Top Stories
ప్రధాన వార్తలు
Watch Live: కళ్యాణదుర్గంలో సీఎం జగన్ ప్రచార సభ
Watch Live: కళ్యాణదుర్గంలో సీఎం జగన్ ప్రచార సభ
ముస్లింలకు రిజర్వేషన్లు ఉండాల్సిందే: సీఎం జగన్
కర్నూలు, సాక్షి: చంద్రబాబు రాజకీయం ఊసరవెల్లి రాజకీయమని, అది బాగా ముదిరిపోయిన తొండగా మారిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎద్దేవా చేశారు. కర్నూలు ఎన్నికల ప్రచార భేరీలో మైనారిటీల రిజర్వేషన్ల అంశంపై సీఎం జగన్ ప్రధానంగా స్పందించారు. ‘‘చంద్రబాబు ఒకపక్క ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న బీజేపీతో జత కడతారు. మరోవైపు మైనారిటీలను మోసం చేసేందుకు దొంగ ప్రేమ నటిస్తారు. ఇంతకన్నా ఊసరవెల్లి రాజకీయాలు ఉంటాయా?. ఆరు నూరైన.. నూరు ఆరైన నాలుగు శాతం రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే. ఇది మీ జగన్ మాట. ఇది వైఎస్సార్ బిడ్డ మాట’’ అని సీఎం జగన్ ఉద్ఘాటించారు. ‘‘ మైనారిటీలకు రిజర్వేషన్లపై మోదీ సమక్షంలో చంద్రబాబు ఇలా మాట్లాడగలగా?. అసలు మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేస్తామన్నా కూడా ఎందుకు బీజేపీతో కొనసాగుతున్నారు’’ అని సీఎం జగన్ నిలదీశారు. మీ బిడ్డది మనసున్న ప్రభుత్వం. కులం, మతం, వర్గం చూడకుండా.. ఏ పార్టీకి ఓటేశారన్నది కూడా చూడకుండా.. కేవలం పేదరికం మాత్రమే చూశాడు. వాళ్ల బతుకుల్ని మార్చడం కోసమే అడుగులు వేశాడు. కానీ, చంద్రబాబు అలా కాదు. చంద్రబాబుది ఊసరవెల్లి రాజకీయం. ఇక్కడున్న వేల జనాలకే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నప్రజలకూ చెప్పాలి. నాలుగు శాతం రిజర్వేషన్లు కేవలం మతం ప్రాతిపాదికన ఇచ్చింది కాదు. ముస్లింలలో ఉన్న పటాన్, సయ్యద్, మొగల్స్ లాంటి వాళ్లకు ఇవ్వడం లేదు.. కేవలం వెనుకబాటు తనంగా ఆధారంగానే ఇచ్చింది ఈ రిజర్వేషన్లు.అన్ని మతాల్లో బీసీలు, ఓసీలు ఉంటారు. మైనారిటీలను వేరుగా చూడడం, వాళ్ల నోటిదాకా వెళ్తున్న కూడును లాగేయడం ఎంత వరకు సబబు?. ఇది కేవలం రాజకీయ స్వార్థం కోసంవాళ్ల జీవితాలతో ఆడుకోవడం దుర్మార్గం కాదా?.. అందుకే ఎన్నార్సీ, సీఏఏ విషయంలో.. ఏ అంశంలో అయినా మైనారిటీల మనోభావాలకు, ఇజ్జత్ ఇమాందార్‌కు మేం మద్దతుగా నిలబడతాం. ఆరు నూరైనా ముస్లిం రిజర్వేషన్లు ఉండాల్సిందే.. ఈ ప్రభుత్వంలో మైనారిటీల కోసం షాదీ తోఫా లాంటి పథకాలు మాత్రమే ఇచ్చి ఆగిపోలేదు. ఉర్దూ భాషకు ప్రత్యేక గుర్తింపు, ఐదేళ్లు నా పక్కనే ఒక మైనారిటీ సోదరుడికి ఉప ముఖ్యమంత్రి పదవిని ఇవ్వడం, ఏకంగా ఏడుగురికి ఎమ్మెల్యేలుగా అవకాశమిచ్చాం.. ఇలా మైనారిటీలకు సముచిత స్థానం ఇచ్చింది కేవలం ఈ 59 నెలల కాలంలోనే అని చెప్పడానికి గర్వపడుతున్నా. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని ప్రతీసారి నేను ఎందుకు అంటానంటే.. ఎంతగా వారి మీద ప్రేమ చూపిస్తే వెనకబడిన ఆ వర్గాలకు రాష్ట్రంలో వారికిచ్చే గౌరవం పెరుగుతుంది. వాళ్లలో ఆత్మ స్థైర్యం, ఆత్మ గౌరవం పెరుగుతుంది. అందుకే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నేను నా.. నా.. అని చెప్తాను అని సీఎం జగన్ స్పష్టం చేశారు.
మే 9: ఏపీ ఎన్నికల సమాచారం ఎప్పటికప్పుడు
ఏపీలో ఎన్నికల సమాచారం ఎప్పటికప్పుడు అప్డేట్స్..
అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
తెలుగుదేశం కూటమి డబుల్ గేమ్ అనాలా? లేక దొంగ నాటకాలని అనలా? అమరావతి రాజధాని అంటే ఇతర ప్రాంతాల ప్రజలలో వ్యతిరేకత వస్తుందని భయపడుతున్నారా? బుధవారం నాడు తెలుగుదేశం కూటమి వివిధ పత్రికలలో ప్రచార ప్రకటన విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ విజయవాడ, కలికిరి రాక సందర్భంలో ఈ అడ్వైర్టైజ్ మెంట్ ఇచ్చారు. కేవలం విజయవాడ ప్రాంత ఎడిషన్లలో మాత్రం అమరావతి రాజధాని అని ప్రస్తావించి, ఇతర ప్రాంత ఎడిషన్లలో మాత్రం రాష్ట్ర వికాసానికి అని పేర్కొన్నారు. అంటే దీని అర్ధం ఏమిటి? అమరావతి రాజధాని అంటే ఉత్తరాంధ్రలో, రాయలసీమలలో ప్రజలలో వ్యతిరేకత బహిర్గతమై, ఓట్ల రూపంలో ప్రభావితం చేస్తుందని భయపడడమే కదా!విజయవాడ పత్రికలలో ఇచ్చిన ప్రకటన ఇలా ఉంది. 'మన కలల రాజధాని అమరావతిని కాపాడుకోవడానికి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీగారు పాల్గొంటున్న ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు లక్షలాదిగా తరలిరండి' అని ఉంది. అదే విశాఖపట్నం ఏరియాలో ఇచ్చిన ప్రకటనలో మాత్రం అందుకు భిన్నంగా 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వికాసానికి మోదీ గ్యారంటీ...' అని రాశారు. అంటే విజయవాడకు మోదీ వస్తున్నది కేవలం అమరావతి గురించేనని అనుకోవాలా? రాష్ట్ర వికాసం కోసం కాదా? విశాఖకు అమరావతి కలల రాజధాని కాదని చెప్పడమే కదా! ఒకపక్క అమరావతితోనే అభివృద్ది అంటూ సొల్లు పురాణం చెప్పే టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ఎందుకు ఇలా డ్రామా ఆడుతున్నారంటే వారికి తమపై తమకే నమ్మకం లేదనే కదా?ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడకు వెళ్లినా స్పష్టంగా మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని, తద్వారా వికేంద్రీకరణ జరిగి అభివృద్దికి బాటలు వేస్తుందని చెబుతున్నారు. అమరావతిలో శాసన రాజధాని, విశాఖలో కార్యనిర్వాహక రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని అని ఆయన మానిఫెస్టోలో కూడా చెప్పారు. విశాఖ ఎక్జిక్యూటివ్ కాపిటల్ అయితే లక్షల కోట్లు ఖర్చు పెట్టనవసరం లేదని, రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్ అవుతుందని ఆయన అభిప్రాయపడుతున్నారు.విశేషం ఏమిటంటే ప్రముఖ నటుడు, చంద్రబాబు వియ్యంకుడు అయిన బాలకృష్ణ రెండో అల్లుడు శ్రీభరత్ కూడా విశాఖ రాజధాని అయితే బెటర్ అంటూ చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్ అవుతోంది. శ్రీభరత్ విశాఖ నుంచి టీడీపీ పక్షాన పార్లమెంటుకు పోటీచేస్తున్నారు. ఆయన అమరావతి ఇప్పటికిప్పుడు అభివృద్ది కాదని, ఇరవై ఏళ్లయినా పడుతుందని, విశాఖ అయితే ఆ ఇబ్బంది ఉండదని అన్నారు. అంటే తెలుగుదేశం కూటమి అభ్యర్ధులు ఒక్కోచోట ఒక్కోరకంగా ప్రచారం చేస్తున్నారని తేలిపోతోంది. నిజానికి అమరావతి రాజధాని అని గతంలో హడావుడి చేసినా తెలుగుదేశంను ప్రజలు ఓడించారు. చివరికి అమరావతి గ్రామాలు ఉన్న తాడికొండ నియోజకవర్గంలోను, మంగళగిరి నియోజకవర్గంలోను టీడీపీ ఓడిపోయింది.స్వయంగా చంద్రబాబు కుమారుడు లోకేష్ మంగళగిరిలో ఓటమిపాలయ్యారు. దానికి కారణం అమరావతి రాజధాని పేరుతో టీడీపీ నేతలు జరిపిన భూదందానే. ఈ కుంభకోణాలపై రాష్ట్ర ప్రభుత్వం పలు కేసులు కూడా పెట్టింది. ఇదంతా ఒక కులం వారికోసం, ముందస్తు సమాచారం ఆధారంగా భూములు కొని లాభపడ్డవారి కోసమేనని ఇక్కడి ప్రజలు కూడా అనుమానించారు. దాంతో అమరావతి రాజధాని అన్న కాన్సెప్ట్‌కు ప్రజామోదం లేకుండా పోయింది. అయినా 2019 తర్వాత కూడా రాజధాని రైతుల పేరుతో ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా అండతో కల్పిత ఉద్యమాలను టీడీపీ నడిపింది. అయినా ఇప్పుడు అమరావతి అంటే జనం నమ్మడం లేదని గ్రహించి ఈ రకంగా డబుల్ గేమ్ ఆరంభించారని భావించాలి.అమరావతికి లక్షల కోట్ల వ్యయం అవుతుందని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ప్రచారం చేసేవారు. బీజేపీతో చెడ్డాక ప్రధాని మోదీ అమరావతికి ఏమీ ఇవ్వలేదని, చెంబుడు నీళ్లు, పిడికెడు మట్టి ఇచ్చి వెళ్లారని కూడా ఆయన విమర్శించేవారు. అలాంటిది ఇప్పుడు కలల రాజధాని అమరావతిని కాపాడుకోవడానికి గాను ప్రజలు మోదీ రోడ్‌షో కు రావాలని కోరారు. గతంలో బీజేపీ నేతలు కూడా అమరావతి భూ స్కామ్ చాలా పెద్దదని విమర్శించేవారు. ఇప్పుడు మోదీ అమరావతికి ఏమైనా లక్ష కోట్ల నిధులు ఇస్తానని కూటమి నేతలకు హామీ ఇచ్చారా? అసలు ఏపీలో ఫలానా అభివృద్ది చేస్తానని మోదీ గ్యారంటీ ఇవ్వడం లేదు. అయినా వీరు మాత్రం ప్రజలను రకరకాలుగా మోసం చేయడానికి యత్నిస్తున్నారు.రాజమండ్రి, అనకాపల్లిలలో జరిగిన ప్రధాని సభలలో ఎక్కడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించలేదు. ఆయనపై నేరుగా అనివీతి ఆరోపణలు చేయలేదు. కాకపోతే జనరల్‌గా ఏవో కొన్ని విమర్శలు చేయాలి కాబట్టి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అవినీతి అంటూ ఇంతకాలం టీడీపీ ఏమి ఆరోపిస్తుందో వాటినే ఆయన కూడా చెప్పి వెళ్లారు. విశేషం ఏమిటంటే మోదీ కానీ, అమిత్ షా కానీ చంద్రబాబు ఉపన్యాసం వినకుండానే నిష్క్రమించడం. బహుశా చంద్రబాబు మాటల మీద వీరికి నమ్మకం పోయిందేమో తెలియదు. మోదీని ఏపీకి తీసుకు రావడం ద్వారా తమకు పలుకుబడి ఉందని, ఎన్నికల సంఘంపై ఒత్తిడి పెంచుతున్నట్లు కనిపిస్తోంది.కొందరు సీనియర్ ఐపీఎస్ అధికారులను సహేతుక కారణాలు చూపకుండానే బదిలీ చేయడం, నాలుగేళ్లుగా అమలు అవుతున్న స్కీముల ద్వారా లబ్ది దారులకు డబ్బు విడుదల చేయకుండా ఆదేశాలు ఇవ్వడం, వలంటీర్ల వ్యవస్థను నిలుపుదల చేయడం, చంద్రబాబు ఎంత నీచంగా ఉపన్యాసాలు చేస్తున్నా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోకపోవడం ఇందుకు ఉదాహరణలుగా కనిపిస్తాయి. బీజేపీకి ఏపీలో ఒక్క శాతం ఓట్లు కూడా గత ఎన్నికలలో రాలేదు. అయినా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ద్వారా రాయబేరాలు సాగించి కాళ్లా, వేళ్ల పడి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఇదంతా కేంద్ర ప్రభుత్వం ద్వారా తమ పనులు చక్కబెట్టుకోవడానికే అని అర్దం అవుతుంది.తమపై ఉన్న కేసులు ముందుకు వెళ్లకుండా చంద్రబాబు జాగ్రత్తపడడానికే అని ప్రజలంతా భావిస్తున్నారు. అమరావతి రాజధాని విషయంలోనే కాదు. పలు విషయాలలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు డబుల్ గేమ్ ఆడుతున్నారు. వలంటీర్ల వ్యవస్థ వల్ల అంతా వినాశనమేనని గతంలో ప్రచారం చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ దారుణమైన ఆరోపణలు ఆ చిన్నస్థాయి వలంటీర్లపై గుప్పించారు. తదుపరి ఎన్నికల సమయానికి తాము కూడా వలంటీర్లను కొనసాగిస్తామని, ఇంకా ఎక్కువ వేతనం ఇస్తామని ప్రకటించారు.వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రం శ్రీలంక అవుతోందని చంద్రబాబు, పవన్ లు విమర్శించేవారు. కానీ వారి ఎన్నికల మానిఫెస్టోలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న వాటికన్నా మూడు రెట్ల వ్యయంతో సంక్షేమ స్కీములు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. లాండ్ టైటిలింగ్ యాక్ట్ కు అసెంబ్లీలో మద్దతు ప్రకటించారు. ఎన్నికల వేళ మాత్రం అదేదో ప్రమాదకరమైనదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కేంద్రానికి సంబంధించిన ఈ చట్టం గురించి మోదీ, అమిత్ షా సభలలో మాత్రం నోరు విప్పరు.ఇన్ని రకాలుగా డ్రామాలు ఆడుతున్న, అబద్దాలు చెబుతున్న టీడీపీ కూటమికి ఎవరైనా ఓటు వేస్తే, వారి అబద్దాలకు ఆమోద ముద్ర వేసినట్లే అవుతుంది. చివరిగా ఒక మాట. పవన్ కల్యాణ్ పెద్ద కవి మాదిరిగా పర్వతం ఎవరికి తలవంచదు. సముద్రం ఎవరి కాళ్ల వద్దకు వెళ్లదు.. అంటూ సినిమా డైలాగులు చెబుతుంటారు. కానీ మోదీ పాల్గొన్న సభలో ఈయన వంగి, వంగి ప్రవర్తించిన తీరు మాత్రం అందరిని విస్తుపరిచింది. ఈయన చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అచ్చం చంద్రబాబు స్టైల్ లోనే పవన్ ఉన్నారని ప్రజలకు క్లారిటీ వచ్చింది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
భారతదేశంలో బ్యాన్ చేసిన ఆహార పదార్థాలు ఇవే..!
