Top Stories
ప్రధాన వార్తలు
ఇది కదా జగన్ అంటే.. ఆ రికార్డ్ ఆయనకే సొంతం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మే ముప్పై తేదీన తన పదవీకాలం ఐదేళ్లు సంపూర్ణంగా పూర్తి చేసుకున్నందుకు ముందుగా అభినందనలు, శుభాకాంక్షలు. గతంలో వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిమోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఇలాగే ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా 2014లో ఎన్నికయ్యాక ఐదేళ్లు పాలన చేసినట్లే అయినా, సాంకేతికంగా చూస్తే ఆయన ఎనిమిది రోజులు ముందుగానే పదవి కోల్పోయినట్లు అవుతుంది. ఎందుకంటే 2014 జూన్ ఎనిమిదిని పదవీ చేపట్టగా, 2019 మే ముప్పైనాటికి పదవిని వదలిపెట్టవలసి వచ్చింది. కానీ వైస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డిలకు ఆ ఇబ్బంది రాలేదు. వీరిద్దరూ రెండోసారి వరసగా గెలిచారు.చంద్రబాబు నాయుడు 1995లో తన మామ ఎన్టీఆర్‌ను కూలదోసి అధికారం చేపట్టారు. 1999 అక్టోబర్ లో రెండోసారి అధికారంలోకి వచ్చినా, 2003లో అసెంబ్లీని రద్దు చేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో ఓటమి కారణంగా 2004 మే నెలలోనే పదవిని కోల్పోయారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మిగిలిన సీఎంల కన్నా విభిన్నమైన రాజకీయవేత్త అని చెప్పాలి. వైఎస్సార్సీపీను స్థాపించడం, ఆ తర్వాత ఆయన అనేక కష్ట, నష్టాలు ఎదుర్కోవడం అంతా గమనించారు. అక్రమ కేసులలో ఆయనను జైలులో ఉన్నప్పుడు, ఆయనకోసం రాజీనామా చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో జరిగిన ఉప ఎన్నికలలో వైఎస్సార్సీపీ సంచలనాత్మకమైన రీతిలో గెలుపొందడం కూడా విశేషమే.2014 సాదారణ ఎన్నికలలో అధికారంలోకి రాలేకపోయినా, విపక్షంలో ఉన్నప్పుడు 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేసినా, వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో పోరాట పటిమ తగ్గలేదు. తదుపరి సైతం అనేక పోరాటాలు చేయవలసి రావడం వంటి ఘట్టాల నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019లో చరిత్రాత్మకమైన రీతిలో విజయం సాధించారు. ఉమ్మడి రాష్ట్రంలో సైతం ఎవరికి సాధ్యం కానీ రీతిలో దాదాపు ఏభై శాతం ఓట్లు సాధించి 151 సీట్లతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగలగడం ఒక రికార్డు. ఉమ్మడి ఏపీలో ఎన్టీ.రామారావు, కేసీఆర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డిలే సొంతపార్టీ పెట్టుకుని అధికారంలోకి రాగలిగారు. తెలుగు రాష్ట్రాలలో తండ్రులు ముఖ్యమంత్రులు అయ్యాక, వారి కుమారులు పలువురు రాజకీయాలలోకి వచ్చి మంత్రులు కాగలిగారు తప్ప, ముఖ్యమంత్రి అయింది మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరే.వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అండతోనే 2009 లో ఎంపీగా గెలుపొందిన మాట నిజమే. కానీ అనూహ్యంగా వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు ఒకరకంగా చెప్పాలంటే గందరగోళంలో పడింది. మెజార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికు మద్దతు ఇచ్చినా, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాందీ మాత్రం అప్రజాస్వామికంగా వ్యవహరించి వైఎస్ జగన్మోహన్ రెడ్డికు అవకాశం ఇవ్వలేదు. అదే ఆయనకు ఛాలెంజ్‌గా మారింది. తాను చేయదలచుకున్నది చేశారు. గెలిచినా, ఓడినా సొంత రాజకీయం సాగించారు. సోనియాగాంధీ చేతిలో కేంద్ర ప్రభుత్వం ఉన్నందున కేసులు పెడుతుందన్న భయంతో వైఎస్ సన్నిహితులు సైతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట నడవడానికి భయపడినా, తాను మాత్రం తిరుగుబాటు వీరుడుగానే జనంలోకి వెళ్లి వారి హృదయాలను గెలుచుకున్నారు.మామ ఎన్టీఆర్‌నే కుట్ర పూరితంగా సీఎం పదవిని లాగిపడేసిన వ్యక్తి, ఎప్పుడు ఎవరితో అవసరమైతే వారితో పొత్తు పెట్టుకోగల వ్యక్తి, ఆచరణ సాద్యం కానీ హామీలు ఇచ్చే వ్యక్తిగా పేరొందిన చంద్రబాబు వంటి నేతను ఢీకొట్టడం అంటే తేలికకాదని చాలామంది భావిస్తారు. కుట్ర రాజకీయాలలో ఘనాపాటిగా పేరొందిన చంద్రబాబును ఓడించడం ద్వారా రాజకీయాలలో విశ్వసనీయతకు ప్రాధాన్యం ఉందని మొదటిసారిగా రుజువు చేసిన నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు తెచ్చుకున్నారు. అనైతిక రాజకీయాల జోలికి వెళ్లకుండా, ప్రజలకు తాను ఏమి చెప్పానో, అవి చేయాల్సిందే అనే పట్టుదలతో కృషి చేసిన ముఖ్యమంత్రిగా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తింపు పొందారు.చంద్రబాబు 2014 లో తాను ఇచ్చిన మానిఫెస్టోని చెత్తబుట్టలో పడవేస్తే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019లో తాను ప్రకటించిన మానిఫెస్టోని మంత్రులు, ఐఎఎస్ అధికారులకు ఇచ్చి అమలు చేయాల్సిందేనని చెప్పి కొత్త సంస్కృతికి నాంది పలికారు. గతంలో ఏ ముఖ్యమంత్రి ఇంత సాహసోపేతంగా చేయలేదని చెప్పాలి. అంతేకాదు. తన టరమ్ పూర్తి అవుతున్న తరుణంలో మానిఫెస్టో కాపీలతో పాటు, ఏ కుటుంబానికి ఎంత మేలు చేసింది వవరిస్తూ ప్రతి ఇంటికి అభివృద్ది నివేదికలను తన ఎమ్మెల్యేల ద్వారా అందించి కొత్త ట్రెండ్ సృష్టించిన నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పాలి. మనిషిని చూస్తే ఈయన నిజంగానే ఇన్ని చేశారా అనిపిస్తుంది. ఇంతమంది ఆయనపై కక్ష కడితే వారందరిని ఒంటి చేత్తో ఎదుర్కున్నారా? అనే భావన వస్తుంది. బక్కపలచగా ఉండి, సింపుల్ డ్రెస్‌లో కనిపించే ఈయన ఏపీలో ఇన్ని వ్యవస్థలను కొత్తగా తీసుకురాగలుగుతారని ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు.ప్రభుత్వంలోని దాదాపు అన్నీ రంగాలలో తనదైన మార్కును వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూపించగలిగారు. పేదలు vs పెత్తందార్లు అనే నినాదాన్ని చేపట్టినప్పటికీ, రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వ్యవస్థలను ఆయన తెచ్చారంటే అతిశయోక్తి కాదు. కరోనా సంక్షోభ సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న చొరవ, వ్యాధిపాలిట పడిన వారికి అందించిన వైద్యసేవలు మొదలైనవి ప్రశంసనార్హం. ఆ టైమ్‌లో సైతం స్కీములను అమలు చేసి ఆదుకున్న నేతగా పేదల గుండెల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిరస్థాయిగా నిలిచిపోయారంటే ఆశ్చర్యం కాదు. ఆయన రోల్ మోడల్ ప్రభుత్వాన్ని నడిపారు. దేశంలోనే ఎవరూ చేయని సరికొత్త ప్రయోగాలు చేశారని చెప్పాలి. అందులో అనేకం కీలకంగా ఉన్నాయి.వలంటీర్ల వ్యవస్థను పెడతానని ఎన్నికల మానిఫెస్టోలో చెప్పినప్పుడు ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. ప్రభుత్వంలోకి రాగానే వలంటీర్లను పెడుతుంటే వీరంతా ఏమి చేస్తారో అనే అభిప్రాయం ఉండేది. రెండున్నర లక్షల మంది స్వచ్చంద సైన్యాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తయారు చేశారన్న సంగతి ఆ తర్వాత కానీ జనానికి అర్దం కాలేదు. వలంటీర్లు ఇళ్లకు వచ్చి కుశల సమాచారం అడగడం కాదు.. వారి అవసరాలను తీర్చే వ్యవస్థగా మారారు. ప్రభుత్వం చుట్టూ తిరగడం కాదు. ప్రభుత్వమే ప్రతి ఒక్కరి గడపవద్దకు వెళ్లి సేవలందించడం అని పరిపాలనకు కొత్త నిర్వచనం ఇచ్చి అమలు చేయడం అతి పెద్ద విజయం అనిపిస్తుంది. గ్రామ, వార్డు సచివాలయాలలో ప్రజలకు అవసరమైన పనులన్ని జరిగిపోవడం కొత్త అనుభూతి. ఒకప్పుడు ఏ సర్టిఫికెట్టు కావాలన్నా, వేరే ఏ పని ఉన్నా, మండల ఆఫీస్‌ల చుట్టూనో, ఆ పైన ఉండే అదికారుల చుట్టూనో తిరిగే పరిస్థితిని తప్పించి తమ ఇళ్లకే అవన్ని చేరే ఏర్పాటు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజంగా అభినందనీయుడు.ఈ సచివాలయాల కోసం ఏకంగా లక్షన్నర ఉద్యోగాలను ఒకే ఏడాదిలో ప్రభుత్వపరంగా ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రైతులు ఒకప్పుడు ఎరువులు, విత్తనాల కోసం తమ చెప్పులను ఆయా షాపుల వద్ద, ప్రభుత్వ గౌడౌన్ల వద్ద క్యూలో పెట్టవలసి వచ్చేది. ఇప్పటికి తెలంగాణలో అదే పరిస్థితి కొనసాగుతోంది. ఆదిలాబాద్‌లో జరిగిన రైతుల ఆందోళన ఇందుకు ఉదాహరణ. ఏపీలో ఆ ఇబ్బంది లేకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయగలిగారు. రైతులు తమ గ్రామంలోనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలనుంచి అన్నీ సేవలు పొందగలుగుతున్నారు. అందువల్లే ఈ ఐదేళ్లలో ఎక్కడా ఒక్క రైతు ఆందోళన చూడలేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హామీలు అమలు చేస్తామని చెబుతూ అంతా వచ్చి దరఖాస్తు చేసుకోమన్నారు. అప్పుడు బారీ క్యూలు తెలంగాణ వ్యాప్తంగా కనిపించాయి. అదే ఏపీలో ఆ అవసరమే లేదు. వలంటీర్లే ఇళ్లకు వెళ్లి అర్హత ఉంటే వారే నమోదు చేసుకుని స్కీమ్ అమలు చేశారు. ఇది ఉదాహరణ మాత్రమే.ఏపీలో ప్రభుత్వ స్కూళ్లలో జరిగిన మార్పులు ఒక విప్లవం అని చెప్పాలి. స్కూళ్లు బాగు చేయడం మొదలు, ఆంగ్ల మీడియం, వారికి మంచి ఆహారం, డ్రెస్, పుస్తకాలు మొదలైనవి స్కూల్ తెరిచిన మొదటి రోజుల్లోనే ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు. గతంలో ఇలా జరిగిన సందర్భాలు దాదాపు లేవని చెప్పాలి. ఆంగ్ల మీడియం, ఐబీ సిలబస్, టోఫెల్ మొదలైన వినూత్న మార్పులు జరిగింది ఏపీలో మాత్రమే. వైద్య రంగంలోకూడా గణనీయమైన మార్పులు తెచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రులను మార్చారు. ప్రజల వద్దకే డాక్టర్లను పంపించే విధానం తెచ్చారు. ఊళ్లలో ఆరోగ్య శిబిరాలు పెట్టారు. ఆరోగ్యశ్రీలో వ్యాధుల సంఖ్య పెంచారు. తను చెప్పిన సంక్షేమ స్కీములను యధాతధంగా అర్హులైన వారందరికి అమలు చేసి చూపించారు. ప్రాంతం చూడలేదు. కులం చూడలేదు. మతం చూడలేదు. పార్టీ చూడలేదు. ఇది చాలామందికి నమ్మశక్యం కానీ విషయమే.అంతకుముందు టీడీపీ పాలనలో జన్మభూమి కమిటీల అవినీతి తతంగాలు చూసినవారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకు వచ్చిన ఈ మార్పు ఆశ్చర్యాలను కలిగించింది. అమ్మ ఒడి, చేయూత, కాపు నేస్తం, రైతు భరోసా, చేనేత నేస్తం.. ఇలా ఒకటేమిటి సుమారు ముప్పైకి పైగా స్కీములను ఒక్క రూపాయి అవినీతి లేకుండా లబ్దిదారుల ఖాతాలలోకి వెళ్లేలా డిబిటి పద్దతి అమలు చేసిన ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే. పేదలకు 31లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఒక సంచలనం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. విపక్ష టీడీపీ తొలుత వీటన్నిటిని విమర్శించినా, తదుపరి తామూ అమలు చేస్తామని చెప్పడమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజన్‌ను తెలియచేస్తుంది. అభివృద్దివైపు చూస్తే స్కూళ్లు, ఆస్పత్రులు బాగు చేయడం అన్నిటికన్నా పెద్ద ప్రగతి అని వేరే చెప్పనవసరం లేదు. తీర ప్రాంతంలో నాలుగు పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్లు, ఫిషరీస్ యూనివర్శిటీ, ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రి, 700 కోట్లతో 800 గ్రామాలకు నీటి స్కీము, పదిహేడు మెడికల్ కాలేజీలు, పలు కొత్త పరిశ్రమలు, పార్మాహభ్, రెండున్నర లక్షల కోట్ల విలువైన పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్లు, నలభై వేల కోట్ల విలువైన సోలార్ పానెల్ పరిశ్రమ.. బద్వేలు వద్ద సెంచరీ ప్లైవుడ్, కొప్పర్తి ఎలక్ట్రానిక్ పారిశ్రామికవాడ.. ఇలా అనేకం టేక్ ఆఫ్ అయ్యాయి. విశాఖ నగరాన్ని ఒక సూపర్ సిటీగా తీర్చిదిద్దే ప్రక్రియ చేపట్టారు. ఆదాని డేటా సెంటర్, ఇన్ ఫోసిస్ తదితర కంపెనీలు రావడం.. ఇలా ఒకటేమిటి వివిధ రంగాలలో తనకంటూ ఒక ప్రత్యేకతను తెచ్చుకునేలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేసింది. ఇదేదో పొగడడానికి చెప్పడం లేదు. అలా అని విమర్శలు లేవని కాదు. ఏ ప్రభుత్వంలో అయినా కొన్ని లోటుపాట్లు ఉంటాయి. ఒక్క మద్య నిషేధం హామీని అమలు చేయలేకపోయామని పార్టీనే అధికారికంగా చెప్పింది.