Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Andhra Pradesh Elections Exit Poll Result 2024
ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు: ఏపీలో మళ్లీ ‘ఫ్యాన్‌’ ప్రభంజనమే

సాక్షి, గుంటూరు: వైఎస్సార్‌సీపీకి తిరుగులేదని మరోసారి స్పష్టమైంది. సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు శనివారం సాయంత్రం వెల్లడయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టించి మళ్లీ అధికారంలోకి రానుందని ఎగ్జిట్‌పోల్స్‌ తేల్చాయి. వైఎస్సార్‌ సీపీ విజయ భేరి మోగించనుందని స్పష్టం చేశాయి. సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో విప్లవాత్మక మార్పులు తెచ్చిన సీఎం జగన్‌ ప్రభుత్వానికే మరోసారి జనం జై కొట్టనున్నారని ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించాయి. ఆత్మసాక్షి: వైఎస్సార్‌సీపీ: 98-116టీడీపీ 59-77రేస్‌:వైఎస్సార్‌సీపీ-117-120టీడీపీ-48-50పోల్‌ స్ట్రాటజీ గ్రూప్‌:వైఎస్సార్‌సీపీ- 115-125టీడీపీ- 50-60ఆపరేషన్‌ చాణక్య:వైఎస్సార్‌సీపీ: 95-102టీడీపీ: 64-68చాణక్య పార్థదాస్‌:వైఎస్సార్‌సీపీ: 110-120టీడీపీ: 55-65 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించి సత్తా చాటింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనలో సంక్షేమానికి పెద్దపీట వేశారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. సీఎం జగన్‌ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక 99 శాతం అమలు చేయడంతో పేదవర్గాల్లో అధికార వైఎస్సార్‌సీపీకి ఆదరణ మరింత పెరిగింది. దీంతో ఓటర్లు మరోసారి వైఎస్సార్‌సీపీకి అవకాశం కల్పించారని ఎగ్జిట్‌పోల్‌ ఫలితాలు చెబుతున్నాయి.

Lok Sabha Elections Exit Poll 2024 Live Updates:BJPVsINDIA
కేంద్రంలో పవర్‌ ఎవరిది..? ఎగ్జిట్‌ పోల్స్‌ సంచలనం..

సాక్షి,న్యూఢిల్లీ: సుదీర్ఘంగా నలభై రోజులకుపైగా జరిగిన 2024 లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ శనివారం(జూన్‌1) సాయంత్రం 5 గంటలకు ముగిసింది. అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న2024 పార్లమెంట్‌ ఎన్నికల ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదలయ్యాయి. తుది, ఏడవ విడత పోలింగ్‌ ముగిసిన వెంటనే టీవీ ఛానళ్లు, ప్రముఖ సర్వే సంస్థలు ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలు రిలీజ్‌ చేశాయి. రిపబ్లిక్‌ టీవీ- మ్యాట్రి క్జ్‌ఎన్డీఏ-354ఇండియా-153ఇతరులు-30మొత్తం -543

Ksr Comments On Telangana And Andhra Pradesh Joint Capital Hyderabad
ఏపీకి హైదరాబాద్‌ అసలు ఎంత దూరం?

ఏపీ, తెలంగాణల ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఇక కొనసాగే అవకాశం లేనట్లేనా! బై బై చెప్పిసినట్లేనా! పంజాబ్, హర్యానాలకు చండీఘడ్ దశాబ్దాల తరబడి ఉమ్మడి రాజధానిగా ఉంటోంది. కానీ హైదరాబాద్‌ను మాత్రం ఏపీ ప్రజలు పదేళ్లకే వదలుకోకతప్పదన్న అభిప్రాయం కలుగుతోంది. ఏపీ మాత్రం మరో పదేళ్లు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కోరుకుంటోంది. కానీ తెలంగాణ ప్రభుత్వం అందుకు సిద్ధపడడం లేదు. ఇప్పటికీ హైదరాబాద్‌లో ఏపీ ఆధీనంలో ఉన్న భవనాలను స్వాధీనం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏపీకి ఇంతవరకు కేటాయించిన లేక్ వ్యూ అతిథి గృహం వంటి భవనాలను తెలంగాణ తీసేసుకుంటుందన్నమాట.అలాగే తెలంగాణలోని వైద్య కాలేజీలలో ఉన్న అన్ రిజర్వుడ్ కోటా సీట్లను ఇకపై కేవలం తెలంగాణ విద్యార్థులకే కేటాయించాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇదే రూల్ ఏపీకి కూడా వర్తిస్తుంది. విభజన చట్టంలో రెండు రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల కోసం పదిహేను శాతం సీట్లను ఉంచారు. వాటికి ఎవరైనా పోటీపడవచ్చు. ఏపీ విద్యార్థులకు దక్కకుండా అన్నీ సీట్లను తెలంగాణకే ఇవ్వాలని ఆయన అంటున్నారు. నిజానికి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ సాంకేతికంగా కొనసాగవలసిన అవసరం ఉంది. ఎందుకంటే రెండు రాష్ట్రాలకు సంబంధించిన అనేక విభజన అంశాలు ఇంకా పరిష్కారం కాలేదు. దీనిపై చొరవ చూపవలసిన కేంద్ర ప్రభుత్వం తూతూ మంత్రంగా సమావేశాలు జరుపుతూ కాలయాపన చేసింది తప్ప, చిత్తశుద్ధితో నిర్ణయాలు చేయలేకపోయింది. దానికి కారణం రాజకీయాలే అని చెప్పాలి.తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు రెండిటికి రాజకీయ ప్రయోజనాలున్నాయి. ఇక్కడ మొన్నటివరకు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌తో పాటు ఈ రెండు పార్టీలు కూడా బలంగా ఉన్నాయి. అందువల్ల తెలంగాణ యాంగిల్‌లోనే వీరు ఆలోచిస్తున్నారు తప్ప ఏపీని పట్టించుకుంటున్నట్లు కనిపించడం లేదు. పొరపాటున తెలంగాణ ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుని ఏపీతో తగాదా లేకుండా చేసుకుంది అనుకోండి.. వెంటనే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు తెలంగాణకు అన్యాయం జరిగిందని రాజకీయం చేస్తున్నాయి. ఉదాహరణకు కృష్ణా నది జలాలపై ఎంత రగడ చేశారో చూడండి. రాయలసీమకు వరద జలాలను తరలించినా, తెలంగాణకు నష్టం జరుగుతున్నట్లుగా వివిధ పార్టీలు విమర్శలు చేశాయి. చివరికి నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద సీఆర్‌పీఎఫ్‌తో కాపలా పెట్టవలసి వస్తోంది. ఆరు నెలల క్రితం ఏపీ ప్రభుత్వం బలవంతంగా తనకు రావల్సిన నీటి కోటాను తీసుకువెళ్లింది కనుక సరిపోయిందికానీ, లేకుంటే ఏపీకి నీళ్లు రావడమే కష్టం అయ్యేదేమో! నదీజలాల యాజమాన్య బోర్డులున్నా.. వాటికున్న అధికారాలు అంతంతమాత్రమేనని చెప్పాలి. ఈ ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించడానికి ఏపీ సిద్ధపడినా, తెలంగాణ వెనుకడుగు వేస్తోంది. దానికి కారణం రాజకీయ విమర్శలు వస్తాయన్న భయంతోనే. పైగా తెలంగాణ ప్రభుత్వం కృష్ణా జలాలు మొత్తం తమకే కేటాయించాలన్నంతగా డిమాండ్ పెట్టింది. ట్రిబ్యునల్ నదిలో 811 టీఎమ్‌సీల నీరు పారుతుందని అంచనా వేస్తే, తెలంగాణ ప్రభుత్వం 798 టీఎమ్‌సీల నీరు తమకే అవసరం అని చెబుతోంది. ఒకపక్క నదిలో వరదలు తగ్గుతున్నాయి. ఇంకో పక్క రెండు రాష్ట్రాలు తమ వాస్తవ అవసరాల ప్రాతిపదికన కాకుండా రాజకీయాల దృష్టితో బేసిస్ నీటి వాటాను కోరుతున్నాయి. ఉమ్మడి ఏపీ విభజన సమయంలో ఏపీకి రాజధాని లేదు కనుక హైదరాబాద్‌ను పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా వాడుకోవచ్చని నిర్ణయించారు. ఆ టైమ్‌లో కొందరు ఎంపీలు చండీఘడ్ మాదిరి సుదీర్ఘకాలం ఉమ్మడి రాజధానిగా కొనసాగవచ్చని అభిప్రాయపడ్డారు. 2014 లో విభజిత ఏపీకి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు కూడా అదే తీరులో హైదరాబాద్‌లో ఉన్నారు. సచివాలయ భవనాలకు వందల కోట్లు వెచ్చించారు. ఎవరైనా అడిగితే హైదరాబాద్ రాజధానిగా చాలాకాలం ఉంటుందని అనేవారు. కానీ ఆయన ఓటుకు నోటు కేసులో పట్టుబడడంతో టీఆర్ఎస్‌తో రాజీలో భాగంగా హైదరాబాద్‌ను వదలి ఏపీకి వెళ్లిపోయారు. దాంతో మొత్తం పరిస్థితి తలకిందులైంది.