భారతదేశం విభిన్న సంస్కృతులతో భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా ఉంటుంది. విభిన్న పాక శాస్త్రాలను ప్రొత్సహించి రుచులను ఆస్వాదిస్తుంది. అయితే ప్రజారోగ్యం దృష్ట్యా దేశవ్యాప్తంగా కొన్ని రకాల ఆహార పదార్థాలను బ్యాన్ చేసింది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ). ఆ ఆహార పదర్థాలేంటీ? ఎందుకు వాటిని బ్యాన్ చేశారు వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందాం.పర్యావరణ ప్రభావాలు, ఆరోగ్య సమస్యలు దృష్ట్యా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) భారతదేశమంతటా కొన్ని రకాల ఆహార పదార్థాలను పూర్తిగా బ్యాన్ చేసింది. అవేంటంటే..చైనీస్ పాల ఉత్పత్తులు..చైనాలో ఆహార భద్రత కుంభకోణాలు, కాలుష్య సమస్యలకు సంబంధించిన అనేక సంఘటనలు వెలుగులోకి రాడవంతో ఎప్ఎస్ఎస్ఏఐ 2008లో చైనీస్ పాల ఉత్పత్తులు, శిశు ఫార్ములాతో సహా భారతదేశం నిషేధించింది. ప్రోటీన్ స్థాయిలన పెంచేలా మెలమైన్ విషపూరిత రసాయనం వంటి కలుషితాలను గుర్తించడంతోనే నిపుణులు చైనీస్ పాల ఉత్పత్తుల అమ్మకాలను నిషేధించారు. ఇవి ప్రజల ఆరోగ్యాన్ని తీవ్ర ప్రమాదంలోకి నెట్టేస్తాయని పరిశోధనలో తేలింది కూడా. జన్యు పరంగా మార్పు చెందిన ఆహారాలు..పర్యావరణ ప్రభావం, జీవ వైవిధ్య నష్టం, ఆరోగ్య ప్రమాదాల ఆందోళన నేపథ్యంలో జన్యుపరంగా మార్పు చెందిన పంటలు, ఆహారా సాగు, దిగమతులపై భారతదేశం ఆంక్షలు విధించింది. బీటీ పత్తి వంటి జన్యు మార్పు పంటల వాణిజ్య సాగుకు అనుమతి ఉన్నప్పటికీ..ఆయా ఆహార పంటలకు ఆమోద ప్రక్రియ చలా కఠిన షరతులతో ఉంటుంది. దీర్థకాలికా ఆరోగ్యం పర్యావరణ పరిణామాలపై ప్రభావం చూపిస్తాయనేది పలువురు నిపుణులు వాదన. పోటాషియం బ్రోమేట్..2016లో ఎఫ్ఎస్ఎస్ఏఐ ఈ పోటాషియం బ్రోమేట్ వాడకాన్ని నిషేధించింది. ఇది పిండి స్థితిస్థాపక తోపాటు రొట్టె పరిమాణాన్ని మెరుగుపరచడానికి ఉపయోగించే ఆహార సంకలితం. అయితే దీనివల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ ఉందని అధ్యయనాల్లో తేలింది. ఇది ఎక్కువగా థైరాయిడ్ కేన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని, ముఖ్యంగా బ్రెడ్ వంటి బేకరీ ఉత్పత్తుల్లో దీని వినియోగాన్ని నిషేధించమని అధికారులు సూచించారు.పండ్లను పక్వానికి వచ్చేలా చేసే కృత్రిమ కారకాలు..పండ్లను కృత్రిమంగా పండిచేందుకు వాడే కాల్షియం కార్బైడ్, ఇథిలీన్ గ్యాస్ వంటి రసాయన కారకాలు కారణంగా ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని భారతదేశం వీటిని నిషేధించింది. ఈ కాల్షియం కార్బైడ్ పండ్లు పక్వానికి వచ్చే ప్రక్రియలో ఎసిటిలిన్ వాయువుని విడుదల చేస్తుందని, ఇది కేన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. పోయ్ గ్రాస్‌పోయ్ గ్రాస్ దాని ఉత్పత్తి ప్రక్రియకు సంబంధించిన ఆందోళన కారణంగా నిషేదించారు. ఇది బాతులు లేదా పెద్ద బాతులు వాటి కాలేయాలను పెంచడానికి బలవంతంగా ఈ గ్రాస్‌ని ఇవ్వడంపై జంతు సంక్షేమవాదు ఆందోళనలు లేవనెత్తారు. ఇది అవమానవీయ చర్యగా పేర్కొన్నారు. ఈ పోయ్ గ్రాస్ అమ్మకం, దిగుమతిని నిషేధించడం జరిగింది. రెసిపీల కోసం వాటిని హింసించేలా ఇలాంటి గ్రాస్‌తో ఫీడ్ చేయడం అనేది హింసతో సమానమని చెబుతోంది. రెడ్ బుల్ ఎనర్జీ డ్రింక్రెడ్ బుల్ కెఫిన్, టౌరిన్ వంటివి ఇతర ఉత్ప్రేరకాలు కలిగి ఉన్న ఒక ప్రముఖ ఎనర్జీ డ్రింక్. దీనిలో కెఫీన్ కంటెంట్ కారణంగా 2006లో ఎఫ్ఎస్ఎస్ఏఐ భారతదేశమంతటా నిషేధించింది. నిజానికి కెఫిన్ వినియోగం సురక్షితమైన ఈ రెండ్‌బుల్ ఎనర్జీ డ్రింక్స్ అధికంగా తీసుకుంటే గుండె కొట్టుకునే రేటు పెరగడం, రక్తపోటు పెరగడం, నిర్జలీకరణం వంటి ప్రతికూల ప్రభావాలకు దారితీసే ప్రమాదం ఎక్కువ. సస్సాఫ్రాస్ ఆయిల్‌సాసఫరస్ ఆయిల్లో అధిక ఎరుసిక్ యాసిడ్ కంటెంట్ ఉన్నందున 2003లో ఎఫ్ఎస్ఎస్ఏఐ నిషేధించింది. ఇది గుండె జబ్బులతో సహా ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తుంది. ఈ నూనెలో ఎరుసిక్ యాసిడ్ స్థాయిలు పరిమితికి మించి ఉండటంతో హృదయ ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉండటంతోనే అధికారులు దీన్ని నిషేధించారు. చైనీస్ వెల్లుల్లి..2019లో చైనా నుంచి దిగుమతి చేసిన వెల్లుల్లిలో పురుగుమందుల అవశేషాలు ఎక్కువగా ఉన్నాయని ఆందోళనలు రావడంతో ఎఫ్ఎస్ఎస్ఏఐ ఈ చైనీస్ వెల్లుల్లి దిగుమతిని భారతదేశంలో నిషేధించారు. ఈ వెల్లుల్లిలో పరిమితికి మించి పురుగుల మందుల అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు నిపుణుల. ఇది వినియోగదారుల ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది. ప్రజలు హానికరమైర రసాయనాలకు గురికాకుడదన్న ఉద్దేశ్యంతోనే ఈ నియంత్రణ చర్యలు తీసుకున్నారు అధికారులు. బ్రోమినేటెడ్ వెజిటబుల్ ఆయిల్ ..బ్రోమినేటెడ్ వెజిటబుల్ ఆయిల్ కొన్ని పానీయాలకు జోడించడం జరగుతుంది. ఉదాహరణకు సిట్రస్-ఫ్లేవర్ సోడాలు, సువాసనల కోసం వినియోగిసతఆరు. ఈ నూనెలో బ్రోమిన్ ఉంటుంది. ఇది నాడీ సంబంధిత లక్షణాలు, థైరాయిడ్ రుగ్మతలు వంటి ఆరోగ్య సమస్యలకు దాస్తుంది. అందువల్ల దీన్ని ఆహారం, పానీయాలలో వినియోగించటాన్ని నిషేధించాయి లేదా పరిమితం చేశాయి. కుందేలు మాంసం..ప్రధానంగా జంతు సంక్షేమం, మతపరమైన ఆందోళనల కారణంగా కుందేలు మాంసం భారతదేశంలో నిషేధించడం జరిగింది. జనాభాలో మెజారిటీగా ఉన్న హిందువులు కుందేలును పవిత్రమైన జంతువుగా భావిస్తారు. అందువల్దాల దీన్ని మాంసాన్ని ఇక్కడ ఎవరూ తినరని చెప్పొచ్చు . జంతు సంక్షేమ నిబంధనల దృష్ట్యా కుందేలు మాంసం అమ్మకాలను నిషేధించింది భారత్.అందువల్ల ఇలాంటి పదార్థాలు పొరపాటున కనిపించిన కొనద్దు. ఎక్కడైన విక్రయిస్తున్నట్లు తెలిసినా సంబంధిత అదికారులకు ఫిర్యాదు చేయడం వంటివి చేయండి. అందరి ఆరోగ్యాన్ని కాపాడేందుకు మన వంతుగా కృషి చేద్దాం.(చదవండి: బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్‌లు)
Rashmika Mandanna: గుడ్ న్యూస్ చెప్పిన రష్మిక
‘పుష్ప’ చిత్రంలో పాన్ ఇండియా హీరోయిన్గా మారిపోయింది రష్మిక. ఆ తర్వాత తన ఫోకస్ అంతా బాలీవుడ్ పైనే పెట్టింది. మిషన్ మజ్ను, గుడ్‌బై లాంటి బాలీవుడ్ సినిమాల్లో నటించినా.. అంతగా గుర్తింపు రాలేదు. కానీ యానిమల్ మూవీ రష్మికకు పెద్ద బ్రేక్ ఇచ్చింది. అందులో ప్రేమతో హింసించే భర్తకు భార్యగా రష్మిక అద్భుతంగా నటించి, విమర్శకుల ప్రశంసలు పొందింది. యానిమల్ తర్వాత రష్మికకు బాలీవుడ్లో వరుస అవకాశాలు వస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమాలో అవకాశం సొంతం చేసుకుంది ఈ నేషనల్ క్రష్. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేసింది.‘మీరు ఎన్నో రోజులుగా నా సినిమా అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మీకోసమే ఈ సర్ప్రైజ్. ‘సికందర్’తో మీ ముందుకు వస్తున్నాను. ఇంత గొప్ప ప్రాజెక్ట్‌లో నటించే అవకాశం రావడం ఎంతో ఆనందంగా, గౌరవంగా ఉంది’ అని రష్మిక తన ఎక్స్(ట్విటర్) ఖాతాలో రాసుకొచ్చింది. ఈ చిత్రానికి తమిళ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. సాజిద్ నడియాడ్ వాలా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రష్మిక ‘కుబేర’, ‘రెయిన్ బో’, ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాల్లో నటిస్తోంది. ఆమె నటించిన పుష్ప 2 చిత్రం ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. You guys for a long time have been asking me for the next update and here it is.. ❤️Surprise!! ✨ I am truly grateful and honoured to be a part of #Sikandar #SajidNadiadwala @BeingSalmanKhan @ARMurugadoss @NGEmovies @WardaNadiadwala Releasing in cinemas on EID 2025! 🌙❤️✨… https://t.co/xegNMOkt5u— Rashmika Mandanna (@iamRashmika) May 9, 2024
పిచ్ స్వరూపం మారిందా లేక మార్చేశారా.. మరీ ఈ రేంజ్లో విధ్వంసమా..?