శాంతి భద్రతలు ఐదేళ్లుగా పూర్తి అదుపులో ఉన్నా, ప్రతిపక్షం, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా దారుణమైన అబద్దాలు ప్రచారం చేశాయి. వీటిని ఎదుర్కోవడం వైఎస్ జగన్మోహన్ రెడ్డికు పెద్ద సవాల్ అయింది. ఒకేసారి వివిధ రంగాలలో సంస్కరణలు చేపట్టడం, ఆయా వర్గాలలోని పెత్తందార్లకు ఆగ్రహం తెప్పించింది. ఉదాహరణకు ప్రభుత్వ స్కూళ్లు బాగు చేయడం కార్పొరేట్ విద్యా సంస్థల యజమానులకు నచ్చలేదు. ప్రభుత్వ సేవలన్ని ప్రజల ఇళ్ల వద్దకు చేర్చడం, తద్వారా తమ ప్రాధాన్యత తగ్గిందన్న భావన, ముడుపులు దక్కకుండా పోతున్నాయన్న ఆక్రోశం అందరిలో కాకపోయినా కొంతమంది ఉద్యోగులలో ఏర్పడిందని అంటారు. ప్రభుత్వ స్కూళ్లు బాగు చేసి టైమ్‌కు టీచర్లను రావాలని చెబితే వారిలో కొందరికి కోపం వచ్చిందని చెబుతారు. ఏపీలో సినిమా షూటింగ్‌లు చేయాలని, ఇతరత్రా పేదలకు ధరలు అందుబాటులో ఉంచాలని, దానిని బట్టి టిక్కెట్ల రేట్లు నిర్ధారిస్తామని చెప్పడం బడా సినిమా పెట్టుబడిదారులకు నచ్చలేదు.ఆస్పత్రులను బాగు చేసి, డాక్టర్లను పేదల ఇళ్లకు పంపడం కొన్ని ప్రైవేటు ఆస్పత్రులకు అంతగా ఇష్టం ఉండదు. భూముల రీసర్వే, ఈ స్టాంప్ విధానం, లాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా భూ వివాదాలు తగ్గించడం, బడా భూస్వాములు, రియల్ ఎస్టేట్ దందాలు చేసేవారికి అసంతృప్తి కలిగించింది. అందుకే లాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, రామోజీరావు, రాధాకృష్ణ వంటివారు పచ్చి అబద్దాలను ప్రచారం చేశారు. ఆయా వ్యవస్థలను చంద్రబాబు బాగా ప్రభావితం చేస్తూ ప్రభుత్వాన్ని బాగా ఇబ్బంది పెట్టారు. అందులో న్యాయ వ్యవస్థ ద్వారా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికు బాగా తలనొప్పి తెప్పించారని చెప్పవచ్చు. మూడు రాజధానుల వ్యవహారం ఒక కొలిక్కి రానీవ్వకుండా విపక్షం వ్యవస్థల ద్వారా అడ్డుపడింది.ఇన్ని జరిగినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా వెనక్కి తగ్గలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ పెత్తందార్ల ప్రతినిధిగా ఉండడానికి ఇష్టపడలేదు. పాదయాత్రలో సామాన్యుల కష్టాలు ఎలా తెలుసుకున్నారో, ఆ విధంగానే పేదల ప్రతినిధిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగించారు. అదే శ్రీరామరక్ష అవుతుందని ఆయన నమ్మారు. అందుకే ధైర్యంగా తను మంచి చేసి ఉంటేనే ఓటు వేయండని ప్రజలకు పిలుపు ఇవ్వగలిగారు. ఇలా చేసిన ముఖ్యమంత్రి దేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరే. ఎంత ఆత్మ విశ్వాసం లేకుంటే ఆయన ఆ మాట చెప్పగలుగుతారు! అదే ఆత్మ స్థైర్యంతో, ప్రత్యర్ధులు ఎంతగా వేధించినా తొణకకుండా, బెణకకుండా ఐదేళ్లు పూర్తి చేసుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సగర్వంగా ప్రజల ముందు నిలబడ్డారు. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు విజయానికి సంకేతంగా కనిపిస్తుంది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
‘‘మేము ఏకగ్రీవంగా చెబుతున్నాము. మీరు ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేస్తారో అమరావతిలో.. దానికి సరిగ్గా ఆపోజిట్‌గా మరొక వేదిక ఏర్పాటు చేసి, అదే రోజు నారా లోకేశ్ బాబు గారిని పార్టీ అధ్యక్షుడిగా అనౌన్స్ చేయాలి. ఇది మా డిమాండ్.’’ఈ డిమాండ్ చేసింది ఎవరో తెలుగుదేశం పార్టీ సాధారణ కార్యకర్త కాదు! ఇటీవల చంద్రబాబు కటౌట్‌ను రక్తంతో కడిగిన ఆ పార్టీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న!! నాయకుడు అధినాయకుడిని డిమాండ్ చేయటం ఏంటి? పైగా లోకేష్‌ను పార్టీ అధ్యక్షుడిగా చేయమని డిమాండ్ చేయటం ఏంటి? అందునా.. ఏక కాలంలో ఎదురెదురుగా రెండు వేదికలను ఏర్పాటు చేసి – ఈ వేదికపై చంద్రబాబు ప్రమాణ స్వీకారం, ఎదురు వేదికపై చినబాబు పార్టీ అధ్యక్ష ప్రమాణ స్వీకారం జరగాలని కోరటం ఏమిటి? ఎందుకు ‘బుద్ధన్న’ అలా అన్నారు. అసలు ఆ పార్టీలో ఏం జరుగుతోంది?లోకేశ్ ప్రస్తుతం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. ఆయన్నిప్పుడు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా నియమించాలని బుద్ధా వెంకన్న డిమాండ్. అంటే.. ఇండైరెక్టుగా లోకేశ్‌ను సీఎంను చేయాలని సూచించటమా? లేక చినబాబుకు దగ్గర కావాలన్న వ్యూహమా? లేదంటే, చంద్రబాబు సూచన మేరకే అలా డిమాండ్ చేసి ఉంటారా? ఇవేవీ కాదంటే.. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేసినా ఇబ్బంది లేకుండా ఉండేందుకు ముందుజాగ్రత్తగా ఆయన అలా ఏమైనా అన్నారా? ఏదేమైనా టీడీపీలో నాలుగు రోజుల క్రితం జరిగిన ఆసక్తికరమైన పరిణామం... బుద్ధా వెంకన్న డిమాండ్.టీడీపీ అధికారంలోకి వస్తుందా, రాదా అన్నది అటుంచి.. అసలు బుద్ధన్న ఇలాంటి ప్రకటన ఎందుకు చేసినట్లు అని ఆ పార్టీలోని నాయకులే అయోమయంగా ముఖాలు చూసుకుంటున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీలో ఏదైనా గందరగోళం మొదలైందా అనే అనుమానాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.నిజానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రస్తుతం ఆలోచిస్తున్నది లోకేశ్ బాబు అధ్యక్షుడు అవుతాడా కాడా అని కాదు. పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందా రాదా అని. ఓటమి అంటే చంద్రబాబుకు భయం. అందుకే ఆయన ఒంటరిగా పోటీ చేయరు. పొత్తు కోసం చూస్తారు. పొత్తు కుదరకపోతే కొత్త ఎత్తులు ఏవైనా వేస్తారు. మొన్న జరిగిన ఎన్నికల్లో బీజేపీ, జనసేనలతో కూటమిని కట్టారు కనుక... ఫలితాలు అనుకూలంగా రాకపోతే ఎలా ముందుకు వెళ్లాలా అని ఆయన ఇప్పుడు ఆలోచిస్తుండవచ్చు. కొత్తగా ఏర్పడే జగన్ ప్రభుత్వంలో తొలి 100 రోజుల్లో రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించటానికి రామోజీ తో కలసి ఏదైనా వ్యూహాన్ని ఆలోచిస్తూ కూడా ఉండొచ్చు. చెప్పలేం. గెలుపు కోసం చంద్రబాబు ఏమైనా చేయగలరు. ఓడిపోయినా కూడా... ఏమైనా చేయించగలరు!ఈ నేపథ్యంలో గత 1999, 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో ఆయన్ని ఓడించిన స్వయంకృతాపరాధాలు, ఆయన్ని గెలిపించిన ఎత్తులు, పొత్తులు; గెలుపు వంటి ఓటములు, ఓటమి వంటి గెలుపుల గురించి చూడటం అవసరం.చంద్రబాబుకు మొదటి అతి పెద్ద ఓటమి 2004లో ఎదురైంది. అంతకు ముందు 1999లో జరిగిన ఎన్నికలు ఆయన్ని పార్టీలో తిరుగులేని నేతగా నిలబెట్టాయి. అక్కడి ఉంచి నేరుగా, మళ్లీ లేవలేనంతగా 2004లో కిందికి పడేశాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనంలో సైకిల్ కొట్టుకుపోయింది. స్కూల్ టీచర్లు, ప్రభుత్వోద్యోగులు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఓటు వేయటం మాత్రమే కాదు, చంద్రబాబుకు వ్యతిరేకంగా కూడా పనిచేశారు. జన్మభూమి కార్యక్రమాలకు తమను ఉపయోగించుకోవటం వారికి ఆగ్రహం తెప్పించింది. ప్రభుత్వోద్యోగుల పని విధి విధానాలలో కొత్తగా తెచ్చిన మార్పులు కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రభావం చూపెట్టాయి.ఇంతకన్నా ముఖ్యం.. విద్యుత్ చార్జీలు, నీటి చార్జీల పెంపు. దీనిపై రైతులు రాష్ట్రవ్యాప్తంగా ధర్నా చేస్తే... హైదరాబాద్ బషీర్‌బాగ్‌లో జరిగిన ధర్నాలో నిరసనకారులైన రైతులపై చంద్రబాబు పోలీసుల చేత కాల్పులు జరిపించారు. పోలీస్ కాల్పులలో రామకృష్ణ, విష్ణువర్థన్ రెడ్డి, బాలస్వామి అనే ముగ్గురు రైతులు దుర్మరణం చెందారు. బాబు పాలనలో మాయని మచ్చగా మిగిలిన ఉదంతం అది. ఇక 1995–2004 మధ్య రాష్ట్రంలో ఒక్క నీటి పారుదల ప్రాజెక్టు నిర్మాణం జరగలేదు. అప్పుడే తెలంగాణ ఉద్యమం, అప్పుడే వై.ఎస్. రాజశేఖరరెడ్డి పాదయాత్ర! 2004 ఎన్నికల్లో ఆ రెండూ తమదైన ప్రభావం చూపి, బాబు ఓటమికి కారణం అయ్యాయి.ఇవికాక, మరికొన్ని కారణాలు కూడా ఆనాటి చంద్రబాబు ఘోర పరాజయానికి ఆజ్యం పోశాయి. తూర్పు ఆసియా దేశాల పద్ధతులను ఆదర్శంగా తీసుకుని ముఖ్యమంత్రిగా ఆనాడు చంద్రబాబు కనిన స్వర్ణాంధ్ర ప్రదేశ్, విజన్ –2020 కలలు బెడిసికొట్టాయి. కేవలం సమాచార సాంకేతిక విజ్ఞానం మీద, బయో టెక్నాలజీ మీదా ఆధారపడి ఆయన ఆ కలలు కన్నారు. అవి సమాచార సాధనాలను, విదేశీ అధినేతలను, విదేశీ వాణిజ్యవేత్తలను ఆకట్టుకుని ఉంటే ఉండొచ్చు. కానీ కేవలం వాటి ద్వారానే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని చంద్రబాబు భ్రమ పడ్డారు. గెలుపై ధీమాగా ఉన్నారు. చివరికి బోర్లా పడ్డారు. వ్యవసాయ రంగం అభివృద్ధి మీద, పేదరికం నిర్మూలనపైనా ఆయన దృష్టి సారించకపోవటం కూడా ఆ ఎన్నికల్లో చంద్రబాబు ఓటమికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.అంతకు ముందు 1999 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిన మాట నిజమే అయినా అది ఏమాత్రం చంద్రబాబు ఘనత కాదు. కార్గిల్ యుద్ధ ప్రభావం గెలుపునకు దోహదపడింది. పాకిస్థాన్‌తో కార్గిల్ యుద్ధంలో గెలిచిన అనంతరం.. సాధారణ సమయానికి భిన్నంగా, కొన్ని నెలల ఆలస్యంగా సార్వత్రిక ఎన్నికలు ఆ ఏడాది సెప్టెంబరులో జరిగాయి. వాటితో పాటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా. ఆ ఎన్నికల్లో చంద్రబాబు బీజేపీతో టై–అప్ అయ్యారు. తాము గెలిస్తే, కేంద్రంలో బీజేపీకి బయటి నుండి మద్ధతు ఇస్తామన్న హామీతో ఆయన ఆ ఎన్నికలకు వెళ్లారు.కార్గిల్ యుద్ధంలో గెలుపు వాజ్‌పేయిని గొప్ప నాయకుడిగా నిలబడితే ఆ నాయకుడితో చేయి కలపడం చంద్రబాబుకు గొప్పగా కలిసొచ్చింది. మొత్తం 294 సీట్లలో తెలుగుదేశం 269 సీట్లకు, బీజేపీ 24 సీట్లకు పోటీ చేస్తే తెలుగు దేశం 180 సీట్లలో గెలిచింది. అయినప్పటికి మునుపటి కన్నా 36 సీట్లు తగ్గాయి. బీజేపీకి మాత్రం అంతకుముందు కన్నా 9 సీట్లు పెరిగాయి. అంటే.. వాజ్‌పేయి ఆధ్వర్యంలోని జాతీయ పార్టీ బీజేపీ ప్రభావంతోనే చంద్రబాబు నాయకత్వంలోని ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం ఎక్కువ సీట్లు సాధించింది తప్ప అది చంద్రబాబు చరిష్మా కాదు. ఇంకా చెప్పాలంటే కేవలం కార్గిల్ ప్రభావం.2004 ఎన్నికల తర్వాత వరుసగా 2009లో కూడా తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. అందుకు కారణంగా చంద్రబాబు ఎలాంటి సాకులు చెప్పినా.. అసలు కారణం మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకుడు, స్వర్గీయ గాలి ముద్దు కృష్ణమ నాయుడు విశ్లేషణలో కనిపిస్తుంది.‘‘2009లో మా పార్టీ ఓడిపోవటానికి ప్రధాన కారణం పీఆర్పీ పార్టీ, లోక్‌సత్తా పార్టీలు కొత్తగా రావటం. దాంతో యాంటీ కాంగ్రెస్ ఓటు చీలటం జరిగింది. రెండవది – టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నందు వల్ల ఈ హైదరాబాద్‌లో గానీ, రంగారెడ్డి జిల్లాలో గానీ మాకు ఏం సీట్లు కూడా రాలేదు. ఎందుకంటే హైదరాబాద్, రంగారెడ్డిలో వాళ్లు, రాష్ట్రం సపరేట్ కాకూడదని ఎక్కువమంది జనం అనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ మాకు ఒకే ఒక్క సీటు రావటం జరిగింది. అందువల్ల మేము ఘోరంగా ఓడిపోవటం జరిగింది. యాంటీ కాంగ్రెస్ ఓటు చిరంజీవి, జయప్రకాష్ నారాయణ్ చీల్చుకోవటం కూడా మా ఓటమి కారణం. అప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ఓట్ బ్యాంకు దాదాపు 13 శాతం తగ్గింది. 2004లో 51 శాతం ఉన్న ఓట్ బ్యాంకు వాళ్లకు 38 శాతం అయింది. మేము 37 శాతంతో ఓడిపోయాం. ఒక్క పర్సెంట్ ఓట్ల తేడాతోనే మేము 2009 ఎన్నికల్లో ఓడిపోవటం జరిగింది. గెలుపు అంచుకు వచ్చి ఓడిపోయాం. 92 సీట్లు గెలిచాం మేము. కాంగ్రెస్ 155 మాత్రమే గెలిచింది. వాళ్లకు 35 సీట్లు తగ్గినయ్. మాకు దాదాపు 45 సీట్లు పెరిగాయి. రాజశేఖర రెడ్డి విజృంభించి ప్రచారం చేయటం కూడా జనంలో కొంత భయం కల్పించింది’’ అన్నారు ముద్దు కృష్ణమ నాయుడు.2014లో తిరిగి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ ఎన్నికల్లోనూ చంద్రబాబు బీజేపీతో చేతులు కలిపారు. వారి పొత్తు ఫలించి తెలుగుదేశానికి 25 సీట్లు, బీజేపీకి 7 సీట్లు పెరిగినప్పటికీ, వైఎస్సార్సీపీ ప్రభావంతో తెలుగు దేశం పార్టీ 117 సీట్లుకు మించి సాధించలేకపోయింది. ఆ మాత్రమైనా మోదీ హవాతో కొట్టకొచ్చిన సీట్లు, ఓట్లు మాత్రమే అవి.2019 గురించి ఇక చెప్పేదేముంది? వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ 175కి 151 సీట్లు గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. తెలుగుదేశం పార్టీ 23 సీట్లు మాత్రమే సాధించగలిగింది. అందుకు అనేక కారణాలున్నాయి. పార్టీలో అంతర్గత కలహాలు, స్పెషల్ స్టేటస్‌పై యు–టర్న్, అమరావతి నిర్మాణాన్ని ఉద్దేశపూర్వకంగా మెల్లిగా నడిపించటం, కాపు ఓట్లు చీలుస్తాడని అనుకున్న పవన్ కల్యాణ్ హీరో ఫ్యాక్టర్ పని చేయకపోవటం, అవినీతి.. వీటన్నిటితో పాటు రాష్ట్రానికి అందవలసిన నిధుల విషయంలో కేంద్రంతో ఘర్షణ వైఖరి అవలంబించి ఎన్.డి.ఎ. నుంచి బయటికి రావటం కూడా టీడీపీని దెబ్బకొట్టేసింది. దానికి మించి పార్టీలో చంద్రబాబు ‘వన్ మ్యాన్ షో’ పార్టీని ఒంటరిని చేసింది.ఈ అనుభవం రీత్యా మళ్లీ ఈ తాజా ఎన్నికల్లో చంద్రబాబు బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు. అయితే ఆ పొత్తు ఫలిస్తుందా, మొదటికే మోసం తెస్తుందా అని ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధినేతలో, ఆయన్ని బలపరుస్తుండే మీడియాలో కలవరం రేకెత్తిస్తోంది. అందుకే ఎన్నికలు ముగిసి, ఫలితాలు ఇంకా రాకముందే తెలుగు దేశం నాయకులు, రామోజీ రావు.. ‘గెలుపు కూటమిదే’ అని నినదిస్తున్నాయి. ఒకటి గమనించారా? ‘గెలుపు తెలుగుదేశానిదే’ వారు అనటం లేదు. – మాధవ్ శింగరాజు
TG: రాష్ట్ర చిహ్నం మార్పు.. చార్మినార్ ముందు కేటీఆర్ నిరసన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజముద్రలో మార్పులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తూ చార్మినార్ వద్ద కేటీఆర్ నిరసనలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షతోనే వ్యవహరిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర చిహ్నం మారుస్తోందని దుయ్యబట్టారు. చార్మినార్ ముద్రను తీసేయడం హైదరాబాదీలను అవమానించడమే.. కాకతీయుల కళా తోరణాన్ని ఎలా తొలగిస్తారంటూ కేటీఆర్ ప్రశ్నించారు.మరోవైపు, రాష్ట్ర చిహ్నం నుంచి చార్మినార్‌ను తొలగించడంపై కేటీఆర్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. చార్మినార్ దశాబ్దాల తరబడి హైదరాబాద్‌కు ఐకాన్‌గా ప్రపంచంలోనే గుర్తింపు పొందింది. నగరం గురించి ఎవరైనా ఆలోచిస్తే వారు ప్రపంచ వారసత్వ హోదా పొందేందుకు అన్ని అర్హతలున్న చార్మినార్ గురించి ఆలోచించకుండా ఉండలేరని... కానీ ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పనికిరాని కారణాలను సాకుగా చూపుతూ చార్మినార్‌ను రాష్ట్ర అధికారిక ముద్ర నుంచి తొలగించాలని భావిస్తోందని మండిపడ్డారు.World over, Charminar has been the icon/symbol of Hyderabad for centuriesWhen one thinks of Hyderabad, they cannot but think of Charminar which has all the qualities of a UNESCO world heritage site Now Congress Government wants to remove the iconic Charminar from the state… pic.twitter.com/SQVxQAI6lL— KTR (@KTRBRS) May 30, 2024
నైరుతి వచ్చేసింది.. వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి..
సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతు పవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. గురువారం ఉదయం కేరళను తాకాయి. కేరళ సహా ఈశాన్య రాష్ట్రాల్లోకి నైరుతి రుతు పవనాలు ప్రవేశించాయి. వారంలో తెలుగు రాష్టాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. గతేడాది కంటే ముందుగానే నైరుతి పవనాలు రాగా, ఇప్పటికే కేరళ వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాలు.. కేరళ రాష్ట్రాన్ని ఐఎండీ అలెర్ట్ చేసింది.నాలుగైదు రోజుల్లో రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రంలోని ఎక్కువ ప్రాంతాలు, మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతాల్లో విస్తరించాయి. లక్షద్వీప్‌లోని కొన్ని ప్రాంతాలు, కేరళ, మరికొన్ని భాగాలు నైరుతి, మధ్య బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతం, ఈశాన్య రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాల్లోకి విస్తరిస్తున్నాయి.కాగా, వారం ముందుగానే రుతుపవనాలు పురోగమిస్తుండడంతో ఈ సీజన్లో సమృద్ధిగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. రుతుపవనాల పురోగమనం, రెమల్ తుఫాన్ కారణంగా ప్రస్తుతం రోహిణీ కార్తె ఉన్నా దాని ప్రభావం పెద్దగా రాష్ట్రంపై పడలేదు. స్వల్పంగానే ఉష్ణోగ్రతలు పెరిగాయి. బుధవారం పలుచోట్ల 42 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పార్వతీపురం మన్యం జిల్లా పోయిమలలో అత్యధికంగా 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పల్నాడు జిల్లా చిరుమామిళ్లలో 42.5, గరికపాడులో 42 డిగ్రీలు, విజయవాడలో 39.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వచ్చే రెండు రోజులు కూడా వాతావరణం ఈ మాదిరిగానే ఉండవచ్చని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.
British Parliament Dissolve: బ్రిటన్ పార్లమెంట్ రద్దు..
బ్రిటన్ పార్లమెంట్ రద్దైంది. బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్‌కు అనుగుణంగా పార్లమెంట్‌ను గురువారం రద్దు చేశారు. ఇక, పార్లమెంట్ రద్దుతో ఐదు వారాల ఎన్నికల ప్రచారం నేటి నుంచి అధికారికంగా ప్రారంభమైంది. దీంతో, నేటి నుంచి ఎన్నికల ప్రచారం షురూ కానుంది.కాగా, జూలై నాలుగో తేదీన ముందస్తు ఎన్నికలకు వెళ్లనున్నట్లు ఆ దేశ ప్రధాన మంత్రి రిషి సునాక్ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈనెల 23న ప్రధాని అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’ వద్ద సునాక్ ఎన్నికల తేదీపై ప్రకటన చేశారు. ఈ సందర్భంగా సునాక్ మాట్లాడుతూ..‘ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా ఎన్నో విజయాలను సాధించాం. దేశ ప్రజల రక్షణ కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని మీకు హామీ ఇస్తున్నాను. బ్రిటన్ ప్రజలు తమ భవిష్యత్తు ఎలా ఉండాలో ఎంచుకునే సమయం వచ్చింది’ అంటూ కామెంట్స్ చేశారు. #BreakingNews #Updates #ukpolitics#British Parliament is formally dissolved ahead of July 4 general #election which polls indicate #Labour is expected to win over ruling #Conservative party pic.twitter.com/Lubf43M6r4— Tanveer Roomi (@TanveerRoomi) May 30, 2024ఇక బ్రిటన్ పార్లమెంట్లో మొత్తం 650 మంది సభ్యులు ఉన్నారు. కాగా, గత 14 ఏళ్లుగా బ్రిటన్‌లో కన్జర్వేటివ్ పార్టీ అధికారంలో ఉంది. రెండేళ్ల క్రితం ఆ దేశ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు. అయితే, ప్రధానిగా సునాక్ తీసుకున్న కొన్ని నిర్ణయాలపై సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు.. ఈసారి జరగబోయే ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ నుంచి దాదాపు 129 మంది ఎంపీలు పోటీ చేయడం లేదని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరగబోయే ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.
భారత్-పాక్ మ్యాచ్‌కు ఉగ్ర ముప్పు.. టీమిండియాకు మూడెంచెల భద్రత!
టీ20 వరల్డ్‌కప్-2024కు మరో రెండు రోజుల్లో తెరలేవనుంది. జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్‌లు వేదికగా ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఈ మెగా ఈవెంట్ కోసం ఇప్పటికే అన్ని జట్లు అమెరికా, కరేబియన్ దీవులకు చేరుకున్నాయి.ఇక టీమిండియా విషయానికి వస్తే.. జూన్ 5న ఐర్లాండ్‌తో జరగనున్న మ్యాచ్‌తో తమ వరల్డ్‌కప్ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. అనంతరం జూన్ 9న న్యూయార్క్ వేదికగా చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో భారత్ అమీతుమీ తెల్చుకోనుంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులు వెయ్యి కళ్లుతో ఎదురుచూస్తున్నారు.ఉగ్ర ముప్పు...అయితే ఈ దాయాదుల పోరుకు ప్రో ఐసీస్ గ్రూపు నుంచి ఉగ్ర ముప్పు పొంచి ఉన్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో అమెరికా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. మ్యాచ్ జరిగే న్యూయార్క్‌లోని నసావు కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భద్రతను పెంచారు.అంతేకాకుండా టీమిండియా బస చేస్తున్న హోటల్లో కూడా మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు యూఎస్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. కాగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా టోర్నీని విజయవంతంగా నిర్వహించేందుకు అమెరికా ప్రభుత్వం అన్ని విధాలగా ప్రయత్నిస్తున్నట్లు ఈఎస్పీఎన్ క్రిక్ ఈన్‌ఫో తమ రిపోర్ట్‌లో పేర్కొంది.స్పందించిన ఐసీసీ..అయితే పాక్-భారత్ మ్యాచ్‌కు ఉగ్రముప్పు వార్తలపై ఐసీసీ స్పందిచింది. "ఈటోర్నీని విజయవంతంగా నిర్వహించేందుకు భద్రతా పరంగా మేము అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. ఈ ఈవెంట్లో ప్రతీ ఒక్కరి భద్రతే ముఖ్యం. ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న అమెరికా, వెస్టిండీస్ రెండు దేశాల అధికారులతో మేము కలిసి పనిచేస్తున్నాము. ఎప్పటికప్పుడు అధికారులతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాం. ఒకవేళ అనుకోకుండా ఏ చిన్న సంఘటన జరిగినా కూడా వెంటనే సరిదిద్దేందుకు సిద్దంగా ఉంటామని ఐసీసీ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.
క్యాష్‌లెస్ చికిత్సపై గంటలోనే నిర్ణయం..ఐఆర్డీఏఐ ఆదేశాలు
ఆరోగ్య బీమా పాలసీదారు క్లెయిమ్ చేసిన గంటలోపే నగదు రహిత చికిత్సపై నిర్ణయం తీసుకోవాలని బీమా సంస్థలకు ఐఆర్డీఏఐ ఆదేశాలు జారీ చేసింది. ఆసుపత్రి తుది బిల్లు వచ్చాక మూడు గంటల్లోపు అనుమతి ఇవ్వాలని తెలియజేసింది. బుధవారం ఈమేరకు భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) మాస్టర్ సర్క్యులర్ విడుదల చేసింది. ఆరోగ్య బీమా ఉత్పత్తులపై ఉన్న 55కు పైగా ఆదేశాలను క్రోడీకరించి దీన్ని రూపొందించినట్లు పేర్కొంది.సర్క్యూలర్‌లోని వివరాల ప్రకారం..క్లెయిమ్ పరిష్కారాల కోసం పాలసీదారులు ఎలాంటి డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. బీమా సంస్థలు, థర్డ్‌పార్టీ ఏజెన్సీలు తమకు అవసరమైన పత్రాలను పాలసీదారుల నుంచి కాకుండా నేరుగా ఆసుపత్రుల నుంచే సేకరించాలి. వయసు, ప్రాంతం, ఆరోగ్య పరిస్థితులతో సంబంధం లేకుండా బీమా పాలసీని అందించాలి. అవసరాన్ని బట్టి కొత్త పాలసీలను తీసుకొచ్చే అవకాశం బీమా సంస్థలకు ఉంది.ఐఆర్డీఏఐ చేసిన కొన్ని మార్పులు..డిశ్చార్జీకి మూడు గంటల కంటే ఎక్కువ ఆలస్యం జరిగి ఆసుపత్రి ఏదైనా అదనపు ఛార్జీలు విధిస్తే ఆ మొత్తాన్ని కూడా బీమా సంస్థ భరిస్తుంది.చికిత్స సమయంలో పాలసీదారుడు మరణిస్తే వెంటనే క్లెయిమ్ ప్రాసెస్ చేయాలి. తక్షణమే ఆసుపత్రి నుంచి మృత దేహాన్ని తమ బంధువులకు అప్పగించాలి.పాలసీదారులకు సహాయం చేయడానికి బీమా కంపెనీలు ఆసుపత్రిలో ఫిజికల్ మోడ్‌లో ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయవచ్చు.ఒకటి కంటే ఎక్కువ పాలసీలు ఉన్న పాలసీదారులు తమకు ఆమోదయోగ్యమైన క్లెయిమ్ పొందగలిగే పాలసీని ఎంచుకోవచ్చు.పాలసీ తీసుకునేందుకూ, పాలసీ పునరుద్ధరణ, సేవలు, ఫిర్యాదుల పరిష్కారం తదితరాల కోసం అవసరమైన సాంకేతిక సేవలను అందించాలి.బీమా కంపెనీలు పాలసీ డాక్యుమెంట్‌తో పాటు కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్ (సీఐఎస్)ని కూడా అందించాలి. బీమా పాలసీ రకం, బీమా మొత్తం, కవరేజీ వివరాలు, మినహాయింపులు.. వంటివి సులభ పదాల్లో తెలియజేయాలి.పాలసీ వ్యవధిలో ఎలాంటి క్లెయిమ్‌లు చేయకపోతే వారికి నో క్లెయిమ్ బోనస్ లేదా ప్రీమియం తగ్గించే అవకాశాన్ని కల్పించవచ్చు.ఇదీ చదవండి: పర్యాటకులకు స్వర్గధామాలు ఈ బీచ్‌లుఇటీవల లోకల్ సర్కిల్ చేసిన సర్వేలో 43 శాతం బీమా పాలసీదారులు గత మూడేళ్లలో తమ బీమా క్లెయిమ్‌లను ప్రాసెస్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. చాలామంది పాలసీదారులు ఆసుపత్రిలో చేరిన చివరి రోజు వరకు తమ క్లెయిమ్ ప్రాసెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు సర్వే తెలిపింది.
హృదయ తలుపు మూసేశా.. బ్రేకప్ సాంగ్ పాడిన శృతిహాసన్
‘నా డోర్స్ మూసేశాను. కీ అంటేనే అసహ్యం’ అని హీరోయిన్ శృతిహాసన్ తన ఇన్‌స్ట్రాగామ్‌లో పేర్కొన్నారు. ఆ పోస్ట్ ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. లోకనాయకుడు కమల్ హాసన్ వారసురాలైన ఈమె తన తండ్రి నటించిన హేరామ్ చిత్రంతో బాల నటిగా రంగప్రవేశం చేశారు. 2009లో లక్ అనే హిందీ చిత్రం ద్వారా కథానాయికగా ఎంట్రీ ఇచ్చారు. అనగనగా ఓ ధీరుడు చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. 2011లో 7 ఆమ్ అరివు (సెవన్త్ సెన్స్) చిత్రంతో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది.తెలుగులో ఎక్కువ సక్సెస్అయితే ఆ తరువాత నుంచి శృతిని తమిళ సినీ పరిశ్రమ కంటే తెలుగు సినీ పరిశ్రమే ఎక్కువగా ఆదరిస్తూ వస్తోంది. చిరంజీవి, బాలకృష్ణ, మహేశ్‌బాబు, రవితేజ, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సరసన నటించి విజయాలను అందుకుని లక్కీ హీరోయిన్గా ముద్ర వేసుకున్నారు. ఇటీవల సలార్‌తో సక్సెస్ అందుకోగా ఇనిమేల్ అనే ప్రైవేట్ ఆల్బమ్‌లో దర్శకుడు లోకేశ్ కనకరాజ్‌తో కలిసి నటించి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న కూలీ చిత్రంలో ఆయనకు కూతురిగా నటించనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మింగిల్ అవ్వాలనుకోవడం లేదుఇకపోతే శృతిహాసన్‌కు ప్రేమ అచ్చిరాలేదనుకుంటా.. ఇప్పటికే రెండుసార్లు ప్రేమ వ్యవహారంలో విఫలం అయిన శృతిహాసన్ తాజాగా శాంతను హజారికా అనే టాటూ కళాకారుడికి బ్రేకప్ చెప్పిందని సమాచారం. దీంతో తాను ప్రస్తుతం సింగిల్‌నే అని.. మింగిల్ అవ్వాలనుకోవడం లేదని పేర్కొన్నారు. తాజాగా ‘ఐ షట్ ద డోర్. అండ్ ఐ ఈట్ ద కీ. ఐ వోంట్ బీ నీడింగ్ దట్ మీ ఎనీమోర్’ అంటూ ప్రేమలో ఓడిపోయిన వారు పాడుకునేలాంటి పాటను పోస్ట్ చేశారు. హృదయ తలుపులు మూసేశానని, ప్రేమ అనే తాళంతో దాన్ని తెరవాలనుకోవడం లేదని శృతి హాసన్ పాట రూపంలో పాడుతుందన్నమాట! View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) చదవండి: పోలీసులతో హీరోయిన్ గొడవ.. వీడియో వైరల్
ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో రిజల్ట్
ఏపీ ఈసెట్ ఫలితాలు కోసం రిజల్ట్ కోసం క్లిక్ చేయండి
ఇంకా రాదేం.. నాలుగో తేది!
సాక్షి, రాజమహేంద్రవరం: సార్వత్రిక సమరంలో చివరి ఘట్టం ఆవిష్కృతం కానుంది. మరో ఐదు రోజుల్లో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో ఎన్నికలు జరుగుతుండటంతో పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియల్లో జాప్యం చోటు చేసుకుంది. మన రాష్ట్రంలో ఈ నెల 13న పోలింగ్ ముగిసింది. వచ్చే నెల 4వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. కౌంటింగ్ సమయం సమీపిస్తుండడంతో ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, ఇటు ప్రజల దృష్టంతా ఫలితాలపైనే ఉంది. నాలుగో తేదీ ఎంత వేగంగా వస్తుందా.. ఎప్పుడెప్పుడు ఫలితాలు తెలిసిపోతాయా.. అన్న ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. గెలుపోటములపై వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తుండగా.. టీడీపీ అభ్యర్థుల్లో మాత్రం అంతర్మథనం నెలకొంది. గెలుస్తామా? చతికిల పడతామా? అన్న ఆందోళన వెంటాడుతోంది. కౌంటింగ్‌కు కసరత్తు ఓట్ల లెక్కింపునకు అధికారులు ముమ్మర కసరత్తు నిర్వహిస్తున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు, అధికారుల నియామకం, భద్రతా చర్యలపై జిల్లా కలెక్టర్ కె.మాధవీలత, ఎస్పీ పి.జగదీష్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సిబ్బందికి దిశా నిర్దేశం చేస్తున్నారు. నన్నయ విశ్వవిద్యాలయం మొత్తం పోలీసు పహరాలో ఉంది. కౌంటింగ్‌కు అవసరమైన టేబుళ్లు సైతం సిద్ధం చేశారు. ఉదయం 8 గంటలకు తొలుత పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియ ప్రారంభిస్తారు. అనంతరం ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. ఈ మేరకు ఇప్పటికే సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. విహార యాత్రలకు ముగింపు సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలువురు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు విదేశీ, స్వదేశీ పర్యటనలకు వెళ్లారు. ఇన్నాళ్లూ ఎన్నికల ప్రచారాల్లో బిజీగా గడిపిన ద్వితీయ శ్రేణి నేతలు చిల్ అయ్యేందుకు గోవా చెక్కేశారు. మరికొందరు విహార యాత్రలు, ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎక్కువ శాతం వైఎస్సార్ సీపీ అభ్యర్థులు స్వగ్రామాల్లోనే కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతున్నారు. ఇన్నాళ్లూ ఇంటికి దూరమైన లోటును పూడ్చుకుంటున్నారు. సొంత పనులు చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు ప్రక్రియ సమీపిస్తుండటంతో దేశ, విదేశాలకు వెళ్లినవారు ఇప్పుడు సొంత నియోజకవర్గాలకు చేరుకుంటున్నారు. ఎన్నికల్లో గెలుపోటములపై సన్నిహితులతో ఆరా తీస్తున్నారు. పోలింగ్ సరళిని బట్టి ఎన్ని వేల ఓట్లతో గెలుస్తామన్న విషయమై అంచనాలు వేసుకుంటున్నారు. ఫలితాలు వెలువడే వరకు ఆగలేక తమ విజయావకాశాలపై వివిధ మార్గాల ద్వారా ప్రాథమిక అంచనాకు వస్తున్నారు. జ్యోతిషం, న్యూమరాలజీకి డిమాండ్ ఎన్నికల్లో గెలుపోటములపై తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అభ్యర్థులు వివిధ మార్గాలను వెతుకుతున్నారు. కొందరు జ్యోతిషులను ఆశ్రయిస్తున్నారు. తమ జాతకం ప్రకారం విజయావకాశాలపై ఆరా తీస్తున్నారు. ఏమైనా దోషాలు ఉంటే వాటిని తొలగించుకునే ప్రక్రియలు నిర్వహిస్తున్నారు. న్యూమరాలజీ ప్రకారం తాను గెలిచే అవకాశం ఉందా? అంకెలు అనువుగా ఉన్నాయా? లేదా? అన్న విషయమై స్పష్టత తీసుకుంటున్నారు. దీంతో జ్యోతిషులకు బాగా గిట్టుబాటు అవుతోంది.కార్యకర్తలకు దిశానిర్దేశం సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ఎడతెగని ఉత్కంఠ నెలకొంది. పోలింగ్ అనంతరం విహార, ఆధ్యాతి్మక యాత్రలకు వెళ్లిన నేతలంతా సొంత నియోజకవర్గాలకు చేరుకుంటున్నారు. కౌంటింగ్ రోజు అనుసరించాల్సిన వ్యూహాలపై సన్నిహితులు, పార్టీ శ్రేణులతో చర్చించుకుంటున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో కీలకమైన ఏజెంట్లు, ఇతర ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశాలు పెట్టుకుంటున్నారు. కౌంటింగ్ సరళి పరిశీలించడం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కార్యకర్తలకు అభ్యర్థులు దిశానిర్దేశం చేస్తున్నారు.సర్వేలతో సతమతం అభ్యర్థుల విజయంపై రోజుకో సర్వే మార్కెట్లో దర్శనమిస్తోంది. ఒక సర్వేలో ఒక అభ్యర్థి గెలుస్తారని స్పష్టం చేస్తే మరో సర్వేలో ఓటమి చెందుతున్నట్లు వెల్లడిస్తున్నారు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి అభ్యర్థుల వంతవుతోంది. మరోవైపు అభ్యర్థుల పర్సనల్‌గా సర్వే సంస్థలను ఆశ్రయించి మరీ సర్వే చేయించుకుంటున్నారు. సర్వే చేయించుకునే అభ్యరి్థకి మీదే విజయమంటూ నమ్మబలికి రూ.లక్షలు వసూలు చేస్తున్నారు. వేల మెజార్టీతో గట్టెక్కుతారని వెల్లడిస్తుండటంతో అభ్యర్థులు ఇక తమ విజయం ఖాయమన్న ధీమాలో ఉన్నారు. బూత్ స్థాయి నుంచి మండల స్థాయి వరకు పోలైన ఓట్ల లెక్కలతో ఏ పారీ్టకి ఎన్ని ఓట్లు వస్తాయో.. స్వతంత్రుల ప్రభావం ఎవరిపై ఉంటుందో.. నోటా ఎవరి ఎవరి పాలిట శాపంగా మారనుందో వంటి అంశాలు ఆయా పారీ్టల నేతలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. జిల్లాలో ప్రధాన పారీ్టలు ఇప్పటికే అంతర్గత సర్వేలు నిర్వహించి విజయంపై ఓ అంచనాకు వచ్చాయి.
తప్పక చదవండి
- సచిన్, గవాస్కర్ కాదు.. అతడే నా ఫేవరెట్: కేంద్ర మంత్రి జైశంకర్
- మహిళా యూట్యూబర్ అరెస్టు
- సాయి రాజేష్ పాము లాంటి వ్యక్తి.. గాయత్రి సెన్సేషనల్ కామెంట్స్
- అల్లుడు హైడ్రామా..!
- Lok Sabha Election 2024: బీజేపీకి 295 –305 సీట్లు, కాంగ్రెస్‌కు 55–65 సీట్లు
- ‘బోట్ నెట్’పై ఎఫ్‌బీఐ గురి.. చైనా పౌరుడు అరెస్ట్
- Aditi Dugar: జీరో టు.. మ.. మ.. మాస్క్ వరకు!
- విజయ్ సరసన హీరోయిన్గా ఛాన్స్.. చేయనని ఏడ్చేసిన బాలీవుడ్ బ్యూటీ
- వెండే బంగారమాయెగా..