ఏపీ ప్రజలు దీనివల్ల బాగా నష్టపోయారు. ఆ కేసు సమయంలో చంద్రబాబు ఏకంగా హైదరాబాద్‌లో కేసులు పెట్టే అధికారం తమకు కూడా ఉంటుందన్నంతవరకు వివాదాస్పదంగా మాట్లాడారు. ఆయన రాత్రికి రాత్రే పెట్టె, బెడ సర్దుకుని వెళ్లడంతో సచివాలయ భవనాలన్నీ వృధా అయిపోయాయి. ఆ బిల్డింగ్‌లు పాడైపోతున్నందున తమకు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరితే ప్రస్తుత ప్రభుత్వం అంగీకరించింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీ వాడుతున్న ఇతర భవనాలను స్వాధీనం చేయాలని కోరుతోంది. దీనివల్ల హైదరాబాద్‌లో ఏపీకి స్టేక్ లేకుండా పోతుంది. హైదరాబాద్ ఉమ్మడి ఏపీ ప్రజలు అంతా కలిసి అభివృద్ది చేసుకున్న నగరం. కానీ ఇప్పుడు ఒక ప్రాంతానికే పరిమితం అవడం వల్ల ఏపీ ప్రజలకు నష్టం జరగవచ్చు. విభజన సమయంలో మాబోటి వాళ్లం ఏపీకి హైదరాబాద్‌లో విద్య, ఉపాధి, నివాస అవకాశాలలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసే విధంగా చట్టం ఉండాలని సూచించినా, రాజకీయ పార్టీలు పట్టించుకోలేదు. దాని ఫలితంగా విద్యపరంగాకానీ, ఉపాధి అవకాశాలలో కానీ మున్ముందు ఏపీకి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. తెలంగాణకు నష్టం చేయాలని, ఇక్కడ ప్రజలకు అన్యాయం జరగాలని ఎవరూ కోరడం లేదు. కానీ ఏపీకి న్యాయం జరగాలన్నదే అందరి అభిప్రాయం. హైదరాబాద్‌లో కానీ, ఇతరత్రా కానీ రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఆస్తులు ఉన్నాయి. ఉదాహరణకు ఆర్టీసీ ఆస్తులు రెండురాష్ట్రాలకు వర్తిస్తాయి. ఆ ఆస్తుల విభజన ఇంకా జరగలేదు. అలాగే ఇతర సంస్థల ఆస్తులు కూడా పెండింగులోనే ఉన్నాయి. బ్యాంకులలో కూడా ఉమ్మడి ఖాతాలలో డబ్బు ఉంది. దానిపై వివాదం వస్తే ఏపీ తెలుగు అకాడమీ సుప్రింకోర్టువరకు వెళ్లి తన వాటాను సాధించుకుంది.అలాగే ఇతర సంస్థల ఆస్తులు, బ్యాంకు ఖాతాలను పంచవలసి ఉంటుంది. మొత్తం సుమారు లక్షన్నర కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఏపీకి రావాలన్నది ఒక అంచనా. అది తేలలేదు. ప్రభుత్వరంగ సంస్థల విషయం పరిష్కారం కాలేదు. ఉద్యోగుల విభజనపై విద్యుత్ బోర్డు వంటి సంస్థలలో ఏళ్ల తరబడి కోర్టులలో కేసులు సాగాయి. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగకపోతే, ఏపీకి హైదరాబాద్ పూర్తిగా పరాయిదైపోతుంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఒక రాజకీయ నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది.కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ అందుకు అనుగుణంగా వ్యవహరిస్తుందా అనే సందేహం ఉంది. దానికి కారణం హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా పొడిగించాలని నిర్ణయిస్తే బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు పెద్ద దుమారం లేవదీస్తాయి. దానివల్ల బీజేపీకి తెలంగాణలో నష్టం జరుగుతుందన్న భయం ఉంటుంది. అలాగే కాంగ్రెస్ జాతీయ నాయకత్వం కూడా ఈ విషయంలో నోరు మెదపకపోవచ్చు. ఎందుకంటే వారికి తెలంగాణలో అధికారం ఉంది. ఏపీలో ఒక్క శాతం ఓట్లు కూడా రావడం లేదు కనుక. పైగా ఈ రెండు పార్టీలకు ఏపీలో ఉన్న ఓట్లు ఒకశాతం లోపే. ఏపీ లోని పార్టీలు దీనిపై ఎంతవరకు డిమాండ్ చేస్తాయో చూడాలి.అధికార వైఎస్సార్‌సీపీ దీనిపై కేంద్రానికి ఇప్పటికే లేఖ రాసిందని సమాచారం. ప్రతిపక్ష టీడీపీ దీనిపై నోరు మెదిపే అవకాశం తక్కువే. ఎందుకంటే భారతీయ జనతా పార్టీని బతిమలాడుకుని మళ్లీ టీడీపీ ఎన్‌డీఏలో చేరింది. అందువల్ల బీజేపీకి అసంతృప్తి కలిగించే ప్రత్యేక హోదాతో సహా ఏ డిమాండ్లు ఏవీ టీడీపీ పెట్టదు. కాంగ్రెస్, బీజేపీల ఏపీ శాఖలు కూడా దీనిపై నోరెత్తకపోవచ్చు. ఈ పరిస్థితి తెలంగాణకు అడ్వాంటేజ్‌గా మారుతుంది. ఏపీకి నష్టం కలిగినా ఏమి చేయలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొందని చెప్పకతప్పదు. కానీ ధర్మంగా అయితే మరో పదేళ్లు లేదా విభజన సమస్యలు పరిష్కారం అయ్యేవరకైనా ఉమ్మడి రాజధానిగా కొనసాగించడం అవశ్యం.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