ఐపీఎల్ 2024 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. దాదాపుగా ప్రతి మ్యాచ్‌లో పట్టపగ్గాల్లేకుండా విరుచుకుపడుతున్నారు. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రవిస్ హెడ్ విధ్వంసం మాటల్లో వర్ణించలేనట్లుగా ఉంది. వీరిద్దరి ఊచకోత ధాటికి పొట్టి క్రికెట్ రికార్డులు బద్దలవుతున్నాయి. నిన్న లక్నోతో జరిగిన మ్యాచ్‌లో వీరి విధ్వంసం వేరే లెవెల్లో ఉంది. వీరిద్దరు లక్నో బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డారు. ఫలితంగా 166 పరుగుల ఓ మోస్తరు లక్ష్యం 9.4 ఓవర్లలోనే తునాతునకలైంది. అభిషేక్ (28 బంతుల్లో 75 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్సర్లు), హెడ్ (30 బంతుల్లో 89 నాటౌట్; 8 ఫోర్లు, 8 సిక్సర్లు) ఊహకందని విధ్వంసం సృష్టించి తమ జట్టుకు చిరస్మరణీయ విజయాన్నందించారు. ఈ విజయంతో సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది.పిచ్ స్వరూపం మారిందా.. ఆ ఇద్దరూ మార్చేశారా..?నిన్నటి మ్యాచ్‌లో అభిషేక్, హెడ్ విధ్వంసం ఏ రేంజ్లో సాగిందన్నదానికి ఓ విషయం అద్దం పడుతుంది. ఈ మ్యాచ్‌లో లక్నో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఉప్పల్ మైదానంలోని పిచ్ ఆనవాయితీగా తొలుత బ్యాటింగ్ చేసే జట్లకు సహకరిస్తుంది. అయితే సన్‌రైజర్స్ బౌలర్లు, ముఖ్యంగా భువీ చెలరేగడంతో లక్నో ఇన్నింగ్స్ నత్తనడకలా సాగింది. ఆఖర్లో పూరన్, బదోని మెరుపులు మెరిపించడంతో లక్నో గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది.ఇక్కడ ఓ ఆసక్తికర విషయం ఏంటంటే.. లక్నో తొలుత బ్యాటింగ్ చేస్తూ పవర్ ప్లేలో (తొలి 6 ఓవర్లలో) 2 వికెట్లు కోల్పోయి కేవలం 27 పరుగులు మాత్రమే చేసింది. అదే సన్‌రైజర్స్ తొలి ఆరు ఓవర్లలో మాటల్లో వర్ణించలేని విధ్వంసాన్ని సృష్టించి ఏకంగా 107 పరుగులు పిండుకుంది. సన్‌రైజర్స్ ఓపెనర్ల విధ్వంసం చూశాక అభిమానులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పిచ్ స్వరూపం మారిందా లేక ఆ ఇద్దరూ మార్చేశారా..? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఒకే మ్యాచ్‌లో పవర్ ప్లేల్లో మరీ ఇంత వ్యత్యాసమా అని ముక్కునవేల్లేసుకుంటున్నారు. ఇరు జట్ల పవర్ ప్లే స్కోర్లలో 80 పరుగుల వ్యత్యాసం ఉంది. మొత్తానికి నిన్నటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓపెనర్ల విధ్వంసం ధాటికి పలు రికార్డులు బద్దలయ్యాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.ఐపీఎల్ పవర్ ప్లేల్లో రెండో అత్యధిక స్కోర్ (107/0)ఐపీఎల్లో సన్‌రైజర్స్ మాత్రమే రెండు సందర్భాల్లో (ఇదే సీజన్లో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో (125/0) పవర్ ప్లేల్లో 100 పరుగుల మార్కును దాటింది.ఓ మ్యాచ్ పవర్ ప్లేల్లో అత్యధిక వ్యత్యాసం (80 పరుగులు- లక్నో 27/2, సన్‌రైజర్స్ 107/0)లక్నోకు పవర్ ప్లేల్లో ఇదే అత్యల్ప స్కోర్ (27/2)ఈ సీజన్ బ్యాటింగ్ పవర్ ప్లేల్లో ట్రవిస్ హెడ్‌కు ఇది నాలుగో అర్ద సెంచరీ. ఓ సీజన్ పవర్ ప్లేల్లో ఇవే అత్యధికం.ఒకే సీజన్లో 20 బంతుల్లోపే మూడు హాఫ్ సెంచరీలు సాధించిన హెడ్. ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ ఆటగాడు జేక్ ఫ్రేజర్, హెడ్ మాత్రమే ఈ ఘనత సాధించారు.ఐపీఎల్ చరిత్రలో రెండో వేగవంతమైన 100 పరుగుల భాగస్వామ్యం (అభిషేక్, హెడ్ (34 బంతుల్లో). ఇదే జోడీ పేరిటే వేగవంతమైన 100 పరుగుల భాగస్వామ్యం రికార్డు కూడా నమోదై ఉంది. ఇదే సీజన్లో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌ల్లో ఈ ఇద్దరు 30 బంతుల్లోనే 100 పరుగుల పార్ట్‌నర్‌షిప్‌ను నమోదు చేశారు.ఐపీఎల్ చరిత్రలోనే తొలి 10 ఓవర్లలో అత్యధిక స్కోర్ (సన్‌రైజర్స్ 9.4 ఓవర్లలో 167/0)100కు పైగా లక్ష్య ఛేదనలో అత్యధిక మార్జిన్‌తో విజయం (166 పరుగుల లక్ష్యాన్ని మరో 62 బంతులు మిగిలుండగానే ఛేదించిన సన్‌రైజర్స్)మూడో వేగవంతమైన 100 పరుగులు (జట్టు స్కోర్)-5.4 ఓవర్లలో 100 పరుగులు టచ్ చేసిన సన్రైజర్స్ఓ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన జట్టుగా రికార్డుల్లోకెక్కిన సన్‌రైజర్స్. ఆరెంజ్ ఆర్మీ ఈ సీజన్లో ఇప్పటికే 146 సిక్సర్లు బాదింది. 2018 సీజన్లో సీఎస్కే 145 సిక్సర్లతో రెండో స్థానంలో ఉంది.
సిక్ లీవ్ తీసుకున్న ఉద్యోగుల తొలగింపు
టాటా యాజమాన్యంలోని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఉద్యోగులపై కొరడా ఝుళిపించింది. ముకుమ్మడిగా సిక్ లీవ్ తీసుకున్న ఉద్యోగులను తొలగించింది. సెలవు అనంతరం తిరిగి ఉద్యోగులు సంస్థకు రిపోర్ట్ చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వర్గాలు చెప్పాయి. ఇటీవల ఉద్యోగులు విధులకు రాకపోవడంతో బుధవారం సంస్థ దాదాపు 80కి పైగా విమాన సర్వీసులను రద్దు చేసింది. ఈ చర్యకు కారణమైన 25 మంది క్యాబిన్ సిబ్బందిపై చర్యలు తీసుకుంది.‘సిక్‌లీవ్ అనంతరం 25 మంది ఉద్యోగులు సంస్థకు రిపోర్ట్ చేయడంలో విఫలయ్యారు. వారితీరు వల్ల విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్ ఎంప్లాయిస్ సర్వీస్ రూల్స్‌ను పాటించనందుకు వారిపై చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. అందులో భాగంగానే వారి ఉద్యోగాలు తొలగించాం’ అని టర్మినేషన్ లేటర్లో కంపెనీ తెలిపింది.బుధవారం విమాన సర్వీసుల్లో కలిగిన అంతరాయం తర్వాత సంస్థ సీఈఓ అలోక్ సింగ్ స్పందించారు. ఉద్యోగులకు ఏదైనా సమస్యలుంటే క్యాబిన్ సిబ్బందితో చర్చకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఎయిర్‌లైన్ రాబోయే కొద్ది రోజుల పాటు విమానాలను తగ్గిస్తుందని తెలిపారు.ఇదీ చదవండి: కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను రద్దు చేసిన ఆస్ట్రాజెనెకా.. కారణం తెలుసా..ఇదిలాఉండగా, ఎయిరిండియా వైఖరిపట్ల సిబ్బంది అసంతృప్తిగా ఉన్నారని తెలిసింది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ను ఎయిర్ఏషియా ఇండియాతో విలీనం చేయడం వల్ల సిబ్బంది జీతాలు దాదాపు 20 శాతం తగ్గాయని ఉద్యోగులు చెబుతున్నారు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ కెకె విజయ్‌కుమార్ మాట్లాడుతూ..ఎయిరేషియాతో విలీనానికి ముందు ఉద్యోగులకు ఇవ్వాల్సిన పరిహారంలో స్పష్టత ఇవ్వాలని కోరారు. ఈ విలీనంతో ఉద్యోగులకు రావాల్సిన అలవెన్సులు పూర్తిగా తొలగించబడ్డాయన్నారు. దాంతో భారీగా జీతాలు తగ్గాయని చెప్పారు. సంస్థ నిర్వహణలో లోపాలున్నాయని, సిబ్బంది పట్ల సమానత్వం కరవైందని యూనియన్ గతంలో దిల్లీలోని రీజినల్ లేబర్ కమిషనర్‌కు, టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్‌కు లేఖ రాసింది.
పవన్.. నువ్వు తీసిన సినిమాలెన్నీ.. నీ ఆస్తులెంత?: పోతిన మహేష్
సాక్షి, విజయవాడ: చంద్రబాబుకు ఊడిగం చేయడానికే పవన్ రాజకీయాల్లోకి వచ్చారని వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్ అన్నారు. అలాగే, టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గర డబ్బు తీసుకుని పవన్.. జనసేన పెట్టారని కామెంట్స్ చేశారు.కాగా, పోతిన మహేష్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. పవన్ ఓ ప్యాకేజీ స్టార్. పాలేరు కంటే హీనంగా చంద్రబాబు కోసం పవన్ పనిచేస్తున్నారు. చంద్రబాబు డబ్బు తీసుకుని పవన్ పార్టీ పెట్టారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదని పవన్ కొత్త పల్లవి ఎత్తుకున్నారు. తన ఆస్తులు కూడబెట్టుకునేందుకే జనసేన పార్టీ పెట్టారు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక సాధారణ అపార్ట్మెంట్లో ఉంటున్నా అని 2014 పవన్ చెప్పాడు. ఒకప్పుడు కార్ ఈఎంఐ కట్టలేనని చెప్పాడు పవన్. ఇప్పుడు 2024 నాటికి 1500 నుండి 2 వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. తిరగటానికి సొంతంగా హెలిక్యాప్టర్, భూములు ఎలా వచ్చాయో పవన్ చెప్పాలి. నమ్ముకున్న నాలాంటి వాళ్ళని అమ్ముకుని పవన్ ఆస్తులు సంపాదించాడు. మార్పు కోసం పని చెయ్యాలి అని చెప్తూ పవన్ చంద్రబాబుకు పాలేరులాగా పని చేశారు.ప్రజారాజ్యం పార్టీని నడపలేక చిరంజీవి ఏతేస్తే.. పవన్ పార్టీ పెట్టడానికి డబ్బులు తీసుకున్నాడు. పవన్ కళ్యాణ్ ఒక పొలిటికల్ 420. గత ఎన్నికల్లో ప్రజలు ముందే గ్రహించి తీర్పు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చిలనీవ్వను అంటు బాబుకే ఊడిగం చేస్తూ కొత్త పల్లవి ఎత్తాడు. తీసుకుంటున్న సీట్లు ఎన్ని? మార్పు సాధ్యం ఎలా?పార్టీ పెట్టింది పవన్ ఆస్తులు సంపాదించటానికి.. మాలాంటి వాళ్ళని తాకట్టు పెట్టి లగ్జరీ కార్లు కొన్నాడు. మంగళగిరి పార్టీ ఆఫీస్ పక్కనే 100 కోట్ల ల్యాండ్ కొన్నాడు. బినామీ నర్రా శ్రీనివాస్ మిత్రుడు పోసడపు వెంకటేశ్వరరావు పేరుతో కొంత భూమిని రిజిస్ట్రేషన్ చెప్పించారు. పవన్ కళ్యాణ్ డ్రైవర్ నవీన్ అనే వ్యక్తి మధ్యవర్తిగా రిజిస్ట్రేషన్‌కు వచ్చాడు.డాక్యుమెంట్స్‌లో సరైన సైట్ ఫోటో కూడా పెట్టలేదు. డాక్టర్ బాబు బాలాజీ ప్రకాష్‌తో ఈ వ్యవహారం మొత్తం కుడా నడిపారు. ఈ భూమి పవన్ కళ్యాణ్ కోసమే కొన్నారు. విచారిస్తే నిజాలు తెలుస్తాయి. ఈ ల్యాండ్ కొనటానికి డబ్బు ఎక్కడి నుండి వచ్చింది. సినిమాలు కూడా తీయలేదు. ఈ అంశంపై సీబీఐకి ఫిర్యాదు చేస్తాను.డాక్యుమెంట్స్ అడ్రస్, చెల్లింపులు వేరు వేరు చోట్ల నుండి జరిగాయి. 100 శాతం ఈ ఆస్తి బినామీ పేరుతో పవన్ కొన్నాడు. రంగారెడ్డిలో 45 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది ఇంకా పెంచుతున్నారు. ఎన్నికల ఆఫిడవిట్లో 14 ఎకరాలు అని పెట్టాడు పవన్. ఎన్నారైలు, కాపు సామాజిక వర్గం ఇచ్చిన డబ్బులు పవన్ వాడుకున్నాడు.పవన్ రక్త సంబంధీకుల ఆస్తుల వివరాలు వెల్లడించాలి. చిరంజీవి, రామ్ చరణ్ తప్ప అందరి ఆస్తుల వివరాలు చెప్పాలి. పవన్ కుటుంబ సభ్యులే ఆయనకు బినామీలు. 28 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. 48 కోట్లు అప్పులు ఉన్నాయి అని ఎన్నికల అఫిడవిట్లో తెలిపాడు. హైదరాబాద్‌లో ఒకప్పుడు జనసేన ఆఫీసు అద్దె భవనం, ఇప్పుడు సొంత భవనం. ఇంకా రిజిస్ట్రేషన్ అవలేదు. వీటికి డబ్బు ఎక్కడి నుండి వచ్చింది. చంద్రబాబు నుండి తీసుకున్న డబ్బు కాదా?.పీపుల్స్ మీడియాలో పవన్‌కు వాట ఉంది. రేణు దేశాయ్‌కి ప్రతీ నెల 10 లక్షలు ఎందుకు ఇస్తున్నాడు. పవన్‌కు మరో ఆఫర్ వచ్చింది. అసెంబ్లీ , పార్లమెంట్ సీట్లు అమ్ముకుంటే 150 కోట్లు వచ్చాయి. చంద్రబాబు చెప్పిన వారికి సీట్లు ఇస్తే ఒక్కొక్కరికి 10 కోట్లు ఇచ్చారు. ఎంపీ బాలశౌరికి 30 కోట్లు తీసుకుని సీటు ఇచ్చారు. క్యాష్ ఇచ్చే వరకు బాలశౌరికి టికెట్ ప్రకటించలేదు. వీటన్నింటిపై పవన్ స్పష్టత ఇవ్వాలి. పవన్ తీసిన సినిమాలు ఎన్ని వచ్చిన ఆదాయం ఎంత?.రెండు వేల కోట్ల ఆస్తులు ఉన్న పవన్ సామాన్య మధ్య తరగతికి చెందిన వాడు ఎలా అవుతాడు?. చెవిలో పువ్వులు పెడుతున్నాడు. పవన్ ఒక చీడ పురుగు. నాడు చిరంజీవి మోసం చేసి ఇంటికి వెళ్లాడు. నేడు పవన్ మళ్లీ వచ్చాడు. మోసం చేసి ఆస్తులు కూడబెట్టుకోవడమే వీరిద్దరి పని’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్
ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన, భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్ల నుండి ప్రేరణ పొంది అద్భుతమైన మరియు వైవిధ్యమైన శ్రేణి సమకాలీన, రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్లు, కస్టమర్లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా, ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్, ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్లెట్లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్ 18కేరట్ మరియు 22కేరట్ బంగారంలో విస్తృతమైన శ్రేణి డిజైన్లతో, నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని సంపూర్ణం చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్లెట్లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.