- ప్రియుడి వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య
సినిమా
పోలీసులతో హీరోయిన్ గొడవ.. వీడియో వైరల్
నివేతా పేతురాజ్.. తమిళనాడుకు చెందిన ఈ బ్యూటీ 'మెంటల్ మదిలో' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత చిత్రలహరి మూవీతో ఇక్కడ మంచి పాపులారిటీ తెచ్చుకుంది. ఆపై విశ్వక్ సేన్‌తో కలిసి నటించిన పాగల్, దాస్ కా దమ్కీ చిత్రాలతో తన మార్క్ నటనతో ఫిదా చేసింది. అయితే, సుమారు రెండేళ్లుగా ఆమె నటించిన సినిమా ఏదీ కూడా తెరపై కనిపించలేదు. ఈ క్రమంలో ఆమెకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.నివేతా పేతురాజ్ కారులో వెళ్తున్న సమయంలో చెకింగ్ పేరుతో పోలీసులు ఆపుతారు. కారు డిక్కీ ఓపెన్ చేయమని ఆమెను పోలీసులు కోరడంతో అందుకు ఆమె నిరాకరిస్తుంది. ఎందుకు ఓపెన్ చేయాలని చిన్నపాటి గొడవకు దిగుతుంది. పేపర్లు అన్నీ ఉన్నాయి కావాలంటే చెక్ చేసుకోండి అంటూ వారిస్తుంది. 'కారు డిక్కి మాత్రం ఓపెన్ చేయను, అది నా పరువుకు సంబంధించిన అంశం. మీకు చెప్పినా అర్థం కాదు. నేను డిక్కీ మాత్రం ఓపెన్ చేయను అంటూ.. పోలీసులతో గొడవకు దిగుతుంది. ఈ క్రమంలో వీడియో తీస్తున్న పోలీసును ఆమె అడ్డగిస్తుంది. ఈ వివాధానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.ఈ వీడియో చూసిన ప్రేక్షకులు తమదైన స్టైల్లో కామెంట్లు చేస్తున్నారు. ఇదంతా ఏదైనా సినిమా ప్రమోషన్ అయి ఉండవచ్చని చెబుతున్నారు. అదీ కాకుంటే తన నటిస్తున్న కొత్త సినిమాకు సంబంధించిన ఒక సీన్ అయి ఉంటుందని ఆమె తెలుపుతున్నారు. పోలీసులుగా ఉన్న వారిలో ఒకరు సాధారణ చెప్పులు ధరించడాన్ని నెటిజన్లు గుర్తించారు. డ్యూటీలో ఉన్న పోలీసు అధికారులు తప్పకుండా షూస్ ధరిస్తారని తెలిసిందే. దీంతో ఇదంతా సినిమా స్టంట్ అని నెటిజన్లు చెబుతున్నారు. ఇంత చక్కగా అమ్మాయి నటిస్తుంటే ప్రమోషన్స్ ఎందుకు..? అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. కొత్త సినిమా అప్డేట్?నివేదా పేతురాజ్..మొన్నటి వరకు అటు తమిళ్‌తో పాటు ఇటు టాలీవుడ్‌లోనూ వరుస సినిమాలతో అలరించింది. టాలీవుడ్లో చివరగా ఈ బ్యూటీ విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘దాస్ కా ధమ్కీ(2023)’ చిత్రంలో నటించింది. ఈ వెంటనే ఆమె నటించిన హిందీ వెబ్ సిరీస్ ‘కాలా’ కూడా రిలీజైంది. ప్రస్తుతం అటు తమిళ్లో కానీ ఇటు తెలుగు కానీ నివేదాకు సినిమాలు లేవు. దీంతో తన కొత్త సినిమా ప్రకటన అందరికి రీచ్ అవ్వాలనే ఇలాంటి ఫ్రాంక్ వీడియో ప్లాన్ చేసిందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. Actress #NivethaPethuraj argued and hesitated to open backside trunk of the car and scolded the recorded person...Her expressions made Policemen to doubt on herself...#Tollywood #NivethaPethuraj #Police pic.twitter.com/49W6DNPcdL— Anchor_Karthik (@Karthikkkk_7) May 29, 2024
సాయి రాజేష్ పాము లాంటి వ్యక్తి.. గాయత్రి సెన్సేషనల్ కామెంట్స్
బేబీ సినిమా కథ నాదేనంటూ షార్ట్ ఫిలిం డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ శిరిన్ శ్రీరామ్ కొన్నిరోజులుగా పోరాడుతున్నాడు. గతేడాదిలో ఆనంద్ దేవరకొండ , వైష్ణవి చైతన్య , విరాజ్ ఆనంద్ ప్రధాన పాత్రల్లో నటించిన 'బేబీ' చిత్రాన్ని సాయి రాజేశ్ దర్శకత్వం వహిస్తే ఎస్కేఎన్ నిర్మాతగా తెరకెక్కించారు. అయితే, ఈ కథ మొత్తం తనదే అంటూ ఐడియాను కాపీ కొట్టి సాయి రాజేశ్ బేబి సినిమా తీశాడని దర్శకుడు శిరిన్ శ్రీరామ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విషయంపై సాక్ష్యాలతో సహా సాయి రాజేష్ మీద ‘బేబీ లీక్స్ అనే బుక్‌ను వెబ్సైట్లో https://babyleaks2023.blogspot.com/ అందుబాటులోకి తీసుకొచ్చాడు.బేబీ సినిమా డైరెక్టర్ సాయి రాజేష్ చేసిన మోసం, దానికి సంబంధించిన సాక్ష్యాలను బేబీ లీక్స్ అంటూ పుస్తకరూపంలో తీసుకొచ్చారు. ఈ బేబీ లీక్స్ బుక్‌ను మీడియా ముందుంచారు. అయితే, తాజాగా సినీ నటి గాయత్రి గుప్తా కూడా ఈ అంశంపై రియాక్ట్ అయింది. ఫిదా సినిమాతో పాపులర్ అయిన గాయత్రి.. ఐస్ క్రీమ్ 2, కొబ్బరిమట్ట, మిఠాయి లాంటి సినిమాల్లో నటించింది. బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ గురించి గాయత్రి ఇలా చెప్పుకొచ్చింది. 'బేబీ సినిమా కథను ప్రేమించొద్దు అనే పేరుతో శిరిన్ శ్రీరామ్ రాసుకున్నారు. దానిని సాయి రాజేష్ కాపీ కొట్టేశాడు. ఈ సినిమాలో మొదటగా హీరోయిన్గా నన్ను అనుకున్నారు. అందుకు ఆడిషన్ కూడా జరిగింది. స్కూల్ డ్రెస్‌లో ఉన్న ఆ ఫోటోలను సాయి రాజేష్‌కు చూపించాను. దానినే బేబీలో కాపీ కొట్టాడు. ట్రైలర్ విడుదల అయ్యాక చూసి నేను షాక్ అయ్యాను. సాయి రాజేష్‌తో ఇబ్బందులు నాకు కొత్త కాదు. ఆయన డైరెక్ట్ చేసిన కొబ్బరిమట్టలో కూడా నన్ను ఇబ్బంది పెట్టాడు. ఆ సినిమాకు సంబంధించి రూ. 3లక్షలు ఇస్తానన్నారు. కానీ, కేవలం రూ.25 వేలు ఇచ్చి బాగా టార్చర్ పెట్టారు. అవన్నీ సరేలే అనుకుంటే.. బేబీ కథను మొదట రాసుకుంది శిరిన్. కానీ, సాయి రాజేష్ మాత్రం ఆ కథను తానే క్రియేట్ చేశానంటాడు. ఇద్దరూ కలిసి ఆ కథతో సినిమా తీద్దామని చివరి క్షణంలో బడ్జెట్ లేదని తెలివిగా శిరిన్‌ను తప్పించాడు. అదే కథను శిరిన్ నుంచి సాయి రాజేష్ కాపీ కొట్టేసి.. గీతా ఆర్ట్స్‌లో చర్చలు జరిపాడు. ఆ సంస్థ చాలా మంచిది. కానీ, పాము లాంటి సాయి రాజేష్‌ను వారు గుర్తించాలి. బేబీ సినిమా కోసం సాయి రాజేష్ చాలా చీప్ ట్రిక్స్ చేశాడు. బేబీ పాత్రను చాలా దారుణంగా చూపించాడు. కొందరైతే హీరోయిన్ పోస్టర్‌ను చెప్పులతో కూడా కొట్టారు. అంతలా ఆయన పబ్లిసిటీని ఉపయోగించుకున్నాడు. సాయి రాజేష్ లాంటి వ్యక్తి టాలీవుడ్‌కు మచ్చలా మిగిలిపోతాడు. బేబీ కథ రాసుకున్న శిరిన్ శ్రీరామ్‌కు న్యాయం జరిగాలి.' అని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపింది.
ఓటీటీలో రూ. 350 కోట్ల బడ్జెట్ సినిమా
బాలీవుడ్ హీరోలు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన చిత్రం ‘బడేమియా ఛోటేమియా’. అలీ అబ్బాస్ జాఫర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా, మానుషి చిల్లర్, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు కీలక పాత్రలలో నటించారు. భారీ అంచనాలతో ఏప్రిల్ 11న విడుదలైన ఈ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. అయితే, ఇప్పుడు ఓటీటీలోకి రానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటన చేసింది.కొన్నేళ్ల నుంచి వరుస ప్లాపులతో ఉన్న అక్షయ్‌కుమార్ ‘బడేమియా ఛోటేమియా’తో హిట్ కొట్టాలని చాలా కష్టపడ్డాడు. కానీ, ఫలితం మారలేదు. మరో డిజాస్టర్ ఆయన ఖాతాలో చేరిపోయింది. సుమారు రూ. 350 కోట్ల బడ్జెట్‌తో భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే, ఈ సినిమాకు కేవలం రూ. 90 కోట్ల వరకు మాత్రమే కలెక్ట్ చేసింది. ఇందులో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా కనిపిస్తే.. సానాక్షి సిన్హా ఓ కీలక పాత్రలో కనిపించింది. జూన్ 6 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందని అధికారికంగా ప్రకటన వచ్చేసింది. దేశభక్తి ప్రధానంగా ఈ సినిమా కథ ఉంటుంది. ఇందులో భారీ తారాగణంతో పాటు కావాల్సినంత సాంకేతిక హంగులు, మంచి లొకేషన్లు ఉన్నాయి. యాక్షన్ సీన్స్‌లలో గన్నులు, ట్యాంకర్లు, హెలికాఫ్టర్లు అడుగడుగునా ఉపయోగించి భీకర పోరాటాలు చేసినా సరైన కథ, కథనాలు లేకపోవడంతో సినిమాకు బాగా మైనస్ అయింది. జూన్ 6 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న 'బడేమియా ఛోటేమియా'ను ఇంట్లోనే చూసేయండి.
ఓటీటీలో మలయాళ హిట్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
ఈ ఏడాదిలో మలయాళ చిత్ర పరిశ్రమ చాలా హిట్ సినిమాలతో కళకళలాడిపోతోంది. ఈ ఏడాదిలో వచ్చిన చాలా సినిమాలు రూ.100 కోట్ల క్లబ్‌లోనూ చేరాయి. చాలా సినిమాలు అక్కడి ప్రేక్షకులతో పాటు.. ఇతర భాషల సినీ ప్రేమికులనూ అలరిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రేమలు,మంజుమ్మెల్ బాయ్స్, భ్రమయుగం,ఆవేశం,ఆడుజీవితం ,అన్వేషిప్పిమ్ కండెతుమ్ వంటి చిత్రాలు ప్రేక్షకులను మెప్పించాయి. ఇవన్నీ తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి.అయితే తాజాగా మరో హిట్ సినిమా తెలుగులో విడుదల కానుంది. అది కూడా ఓటీటీలోకి రానుంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్‌లాల్ నటించిన చిత్రం 'వర్షంగల్కు శేషం'. ఏప్రిల్ 11వ తేదీన రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ దక్కించుకుంది. సుమారు రెండేళ్ల క్రితం ప్రణవ్ మోహన్‌లాల్‌కు మొదటి హిట్ అందించిన డైరెక్టర్ వినీత్ శ్రీనివాసన్ ఈ చిత్రం ద్వారా మరో విజయాన్ని అందుకున్నారు. జూన్ 7వ తేదీన సోనీ లివ్ ఓటీటీ వేదికగా 'వర్షంగల్కు శేషం' స్ట్రీమింగ్ కానుంది. ఈమేరకు తెలుగు ట్రైలర్‌ను కూడా సోని లివ్ విడుదల చేసింది.మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడలో విడుదల అవుతుందని అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. కేవలం రూ. 7 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 80 కోట్లకు పైగానే కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. 'వర్షంగల్కు శేషం' కథ మొత్తం గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించారు. ప్రధానంగా ఇద్దరు స్నేహితుల చుట్టూ జరిగే సంఘటనలు చాలా ఆసక్తిని కలిగిస్తాయి. వారిలో ఒకరు డైరెక్టర్ కావాలని ప్రయత్నిస్తే.. మరొకరు సంగీత దర్శకుడిగా ఎదగాలని ప్రయత్నిస్తారు. ఎక్కువగా ఎమోషనల్ సీన్స్‌తో ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా ఈ చిత్రం దగ్గరైంది. జూన్ 7 నుంచి సోనీ లివ్‌లో తెలుగులో అందుబాటులోకి రానున్న ఈ చిత్రాన్ని కుటుంబంతో పాటు చూసి ఎంజాయ్ చేయండి.
ఫొటోలు
కేన్స్ 2024లో తళుక్కున మెరిసిన స్టార్, ఎవరీ నాన్సీ త్యాగి (ఫొటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు (ఫొటోలు)
'భజే వాయు వేగం' ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అంటూ కామెంట్స్.. నా భర్త అడిగేవాడన్న హీరోయిన్!(ఫొటోలు)
ఈ స్టన్నింగ్ బ్యూటీ.. టీమిండియా స్టార్ భార్య! గుర్తుపట్టారా? (ఫొటోలు)
క్రీడలు
ఆల్‌రౌండ్ షోతో ఇరగదీసిన ఇంగ్లండ్ బ్యాటర్.. చిత్తుగా ఓడిన పాక్
3 టీ20లు, 3 వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ల కోసం ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్టు కనీసం ఒక్క విజయం కూడా సాధించకుండానే రిక్త హస్తాలతో ఇంటిబాట పట్టింది. ఈ పర్యటనలో తొలుత టీ20 సిరీస్‌ను 0-3 తేడాతో కోల్పోయిన పాక్.. నిన్న జరిగిన మూడో వన్డేతో వన్డే సిరీస్‌ను సైతం 0-2 తేడాతో కోల్పోయింది.మూడో వన్డేలో ఇంగ్లండ్ 178 పరుగుల భారీ తేడాతో పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 302 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన పాక్ 29.1 ఓవర్లలో 124 పరుగులకే ఆలౌటైంది. నాట్ సీవర్ బ్రంట్ ఆల్‌రౌండ్ షోతో ఇరగదీసి ఇంగ్లండ్‌ను ఒంటిచేత్తో గెలిపించింది.తొలుత బ్యాటింగ్‌లో అజేయ సెంచరీతో (124 నాటౌట్) చెలరేగిన బ్రంట్.. ఆతర్వాత బౌలింగ్‌లోనూ రాణించి 2 వికెట్లు తీసింది. బ్రంట్‌తో పాటు బౌచియర్ (34), డేనియెల్ వ్యాట్ (44), అలైస్ క్యాప్సీ (39 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ఇంగ్లండ్ భారీ స్కోర్ చేసింది. పాక్ బౌలర్లలో హనీ 2, డయానా బేగ్, నిదా దార్, ఫాతిమా సనా తలో వికెట్ పడగొట్టారు.అనంతరం ఇంగ్లండ్ బౌలర్లు తలో చేయి వేయడంతో పాక్ స్వల్ప స్కోర్‌కే కుప్పకూలింది. సోఫీ ఎక్లెస్టోన్ 3, బ్రంట్, లారెన్ బెల్ చెరో 2, కేట్ క్రాస్, చార్లెట్ డీన్ తలో వికెట్ పడగొట్టారు. పాక్ ఇన్నింగ్స్‌లో మునీబా అలీ (47), అలియా రియాజ్ (36), సిద్రా అమీన్ (10), అయేషా జాఫర్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.
"టీమ్ ఆఫ్ ద ఇయర్" క్యాప్స్ అందుకున్న టీమిండియా క్రికెటర్లు
టీ20 వరల్డ్‌కప్ 2024కు ముందు పలువురు టీమిండియా క్రికెటర్లు "టీమ్ ఆఫ్ ద ఇయర్" క్యాప్స్ అందుకున్నారు. గతేడాది జాతీయ జట్టు తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినందుకు గాను సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్‌లను టీమ్ ఆఫ్ ద ఇయర్ క్యాప్స్‌తో పాటు ఐసీసీ అవార్డులు వరించాయి.ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో పాటు టీమ్ ఆఫ్ ద ఇయర్ క్యాప్‌ను అందుకున్నాడు. ఎడమచేతి వాటం పేసర్ అర్ష్‌దీప్ సింగ్ కూడా టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్ క్యాప్‌ను అందుకున్నాడు.ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్ క్యాప్ లభించింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ క్యాప్‌లు అందుకున్నారు.ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్‌కప్ 2024లో భారత ప్రస్తానం జూన్ 5న ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌తో మొదలవుతుంది. అనంతరం జూన్ 9న భారత జట్టు దాయాది పాకిస్తాన్‌ను ఢీకొట్టనుంది. ఈ మెగా టోర్నీలో భారత్.. పాకిస్తాన్, కెనడా, యూఎస్ఏ, ఐర్లాండ్‌లతో కలిసి గ్రూప్-ఏలో పోటీపడనుంది.టీ20 ప్రపంచకప్ కోసం ప్రకటించిన భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్ట్రావెలింగ్ రిజర్వ్స్: శుభ్‌మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్
భారత్-పాక్ మ్యాచ్‌కు ఉగ్ర ముప్పు.. టీమిండియాకు మూడెంచెల భద్రత!
టీ20 వరల్డ్‌కప్-2024కు మరో రెండు రోజుల్లో తెరలేవనుంది. జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్‌లు వేదికగా ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఈ మెగా ఈవెంట్ కోసం ఇప్పటికే అన్ని జట్లు అమెరికా, కరేబియన్ దీవులకు చేరుకున్నాయి.ఇక టీమిండియా విషయానికి వస్తే.. జూన్ 5న ఐర్లాండ్‌తో జరగనున్న మ్యాచ్‌తో తమ వరల్డ్‌కప్ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. అనంతరం జూన్ 9న న్యూయార్క్ వేదికగా చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో భారత్ అమీతుమీ తెల్చుకోనుంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులు వెయ్యి కళ్లుతో ఎదురుచూస్తున్నారు.ఉగ్ర ముప్పు...అయితే ఈ దాయాదుల పోరుకు ప్రో ఐసీస్ గ్రూపు నుంచి ఉగ్ర ముప్పు పొంచి ఉన్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో అమెరికా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. మ్యాచ్ జరిగే న్యూయార్క్‌లోని నసావు కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భద్రతను పెంచారు.అంతేకాకుండా టీమిండియా బస చేస్తున్న హోటల్లో కూడా మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు యూఎస్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. కాగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా టోర్నీని విజయవంతంగా నిర్వహించేందుకు అమెరికా ప్రభుత్వం అన్ని విధాలగా ప్రయత్నిస్తున్నట్లు ఈఎస్పీఎన్ క్రిక్ ఈన్‌ఫో తమ రిపోర్ట్‌లో పేర్కొంది.స్పందించిన ఐసీసీ..అయితే పాక్-భారత్ మ్యాచ్‌కు ఉగ్రముప్పు వార్తలపై ఐసీసీ స్పందిచింది. "ఈటోర్నీని విజయవంతంగా నిర్వహించేందుకు భద్రతా పరంగా మేము అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. ఈ ఈవెంట్లో ప్రతీ ఒక్కరి భద్రతే ముఖ్యం. ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న అమెరికా, వెస్టిండీస్ రెండు దేశాల అధికారులతో మేము కలిసి పనిచేస్తున్నాము. ఎప్పటికప్పుడు అధికారులతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాం. ఒకవేళ అనుకోకుండా ఏ చిన్న సంఘటన జరిగినా కూడా వెంటనే సరిదిద్దేందుకు సిద్దంగా ఉంటామని ఐసీసీ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.
సచిన్, గవాస్కర్ కాదు.. అతడే నా ఫేవరెట్: కేంద్ర మంత్రి జైశంకర్
కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్డర్ ఎస్ జైశంకర్ టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిపై ప్రశంసల వర్షం కురిపించాడు. క్రికెట్‌ను అమితంగా ఇష్టపడే జైశంకర్‌ను అత్యుత్తమ భారత బ్యాటర్ ఎవరని ప్రశ్నించగా.. విరాట్ కోహ్లికి తన ఓటు వేశాడు. ఈ విషయంలో జైశంకర్‌కు సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, విరాట్ కోహ్లి రూపంలో మూడు ఆప్షన్లు ఇవ్వగా.. విరాట్పైపు మొగ్గు చూపాడు. ఫిట్నెస్ మరియు వైఖరి కారణంగా కోహ్లిను ఇష్టపడతానని జైశంకర్ చెప్పుకొచ్చాడు. ఈ కారణాలు మినహాయించి సచిన్, గవాస్కర్లను పక్కకు పెట్టడానికి వేరే కారణాలు లేవని తెలిపాడు. సుశాంత్ సిన్హా యూట్యూబ్ ఛానెల్లో మాట్లడుతూ జైశంకర్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.ఇదిలా ఉంటే, విరాట్ కోహ్లి 35 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఫామ్‌లో ఉండి ఇరగదీస్తున్నాడు. కోహ్లి ఈ వయసులోనూ భీకర ఫామ్‌లో ఉండటానికి అతని ఫిట్‌నెస్సే కారణమని అంతా అంటుంటారు. ఆట పట్ల అతనికున్న అంకితభావం, దృక్పదం అతన్ని లేటు వయసులోనూ టాప్ క్రికెటర్‌గా నిలబెడుతుంది. చాలా మంది యువ క్రికెటర్లు సైతం ఫిట్నెస్ విషయంలో, యాటిట్యూడ్ విషయంలో విరాట్‌ను ఆదర్శంగా తీసుకుంటారు. Question:- Virat Kohli or Sachin Tendulkar or Sunil Gavaskar? (Sushant Sinha YT).External affairs Minister Dr Jaishankar:- "I have biased towards Virat Kohli because of his fitness, attitude. That's why I will pick Virat".pic.twitter.com/Y7ossf99CQ— Tanuj Singh (@ImTanujSingh) May 29, 2024పెద్దపెద్ద సెలబ్రిటీలు సైతం విరాట్ ఫిట్‌నెస్‌కు ముగ్దులవుతుంటారు. ప్రపంచ క్రికెట్లో దృవతారగా వెలగడానికి విరాట్ ఫిట్‌నెస్సే కారణమనడం అతిశయోక్తి కాదు. మైదానంలో అతను ప్రదర్శించే దూకుడు, చిన్న చిన్న విషయాలకు సైతం స్పందించే విభిన్నమైన తత్వం విరాట్‌ను ప్రత్యేకంగా నిలబెడుతుంది. మంత్రులే కాక దేశాధినేతలు సైతం విరాట్‌ను అభిమానించడానికి అతని ఫిట్నెస్, ఆట పట్ల అతనికున్న అంకితభావమే కారణం.ఇదిలా ఉంటే, విరాట్ ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2024 సీజన్లో భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఈ టోర్నీలో విరాట్ 15 మ్యాచ్‌ల్లో 61.75 సగటున సెంచరీ, 5 అర్ధసెంచరీ సాయంతో 714 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్‌గా ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. విరాట్.. జూన్ 1 నుంచి ప్రారంభంకాబోయే టీ20 వరల్డ్‌కప్‌లో ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే టీమిండియా రెండోసారి టైటిల్ గెలవడం ఖాయం.
బిజినెస్
బేర్ పంజా.. నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 183 పాయింట్లు నష్టపోయి 22,703 వద్దకు చేరింది. సెన్సెక్స్ 684 పాయింట్లు దిగజారి 74,486 వద్ద ముగిసింది.సెన్సెక్స్ 30 సూచీలో పవర్‌గ్రిడ్, సన్‌ఫార్మా, నెస్లే, ఐటీసీ, భారతీఎయిర్‌టెల్ కంపెనీ షేర్లు కంపెనీ షేర్లు లాభాల్లోకి చేరాయిఐసీఐసీఐ బ్యాంక్, టెక్‌మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఎస్బీఐ, విప్రో, ఇన్ఫోసిస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, హెచ్‌యూఎల్, బజాజ్ ఫైనాన్స్, ఎల్ అండ్ టీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎం అండ్ ఎం కంపెనీ షేర్లు నష్టపోయాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
నాలుగేళ్లకే లాభాల్లోకి చేరిన హైదరాబాద్ కంపెనీ
కేజీఎఫ్, కాంతారా, సలార్ వంటి సినిమాలతోపాటు తాజాగా విడుదలకు సిద్ధమైన కల్కి చిత్రానికి డిజిటల్‌మార్కెట్ చేస్తున్న సిల్లీమాంక్స్ నాలుగేళ్లకే లాభాల్లోకి చేరింది. హైదరాబాద్‌కు చెందిన ఈ కంపెనీ జనవరి-మార్చి త్రైమాసికానికిగాను రూ.26.83లక్షలు లాభాన్ని పోస్ట్ చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.5.5 కోట్లమేర నష్టపోయిన సంస్థ తాజా ఫలితాల్లో లాభాలు పోస్ట్ చేయడంతో పెట్టుబడిదారులకు కొంత ఊరట లభించింది.కంపెనీ లాభాలపై సంస్థ సహవ్యవస్థాపకులు, ఎండీ సంజయ్‌రెడ్డి మాట్లాడుతూ..‘ఇండియన్ ఎంటర్టైన్మెంట్ రంగంలో కీలకంగా ఉన్న సంస్థ నాలుగేళ్ల తర్వాత లాభదాయకంగా మారడం గొప్ప విజయంగా భావిస్తున్నాం. సంస్థ చేపట్టిన కొన్ని వ్యూహాత్మక కార్యక్రమాలతో ఈ విజయం సొంతమైంది. కంపెనీ కార్యకలాపాలను క్రమబద్ధీకరించాం. క్రమశిక్షణతో కూడిన ఆర్థిక విధానాన్ని అనుసరించాం. ప్రతిభావంతులైన బృంద సభ్యులతో మరిన్ని విజయాలు సాధించేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని అన్నారు. సంస్థ ప్రాజెక్ట్‌లు ఇవే..ఇండియన్ ఎంటర్టైన్మెంట్ రంగంలో ఈ సంస్థ సినిమాలకు డిజిటల్ మార్కెటింగ్ సేవలందిస్తోంది. గతంలో విడుదలైన కేజీఎఫ్, కేజీఎఫ్-2, కాంతారా, సలార్ వంటి సినిమాలతోపాటు త్వరలో విడుదలయ్యే ప్రబాస్ నటించిన కల్కి 2898-ఏడీ చిత్రం యూనిట్లతో కలిసి పనిచేసింది. డిజిటల్ మార్కెటింగ్తోపాటు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా కూడా వ్యవహరిస్తోంది.ఉద్యోగులకు షేర్క్యాపిటల్లో 5 శాతం వాటాకంపెనీ త్రైమాసిక ఫలితాలు వెల్లడించిన సందర్భంగా తమ ఉద్యోగుల ప్రయోజనాల కోసం ‘ఎంప్లాయి స్టాక్ ఓనర్షిప్ ప్లాన్’(ఈసాప్)ను ప్రకటించింది. ఈప్లాన్‌లో భాగంగా కంపెనీ మొత్తం షేర్క్యాపిటల్లో 5శాతం వాటాను తమ ఉద్యోగులకు కేటాయించింది. రానున్న ఐదేళ్లలో ఈవాటాలో 70 శాతం మూలధనాన్ని ఉద్యోగులకు పంచనున్నారు. ఈ ప్రక్రియ జూన్ 2024 నుంచి ప్రారంభంకానుందని కంపెనీ చెప్పింది.ఇదీ చదవండి: పెరుగుతున్న బంగారం ధరలు.. రూ.లక్ష మార్కు చేరిన వెండికరోనా కారణంగా సినిమా పరిశ్రమ 2020 ప్రారంభం నుంచి తీవ్ర అనిశ్చితులు ఎదుర్కొంది. క్రమంగా కొవిడ్ భయాలు తొలగి గతేడాది నుంచి ఆ రంగం పుంజుకుంటోంది. ఫలితంగా ఆ పరిశ్రమపై ఆధారపడిన కంపెనీలు లాభాల్లోకి చేరుతున్నట్లు మార్కెట్‌వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దాంతోపాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల సంఖ్య పెరుగుతోంది. అందులో ప్రమోషన్లు, ప్రకటనలు, డిజిటల్ మార్కెటింగ్‌కు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
పెరుగుతున్న బంగారం ధరలు.. రూ.లక్ష మార్కు చేరిన వెండి
కొంతకాలంగా ఈక్విటీమార్కెట్లు భారీగా పుంజుకున్నాయి. దాంతో బంగారం ధరలు పడిపోయాయి. ఇటీవల మళ్లీ మార్కెట్లో అనిశ్చితులు నెలకొంటున్నాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మార్కెట్లు పడిపోతున్నాయి. దాంతో తిరిగి బంగారం ధరలు పెరుగుతున్నాయి. పెట్టుబడిదారులు సేఫ్డ్ అసెట్స్‌లో భాగంగా పసిడిని ఎంచుకుంటారు. కాబట్టి బుధవారం గోల్డ్రేట్లు స్వల్పంగా పెరిగాయి. వివిధ ప్రాంతాల్లో పసిడిధరలు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.67,100 (22 క్యారెట్స్), రూ.73,200 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. మంగళవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల ధరలు వరుసగా రూ.250, రూ.270 పెరిగింది.చెన్నైలో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.350, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.380 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.67,750 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.73,910 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో కూడా నేడు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు రూ.67,250.. 24 క్యారెట్ల ధర రూ.73,350కు చేరింది.ఇదీ చదవండి: వ్యాధుల నియంత్రణకు ఏఐ సహాయంవెండి ధరలువెండి ధర మార్కెట్లో భారీగా పెరుగుతోంది. బుధవారం కేజీ వెండి ధర ఏకంగా రూ.1200 పెరిగి రూ.1,02,200కు చేరింది. దాంతో లక్షమార్కును దాటినట్లయంది. వెండి తయారీలో ప్రధానపాత్ర పోషిస్తున్న, స్టాక్మార్కెట్లో లిస్ట్ అయిన ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ జింక్ స్టాక్ ధర నెల రోజులుగా భారీగా పెరిగింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).
వ్యాధుల నియంత్రణకు ఏఐ సహాయం
దీర్ఘకాలిక వ్యాధుల సమస్యల నియంత్రణ, నిర్వహణకు తోడ్పడే టెక్నాలజీల అభివృద్ధికి విప్రో సంస్థ సెంటర్ ఫర్ బ్రెయిన్ రీసెర్చ్ (సీబీఆర్)తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. కొత్త టెక్నాలజీల తయారీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా అనలిటిక్స్ వంటి సాంకేతికతలను ఉపయోగించుకోనుంది.ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఆధ్వర్యంలోని సీబీఆర్ స్వయంప్రతిపత్తి కలిగిన, లాభాపేక్ష లేని పరిశోధనా సంస్థ. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నియంత్రణ, నిర్వహణకు సంబంధించి విప్రో సీబీఆర్తో కలిసి వ్యక్తిగత సంరక్షణ ఇంజిన్‌ను తయారుచేయనుంది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం..కొత్త టెక్నాలజీ ఇంజిన్‌లో వాడే కృత్రిమమేధ, మెషిన్ లెర్నింగ్, బిగ్‌డేటా అనలిటిక్స్ నిత్యం వ్యక్తులతో మాట్లాడుతూ దీర్ఘకాలిక ఆరోగ్యంపై దృష్టి సారిస్తాయి. జీవనశైలిలో వస్తున్న మార్పులను విశ్లేషిస్తాయి. గుండె, న్యూరోడిజెనరేటివ్ వంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గించడం, వాటిని నిర్వహించడంపై దృష్టి పెడుతాయి. సీబీఆర్ సహకారంతో డిజిటల్ యాప్ ఆధారిత ప్రయోగాల ద్వారా ఈ ఇంజిన్‌ను విప్రో పరీక్షిస్తుంది.ఇదీ చదవండి: రష్యా కంపెనీతో రిలయన్స్ ఒప్పందం.. ఎందుకంటే..విప్రో లిమిటెడ్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ శుభా తటవర్తి మాట్లాడుతూ..‘సాంకేతిక ఆవిష్కరణల ద్వారా హెల్త్‌కేర్ రంగంలో భారీ మార్పులు తీసుకురావడానికి కంపెనీ కట్టుబడి ఉంది. ఈమేరకు కంపెనీ ప్రతిష్టాత్మకమైన ఐఐఎస్సీ ఆధ్వర్యంలోని సీబీఆర్తో భాగస్వామ్యం కావడం సంతోషకరం. విప్రో సాంకేతికత అనుభవానికి సీబీఆర్ పరిశోధన తోడవ్వడం వల్ల రోగుల ఆరోగ్య సంరక్షణకు మరిన్ని కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయ’ని అన్నారు.
వీడియోలు
అధికారిక రాజముద్రను ఖరారు చేసిన సీఎం రేవంత్ సర్కార్
ఏపీలో విప్లవాత్మక మార్పులు
కేసీఆర్ పేరు లేకుండా చెయ్యాలనే కడుపుమంటతోనే ఈ కుట్రలు
రోడ్డెక్కిన బీఆర్ఎస్ నేతలు
కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు
కేరళను ముంచెత్తిన భారీ వర్షాలు
చంద్రగిరి DSPపై వేటు
చంద్రగిరి DSPపై వేటు
జీడిమెట్ల న్యూ ఎల్బీనగర్ లో దారుణం
అబ్దుల్లాపూర్ మెట్ లో హృదయవిదారక ఘటన
ఫ్యామిలీ
పొల్యూషన్‌కి మామిడి మొక్కలతో చెక్ పెట్టి..దాన్నే బిజినెస్‌గా మార్చేశాడు!
భారత పారిశ్రామిక దిగ్గజం,రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అబానీకి రిలయన్స్ జియో వంటి వివిధ వ్యాపారాలు ఉన్నాయి. ఆయనే ఆసియాలో అతిపెద్ద మామిడి తోటను కలిగి ఉన్న వ్యక్తి కూడా. అంతేగాదు ఎక్కువ మామిడి పండ్లను పండించి ఎగుమతి చేసేది కూడా రిలయన్స్ సంస్థే. దీని వెనుక దాగున్న ఆసక్తికర కథ వింటే..ముఖేశ్ అంబానీకి సలాం కొట్టకుండా ఉండలేరు.భారతదేశంలో అత్యంత ధనవంతుడైన ప్రముఖ వ్యాపార దిగ్గజం ముఖేశ్ అంబానీ 1990లలో ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీ ఆయిల్‌ని గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఏర్పాటు చేశారు. దీని కారణంగా పెద్ద మొత్తంలో కాలుష్యం ఏర్పడటం జరిగింది. ఈ విషయమై కాలుష్య నియంత్రణ బోర్డుల నుంచి రిలయన్స్‌కి నోటీసులు వచ్చాయి. దీంతో ఈ సమస్యకు పరిష్కారం కోసం తీవ్రంగా న్వేషించడం మొదలు పెట్టింది రిలయన్స్. దీనికి చెక్పెట్టగలిగేది మామిడి మొక్కలే అని డిసైడ్ అయ్యారు. వెంటనే ఆ రిఫైనరీ ఆయిల్ సమీపంలో ఉన్న దాదాపు 600 ఎకరాల బంజరు భూములను గ్రీన్‌ఫీల్డ్‌గా మార్చేసింది. ఆ భూముల్లో ఏకంగా 200 రకాల మామిడి మొక్కలను నాటించింది. ఈ తోటకు ముఖేశ్ అంబానీ తండ్రి రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ పేరు మీదుగా 'దీరుభాయ్ అంబానీ లిఖీబాగ్ అమ్రాయీ' అనే పేరే పెట్టారు. దీనిని లఖీభాగ్ అని పిలుస్తారు. ఇది బిహార్‌లోని దర్భంగాలో ఉంది. ఈ తోటలో అల్ఫోన్సో, రత్న, సింధు, నీలం, ఆమ్రపాలి వంటి ప్రధాన భారతీయ రకాలే కాకుండా విదేశీ మామి రకాలు కూడా ఉన్నాయి. ఈ లఖీబాగ్ అమ్రాయి తోట నుంచి ఏడాదికి దాదాపు 127 రకాల మామిడి పండ్లను ఉత్తత్తి చేస్తుంది. వాటిని విదేశాలకు ఎగుమతి చేస్తారు. అంతేగాదు రిలయన్స్ పండ్ల తోటలను సందర్శించి వినూత్న పద్ధతులను నేర్చుకోమని రైతులను ప్రోత్సహిస్తోంది కూడా. పైగా ప్రతి ఏడాది ఏకంగా ఒక లక్షకుపైగా మామిడి మొక్కలను ఉచితంగా రైతులకు పంపిణీ చేస్తుంది రిలయన్స్ కంపెనీ. ఇక్కడ ఒక సమస్య పరిష్కారాన్ని కనుగొని దాన్నుంచి కూడా వ్యాపారం చేసి లాభాలు ఆర్జించిన గొప్ప వ్యాపారవేత్త మన ముఖేశ్ అంబానీ. నిజంగా బిజినెస్ మ్యాన్ అసలైన నిర్వచనం, స్ఫూర్తి కూడా అతడే కదూ..!.(చదవండి: ఫిడే చెస్ రేటింగ్ పొందిన అతిపిన్న వయస్కురాలు! దటీజ్ జియానా గర్గ్..!)
అందాల హీరోయిన్ వెజిటబుల్ సూప్ రెసిపీ, నెటిజన్లు ఏమన్నారంటే!
ప్రేమ పావురాలు సినిమాతో యువతరం మనసు దోచుకున్న భాగ్యశ్రీ గుర్తుందా. ఆ తరువాత సెకండ్ ఇన్నింగ్స్‌లో తెలుగులో ప్రభాస్ మూవీ రాధేశ్యామ్‌లో కూడా కనిపించింది. 2.3 మిలియన్ల ఫాలోయర్లతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే భాగ్యశ్రీ రెసిపీలు, తన బ్యూటీ సీక్రెట్స్‌ను పంచుకుంటూ ఉంటుంది. తాజాగా సింపుల్‌గా తయారు చేసుకునే వెజిటబుల్ సూప్ గురించి ఒక వీడియో పోస్ట్ చేసింది. ఇది ప్రస్తుతం వైరల్ గా మారింది. View this post on Instagram A post shared by Bhagyashree (@bhagyashree.online)వెజిటబుల్ సూప్: క్యారట్, కాప్సికమ్, ఫ్రెంచ్బీన్స్, వెన్న, మైదా కార్న్ ఫ్లోర్, పాలు, చీజ్ సాయంతో సూప్ తయారు చేసింది. దీనికి కొద్దిగా పెప్పర్, చిల్లీ సాస్ యాడ్ చేసి చీజ్‌తో గార్నిష్ చేసింది.అయితే దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. మైదా, మొక్కజొన్న పిండి, వెన్న ఆరోగ్యానికి మంచిది కాదని ఒకరు కమెంట్ చేశారు. అలాగే మైదాకు బదులుగా గోధుమ పిండి లేదా జొన్న పిండి లేదా రాగి పిండిని ఉపయోగిస్తే మంచిదని, మొక్కజొన్న పిండిని ఎవాయిడ్ చేయవచ్చు అని కూడా మరొకరు సూచించారు.
సక్సెస్‌కి ఏజ్‌తో సంబంధం లేదంటే ఇదేనేమో..! ఏకంగా ఫిడే చెస్..
చెస్ స్టార్ జియానా గార్గ్ అతి పిన్న వయస్కురాలైన చెస్ ఛాంపియన్. అతి చిన్న వయసులోనే అంతర్జాతీయ ఫిడే(ప్రపంచ చెస్ సమాఖ్య) రేటింగ్ పొంది అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. అంతేగాదు అత్యంత చిన్న వయసులో ఈ రేటింగ్ పొందిన చిన్నారిగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. ఐదేళ్ల వయసులో అత్యున్నత అంతర్జాతీయ ప్రపంచ చెస్ సమాఖ్య రేటింగ్‌ని పొందిన మహిళా క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. అమె చెస్ జర్నీ ఎలా సాగిందంటే..జియానా గార్గ్ సాధించిన ఫిడే చెస్ రెటింగ్ నిజంగా అసాధారణమైనది. అత్యధిక ఫీడే చెస్ రేటింగ్ సాధించిన ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలు ఆమె. ఈ విజయాన్ని చూస్తే జియానాకు చదరంగం పట్ల ఉన్న ఇష్టం, అంకితభావం క్లియర్‌గా తెలుస్తోంది. ఆమె చెస్ నేర్చుకోవడం ప్రారంభించింది కేవలం నాలుగున్నరేళ్ల నుంచే..చాలా వేగంగా ఈ క్రీడలో అపార జ్ఞానాన్ని సంపాదించింది. ఈ విజయంలో జియాని గురువు నవీన్ బన్సాల్ పాత్ర ఎక్కువే ఉంది. చండీగఢ్ చెస్ అసోసీయేషన్ వైస్ ప్రెసిడెంట్ అయిన నవీన్ బన్సాల్ మొదట్లో ఇంత చిన్న వయసులో ఉన్న ఆ చిన్నారికి చెస్ నేర్పించడానికి చాలా సంకోచించాడు. ఎందుకంటే..?ఐదేళ్ల కంటే తక్కువ వయసు ఉన్న చిన్నారులకు చెస్ ఎట్టిపరిస్థితుల్లో నేర్పించరు. అందువల్ల ఆయన ముందుకు రాలేకపోయినా..జియానాలో ఉన్న ప్రతిభ ఆయన్ను ఆకర్షించింది. ఆమెకు చెస్ మెళుకువలు నేర్పించేలా చేసింది. అదీగాక జియానా అమ్మ కూడా తన కూతురు క్రమశిక్షణతో ఉంటుందని ఒప్పించేలా ఒక వీడియో కూడా తనకు పంపినట్లు తెలిపారు. ఐతే ఆమె కొన్ని నెలల శిక్షణలోనే చెస్అ డ్వాన్స్‌డ్ బ్యాచ్‌లో పదోన్నతి పొందింది. "తను నా ఉపన్యాసాలను వినేలా అత్యంత అధునాతన బ్యాచ్‌లో ఉంచి మరీ కోచింగ్ ఇప్పించాం. ఐతే ఆమె అనుహ్యంగా మంచి రేటింగ్ ఉన్న ఇతర పిల్లలతో సమానంగా పోటీ పడటం ప్రారంభించిదని గుర్తించి, ఆమెకు చక్కటి తర్ఫీదు ఇచ్చామని చెప్పారు". బన్సాలీ. ఆమె ఇంతలా చెస్‌పై అంకితభావంతో నేర్చుకునేలా దృష్టిసారించడంలో జియానా తల్లి పాత్ర అద్భుతమైనదని అన్నారు. తల్లిదండ్రులు సహకారం లేకుండా ఏ కోచ్ కూడా ఇంత చిన్న వయసులోనే చెస్ ఛాంపియన్లుగా తీర్చిదిద్దలేరని అన్నారు.జియానా చెస్ విజయాలు..జియానా గార్గ్ మ్యాట్రిక్స్ కప్ ఇంటర్నేషనల్ ఓపెన్ ఫైడ్ రేటెడ్ చెస్ టోర్నమెంట్ 2024, నేషనల్ అండర్-11 గర్ల్స్ చెస్ ఛాంపియన్షిప్-2023, మొదటి మ్యాట్రిక్స్ కప్ ఇంటర్నేషనల్ ఓపెన్ ఫైడ్ రేటింగ్ చెస్ టోర్నమెంట్ 2023, మొదటి లేట్ శ్రీ ధీరాజ్ సింగ్ మెమోర్ ఓపెన్ రఘువానిడే, రేటింగ్ టోర్నమెంట్ 2023 వంటి అనేక టోర్నమెంట్లలో పాల్గొంది. ఆమె తను గురువుల మార్గదర్శకత్వంలో చేసిన అచంచలమైన కృషి, అంకితభావాలకి నిదర్శనమే ఈ విజయాల పరంపర. అంతేగాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చదరంగా ఔత్సాహికులకు స్పూర్తిగా నిలిచింది. పైగా ఈ పురాతన చెస్ క్రీడలో రాణించడానికి వయసు ఏ మాత్రం అడ్డంకి కాదని ప్రూవ్ చేసింది.(చదవండి: 'రజనీకాంత్ స్టైల్ దోసలు': చూస్తూనే ఉండిపోతారు..!)
'రజనీకాంత్ స్టైల్ దోసలు': చూస్తూనే ఉండిపోతారు..!
టీఫెన్స్లో రారాణిలా ఓ వెలుగు వెలుగుతున్న వంటకం ఏదంటే..'దోసె'. ఇప్పుడూ రకరకాల చెఫ్‌ల పాకశాస్త్ర నైపుణ్యం పుణ్యామా అని వైరేటీ దోసలు వచ్చేశాయి. కస్టమర్లు కూడా వెరైటీ దోసెలు ట్రై చేసేందుకు తహతహలాడుతున్నారు. ఇప్పుడూ రోడ్డు సైడ్ ఉండే చిన్న చిన్న స్టాల్స్‌లో కూడా విభిన్నమైన దోసెలు కూడా టేస్టీగా ఉండి కస్టమర్ల మనసులను దోచుకుంటున్నాయి. అయితే ఈ స్ట్రీట్ సైడ్ అమ్మే వ్యాపారస్తుల్లో కొందరూ దోసెలు వేసే విధానం చూస్తే తినాలన్న ఆలోచనకంటే..ఆ స్టైలింగ్ స్కిల్ భలే ఆకట్టుకుంటుంది. అలానే సూపర్‌స్టార్ రజనీ రేంజ్ స్టైల్లో దోసెల వేసి కస్టమర్లను ఆకట్టుకుంటున్నాడు ఓ వ్యాపారి. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ముంబైలోని దారరలోని వీధి పక్కన ఉండే ఫుడ్ స్టాల్ కనిపిస్తుంది. ఆ వ్యాపారి ఏకకాలంలో ఓకేసారి నాలుగు దోసలు వేసే విధానం. అవి రెడి అయ్యాక పెనం మీద తీసే స్టైలింగ్ కోలీవుడ్ నటుడు రజనీకాంత్ స్టైల్లో ఎగరేస్తూ యమ ఫాస్ట్‌గా తీస్తుంటాడు. ఆ పక్కనే ఉన్న సహాయకుడు ఆయన విసిరే ప్రతి దోసెను భలే ఒడిసి పట్టుకునే విధానం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ స్టాలల్లో విక్రేత దోసెలను వేసే విధానం, వాటిని మడత పెట్టి ప్లేట్లోకి విసిరే విధానం అచ్చం రజనీకాంత్ స్టైల్‌ని పోలి ఉంటుంది. ఈ వీడియోకి "ముంబై ప్రసిద్ద రజనీకాంత్ స్టైల్ దాదార్ దోసవాలా ముత్తు దాస్ కార్నర్, ముంబై స్ట్రీల్ ఫుడ్" అనే క్యాప్షన్‌ని జోడించి మరీ పోస్ట్ చేశారు. దీంతో నెటిజన్లు ఈ దోస వాలా అతడి సహాయకుడు ఇద్దరు క్రికెట్ టీమ్‌లో ఉండాల్సిన వాళ్లు అంటూ వారి నైపుణ్యాన్ని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. (చదవండి: ఉత్తరాదిన సూర్యుడి భగభగలు..మానవ శరీరంపై ప్రభావం ఎలా ఉంటుందంటే..)
న్యూస్ పాడ్‌కాస్ట్
నేడు కేరళకు నైరుతి రుతుపవనాల రాక.. రెండు రోజుల్లో రాయలసీమలో ప్రవేశించే అవకాశం.. ఇంకా ఇతర అప్డేట్స్
ప్రతిపక్ష నాయకులు చల్లే బురదలోనే కమలాలు విరగబూస్తాయి.. ప్రధాని మోదీ ధీమా.. ఇంకా ఇతర అప్డేట్స్
మోదీని ఈడీ అడిగినా దేవుడు పంపాడని చెప్తారేమో అంటూ రాహుల్ గాంధీ ఎద్దేవా.. ఇంకా ఇతర అప్డేట్స్
ఎన్నికల్లో విపక్ష ‘ఇండియా’ కూటమి గెలిస్తే హిందువులు రెండో తరగతి పౌరులే.. ప్రధాని మోదీ ఆందోళన.. ఇంకా ఇతర అప్డేట్స్
సార్వత్రిక ఎన్నికల ఆరో విడతలో 61.11 శాతం ఓటింగ్ నమోదు.. ఇంకా ఇతర అప్డేట్స్
దేశ అభివృద్ధి కోసమే మూడోసారి బీజేపీ ప్రభుత్వం, ఈ ఎన్నికల్లో గెలుపు నా కోసం, నా కుటుంబం కోసం కాదు.. ప్రధాని మోదీ స్పష్టీకరణ.. ఇంకా ఇతర అప్డేట్స్
పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రం వీడియో లీక్‌తో ఎన్నికల సంఘానికి సంబంధం లేదు... ఆంధ్రప్రదేశ్ సీఈవో ముకేష్ కుమార్ మీనా స్పష్టీకరణ.. ఇంకా ఇతర అప్డేట్స్
కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు పాకిస్తాన్ సానుభూతిపరులు... ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఆగ్రహం.. ఇంకా ఇతర అప్డేట్స్
విపక్షాలది మతతత్వ, కులతత్వ, వారసత్వ కూటమి.. ప్రధాని మోదీ విమర్శలు.. ఇంకా ఇతర అప్డేట్స్
టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కలకలం
క్రైమ్
క్రమంగా ఆన్లైన్ ఆటలకు అలవాటు పడ్డారో.. ప్రమాదమే!
కరీంనగర్: అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను కొందరు మంచికి వినియోగించుకుంటే.. మరికొందరు ఆన్‌లైన్‌గేమ్స్ ఆడుతూ అదఃపాతాళానికి పోతున్నారు. క్రమంగా ఆన్లైన్ ఆటలకు అలవాటు పడిన యువత ఎవరిమాట వినకుండా తయారవుతున్నారు. లక్షల రూపాయలు నష్టపోయి పెద్దలకు చెప్పుకోలేక కొందరు ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు. మరికొందరు తల్లిదండ్రుల ఖాతాల్లో నుంచి దొంగతనాన తీసుకొని అప్పులు చెల్లిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు జిల్లాలో ఇటీవల పెరిగిపోయాయి.నిత్యం ఆన్లైన్లో..ఆండ్రాయిడ్ ఫోన్లు, అన్లిమిటెడ్ డాటా ఉండడంతో ఎవరిని చూసిన నిత్యం ఆన్లైన్లోనే ఉంటున్నారు. రమ్మి, క్యాసినో.. తదితర కొత్తకొత్త పేర్లతో అట్రాక్ట్ చేస్తున్న ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ లక్షల్లో నష్టపోతున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా చేతిలో ఫోన్‌తోనే గడుపుతున్నారు. ఇలా అలవాటుపడ్డ వాళ్లలో కొందరి మానసిక స్థితి సరిగ్గా లేకుండా పోయింది. మరికొందరైతే పెద్దల మాటలకు ఎదురుచెప్పడం, కుటుంబ సభ్యులపై దాడి చేయడం వంటి స్థితికి చేరుకుంటున్నారు.లాభాలు వస్తున్నాయనే ఆశతో..అప్పుడప్పుడే ఆన్లైన్ గేమ్స్ మొదలుపెట్టిన వారికి మొదటల్లో చిన్నపాటి లాభాలు ఆశచూపుతారు. ఇలా ఆ గేమ్స్‌కు ఆకర్షితులను చేసి క్రమంగా డబ్బులు గుంజుతుంటారు. జిల్లాలో ఇలా ఆన్లైన్ గేమ్స్ ఆడి కుదేలైన కుటుంబాలు అనేకం ఉన్నాయి. అయితే ఇలా నష్టపోయిన కుటుంబాలకు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెనకాడుతున్నాయి. తమ కుటుంబం పరువు పోతుందనే భయంతో ఫిర్యాదు చేయడం లేదు.ఆన్లైన్ గేమ్స్ ఆడి నష్టపోయిన వారు ఇలా..వేములవాడకు చెందిన ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి రైల్వేశాఖలో విధులు నిర్వర్తించేవాడు. సహచరులతో ఆన్లైన్ గేమ్స్‌కు అలవాటు పడి ఉన్న ఆస్తిని పోగొట్టుకున్నాడు. అప్పుల పాలు కావడంతో మానసికంగా కుంగిపోయి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందాడు. దీంతో భార్య, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు రోడ్డున పడ్డారు.ఇటీవల వేములవాడలో రూ.2కోట్లతో ఉడాయించిన పూజారి మహేశ్ కూడా ఆన్లైన్ గేమ్స్‌కు అలవాటు పడ్డట్లు సన్నిహితుల ద్వారా తెలిసింది. ఆన్లైన్ గేమ్స్ ఆడి లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నాడని స్నేహితులు తెలిపారు.వేములవాడకు చెందిన యువకులు రాజు, వెంకటేశ్, రమణ, శ్రీనివాస్.. ఆన్లైన్ గేమ్ పేరుతో క్యాసినో తదితర ఆటలవైపు మొగ్గుచూపారు. దాదాపు రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు నష్టపోయారు.అవగాహన కల్పిస్తున్నాం..ఆన్లైన్ గేమ్స్, సైబర్‌క్రైమ్‌లపై పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నాం. కళాబృందాల ద్వారా గ్రామీణులను చైతన్యం చేస్తున్నాం యువత ఆన్లైన్ గేమ్‌లకు బానిస కావడం సమాజానికి మంచిది కాదు. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. స్కిల్ గేమ్స్ మాత్రమే ఆడాలి. అధిక డబ్బులు వస్తాయని ఆశ చూపే ఏ గేమ్ కూడా వాడొద్దు. అలాంటి గేమ్స్ వాడితే ఆర్థికంగా నష్టపోతారు. ఇలా ంటి వాటిపై జాగ్రత్తగా ఉండాలి. – నాగేంద్రచారి, వేములవాడ డీఎస్పీఇవి చదవండి:
Banjara Hills: నేను ముంబైలో ఉన్నా..పెళ్లి చేసుకున్నా
బంజారాహిల్స్: తాను స్నేహితురాలితో వెళ్తున్నానని, తన కోసం వెతకవద్దని ఇన్సాగ్రామ్లో తల్లికి పోస్ట్ పెట్టిన ఓ బాలిక సాయంత్రం తాను ముంబైలో ఉన్నానని, సైఫ్ అనే యువకుడిని పెళ్లి చేసుకున్నట్లు మరో పోస్ట్ చేసింది. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–11లోని ఉదయ్‌నగర్‌లో నివసించే బాలిక (14) ఎనిమిదో తరగతి పూర్తి చేసింది. ఇన్సాగ్రామ్లో చురుగ్గా ఉంటుంది. సోషల్ మీడియాను బాగా ఫాలో అవుతుంది. ఇందులో భాగంగానే ఇన్‌స్టాలో జహ్రనగర్లో సైఫ్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఈ నెల 17వ తేదీన తన తల్లికి ఆ బాలిక తన స్నేహితురాలి ఇంటికి వెళ్తున్నానంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ నెల 22న ఆ బాలిక ఇన్స్టాలోనే తాను సైఫ్‌ను పెళ్లి చేసుకున్నానని, ముంబయ్‌లో ఉన్నానని, ఇద్దరూ కలిసి దిగిన ఫొటోను షేర్ చేసింది. కొంతకాలంగా తన కూతురు జహ్రనగర్కు వెళ్తుండేదని, సైఫ్ అనే యువకుడు ఇన్‌స్టాలో పరిచయం అయ్యాడని, ఆయనతో వెళ్లిన విషయాన్ని ఇన్‌స్టాలో పోస్ట్ చేసి చెప్పిందని బాధిత తల్లి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రియుడి వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య
జీడిమెట్ల: అమ్మా.. నాన్న.. మీరు చెప్పిన మాటలు నేను వినలేదు.. ప్రేమిస్తున్నాను అని వెంటపడిన అబ్బాయి ప్రేమను అంగీకరించారు.. అతను పెట్టే మానసిక ఒత్తిడి తట్టుకోలేక చనిపోతున్నాను. ఐ లవ్ యూ అమ్మా నాన్న అంటూ ఓ యువతి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన జీడిమెట్ల పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల, మృతురాలి తల్లిదండ్రులు తెలిపిన మేరకు.. షాపూర్‌నగర్ ఎన్ఎల్బీ నగర్‌కు చెందిన బాలబోయిన కుమార్ కుమార్తె అఖిల(22)ను అదే ప్రాంతానికే చెందిన ఓరుగంటి వెంకటేశ్ కుమారుడు అఖిల్ సాయిగౌడ్ గత 8సంవత్సరాల నుండి ప్రేమిస్తున్నాను అంటూ వెంటపడుతున్నాడు. తనను ప్రేమించకపోతే చనిపోతానంటూ వేధించేవాడు. దీంతో అఖిల కూడా సాయిగౌడ్ ప్రేమను అంగీకరించి విషయాన్ని ఇంట్లో తల్లిదండ్రులకు తెలిపింది. ఈ విషయం ఇరుకుటుంబాలు కూర్చుని మాట్లాడుకుని వీరి ప్రేమను అంగీకరించాయి. వేధించి రోడ్లపైనే కొట్టేవాడు.. కాగా అఖిలను సాయిగౌడ్ మానసికంగా వేధించేవాడు. కోపంతో రోడ్లపైనే కొట్టేవాడు. అయినప్పటికీ అఖిల భరిస్తూ వచ్చింది విషయాన్ని పలుమార్లు తల్లిదండ్రులకు కూడా చెప్పింది. అతని వేధింపులు భరించలేక అఖిల తనలో తానే కుమిలిపోయేది ఇటీవల కొంతకాలం నుండి సాయిగౌడ్ పెళ్లి విషయంలో ముఖం చాటేశాడు. దీంతో మరింత కుంగిపోయిన అఖిల మంగళవారం రాత్రి 10 పేజీల సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఉరి వేసుకుని మృతిచెందింది. దీంతో జీడిమెట్ల పోలీసులు అఖిల్ సాయిగౌడ్‌పై కేసు నమోదు చేశారు.
‘స్కూటీ’అంటే పాప.. ‘బైక్’అంటే బాబు
సాక్షి, న్యూఢిల్లీ: పసికందుల విక్రయానికి అంతర్రాష్ట్రముఠా కోడ్ భాష వినియోగించినట్టు రాచకొండ పోలీసులు గుర్తించారు. పాపను ‘స్కూటీ’గా, బాబును ‘బైక్’గా పిలుస్తూ ఇలా కోడ్ భాష ఎంచుకున్నట్లు స్పష్టమైంది. చిన్నారులను రాష్ట్రాలు దాటించి పిల్లలు లేని దంపతులకు అమ్ముతున్న అంతర్రాష్ట్రముఠా గుట్టును రాచకొండ పోలీసులు భగ్నం చేసిన విషయం విదితమే. ఈ వ్యవహారంలో పోలీసులు మరింత దూకుడుగా ముందుకెళుతున్నారు. బుధవారం ఢిల్లీతోపాటు పుణే, యూపీ, నోయిడా, హరియాణాల్లోని పలు సిటీల్లో రాచకొండ పోలీసులు బృందాలుగా తనిఖీలు చేశారు. స్థానిక పోలీసుల సహకారంతో కొందరిని అదుపులోకి తీసుకొని విచారించినట్టు తెలుస్తోంది.వాట్సాప్‌లో మెసేజ్‌లు పాప కావాలి అంటే ‘స్కూటీ’ కావాలా?, బాబు కావాలి అంటే మీకు ‘బైక్’ కావాలా అని ముఠా సభ్యులు వాట్సాప్‌లో పిల్లలు లేని దంపతులకు మెసేజ్‌లు పంపేవారు. డైరెక్టుగా పాప కావాలా లేదా బాబు కావాలా అని మెసేజ్‌లు చేస్తే పోలీసులకు దొరికిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ముఠాసభ్యులు ఈ కోడ్ భాషను వినియోగించినట్టు పోలీసులు గుర్తించారు.ఎవరైనా తెలియక పాప లేదా బాబు కావాలి అని మెసేజ్ చేస్తే వారికి వాట్సాప్ కాల్ చేసి మరీ ఈ కోడ్ భాష గురించి చెప్పేవారని, అనంతరం పిల్లలు లేని దంపతులు కూడా కోడ్ భాషను వినియోగించే వారని తెలిసింది. ఈరకంగా పలు ప్రాంతాల్లో పసికందులను విక్రయించినట్టు సమాచారం. ప్రస్తుతం రాచకొండ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపిన వారి వివరాలతోపాటు వీరికి సంబంధించిన ప్రతి ఒక్క కదలికలపై నిఘా పెంచారు. కొంతకాలంగా వీరు ఎవరెవరితో మాట్లాడుతున్నారు అనే విషయాలను తెలుసుకున్నారు. వీటితో పాటు వాట్సాప్/టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికగా చాట్ చేసిన వివరాలు సేకరించారు. ఈ చాటింగ్‌లలో పోలీసులకు క్లూ లభించినట్టు తెలుస్తోంది. ఈ క్లూతోనే ఢిల్లీ, ఫుణే, హర్యానా వంటి ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టిన పోలీసులు కొందరికి నోటీసులు కూడా జారీ చేసినట్టు విశ్వసనీయ సమాచారం.ఆ చిన్నారులు మా వద్ద క్షేమంగా ఉన్నారు.పెంపుడు తల్లిదండ్రులకు పిల్లలను ఇచ్చేది లేదు: కాంతి వెస్లీవెంగళరావునగర్(హైదరాబాద్): రాచకొండ పోలీసులు 11 మంది చిన్నారులను శిశువిహార్‌కు అప్పగించారని, వారంతా తమ వద్ద క్షేమంగా ఉన్నారని మహిళ,శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ కాంతి వెస్లీ చెప్పారు. బుధవారం కొందరు తల్లిదండ్రులు, మీడియా మహిళ, శిశు సంక్షేమశాఖ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అయితే దాదాపు రెండు గంటలపాటు ఎదురుచూసినా ఎవరినీ లోపలకు అనుమతించలేదు. ఆ తర్వాత కాంతి వెస్లీ బయటకు వచ్చి మీడియాకు పలు విషయాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నారులను విక్రయించడం, కొనడం చట్టరీత్యా నేరం.. వారికి కఠినశిక్షలు పడతాయని హెచ్చరించారు. ఆ విధంగా తీసుకొని పెంచుకోవడం కూడా తప్పేనన్నారు. చిన్నారులను కొని పెంచిన వారు ఇప్పుడు వచ్చి మా పిల్లలను మాకివ్వండి అని అడుగుతున్నారని, వారికి పిల్లలను ఇవ్వడం ఎట్టి పరిస్థితుల్లో కుదరదని తేల్చిచెప్పారు. అలాంటి తల్లిదండ్రులు ఎవరూ ఇక్కడకు రావొద్దని పేర్కొన్నారు. సంతానం లేనివారు ఎవరైనా పిల్లలు కావాలంటే మా వద్దకు వచ్చి దరఖాస్తు చేసుకుంటే విచారణ అనంతరం దత్తత ఇస్తామన్నారు. పెంపుడు తల్లిదండ్రులు దత్తత కోసం దరఖాస్తు చేసుకుంటే వారికి ఈ పిల్లలను మ్యాచ్ చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.