Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

CM YS Jagan Election Campaign Schedule At Mangalagiri
నేడు సీఎం వైఎస్‌ జగన్‌ ఎన్నికల ప్రచారం ఇలా..

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం 10 గంటలకు గుంటూరు లోక్‌సభ స్థానం పరిధిలోని మంగళగిరిలో ఉన్న పాత బస్టాండ్‌ సెంటర్‌లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్‌ పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు చిత్తూరు లోక్‌సభ స్థానం పరిధిలోని నగరి నియోజకవర్గం పుత్తూరులో ఉన్న కార్వేటినగరం రోడ్‌ కాపు వీధి సర్కిల్‌లో జరిగే సభలో సీఎం పాల్గొంటారు. మధ్యా­హ్నం 3 గంటలకు కడపలోని శ్రీపొట్టి శ్రీరాములు సర్కిల్‌లో జరిగే సభలో సీఎం జగన్‌ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.  

మధ్యాహ్నం 1.50 గంటలకు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో సీఎం వైఎస్‌ జగన్‌ ఎన్నికల ప్రచార సభకు ఎండను సైతం  లెక్కచేయకుండా హాజరైన అశేష జనసందోహంలో ఓ భాగం
అది పెత్తందార్ల కూటమి: సీఎం జగన్‌

ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఆప్యాయత చూపిస్తేనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో ఆత్మస్థైర్యం పెరుగు తుంది. గుండెల్లో పెట్టుకుని ప్రేమ చూపిస్తే గ్రామాలు, రాష్ట్రంలో వారికిచ్చే గౌరవం పెరుగుతుంది. వారి ఆత్మగౌరవం ఇనుమడిస్తుంది.ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెబుతున్న బీజేపీతో చంద్రబాబు కొనసాగుతున్నారు. ఆరు నూరైనా ముస్లిం మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు కొనసాగాల్సిందే. ప్రధాని మోదీ సమక్షంలో ఇలా మాట్లాడే ధైర్యం చంద్రబాబుకు ఉందా? ఒక్క రిజర్వేషన్లే కాదు.. ఎన్‌ఆర్‌సీ, సీఏఏతో పాటు ఏ అంశంమైనా సరే ముస్లిం మైనార్టీల మనోభావాలకు, ఇజ్జత్, ఇమాన్‌కు అండగా నిలబడతాం. 175 అసెంబ్లీ సీట్లకుగానూ 4 శాతం అంటే ఏడు అసెంబ్లీ సీట్లు ముస్లింలకు ఇచ్చి పొలిటికల్‌ రిజర్వేషన్లు కూడా కల్పించిన ఏకైక పార్టీ మీ బిడ్డది మాత్రమే. మైనార్టీలకు ఏనాడైనా మంచి చేసిన చరిత్ర చంద్ర బాబుకు ఉందా? ఎన్ని జన్మలకైనా వస్తుందా? చంద్రబాబుది ఊసరవెల్లి రాజకీయం. ఆయన బాగా ముదిరిపోయిన తొండ.– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  సాక్షి ప్రతినిధి కర్నూలు/సాక్షి, అనంతపురం/సాక్షి ప్రతినిధి, కడప: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు కోరుకున్న వాటి గురించి కాకుండా కేవలం చంద్రబాబు, దత్తపుత్రుడు, వది­నమ్మ, రామోజీరావు లాంటి దుష్ట చతుష్ట­యానికి ఏం కావాలి? అని మాత్రమే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా ఆలోచిస్తున్నారని ముఖ్య­మంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. ఎన్నికల సందర్భంగా ఏపీకి వచ్చిన ఢిల్లీ పెద్దలంతా మన రాష్ట్ర ప్రజలకు ఊరట కల్పించేలా ఎలాంటి ప్రకటన చేయకుండా నాలుగు రాళ్లేసి వెళ్లారని వ్యాఖ్యానించారు. అక్కచెల్లెమ్మల అభ్యు­న్నతి, అవ్వాతాతల చిరునవ్వులు, సామాజిక వర్గాల వికాసానికి పాటుపడతామని కూటమి నేతలు చెప్పడం లేదని, చంద్రబాబుది పెత్తందార్ల కూటమి అని ధ్వజమెత్తారు. గురువారం కర్నూలులోని వైఎస్సార్‌ సర్కిల్, అనంతపురం జిల్లా కళ్యాణ­దుర్గంలోని కొల్లాపురమ్మ టెంపుల్‌ రోడ్డు వాల్మీకి సర్కిల్, అన్నమయ్య జిల్లా రాజంపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు. ఆ వివరాలివీ..దేశంలోనే అంత అవినీతిపరుడు లేడన్న నోటితోనే..చంద్రబాబు ఈమధ్య ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాతో ఏపీలో ఉమ్మడి సభలు పెట్టిస్తున్నాడు. చంద్రబాబు ఉమ్మడి సభలు పెట్టిస్తున్నప్పుడు ప్రజలంతా ఏం ఆశించారంటే.. పదేళ్ల క్రితమే మనకు రావాల్సిన ప్రత్యేక హోదాను ఇప్పటికైనా ఇస్తారేమో! ఈ మాట వారి నోటి నుంచి వస్తుందేమోనని ఆశగా ఎదురు చూశారు. ఆ ప్రకటన చేస్తారేమోనని ఎదురు చూసిన ప్రజలకు నిరాశే మిగిలింది. రాష్ట్ర ప్రజలకు కావాల్సిన మాట ఒక్కటీ మాట్లాడకుండా... చంద్రబాబు నాయుడుకి ఏం కావాలి? దత్తపుత్రుడికి ఏం కావాలి? వదినమ్మకు ఏం కావాలి? దుష్ట చతుష్టయానికి ఏం కావాలి? అని వీళ్లకు సంబంధించిన మాటలు మాత్రమే మాట్లాడి, మన మీద నాలుగు రాళ్లు వేసి వెళ్లారు. అదే మోదీ గారు మొన్నటిదాకా ఇదే చంద్రబాబును ‘ఇంతటి అవినీతిపరుడు దేశ చరిత్రలోనే ఉండడు’ అని చెప్పిన నోటితోనే ఇవాళ వారి కూటమిలో చేరినందుకు పొగిడి వెళ్లిపోయారు! మరి దీనివల్ల రాష్ట్రంలో రైతులకుగానీ, అక్కచెల్లెమ్మలకుగానీ, అవ్వా­తాతల­కుగానీ, పిల్లలకుగానీ, ఏ ఒక్కరికైనా లాభం జరిగిందా? 2014 హామీలపై మాట్లాడని కూటమి నేతలుమరి దేశ ప్రధాని, కేంద్ర హోంమంత్రి, చంద్ర­బాబు, దత్తపుత్రుడు, వదినమ్మ వీరంతా 2014లో ఇచ్చిన మేనిఫెస్టోను చూపించి ఇదిగో ఇవన్నీ చెప్పాం.. ఆ ముఖ్యమైన హామీలను నెరవేర్చాం!! అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? కూటమి అంటారు.. డబుల్‌ ఇంజన్‌ అంటారు! 2014లో ఇదే ముగ్గురి ఫొటోలతో, చంద్రబాబు సంతకం పెట్టి ఇంటింటికీ పంపిన పాంప్లెట్, మేనిఫెస్టోలోని ముఖ్యమైన అంశాలనే అమలు చేయలేకపోతే ఇక డబుల్‌ ఇంజనూ... డబుల్‌ ఇంజనూ! అని ఎందుకు అంటున్నారు? అంటరానితనంపై యుద్ధం మిగిలే ఉంది!ఈ పెత్తందార్ల కూటమి అంతా పేద పిల్లలకు గవర్న­మెంట్‌ బడుల్లో ఇంగ్లిష్‌ మీడియం చదువులు చెప్పి­స్తుంటే తట్టుకోలేకపోతున్నారు. మొన్న వచ్చి చంద్ర­బాబును పక్కన పెట్టుకుని మాట్లాడిన అమిత్‌ షా, ఢిల్లీ పెద్దలను అడుగుతున్నా. బాబును, దత్తపుత్రు­డినీ అడుగుతున్నా. వీళ్లకు మద్దతు ఇస్తున్న ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ 5నూ అడుగుతున్నా. మీ పిల్లలు, మీ మనవళ్లు.. మీవాళ్ల­లో ఏ ఒక్కరినైనా కూడా ఇంగ్లిష్‌ మీడియం బడుల్లో కాకుండా తెలుగు మీడియంలోగానీ లేదా మీ స్థానిక భాషలోగానీ చదివిస్తున్నారా? మన గవర్నమెంట్‌ స్కూళ్ల పిల్లలకు మాత్రం తెలుగు మీడియం అట! ఇటువంటి పెత్తందారీ భావజాలంతో వాళ్లు మన ప్రజల ముందుకు వచ్చి ఓటు వేయమని అడుగు­తున్నారు. ఇలాంటి వారికి ఓటు వేస్తే పేద పిల్లలకు, గవర్నమెంట్‌ బడుల్లో చదువుతున్న ఆ పిల్లలకు ఒక్కరికైనా ఇంగ్లీష్‌ మీడి­యం నేర్పుతారా? అందుకే ఆలోచన చేయండి. ఈ రూపం మార్చుకున్న అంట­రానితనం మీద మనం చేయా­ల్సిన యుద్ధం ఇంకా ఎంత ఉందో గుర్తుపెట్టుకోమని కోరుతున్నా.మోసపూరిత హామీలతో బాబు మేనిఫెస్టోమరో నాలుగు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇవి కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి కావు. రాబోయే ఐదేళ్లూ ఇంటింటి అభివృద్ధి, పథ­కాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలివి. జగన్‌కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి జరుగుతుంది. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నింటికీ ముగింపు, మళ్లీ మోసపోవ­డమే! చంద్రబాబుకు ఓటు వేయడం అంటే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టడమే. ఆయన జీవిత­మంతా మోసాలు, అబద్ధాలే. అధికారం దక్కిన ప్రతిసారీ పేదలను మోసం చేశాడు. ఇది చరిత్ర చెబు­తున్న సత్యం. సాధ్యం కాని హామీలతో చంద్ర­బాబు మోసపూరితంగా ఇచ్చిన మేనిఫెస్టోకు అర్థం లేదు. ఎన్నికల తరువాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే సంప్రదాయాలను మారుస్తూ 99 శాతం వాగ్దానా­లను చిత్తశుద్ధితో అమలు చేశాం. గతంలో రాష్ట్రంలో కేవలం నాలుగు లక్షల ప్రభుత్వ ఉద్యో­గాలు మాత్రమే ఉంటే మీ బిడ్డ ఏకంగా మరో 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కొత్తగా ఇచ్చాడు. రాష్ట్ర చరిత్ర­లో ఎప్పుడూ చూడని విధంగా రూ.2.70 లక్షల కోట్లు బటన్‌ నొక్కి వివిధ పథకాల ద్వారా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు పారదర్శకంగా అందించాం.వ్యవస్థల్లో సమూల మార్పులు..నాడు–నేడుతో బాగుపడిన ప్రభుత్వ పాఠశాలలు, ఇంగ్లిష్‌ మీడియం, ఆరో తరగతి నుంచి డిజిటల్‌ బోధన, 8వ తరగతి నుంచి పిల్లలకు ట్యాబ్‌లు, తొలిసారిగా బైలింగ్యువల్‌ పాఠ్య పుస్తకాలు, మూడో తరగతి నుంచే సబ్జెక్ట్‌ టీచర్లు, సీబీఎస్‌ఈ నుంచి ఐటీ దాకా ప్రయాణం, బడులు తెరవగానే విద్యా­కానుక, గోరుముద్ద, అమ్మ ఒడి, పూర్తి ఫీజులు చెల్లిస్తూ విద్యాదీవెన, వసతి దీవెన, కరిక్యులమ్‌లో సమూల మార్పులు, అంతర్జాతీయ వర్సిటీల నుంచి సర్టిఫైడ్‌ ఆన్‌లైన్‌ కోర్సులు, తప్పనిసరి ఇంటర్న్‌­షిప్‌.. ఇలాంటి విద్యా విప్లవాలను గతంలో ఎప్పు­డైనా చూశారా? ఇంజనీరింగ్, డాక్టర్, డిగ్రీ లాంటి ఉన్నత చదువులు అభ్యసించే విద్యార్థుల్లో ఏకంగా 93% మంది జగనన్న విద్యా దీవెన అందుకుంటు­న్నారు. నా అక్క చెల్లెమ్మలు వారి కాళ్లపై నిలబడేలా ఆసరా, సున్నావడ్డీ, చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తంతోపాటు 31లక్షల ఇళ్లపట్టాలు వారి పేరుపై రిజిస్ట్రేషన్‌ చేశాం. ఏకంగా 22 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టడం గతంలో ఎప్పుడైనా జరిగిందా?ముస్లింలపై బాబు కపట ప్రేమ..ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తామని బీజేపీ శపథం చేసింది. అలాంటి పార్టీ­తో చంద్రబాబు జత కట్టాడు. మైనార్టీల రిజర్వేష­న్లను రద్దు చేస్తామంటున్న బీజేపీతోనే కొనసాగు­తా­నంటున్నాడు. మైనార్టీలను మోసం చేసేందుకు డ్రామాలాడుతూ కపట ప్రేమ నటిస్తు­న్నాడు. ఇంతకంటే ఊసరవెల్లి రాజకీయాలు ఉంటాయా? ఈ రోజు నేను మీ అందరి సమక్షంలో చెబుతున్నా.. ఆరు నూరైనా నూరు ఆరైనా 4 శాతం రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే. ఇది మీ బిడ్డ జగన్‌ ఇస్తున్న మాట. వైఎస్సార్‌ బిడ్డ మాట. ఈ మాట ప్రధాని మోదీ సమక్షంలో చంద్రబాబు చెప్పగలరా? మైనార్టీల రిజర్వేషన్లను రద్దు చేస్తా­మని బీజేపీ చెప్పిన తర్వాత కూడా ఎందుకు కొనసాగుతున్నారు? మైనార్టీలపై మీ బిడ్డ జగన్‌­ది నిజమైన ప్రేమ. ఇవాళ ఇక్కడున్న వేలాది మంది­తోపాటు అందరికీ ఒక్క విషయం చెబుతు­న్నా.. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు మతం ప్రాతిప­దికన ఇచ్చినవి కాదు. ముస్లింలలోనూ ఉన్నత వర్గాలకు రిజర్వేషన్లు వర్తించడం లేదు. పఠాన్, సయ్యద్, మొఘల్‌కు రిజర్వేషన్లు వర్తించవు. వారిలో పేదవారికి మాత్రమే ఇచ్చారు. అన్ని మతా­ల్లోనూ బీసీలు, ఓసీలు ఉంటారు. అలాంటప్పుడు రాజకీయ స్వార్థంతో మైనార్టీలను వేరేగా చూసి వారి నోటిదాకా వచ్చిన కూడును తీసేయాలనుకోవడం ఎంత వరకూ ధర్మం? రాజకీయ స్వార్థం కోసం వారి జీవితాలతో ఆడుకోవడం దుర్మార్గం కాదా? ఎట్టిపరిస్థితు­ల్లోనూ రిజర్వేషన్‌లతో పాటు ఎన్‌ఆర్‌సీ, సీఏఏ లాంటి ఏ అంశంలోనైనా ముస్లింలకు అండగా నిలబడతా. ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటా. వారిపై ప్రేమ చూపుతా. ఇళ్ల పట్టాలు, డీబీటీ, షాదీ తోఫాతో పాటు ఉర్దూను రెండో అధికార భాషగా ప్రకటించాం. నలుగురు ఎమ్మెల్సీలు, నలుగురు ఎమ్మెల్యేలతో పాటు మైనార్టీ సోదరు­డికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఐదేళ్లు నా పక్కనే పెట్టుకున్నా. మైనార్టీ సోదరికి శాసనసభ మండలి ఉపాధ్యక్షురాలిగా అవకాశం కల్పించాం. మైనార్టీ సబ్‌ప్లాన్‌ బిల్లు తేవడంతో పాటు ప్రతీ సందర్భంలోనూ చిత్తశుద్ధి చాటుకున్నాం.రైతన్నలకు తోడుగా..గతంలో ఎప్పుడూ చూడని విధంగా రైతన్నలకు పెట్టు­బడి సాయంగా రైతు భరోసా, ఉచిత పంటల బీమా, సీజన్‌ ముగిసేలోపు ఇన్‌పుట్‌ సబ్సిడీ, పగటి పూట 9గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ లాంటి పథకాలను తీసుకొచ్చాం. రైతన్నలను ఇంతగా ప్రేమించే ప్రభుత్వం కానీ పథకాలు కానీ గతంలో ఉన్నా­యా? స్వయం ఉపాధికి అండగా ఆటోలు, టాక్సీలు నడిపే డ్రైవర్లకు వాహనమిత్ర, నేతన్న­నేస్తం, మత్స్యకార భరోసాతో పాటు చిరువ్యాపారులకు తోడు, చేదోడు అందించాం. లాయర్లకు లానేస్తం ఇచ్చాం.. ఇవన్నీ గతంలో ఎప్పుడైనా ఉన్నాయా?ఆరోగ్యం.. పౌరసేవలువైద్యం కోసం ఏ ఒక్కరూ అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదని రూ.25 లక్షల వరకూ ఆరోగ్య­శ్రీని విస్తరించి ఉచితంగా సేవలందిస్తున్నాం. విశ్రాంతి సమ­యంలో ఆరోగ్య ఆసరా ద్వారా అండగా నిలిచాం. గ్రామంలోనే విలేజ్‌ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్, ప్రతి ఇం­­టినీ జల్లెడ పడుతూ ఆరోగ్య సురక్ష తెచ్చాం. ప్రజల ఆరోగ్యం కోసం ఇంతగా పరితపించిన ప్రభుత్వం గతంలో ఉందా? ఇవాళ ఏ గ్రామానికి వెళ్లి చూసినా 600 రకాల పౌరసేవలు అందిస్తున్న గ్రామ సచివా­లయం కనిపిస్తోంది. 60–70 ఇళ్లకు వలంటీర్ల సేవలు, ఇంటికే రూ.3వేల పింఛన్, రేష­న్, పౌరసేవలు, పథకాలు, గ్రామాల్లో అక్క చెల్లె­మ్మల­కు అండగా మహిళా పోలీసు, దిశ యాప్‌ లాంటివి గతంలో ఎప్పుడైనా అమల­య్యాయా? ఇవాళ మన గ్రామాల్లో ఫైబర్‌ గ్రిడ్, నిర్మాణంలో ఉన్న డిజిటల్‌ లైబ్రరీలు కనిపిస్తు­న్నాయి. మరి 14ఏళ్లు ముఖ్య­మంత్రిగా చేశానని చెప్పుకునే చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్కటైనా మంచి పని గుర్తుకొస్తుందా? బాబు ఇచ్చే డబ్బులన్నీ మీవే..బటన్లు నొక్కి మీ బిడ్డ మీకు మంచి చేశాడు. ఎలాంటి బటన్లు నొక్కని చంద్రబాబు వద్ద డబ్బులు దండిగా ఉన్నాయి. మీకు ఇవ్వాల్సిన డబ్బులను ఆయన దోచు­­కున్నాడు. ఆ దోచుకున్న డబ్బులో నుంచి ఓ­టు­­కు రూ.2 వేలు, రూ.3 వేలు, కొన్నిచోట్ల రూ.4వేలు కూడా ఇచ్చేందుకు తయారుగా ఉన్నాడు. చంద్ర­బాబు డబ్బులిస్తే వద్దనకుండా తీసుకోండి. ఎందుకంటే.. ఆ డబ్బు అంతా మనదే. మన దగ్గర నుంచి దోచేసిన సొమ్మే అదంతా. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. మీకు ఎవరి వల్ల మంచి జరిగిందో ఆలోచించండి. మీ కుటుంబ సభ్యులతోనూ చర్చించండి. చిన్నపిల్లల అభిప్రాయం కూడా తీసుకుని నిర్ణయం తీసుకోండి. ఎవరి వల్ల ఈ మంచి కొనసాగుతుందో గమనించి ఓటేయాలని కోరు­™­è ున్నా. మంచి చేసిన ఫ్యాను ఇం­­­ట్లో­¯­ó∙ఉండాలి. చెడు చేసిన సైకిల్‌ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్‌ సింకులోనే ఉండాలి. చంద్ర­­బాబు ఇచ్చే డబ్బులకు మోసపోకండి. మళ్లీ జగన్‌ ఉంటేనే ప్రతి నెలా కేలండర్‌ ప్రకారం పథకాలు మీ చేతికే  అందుతాయి.  మళ్లీ వలంటీర్లు మన ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్తు బాగుండాలన్నా, పథకాలన్నీ కొన­సాగాలన్నా, లంచా­­­లు, వివక్ష లేని పాలన కొనసా­గాలన్నా, బడులు, పేద పిల్లల చదువులు బాగుండాలన్నా, వైద్యం, వ్యవసాయం మెరుగ్గా ఉండాలన్నా ఫ్యాన్‌ గుర్తుపై రెండు బటన్లు నొక్కి 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానా­ల్లో మన అభ్యర్థులనే గెలిపించాలి.బాబు హేళన చేస్తే జగన్‌ ఆత్మస్థైర్యం కల్పించాడు‘నేను ప్రతీ సందర్భంలోనూ నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అంటూ ప్రేమను బాహాటంగా ఎందుకు చూపిస్తానో తెలుసా? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న­ప్పుడు వారిని గుండెల్లో పెట్టుకుని ప్రేమ చూపిస్తే గ్రామాలు, రాష్ట్రంలో వారికిచ్చే గౌరవం పెరుగుతుంది. వారిలో ఆత్మస్థైర్యం, ఆత్మగౌరవం ఇనుమడిస్తుంది. ఇది జరగాలంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ‘నా...’ అనే ఆప్యాయత చూ­పించాలి. చంద్ర­బా­బును చూస్తే ఇలాంటి ప్రేమ, న్యాయం దేవు­డెరుగు! అధికారంలో ఉంటే బడుగు, బలహీన వర్గాలను హేళన చేసి కించపరుస్తూ బెదిరిస్తారు. దారుణమైన మోసాలూ చేస్తారు. 2014లో బాబు ముఖ్యమైన మోసాలివీ..⇒ రూ.87,612కోట్ల రైతురుణాల మాఫీ జరిగిందా? ⇒ రూ.11,205 కోట్ల పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేశారా? ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం ద్వారా రూ.25 వేలు డిపాజిట్‌ దేవుడెరుగు కనీసం రూపాయైనా ఇచ్చాడా?⇒ ఇంటికో ఉద్యోగం లేదంటే నెలకు రూ.2 వేలు నిరుద్యోగభృతి ఇచ్చాడా? ఐదేళ్లలో ఏ ఒక్కరికైనా రూ.1.20 లక్షలు ఇచ్చారా? ఉమెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఏర్పాటు జరిగిందా?⇒ రూ.10వేలకోట్లతో బీసీ సబ్‌ప్లాన్, చేనేత, పవర్‌­లూ­­మ్స్‌ రుణాలమాఫీ హామీలు అమల­య్యా­యా? ⇒ అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, పక్కా ఇళ్లు ఇస్తానని నమ్మబలికి ఏ ఒక్కరికైనా సెంటు స్థలం ఇచ్చాడా? సింగపూర్‌కు మించి అభివృద్ధి, ప్రతి నగరంలో హైటెక్‌ సిటీని నిర్మించారా? కర్నూలు, కళ్యాణ­దుర్గం, రాజంపేటలో ఎవరికైనా కనిపిస్తు­న్నాయా? ప్రత్యేక హోదా తేకపోగా అమ్మే­శా­రు. ⇒ మళ్లీ కూటమిగా మీ ముందుకొచ్చి సూపర్‌­సిక్స్, సూపర్‌ సెవన్, ఇంటింటికీ కేజీ బంగారం, బెంజ్‌కారు అంటూ మళ్లీ మోసాలకు తయార­య్యా­రు.రోడ్డు ప్రమాద బాధితుడికి సీఎం జగన్‌ అభయంకళ్యాణదుర్గం: కొద్ది నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, మంచానికే పరిమితమైన అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం బెళుగుప్ప మండలం నరసాపురం గ్రామానికి చెందిన బి.శ్రీనివాసులుకు అండగా ఉంటానని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. గురువారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో రోడ్‌ షోలో సీఎం వైఎస్‌ జగన్‌ పాల్గొన్నారు. అక్కడ స్ట్రెచర్‌పై ఉన్న శ్రీనివాసులును చూసి సీఎం జగన్‌ బస్సులో నుంచి దిగారు. నేరుగా శ్రీనివాసులు వద్దకు వెళ్లి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. గత ఏడాది నవంబర్‌ 14న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇప్పటికీ చికిత్స పొందుతున్నట్లు బాధితుడు తెలిపాడు. అనంతపురంలోని సవేరా ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నామని, ఇప్పటికే రూ.7 లక్షలకు పైగా ఖర్చయిందని కుటుంబ సభ్యులు సీఎం జగన్‌కు వివరించారు. ఇందుకు సీఎం వైఎస్‌ జగన్‌ స్పందిస్తూ.. శ్రీనివాసులు త్వరలోనే కోలుకొనేలా మెరుగైన వైద్య సేవలకు సిఫారసు చేస్తామని, వైద్య ఖర్చులను భరిస్తామని వారికి భరోసా ఇచ్చారు.రాజంపేటలో 18వ మెడికల్‌ కాలేజీ.ఈ ప్రాంతానికి ఒక మెడికల్‌ కాలేజీ మంజూరు చే­యాలని అమరన్న, మిథున్‌ ఇద్దరూ కలసి నాపై ఒత్తిడి తెస్తున్నారు. వచ్చే టర్మ్‌లో అది చేస్తానని మాట ఇస్తు­న్నా. రాష్ట్రంలో ఇప్పటికే 17 మెడికల్‌ కాలేజీలకు శ్రీకా­రం చుట్టగా, 18వ మెడికల్‌ కాలేజీ రాజంపేటలో వస్తుంది.ఢిల్లీ దాకా సౌండ్‌ వినిపించాలి..మీరు ఇక్కడ నొక్కే బటన్‌ సౌండ్‌ ఢిల్లీ దాకా వినిపించాలి. మీ బిడ్డ పెన్షన్లు నేరుగా ఇంటికే పంపుతుంటే అడ్డుకున్న వారికి ఆ సౌండ్‌ వినిపించాలి. అంత గట్టిగా సౌండ్‌ వినిపించేలా భారీ మెజార్టీతో మన అభ్యర్థులను గెలిపించాలని ప్రార్థిస్తున్నా.ఇలాంటి వ్యక్తిని నమ్మొచ్చా?చంద్రబాబు మన జిల్లాకు వచ్చి మూడు ప్రాంతాల్లో మీటింగులు పెట్టాడు. రాయచోటికి వెళ్తే రాయచోటి జిల్లా హెడ్‌ క్వార్టర్‌గా కంటిన్యూ అవుతుంది అంటాడు. మదనపల్లికి పోతే మదనపల్లి జిల్లా హెడ్‌ క్వార్టర్‌ అంటాడు. రాజం­పేటకు వస్తే రాజంపేట జిల్లా హెడ్‌ క్వార్టర్‌ అంటాడు. మరి ఇలాంటి వ్యక్తిని నమ్మొచ్చా? ఇదే రాజంపేటలో మన గంగిరెడ్డి అన్నకు చెందిన అన్నమయ్య కాలేజీని ప్రపంచంలో టాప్‌ 100 యూనివర్సిటీలతో టైఅప్‌ చేయించి ఒక వర్సిటీగా మీకు అందించాం. పింఛా ప్రాజెక్టు దాదాపు 90 శాతం పనులు పూర్తిచేశాం. అన్నమయ్య ప్రాజెక్టు పూర్తి కావాలన్నా, గాలేరు నగరి కాలువ పనులు రైల్వేకోడూరు వరకు పూర్తి చేయాలన్నా మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వమే రావాలి.మన అభ్యర్థులను ఆశీర్వదించండికర్నూలు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు బీవై రామయ్య, ఇంతియాజ్, పాణ్యం ఎమ్మెల్యే అభ్యర్థి కాటసాని రాంభూపాల్‌రెడ్డి, నంద్యాల ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానంద­రెడ్డి, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి తలారి రంగయ్య, అనంతపురం ఎంపీ అభ్యర్థి మాలగుండ్ల శంకర నారాయణ, రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి అమర్‌నాథ్‌రెడ్డి, నాకు సొంత తమ్ముడు లాంటి ఎంపీ అభ్యర్థి మిథున్‌రెడ్డిని గొప్ప మెజార్టీతో మీరంతా ఆశీర్వదించాలని కోరుతున్నా.రాజంపేటలో 18వ మెడికల్‌ కాలేజీ.ఈ ప్రాంతానికి ఒక మెడికల్‌ కాలేజీ మంజూరు చే­యాలని అమరన్న, మిథున్‌ ఇద్దరూ కలసి నాపై ఒత్తిడి తెస్తున్నారు. వచ్చే టర్మ్‌లో అది చేస్తానని మాట ఇస్తు­న్నా. రాష్ట్రంలో ఇప్పటికే 17 మెడికల్‌ కాలేజీలకు శ్రీకా­రం చుట్టగా, 18వ మెడికల్‌ కాలేజీ రాజంపేటలో వస్తుంది.వైఎస్సార్‌సీపీకి జూనియర్‌ ఎన్టీఆర్, ప్రభాస్‌ ఫ్యాన్స్‌ మద్దతుకర్నూలు(సెంట్రల్‌): వైఎస్సార్‌సీపీకి జూనియ­ర్‌ ఎన్టీఆర్, ప్రభాస్‌ ఫ్యాన్స్‌ మద్దతు ప్రకటించారు. గురువారం సీఎం జగన్‌ కర్నూలులోని వైఎస్సార్‌ సర్కిల్‌లో ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. ఈ సభలో జూనియర్‌ ఎన్టీఆర్, ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కూడా పాల్గొని తమ మద్దతు సీఎం వైఎస్‌ జగన్‌కే అని ప్లకార్డులు, జెండాలు ప్రదర్శించారు. వైఎస్‌ జగన్‌ పొలిటికల్‌ హీరో అని కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి సీఎంగా వైఎస్‌ జగన్‌ గెలుపొందడం ఖాయమన్నారు. వైఎస్‌ జగన్‌తోనే పేద ప్రజల అభివృద్ధి సాధ్యమన్నారు.  

BRS Leader KCR Exclusive interview With Sakshi
మాది పేగు బంధం: ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో కేసీఆర్‌

కేసీఆర్‌ రాష్ట్ర సాధకుడు, ఒక చరిత్ర. తెలంగాణతో నాది పేగు బంధం. నాడు ఆశలు అడుగంటిన సమయంలో పట్టుమని పది మంది కూడా లేకున్నా తెలంగాణ పోరాటం మొదలుపెట్టా. అనేక కష్టనష్టాలకోర్చి రాష్ట్రాన్ని సాధించా. నా గుండె ధైర్యం ఎన్నడూ చెక్కు చెదరదు. కోడి రెక్కల కింద పిల్లలను దాచుకున్నట్లు తెలంగాణ ప్రజలను కాపాడుకున్నాం. గత ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ అభూత కల్పనలు సృష్టిస్తే.. మేం చేసింది కూడా చెప్పుకోలేక పోయాం. పదేళ్లు సీఎంగా నేను ఏం మాట్లాడానో, వాళ్లేం మాట్లాడుతున్నారో ప్రజలు చూస్తున్నారు. బీఆర్‌ఎస్‌ జాతీయ కార్యకలాపాలకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. తెలంగాణలో ఓడిపోకపోతే మహారాష్ట్రలో 20, 30 ఎంపీ సీట్లు వచ్చేవి. ఏడాదిలోగా గ్రామస్థాయి మొదలుకుని మొత్తం బీఆర్‌ఎస్‌ కార్యవర్గాలను పునర్వ్యవస్థీకరిస్తాం.(కల్వల మల్లికార్జున్‌రెడ్డి) కాంగ్రెస్‌ను నమ్మి మోసపోయామని తెలంగాణ ప్రజలు గుర్తించారని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం గురించి సీఎం రేవంత్‌ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉందన్నారు. ‘ఓటుకు కోట్లు’ కేసు నుంచి రేవంత్‌ తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు 12కుపైగా లోక్‌సభ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో ప్రాంతీయ పార్టీల కూటమే అధికారంలోకి వస్తుందని, అందులో బీఆర్‌ఎస్‌ కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న కేసీఆర్‌ ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.     తెలంగాణతో తమది పేగు బంధమని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేది బీఆర్‌ఎస్‌ ఒక్కటేనని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ అన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే..  ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మి మోసపోయారు కాంగ్రెస్‌ ఇచ్చిన అడ్డగోలు హామీలతో ప్రజలు ఆశకు పోయి మోసపోయారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాతి పరిణామాలతో.. కాంగ్రెస్‌ను నమ్మి తినే అన్నంలో మన్నం పోసుకున్నామనే భావన జనంలో మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో మేం పూర్తిగా తుడిచిపెట్టుకుపోలేదు. కేవలం 1.8శాతం ఓట్ల స్వల్ప తేడాతో అధికారం కోల్పోయాం. మాకు కొన్ని వర్గాలు దూరం అయ్యాయనేది ఈనాడు జర్నలిజం స్కూల్‌ నుంచి పుట్టిన విచిత్రమైన కథ. మాకు ఏ ఒక్క వర్గం కూడా దూరం కాలేదు. కేంద్రంలో ప్రాంతీయ పార్టీల కూటమిదే అధికారం మోదీ ఏమైనా మొనగాడా? రాహుల్‌ సిపాయా? ఎన్డీయే, ఇండియా కూట­మి ఏదీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఎన్నికల తర్వాత మోదీ, ఎన్డీయే దుర్మార్గ పాలన అంతమవుతుంది. దక్షిణాదిలోని 139 సీట్లలో బీజేపీకి 9 కూడా రావు. అధికారం వచ్చే పరిస్థితి కాంగ్రెస్‌కు లేదు. బలంగాఉన్న ప్రాంతీయ పార్టీలతో ఏర్పడే కూటమికే వాళ్లు మద్దతు ఇవ్వాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఎవరి మద్దతు తీసుకోవాలో అందరం కలసి నిర్ణయం తీసుకుంటాం. ప్రాంతీయ పార్టీల కూటమి వస్తే బీఆర్‌ఎస్‌కు ఒకట్రెండు కేంద్ర మంత్రి పదవులు కూడా వస్తాయి. మోదీ మేనియా అంతా గ్యాస్‌ ఎన్డీయే ట్రాష్,. మోదీ మేనియా గ్యాస్‌ అని తేలిపోయింది. ఆయన నినాదా­లన్నీ డొల్ల, మోదీ పాలనలో ఒక్క రంగం కూడా బాగుపడలేదు. కార్పొరేట్లకు రుణమాఫీ చేశారు. ఎగవేతదారులను లండన్‌లో పెట్టి మేపుతున్నారు. మోదీ రాజకీయంగా అనేక దుర్మార్గాలు చేశారు. 700కుపైగా ఇత ర పార్టీల ప్రజాప్రతినిధులను చేర్చు కుని ప్రభుత్వాలను కూల్చివేశారు. గతంలో 111 మంది ఎమ్మెల్యేలు ఉన్న మా ప్రభుత్వాన్ని కూడా కూల్చాలని చూశారు. అలాంటి పరిస్థితి రాకుండా.. మేం నైతిక పద్ధతుల్లో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకున్నాం.పెట్రోల్‌ ‘చార్‌ సౌ’ దాటుతుంది కేంద్రంలో బీజేపీ, మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే.. వారి సీట్లేమోగానీ పెట్రోల్‌ ‘చార్‌ సౌ’ దాటడం పక్కా. ప్రధాని మోదీ దుర్మార్గుడు. మత విద్వేషాలు మినహా దేశ ప్రగతి ఆయనకు పట్టదు. రాష్ట్రాలను మున్సిపాలిటీల కంటే అధ్వానంగా దిగజార్చారు. మోదీ మూలంగా మతపిచ్చి వాళ్ల దేశమనే ముద్ర పడుతోంది. కవిత, కేజ్రీవాల్‌ అరెస్టుపై అమెరికా, జర్మనీ వంటి ప్రజాస్వామ్య దేశాలు కూడా ప్రతిస్పందించాయి.రేవంత్‌ తప్పించుకోలేడుప్రధాని మోదీని రేవంత్‌ బడేభాయ్‌ అనడం వంటి వాటిపై కాంగ్రెస్‌లోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రేవంత్‌ ఒకవేళ బీజేపీలోకి వెళ్తే.. తాము 30 మందిమి రెడీగా ఉన్నామని, కలిసి పనిచేద్దామని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కొందరు బీఆర్‌ఎస్‌ నేతలతో చెప్తున్నారు. ‘ఓటుకు కోట్లు’ కేసులో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడిన రేవంత్‌ దాన్నుంచి తప్పించుకోలేడు. ఆయన అరెస్టు అయితే రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి వస్తుందని అంతా అనుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమానికి రేవంత్‌కు సంబంధమే లేదు. ఉద్యమకారుల మీదికి తుపాకీతో వచ్చిన ఆయన తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుంది. గుజరాత్‌తో తెలంగాణకు ఫైనల్‌ మ్యాచ్‌ అనేది బుద్ధిలేని వాదన.బీజేపీకి వ్యతిరేకంగా నిలవడం వల్లే కవిత అరెస్టు అవినీతికి పాల్పడాల్సిన అవసరం, ఖర్మ నా కూతురుకు లేవు. ఆమె నిర్దోíÙ, అమాయకురాలు. విచారణకు సహకరించినా అరెస్టు చేశారు. ఇలా చేస్తారని నాకు ముందే తెలుసు. రాజకీయ కక్ష సాధింపులకు బలి కాబోతున్నావు, నేరం చేయలేదు కాబట్టి ధైర్యంగా ఉండు అని కవితకు చెప్పా. బీజేపీ వాళ్లు దుర్మార్గాలకు పాల్పడుతారని వివరించా. నేను, కేజ్రీవాల్‌ ఇద్దరం బీజేపీకి వ్యతిరేకంగా బలంగా నిలబడటం వల్లే ఇది జరుగుతోంది. న్యాయ వ్యవస్థ మీద నమ్మకముంది. కవిత బెయిల్‌ కోసం నేను బీజేపీతో రాజీ పడ్డాననడం అర్థ రహితం.నిఘా నుంచి సమాచారం మాత్రమే కోరాం.. ఫోన్‌ ట్యాపింగ్‌ అంటూ.. బాకా, కాకా మీడియాలో వస్తున్న వార్తలన్నీ ట్రాష్‌. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ప్రభుత్వానికి గూఢచార వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థ ఎలా సమాచార సేకరణ జరిపిందనేది మాకు అనవసరం. సీఎం, మంత్రులకు అందులో ఏం పాత్ర ఉంటుంది. ఫోన్‌ ట్యాప్‌ చేయాలని ఏ సీఎం కూడా ఆదేశించరు. ప్రభుత్వ పనితీరు, శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిఘా వ్యవస్థల నుంచి సమాచారం మాత్రం అడుగుతాం.జగన్‌ మళ్లీ సీఎం అవుతారు వైఎస్‌ జగన్‌ ఏపీలో రెండోసారి సీఎం అవుతారనే సమాచారం నాకు ఉంది. షర్మిల వంటి వ్యక్తులతో ఏదీ సాధ్యం కాదు. ఒకవేళ ఎవరైనా షర్మిల వంటి వారిని అడ్డుపెట్టుకుని ఇబ్బంది పెట్టాలని చూసినా అవి ఫలించవు.మోదీ ఉల్లంఘనలు కనిపించట్లేదా? ప్రధాని మోదీ ఏం మాట్లాడినా అడిగేవారు లేక ‘బారా ఖూన్‌ మాఫ్‌’ అన్నట్టుగా తయారైంది. మతం పేరిట ప్రధాని రెచ్చగొడుతున్నా చర్యలు లేవు. హైదరాబాద్‌ బీజేపీ అభ్యర్థి శివ లింగం మీద నీళ్లు పోస్తూ ఓట్లు అడిగితే ఉల్లంఘన కాదా? ఎన్నికల సంఘం నాపై మాత్రం 48 గంటల నిషేధం విధించింది. అది బీజేపీ అనుబంధ సంస్థగా మారింది. ధరణి, ల్యాండ్‌ టైటిల్‌ వంటివి ఉత్తమ విధానాలు చాన్నాళ్లుగా భూములను చిక్కుల్లో పెట్టి, రైతులను రాచి రంపాన పెట్టి.. ఎవరి భూములు ఎవరివో తెలియకుండా కన్ఫ్యూజన్‌లో పెట్టి.. లక్షలు, కోట్ల రూపాయలు దండుకున్నారు. ఎవరైనా సీఎం సాహసం చేసి దానిని సరిదిద్దాలని ప్రయత్నిస్తే.. కొన్ని ప్రతీపశక్తులు ప్రజల్లో భయాందోళన కలిగించే ప్రయత్నాలు చేస్తాయి. ధరణితో తెలంగాణలో ప్రజలకు మేలు జరిగింది. ఏపీలో సీఎం జగన్‌ కూడా ప్రజలకు మంచి చేసే ప్రయత్నం చేశారు. భూములను ఎవరూ లాక్కోకుండా ఉండేందుకే ధరణి, ల్యాండ్‌ టైటిల్‌ వంటి ఉత్తమ విధానాలు ఉపయోగపడతాయి. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి ఉత్తమ విధానాలు లేవు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బద్నాం చేసే ఉన్మాదం కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్‌ను బద్నాం చేయాలనే ఉన్మాదం కాంగ్రెస్‌లో కనిపిస్తోంది. భారీ ప్రాజెక్టుల్లో బాలారిష్టాలు సహజం. ఒక బ్యారేజీ పిల్లర్లలో వచ్చిన సమస్యను సాకుగా చూపి పంటలను ఎండబెట్టారు. నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ మధ్యంతర నివేదికలోనూ ప్రభుత్వాన్ని తప్పు పట్టింది. తక్షణమే మరమ్మతులు చేపట్టి నీళ్లు వినియోగించుకోవాలని సూచించింది. జ్యుడీషియల్‌ కమిషన్‌కు ఇంజనీరింగ్‌ విధానాల గురించి ఏం తెలుసు? మహానది, గోదావరి, కృష్ణా, కావేరి నదులను అనుసంధానించాలని 50 ఏళ్ల క్రితం అనుకున్నారు. మహానది విషయంలో ఒడిశా దుడ్డుకర్ర పట్టుకుంది. దాంతో గోదావరి నుంచి అనుసంధానం మొదలు పెడతామని మోదీ అంటున్నారు. గోదావరిలో రెండు తెలుగు రాష్ట్రాల వాటా తేల్చిన తర్వాతే అనుసంధానం గురించి మాట్లాడాలి.ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ జర్నలిజానికే మచ్చ కేసీఆర్‌ ప్రజాస్వామ్యయుతంగా ఉండరనేది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వంటి కొందరు విషం చిమ్మేవాళ్లు చేసే తప్పుడు ప్రచారం. రాధాకృష్ణ జర్నలిస్టేనా? ఆయన కక్కేది విషం. దానికి వలువలు, విలువలు లేవు. కొత్త పలుకుఅంటూ చెత్త రాస్తారు. ఆయన సొంత అభిప్రాయాలు, కోరికలను చెప్తూ.. ఎదుటి వాళ్ల మీద విషం కక్కుతుంటారు. ఏబీఎన్, ఆంధ్రజ్యోతి వంటివి జర్నలిజం పరువు తీసి బజారులో నిలబెట్టాయి. కాకా, బాకా ఊది గెలిపిస్తామని అనుకుంటున్న వీళ్లు.. గతంలో చంద్రబాబును ఏపీలో గెలిపించగలిగారా? రాధాకృష్ణ లాంటి వాళ్లు జర్నలిజానికి మచ్చ.పుస్తకాలు చదువుతున్నా.. పాటలు వింటున్నా సర్జరీ తర్వాత మెల్లగా కోలుకుంటున్నా. కొంత సమయం దొరికినప్పుడు పుస్తకాలు చదువుతున్నా. కిషోర్‌కుమార్, లతా మంగేష్కర్, ముఖేశ్‌ పాటలు చాలా ఇష్టం. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సమయం దొరకదు. సీఎం బాధ్యతల నుంచి తప్పుకున్నాక ఎన్నికలు, పార్టీ కార్యకలాపాలపై దృష్టి పెట్టాను. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వ పనితీరు చూస్తే.. ప్రశాంతంగా ఉండలేకపోతున్నా..  

Sakshi Editorial On Corona Vaccine
భరోసా కావాలి!

పిల్ల పోయినా... పురుటి కంపు పోలేదని ఒక ముతక సామెత. కరోనా అనే మాట క్రమంగా విన మరుగవుతూ వస్తున్నా, దాని ప్రకంపనలు మాత్రం మానవాళిని ఆందోళనకు గురి చేస్తూనే ఉన్నాయి. కరోనా టీకా కోవిషీల్డ్‌పై తాజాగా వస్తున్న వార్తలే అందుకు తార్కాణం. సదరు టీకా తీసుకోవడం వల్ల మనిషిలో రక్తం గడ్డలు కట్టడం, రక్తంలోని ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గడం (వైద్య పరిభాషలో ‘థ్రోంబో సైటోపేనియా సిండ్రోమ్‌’ – టీటీఎస్‌) లాంటి అరుదైన దుష్ప్రభావాలుంటాయని దాన్ని రూపొందించిన బ్రిటన్‌ దిగ్గజ ఔషధ సంస్థ ఆస్ట్రాజెనెకా లండన్‌ కోర్టులో ఒప్పుకుంది. దాంతో గత వారం గందరగోళం మొదలైంది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఆ టీకాను ఉపసంహరిస్తు న్నట్టు ఆస్ట్రాజెనెకా బుధవారం ప్రకటించడంతో, భారత్‌లో కోవిషీల్డ్‌గా, యూరప్‌లో వాక్స్‌జెవ్రి యాగా అమ్ముడైన కోవిడ్‌ టీకాపై రచ్చ పరాకాష్ఠకు చేరింది. కరోనా టీకాల భద్రతపై చాలాకాలంగా జరుగుతున్న చర్చలకు తాజా పరిణామాలు యాదృచ్ఛికంగా కొత్త ఊపిరినిచ్చాయి. మన దేశంలో సుప్రీమ్‌ కోర్ట్‌ సైతం ఆస్ట్రాజెనెకా టీకాపై వచ్చిన పిటిషన్‌ విచారణకు అంగీకరించడం గమనార్హం. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే – కోవిడ్‌ మహమ్మారితో ప్రపంచం అల్లాడుతున్న సమయంలో ప్రజారోగ్యంలో ఆక్స్‌ఫర్డ్‌ – ఆస్ట్రాజెనెకా టీకా కీలక భూమిక పోషించింది. క్లినికల్‌ పరీక్షల అనంతరం 2021 జనవరి 4న టీకా తొలి డోస్‌ వినియోగించారు. ఆ ఒక్క ఏడాదే దాదాపు 250 కోట్ల డోసులు వేశారు. లక్షలాది ప్రాణాలను కాపాడారు. 2021 ప్రథమార్ధంలో భారతదేశంలో డెల్టా వేరియంట్‌ పెచ్చరిల్లినప్పుడు కూడా ఇదే సంజీవని. ప్రపంచదేశాల మధ్య టీకాల సరఫరాలో చిక్కులున్నప్పుడూ ఆ మానవతా సంక్షోభ పరిష్కారానికి అందుబాటులో ఉన్న కొన్నిటిలో ఇదీ ఒకటి. ఫైజర్, మోడర్నా, నోవావ్యాక్స్, వగైరాల లానే ఈ టీకా కూడా అనేక స్థాయుల పరీక్షలకు లోనైంది. మూడు విడతల ట్రయల్స్‌లో వేలాది ప్రజలపై పరీక్షలు చేసి, సురక్షితమనీ, ప్రభావశీలమనీ తేలాకనే అను మతులిచ్చారు. బ్రిటన్‌ సహా యూరప్‌లోని పలు దేశాల్లో 2021 ఆరంభంలో దీన్ని పంపిణీ చేశారు.నిజానికి, ఈ టీకా వినియోగం వల్ల కొన్ని దుష్ఫలితాలు ఉండవచ్చని బ్రిటన్‌ ప్రభుత్వం 2021 ఫిబ్రవరిలోనే చెప్పింది. కానీ, ప్రపంచవ్యాప్తంగా వారానికి 40 లక్షల కొత్త కేసులొస్తూ, కరోనా తీవ్రత భయం రేపుతున్న సమయమది. దిక్కుతోచని ఆ పరిస్థితుల్లో... టీకాతో అరుదుగా వచ్చే ముప్పు కన్నా ఉపయోగాలే ఎక్కువని ప్రపంచ ఆరోగ్య సంస్థ లాంటివి భావించాయి. పైగా, మహిళలు వాడే గర్భనిరోధక మాత్రల లాంటి అనేక ఇతర ఔషధాలతో పోలిస్తే ఈ టీకాతో రక్తం గడ్డలు కట్టే రేటు బాగా తక్కువనీ, ప్రతి వెయ్యిమందిలో ఒక్కరికే ఆ ప్రమాదం ఉంటుందనీ లెక్కల్లో తేల్చారు. అందుకే, ప్రపంచ క్షేమం కోసం ఈ టీకాను కొనసాగించారు. ఇక, భారత్‌ సంగతెలా ఉన్నా విదేశాల్లో కరోనా టీకాతో సహా ఏ ఔషధంతో ఇబ్బంది తలెత్తినా బాధితులకు నష్టపరిహార పథకాలున్నాయి. అయితే, అక్కడ కూడా నష్టపరిహారం అందడంలో చిక్కులు ఎదురవడంతో సమస్య వచ్చింది. టీటీఎస్‌ వల్ల బ్రిటన్‌లో కనీసం 81 మంది చనిపోగా, వందల మంది అనారోగ్యం బారిన పడ్డారు. నష్టపరిహారం కోరుతూ బాధిత కుటుంబాలు కోర్టుకెక్కాయి. అలా దాదాపు 51 కేసులు ఎదుర్కొంటున్న ఆస్ట్రాజెనెకా లండన్‌లోని హైకోర్ట్‌లో తొలిసారిగా టీకా దుష్ప్రభావాలను అంగీకరించింది. సహజంగానే ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా, మరీ ముఖ్యంగా 175 కోట్లకు పైగా కోవిషీల్డ్‌ టీకా డోసులు తీసుకున్న మన దేశ ప్రజానీకంలో కలకలం రేపింది. ఒక దశలో లక్షలాది ప్రజానీకాన్ని కాపాడి, ప్రపంచానికి రక్షాకవచంగా కనిపించిన టీకా ఇప్పుడిలా భయాందోళనలకు కారణం కావడం విచిత్రమే. కానీ, ప్రాణాంతక మహమ్మారిని కట్టడి చేసేందుకు మరో మార్గం లేని దశలో ఈ టీకాలే దిక్కయ్యాయని మర్చిపోరాదు. ప్రాణరక్షణ కోసం ప్రపంచంలోని అన్ని ప్రభుత్వాలూ, ఔషధ సంస్థలూ టీకాలను తీసుకురావడంలో కొంత హడావిడి పడివుండవచ్చు. లాభనష్టాలపై ప్రజల్ని మరింత చైతన్యం చేసి, టీకా కార్యక్రమం చేపట్టి ఉండవచ్చు. అయితే, కోట్లాది ప్రాణాలకు ముందుగా ప్రాథమిక భద్రతే ధ్యేయంగా టీకాల వినియోగం త్వరితగతిన సాగిందని అర్థం చేసు కోవాలి. పైగా, టీకా దుష్ప్రభావాలు అత్యంత అరుదుగా కొందరిలోనే కనిపిస్తాయని వైద్య నిపు ణులు ఇప్పటికీ స్పష్టం చేస్తున్నందున అతిగా ఊహించుకొని ఆందోళన చెందడం సరికాదు.ఆస్ట్రాజెనెకా వారి టీకా మంచిదే అయినా, ఫైజెర్, మోడర్నా లాంటి ఇతర టీకాలు మెరుగైనవని నిపుణుల మాట. మరింత భద్రత, ప్రభావశీలత ఉన్న ఎంఆర్‌ఎన్‌ఏ వెర్షన్లు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. దానికి తోడు బాధితుల కేసులు. ఫలితంగా, ఆస్ట్రాజెనెకా తన టీకాలను ఉపసంహ రించుకోక తప్పలేదు. కోర్టు కేసులకూ, తమ ఉపసంహరణకూ సంబంధం లేదనీ, రెండూ కాకతాళీ  యమేననీ ఆ సంస్థ చెబుతున్నా, ఇదంతా నష్టనివారణ చర్యల్లో భాగంగానే కనిపిస్తోంది. అది అటుంచితే, రోగుల భద్రతే తమ ప్రాధాన్యమని ఆస్ట్రాజెనెకా పునరుద్ఘాటిస్తే సరిపోదు. టీకా వాడకం వల్ల తలెత్తిన ఆరోగ్య సమస్యలకు విరుగుడు ఆలోచించి, ప్రజల్లో భరోసా పెంచాలి. బాధ్యత వహించి, బాధిత రోగులకు సత్వర నష్టపరిహారం చెల్లించి తీరాలి. టీకాలో లోపమెక్కడ జరిగిందో క్షుణ్ణంగా పరిశోధించాలి. ప్రభుత్వాలు సైతం ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలి. టీకా వినియోగం సురక్షితమేనని ప్రకటించడానికి అనుసరిస్తున్న ప్రమాణాలేమిటో ఒకసారి సమీక్షించాలి. కఠినమైన ప్రమాణాలు పాటించకుండానే కోవిషీల్డ్‌ వినియోగానికి పచ్చజెండా ఊపిన నియంత్రణ అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే, ప్రస్తుత పరిణామాలతో ప్రజలకు టీకాల పైన, వాటి తయారీదార్లపైన, చివరకు ఆరోగ్య వ్యవస్థ మీదే నమ్మకం సడలితే అది మరింత ప్రమాదం. 

High Court broke Chandrababu conspiracies
చంద్రబాబు కుట్రలకు హైకోర్టు బ్రేక్‌

సాక్షి, అమరావతి: సంక్షేమ పథకాల కింద రైతులు, మహిళలు, విద్యార్థులకు దక్కాల్సిన నిధులను అడ్డుకుంటూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పన్నిన కుట్రలను హైకోర్టు పటాపంచలు చేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్‌డీఏతో పొత్తు పెట్టుకుని... కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా నిధుల పంపిణీని అడ్డుకునేందుకు చంద్రబాబు ముఠా కొద్దిరోజులుగా ప్రయత్నిస్తోంది. అవన్నీ ఐదేళ్లుగా కొనసాగుతున్న పథకాలని, లబ్ధిదారులు కూడా పాతవారేనని అలాంటప్పుడు దానికి ఎన్నికల కోడ్‌ అడ్డంకి కాదని ఎన్నికల కమిషన్‌కు వైఎస్సార్‌సీపీ, రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని వినతులు పంపినా... చంద్రబాబు ఒత్తిడితో ఈసీ వాటిని పట్టించుకోలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు జోక్యంతో బాబు కుట్రలు భగ్నమయ్యాయి. ఇన్‌పుట్‌ సబ్సిడీ, విద్యా దీవెనతో పాటు మహిళలకు ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం కింద రూ.14,165 కోట్ల నిధులను లబ్దిదారులకు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతిని నిరాకరిస్తూ ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ఈ నెల 10వ తేదీ వరకు తాత్కాలికంగా నిలుపుదల (అబయన్స్‌) చేసింది. అయితే 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు మాత్రం సంక్షేమ పథకాల నిధులను పంపిణీ చేయడం గానీ, బదలాయించడం గానీ చేయరాదని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో 10వ తేదీన నిధుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు వెసులుబాటునిచ్చినట్లయింది. నిధుల పంపిణీకి సంబంధించి పత్రికలు, టీవీలు, రేడియో, ఇంటర్‌నెట్‌తో సహా ఏ ఇతర మాధ్యమం ద్వారా ఏ రకమైన ప్రచారం చేయడానికి వీల్లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే నిధుల పంపిణీ విషయంలో ఎలాంటి ఆర్భాటాలు గానీ, సంబరాలు గానీ, రాజకీయ నాయకుల ప్రమేయం గానీ ఉండటానికి వీల్లేదని కూడా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ విషయంలో ఎన్నికల సంఘం జారీ చేసిన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని మీరడానికి వీల్లేదంది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఎన్నికల సంఘాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ...  తదుపరి విచారణను జూన్‌ 27కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బొప్పూడి కృష్ణమోహన్‌ గురువారం రాత్రి 10.20 గంటల సమయంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. నిధుల కోసం కోర్టు తలుపుతట్టిన మహిళలు, రైతులు, విద్యార్థులు... ఇన్‌పుట్‌ సబ్సిడీ, వైఎస్సార్‌ చేయూత, జగనన్న విద్యా దీవెన, వైఎస్సార్‌ ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల కింద లబ్దిదారులకు పంపిణీ చేయాల్సిన నిధులను ఎన్నికలు పూర్తయ్యే వరకు పంపిణీ చేయవద్దంటూ ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్నికల సంఘం ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆయా సంక్షేమ పథకాల లబ్దిదారులైన రైతులు, మహిళలు, విద్యార్థులు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఆయా పథకాల కింద నిధులను తక్షణమే విడుదల చేసేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్ధించారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన జస్టిస్‌ కృష్ణమోహన్, నిధుల పంపిణీ ఎందుకు అత్యవసరమో వివరిస్తూ ఎన్నికల సంఘానికి వినతిపత్రం సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆ వినతిపత్రంపై తగిన నిర్ణయం వెలువరించాలని ఎన్నికల సంఘాన్ని గతంలోనే ఆదేశింశారు. ఈ వ్యాజ్యాలు గురువారం మరోసారి విచారణకు రాగా, కేంద్ర ఎన్నికల సంఘం తరఫు సీనియర్‌ న్యాయవాది అవినాష్‌ దేశాయ్‌ వాదనలు వినిపిస్తూ, రాష్ట్ర ప్రభుత్వ వినతిని పరిగణనలోకి తీసుకున్నామని, అందుకే పోలింగ్‌ పూర్తయ్యే వరకు నిధుల పంపిణీని ఆపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించామని చెప్పారు. ఇప్పుడు నిధులు పంపిణీ చేస్తే అది ఓటర్లను ప్రభావితం చేసినట్లే అవుతుందని తెలిపారు. అప్పుడు చంద్రబాబుకు అనుకూలంగా.. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనంతరం పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఆయా పథకాల కింద రైతులు, మహిళలు, విద్యార్థులకు ఇవ్వాల్సిన నిధులను ఇచ్చి వారిని ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ‘‘ఇవేమీ కొత్త పథకాలు కావు. ఇప్పటికే కొనసాగుతున్న పథకాలు. వీటి ద్వారా లబ్దిదారులకు నిధులను పంపిణీ చేయడం ప్రభుత్వ బాధ్యతల నిర్వహణలో భాగమే అవుతుంది తప్ప, ఓటర్లను ప్రభావితం చేయడం కిందకు రాదు. నిధుల పంపిణీకి అనుమతుల విషయంలో ఎన్నికల సంఘం వివక్షాపూరితంగా వ్యవహరిస్తోంది. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పసుపు కుంకుమ పథకం కింద నిధుల పంపిణీకి ఎన్నికల సంఘం అనుమతినిచ్చింది. ఆ పథకం ఎన్నికల నియమావళి రాకముందే అమలవుతోందన్న కారణంతో నిధుల పంపిణీకి అనుమతిచ్చింది’’ అని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పసుపు కుంకుమ కింద నిధుల పంపిణీకి అనుమతినిచ్చిన విషయాన్ని ఎన్నికల సంఘం లిఖితపూర్వకంగా ఢిల్లీ హైకోర్టు ముందుంచిందని ఆయన వివరించారు. నిధుల పంపిణీపై ఎలాంటి ప్రచారం చేయకుండా చూడాలని అప్పటి ప్రధాన ఎన్నికల అధికారిని సైతం ఎన్నికల కమిషన్‌ ఆదేశించిందని ఆయన కోర్టుకు తెలిపారు. మరి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నిధుల పంపిణీకి అనుమతినిచ్చిన ఎన్నికల కమిషన్, ఇప్పుడు నిధుల పంపిణీని ఎందుకు అడ్డుకుంటోందని ప్రశ్నించారు. ‘‘ప్రస్తుతం ఏ పథకాల కింద అయితే నిధులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందో, ఆ పథకాలలన్నీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) రావడానికి ముందే అమల్లో ఉన్నాయి. దీన్ని ఒకవైపు ఎన్నికల సంఘం అంగీకరిస్తూనే మరో వైపు నిధుల పంపిణీకి బ్రేక్‌ వేసింది’’ అని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పసుపు కుంకుమ కింద నిధుల పంపిణీపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొందరు ఎన్నికల సంఘానికి వినతి పత్రాలు ఇచ్చిన కూడా ఎన్నికల సంఘం వాటిని పట్టించుకోలేదన్నారు. ఎన్నికలకు ముందు పసుపు కుంకుమ కింద లబ్దిదారులకు నిధుల పంపిణీని అడ్డు​కోవాలంటూ ఏపీ హైకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలైందని, అయితే నిధుల పంపిణీని అడ్డుకునేందుకు హైకోర్టు నిరాకరించిందని ఆయన కోర్టుకు నివేదించారు. చంద్రబాబు హయాంలో ఓ రకంగా, ఇప్పుడు మరో రకంగా ఎన్నికల కమిషన్‌ వ్యవహరిస్తోందని, ఇది ద్వంద్వ ప్రమాణాలను పాటించడమే అవుతుందని మోహన్‌రెడ్డి చెప్పారు. ఒక్కొక్కరి విషయంలో ఒక్కో రకంగా ఎన్నికల కమిషన్‌ వ్యవహరిస్తోందని, అందుకు ప్రస్తుత నిర్ణయాలే ఉదాహరణని ఆయన తెలిపారు. నిధుల పంపిణీ బ్యాంకు ఖాతాల ద్వారానే జరుగుతుంది... ఈ నిధులు రాకుంటే రైతులు, విద్యార్థులు, మహిళలు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని, అంతిమంగా అది అప్పులు చేసే స్థితికి దారి తీస్తుందని ఆయన వివరించారు. నిధుల పంపిణీ మొత్తం బ్యాంకు ఖాతాల ద్వారానే జరుగుతుందని, ప్రభుత్వం ఎక్కడా కూడా నిధుల పంపిణీపై ప్రకటనలు ఇవ్వడం గానీ, ప్రచారం చేసుకోవడం గానీ చేసే అవకాశం లేదన్నారు. నిధుల పంపిణీ ద్వారా లబ్ది పొందాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి లేదని తెలిపారు. గతంలో ఎప్పుడో ప్రకటించిన ఈ పథకాలకు ఎన్నికల నియమావళి వర్తించదన్నారు. ఈ పథకాల గురించి ప్రజలందరికీ ఎప్పుడో తెలుసునని, ఈ పథకాల వల్ల ప్రభుత్వానికి ఎంతో మంచి పేరు వచ్చిందని, కాబట్టి ఇప్పుడు వాటి ద్వారా ప్రభుత్వం కొత్తగా పొందే లబ్ది గానీ, ప్రచారం గానీ ఏమీ ఉండదన్నారు. లబ్దిదారుల గుర్తింపు, నిధుల బదిలీ మొత్తం అధికారుల కనుసన్నల్లోనే జరుగుతుందని, ఇందులో ప్రభుత్వానిది నామమాత్రపు పాత్రేనని వివరించారు. కాబట్టి అధికార పార్టీ లబ్ది పొందుతున్న వాదన అర్థరహితమని మోహన్‌రెడ్డి తెలిపారు. నిధుల లభ్యతను బట్టి పంపిణీ చేస్తూ వస్తున్నాం... అటు తరువాత రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ, ఎన్నికల సంఘం నిలుపుదల చేసిన పథకాలేవీ కొత్తవి కావన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా అమలవుతన్నాయని, నిరి్ధష్ట సమయంలో నిధులను లబ్దిదారులకు పంపిణీ చేయడం జరుగుతోందని చెప్పారు. ఇప్పుడు కూడా ఎన్నికల నియమావళి అమల్లోకి రావడానికి ముందే ఈ పథకాలను ప్రకటించడం, లబ్దిదారులను గుర్తించడం జరిగిందన్నారు. నిధుల పంపిణీ అవసరాన్ని వివరిస్తూ ఎన్నికల కమిషన్‌కు వివరణ కూడా ఇచ్చామన్నారు. ఎన్నికల తేదీ దగ్గరలో ఉందని ఎన్నికల సంఘం ఇప్పుడు చెబుతోందని, వాస్తవానికి తాము ఎప్పుడో ఎన్నికల సంఘాన్ని నిధుల పంపిణీ కోసం అనుమతి కోరామని, అనుమతినివ్వడంలో సంఘం జాప్యం చేసిందని తెలిపారు. నిధుల లభ్యతను బట్టి పంపిణీ ఉంటుందని, ఈ నాలుగేళ్లు అలాగే చేస్తూ వచ్చామన్నారు. చంద్రబాబు హయాంలో ఎన్నికలకు ముందు భవిష్యత్తులో నగదుగా మార్చుకునే విధంగా లబ్దిదారులకు పోస్ట్‌ డేటెడ్‌ చెక్కులు ఇచ్చారని, అప్పుడు ఎన్నికల సంఘం ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పుడు మాత్రం లేని పోని రాద్దాంతం చేస్తోందన్నారు. కొత్త పథకాలకు మాత్రమే ఎన్నికల నియమావళి వర్తిస్తుందని చెప్పారు. మిగిలిన వారి అవకాశాలు దెబ్బతినకుండా ఉండేందుకే... చివరగా ఎన్నికల సంఘం తరఫున సీనియర్‌ న్యాయవాది అవినాష్‌ దేశాయ్‌ వాదనలు వినిపిస్తూ, పోలింగ్‌ అయ్యేంత వరకు నిధుల పంపిణీని ఆపడం వల్ల వచ్చే నష్టం ఏమీ లేదన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే మిగిలిన వారి అవకాశాలు (లెవల్‌ ప్లేయింగ్‌ ఫీల్డ్‌) దెబ్బతినకుండా ఉండేందుకే నిధుల పంపిణీని ఆపాలంటూ ఉత్తర్వులిచ్చామని తెలిపారు. ఎన్నికల నియమావళికి లోబడే ఈ ఉత్తర్వులిచ్చామని చెప్పారు. ఎన్నికల నియమావళి కొత్త పథకాలతో పాటు పాత పథకాలకు సైతం వర్తిస్తుందని తెలిపారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు నిధుల పంపిణీ జరిగితే ఓటర్లను ప్రభావితం చేసినట్లే అవుతుందన్నారు. అందుకు ఆస్కారం లేకుండా చేసేందుకే నిధుల పంపిణీని నిలుపుదల చేశామన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ వ్యాజ్యాలను తోసిపుచ్చాలని ఆయన కోర్టును కోరారు. ఉదయం 10.45 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందరి సుదీర్ఘ వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ కృష్ణమోహన్‌ రాత్రి 10.20 గంటలకు ఉత్తర్వులు వెలువరించారు. ఈ వ్యాజ్యాలకున్న అత్యవసరం నేపథ్యంలో పూర్తి ఉత్తర్వుల కాపీ స్థానంలో అడ్వాన్స్‌ ఉత్తర్వుల కాపీని విడుదల చేశారు. పూర్తి కాపీ అందుబాటులోకి వచ్చేందుకు కాస్త సమయం పట్టే అవకాశం ఉంది.   

Sakshi Guest Column On AP CM YS Jagan
చరిత్ర పునరావృతం అవుతుంది...

ఎన్నికలు దగ్గర పడే కొద్దీ గెలుపుపై నమ్మకం సన్న గిల్లో, లేక చెప్పుకోడానికి మరేం లేకనో కొంతమంది రాజకీయ నాయకులు ద్వేషపూరిత ప్రసంగాలను ఆశ్రయించారు. విద్వేషాన్ని రగిలించే ఈ ప్రసంగాలు సత్యదూరమైన ఆరో పణలతో కూడినవి. ప్రధాన మంత్రి మోదీ మాట్లాడుతూ ఈ దేశంలోని ముస్లింలను చొర బాటుదారులుగా అభివర్ణించడం దారుణం. ముస్లిం ప్రజలందరికీ ఇది అవమానకరం. ప్రత్యర్థి పార్టీ మేనిఫెస్టోను ‘ముస్లిం లీగ్‌‘ మేనిఫెస్టోగా పెర్కొనడం ప్రధాని స్థాయికి తగినది కాదు.‘ఇండియా’ కూటమి వస్తే మీ ఇంటిలోని బంగారం, మంగళసూత్రాలతో సహా అంతా దోచి ముస్లింలకు కట్టబెడతారు అనడం అథమ స్థాయి వాదన.ఎన్నో సర్వేల్లో తేలిన వాస్తవాల ప్రకారం దేశం మొత్తం మీద ముస్లింల ఆర్థిక పరిస్థితి చాలా దయనీయం. దేశంలో జైళ్లలో మగ్గుతున్న వారిలో దళితులు, ఆదివాసీల లాగానే ముస్లింలు కూడా వారి జనాభా నిష్పత్తి కంటే ఎక్కువగా ఉన్నారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని ఆనాడు వైఎస్సార్‌ సారథ్యం లోని కాంగ్రెస్‌ ప్రభుత్వం దేశం లోనే మొట్ట మొదటి సారి ముస్లింలకు ప్రత్యేక రిజర్వేషన్‌ కల్పించింది. మోదీ తన ప్రసంగంలో ముస్లిం రిజర్వేషన్‌ను ప్రస్తావిస్తూ ఇతర బీసీల రిజర్వేషన్లు తగ్గించి ముస్లింలకు ఇవ్వచూపు తున్నారు అని విమర్శించడం అవాస్తవమే గాక శోచనీయం.మోదీ బాటలో నడుస్తూ ఎన్డీఏ కూటమి భాగస్వామి పవన్‌ కల్యాణ్‌ ఆంధ్రప్రదేశ్‌లో విద్వేషం వెదజల్లుతున్నారు. యాదృచ్ఛికంగానో, ఆకతాయి మూకల వల్లో జరిగిన ఆలయ రథ అగ్నిప్రమాదాన్నీ, ఒక విగ్రహానికి జరిగిన హానినీ ఆ యా ప్రాంతాల సభలలో ఒకటికి పది సార్లు ప్రస్తావిస్తూ ప్రభుత్వమే అటువంటివి చేయించింది అనే అర్థాన్ని స్ఫురించేలా అపోహలకి తెరలేపు తున్నారు.ఎటువంటి ఆధారాలు లేకుండా వందల కొద్దీ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయి అని బహిరంగ సభలలో అరవడం ఒక బాధ్యతా యుతమైన నేత పని అనిపించుకుంటుందా? మత విద్వేషాలు అనే ఊసు ఎప్పుడూ లేని ఉత్తరాంధ్రలో ప్రజలను రెచ్చగొట్టే ఇలాంటి ప్రసంగాలు చేయడం ఒక అమానుష చర్య. మరి కొన్ని సభల్లో ప్రజలను ‘మీకు సిగ్గు లేదా’, ‘పౌరుషం లేదా’ ‘మీరు రోడ్లు ఎక్కి వీళ్లకి బుద్ధి చెప్పరా’ అని అనడం వారిని ప్రత్యక్ష హింస వైపు ప్రేరేపించడమే. ఒక వైపు 2016లో చంద్ర బాబు హయాంలో జరిగిన కాపు రిజర్వేషన్‌ ఆందో ళన, తుని రైలు విధ్వంసం సంఘటనలను అప్పటి ప్రతిపక్షం వైసీపీ చేయించింది అనే నిందను వేశారు. అదే నోటితో జగన్‌ ప్రభుత్వం కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెట్టిన సందర్బంగా 2022లో జరిగిన మంత్రి ఇల్లు దగ్ధం సంఘటనకు కూడా జగనే కారకుడు అనడంలో ఔచిత్యం ఏంటి? ఈ రెండు సునిశితమైన అంశాలను ఎన్ని కల వేళ మళ్ళీ తెర మీదకి తెచ్చి విద్వేషాలను రగిలించే తత్వం చాలా తప్పు. అసలు కాపు రిజర్వేషన్‌ సమస్యపై తనది, తన కూటమి వైఖరి ఏంటో చెప్పకుండా వైసీపీ లోని కాపు నేతలను కించ పరుస్తూ వారి నియోజక వర్గాల్లోనే అవమా నించడం ఒక అక్కసుతో, ద్వేషంతో కూడిన అజెండాలో భాగమే.14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఒక సిట్టింగ్‌ ముఖ్యమంత్రిని ‘కరుడు కట్టిన ఉగ్రవాది’ అని వర్ణించటం అత్యంత గర్హనీయ చర్య. ఈ మాటల్లో ఉక్రోషం కొట్టొచ్చినట్లు కనిపి స్తుంది. ప్రజలు వేసిన ఓట్లతో ముఖ్యమంత్రి అయిన జగన్‌ ఉగ్రవాది ఎలా అవుతారు? విధాన పరంగా విమర్శిస్తే ప్రజలు హర్షిస్తారు కానీ ఇటు వంటి మాటలు వాడితే ఎదురుదెబ్బ తగలడం ఖాయం.ఈ విధంగా కూటమి నేతలు మోదీ, పవన్‌ కల్యాణ్, చంద్రబాబు ముగ్గురూ విద్వేషాన్ని రగిలిస్తుంటే ముక్కున వేలేసుకోవాల్సిన పరిస్థితి ప్రజల దయ్యింది. ఇంతగా విలువలకు తిలోద  కాలు ఇచ్చిన వైనం చూస్తే ఓటమి భయం వారిని వేధిస్తున్నట్టు అనిపిస్తోంది. ఇలాంటి విమర్శల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ తన మేనిఫెస్టో విడుదల చేసింది. గమనించాల్సిన విషయం ఏంటంటే కొత్తగా పెద్ద హామీలు ఏమీ ఇవ్వక పోవడం. ‘ఉన్న పథకాలనే కొనసాగిస్తాం, మెరుగు చేస్తాం’ అంటూ ముందుకు వచ్చిన జగన్‌ తన ఓటు బ్యాంకుపై ఆత్మ విశ్వాసం కలిగి ఉన్నా రని దీన్నిబట్టి  అర్థమవుతోంది. ఇలాగే 2009లో అప్పటి వైఎస్‌ఆర్‌ కూడా 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నాక ఎటువంటి కొత్త హామీలు ఇవ్వకపోయినా ప్రజలు తమ నమ్మకాన్ని మళ్ళీ ఆయనపై ఉంచి ప్రతిపక్ష మహాకూటమిని చిత్తుగా ఓడించారు. మళ్లీ ఇప్పుడు సంక్షేమానికి ప్రజలు పట్టం కట్టిన ఆ చరిత్ర పునరావృతం అవుతుందనిపిస్తోంది.డా‘‘ జి. నవీన్‌ వ్యాసకర్త సామాజిక, రాజకీయ విశ్లేషకులుnaveen.prose@gmail.com

TDP MP Candidate Sribharat Says Visakhaptnam Is Best For Capital
విశాఖ బెస్ట్.. అమరావతి వేస్ట్: తేల్చి చెప్పేసిన బాలయ్య చిన్నల్లుడు

అదేంటి అలాగనేశాడు.. ఒసే.. అలా చెప్పడమేటి? పళ్ళకుండూ.. ఇలాపింటి మాటలే దెబ్బేసేస్తాయి. నిజాలు అయినా.. అలా ఒప్పేసుకోకూడదు. ఆ.. ఎలచ్చన్లు అంటే ఏటనున్నావ్‌ మనకు ఏది లాభమో అదే చెప్పాలి. పక్కోడు మంచోడు అయినా మంచి చేసినా మనం ఒప్పుకోకూడదు. కానీ బాలయ్య చిన్నల్లుడు మాత్రం నిజం ఒప్పేసుకున్నాడు.. అంటూ కంచరపాలెం టీ  కొట్టు దగ్గర చెప్పుకెళ్తున్నాడు  సిమాచలం. ఒరే ఏట్రా బాబు.. అలా ఒక్కడివే పేలుకుంటున్నావ్ అన్నాడు నారాయణ బీడీ అంటిస్తూ, మరేట్రా బాలయ్య చిన్నల్లుడు.. ఇసాపట్నం టీడీపీ ఎంపీ కేండేట్ శ్రీభరత్ మొత్తానికి నిజం ఒప్పేసుకున్నాడు. జగన్ చేసిందే కరెస్ట్ అని చెప్పేసాడు అన్నాడు సిమాచలం. ఒరేయ్.. అసలు పాయింట్ చెప్పకుండా ఏదేదో పేల్తే గూబ పేలిపోద్ది అన్నాడు సిరగ్గా నారాయణ..మనకు రాజధానిగా ఇసాపట్నమే బెస్టని, పొలాలు తుప్పలు డొంకలతో విలేజిల్లో ఉన్న అమరావతి వేస్ట్ అని చెప్పేశాడ్రా బాబు అన్నాడు సిమాచలం. ఒసే.. తెలుగుదేశపోల్లు అమరావతి అంటారు కదేటి.. ఉన్నఫళంగా ఇలాగనేశాడేటి అన్నాడు నారాయణ. ఒరేయ్.. వాళ్లకూ తెలుసురా అమరావతి అయ్యేది కాదని, ఎప్పటికైనా ఇసాపట్నమే ఆంధ్రకు పెద్ద దిక్కు అని. అందుకే ఆళ్ళ కాలేజీ కూడా ఇక్కడే డెవలప్ చేస్తున్నాడుచూసావా అన్నాడు సిమాచలం. అవునురోయ్ మన ఇసాపట్నానికి అమరావతికి సాపత్తిమా, పల్లకోరా బాబు.. ఆ ముక్క తెలుగుదేశపోళ్ళకు కూడా తెలుసు. కానీ చంద్రబాబుకు అన్నీ మూసుకున్నారు. ఏదైనా జగన్ గొప్పోడురా బాబు అందుకే మన వైజాగ్‌ను రాజధానిగా చేయడమే కాదు ఇక్కడే పెద్దపెద్ద కంపెనీలు తెస్తాను అని అప్పుడే డిసైడ్ అయ్యాడు. చూస్తుండు అన్నీ ఖచ్చితంగా చేస్తాడు అని చెబుతున్న సిమాచలం వైపు విస్మయంతో చూస్తూ... పోన్లేరా అలాగైతే మన గుంతలకు ఇక్కడే ఉజ్జోగాలు వస్తాయి అన్నాడు నారాయణ.టీడీపీ ఎంపీ అభ్యర్థి గీతం కాలేజీ చైర్మన్ శ్రీభరత్ మనసులోని మాట చెప్పేశారు. రాష్ట్ర రాజధానిగా విశాఖ అద్భుతంగా ఉంటుందని, ఈ నగరానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయ్ కాబట్టి  దేన్నిమించిన నగరం రాజధానిగా ఎంపిక చేసుకోలేమని తేల్చి చెప్పేశారు. ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అమరావతి అనేది రాజధానిగా పనికిరాదని, విశాఖ అద్భుతంగా అభివృద్ధి చెందిన నగరమని, అందుకే దీన్నే రాజధానిగా చేయాలనీ అన్నారు. అయన ఇప్పుడు చెబుతున్నారు కానీ సీఎం వైఎస్ జగన్ ఏనాడో విశాఖను రాజధానిగా చేస్తానన్నారు.అయన రేపు ప్రమాణస్వీకారం కూడా విశాఖలోనే అని తేల్చేశారు.  ఇక శ్రీ భారత్ మామ, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా విశాఖలో భీమిలి ప్రాంతంలో భూములు కొన్నట్లు తెలుస్తోంది. అంటే ఆయనకు కూడా విశాఖ రాజధాని అవుతుందని తెలుసు. కానీ చంద్రబాబు మాత్రమే తన తాబేదారులకోసం రియల్ ఎస్టేట్ వ్యాపారులకోసం అమరావతి కావాలని అంటున్నారని ప్రజలు గుర్తించారు. ఇక ఎన్నికల ఫలితాలు రావడం, జగన్ గెలవడం.. విశాఖలోనే ప్రమాణస్వీకారం చేయడం, అక్కడే నివాసం ఏర్పాటు చేసుకోవడం చకచకా జరిగిపోతాయని ఉత్తరాంధ్ర ప్రజలు ఎదురుచూస్తున్నారు.-సిమ్మాదిరప్పన్న 

Campaigning in elections not a fundamental right says Enforcement Directorate
Enforcement Directorate (ED): ఎన్నికల ప్రచారం ప్రాథమిక హక్కు కాదు

న్యూఢిల్లీ: ఎన్నికల్లో ప్రచారం చేయడం అనేది ప్రాథమిక హక్కు లేదా రాజ్యాంగపరమైన హక్కు కాదని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ స్పష్టం చేసింది. అలాగే అది చట్టపరమైన హక్కు కూడా కాదని తేల్చిచెప్పింది. ఎన్నికల్లో ప్రచారం చేయాలన్న కారణంతో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కనీ్వనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ ఇవ్వొద్దని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో అరెస్టయిన అరవింద్‌ కేజ్రీవాల్‌ మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనకు బెయిల్‌ ఇవ్వొద్దంటూ ఈడీ అఫిడవిట్‌ దాఖలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాజకీయ నాయకులు జ్యుడీషియల్‌ కస్టడీలో ఉంటూ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన సందర్భాలు గతంలో ఉన్నాయని, ప్రచారం చేసుకోవడానికి వారికి కోర్టులు మధ్యంతర బెయిల్‌ ఇవ్వలేదని ఈడీ తన అఫిడవిట్‌లో ప్రస్తావించింది. ఎన్నికల్లో పోటీ చేయకపోయినా కేవలం ప్రచారం కోసం మధ్యంతర బెయిల్‌ ఇచి్చన ఉదంతాలు కూడా లేవని స్పష్టం చేసింది. చట్టం ముందు అందరూ సమానమేనని ఉద్ఘాటించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ప్రత్యేక మినహాయింపు ఇవ్వడం చట్ట ముందు అందరూ సమానమేనన్న నిబంధనను ఉల్లంఘించినట్లు అవుతుందని వెల్లడించింది. అదేకాకుండా ఇప్పుడు ఆయనకు మధ్యంతర బెయిల్‌ ఇస్తే భవిష్యత్తులో రాజకీయ నాయకులు ఇలాంటి వెసులుబాటు కోరే అవకాశం ఉందని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచి్చంది.  కేజ్రీవాల్‌పై అతి త్వరలో ఈడీ చార్జిషీట్‌  ఢిల్లీలో ఎక్సయిజ్‌ విధానంలో అవకతవక ల సంబంధ కేసులో ఈడీ అతి త్వరలో ప్రత్యేక మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేయనున్నట్లు తెలిసింది. ఈ చార్జిషీట్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్, తెలంగాణకు చెందిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతోపాటు ఇతర నిందితుల పేర్లతో అదనంగా మరిన్ని వివరాలు, ఆస్తుల గురించి ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి. మద్యం కుంభకోణంలో ఈడీ ఇప్పటిదాకా 18 మందిని అరెస్టు చేసింది. ఇప్పటికే ఆరు చార్జిషీట్లు దాఖలు చేసింది. మరో నాలుగైదు రోజుల్లో దాఖలు చేయబోయే చార్జిషీట్‌ ఏడోది కానుంది.

Dhanush's Son Yatra Raja Got Good Result In Board Exams
ఇంటర్‌ ఫలితాల్లో సత్తా చాటిన ధనుష్‌ కుమారుడు.. మార్కులెన్నో తెలుసా..?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్‌లు కొద్దిరోజుల క్రితమే విడాకుల విషయంలో వార్తల్లో నిలిచారు. 2004లో ప్రేమ వివాహం చేసుకున్న వీరిద్దరూ సుమారు 18 ఏళ్ల పాటు కలిసి జీవించారు. వారికి  యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే,  గత రెండేళ్లుగా ధనుశ్, ఐశ్వర్య వేర్వేరుగానే ఉంటున్నారు.ధనుష్‌ పెద్ద కుమారుడు యాత్ర 12వ తరగతి బోర్డు పరీక్షలలో బాగా రాణించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇంటర్‌ ఫలితాల్లో అతని అత్యుత్తమ ప్రదర్శనకు అభిమానులతో పాటు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. ఇటీవల ముగిసిన 12వ తరగతి బోర్డు పరీక్షలో యాత్ర 600 మార్కులకు గాను మొత్తం 569 మార్కులు సాధించినట్లు సమాచారం. తమిళ్‌ 100కి 98, ఇంగ్లిష్‌లో 92, గణితంలో 99, ఫిజిక్స్‌లో 91, బయాలజీలో 97, కెమిస్ట్రీలో 92 మార్కులు సాధించినట్లు ఇంటర్నెట్‌లో ఒక వార్త వైరల్ అవుతుంది. ఇందులో అధికారికంగా ప్రకటన వెలువడలేదు.ధనుష్, ఐశ్వర్య విడిపోయినప్పటికీ, వారు తమ ఇద్దరు పిల్లలను బాధ్యతగానే చూసుకుంటున్నారు. లాల్ సలామ్ మ్యూజిక్ లాంచ్ పార్టీలో ఐశ్వర్యతో పాటుగా యాత్ర,లింగ కనిపించారు. కెప్టెన్ మిల్లర్ ఫిల్మ్ ఫెస్టివల్‌ సమయంలో పిల్లలు ఇద్దరూ కూడా ధనుష్‌తో కలిసి సందడి చేశారు. యాత్రకు 18 ఏళ్లు కాగా, చిన్న కుమారుడు లింగాకు 14 ఏళ్లు. వీరిద్దరూ చెన్నైలోని ఓ ప్రముఖ పాఠశాలలో చదువుకున్నట్లు సమాచారం. 

తనిష్క్ జ్యువెలరీ నెక్లెస్‌
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్

ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన,  భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్‌ల నుండి ప్రేరణ పొంది  అద్భుతమైన మరియు వైవిధ్యమైన  శ్రేణి సమకాలీన,  రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్‌లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్‌లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్‌లు,  కస్టమర్‌లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా,  ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్‌ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్‌ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్,  ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం  వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్‌లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్‌గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్‌లెట్‌లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్‌లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్‌లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్‌డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్‌లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్  18కేరట్  మరియు 22కేరట్  బంగారంలో విస్తృతమైన శ్రేణి  డిజైన్‌లతో,  నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని  సంపూర్ణం  చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్‌లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన  సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను  అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా  కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్‌లెట్‌లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement

ఫోటో స్టోరీస్

View all