తప్పక చదవండి
- బాబు, లోకేష్‌కు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
- సీఎం నితీష్‌కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- PK: 'పులుసు కారుతోంది'..!
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- Mona Patel: ‘ఎవరీ మోనా?’ అని సెర్చ్ చేసేలా...
- Playoffs: పాండ్యాకు పరాభవం.. ముంబై కథ ముగిసిందిలా!
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
సినిమా
బతకడానికి కేవలం 30 శాతమే ఛాన్స్: స్టార్ హీరోయిన్
మురారి, ఇంద్ర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ముద్దుగుమ్మ సోనాలి బింద్రే. టాలీవుడ్లో హిట్ చిత్రాలు చేసిన బాలీవుడ్ భామ.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. అయితే 2018లో క్యాన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే. ఇటీవల ది బ్రోకెన్ న్యూస్ సీజన్-2 వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సోనాలి క్యాన్సర్ నిర్ధారణ తర్వాత తన కుటుంబం తీవ్రమైన ఒత్తిడికి గురైందని తెలిపింది.సోనాలి మాట్లాడుతూ.. 'ముఖ్యంగా 2018లో క్యాన్సర్ నిర్ధారణ అయింది. ఆ వార్త నా కుటుంబాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. మాకు షాకింగ్‌గా అనిపించింది. ఇది జరిగినప్పుడు నేను రియాల్టీ షో చేస్తున్నా. ఆ సమయంలో నాకు ఆరోగ్యం సరిగ్గా లేదని తెలుసు. డాక్టర్ వద్దకు వెళ్లినప్పుడు ఏదైనా చిన్న ప్రాబ్లమ్ మాత్రమే ఉంటుందని అనుకున్నా. కానీ పరీక్షలు చేశాక అసలు విషయం తెలిసింది. ఆ సమయంలో డాక్టర్, నా భర్త గోల్డీ బెహ్ల్ మొహాలు ఒక్కసారిగా మారిపోయాయి. అప్పటికే స్టేజ్ -4 క్యాన్సర్‌తో ఉన్నట్లు తెలిసింది. కేవలం 30 శాతం బతికే అవకాశం ఉందని డాక్టర్ చెప్పారు. దీంతో డాక్టర్‌పై నా భర్త కోపం ప్రదర్శించాడు. కానీ ఆ తర్వాత కీమోథెరపీ చేయించుకున్నా. అది చాలా కఠినమైన చికిత్స. నా జుట్టు రాలడం లాంటి తీవ్రమైన సమస్య ఎదుర్కొన్నా' అని తెలిపింది.
హీరోయిన్‌తో బ్రేకప్! మరో బ్యూటీతో హీరో పార్టీ!
సినిమా ఇండస్ట్రీలో ప్రేమాయణాలు, బ్రేకప్పులు సర్వసాధారణమైపోయాయి. కొన్ని జంటలైతే పెళ్లి పీటలెక్కడం ఖాయమనుకునే సమయానికి అనూహ్యంగా విడిపోవడానికే మొగ్గుచూపుతున్నాయి. ఇటీవలి కాలంలో బాలీవుడ్ లవ్ బర్డ్స్ అనన్య పాండే- ఆదిత్య రాయ్ కపూర్ బ్రేకప్ చెప్పుకున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. హీరోయిన్‌తో పార్టీ !దీనిపై అటు అనన్య, ఇటు ఆదిత్య ఎవరూ స్పందించనేలేదు. ఇంతలో ఆదిత్య రాయ్ కపూర్ మరో హీరోయిన్‌తో పార్టీ చేసుకున్నాడంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సారా అలీ ఖాన్‌తో అతడు పార్టీలో పాల్గొన్నాడు. వీరిద్దరూ మెట్రో ఇన్ ఢిల్లీ అనే సినిమా సెట్స్‌లో డైరెక్టర్ అనురాగ్ బసు బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. అది సహజమే..ఒక సినిమాలో హీరోహీరోయిన్లుగా నటిస్తున్నప్పుడు ఆ మాత్రం స్నేహం, సాన్నిహిత్యం ఉండటం సహజమే అని అభిమానులు వెనకేసుకొస్తున్నారు. కొందరు మాత్రం బ్రేకప్ అయిన బాధ లేకుండా ఆదిత్య మరో హీరోయిన్‌తో ఇంత చనువుగా ఉండటం ఏమీ బాలేదని కామెంట్లు చేస్తున్నారు. #SaraAliKhan and #AdityaRoyKapur celebrating #AnuragBasu sir's bday on the sets of #MetroInDino 🥹💕 pic.twitter.com/pab1vBwa68— sakt` (@SarTikFied) May 8, 2024
మా గురించి మాట్లాడేందుకు మీరెవరు?: వరలక్ష్మి శరత్‌కుమార్
దక్షిణాది నటీమణుల్లో వరలక్ష్మీ శరత్‌కుమార్ రూటే వేరని చెప్పవచ్చు. ఆమె ఎంత సౌమ్యంగా మాట్లాడతారో, తేడా వస్తే అంత రఫ్‌గానూ దులిపేస్తారు. నిర్మొహమాటంగా మాట్లాడే వరలక్ష్మీశరత్‌కుమార్ ఏ భాషలోనైనా.. ఎలాంటి పాత్రనైనా నటించే సత్తా కలిగిన నటి. ఈమె తాజాగా ఉమెన్ సెంట్రిక్ పాత్రలో నటించిన బహుభాషా చిత్రం శబరి ఇటీవలే తెరపైకి వచ్చింది. మరికొన్ని చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. కాగా ఇటీవల నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు మాట్లాడారు. ముఖ్యంగా తన గురించి మాట్లాడిన నెగిటివ్ కామెంట్స్‌పై ఫైర్ అయ్యారు.అసలు తన గురించి నెగిటివ్‌గా మాట్లాడటానికి మీరెవరు? అని వరలక్ష్మి ప్రశ్నించారు. శరత్‌కుమార్ మొదట్లో ఛాయ అనే మహిళను పెళ్లి చేసుకోవడంతో ఆమెకు వరలక్ష్మీ శరత్‌కుమార్ జన్మించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత మనస్పర్థల కారణంగా వరలక్ష్మీ తల్లిదండ్రులు విడిపోయారు. ఆ తరువాత శరత్‌కుమార్ నటి రాధికను రెండో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ రాహుల్ అనే కుమారుడు ఉన్నాడు.అయితే ప్రస్తుతం శరత్‌కుమార్ మొదటి భార్య ఛాయ, రెండో భార్య రాధిక కుటుంబాలు కలిసి మెలిసే ఉంటున్నాయి. ఇటీవల నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ ఎంగేజ్మెంట్ వేడుకలోనూ అందరూ కలిసి పాల్గొన్నారు. ఈ సంఘటన గురించి రక రకాల కామెంట్స్ దొర్లాయి. వీటిపై స్పందించిన నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ మీరు కామెంట్స్ చేసే వ్యక్తి జీవితం ఏమిటన్నది మీకు తెలుసా? తను ఉన్నత స్థాయికి చేరారంటే అందుకు పడిన కష్టం మీకు తెలుసా? ఈజీగా కామెంట్స్ మాత్రం చేస్తారు అని ఫైరయ్యారు.ఒకరి గురించి నెగిటివ్ కామెంట్స్ చేసే ముందు వారి గురించి మీకేం తెలుసో ఆలోచించుకోవాలని వరలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే నటీనటుల గురించి మీరెందుకు ఇతరులకు సాయం చేయలేదని కామెంట్ చేసేకంటే.. మీరెందుకు సాయం చేయకూడదు అని ప్రశ్నించారు. నిజం చెప్పాలంటే ప్రపంచంలోనే నటీమణులకే పారితోషికం చాలా తక్కువని అన్నారు. ఎందుకంటే తమకు ఎప్పుడు డబ్బు వస్తుందో తెలియదని.. షూటింగ్ లేకపోతే పారితోషికమే రాదని చెప్పారు. అయితే నెగిటివ్ కామెంట్స్ చేసేవారు తాము సౌకర్యవంతమైన జీవితాన్ని అనుభవిస్తుంటామని భావిస్తుంటారన్నారు.కానీ నిజానికి అలాంటి పరిస్థితిలేదని ఆమె తెలిపారు. తాము నెలకు తమ వద్ద పని చేసేవారికి జీతాలు చెల్లించాలని.. అయితే తమకు మాత్రం నెలసరి జీతాలు ఉండవన్నారు. షూటింగ్ ఉంటేనే పారితోషిక ఉంటుందని.. ఒక్కోసారి నిర్మాత ఇంట్లో ఏదైనా సమస్య తలెత్తి.. షూటింగ్ నిలిచిపోతే పారితోషికం ఆగిపోతుందన్నారు. తాము వెళ్లి అడిగే పరిస్థితి ఉండదన్నారు. అలా తమకు పారితోషికం ఎప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితి అన్నారు. కాబట్టి తమ పని అంత సులభం కాదని నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ పేర్కొన్నారు.
పెళ్లి ఫోటోలు డిలీట్.. ఎయిర్‌పోర్ట్‌లో మెరిసిన స్టార్ కపుల్!
బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్‌లో దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్ జంట ఒకరు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. దీపికా ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ఈ దంపతులు ప్రకటించారు. త్వరలోనే ఈ జంట తమ మొదటి బిడ్డను జీవితంలోకి ఆహ్వానించనున్నారు.అయితే తాజాగా రణ్వీర్ సింగ్ తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా నుంచి తొలగించారు. దీంతో వీరిద్దరిపై మరోసారి రూమర్స్ మొదలయ్యాయి. అయితే తాజాగా ఈ జంట ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో మెరిసింది. రణవీర్‌తో కలిసి తిరిగివచ్చిన దీపికా జంటగా కనిపించారు. అయితే పెళ్లి ఫోటోలు డిలీట్ చేయడంపై ఇప్పటివరకు రణ్వీర్ సింగ్ స్పందించలేదు. దీపికా ఈ ఏడాది సెప్టెంబరులో తమ బిడ్డకు జన్మనివ్వనున్నట్లు తెలుస్తోంది.దీపికా సినిమాల విషయానికొస్తే రణవీర్ సింగ్, అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్, కరీనా కపూర్, టైగర్ ష్రాఫ్, అర్జున్ కపూర్లతో కలిసి సింఘమ్ ఎగైన్‌లో కనిపించనుంది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీలతో కల్కి 2898 ఏడీ చిత్రంలో నటించింది. మరోవైపు రణవీర్ సింగ్, కియారా అద్వానీ జంటగా డాన్- 3 చిత్రంలో నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani)
ఫొటోలు
కర్నూలులో కదం తొక్కిన జగనన్న జనాభిమానం (ఫొటోలు)
Met Gala 2024 : అరంగేట్రంలోనే అదుర్స్..ఎవరీ మోనా (ఫొటోలు)
Yashika Aannand: అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్న యాషిక ఆనంద్ (ఫొటోలు)
విల్లామేరీ విద్యార్థినుల ఫేర్వెల్.. ఫ్యాషన్ షోతో అదరగొట్టిన అమ్మాయిలు
Vijay Deverakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ బర్త్ డే స్పెషల్.. ఫోటోలు
క్రీడలు
పిచ్ స్వరూపం మారిందా లేక మార్చేశారా.. మరీ ఈ రేంజ్లో విధ్వంసమా..?
