Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

CM YS Jagan Viajayawada To Visit IPac Office Updates
మళ్లీ మనదే అధికారం.. చరిత్ర సృష్టించబోతున్నాం: సీఎం జగన్‌

ఎన్టీఆర్‌, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వైఎస్సార్‌సీపీ ప్రభంజనం ఖాయమని, మళ్లీ అధికారంలోకి రాబోతోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం మధ్యాహ్నాం ఐప్యాక్‌ ప్రతినిధులతో భేటీ అయిన సీఎం జగన్‌ ఎన్నికల ఫలితాల్ని అంచనా వేశారు. ‘‘మళ్లీ అధికారంలోకి వస్తున్నాం. మరోసారి చరిత్ర సృష్టించబోతున్నాం. 2019లో 151 సీట్లు, 22 ఎంపీ సీట్లు గెలిచాం. ఈసారి గతంలో కంటే ఎక్కువ సీట్లే గెలుస్తాం. ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టించబోతోంది. జూన్‌4వ తేదీన రాబోయే ఏపీ ఫలితాలు చూసి దేశం షాక్‌ అవుతుంది. ఫలితాల తర్వాత దేశం మొత్తం మనవైపే చూస్తుంది. ‘‘ప్రశాంత్‌ కిషోర్‌ ఆలోచించలేనన్ని సీట్లు వస్తాయి. ప్రశాంత్‌ కిషోర్‌ చేసేది ఏమీ లేదు. అంతా టీమే చేస్తుంది. వచ్చే ప్రభుత్వంలో ఐదేళ్లపాటు ప్రజలకు ఇంకా ఎక్కువ మేలు చేద్దాం. రానున్న రోజుల్లో ఈ ప్రయాణం ఇలాగే కొనసాగుతుంది’’ అని ఐప్యాక్‌ ప్రతినిధులతో సీఎం జగన్‌ అన్నారు.ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ కోసం పొలిటికల్‌ కన్సల్టెన్సీగా ఐప్యాక్‌ పని చేసిన సంగతి తెలిసిందే. గురువారం మధ్యాహ్నాం బెంజిసర్కిల్‌లో ఉన్న ఇండియన్‌ పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీ(I-Pac) కార్యాలయానికి వెళ్లిన సీఎం జగన్‌.. సుమారు అరగంటపాటు అక్కడి ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఐ-ప్యాక్‌ ప్రతినిధులతో సీఎం జగన్‌ టీం సభ్యులతో సెల్ఫీలు దిగుతూ కాసేపు సరదాగా గడిపారు.

Palnadu And Anantapur Sps Have Been Suspended By The Ec
పచ్చ కుట్రపై ఈసీ యాక్షన్‌

సాక్షి, ఢిల్లీ: ఏపీలో ఎన్నికల అనంతరం హింసపై ఈసీ కఠిన చర్యలు తీసుకుంది. హింసపై దర్యాప్తునకు సిట్‌ ఏర్పాటు చేసింది. రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని సిట్‌ను ఈసీ ఆదేశించింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై వేటు వేసింది. పల్నాడు కలెక్టర్‌, తిరుపతి ఎస్పీపై ఈసీ బదిలీ వేటు వేయగా, పల్నాడు, అనంతపురం ఎస్పీలను సస్పెన్షన్‌ చేసింది.పల్నాడు, అనంతపురం, తిరుపతిలోని 12 మంది ఎస్‌ఐలను సస్పెండ్‌ చేసింది. అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అల్లర్లకు పాల్పడిన వారిపై ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయాలని ఈసీ ఆదేశించింది. హింసాత్మక ఘటనలపై చర్యలు తీసుకోవాలని సీఎస్‌, డీజీపీలను ఆదేశించిన ఈసీ.. 25 కంపెనీల పారా మిలటరీ బలగాలను కొనసాగించాలని పేర్కొంది.ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ గుప్తా కేంద్ర ఎన్నికల సంఘం ముందు హాజరయ్యారు. రాష్ట్రంలో పోలింగ్‌ రోజు, ఆ తరువాత హింసాత్మక ఘటనలు చోటు చేసు­కోవ­టాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. దీనిపై స్వయంగా హాజరై వివరణ ఇవ్వా­లని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కె.ఎస్‌.జవహర్‌రెడ్డి, డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తాను ఆదేశించింది. ఈ నేపథ్యంలో వారిద్దరూ ఢిల్లీ వెళ్లి ఈసీకి వివరణ ఇచ్చారు.పోలింగ్‌ అనంతరం పల్నాడు, కారంపూడి, చంద్రగిరి, తాడిపత్రిలో ఘర్షణలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి హెచ్చరించినా స్థానిక పోలీ­సులు నిర్లక్ష్యంగా వ్యవహరించటాన్ని తీవ్రంగా పరి­గ­ణించిన ఈసీ బాధ్యులపై చర్యలు చేపట్టింది.

CM YS Jagan Says YSRCP Will Big Win AP Elections
‘ఫ్యాన్’‌దే ప్రభంజనం.. సీఎం జగన్‌ సరికొత్త రికార్డ్‌!

ఏపీ రాజకీయ చరిత్రలోనే వైఎస్సార్‌సీపీ సరికొత్త చరిత్ర లిఖించబోతుంది. ‘ఫ్యాన్‌’ ప్రభంజనం సృష్టించబోతోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఐదేళ్ల పాలనకు ప్రజలు జైకొట్టారు. ప్రతిపక్షాలు, పచ్చ బ్యాచ్‌ దిమ్మతిరిగిపోయే విధంగా ప్రజలు తీర్పునిచ్చినట్టు సీఎం జగన్‌ ప్రకటన చేశారు.సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారంలోకి అడుగుపెట్టిన నాటి నుంచి ప్రజలే తనకు స్టార్‌ క్యాంపైనయిర్స్‌ అని చెప్పారు. తాను నమ్మకుంది ఆ దేవుడు, ప్రజలనేనని అన్ని వేదికలపైనా ప్రస్తావించారు. ఇక, సీఎం జగన్‌ అందిస్తున్న సంక్షేమ పథకాలు అందితేనే వైఎస్సార్‌సీపీకి ఓటు వేయాలని కోరారు. ఆయన మాటలు ప్రతీ ఒక్క కుటుంబాన్ని చేరుకున్నాయి. సీఎం జగన్‌ చేసిన సాయాన్ని ఎవరూ మరిచిపోలేదు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నాయకత్వం పట్ల, పాలన పట్ల నమ్మకం ఉంచారు.అందుకే 2024 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకే భారీగా ఓట్లు వేశారు. రాష్ట్రంలో పోలింగ్‌ శాతం పెరగడం కూడా ఇందుకు ఒక ఉదాహారణ. ఇక, 2019లో వచ్చిన సీట్ల కన్నా ఈసారి మరిన్ని ఎక్కువ సీట్లు వస్తాయని సీఎం జగన్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే, సీఎం జగన్‌ ఇప్పటి వరకు చేసిన ఏ ప్రకటన అయినా ఆచితూచి మాత్రమే చేశారు.పేదలు వర్సెస్‌ పెత్తందారులు అన్న ఎన్నికల నినాదాన్ని ముందుకు తీసుకెళ్లిన సీఎం జగన్‌.. ఈసారి వచ్చే ఫలితాలు ప్రభంజనం సృష్టిస్తాయని చెప్పుకొచ్చారు. ఇప్పుడు కూడా విజయంపై కచ్చితమైన సమాచారంతోనే ఆయన ఇలాంటి ప్రకటన చేశారని రాజకీయ వర్గాలు సైతం చెబుతున్నాయి. సీఎం జగన్‌ సంచలన ప్రకటనతో కూటమి నేతలు డీలా పడినట్టు తెలుస్తోంది.అయితే, ముఖ్యమంత్రి జగన్‌ పూర్తిగా ప్రాక్టికల్‌గా ఉండే వ్యక్తి. ఆయన ఏ పని చేసినా పూర్తి పారదర్శకంగా ఉంటారు. వేర్వేరు సమీకరణాలు అన్నీ పరిశీలించి ముందడుగు వేస్తారు. ఎన్నికల సందర్భంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల మార్పు సమయంలో కూడా కచ్చితమైన నిర్ణయాలే తీసుకున్నారు. ప్రతిపక్షాలు, సీఎం జగన్‌ అంటే గిట్టని వారు ఎన్ని కామెంట్స్‌ చేసినా ఆయన అవేవీ పట్టించుకోకుండా ముందుకుసాగారు. ఎంతో దమ్ము, ధైర్యంతో అభ్యర్థులను మార్చారు. ఒక నాయకుడిగా తన నాయకత్వం మీద, పార్టీ మీద, పాలన మీద ఉన్న నమ్మకాన్ని ఈ ప్రకటన సంకేతంగా మారిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక, ఏపీ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చేసిన ఫస్ట్‌ రియాక్షన్‌ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. ఇప్పటివరకు టైట్‌ ఫైట్‌, ఎవరికి ఎడ్జ్‌ తెలియదన్నట్టుగా వార్తలు రాసుకొచ్చిన మీడియా సంస్థలు కూడా.. సీఎం జగన్‌ చేసిన ప్రకటన పట్ల షాక్‌ తిన్నాయి. ఒక నాయకుడు.. ఎంతో నమ్మకంగా చేసిన ఒక ధృడమైన ప్రకటన.. వైనాట్‌ 175 నినాదాన్ని చర్చనీయాంశం చేశాయి.

Jaishankar veiled dig at Nehru Over Control Of Pak Occupied Kashmir
కొందరి బలహీనత వల్లే పీఓకే చేజారింది.. నెహ్రూపై విదేశాంగ మంత్రి

పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) భారత్‌లో అంతర్భాగమేనని విదేశాంగ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. కొంతమంది బలహీనత వల్లే పీఓకేపై భారత్‌ నియంత్రణ కోల్పోయిందని ఆరోపించారు. ఒకరు చేసిన పొరపాటే దీనికి కారణమని చెప్పారు. భారత తొలి ప్రధాని జవహార్‌లాల్‌ నెహ్రూ, కాంగ్రెస​్‌ పార్టీని పరోక్షంగా ఉద్ధేశిస్తూ జైశంకర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని నాసిక్‌లో ‘విశ్వబంధు భారత్’ పేరుతో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి ప్రసంగిస్తూ పీఓకేపై జై శంకర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్ విలీనం చేసుకునే విషయమై లక్ష్మణ రేఖ వంటివి ఉన్నాయంటే తాను నమ్మబోనని చెప్పారు.లక్ష్మణ రేఖ వంటిది ఏదీ లేదని పేర్కొన్నారు. భారత్‌లో పీఓకే అంతర్భాగమని తాను భావిస్తున్నట్లు తెలిపారు. కొందరి బలహీనత వల్లే పీఓకే తాత్కాలికంగా మన నుంచి చేజారిందని, దానిపై పట్టు కోల్పోవడానికి వారి పొరపాటే కారణం అని నెహ్రూపై పరోక్షంగా ఆరోపణలు చేశారు. విశ్వ వేదికపై మన స్థానాన్ని బలంగా ఉంచుకోవాలని భావిస్తున్నానని, స్వీయ విశ్వాసాన్ని ఏనాడూ వీడొద్దన్నారు.చైనా-పాకిస్తాన్‌ ఎకనామిక్‌ కారిడార్‌, పాక్‌తో బీజింగ​ సహకారంపై జై శంకర్‌ విమర్శలు గుప్పించారు. ‘నేను చైనా రాయబారిగా ఉన్నాను, చైనా గత చర్యల గురించి మనందరికీ తెలుసు. ఈ భూమిని పాకిస్తాన్ లేదా చైనా తమదని చెప్పుకోలేదని మేము వారికి పదేపదే చెప్పాము. సార్వభౌమాధికారం ఉన్నవారు ఎవరైనా ఉన్నారంటే, అది భారతదేశం. మీరు ఆక్రమిస్తున్నారు, మీరు అక్కడ నిర్మిస్తున్నారు, కానీ చట్టపరమైన హక్కు మాదే.’నని పేర్కొన్నారు.చైనా పాకిస్తాన్‌ మధ్య 1963 సరిహద్దు ఒప్పందాన్ని కూడా జైశంకర్ ఎత్తి చూపారు. అక్కడ పాకిస్తాన్ దాదాపు 5,000 కి.మీ భూభాగాన్ని చైనాకు అప్పగించిందని అన్నారు. ‘1963లో, పాకిస్తాన్- చైనా తమ స్నేహాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అంగీకరించాయి. చైనాను దగ్గరగా ఉంచడానికి, పాకిస్తాన్ ఆక్రమిత భూభాగంలో దాదాపు 5,000 కి.మీలను డ్రాగన్‌కు అప్పగించింది. ఈ ప్రాంతం భారతదేశానికి చెందింది’ ఆయన తెలిపారు.

Minister Botsa Satyanarayana Comments On Chandrababu
విశాఖలో జూన్‌ 9న సీఎంగా వైఎస్‌ జగన్‌ ప్రమాణం: మంత్రి బొత్స

సాక్షి, విజయవాడ: సీఎం జగన్‌ విద్య, వైద్యంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. జూన్‌ 9న విశాఖలో సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎం జగన్‌ చేసేదే చెప్తారు.. మంచి జరిగే నిర్ణయాలనే తీసుకుంటారన్నారు.ప్రజలంతా మళ్లీ ముఖ్యమంత్రిగా జగనే ఉండాలని కోరుకున్నారు. టీడీపీ అసహనంతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది. ఎన్నికల్లో సీఎం జగన్‌ కొత్త ట్రెండ్‌ తీసుకొచ్చారు. వైనాట్‌ 175 లక్ష్యానికి దగ్గరగా సీట్లు గెలవబోతున్నాం. మరోసారి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రావాలనే విధంగా ప్రజలు ఓటింగ్‌లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అన్ని వర్గాలవారిని సమానంగా చూసిన వ్యక్తి సీఎం జగన్‌ ఎన్టీఆర్‌, వైఎస్సార్‌ హయాంలో వచ్చిన పాజిటివ్‌ వైబ్రేషన్స్‌ ఇప్పుడు మళ్లీ వస్తున్నాయి.’’ మంత్రి బొత్స చెప్పారు.‘‘మేము అధికారంలోకి రాగానే అందరూ తోక ముడుస్తారు. టీడీపీ అసహనంతో దాడులు చేసింది. మేము సంయమనం పాటిస్తున్నాం. మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓట్లు వేయండని ధైర్యంగా చెప్పిన వ్యక్తి జగన్‌. గతంలో చంద్రబాబు హామీలు ఇచ్చి మాట తప్పారు. బాబుకు అధికారం ఇస్తే మళ్లీ కష్టాలు వస్తాయి.. మళ్లీ పెత్తందారులు వస్తారని ప్రజలు భయపడ్డారు. చంద్రబాబుది మేకపోతు గాంభీర్యం’’ అంటూ మంత్రి బొత్స ఎద్దేవా చేశారు.

Niti Aayog Sensational Announcement On Land Titling Act
ల్యాండ్ టైట్లింగ్‌ యాక్ట్‌పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన

సాక్షి, ఢిల్లీ: ల్యాండ్ టైట్లింగ్‌ యాక్ట్‌పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన చేసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భేష్ అన్న నీతి ఆయోగ్‌.. ఈ చట్టం తో రైతుల భూములు లాక్కునే పరిస్థితి ఉండదని స్పష్టం చేసింది. ఈ చట్టం వల్ల భూములన్నీ మరింత భద్రం అని.. భూములపై రైతులకు సర్వహక్కులు లభిస్తాయని పేర్కొంది.పటిష్టమైన భూ యాజమాన్య నిర్వహణకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని.. ఈ చట్టంతో భూ పరిపాలన మరింత సులువవుతుందన్న నీతి ఆయోగ్‌.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై దుష్ప్రచారానికి చెక్ పెట్టింది. సాక్షి డిప్యూటీ ఇన్ పుట్ ఎడిటర్ వెంకటేష్ అడిగిన ఆర్టీఐ ప్రశ్నకు నీతి ఆయోగ్‌ సమాధానం పంపింది.ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్” కు వ్యతిరేకంగా జరిగిన విస్తృత ప్రచారానికి నీతి అయోగ్ వివరణతో రైతుల్లో భరోసా, నమ్మకం పెరగనుంది. ఇక ల్యాండ్ టైట్లింగ్‌ యాక్ట్ పై రైతుల అనుమానాలు తొలగనున్నాయి. ల్యాండ్ టైట్లింగ్‌ యాక్ట్‌పై రైతులను తప్పుదోవ పట్టించిన ప్రచారానికి చెల్లు చీటీ పడింది.అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే నీతి ఆయోగ్‌ సమాధానం పంపింది. నీతి ఆయోగ చైర్మనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. కాగా, టీడీపీ-జనసేన కూటమి దుష్ప్రచారానికి ఇక చెక్ పడినట్లే.. ల్యాండ్ టైట్లింగ్‌ యాక్ట్‌తో రైతులకు టైటిల్ పై పరిపూర్ణ హక్కుల లభిస్తాయని ఇప్పటికే సీఎం జగన్‌ స్పష్టం చేశారు. సీఎం జగన్ మాటనే బలపరుస్తూ నీతి ఆయోగ్‌ సమాధానం ఇచ్చింది. ఈ అంశంతో మరోసారి విశ్వసనీయతకు సీఎం జగన్‌ మారుపేరుగా నిలిచారు.కాగా, ఓటమి భయంతో చంద్రబాబు గ్యాంగ్‌ ల్యాండ్ టైట్లింగ్‌ యాక్ట్‌పై ప్రజల్లో లేనిపోని అనుమానాలు సృష్టించే ప్రయత్నం చేసింది. చెప్పుకోవడానికి చంద్రబాబుకు ఏమీ లేక వైఎస్‌ జగన్‌పైన, ఆయన ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేసి, ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగానే ప్రజల భూములపై వారికే హక్కులు కల్పించేలా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తెస్తున్న ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై నీచమైన ప్రచారానికి ఒడిగట్టింది. భూముల వ్యవస్థను సమూలంగా మార్చడం ద్వారా ప్రజలకు.. తద్వారా సమాజానికి, రాష్ట్రానికి ఎంతో మేలు చేసే ఈ చట్టాన్ని స్వలాభం కోసం వివాదాస్పదంగా మార్చింది.భూముల సమగ్ర సర్వే ద్వారా భూమి రికార్డులను ఆధునీకరించి వాటిపై ప్రజలకు శాశ్వత భూ హక్కులు కల్పించేదే ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం. దీనివల్ల రికార్డుల భద్రత, రిజిస్ట్రేషన్లలో పారదర్శకత, ఆస్తుల రక్షణకు ప్రభుత్వ గ్యారంటీ లభిస్తాయి.ప్రస్తుతం భూమి హక్కులు అంటే కనీసం 30 రికార్డులు చూసుకోవాలి. అన్ని వివరాలూ స్పష్టంగా ఉన్నా, 30 పత్రాలు బాగున్నా ఏదో ఒక విధంగా కేసులు పెట్టే పరిస్థితి ఉంది. దీంతో ఏ భూమినైనా వివాదాస్పదంగా మార్చొచ్చు. వివాదంలో ఉన్న భూమిని తిరిగి భూ యజమాని తన పేరు మీదకు తెచ్చుకోవాలంటే కోర్టుకే వెళ్లాలి. ఏళ్లకు ఏళ్లు వేచి చూడాలి. కింది కోర్టు, పైకోర్టు అంటూ తిరగాలి. ఈ అవస్థలన్నింటినీ తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టాన్ని తీసుకువచ్చింది.

Mahindra XUV 3XO Bookings Crossed 50000 in 60 Minutes
బుకింగ్స్‌లో సరికొత్త రికార్డ్.. మార్కెట్లో మహీంద్రా కారు సంచలనం

గత నెల చివరలో దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త మహీంద్రా XUV 3XO కారు బుకింగ్స్ బుధవారం (మే 15) ప్రారంభయ్యాయి. బుకింగ్స్ ప్రారంభమైన కేవలం 10 నిమిషాల్లో మహీంద్రా కొత్త కారు 27000 బుకింగ్స్ పొందింది. అదే విధంగా 60 నిమిషాల్లో 50000 బుకింగ్స్ పొందింది.మహీంద్రా కంపెనీ ఇప్పటికే 10000 కార్లను (XUV 3XO) ఉత్పత్తి చేసినట్లు సమాచారం. కాబట్టి డెలివరీలు ఈ నెల 26 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ కొత్త కారు మొత్తం 9 వేరియంట్లలో విడుదలైంది. XUV 3XO ప్రారంభ ధర రూ. 7.49 లక్షలు.తొమ్మిది వేరియంట్లు, ఎనిమిది కలర్ ఆప్షన్లలో లాంచ్ అయిన ఈ కొత్త కారు మూడు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. మంచి డిజైన్ కలిగిన ఈ కారు లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో కొత్త ఫ్రంట్ అండ్ రియర్ బంపర్‌లు, లెవల్ 2 ఏడీఏఎస్, పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, 65W టైప్-సి ఛార్జింగ్ పోర్ట్, ఆటో హోల్డ్ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.Crossing milestones even before it hits the roads. A big thank you to all our customers who have made this possible. Be a part of our journey, book now: https://t.co/P7UUnkoyxv#XUV3XO    #EverythingYouWantAndMore #The3XFactor pic.twitter.com/HMNylKisa1— Mahindra XUV 3XO (@MahindraXUV3XO) May 15, 2024

IPL 2024 SRH vs GT: Toss has been delayed due to wet outfield
SRH vs GT: మ్యాచ్‌కు వ‌ర్షం అడ్డంకి.. హెచ్‌సీఏ కీల‌క ప్ర‌క‌ట‌న‌

ఐపీఎల్‌-2024లో భాగంగా ఉప్ప‌ల్‌లోని రాజీవ్ గాంధీ అంత‌ర్జాతీయ స్టేడియం వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ మ్యాచ్‌కు వ‌ర్షం అంత‌రాయం క‌లిగించింది. భారీ వ‌ర్షం కార‌ణంగా ఉప్ప‌ల్ మైదానం ఔట్ ఫీల్డ్ చిత్త‌డిగా మారింది. మైదానాన్ని సిద్ధం చేసే ప‌నిలో గ్రౌండ్ స్టాప్ ప‌డ్డారు.అయితే ఇంకా చిన్నపాటి జల్లు కురుస్తుండ‌డంతో సెంట్ర‌ల్ పిచ్‌ను మాత్రం క‌వ‌ర్స్‌తో క‌ప్పి ఉంచారు. దీంతో టాస్ ఆల‌స్యం కానుంది. ఇక ఈ మ్యాచ్ నిర్వ‌హ‌ణ‌పై హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. వ‌ర్షం త‌గ్గినా ఔట్ ఫీల్డ్ త‌డిగా ఉండ‌టంతో మైదానాన్ని సిద్దం చేసుందుకు 100 మందికి పైగా గ్రౌండ్ స్టాప్ శ్రమిస్తున్నార‌ని జగన్ మోహన్ రావు తెలిపారు. మ్యాచ్‌ నిర్వహణకు రాత్రి 10.30 వరకు సమయం ఉన్నట్లు ఆయ‌న పేర్కొన్నారు.

PhonePe Partners With LankaPay Details
భారతీయ పర్యాటకులకు శుభవార్త.. ఇక ఆ దేశంలో 'ఫోన్ పే' సేవలు

యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (UPI) సేవలు విస్తరణ చాలా వేగంగా జరుగుతోంది. ఇప్పటికే పలుదేశాల్లో అందుబాటులో ఉన్న 'ఫోన్ పే' ఇప్పుడు తాజాగా 'లంకాపే'తో చేతులు కలిపింది. ఇది భారతీయ పర్యాటకులకు పెద్ద శుభవార్త అనే చెప్పాలి.శ్రీలంకకు వెళ్లే భారతీయులు ఇకపై ఫోన్ పే యాప్‌తో లంకాపే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అమౌంట్ పే చేయవచ్చు. ఈ సదుపాయం అందుబాటులోకి రావడంతో భారతీయ పర్యాటకులు శ్రీలంకకు వెళ్ళేటప్పుడు ప్రత్యేకంగా డబ్బు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు.ఇప్పటికే ఫోన్ పే సేవలు సింగపూర్, నేపాల్ వంటి దేశాల్లో అమలులో ఉన్నాయి. ఇప్పుడు తాజాగా శ్రీలంక దేశంలో కూడా అందుబాటులోకి వచ్చేసింది.శ్రీలంకలో ప్రారంభమైన ఫోన్ పే సేవల సందర్భంగా.. లంకాపే సీఈఓ చన్నా డి సిల్వా మాట్లాడుతూ, భారతీయ పర్యాటకులు, బిజినెస్‌ ప్రయాణీకులకు శ్రీలంక పర్యటన సమయంలో చెల్లింపు అనుభవాన్ని మెరుగుపరిచే దిశలో ఇది కీలక అడుగు అన్నారు. సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ శ్రీలంక గవర్నర్‌ నందలాల్‌ వీరసింగ్‌ స్పందిస్తూ.. పోటీతత్వాన్ని, శ్రీలంక వ్యాపారులకు ప్రయోజనాలను పెంపొందించడానికి చాలా ఉపయోగకరంగా ఉండదని అన్నారు. ఈ కార్యక్రమానికి బ్యాంకింగ్ అండ్ టూరిజం రంగాల ప్రతినిధులు, వ్యాపార సంఘాల ప్రతినిధులతో సహా శ్రీలంకకు చెందిన ముఖ్య వాటాదారులు హాజరయ్యారు.

Allu Arjun Pushpa 2 The Rule postponed for This Reason
బన్నీ ఫ్యాన్స్‌కు షాక్.. పుష్ప-2 మూవీ వాయిదా..?

ఐకాన్‌ స్టార్‌, సుకుమార్‌ కాంబోలో వస్తోన్న మోస్ట్ అవేటేడ్ మూవీ పుష్ప-2: ది రూల్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌, టీజర్‌ రిలీజ్ చేయగా సోషల్ మీడియాను షేక్ చేశాయి. వీరిద్దరి కాంబోలో వచ్చిన పుష్పకు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. నేషనల్ క్రష్‌ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో యాంకర్ అనసూయ.. మరోసారి దాక్షాయణిగా మెప్పించనున్నారు. తాజాగా అనసూయ బర్త్ డే సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్‌ రివీల్‌ చేశారు మేకర్స్.పుష్ప-2 వాయిదా?అయితే ఇప్పటికే ఈ మూవీ రిలీజ్‌ తేదీని కూడా ప్రకటించారు డైరెక్టర్‌ సుకుమార్‌. ఈ ఏడాది ఆగస్టు 15న థియేటర్లలో పుష్ప-2 సందడి చేయనుందని వెల్లడించారు. అయితే తాజాగా ఈ మూవీ విడుదల వాయిదా పడుతుందనే లేటేస్ట్‌ టాక్‌ వినిపిస్తోంది. పుష్ప-2 మూవీ ఎడిటర్‌ ఆంటోనీ రూబెన్‌ డేట్స్‌ విషయంలో సమస్యలు రావడంతో ఆయన తప్పుకున్నట్లు సమాచారం. మరోవైపు ఎడిటింగ్‌ పూర్తి చేయడానికి నవీన్‌ నూలిని ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. ఈ నేపథ్యంలోనే పుష్ప-2 రిలీజ్ వాయిదా పడుతుందనే వార్తలు ఊపందుకున్నాయి. దీంతో బన్నీ ఫ్యాన్స్‌ ఆందోళనకు గురవుతున్నారు.అదే రోజు రిలీజ్మరోవైపు అల్లు అర్జున్‌ ఈ నెలలో సినిమా షూటింగ్ పూర్తి చేస్తాడని చిత్రయూనిట్ పేర్కొంది. జూన్ నాటికి మిగిలిన షూటింగ్ పూర్తి అవుతుందని.. సినిమా విడుదల విషయంలో ఎలాంటి ఆలస్యం జరగదని అంటున్నారు. కాగా.. ఇప్పటికే ఆగస్టు 15వ తేదీన తప్పకుండా రిలీజ్ చేస్తామని సుకుమార్‌ చాలాసార్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

తప్పక చదవండి

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement