Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Watch Live AP CM YS Jagan Public Meeting At Kurnool
Watch Live: కర్నూలులో సీఎం జగన్ ప్రచార సభ

Watch Live: కర్నూలులో సీఎం జగన్ ప్రచార సభ

vallabhaneni vamsi satires on chandrababu tdp leaders at gannavaram
ఆరోజు నేను అసలు అసెంబ్లీలోనే లేను: వల్లభనేని వంశీ

సాక్షి, కృష్ణా : పవన్ రాజకీయాలను మారుస్తానంటారని, రాజకీయ పార్టీ అధినేతగా సమాచారం తెలుసుకుని మాట్లాడాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ అన్నారు. ఎవరో చెప్పిన మాటలు విని గోబెల్స్ ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు. గన్నవరం మండలంలో గురువారం వల్లభనేని వంశీ ఎన్నికల ప్రచారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నారా భువనేశ్వరిని నేను ఎప్పుడూ ఒక్కమాట అనలేదు. నేను అన్నట్లు విన్నారా... చూశారా... వీడియో ఉందా?. లోకేష్ నన్ను, నా కుంటుంబ సభ్యులపై ఐటీడీపీతో సోషల్ మీడియాలో వార్తలు రాయించాడు. ఇలాంటి సంస్కృతి మంచిది కాదని లోకేష్‌కు చెప్పా. నేను అసెంబ్లీలో భువనేశ్వరి గురించి మాట్లాడారని పవన్ అంటున్నారు. ఆరోజు నేను అసలు అసెంబ్లీలోనే లేను. ఐఎస్‌బీ మొహాలీలో కోర్సు కోసం పంజాబ్‌లో ఉన్నా. పవన్ మాటలు హాస్యాస్పదం. ఎవరో చెప్పిన మాటలు విని పవన్ మాట్లాడటం సరికాదు. నేను అనని మాట నాకు ఆపాదించారు. నేను ఎవరినీ ఏమీ అనకపోయినా క్షమాపణ చెప్పాను. కానీ కొందరు లోకేష్ దగ్గరకు వెళ్లి మీ అమ్మను అన్నారంటూ తప్పుడు సమాచారం ఇచ్చారు’’ అని వంశీ తెలిపారు.చంద్రబాబు, టీడీపీ నేతల పై వంశీ సెటైర్లు‘‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్రం పార్లమెంట్‌లో పెట్టింది. పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందాక రాష్ట్రాలు అంగీకరించాల్సిందే. చంద్రబాబు, టీడీపీ నేతలు ఇప్పుడే కళ్లు తెరిచినట్లు మాట్లాడుతున్నారు. పార్లమెంట్‌లో, అసెంబ్లీలో మద్దతిచ్చింది వీళ్లే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై కావాలనే రాద్ధాంతం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు చెప్పుకోవడానికి ఏమీ లేదు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పని కూడా గుర్తుకురాదు. చంద్రబాబు విద్వేషంతో అబద్ధపు ప్రచారం చేస్తున్నాడు. గత మూడు ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేశా. తొలిసారి వైసీపీ తరపున పోటీచేస్తున్నా. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ఎన్నికల్లో చంద్రబాబు ఏం చెబితే అదే ప్రజలకు చెప్పేవాళ్లం. అధికారంలోకి వచ్చాక ఏం చేయలేకపోయేవాళ్లం. చంద్రబాబు రుణమాఫీ చేస్తానన్నాడు... చేయలేదు. బ్యాంకుల్లో బంగారం విడిపిస్తానన్నాడు... చేయలేదు. బాబు వస్తే జాబు అన్నాడు... ఎవరికీ జాబు రాలేదు’’అని వంశీ మండిపడ్డారు. ఇక.. మానవ వనరుల అభివృద్ధితోనే సమాజం అభివృద్ధి అని సీఎం జగన్ నమ్మారు. దేశ రాజకీయాల్లో మేనిఫెస్టోను తూ.చా తప్పకుండా అమలు చేసిన ఒకే ఒక్కరు సీఎం జగన్ అని వంశీ అన్నారు.

మే 9: ఏపీ ఎన్నికల సమాచారం ఎప్పటికప్పుడు

ఏపీలో ఎన్నికల సమాచారం ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌..

TDP Janasena Key Leaders Leaving In Party
ఒకరి వెంట మరొకరు..

సాక్షి అమలాపురం: అమలాపురం అసెంబ్లీ పరిధిలో మిత్రపక్షాలైన టీడీపీ, జనసేన పార్టీలలో సీనియర్లకు, కొన్ని సామాజికవర్గాల వారికి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. చివరకు పార్టీలను వీడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అనుమానంతో అడుగడుగునా వేధింపులకు గురి చేయడంతో వారందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఆ పార్టీల అధిష్టానాలు స్పందించకపోవడం దారుణం. జనసేనకు ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశం దక్కకపోవడంతో ఆ పార్టీ పార్లమెంట్, అసెంబ్లీ ఇన్‌చార్జులు డీఎంఆర్‌ శేఖర్, శెట్టిబత్తుల రాజబాబు పార్టీని వీడారు. వీరితో పాటు పెద్ద ఎత్తున పార్టీ క్యాడర్‌ వెళ్లిపోయింది. వీరంతా వైఎస్సార్‌ సీపీలో చేరారు. ఇప్పుడు టీడీపీ నాయకులు పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. ప్రధానంగా కాపు సామాజికవర్గానికి చెందినవారు టీడీపీని వీడుతుండడం గమనార్హం. నాయకులే కాదు, వందలాది మంది పార్టీల కార్యకర్తలు సైతం ఆ రెండు పార్టీలకు గుడ్‌బై చెబుతున్నారు. పార్టీ సీనియర్‌ నాయకుడు పరమట శ్యామ్‌ రెబల్‌గా పోటీలో నిలబడిన విషయం తెలిసిందే. వీరితో పాటు పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. పార్టీ సీనియర్‌ నేత, మాజీ హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప సోదరుడు జగ్గయ్యనాయుడు ఏకంగా రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. టీడీపీ రెబల్‌ అభ్యర్థి శ్యామ్‌కు జగ్గయ్యనాయుడు మద్దతు ఉందని టీడీపీ అభ్యర్థి ఆనందరావు మద్దతుదారులు బహిరంగంగా ఆరోపిస్తుండడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.జనసేన, టీడీపీలను వీడుతున్నవారిలో కాపు సామాజికవర్గం వారు అధికంగా ఉండడం విశేషం. జనసేనతో భవిష్యత్‌ లేదని తేలిపోవడంతోపాటు టీడీపీలో గుర్తింపు కరువడడంతో వారు పార్టీని వీడిపోతున్నారు. పార్టీ జిల్లా అధిష్టానం కలుగజేసుకుంటుందా? అంటే అదీ లేదు. జనసేన పారీ్టకి జిల్లాలో ఒక యంత్రాంగం అంటూ లేదు. టీడీపీలో తగువులు తీర్చాల్సిన నేతలు గొడవలు పెడుతుండడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక వారు పారీ్టకి గుడ్‌బై చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ దగ్గర పడుతున్న నేపథ్యంలో టీడీపీ, జనసేనల్లో వలసలు ఆగకపోవడంతో ఆ ప్రభావం ఫలితంపై పడుతోందని రాజకీయ విశ్లేషకుల భావన.హేళన చేశారు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి టీడీపీలో ఉన్నాను. ఇప్పుడు నియోజకవర్గ పెద్దలు నన్ను పట్టించుకోవడం లేదు. పైగా నా సామాజికవర్గాన్ని కించిపరుస్తూ హేళన చేశారు. ఇప్పటికి నాలుగుసార్లు పోటీ చేశారు. మీరు ఒకసారి మాత్రమే గెలిచారు. ఈసారి అల్లవరం నుంచి అవకాశం ఇవ్వాలని పార్టీ అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావును కోరితే మమ్మల్ని పక్కన బెట్టారు. – అడపా కృష్ణ ప్రసాద్, అల్లవరం మండలం. ఇటీవల పార్టీకి రాజీనామా చేసిన టీడీపీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడుఇదేనా పార్టీ ఇచ్చే గుర్తింపు పార్టీ సీనియర్‌ అనే గౌరవం లేకుండా చాలా సందర్భాలలో తక్కువ చేసి మాట్లాడుతున్నారు. పార్టీ నాయకులు మమ్మల్ని అడుగడుగునా అవహేళన చేస్తున్నారు. ఇదేనా పార్టీ మాకు ఇచ్చే గుర్తింపు. పార్టీ బాధ్యులే వర్గాలు కడుతున్నారు. – లింగోలు వెంకన్న (పెదకాపు), జనుపల్లి మాజీ సర్పంచ్, ఆత్మ మాజీ చైర్మన్, టీడీపీ సమన్వయ కమిటీ సభ్యుడురాజకీయాల నుంచి తప్పుకుంటున్నా పార్టీలో ఎంతోమంది సీట్లు ఆశిస్తారు. వారంతా మమ్మల్ని కలిసి మద్దతు కోరతారు. అంతమాత్రాన మాకు వర్గాలు కడతారా? మా కుటుంబం టీడీపీ విజయానికి చిత్తశుద్ధితో పనిచేస్తుంటే మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అందుకే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను. – నిమ్మకాయల జగ్గయ్యనాయుడు, మాజీ హోం మంత్రి చినరాజప్ప సోదరుడుపట్టించుకోవడం లేదు జనసేన పార్టీ పల్లకీ మోసినా మాకు గుర్తింపు లేదు. టీడీపీ నాయకులు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. అడగడుగునా అవమానాలు ఎదురువుతున్నాయి. మా సేవలకు గుర్తింపు దక్కడం లేదు. – మోకా బాలయోగి, మాజీ సర్పంచ్, రెళ్లుగడ్డ, అల్లవరం మండలంటీడీపీకి మద్దతు ఇవ్వడం తప్పు గ్రామంలో 1,200 పార్టీ సభ్యత్వాలు చేయించగా జనసేన పెద్దలు ఘనంగా సత్కరించారు. కానీ ఇప్పుడు నేనే పార్టీ వీడి వెళ్లాల్సి వస్తోంది. టీడీపీలో ఉన్నప్పుడు గుర్తింపు లేక జనసేనకు వచ్చాను. ఇప్పుడు అదే జనసేన టీడీపీకి మద్దతు ఇవ్వడం చాలా తప్పు. – గొలకోటి వెంకటేష్, జనసేన గ్రామ కమిటీ అధ్యక్షుడు అందుకే స్వతంత్ర అభ్యరి్థగా పోటీ ఐదుసార్లుగా పార్టీ టిక్కెట్‌ ఆశించినా నాకు అవకాశం దక్కలేదు. ఈసారి టిక్కెట్‌ ఇవ్వలేదు సరికదా.. అడుగడుగునా నన్ను అవమానించారు. నన్ను ఎవరో ప్రభావితం చేస్తే పోటీలో ఉన్నానని తప్పుడు ప్రచారం చేశారు. నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాను అంటే వారి వద్ద నుంచి స్పందన లేదు. అందుకే స్వతంత్ర అభ్యరి్థగా నేను పోటీలో ఉన్నాను. – పరమట శ్యామ్, టీడీపీ రెబల్‌ అభ్యర్థి

నల్లజర్లలో హోం మంత్రి తానేటి వనిత ఉన్న ఇంటిపై టీడీపీ గూండాలతో కలిసి దాడి చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకట్రాజు , టీడీపీ గూండాల దాడిలో గాయపడిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి  సతీమణి రమాదేవి, మాజీ ఎంపీపీ చౌడేశ్వరి
ఓటమి భయంతో.. బూతులు.. దాడులు.. కుట్రలు

ఓటమి తప్పదన్న నిరాశానిస్పృహలు టీడీపీ కూటమిని ఏ స్థాయికి దిగజారుస్తున్నాయంటే... చంద్రబాబు స్థాయి మరిచి, సిగ్గెగ్గులు వదిలి ‘అమ్మ మొగుడు.. అమ్మమ్మ మొగుడు’ అంటూ అడ్డూఅదుపూ లేకుండా పిచ్చిపట్టినట్లు అరుస్తున్నాడు. వృద్ధుల ఇంటికి పింఛను రాకుండా వారిని మండటెండల్లో రోడ్లమీదికి తేవటమే కాదు..భూములు లాక్కున్నారంటూ పచ్చి అబద్ధాలతో చెలరేగుతున్నాడు. రైతులు, విద్యార్థులు, మహిళల ఖాతాల్లో పడాల్సిన నిధులను కుట్రతో అడ్డుకోవటమే కాదు... బాబు, దత్తపుత్రుడు కలిసి కిరాయి గూండాలతో దాడులు చేయిస్తున్నారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య కావచ్చు... హోంమంత్రి తానేటి వనిత కావచ్చు... ప్రచారానికి వెళుతున్న మహిళా నేతలపై దాడులకు తెగబడుతున్నారు. ఎన్ని చేసినా.. ఇది నారాసురుడికి క్లయిమాక్సే.సాక్షి, అమరావతి/వెల్దుర్తి/ముప్పాళ్ల/సాక్షి, నరసరావుపేట: రూ.కోట్ల కట్టలు వెదజల్లుతున్నా.. అక్రమ మద్యాన్ని ఏరులై పారిస్తున్నా.. కళ్ల ముందు మరోసారి ఘోర పరాజయం స్పష్టంగా కనిపిస్తుండటంతో కూటమి నేతలు చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లో ఫ్రస్టేషన్‌ (నిరాశ, నిస్పృహ) తార స్థాయికి చేరుకుంది. చివరకు అధికార పార్టీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న మహిళలపై సైతం దాడులు చేసే స్థాయికి దిగజారిపోవడం వారిద్దరినీ ఆవరించిన నైరాశ్యాన్ని రుజువు చేస్తోంది. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి నీ అమ్మ మొగుడు..! నీ అమ్మమ్మ మొగుడు..! అంటూ ఈ నెల 6న అనకాపల్లి సభలో చంద్రబాబు బూతు పురాణం లంకించుకోవడంతో మహిళలంతా నివ్వెరపోయారు. అంతకుముందు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో జరిగిన సభలో.. జగన్‌ను చంపితే ఏమవుతుందంటూ టీడీపీ కార్యకర్తలను చంద్రబాబు రెచ్చగొట్టారు. ఒకపక్క ముఖ్యమంత్రి జగన్‌ తన ఐదేళ్ల పాలనలో తెచ్చిన విప్లవాత్మక సంస్కరణలు, మార్పులను ప్రజలకు వివరిస్తూ, వారినుంచే జవాబులు రాబడుతూ ప్రచారం నిర్వహిస్తుండగా మరోపక్క కూటమి నేతలు చంద్రబాబు, పవన్‌ దాడులు, దుర్భాషలనే నమ్ముకోవడం వారి వ్యక్తిత్వాలకు ప్రతీకగా నిలుస్తోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. పవన్‌ కళ్యాణ్‌ సైతం బాబు శైలిని అనుకరిస్తూ వ్యక్తిత్వహననం, దుర్భాషలకు దిగడం తెలిసిందే. దీంతో టీడీపీ, జనసేన రౌడీ మూకలు పేట్రేగుతూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలపై ఇనుపరాడ్లు, రాళ్లు, కర్రలతో దాడులకు దిగుతూ హత్యాయత్నాలకు పాల్పడుతున్నాయి. నల్లజర్లలో ‘ముళ్లపూడి’, మాచర్లలో ‘జూలకంటి’ గూండాయిజం తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం నల్లజర్లలో మంగళవారం రాత్రి ప్రచారం ముగించుకుని పార్టీ నేత వెల్లంకి సుబ్రమణ్యం ఇంట్లో భోజనం చేస్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, హోంమంత్రి తానేటి వనితపై టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకట్రాజు, జడ్పీ మాజీ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు నేతృత్వంలో టీడీపీ గూండాలు దాడి చేసి హత్యాయత్నానికి తెగబడ్డారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం సిరిగిరి­పాడులో బుధవారం ప్రచారం చేస్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి భార్య రమాదేవిపై టీడీపీ గూండాలు రాళ్లతో దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. పలువురు మహిళలు సైతం గాయ­పడ్డారు. ఏడు హత్య కేసుల్లో నిందితుడైన మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహా్మరెడ్డి టీడీపీ గూండాలను దాడులకు పురిగొల్పారు. పచ్చి అవకాశవాదం.. ఎన్నికల్లో సీఎం జగన్‌ నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీని ఒంటరిగా ఎదుర్కోనే సత్తాలేక జనసేనతో జట్టు కట్టి బీజేపీతో కాళ్ల బేరానికి దిగిన చంద్రబాబు దాడులు, హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఇదే కూటమి అధికారంలోకి వచ్చాక హామీలను అమలు చేయకుండా దగా చేయడం, ఇప్పుడు మళ్లీ జత కట్టటాన్ని ప్రజలు పచ్చి అవకాశవాదంగా గుర్తించారు. మళ్లీ కూటమి ముసుగులో చంద్రబాబు మోసం చేస్తారనే అభిప్రాయం బలంగా నాటుకుపోయింది. దీంతో చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ఎన్నికల ప్రచారానికి జనస్పందన కరువైంది. ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌ షాను రప్పించినా ప్రయోజనం కానరాకపోవడంతో ఓటర్లపై ధనా్రస్తాన్ని ఎక్కుపెట్టారు. నోట్ల కట్టలతో ప్రైవేట్‌ సైన్యాలు విదేశాల్లోని తన సామాజిక వర్గానికి చెందిన ఆరు వేల మంది ఎన్నారైలను రప్పించిన చంద్రబాబు వారిని గ్రామాల్లో మోహరించి నోట్ల కట్టలు వెదజల్లుతున్నారు. నెల్లూరు సిటీలో టీడీపీ అభ్యర్థి నారాయణ, విజయవాడ పశ్చిమలో బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి, నరసరావుపేట లోక్‌సభ స్థానంలో టీడీపీ అభ్యర్థి కృష్ణదేవరాయలు, అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్‌ తదితరుల ద్వారా నోట్ల కట్టలతో ప్రైవేట్‌ సైన్యాలను సమాయత్తం చేశారు. ఎన్నికల అధికారులకు భారీ ఎత్తున పట్టుబడుతున్న కోట్ల కట్టలన్నీ టీడీపీ నేతలవే కావడం గమనార్హం. కర్ణాటక, గోవా, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, తెలంగాణ నుంచి భారీ ఎత్తున మద్యాన్ని తరలించి ఏరులై పారిస్తున్నారు. ఎన్నికల అధికారులు సీజ్‌ చేస్తున్న మద్యం డంపులే అందుకు నిదర్శనం. కోట్ల కట్టలను వెదజల్లుతున్నా.. మద్యాన్ని ఏరులై పారిస్తున్నా.. ఎలాంటి ప్రభావం చూపలేకపోవడం, ఘోర పరాజయం కళ్ల ముందు కానరావడంతో చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ఫ్రస్టేషన్‌ తారస్థాయికి చేరుకుంది. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను వెంటాడి, వేటాడి రక్తపుటేరులు పారించి భయోత్పాతం సృష్టించడం ద్వారా ఉనికి చాటుకోవాలని ఎత్తు వేశారు. ఈ క్రమంలో టీడీపీ, జనసేన గూండాలను దాడులు, హత్యాకాండకు పురిగొలిపారు. ‘ఫ్యాన్‌’కి ఓటేశాడని..!పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదలలో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు హోం ఓటింగ్‌ ప్రక్రియలో భాగంగా పరిమి పెద్దభూషయ్య అనే వృద్ధుడు వైఎస్సార్‌సీపీకి ఓటు వేసేందుకు సుముఖత చూపటాన్ని జీర్ణించుకోలేక బెదిరిస్తూ వాదనకు దిగాయి. తనకు కులాలతో పనిలేదని, మంచి చేసిన పార్టీకే ఓటు వేస్తానని పెద్దభూషయ్య తేల్చి చెప్పడంతో వాగ్వాదం నెలకొంది. టీడీపీ సానుభూతిపరుడు రావిపాటి నాగేశ్వరరావు కర్రతో దాడి చేయడంతో వైఎస్సార్‌ సీపీకి చెందిన కానాల పుల్లారెడ్డి తలకు తీవ్ర గాయమైంది. వైఎస్సార్‌ సీపీకి చెందిన షేక్‌ దమ్మాలపాటి బాజికి కూడా ఘటనలో గాయాలయ్యాయి. పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.మాచర్ల ఘటనపై ఈసీ సీరియస్‌మాచర్ల నియోజకవర్గంలో ప్రశాంతంగా ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణితో పాటు పలువురు మహిళలపై టీడీపీ మూకలు దాడులకు తెగబడిన ఘటనను ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. మాచర్ల టౌన్‌ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ పి.శరత్‌బాబు, వెల్దుర్తి ఎస్సై వంగా శ్రీహరి, కారంపూడి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ చిన్న మల్లయ్యను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ముగ్గురూ తక్షణమే విధుల నుంచి రిలీవ్‌ కావాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. దౌర్జన్యాలు.. హత్యాయత్నాలు⇒ నంద్యాల జిల్లా బనగానపల్లె మార్కెట్‌ వద్ద మంగళవారం ప్రచారం చేస్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి భార్య కాటసాని జయమ్మపై దాడికి టీడీపీ అభ్యర్థి బీసీ జనార్ధన్‌రెడ్డి గూండాలను పురిగొల్పారు. ఈ విషయం తెలియడంతో అక్కడకు చేరుకున్న ఆమె తనయుడు ఓబుళరెడ్డిపై కూడా టీడీపీ గూండాలు దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు కోనేటి దుర్గ, సయ్యద్‌ అబ్బాస్, ఇంతియాజ్, ఖాజా హుస్సేన్, జమీర్, గుర్రప్ప తీవ్రంగా గాయపడ్డారు. ⇒ అనంతపురం నియోజకవర్గంలో గత నెల 30న ఎన్నికల ప్రచారం నిమితం బైక్‌పై వెళ్తున్నవైఎస్సార్‌సీపీ నాయకుడు గుజ్జుల నగే­ష్‌పై టీడీపీ గూండాలు కళ్లల్లో కారం చల్లి కర్రలు, ఇనుపరాడ్లతో హత్యాయత్నానికి పాల్పడ్డారు. ⇒ శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పిచ్చిరెడ్డికొట్టాల గ్రామంలో గత నెల 27న ఎన్నికల ప్రచారానికి వెళ్లిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకా‹Ùరెడ్డి, సోదరుడు తోపుదుర్తి రాజశేఖరరెడ్డి వాహనాలపై టీడీపీ మాజీ మంత్రి పరిటాల సునీత నేతృత్వంలో టీడీపీ గూండాలు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో వైఎస్సార్‌సీపీ నేత కురుబ ముత్యాలు వాహనంతోపాటు పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ⇒ ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలో మిట్టమీదిపల్లి, మాల్యవంతునిపాడు గ్రామాల మధ్య వైఎస్సార్‌సీపీకి చెందిన మూడు ప్రచార రథాలపై టీడీపీ గూండాలు దాడులకు పాల్పడ్డారు. డ్రైవర్లు వీరాంజనేయులు, ఆంథోని, రాజును రాడ్లు, కర్రలతో తీవ్రంగా కొట్టారు. ⇒ శ్రీకాకుళం జిల్లా నుంచి శ్రీసత్యసాయి జిల్లా వరకూ రాష్ట్రవ్యాప్తంగా ఇదే రీతిలో టీడీపీ, జనసేన రౌడీ మూకలు వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులకు తెగబడుతూ భయోత్పాతం సృష్టిస్తున్నాయి. మాచర్ల ఎమ్మెల్యే పీఆర్కే సతీమణిపై దాడిఎన్నికల వేళ టీడీపీ అరాచకాలు ఏ స్థాయికి దిగజారాయంటే ఇప్పటివరకు పల్నాడు ప్రాంతంలో మహిళలు, పిల్లలపై దాడులు చేసిన సంస్కృతి లేదు. అలాంటిది మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహా్మరెడ్డి ప్రోద్బలంతో పచ్చమూకలు బరి తెగించాయి. ఎన్నికల ప్రచారం చేస్తున్న మాచర్ల వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణి రమాదేవితోపాటు పలువురు మహిళలపై బుధవారం రాళ్లు, సీసాలతో దాడులకు దిగి హత్నాయత్నానికి పాల్పడ్డాయి. వెల్దుర్తి మండలం శిరిగిరిపాడులో ఇంటింటి ప్రచారం చేస్తున్న రమాదేవిపై టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కుర్రి పున్నారెడ్డి కుమారుడు శివారెడ్డి, కల్లం రామాంజిరెడ్డి తమ అనుచరులతో కలసి రాళ్ల దాడికి పాల్పడ్డారు. పీఆర్కే సతీమణి రమాదేవి, మాజీ ఎంపీపీ దాసరి చౌడేశ్వరి, కౌన్సిలర్‌ గట్ల అరుణ కుమారి, కో ఆప్షన్‌ సభ్యురాలు అన్నెం అనంతరావమ్మలకు తీవ్ర గాయాలయ్యాయి. మాజీ ఎంపీపీ చౌడేశ్వరికి చెందిన స్కార్పియో వాహనాన్ని ధ్వంసం చేశారు. అడ్డుకునే యత్నం చేసిన ఎస్‌ఐ శ్రీహరిపై సైతం పచ్చమూకలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ప్రశాంత వాతావరణంలో ప్రచారం చేస్తున్న మహిళలపై దాడులకు దిగటాన్ని ప్రజలు ఛీదరించుకుంటున్నారు. ప్రజాక్షేత్రంలో గెలవలేక టీడీపీ హింసకు పాల్పడుతోందని మండిపడుతున్నారు. ఏడుగురి హత్య కేసులో నిందితుడైన జూలకంటి బ్రహా్మరెడ్డిని చంద్రబాబు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించడంతో ఫ్యాక్షన్‌ రాజకీయాలు తిరిగి మొదలయ్యాయని పేర్కొంటున్నారు. ఓటమి భయంతోనే మహిళలపై టీడీపీ దాడులుఎన్నికల్లో ఓటమి భయం­తోనే టీడీపీ అధినేత చంద్రబాబు మహిళలపై దాడులు చేయిస్తున్నాడని వైఎస్సార్‌సీపీ మహిళా విభా­గం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత మండిపడ్డారు. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. దళిత మహిళ.. అందులోనూ రాష్ట్ర హోం మంత్రి తానేటి వనితపై దాడి చేయడం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో బొండా ఉమా మహిళలపై దాడులకు పురిగొల్పడం సిగ్గుచేటని మండిపడ్డారు. సీఎం వైఎస్‌ జగన్‌ రాజకీయ పదవుల్లో మహిళలకు పెద్ద పీట వేసి.. దళితులకు రాజ్యాధికారం కల్పించారన్నారు. సంక్షేమ పథకాల ద్వారా పేదల అభివృద్ధికి కృషి చేశారని వివరించారు. అందుకే టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు సీఎం జగన్‌పై కక్ష కట్టాయన్నారు. విద్యార్థులకు విద్యా దీవెన, రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, మహిళలకు ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం తదితర పథకాలను రాకుండా చంద్రబాబు అడ్డుపడ్డారని మండిపడ్డారు. మహిళలపై దాడులు చేస్తున్న టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి మరోసారి ఓటుతో బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ముగిసిన ముంబై ప్రయాణం (PC: BCCI)
Playoffs: పాండ్యాకు పరాభవం.. ముంబై కథ ముగిసిందిలా!