ఐపీఎల్ 2024 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. దాదాపుగా ప్రతి మ్యాచ్‌లో పట్టపగ్గాల్లేకుండా విరుచుకుపడుతున్నారు. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రవిస్ హెడ్ విధ్వంసం మాటల్లో వర్ణించలేనట్లుగా ఉంది. వీరిద్దరి ఊచకోత ధాటికి పొట్టి క్రికెట్ రికార్డులు బద్దలవుతున్నాయి. నిన్న లక్నోతో జరిగిన మ్యాచ్‌లో వీరి విధ్వంసం వేరే లెవెల్లో ఉంది. వీరిద్దరు లక్నో బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డారు. ఫలితంగా 166 పరుగుల ఓ మోస్తరు లక్ష్యం 9.4 ఓవర్లలోనే తునాతునకలైంది. అభిషేక్ (28 బంతుల్లో 75 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్సర్లు), హెడ్ (30 బంతుల్లో 89 నాటౌట్; 8 ఫోర్లు, 8 సిక్సర్లు) ఊహకందని విధ్వంసం సృష్టించి తమ జట్టుకు చిరస్మరణీయ విజయాన్నందించారు. ఈ విజయంతో సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది.పిచ్ స్వరూపం మారిందా.. ఆ ఇద్దరూ మార్చేశారా..?నిన్నటి మ్యాచ్‌లో అభిషేక్, హెడ్ విధ్వంసం ఏ రేంజ్లో సాగిందన్నదానికి ఓ విషయం అద్దం పడుతుంది. ఈ మ్యాచ్‌లో లక్నో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఉప్పల్ మైదానంలోని పిచ్ ఆనవాయితీగా తొలుత బ్యాటింగ్ చేసే జట్లకు సహకరిస్తుంది. అయితే సన్‌రైజర్స్ బౌలర్లు, ముఖ్యంగా భువీ చెలరేగడంతో లక్నో ఇన్నింగ్స్ నత్తనడకలా సాగింది. ఆఖర్లో పూరన్, బదోని మెరుపులు మెరిపించడంతో లక్నో గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది.ఇక్కడ ఓ ఆసక్తికర విషయం ఏంటంటే.. లక్నో తొలుత బ్యాటింగ్ చేస్తూ పవర్ ప్లేలో (తొలి 6 ఓవర్లలో) 2 వికెట్లు కోల్పోయి కేవలం 27 పరుగులు మాత్రమే చేసింది. అదే సన్‌రైజర్స్ తొలి ఆరు ఓవర్లలో మాటల్లో వర్ణించలేని విధ్వంసాన్ని సృష్టించి ఏకంగా 107 పరుగులు పిండుకుంది. సన్‌రైజర్స్ ఓపెనర్ల విధ్వంసం చూశాక అభిమానులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పిచ్ స్వరూపం మారిందా లేక ఆ ఇద్దరూ మార్చేశారా..? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఒకే మ్యాచ్‌లో పవర్ ప్లేల్లో మరీ ఇంత వ్యత్యాసమా అని ముక్కునవేల్లేసుకుంటున్నారు. ఇరు జట్ల పవర్ ప్లే స్కోర్లలో 80 పరుగుల వ్యత్యాసం ఉంది. మొత్తానికి నిన్నటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓపెనర్ల విధ్వంసం ధాటికి పలు రికార్డులు బద్దలయ్యాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.ఐపీఎల్ పవర్ ప్లేల్లో రెండో అత్యధిక స్కోర్ (107/0)ఐపీఎల్లో సన్‌రైజర్స్ మాత్రమే రెండు సందర్భాల్లో (ఇదే సీజన్లో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో (125/0) పవర్ ప్లేల్లో 100 పరుగుల మార్కును దాటింది.ఓ మ్యాచ్ పవర్ ప్లేల్లో అత్యధిక వ్యత్యాసం (80 పరుగులు- లక్నో 27/2, సన్‌రైజర్స్ 107/0)లక్నోకు పవర్ ప్లేల్లో ఇదే అత్యల్ప స్కోర్ (27/2)ఈ సీజన్ బ్యాటింగ్ పవర్ ప్లేల్లో ట్రవిస్ హెడ్‌కు ఇది నాలుగో అర్ద సెంచరీ. ఓ సీజన్ పవర్ ప్లేల్లో ఇవే అత్యధికం.ఒకే సీజన్లో 20 బంతుల్లోపే మూడు హాఫ్ సెంచరీలు సాధించిన హెడ్. ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ ఆటగాడు జేక్ ఫ్రేజర్, హెడ్ మాత్రమే ఈ ఘనత సాధించారు.ఐపీఎల్ చరిత్రలో రెండో వేగవంతమైన 100 పరుగుల భాగస్వామ్యం (అభిషేక్, హెడ్ (34 బంతుల్లో). ఇదే జోడీ పేరిటే వేగవంతమైన 100 పరుగుల భాగస్వామ్యం రికార్డు కూడా నమోదై ఉంది. ఇదే సీజన్లో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌ల్లో ఈ ఇద్దరు 30 బంతుల్లోనే 100 పరుగుల పార్ట్‌నర్‌షిప్‌ను నమోదు చేశారు.ఐపీఎల్ చరిత్రలోనే తొలి 10 ఓవర్లలో అత్యధిక స్కోర్ (సన్‌రైజర్స్ 9.4 ఓవర్లలో 167/0)100కు పైగా లక్ష్య ఛేదనలో అత్యధిక మార్జిన్‌తో విజయం (166 పరుగుల లక్ష్యాన్ని మరో 62 బంతులు మిగిలుండగానే ఛేదించిన సన్‌రైజర్స్)మూడో వేగవంతమైన 100 పరుగులు (జట్టు స్కోర్)-5.4 ఓవర్లలో 100 పరుగులు టచ్ చేసిన సన్రైజర్స్ఓ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన జట్టుగా రికార్డుల్లోకెక్కిన సన్‌రైజర్స్. ఆరెంజ్ ఆర్మీ ఈ సీజన్లో ఇప్పటికే 146 సిక్సర్లు బాదింది. 2018 సీజన్లో సీఎస్కే 145 సిక్సర్లతో రెండో స్థానంలో ఉంది.
చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్.. ప్రపంచంలోనే తొలి టీ20 జట్టుగా..
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమి తర్వాత అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చింది సన్‌రైజర్స్ హైదరాబాద్. సొంత మైదానం ఉప్పల్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది.ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ తుఫాన్ ఇన్నింగ్స్ కారణంగా క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో తొలిసారి లక్నోపై విజయం నమోదు చేసింది. అదే విధంగా ఈ సీజన్లో ఆడిన 12 మ్యాచ్‌లలో ఏడో గెలుపు నమోదు చేసింది.విధ్వంసకర బ్యాటింగ్తద్వారా 14 పాయింట్లతో పట్టికలో మూడోస్థానానికి ఎగబాకి.. ప్లే ఆఫ్స్ రేసులో ముందుకు దూసుకువచ్చింది. కాగా లక్నోతో మ్యాచ్ సందర్భంగా సన్‌రైజర్స్ సరికొత్త ప్రపంచ రికార్డు సాధించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ విధ్వంసకర బ్యాటింగ్ వల్లే ఇది సాధ్యమైంది.ఉప్పల్‌లో టాస్ గెలిచిన లక్నో తొలుత బ్యాటింగ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది రాహుల్ సేన.సునామీ ఇన్నింగ్స్అయితే, లక్ష్య ఛేదనకు దిగిన తర్వాత లక్నోకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు రైజర్స్ ఓపెనర్లు. ట్రావిస్ హెడ్ ఆది నుంచే దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ లక్నో బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాడు. అతడి ప్రోద్బలంతో అభిషేక్ శర్మ కూడా హిట్టింగ్తో మెరిశాడు.హెడ్ 30 బంతుల్లోనే 89 పరుగులతో దుమ్ములేపగా.. అభిషేక్ 28 బంతుల్లో 75 పరుగులతో విరుచుకుపడ్డాడు. వీరిద్దరి సునామీ ఇన్నింగ్స్ కారణంగా 8.2 ఓవర్లలోనే 150 పరుగుల మార్కు అందుకుంది.ప్రపంచంలోనే తొలి జట్టు👉టీ20 చరిత్రలో అత్యంత తక్కువ ఓవర్లలో ఇలా 150 స్కోరు చేసిన తొలి జట్టు సన్‌రైజర్స్ కావడం విశేషం. ఇక హెడ్, అభి విధ్వంసం కారణంగా సన్‌రైజర్స్ 9.4 ఓవర్లలోనే లక్నో విధించిన 166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.తద్వారా మరో వరల్డ్ రికార్డు కూడా సాధించింది. టీ20 క్రికెట్ చరిత్రలో 150కి పైగా లక్ష్యాన్ని అత్యంత వేగంగా ఛేదించిన జట్టుగా నిలిచింది. లక్నోతో మ్యాచ్ సందర్భంగా సన్‌రైజర్స్ సాధించిన ప్రపంచ రికార్డులు క్లుప్తంగా..టీ20 హిస్టరీలో ఫాస్టెస్ట్ 150+ ఛేజింగ్1. సన్‌రైజర్స్ హైదరాబాద్- లక్నో సూపర్ జెయింట్స్ మీద- 9.4 ఓవర్లలోఏ 166 పరుగుల లక్ష్య ఛేదన.2. బ్రిస్బేన్ హీట్- మెల్బోర్న్ స్టార్స్ మీద- 10 ఓవర్లలో 157 పరుగుల లక్ష్య ఛేదన.3. గయానా అమెజాన్ వారియర్స్- జమైకా తలావాస్- 10.3 ఓవర్లలో 150 పరుగుల లక్ష్య ఛేదన.ఐపీఎల్ చరిత్రలో 10 ఓవర్లలోపే మూడుసార్లు అత్యధిక పరుగులు సాధించిన ఏకైక జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్👉లక్నో సూపర్ జెయింట్స్ మీద- 167/0 (9.4)- 2024లో👉ఢిల్లీ క్యాపిటల్స్ మీద- 157/4- 2024లో👉ముంబై ఇండియన్స్ మీద- 148/2- 2024లో.WHAT. A. CHASE 🧡A 🔟-wicket win for @SunRisers with more than 🔟 overs to spare! Scorecard ▶️ https://t.co/46Rn0QwHfi#TATAIPL | #SRHvLSG pic.twitter.com/kOxzoKUpXK— IndianPremierLeague (@IPL) May 8, 2024
ఐపీఎల్లో నేటి (మే 9) మ్యాచ్.. ఆర్సీబీతో పంజాబ్ 'ఢీ'.. తప్పక గెలవాలి
ఐపీఎల్లో ఇవాళ మరో ఆసక్తికర సమరం జరుగనుంది. ప్లే ఆఫ్స్ బెర్త్‌పై దాదాపుగా ఆశలు వదులుకున్న పంజాబ్ కింగ్స్.. ఇంచుమించు అలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్న ఆర్సీబీని ఢీకొట్టనుంది. ధర్మశాల వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది.ఇరు జట్లలో ఏ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరాలన్నా ఈ మ్యాచ్‌తో పాటు మిగిలిన మ్యాచ్‌లన్నీ (రెండు) భారీ తేడాతో గెలవాల్సి ఉంది. ఇలా జరిగినా ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కుతుందని గ్యారెంటీ లేదు. ఫైనల్ ఫోర్ రేసులో ఉన్న మిగతా జట్ల జయాపజయాలపై ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.ప్రస్తుతం ఆర్సీబీ, పంజాబ్ 11 మ్యాచ్‌లు ఆడి చెరి నాలుగు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. పంజాబ్‌తో పోలిస్తే ఆర్సీబీ నెట్ రన్‌రేట్ కాస్త మెరుగ్గా ఉంది. ఆర్సీబీ -0.049 రన్‌రేట్ కలిగి ఉండగా.. పంజాబ్‌కు -0.049 ఉంది. ఆర్సీబీ ఈ మ్యాచ్ తరువాత ముంబై, గుజరాత్‌లతో తలపడాల్సి ఉండగా..పంజాబ్ ఈ మ్యాచ్ తర్వాత పటిష్టమైన రాజస్థాన్, సన్‌రైజర్స్‌ను ఢీకొట్టాల్సి ఉంది.పంజాబ్‌తో పోలిస్తే ఆర్సీబీ కాస్త బలహీనమైన ప్రత్యర్దులతో తలపడాల్సి ఉన్న నేపథ్యంలో ఆ జట్టుకు ప్లే ఆఫ్స్ అవకాశాలు కాస్త మెరుగ్గా ఉన్నాయి. ఆర్సీబీ ఈ మ్యాచ్‌తో పాటు ముంబై, గుజరాత్‌లపై భారీ తేడాతో గెలిస్తే 14 పాయింట్లు ఖాతాలో ఉండి సీఎస్కే (12), ఢిల్లీ (12), లక్నోలతో (12) ప్లే ఆఫ్స్ బెర్తు కోసం పోటీపడే అవకాశం ఉంది.ఢిల్లీ, లక్నో ఇంకా రెండ్రెండు మ్యాచ్‌లు, సీఎస్కే మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. కేకేఆర్ (16), రాజస్థాన్ (16) పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో ఉండి ప్లే ఆఫ్స్ బెర్తులను దాదాపుగా ఖరారు చేసుకోగా.. సన్‌రైజర్స్ (14).. సీఎస్కే, ఢిల్లీ, లక్నోల కంటే కాస్త మెరుగైన స్థానంలో ఉంది.సన్‌రైజర్స్ తదుపరి ఆడబోయే రెండు మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిచిన ప్లే ఆఫ్స్ మూడో బెర్త్ ఆ జట్టు వశమే అవుతుంది. అప్పుడు మిగిలిన నాలుగో బెర్త్ కోసం సీఎస్కే, ఢిల్లీ, లక్నో, ఆర్సీబీ నువ్వా నేనా అన్నట్లు పోటీపడాల్సి ఉంటుంది. నిన్న లక్నోపై సన్‌రైజర్స్ భారీ విజయం సాధించడంతో ఈ సీజన్లో ముంబై పోరాటం అధికారికంగా ముగిసింది. ఆ జట్టు మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నా వాటి ఫలితంతో సంబంధం లేకుండా లీగ్ నుంచి నిష్క్రమించింది.తుది జట్లు (అంచనా)..పంజాబ్: జానీ బెయిర్‌స్టో, రిలీ రొస్సో, శశాంక్ సింగ్, సామ్ కర్రన్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్‌కీపర్), అశుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్ [ఇంపాక్ట్ సబ్: ప్రభ్‌సిమ్రన్ సింగ్]ఆర్సీబీ: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్వెల్, విల్ జాక్స్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్, కర్ణ్ శర్మ, స్వప్నిల్ సింగ్, యశ్ దయాల్, విజయ్‌కుమార్ వైశాఖ్, మహ్మద్ సిరాజ్ [ఇంపాక్ట్ సబ్: రజత్ పాటిదార్]
కొడితే ఫోర్లు, సిక్సర్లే!.. ఓడిపోతే అందరూ అనేవాళ్లే!
‘‘నాకసలు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. టీవీలోనే ఇలాంటి బ్యాటింగ్ చూశాం. కానీ ఇప్పుడిలా.. అస్సలు నమ్మలేకపోతున్నాం. ప్రతి బంతి బౌండరీ లేదంటే సిక్సర్.వారి నైపుణ్యాలకు హ్యాట్సాఫ్. సిక్స్‌లు కొట్టేందుకు వాళ్లు పడిన శ్రమ ఇక్కడ కనిపిస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో అసలు పిచ్ ఎలా ఉంటుందో అంచనా వేసే ఛాన్స్ కూడా వాళ్లు మాకివ్వలేదు.మొదటి బంతి నుంచే వారి దూకుడు కొనసాగగా.. మేము ఏ దశలోనూ అడ్డుకట్ట వేయలేకపోయాం. జట్టు ఓడిపోయినట్లయితే.. మనం తీసుకున్న ప్రతీ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూనే ఉంటారు.మేము కనీసం ఇంకో 40- 50 పరుగులు చేయాల్సింది. పవర్ ప్లేలో వికెట్లు కోల్పోయిన తర్వాత అస్సలు కోలుకోలేకపోయాం. ఆయుశ్, నిక్కీ అద్భుతంగా బ్యాటింగ్ చేసినందు వల్లే 166 టార్గెట్ విధించగలిగాం’’ అని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు.ఒకవేళ తాము 240 పరుగులు చేసినా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆ లక్ష్యాన్ని ఛేదించేదేనేమో అంటూ ప్రశంసలు కురిపించాడు. కాగా ఐపీఎల్-2024 తాజా మ్యాచ్‌లో లక్నో సన్‌రైజర్స్‌తో తలపడింది.టాపార్డర్ పూర్తిగా విఫలం ఉప్పల్‌లో బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో తొలుత బ్యాటింగ్ చేసి.. పరుగులు రాబట్టేందుకు ఆపసోపాలు పడింది. ఓపెనర్, కెప్టెన్ కేఎల్ రాహుల్(29) సహా టాపార్డర్‌లో క్వింటన్ డికాక్(2), మార్కస్ స్టొయినిస్(3) పూర్తిగా విఫలమయ్యారు.నాలుగో నంబర్ బ్యాటర్ కృనాల్ పాండ్యా(21 బంతుల్లో 24) నిలదొక్కునే ప్రయత్నం చేసినా రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అతడి పప్పులు ఉడకనివ్వలేదు. దీంతో కష్టాల్లో పడిన లక్నోను నికోలస్ పూరన్(26 బంతుల్లో 48), ఆయుశ్ బదోని(30 బంతుల్లో 55) ఆదుకున్నారు.పరుగుల సునామీవీరిద్దరి భాగస్వామ్యం కారణంగానే లక్నో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేయగలిగింది. అయితే, లక్ష్య ఛేదనలో ఊహించని విధంగా పరుగుల సునామీ సృష్టించారు సన్‌రైజర్స్ ఓపెనర్లు అభిషేక్ శర్మ(28 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లు- 75 పరుగులు), ట్రావిస్ హెడ్(30 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్‌లు- 89 రన్స్).కొడితే బౌండరీ లేదంటే సిక్స్ అన్నట్లుగా సాగింది వీళ్లిద్దరి విధ్వంసం. అభిషేక్ 267.86, హెడ్ 296.67 స్ట్రైక్‌రేటుతో బ్యాటింగ్ చేయడంతో.. దెబ్బకు 9.4 ఓవర్లలోనే టార్గెట్ పూర్తి చేసింది సన్‌రైజర్స్.పాపం రాహుల్లక్నోను 10 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఇక ఈ పరుగుల విధ్వంసానికి సాక్షిగా నిలిచిన వికెట్ కీపర్ బ్యాటర్, కెప్టెన్ కేఎల్ రాహుల్ ఓటమి అనంతరం పైవిధంగా స్పందించాడు. కాగా ఓటమి నేపథ్యంలో లక్నో యజమాని సంజీవ్ గోయెంకా రాహుల్‌పై సీరియస్ అయ్యాడు. చదవండి: SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్WHAT. A. CHASE 🧡A 🔟-wicket win for @SunRisers with more than 🔟 overs to spare! Scorecard ▶️ https://t.co/46Rn0QwHfi#TATAIPL | #SRHvLSG pic.twitter.com/kOxzoKUpXK— IndianPremierLeague (@IPL) May 8, 2024
బిజినెస్
ఇక ఆ బ్యాంక్ యాప్ వాడుకోవచ్చు.. ఆర్బీఐ ఊరట
న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ)పై విధించిన ఆంక్షలను ఎత్తివేస్తూ ఆర్బీఐ ఊరట కలిగించింది. బీవోబీ వరల్డ్ మొబైల్ యాప్ ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకునేందుకు తాజాగా బీవోబీకు అనుమతినిచ్చింది.బీవోబీ వరల్డ్ యాప్ ద్వారా వినియోగదార్లను చేర్చుకోరాదంటూ 2023 అక్టోబర్ 10న ఆర్బీఐ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. వర్తించే మార్గదర్శకాలు, నిబంధనలకు అనుగుణంగా వినియోగదార్లను చేర్చుకుంటామని బీవోబీ తెలిపింది.'బీవోబీ వరల్డ్' యాప్ అనేది పెద్ద సంఖ్యలో కస్టమర్ల కోసం ఒక ప్రాథమిక ఛానెల్, వీడియో కేవైసీ ద్వారా ఖాతా తెరవడాన్ని సులభతరం చేస్తుంది. కొత్త కస్టమర్లను చేర్చుకోకుండా ఓ మొబైల్ బ్యాంకింగ్ ఛానెల్‌ని ఆర్బీఐ నిషేధించడం ఇదే తొలిసారిగా నిలిచింది. ఈ నెల ప్రారంభంలో, కొత్త కస్టమర్లను డిజిటల్‌గా ఆన్‌బోర్డ్ చేయకుండా కోటక్ బ్యాంక్‌ను కూడా ఆర్బీఐ నిషేధించింది.
World Migration Report 2024: భారత్‌కు మనవాళ్ల డబ్బేడబ్బు
ఐక్యరాజ్యసమితి: విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు స్వదేశానికి తమ సంపాదనను పంపడంలో (రెమిటెన్స్) రికార్డు సృష్టించారు. భారత్‌కు ఈ తరహా నిధులు 2022లో 111.22 బిలియన్ డాలర్లు వచ్చాయి. దీనితో ఇంత భారీ స్థాయిని అందుకున్న తొలి దేశంగా భారత్ రికార్డులకు ఎక్కింది. నిజానికి రెమిటెన్సులు 100 బిలియన్ డాలర్లు దాటిన తొలి దేశంగా కూడా భారత్ నిలిచింది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎం) ఈ మేరకు విడుదల చేసిన వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ 2024లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... » రెమిటెన్సులకు సంబంధించి భారత్ తరువాతి నాలుగు స్థానాల్లో మెక్సికో(61 బిలియన్ డాలర్లు), చైనా (51 బిలియన్ డాలర్లు), ఫిలిప్పైన్స్, ఫ్రాన్స్ నిలిచాయి. 2021లో చైనా స్థానాన్ని 2022లో మెక్సికో అధిగమించింది. » దక్షిణాసియా నుంచి చాలా పెద్ద సంఖ్యలో వలస కార్మికులు ఉన్నందున ఈ ప్రాంతం ప్రపంచవ్యాప్తంగా రెమిటెన్స్‌కు సంబంధించి అతిపెద్ద మొత్తాలను పొందుతోంది. దక్షిణాసియాలో భారత్‌తోపాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లు రెమిటెన్సులకు సంబంధించి టాప్–10 దేశాల్లో ఉన్నాయి. అంతర్జాతీయంగా పాకిస్తాన్ 30 బిలియన్ డాలర్లతో ఆరవ స్థానంలో ఉండగా, బంగ్లాదేశ్ 21.5 బిలియన్ డాలర్లతో ఎనిమిదవ స్థానంలో నిలుస్తోంది. » 44.8 లక్షల మంది వలసదారుల గమ్యస్థాన దేశంగా భారతదేశం 13వ స్థానంలో నిలిచింది. » విద్యార్థులను ఆకర్షించడంలో తొలి దేశంగా అమెరికా (8,33,000) ఉంది. తరువాతి స్థానాల్లో బ్రిటన్ (దాదాపు 6,01,000), ఆస్ట్రేలియా (దాదాపు 3,78,000), జర్మనీ (3,76,000 పైగా), కెనడా (దాదాపు 3,18,000) ఉన్నాయి.భారత్ పయనమిలా... (అంకెలు బిలియన్ డాలర్లలో) 2010 53.48 2015 68.91 2020 83.15 2022 111.22
భారత్‌లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
న్యూఢిల్లీ: గూగుల్ తన డిజిటల్ వాలెట్ అప్లికేషన్ గూగుల్ వాలెట్‌ను భారత్‌లో విడుదల చేసింది. గూగుల్ ఈ యాప్‌ను తొలిసారి 2022లో అమెరికాలో లాంచ్ చేసింది. రెండు సంవత్సరాల తర్వాత భారత్ వినియోగదారులకు పరిచయం చేసింది. గూగుల్ వాలెట్అంటే ఏమిటి?గూగుల్ వాలెట్ వివిధ డిజిటల్ ఆస్తులను ఒకే అనుకూలమైన ప్రదేశంలో స్టోర్ చేసుకునేందుకు అనుమతిస్తుంది. యాప్‌లో బోర్డింగ్ పాస్‌లు, లాయల్టీ కార్డ్‌లు, ఈవెంట్ టిక్కెట్లు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పాస్‌లు, గిఫ్ట్ కార్డ్‌లు ఇతర డిజిటల్ డాక్యుమెంట్లను భద్రపరుచుకోవచ్చు. గూగుల్పేపై ప్రభావం గూగుల్ వాలెట్ లాంచ్‌తో గూగుల్ పే యాప్ పనిచేస్తోందా? అనే అనుమానాలపై గూగుల్ స్పందించింది. గూగుల్ వాలెట్ వల్ల గూగుల్ పే వల్ల ఎలాంటి ప్రతి కూల ప్రభావం చూపదని గూగుల్ స్పష్టం చేసింది. గూగుల్ పేకి, గూగుల్ వాలెట్‌కి మధ్య తేడా చెల్లింపు కార్డ్‌లను గూగుల్ వ్యాలెట్‌కు అనుసంధానిస్తే.. గూగుల్ పే పనిచేసే ఎక్కడైనా ఆఫ్‌లైన్‌లో చెల్లింపులు చేయొచ్చు. ప్రధాన కంపెనీలతో భాగస్వామ్యం పీవీఆర్ ఐనాక్స్, ఫ్లిప్‌కార్ట్, ఎయిర్ ఇండియా, షాపర్స్ స్టాప్, ఇక్సిగోతో పాటు ఇతర కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు భారతదేశంలో గూగుల్ వాలెట్ ప్రారంభించిన సందర్భంగా గూగుల్ ప్రకటించింది.ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి గూగుల్ వాలెట్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. డెబిట్ కార్డ్‌లు, క్రెడిట్ కార్డ్‌లు, లాయల్టీ కార్డ్‌లు, గిఫ్ట్ కార్డ్‌లను ఒక అనుకూలమైన ప్లాట్‌ఫారమ్‌లో నిల్వ చేయడానికి దాన్ని ఉపయోగించవచ్చు.
ఉద్యోగుల తొలగింపు..టీసీఎస్‌లో అసలేం జరుగుతోంది?
ప్రముఖ టెక్ దిగ్గజం టీసీఎస్ ఉద్యోగుల తొలగింపు మరోసారి చర్చకు దారి తీసింది. గతేడాది ‘లంచాలకు ఉద్యోగాలు’ కుంభకోణంలో పలువురికి ఉద్వాసన పలకగా.. తాజాగా భద్రత పేరుతో అనుమానం ఉన్న ఉద్యోగుల్ని తొలగించడం టెక్ విభాగంలో చర్చాంశనీయంగా మారింది. భద్రత పేరుతో టీసీఎస్ తమను ఉద్యోగాల నుంచి తొలగించిందంటూ పలువురు ఉద్యోగులు సోషల్ మీడియాలో వాపోతున్నారు.రెడ్డిట్ పోస్ట్‌ల ప్రకారం.. లేఆఫ్స్ ఇచ్చిన ఉద్యోగులు వ్యక్తిగత ల్యాప్‌ట్యాప్‌లను ఉపయోగించి వారి సున్నితమైన లాగిన్ క్రెడిన్షియల్స్‌ను షేర్ చేశారని, భద్రత దృష్ట్యా వారిని తొలగించినట్లు మేనేజర్ ఆరోపిస్తున్నట్లు సదరు బాధిత ఉద్యోగులు రెడ్డిట్ పోస్ట్‌లో తెలిపారు. I got suspended from tcs today because of a security incident which was reported by me byu/Personal_Stage4690 indevelopersIndia తమను ఉద్యోగం నుంచి ఎందుకు తొలగించారని ప్రశ్నించినప్పుడల్లా క్లయింట్ అడ్రస్‌లు షేర్ చేయడం, వ్యక్తిగత ల్యాప్‌టాప్‌లను ఉపయోగించడం, వాట్సాప్‌లో కమ్యూనికేట్ చేయడం ఇలా ప్రతిదానిపై నిందలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఉద్యోగుల తొలగింపులపై టీసీఎస్ ఎలాంటి ప్రకటన చేయలేదు. I got suspended from tcs today because of a security incident which was reported by me byu/Personal_Stage4690 indevelopersIndia
వీడియోలు
కర్నూలు బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగం ముఖ్యాంశాలు
ఆ గ్యాంగ్ ను ఏకిపారేసిన వల్లభనేని వంశీ
Watch Live: కళ్యాణదుర్గంలో సీఎం జగన్ ప్రచార సభ
పొరపాటున బాబుకు ఓటేస్తే..జరిగేది ఇదే..
చంద్రబాబుకు ఊడిగం చేయడానికే పవన్ రాజకీయాల్లోకి వచ్చారు
ముస్లిం రిజర్వేషన్లపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
వీళ్ళే మన అభ్యర్థులు.. గెలిపించాల్సిన బాధ్యత మీదే..
సీఎం జగన్ రాకతో దద్దరిల్లిన కర్నూలు
చంద్రబాబుది ఊసరవెల్లి రాజకీయం..బాబు బాగా ముదిరిపోయిన తొండ
కూటమిపై గర్జించిన సీఎం జగన్.. దద్దరిల్లిన రాయలసీమ గడ్డ..
ఫ్యామిలీ
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
టాలీవుడ్ రౌడీ హీరోగా పేరుగాంచిన విజయ్ దేవకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చూడటానికి మంచి స్టైయిలిష్ లుక్‌తో కండలు తిరిగిన బాడీతో మంచి ఫిట్నెస్గా ఉంటాడు. అమ్మాయిల కలల రాకుమారుడిలా క్రేజీ లుక్‌తో ఎట్రాక్ట్ చేస్తుంటాడు. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న ఈ రౌడీ హీరో పిట్ నెస్ రహస్యం ఏంటో తెలుసుకుందామా..!వర్కౌట్లు..కండలు తిరిగిన టోన్డ్ ఫిజిక్‌ని మెయింటెయిన్ చేసేందుకు తీవ్రమైన వ్యాయామాలు చేస్తుంటారు. ముఖ్యంగా అధిక బరువులు, కార్డియో ఫంక్షన్లకు సంబంధించిన వ్యాయామాలు ఎక్కువగా చేస్తుంటాయడు. ప్రతిరోజు కనీసం రెండు గంటలు వర్కౌట్లకు కేటాయిస్తాడు. ముఖ్యంగా మనస్సు, శరీరం ప్రశాంతంగా ఉండేలా యోగా, మెడిటేషన్ వంటివి తప్పనిసరి. డైట్ ప్లాన్..విజయ్ చాలా స్ట్రిక్ట్ డైట్ ప్లాన్‌ని ఫాలో అవుతాడు. ఇందులో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. పిండి పదార్థాలు, కొవ్వులు తక్కువగా ఉండే ఆహారానికే ప్రాధాన్యత ఇస్తాడు. ముఖ్యంగా జీవక్రియను చురుకుగా ఉంచేందుకు అతిగా తినకుండా ఉండేలా జాగ్రత్త పడుతుంటాడు. ముఖ్యంగా రోజంతా చిన్న చిన్నగానే భోజనం తీసుకుంటాడు. ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర పానీయాలకు దూరంగా ఉంటాడు. హైడ్రేటెడ్‌గా ఉండటానికి పుష్కలంగా నీరు తాగుతుంటాడు.ఇక్కడ విజయ్ దేవరకొండలా పిట్‌గా ఉండాలంటే మంచి ఫిజిక్, తీవ్రమైన వర్కౌట్లు, స్ట్రిక్ట్ డైట్ ప్లాన్లు అవసరం అనేది గ్రహించాలి. అలా అని ఎలా పడితే అలా చేసేయ్యకూడదు. ఫిట్నెస్ కోచ్‌లు, ఆరోగ్య నిపుణులు పర్యవేక్షణలో సలహాలు, సూచనలతో సరైన విధంగా వర్కౌట్లు చేయాల్సి ఉంటుంది. అలాగే అందుకు తగ్గట్టుగా తీసుకునే డైట్ కూడా నిపుణుల సలహాలు మేరకు తీసుకోవాలినేది గ్రహించాలి. అందరికి ఒకలాంటి డైట్‌ప్లాన్‌లు వర్కౌట్లు సరిపోవు. ఇక్కడ ఆయా వ్యక్తుల ఆరోగ్య చరిత్ర, ఫేస్ చేసే హెల్త్ సమస్యలు తదితరాలను పరిగణలోనికి తీసుకుని ఎలాంటి వర్కౌట్ సెషన్లు మంచివి, ఎలాంటి ఆహారం తీసుకోవడం మంచిది అనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి వాటన్నింటిని పరిగనలోనికి తీసుకుని ఫాలో అవ్వడం మంచిది. (చదవండి: భారతదేశంలో బ్యాన్ చేసిన ఆహార పదార్థాలు ఇవే..!)
పెదవుల నిగారింపుకై.. ఇలా చేస్తే చాలు..!
పెరుగుతున్న ఎండవేడికి చర్మంతోపాటు, పెదవులపై నలుపు రంగు పేరుకుపోతూంటుంది. పెదవులపై చీలికలతో పాటు మెరిసేతత్వం కూడా తగ్గుతుంది. మరి పెదవులు సహజంగా, కోమలంగా ఉండాలంటే ఈ ట్రిక్స్ ట్రై చేయండి..!ఇలా చేయండి..రోజూ ఉదయాన్నే బ్రష్ చేసిన తరువాత.. బ్రష్ మీద కొద్దిగా తేనె వేసి రెండు పెదవులపైన గుండ్రంగా ఐదు నిమిషాలపాటు రుద్దాలి. ఇలా రోజూ చేయడం వల్ల పెదవులపై పేరుకుపోయిన మృతకణాలు తొలగిపోతాయి. మర్ధన వల్ల రక్తప్రసరణ సక్రమంగా జరిగి పెదవులు మృదువుగా మారతాయి.ఉదయం బ్రష్‌తో మర్దన చేసాక, రాత్రి పడుకునేముందు మాయిశ్చరైజర్ తప్పనిసరిగా రాయాలి. ఇందుకోసం.. కొద్దిగా బీట్రూట్ రసాన్ని వేడి చేయాలి. వేడిచేసిన రసంలో అర టీస్పూను కార్న్‌ఫ్లోర్ వేసి ఐదు నిమిషాలపాటు బాగా కలిపి దించేయాలి. తరువాత ఈ మిశ్రమంలో అర టీస్పూను గ్లిజరిన్, పావు టీస్పూను కొబ్బరి నూనె కలిపి ఎయిర్‌టైట్ కంటైనర్‌లో నిల్వచేయాలి. ఈ మిశ్రమం గట్టిపడిన తరువాత పెదవులకు రాసి మర్ధన చేసి పడుకోవాలి. ఉదయం నీటితో కడిగేయాలిఈ రెండింటిని ఒకదాని తరువాత ఒకటి క్రమం తప్పకుండా పాటిస్తే పెదవులు గులాబి రేకుల్లా కోమలంగా పింక్ కలర్లో ఆకర్షణీయంగా కనిపిస్తాయి.ఇవి చదవండి: Beauty Tips: కనురెప్పల సోయగానికై.. ఇలా చేయండి!
భారతదేశంలో బ్యాన్ చేసిన ఆహార పదార్థాలు ఇవే..!
భారతదేశం విభిన్న సంస్కృతులతో భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా ఉంటుంది. విభిన్న పాక శాస్త్రాలను ప్రొత్సహించి రుచులను ఆస్వాదిస్తుంది. అయితే ప్రజారోగ్యం దృష్ట్యా దేశవ్యాప్తంగా కొన్ని రకాల ఆహార పదార్థాలను బ్యాన్ చేసింది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ). ఆ ఆహార పదర్థాలేంటీ? ఎందుకు వాటిని బ్యాన్ చేశారు వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందాం.పర్యావరణ ప్రభావాలు, ఆరోగ్య సమస్యలు దృష్ట్యా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) భారతదేశమంతటా కొన్ని రకాల ఆహార పదార్థాలను పూర్తిగా బ్యాన్ చేసింది. అవేంటంటే..చైనీస్ పాల ఉత్పత్తులు..చైనాలో ఆహార భద్రత కుంభకోణాలు, కాలుష్య సమస్యలకు సంబంధించిన అనేక సంఘటనలు వెలుగులోకి రాడవంతో ఎప్ఎస్ఎస్ఏఐ 2008లో చైనీస్ పాల ఉత్పత్తులు, శిశు ఫార్ములాతో సహా భారతదేశం నిషేధించింది. ప్రోటీన్ స్థాయిలన పెంచేలా మెలమైన్ విషపూరిత రసాయనం వంటి కలుషితాలను గుర్తించడంతోనే నిపుణులు చైనీస్ పాల ఉత్పత్తుల అమ్మకాలను నిషేధించారు. ఇవి ప్రజల ఆరోగ్యాన్ని తీవ్ర ప్రమాదంలోకి నెట్టేస్తాయని పరిశోధనలో తేలింది కూడా. జన్యు పరంగా మార్పు చెందిన ఆహారాలు..పర్యావరణ ప్రభావం, జీవ వైవిధ్య నష్టం, ఆరోగ్య ప్రమాదాల ఆందోళన నేపథ్యంలో జన్యుపరంగా మార్పు చెందిన పంటలు, ఆహారా సాగు, దిగమతులపై భారతదేశం ఆంక్షలు విధించింది. బీటీ పత్తి వంటి జన్యు మార్పు పంటల వాణిజ్య సాగుకు అనుమతి ఉన్నప్పటికీ..ఆయా ఆహార పంటలకు ఆమోద ప్రక్రియ చలా కఠిన షరతులతో ఉంటుంది. దీర్థకాలికా ఆరోగ్యం పర్యావరణ పరిణామాలపై ప్రభావం చూపిస్తాయనేది పలువురు నిపుణులు వాదన. పోటాషియం బ్రోమేట్..2016లో ఎఫ్ఎస్ఎస్ఏఐ ఈ పోటాషియం బ్రోమేట్ వాడకాన్ని నిషేధించింది. ఇది పిండి స్థితిస్థాపక తోపాటు రొట్టె పరిమాణాన్ని మెరుగుపరచడానికి ఉపయోగించే ఆహార సంకలితం. అయితే దీనివల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ ఉందని అధ్యయనాల్లో తేలింది. ఇది ఎక్కువగా థైరాయిడ్ కేన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని, ముఖ్యంగా బ్రెడ్ వంటి బేకరీ ఉత్పత్తుల్లో దీని వినియోగాన్ని నిషేధించమని అధికారులు సూచించారు.పండ్లను పక్వానికి వచ్చేలా చేసే కృత్రిమ కారకాలు..పండ్లను కృత్రిమంగా పండిచేందుకు వాడే కాల్షియం కార్బైడ్, ఇథిలీన్ గ్యాస్ వంటి రసాయన కారకాలు కారణంగా ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని భారతదేశం వీటిని నిషేధించింది. ఈ కాల్షియం కార్బైడ్ పండ్లు పక్వానికి వచ్చే ప్రక్రియలో ఎసిటిలిన్ వాయువుని విడుదల చేస్తుందని, ఇది కేన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. పోయ్ గ్రాస్‌పోయ్ గ్రాస్ దాని ఉత్పత్తి ప్రక్రియకు సంబంధించిన ఆందోళన కారణంగా నిషేదించారు. ఇది బాతులు లేదా పెద్ద బాతులు వాటి కాలేయాలను పెంచడానికి బలవంతంగా ఈ గ్రాస్‌ని ఇవ్వడంపై జంతు సంక్షేమవాదు ఆందోళనలు లేవనెత్తారు. ఇది అవమానవీయ చర్యగా పేర్కొన్నారు. ఈ పోయ్ గ్రాస్ అమ్మకం, దిగుమతిని నిషేధించడం జరిగింది. రెసిపీల కోసం వాటిని హింసించేలా ఇలాంటి గ్రాస్‌తో ఫీడ్ చేయడం అనేది హింసతో సమానమని చెబుతోంది. రెడ్ బుల్ ఎనర్జీ డ్రింక్రెడ్ బుల్ కెఫిన్, టౌరిన్ వంటివి ఇతర ఉత్ప్రేరకాలు కలిగి ఉన్న ఒక ప్రముఖ ఎనర్జీ డ్రింక్. దీనిలో కెఫీన్ కంటెంట్ కారణంగా 2006లో ఎఫ్ఎస్ఎస్ఏఐ భారతదేశమంతటా నిషేధించింది. నిజానికి కెఫిన్ వినియోగం సురక్షితమైన ఈ రెండ్‌బుల్ ఎనర్జీ డ్రింక్స్ అధికంగా తీసుకుంటే గుండె కొట్టుకునే రేటు పెరగడం, రక్తపోటు పెరగడం, నిర్జలీకరణం వంటి ప్రతికూల ప్రభావాలకు దారితీసే ప్రమాదం ఎక్కువ. సస్సాఫ్రాస్ ఆయిల్‌సాసఫరస్ ఆయిల్లో అధిక ఎరుసిక్ యాసిడ్ కంటెంట్ ఉన్నందున 2003లో ఎఫ్ఎస్ఎస్ఏఐ నిషేధించింది. ఇది గుండె జబ్బులతో సహా ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తుంది. ఈ నూనెలో ఎరుసిక్ యాసిడ్ స్థాయిలు పరిమితికి మించి ఉండటంతో హృదయ ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉండటంతోనే అధికారులు దీన్ని నిషేధించారు. చైనీస్ వెల్లుల్లి..2019లో చైనా నుంచి దిగుమతి చేసిన వెల్లుల్లిలో పురుగుమందుల అవశేషాలు ఎక్కువగా ఉన్నాయని ఆందోళనలు రావడంతో ఎఫ్ఎస్ఎస్ఏఐ ఈ చైనీస్ వెల్లుల్లి దిగుమతిని భారతదేశంలో నిషేధించారు. ఈ వెల్లుల్లిలో పరిమితికి మించి పురుగుల మందుల అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు నిపుణుల. ఇది వినియోగదారుల ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది. ప్రజలు హానికరమైర రసాయనాలకు గురికాకుడదన్న ఉద్దేశ్యంతోనే ఈ నియంత్రణ చర్యలు తీసుకున్నారు అధికారులు. బ్రోమినేటెడ్ వెజిటబుల్ ఆయిల్ ..బ్రోమినేటెడ్ వెజిటబుల్ ఆయిల్ కొన్ని పానీయాలకు జోడించడం జరగుతుంది. ఉదాహరణకు సిట్రస్-ఫ్లేవర్ సోడాలు, సువాసనల కోసం వినియోగిసతఆరు. ఈ నూనెలో బ్రోమిన్ ఉంటుంది. ఇది నాడీ సంబంధిత లక్షణాలు, థైరాయిడ్ రుగ్మతలు వంటి ఆరోగ్య సమస్యలకు దాస్తుంది. అందువల్ల దీన్ని ఆహారం, పానీయాలలో వినియోగించటాన్ని నిషేధించాయి లేదా పరిమితం చేశాయి. కుందేలు మాంసం..ప్రధానంగా జంతు సంక్షేమం, మతపరమైన ఆందోళనల కారణంగా కుందేలు మాంసం భారతదేశంలో నిషేధించడం జరిగింది. జనాభాలో మెజారిటీగా ఉన్న హిందువులు కుందేలును పవిత్రమైన జంతువుగా భావిస్తారు. అందువల్దాల దీన్ని మాంసాన్ని ఇక్కడ ఎవరూ తినరని చెప్పొచ్చు . జంతు సంక్షేమ నిబంధనల దృష్ట్యా కుందేలు మాంసం అమ్మకాలను నిషేధించింది భారత్.అందువల్ల ఇలాంటి పదార్థాలు పొరపాటున కనిపించిన కొనద్దు. ఎక్కడైన విక్రయిస్తున్నట్లు తెలిసినా సంబంధిత అదికారులకు ఫిర్యాదు చేయడం వంటివి చేయండి. అందరి ఆరోగ్యాన్ని కాపాడేందుకు మన వంతుగా కృషి చేద్దాం.(చదవండి: బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్‌లు)
కనురెప్పల సోయగానికై.. ఇలా చేయండి!
ఆర్టిఫీషియల్ ఐ లాషెస్తో కళ్లను మీనాల్లా మెరిపించవచ్చని తెలిసినాకూడా వాటిని ఎలా అమర్చుకోవాలో అర్థం కాక ఇబ్బంది పడుతుంటే... ఒకసారి ఇలా ట్రై చేయండి.ఆర్టిఫీషియల్ ఐ లాషెస్ (సౌందర్య సాధనాల మార్కెట్లో దొరుకుతాయి) ఒక సెట్, వాటిని అమర్చడానికి ఐలాష్ గ్లూ తీసుకోవాలి.వీటితోపాటు కత్తెర, ట్వీజర్, ఐ లాష్ కర్లర్, ఐ లైనర్, మస్కారా తీసుకోవాలి.ఆర్టిఫీషియల్ ఐ లాషెస్ మరీ పొడవుగా ఉన్నట్లనిపిస్తే తగినంత మేరట్రిమ్ చేయాలి.ట్వీజర్ సహాయంతో లాషెస్‌కు గ్లూ పట్టించాలి. ఇప్పుడు వాటిని జాగ్రత్తగా కనురెప్ప మీద అమర్చాలి. గ్లూ ఆరి లాషెస్ సెట్ అయ్యే వరకు ఆగాలి. స్కిన్‌కు అంటుకోకుండా గ్లూవిడిగా ఆరిపోతున్నట్లు అనిపించినా, ఆరాక ఊడి వచ్చేటట్లు అనిపించినా కనురెప్పల మీద ఆర్టిఫీషియల్ లాషెస్ కరెక్ట్‌గా సెట్ అయ్యేటట్లు మెల్లగా నొక్కాలి.గ్లూ ఆరిన తర్వాత లాషెస్‌కు డార్క్‌షేడ్ ఐ లైనర్ అప్లయ్ చేయాలి. ఇలా చేయడం వల్ల అసలు కనురెప్పలకు, ఆర్టిఫీషియల్ లాషెస్‌కు మధ్య తేడా కనిపించకుండా అంతా ఒకేలా ఉంటాయి.చివరగా ఐలాష్ కర్లర్‌తో వంపు తిప్పాలి. అవసరమనిపిస్తే (మరింతడార్క్గా కనిపించాలనుకుంటే) మస్కారా అప్లయ్ చేయాలి.ఇవి చదవండి: మొలకలతో బోలెడన్ని ప్రయోజనాలు, ఈ సైడ్ ఎఫెక్ట్స్ తెలుసుకోండి!
న్యూస్ పాడ్‌కాస్ట్
దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా కనిపిస్తారు... కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై తీవ్ర దుమారం.. ఇంకా ఇతర అప్డేట్స్
నేడు వేములవాడకు నరేంద్ర మోదీ... రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్న ప్రధానమంత్రి... ఇంకా ఇతర అప్డేట్స్
క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
భూమి లాక్కున్నట్లు ఒక్క రైతయినా చెప్పాడా అంటూ చంద్రబాబు, ఎల్లో మీడియాకు సీఎం జగన్ సూటి ప్రశ్న.. ఇంకా ఇతర అప్డేట్స్
నాకు బిడ్డలు లేరు, ప్రజల బిడ్డల కోసమే నా తపన.. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటన.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం పట్ల ఎన్నికల సంఘం సీరియస్.. తక్షణం దర్యాప్తు చేసి, చర్యలు తీసుకుని నివేదిక ఇవ్వాలని సీఐడీకి ఆదేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
అవ్వాతాతల పెన్షన్లపై చంద్రబాబు పాపిష్టి కళ్లు.. నరసాపురం, క్రోసూరు, కనిగిరి ప్రచార సభల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం.. ఇంకా ఇతర అప్డేట్స్
కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు పాకిస్తాన్ ఆరాటం.. గుజరాత్ ప్రచారంలో ప్రధాని మోదీ విమర్శలు.. ఇంకా ఇతర అప్డేట్స్
తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై నిషేధం.. 48 గంటలపాటు ప్రచారం ఆపేయాలన్న కేంద్ర ఎన్నికల సంఘం .. ఇంకా ఇతర అప్డేట్స్
చంద్రబాబుది బోగస్ రిపోర్ట్.. జగన్‌ది ప్రోగ్రెస్ రిపోర్ట్... టంగుటూరు, మైదుకూరు, కలికిరి ఎన్నికల సభల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టీకరణ.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
రాసలీలల రామ్మోహన్!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ తూర్పు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహనరావు మహిళలపై లైంగిక వేధింపుల వ్యవహారం బట్టబయలైంది. పలువురు మహిళలతో అసభ్యకరంగా చాటింగ్ చేసినట్టు వెల్లడైంది. ప్రస్తుతం వాట్సప్ చాటింగ్, స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విజయవాడలోని వివిధ వాట్సప్ గ్రూపుల్లో, ఫేస్ బుక్ పేజీల్లో, ఇన్‌స్ట్రాగాం వేదికల్లో అవి చక్కెర్లు కొడుతుండటంతో ఆయన లీలలపై తూర్పు నియోజకవర్గ ఓటర్లు ముక్కున వేలేసుకుంటున్నారు. మహిళా ఓటర్లయితే గద్దెకు గుణపాఠం చెబుతామని స్పష్టం చేస్తున్నారు. ఇన్నాళ్లకు గద్దె నిజ స్వరూపం బట్ట బయలైందని టీడీపీ వర్గీయులే వ్యాఖ్యానించిడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయనకు 15 ఏళ్లుగా అనుచరుడిగా ఉన్న ఒకరు ఆయన రాసలీలల వ్యవహారాలను ఆధారాలతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం విజయవాడ నగరంలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల గద్దె ప్రధాన అనుచరుడు మహిళలను వేధింపులకు గురిచేసి, దాడి చేయడంతో పటమట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఏకంగా గద్దె వాట్సప్ చాటింగ్ వెలుగులోకి రావడంతో టీడీపీ ఆత్మరక్షణలో పడింది. ఇప్పటికే తూర్పు నియోజక వర్గంలో గద్దె గ్రాఫ్ పడిపోవడంతో తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వాట్సప్ చాటింగ్స్ వ్యవహారం వెలుగులోకి రావడంతో తూర్పు నియోజకవర్గంలో టీడీపీ ఓటమి ఖాయమని ఆ పార్టీ నాయకులే తేల్చిచెబుతున్నారు.
ఈత సరదా ప్రాణం తీసింది
వైఎస్సార్: లింగాల మండలం తాతిరెడ్డిపల్లెలో ఈత నేర్చుకోవాలని చిన్నారి సరదా పడగా... ప్రమాదవశాత్తూ ఆమె ప్రాణం తీసింది. స్థానికుల వివరాల మేరకు.. తాతిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన తోట రవీంద్రారెడ్డి, మంజుల దంపతుల కుమార్తె మహిత(12) బుధవారం గ్రామంలోని చెరువులో ఈత నేర్చుకునేందుకు తోటి పిల్లలతో కలిసి వెళ్లింది.నడుముకు ఖాళీ క్యాన్ కట్టుకుని చెరువులో ఈత కొట్టేందుకు దిగారు. ఆ సమయంలో నడుముకు ఉన్న క్యాన్ ఊడిపోయింది. అక్కడున్న పిల్లలు, పెద్దలు చూస్తుండగానే భయానికి గురైన మహిత నీటిలో మునగగానే మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. కుమార్తె మృతిచెందడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
యశవంతపుర: అంబులెన్స్– కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన దుర్ఘటన కర్ణాటక– కేరళ సరిహద్దుల్లోని కాసరగోడులో మంగళవారం జరిగింది. మృతులను కేరళ త్రిసూరు జిల్లా గురువాయురుకు చెందిన శ్రీనాథ్ (54), ఆయన కొడుకులు శరత్ (18), మనన్ (15) గుర్తించారు శ్రీనాథ్ దుబాయ్‌లో ఉద్యోగం చేస్తూ సెలవులు పెట్టి ఊరికి వచ్చాడు. ఆయన భార్య స్మిత అక్కడే ఓ ఇంటర్నెట్ సెంటర్ నిర్వహిస్తున్నారు. ఆమెకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో వారితో పాటు రాలేకపోయారు. ఈ క్రమంలో ముగ్గురూ కలిసి బెంగళూరులో బంధువులను కలవాలని బయల్దేరారు. ముగ్గురూ కారులో కొల్లూరు మూకాంబిక ఆలయంలో అమ్మవారి దర్శనం చేసుకుని వెళుతుండగా, మంజేశ్వర వద్ద ఎదురుగా వేగంగా వచ్చిన అంబులెన్స్ ఢీకొట్టింది. ఆ ధాటికి రెండు వాహనాలూ పలీ్టలు కొట్టాయి. తండ్రీ కొడుకులు కారులోనే దుర్మరణం చెందారు. అంబులెన్స్ డ్రైవర్, ఇద్దరికి కూడా గాయాలు తగిలాయి. ప్రమాదం ఊళ్లోనే జరగడంతో పెద్దసంఖ్యలో జనం పోగయ్యారు. పోలీసులు చేరుకుని మృతదేహాలను, బాధితులను ఆస్పత్రులకు తరలించారు. ఘటనాస్థలమంతా రక్తసిక్తమై భీతావహంగా మారింది. ఈ విషయాన్ని ఊళ్లోని శ్రీనాథ్ భార్యకు ఇంకా చెప్పలేదని, ఇంత ఘోరం జరుగుతుందనుకోలేదని మృతుల బంధువుల విలపించారు.
కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని ప్రత్యేక కోర్టు మరోసారి పొడిగించింది. ఈడీ కేసులో ఈ నెల 14వ తేదీ వరకు.. సీబీఐ కేసులో ఈ నెల 20వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసుల్లో ఇంతకు ముందు విధించిన జ్యుడీషియల్ కస్టడీ గడువు ముగియడంతో.. అధికారులు కవితను రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున కస్టడీ పొడిగించాలని ఈడీ తరఫు న్యాయవాది నవీన్‌కుమార్ మట్టా కోరారు.కుంభకోణంలో కవిత పాత్రపై ఒకట్రెండు రోజుల్లో చార్జిషీటు దాఖలు చేస్తామని కోర్టుకు వివరించారు. మరోవైపు సీబీఐ కేసులో న్యాయవాది పంకజ్ గుప్తా వాదనలు వినిపిస్తూ.. కవితతో సంబంధాలు ఉన్న మరికొందరిని విచారించాల్సి ఉందని, దర్యాప్తు సజావుగా సాగాలంటే జ్యుడీషియల్ కస్టడీ పొడిగించాలని కోరారు. ఇక ఈడీ కేసులో కవిత తరఫు న్యాయవాది నితీశ్‌రాణా వాదనలు వినిపిస్తూ.. కుటుంబ సభ్యులు కవితతో 15 నిమిషాలు మాట్లాడటానికి అనుమతించాలని కోరారు. కోర్టు లాకప్‌లో పిటిషనర్ భర్త తీసుకొచ్చిన ఆహారాన్ని అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. జైలుకు పంపుతున్న ఇంటి భోజనాన్ని కూడా జైలు సూపరింటెండెంట్ ఒక్కరే తనిఖీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే న్యాయమూర్తి జోక్యం చేసుకుని.. కవితకు ఇంటి భోజనం నిలిపివేశాక కూడా మళ్లీ ఎందుకు అడుగుతున్నారని, దీనిపై జైలు సూపరింటెండెంట్ వివరణ ఇవ్వాలని ఆదేశించారు. తర్వాత కవిత జ్యుడీషి యల్ కస్టడీలను పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కవితకు చదువుకోవ డానికి పది పుస్తకా లను అనుమతించాల ని జైలు అధికారులకు సూచించారు. ఈడీ, సీబీఐ కేసులలో ప్రత్యేక కోర్టుకు కవితకు బెయిల్ నిరాకరించిన నేపథ్యంలో.. ఆమె న్యాయవా దులు బుధవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించినట్టు తెలిసింది.నా అరెస్టు అన్యాయం: కవితఅధికారులు ప్రత్యేక కోర్టు ప్రాంగణంలోకి కవితను తీసుకువచ్చినప్పుడు.. ‘జైతెలంగాణ.. జై భారత్’ అంటూ నినాదాలు చేశారు. కోర్టు హాల్ నుంచి బయటకు వస్తున్న సమయంలో.. ప్రజ్వల్ రేవణ్ణ వంటి వాళ్లను దేశం దాటించి, తనలాంటి వారిని అరెస్టు చేయడం అన్యాయమని కవిత వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని పేర్కొన్నారు.