Top Stories
ప్రధాన వార్తలు
నేడు సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం ఇలా..
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం 10 గంటలకు గుంటూరు లోక్‌సభ స్థానం పరిధిలోని మంగళగిరిలో ఉన్న పాత బస్టాండ్ సెంటర్లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు చిత్తూరు లోక్‌సభ స్థానం పరిధిలోని నగరి నియోజకవర్గం పుత్తూరులో ఉన్న కార్వేటినగరం రోడ్ కాపు వీధి సర్కిల్లో జరిగే సభలో సీఎం పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు కడపలోని శ్రీపొట్టి శ్రీరాములు సర్కిల్లో జరిగే సభలో సీఎం జగన్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.
పెత్తందార్ల కూటమిని వ్యతిరేకించండి: సీఎం జగన్
అన్నమయ్య జిల్లా, సాక్షి: చంద్రబాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమేనని.. పొరపాటున బాబుకు ఓటస్తే.. పథకాలు ముగింపేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గురువారం ఆయన అన్నమయ్య జిల్లా రాజంపేట రైల్వే కోడూరు రోడ్డులో ప్రచార సభలో మాట్లాడుతూ చంద్రబాబు.. మోదీ, అమిత్‌షాను తీసుకొచ్చి సభలు పెట్టించారు. ప్రత్యేక హోదా హామీ వస్తుందేమోనని ప్రజలు ఎదురుచూశారు.. వాళ్లు ప్రత్యేక హోదా హామీ ఇవ్వకుండా.. విమర్శించి వెళ్లిపోయారు’’ అంటూ సీఎం జగన్ మండిపడ్డారు.‘‘చంద్రబాబు అంతటి అవినీతిపరుడు దేశంలోనే లేడని మోదీ అన్నారు. కూటమిలో చేరగానే అదే నోటితో చంద్రబాబును పొగుడుతున్నాడు. చంద్రబాబు, దత్తపుత్రుడికి ఏం కావాల్లో అది మాత్రమే మాట్లాడారు. పెత్తందార్ల కూటమిని వ్యతిరేకించండి’’ అంటూ సీఎం జగన్ పిలుపునిచ్చారు.‘‘2014లో ఇదే కూటమి ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా?. చంద్రబాబు కూటమి.. పెత్తందార్ల కూటమి. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే.. వ్యతిరేకించారు. పెత్తందార్ల పిల్లలు మాత్రమే ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలా? 59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను నెరవేర్చాం. 2 లక్షల 31 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాం. అక్క చెల్లెమ్మలకు నేరుగా రూ.2 లక్షల 70 వేల కోట్లు అందించాం’’ అని సీఎం వివరించారు.గతంలో ఎప్పుడైనా ఇంత మంచి జరిగిందా?. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చాం. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం. 3వ తరగతి నుంచే టోఫెల్ క్లాసులు, సబ్జెక్ట్ టీచర్లు. ప్రభుత్వ స్కూళ్లలో 6వ తరగతి నుంచే డిజిటల్ బోధన. ఇంటర్నేషనల్ యూనివర్శిటీలతో సర్టిఫైడ్ కోర్సులు. పిల్లల చదువు కోసం తల్లులను పోత్సహిస్తూ అమ్మఒడి. విద్యారంగంలో జరిగిన విప్లవాలు.. గతంలో ఎప్పుడైనా జరిగాయా?. మహిళా సాధికారతకు అర్థం చెప్తూ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉన్నాం. మొదటిసారి మేనిఫెస్టో అనే పదానికి విశ్వసనీయత తీసుకొచ్చాం’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.⇒రాజంపేటలో అక్కచెల్లెమ్మల పేరిట 4వేల ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్, ఇళ్ల నిర్మాణం..⇒మరో 4 రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతోంది..⇒జరగబోయే ఈ ఎన్నికలు పథకాల కొనసాగింపును నిర్ణయించేవి..⇒మీ జగన్ తీసుకొచ్చినన్ని పథకాలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా?⇒ఈ తరహాలో పేదవాడి మీద ధ్యాస పెట్టిన ప్రభుత్వం గతంలో చూశారా? ⇒ప్రత్యేకహోదాను అమ్మేశారు, పెత్తందార్ల కూటమిని వ్యతిరేకించండి..⇒చంద్రబాబు ఎక్కడికి వెళ్తే అక్కడ దాన్ని జిల్లా కేంద్రం చేస్తా అంటున్నాడు..⇒రాజంపేట, మదనపల్లి, రాయచోటిలను జిల్లా కేంద్రం చేస్తానంటున్నాడు నమ్ముతారా?⇒రాజంపేటలో పింఛా డ్యాం ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తి చేశాం⇒అన్నమయ్య ప్రాజెక్ట్, గాలేరు-నగరి కాల్వ పనులు పూర్తి చేయాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి⇒రాజంపేట కేంద్రంగా అన్నమయ్య కాలేజ్‌ను యూనివర్శిటీగా తీర్చిదిద్దాం⇒మీ బిడ్డ తీసుకున్న నిర్ణయం రాజంపేట చరిత్రలో నిలిచిపోతుంది⇒అధికారంలోకి వచ్చిన తర్వాత రాజంపేటలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు
చరిత్ర పునరావృతం అవుతుంది...
ఎన్నికలు దగ్గర పడే కొద్దీ గెలుపుపై నమ్మకం సన్న గిల్లో, లేక చెప్పుకోడానికి మరేం లేకనో కొంతమంది రాజకీయ నాయకులు ద్వేషపూరిత ప్రసంగాలను ఆశ్రయించారు. విద్వేషాన్ని రగిలించే ఈ ప్రసంగాలు సత్యదూరమైన ఆరో పణలతో కూడినవి. ప్రధాన మంత్రి మోదీ మాట్లాడుతూ ఈ దేశంలోని ముస్లింలను చొర బాటుదారులుగా అభివర్ణించడం దారుణం. ముస్లిం ప్రజలందరికీ ఇది అవమానకరం. ప్రత్యర్థి పార్టీ మేనిఫెస్టోను ‘ముస్లిం లీగ్‘ మేనిఫెస్టోగా పెర్కొనడం ప్రధాని స్థాయికి తగినది కాదు.‘ఇండియా’ కూటమి వస్తే మీ ఇంటిలోని బంగారం, మంగళసూత్రాలతో సహా అంతా దోచి ముస్లింలకు కట్టబెడతారు అనడం అథమ స్థాయి వాదన.ఎన్నో సర్వేల్లో తేలిన వాస్తవాల ప్రకారం దేశం మొత్తం మీద ముస్లింల ఆర్థిక పరిస్థితి చాలా దయనీయం. దేశంలో జైళ్లలో మగ్గుతున్న వారిలో దళితులు, ఆదివాసీల లాగానే ముస్లింలు కూడా వారి జనాభా నిష్పత్తి కంటే ఎక్కువగా ఉన్నారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని ఆనాడు వైఎస్సార్ సారథ్యం లోని కాంగ్రెస్ ప్రభుత్వం దేశం లోనే మొట్ట మొదటి సారి ముస్లింలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించింది. మోదీ తన ప్రసంగంలో ముస్లిం రిజర్వేషన్‌ను ప్రస్తావిస్తూ ఇతర బీసీల రిజర్వేషన్లు తగ్గించి ముస్లింలకు ఇవ్వచూపు తున్నారు అని విమర్శించడం అవాస్తవమే గాక శోచనీయం.మోదీ బాటలో నడుస్తూ ఎన్డీఏ కూటమి భాగస్వామి పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్‌లో విద్వేషం వెదజల్లుతున్నారు. యాదృచ్ఛికంగానో, ఆకతాయి మూకల వల్లో జరిగిన ఆలయ రథ అగ్నిప్రమాదాన్నీ, ఒక విగ్రహానికి జరిగిన హానినీ ఆ యా ప్రాంతాల సభలలో ఒకటికి పది సార్లు ప్రస్తావిస్తూ ప్రభుత్వమే అటువంటివి చేయించింది అనే అర్థాన్ని స్ఫురించేలా అపోహలకి తెరలేపు తున్నారు.ఎటువంటి ఆధారాలు లేకుండా వందల కొద్దీ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయి అని బహిరంగ సభలలో అరవడం ఒక బాధ్యతా యుతమైన నేత పని అనిపించుకుంటుందా? మత విద్వేషాలు అనే ఊసు ఎప్పుడూ లేని ఉత్తరాంధ్రలో ప్రజలను రెచ్చగొట్టే ఇలాంటి ప్రసంగాలు చేయడం ఒక అమానుష చర్య. మరి కొన్ని సభల్లో ప్రజలను ‘మీకు సిగ్గు లేదా’, ‘పౌరుషం లేదా’ ‘మీరు రోడ్లు ఎక్కి వీళ్లకి బుద్ధి చెప్పరా’ అని అనడం వారిని ప్రత్యక్ష హింస వైపు ప్రేరేపించడమే. ఒక వైపు 2016లో చంద్ర బాబు హయాంలో జరిగిన కాపు రిజర్వేషన్ ఆందో ళన, తుని రైలు విధ్వంసం సంఘటనలను అప్పటి ప్రతిపక్షం వైసీపీ చేయించింది అనే నిందను వేశారు. అదే నోటితో జగన్ ప్రభుత్వం కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టిన సందర్బంగా 2022లో జరిగిన మంత్రి ఇల్లు దగ్ధం సంఘటనకు కూడా జగనే కారకుడు అనడంలో ఔచిత్యం ఏంటి? ఈ రెండు సునిశితమైన అంశాలను ఎన్ని కల వేళ మళ్ళీ తెర మీదకి తెచ్చి విద్వేషాలను రగిలించే తత్వం చాలా తప్పు. అసలు కాపు రిజర్వేషన్ సమస్యపై తనది, తన కూటమి వైఖరి ఏంటో చెప్పకుండా వైసీపీ లోని కాపు నేతలను కించ పరుస్తూ వారి నియోజక వర్గాల్లోనే అవమా నించడం ఒక అక్కసుతో, ద్వేషంతో కూడిన అజెండాలో భాగమే.14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఒక సిట్టింగ్ ముఖ్యమంత్రిని ‘కరుడు కట్టిన ఉగ్రవాది’ అని వర్ణించటం అత్యంత గర్హనీయ చర్య. ఈ మాటల్లో ఉక్రోషం కొట్టొచ్చినట్లు కనిపి స్తుంది. ప్రజలు వేసిన ఓట్లతో ముఖ్యమంత్రి అయిన జగన్ ఉగ్రవాది ఎలా అవుతారు? విధాన పరంగా విమర్శిస్తే ప్రజలు హర్షిస్తారు కానీ ఇటు వంటి మాటలు వాడితే ఎదురుదెబ్బ తగలడం ఖాయం.ఈ విధంగా కూటమి నేతలు మోదీ, పవన్ కల్యాణ్, చంద్రబాబు ముగ్గురూ విద్వేషాన్ని రగిలిస్తుంటే ముక్కున వేలేసుకోవాల్సిన పరిస్థితి ప్రజల దయ్యింది. ఇంతగా విలువలకు తిలోద కాలు ఇచ్చిన వైనం చూస్తే ఓటమి భయం వారిని వేధిస్తున్నట్టు అనిపిస్తోంది. ఇలాంటి విమర్శల నేపథ్యంలో వైఎస్సార్సీపీ తన మేనిఫెస్టో విడుదల చేసింది. గమనించాల్సిన విషయం ఏంటంటే కొత్తగా పెద్ద హామీలు ఏమీ ఇవ్వక పోవడం. ‘ఉన్న పథకాలనే కొనసాగిస్తాం, మెరుగు చేస్తాం’ అంటూ ముందుకు వచ్చిన జగన్ తన ఓటు బ్యాంకుపై ఆత్మ విశ్వాసం కలిగి ఉన్నా రని దీన్నిబట్టి అర్థమవుతోంది. ఇలాగే 2009లో అప్పటి వైఎస్ఆర్ కూడా 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నాక ఎటువంటి కొత్త హామీలు ఇవ్వకపోయినా ప్రజలు తమ నమ్మకాన్ని మళ్ళీ ఆయనపై ఉంచి ప్రతిపక్ష మహాకూటమిని చిత్తుగా ఓడించారు. మళ్లీ ఇప్పుడు సంక్షేమానికి ప్రజలు పట్టం కట్టిన ఆ చరిత్ర పునరావృతం అవుతుందనిపిస్తోంది.డా‘‘ జి. నవీన్ వ్యాసకర్త సామాజిక, రాజకీయ విశ్లేషకులుnaveen.prose@gmail.com
సీఎం జగన్‌లో ఆ ధీమా ఎలా వచ్చిందంటే.?
