Top Stories
ప్రధాన వార్తలు
రేవ్‌పార్టీ కేసులో ట్విస్ట్
బెంగళూరు, సాక్షి: నగరంలో వెలుగు చూసిన రేవ్ పార్టీలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయ, సినీ ప్రముఖులు ఇందులో పాల్గొన్నట్లు పక్కా సమాచారం అందుతోంది. వాళ్ల నుంచి బెంగళూరు నార్కొటిక్స్ విభాగం శాంపిల్స్ సేకరించగా.. అసలు ఈ రేవ్ పార్టీ వెనుక ఎవరున్నారనేది తేల్చే పనిలో ఉన్నారు బెంగళూరు పోలీసులు.ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో రేవ్ పార్టీ కలకలం రేగింది. ఆదివారం అర్ధరాత్రి బర్త్ డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీని నిర్వహించగా.. పోలీసులు దాడి చేశారు. ఈ రేవ్ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడకం కూడా జరిగింది. పట్టుబడ్డ వాళ్లలో సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నారు.సదరు జీఆర్ ఫామ్‌హౌస్ హైదరాబాద్ కాన్కార్డ్ సంస్థకు గోపాల్ రెడ్డికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌కు చెందిన వాసు అనే వ్యక్తి ఈ పార్టీని ఏర్పాటు చేసినట్లు, విమానంలో యువతీయువకులను తరలించినట్లు పోలీసులు నిర్ధారించారు. తెల్లవారుజామున 3 వరకు జరుగుతున్న రేవ్ పార్టీపై పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. రేవ్ పార్టీలో పోలీసులకు భారీగా డ్రగ్స్, కోకైన్ లభ్యమయ్యాయి. కర్ణాటక, తెలుగు రాష్ట్రాలకు చెందిన వంద మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్టీలో 25 మందికి పైగా యువతులు ఉన్నారు. సుమారు 15 విలువైన కార్లను పోలీసులు సీజ్ చేశారు. రేవ్ పార్టీలో తెలుగు సీనీ ఇండస్టీకి చెందిన వారు ఉన్నట్లు బయటకు రావడం కలకలం రేపుతోంది. ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు బెంగళూరు సీసీబీ పోలీసులు. ఆ కథనాల్ని ఖండించిన కాకాణిరేవ్‌పార్టీలో దొరికిన ఓ కారుతో ఏపీ మంత్రి కాకాణి గోవర్థన్‌కు సంబంధం ఉన్నట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రచురిస్తున్నాయి. దీనిపై ఆయన స్పందించారు. బెంగళూర్ రేవ్ పార్టీలో దొరికిన కారుతో నాకు సంబంధం లేదు. కారుపై స్టిక్కర్ ఒరిజినాలా? ఫొటో కాపీనా? అనేది పోలీసులే తేలుస్తారు. 2023తో ఆ స్టిక్కర్ కాలపరిమితి ముగిసింది అని కాకాణి అన్నారు.నాకు సంబంధం లేదు: సినీ నటి హేమ‘‘నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. నాకు బెంగుళూరు రేవ్ పార్టీ తో సంబంధం లేదు. అనవసరంగా నన్ను లాగుతున్నారు. కన్నడ మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు’’ అని సినీ నటి హేమ ప్రకటించారు. అయితే హేమ ప్రకటన చేసిన కాసేపటికే పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు. ఆమె పార్టీలో పాల్గొందంటూ బెంగళూరు పోలీసులు ఒక ప్రకటన ఇచ్చినట్లు తెలుస్తోంది.రాజకీయ ప్రముఖులు సైతంబెంగళూరు రేవ్ పార్టీలో పట్టుబడ్డ వంద మందిలో 70 మంది పురుషులు, 30 మంది యువతులు ఉన్నారు. అయితే వీళ్లలో సినీ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు సైతం ఉన్నట్లు సమాచారం. వాసు అనే వ్యక్తి పేరు మీద ఈ పార్టీ జరగ్గా.. అసలు ఈ పార్టీ వెనుక ఎవరున్నారనేది తేల్చే పనిలో ఉన్నారు. ప్రస్తుతం పట్టుబడ్డ వాళ్ల నుంచి శాంపిల్స్ సేకరించే పనిలో ఉంది బెంగళూరు నార్కోటిక్స్ విభాగం.
కవిత కస్టడీ జూన్ 3 వరకు పొడగింపు
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యు కోర్టు మరోసారి పొడగించింది. ఇవాళ(సోమవారం) మధ్యాహ్నం రౌస్ అవెన్యు కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను తిహార్ జైలు అధికారులు ప్రవేశపెట్టారు. సీబీఐ కేసులో విచారణ జరిపిన అనంతరం కవిత కస్టడీనీ జూన్ 3 వరకు పొడగిస్తున్నట్లు రౌస్ అవెన్యు కోర్టు న్యాయమూర్తి తెలిపారు. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు చేసిన నేపథ్యంలో ఆమె ప్రస్తుతం తిహార్ జైల్లో ఉంటున్న విషయం తెలిసిందే. ఈ కేసులో కవిత పాత్రను ప్రస్తావిస్తూ ఇటీవల ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది. మరోవైపు ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఈ నెల 24న విచారణ చేపట్టనుంది.
ఇలా.. అన్నింటిలోనూ డబుల్ గేమ్ నిపుణులే..!
కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండి కూటమి అధికారంలోకి వస్తే అయోధ్యలోని శ్రీరాముడు మళ్లీ టెంట్ కిందకు వస్తాడు.. ఆలయంపై బుల్డోజర్ పంపుతారు.. ఇది దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఒక వ్యాఖ్య. పార్లమెంటు ఎన్నికల ప్రచారం సందర్భంగా మోదీ ఇంత మాట ఎలా అన్నారో అర్దం కాదు. ఈ మాట విన్నప్పుడు ఒక్కసారిగా దేశ ప్రజలంతా ఆశ్చర్యం చెందారు. మోదీనేనా ఇలా మాట్లాడుతుంది.. అని అంతా విస్తుపోయారు. దాంతో మోదీ ఈసారి ఎందుకో తడబడుతున్నారన్న భావన ఏర్పడింది. గత రెండు ఎన్నికలలో మోదీ ఇంత ఘోరంగా మాట్లాడారన్న విమర్శలు రాలేదు. ఈ ఒక్కటే కాదు. కాంగ్రెస్ గెలిస్తే పాకిస్తాన్ సంతోషిస్తుందని, ముస్లింలను అప్పీజ్ చేస్తోందని, ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఇలాంటి అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.⇒ అంటే ఈ విమర్శల ద్వారా హిందూ ఓట్ల పోలరైజేషన్‌కు మోదీ, ఆయనతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా లు ప్రయత్నించారు. ఇక్కడ కూడా వారు డబుల్ గేమ్ ఆడారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ముస్లింలకు ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రకటించారు. గతంలో కర్నాటకలో కూడా అలాగే చేశారు. అయినా అక్కడ ప్రభుత్వాన్ని నిలబెటుకోలేకపోయారు. తెలంగాణలో ఆ పాయింట్ పైన కూడా గట్టి ఉపన్యాసాలు చేశారు. కానీ ఏపీకి వెళ్లేసరికి అక్కడ మళ్లీ టీడీపీ, జనసేనల కూటమితో కలిసి ఉండడంతో, ముస్లిం రిజర్వేషన్ల గురించి ప్రసంగాలలో ప్రస్తావించకపోవడం కూడా అందరూ గమనించారు.⇒ 2014 ఎన్నికల సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ ఉన్నారు. ఆయన వ్యూహాత్మకంగా దేశం అంతటా గుజరాత్లో జరిగిన అబివృద్ది అంటూ టీవీలలో, పత్రికలలో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. తద్వారా ఒక ఇమేజీని తెచ్చుకున్నారు. నిజానికి అప్పటికి ఆయన బీజేపీ ప్రధాని అభ్యర్దిగా కూడా నిర్ణయం కాలేదు. కానీ తన ప్రచార వ్యూహం ద్వారా బీజేపీని కూడా ఆయన ప్రభావితం చేయగలిగారు. దేశ ప్రజలంతా మోదీ అంటే అభివృద్ది అని నమ్మారు. గుజరాత్లో ఆయన బాగా చేశారన్న భావన బాగా బలపడింది. ఆ రోజుల్లో టీవీలలో ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వెంటనే జనం నుంచి నిరసన వచ్చేది. నేను లైవ్ షో చేస్తున్నప్పుడు సైతం ఈ అనుభవం చూశాను. ఎక్కడైనా మోదీని ఒక్క మాట అంటే జనం ఊరుకునేవారుకారు. అలాంటిది దశాబ్దం తర్వాత మోదీని లైవ్ షోలలో ఫోన్ చేసి ప్రజలే విమర్శిస్తున్నారు.⇒ అంతమాత్రాన ఆయనపై పూర్తి వ్యతిరేకత ఏర్పడిందని కాదు. కానీ ఒక నేత ఎలా ఉండాలని అనుకుంటారో ఆయన అలా లేరన్న భావన పెరుగుతోందన్నమాట. ప్రత్యేకించి రామాలయంపై బుల్డోజర్ నడుపుతారన్న ఆయన ఆరోపణను ఎవరూ జీర్ణించుకోలేదు. ఆయనను సమర్ధించేవారు సైతం మోదీ అలాంటి విమర్శ చేసి ఉండాల్సింది కాదనే అనుకుంటున్నారు. ప్రధాని మోదీ వెయ్యి, ఐదు వందల రూపాయల నోట్లు రద్దు చేసి, రెండువేల రూపాయల నోట్లు తెచ్చినప్పుడు చాలామందికి అంత ఇష్టం లేదు. దానివల్ల సామాన్యులు చాలా కష్టపడ్డారు. అయినా మోదీ చిత్తశుద్దిని జనం శంకించలేదు. దేశం కోసం, నల్లధనం నిర్మూలనకోసమే ఆయన ఇలా చేసి ఉండవచ్చులే అని సర్దుకున్నారు.⇒ జీఎస్టీ వంటివాటిపై కూడా భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ అప్పట్లో బీజేపీ గెలవదన్న అంచనాకు వచ్చిన సీనియర్ నేత చంద్రబాబు నాయుడు వంటివారు బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి నుంచి వైదొలిగారు. ఆ తరుణంలో జరిగిన పుల్వమా ఘటనతో దేశం మూడ్ మారిపోయింది. పాక్ ఉగ్రవాదులు మన సైనికులు ఉన్న బస్‌ను పేల్చడంతో, మోదీ ధైర్యంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌కు వైమానిక దళాన్ని పంపించి ఉగ్రవాద శిబిరాలను ద్వంసం చేయించారు. అప్పుడు ఇండియా పైలట్ ఒకరు పాక్‌కు పట్టుబడగా, జాగ్రత్తగా హాండిల్ చేసి ఆయనను భద్రంగా ఇండియాకు తీసుకు రాగలిగారు. దాంతో మోదీపై విశ్వాసం పెరిగింది. మళ్లీ మోదీ వేవ్ వీచి ఎన్డీఏ కేంద్రంలో అధికారంలోకి రాగలిగింది.⇒ 2019 ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీని టెర్రరిస్తు అని విమర్శించారు. భార్యను ఏలుకోలేని వ్యక్తి దేశాన్ని ఏమి ఏలతారని అన్నారు, ముస్లింలను బతకనివ్వరని, మంచివాడు కాదని.. అవినీతిపరుడని.. ఇలా ఏవేవో పిచ్చి విమర్శలు చేశారు. దానికి ప్రతిగా చంద్రబాబు అవినీతి పరుడని, పోలవరం ప్రాజెక్టును ఏటీఎమ్ మాదిరి వాడుకున్నారని మోదీ ధ్వజమెత్తారు. లోకేష్ తండ్రి అంటూ చాలా వ్యంగ్యంగా చంద్రబాబు సీనియారిటీపై విమర్శనాస్త్రాలు సంధించారు. కానీ 2024 నాటికి చంద్రబాబు ఆధ్వర్యంలోని టీడీపీతో జతకట్టడం ప్రజలందరిని ఆశ్చర్యపరిచింది. మోదీ ఎంతో వ్యక్తిత్వం, ఆత్మ గౌరవం ఉన్న నేత అని భావిస్తున్న సపోర్టర్లకు ఆయన షాక్ ఇచ్చారని చెప్పాలి.⇒ అలాగే టెర్రరిస్టు అన్న నోటితోనే చంద్రబాబు నాయుడు విశ్వగురు అంటూ మోదీని పొగిడారు. మరి వీళ్లిద్దరూ గతంలో దూషించుకున్న విషయాలను నమ్మిన ప్రజలు ఏమైపోవాలి. వీరు మారితే ప్రజలంతా మారిపోవాలా? అన్న చర్చ జరిగింది. దేశ ప్రధాని అయిన తర్వాత రాజకీయ నేతగా కాకుండా రాజనీతిజ్ఞుడుగా మారాలని అంతా ఆశిస్తారు. గతంలో చేసిన పలువురు ప్రధాన మంత్రులు చాలావరకు అలాగే వ్యవహరించారు. ప్రతిదానిలోను రాజకీయం చూడలేదు. రాజకీయ ప్రత్యర్ధులపై విమర్శలు చేసినా చాలా హుందాగా ఉండేవి. వ్యక్తిగత ఆరోపణలకు చాలా తక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ మోదీ రాష్ట్రస్థాయి నాయకులతో పోటీపడినట్లుగా, ఏ రాష్ట్రానికి వెళితే అక్కడ వారిపై వ్యక్తిగత ఆరోపణలు చేయడానికి వెనుకాడలేదు.⇒ ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. అవినీతిపరులను జైలులోనే ఉంచుతామని తాజాగా ఆయన చేసిన ప్రకటనను కూడా జనం సీరియస్‌గా తీసుకోవడం లేదు. డిల్లీ లిక్కర్ స్కామ్ అంటూ ఒకదానిని తీసుకుని ఆప్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను, ఆయన మంత్రులు కొందరిని జైలులో పెట్టి కక్ష తీర్చుకుంటున్నారన్న విమర్శ వచ్చింది. అదే టైమ్‌లో వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను ఎగవేసిన వారిని, వందల కోట్ల మోసాలు చేసినవారిని బీజేపీలో చేర్చుకుని వారికి ఏకంగా ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్లు ఇచ్చి, వారికోసం ప్రచారానికి స్వయంగా వెళుతున్న వైనం తీవ్ర విమర్శలకు గురి అవుతోంది. నిజంగా మోదీకి అవినీతిని అంతం చేయాలన్న చిత్తశుద్ది ఉందా అన్న సందేహం కలుగుతుంది.⇒ గతంలో రఫేల్ యుద్ధ విమానాల కొనుగోళ్లలో పలు ఆరోపణలు వచ్చినా జనం పట్టించుకోలేదు. కానీ మతం పేరుతో బీజేపీ రాజకీయం చేస్తున్నదన్న భావన ప్రజలలో ప్రబలితే అది వారికి తీవ్ర నష్టం కలిగిస్తుంది. అసలు మోదీ బుల్డోజర్ విమర్శలు చేయగానే అందరికి గుర్తుకు వచ్చింది యూపీ ముఖ్యమంత్రి యోగి బుల్డోజర్ తోనే ప్రభుత్వం నడిపారన్న వ్యాఖ్య ఉంది. రౌడీ షీటర్లు, అల్లర్లకు పాల్పడిన వారిని చట్టం ప్రకారం శిక్షించడం కాకుండా బుల్డోజర్లతో వారి ఇళ్లు కూల్పించారు. ఇప్పుడు ఆరోపణ మోదీ కాంగ్రెస్ పై చేస్తున్నారు. అంతేకాదు, అయోధ్యలో వివాదాస్పద బాబ్రి మసీదును కూల్చింది కూడా బీజేపీనే అన్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి మత రాజకీయాలు చేయడంలో బీజేపీదే అగ్రస్థానంగా ఉందన్నది వాస్తవం. అయినా మోదీ కాంగ్రెస్‌పై మతపరమైన ఆరోపణలు చేస్తుంటారు. అలా అని కాంగ్రెస్ ఏదో పత్తిత్తు అనడం లేదు.⇒ తెలంగాణలో ఆర్ఆర్టాక్స్ అంటూ మోదీ విమర్శలు చేశారు. బాగానే ఉంది. మరి గతంలో ఏపీలో ఎన్నికల ప్రచారంలో చంద్రబాబును అవినీతిపరుడని విమర్శించారు కదా.. ఇప్పుడు ఎలా కలిశారంటే అందుకు జవాబుదొరకదు. చంద్రబాబు పీఎస్ ఇంటిలో సోదాలు జరిపి రెండువేల కోట్ల అక్రమాలు కనుగొన్నట్లు కేంద్రం ప్రకటన చేసింది కదా.. అదేమైంది అని ఎవరైనా అడిగితే బదులు ఉండదు. చంద్రబాబుకు ఆదాయపన్ను శాఖ నోటీసులు ఇచ్చిన విషయంలో ఏమి తేల్చారో ఎవరూ చెప్పరు. మహారాష్ట్రలో మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు పలు ఆరోపణలు చేసిన బీజేపీ, ఆయన తమ పార్టీలో చేరగానే రాజ్యసభ సీటు ఇచ్చి మరీ ఆదరించింది. దీనిని ఏ విధంగా చూడాలి. ఇలా అన్నిటిలొను డబుల్ గేమ్ ఆడుతున్న నేతలలో మోదీ చేరడం ఆయనను అభిమానించేవారికి కాస్త బాధ కలిగించే విషయమే కదా!⇒ మరో విషయం మాట్లాడుకోవాలి. ఒకవైపు బీజేపీ ఉచితాలకు వ్యతిరేకం అని ప్రచారం చేస్తారు. ఇంకోవైపు ఆయా రాష్ట్రాలలో రకరకాల ఉచిత వాగ్దానాలు చేస్తుంటారు. ఉదాహరణకు ఒడిషాలో శాసనసభ ఎన్నికలలో ప్రతి మహిళకు ఏభైవేల రూపాయల ఓచర్ ఇస్తామని బీజేపీ ఎన్నికల ప్రణాళికలో పెట్టిందట. ఈశాన్య రాష్ట్రాలలో క్రైస్తవులు అధికంగా ఉంటారు కనుక అక్కడ ఉచితంగా జెరుసలెం యాత్రకు హామీ ఇస్తుంటారు.ఏపీలో టీడీపీ, జనసేనలు ప్రకటించిన మానిఫెస్టోతో తమకు సంబంధం లేదని చెబుతారు. అదే టైమ్ లో వారి మానిఫెస్టోకి మద్దతు ఇస్తున్నామని అంటారు. దీని అర్ధం ఏమిటో ఎవరికి తెలియదు. బీజేపీలో ఇతర పార్టీ అభ్యర్ధులను తీసుకుని టిక్కెట్లు ఇస్తుంటారు. దేశ వ్యాప్తంగా 108 మంది ఫిరాయింపుదారులకు బీజేపీ టిక్కెట్లు ఇచ్చిందని లెక్కలు చెబుతున్నాయి. అంటే మొత్తం అభ్యర్ధులలో నాలుగో వంతు ఇతర పార్టీలకు చెందినవారే అన్నమాట.⇒ అంతదాకా ఎందుకు ఏపీలో ఆరుగురు అభ్యర్ధులలో ఐదుగురు వేరే పార్టీల నుంచి వచ్చి చేరినవారే. వారిలో కొందరు టీడీపీ కోవర్టులుగా ముద్రపడ్డవారు. తెలంగాణలో సైతం పదిమందికి పైగానే ఫిరాయింపుదారులకు బీజేపీ టిక్కెట్లు ఇచ్చింది. ఇలాంటి పరిస్థితిలో గతంలో కాంగ్రెస్ పార్టీ తీరుకు, ఇప్పుడు బీజేపీ తీరుకు పెద్ద తేడా ఉన్నట్లు అనిపించదు. ఇందిరాగాంధీ ఎమర్జన్సీ పెట్టి ప్రతిపక్ష నేతలను జైళ్లలో పెట్టారు. ఇప్పుడు ఎమర్జన్సీ లేకుండానే ఏదో కేసులో పెట్టి తమకు గిట్టనివారిని జైలుకు పంపుతున్నారన్న విమర్శలను మోదీ ఎదుర్కుంటున్నారు. అదే టైమ్‌లో బీజేపీలో చేరగానే కేసులు ఏవీ ముందుకు వెళ్లకుండా ఆగిపోతున్నాయన్న బావన ఏర్పడింది. అందుకే ఆయా రాష్ట్రాలలో కొంతమంది తాము ఎన్ని అవినీతి పనులు చేసినా బీజేపీ గొడుగు కిందకు చేరి రక్షణ పొందుతున్నారన్న అబిప్రాయం వ్యాపిస్తోంది.⇒ ఇది మోదీ ప్రభుత్వానికి మంచిది కాదు. ఇలాంటి కారణాల వల్లే ఈసారి బీజేపీకి పూర్తి మెజార్టీ వస్తుందా? రాదా? అన్న చర్చ జరుగుతోంది. ఎన్డీఏకి 400 సీట్లు వస్తాయని ప్రధాని మోదీతోపాటు బీజేపీ నేతలు పలువురు చెబుతున్నా, అదంతా మేకపోతు గాంభీర్యంగానే కనిపిస్తుంది. అయినప్పటికీ మోదీ వంటి పెద్ద నేత తన ప్రసంగాలలో సంయమనంగా ఉంటేనే మంచిది. దానివల్ల దేశ రాజకీయాలు కొంత ఆరోగ్యకరంగా సాగడానికి అవకాశం ఉంటుంది. విశేషమేమిటంటే శ్రీరాముడిని సొంతం చేసుకుని రాజకీయాలు సాగించాలన్న వ్యూహంలో ఉన్న బీజేపీ రామాలయం ఉన్న అయోధ్యలోనే తీవ్రమైన పోటీ ఎదుర్కుంటోందట.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయలు
May 20th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
May 20th AP Elections 2024 News Political Updates2:20 PM, May 20th, 2024ఏపీలో కొత్త పోలీస్ అధికారుల నియామకంఈసీ సస్పెండ్ చేసిన అధికారుల అధికారుల స్థానంలో కొత్తవాళ్ల నియామకంతాడిపత్రి డీఎస్పీగా జనార్థన్నాయుడుతాడిపత్రి సీఐగా నాగేంద్ర ప్రసాద్తిరుపతి డీఎస్పీగా మనోహరచారితిరుపతి ఎస్బీ సీఐగా విశ్వనాథ్గురజాల డీఎస్పీగా సీహెచ్ శ్రీనివాసరావు.. 2:06 PM, May 20th, 2024కాసేపట్లో డీజీపీకి సిట్ నివేదికఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలపై సిట్ ప్రాధమిక నివేదిక సిద్దంఉదయం నుంచి డిజిపి ప్రధాన కార్యాలయంలోనే కూర్చుని ప్రాధమిక నివేదిక సిద్దం చేస్తున్న ఐజీ వినీత్ బ్రిజ్ లాల్మరికాసేపట్లో డిజిపి హరీష్ కుమార్ గుప్తాకి సిట్ ప్రాధమిక నివెదికసిట్ ప్రాధమిక నివేదికపై తీవ్ర ఉత్కంఠగత రెండు రోజులగా పల్నాడు, అనంతపురం,తిరుపతి జిల్లాలలో సిట్ బృందాలు క్షేత్రస్ధాయి పర్యటన33 ఎఫ్ఐఆర్ లు, సీసీ కెమెరా ఫుటేజ్ లు పరిశీలనఘటనలు జరిగిన గ్రామాలు సందర్శన1:32 PM, May 20th, 2024చింతమనేని ఎక్కడ?పరారీలో దెందులూరు కూటమి అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పోలింగ్ టైంలో అల్లర్లకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్ పెదవేగి మండలం కొప్పులవారిగూడెం పీఎస్‌పై చింతమనేని దాడిసినీ ఫక్కీలో దాడి చేసి అరెస్టైన వ్యక్తిని విడిపించిన చింతమనేనిచింతమనేనితో పాటు మరో 14 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు16 రాత్రి నుంచే అజ్ఞాతంలోకి.. బెంగళూరు వెళ్లినట్టు ప్రాథమిక సమాచారంఆయనతో పాటు మరో 14 మంది ఉన్నట్టు పోలీసుల గుర్తింపునూజివీడు డీఎస్పీ పర్యవేక్షణలో 6 ప్రత్యేక బృందాల ఏర్పాటు12:51 PM, May 20th, 2024మంగళగిరిపల్నాడు హింసలో బాధితులుగా పలువురు మహిళలుమహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసిన చినగణేషునిపాడు మహిళలుటీడీపీ నేతలు ఎస్సీ, బీసీ మహిళల ఇళ్లపై దాడులు జరపడంతో భయాందోళనకు గురై ఓ గుడిలో రెండ్రోజుల పాటు తలదాచుకున్న మహిళలుపోలీసుల సాయంతో బంధువుల ఇళ్లకు వెళ్లినట్టు మహిళా కమిషన్ కు ఫిర్యాదుతమకు న్యాయం చేయాలని, నిందితులను శిక్షించాలని కమిషన్ ను కోరిన మహిళలుసాక్షితో మాట్లాడిన మహిళా కమిషన్ చైర్మన్ గజ్జల వెంకటలక్ష్మిపల్నాడు జిల్లా మాచవరం మండలం కొత్తగణేశునిపాడుకు చెందిన ఎస్సీ, బీసీ మహిళల్ని దాదాపు 24 గంటలపాటు బంధించి వారిని చిత్రహింసలకు గురిచేశారు: గజ్జల వెంకటలక్ష్మిబాధితులకు రక్షణ కల్పించాలని, నిందితులకు కఠినశిక్షలు పడేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్, ఎస్పీకి లేఖ రాFeg: గజ్జల వెంకటలక్ష్మిఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలనే టార్గెట్ చేసుకుని వారిపై దాడులు చేయడం దుర్మార్గం: గజ్జల వెంకటలక్ష్మిప్రజాస్వామ్య విలువలకు ఇలాంటి వాతావరణం పూర్తి విరుద్ధం: గజ్జల వెంకటలక్ష్మిమహిళలకు స్వేచ్ఛగా నచ్చిన వారికి ఓటు వేసే హక్కు లేదా..?: గజ్జల వెంకటలక్ష్మివారికి నచ్చని వారికి ఓట్లేసినంత మాత్రాన చంపేస్తారా..? : గజ్జల వెంకటలక్ష్మిచంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడూ మహిళలపై చాలా చిన్నచూపుతో వ్యవహరించారు: గజ్జల వెంకటలక్ష్మిఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలనే టార్గెట్ చేసుకుని వారిపై దాడులకు ఉసిగొల్పుతోన్న చంద్రబాబు తీరుపై మహిళలు ఆగ్రహంతో ఉన్నారు: గజ్జల వెంకటలక్ష్మిఎలక్షన్ కమిషన్ నిబంధనల వల్ల బాధితులను పరామర్శించలేదు: గజ్జల వెంకటలక్ష్మిత్వరలోనే బాధితులను కలిసి వారికి ధైర్యం చెప్తాం: గజ్జల వెంకటలక్ష్మి 12:11 PM, May 20th, 2024విజయనగరండిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి కీలక వ్యాఖ్యలుఎంపీ పోస్టల్ బ్యాలెట్ ను తహసీల్దార్ కార్యాలయం స్ట్రాంగ్ రూమ్ నుండి లెక్కింపు కేంద్రానికి తరలించడం లో అధికార్ల సమాచార లోపం వుంది.వైస్సార్సీపీ అభ్యర్థి ఏజెంట్ ను ఈ ప్రక్రియ కోసం పంపించాము.టీడీపీ అభ్యర్థి ఏజెంట్ హాజరు కాక పోవడం వారి ఇష్టం. అయినా రాజకీయం చేసే ప్రకటనలు చేస్తున్నారు.కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతం గా జరగాలని వైస్సార్సీపీ మనస్పూర్తి గా కోరుకుంటుంది.గతం లో గెలిచినా, ఓడినా లేకితనం రాజకీయాలు చేయలేదు.12:00 PM, May 20th, 2024పోలీసుల అదుపులో బళ్ల బాబీఎన్నికల ఫలితాలు వెలవడక ముందే నరసాపురంలో జనసేన నాయకుల దౌర్జన్యంపశ్చిమగోదావరి మొగల్తూరు మండలం కేపీ పాలెం బీచ్ సమీపంలో జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్ అనుచరుడు బళ్ల బాబీ.. ఆటోలో వెళ్తున్న కుటుంబం పై దాడికారుకు ఆటో సైడ్ ఇవ్వలేదని ఆటోను వెంబడించి.. అందులోని ఇద్దరు మహిళలు,పిల్లలు, మరో ఇద్దరిపై దాడి చేసిన బాబీ అతని స్నేహితులుమీరు ఎవరు వైఎస్ఆర్ సీపీకి ఓటు వేశారా? జనసేనకు ఓటు వేశారా...? అంటూ నిలదీసిన బాబి అండ్ కోమీరు బీసిల్లా ఉన్నారు వైఎస్ఆర్ సీపీకే ఓటు వేసి ఉంటారని బాబి అతడి స్నేహితులను దాడి.. ఆపై అక్కడి నుంచి జారుకున్న బ్యాచ్‌నరసాపురం ఆసుపత్రికి బాదితులను తరలించిన స్థానికులుఆసుపత్రిలో బాధితులను పరామర్శించి.. వారి నుండి వివరాలు అడిగి తెలుసుకున్న డీఎస్పీ శ్రీనివాస్..కేసు నమోదు చేసి బళ్ల బాబీని అదుపులకు తీసుకున్న పోలీసులు11:32 AM, May 20th, 2024విజయవాడఎన్నికల సంఘానికి నేడు సిట్ ప్రాధమిక నివేదికపోలింగ్ అనంతర అల్లర్లపై నివేదిక సిద్ధం చేస్తున్న సిట్ ఇన్‌ఛార్జి వినీత్ బ్రిజ్‌లాల్‌నేడు ప్రాథమిక నివేదిక డీజీపీకి సమర్పణఇప్పటికే అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో పర్యటించిన నాలుగు బృందాలుతాడిపత్రి, చంద్రగిరి, మాచర్ల, గురజాల, నరసారావుపేట ఘటనలపై కీలక ఆధారాలు సేకరణకేసుల విచారణపై సమీక్ష పూర్తి చేసిన సిట్కేసుల విచారణపై ఇకపై కూడా పరివేక్షణ కొనసాగించనున్న సిట్రానున్న రోజుల్లో మరింత లోతుగా విచారణ చేయనున్న సిట్డీజీపీకి నివేదిక సమర్పించిన తర్వాత ప్రెస్ నోట్ విడుదల చేయనున్న సిట్11:01 AM, May 20th, 2024గుంటూరుసాయంత్రం సిట్ చీఫ్ వినీత్ బ్రిజిలాల్ ను కలవనున్న వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందంపోలింగ్ నాడు తర్వాత జరిగిన హింసాత్మక సంఘటనలపై ఫిర్యాదుపల్నాడు, అనంతపురం, తిరుపతి తదితర ప్రాంతాలలో వైఎస్సార్సీపీ శ్రేణులపై జరిగిన దాడుల ఆశారాలను అందించే అవకాశంఓటర్లను భయబ్రాంతులకు గురిచేసిన అంశాలపై కూడా సిట్ కి వివరించనున్న పార్టీ బృందం10:38 AM, May 20th, 2024ప్రకాశంఎల్లో మీడియా పై మాజీమంత్రి బాలినేని ఆగ్రహంతప్పుడు కథనాలు ప్రచురిస్తే ఖబడ్దార్నాపై తప్పుడు కథనాలు ప్రసారం చేసిన మహాటీవి పై పరువునష్టం దావా వేస్తాఎవరెన్ని కుట్రలు చేసినా...అబద్ధాలు ప్రచారం చేసుకున్నా..కూటమి చిత్తుగా ఓడిపోవడం ఖాయంరాబోయేది వైస్సార్సీపీ ప్రభుత్వమే130 సీట్లకు పైగా వైస్సార్సీపీ కైవసం చేసుకోబోతోందిజూన్ 9 న ముఖ్యమంత్రి గా జగన్మోహన్ రెడ్డి ప్రమాణం చేస్తారు10:14 AM, May 20th, 2024కాకినాడ సిటీ, పిఠాపురంలో అల్లర్లకు ఛాన్స్!కాకినాడ సిటీ, పిఠాపురంపై కేంద్ర నిఘా విభాగం(ఇంటెలిజెన్స్ బ్యూరో) అలర్ట్‌కౌంటింగ్‌కు ముందు, తర్వాత హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం!కాకినాడ, పిఠాపురంపై ఎన్నికల సంఘానికి ఐబీ నివేదికకాకినాడలోని ఏటిమొగ, దుమ్ములపేట, రామకృష్ణారావుపేటపై ప్రత్యేక దృష్టిఎన్నికల్లో గొడవలు చేసిన, ప్రేరేపించిన వ్యక్తులపై ఇప్పటికే పోలీసుల నిఘా10:00 AM, May 20th, 2024ఈసీకి సిట్ రిపోర్ట్ఏపీలో అల్లర్లపై నేడు ఎన్నికల సంఘానికి సిట్ నివేదికఏపీ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలపై చివరి అంకానికి చేరుకున్న సిట్ దర్యాప్తుతాడిపత్రిలో ముగిసిన సిట్ విచారణపల్నాడు, తిరుపతిలో ఇవాళ మూడో రోజు కొనసాగనున్న విచారణక్రొసూరు, అచ్చంపేట మండలాల్లో నేడు పర్యటించనున్న సిట్ బృందాలుఏపీలో అల్లర్లపై నేడు డీజీపీకి సిట్ నివేదికసెక్యూరిటీ వైఫల్యం వల్లే అల్లర్లు జరిగినట్లు సిట్ ప్రాథమిక అంచనాఆ వెంటనే ఈసీకి నివేదిక పంపనున్న డీజీపీసమగ్ర దర్యాప్తు కోసం సిట్‌కు గడువు పొడిగించాలని కోరే అవకాశంసమగ్ర కథనం: సిట్ నివేదికలో కీలకాంశాలు9:27 AM, May 20th, 2024ఆగని పచ్చ చిలుక పలుకులుమరోసారి వైఎస్సార్సీపీపై విషం చిమ్మిన ప్రశాంత్ కిషోర్‌చంద్రబాబు డైరెక్షన్లోనే పని చేస్తున్న మాజీ ఎన్నికల వ్యూహకర్తఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓడిపోతుందంటూ బర్కాదత్ ఇంటర్వ్యూలో వ్యాఖ్యలుబీజేపీకి మాత్రం సానుకూలంగానే పీకే స్వరంఐ-ప్యాక్ టీంతో భేటీ సమయంలో సీఎం జగన్ గెలుపు వ్యాఖ్యలుపీకే చెప్పిన దానికంటే ఎక్కువ సీట్లు వస్తాయంటూ వ్యాఖ్యానించిన సీఎం జగన్‌పీకే చేసేది ఏం లేదని.. అంతా ఐప్యాక్ టీం కష్టం ఉందన్న సీఎం జగన్జగన్ వ్యాఖ్యలపై పీకేకు నూరిపోసిన చంద్రబాబువైఎస్సార్‌సీపీ శ్రేణుల్ని ఢీలా పరిచేందుకు ఎల్లో మీడియా ప్రయత్నాలు9:05 AM, May 20th, 2024పల్నాడుమాచర్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహంకాళి పిచ్చయ్య బైక్ తగలబెట్టిన గుర్తు తెలియని వ్యక్తులురాత్రి ఇంటిముందు పార్క్ చేసిన బైక్ ను తగలబెట్టిన గుర్తు తెలియని వ్యక్తులుతెలుగుదేశం పార్టీకి చెందిన వారే తగలబెట్టి ఉంటారని అనుమానం8:00 AM, May 20th, 2024అనంతపురం: సిట్ అధికారులకు వినతి పత్రం అందజేసిన తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సతీమణి రమాదేవితమ ఇంటిపై రాళ్ల దాడికి పాల్పడిన టీడీపీ నేతలపై, తమ ఇంట్లో సీసీ కెమెరాలు ధ్వంసం చేసిన పోలీసులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని సిట్ అధికారులను కోరారు 7:30 AM, May 20th, 2024విజయవాడఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు ముమ్మరంనేటి సాయంత్రానికి డీజీపీకి ప్రాధమిక నివేదిక ఇవ్వనున్న సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్నాలుగు బృందాలగా సిట్ దర్యాప్తుపల్నాడు జిల్లాలో క్షేత్రస్ధాయిలో పర్యటించిన రెండు బృందాలుపల్నాడు జిల్లాలోని రెండు బృందాలని పర్యవేక్షించిన అదనపు ఎస్పీ సౌమ్యలతతిరుపతి జిల్లా చంద్రగిరిలో పర్యటించిన మరొక బృందంఅనంతపురం జిల్లాలోని తాడిపర్తిలో మరొక బృందం పర్యటనడీఎస్పీ ఆద్వర్యంలో ఇద్దరు సీఐలతో ప్రతీ బృందం క్షేత్రస్ధాయిలో సమాచార సేకరణఎప్పటికపుడు నాలుగు బృందాల నుంవి సమాచారాన్ని తీసుకుని నివేదిక సిద్దం చేసే పనిలో హెడ్ క్వార్టర్స్ నుండి పర్యవేక్షిస్తున్న మరో అదనపు ఎస్పీమొత్తంగా 33 ఎఫ్ఐఆర్లను పరిశీలించిన సిట్ బృందాలుదాదాపు 300 మందికి నిందితులు ఈ హింసాత్మక ఘటనలలో పాల్గొన్నట్లు ఎఫ్ఐఆర్లలో నమోదుఇప్పటికే వంద మందికి పైగా నిందితులు అరెస్ట్సీసీ కెమెరా ఫుటేజ్‌లు పరిశీలనక్షేత్రస్ధాయి పర్యటనలో కీలక సమాచారాన్ని రాబట్టిన సిట్ బృందాలుపోలీస్ ఉన్నతాధికారుల వైఫల్యంపైనా పరిశీలనసస్పెండ్ అయిన పల్నాడు జిల్లా ఎస్పీ బిందుమాధవ్, అనంతపురం జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్‌ల పనితీరుపైనా సిట్ అనుమానాలుటీడీపీ రౌడీలు ఘర్షణలకి దిగడానికి ఈ ఇద్దరి ఎస్పీల వైఫల్యమే కారణమంటూ ఇప్పటికే ఈసీకి సిట్ బృందాలకి కూడా ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీనాలుగు బృందాల క్షేత్రస్ధాయి సమాచార సేకరణ ఆధారంగా నేటి సాయంత్రం 4 గంటల లోపు డీజీపీకి ప్రాధమిక నివేదిక ఇవ్వనున్న సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్సిట్ ఇచ్చే ప్రాధమిక నివేదికని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపనున్న డీజీపీ హరీష్ కుమార్ గుప్తాపూర్తిస్ధాయి దర్యాప్తుకి మరికొన్ని రోజుల సమయం పొడిగించాలని కోరే అవకాశంసిట్ ప్రాధమిక నివేదిక ఆధారంగా కేంద్ర ఎన్నికల కమీషన్ తదుపరి చర్యలకి అవకాశం7:00 AM, May 20th, 2024మార్చినచోటే మారణకాండ ‘సిట్’కు ఆధారాలు అందించిన మంత్రి అంబటిచంద్రబాబు, పురందేశ్వరి కుట్రతో చెలరేగిన హింస ఓటమి భయంతో బాబు రాక్షసత్వంతలలు పగులుతున్నా పోలీసులు స్పందించలేదుడబ్బులకు లొంగిపోయిన వారిపై చర్యలు తీసుకోవాలితొండపిలో ప్రాణ భయంతో గ్రామాన్ని వీడిన ముస్లిం మైనార్టీలు 6:30 AM, May 20th, 2024ముందస్తు బెయిల్ లేకుండా విదేశాలకు చంద్రబాబుఫైబర్‌నెట్ కేసులో సుప్రీంలో కొనసాగుతున్న విచారణశంషాబాద్ విమానాశ్రయంలో అడ్డుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులుసుదీర్ఘ వివరణ అనంతరం ఎట్టకేలకు అనుమతిపర్యటన గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలునాలుగు రోజుల క్రితమే గుట్టుగా వెళ్లిపోయిన లోకేశ్
నాగబాబు ట్వీట్ వివాదం.. అల్లు అర్జున్ షాకింగ్ నిర్ణయం!
మెగా ఫ్యామిలీలో ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనల గురించి మీకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అల్లు అర్జున్ గురించి పరోక్షంగా నాగబాబు చేసిన ట్వీట్ వల్ల రచ్చ రచ్చ అయింది. ఏకంగా తన అకౌంట్‌ని కొన్నిరోజులు డీయాక్టివేట్ చేసిన నాగబాబు మళ్లీ.. ఆ ట్వీట్ డిలీట్ చేసిన తర్వాతే ట్విట్టర్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. గొడవ ఇక్కడితే అయిపోలేదు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.(ఇదీ చదవండి: బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్ యామీ గౌతమ్.. పేరేంటో తెలుసా?)మెగా ఫ్యామిలీలో విబేధాలు ఉన్నాయనేది సోషల్ మీడియాలో గత కొన్నాళ్ల నుంచి వినిపిస్తోంది. బన్నీ.. మెగా ఫ్యామిలీకి దూరమయ్యాడని.. అందుకే చరణ్‌తో అంతంత మాత్రంగానే ఉంటున్నాడని నెటిజన్లు అనుకుంటున్నారు. ఇందుకు తగ్గట్లే పుట్టినరోజున వీళ్లిద్దరూ ఎవరూ కూడా ఒకరికి ఒకరు విషెస్ చెప్పకపోవడం లాంటివి ఇవి నిజమే అనే అందరూ అనుకునేలా చేశాయి. ఇందులో నిజానిజాలు పక్కనబెడితే కొన్నిరోజుల ముందు నాగబాబు, పరోక్షంగా బన్నీ గురించి చేసిన ట్వీట్ పెద్ద దూమారమే రేపింది.ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరిరోజు అల్లు అర్జున్ నంద్యాల వెళ్లాడు. వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తన స్నేహితుడు శిల్పా రవిచంద్రా రెడ్డి కోసం అక్కడికి వెళ్లాడు. దీని గురించి నేరుగా చెప్పకుండా.. 'మనవాడు, పరాయివాడు' అని నాగబాబు ట్వీట్ చేశాడు. దీంతో బన్నీ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. సోషల్ మీడియాలో ఘోరంగా ట్రోల్ చేశారు. ఇదంతా బన్నీకి కూడా నచ్చలేదని, దీంతో మెగా ఫ్యామిలీకి ఉన్న వాట్సాప్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయిపోయాడని అనుకుంటున్నారు. ఇందులో నిజమేంటనేది క్లారిటీ రావాల్సి ఉంది.(ఇదీ చదవండి: ఇక్కడ నాపై బ్యాన్ విధిస్తామని బెదిరిస్తున్నారు: పాయల్ రాజ్‌పుత్)
‘AI’తో ప్రమాదమే.. గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ వార్నింగ్
ఆటోమేటిక్‌గా నడిచే కార్లు, బైక్‌లు.. ఇలా ఎక్కడ చూసినా కృత్రిమ మేధ మన జీవితంలో ఓ భాగంగా మారిపోతోంది. అయితే దీంతో చాలా పనులు సులభంగా పూర్తవుతున్నందుకు సంతోషంగానే ఉన్నా.. ఇది మన ఉద్యోగాలకు ఎక్కడ ఎసరు పెడుతుందోనన్న భయం నెలకొంది. తాజాగా, గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ జెఫ్రీ హింటన్ సైతం ఇదే ఆందోళనను వెలిబుచ్చారు. ఓ ఇంటర్వ్యూలో అన్నీ రంగాల్లో పెరిగిపోతున్న ఏఐ వినియోగం గురించి చర్చించారు. రానున్న రోజుల్లో దాని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయో హెచ్చరించారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఏఐ కారణంగా ఉద్యోగాలు కోల్పోవడంపై జెఫ్రీ హింటన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఏఐ విషయంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన అన్నారు.ఈ సందర్భంగా ప్రపంచానికి ఆదాయం అవసరమని, అలాంటి అవకాశాల్ని ప్రభుత్వాలే సృష్టించాలని తెలిపారు. ఇక లేఆఫ్స్ గురైన ఉద్యోగులకు ప్రభుత్వాలు బేసిక్ పే శాలరీ చెల్లిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
హెలికాప్టర్ ప్రమాదం.. ఇరాన్ అధ్యక్షుడి చివరి వీడియో వైరల్
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంపై ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్( బెల్-212) ఆదివారం సాయంత్రం ప్రమాదానికి గురైంది. జోల్ఫా ప్రాంతం సమీపంలోని పర్వతప్రాంతాలను దాటుతుండగా ప్రతికూల వాతావరణం కారణంగా దట్టమైన అడవిలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో రైసీతోపాటు విదేశాంగ మంత్రి, మరో ఎనిమిది అధికారులు ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశ అధికారిక మీడియా వెల్లడిచింది. అధ్యక్షుడి కాన్వాయ్‌లోని మరో రెండు హెలికాప్టర్లు గమ్యస్థానాన్ని సురక్షితంగా చేరుకున్నాయని తెలిపింది. ఇరాన్- అజర్బైజాన్ సరిహద్దుల్లో కొత్తగా నిర్మించిన ఓ డ్యామ్ ప్రారంభోత్సంలో పాల్గొని తిరిగి వచ్చే సమయంలో ఈ దుర్ఘటన సంభవించింది.కాగా తాజాగా హెలికాప్టర్ ప్రమాదానికి ముందు రైసీకి చెందిన చివరి ఫోటో, వీడియోను ఇరాన్ మీడియా షేర్ చేసింది. ఇందులో రైసీ హెలికాప్టర్ కిటికీ నుంచి రైసీ బయటకు చూస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆయనతో పాటు విదేశాంగ మంత్రి, ఇతర ఉన్నత అధికారులు కూడా ఉన్నారు. చాపర్‌లో వెళ్లడానికి ముందు అధికారులతో అధ్యక్షుడు మీటింగ్ ఏర్పాటు చేసిన దృశ్యాలు కూడా ఆ క్లిప్‌లో ఉన్నాయి. ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. రైసీ బయల్దేరిన 30 నిమిషాలకే ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. దాదాపు 16 గంటల తర్వాత కొండ ప్రాంతంలో హెలికాప్టర్ శిథిలాలు గుర్తించారు. ఈ ఘటనలో రైసీతో పాటు హెలికాప్టర్లో ఉన్నవారంతా దుర్మరణం చెందారు.#Iranian President #Ibrahim #Raisai's last trip, the video of the aerial tour of the dam before the helicopter Crashh!!#Iran pic.twitter.com/fUTlBqpKW7— Imran Pazir (@imranpazir1) May 20, 2024తరువాతి అధ్యక్షుడు ఆయనే..కాగా ఇబ్రహీం రైసీ మృతిచెందడంతో.. తదుపరి ఇరాన్ అధ్యక్షుడు ఎవరవుతారనేది చర్చనీయాంశంగా మారింది. ఇరాన్ ఉపాధ్యక్షుడు మహమ్మద్ మొఖ్బర్(69) తాత్కాలికంగా దేశాధ్యక్ష బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. అధ్యక్షుడు అకస్మాత్తుగా మరణిస్తే తొలుత వైస్ ప్రెసిడెంట్ ఆ పదవిని చేపడతారు. దీనికి దేశ సుప్రీం లీడర్ ఖమేనీ ఆమోదించాలి. ఆ తర్వాత ఉపాధ్యక్షుడు మొఖ్బర్, పార్లమెంటరీ స్పీకర్, న్యాయ వ్యవస్థ చీఫ్ ఘోల్లమ్‌హోస్సేన్ మొహసేని ఎజీతో కూడిన కౌన్సిల్ 50 రోజుల్లోగా కొత్త అధ్యక్షుడి ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది.
ఇవాళే డీజీపీకి నివేదిక.. సిట్ పొడిగింపు?
విజయవాడ, సాక్షి: రాష్ట్రంలో ఎన్నికలకు ముందు, తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణకు ప్రత్యేక విచారణ బృందం(సిట్) ఇవాళ్టితో ముగియనుంది. సోమవారం సాయంత్రం రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్ గుప్తాకు సిట్ ఇన్చార్జి.. ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ నివేదికను సమర్పించనున్నారు. అయితే రెండ్రోజుల్లో సమాచార సేకరణకే సమయం సరిపోవడంతో లోతైన దర్యాప్తు కోసం గడువు పొడిగించాలని సిట్ బృందం డీజీపీని కోరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ‘‘హింసాత్మక ఘటనలపై ఈసీకి ఇవాళ నివేదిక ఇస్తాం. నాలుగు జిల్లాల్లో టీమ్‌లు దర్యాప్తులో ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లకు చెప్పి.. కొన్ని కేసుల్లో అదనపు సెక్షన్లు చేరుస్తాం. అలాగే కొంతమంది నిందితులను గుర్తించాం. నేటి నుంచి దర్యాప్తును పర్యవేక్షిస్తాం’’ అని సిట్ ఇన్చార్జి వినీత్ బ్రిజ్‌లాల్ ఓ మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా వ్యాఖ్యానించారు. సిట్ ఇలా.. ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు ముమ్మరంగా జరిగింది. నాలుగు బృందాలుగా విడిపోయిన సిట్ సభ్యులు.. అలర్లు జరిగిన ప్రాంతాల్లో పర్యటించారు. పల్నాడులో అడిషనల్ ఎస్పీ సౌమ్యలత నేతృత్వంలో రెండు బృందాలు, తిరుపతి చంద్రగిరిలో ఒక టీం, అనంతపురం తాడిపత్రిలో మరో టీం పర్యటించింది. డీఎస్పీ ఆద్వర్యంలో ఇద్దరు సీఐలతో ప్రతీ బృందం క్షేత్రస్ధాయిలో సమాచార సేకరణ చేపట్టింది. అదే సమయంలో.. వినీత్ బ్రిజ్‌లాల్, ఐజీ (సిట్ ఇన్‌ఛార్జి)రమాదేవి, ఏసీబీ ఎస్పీసౌమ్యలత, ఏసీబీ అదనపు ఎస్పీరమణమూర్తి, శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీపి.శ్రీనివాసులు, సీఐడీ డీఎస్పీ వల్లూరి శ్రీనివాసరావు, ఒంగోలు ఏసీబీ డీఎస్పీ రవి మనోహరచారి, తిరుపతి ఏసీబీ డీఎస్పీవి.భూషణం, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (గుంటూరు రేంజ్) కె.వెంకటరావు, ఇన్స్పెక్టర్(ఇంటెలిజెన్స్), విశాఖపట్నంరామకృష్ణ, ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌జీఐ శ్రీనివాస్, ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌మోయిన్, ఇన్స్పెక్టర్, ఒంగోలు పీటీసీఎన్.ప్రభాకర్, ఇన్స్పెక్టర్, అనంతపురం ఏసీబీశివప్రసాద్, ఇన్స్పెక్టర్, ఏసీబీసిట్ హెడ్ క్వార్టర్స్‌లో ఉంటూ ఎప్పటికపుడు నాలుగు బృందాల నుంచి సమాచారాన్ని తీసుకుని నివేదిక సిద్దం చేసే పనిని మరో అదనపు ఎస్పీకి అప్పగించారు. మొత్తంగా.. హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాల పరిధిలోని పీఎస్‌లలో నమోదు అయిన 33 ఎఫ్ఐఆర్లను సిట్ పరిశీలించింది. వీటి ఆధారంగా 300 మందిని ఈ హింసాత్మక ఘటనల్లో పాల్గొన్నట్లు నిర్ధారించుకుంది. ఇందులోనూ 100 మందిని ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు.. పరారీలో ఉన్న మిగతా వాళ్ల కోసం పోలీస్ బలగాలు గాలింపు చేపటినట్లు సిట్ నివేదికలో పొందుపర్చినట్లు సమాచారం. అదే సమయంలో పోలీసులకు సిట్ బృందాలు పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది.ఇక క్షేత్రస్ధాయి పర్యటనలో కీలక సమాచారాన్ని రాబట్టిన సిట్ బృందాలు.. సీసీ కెమెరాల ఫుటేజీలను సైతం క్షుణ్ణంగా పరిశీలించింది. అదే సమయంలో పోలీస్ ఉన్నతాధికారుల వైఫల్యంపైనా పరిశీలన చేసింది. సస్పెండ్ అయిన పల్నాడు జిల్లా ఎస్పీ బిందుమాధవ్, అనంతపురం జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ల పనితీరుపైనా సిట్ అనుమానాలు వ్యక్తం చేసినట్లుసమాచారం. ఇక సిట్ బృందాలకు వైఎస్సార్సీపీ, టీడీపీలు పోటాపోటీగా ఫిర్యాదులు చేసుకున్నాయి. టీడీపీ శ్రేణులు ఘర్షణలకి దిగడానికి ఈ ఇద్దరి ఎస్పీల వైఫల్యమే కారణమంటూ ఇప్పటికే ఈసీకి, సిట్ బృందాలకి కూడా YSRCP ఫిర్యాదు చేసింది. ఈసీ నిర్ణయంపై ఉత్కంఠఈసీ ఆదేశాలనుసారం సిట్ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం సిట్‌కు పూర్తి అధికారులు అప్పగించింది. రెండ్రోజుల గడువులో క్షేత్రస్థాయి సమాచార సేకరణ మాత్రమే చేపట్టింది. ప్రధాన ఘటనలకు సంబంధించిన దర్యాప్తును మాత్రమే సిట్ సమీక్షించింది. అయితే ఈ అల్లర్ల వెనుక ఉన్న కుట్రను చేధించాలన్నా.. హింసకు కారణమైన రాజకీయ పెద్దలను గుర్తించాలన్నా పూర్థిస్తాయిలో దర్యాప్తు అవసరం. అందుకే గడువు పొడిగించాలని సిట్ ఇన్చార్జి వినీత్ బ్రిజ్‌లాల్ కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే డీజీపీ ప్రాథమిక నివేదికను ఎన్నికల సంఘానికి పంపాల్సి ఉంటుంది. దీంతో ఈసీ సిట్ ప్రాథమిక నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటుందా? లేదంటే పూర్తిస్థాయి దర్యాప్తు నివేదిక వచ్చేదాకా ఎదురు చూస్తుందా? అనే ఉత్కంఠ నెలకొంది.
ధోని ఐపీఎల్ రిటైర్మెంట్పై బిగ్ అప్డేట్..
ఐపీఎల్-2024 లీగ్ దశలోనే చెన్నై సూపర్ కింగ్స్ ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన ఆర్సీబీ చేతిలో సీఎస్కే ఓడిపోయింది. రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని ఆఖరిలో మెరుపులు మెరిపించినప్పటికి తమ జట్టును మాత్రం గెలిపించలేకపోయారు.సీఎస్కే, ఆర్సీబీ 14 పాయింట్లతో సమంగా ఉన్నప్పటికి.. రన్‌రేట్ పరంగా బెంగళూరు మెరుగ్గా ఉండడంతో ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. అయితే ఈ ఏడాది సీజన్ తర్వాత ధోని ఐపీఎల్‌కు విడ్కోలు పలకనున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ధోని నుంచి అయితే ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన రాలేదు. ఈ క్రమంలో ధోని రిటైర్మెంట్ వార్తలపై సీఎస్కే ప్రతినిథి ఒకరు స్పందించారు. ధోని తన రిటైర్మెంట్ గురించి ఫ్రాంచైజీకి ఇప్పటి వరకు తెలియజేయలేదని సదరు ప్రతినిథి తెలిపారు."ఐపీఎల్ రిటైర్మెంట్ గురుంచి ధోని ఇప్పటివరకు సీఎస్కేలో ఎవరితోనూ చర్చించలేదు. అతడు తన నిర్ణయాన్ని వెల్లడించడానికి కొంత సమయం తీసుకుంటాని మెనెజ్‌మెంట్‌తో ధోని చెప్పాడు. అతడు ఇంకా ఫిట్‌గానే ఉన్నాడు. అది మాకు కలిసొచ్చే అంశం. వికెట్ల మధ్య పరిగెత్తడంలో అతడు ఎక్కడ ఇబ్బంది పడలేదు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పై చాలా మంది దిగ్గజ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కానీ అభిమానులు అయితే వచ్చే సీజన్లో ఈ రూల్‌ను ఉపయోగించుకుని ధోనిని కేవలం బ్యాటింగ్‌కే దిగేలా చూడాలి కోరుతున్నారు. ఇది గానీ ధోని ఏమి నిర్ణయం తీసుకుంటాడో మాకు తెలియదు. తను ఏ నిర్ణయం తీసుకున్న మేము అంగీకరిస్తాం. అతను ఎల్లప్పుడూ జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టకుని ఏ నిర్ణయమైన తీసుకుంటాడని" సీఎస్కే సీనియర్ అధికారి ఒకరు టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నాడు.
అయ్యో దేవుడా! అంత్యక్రియలకు రూ. 30 లక్షలా?
అంత్యక్రియలు అనేది మరణించిన వారి గౌరవార్థం నిర్వహించే కర్మ. ఎవరి ఆచారానికి తగ్గట్టు, ఎవరి ఆర్థిక స్థోమతకు తగ్గట్టు అంత్యక్రియలు నిర్వహించడం పరిపాటి. కానీ కెనడాలోదారుణ పరిస్థితులునెలకొన్నాయి. ఒక్కో మృత దేహానికి నిర్వహించే అంత్యక్రియలు ఖర్చు రూ. 27 నుంచి 30లక్షల దాటి పోతుండటంతో ఏం ఏయాలో తోచక అయోమయంలో పడిపోతున్నారు జనం,ఒకవైపు కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న కునం, దుఃఖం మరోవైపు పరలోకానికి చేరిన తమ ఆత్మీయులకు కూడా అంత్యక్రియలు నిర్వహించలేక అనాథ శవాల్లా వదిలివేస్తున్న వైనం ఆందోళన కరంగా మారింది. ఎందుకంటే అక్కడ ఏరియాను బట్టి, అంత్యక్రియల ఖర్చు ఏకంగా రూ. 30 లక్షలుకుపైమాటేన. అంతసొమ్ము భరించడం తమవల్ల కాకపోవడంతో చేసేది లేక దిక్కులేని శవాల్లా వాటిని వదిలేస్తున్నారు. దీంతో అనాథ మృతదేహాల సంఖ్య పేరుకు పోతోందిట.దాదాపు దేశమంతటా ఇదే పరిస్థితి నెలకొంది. కెనడాలో, స్థానాన్ని బట్టి శ్మశానవాటిక ప్లాట్ల ధరలలో గణనీయమైన వ్యత్యాసం ఉంది. కెనడాలో అంత్యక్రియలకు సగటున 30 వేల డాలర్లకు పైనే అవుతోంది. మిడ్‌టౌన్ టొరంటోలో భారీగా ధర (రూ. 27 లక్షలు.) చెల్లించాల్సి వస్తోంది. ఇతర ఖర్చులు కలిపి మొత్తం వ్యయం రూ. 30 లక్షలు దాటేస్తోంది. అంటారియో ప్రావిన్సులో 2013లో 242 అనాథ శవాలను గుర్తించగా పదేళ్లు తిరిగేసరికి అంటే 2023 ఆ సంఖ్య 1,183కు చేరుకుంది. క్యూబెక్‌లో, 2013లో 66గా ఉన్న క్లెయిమ్ చేయని మృతదేహాల సంఖ్య 2023లో 183కి పెరిగింది. అల్బెర్టాలో, 2016లో 80 ఉన్న మృతదేహాల సంఖ్య 2023లో 200కి పెరిగింది. మృతదేహాల వద్ద లభించిన ఆధారాలను బట్టి అవి తమవారివేనని కుటుంబ సభ్యులు గుర్తించినప్పటికీ, అంత్యక్రియల ఖర్చుకు భయపడి తీసుకెళ్లేందుకు ముందుకు రావడం లేదు. దీనిపై ప్రతి పక్షాలు విచారం వ్యక్తం చేశాయి.
తప్పక చదవండి
- సోషల్ మీడియా ట్రోలింగ్ : బిడ్డ బతికినా, పాపం తల్లి తట్టుకోలేకపోయింది!
- హైదరాబాద్‌లో మళ్లీ దంచికొడుతున్న వాన
- అదృష్టం ఎవరిని వరిస్తోంది.. ఎస్బీఐ ఛైర్మన్ పదవి కోసం పోటీ
- అమితాబ్ గురించి ఏదో అనుకున్నా.. ఆరోజు సీన్ షూట్ చేసేటప్పుడు..
- కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్రుకాల్చి వాత పెట్టాలి: కేటీఆర్
- రాత్రైతే నా భార్య రాక్షసిలా ప్రవర్తిస్తోంది
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతిపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
- అతడొక క్లాస్ ప్లేయర్.. ఎంత చెప్పుకున్న తక్కువే: ప్యాట్ కమ్మిన్స్
- Jr NTR Birthday: 'మ్యాన్ ఆఫ్ మాసెస్'గా ఎన్టీఆర్ ఎలా ఎదిగాడు..?
- హెలికాఫ్టర్ క్రాష్.. ఇరాన్ అధ్యక్షుడి దుర్మరణం
సినిమా
'డబ్బు కోసమే 46 ఏళ్ల కమెడియన్‌తో పెళ్లి'.. నటి ఏమందంటే?
జైలర్ నటుడు, కమెడియన్ రెడిన్ కింగ్స్లీ గతేడాది పెళ్లి చేసుకున్నాడు. 46 ఏళ్ల వయసులో ప్రియురాలు, నటి సంగీత మెడలో మూడుముళ్లు వేశాడు. వివాహం తర్వాత తన ఫస్ట్ బర్త్‌డేను భార్యతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు. అంత పెద్ద వయసులో ఉన్నవాడిని సంగీత పెళ్లి చేసుకోవడానికి కారణం డబ్బేనని చాలామంది విమర్శించారు. ఇకపోతే సంగీతకు ఇదేమీ ఫస్ట్ మ్యారేజ్ కాదు. రెండో పెళ్లిగతంలో ఆమె క్రిష్‌ను పెళ్లాడగా వీరికి ఒక పాప కూడా ఉంది. వ్యక్తిగత కారణాల వల్ల వీరు విడాకులు తీసుకున్నారు. అనంతరం సంగీత రెడిన్తో ప్రేమలో పడగా ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. తన పెళ్లిపై వస్తున్న ట్రోల్స్‌పై తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె స్పందించింది. సంగీత మాట్లాడుతూ.. ఈ వయసులో పెళ్లి అవసరమా? అంటున్నారు. మా వయసు పెరగలేదుమానసికంగా నా వయసు 18, తన వయసు 22! మేము ఆ ఏజ్‌లోనే ఉన్నట్లు ఫీలవుతున్నాం. అది మీకు చెప్పినా అర్థం కాదు. ఇంకేమన్నారు.. డబ్బు కోసం పెళ్లి చేసుకున్నానా? అదెలాగో కాస్త వివరించి చెప్తారా? మీ వల్ల కాదు! అతడిలో నాకు నచ్చింది సింప్లిసిటీ! చాలా నిరాడంబరంగా ఉంటాడు. అది చూసే తనను పెళ్లి చేసుకున్నాను అని పేర్కొంది.కమెడియన్‌గా గుర్తింపుకాగా రెడిన్ కింగ్స్లీ.. కోలమావు కోకిల అనే తమిళ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. నెల్సన్ డైరెక్ట్ చేసిన అన్ని సినిమాల్లోనూ రెడిన్ యాక్ట్ చేశాడు. డాక్టర్ మూవీలో ఈయన పోషించిన భగత్ పాత్ర అతడికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది.సీరియల్స్- సినిమాలుఎల్కేజీ, అన్నాత్తె, బీస్ట్, కాతువాకుల రెండు కాదల్, మార్క్ ఆంటోని, మట్టి కుస్తీ, జైలర్ వంటి పలు సినిమాల్లో నవ్వులు పూయించాడు. సంగీత విషయానికి వస్తే అరన్మనైక్కిలి, తిరుమల్ వంటి సినిమాలు చేయగా సీరియల్స్‌లోనే ఎక్కువగా నటించింది.
Jr NTR HD Stills: ఎన్టీఆర్ 'దేవర' ఫియర్ సాంగ్ ఫోటోలు వైరల్
బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. పేరేంటో తెలుసా?
హీరోయిన్ యామీ గౌతమ్ గుడ్ న్యూస్ చెప్పేసింది. కొన్నిరోజుల ముందు తాను ప్రెగ్నెన్సీతో ఉన్న విషయాన్ని బయటపెట్టిన ఈమె.. ఇప్పుడు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు చెప్పింది. అలానే పిల్లాడికి వేదవిద్ అని పేరు కూడా పెట్టినట్లు ఇన్ స్టా పోస్ట్‌తో వెల్లడించింది. ఈ క్రమంలోనే పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ఈమెకు విషెస్ చెబుతున్నారు.(ఇదీ చదవండి: ఇక్కడ నాపై బ్యాన్ విధిస్తామని బెదిరిస్తున్నారు: పాయల్ రాజ్‌పుత్)2010లో 'ఉల్లాస ఉత్సాహ' అనే కన్నడ సినిమాతో యామీ గౌతమ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తర్వాత ఏడాదే 'నువ్విలా' మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అనంతరం గౌరవం, యుద్ధం, కొరియర్ బాయ్ కల్యాణ్ తదితర తెలుగు సినిమాల్లో చేసింది. కానీ ఇక్కడ పెద్దగా కలిసి రాకపోవడంతో బాలీవుడ్‌కి షిఫ్ట్ అయిపోయింది. గత ఏడేళ్ల నుంచి అక్కడే మూవీస్ చేస్తోంది.2019లో రిలీజైన 'ఉరి' చేస్తున్న టైంలో ఆ సినిమా దర్శకుడు ఆదిత్య ధర్‌తో ప్రేమలో పడింది. అలా రెండేళ్ల పాటు రిలేషన్లో ఉన్న వీళ్లిద్దరూ 2021లో పెళ్లి చేసుకున్నారు. రీసెంట్గా 'ఆర్టికల్ 370' చిత్రంతో హిట్ కొట్టిన యామీ.. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో తాను ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు చెప్పింది. ఇప్పుడు బిడ్డకు జన్మనిచ్చినట్లు ప్రకటించింది.(ఇదీ చదవండి: బెంగళూరు రేవ్ పార్టీ.. స్పందించిన నటి హేమ) View this post on Instagram A post shared by Aditya Dhar (@adityadharfilms)
బెంగళూరు రేవ్ పార్టీ.. స్పందించిన నటి హేమ
సాక్షి, బెంగళూరు: బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి రేవ్ పార్టీ జరిగింది. బర్త్‌డే పార్టీ పేరుతో జీఆర్ ఫామ్‌హౌస్‌లో జరిగిన ఈ రేవ్ పార్టీపై పోలీసులు పక్కా సమాచారంతో దాడి చేశారు. ఈ పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్, కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఈ పార్టీని ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ రేవ్ పార్టీలో టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ సెలబ్రిటీలు సైతం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్ నటి హేమ కూడా ఈ పార్టీలో భాగమైందని వార్తలు వైరలవుతుండటంతో ఆమె స్పందించింది. బెంగళూరు రేవ్ పార్టీతో తనకు ఏమాత్రం సంబంధం లేదని హేమ వెల్లడించింది. తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని స్పష్టం చేసింది. కన్నడ మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని పేర్కొంది. అనవసరంగా తన పేరును లాగొద్దని విజ్ఞప్తి చేసింది.చదవండి: Payal Rajput: ఇక్కడ నాపై బ్యాన్ విధిస్తామని బెదిరిస్తున్నారుబెంగళూరులో రేవ్‌పార్టీ కలకలం.. పట్టుబడ్డ టాలీవుడ్ ప్రముఖులు!
ఫొటోలు
క్రీడలు
ధోని ఐపీఎల్ రిటైర్మెంట్పై బిగ్ అప్డేట్..
ఐపీఎల్-2024 లీగ్ దశలోనే చెన్నై సూపర్ కింగ్స్ ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన ఆర్సీబీ చేతిలో సీఎస్కే ఓడిపోయింది. రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని ఆఖరిలో మెరుపులు మెరిపించినప్పటికి తమ జట్టును మాత్రం గెలిపించలేకపోయారు.సీఎస్కే, ఆర్సీబీ 14 పాయింట్లతో సమంగా ఉన్నప్పటికి.. రన్‌రేట్ పరంగా బెంగళూరు మెరుగ్గా ఉండడంతో ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. అయితే ఈ ఏడాది సీజన్ తర్వాత ధోని ఐపీఎల్‌కు విడ్కోలు పలకనున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ధోని నుంచి అయితే ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన రాలేదు. ఈ క్రమంలో ధోని రిటైర్మెంట్ వార్తలపై సీఎస్కే ప్రతినిథి ఒకరు స్పందించారు. ధోని తన రిటైర్మెంట్ గురించి ఫ్రాంచైజీకి ఇప్పటి వరకు తెలియజేయలేదని సదరు ప్రతినిథి తెలిపారు."ఐపీఎల్ రిటైర్మెంట్ గురుంచి ధోని ఇప్పటివరకు సీఎస్కేలో ఎవరితోనూ చర్చించలేదు. అతడు తన నిర్ణయాన్ని వెల్లడించడానికి కొంత సమయం తీసుకుంటాని మెనెజ్‌మెంట్‌తో ధోని చెప్పాడు. అతడు ఇంకా ఫిట్‌గానే ఉన్నాడు. అది మాకు కలిసొచ్చే అంశం. వికెట్ల మధ్య పరిగెత్తడంలో అతడు ఎక్కడ ఇబ్బంది పడలేదు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పై చాలా మంది దిగ్గజ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కానీ అభిమానులు అయితే వచ్చే సీజన్లో ఈ రూల్‌ను ఉపయోగించుకుని ధోనిని కేవలం బ్యాటింగ్‌కే దిగేలా చూడాలి కోరుతున్నారు. ఇది గానీ ధోని ఏమి నిర్ణయం తీసుకుంటాడో మాకు తెలియదు. తను ఏ నిర్ణయం తీసుకున్న మేము అంగీకరిస్తాం. అతను ఎల్లప్పుడూ జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టకుని ఏ నిర్ణయమైన తీసుకుంటాడని" సీఎస్కే సీనియర్ అధికారి ఒకరు టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నాడు.
అతడొక క్లాస్ ప్లేయర్.. ఎంత చెప్పుకున్న తక్కువే: ప్యాట్ కమ్మిన్స్
ఐపీఎల్-2024లో తమ చివరి లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ ఘన విజయం సాధించింది. 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఎస్ఆర్హెచ్ సునాయసంగా చేధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ రెండో స్ధానంలో నిలిచింది. దీంతో మే 21న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న తొలి క్వాలిఫియర్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. ఇక పంజాబ్‌పై విజయంపై మ్యాచ్ అనంతరం ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ స్పందించాడు."మా హోం గ్రౌండ్లో చివరి లీగ్ మ్యాచ్‌లో విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. మా జట్టును సపోర్ట్ చేసేందుకు మైదానంకు వచ్చిన అభిమానులందరికి ధన్యవాదాలు. ఇంత ఫ్యాన్ కలిగి ఉన్న టీమ్‌ను ఎక్కడ నేను చూడలేదు. మేము మా సొంత మైదానంలో 7 మ్యాచ్‌ల్లో ఆరింట విజయాలు సాధించాము. ఈ సీజన్లో ఇప్పటివరకు మా కుర్రాళ్లు అద్బుతంగా రాణించారు. ప్రతీ ఒక్కరూ జట్టు విజయాల్లో తమ వంతు పాత్ర పోషించారు. ఇక అభిషేక్ గురుంచి ఎంత చెప్పుకున్న తక్కువే. అతడికి అద్భుతమైన బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఫియర్ లెస్ క్రికెట్ ఆడుతాడు. అతడి బ్యాటింగ్ విధ్వంసానికి ప్రతీ ఒక్క బౌలర్ భయపడాల్సిందే. నేను కూడా అభిషేక్‌కు బౌలింగ్ చేయాలనుకోవడం లేదు. పేసర్లకే కాదు స్పిన్నర్లపై కూడా అతడు స్వేచ్ఛగా ఆడుతాడు. ఇక నితీష్ ఒక యువ సంచలనం. అతడొక ఒక క్లాస్ ప్లేయర్. అతడి తన అనుభవానికి మించి ఆడుతున్నాడు. అతను మా టాప్-ఆర్డర్లో కీలక ఆటగాడు. నాకౌట్ మ్యాచ్‌ల్లో కూడా ఇదే రిథమ్‌ను కొనసాగించడానికి ప్రయత్నిస్తామని" పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో కమ్మిన్స్ పేర్కొన్నాడు.
జట్టును ప్రకటించిన వెస్టిండీస్.. కొత్త కెప్టెన్ ఎవరంటే?
టీ20 వరల్డ్‌కప్-2024లో సన్నాహకాల్లో భాగంగా వెస్టిండీస్ తమ స్వదేశంలో ఆరు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. తొలి దశ పర్యటనలో భాగంగా మూడు మ్యాచ్‌లు మాత్రమే ఇరు జట్లు ఆడనునున్నాయి. టీ20 వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత మరో మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి.మే 23న జమైకా వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ప్రోటీస్‌తో సిరీస్ కోసం 14 మంది సభ్యులతో కూడిన తమ జట్టును విండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ సిరీస్‌కు ఐపీఎల్-2024లో భాగమైన విండీస్ ఆటగాళ్లు దూరమయ్యారు. కెప్టెన్ కెప్టెన్ రావ్‌మెన్ పావెల్, ఆండ్రీ రస్సెల్, హెట్‌మైర్ వంటి కీలక ఆటగాళ్లు ప్లే ఆఫ్స్‌కు సన్నద్దమవుతున్నారు. ఈ సిరీస్‌లో విండీస్ కెప్టెన్‌గా బ్రాండన్ కింగ్ వ్యవహరించనున్నాడు.దక్షిణాఫ్రికాతో సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు: బ్రాండన్ కింగ్, రోస్టన్ చేజ్, అలిక్ అథానాజ్, జాన్సన్ చార్లెస్, ఆండ్రీ ఫ్లెచర్, మాథ్యూ ఫోర్డే, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, షమర్ జోసెఫ్, కైల్ మేయర్స్, ఒబెడ్ మెక్కాయ్, గుడాకేష్ మోటీ, రొమారియోడెన్ షెఫెర్డ్ వాల్ష్.
పోరాడి ఓడిన సుమిత్ నగాల్..
జెనీవా ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 93వ ర్యాంకర్ సుమిత్ 6–7 (7/9), 3–6తో ప్రపంచ 19వ ర్యాంకర్ సెబాస్టియన్ బేజ్ (అర్జెంటీనా) చేతిలో పోరాడి ఓడిపోయాడు.ఒక గంటా 39 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్ తన సర్వీను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేశాడు. సుమిత్‌కు 6,215 యూరోల (రూ. 5 లక్షల 62 వేలు) ప్రైజ్‌మనీ లభించింది.ఇవి చదవండి: వర్షంతో కోల్‌కతా, రాజస్తాన్ మ్యాచ్ రద్దు
బిజినెస్
న్యూరాలింక్ అద్భుతం, బ్రెయిన్లో చిప్‌ను అమర్చి.. ఆపై తొలగించి
ప్రముఖ వ్యాపార దిగ్గజం ఎలోన్ మస్క్‌కు చెందిన న్యూరాలింక్ కంపెనీ న్యూరోటెక్నాలజీలో అరుదైన ఘనతను సాధించింది. ఈ ఏడాది మార్చిలో పక్షవాతానికి గురైన ఓ యువకుడి బ్రెయిన్ (పుర్రెభాగం- skull)లో చిప్‌ను విజయవంతంగా అమర్చింది. అయితే సమస్యలు ఉత్పన్నం కావడంతో ఆ చిప్‌ను వైద్యులు తొలగించారు. చిప్‌లోని లోపాల్ని సరిచేసి మరోసారి బ్రెయిన్లో అమర్చారు.ఇప్పుడా యువకుడు చేతుల అవసరం లేకుండా కేవలం తన ఆలోచనలకు అనుగుణంగా బ్రెయిన్ సాయంతో కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్‌ను వినియోగిస్తున్నాడు. ఈ సందర్భంగా టెక్నాలజీ తన జీవితాన్ని మార్చేసిందంటూ భావోద్వేగానికి గురవుతున్నాడు.పక్షవాతంతో వీల్ ఛైర్‌కే2016లో సమ్మర్ క్యాప్ కౌన్సిలర్‌గా పనిచేసే సమయంలో నోలాండ్ అర్బాగ్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదంలో అతని వెన్నుముక విరిగి పక్షవాతంతో వీల్ ఛైర్‌కే పరిమితమయ్యాడు.ఎన్1 అనే చిప్ సాయంతోమెడకింది భాగం వరకు చచ్చుపడిపోవడంతో తాను ఏ పనిచేసుకోలేకపోయేవాడు. అయితే మానవ మెదడులో ఎలక్ట్రానిక్ చిప్‌ను అమర్చే ప్రయోగాలు చేస్తోన్న న్యూరాలింక్ ఈ ఏడాది మార్చిలో నోలాండ్ అర్బాగ్ పుర్రెలో ఓ భాగాన్ని తొలగించి అందులో 8 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన ఎన్1 అనే చిప్‌ను చొప్పించింది. ఇదే విషయాన్ని మస్క్ అధికారింగా ప్రకటించారు.Livestream of @Neuralink demonstrating “Telepathy” – controlling a computer and playing video games just by thinking https://t.co/0kHJdayfYy— Elon Musk (@elonmusk) March 20, 2024 డేటా కోల్పోవడంతో కథ మళ్లీ మొదటికిఈ నేపథ్యంలో ఆర్బాగ్ బ్రెయిన్లో అమర్చిన చిప్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. డేటా కోల్పోవడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. దీంతో న్యూరాలింక్ సంస్థ బాధితుడి బ్రెయిన్ నుంచి చిప్‌ను తొలగించింది. ఆపై సరిచేసి మళ్లీ ఇంప్లాంట్ చేసింది. ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానంటూ చిప్ తొలగించిన తాను భయపడినట్లు నోలాండ్ అర్బాగ్ చెప్పారు.న్యూరాలింక్ అద్భుతం చేసింది‘ఈ చిప్ నా జీవితాన్ని మార్చేసింది. కానీ చిప్‌లో డేటా పోవడంతో.. చిప్ అమర్చిన తర్వాత గడిపిన అద్భుత క్షణాల్ని కోల్పోతాననే భయం మొదలైంది. అయినప్పటికీ, న్యూరాలింక్ అద్భుతం చేసింది. సాంకేతికతకు మార్పులు చేసి మెరుగుపరచగలిగింది’ అంటూ గుడ్ మార్నింగ్ అమెరికా ఇంటర్వ్యూలో తన అనుభవాల్ని షేర్ చేశారు నోలాండ్ అర్బాగ్
బీమా పాలసీ.. అత్యవసర నిధి!
ఉన్నట్టుండి నిధుల అవసరం ఏర్పడిందా..? వ్యక్తిగత రుణానికి తక్కువ క్రెడిట్ స్కోర్ అడ్డు పడుతోందా? లేదంటే వ్యక్తిగత రుణంపై అధిక వడ్డీ రేటు చూసి వెనుకాడుతున్నారా..? ఇలాంటి సందర్భాల్లో బీమా పాలసీయే మిమ్మల్ని ఆదుకుంటుంది. అదెలా అంటారా? ఎండోమెంట్ బీమా ప్లాన్లపై బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు రుణ సదుపాయం కల్పిస్తున్నాయి. పైగా పర్సనల్ లోన్‌తో పోలిస్తే వడ్డీ రేటు తక్కువే.డబ్బులు అవసరం పడితే బీమా పాలసీని సరెండ్ చేసే వారూ ఉన్నారు. ఇలా ఇన్సూరెన్స్ పాలసీని సరెండర్ చేయడానికి బదులు, దానిపై రుణం తీసుకుని అవసరం గట్టెక్కడమే మంచి మార్గం అవుతుంది. దీనివల్ల బీమా రక్షణను ఎప్పటి మాదిరే కొనసాగించుకోవచ్చు. ఇది ఎలా పనిచేస్తుందన్నది తెలియజేసే కథనమే ఇది. రుణ సదుపాయం అన్ని రకాల బీమా పాలసీలపై వస్తుందనుకుంటే పొరపాటు. కేవలం కొన్ని రకాల పాలసీలకే ఇది పరిమితం. ‘‘పొదుపుతో కూడిన సంప్రదాయ బీమా పాలసీ (ఎండోమెంట్, మనీ బ్యాక్ ప్లాన్లు) కలిగి ఉన్నవారు వాటిపై పలు రకాల ఆర్థిక అవసరాల కోసం రుణాన్ని పొందొచ్చు’’అని ఏజెస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో విఘ్నేష్ సహానే తెలిపారు. టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు కేవలం మరణ పరిహారాన్నే అందిస్తాయని, ఎలాంటి రాబడి హామీ ఉండదు కనుక వాటిపై రుణం పొందలేరని స్పష్టం చేశారు. యూనిట్ లింక్డ్ ప్లాన్ల (యులిప్)లోనూ రాబడులు మార్కెట్‌పై ఆధారపడి ఉంటాయి కనుక వాటిపైనా రుణ సదుపాయం ఉండదని తెలిపారు. ఎక్కడ తీసుకోవచ్చు? పాలసీ మంజూరు చేసిన జీవిత బీమా కంపెనీ నుంచే రుణం తీసుకునే వెసులుబాటు ఉంది. నేడు చాలా బీమా సంస్థలు పాలసీలపై రుణాలను కూడా ఇస్తున్నాయి. అలాగే, బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు ఈ తరహా రుణాలను ఆఫర్ చేస్తుంటాయి. అయితే, బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీల కంటే పాలసీ మంజూరు చేసిన బీమా సంస్థను సంప్రదించడమే మెరుగైన మార్గమని నిపుణులు అంటున్నారు. ‘‘ఇన్సూరెన్స్ కంపెనీతో పోలిస్తే బ్యాంక్‌లు బీమా ప్లాన్లపై తక్కువ రుణ మొత్తాన్ని ఆఫర్ చేస్తాయి. అదే మాదిరి బీమా సంస్థలతో పోలిస్తే బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు రుణాలపై కొంచెం అధిక రేటును వసూలు చేస్తుంటాయి’’అని సెబీ నమోదిత ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ‘ప్లాన్ ఆర్’ వ్యవస్థాపకుడు అజయ్ ప్రుతి తెలిపారు. బ్యాంక్‌లు సాధారణంగా బీమా పాలసీపై రుణాన్ని నేరుగా కాకుండా.. కరెంట్ అకౌంట్‌పై ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కింద అందిస్తుంటాయి. ‘‘తరచుగా నిధుల అవసరం ఏర్పడేవారు ఇలా కరెంట్ అకౌంట్‌పై (సెక్యూరిటీ కింద బీమా పాలసీ జమ చేసి) ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయం తీసుకోవడాన్ని పరిశీలించొచ్చని పైసా బజార్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సహిల్ అరోరా సూచించారు. చౌక రుణం ‘‘బీమా పాలసీలపై రుణ రేటు చాలా తక్కువగా ఉండడాన్ని గమనించొచ్చు. సాధారణంగా వీటిపై 9–9.5 శాతం వార్షిక వడ్డీ రేటును వసూలు చేస్తుంటారు. అదే వ్యక్తిగత రుణాలు (పర్సనల్ లోన్) అయితే 12 శాతం అంతకంటే ఎక్కువే ఉంటుంది’’అని బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రాజేష్ కృష్ణన్ తెలిపారు. ఇక బీమా పాలసీలపై రుణం ఎంతొస్తుందంటే.. రుణం తీసుకునే నాటికి ఉన్న స్వా«దీనపు విలువ (సరెండర్ వ్యాల్యూ)లో 90 శాతం వరకు. బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీల నుంచి రుణం మంజూరునకు సాధారణంగా నాలుగు నుంచి ఏడు రోజులు పడుతుంది. అదే బీమా సంస్థల నుంచి రుణం మూడు రోజుల్లోనే పొందొచ్చు. కొన్ని బీమా సంస్థలు ఇంతకంటే వేగంగా ఆన్లైన్లోనే పాలసీలపై రుణాలను మంజూరు చేస్తున్నాయి. ‘‘జీవిత బీమా పాలసీలపై రుణం దరఖాస్తు మదింపు, రుణం మంజూరు చాలా వేగంగా ఉంటుంది. బీమా సంస్థ నుంచే రుణం తీసుకునేట్టు అయితే ఎలాంటి అదనపు తనిఖీలు, పరిశీలనలు అవసరం పడవు’’అని రాజేష్ కృష్ణన్ వివరించారు.బీమా పాలసీపై రుణం తీసుకోవడం ఎంతో సౌకర్యమైనదిగా పాలసీఎక్స్ సీఈవో నావల్ గోయల్ సైతం అంగీకరించారు. ‘‘దరఖాస్తు చేసుకోవడం ఎంతో సులభం. తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న వారు సైతం పాలసీపై రుణానికి అర్హులే. ఎందుకంటే పాలసీపై రుణం జారీకి క్రెడిట్ స్కోర్ తనిఖీలు అవసరం పడవు’’అని కృష్ణన్ తెలిపారు. ఈ రుణం తిరిగి చెల్లింపు నిబంధనలు కూడా సులభమే. ‘‘రుణం చెల్లించడం వీలు కానప్పుడు కేవలం రుణంపై వడ్డీ వరకే చెల్లించొచ్చు. అసలు రుణాన్ని ఎప్పుడైనా తిరిగి తీర్చివేయవచ్చు’’అని ప్రుతి వివరించారు. ఎంత వీలైతే అంత అసలు రుణంలో చెల్లించుకుంటూ వెళ్లడం కూడా మంచి ఆలోచనే. దీనివల్ల ప్రతి నెలా చెల్లించే వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చు. అత్యవసర నిధి బీమా పాలసీ అత్యవసర నిధిగానూ అక్కరకొస్తుంది. ప్రతి కుటుంబానికి విధిగా అత్యవసర నిధి ఉండాలి. అనుకోని పరిణామాలతో నెలవారీ వచ్చే ఆదాయం ఆగిపోతే? చేస్తున్న ఉద్యోగం ఊడిపోతే..? అక్కడి నుంచి తిరిగి ఉపాధి లభించేంత వరకు కుటుంబ అవసరాలను తీర్చేందుకు అత్యవసర నిధి ఉపయోగపడుతుంది. కనీసం ఆరు నెలల నుంచి ఏడాది అవసరాలను తీర్చేంత అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తుంటారు. అయితే, ప్రతి ఒక్కరికీ ఇంత మొత్తం అత్యవసర నిధి కింద ఏర్పాటుకు వెసులుబాటు ఉండకపోవచ్చు. ఇలాంటి వారు ఎండోమెంట్ లేదా మనీబ్యాక్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను అత్యవసర నిధి కింద ఉపయోగించుకోవచ్చు. తిరిగి ఉపాధి ఏర్పడి, ఆదాయం చేతికి అందేంత వరకు పాలసీపై రుణంతో అవసరాలను గట్టెక్కొచ్చు. ఆ తర్వాత క్రమంగా ఆరు నెలల్లోపు పాలసీపై రుణాన్ని తీర్చివేయడం మంచి ఆలోచన అవుతుంది. పాలసీ సరెండర్ అంటే? ఎండోమెంట్ లేదా మనీ బ్యాక్ బీమా ప్లాన్ వద్దనుకునే వారు దాన్ని సరెండర్ చేసుకోవచ్చు. అంటే గడువు ముగియకుండానే పాలసీని వెనక్కిచ్చేయడం. పాలసీ తీసుకున్న తర్వాత ఎంత కాలానికి సరెండర్ చేస్తున్నారనే దాని ఆధారంగా దానిపై ఎంతొస్తుందన్నది ఆధారపడి ఉంటుంది. ఈ సరెండర్ వ్యాల్యూ (స్వా«దీనపు విలువ) విషయంలో బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) 2024 ఏప్రిల్ 1 నుంచి నూతన నిబంధనలు తీసుకొచ్చింది. వీటి ప్రకారం బీమా పాలసీ తీసుకున్న మూడేళ్లలోపు సరెండర్ చేస్తే చేతికి చాలా తక్కువే వస్తుంది. అంటే అప్పటికి కట్టిన ప్రీమియంలో సగం కూడా రాదు. అదే పాలసీ తీసుకున్న తర్వాత నాలుగేళ్ల నుంచి ఏడేళ్లలోపు సరెండర్ చేస్తే అధిక విలువ పాలసీదారుకు దక్కుతుంది. నిజానికి ఎండోమెంట్, మనీబ్యాక్ పాలసీల్లో 20–30 ఏళ్లపాటు కొనసాగినప్పుడే ప్రతిఫలం కనిపిస్తుంది. ఇంతకంటే తక్కువ కాలవ్యవధిపై వచ్చే ప్రయోజనం అంతగా ఉండదు. అందుకని నిధుల అవసరం ఏర్పడితే బీమా ప్లాన్‌ను సరెండర్ చేయడానికి బదులు.. దానిపై రుణం పొందడమే మెరుగైనది అవుతుంది. మళ్లీ నిధుల వెసులుబాటు వచ్చిన వెంటనే తీసుకున్న రుణాన్ని తీర్చివేయాలి. ఆరంభంలో తక్కువే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న కొత్తలో దీనిపై వచ్చే రుణం చాలా స్వల్పం. ఇందులో ఉన్న ప్రతికూలత ఇదే. క్యాష్ వ్యాల్యూ లేదా సరెండర్ వ్యాల్యూ గణనీయంగా పెరిగేందుకు కొన్నేళ్లు పడుతుంది. అప్పుడే చెప్పుకోతగ్గ మేర రుణం దీనిపై వస్తుంది. ఇక ఎండోమెంట్ లేదా మనీ బ్యాంక్ పాలసీలపై దీర్ఘకాలంలో వచ్చే రాబడి 5–6 శాతం మేర ఉంటుంది. దీనిపై రుణం తీసుకుంటే, నికరంగా అందుకునే రాబడి ప్రయోజనం మరింత తగ్గిపోతుందని గుర్తు పెట్టుకోవాలి. తిరిగి చెల్లించలేకపోతే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలపై ఉన్న మరో అనుకూలత ఏమిటంటే.. రుణాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమైనా అది క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేయబోదని కృష్ణన్ తెలిపారు. రుణంలో అసలు, వడ్డీ, చార్జీలు అన్నింటినీ పాలసీ సరెండర్ వ్యాల్యూ నుంచి బీమా సంస్థలు సర్దుబాటు చేసుకుంటాయని సహిల్ అరోరా తెలిపారు. రుణం చెల్లించకుండా పాలసీదారు మరణించిన సందర్భాల్లో.. పరిహారం నుంచి రుణం, వడ్డీ, చార్జీలను మినహాయించుకుని, మిగిలిన మొత్తాన్ని బీమా సంస్థ నామినీ లేదా పాలసీదారు వారసులకు చెల్లిస్తుంది. రుణం తీర్చకుండానే పాలసీ గడువు ముగిసిపోయిందనుకుంటే.. అప్పుడు నికరంగా చెల్లించే మొత్తం నుంచి రుణాన్ని బీమా సంస్థ వసూలు చేసుకుంటుంది. ఒకవేళ రుణంపై వడ్డీ కూడా బకాయి పడితే.. అసలు, వడ్డీ మొత్తం సరెండర్ వ్యాల్యూని దాటిపోతుంటే అప్పుడు పాలసీని బీమా సంస్థ రద్దు చేస్తుంది. పాలసీపై రుణం తీసుకునే సమయంలోనే దానిపై బీమా సంస్థకు హక్కులు బదలాయిస్తున్నట్టు అంగీకారాన్ని తీసుకుంటాయి. రుణం సమంజసమేనా..? అసలు జీవిత బీమా ఎందుకు? ఆర్జించే వ్యక్తికి దురదృష్టవశాత్తూ ఏదైనా వాటిల్లితే అప్పుడు అతనిపై ఆధారపడిన కుటుంబం ఆర్థికంగా కష్టాలు పడకూడదనే. తాను లేకపోయినా, తన కుటుంబ అవసరాలను తీర్చే లక్ష్యంతోనే లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజీని తీసుకుంటుంటారు. మరి అలాంటి సాధనంపై రుణం తీసుకుంటే, అసలు ప్రయోజనానికే భంగం కలగొచ్చని నిపుణుల భావన. అదెలా అంటే పాలసీపై రుణం తీసుకున్న తర్వాత సదరు పాలసీదారు అనుకోకుండా మరణం పాలైతే.. కుటుంబానికి దక్కే బీమా పరిహారం పెద్దగా ఉండకపోవచ్చు. దాంతో బీమా ఉద్దేశ్యం నెరవేరకుండా పోతుంది. అందుకని బంగారం, మ్యూచువల్ ఫండ్స్, ప్రాపర్టీ తదితర ఇతర సాధనాలపై రుణం తీసుకోవడాన్ని పరిశీలించొచ్చని చెబుతుంటారు. కానీ, ఇక్కడ వాస్తవ అంశం ఏమిటంటే.. బంగారంపై రుణం తీసుకున్న తర్వాత సదరు వ్యక్తి మరణించినా కానీ, ఆ అప్పు తీర్చాల్సిన బాధ్యత కుటుంబంపైనే పడుతుంది. అందుకని ఏ సాధనంపై రుణం తీసుకున్నా పరిణామం ఒక్కటిగానే ఉంటుంది. అందుకుని దీనికి పరిష్కారం ఒకటి ఉంది. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి ఏదైనా అవసరం కోసం రుణం తీసుకుంటుంటే, వెంటనే అంత విలువకు టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజీని పెంచుకోవడం లేదంటే అదనపు కవరేజీతో టర్మ్ ప్లాన్ కొనుగోలు చేయడం మంచిది. దీనివల్ల అనుకోనిది జరిగినా వచ్చే పరిహారంతో రుణాలను గట్టెక్కొచ్చు. ఇక దీర్ఘకాల అవసరాలకు కాకుండా స్వల్పకాల అవసరాలకే బీమాపై రుణానికి పరిమితం కావాలి. మూడు నుంచి ఆరు నెలలు మించకూడదు. ఎందుకంటే ఇంత తక్కువ కాలానికి చెల్లించాల్సిన వడ్డీ భారం కూడా చాలా తక్కువే ఉంటుంది. కనుక ఒకవేళ పాలసీదారు మరణించినా కుటుంబం పెద్దగా నష్టపోయేది ఉండదు. బీమా సంస్థ తనకు రావాల్సినంత మేర మినహాయించుకుని, మిగిలినది చెల్లించేస్తుంది. ఎండోమెంట్ ప్లాన్ ఉన్న వారు విధిగా మెరుగైన కవరేజీతో టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తప్పకుండా తీసుకోవాలి. అప్పుడు కుటుంబానికి మెరుగైన ఆర్థిక రక్షణ ఉంటుంది.
రూ.8300 కోట్ల పెట్టుబడికి సిద్దమైన రీసైక్లింగ్ కంపెనీ.. టార్గెట్ ఏంటో తెలుసా?
ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, బ్యాటరీ రీసైక్లింగ్ కంపెనీ 'అటెరో' వచ్చే ఐదేళ్లలో సుమారు రూ. 8300 కోట్ల పెట్టుబడి పెట్టాలని యోచిస్తోందని కంపెనీ సీఈవో, కో ఫౌండర్ 'నితిన్ గుప్తా' తెలిపారు. ప్రస్తుతం కంపెనీ సంవత్సరానికి 1,44,000 టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలను(ఈ-వేస్ట్ ), 15,000 టన్నుల లిథియం అయాన్ బ్యాటరీని రీసైకిల్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. రాబోయే రోజుల్లో ఈ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి సంస్థ ఈ పెట్టుబడి పెట్టింది.సంస్థ ప్రతి ఏటా 100 శాతం వృద్ధి సాధిస్తోందని, ఈ క్రమంలోనే సామర్థ్యాన్ని పెంచుకుంటూ ముందుకు సాగుతోంది. ఐరోపా దేశంలో ఇప్పటికే తన కార్యకలాపాలనను ప్రారంభించింది. భారతదేశంలో మరొక గ్రీన్‌ఫీల్డ్ సౌకర్యాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. దీనికోసం ఆంధ్రప్రదేశ్ / జార్ఖండ్‌లో స్థలాన్ని కూడా ఖరారు చేసినట్లు సమాచారం.కంపెనీ తన ఉనికిని విస్తరించిన తరువాత రీసైక్లింగ్ కెపాసిటీ ఏడాదికి 50000 టన్నులకు చేరుతుంది. ప్రస్తుతానికి కంపెనీ రీసైక్లింగ్ సామర్థ్యం 415000 టన్నులు అని తెలుస్తోంది. కంపెనీ 2027 నాటికి దాదాపు రూ. 16500 కోట్ల ఆదాయం గడించాలని యోచిస్తోంది. 2023లో కంపెనీ ఆదాయం రూ. 285 కోట్లు, 2024లో రూ. 440 కోట్లు.అటెరోకు ప్రస్తుతం 25 శాతం మార్కెట్ వాటా అది. ఇది వచ్చే ఏడాదికి 35 శాతానికి పెరుగుతుంది. అయితే మార్కెట్ వాటా పరంగా కంపెనీ దాని ప్రత్యర్థుల కంటే 10 శాతం తక్కువగా ఉంటుందని సమాచారం. రాబోయే రోజుల్లో కంపెనీ గణనీయమైన వృద్ధి సాదిస్తుందని భావిస్తున్నట్లు నితిన్ గుప్తా పేర్కొన్నారు.
స్పేస్‌లోకి తొలి తెలుగు వ్యక్తి గోపీ తోటకూర.. ప్రారంభమైన ప్రయోగం
స్పేస్ టూరిజంలో అమెజాన్ అధినేత జెఫ్‌బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజన్ మరో అడుగు ముందుకు వేసింది. బ్లూ ఆరిజన్ సంస్థ టెక్సాస్ కేంద్రంగా అంతరిక్షం అంచు వరకు వెళ్లే మానవ రాకెట్ ప్రయోగాన్ని ప్రారంభించింది. బ్లూ ఆరిజన్ న్యూ షెపర్డ్ మిషన్ ఎన్ఎస్-25 మిషన్‌ను పశ్చిమ టెక్సాస్‌లోని లాంచ్ సైట్ వన్ నుండి మే 19న ఉదయం 8.30 (భారత్ కాలమాన ప్రకారం..సాయంత్రం 7.30) గంటలకు రాకెట్ బయలుదేరుతుంది. ఈ ఎన్ఎస్ -25 మెషిన్లో భారత్‌కు చెందిన గోపి తోటకూర సహా ఆరుగురు ప్రయాణిస్తున్నారు.కాగా, గోపి తోటకూరతో పాటు వెంచర్ క్యాపిలిస్ట్ మాసన్ ఏంజెల్, ఫ్రాన్స్ బిజినెస్మెన్ సిల్వైన్ చిరోన్, అమెరికా టెక్ బిజినెస్మెన్ కెన్నెత్ ఎల్ హెస్, సాహసయాత్రికుడు కరోల్ షాలర్, అమెరికా వైమానికదళ మాజీ కెప్టెన్ ఎడ్ డ్వైట్.. ఈ స్పేస్ యాత్రకు వెళ్లారు.
వీడియోలు
అది పచ్చ బ్యాచ్ పనే.. రేవ్ పార్టీ కథనాలపై కాకాణి ఫైర్..
పోలీస్ స్టేషన్ పై దాడి చేసి పారిపోయిన చింతమనేని
పోస్టల్ బ్యాలెట్ ఓటును అమ్ముకున్న ఎస్సై
సత్తెనపల్లిలో సిట్ టీమ్
తెలంగాణలో వీసీల పంచాయితీ
హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో విశాఖవాసి అరెస్ట్
బెంగళూరు రేవ్ పార్టీతో నాకు సంబంధంలేదు: సినీ నటి హేమ
రిజర్వేషన్లపై మోడీ డబుల్ గేమ్
అరుకు లోయలో ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలు
సిట్ వద్ద కీలక ఆధారాలు.. విచారణ అడ్డుకునే కుట్ర
ఫ్యామిలీ
కొత్త హెయిర్ స్టైల్లో విరాట్ కోహ్లీ..వావ్!అంటూ ఫ్యాన్స్ కితాబు!
భారత క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లకి విధ్వంసకర బ్యాట్స్మ్యాన్గానే గాక.. స్టైలీష్ ఐకాన్‌గా కూడా మంచి గుర్తింపు పొందాడు. చాలామంది అభిమానులు విరాట్ స్టైల్‌నే ఫాలో అవుతుంటారు. అంతలా ఉంటుంది ఆయన హెయిర్ స్టైల్‌కి, గడ్డం స్టైల్‌కి క్రేజ్. ప్రతి ఐపీఎస్ మ్యాచ్‌కి కోహ్లీ కొత్త లుక్‌లో ఎంట్రీ ఇస్తూ..అభిమానులను ఆశ్చర్యపరుస్తుంటాడు. అందులోనూ ఈసారీ టీ20 వరల్డ్ కప్ రెండు వారాల్లో జరగనుంది. అందుకోసం కోహ్లీ ఏ హెయిర్‌స్టైల్‌తో కనిపించనున్నాడా? అని ఆసక్తిగా చూస్తున్నారు ఫ్యాన్స్. ఈసారి కోహ్లీ కేశాలంకరణ ఏ స్టయిల్లో ఉందంటే..విరాట్‌ని డిఫెరెంట్ డిఫెరెంట్ స్టయిల్ కనిపించేలా మెరుగులు దిద్దేది సెలబ్రిటీ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్. అతడి స్టైలిష్ నైపుణ్యంతో విరాట్ లుక్‌ని మరింత ఎంట్రాక్టివ్గా కనిపించేలా చేస్తాడు. ముఖ్యంగా అతడి ఫ్యాన్స్ ఫిదా అయ్యి స్టయిల్‌నే ఫాలో అయ్యేంతగా ఆకర్ణణీయంగా మలుస్తాడు. ఈసారి హకీమ్ చాలా కొత్తగా.. కోహ్లి లుక్‌ని ప్రజెంట్ చేశాడు. View this post on Instagram A post shared by Aalim Hakim (@aalimhakim) వన్ అండ్ ఓన్లీ కింగ్ కోహ్లీ కోసం గ్రుంగి షార్ప్ హ్యారీకట్ని ఎంచుకున్నట్లు హకీమ్ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. ఇది గ్రాడ్యయేషన్ చేస్తున్న కుర్రాడి లుక్‌ని ఇస్తుందని చెప్పాడు. ఫ్రంట్ హెయిర్లెస్గా ఉండి, మిగతా అంతా పొడవుగా ఉండి కదలికలు ఉండేలా సరికొత్త హెయిర్ స్టయిల్ని సెట్ చేశాడు హకీమ్. ఇక హకీమ్ బాలీవుడ్ సినీ ప్రముఖుల నుంచి ప్రసిద్ధ సెలబ్రిటీలకు డిఫరెంట్ హెయిర్ స్టయిల్ పరిచయం చేస్తుంటాడు. అతడు ఏకంగా లక్ష రూపాయల దాక చార్జ్ చేస్తాడు.కోహ్లీ కొత్త హెయిర్ స్టైల్‌కి సంబంధించిన న్యూలుక్ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్ల రెండు రోజుల్లో జరగనున్ను టీ20 ప్రపంచకప్‌కి తగ్గ కొత్తహెయిర్ స్టయిల్ ఇది అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఒక అభిమాని ఆర్సీబీ జెర్సీ ధరించి..హృదయపూర్వకంగా నవ్వుతున్న కోహ్లీ వీడియోని షేర్ చేస్తూ.. టీ20 వరల్డ్ కప్‌కి విరాట్ కొత్త హెయిర్ స్టైల్ అని పేర్కొంటూ సోషల్ మీడియా ఎక్స్‌లో వీడియో పోస్ట్ చేశాడు.New hairstyle for T20 WC🙂👍🏻#viratkohli pic.twitter.com/4Vdp4Ha3PQ— 𝙒𝙧𝙤𝙜𝙣🥂 (@wrognxvirat) May 16, 2024 (చదవండి: సౌదీ అరేబియా రాజుకి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్! ఎందువల్ల వస్తుందంటే..?)
నెలసరి ముందు బాగా తలనొప్పా! పీఎంఎస్ అంటే ఏంటో తెలుసా?
నా వయసు 25 ఏళ్లు. ఇటీవల నాకు నెలసరి ముందు బాగా కడుపునొప్పి, తలనొప్పి వస్తున్నాయి. భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోతున్నాను. జాబ్‌లో కూడా ఏ పనిమీదా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. నాకేమైనా సమస్య ఉందంటారా? – రాజీవ, బనగానపల్లిమీరు ఎదుర్కొంటున్న సమస్యను ‘ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్’ (పీఎంఎస్) అంటారు. ప్రతి వందమందిలో ఇద్దరికి మీలో ఉన్నంత తీవ్రంగా ఈ సమస్య ఉంటుంది. దీని లక్షణాలు దినచర్యను ప్రభావితం చేసేంతగా ఉంటాయి. చాలామందిలో నెలసరి మొదలవడానికి రెండువారాల ముందు నుంచి శారీరక, మానసిక మార్పులు కనిపిస్తాయి. బరువు పెరగడం, మానసికంగా బలహీనం కావడం, తలనొప్పి, చిరాకు, కోపం, నిద్రలేమి, నీరసం ఉంటాయి.పీఎంఎస్‌కి సరైన కారణం తెలియదు. హార్మోన్ల అసమతుల్యత వల్ల వస్తుందనుకుంటాము. మీలో కలిగే మార్పులన్నీ కాగితంపై రాసుకోవాలి. దీనిని మెన్స్ట్రువల్ డైరీ అంటారు. ఇలా రెండు మూడు నెలలు మెన్స్ట్రువల్ డైరీ రాశాక, సమస్యకు కారణాలు కొంతవరకు తెలుస్తాయి.ముఖ్యంగా జీవనశైలిలో మార్పులు– అంటే, ప్రతిరోజూ వ్యాయామం చేయడం, పోషకాహారం తీసుకోవడం, నెలసరికి రెండు మూడు వారాల ముందు నుంచి టీ, కాఫీలు తగ్గించడం, జంక్‌ఫుడ్ మానేయడం వంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే, కొంతవరకు ఫలితం ఉంటుంది. యోగా, ధ్యానం వంటివి చేయడం ద్వారా మానసిక స్థైర్యం పెరగడమే కాకుండా, పీఎంఎస్ లక్షణాల తీవ్రత తగ్గుతుంది.అలాగే, డాక్టర్ పర్యవేక్షణలో కొన్ని మందులు కూడా వాడాల్సి ఉంటుంది. విటమిన్–డి, విటమిన్–ఇ లాంటి సప్లిమెంట్లు ఉపయోగపడతాయి. పైమార్పులు, సప్లిమెంట్లతో ఫలితం కనిపించకపోతే, డాక్టర్ల పర్యవేక్షణలో అవసరమైన మందులు తీసుకోవలసి ఉంటుంది. అత్యంత అరుదుగా శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది.డా. భావన కాసు, గైనకాలజిస్ట్ అండ్ అబ్‌స్టెట్రీషియన్, హైదారాబాద్
టెకీ రమ్య ఉదంతం : మీరొచ్చి పెంచుతారా? గాయని చిన్మయి ఆవేదన
తమిళనాడులోని కోయంబత్తూరలో ఐటీ ఉద్యోగి రమ్య ఆత్మహత్య ఘటనపై ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వేధించిన నెటిజన్లు వచ్చి ఇపుడా బిడ్డను పెంచుతారా అంటూ ఫైర్ అయ్యారు. ఆ మేరకు ఇన్‌స్టాలో చిన్మయి పోస్ట్ పెట్టారు. View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) ఏప్రిల్ 28న, తిరుముల్లైవాయల్‌లోని అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లోని నాల్గవ అంతస్తు బాల్కనీలో రమ్య తన కుమార్తెతో ఆడుకుంటుండగా, ఎనిమిది నెలల పాప ఆమె చేతుల్లోంచి జారి సన్‌షేడ్‌పై పడిపోయింది. అయితే వెంటనే స్పందించిన స్థానికులు ఆమెను రక్షించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు ఆమెను విపరీతంగా ట్రోల్ చేయడంతో మనస్థాపానికి గురైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలోఉరివేసుకుని ఆత్మ హత్యకు పాల్పడింది. దీంతో ఆమె ఇద్దరు బిడ్డలు తల్లి లేని బిడ్డలుగా మారిపోవడం విషాదం. మరోవైపు కేసు నమోదు చేసిన కరమడై పోలీసులు ఆమె మరణాకి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి: సోషల్ మీడియా ట్రోలింగ్ : బిడ్డ బతికినా, పాపం తల్లి తట్టుకోలేకపోయింది!
తినే ఆహారంలో వెరైటీలు ఉండేలా చూసుకోవాలి..! లేదంటే?
జీవనశైలి అలవాట్లలో పెద్ద ఎత్తున వచ్చిన మార్పులతో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. కొన్ని దశాబ్దాలుగా మారిన, మారుతున్న ఆహార అలవాట్లతో ఎక్కువ మందిలో పోషకాహార లోపాలు, రక్తలేమి, ఇతర అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. ఫాస్ట్‌ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ వినియోగం కూడా పెరగడంతో ఊబకాయం వంటి సమస్యలకు అనేక మంది గురవుతున్నారు.ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్–హైదరాబాద్, ఎన్ఐఎన్ నిపుణుల కమిటీ ‘డైటరీ గైడ్‌లైన్స్ ఫర్ ఇండియన్స్’ పేరిట నిర్వహించిన అధ్యయనంలో పలు సూచనలు చేసింది. అన్ని వయసుల వారిలో ఆరోగ్య పరిరక్షణకు 17 డైటరీ గైడ్‌లైన్స్ సూచించింది. సమతుల ఆహారంలో వెరైటీలు (భిన్నరకాల ఆహార పదార్థాలు) ఉండేలా చూసుకోవడం ముఖ్యమని చెప్పింది.ఐసీఎంఆర్–ఎన్ఐఎన్ గైడ్‌లైన్స్‌లో ముఖ్యమైనవి..మనం తీసుకునే ఆహారంలో తాజా కూరలు, పండ్లు, 50 శాతం ధాన్యం (సిరియల్స్) పోషకాలు, పీచు పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. చిక్కుళ్లు, గింజలు, చేపలు, గుడ్లు వంటివి తీసుకోవాలి.ఆరునెలల వయసు పైబడిన పిల్లలకు ఇళ్లలోనే తయారు చేసిన సెమీ–సాలిడ్ సప్లిమెంటరీ ఫుడ్‌ను ఇవ్వాలి.చిన్నపిల్లలు, పెరిగే వయసున్న పిల్లలకు తగిన ఆహారం అందించి వారు అనారోగ్యం బారిన పడకుండా చూడాలి.నూనె/కొవ్వుపదార్థాలు పరిమితంగా వాడాలి, తగినంతగా పోషకాలు, ఎసెన్షియల్ అమినో యాసిడ్స్‌ను వివిధ రకాల ఆహార పదార్థాల ద్వారా లభించేలా చూడాలి.కండలు పెంచేందుకు ప్రొటీన్ సప్లిమెంట్స్ తీసుకోరాదు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకుని ఊబకాయం వంటివి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలు, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, చక్కె ర, ఉప్పు ఎక్కువ ఉన్న వాటిని నియంత్రించాలి.శారీరకంగా చురుకుగా ఉండేందుకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.శుభ్రమైన, సురక్షితమైన ఆహారాన్నే తీసుకోవాలి. మంచినీళ్లు తగినంతగా తాగాలి.ప్రస్తుతం ఆహార పదార్థాలు ఎక్కువగా ప్యాకేజ్డ్ రూపంలో వస్తున్నందున ఆ ప్యాకెట్లపై ఉన్న వివరాలను పూర్తిగా చదివాకే కొనుగోలు చేయాలి.గంటల తరబడి టీవీలు చూస్తున్నపుడు మధ్య మధ్యలో లేచి అటు ఇటు తిరగాలి.బిజీ షెడ్యూళ్లలో పనిచేస్తున్నా గంటకు ఒకసారైనా 5 నుంచి 10 నిమిషాలు నడవాలి.ఇవి చదవండి: సోషల్ మీడియా ట్రోలింగ్ : బిడ్డ బతికినా, పాపం తల్లి తట్టుకోలేకపోయింది!
న్యూస్ పాడ్‌కాస్ట్
ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురావాలన్న ఆలోచన మానుకోండి... కాంగ్రెస్ పార్టీకి హితవు పలికిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ అనంతరం జరిగిన హింసాకాండపై వినీత్ బ్రిజ్‌లాల్ నేత్వత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు.. ఇంకా ఇతర అప్డేట్స్
రుణమాఫీకి ఏర్పాట్లు చేయండి, ఆగస్టు 15లోగా చేసి తీరాల్సిందే.. అధికారులకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో 81.3 శాతం పోలింగ్... వెల్లడించిన సీఈవో కార్యాలయం వర్గాలు.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో పోటెత్తిన ఓటర్లు. కడపటి వార్తలు అందే సమయానికి 76.50 శాతం పోలింగ్.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో వన్స్‌మోర్... రాష్ట్రంలో మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం తథ్యమని జాతీయ మీడియా సంస్థల సర్వేల్లో వెల్లడి.. ఇంకా ఇతర అప్డేట్స్
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 50 సీట్లు కూడా రావు, ప్రతిపక్ష పార్టీ హోదా దక్కదు... తేల్చిచెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని 57 నెలలకే అంతం చేసే కుట్రలు.. ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం.. ఇంకా ఇతర అప్డేట్స్
చంద్రబాబుది పెత్తందార్ల కూటమి... ఎన్నికల ప్రచార సభల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
అమెరికా వీసా కోసం ‘దొంగ’ నాటకం, అడ్డంగా బుక్కైన నలుగురు భారతీయులు
అమెరికా వీసా కోసం వింత నాటకంతోఅడ్డంగా బుక్కయ్యారు. నిందితుల్లో నలుగురు భారతీయులతో సహా ఆరుగురు ఉన్నారు. ఇమ్మిగ్రేషన్ వీసాలు పొందేందుకు ఆయుధాలతో దోపిడీల్లో బాధితులుగా కుట్ర పన్నారు. తద్వారా బాధితులు యునైటెడ్ స్టేట్స్కు ఇమ్మిగ్రేషన్ వీసాలు పొందవచ్చని ప్లాన్ వేశారు. చివరికి ఏమైందంటే..కెంటకీలోని ఎలిజబెత్‌టౌన్‌కు చెందిన భిఖాభాయ్ పటేల్, జాక్స్న్కు చెందిన నీలేష్ పటేల్, టెన్నెస్సీ, రవినాబెన్ పటేల్, రేసిన్, విస్కాన్సిన్,ఫ్లోరిడాలోని జాక్సన్విల్లేకు చెందిన రజనీ కుమార్ పటేల్, అమెరికా వీసాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు దశలవారీగా జరిగిన దోపిడీలలో బాధితులుగా నటించారు. తద్వారా మానసిక లేదా శారీరక వేధింపులకు గురైన కొన్ని నేరాల బాధితుల కోసం ఉద్దేశించిన వీసాలు పొందవచ్చని భావించారు. కానీ పోలీసులకు చిక్కారు. చికాగో సెంట్రల్ కోర్టులో ఆరోపణలు నమోదైనాయి. కోర్టు ప్రకటన ప్రకారం, నిందితులు, కొందరు దోపిడీకి గురైన వారి సర్టిఫికేట్ల ఆధారంగా అమెరికా పౌరసత్వం, వీసా సేవలకు నకిలీ U-వీసా దరఖాస్తులను కూడా సమర్పించారు. వీసా దరఖాస్తులో తప్పుడు ప్రకటనలు చేశారని రవీనాబెన్ పటేల్‌పై వేర్వేరుగా ఆరోపణలు వచ్చాయి. ఈ స్కాంలో నలుగురు వ్యక్తులు నయీంకు వేల డాలర్లు చెల్లించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు ఈ నకిలీ దోపిడీ సమయంలో కొందరు వ్యక్తులు ఆయుధాలతో బాధితుల వద్దకు వెళ్లి దోచుకున్నారని కూడా నివేదిక పేర్కొంది. మోసానికి కుట్ర పన్నారనే ఆరోపణలపై నిందితుడికి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, వీసా దరఖాస్తులో తప్పుడు ప్రకటనలు చేసిన ఆరోపణలపై 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే నిబంధన ఉందని ఒక ప్రకటన తెలిపింది.
చికెన్ తిని యువకుడి మృతి
తిరువళ్లూరు: వెయిట్ లిఫ్టింగ్‌పై ఆసక్తితో తరచూ చికెన్ తిన్న యువకుడు మృతిచెందాడు. తిరువళ్లూరు జిల్లా తొయుదావూర్ గ్రామానికి చెందిన తులక్కానం కుమారుడు విఘ్నేష్(28). ఇతను వెయిట్ లిఫ్టింగ్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. శరీర ఆకృతిని పెంచడానికి కోడిగుడ్లు, కోడిమాంసం మాత్రమే గత ఆరు నెలల నుంచి తీసుకుంటున్నట్టు తెలిసింది. దీంతో గత 16న అనారోగ్యానికి గురయ్యాడు. వెంటనే బంధువులు తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి అక్కడ వైద్యం అందించారు. ఆరోగ్యం కొంత కుదుటపడడంతో శనివారం ఇంటికి వెళ్లాడు. అనంతరం సమీపంలోని చర్చికి వెళ్లి ప్రార్థన నిర్వహిస్తుండగా కుప్పకూలిపోయాడు. వెంటనే స్థానికులు అరక్కోణంలోని సీఎంసీ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు.
టిప్పర్ ఢీకొని బీటెక్ విద్యార్థి మృతి
బత్తలపల్లి: స్థానిక జాతీయ రహదారిపై టిప్పర్ ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ యువకుడు మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన మేరకు... చెన్నేకొత్తపల్లి మండలం ప్యాదిండికి చెందిన జంగాలపల్లి హనుమంతరెడ్డి కుమారుడు అశోక్‌రెడ్డి(22), బత్తలపల్లి మండలం అప్పరాచెరువు గ్రామానికి చెందిన బ్యాళ్ల వెంకటశివయ్య కుమారుడు విష్ణువర్ధన్‌బాబు చైన్నెలోని ఓ పైవేట్ కళాశాలలో వరుసగా ఒకరు ఫైనల్ ఇయర్, మరొకరు థర్డ్ ఇయర్ చదువుతున్నారు. ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడంతో స్నేహితులయ్యారు. ఈ క్రమంలోనే వేసవి సెలవులు రావడంతో ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమైన వీరు ఆదివారం ముదిగుబ్బ మండలం రాళ్ల అనంతపురంలోని అశోక్‌రెడ్డి అక్క ఇంటికి చేరుకున్నారు. మధ్యాహ్నం భోజనం ముగించుకుని స్వగ్రామానికి బయలుదేరారు. నల్లబోయనపల్లి వద్దకు చేరుకోగానే గ్రామ సర్వీసు రోడ్డుపై నుంచి వచ్చిన ఐచర్ వాహనాన్ని తప్పించే క్రమంలో రోడ్డు మధ్యలోకి చేరుకున్నారు. అదే సమయంలో అనంతపురం నుంచి ఉప్పలపాడు ఇసుక రీచ్‌కు వెళుతున్న టిప్పర్ ఢీకొంది. ప్రమాదంలో అశోక్‌రెడ్డి తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన విష్ణువర్దన్బాబును స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ ద్వారా ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న రాళ్లఅనంతపురంలోని సోదరి అక్కడకు చేరుకుని తమ్ముడి మృతదేహం పడి బోరున విలపించింది. ఎస్ఐ శ్రీనివాసులు, ఏఎస్ఐ సోమశేఖర్‌మూర్తి అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు.
మీ పాస్వర్డ్ స్ట్రాంగేనా?
సాక్షి, హైదరాబాద్: ఏటీఎం, ఆన్లైన్ బ్యాకింగ్ పాస్‌వర్డ్‌ల విషయంలో నిర్లక్ష్యం ఏమాత్రం తగదని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొందరు మరిచిపోతామనో..సులభంగా ఉండాలనో ...1111, 1212 తరహా అత్యంత సాధారణ పాస్వర్డ్లు పెట్టుకునే వారంతా సైబర్ నేరగాళ్లకు డబ్బులు కాజేసే అవకాశమిచి్చనవారవుతారని హెచ్చరించారు. చెక్ పాయింట్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ లిమిటెడ్ నివేదిక ప్రకారం, 2024 మొదటి త్రైమాసికంలో భారతదేశంలోని సైబర్ దాడులలో 33% గణనీయమైన పెరుగుదల నమోదైంది. 3.4 మిలియన్ల పాస్‌వర్డ్‌ల అధ్యయనం తర్వాత పది వీక్ పాస్‌వర్డ్‌లను గుర్తించినట్లు నిపుణులు పేర్కొన్నారు. వీటిలో ఏదైనా సంఖ్యను పిన్ నంబర్ (పర్సనల్ ఐడెంటిఫికేషన్ నంబర్)గా వాడుతుంటే..దాన్ని వెంటనే మార్చుకుని..ఇతరులు సులువుగా గుర్తించలేని పాస్‌వర్డ్‌ను పెట్టుకోవాలని సూచించారు. అదేవిధంగా తమ, లేదా ఇతర కుటుంబ సభ్యుల పుట్టిన సంవత్సరాలు సైతం పెట్టుకోకపోవడమే ఉత్తమం అని నిపుణులు సూచిస్తున్నారు.అత్యంత వీక్ పాస్వర్డ్లు ఇవే... 1234, 1111, 0000, 1212, 7777, 1004,2000, 4444, 2222, 6969