Kejriwal Interim Bail Extension Judgement Reserved
రేపు మళ్లీ జైలుకు కేజ్రీవాల్‌..కోర్టులో నో రిలీఫ్‌

న్యూఢిల్లీ: లిక్కర్‌ స్కామ్‌ కేసులో మధ్యంతర బెయిల్ పొడిగింపుపై ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్‌) చీఫ్‌, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై ఢిల్లీ రౌస్‌ఎవెన్యూ కోర్టు తీర్పు రిజర్వ్‌ చేసింది. జూన్‌ 5న తీర్పు వెలువరిస్తామని తెలిపింది. దీంతో కేజ్రీవాల్ రేపు(జూన్‌2) తీహార్‌ జైలులో లొంగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లిక్కర్‌ స్కామ్‌ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తన అరెస్టును సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ ఆలస్యమవుతుండటంతో ఎన్నికల్లో ప్రచారం కోసం అత్యున్నత కోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది. జూన్‌ 2న కేజ్రీవాల్‌ తిరిగి లొంగిపోవాలని ఆదేశించింది. మధ్యంతర బెయిల్‌ గడువు ముగియడంతో బరువు తగ్గడం, కిడ్నీ సమస్యలకు సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి బెయిల్‌ను మరో ఏడు రోజుల పాటు పొడిగించాలని కేజ్రీవాల్ రౌస్‌ఎవెన్యూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై శనివారం(జూన్‌1) విచారణ జరిగింది. విచారణ సమయంలో కేజ్రీవాల్‌ మధ్యంత బెయిల్‌ పొడిగింపును ఈడీ వ్యతిరేకించింది.

Buzz: Sukumar Plan To Change Pushpa 2 Movie Climax
సుకుమార్‌ షాకింగ్‌ నిర్ణయం.. షాక్‌లో బన్నీ ఫ్యాన్స్‌!

ఆగస్ట్‌ 15.. బన్నీ ఫ్యాన్స్‌కి నిజంగా పండగ రోజే. అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న ‘పుష్ప 2: ది రూల్’ మూవీ అదే రోజు రిలీజ్‌ కాబోతుంది. ‘పుష్ప.. పుష్పరాజ్.. నీయవ్వ తగ్గేదే లే’ అంటూ ఇండియన్‌ బాక్సాఫీస్‌ షేక్‌ చేసిన ‘పుష్ప’ మూవీకి సీక్వెల్‌గా రాబోతుంది ఈ చిత్రం. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు, టీజర్‌ ఈ మూవీపై మరింత ఆసక్తిని పెంచేలా చేశాయి. అయితే విడుదల తేది దగ్గర పడినా.. ఇంకా షూటింగ్‌ పూర్తికాకపోవడం బన్నీ అభిమానుల్ని కలవరపెడుతోంది. ముందు చెప్పినట్లుగా ఆగస్ట్‌ 15న బొమ్మ పడుతుందా లేదా వాయిదా పడుతుందా అనే అనుమానాలు తల్లెత్తుతున్నాయి. ఇలాంటి సమయంలో డైరెక్టర్‌ సుకుమార్‌ షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా క్లైమాక్స్‌ని మార్చాలని భావిస్తున్నాడట.సాధారణంగా సుకుమార్‌ తన ప్రతి సినిమాకు రెండు క్లైమాక్స్‌లు ప్లాన్‌ చేస్తాడట. అలా పుష్ప 2 కోసం కూడా ఇప్పటికే రెండు క్లైమాక్స్‌లు సిద్ధం చేసుకున్నాడట. రెండింటిలో ఒకటి యాడ్‌ చేయాలని భావించాడట. అయితే ముందుగా అనుకున్న క్లైమాక్స్‌లు కాకుండా వేరేది యాడ్‌ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పుష్ప 2 కి కొనసాగింపుగా పుష్ప 3 కూడా చేయాలనే ఆలోచన రావడంతో..క్లైమాక్స్‌ కూడా పార్ట్‌ 3కి సెట్‌ అయ్యేలా ప్లాన్‌ చేయబోతున్నాడట. ఒకవేళ అదే నిజమైతే సుకుమార్‌ మళ్లీ రీషూట్‌కి వెళ్తాడా? లేదా ఇప్పటికే ఫిక్స్‌ అయిన వాటి నుంచి బెస్ట్‌ క్లైమాక్స్‌ని యాడ్‌ చేస్తారా? అనేది తెలియాక ఫ్యాన్స్‌ టెన్షపడుతున్నారట. ఒకవేళ రీషూట్‌కి వెళ్తే మాత్రం పుష్ప 2 ఆగస్ట్‌ 15కి రిలీజ్‌ కావడం కష్టమే అని సినీ పండితులు చెబుతున్నారు. ఇప్పటికి కెవలం రెండు పాటలను మాత్రమే విడుదల చేశారు. ఇంకా నాలుగు పాటలను రిలీజ్‌ చేయాల్సి ఉంది. ఒక స్పెషల్‌ సాంగ్‌ షూటింగ్‌ కూడా చేయాలి. ఇలా చాలా పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇలాంటి తరుణంలో క్లైమాక్స్‌ చేంజ్‌ అని వార్తలు వినిపించడం బన్నీ అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. ఇక ఈ చిత్రంలో అల్లు అర్జున్‌కి జోడిగా రష్మిక నటించగా.. ఫహాద్‌ ఫాజిల్‌, ధనుంజయ్‌, సునీల్‌, అనసూయ కీలక పాత్రలు పోషించారు.

Satyanash Kar Diya Hai: Ex PCB Chief On Pakistan Ahead Of T20 WC 2024
‘జట్టును సర్వనాశనం చేశారు.. వాళ్లను విడదీశారు’

టీ20 ప్రపంచకప్‌-2024 ఆరంభానికి ముందు పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-0తో ఓటమిపాలైంది. రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు కాగా.. మిగిలిన రెండింటిలో బట్లర్‌ బృందం చేతిలో ఓడి సిరీస్‌ను చేజార్చుకుంది.కాగా వన్డే ప్రపంచకప్‌-2023లో కనీసం సెమీస్‌ కూడా చేరకుండానే పాకిస్తాన్‌ నిష్క్రమించడంతో తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో కెప్టెన్‌ బాబర్‌ ఆజం నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశాడు.ఫలితంగా అతడి స్థానంలో టీ20లకు పేసర్‌ షాహిన్‌ ఆఫ్రిది, టెస్టులకు షాన్‌ మసూద్‌ను కెప్టెన్లుగా నియమించింది అప్పటి పాక్‌ క్రికెట్‌ బోర్డు. అయితే, వీరిద్దరి సారథ్యంలో పాక్‌ ఆస్ట్రేలియా(టెస్టు), న్యూజిలాండ్‌(టీ20) వైట్‌వాష్‌కు గురైంది.తిరిగి కెప్టెన్‌గామరోవైపు.. పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డులోనూ ఎప్పటికప్పుడు మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో వన్డే, టీ20లకు బాబర్‌ ఆజం తిరిగి కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ప్రపంచకప్‌-2024లోనూ జట్టును ముందుండి నడిపించనున్నాడు.అయితే, అంతకంటే మందు మెగా టోర్నీ సన్నాహకాల్లో భాగంగా ఇంగ్లండ్‌ చేతిలో పాక్‌ ఇలా పరాభావానికి గురైంది. ఈ నేపథ్యంలో పీసీబీ మాజీ చైర్మన్‌ రమీజ్‌ రాజా మేనేజ్‌మెంట్‌ తీరుపై మండిపడ్డాడు. ప్రయోగాలకు పోయి జట్టును సర్వనాశనం చేశారంటూ తీవ్రస్థాయిలో విమర్శించాడు.ఇప్పటికే జట్టును సర్వనాశనం చేసేశారు‘‘ఇప్పటికైనా ప్రయోగాలు ఆపండి. సరైన కూర్పుతో జట్టును బరిలోకి దించండి. స్ట్రైక్‌రేటు అనే ఫోబియా నుంచి బయటపడండి. ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు అంతగా దంచికొట్టే ఆటగాళ్లు లేరు.ఇప్పటికే జట్టును సర్వనాశనం చేసేశారు. అత్యుత్తమ ఓపెనింగ్‌ జోడీ(బాబర్‌ ఆజం- మహ్మద్‌ రిజ్వాన్‌)ను విడదీశారు. మిడిలార్డర్‌లో ఎవరిని ఆడించాలో మీకే స్పష్టత లేదు.ఇద్దరు వికెట్‌ కీపర్లు ఎందుకు?ఆల్‌రౌండర్లందరినీ తెచ్చి మిడిలార్డర్‌లో కుక్కేశారు. ఇద్దరు వికెట్‌ కీపర్లు తుదిజట్టులో ఆడుతున్నారు. ఫాస్ట్‌ బౌలర్లను తరచూ మారుస్తున్నారు. మీ స్పిన్నర్లు బంతిని ఏమాత్రం స్పిన్‌ చేయడం లేదు.వాళ్లలో అసలు ఆత్మవిశ్వాసం కనబడటం లేదు. తుదిజట్టు నుంచి ఇమాద్‌ వసీం(స్పిన్నర్‌)ను ఎందుకు తప్పించారు?.. మిగతా వాళ్ల స్థానాల విషయంలోనూ క్లారిటీ లేదు. ఏదేమైనా టీ20 ప్రపంచకప్‌ వంటి మెగా ఈవెంట్‌కు ముందు జట్టును మొత్తం భ్రష్టుపట్టించారు’’ అని మాజీ బ్యాటర్‌ రమీజ్‌ రాజా పాక్‌ బోర్డు తీరును తూర్పారబట్టాడు.కాగా కివీస్‌తో టీ20 సిరీస్‌ సందర్భంగా సయీమ్‌ ఆయుబ్‌ను ఓపెనర్‌గా ప్రమోట్‌ చేసిన పీసీబీ.. బాబర్‌ను వన్‌డౌన్‌లో ఆడించింది. 21 ఏళ్ల ఆయుబ్‌ న్యూజిలాండ్‌తో సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడి కేవలం 52 పరుగులు చేశాడు. కాగా టీ20లలో పాక్‌ అత్యుత్తమ ఓపెనింగ్‌ జోడీగా బాబర్‌- రిజ్వాన్‌ రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. గత టీ20 ప్రపంచకప్‌-2022లో 105 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఇక ఈ ఏడాది వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌ జూన్‌ 6న యూఎస్‌ఏతో తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఆ తర్వాత చిరకాల ప్రత్యర్థి టీమిండియాను జూన్‌ 9న ఢీకొట్టనుంది.చదవండి: రోహిత్‌, విరాట్‌ భార్యలను గమనిస్తేనే తెలిసిపోతుంది: గంగూలీ

 In Battle For 11000 Crore Tobacco Empire Son Accuses Mother Of Assault
రూ. 11వేల కోట్ల టుబాకో సామ్రాజ్యం : ముదిరిన తల్లీ కొడుకుల పోరు

పాపులర్‌ సిగరెట్‌ కంపెనీ గాడ్‌ఫ్రే ఫిలిప్స్ మధ్య రగిలిన ఫ్యామిలీ వార్‌ మరింత ముదురుతోంది. గాడ్‌ఫ్రే ఫిలిప్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సమీర్ మోడీ తల్లి తనపై దాడికి పాల్పడిందని ఆరోపించారు. ఢిల్లీలోని జసోలా ఆఫీస్‌లో జరగాల్సిన బోర్డు మీటింగ్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించినందుకు గాడ్‌ఫ్రే ఫిలిప్స్‌కు చెందిన పలువురు డైరెక్టర్లు, తన తల్లి బీనా మోడీ వ్యక్తిగత భద్రతా అధికారి (పిఎస్‌ఓ) పలువురు డైరెక్టర్లు తనను తీవ్రంగా గాయపరిచారని ఆరోపిస్తూ సమీర్ శుక్రవారం ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రూ. 11,000 కోట్ల వారసత్వంపై కొనసాగుతున్న ఫ్యామిలీ వార్‌ మరింత తీవ్రమైంది.బోర్డ్‌ మీటింగ్‌కి హాజరయ్యే ప్రయత్నంలో, తల్లి బీనా పీఎస్‌ఓవో నెట్టివేయడంతో తన చూపుడి వేలుకి తీవ్ర గాయమైందనీ, అదిక పూర్తిగా పనిచేయదని వైద్యులు తెలిపారంటూ సరితా విహార్ పోలీస్ స్టేషన్‌లో దాఖలు చేసిన ఫిర్యాదులో మోడీ పేర్కొన్నారు.‘‘నా సొంత కార్యాలయంలోనే దాడి జరుగుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. "షేర్ల సెటిల్‌మెంట్‌పై కోర్టు కేసు పెండింగ్‌లో ఉండగా, ఇప్పుడు నా వాటాను విక్రయించను. నన్ను బోర్డు నుండి తొలగించే ప్రయత్నాన్ని అడ్డుకుంటాను’’ అంటూ సమీర్ మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ ఆరోపణలను గాడ్‌ఫ్రే ఫిలిప్స్ ప్రతినిధి ఆరోపణలను ఖండించారు. ఇవి పూర్తిగా అబద్ధం, దారుణమైన ఆరోపణలని పేర్కొన్నారు. ఈ ఘటన ఇంట్లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యిందని, అవి చూస్తే ఈ ఘటనపై స్పష్టత వస్తుందన్నారు.కాగా 2019లో గాడ్‌ఫ్రే ఫిలిప్స్ అధినేత కేకే మోడీ మరణంతర్వాత కుటుంబం వారసత్వ సంపదపై వివాదం మొదలైంది. అప్పటినుంచి కలహాలుకొనసాగుతున్నాయి.గాడ్‌ఫ్రే ఫిలిప్స్ ప్రస్తుత సీఈఓ బీనా మోడీ ట్రస్ట్ డీడ్ నిబంధనలను ఉల్లంఘించి కంపెనీని తన ఆధీనంలోకి తీసుకున్నారని సమీర్ ఆరోపిస్తూ దావా వేశారు. అయితే మొదట తల్లి బీనా నిర్ణయానికి సమీర్, అతని సోదరి, చారు మోడీ మద్దతు ఇచ్చారు. అయితే, దీనిని వ్యతిరేకించిన లలిత్ మోడీ ట్రస్టు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.దీంతో అతని వాటా అతని కిచ్చేశారు. తరువాత కుటుంబ సంపదను పంచమని కోరడంతో వచ్చిన విభేదాల నేపథ్యంలో ఈ వివాదం ప్రస్తుం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. సమీర్ మోడీ 1933లో తన తాత గుజర్మల్ మోడీ స్థాపించిన మోడీ ఎంటర్‌ప్రైజెస్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అలాగే గాడ్‌ఫ్రే ఫిలిప్స్ ఇండియాకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూడా.

Minister Jogi Ramesh Satirical Comments On Chandrababu Foreign Tour
బాబు.. దోచుకుంది దాచుకునేందుకు విదేశాలకు వెళ్లావా?: జోగి రమేష్‌

సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు విదేశీ పర్యటనను గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించారు మంత్రి జోగి రమేష్‌. ఎన్నిసార్లు అడిగినా చంద్రబాబు విదేశీ పర్యటనపై ఎందుకు సమాధానం చెప్పడం లేదన్నారు.కాగా, మంత్రి జోగి రమేష్‌ శనివారం మీడియాతో​ మాట్లాడుతూ..‘చంద్రబాబు విదేశీ పర్యటన మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. మొదట హైదరాబాద్ నుండి దుబాయ్ వెళ్లారని అన్నారు. ఆ తర్వాత అక్కడ్నుండి‌ ఎక్కడకు వెళ్లారు?. వైద్యం కోసం అమెరికా వెళ్లాడని ఎల్లోమీడియా రాసింది. అబ్బే ఆయన అమెరికా రాలేదని ఆయన పార్టీ నేతలే అన్నారు. అసలు ఇంత రహస్యంగా ఎందుకు వెళ్లారు? ఎక్కడకు వెళ్లారు?. చంద్రబాబుకు ప్రచార పిచ్చి బాగా మురిదిపోయింది.ఈ రహస్య పర్యటన వెనుక‌ కారణం ఏంటి?. దోచుకున్న డబ్బుని దాచుకోవటానికి వెళ్లారా?. విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి వెళ్లారో ప్రజలకు చెప్పాలి. ఏ దేశం వెళ్లినా ఒక ఫోటో దిగి పంపించే చంద్రబాబు.. ఈసారి ఎందుకు ఫోటోలు కూడా పంపలేదు?. అసలు ఈ పది రోజులు ఎక్కడకు వెళ్లారో ఎందుకు చెప్పటం లేదు?. ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఆయన పర్యటన గురించి ప్రజలకు అవసరం. మా నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి లండన్ వెళ్తాడని టైంతో సహా మేము చెప్పాం. మరి చంద్రబాబు పర్యటనపై ఎందుకంత గోప్యత?. ఇప్పటికైనా చంద్రబాబు పర్యటన వివరాలను ప్రజలకు వివరించాలి.అవినీతిపరుడైన ఏబీ వెంకటేశ్వరరావును టీడీపీ నేతలు అక్కున చేర్చుకున్నారు. దేవినేని ఉమా సహా అందరూ వెళ్లి అవినీతిపరుడిని సత్కరించారు. ఈరోజు వచ్చే ఎగ్జిట్ పోల్స్ దెబ్బకి టీడీపీకి దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది. నాలుగో తేదీన ఫలితాలు చూసిన తర్వాత చంద్రబాబుకు మూర్చ వస్తుంది. ఆ రోజున కూటమి కుదేలవుతుంది. వైఎస్సార్‌సీపీ​ శ్రేణులంతా సంబరాలకు సిద్ధం కావాలి. పండుగ వాతావరణంలో సంబరాలు జరుపుకోవాలి. సీఎం జగన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవ్వాలని పిలుపునిస్తున్నాం’ అంటూ కామెంట్స్‌ చేశారు.