నాలుగు రోజుల్లో ఎన్నికలు. యావత్తు దేశం ఆసక్తిగా ఆంధ్రప్రదేశ్ ఎదురు చూస్తున్న వేళ.. సీఎం జగన్ నిన్న టీవీ 9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ వెల్లలచెరువుతో మాట్లాడారు. వివిధ విషయాలపై తన అభిప్రాయాలను సూటిగా, స్పష్టంగా వివరించారు. ఐదేళ్ల తన పాలనలో ప్రజలకు ఏం చేశారన్నదానిపై వివరించిన సీఎం జగన్.. తానిచ్చిన మాటకు, చేసిన పనిని పోల్చి చూపించి తనకు ఎంత విశ్వసనీయత ఉందో స్పష్టంగా వివరించారు. Yes, why not 175 అని ధీమా వ్యక్తం చేశారు. వేర్వేరు అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యక్తం చేసిన అభిప్రాయాలు.గెలిచేది వైఎస్సార్సిపీనే, తిరిగేదీ ఫ్యానేఇప్పుడు ఏపీలో జరుగుతున్నవి బై పోలార్ ఎన్నికలు 99% కుటుంబాల అభివృద్ధిలో జగన్ పాత్ర ఉంది ఎంతమంది కలిసి పోటీ చేసినా 50 శాతానికి పైగా ఓట్లు వచ్చిన వాళ్లే గెలుస్తారు ప్రతి పేదింటి అభివృద్ధి కోసం పాటుపడుతున్నాం అందుకే వైనాట్ 175 అంటున్నాంబీజేపీతో మాకు సిద్ధాంతపరమైన విభేదాలు ఉంటాయి బీజేపీ, టీడీపీ పొత్తులపై వారికే క్లారిటీ లేదు మోదీ దేశానికి ప్రధాని.. నేను రాష్ట్రానికి సీఎం ఒక సీఎంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధానిని కలుస్తాం బీజేపీ పెట్టిన అన్ని బిల్లులకు మేం మద్దతు ఇవ్వలేదు రాష్ట్ర ప్రయోజనాల కోసమే కొన్నింటికి మద్దతు ఇచ్చాము కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తెస్తాం కేంద్రంలో ఎవరున్నా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అందరితో సత్సంబంధాలు ఉండాలని నేను ఆశిస్తా నన్ను ఒంటరిగా ఎదుర్కోలేమని భయపడుతున్నారు దేశం మొత్తం ఏపీ మోడల్ ఫాలో మనసుపెట్టి పాలన చేస్తున్నాంకొత్తగా 17 మెడికల్ కాలేజీలు కడుతున్నాంకొత్తగా నాలుగు ఓడరేవులు కడుతున్నాం10 ఫిషింగ్ హార్బర్లు కడుతున్నాంమూడు ఇండస్ట్రీయల్ కారిడార్లు ఏర్పాటు చేస్తున్నాంఈజ్ ఆఫ్ డూయింగ్ లో నెంబర్ వన్ గా ఉన్నాంMSMEలపై పెట్టిన దృష్టి ఇంతకుముందెన్నడూ లేదుMSMEలలో అదనంగా 20 లక్షల మందికి ఉపాధి లభించిందిస్వయం ఉపాధి ఎంచుకున్న వారు దెబ్బతింటే అభివృద్ధి ఆగుతుందిగతంలో ఎప్పుడూ జరగని అభివృద్ధి చేశాంమా పాలనలో లక్ష కోట్లకుపైగా పెట్టుబడులుపారిశ్రామికవేత్తలు క్యూ కట్టారునేను చేసిన అభివృద్ధి కళ్ల ముందు కనిపిస్తోందిచూడాలని లేనప్పుడు అభివృద్ధి కనిపించదుపచ్చకామెర్లు ఉంటే లోకమంతా పచ్చగానే కనిపిస్తుందిశ్రీకాకుళంలో పోర్టు కడుతున్నాంశ్రీకాకుళం ముంబైలా అభివృద్ధి చెందుతుందితెలంగాణలో 60శాతం రెవెన్యూ హైదరాబాద్ దేతెలంగాణకు హైదరాబాద్..ఏపికి విశాఖ ఐకాన్ సిటీలుఅందుకే ఏపీకి పెట్టుబడులు పోటెత్తాయివిద్యలో విప్లవాత్మక సంస్కరణలు3వేల డిజిటల్ లైబ్రరీలు నిర్మాణంలో ఉన్నాయి6వ తరగతి నుంచే డిజిటల్ బోధన8వ తరగతి విద్యార్ధులకు ట్యాబ్ లు ఇచ్చాంఅంతర్జాతీయవర్సిటీల కోర్సులు తీసుకొచ్చాంపిల్లలకు మంచి ఉద్యోగాలు రావాలనేది మా తాపత్రయంఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 2 లక్షల 31 వేల ఉద్యోగాలు చంద్రబాబు హయాంలో 32 వేల ఉద్యోగాలు ఇచ్చారుకానీ మా హయాంలో ఏకంగా 2 లక్షల 31వేల ఉద్యోగాలిచ్చాంవైద్యరంగంలో 54 వేల ఉద్యోగాల భర్తీ జరిగిందిఅన్నదాతకు అండగా నిలిచాంరైతు భరోసా సాగు ఖర్చులో 80 శాతంరైతులకు పెట్టుబడి సాయం గతంలో లేదువిశాఖ నుంచే పరిపాలనఅమరావతిలో డెవలప్మెంట్ ఎకరాకు రూ.2 కోట్లు అవసరంవిశాఖలో ఉన్న మౌలిక సదుపాయాలు ఏపీలో మరెక్కడా లేవువిశాఖలోనే ప్రమాణస్వీకారం చేస్తాపరిపాలన విశాఖ నుంచే జరుగుతుందిఆంధ్రప్రదేశ్లో విశాఖ అతిపెద్ద సిటీవిశాఖలో అతిపెద్ద సచివాలయం నిర్మిస్తాంఅతిపెద్ద కన్వెన్షన్ హాల్, స్టేడియం కడతాంవిశాఖ ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరంవిశాఖకు బూస్టింగ్ ఇస్తే మరింత అభివృద్ధి సాధ్యంఅమరావతి అభివృద్ధి చేయాలంటే ఆలస్యం అవుతుందివీలైనంత త్వరగా విశాఖను హైదరాబాద్, చెన్నై స్ధాయికి తీసుకెళ్లాలిపారదర్శకంగా సంక్షేమంఅర్హులైన వారందరికి సంక్షేమం ఇస్తున్నాంలంచాలు, వివక్ష లేకుండా పథకాలు అందిస్తున్నాంనేరుగా ఖాతాల్లోకి డబ్బు జమచేస్తున్నాంనాణ్యమైన విద్యతో పిల్లల టాలెంట్ పెరుగుతుందిఅందుకే అమ్మఒడి ఇస్తున్నాంపిల్లలకు పెట్టే ప్రతిరూపాయి వారి అభివృద్ధికోసమేఆసరా లేకపోతే కోటి మంది మహిళలు నష్టపోతారునిలదొక్కుకోవడానికి సాయం చేస్తే వారిని సోమరిపోతులను చేసినట్టు కాదుDBT ద్వారా ఇచ్చేవేవీ ఉచితాలు కావుDBT లకు ఒక ప్రయేజనం ఉందినాలుగేళ్ల పాటు చేయూత అందించాంచంద్రబాబు ఇష్టానుసారంగా హామీలు ఇస్తున్నారునేనుకూడా చంద్రబాబుకంటే ఎక్కువ హామీలు ఇవ్వగలనుఒకే అబద్ధాన్ని వందసార్లు చెబుతున్నారుచేయగలిగేవే మేనిఫెస్టోలో పెట్టాలిఇష్టానుసారం హామీలు ఇస్తే నిధులు ఎలా వస్తాయిరాష్ట్ర వనరులను దృష్టిలో పెట్టుకుని హామీలు ఇవ్వాలిప్రజలను మోసం చేయడం నాకు ఇష్టం లేదురాష్ట్రం శ్రీలంక అవుతుందని మాట్లాడుతున్నారుసూపర్-6, సూపర్-7 అంటూ అడ్డగోలు హామీలు ఇస్తున్నారురాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలిచేయగలిగేవే మేనిఫెస్టోలో పెట్టాలివిశ్వసనీయత నా శ్వాసనా ప్రతి మాటకు విశ్వసనీయత ఉంటుందినేను చేసేవి విమర్శలే తప్ప... వాళ్లలాగే తిట్టలేనుగతంలో కంటే ఎక్కువ కాన్ఫిడెన్స్‌తో ఉన్నాఇప్పుడు జరుగుతున్నవి బైపోలార్90 శాతం కుటుంబాల అభివృద్ధిలో జగన్ పాత్ర ఉందిఎంత మంది కలిసి పోటీ చేసినా 50శాతానికిపైగా ఓట్లు వచ్చిన వాళ్లే గెలుస్తారుప్రతి పేదింటి అభివృద్ధి కోసం పాటుపడుతున్నాంమంచినిచూసి ఓటువేయండని చంద్రబాబు అడగలేకపోతున్నారునా ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపించి ఓట్లు అడుగుతున్నాపవన్ కల్యాణ్ పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలుపవన్ గురించి నేను చాలా తక్కువ మాట్లాడుతారాజకీయాల్లో రోల్ మోడల్ గా ఉండాలిఐదేళ్లకోసారి భార్యలను మార్చడం సరికాదుఒకసారి జరిగితే పొరపాటు.. రెండోసారి జరిగితే గ్రహపాటుమూడు, నాలుగుసార్లు అయితే అలవాటుచంద్రబాబు, దత్తపుత్రుడు రాజకీయ పార్టనర్స్గతంలో టీడీపీ మేనిఫెస్టోలో పవన్ భాగస్వామిచంద్రబాబు చేసిన ప్రతిపాపంలో దత్తపుత్రుడి వాటా ఉందిబీజేపీ తప్పులను కూడా నేను ప్రశ్నిస్తున్నాముస్లిం రిజర్వేషన్ల గురించి మాట్లాడటం తప్పు ప్రతిమతంలో ఓసీలు, బీసీలు ఉంటారు మతం వేరు.. రిజర్వేషన్లు వేరుముస్లింలపై చంద్రబాబుకు ప్రేమ ఉంటే ఇంకా ఎన్డీఏలో ఎందుకు కొనసాగుతున్నారుముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడం ధర్మంముస్లింలలో వెనకబడిన వారికే రిజర్వేషన్లు ఉన్నాయిరిజర్వేషన్ల విషయంలో కోర్టుకు వెళ్తాం పార్లమెంటులో కూడా గళమెత్తుతాం ప్రత్యేక హోదా వైఎస్సార్సీపీ ఎజెండాప్రత్యేక హోదాను ఎవరు అమ్మేశారు? హోదాను తాకట్టు పెట్టి చంద్రబాబు ప్యాకేజీ అన్నారు చంద్రబాబు వల్ల రాష్ట్రం నష్టపోయింది కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించి అన్యాయం చేసింది ప్రత్యేక హోదాను విభజన చట్టంలో చేర్చలేదు హోదాను చట్టంలో చేర్చకపోవడం అతిపెద్ద అన్యాయంహోదాను చట్టంలో చేర్చి ఉంటే కోర్టుకు వెళ్లి సాధించుకునే అవకాశం ఉండేది చంద్రబాబు ట్రాప్‌లో పడితే ఏం చేయగలం?వివేకా కేసును తప్పుదోవ పట్టించారువివేకాహత్యను కడప సెంట్రిక్ గా మార్చారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిన్నాన్న ఓడిపోవాల్సింది కాదు అవినాష్ వివరణ కరెక్టేనని ఎవరికైనా అనిపిస్తుంది తప్పు చేయని వ్యక్తిని తప్పు చేశారనడం ఘోరం అవినాష్ తప్పు చేయలేదని వీడియోలు చూసిన వారు ఎవరైనా చెబుతారుచెల్లెళ్లకు న్యాయం చేసేందుకు మరొకరికి అన్యాయం చేయడం ధర్మం కాదు చిన్నాన్న రెండో భార్య గురించి అవినాష్ అడుగుతున్నది లాజికల్ గా కరెక్ట్ కాదా?సునీత మాటలు ఎన్నికలపై ప్రభావం చూపవు ఏం జరిగిందో కడప జిల్లా ప్రజలందరికీ తెలుసు అవినాష్ ఎలాంటివాడో జిల్లా ప్రజలకు తెలుసు అవినాష్ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు కుటుంబం vs పార్టీప్రజా జీవితంలో కొన్ని సవాళ్లు వస్తాయి 2019లో నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా కాంగ్రెస్ కు రాలేదు అయినా వైఎస్సార్సిపి ఓటు బ్యాంకును చీల్చాలని కాంగ్రెస్ పేరిట కుట్ర చేస్తున్నారు షర్మిల ద్వారా లబ్ధి పొందాలని చూస్తున్నారు నాకు ప్రైవేట్ లైఫ్ అంటూ ప్రత్యేకంగా లేదు పబ్లిక్ లైఫ్, ప్రైవేట్ లైఫ్ అంతా ఒక్కటే దేవుడిపై నమ్మకం, ప్రజలపై విశ్వాసం ఉందివందేళ్ల తర్వాత తొలిసారి సర్వే చేశాంభూ రికార్డులు సిద్ధం చేశాంభూమిపై యజమానికి సర్వహక్కులు కల్పించేదే ఈ చట్టం ఏపీలో 17వేల గ్రామాల్లో రికార్డులు అప్డేట్ చేశాం టైటిల్స్ లో తప్పులు లేకుండా చూడడం ప్రభుత్వ గ్యారెంటీ ల్యాండ్ టైటిలింగ్ చట్టంలో భూములకు ఇన్సూరెన్స్ గ్రామ సచివాలయాలే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులుగా మార్పు సచివాలయాల్లో 15 వేల సర్వేయర్లతో కొత్త వ్యవస్థను తీసుకొచ్చాం ప్రతి గ్రామంలో ఒక సర్వేయర్ ను పెట్టాం ల్యాండ్ టైటిలింగ్, రిజిస్ట్రేషన్ రెండూ ఒకటి కాదు అన్ని సర్వేలు పూర్తయ్యాకే యాక్ట్ వస్తుంది ఈ చట్టం వల్ల ఎవరికీ నష్టం లేదు, పైగా అన్ని రకాల ప్రయోజనాలు
దుష్యంత్ చౌతాలాకు షాక్.. ఖట్టర్‌ను కలిసిన నలుగురు జేజేపీ ఎమ్మెల్యేలు
బీజేపీ పాలిత ర్యానాలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రాష్ట్రంలో సీఎం నయాబ్ సింగ్ సైనీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అసెంబ్లీలో బలపరీక్ష డిమాండ్ చేసిన దుష్యంత్ చౌతాలాకు సొంత పార్టీ ఎమ్మెల్యేలే షాక్ ఇచ్చారు. జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)కి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు గురువారం మధ్యాహ్నం బీజేపీ మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌ను కలిశారు. పానిపట్‌లోని మంత్రి మహిపాల్ దండా నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఖట్టర్, మహిపాల్‌తో సుమారు అరగంటపాటు జేజేపీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. అరగంటపాటు సాగిన ఈ సమావేశంలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో నెలకొన్న తాజా సంక్షోభంపై చర్చించినట్లు సమాచారం.కాగా ఇటీవల ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు (సోంబీర్ సంగ్వాన్, రణధీర్ సింగ్ గొల్లెన్, ధరంపాల్ గోండర్) బీజేపీ ప్రభుత్వానికి తమ మద్దతును ఉపసంహరించుకున్నారు. దీంతో నయాబ్ సింగ్ సైనీ సర్కార్ సంక్షోభంలో పడింది. ఈ క్రమంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని కోరుతూ జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) చీఫ్ దుష్యంత్ చౌతాలా గురువారం హర్యానా గవర్నర్‌కు లేఖ రాశారు. ఒకవేళ ప్రభుత్వానికి మెజారిటీ రాకపోతే రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్ చేశారు.కాగా హర్యానాలో బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చడం కోసం కాంగ్రెస్‌కు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని బీజేపీ మాజీ మిత్రపక్షమైన దుష్యంత్ చౌతాలా స్పష్టం చేశారు. అసెంబ్లీలో అవిశ్వాసం పెడితే తాము బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా ఓటేస్తామని తెలిపారు. వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎంచుకుంటే కాంగ్రెస్‌కు బయటి మద్దతు ఇస్తానని ప్రకటించారు.
విశాఖ బెస్ట్.. అమరావతి వేస్ట్: తేల్చి చెప్పేసిన బాలయ్య చిన్నల్లుడు
అదేంటి అలాగనేశాడు.. ఒసే.. అలా చెప్పడమేటి? పళ్ళకుండూ.. ఇలాపింటి మాటలే దెబ్బేసేస్తాయి. నిజాలు అయినా.. అలా ఒప్పేసుకోకూడదు. ఆ.. ఎలచ్చన్లు అంటే ఏటనున్నావ్ మనకు ఏది లాభమో అదే చెప్పాలి. పక్కోడు మంచోడు అయినా మంచి చేసినా మనం ఒప్పుకోకూడదు. కానీ బాలయ్య చిన్నల్లుడు మాత్రం నిజం ఒప్పేసుకున్నాడు.. అంటూ కంచరపాలెం టీ కొట్టు దగ్గర చెప్పుకెళ్తున్నాడు సిమాచలం. ఒరే ఏట్రా బాబు.. అలా ఒక్కడివే పేలుకుంటున్నావ్ అన్నాడు నారాయణ బీడీ అంటిస్తూ, మరేట్రా బాలయ్య చిన్నల్లుడు.. ఇసాపట్నం టీడీపీ ఎంపీ కేండేట్ శ్రీభరత్ మొత్తానికి నిజం ఒప్పేసుకున్నాడు. జగన్ చేసిందే కరెస్ట్ అని చెప్పేసాడు అన్నాడు సిమాచలం. ఒరేయ్.. అసలు పాయింట్ చెప్పకుండా ఏదేదో పేల్తే గూబ పేలిపోద్ది అన్నాడు సిరగ్గా నారాయణ..మనకు రాజధానిగా ఇసాపట్నమే బెస్టని, పొలాలు తుప్పలు డొంకలతో విలేజిల్లో ఉన్న అమరావతి వేస్ట్ అని చెప్పేశాడ్రా బాబు అన్నాడు సిమాచలం. ఒసే.. తెలుగుదేశపోల్లు అమరావతి అంటారు కదేటి.. ఉన్నఫళంగా ఇలాగనేశాడేటి అన్నాడు నారాయణ. ఒరేయ్.. వాళ్లకూ తెలుసురా అమరావతి అయ్యేది కాదని, ఎప్పటికైనా ఇసాపట్నమే ఆంధ్రకు పెద్ద దిక్కు అని. అందుకే ఆళ్ళ కాలేజీ కూడా ఇక్కడే డెవలప్ చేస్తున్నాడుచూసావా అన్నాడు సిమాచలం. అవునురోయ్ మన ఇసాపట్నానికి అమరావతికి సాపత్తిమా, పల్లకోరా బాబు.. ఆ ముక్క తెలుగుదేశపోళ్ళకు కూడా తెలుసు. కానీ చంద్రబాబుకు అన్నీ మూసుకున్నారు. ఏదైనా జగన్ గొప్పోడురా బాబు అందుకే మన వైజాగ్‌ను రాజధానిగా చేయడమే కాదు ఇక్కడే పెద్దపెద్ద కంపెనీలు తెస్తాను అని అప్పుడే డిసైడ్ అయ్యాడు. చూస్తుండు అన్నీ ఖచ్చితంగా చేస్తాడు అని చెబుతున్న సిమాచలం వైపు విస్మయంతో చూస్తూ... పోన్లేరా అలాగైతే మన గుంతలకు ఇక్కడే ఉజ్జోగాలు వస్తాయి అన్నాడు నారాయణ.టీడీపీ ఎంపీ అభ్యర్థి గీతం కాలేజీ చైర్మన్ శ్రీభరత్ మనసులోని మాట చెప్పేశారు. రాష్ట్ర రాజధానిగా విశాఖ అద్భుతంగా ఉంటుందని, ఈ నగరానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయ్ కాబట్టి దేన్నిమించిన నగరం రాజధానిగా ఎంపిక చేసుకోలేమని తేల్చి చెప్పేశారు. ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అమరావతి అనేది రాజధానిగా పనికిరాదని, విశాఖ అద్భుతంగా అభివృద్ధి చెందిన నగరమని, అందుకే దీన్నే రాజధానిగా చేయాలనీ అన్నారు. అయన ఇప్పుడు చెబుతున్నారు కానీ సీఎం వైఎస్ జగన్ ఏనాడో విశాఖను రాజధానిగా చేస్తానన్నారు.అయన రేపు ప్రమాణస్వీకారం కూడా విశాఖలోనే అని తేల్చేశారు. ఇక శ్రీ భారత్ మామ, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా విశాఖలో భీమిలి ప్రాంతంలో భూములు కొన్నట్లు తెలుస్తోంది. అంటే ఆయనకు కూడా విశాఖ రాజధాని అవుతుందని తెలుసు. కానీ చంద్రబాబు మాత్రమే తన తాబేదారులకోసం రియల్ ఎస్టేట్ వ్యాపారులకోసం అమరావతి కావాలని అంటున్నారని ప్రజలు గుర్తించారు. ఇక ఎన్నికల ఫలితాలు రావడం, జగన్ గెలవడం.. విశాఖలోనే ప్రమాణస్వీకారం చేయడం, అక్కడే నివాసం ఏర్పాటు చేసుకోవడం చకచకా జరిగిపోతాయని ఉత్తరాంధ్ర ప్రజలు ఎదురుచూస్తున్నారు.-సిమ్మాదిరప్పన్న
భరోసా కావాలి!
పిల్ల పోయినా... పురుటి కంపు పోలేదని ఒక ముతక సామెత. కరోనా అనే మాట క్రమంగా విన మరుగవుతూ వస్తున్నా, దాని ప్రకంపనలు మాత్రం మానవాళిని ఆందోళనకు గురి చేస్తూనే ఉన్నాయి. కరోనా టీకా కోవిషీల్డ్‌పై తాజాగా వస్తున్న వార్తలే అందుకు తార్కాణం. సదరు టీకా తీసుకోవడం వల్ల మనిషిలో రక్తం గడ్డలు కట్టడం, రక్తంలోని ప్లేట్లెట్ల సంఖ్య తగ్గడం (వైద్య పరిభాషలో ‘థ్రోంబో సైటోపేనియా సిండ్రోమ్’ – టీటీఎస్) లాంటి అరుదైన దుష్ప్రభావాలుంటాయని దాన్ని రూపొందించిన బ్రిటన్ దిగ్గజ ఔషధ సంస్థ ఆస్ట్రాజెనెకా లండన్ కోర్టులో ఒప్పుకుంది. దాంతో గత వారం గందరగోళం మొదలైంది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఆ టీకాను ఉపసంహరిస్తు న్నట్టు ఆస్ట్రాజెనెకా బుధవారం ప్రకటించడంతో, భారత్‌లో కోవిషీల్డ్‌గా, యూరప్‌లో వాక్స్‌జెవ్రి యాగా అమ్ముడైన కోవిడ్ టీకాపై రచ్చ పరాకాష్ఠకు చేరింది. కరోనా టీకాల భద్రతపై చాలాకాలంగా జరుగుతున్న చర్చలకు తాజా పరిణామాలు యాదృచ్ఛికంగా కొత్త ఊపిరినిచ్చాయి. మన దేశంలో సుప్రీమ్ కోర్ట్ సైతం ఆస్ట్రాజెనెకా టీకాపై వచ్చిన పిటిషన్ విచారణకు అంగీకరించడం గమనార్హం. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే – కోవిడ్ మహమ్మారితో ప్రపంచం అల్లాడుతున్న సమయంలో ప్రజారోగ్యంలో ఆక్స్ఫర్డ్ – ఆస్ట్రాజెనెకా టీకా కీలక భూమిక పోషించింది. క్లినికల్ పరీక్షల అనంతరం 2021 జనవరి 4న టీకా తొలి డోస్ వినియోగించారు. ఆ ఒక్క ఏడాదే దాదాపు 250 కోట్ల డోసులు వేశారు. లక్షలాది ప్రాణాలను కాపాడారు. 2021 ప్రథమార్ధంలో భారతదేశంలో డెల్టా వేరియంట్ పెచ్చరిల్లినప్పుడు కూడా ఇదే సంజీవని. ప్రపంచదేశాల మధ్య టీకాల సరఫరాలో చిక్కులున్నప్పుడూ ఆ మానవతా సంక్షోభ పరిష్కారానికి అందుబాటులో ఉన్న కొన్నిటిలో ఇదీ ఒకటి. ఫైజర్, మోడర్నా, నోవావ్యాక్స్, వగైరాల లానే ఈ టీకా కూడా అనేక స్థాయుల పరీక్షలకు లోనైంది. మూడు విడతల ట్రయల్స్‌లో వేలాది ప్రజలపై పరీక్షలు చేసి, సురక్షితమనీ, ప్రభావశీలమనీ తేలాకనే అను మతులిచ్చారు. బ్రిటన్ సహా యూరప్‌లోని పలు దేశాల్లో 2021 ఆరంభంలో దీన్ని పంపిణీ చేశారు.నిజానికి, ఈ టీకా వినియోగం వల్ల కొన్ని దుష్ఫలితాలు ఉండవచ్చని బ్రిటన్ ప్రభుత్వం 2021 ఫిబ్రవరిలోనే చెప్పింది. కానీ, ప్రపంచవ్యాప్తంగా వారానికి 40 లక్షల కొత్త కేసులొస్తూ, కరోనా తీవ్రత భయం రేపుతున్న సమయమది. దిక్కుతోచని ఆ పరిస్థితుల్లో... టీకాతో అరుదుగా వచ్చే ముప్పు కన్నా ఉపయోగాలే ఎక్కువని ప్రపంచ ఆరోగ్య సంస్థ లాంటివి భావించాయి. పైగా, మహిళలు వాడే గర్భనిరోధక మాత్రల లాంటి అనేక ఇతర ఔషధాలతో పోలిస్తే ఈ టీకాతో రక్తం గడ్డలు కట్టే రేటు బాగా తక్కువనీ, ప్రతి వెయ్యిమందిలో ఒక్కరికే ఆ ప్రమాదం ఉంటుందనీ లెక్కల్లో తేల్చారు. అందుకే, ప్రపంచ క్షేమం కోసం ఈ టీకాను కొనసాగించారు. ఇక, భారత్ సంగతెలా ఉన్నా విదేశాల్లో కరోనా టీకాతో సహా ఏ ఔషధంతో ఇబ్బంది తలెత్తినా బాధితులకు నష్టపరిహార పథకాలున్నాయి. అయితే, అక్కడ కూడా నష్టపరిహారం అందడంలో చిక్కులు ఎదురవడంతో సమస్య వచ్చింది. టీటీఎస్ వల్ల బ్రిటన్‌లో కనీసం 81 మంది చనిపోగా, వందల మంది అనారోగ్యం బారిన పడ్డారు. నష్టపరిహారం కోరుతూ బాధిత కుటుంబాలు కోర్టుకెక్కాయి. అలా దాదాపు 51 కేసులు ఎదుర్కొంటున్న ఆస్ట్రాజెనెకా లండన్‌లోని హైకోర్ట్‌లో తొలిసారిగా టీకా దుష్ప్రభావాలను అంగీకరించింది. సహజంగానే ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా, మరీ ముఖ్యంగా 175 కోట్లకు పైగా కోవిషీల్డ్ టీకా డోసులు తీసుకున్న మన దేశ ప్రజానీకంలో కలకలం రేపింది. ఒక దశలో లక్షలాది ప్రజానీకాన్ని కాపాడి, ప్రపంచానికి రక్షాకవచంగా కనిపించిన టీకా ఇప్పుడిలా భయాందోళనలకు కారణం కావడం విచిత్రమే. కానీ, ప్రాణాంతక మహమ్మారిని కట్టడి చేసేందుకు మరో మార్గం లేని దశలో ఈ టీకాలే దిక్కయ్యాయని మర్చిపోరాదు. ప్రాణరక్షణ కోసం ప్రపంచంలోని అన్ని ప్రభుత్వాలూ, ఔషధ సంస్థలూ టీకాలను తీసుకురావడంలో కొంత హడావిడి పడివుండవచ్చు. లాభనష్టాలపై ప్రజల్ని మరింత చైతన్యం చేసి, టీకా కార్యక్రమం చేపట్టి ఉండవచ్చు. అయితే, కోట్లాది ప్రాణాలకు ముందుగా ప్రాథమిక భద్రతే ధ్యేయంగా టీకాల వినియోగం త్వరితగతిన సాగిందని అర్థం చేసు కోవాలి. పైగా, టీకా దుష్ప్రభావాలు అత్యంత అరుదుగా కొందరిలోనే కనిపిస్తాయని వైద్య నిపు ణులు ఇప్పటికీ స్పష్టం చేస్తున్నందున అతిగా ఊహించుకొని ఆందోళన చెందడం సరికాదు.ఆస్ట్రాజెనెకా వారి టీకా మంచిదే అయినా, ఫైజెర్, మోడర్నా లాంటి ఇతర టీకాలు మెరుగైనవని నిపుణుల మాట. మరింత భద్రత, ప్రభావశీలత ఉన్న ఎంఆర్ఎన్ఏ వెర్షన్లు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. దానికి తోడు బాధితుల కేసులు. ఫలితంగా, ఆస్ట్రాజెనెకా తన టీకాలను ఉపసంహ రించుకోక తప్పలేదు. కోర్టు కేసులకూ, తమ ఉపసంహరణకూ సంబంధం లేదనీ, రెండూ కాకతాళీ యమేననీ ఆ సంస్థ చెబుతున్నా, ఇదంతా నష్టనివారణ చర్యల్లో భాగంగానే కనిపిస్తోంది. అది అటుంచితే, రోగుల భద్రతే తమ ప్రాధాన్యమని ఆస్ట్రాజెనెకా పునరుద్ఘాటిస్తే సరిపోదు. టీకా వాడకం వల్ల తలెత్తిన ఆరోగ్య సమస్యలకు విరుగుడు ఆలోచించి, ప్రజల్లో భరోసా పెంచాలి. బాధ్యత వహించి, బాధిత రోగులకు సత్వర నష్టపరిహారం చెల్లించి తీరాలి. టీకాలో లోపమెక్కడ జరిగిందో క్షుణ్ణంగా పరిశోధించాలి. ప్రభుత్వాలు సైతం ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలి. టీకా వినియోగం సురక్షితమేనని ప్రకటించడానికి అనుసరిస్తున్న ప్రమాణాలేమిటో ఒకసారి సమీక్షించాలి. కఠినమైన ప్రమాణాలు పాటించకుండానే కోవిషీల్డ్ వినియోగానికి పచ్చజెండా ఊపిన నియంత్రణ అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే, ప్రస్తుత పరిణామాలతో ప్రజలకు టీకాల పైన, వాటి తయారీదార్లపైన, చివరకు ఆరోగ్య వ్యవస్థ మీదే నమ్మకం సడలితే అది మరింత ప్రమాదం.
క్యాబ్ డ్రైవర్‌తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ '12th ఫెయిల్'తో హీరో విక్రాంత్ మాస్సే పేరు మార్మోగిపోయింది. అతడి సహజ నటనకు జనం ఫిదా అయిపోయారు. ప్రస్తుతం అతడి చేతిలో ఐదు సినిమాలున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా అతడు క్యాబ్ డ్రైవర్‌తో గొడవపడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో క్యాబ్ డ్రైవర్ మాట్లాడుతూ.. నా పేరు ఆశిష్. నేనొక క్యాబ్ డ్రైవర్‌ను. ఓ ప్రయాణికుడిని ఎక్కించుకుని అతడు చెప్పిన లొకేషన్లో దిగబెట్టాను. ఈ నాటకాలు నా దగ్గర కాదుకానీ అతడు నాకు డబ్బులివ్వనంటున్నాడు. పైగా తిడుతున్నాడంటూ ఫోన్ కెమెరాను విక్రాంత్ వైపు తిప్పాడు. దీంతో నటుడు కెమెరాను తన చేతులతో కవర్ చేసేందుకు ప్రయత్నించాడు. కెమెరా ఎందుకు ఆన్ చేశావు? బెదిరిస్తున్నావా? అయినా ఫోన్ యాప్‌లో సడన్‌గా డబ్బు ఎందుకు ఎక్కువ చూపిస్తుంది. ఇలాంటి నాటకాలు నా దగ్గర నడవవు అని వాదులాటకు దిగాడు. అది నా తప్పా?ఆ క్యాబ్ డ్రైవర్.. యాప్‌లో డబ్బు ఎక్కువ చూపిస్తే అది నా తప్పా? మాకన్నా మీరే ఎక్కువ సంపాదిస్తుంటారు. ఎందుకిలా గొడవ చేస్తున్నారు అని ప్రశ్నించాడు. అతడి సమాధానంతో చిర్రెత్తిపోయిన విక్రాంత్.. ఎంత డబ్బు సంపాదిస్తే ఏంటి? అయినా అది కష్టార్జితంతో కూడబెట్టింది అని బదులిచ్చాడు. ఇది చూసిన జనాలు.. నటుడిని వెనకేసుకొస్తున్నారు. ఈ మధ్య ఓలా, ఉబర్ వంటి సంస్థలు ఇలాగే మోసం చేస్తున్నాయి.తప్పే లేదుగమ్య స్థానానికి చేరిన తర్వాత అంతకుముందు సూచించిన అమౌంట్ కంటే ఎక్కువ డబ్బు అడుగుతున్నాయి. విక్రాంత్ గొడవపడటంలో తప్పే లేదు అని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం.. ఇదంతా కొత్త సినిమా కోసం ప్రమోషనల్ స్టంట్.. స్క్రిప్ట్ బాగా రాశారు అని సెటైర్లు వేస్తున్నారు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood)చదవండి: తల దించుకున్నా, అందుకే పెళ్లి విషయం దాచా!
ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన ధనుష్ కుమారుడు.. మార్కులెన్నో తెలుసా..?
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్‌లు కొద్దిరోజుల క్రితమే విడాకుల విషయంలో వార్తల్లో నిలిచారు. 2004లో ప్రేమ వివాహం చేసుకున్న వీరిద్దరూ సుమారు 18 ఏళ్ల పాటు కలిసి జీవించారు. వారికి యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే, గత రెండేళ్లుగా ధనుశ్, ఐశ్వర్య వేర్వేరుగానే ఉంటున్నారు.ధనుష్ పెద్ద కుమారుడు యాత్ర 12వ తరగతి బోర్డు పరీక్షలలో బాగా రాణించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇంటర్ ఫలితాల్లో అతని అత్యుత్తమ ప్రదర్శనకు అభిమానులతో పాటు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. ఇటీవల ముగిసిన 12వ తరగతి బోర్డు పరీక్షలో యాత్ర 600 మార్కులకు గాను మొత్తం 569 మార్కులు సాధించినట్లు సమాచారం. తమిళ్ 100కి 98, ఇంగ్లిష్‌లో 92, గణితంలో 99, ఫిజిక్స్‌లో 91, బయాలజీలో 97, కెమిస్ట్రీలో 92 మార్కులు సాధించినట్లు ఇంటర్నెట్లో ఒక వార్త వైరల్ అవుతుంది. ఇందులో అధికారికంగా ప్రకటన వెలువడలేదు.ధనుష్, ఐశ్వర్య విడిపోయినప్పటికీ, వారు తమ ఇద్దరు పిల్లలను బాధ్యతగానే చూసుకుంటున్నారు. లాల్ సలామ్ మ్యూజిక్ లాంచ్ పార్టీలో ఐశ్వర్యతో పాటుగా యాత్ర,లింగ కనిపించారు. కెప్టెన్ మిల్లర్ ఫిల్మ్ ఫెస్టివల్ సమయంలో పిల్లలు ఇద్దరూ కూడా ధనుష్‌తో కలిసి సందడి చేశారు. యాత్రకు 18 ఏళ్లు కాగా, చిన్న కుమారుడు లింగాకు 14 ఏళ్లు. వీరిద్దరూ చెన్నైలోని ఓ ప్రముఖ పాఠశాలలో చదువుకున్నట్లు సమాచారం.
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్
ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన, భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్ల నుండి ప్రేరణ పొంది అద్భుతమైన మరియు వైవిధ్యమైన శ్రేణి సమకాలీన, రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్లు, కస్టమర్లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా, ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్, ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్లెట్లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్ 18కేరట్ మరియు 22కేరట్ బంగారంలో విస్తృతమైన శ్రేణి డిజైన్లతో, నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని సంపూర్ణం చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్లెట్లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.
తప్పక చదవండి
- ప్రభుత్వానిది నియంతృత్వ ధోరణి అనడం దుర్మార్గం
- అవకాశవాది, అబద్దాలకోరు, కుట్రదారు చంద్రబాబే
- టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
- ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
- కేజ్రీవాల్ పిటిషన్‌ను వ్యతిరేకించిన ఈడీ.. సుప్రీంలో అఫిడవిట్ దాఖలు
- టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- కేజ్రీవాల్‌పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న ఈడీ
- తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఐదు రోజులు గట్టి వానలే!
సినిమా
ఏడేళ్ల తర్వాత సీక్వెల్.. 'మాయావన్' టీజర్ విడుదల
సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి, జాకీష్రాఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'మాయావన్'. కోలీవుడ్‌లో 2017లో సి.వి. కుమార్ తెరకెక్కించారు. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రానుంది. తాజాగా పార్ట్-2 నుంచి టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. తెలుగులో 'ప్రాజెక్ట్ z' పేరుతో మొదటి భాగం ఏప్రిల్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.సైన్స్ ఫిక్షన్ జానర్లో రాబోతున్న 'మాయావన్' సీక్వెల్ నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సి.వి. కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మొదటి భాగం భారీ హిట్ కావడంతో ఏడేళ్ల తర్వాత మాయావన్ పేరుతోనే సీక్వెల్ రానుంది.
క్యాబ్ డ్రైవర్‌తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ '12th ఫెయిల్'తో హీరో విక్రాంత్ మాస్సే పేరు మార్మోగిపోయింది. అతడి సహజ నటనకు జనం ఫిదా అయిపోయారు. ప్రస్తుతం అతడి చేతిలో ఐదు సినిమాలున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా అతడు క్యాబ్ డ్రైవర్‌తో గొడవపడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో క్యాబ్ డ్రైవర్ మాట్లాడుతూ.. నా పేరు ఆశిష్. నేనొక క్యాబ్ డ్రైవర్‌ను. ఓ ప్రయాణికుడిని ఎక్కించుకుని అతడు చెప్పిన లొకేషన్లో దిగబెట్టాను. ఈ నాటకాలు నా దగ్గర కాదుకానీ అతడు నాకు డబ్బులివ్వనంటున్నాడు. పైగా తిడుతున్నాడంటూ ఫోన్ కెమెరాను విక్రాంత్ వైపు తిప్పాడు. దీంతో నటుడు కెమెరాను తన చేతులతో కవర్ చేసేందుకు ప్రయత్నించాడు. కెమెరా ఎందుకు ఆన్ చేశావు? బెదిరిస్తున్నావా? అయినా ఫోన్ యాప్‌లో సడన్‌గా డబ్బు ఎందుకు ఎక్కువ చూపిస్తుంది. ఇలాంటి నాటకాలు నా దగ్గర నడవవు అని వాదులాటకు దిగాడు. అది నా తప్పా?ఆ క్యాబ్ డ్రైవర్.. యాప్‌లో డబ్బు ఎక్కువ చూపిస్తే అది నా తప్పా? మాకన్నా మీరే ఎక్కువ సంపాదిస్తుంటారు. ఎందుకిలా గొడవ చేస్తున్నారు అని ప్రశ్నించాడు. అతడి సమాధానంతో చిర్రెత్తిపోయిన విక్రాంత్.. ఎంత డబ్బు సంపాదిస్తే ఏంటి? అయినా అది కష్టార్జితంతో కూడబెట్టింది అని బదులిచ్చాడు. ఇది చూసిన జనాలు.. నటుడిని వెనకేసుకొస్తున్నారు. ఈ మధ్య ఓలా, ఉబర్ వంటి సంస్థలు ఇలాగే మోసం చేస్తున్నాయి.తప్పే లేదుగమ్య స్థానానికి చేరిన తర్వాత అంతకుముందు సూచించిన అమౌంట్ కంటే ఎక్కువ డబ్బు అడుగుతున్నాయి. విక్రాంత్ గొడవపడటంలో తప్పే లేదు అని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం.. ఇదంతా కొత్త సినిమా కోసం ప్రమోషనల్ స్టంట్.. స్క్రిప్ట్ బాగా రాశారు అని సెటైర్లు వేస్తున్నారు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood)చదవండి: తల దించుకున్నా, అందుకే పెళ్లి విషయం దాచా!
ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన ధనుష్ కుమారుడు.. మార్కులెన్నో తెలుసా..?
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్‌లు కొద్దిరోజుల క్రితమే విడాకుల విషయంలో వార్తల్లో నిలిచారు. 2004లో ప్రేమ వివాహం చేసుకున్న వీరిద్దరూ సుమారు 18 ఏళ్ల పాటు కలిసి జీవించారు. వారికి యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే, గత రెండేళ్లుగా ధనుశ్, ఐశ్వర్య వేర్వేరుగానే ఉంటున్నారు.ధనుష్ పెద్ద కుమారుడు యాత్ర 12వ తరగతి బోర్డు పరీక్షలలో బాగా రాణించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇంటర్ ఫలితాల్లో అతని అత్యుత్తమ ప్రదర్శనకు అభిమానులతో పాటు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. ఇటీవల ముగిసిన 12వ తరగతి బోర్డు పరీక్షలో యాత్ర 600 మార్కులకు గాను మొత్తం 569 మార్కులు సాధించినట్లు సమాచారం. తమిళ్ 100కి 98, ఇంగ్లిష్‌లో 92, గణితంలో 99, ఫిజిక్స్‌లో 91, బయాలజీలో 97, కెమిస్ట్రీలో 92 మార్కులు సాధించినట్లు ఇంటర్నెట్లో ఒక వార్త వైరల్ అవుతుంది. ఇందులో అధికారికంగా ప్రకటన వెలువడలేదు.ధనుష్, ఐశ్వర్య విడిపోయినప్పటికీ, వారు తమ ఇద్దరు పిల్లలను బాధ్యతగానే చూసుకుంటున్నారు. లాల్ సలామ్ మ్యూజిక్ లాంచ్ పార్టీలో ఐశ్వర్యతో పాటుగా యాత్ర,లింగ కనిపించారు. కెప్టెన్ మిల్లర్ ఫిల్మ్ ఫెస్టివల్ సమయంలో పిల్లలు ఇద్దరూ కూడా ధనుష్‌తో కలిసి సందడి చేశారు. యాత్రకు 18 ఏళ్లు కాగా, చిన్న కుమారుడు లింగాకు 14 ఏళ్లు. వీరిద్దరూ చెన్నైలోని ఓ ప్రముఖ పాఠశాలలో చదువుకున్నట్లు సమాచారం.
కన్నప్పలో అడుగుపెట్టిన ప్రభాస్.. ఫోటో వైరల్
మంచువిష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో మోహన్‌బాబు, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్ టైన్మెంట్స్పై మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. తాజాగా కన్నప్ప ప్రాజెక్ట్‌లోకి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అడుగుపెట్టేశారు. ఈమేరకు మంచు విష్ణు అధికారికంగా ప్రకటించేశారు.ఈ చిత్రంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అతిథి పాత్రలో నటించబోతున్నట్లు చాలా రోజుల నుంచి వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ, తాజాగా విష్ణు అధికారికంగా ప్రకటించడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ మూవీలో అతడు నందీశ్వరుడి పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కోసం ప్రభాస్ కేవలం మూడు రోజుల సమయం మాత్రమే కేటాయించినట్లు సమాచారం ఉంది. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో కనిపిస్తున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తి అయిపోయింది. దాదాపు షూటింగ్ కార్యక్రమం పూర్తి దశలో ఉన్న కన్నప్ప ఇదే ఏడాది విడుదల కానుంది.మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ కన్నప్పను మోహన్ బాబు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శివుని భక్తుడైన భక్త కన్నప్ప అచంచలమైన భక్తిని, విశ్వాసాన్ని చూపించబోతున్నారు. "కన్నప్ప"లో ప్రఖ్యాత హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ, యాక్షన్ డైరెక్టర్ కెచా ఖంపక్డీతో సహా ఆకట్టుకునే అద్భుతమైన టీం పని చేస్తోంది. ఆకర్షణీయమైన విజువల్స్, అద్భుతమైన కథ, కథనాలతో ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. View this post on Instagram A post shared by Vishnu Manchu (@vishnumanchu)
ఫొటోలు
రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)
హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ డ్యాన్స్.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)
సన్‌రైజర్స్ పరుగుల సునామీ.. కావ్యా మారన్ రియాక్షన్ వైరల్ (ఫొటోలు)
రాయ్ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)
‘లాపతా లేడీస్’ నటి సంచలనం ఏకంగా కోటి ఫాలోయర్లు (ఫొటోలు)
క్రీడలు
కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్‌గా
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లి మరోసారి సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో కోహ్లి అదరగొట్టాడు. పంజాబ్ బౌలర్లను విరాట్ ఊచకోత కోశాడు. తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. 47 బంతులు ఎదుర్కొన్న కింగ్ కోహ్లి.. 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో 92 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు రజిత్ పాటిదార్(55), కామెరాన్ గ్రీన్(46) రాణించడంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో చెలరేగిన విరాట్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్‌పై 1000 పరుగుల మైలు రాయిని అందుకున్నాడు.తద్వారా ఐపీఎల్ చరిత్రలో మూడు జట్లపై 1000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్‌గా కోహ్లి రికార్డులకెక్కాడు. ఐపీఎల్లో కోహ్లి పంజాబ్ కంటే ముందు ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్‌పై 1000 పరుగులు మైలు రాయిని అందుకున్నాడు. అదే విధంగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో కోహ్లి 600 పరుగుల మార్కును కూడా అందుకున్నాడు. ఈ ఏడాది సీజన్లో 12 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి.. 634 పరుగులు చేశాడు. తద్వారా ఐపీఎల్లో అత్యధిక సార్లు 600 పరుగులు మార్క్‌ను అందుకున్న కేఎల్ రాహుల్ రికార్డును కోహ్లి సమం చేశాడు. కోహ్లి 4 సీజన్లలో 600 ప్లస్ పరుగులు చేశాడు. రాహుల్ కూడా 4 సీజన్లలో 600 పైగా పరుగులు చేశాడు.
చెలరేగిన విరాట్ కోహ్లి.. పంజాబ్ ముందు భారీ టార్గెట్
ఐపీఎల్-2024లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో కీలక మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 241 పరుగుల భారీ స్కోర్ సాధించింది.ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి మరోసారి అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. విరాట్ తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. 47 బంతులు ఎదుర్కొన్న విరాట్.. 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో 92 పరుగులు చేసి ఔటయ్యాడు.కోహ్లితో పాటు రజిత్ పాటిదార్(55), కామెరాన్ గ్రీన్(46) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో హర్షల్ పటేల్ 3 వికెట్లు పడగొట్టగా.. విధ్వత్ కావేరప్ప రెండు, అర్ష్‌దీప్ సింగ్, సామ్ కుర్రాన్ తలా రెండు వికెట్లు సాధించారు.
విరాట్ కోహ్లి సింగిల్ హ్యాండ్ సిక్స్.. వీడియో వైరల్
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ విరాట్ కోహ్లి తన అద్భుత ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో కింగ్ కోహ్లి ఆకాశమే హద్దుగా చెలరేగాడు.విరాట్ తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. 47 బంతులు ఎదుర్కొన్న విరాట్.. 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో 92 పరుగులు చేసి ఔటయ్యాడు.అయితే ఈ మ్యాచ్‌లో కోహ్లి ఓ సంచలన షాట్‌తో మెరిశాడు.పంజాబ్ యువ పేసర్ విధ్వత్ కావేరప్ప బౌలింగ్‌లో కోహ్లి సింగిల్ హ్యాండ్ సిక్స్ బాదాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్ 7 వ ఓవర్ వేసిన కావేరప్ప బౌలింగ్‌లో తొలి బంతిని కోహ్లి ఫ్రంట్ ఫుట్కు మిడాఫ్ మీదగా ఒంటి చేత్తో సిక్స్ బాదాడు. విరాట్ షాట్ చూసిన అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. What an amazing shot by Virat kohli 😳@imVkohli #RCBvsPBKS pic.twitter.com/BDdcQgLC70— Ritu Gurjar (@Ritugurjar111) May 9, 2024
ఐదో టీ20లో భారత్ ఘన విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్
సిల్హెట్ వేదికగా బంగ్లాదేశ్ మహిళలతో జరిగిన ఐదో టీ20లో 21 పరుగుల తేడాతో భారత జట్టు ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 5-0 తేడాతో భారత్ క్లీన్ స్వీప్ చేసింది. ఆఖరి టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 156 పరుగుల భారీ స్కోర్ సాధించింది. టీమిండియా బ్యాటర్లలో హేమలత(37) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మంధాన(33),హర్‌ప్రీత్ కౌర్(30) పరుగులతో రాణించారు. బంగ్లా బౌలర్లలో రబేయా ఖాన్, నహిదా అక్తర్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. సుల్తానా ఒక్క వికెట్ సాధించింది. అనంతరం 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. నిర్ఱీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 135 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో రాధా యాదవ్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఆశా రెండు వికట్లు సాధించింది. బంగ్లా బ్యాటర్లలో రితూ మోనీ(37) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది.చదవండి: టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
బిజినెస్
మూడు రోజుల్లో 795 ఫ్లాట్లు అమ్మిన డీఎల్ఎఫ్.. ఎక్కడంటే..
ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ డీఎల్ఎఫ్ మూడు రోజుల్లోనే గురుగ్రామ్‌లో రూ.5,590 కోట్ల విలువైన 795 లగ్జరీ ఫ్లాట్లు విక్రయించింది. కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం..డీఎల్ఎఫ్ గురుగ్రామ్‌లో 'డీఎల్ఎఫ్ ప్రివానా వెస్ట్' అనే కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించింది. ఇందులో భాగంగా లగ్జరీ ఫ్లాట్లను నిర్మించారు.ఫ్లాట్ల అమ్మకాలు ప్రారంభించిన మూడు రోజుల్లోనే మొత్తం 795 ఫ్లాట్లు విక్రయించారు. వాటి విలువ రూ.5,590 కోట్లుగా ఉంది. ఈ ప్రాజెక్ట్‌ను 116 ఎకరాల డీఎల్ఎఫ్ టౌన్షిప్లో భాగంగా 12.57 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ సంస్థ గతంలో ప్రివానా సౌత్‌లో నిర్మించిన 1,113 ఫ్లాట్లను మూడురోజుల్లో విక్రయించి రూ.7,200 కోట్లు సమకూర్చుకుంది.ఇదీ చదవండి: సిక్ లీవ్ తీసుకున్న ఉద్యోగుల తొలగింపుడీఎల్ఎఫ్ హోమ్ డెవలపర్స్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఆకాష్ ఓహ్రి మాట్లాడుతూ..ఫ్లాట్ల విక్రయానికి సంబంధించి వినియోగదారుల నుంచి మంచి స్పందన వచ్చినట్లు సంతృప్తి వ్యక్తం చేశారు. వీటిని ఎక్కువగా ఎన్ఆర్ఐలే కొనుగోలు చేసినట్లు తెలిపారు.
సిక్ లీవ్ తీసుకున్న ఉద్యోగుల తొలగింపు
టాటా యాజమాన్యంలోని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఉద్యోగులపై కొరడా ఝుళిపించింది. ముకుమ్మడిగా సిక్ లీవ్ తీసుకున్న ఉద్యోగులను తొలగించింది. సెలవు అనంతరం తిరిగి ఉద్యోగులు సంస్థకు రిపోర్ట్ చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వర్గాలు చెప్పాయి. ఇటీవల ఉద్యోగులు విధులకు రాకపోవడంతో బుధవారం సంస్థ దాదాపు 80కి పైగా విమాన సర్వీసులను రద్దు చేసింది. ఈ చర్యకు కారణమైన 25 మంది క్యాబిన్ సిబ్బందిపై చర్యలు తీసుకుంది.‘సిక్‌లీవ్ అనంతరం 25 మంది ఉద్యోగులు సంస్థకు రిపోర్ట్ చేయడంలో విఫలయ్యారు. వారితీరు వల్ల విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్ ఎంప్లాయిస్ సర్వీస్ రూల్స్‌ను పాటించనందుకు వారిపై చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. అందులో భాగంగానే వారి ఉద్యోగాలు తొలగించాం’ అని టర్మినేషన్ లేటర్లో కంపెనీ తెలిపింది.బుధవారం విమాన సర్వీసుల్లో కలిగిన అంతరాయం తర్వాత సంస్థ సీఈఓ అలోక్ సింగ్ స్పందించారు. ఉద్యోగులకు ఏదైనా సమస్యలుంటే క్యాబిన్ సిబ్బందితో చర్చకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఎయిర్‌లైన్ రాబోయే కొద్ది రోజుల పాటు విమానాలను తగ్గిస్తుందని తెలిపారు.ఇదీ చదవండి: కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను రద్దు చేసిన ఆస్ట్రాజెనెకా.. కారణం తెలుసా..ఇదిలాఉండగా, ఎయిరిండియా వైఖరిపట్ల సిబ్బంది అసంతృప్తిగా ఉన్నారని తెలిసింది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ను ఎయిర్ఏషియా ఇండియాతో విలీనం చేయడం వల్ల సిబ్బంది జీతాలు దాదాపు 20 శాతం తగ్గాయని ఉద్యోగులు చెబుతున్నారు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ కెకె విజయ్‌కుమార్ మాట్లాడుతూ..ఎయిరేషియాతో విలీనానికి ముందు ఉద్యోగులకు ఇవ్వాల్సిన పరిహారంలో స్పష్టత ఇవ్వాలని కోరారు. ఈ విలీనంతో ఉద్యోగులకు రావాల్సిన అలవెన్సులు పూర్తిగా తొలగించబడ్డాయన్నారు. దాంతో భారీగా జీతాలు తగ్గాయని చెప్పారు. సంస్థ నిర్వహణలో లోపాలున్నాయని, సిబ్బంది పట్ల సమానత్వం కరవైందని యూనియన్ గతంలో దిల్లీలోని రీజినల్ లేబర్ కమిషనర్‌కు, టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్‌కు లేఖ రాసింది.
నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు గురువారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:32 సమయానికి నిఫ్టీ 45 పాయింట్లు నష్టపోయి 22,256కు చేరింది. సెన్సెక్స్ 162 పాయింట్లు తగ్గి 73,287 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 105.5 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 83.8 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.5 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో ఫ్లాట్‌గా ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.03 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.18 శాతం దిగజారింది.బలహీన అంతర్జాతీయ సంకేతాలతో ప్రైవేట్ బ్యాంకులు, ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. సార్వత్రిక ఎన్నికల 3 దశల్లో ఓటింగ్‌శాతం తక్కువగా నమోదైందనే వార్తల నడుమ, విదేశీ అమ్మకాలు కొనసాగడమూ ఇందుకు తోడైంది. బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన ‘బీఓబీ వరల్డ్’ యాప్ ద్వారా కొత్త వినియోగదారులను చేర్చుకోకుండా గతంలో విధించిన ఆంక్షలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బుధవారం తొలగించింది. నియంత్రణపరమైన ఉల్లంఘనల కారణంగా 2023 అక్టోబరు 10న ఈ ఆంక్షలను ఆర్బీఐ విధించింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
రూ.1000 కోట్లు దాటిన టాటా కంపెనీ లాభం
న్యూఢిల్లీ: టాటా పవర్ చివరి త్రైమాసికం కన్సాలిడేటెడ్ నికర లాభం 11% పుంజుకుని రూ. 1,046 కోట్ల ను తాకింది. మొత్తం ఆదాయం రూ. 13,325 కోట్ల నుంచి రూ. 16,464 కోట్లకు జంప్‌చేసింది. షేరుకి రూ. 2 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది.ఇందుకు జులై 4 రికార్డ్ డేట్. పూర్తి ఏడాదికి టాటా పవర్ నికర లాభం రూ. 3,810 కోట్ల నుంచి రూ. 4,280 కోట్లకు బలపడింది. ఆదాయం సైతం రూ. 56,547 కోట్ల నుంచి రూ. 63,272 కోట్లకు ఎగసింది. ఇది కంపెనీ చరిత్రలోనే అత్యధికం.కంపెనీ ప్రకటన ప్రకారం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.1.4 లక్షల కోట్లను అధిగమించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ. 61,542 కోట్ల అత్యధిక ఆదాయాన్ని, రూ. 12,701 కోట్ల ఎబిటాను సాధించింది.
వీడియోలు
సీఎం జగన్ సభలో ఆసక్తికర ఫ్లెక్సీలు
సీఎం జగన్ పంచులతో దద్దరిల్లిన రాజంపేట..
చరిత్రలో నిలిచిపోయేలా.. అన్నమయ్య జిల్లా ప్రజలకు శుభవార్త
చంద్రబాబు కూటమి ఉమ్మడి సభలు పై సీఎం జగన్ అదిరిపోయే సెటైర్లు
చంద్రబాబు కు అధికారం వస్తే "జిల్లా హెడ్ క్వార్టర్స్"
రాజంపేట లో అశేష ప్రజా స్పందన
కూటమిని నమ్మి మోసపోతే.. పేదలకు మళ్లీ కష్టాలు తప్పవు
గత ఐదేళ్ళలో ఏ ఏ వర్గాల ప్రజల సంపద ఎలా పెరిగింది... వాస్తవాలు
సీఎం జగన్ మాస్ ఎంట్రీ @ రాజంపేట
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @రాజంపేట (అన్నమయ్య జిల్లా)
ఫ్యామిలీ
‘లాపతా లేడీస్’ నటి సంచలనం ఏకంగా కోటి ఫాలోయర్లు (ఫొటోలు)
ప్యాకేజ్డ్ స్నాక్స్, ఫిజీ డ్రింక్స్ నిజంగానే మంచివి కావా? శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..
ప్యాకేజ్డ్ ఫుడ్స్, కొన్ని రకాల ప్రిజర్వేటెడ్ డ్రింక్స్ తింటే మంచిదికాదని విన్నాం. వాటి వల్ల పలు రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు సూచించడం జరిగిది. అయితే శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనంలో అదే నిజమని ధృవీకరించారు. అందుకోసం సుమారు 30 ఏళ్లు జరిపిన సుదీర్ఘ అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవేంటంటే..బాగా ప్రాసెస్ చేసిన పిండులు(మైదా వంటివి)తో తయారు చేసే స్నాక్స్లు, డ్రింక్‌లు తీసుకుంటే ఆయుర్ధాయం తగ్గి, అకాల మరణాలు సంభవిస్తాయని వెల్లడయ్యింది. ప్యాకేజ్డ్ ఫుడ్స్ అయినా..ఆలు చిప్స్, బర్గర్, బేకరి పదార్థాల్లో ఎక్కువగా ఉప్పు, చక్కెర, సంతృప్త కొవ్వులు అధికంగా ఉంటాయని పరిశోధకులు తెలిపారు. వీటిలో శరీరానికి అవసరమయ్యే ఫైబర్, విటమిన్లు లేకపోవడం వల్ల అనారోగ్యానికి దారితీస్తుందని పేర్కొన్నారు. వీటిని ఎక్కువుగా తీసుకుంటే మధుమేహం, రక్తపోటు, హృదయ సంబంధ వ్యాధులు, కేన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు జరిపిన సుదీర్ఘ అధ్యయనంలో వెల్లడయ్యింది. అందుకోసం తాము 1984 నుంచి 2018 మధ్య సుమారు 11 యూఎస్ రాష్ట్రాల నుంచి70 వేల మంది మహిళా నర్సుల దీర్ఘాకాలిక ఆరోగ్యాన్ని ట్రాక్ చేయగా ఈ విషయాలు వెల్లడయ్యాయని చెప్పారు. బాగా శద్ధి చేసిన పిండులతో చేసిన బేకరి పదార్థాలను రోజుకు ఏడుసార్లకు పైగా తీసుకున్న వారిలో అకాల మరణాల ప్రమాదం 4% అని, ఇతర కారణాల వల్ల 9% అని వెల్లడించారు. వీటిని తీసుకోవడం వల్ల ముఖ్యంగా కేంద్ర నాడీవ్యవస్థకు సంబంధించిన సమస్యలతో మరణాలు సంభవించే ప్రమాదం 8%కి పైగా ఉందని చెప్పుకొచ్చారు పరిశోధకులు.ఇక మాంసం, పౌల్ట్రీ, సీఫుడ్ ఆధారిత ఉత్పత్తుల వల్ల కూడా అకాల మరణం సంభవించే ప్రమాదం ఎక్కువేనని చెప్పారు. ఇది పరిశీలనాత్మక అధ్యయనమే అయినప్పటికీ..ఇది ఎంతవరకు నిజం అనేందుకు కచ్చితమైన నిర్థారణలు లేవు. అయితే దీర్ఘకాలిక ఆరోగ్య కోసం శుద్ధి చేసిన పిండులతో చేసే పదార్థాల వినియోగాన్ని పరిమితం చేయాలనే విషయాన్ని మాత్రం అధ్యయనాలు నొక్కి చెబుతున్నాయని చెప్పారు. భవిష్యత్తులో పాసెస్డ్ ఫుడ్స్ వినియోగంపై మరిన్ని పరిశోధనలు చేసి వాస్తవాలను వెల్లడిస్తామని చెప్పారు పరిశోధకులు. (చదవండి: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!)
వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
వంట చేయడం వల్ల వచ్చే పొగ నుంచి గాలి కాలుష్యమవుతుంది. ఇటీవల కార్లలో వాసన చూస్తే కేన్సర్ వస్తుందని పలు నివేదికలు హల్ చల్ చేశాయి. తాజాగా మరో అధ్యయనం దిగ్భ్రాంతి రేపుతోంది. అదేంటో తెలియాలంటే మీరీ కథనం చదవాల్సిందే!పప్పు పోపు, పులిహోర తాలింపు, చికెన్, మటన్ మసాలా ఘుమ ఘుమలు లాంటివి రాగానే గాలి ఒకసారి అలా గట్టిగాపైకి ఎగ పీల్చి.. భలే వాసన అంటాం కదా. కానీ ఇలా వంట చేసేటపుడు వచ్చే వాసన గాలిని కలుషితం చేస్తుందని అధ్యయనం కనుగొంది. అమెరికాలో అత్యధిక సంఖ్యలో తినుబండారాలను కలిగి ఉన్న లాస్ వెగాస్‌లో గాలి నాణ్యత సమస్య ఎక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించారు.నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) చేసిన ఈ పరిశోధనలో రెస్టారెంట్లు, ఫుడ్ ట్రక్కులు , వీధి వ్యాపారుల వద్ద వంట చేసే రుచికరమైన వాసన గాలి నాణ్యతను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని కనుగొంది. పట్టణ వాయు కాలుష్యం ప్రభావంపై కెమికల్ సైన్సెస్ లాబొరేటరీ (CSL) పరిశోధకులు ఆశ్చర్యకరమైన ఫలితాలను విడుదల చేశారు. అమెరికాలోని లాస్ ఏంజిల్స్, లాస్ వేగాస్ ,కొలరాడోలోని బౌల్డర్ మూడు నగరాలపై దృష్టి సారించారు. ఈ నగరాల్లో వంటకు సంబంధించిన మానవ-కారణమైన అస్థిర కర్బన సమ్మేళనాలను (VOCలు) కొలుస్తారు. మీకు వాసన వచ్చిందంటే, అది గాలి నాణ్యతను ప్రభావితం చేసే మంచి అవకాశం ఉందంటున్నారు పరిశోధకులు.వెగాస్ బహిరంగ గాలిలో ఉన్న మొత్తం కర్బన సమ్మేళనాల్లో 21 శాతం వంటలనుంచి వచ్చినవేనని అధ్యయన రచయిత మాట్ కాగన్ చెప్పారు. వాహనాలు, అడవి మంటల పొగ, వ్యవసాయం, వినియోగదారు ఉత్పత్తులు వంటి విభిన్న వనరుల ఉద్గారాలను పరిశోధకులు అంచనా వేశారు. పట్టణాల్లో వీటిని లాంగ్-చైన్ ఆల్డిహైడ్లు అని పిలుస్తామని వెల్లడించారు. అయితే వంట చేయడం వల్ల వచ్చే వాయు కాలుష్యం చాలా తక్కవే అని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో దాదాపు నాలుగింట ఒక వంతు ఉద్గారాలకు వంట వాసన కారణమవుతుందని పరిశోధకులు నిర్ధారించారు. అంతేకాదు ఇంటి లోపల ,ఇళ్ల లోపల సమస్య మరింత తీవ్రంగా ఉందని నిపుణులు హెచ్చరించారు.
పిజ్జా లవ్ : ఇద్దరమ్మాయిలు చేసిన పని తెలిస్తే షాక్ అవుతారు
పిజ్జా అంటే చెప్పలేనంత ప్రేమ ఇద్దరు స్నేహితులు చేసిన తెలిస్తే షాక్ అవుతారు. ఒకరోజు సెలవుపెట్టి ఏకంగా విమానంలో వెళ్లి మరీ పిజ్జా ఆరగించి వచ్చారు. దీనికి ఎంత ఖర్చయిందో తెలుసా? మాంచెస్టర్ ఈవెనింగ్ న్యూస్ ప్రకారం, యూకేకుచెందిన మోర్గాన్ బోల్డ్, ఆమె స్నేహితురాలు జెస్ వుడర్ ఇద్దరూ "ఎక్స్ట్రీమ్ డే ట్రిప్"ని ప్లాన్ చేసారు. అంటే ఒక్క రోజులోనే తిరిగి ఆఫీసుకు వచ్చేసేలా అన్నమాట. దీని ప్రకారం ఇద్దరు స్నేహితులు లివర్‌పూల్ నుండి పిసాకు (ఇటలీలో) మాంచెస్టర్ విమానాశ్రయంలో విమానంలో వెళ్లారు. డే రిటర్న్ ఫ్లైట్లను బుక్ చేసుకున్నారు. ఏప్రిల్ 24న ఉదయం 6 గంటలకు బయలుదేరి రాత్రి 11 గంటలకు ఇంటికి చేరుకోవడం విశేషం. ఈ సుడిగాలి పర్యటనలో షాపింగ్ చేసుకొని, తమకిష్టమైన పిజ్జాను ఆస్వాదించారు.బోల్డ్, వుడర్ లీనింగ్ టవర్ ఆఫ్ పిసా ముందు ఫోటోలు తీసుకున్నారు. గూగుల్ మ్యాప్‌లో మంచి పిజ్జాతో రెస్టారెంట్లకు వెతుక్కున్నారు. విమానచార్జీలు, విమానాశ్రయం పార్కింగ్, ఫుడ్ కలిపి మొత్తం పర్యటనకు 170 పౌండ్లు (రూ. 17,715) వెచ్చించామని తెలిపారు. లివర్పూల్నుంచి లండన్‌కి ఇంతకంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. పైగా అక్కడ పిజ్జా ఇతర డ్రింక్స్ ఖరీదు చాలా ఎక్కువ. దాదాపు అదే డబ్బుతో వేరే దేశం వెళలి వచ్చామంటూ చెప్పుకొచ్చారు. పిసా టవర్‌ను చూస్తూ పిజ్జా తినడం అద్భుతం. ఇక్కడఆహార ధరలు రీజనబుల్‌గానే ఉన్నాయంటూ వెల్లడించారు. వచ్చిన విమానంలోనే తిరిగి ఇంటికి వెళ్లడం ఇంకా బావుందంటూ తెగ సంబరపడిపోయారు.
న్యూస్ పాడ్‌కాస్ట్
దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా కనిపిస్తారు... కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై తీవ్ర దుమారం.. ఇంకా ఇతర అప్డేట్స్
నేడు వేములవాడకు నరేంద్ర మోదీ... రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్న ప్రధానమంత్రి... ఇంకా ఇతర అప్డేట్స్
క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
భూమి లాక్కున్నట్లు ఒక్క రైతయినా చెప్పాడా అంటూ చంద్రబాబు, ఎల్లో మీడియాకు సీఎం జగన్ సూటి ప్రశ్న.. ఇంకా ఇతర అప్డేట్స్
నాకు బిడ్డలు లేరు, ప్రజల బిడ్డల కోసమే నా తపన.. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటన.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం పట్ల ఎన్నికల సంఘం సీరియస్.. తక్షణం దర్యాప్తు చేసి, చర్యలు తీసుకుని నివేదిక ఇవ్వాలని సీఐడీకి ఆదేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
అవ్వాతాతల పెన్షన్లపై చంద్రబాబు పాపిష్టి కళ్లు.. నరసాపురం, క్రోసూరు, కనిగిరి ప్రచార సభల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం.. ఇంకా ఇతర అప్డేట్స్
కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు పాకిస్తాన్ ఆరాటం.. గుజరాత్ ప్రచారంలో ప్రధాని మోదీ విమర్శలు.. ఇంకా ఇతర అప్డేట్స్
తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై నిషేధం.. 48 గంటలపాటు ప్రచారం ఆపేయాలన్న కేంద్ర ఎన్నికల సంఘం .. ఇంకా ఇతర అప్డేట్స్
చంద్రబాబుది బోగస్ రిపోర్ట్.. జగన్‌ది ప్రోగ్రెస్ రిపోర్ట్... టంగుటూరు, మైదుకూరు, కలికిరి ఎన్నికల సభల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టీకరణ.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
రాసలీలల రామ్మోహన్!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ తూర్పు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహనరావు మహిళలపై లైంగిక వేధింపుల వ్యవహారం బట్టబయలైంది. పలువురు మహిళలతో అసభ్యకరంగా చాటింగ్ చేసినట్టు వెల్లడైంది. ప్రస్తుతం వాట్సప్ చాటింగ్, స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విజయవాడలోని వివిధ వాట్సప్ గ్రూపుల్లో, ఫేస్ బుక్ పేజీల్లో, ఇన్‌స్ట్రాగాం వేదికల్లో అవి చక్కెర్లు కొడుతుండటంతో ఆయన లీలలపై తూర్పు నియోజకవర్గ ఓటర్లు ముక్కున వేలేసుకుంటున్నారు. మహిళా ఓటర్లయితే గద్దెకు గుణపాఠం చెబుతామని స్పష్టం చేస్తున్నారు. ఇన్నాళ్లకు గద్దె నిజ స్వరూపం బట్ట బయలైందని టీడీపీ వర్గీయులే వ్యాఖ్యానించిడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయనకు 15 ఏళ్లుగా అనుచరుడిగా ఉన్న ఒకరు ఆయన రాసలీలల వ్యవహారాలను ఆధారాలతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం విజయవాడ నగరంలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల గద్దె ప్రధాన అనుచరుడు మహిళలను వేధింపులకు గురిచేసి, దాడి చేయడంతో పటమట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఏకంగా గద్దె వాట్సప్ చాటింగ్ వెలుగులోకి రావడంతో టీడీపీ ఆత్మరక్షణలో పడింది. ఇప్పటికే తూర్పు నియోజక వర్గంలో గద్దె గ్రాఫ్ పడిపోవడంతో తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వాట్సప్ చాటింగ్స్ వ్యవహారం వెలుగులోకి రావడంతో తూర్పు నియోజకవర్గంలో టీడీపీ ఓటమి ఖాయమని ఆ పార్టీ నాయకులే తేల్చిచెబుతున్నారు.
ఈత సరదా ప్రాణం తీసింది
వైఎస్సార్: లింగాల మండలం తాతిరెడ్డిపల్లెలో ఈత నేర్చుకోవాలని చిన్నారి సరదా పడగా... ప్రమాదవశాత్తూ ఆమె ప్రాణం తీసింది. స్థానికుల వివరాల మేరకు.. తాతిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన తోట రవీంద్రారెడ్డి, మంజుల దంపతుల కుమార్తె మహిత(12) బుధవారం గ్రామంలోని చెరువులో ఈత నేర్చుకునేందుకు తోటి పిల్లలతో కలిసి వెళ్లింది.నడుముకు ఖాళీ క్యాన్ కట్టుకుని చెరువులో ఈత కొట్టేందుకు దిగారు. ఆ సమయంలో నడుముకు ఉన్న క్యాన్ ఊడిపోయింది. అక్కడున్న పిల్లలు, పెద్దలు చూస్తుండగానే భయానికి గురైన మహిత నీటిలో మునగగానే మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. కుమార్తె మృతిచెందడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
యశవంతపుర: అంబులెన్స్– కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన దుర్ఘటన కర్ణాటక– కేరళ సరిహద్దుల్లోని కాసరగోడులో మంగళవారం జరిగింది. మృతులను కేరళ త్రిసూరు జిల్లా గురువాయురుకు చెందిన శ్రీనాథ్ (54), ఆయన కొడుకులు శరత్ (18), మనన్ (15) గుర్తించారు శ్రీనాథ్ దుబాయ్‌లో ఉద్యోగం చేస్తూ సెలవులు పెట్టి ఊరికి వచ్చాడు. ఆయన భార్య స్మిత అక్కడే ఓ ఇంటర్నెట్ సెంటర్ నిర్వహిస్తున్నారు. ఆమెకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో వారితో పాటు రాలేకపోయారు. ఈ క్రమంలో ముగ్గురూ కలిసి బెంగళూరులో బంధువులను కలవాలని బయల్దేరారు. ముగ్గురూ కారులో కొల్లూరు మూకాంబిక ఆలయంలో అమ్మవారి దర్శనం చేసుకుని వెళుతుండగా, మంజేశ్వర వద్ద ఎదురుగా వేగంగా వచ్చిన అంబులెన్స్ ఢీకొట్టింది. ఆ ధాటికి రెండు వాహనాలూ పలీ్టలు కొట్టాయి. తండ్రీ కొడుకులు కారులోనే దుర్మరణం చెందారు. అంబులెన్స్ డ్రైవర్, ఇద్దరికి కూడా గాయాలు తగిలాయి. ప్రమాదం ఊళ్లోనే జరగడంతో పెద్దసంఖ్యలో జనం పోగయ్యారు. పోలీసులు చేరుకుని మృతదేహాలను, బాధితులను ఆస్పత్రులకు తరలించారు. ఘటనాస్థలమంతా రక్తసిక్తమై భీతావహంగా మారింది. ఈ విషయాన్ని ఊళ్లోని శ్రీనాథ్ భార్యకు ఇంకా చెప్పలేదని, ఇంత ఘోరం జరుగుతుందనుకోలేదని మృతుల బంధువుల విలపించారు.
కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని ప్రత్యేక కోర్టు మరోసారి పొడిగించింది. ఈడీ కేసులో ఈ నెల 14వ తేదీ వరకు.. సీబీఐ కేసులో ఈ నెల 20వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసుల్లో ఇంతకు ముందు విధించిన జ్యుడీషియల్ కస్టడీ గడువు ముగియడంతో.. అధికారులు కవితను రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున కస్టడీ పొడిగించాలని ఈడీ తరఫు న్యాయవాది నవీన్‌కుమార్ మట్టా కోరారు.కుంభకోణంలో కవిత పాత్రపై ఒకట్రెండు రోజుల్లో చార్జిషీటు దాఖలు చేస్తామని కోర్టుకు వివరించారు. మరోవైపు సీబీఐ కేసులో న్యాయవాది పంకజ్ గుప్తా వాదనలు వినిపిస్తూ.. కవితతో సంబంధాలు ఉన్న మరికొందరిని విచారించాల్సి ఉందని, దర్యాప్తు సజావుగా సాగాలంటే జ్యుడీషియల్ కస్టడీ పొడిగించాలని కోరారు. ఇక ఈడీ కేసులో కవిత తరఫు న్యాయవాది నితీశ్‌రాణా వాదనలు వినిపిస్తూ.. కుటుంబ సభ్యులు కవితతో 15 నిమిషాలు మాట్లాడటానికి అనుమతించాలని కోరారు. కోర్టు లాకప్‌లో పిటిషనర్ భర్త తీసుకొచ్చిన ఆహారాన్ని అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. జైలుకు పంపుతున్న ఇంటి భోజనాన్ని కూడా జైలు సూపరింటెండెంట్ ఒక్కరే తనిఖీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే న్యాయమూర్తి జోక్యం చేసుకుని.. కవితకు ఇంటి భోజనం నిలిపివేశాక కూడా మళ్లీ ఎందుకు అడుగుతున్నారని, దీనిపై జైలు సూపరింటెండెంట్ వివరణ ఇవ్వాలని ఆదేశించారు. తర్వాత కవిత జ్యుడీషి యల్ కస్టడీలను పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కవితకు చదువుకోవ డానికి పది పుస్తకా లను అనుమతించాల ని జైలు అధికారులకు సూచించారు. ఈడీ, సీబీఐ కేసులలో ప్రత్యేక కోర్టుకు కవితకు బెయిల్ నిరాకరించిన నేపథ్యంలో.. ఆమె న్యాయవా దులు బుధవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించినట్టు తెలిసింది.నా అరెస్టు అన్యాయం: కవితఅధికారులు ప్రత్యేక కోర్టు ప్రాంగణంలోకి కవితను తీసుకువచ్చినప్పుడు.. ‘జైతెలంగాణ.. జై భారత్’ అంటూ నినాదాలు చేశారు. కోర్టు హాల్ నుంచి బయటకు వస్తున్న సమయంలో.. ప్రజ్వల్ రేవణ్ణ వంటి వాళ్లను దేశం దాటించి, తనలాంటి వారిని అరెస్టు చేయడం అన్యాయమని కవిత వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని పేర్కొన్నారు.