 25-50 శాతం వరకు పెరిగాయని తెలిపారు.ప్రీమియం అధికమవడంతో సామాన్యులు ఆరోగ్య పాలసీ తీసుకోవడానికి ఆసక్తి చూపడంలేదు. 2022లో 62 శాతంగా ఉన్న పాలసీదారులు 2023లో 52 శాతానికి తగ్గారు. మరోవైపు, గత ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్య బీమా కంపెనీలు రికార్డు స్థాయిలో లాభాలు పొందుతున్నాయి. వాటి సరాసరి వార్షిక వృద్ధిరేటు 20 శాతంగా నమోదవుతుంది. కరోనాతో ఆరోగ్య బీమా పాలసీలు తీసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ, క్రమంగా తగ్గుతోంది.
అతిపెద్ద ఐటీ కంపెనీ.. సీఈవో జీతం మాత్రం..
దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సీఈవో, ఎండీ కృతివాసన్ 2024 ఆర్థిక సంవత్సరంలో వార్షిక పరిహారంగా రూ. 25.36 కోట్లు తీసుకున్నారు. అతిపెద్ద ఐటీ కంపెనీల సీఈవోల జీతాల్లో ఇదే అత్యంత తక్కువ కావడం గమనార్హం.ఆసక్తికరంగా, బయటకు వెళ్తున్న చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎన్జీ సుబ్రమణ్యం ఇదే సంవత్సరంలో సీఈవో కృతివాసన్ కంటే ఎక్కువ వేతనం అందుకున్నారు. అయితే, సీఈఓగా కృతివాసన్ జీతం 10 నెలల కాలానికి కాగా, సుబ్రమణ్యం వేతనం పూర్తి సంవత్సరానికి. కృతివాసన్ 2023 జూన్ 1న రాజేష్ గోపీనాథన్ నుండి సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. రాజీనామా చేయడానికి ముందు రెండు నెలల స్వల్ప వ్యవధిలో గోపీనాథన్ రూ. 1.1 కోట్లు అందుకున్నారు. అంతకు ముందు ఏడాది అంటే 2023 ఆర్థిక సంవత్సరంలో ఆయన రూ. 29.16 కోట్లు అందుకున్నారు.కృతివాసన్ వేతన పరిహారంలో ప్రాథమిక జీతం, ఇతర ప్రయోజనాలు, అలవెన్సులు, కమీషన్ ఉన్నాయి. టీసీఎస్ వార్షిక నివేదిక ప్రకారం, 2024 ఆర్థిక సంవత్సరంలో ఆయన రూ.21 కోట్ల కమీషన్ అందుకున్నారు. కంపెనీలో కృతివాసన్‌కి 11,232 స్టాక్‌లు ఉన్నప్పటికీ వేతన పరిహారంలో ఎంప్లాయి స్టాక్ పర్చేజ్ స్కీమ్ (ESPS) ఉండదు.2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇతర ఐటీ సంస్థలు తమ వార్షిక నివేదికలను ఇంకా విడుదల చేయలేదు. 2023 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ రూ. 56 కోట్ల వార్షిక రెమ్యునరేషన్ ప్యాకేజీని పొందారు. ఐటీ కంపెనీ సీఈవోల జీతాల్లో ఇదే అత్యధికం. ఈయన తర్వాత విప్రో సీఈఓ శ్రీనివాస్ పల్లియా సుమారు రూ. 50 కోట్ల అత్యధిక వార్షిక ప్యాకేజీ అందుకున్నారు. రూ. 28.4 కోట్లతో హెచ్‌సీఎల్ టెక్ సీఈవో విజయకుమార్ మూడో స్థానంలో ఉన్నారు.
మారుతీ స్విఫ్ట్ కొత్త మోడల్
న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ తమ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్ కారులో 4వ జనరేషన్ మోడల్‌ను విడుదల చేసింది. దీని ధర రూ. 6.49 లక్షల నుంచి రూ. 9.64 లక్షల వరకు (ఢిల్లీ ఎక్స్‌షోరూం) ఉంటుంది. ఈ కారును అభివృద్ధి చేయడంపై రూ. 1,450 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు సంస్థ ఎండీ హిసాషి తకెయుచి తెలిపారు. హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్ అమ్మకాల్లో ప్రీమియం విభాగం వాటా 60 శాతంగా ఉంటోందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఏటా 7 లక్షల యూనిట్లుగా ఉన్న ఈ సెగ్మెంట్ 2030 నాటికి పది లక్షల యూనిట్లకు చేరగలదని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఎస్బీఐ లాభం రికార్డ్
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) గత ఆర్థిక సంవత్సరం(2023–24) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి (క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 18 శాతం ఎగసి రూ. 21,384 కోట్లను అధిగమించింది. అంతక్రితం ఏడాది(2022–23) క్యూ4లో రూ. 18,094 కోట్లు మాత్రమే ఆర్జించింది. స్టాండెలోన్ లాభం సైతం రూ. 16,695 కోట్ల నుంచి రూ. 20,698 కోట్లకు దూసుకెళ్లింది. మొత్తం ఆదాయం రూ. 1.06 లక్షల కోట్ల నుంచి రూ. 1.28 లక్షల కోట్లకు బలపడింది. నిర్వహణ వ్యయాలు రూ. 29,732 కోట్ల నుంచి రూ. 30,276 కోట్లకు పెరిగాయి. మొత్తం ప్రొవిజన్లు రూ. 3,315 కోట్ల నుంచి సగానికి తగ్గి రూ. 1,609 కోట్లకు పరిమిత మయ్యాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 2.78 శాతం నుంచి 2.24 శాతానికి తగ్గాయి. పూర్తి ఏడాదికి సైతం.. ఇక పూర్తి ఏడాదికి ఎస్బీఐ నికర లాభం కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన 21 శాతం జంప్‌చేసింది. రూ. 67,085 కోట్లకు చేరింది. 2022–23లో రూ. 55,648 కోట్లు ఆర్జించింది. వెరసి అటు క్యూ4, ఇటు పూర్తి ఏడాదికి రెండు శతాబ్దాల బ్యాంక్ చరిత్రలోనే అత్యధిక లాభాలు ఆర్జించినట్లు ఎస్బీఐ చైర్మన్ దినేష్ కుమార్ ఖారా పేర్కొన్నారు. క్యూ4లో నికర వడ్డీ ఆదాయం 3 శాతం బలపడి రూ. 41,655 కోట్లను తాకింది. 3.46 శాతం నికర వడ్డీ మార్జిన్లు సాధించింది. మొత్తం ప్రొవిజన్లు రూ. 8,049 కోట్ల నుంచి రూ. 7,927 కోట్లకు తగ్గాయి. స్లిప్పేజీలు రూ. 3,185 కోట్ల నుంచి రూ. 3,867 కోట్లకు పెరిగాయి. స్థూల మొండిబకాయిలు 2.78 శాతం నుంచి 2.42 శాతానికి దిగివచ్చాయి. వడ్డీయేతర ఆదాయం 24 శాతం జంప్‌చేసి రూ. 17,369 కోట్లకు చేరింది. గత నాలుగేళ్లలో 27,000 మంది ఉద్యోగులు తగ్గినప్పటికీ రిటైర్ అవుతున్న సిబ్బందిలో 75 శాతంమందిని విధుల్లోకి తీసుకుంటున్నట్లు ఖారా వెల్లడించారు. టెక్నాలజీ, ఏఐలపై భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తెలియజేశారు.
వీడియోలు
లోకేష్ కి ఆళ్ల రామకృష్ణారెడ్డి సవాల్
చంద్రబాబు దోచిన సొమ్ము అంతా ప్రజలదే..
ప్రత్యేక హోదా కూడా అమ్మేశారు
సీఎం జగన్ సింహగర్జన.. దద్దరిల్లిన మంగళగిరి సభ
నారా లోకేష్ కు ఈ దెబ్బతో..!
మన ప్రభుత్వం ఉంటే..మరెన్నో సంక్షేమ పథకాలు
BRS ఓటమిపై కేసీఆర్ మనసులో మాట
కాళేశ్వరం ప్రాజెక్టు డ్యామేజ్ తప్పు మాది కాదు: కేసీఆర్
ఫోన్ ట్యాంపరింగ్ పై కేసీఆర్ కీ కామెంట్స్
మోదీ గెలుస్తే పెట్రోల్, డీజిల్ ధరలు..400 +..!?
ఫ్యామిలీ
డాగ్ లవర్స్ బీ అలర్ట్ : ప్రమాకరమైన కుక్కలపై తమిళనాడు నిషేధం
దేశంలో వీధికుక్కల దాడులు, దుర్మరణాలు సంఖ్య పెరుగుతూ ఉండటం ఆందోళన రేపుతోంది. ప్రతి ఏడాదీ మిలియన్ల కొద్దీ దాడుల కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా పిల్లలు , సీనియర్ సిటిజన్ల మరణాలు కూడా సంభవిస్తున్నాయి. దేశంలో 3.5 కోట్లకు పైగా వీధికుక్కలు ఉన్న నేపథ్యంలో ఇదొక సవాలుగా మారుతోంది. అంతేకాదు ఇటీవలి కాలంలోక ఒన్ని పెంపుడుకుక్కలు కూడా మనుషులకు తీరనిహాని చేస్తున్న ఘటనలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 23 జాతుల కుక్కలపై తమిళనాడు ప్రభుత్వం నిషేధందేశంలో పెరుగుతున్న కుక్క కాటు కేసుల నేపథ్యంలో పిట్‌బుల్ టెర్రియర్, అమెరికన్ బుల్డాగ్, రోట్వీలర్ లాంటి పలు కుక్క జాతుల పెంపకాన్ని నిషేధించాలని కేంద్రం ఈ ఏడాది మార్చిలో రాష్ట్రాలను ఆదేశించిన సంగతి తెలిసిందే. తమిళనాడులో పిట్‌బుల్ టెర్రియర్, తోసా ఇను సహా 23 రకాల క్రూరమైన కుక్క జాతులను నిషేధించినట్లు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ నిన్న (గురువారం, ఏప్రిల్ 9)ప్రకటించింది. ఇటీవల చెన్నైలో రోట్వీలర్ డాగ్ బాలుడిని గాయపరిచిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.క్రూరమైనవిగా భావించే 23 జాతుల దిగుమతి, పెంపకం, అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అలాగే వీటి పెంపకం, విక్రయాలను నిలిపివేయాలని రాష్ట్రాలను కోరింది. అదే సమయంలో వాటికి గర్భనిరోధకానికి చర్యలు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, పశుసంవర్ధక శాఖ, పాడిపరిశ్రమ శాఖలకు లేఖ రాసింది. కొన్ని జాతుల కుక్కలను పెంపుడు జంతువులుగా, ఇతర ప్రయోజనాల కోసం ఉపగించకుండా నిషేధించాలని పౌరులు, సిటిజన్ ఫోరమ్‌లు, యానిమల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ (AWO) ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.దూకుడు , మానవులకు హాని కలిగించే లక్షనాలున్న ఈ జాతులు ప్రమాదకరమైనవిగా పరిగణించబడతాయి కేంద్రంస్పష్టం చేసింది . 2024 నాటికి భారతదేశంలో నిషేధించిన జాబితాను ప్రకటించింది. కేంద్రం నిషేధించిన కుక్కల జాతుల జాబితా పిట్‌బుల్ టెర్రియర్, టోసా ఇను, అమెరికన్ స్టాఫోర్డ్‌షైర్ టెర్రియర్, ఫిలా బ్రసిలీరో, డోగో అర్జెంటీనో, అమెరికన్ బుల్డాగ్, బోర్‌బోయెల్ కంగల్, సెంట్రల్ ఏషియన్ షెపర్డ్ డాగ్, కాకేసియన్ షెపర్డ్ డాగ్. ఇంకా సౌత్ రష్యన్ షెపర్డ్ డాగ్, టోర్న్‌జాక్, సర్ప్లానినాక్, జపనీస్ టోసా, అకిటా, మాస్టిఫ్స్, టెర్రియర్స్, రోడేసియన్ రిడ్జ్‌బ్యాక్, వోల్ఫ్ డాగ్స్, కానరియో, అక్బాష్ డాగ్, మాస్కో గార్డ్ డాగ్, కేన్ కోర్సో, బ్యాండాగ్ ఉన్నాయి.ఇప్పటికే ఈ నిషేధిత జాతులలో ఏదైనా జాతికి చెందిన కుక్క మీ దగ్గర ఉంటే, వాటి సంతానోత్పత్పిని అరికట్టేలా స్టెరిలైజేషన్ చేయించాల్సి ఉంటుంది.
చుండ్రు సమస్య వేధిస్తోందా? ఇలా ట్రై చేయండి!
వేసవిలో చెమట ఎక్కువగా ఉండటం, వాతావరణ కాలుష్యం కారణంగా జుట్టు సమస్యలు వేధిస్తాయి. చెమట, ధూళికారణంగా జుట్టుకి తొందరగా మురికిపడుతుంది. అందువల్ల తరచు తలస్నానం చేయాలి. అలా తలస్నానం చేయకపోవడం వల్ల అంతకుముందు చుండ్రు లేనివారికి చుండ్రు వచ్చే అవకాశం ఉంది. ముందే చుండ్రు ఉన్నవారిని ఆ సమస్య మరింతగా వేధిస్తుంది. చుండ్రు సమస్యను తగ్గించుకునేందుకు కొన్ని చిట్కాలున్నాయి. ∗ రెండు టీ స్పూన్ల నిమ్మరసాన్ని తీసుకుని ఒక టీస్పూన్ రసాన్ని తలకు (జుట్టు కుదుళ్లకు) పట్టించి పది నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. మరొక టీ స్పూన్ల రసంలో కప్పు నీటిని కలిపి తలస్నానం పూర్తయిన తర్వాత తల మీద (స్కాల్ప్‌కు పట్టేలా) పోసుకోవాలి.∗ వారం పాటు తలకు ఆలివ్ ఆయిల్ రాస్తే చుండ్రు వదులుతుంది. రోజూ తలస్నానం చేసే వాళ్లు రాత్రి పడుకునే ముందు ఆలివ్ ఆయిల్ పెట్టి ఉదయం తలస్నానం చేయవచ్చు.∗ రెండు టేబుల్ స్పూన్ల ల కొబ్బరి నూనెలో అంతే మోతాదు నిమ్మరసం కలిపి తలకు పట్టించి పది నిమిషాల సేపు మర్దన చేయాలి. మర్దన చేసిన తర్వాత ఇరవై నిమిషాలకు మామూలు షాంపూ లేదా కుంకుడుకాయ రసంతో తలస్నానం చేయాలి.∗ టేబుల్ స్పూన్ల మెంతులను రాత్రి నానబెట్టి ఉదయం మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసి అందులో నిమ్మరసం (ఒక కాయ) కలిపి తలకు పట్టించాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి. తలకు మెంతుల పేస్ట్ పెట్టినప్పుడు కొద్దిగా తేమగా ఉండగానే తలస్నానం చేయాలి. పూర్తిగా ఎండి΄ోయే వరకు ఉంచితే జుట్టుకు పట్టేసిన మెంతుల పేస్టును వదిలించడం కష్టం.∗ కప్పు పుల్లటి పెరుగులో టీ స్పూన్ల నిమ్మరసం కలిపి తలకు పట్టించాలి. ఆరిన తర్వాత తలస్నానం చేయాలి.∗చుండ్రును వదిలించడంలో వేపాకు కూడా బాగా పని చేస్తుంది. వేపనూనె తలకు పట్టించి పది నిమిషాల సేపు మర్దన చేయాలి. ఆ తర్వాత తలస్నానం చేయాలి. వేప నూనె లేక΄ోతే వేపాకు రసం పట్టించి మర్దన చేయవచ్చు.
చేతులు రఫ్‌గా ఉన్నాయా? ఇదిగో అద్భుతమైన చిట్కా
కొంతమందికి చేతులు, మోచేతులు నల్లగా అందవిహీనంగా కనిపిస్తూ ఉంటాయి. దీంతో కొన్ని రకాల డ్రెస్సులు వేసుకోవడంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా ఎండాకాలంలో ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. ఈ నేపథ్యంలో మీచేతులు అందంగా, మృదువుగా, మెరిసిపోవాలంటే ఈ చిట్కాలు పాటించండి.పులిసిన పెరుగుపైన ఉండే మీగడ తీసుకుని చేతులకి మసాజ్ చే స్తూ ఉంటే చేతులు మృదువుగా ఉంటాయి. పెట్రోలియమ్ జెల్లీతో కూడా మసాజ్ చేసుకోవచ్చు.ఆలివ్ ఆయిల్ ఒక చెంచా, నిమ్మరసం ఒక చెంచా, గ్లిజరిన్ ఒక చెంచా, గోధుమరవ్వ రెండు చెంచాలు, ΄ాలు ఒక చెంచా కలిపి చేతులకి రాసుకుని గంట తర్వాత వేడి నీటితో శుభ్రంగా కడుక్కోవాలి.స్పూను దానిమ్మరసం, స్పూను టొమోటో గుజ్జు కలిపి దానిలో కొన్ని గ్లిజరిన్ చుక్కలు కలిపి చేతులకి పట్టించి ఒక గంట అయిన తర్వాత కడుక్కుంటే చేతులు చక్కగా మెరుస్తాయి. రెండు స్పూన్ల దానిమ్మరసంలో స్పూను పంచదార కలిపి చక్కెర కరిగిన తర్వాత చేతులకి పట్టించి నెమ్మదిగా మసాజ్ చేస్తే చేతులు నున్నగా ఉంటాయి.చెంచా బాదం పొడిలో తగినన్ని పాలు కలిపి పేస్ట్ చేసుకొని చేతులకి రాసుకొని ΄ావుగంట తర్వాత కడుక్కోవాలి.నారింజ రసం రెండు చెంచాలు, తేనె రెండు చెంచాలు కలిపి చేతులకి రాసుకొని ఇరవై నిమిషాల తర్వాత వేడి నీటితో కడుక్కోవాలి.రెండు చెంచాలు గ్లిజరిన్, రెండున్నర చెంచాలు రోజ్ వాటర్ కలిపి చేతులకి మసాజ్ చేస్తే చేతులు మృదువుగా ఉంటాయి.రాత్రి పడుకోబోయే ముందు చేతులకి బేబీ ఆయిల్ పూసి మృదువుగా మసాజ్ చేస్తే చేతులు కోమలంగా ఉంటాయి.
'అక్షయ తృతీయ' అనే పేరు ఎలా వచ్చింది? బంగారం కొనాల్సిందేనా..?
భారతీయ పండుగలలో అక్షయ తృతీయ పర్వదినానికి అత్యంత విశిష్టత ఉంది. ఈ పండుగను ఇవాళే జరుపుకుంటాం. వైశాఖంలో వచ్చే ఈ శుక్ల పక్ష తదియకు ఎందుకంత ప్రాముఖ్యం. పైగా ఈ రోజు బంగారం కొంటే అక్షయం అవుతుందని నమ్ముతారు. అసలు బంగారానికి ఈ అక్షయ తృతియకు సంబంధం ఏంటీ?. ఈ రోజున ఏం చేస్తారు..?ఆ పేరు ఎలా వచ్చిందంటే..మత్స్య పురాణం ప్రకారం.. ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామ ప్రథమైన అక్షయ తృతీయ వ్రతం గూర్చి చెప్పాడు. వైశాఖ శుద్ధ తదియ నాడు చేసే ఏ వ్రతమైనా, జపమైనా, హోమమైనా, దానాదులేవైనా లేక పుణ్య కార్యాచరణమేదైనా దాని ఫలితము అక్షయమౌతుంది. అలాగే పుణ్య కార్యాచరణ వల్ల వచ్చే ఫలితం అక్షయమైనట్లే, పాపకార్యాచరణ వల్ల వచ్చే పాపం కూడా అక్షయమే అవుతుంది . ఈనాడు, తృతీయా తిథి బ్రహ్మతో కలిసి ఉంటుంది. అందుచే ఇంత విశిష్టత ఈ తిథికి. ఈరోజు ఉపవాస దీక్ష చేసి.. ఏ పుణ్య కర్మనాచరించినా కూడా తత్సంబంధ ఫలము అక్షయంగానే లభిస్తుంది. ఈ తిథినాడు అక్షయుడైన విష్ణువు పూజింపబడతాడు. అందుకే దీనికి "అక్షయ తృతీయ" అని పేరు.ఈ రోజు అక్షతోదకముతో స్నానం చేసి, అక్షతలను విష్ణు భగవానుని పాదములపై ఉంచి, అర్చించి, తరువాత ఆ బియ్యమును బ్రాహ్మణులకు దానమిచవ్వగా.. మిగిలిన వాటిని దైవోచ్చిష్టంగా, బ్రాహ్మణోచ్చిష్టంగా తలచి వాటిని ప్రసాద బుద్ధితో స్వీకరించి భోజనం చేసిన వారికి ఈ ఫలం తప్పక కలుగుతుంది అని పురాణంలో ఈశ్వర వాక్కు. ఇలా ఒక్క వైశాఖ శుక్ల తదియనాడు నియమంతో అక్షయ తృతీయా వ్రతాన్ని ఆచరించిన తరువాత వచ్చే 12 మాసాలలో శుక్ల తృతీయ నాడు ఉపవసించి విష్ణువును ప్రీతితో అర్చిస్తే రాజసూయ యాగము చేసిన ఫలితము కలిగి అంత్యమున ముక్తిని పొందుతారని పురాణోక్తి. అక్షతలు అంటే ఏ మాత్రము విరగని, పగుళ్ళు లేని, గట్టిగా ఉన్న బియ్యము. అవి వరి ధాన్యము నుండి కావచ్చు, గోధుమ ధాన్యము నుంచి కావచ్చు, యవల నుంచి కావచ్చు. ఇటువంటి వాటితో సిద్ధం చేసిన ఆహారమును అక్షతాన్నము లేదా అక్షతాహారము అంటారు.విశిష్టత..కొత్తగా ఏదైనా పని ప్రారంభించేముందు ఆ రోజు తిథి, వారం, నక్షత్రం చూసుకుని వర్జ్యం, దుర్ముహూర్తం లేకుండా చూసుకుంటారు. అమృత ఘడియలు తప్పనిసరిగా చూసుకుంటారు. అయితే అక్షయ తృతీయ రోజు ఇవేమీ చూసుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు మొత్తం అమృత ఘడియలతో సమానమే. అక్షయ తృతీయకు అంత ప్రత్యేకత ఎందుకంటే..ఐశ్వర్యానికి రక్షకుడిగా కుబేరుడు నియమితుడైన రోజిది.బంగారం కొనాల్సిందేనా..?అక్షయ తృతీయ రోజున బంగారం కొని తీరాలని ఏ శాస్త్రంలోనూ లేదు. పురాణాల ప్రకారం, కలి పురుషుడు ఐదు స్థానాల్లో ఉంటాడు. అందులో ఒకడి పసిడి. బంగారాన్ని అహంకరానికి హేతువుగా పరిగణిస్తారు. అంటే అక్షయ తృతీయ రోజున కలిపురుషుడిని ఇంట్లోకి తీసుకొచ్చి అహంకారాన్ని మరింత పెంచుకోవడమే అర్థమని కొందరి వాదన. అయితే ఈరోజున బంగారం కొనాలనే ప్రచారం ఎందుకొచ్చిందంటే.. ఈ పర్వదినాన బంగారం కొనడం కాదు.. దానం చేయాలన్నది అసలు విషయం. అయితే బంగారం కొనుగోలు చేసే శక్తి, సామర్థ్యాలు చాలా మందికి ఉండవు. అందుకే ఆహారం, వస్త్రాలు దానం చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయని పెద్దలు చెబుతారు. అంతేగాదు ఈ రోజున ఏ కార్యాన్ని తల పెట్టినా నిర్విఘ్నంగా సాగుతుందని, ఏ పుణ్యకార్యాన్ని ఆచరించినా కూడా దాని ఫలితాలు అక్షయంగా లభిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకనే అక్షయతృతీయ రోజున తప్పకుండా దానధర్మాలు చేయాలని చెబుతారు. ముఖ్యంగా ఎండలు విపరీతంగా ఉండే ఈ కాలంలో ఉదకుంభదానం పేరుతో నీటితో నింపిన కుండను దానం ఇవ్వమని పెద్దలు సూచిస్తూ ఉంటారు.ఈ రోజునే పురాణల్లో జరిగిన సంఘటనలు..కృతయుగం ఆరంభం అయిన రోజు కూడా వైశాఖ శుద్ధ తదియ రోజునే అని విష్ణుపురాణంలో ఉంది.నిరుపేద అయిన కుచేలుడిని శ్రీకృష్ణుడు అనుగ్రహించిన రోజు అక్షయతృతీయే ..ఈ రోజుతో కుచేలుడి దారిద్ర్యం తీరిపోయి సంపన్నుడయ్యాడుశ్రీ మహావిష్ణువు అవతారాల్లో ఒకటైన పరశురాముడు..వైశాఖ శుద్ద తదియ రోజు రేణుక, జమదగ్ని దంపతులకు కుమారుడిగా జన్మించాడు పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం కూడా అక్షయతృతీయే వ్యాస మహర్షి "మహా భారతం" వినాయకుడి సహాయంతో రాయడం మొదలెట్టిన రోజు అక్షయ తృతీయ అరణ్యవాసంలో ఉన్న పాండవులకు సూర్యుడు అక్షయ పాత్ర ఇచ్చిన రోజు అక్షయ తృతీయ రోజేకుబేరుడు సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమితుడైంది ఈ రోజేకటిక దారిద్రం అనుభవిస్తున్న ఓ పేదరాలి ఇంటికి బిక్షకు వెళ్లిన జగద్గురు ఆదిశంకరాచార్యులు "కనకధారాస్త్రోత్రం" పఠించి ఆ ఇంటిని బంగారంతో నింపేసిన రోజు కూడా ఇదేఒడిశాలో పూరి రథయాత్ర సంబరాల కోసం రథం నిర్మాణాన్ని అక్షయ తృతీయ రోజే ప్రారంభిస్తారు..బృందావనంలోని బంకే బిహరి ఆలయంలో కొలువైన శ్రీకృష్ణుని పాదాలు దర్శించుకునే అవకాశం అక్షయ తృతీయ రోజు మాత్రమే దక్కుతుంది. సింహాచల క్షేత్రంలో అప్పన్న నిజరూప దర్శనం , చందనోత్సవం ప్రారంభమయ్యే రోజు అక్షయ తృతీయఅన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారినుండి కాపాడిన దినం.
న్యూస్ పాడ్‌కాస్ట్
చంద్రబాబుది పెత్తందార్ల కూటమి... ఎన్నికల ప్రచార సభల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం.. ఇంకా ఇతర అప్డేట్స్
దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా కనిపిస్తారు... కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై తీవ్ర దుమారం.. ఇంకా ఇతర అప్డేట్స్
నేడు వేములవాడకు నరేంద్ర మోదీ... రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్న ప్రధానమంత్రి... ఇంకా ఇతర అప్డేట్స్
క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
భూమి లాక్కున్నట్లు ఒక్క రైతయినా చెప్పాడా అంటూ చంద్రబాబు, ఎల్లో మీడియాకు సీఎం జగన్ సూటి ప్రశ్న.. ఇంకా ఇతర అప్డేట్స్
నాకు బిడ్డలు లేరు, ప్రజల బిడ్డల కోసమే నా తపన.. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటన.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం పట్ల ఎన్నికల సంఘం సీరియస్.. తక్షణం దర్యాప్తు చేసి, చర్యలు తీసుకుని నివేదిక ఇవ్వాలని సీఐడీకి ఆదేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
అవ్వాతాతల పెన్షన్లపై చంద్రబాబు పాపిష్టి కళ్లు.. నరసాపురం, క్రోసూరు, కనిగిరి ప్రచార సభల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం.. ఇంకా ఇతర అప్డేట్స్
కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు పాకిస్తాన్ ఆరాటం.. గుజరాత్ ప్రచారంలో ప్రధాని మోదీ విమర్శలు.. ఇంకా ఇతర అప్డేట్స్
తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై నిషేధం.. 48 గంటలపాటు ప్రచారం ఆపేయాలన్న కేంద్ర ఎన్నికల సంఘం .. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
చికాగోలో తెలంగాణ విద్యార్థి అదృశ్యం ఆందోళనలో తల్లిదండ్రులు
అమెరికాలో తెలుగు విద్యార్థి అదృశ్యం కావడం కలకల రేపుతోంది. ఉన్నత విద్య కోసం చికాగో వెళ్లిన తెలంగాణకు చెందిన 25 ఏళ్ల రూపేష్ చంద్ర చింతకింది అదృశ్యం అయ్యాడు. అతని అచూకీ కోసం కుటుంబ సభ్యులు భారత రాయబార వర్గాలను సంప్రదించారు. చికాగోలోని ఎన్ షెరిడాన్ రోడ్ 4300 బ్లాక్ నుంచి అతను తప్పిపోయినట్లు తెలుస్తోంది. టెక్సాస్ నుండి కలవడానికి వచ్చిన ఒకరిని కలవబోతున్నాడని చెప్పినట్లు సమాచారం.‘‘మే 2 మధ్యాహ్నం వాట్సాప్‌లో మాట్లాడాను. ఏదో పని మీద ఉన్నా అని చెప్పాడు. అంతే అప్పటినుంచి ఆఫ్‌లైన్‌లో ఉన్నాడు" రూపేష్ తండ్రి సదానందం తెలంగాణలోని హన్మకొండకు చెందిన రూపేశ్ విస్కాన్సిన్ లోని కాంకార్డియా యూనివర్శిటీలో మాస్టర్స్ చదువుతున్నాడు. వారం రోజులుగా రూపేశ్ ఆచూకీ లభించకపోవడంతో హైదరాబాద్‌లోఉంటున్న అతని తల్లిదండ్రలు ఆందోళనకు గురయ్యారు. తమ కుమారుడి ఆచూకీ కనుగొనాలంటూ భారత విదేశాంగా శాఖను కోరింది. త్వరలోనే రూపేశ్ అచూకీ తెలుస్తుందని ఆశిస్తున్నామని చికాగోలోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది.The Consulate is deeply concerned learning that Indian student Rupesh Chandra Chintakindi is incommunicado since 2nd May. Consulate is in touch with the police and the Indian diaspora hoping to locate/reestablish contact with Rupesh.@IndianEmbassyUS @MEAIndia— India in Chicago (@IndiainChicago) May 8, 2024మే 2 నుంచి రూపేశ్ మిస్సయినట్లు చికాగోలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా తెలిపింది. అతడి ఆచూకి కోసం పోలీసులు ప్రవాస భారతీయులతో నిరంతరం చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. రూపేష్ ఆచూకీ తెలిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని స్థానిక పోలీసులు ప్రకటన విడుదల చేశారు.
రాసలీలల రామ్మోహన్!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ తూర్పు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహనరావు మహిళలపై లైంగిక వేధింపుల వ్యవహారం బట్టబయలైంది. పలువురు మహిళలతో అసభ్యకరంగా చాటింగ్ చేసినట్టు వెల్లడైంది. ప్రస్తుతం వాట్సప్ చాటింగ్, స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విజయవాడలోని వివిధ వాట్సప్ గ్రూపుల్లో, ఫేస్ బుక్ పేజీల్లో, ఇన్‌స్ట్రాగాం వేదికల్లో అవి చక్కెర్లు కొడుతుండటంతో ఆయన లీలలపై తూర్పు నియోజకవర్గ ఓటర్లు ముక్కున వేలేసుకుంటున్నారు. మహిళా ఓటర్లయితే గద్దెకు గుణపాఠం చెబుతామని స్పష్టం చేస్తున్నారు. ఇన్నాళ్లకు గద్దె నిజ స్వరూపం బట్ట బయలైందని టీడీపీ వర్గీయులే వ్యాఖ్యానించిడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయనకు 15 ఏళ్లుగా అనుచరుడిగా ఉన్న ఒకరు ఆయన రాసలీలల వ్యవహారాలను ఆధారాలతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం విజయవాడ నగరంలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల గద్దె ప్రధాన అనుచరుడు మహిళలను వేధింపులకు గురిచేసి, దాడి చేయడంతో పటమట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఏకంగా గద్దె వాట్సప్ చాటింగ్ వెలుగులోకి రావడంతో టీడీపీ ఆత్మరక్షణలో పడింది. ఇప్పటికే తూర్పు నియోజక వర్గంలో గద్దె గ్రాఫ్ పడిపోవడంతో తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వాట్సప్ చాటింగ్స్ వ్యవహారం వెలుగులోకి రావడంతో తూర్పు నియోజకవర్గంలో టీడీపీ ఓటమి ఖాయమని ఆ పార్టీ నాయకులే తేల్చిచెబుతున్నారు.
ఈత సరదా ప్రాణం తీసింది
వైఎస్సార్: లింగాల మండలం తాతిరెడ్డిపల్లెలో ఈత నేర్చుకోవాలని చిన్నారి సరదా పడగా... ప్రమాదవశాత్తూ ఆమె ప్రాణం తీసింది. స్థానికుల వివరాల మేరకు.. తాతిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన తోట రవీంద్రారెడ్డి, మంజుల దంపతుల కుమార్తె మహిత(12) బుధవారం గ్రామంలోని చెరువులో ఈత నేర్చుకునేందుకు తోటి పిల్లలతో కలిసి వెళ్లింది.నడుముకు ఖాళీ క్యాన్ కట్టుకుని చెరువులో ఈత కొట్టేందుకు దిగారు. ఆ సమయంలో నడుముకు ఉన్న క్యాన్ ఊడిపోయింది. అక్కడున్న పిల్లలు, పెద్దలు చూస్తుండగానే భయానికి గురైన మహిత నీటిలో మునగగానే మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. కుమార్తె మృతిచెందడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
యశవంతపుర: అంబులెన్స్– కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన దుర్ఘటన కర్ణాటక– కేరళ సరిహద్దుల్లోని కాసరగోడులో మంగళవారం జరిగింది. మృతులను కేరళ త్రిసూరు జిల్లా గురువాయురుకు చెందిన శ్రీనాథ్ (54), ఆయన కొడుకులు శరత్ (18), మనన్ (15) గుర్తించారు శ్రీనాథ్ దుబాయ్‌లో ఉద్యోగం చేస్తూ సెలవులు పెట్టి ఊరికి వచ్చాడు. ఆయన భార్య స్మిత అక్కడే ఓ ఇంటర్నెట్ సెంటర్ నిర్వహిస్తున్నారు. ఆమెకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో వారితో పాటు రాలేకపోయారు. ఈ క్రమంలో ముగ్గురూ కలిసి బెంగళూరులో బంధువులను కలవాలని బయల్దేరారు. ముగ్గురూ కారులో కొల్లూరు మూకాంబిక ఆలయంలో అమ్మవారి దర్శనం చేసుకుని వెళుతుండగా, మంజేశ్వర వద్ద ఎదురుగా వేగంగా వచ్చిన అంబులెన్స్ ఢీకొట్టింది. ఆ ధాటికి రెండు వాహనాలూ పలీ్టలు కొట్టాయి. తండ్రీ కొడుకులు కారులోనే దుర్మరణం చెందారు. అంబులెన్స్ డ్రైవర్, ఇద్దరికి కూడా గాయాలు తగిలాయి. ప్రమాదం ఊళ్లోనే జరగడంతో పెద్దసంఖ్యలో జనం పోగయ్యారు. పోలీసులు చేరుకుని మృతదేహాలను, బాధితులను ఆస్పత్రులకు తరలించారు. ఘటనాస్థలమంతా రక్తసిక్తమై భీతావహంగా మారింది. ఈ విషయాన్ని ఊళ్లోని శ్రీనాథ్ భార్యకు ఇంకా చెప్పలేదని, ఇంత ఘోరం జరుగుతుందనుకోలేదని మృతుల బంధువుల విలపించారు.