ఐపీఎల్‌-2024 ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి ముంబై ఇండియన్స్‌ నిష్క్రమించింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌- లక్నో సూపర్‌ జెయింట్స్‌ మధ్య బుధవారం మ్యాచ్‌ ఫలితంతో పాండ్యా సేన టాప్‌-4 ఆశలు గల్లంతయ్యాయి. లక్నోను సన్‌రైజర్స్‌ చిత్తు ఓడించడంతో ఈ సీజన్‌లో ముంబై ప్రయాణం ముగిసినట్లయింది.ఎలా అంటే?ఉప్పల్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ లక్నోను పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. కేఎల్‌ రాహుల్‌ సేన విధించిన 166 పరుగుల లక్ష్యాన్ని వికెట్‌ నష్టపోకుండా 9.4 ఓవర్లలోనే ఛేదించింది.WHAT. A. CHASE 🧡A 🔟-wicket win for @SunRisers with more than 🔟 overs to spare! Scorecard ▶️ https://t.co/46Rn0QwHfi#TATAIPL | #SRHvLSG pic.twitter.com/kOxzoKUpXK— IndianPremierLeague (@IPL) May 8, 2024తద్వారా క్యాష్‌ రిచ్‌ లీగ్‌ పదిహేడో ఎడిషన్‌లో ఏడో విజయం(పన్నెండు మ్యాచ్‌లకు గానూ) నమోదు చేసి.. మొత్తంగా 14 పాయింట్లు సాధించింది. నెట్‌ రన్‌రేటు(0.406) కూడా మెరుగుపరచుకుని పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. టాప్‌-2లో తిష్ట వేసిన కేకేఆర్‌, రాజస్తాన్‌మరోవైపు.. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌(రన్‌రేటు 1.453), రాజస్తాన్‌ రాయల్స్‌(రన్‌రేటు 0.476) పదకొండేసి మ్యాచ్‌లు ఆడి చెరో 16 పాయింట్లతో టాప్‌-2లో కొనసాగుతున్నాయి. ఇక చెన్నై సూపర్‌ కింగ్స్‌ 11 మ్యాచ్‌లలో ఆరు గెలిచి 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది.ఈ నేపథ్యంలో చెరో 12 పాయింట్లతో ఐదు, ఆరు స్థానాల్లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌(రన్‌రేటు -0.316), లక్నో సూపర్‌ జెయింట్స్‌(రన్‌రేటు -0.769) వచ్చే వారం తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిచినా 14 పాయింట్లతో పైకి ఎగబాకుతుంది.పాండ్యా సేనకు తప్పని పరాభవంమరోవైపు.. ఆర్సీబీ(11 మ్యాచ్‌లు- 8 పాయింట్లు- మిగిలినవి 3), పంజాబ్‌ కింగ్స్‌(11 మ్యాచ్‌లు- 8 పాయింట్లు- మిగిలినవి 3) ఏడు, ఎనిమిది స్థానాల్లో కొనసాగుతున్నాయి. అయితే, ముంబై ఇండియన్స్‌ తొమ్మిదో స్థానంలో ఉన్నప్పటికీ ఇప్పటికే 12 మ్యాచ్‌లు ఆడేసింది. కేవలం నాలుగింట గెలిచి 8 పాయింట్లతో ఉంది.మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిచినా మహా అయితే మొత్తంగా 12 పాయింట్లు వస్తాయి. కాబట్టి టాప్‌-4లో అడుగుపెట్టేందుకు ముంబైకి దారులు మూసుకపోయినట్లే! ఇక అట్టడుగున ఉన్న గుజరాత్‌ టైటాన్స్‌కు ఇంకో మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేకేఆర్‌, రాజస్తాన్‌, సన్‌రైజర్స్‌ దాదాపుగా ప్లే ఆఫ్స్‌ బెర్తు ఖరారు చేసుకోగా.. ముంబై టోర్నీ నుంచి నిష్క్రమించినట్లయింది.చదవండి: #KL Rahul: కెప్టెన్‌పై కోపంతో ఊగిపోయిన లక్నో ఓనర్‌.. అందరూ చూస్తుండగానే అలా..

AirIndia terminated 25 employees for their failure to report to work after sick leave
సిక్‌ లీవ్‌ తీసుకున్న ఉద్యోగుల తొలగింపు

టాటా యాజమాన్యంలోని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ ఉద్యోగులపై కొరడా ఝుళిపించింది. ముకుమ్మడిగా సిక్‌ లీవ్‌ తీసుకున్న ఉద్యోగులను తొలగించింది. సెలవు అనంతరం తిరిగి ఉద్యోగులు సంస్థకు రిపోర్ట్‌ చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వర్గాలు చెప్పాయి. ఇటీవల ఉద్యోగులు విధులకు రాకపోవడంతో బుధవారం సంస్థ దాదాపు 80కి పైగా విమాన సర్వీసులను రద్దు చేసింది. ఈ చర్యకు కారణమైన 25 మంది క్యాబిన్‌ సిబ్బందిపై చర్యలు తీసుకుంది.‘సిక్‌లీవ్‌ అనంతరం 25 మంది ఉద్యోగులు సంస్థకు రిపోర్ట్‌ చేయడంలో విఫలయ్యారు. వారితీరు వల్ల విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ లిమిటెడ్‌ ఎంప్లాయిస్‌ సర్వీస్‌ రూల్స్‌ను పాటించనందుకు వారిపై చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. అందులో భాగంగానే వారి ఉద్యోగాలు తొలగించాం’ అని టర్మినేషన్‌ లేటర్‌లో కంపెనీ తెలిపింది.బుధవారం విమాన సర్వీసుల్లో కలిగిన అంతరాయం తర్వాత సంస్థ సీఈఓ అలోక్ సింగ్ స్పందించారు. ఉద్యోగులకు ఏదైనా సమస్యలుంటే క్యాబిన్ సిబ్బందితో చర్చకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఎయిర్‌లైన్ రాబోయే కొద్ది రోజుల పాటు విమానాలను తగ్గిస్తుందని తెలిపారు.ఇదీ చదవండి: కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను రద్దు చేసిన ఆస్ట్రాజెనెకా.. కారణం తెలుసా..ఇదిలాఉండగా, ఎయిరిండియా వైఖరిపట్ల సిబ్బంది అసంతృప్తిగా ఉన్నారని తెలిసింది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ను ఎయిర్‌ఏషియా ఇండియాతో విలీనం చేయడం వల్ల సిబ్బంది జీతాలు దాదాపు 20 శాతం తగ్గాయని ఉద్యోగులు చెబుతున్నారు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ కెకె విజయ్‌కుమార్ మాట్లాడుతూ..ఎయిరేషియాతో విలీనానికి ముందు ఉద్యోగులకు ఇవ్వాల్సిన పరిహారంలో స్పష్టత ఇవ్వాలని కోరారు. ఈ విలీనంతో ఉద్యోగులకు రావాల్సిన అలవెన్సులు పూర్తిగా తొలగించబడ్డాయన్నారు. దాంతో భారీగా జీతాలు తగ్గాయని చెప్పారు. సంస్థ నిర్వహణలో లోపాలున్నాయని, సిబ్బంది పట్ల సమానత్వం కరవైందని యూనియన్ గతంలో దిల్లీలోని రీజినల్ లేబర్ కమిషనర్‌కు, టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్‌కు లేఖ రాసింది.

Mona Patel: ‘ఎవరీ మోనా?’ అని సెర్చ్‌ చేసేలా...
Mona Patel: ‘ఎవరీ మోనా?’ అని సెర్చ్‌ చేసేలా...

వరల్డ్స్‌ మోస్ట్‌ ప్రిస్టీజియస్, గ్లామరస్‌ ఫ్యాషన్‌ ఈవెంట్‌ ‘మెట్‌ గాలా–2024’లో బ్రేక్‌ఔట్‌ స్టార్‌గా అందరి దృష్టిని ఆకర్షించింది మోనా పటేల్‌. ‘ఎవరీ మోనా?’ అని సెర్చ్‌ చేసేలా చేసింది. వడోదర నుంచి అమెరికా వరకు ఫ్యాషన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మోనా ఎదిగిన వైనం స్ఫూర్తిదాయకం. ఫిలాంత్రపిస్ట్‌గా ఎన్నో రకాల సేవాకార్యక్రమాలు చేపడుతోంది...గుజరాత్‌లోని వడోదరలో పుట్టి పెరిగిన మోనా పటేల్‌ చాలామంది అమ్మాయిలలాగే స్కూల్, కాలేజీ రోజుల్లో రకరకాల వివక్షలు, సవాళ్లు ఎదుర్కొంది. ‘ఆటలు మగవారి కోసమే’, ‘ఆడవారు ఇంట్లోనే క్షేమంగా ఉంటారు’ ‘లక్ష్యాలు అనేవి మగవారి కోసమే’ ఇలాంటి ఎన్నో పురుషాధిక్య భావజాల ధోరణులకు సంబంధించిన మాటలు విన్నది మోనా.అయితే అలాంటి మాటలకు ఎప్పుడూ విలువ ఇవ్వలేదు. సవాలుకు సై అనడం తప్ప వెనక్కి తిరిగి చూసింది లేదు. పన్నెండు సంవత్సరాల వయసు నుంచి బాయ్స్‌–స్టైల్‌ హెయిర్‌ కట్‌తో కనిపించడంప్రారంభించింది. వస్త్రధారణ కూడా అచ్చం అబ్బాయిలలాగే ఉండేది.‘ఏమిటీ వేషం’లాంటి వెక్కిరింపులకు ముఖం మీదే సమాధానం చెప్పి నోరు మూయించేది. ‘హెయిర్‌ కట్‌ అనేది రెబిలియన్‌ యాక్ట్‌. సెల్ఫ్‌–ఎంపవర్‌మెంట్‌కు సింబల్‌’ అంటూ ఆనాటి రోజులను గుర్తు చేసుకుంటుంది మోనా. ఇంటి నుంచి బయటి వెళ్లడమే సాహసంగా భావించే రోజుల నుంచి చదువు కోసం గుజరాత్‌ యూనివర్శిటీలో అడుగు పెట్టింది. హోమ్‌టౌన్‌ తప్ప మరో టౌన్‌ తెలియని మోనా పైచదువుల కోసం న్యూజెర్సీలోని రాత్‌గర్స్‌ యూనివర్శిటీకి వెళ్లింది.‘ఔట్‌సైడ్‌ ఇండియా లైఫ్‌ గురించి ఎప్పటినుంచో ఆసక్తి ఉండేది. చదువుల రూపంలో అది నెరవేరింది. ఒంటరిగా బయలుదేరినప్పటికీ ఆ ఒంటరితనమే ధైర్యాన్ని ఇచ్చింది. కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది’ అంటుంది మోనా. అమెరికాకు వెళ్లిన కొత్తలో అక్కడి వేషధారణ, ఆచార వ్యవహారాలు తనకు కొత్తగా అనిపించేవి.‘ఈ ప్రపంచంలో నేను ఇమడగలనా!’ అని కూడా సందేహించేది. అయితే ఆ ప్రపంచంలోనే ఎంటర్‌ప్రెన్యూర్‌గా విజయధ్వజం ఎగరేసింది మోనా పటేల్‌. ఒక్కో మెట్టు ఎక్కుతూ హెల్త్‌కేర్, టెక్, రియల్‌ ఎస్టేట్‌... మొదలైన రంగాలలో ఎనిమిది కంపెనీలను నెలకొల్పింది. వ్యాపార విజయాలే కాదు సామాజిక సేవాకార్యక్రమాలు కూడా మోనాకు ఇష్టం. జెండర్‌ ఈక్వాలిటీ, అమ్మాయిల చదువు, ఉమెన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను దృష్టిలో పెట్టుకొని ‘కొచర్‌ ఫర్‌ కాజ్‌’ అనే స్వచ్ఛంద సంస్థనుప్రారంభించింది.‘మూడు పెద్ద సూట్‌కేస్‌లతో తొలిసారిగా ఇండియా నుంచి డల్లాస్‌కు బయలుదేరాను’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంటుంది మోనా.ఆ సూటుకేసులలో విలువైన వస్తువులు ఉండచ్చు. అయితే వాటి అన్నిటికంటే అత్యంత విలువైనది... ఆమెలోని ఆత్మవిశ్వాసం. ఆ ఆత్మవిశ్వాసమే మోనా పటేల్‌ను తిరుగులేని ఎంటర్‌ప్రెన్యూర్‌గా మార్చింది. ఎంతోమందికి స్ఫూర్తి ఇచ్చేలా చేస్తోంది.బంగారు రెక్కల సీతాకోకచిలక..ప్రతిష్ఠాత్మకమైన మెట్‌గాలా 2024 ఎడిషన్‌ను న్యూయార్క్‌లోని ‘మెట్రోపాలిటన్‌ మ్యూజియం ఆఫ్‌ ఆర్ట్‌’లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెన్నిఫర్‌ లోపెజ్, సారా జెస్సికా, ఆలియా భట్, ఇషా అంబానీ, నటాషా పూనావాలా... మొదలైన ఎంతోమంది ప్రముఖులు పాల్గొన్నారు. మెట్‌ గాలా రెడ్‌ కార్పెట్‌పై కనిపించాలనేది ఎంతోమంది అమ్మాయిల కల.అయితే తొలి ప్రయత్నంలోనే ప్రేక్షకులు ‘వావ్‌’ అనుకునేలా చేసి, మెట్‌ గాలాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది పటేల్‌. ‘ది గార్డెన్‌ ఆఫ్‌ టైమ్‌’ థీమ్‌తో రూపొందించిన సీతాకోకచిలక ఆకారంలో ఉన్న గౌనుకు ఎంతోమంది ఫిదా అయ్యారు. ‘నా వారసత్వాన్ని సెలబ్రేట్‌ చేసుకునేలా నా డెబ్యూ లుక్‌ ఉండాలనుకున్నాను’ అంటుంది పటేల్‌. రెడ్‌ కార్పెట్‌పై పటేల్‌ బ్యూటీ లుక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ సెన్సేషన్‌గా మారింది.ఇవి చదవండి: Rosa Shruti Abraham: సెరామిక్ అండ్ గ్లాస్ డిజైనర్..

Vijay Devarakonda Birthday Special: Hero Cinema Journey
ఒకప్పుడు ఎన్నో కష్టాలు.. పాన్‌ ఇండియా హీరో అయ్యాడు!

నువ్వు హీరోవా.. అని చీత్కారాలు పొందిన దగ్గరే నువ్వే అసలైన హీరో అని చప్పట్లు కొట్టించుకుంటే వచ్చే మజానే వేరు! హీరో విజయ్‌ దేవరకొండ విషయంలోనూ ఇదే జరిగింది. ఒకప్పుడు తన సినిమా రిలీజ్ చేయడానికి అష్టకష్టాలు, అవమానాలు పడ్డ విజయ్‌.. ఇవాళ తన సినిమాలను గ్రాండ్‌గా పాన్ ఇండియా లెవల్‌లో రిలీజ్‌ చేసే స్థాయికి ఎదిగాడు. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ ప్రేక్షకుల్ని మెప్పిస్తూ వారి మనసులు గెలుచుకున్నాడు. ఇండస్ట్రీలోకి రావాలనుకునే కొత్త వాళ్లకు రోల్ మోడల్ అయ్యాడు విజయ్. నేడు (మే 9న) విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా ఆయన జర్నీ చూసేద్దాం..విజయ్ కాన్ఫిడెన్స్ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా చూస్తున్నవాళ్లకు విజయ్ దేవరకొండ ఎవరో తెలియదు. రిషి క్యారెక్టర్ లో ఎంతో సహజంగా నటిస్తున్న అతన్ని చూసి ప్రేక్షకులు ఇంప్రెస్ అయ్యారు. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా విజయ్ దేవరకొండ ప్రతిభ అందరికీ తెలిసింది. బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించిన ఈ సినిమా నేషనల్ అవార్డ్ పొందింది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రూపొందించిన అర్జున్ రెడ్డి విజయ్ కెరీర్ కు ఒక బెంచ్ మార్క్ మూవీ అయ్యింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో విజయ్ కాన్ఫిడెన్స్ చూసి ఇండస్ట్రీ ఆశ్చర్యపోయింది.స్టార్‌గా ఎదగడమే కాదుటాక్సీవాలాతో కాస్త డీలా పడ్డా.. గీత గోవిందం ఆయన కెరీర్‌లో ఫస్ట్ హండ్రెడ్ క్రోర్ మూవీగా నిలిచింది. ఖుషి, ఫ్యామిలీ స్టార్ సినిమాలు విజయ్ దేవరకొండను కుటుంబ ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయి. సినిమా మీద ప్యాషన్, హీరోగా విజయ్ చూపించే డెడికేషన్ అందరినీ ఆకట్టుకుంటుంది. స్టార్‌గా ఎదగడమే కాదు సొసైటీ పట్ల తన బాధ్యతను ఎప్పుడూ మర్చిపోలేదు విజయ్ దేవరకొండ. కరోనా సమయంలో దేవరకొండ ఫౌండేషన్ ద్వారా మిడిల్ క్లాస్ ఫండ్ ఏర్పాటు చేసి పేద మధ్య తరగతి కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడమే కాకుండా ఇతరత్రా సాయం చేశాడు.దేవరశాంటయువతకు ఉపాధి కోసం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశాడు. దేవరశాంట పేరుతో ఏటా తన ఫ్యాన్స్ లో కొందరిని టూర్స్ పంపిస్తుంటాడు. తన పుట్టిన రోజున నగరంలోని వివిధ ప్రాంతాలలో ఐస్ క్రీం ట్రక్స్ ఏర్పాటు‌ చేయిస్తాడు. ఖుషి సినిమా టైమ్ లో ప్రేక్షకుల్లో వందమందిని సెలెక్ట్ చేసి వారి కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున కోటి రూపాయల సాయం అందించాడు. ఇలా మంచి మనసున్న హీరోగా విజయ్ దేవరకొండ పేరు తెచ్చుకున్నాడు.చదవండి: వైరల్‌ ఫోటో: కట్టప్పతో ఉన్న ఈ హీరోను గుర్తుపట్టారా?

తనిష్క్ జ్యువెలరీ నెక్లెస్‌
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్

ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన, భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్‌ల నుండి ప్రేరణ పొంది అద్భుతమైన మరియు వైవిధ్యమైన శ్రేణి సమకాలీన, రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్‌లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్‌లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్‌లు, కస్టమర్‌లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా, ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్‌ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్‌ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్, ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్‌లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్‌గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్‌లెట్‌లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్‌లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్‌లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్‌డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్‌లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్ 18కేరట్ మరియు 22కేరట్ బంగారంలో విస్తృతమైన శ్రేణి డిజైన్‌లతో, నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని సంపూర్ణం చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్‌లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్‌లెట్‌లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement

ఫోటో స్టోరీస్

View all