Mother Died Before Voting Begins Son Says
‘ముందు ఓటు.. తర్వాతే తల్లి అంత్యక్రియలు’

దేశంలో లోక్‌సభ ఎన్నికల తుది విడత పోలింగ్‌ నేడు(శనివారం) జరుగుతోంది. దీనిలో భాగంగా బీహార్‌లోని జెహనాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి కూడా పోలింగ్‌ కొనసాగుతోంది. అయితే ఈ నియోజక వర్గంలో ఒక విచ్రిత ఉదంతం వెలుగు చూసింది. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురిచేయడమే కాకుండా ఓటర్లకు ఆదర్శంగా నిలుస్తోంది.జెహనాబాద్‌లోని బూత్ నంబర్ 151 పరిధిలోని దేవ్ కులీ గ్రామానికి చెందిన మిథిలేష్‌ యాదవ్‌, మనోజ్‌ యాదవ్‌ల తల్లి వృద్ధాప్య సమస్యలతో మృతి చెందింది. అయితే కుటుంబ సభ్యులు ఓటు వేసి, వచ్చాకనే ఆ మహిళకు దహన సంస్కారాలు చేయాలని నిర్ణయించుకున్నారు.ఈ సందర్భంగా మృతురాలి కుమారుడు మనోజ్‌యాదవ్‌ మాట్లాడుతూ ఐదేళ్లకోసారి ఓటింగ్ వస్తుందని, ఇవి ఎంతో ముఖ్యమైనవని, అందుకే తామంతా ముందుగా ఓటువేయాలనుకున్నామని తెలిపారు. ఓటింగ్‌ పూర్తయ్యాకనే తల్లికి దహన సంస్కారాలు చేస్తామన్నారు.మృతురాలి కుటుంబానికి చెందిన ఉషాదేవి మాట్లాడుతూ ఓటింగ్ అనేది తప్పనిసరి అని, అందుకే ముందుగా ఓటు వేయబోతున్నామని తెలిపారు. వారంతా క్యూలో నిలుచుని, తమ వంతు వచ్చాక ఓటువేశారు. ఆ తర్వాత తల్లి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.

Gold rates on today commodity market in various places in country
తగ్గిన బంగారం, వెండి ధర.. ఎంతో తెలుసా..?

ఈక్విటీమార్కెట్‌లు ఇటీవల భారీగా పడిపోయాయి. దాంతో బంగారం ధరలు పుంజుకున్నాయి. శుక్రవారం మార్కెట్‌లో స్టాక్‌సూచీలు తీవ్రఒడిదుడుకులతో చివరకు స్వల్పలాభాలతో ముగిశాయి. దాంతో బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వివిధ ప్రాంతాల్లో శనివారం గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.66,500 (22 క్యారెట్స్), రూ.72,550 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. శుక్రవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల ధరలు వరుసగా రూ.200, రూ.210 తగ్గింది.చెన్నైలో శనివారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.200, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.220 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.67,100 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.73,200 (24 క్యారెట్స్ 10 గ్రామ్‌ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో కూడా నేడు బంగారం ధరలు తగ్గాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు రూ.66,650.. 24 క్యారెట్ల ధర రూ.72,700కు చేరాయి. మార్కెట్‌లో శనివారం కేజీ వెండి ధర ఏకంగా రూ.2000 తగ్గి రూ.98,000కు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement