Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

PM Modi Oath Ceremony NDA Government Formation
మహాత్మునికి నివాళులు అర్పించిన ప్రధాని మోదీ

దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ఈరోజు(ఆదివారం) రాత్రి 7.15 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీ మూడోసారి దేశానికి ప్రధాని కాబోతున్నారు. ప్రమాణ స్వీకారానికి ముందు ఆయన ఈరోజు ఉదయాన్నే రాజ్‌ఘాట్‌కు వెళ్లారు. అక్కడ జాతిపిత మహాత్మాగాంధీ సమాధి వద్ద పూలమాలలు ఉంచి, నివాళులర్పించారు.మోదీ ప్రమాణాస్వీకారోత్సవం సందర్భంగా ఢిల్లీలోని పలు చోట్ల దీనికి సంబంధించిన పోస్టర్లు అతికించారు. ఈ కార్యక్రమానికి శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజు, సీషెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ అఫీఫ్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నాథ్, నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ, భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే లను ఆహ్వానించారు. #WATCH | Delhi: PM-designate Narendra Modi arrives at Rajghat to pay tribute to Mahatma Gandhi, ahead of his swearing-in ceremony, to be held today at Rashtrapati Bhawan.He will take the Prime Minister's oath for the third consecutive term, today at 7:15 PM. pic.twitter.com/L7u5S0uvHo— ANI (@ANI) June 9, 2024 ఇదీ చదవండి: నేడు మోదీ మూడోసారి

India and Pakistan match in World Cup today
నేడు టీ20 వరల్డ్‌కప్‌లో హైవోల్టేజ్‌ మ్యాచ్‌

అక్టోబర్‌ 23, 2022...మెల్‌బోర్న్‌ మైదానంలో భారత్, పాకిస్తాన్‌ మ్యాచ్‌...రవూఫ్‌ బౌలింగ్‌లో కోహ్లి రెండు అద్భుత సిక్సర్లతో టీమిండియాను గెలిపించిన తీరును మన అభిమానులెవరూ మరచిపోలేరు. ‘గ్రేటెస్ట్‌ మూమెంట్‌ ఇన్‌ టి20 వరల్డ్‌ కప్‌ హిస్టరీ’ అంటూ తొలి సిక్స్‌కు కితాబిచ్చింది. ఇప్పుడు మళ్లీ టి20 వరల్డ్‌ కప్‌లో అలాంటి అద్భుత క్షణాల కోసం ఇరు జట్ల మధ్య మరో మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. నాటి పోరు తర్వాత టి20 ఫార్మాట్‌లో ఇరు జట్లు తలపడనుండటం ఇదే తొలిసారి. న్యూయార్క్‌: టి20 వరల్డ్‌ కప్‌లో మాజీ చాంపియన్లు, దాయాది జట్లు భారత్, పాకిస్తాన్‌ మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. గ్రూప్‌ ‘ఎ’లో భాగంగా నాసా కౌంటీ క్రికెట్‌ గ్రౌండ్‌లో జరిగే మ్యాచ్‌లో పాక్‌ను టీమిండియా ఎదుర్కొంటుంది. తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై సునాయాసంగా నెగ్గిన భారత్‌ ఉత్సాహంగా కనిపిస్తుండగా... చిన్న జట్టు అమెరికా చేతిలో ఓడిన పాక్‌పై తీవ్ర ఒత్తిడి ఉంది. అమెరికాలో క్రికెట్‌కు ప్రాచుర్యం కల్పించడంలో భాగంగా ఐసీసీ ఈ మ్యాచ్‌కు భారీ స్థాయిలో ప్రచారం నిర్వహించింది. న్యూయార్క్‌ అభిమానుల కోసం తక్కువ సమయంలో 34 వేల సామర్థ్యం గల స్టేడియాన్ని నిరి్మంచింది. పిచ్‌పై ఇప్పటికే చాలా విమర్శలు వస్తున్నాయి. అక్షర్‌ స్థానంలో కుల్దీప్‌! ఐర్లాండ్‌పై సునాయాసంగా గెలిచిన భారత జట్టులో ఎలాంటి ఆందోళన లేదు. టాపార్డర్‌లో రోహిత్, కోహ్లి, పంత్‌ ఖాయం కాగా...సూర్యకుమార్, దూబే, పాండ్యాలతో బ్యాటింగ్‌ పటిష్టంగా ఉంది. గత మ్యాచ్‌లో విఫలమైనా...అసలు సమయంలో ఎలా చెలరేగాలో కోహ్లికి బాగా తెలుసు. పాండ్యా, జడేజా బ్యాటింగ్‌ అవసరం లేకుండా టీమ్‌ విజయాన్ని పూర్తి చేసుకుంది.టాప్‌–7 వరకు బ్యాటింగ్‌ సామర్థ్యం ఉంది కాబట్టి జట్టు ఒక మార్పు చేయవచ్చు. అక్షర్‌ పటేల్‌ స్థానంలో కుల్దీప్‌ యాదవ్‌ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. గత కొంత కాలంగా కుల్దీప్‌ మంచి ఫామ్‌లో ఉండటంతో పాటు పాక్‌పై మంచి రికార్డు కూడా ఉంది. పిచ్‌ స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉంటే మాత్రం ముగ్గురు పేసర్లు బుమ్రా, సిరాజ్, అర్‌‡్షదీప్‌లలో ఒకరిని తప్పించి కుల్దీప్‌ను ఎంపిక చేస్తారు. గందరగోళంలో... మరో వైపు పాకిస్తాన్‌ పరిస్థితి మాత్రం ఇబ్బందికరంగా ఉంది. యూఎస్‌ చేతిలో అనూహ్యంగా ఓడిపోవడంతో అన్ని వైపులనుంచి విమర్శలు వస్తున్నాయి. ఓటమికంటే ఆ మ్యాచ్‌లో పేలవ ఆటతీరు చూస్తే జట్టులో సమస్య ఏమిటో అర్థమవుతుంది. ఓపెనర్లుగా రిజ్వాన్, బాబర్‌ ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు. అటు కెప్టెన్సీ లో కూడా లోపాలతో బాబర్‌ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. మిడిలార్డర్‌ కూడా బలహీనంగా కనిపిస్తోంది. యూఎస్‌తో కేవలం 159 పరుగులకే పరిమితమైంది. సుదీర్ఘకాలంగా ఈ ఫార్మాట్‌లో ఆడుతున్నా బౌలర్లు షాహిన్‌ అఫ్రిది, రవూఫ్, నసీమ్‌ కనీస స్థాయి ప్రదర్శన ఇవ్వడం లేదు. 2021 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లో మినహాయిస్తే ప్రతీ సారి భారత్‌ చేతిలో భంగపడిన టీమ్‌ ఈ సారి ఏం చేస్తుందనేది చూడాలి. టి20 ప్రపంచకప్‌లో నేడువెస్టిండీస్‌ X ఉగాండావేదిక: ప్రొవిడెన్స్‌; ఉదయం గం. 6 నుంచిఒమన్‌ X స్కాట్లాండ్‌ వేదిక: నార్త్‌ సౌండ్‌; రాత్రి గం. 10:30 నుంచిస్టార్‌ స్పోర్ట్స్, హాట్‌ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Israel-Hamas war: Israel rescues 4 hostages, 210 Palestinians reported killed
గాజాలో భీకర పోరు.. 210 మందికి పైగా మృతి!

జెరూసలెం/గాజా: సెంట్రల్‌ గాజాలో నుసెయిరత్‌లో హమాస్‌ మిలిటెంట్లు, ఇజ్రాయెల్‌ సైన్యం మధ్య పోరు భీకరంగా సాగుతోంది. శనివారం నుసెయిరత్, పరిసర ప్రాంతాల్లో ఇజ్రాయెల్‌ దాడుల్లో 210 మంది చనిపోయినట్టు సమాచారం! 400 మంది దాకా గాయపడినట్లు హమాస్‌ను ఉటంకిస్తూ అల్‌జజీరా పేర్కొంది. మృతుల్లో పలువురు చిన్నారులున్నట్లు తెలిపింది. డెయిర్‌ అల్‌ బలాహ్‌లోని అల్‌–హక్సా ఆస్పత్రి మొత్తం రక్తంతో తడిచి వధశాలగా మారిపోయిందని డాక్టర్స్‌ వితౌట్‌ బోర్డర్స్‌ పేర్కొంది.నలుగురు బందీలకు విముక్తి..ఇలా ఉండగా, హమాస్‌ మిలిటెంట్ల చెర నుంచి బందీలను విడిపించుకునేందుకు గాజాపై యుద్ధం ప్రారంభించిన ఇజ్రాయెల్‌ ఆర్మీ పెద్ద విజయం నమోదు చేసుకుంది. నుసెయిరత్‌లో ఓ భవన సముదాయంపై శనివారం పట్టపగలే ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టిన ఆర్మీ రెండు వేర్వేరు ప్రాంతాల్లో దాచి ఉంచిన నోవా అర్గామని(25), అల్మోగ్‌ మెయిర్‌ జాన్‌(21), ఆండ్రీ కొజ్లోవ్‌(27), ష్లోమి జివ్‌(40) అనే నలుగురు బందీలను సురక్షితంగా తీసుకొచ్చినట్లు తెలిపింది. తాజాగా రక్షించిన నలుగురితో కలిపి ఇజ్రాయెల్‌ ఆర్మీ ఇప్పటి వరకు కాపాడిన బందీల సంఖ్య ఏడుకు చేరుకుంది. అమెరికా అందించిన సమాచారంతోనే బందీలను ఇజ్రాయెల్‌ ఆర్మీ గుర్తించి, రక్షించిందని బైడెన్‌ ప్రభుత్వంలోని ఓ అధికారి వెల్లడించారు. గురు, శుక్రవారాల్లోనూ ఇజ్రాయెల్‌ దాడుల్లో డజన్ల మంది మరణించారు.ఆమె వీడియో వైరల్‌.. శనివారం ఐడీఎఫ్‌ రక్షించిన వారిలో అర్గామని అనే మహిళ ఉన్నారు. మిలిటెంట్లకు చిక్కిన బందీల్లో అర్గామనికి చెందిన వీడియోనే మొదటిసారిగా బయటకు వచి్చంది. ఇద్దరు మిలిటెంట్లు బైక్‌పై తీసుకెళ్తుండగా ‘నన్ను చంపకండి’అని ఆమె రోదిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. బ్రెయిన్‌ కేన్సర్‌ ముదిరి మృత్యుశయ్యపై ఉన్న తనకు కూతురిని చూడాలని ఉందంటూ అర్గామని తల్లి లియోరా ఏప్రిల్‌లో ఒక వీడియో విడుదల చేశారు. చెర నుంచి విడుదలైన అర్గామనితో ప్రధాని నెతన్యాహు ఫోన్‌లో మాట్లాడారు. బందీలందరినీ విడిపించేదాకా యుద్ధం ఆపబోమని స్పష్టం చేశారు.

Kalki AD 2898 Pre Release Event
కొన్ని గంటల్లో 'కల్కి' ట్రైలర్‌.. ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడేనా..?

ప్రభాస్‌ హీరోగా నటించిన సైన్స్ ఫిక్షన్ అండ్‌ ఫ్యూచరిస్టిక్‌ ఫిల్మ్‌ ‘కల్కి 2898 ఏడీ’. అమితాబ్‌ బచ్చన్ , కమల్‌ హాసన్ , దీపికా పదుకొనె, దిశా పటానీ ఇతర పాత్రల్లో నటించారు. నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో అశ్వినీదత్‌ నిర్మించిన ఈ చిత్రం జూన్ 27న విడుదల కానుంది. ఈ చిత్రంలో భైరవ పాత్రలో ప్రభాస్‌ నటిస్తున్నారు. ఇందులో బుజ్జి వాహనం చాలా ప్రత్యేకంగా ఉండనుంది. అయితే, మరికొన్ని గంటల్లో కల్కి ట్రైలర్‌ విడుదల కానుంది. ఈ క్రమంలో ఫ్యాన్స్‌ భారీ అంచనాలు పెట్టుకున్నారు.కల్కి ట్రైలర్‌ జూన్‌ 10న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్‌ ప్రకటించారు. దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో థియేటర్స్‌లలో కూడా కల్కి ట్రైలర్‌ను విడుదల చేసే ఛాన్స్‌ ఉంది. అందుకు ఇప్పటికే ఆ థియేటర్స్‌ లిస్ట్‌ను కూడా మేకర్స్‌ రెడీ చేసినట్లు సమాచారం.కల్కి సినిమా జూన్‌ 27న విడుదల కానున్నడంతో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. ఈ వేడుక కోసం పెద్ద ఎత్తున​ నిర్వహిస్తుండటంతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖలను ఆహ్వానించే పనిలో కల్కి టీమ్‌ ఉందట. జూన్‌ 23న కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనున్నట్లు సోషల్‌ మీడియాలో ఒక వార్త వైరల్‌ అవుతుంది.

YSRCP TDP mutual attacks
కవ్వింపులు.. ఆపై గొడవలు

పెళ్లకూరు (తిరుపతి జిల్లా): పెళ్లకూరు మండలం చిల్లకూరులో టీడీపీ కార్యకర్త దుందుడుకు చర్యలతో గొడవ చోటుచేసుకుంది. టీడీపీ, వైఎస్సార్‌సీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ దాడులతో సంబంధం లేని ఎన్‌డీసీసీబీ మాజీ చైర్మన్‌ సత్యనారాయణరెడ్డిపై అక్రమ కేసు నమోదైంది. వివాదాస్పద ఈ గ్రామంలో కొద్ది రోజులుగా పోలీసు పికెట్‌ ఏర్పాటు చేసి 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. అయితే గ్రామానికి చెందిన టీడీపీ నేత దువ్వూరు విజయసేనారెడ్డి టీడీపీ విజయం సాధించిన నేపథ్యంలో గురువారం రాత్రి పెద్ద ఎత్తున బాణసంచా కాల్చాడు. గడ్డివాములు, చిన్న పిల్లలపై నిప్పు రవ్వలు పడ్డాయి. దీంతో అదే గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు మురళి, మరి కొందరు విజయసేనారెడ్డితో మాట్లాడేందుకు వెళ్లారు. అక్కడ మాటామాటా పెరిగి వాగ్వాదానికి దిగారు. ఇరు వర్గాల వారు దాడులకు పాల్పడటంతో పలువురు గాయపడ్డారు. నాయుడుపేట డీఎస్పీ శ్రీనివాసులురెడ్డి ఘటన స్థలానికి చేరుకుని వేర్వేరు వాహనాల్లో చికిత్స నిమిత్తం ఒక వర్గాన్ని శ్రీకాళహస్తికి, మరో వర్గాన్ని నాయుడుపేట ఆసుపత్రులకు తరలించారు. అదే సమయంలో సత్యనారాయణరెడ్డిపై కక్ష సాధించడం కోసం దాడుల్లో గాయపడిన రాకే‹Ùరెడ్డికి మద్దతుగా నాయుడుపేటకు చెందిన కొందరు టీడీపీ యువత పెళ్లకూరు పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. సత్యనారాయణరెడ్డి తమపై దాడి చేయించాడంటూ రాకే‹Ùరెడ్డి, విజయసేనారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు పెట్టాలని పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఇరు వర్గాల ఫిర్యాదులతో ఎన్‌డీసీసీబీ మాజీ చైర్మన్‌ సత్యనారాయణరెడ్డితో పాటు ఆయన వర్గానికి చెందిన పిల్లిమిట్ట మురళి, వంశీకృష్ణ, ఆళ్ల చంద్రబాబు, సుజిత్, మణి, నాగార్జున్, చెంచయ్య, పుట్టయ్యలతో పాటు రాకే‹Ùరెడ్డి, విజయసేనారెడ్డిలపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. సత్యనారాయణరెడ్డిని కూడా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనతో సంబంధంలేని సత్యనారాయణరెడ్డిపై కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శుక్రవారం పోలీస్‌స్టేషన్‌ వద్ద ఆందోళన చేపట్టారు. నాయుడుపేట రూరల్‌ సీఐ జగన్‌మోహన్‌రావు అత్యుత్సాహం వల్లే సత్యనారాయణరెడ్డిని అన్యాయంగా కేసులో ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు. అడిషనల్‌ ఎస్పీ జక్కా కులశేఖర్‌ పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని కేసు వివరాలను పరిశీలించారు. సత్యనారాయణరెడ్డితో పాటు మరో తొమ్మిది మందిని అరెస్టు చేసి సూళ్లూరుపేట కోర్టులో హాజరు పరిచారు. ఎన్నికల సమయంలో డబుల్‌ గేమ్‌ అడుతున్న సీఐని బదిలీ చేయాలని అప్పట్లో ఎమ్మెల్యే సంజీవయ్యకు సూచించడాన్ని మనసులో పెట్టుకొని అన్యాయంగా తనను కేసులో ఇరికించినట్లు సత్యనారాయణ రెడ్డి తెలిపారు.

Funday Special Cover Story Commemorating The Re-Opening Of Children's Schools
పిల్లలూ గుర్తుందా!? వేసవి సెలవులు అయిపోవచ్చాయి..!

వేసవి సెలవులు అయిపోవచ్చాయి. స్కూళ్లు ప్రారంభమవుతున్నాయి. మళ్లీ తరగతి గదులు, ట్యూషన్లు, హోమ్‌ వర్కులు ఇలా పిల్లల్లో హంగామా మొదలైపోయింది. యూనిఫామ్, టెక్స్‌›్టబుక్స్‌ ఇలా అన్నీ మారుతుంటాయి. ఇదంతా పిల్లల తల్లిదండ్రులకు కూడా పరీక్షే! కొత్త స్కూల్‌ బ్యాగ్‌ కొనడం దగ్గర నుంచి కొత్త పుస్తకాలకు అట్టలు వేయడం వరకూ ప్రతి పనీ పేరెంట్స్‌కి హైరానా కలిగిస్తుంది. అయితే పిల్లల్లో పాత ఫ్రెండ్స్‌ని కలుసుకుంటున్నామని, కొత్త ఉపాధ్యాయులు రాబోతున్నారని, క్లాస్‌ రూమ్‌ మారబోతుందని, కొత్త పాఠాలు నేర్చుకోబోతున్నామని ఇలా మిశ్రమ భావోద్వేగాలు తొంగి చూస్తుంటాయి.అయితే పిల్లలు తిరిగి స్కూల్‌ వాతావరణానికి అలవాటు పడాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పవు. పిల్లలు స్కూల్లో ఏది బాగా తింటారు? బాక్సుల్లో ఏం పెట్టాలి? వీటి గురించి కూడా దృష్టి పెట్టాలి. మొదటిసారి స్కూల్‌కి వెళ్తున్న పిల్లల విషయంలో ఎలాంటి చిట్కాలు పాటించాలి? ఆల్‌రెడీ స్కూల్‌ అలవాటున్న పిల్లలను హాలిడేస్‌ మూడ్‌ నుంచి ఎలా బయటికి తీసుకురావాలి? అవన్నీ ఇప్పుడు చూద్దాం.మొదటిసారి స్కూల్‌కి పంపుతున్నారా..?ప్రీస్కూల్, నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీల్లో పిల్లల్ని జాయిన్‌ చేసేటప్పుడు వారిని పేరెంట్స్‌ చాలా ప్రిపేర్‌ చేయాల్సి ఉంటుంది. కొంతమంది పిల్లలు ఈ మార్పును ఆనందంగా అంగీకరిస్తారు. కానీ మరికొందరికి అలవాటు పడటానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. పిల్లల ఎడ్యుకేషన్‌ స్టార్ట్‌ అయ్యిందంటే తల్లిదండ్రులకు టెన్షన్ ్స మొదలైపోయినట్లే! మరి దానిని సులభం చేయడానికి ఈ చిట్కాలను పాటిస్తే మంచిది.చిన్నచిన్న పిల్లలకు స్కూల్‌ ఎలా ఉంటుందో చూపించడానికి ’టాయ్‌ స్కూల్‌’ని తయారు చెయ్యాలి. బొమ్మలతో చిన్న నమూనా పాఠశాలను ఏర్పాటు చెయ్యాలి. మామూలుగా పాఠశాల రోజున ఏమి జరుగుతుందనే దాని గురించి చిన్నగా మాట్లాడుతూనే వారితో కలిసి ఆడుకోవాలి.పాఠశాల ప్రారంభానికి ముందు పిల్లలకు వీలయినన్ని ఎక్కువ పుస్తకాలను చదివి వినిపించాలి. లేదా వారితో చదివించాలి. పిల్లలు వారి కొత్త పాఠశాలలో చేయగలిగే సంగతులు గురించి చర్చించాలి. వారు కలుసుకోబోయే స్నేహితులు, అక్కడుండే వినోదం గురించి మాట్లాడుతూ ఉండాలి.క్లాస్‌ రూముల్లో పిల్లలు స్వయంగా చెయ్యగలిగే పనులను ఇంట్లో ఉన్నప్పటి నుంచే చక్కగా ప్రాక్టీస్‌ చేయించాలి. లంచ్‌ బాక్స్, జ్యూస్‌ లేదా వాటర్‌ బాటిల్‌ మూతలు తెరవడం, తిరిగి మూతలు పెట్టడం.. తమంతట తామే షూస్‌ తియ్యడం, తిరిగి తొడుక్కోవడం, స్పూన్‌తో అన్నం తినడం ఇలాంటి సాధారణ పనులను నేర్పించాలి.స్కూల్లో ఏదైనా విషయం గురించి పిల్లలు ఇబ్బంది పడితే ఆ విషయం గురించి టీచర్‌కి ఎలా చెప్పాలి? ఎలా పర్మిషన్‌ అడగాలి? వంటివి కూడా అలవాటు చెయ్యాలి.స్కూల్‌ ప్రారంభమయ్యే ముందురోజుల్లో పిల్లలను తీసుకుని షాపింగ్‌ వెళ్తే మంచిది. ఆ షాపింగ్‌లో వాళ్లకు నచ్చిన స్కూల్‌ బ్యాగ్, పెన్సిల్‌ కేస్, యూనిఫాం, లంచ్‌ బాక్స్, వాటర్‌ బాటిల్‌ ఇలా అన్నీ కొనిస్తే వారిలో ఉత్సాహం పెరుగుతుంది.ఇక చిన్నారులను స్కూల్‌కి పంపించే నాటికి స్వయంగా టాయిలెట్‌కి వెళ్లగలరా లేదా నిర్ధారించుకోవాలి. లేదంటే కనీసం టాయిలెట్‌ వస్తుందని టీచర్‌కి చెప్పడం అయినా నేర్పించాలి.చిన్న పిల్లలకు షేరింగ్‌ కూడా అలవాటు చెయ్యాలి. స్కూల్లో ఇతర పిల్లల దగ్గర లాక్కోకుండా ఉండటంతో పాటు పక్కపిల్లలకు తమ దగ్గరున్నది షేర్‌ చేసే విధానం నేర్పాలి. స్కూల్లో ఏదైనా పంచిపెడుతున్నప్పుడు తమ వంతు వచ్చే వరకూ వేచి చూడటం గురించి వివరించాలి. దాని వల్ల పిల్లలకు స్నేహితులు పెరుగుతారు.ఇక స్కూల్లో జాయిన్‌ అయిన తర్వాత కూడా పిల్లలతో కలిసి పేరెంట్స్‌ పాఠశాలకు వెళ్లడం, స్కూల్‌ దగ్గర ఆగి ప్లే గ్రౌండ్‌ని పరిశీలించడం, వారి క్లాస్‌ టీచర్‌తో, ఇతర విద్యార్థులతో మాట్లాడటం మంచిది. ఆ సమయంలోనే పిల్లలకు వారి తరగతి గదిలో ఏది బాగా నచ్చుతుందో తెలుసుకోవచ్చు.పాఠశాలలో మొదటి రోజు ఒత్తిడి లేకుండా పిల్లలను సిద్ధం చేయడానికి స్కూల్‌ తెరిచే ముందే మీ పిల్లల తరగతిలో జాయిన్‌ కాబోతున్న ఇతర పిల్లలకు మీ పిల్లలను పరిచయం చెయ్యాలి. అవసరం అయితే ఆ విద్యార్థి కుటుంబాన్ని కలుసుకోవాలి. దాని వల్ల స్కూల్‌లో జాయిన్‌ అయిన రోజు క్లాసులో మీ పిల్లలకు తెలిసి వ్యక్తి ఒకరైనా ఉంటారు. దాంతో ఆ స్కూల్‌ తమకు తెలియని చోటు అనే బెరుకు తగ్గుతుంది.కొద్ది సమయం పాటు మీ నుంచి దూరంగా ఉండేలా వారికి ముందే అలవాటు చెయ్యాలి. కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రులు లేదా మీరు విశ్వసించే పెద్దవారితో మీరు లేకపోయినా మీ పిల్లలు కలిసి ఉండేలా చూసుకోవాలి.పై తరగతులకు వెళ్లే పిల్లల కోసం..చదువులో కాస్త డల్‌గా ఉండి టీచర్స్‌కి భయపడే పిల్లలకు స్కూల్స్‌ ప్రారంభం అంటే కాస్త బెరుకు ఉంటుంది. అలాంటి పిల్లలతో పేరెంట్స్‌ మనసు విప్పి మాట్లాడాలి. వారిలో మానసిక ధైర్యాన్ని కలిగించాలి.పిల్లలు మొదటిరోజు కోసం ఎదురుచూడటంలో సానుకూల అంశాల గురించి పేరెంట్స్‌ చర్చించాలి. వారి పాత ఫ్రెండ్స్‌ని గుర్తు చేస్తూ, కొత్త ఫ్రెండ్స్‌ వస్తే ఎలా కలుస్తారో తెలుసుకుంటూ స్నేహపూర్వకంగా మాట్లాడాలి.పిల్లలు స్కూల్‌కి నడిచి వెళ్తున్నా, బస్సు లేదా ఆటోలో ప్రయాణిస్తున్నా వారితో పాటు ఉండే వారి స్నేహితుల్ని పరిచయం చేసుకోవడం మంచిది. మొదటిరోజు మాత్రం వీలైతే స్వయంగా స్కూల్లో డ్రాప్‌ చేసి పికప్‌ చేసుకోవడం మంచిది. వారిలోని ఒత్తిడికి దూరం చేసినట్లు అవుతుంది.కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కావడానికి రెండు రోజుల ముందు నుంచే స్కూల్‌ షెడ్యూల్‌ని బట్టి వారి నిద్ర వేళలను నిర్ణయించి, అలానే నిద్రపోయేలా చెయ్యాలి. సరైన నిద్ర అందకపోతే స్కూల్లో వారు యాక్టివ్‌గా ఉండలేరు. అలాగే వారికి స్నానం చేయించడం, స్కూల్‌కి రెడీ చేయించడం, స్కూల్‌ నుంచి రాగానే స్కూల్లో సంగతులు అడిగి తెలుసుకోవడం, అవసరం అయితే వారి ఆలోచనలను సరిచేయడం, హోమ్‌ వర్క్‌ చేయించడం వంటి పనుల్లో వారి కోసం సమయాన్ని కేటాయించాలి. అలాగే పిల్లలు నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇంటిని వీలైనంత నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నించాలి.పిల్లలు స్కూల్‌కి వెళ్లే దారిల్లో ఏ షాపులు ఎక్కడ ఉన్నాయి? ఎటు వెళ్తే స్కూల్‌ వస్తుంది? అలాగే స్కూల్‌ నుంచి ఇంటికి ఏయే దారుల్లో రావచ్చు.. అవన్నీ ప్రాక్టీస్‌ చేయించాలి. వారితో కూడా వెళ్తున్నప్పుడు వారినే దారి చెప్పమని అడగటం, లేదంటే ఇంట్లో కూర్చోబెట్టి ఆ దారి గురించి చర్చించడం లాంటివి చెయ్యాలి. అలా చేయడం వల్ల వారు ప్రమాదంలో పడినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినా క్షేమంగా ఇంటికి చేరుకోగలరు.బస్సులు లేదా ఆటోలు ఎక్కుతున్నప్పుడు ఆగి దిగాలని, నిదానంగా ఎక్కాలని పిల్లలకు సూచించాలి. అలాగే పిల్లల్ని తీసుకెళ్లే డ్రైవర్‌తో కూడా పిల్లలను ఓ కంట కనిపెట్టమని చెబుతుండాలి. మీ పిల్లలు ఎక్కడ కూర్చుంటారు? ఎలా కూర్చుంటారు? అన్నీ డ్రైవర్‌ని ఆరా తియ్యాలి.అలాగే స్కూల్‌కి వెళ్తున్న పిల్లలకు రోడ్డు దాటే సమయాల్లో ఇరువైపులా చూసుకోవడం నేర్పించాలి. ఏవైనా వాహనాలు వస్తుంటే పక్కకు ఆగి, అవి వెళ్లిన తర్వాతే నడవడం గురించి చెప్పాలి. ఇవన్నీ దగ్గరుండి ప్రాక్టీస్‌ చెయ్యించాలి.ఏది తిన్నా రోడ్డు మీద ఆరుబయట తినొద్దని, ఇంటికి తెచ్చుకునైనా, లేదా స్కూల్లోనైనా తినాలని చెప్పాలి. అలాగే చేతులు కడుక్కున్న తర్వాతే తినడం అలవాటు చెయ్యాలి. లేదంటే అలర్జీలు, జలుబులు వస్తుంటాయని వారికి అర్థమయ్యేలా చెప్పాలి.పిల్లల్లో ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే దాని గురించి ముందుగానే ఆ స్కూల్‌ టీచర్స్‌తో, ఆయాలతో వివరంగా చెప్పి అత్యవసర పరిస్థితిల్లో సమాచారం ఇవ్వమనాలి.ఇక స్కూల్‌కి సైకిల్‌ మీద వెళ్లే పిల్లల(టీనేజ్‌ వారు) విషయంలో మరింత జాగ్రత్తలు అవసరం. రద్దీప్రదేశాల్లో వెళ్తుంటే హెల్మెట్‌ తప్పసరి ధరించేలా చూడాలి.అపరిచితులు ఇచ్చిన ఆహారం తినొద్దని పిల్లలకు చెప్పడంతో పాటు తింటే దాని వల్ల కలిగే ప్రమాదాల గురించి చెప్పాలి. అవసరమైతే కొన్ని ఉదాహరణలను వివరించాలి. అపరిచితులు పిల్లలను కిడ్నాప్‌ చేస్తారని.. తిరిగి ఇంటికి రాకుండా తీసుకునిపోతారని డైరెక్ట్‌గా చెప్పకుండా.. కొన్ని పేర్లు ఊహించి చెబుతూ.. ఓ కథ రూపంలో వారికి చెబుతుండాలి. అలా చేస్తే వారి మనసుల్లో నాటుకునిపోతుంది.పిల్లలు స్కూల్లో లేదా బయట లేదా బస్సుల్లో ఏవైనా బెదిరింపులకు లోనవుతున్నా, ఏదైనా సమస్యల్లో ఇరుక్కున్నా, అలాంటి విషయాలను ఎప్పటికప్పుడు గమనించు కుంటూ ఉండాలి. మరీ ముఖ్యంగా గుడ్‌ టచ్, బ్యాడ్‌ టచ్‌ గురించి ఆడపిల్లలతో పాటు మగ పిల్లలకు కూడా చెప్పాల్సిందే. సమస్యను మీదకు తెచ్చుకోకుండా ఎలా ఉండాలో చెప్పడంతో పాటు సమస్య వస్తే దాని నుంచి ఎలా బయటపడాలో కూడా నేర్పించాలి. ఒకవేళ ఇతర పిల్లలకు మీ పిల్లల వల్లే సమస్య ఏర్పడుతుంటే దాన్ని కూడా సున్నితంగానే తీసుకోవాలి. పిల్లల దూకుడు ప్రవర్తనకు కొన్ని పరిమితులు విధించి వారిని నెమ్మదిగా మార్చాలి.హోమ్‌వర్క్‌ సమయంలో టీవీ లేదా ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులన్నింటినీ ఆపెయ్యాలి. పెద్దవారు అవుతున్న పిల్లల విషయంలో ఇంటర్నెట్‌ వినియోగాన్ని గమనిస్తూ ఉండాలి.పిల్లల్లో కళ్లు, మెడ, తల అలసటకు గురవుతుంటే దాన్ని గుర్తించి, చదువుతున్నప్పుడు వారికి కాసేపు విరామం ఇస్తుండాలి. కనీసం ఒక పది నిమిషాలు వారికి నచ్చినట్లుగా ఉండనివ్వాలి.పిల్లలు ఇష్టంగా తినే ఈజీ రెసిపీలు..పిల్లలు ఆకలికి ఎక్కువగా ఆగలేరు. పైగా బయట చూసిన తినుబండారాలను చూస్తే అసలు ఆగరు. అందుకే వారికి కావాల్సిన భోజనంతో పాటు స్నాక్స్‌ కూడా సిద్ధం చేసి బాక్సుల్లో పెట్టడం మంచిది. ఒకవేళ మధ్యాహ్నం భోజనాన్ని స్కూల్‌లో ఉచితంగా అందిస్తున్నా, ఇలాంటి స్నాక్స్‌ బాక్స్‌ల్లో పెడితే పిల్లలు దృఢంగా పెరుగుతారు. ఈజీగా సిద్ధమయ్యే కొన్ని రెసిపీస్‌ ఇప్పుడు చూద్దాం.రాగి కుకీలు..కావాల్సినవి..రాగి పిండి– ఒకటిన్నర కప్పులుఏలకుల పొడి– అర టేబుల్‌ స్పూన్‌గుడ్డు– 1ఉప్పు– తగినంతఅల్లం పొడి– కొద్దిగాకొబ్బరి పాలు, రైస్‌ బ్రాన్‌ ఆయిల్‌ – పావు కప్పు చొప్పునతయారీ..ముందుగా స్టవ్‌ ఆన్‌ చేసుకుని.. ఒక పాన్ లో రాగి పిండి, ఏలకుల పొడి వేసుకుని దోరగా వేయించాలి. ఆ మిశ్రమాన్ని మిక్సీలో వేసి.. దానిలో గుడ్డు, అల్లం పొడి, రైస్‌ బ్రాన్‌ ఆయిల్, కొబ్బరి పాలు వేసుకుని మిక్సీ పట్టాలి. దాని వల్ల ఆ మిశ్రమం మొత్తం ముద్దలా మారిపోతుంది. అనంతరం కుకీస్‌లా చేసుకుని.. ఓవెన్ లో 180 డిగ్రీలసెల్సియస్‌లో.. 8 నిమిషాల పాటు బేక్‌ చేస్తే సరిపోతుంది.ఓట్స్‌ ఇడ్లీ..కావాల్సినవి..ఓట్స్‌– 2 కప్పులు (దోరగా వేయించి, మిక్సీ పట్టుకోవాలి)నూనె– అర టేబుల్‌ స్పూన్‌మినప పొడి– 1 టేబుల్‌ స్పూన్‌శనగపిండి– అర టేబుల్‌ స్పూన్‌పెరుగు– 2 కప్పులుపసుపు, కారం– కొద్దికొద్దిగాతయారీ..ముందుగా ఒక బౌల్‌లో ఓట్స్‌ పౌడర్, నూనె, మినప పొడి, శనగపిండి, పెరుగు వేసుకుని బాగా కలిపి.. అవసరం అయితే కొద్దిగా నీళ్లు పోసుకుని, ఇడ్లీ రేకుల్లో కొద్దికొద్దిగా వేసుకుని ఆవిరిపై ఉడికించుకోవాలి. అభిరుచిని బట్టి ఇడ్లీ పిండిలో క్యారెట్‌ తురుము, కొత్తిమీర తురుము కూడా కలుపుకోవచ్చు.ఖర్జూరం– జీడిపప్పు లడ్డూ..కావాల్సినవి..ఖర్జూరాలు, జీడిపప్పు– 1 కప్పు,కొబ్బరి తురుము– అర కప్పు,ఉప్పు– తగినంత,నూనె– 1 టేబుల్‌ స్పూన్‌తయారీ..ముందు ఖర్జూరాలను ఒక గంట నీటిలో నానబెట్టి, గింజ తీసి.. ఆరబెట్టాలి. అనంతరం ఒక మిక్సీ బౌల్‌లో ఖర్జూరాలు, జీడిపప్పు, కొబ్బరి కోరు, తగినంత ఉప్పు, నూనె వేసుకుని బాగా మిక్సీ పట్టుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఒక బౌల్‌లోకి తీసుకుని, నేయి రాసుకున్న చేతులతో చిన్న చిన్న ఉండల్లా చేసుకోవచ్చు.హెర్బ్‌డ్‌ పొటాటోస్‌..కావాల్సినవి..బంగాళదుంపలు– 2 పెద్దవి(తొక్క తీసి.. కడగాలి, వాటిని సన్నని ముక్కలుగా కట్‌ చేసుకోవాలి),ఆలివ్‌ నూనె– 1 టేబుల్‌ స్పూన్,వెల్లుల్లి తురుము– కొద్దిగాతులసి ఆకుల తురుము – కొద్దిగా(అభిరుచిని బట్టి),చిల్లీ ఫ్లేక్స్‌– అర టేబుల్‌ స్పూన్‌ఒరేగానో తురుము– 1 టేబుల్‌ స్పూన్‌ (మార్కెట్‌లో దొరుకుతుంది)తేనె– 2 టేబుల్‌ స్పూన్లుఉప్పు– తగినంతతయారీ..ఒక బౌల్‌లో బంగాళాదుంప ముక్కలు వేసుకుని చిల్లీ ఫ్లేక్, ఆలివ్‌ నూనె, వెల్లుల్లి తురుము, తులసి ఆకుల తురుము, తేనె, ఒరేగానో తురుము ఇలా అన్నీ కలిపి గిన్నెను బాగా కుదపాలి. అనంతర వాటిని బేకింగ్‌ ట్రేలో పెట్టి.. 200 డిగ్రీల సెల్సియస్‌లో 10–15 నిమిషాలు బేక్‌ చేస్తే సరిపోతుంది.స్టీమ్డ్‌ ధోక్లా..కావాల్సినవి..శనగపిండి – 1 కప్పు,ఓట్స్, జొన్నపిండి – పావు కప్పు చొప్పున,పంచదార – 1 టేబుల్‌ స్పూన్,పసుపు– 1 టీస్పూన్,నిమ్మరసం– 1 టేబుల్‌ స్పూన్,ఉప్పు– తగినంత,బేకింగ్‌ పౌడర్‌– 1 టేబుల్‌ స్పూన్‌నీళ్లు– సరిపడా,నూనె– 1 టీ స్పూన్‌తయారీ..శనగపిండి, ఓట్స్, జొన్నపిండి, పంచదార, పసుపు, నిమ్మరసం, బేకింగ్‌ పౌడర్, నూనె వేసుకుని బాగా కలిపి.. కొద్దిగా ఉప్పు తగినంత నీళ్లు పోసుకుని బాగా మిక్స్‌ చెయ్యాలి. అనంతరం ఒక బౌల్‌ తీసుకుని దానిలో ఈ మిశ్రమాన్ని వేసుకుని ఆవిరిపై ఉడికించాలి. ఆవాలు, కొత్తిమీర తాళింపు వేసుకుని.. కొత్తి మీర చట్నీతో కలిపి బాక్స్‌లో పెడితే సరిపోతుంది.మొత్తానికి పిల్లలకు నచ్చేవిధంగా, వారు మెచ్చే విధంగా స్కూల్‌కి పంపించగలిగితే వారి వ్యక్తిత్వ వికాసం బాగుంటుంది. వారిలో కొత్త ఉత్సాహం పొంగుకొస్తుంది. దాంతో వారు పెద్దల మాటను వినడంలో, శ్రద్ధగా చదవడంలో, వినయ విధేయలతో పెరగడంలో నంబర్‌ వన్‌ అవుతారు.

Sakshi Editorial On results in evms
‘బలి’ కోరుతున్న సాంకేతిక విజయం!

‘ది హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌’ గోల్‌ గురించి క్రీడా ప్రియులందరూ వినే ఉంటారు. 1986 ఫుట్‌బాల్‌ వరల్డ్‌ కప్‌ సందర్భంగా అర్జెంటీనా – ఇంగ్లండ్‌ మ్యాచ్‌లో డీగో మారడోనా చేసిన తొలి గోల్‌ వివాదాస్పదమైంది. డీగో చేసిన హెడర్‌ గోల్‌ను వాస్తవానికి చేత్తో నెట్టాడని ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో రికార్డింగ్‌ సౌకర్యం లేకపోవడం వల్ల రెఫరీ దాన్ని గోల్‌గానే ప్రకటించాడు. తర్వాత నాలుగు నిమిషాలకే ‘గోల్‌ ఆఫ్‌ ది సెంచరీ’ని కొట్టిన మారడోనా, అదే ఊపులో వరల్డ్‌ కప్‌ను గెలుచుకోవడమే గాక ఫుట్‌బాల్‌ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించారు. వివాదాస్పద గోల్‌పై ఆ తర్వాత స్పందించిన మారడోనా అది ‘సగం మారడోనా హెడ్, సగం హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌’ ఫలితమని ప్రకటించాడు.దుబాయ్‌లో ఇటీవల కురిపించిన కృత్రిమ వర్షం ఎంత బీభత్సాన్ని సృష్టించిందో ప్రపంచమంతా చూసింది. క్లౌడ్‌ సీడింగ్‌ ఓవర్‌డోస్‌కు వాతావరణ మార్పులు కూడా తోడైన ఫలితంగా రెండేళ్లలో కురవాల్సిన వర్షమంతా ఒకేరోజు కురిసి ఎమిరేట్‌ను అతలాకుతలం చేసింది.ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి జరిగిన ఎన్నికల ఫలితాలను చూస్తుంటే ఏదో ‘అదృశ్య హస్తం’ (హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌) పనిచేసినట్టుగా, కృత్రిమ ఓట్ల వర్షం కురిపించినట్టుగా అనిపించక మానదు. లేదంటే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఇటువంటి ఫలితాలు రావాలంటే రష్యా నాయకుడు పుతిన్‌ లేదా తుర్కియే పాలకుడు ఎర్డోగాన్‌ లేదా మయన్మార్‌ మిలిటరీ జుంటా ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగి ఉండాలి. అలా జరగలేదు కాబట్టి ‘హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌’ ప్రమేయం ఉండాలి. ఎవరా గాడ్‌? కేంద్ర ప్రభుత్వమా? ఎన్నికల సంఘమా... ఎవరు? కృత్రిమ ఓట్ల వర్షానికి క్లౌడ్‌ సీడింగ్‌ ఎవరు చేశారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ జనసామాన్యం మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలివి.ఎలక్ట్రానిక్‌ వోటింగ్‌ మెషిన్‌లను ట్యాంపరింగ్‌ చేయడం ద్వారా ఫలితాలను తారుమారు చేయడం సాధ్యమేనని స్వయంగా చంద్రబాబే పలుమార్లు ప్రకటించారు. ఆయన అభిమాని వేమూరి రవి ఇంకొంచెం ముందుకెళ్లి ఈవీఎమ్‌లను ఎలా హ్యాక్‌ చేయవచ్చో మీడియా సమక్షంలోనే ప్రదర్శించి చూపెట్టారు. అందువల్ల ఈవీఎమ్‌ల ట్యాంపరింగ్‌ అనే ఆర్ట్‌పై కూటమికి స్పష్టమైన అవగాహన ఉన్నది.రాష్ట్రవ్యాప్తంగా సాయంత్రం 5 గంటలకు 68 శాతం ఓట్లు పోలయ్యాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. కానీ తుది వివరాలను ప్రకటించడానికి దాదాపు మూడు రోజుల సమయాన్ని తీసుకున్నది. ఈ అసాధారణ జాప్యంపై సందేహాలను లేవనెత్తుతూ ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ పత్రిక సైతం కథనాన్ని ప్రచురించింది. ఆ గడువు ముగిసిన తర్వాత పోలయిన ఓట్ల సంఖ్య కూడా అనుమానాలను రేకెత్తించే విధంగానే ఉన్నది.తుది పోలింగ్‌ శాతాన్ని సుమారు 81గా నిర్ధారిస్తూ మూడు రోజుల తర్వాత ఈసీ తాపీగా ప్రకటన విడుదల చేసింది. మామూలుగా పోలింగ్‌ సమయం ముగిసిన తర్వాత పోలింగ్‌ కేంద్రం ఆవరణలో నిలబడి ఉన్నవారికి స్లిప్స్‌ పంపిణీ చేస్తారు. వారికి మాత్రమే ఓటువేసే అవకాశం కల్పిస్తారు. అలా నిలబడిన వారికి ఈసారి ఎందుకనో స్లిప్స్‌ లేదా టోకెన్లు పంపిణీ చేయలేదనే వార్తలు వినవస్తున్నాయి. ఇది అనుమానించదగ్గ అంశం.పోలింగ్‌ గడువు ముగిసిన తర్వాత ప్రాంగణంలో నిలబడి ఉన్నవారి సంఖ్య మనకున్న సమాచారం మేరకు ఎక్కడా యాభై నుంచి వంద దాటలేదు. వీరు ఓట్లు వేయడానికి ఇంకో రెండు, మూడు గంటలు చాలు. అంటే తొమ్మిది గంటలకల్లా పోలింగ్‌ పూర్తి కావాలి. కానీ అర్ధరాత్రి దాటిందాకా పోలింగ్‌ జరుగుతూనే ఉందట! అంటే ఆ యాభైమందే అంతసేపూ సైక్లింగ్‌ చేస్తున్నారా? వేలాది పోలింగ్‌ బూత్‌లలో గడువు ముగిసే సమయానికి 65 నుంచి 70 శాతం మధ్యనున్న పోలింగ్‌ శాతం తుది ప్రకటన వచ్చేసరికి 85 నుంచి 95 శాతం దాకా ఎగబాకింది.పోలింగ్‌కు ముందు జరిగిన రాజకీయ పరిణామాలను కూడా గమనంలోకి తీసుకోవాలి. ఎన్డీఏ కూటమిలో చేరడం కోసం చంద్రబాబు పడిన పాట్లు, భరించిన అవమానాలు తెలిసినవే. కూటమిగా కుదురుకున్న తర్వాత వారు ‘ఎలక్షనీరింగ్‌’ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. అనేక ప్రాంతాల్లోని ప్రభుత్వాధికారులను బదిలీ చేశారు. కనీవినీ ఎరుగని విధంగా ఏ ప్రాంతంలో ఏ అధికారిని నియమించాలో కూడా ఎన్నికల సంఘానికి సూచించారు. ఈసీ కూడా కూటమి కోర్కెలన్నింటినీ మారుమాట్లాడకుండా నెరవేర్చింది. సాధారణంగా తెలుగు రాష్ట్రాల ఎన్నికలు ఎప్పుడూ తొలి ఫేజ్‌లోనే ఉంటూ వచ్చాయి. కానీ కూటమి కోరిక మేరకు ఈసారి నాలుగో ఫేజ్‌కు నెట్టివేశారు.మొదటి మూడు దశల పోలింగ్‌ తర్వాత జాతీయ స్థాయిలో ఎన్డీఏలో అభద్రతా భావం మొదలైందట. పోలింగ్‌ సరళి తమకు అనుకూలంగా లేదనే నిర్ధారణకు ఎన్డీఏ పెద్దలు వచ్చారు. నాలుగో దశకు ఎన్నికలను వాయిదా వేయించుకున్న చంద్రబాబు అదనంగా లభించిన సుమారు నెల రోజుల సమయాన్ని ప్రత్యేక ‘ఏర్పాట్ల’ కోసం ఉపయోగించుకున్నారు. ఈ ఏర్పాట్లకు ‘హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌’ పూర్తిగా సహకరించింది. దేశవ్యాప్తంగా 19 లక్షల ఈవీఎమ్‌ల మిస్సింగ్‌పై ఇప్పటికీ కేంద్రం నుంచి స్పష్టమైన సమాధానాలు రాలేదు. ఇవెక్కడున్నాయి? ఏ పనికి వినియోగిస్తున్నారు? ఎవరి సేవల కోసం ‘హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌’ వీటిని వినియోగిస్తున్నారో తేలవలసి ఉన్నది.గడచిన ఐదేళ్లుగా ప్రత్యర్థులపై లేని దాడులను ఉన్నట్లుగా చూపించి గగ్గోలు పెట్టినవారు పోలింగ్‌ రోజు సాయంత్రం, మరునాడు – మళ్లీ కౌంటింగ్‌ రోజు నుంచి గత నాలుగు రోజులుగా జరిగిన హింసాకాండపై మౌనం వహించారు. ఈ హింసాకాండ కూడా అప్పటికప్పుడు ఆవేశంతో చెలరేగినట్టు లేదు. జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక క్రమం కనిపిస్తున్నది. కృత్రిమ ఓట్ల వర్షం కురిసే సమయానికి ఎవరూ పోలింగ్‌ కేంద్రాల వైపు వెళ్లకుండా బెదరగొట్టేందుకు దాడులు జరిగాయి. మరుసటి రోజు కూడా చాలాచోట్ల ఇవి కొనసాగాయి. మళ్లీ కౌంటింగ్‌ పూర్తవుతున్న సమయం నుంచి నాలుగు రోజులుగా యథేచ్ఛగా రాష్ట్రవ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి. అసాధారణమైన ఓటింగ్‌ సరళిని సమీక్షించడానికి ప్రత్యర్థులు గ్రామాల్లో పర్యటించే అవకాశం లేకుండా బెదరగొట్టడానికి ఈ దాడులు జరిగాయి. పోలీసు యంత్రాంగం పూర్తిగా కూటమి వ్యూహానికి తోడుగా నిలబడింది.విచక్షణారహితంగా జరుగుతున్న ఈ దాడులు మన ప్రజాస్వామ్య భవిష్యత్తు మీద ప్రశ్నార్థకాన్ని రచిస్తున్నాయి. ఈ దాడులను ఖండించకపోగా ‘వైఎస్సార్‌సీపీ కవ్వింపు చర్యలకు రెచ్చిపోకండ’ని ముఖ్యమంత్రి కాబోయే చంద్రబాబు ట్వీట్‌ చేశారు. గత రెండేళ్లుగా లోకేశ్‌ ఒక రెడ్‌బుక్‌ను సభల్లో ప్రదర్శిస్తూ హెచ్చరికలు జారీ చేసేవారు. తాను రెడ్‌బుక్‌లో పేర్లు ఎక్కించిన వారి సంగతి అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తానని చెప్పేవారు. ఇప్పుడా రెడ్‌బుక్‌ హోర్డింగ్‌లను కూడళ్లలో ఏర్పాటు చేశారు. దాని సందేశమేమిటో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.సందేశం గూండాతండాలకు స్పష్టంగానే అర్థమైంది. టీడీపీ వారికి చాలాచోట్ల జనసైనికులు కూడా తోడయ్యారు. ప్రత్యర్థులపై దాడులు చేస్తున్న సందర్భాల్లో పోలీసులు మౌన ప్రేక్షక పాత్రను పోషించారు. కొన్నిచోట్ల పారిపోతూ కనిపించారు. ఇప్పటివరకు బయటకొచ్చిన వీడియోల్లో ఇటువంటి దృశ్యాలెన్నో కలవరం కలిగించాయి.నూజివీడులో వైసీపీకి చెందిన ముసినిపల్‌ కౌన్సిలర్‌ను వెంబడించి కత్తులతో పొడుస్తున్న దృశ్యం పిండారీల దండయాత్రను తలపించింది. ఒక హాస్టల్‌ నిర్వాహకుడి ఇంటిపై దాడిచేసి గృహాన్ని ఛిద్రం చేసి, ఆ పెద్దమనిషిని మోకాళ్లపై కూర్చోబెట్టి కాళ్లు పట్టించుకున్న పైశాచికత్వం భయానకంగా కనిపించింది. రాళ్ల దాడులు, కర్రలతో దాడులు, కత్తులతో దాడులు, కిడ్నాప్‌లు... ఎన్నెన్ని దృశ్యాలు? వైసీపీకి చెందిన వారి కార్యాలయాలను పెట్రోల్‌ పోసి తగలబెట్టారు. వాహనాలను తగులబెట్టారు. జెండా దిమ్మెలను సుత్తులతో పగులగొట్టారు. శంకుస్థాపన ఫలకాలను ధ్వంసం చేశారు. గ్రామ సచివాలయాల మీద దాడులు చేశారు. వైఎస్సార్‌ విగ్రహాలను తొలగించి ఈడ్చుకుంటూ అవమానించారు.వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయంపై వైఎస్సార్‌ అక్షరాలు తొలగించారు. ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్‌ల వంటి విప్లవాత్మక కార్యక్రమాలను ప్రారంభించిన వైఎస్సార్‌ పేరు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి బాగుంటుందని భావించిన ప్రభుత్వం చట్టసవరణ ద్వారా ఎన్టీఆర్‌ పేరును మార్చి వైఎస్సార్‌ పేరు పెట్టారు. బదులుగా విజయవాడ కేంద్రంగా ఏర్పడిన కొత్త జిల్లాకు ఎన్టీఆర్‌ పేరును పెట్టారు. ఒక అల్లరిమూక దాడి చేసి ఇప్పుడా అక్షరాలను తొలగించింది..విశ్వవిద్యాలయాల మీద కూడా దాడులకు తెగబడ్డారు. వీసీలు, రిజిస్ట్రార్‌లు తప్పుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభు త్వం మారితే యూనివర్సిటీ పాలకవర్గాలను కూడా మార్చాలనే ఓ కొత్త ఆచారానికి శ్రీకారం చుట్టబోతున్నట్టు కనిపిస్తున్నది. నామినేటెడ్‌ పదవుల్లో ఉన్నవారు రాజీనామాలు చేయడం సంప్రదాయం కానీ, ఇవి నామినేటెడ్‌ పదవులు కావు. సెర్చ్‌ కమిటీ సిఫారసుల మేరకు గవర్నర్‌ చేసిన నియామకాలు. అయినా సరే తమ పార్టీవాడే వీసీగా కూర్చోవాలనే దుందుడుకుతనం ప్రజాస్వామిక పద్ధతులను దెబ్బతీస్తున్నది.భయానక వాతావరణాన్ని కల్పించడం ద్వారా ప్రతిపక్షాలను కట్టడి చేయాలని కొత్త ప్రభుత్వం భావిస్తే అది నెరవేరే అవకాశం ఉండదు. నాలుగు రోజులు ఆలస్యమైనా సరే ఎన్నికల అవకతవకలపై వారు దృష్టి సారించకుండా ఉండరు. నిజానిజాలు తవ్వితీయకుండా ఉండరు. అలాగే కొత్త ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం జనంతో కలిసి విపక్షాలు కచ్చితంగా ఉద్యమిస్తాయి. కూటమికి లభించిన విజయం సాంకేతికమైనదే. అయినా సరే, ప్రభుత్వాన్ని అదే ఏర్పాటు చేస్తుంది. అడ్డంకులేమీ ఉండవు. చేసిన హామీలను నెరవేర్చి, ప్రజాస్వామిక వాతావరణాన్ని పునరుద్ధరించితే కొత్త ప్రభుత్వం ప్రజల మన్నన పొందుతుంది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

Weekly Horoscope 9 June 2024 To15 June 2024 In Telugu
Weekly Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి కాగలవు

మేషం కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక విషయాలు ఉత్సాహాన్నిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. దూరపు బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆలయాలు సందర్శిస్తారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఇంటి నిర్మాణాలు చేపడతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు అనుకోని హోదాలు రాగలవు. కళారంగం వారిని విజయాలు వరిస్తాయి. వారం మధ్యలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. గులాబీ, పసుపు రంగులు. నృసింహస్తోత్రాలు పఠించండి.వృషభంఆర్థిక విషయాలు కొంత నిరాశాజనకంగా ఉంటాయి. మిత్రులతో వివాదాలు ఏర్పడవచ్చు. కొన్ని విషయాలలో చికాకులు ఎదుర్కొంటారు. ముఖ్యమైన పనులు ముందుకు సాగవు. కష్టమే తప్ప ఫలితం అంతగా కనిపించదు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. స్థిరాస్తి వివాదాలు కాస్త గందరగోళం కలిగించవచ్చు. వ్యాపారాలు సామాన్యంగానే ఉంటాయి. ఉద్యోగులకు బాధ్యతలు మరింత పెరుగుతాయి. రాజకీయవర్గాలకు ఒత్తిడులు. వారం మద్యలో శుభవార్తలు. వాహనయోగం. ఎరుపు, నేరేడు రంగులు. శివస్తోత్రాలు పఠించండి.మిథునంఅనుకున్న పనులు సజావుగా పూర్తి చేస్తారు. బంధువుల నుంచి ముఖ్య సమాచారం రాగలదు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. విద్యార్థులకు అనూహ్యమైన ఫలితాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంక్రిమెంట్లు రాగలవు. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్యం. నీలం, లేత ఆకుపచ్చ రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.కర్కాటకంకొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. స్థిరాస్తి వివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. విద్యార్థులు అందరిచేత ప్రశంసలు అందుకుంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులు. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. పారిశ్రామికవేత్తలకు చిక్కులు తొలగుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. నేరేడు, నీలం రంగులు. గణేశాష్టకం పఠించండి.సింహంరుణబాధలు తొలగుతాయి. ఆప్తులు, బంధువులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. స్థిరాస్థి వృద్ధి. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు రాగలవు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో మిత్రులతో కలహాలు. ఇంటాబయటా ఒత్తిడులు. నేరేడు,తెలుపు రంగులు.గణేశ్‌ను పూజించండి.కన్యకొత్త పనులు ప్రారంభించి సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక లావాదేవీలు గతం కంటే మరింత మెరుగుపడతాయి. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. మిత్రులతో వివాదాలు సర్దుకుంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వస్తు, వస్త్రలాభాలు కలుగుతాయి. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలలో గందరగోళం తొలగి లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి సత్కారాలు జరుగుతాయి. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆకుపచ్చ, గులాబీ రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.తులనూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. సంఘంలో విశేషంగా గౌరవమర్యాదలు పొందుతారు. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. పరిచయాలు విస్తరిస్తాయి. విద్యార్థులకు మరింత అనుకూల సమయం. ఆర్థిక ఇబ్బందులు తొలగి ఊరట లభిస్తుంది. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగవర్గాలు ఉత్సాహంగా విధులు నిర్వహిస్తారు. కళారంగం వారు అనుకోని అవకాశాలు లభిస్తాయి. వారం ప్రారంభంలో ఆస్తి వివాదాలు. ఆలయ దర్శనాలు. గులాబీ, నేరేడు రంగులు. లక్ష్మీస్తుతి మంచిది.వృశ్చికంకొన్ని పనులు సాఫీగా పూర్తి చేస్తారు. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయంతో ముందడుగు వేస్తారు.. భూముల వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. రహస్య విషయాలు తెలుసుకుంటారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. కొత్త వ్యక్తుల పరిచయం. క్రీడాకారులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో ఆటుపోట్లు అధిగమిస్తారు. రాజకీయరంగం వారికి కొత్త పదవులు దక్కే అవకాశం. వారం ప్రారంభంలో అనారోగ్యం. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆకుపచ్చ, తెలుపు రంగులు. విష్ణుధ్యానం మంచిది.ధనుస్సుఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. అనుకున్న పనులలో విజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగ యత్నాలు సానుకూలం. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. కొన్ని లక్ష్యాలు సాధిస్తారు. దూరపు బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఊహించని విధంగా హోదాలు దక్కుతాయి. పారిశ్రామికరంగం వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం మద్యలో దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. ఆకుపచ్చ, తెలుపు రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.మకరంఆర్థిక లావాదేవీలు మొదట్లో మందగించినా క్రమేపీ పుంజుకుంటుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి కాగలవు. ఆరోగ్యం కుదుటపడి ఊరట చెందుతారు. బంధువుల సూచనలతో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తి విషయాలలో ఒప్పందాలు చేసుకుంటారు. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. పరిచయాలు మరింత పెరుగుతాయి. నూతన విద్య, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. సంగీత, సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం చివరిలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. పసుపు, గులాబీ రంగులు. గణేశాష్టకం పఠించండి.కుంభంబంధువుల చేయూతతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఎంతటి వారినైనా వాక్పటిమతో ఆకట్టుకుంటారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది, అనుకూల ఫలితాలు సాధిస్తారు. కొత్త వ్యక్తుల పరిచయం. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు, లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో మరింత పురోగతి కనిపిస్తుంది. పారిశ్రామికవర్గాలకు కొన్ని సమస్యలు తీరతాయి. వారం చివరిలో అనుకోని ఖర్చులు. అనారోగ్యం. మిత్రులతో విభేదాలు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. దేవీస్తుతి మంచిది.మీనం...––––క్రమేపీ అనుకూల పరిస్థితులు నెలకొని ఉత్సాహంగా గడుపుతారు. సన్నిహితులు చేదోడుగా నిలుస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. యుక్తితో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో మరింతగా లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో మీకు ఎదురుండదు, పదోన్నతులు రాగలవు. కళారంగం వారికి నూతనోత్సాహం. వారం ప్రారంభంలో ఆస్తి వివాదాలు. అనారోగ్యం. శ్రమ పెరుగుతుంది. ఎరుపు, పసుపు రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

newly married couple suicide in hyderabad
కలిసి బతకలేమని కడతేరిపోయారు!

జీడిమెట్ల, జగద్గిరిగుట్ట: వారిద్దరూ ప్రేమించుకున్నారు.. జీవితాంతం కలిసి ఉండాలని బాసచేసి పెళ్లి చేసుకున్నారు.. వీరి కాపురం కొన్నాళ్లు సాఫీగానే సాగింది. ఇటీవల ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఏం జరిగిందో ఏమో భార్య హెచ్‌ఏఎల్‌లోని తల్లి గారింట్లో, భర్త చింతల్‌ హెచ్‌ఎంటీలో ఒకేరోజు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. జీడిమెట్ల, జగద్గిరిగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాజులరామారం హెచ్‌ఏఎల్‌ కాలనీకి చెందిన కృష్ణమూర్తి చిన్న కుమారుడు మంచూరి రెశ్వంత్‌ (26), గాజులరామారం హెచ్‌ఏఎల్‌ కాలనీకి చెందిన సాయిశ్రేయ (22)ను ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. అనంతరం గాజులరామారం ద్వారకా నగర్‌లో కాపురం పెట్టారు. రెశ్వంత్‌ బిగ్‌బాస్కెట్‌లో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. కొన్నాళ్లు దంపతులిద్దరూ బాగానే ఉన్నారు. ఇటీవల ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. శనివారం రెశ్వంత్‌ హెచ్‌ఎంటీ నిర్మానుష్య ప్రదేశంలో చెట్టుకు చున్నీతో ఉరి వేసుకుని మృతిచెందాడు. సాయిశ్రేయ హెచ్‌ఏఎల్‌ కాలనీలోని తల్లిగారింట్లో ఉరి వేసుకుని మృతిచెందింది. మృతుడి సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Ramoji Rao entrepreneurial journey began in Visakhapatnam
పెదపారుపూడి టు ఫిలింసిటీ

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయ కుటుంబంలో పుట్టిన రామోజీరావు.. పరస్పరం భిన్నమైన రంగాల్లో వ్యాపారాలను ప్రారంభించి విజయం సాధించారు. యాడ్‌ ఏజెన్సీలో పనిచేయడం మొదలుపెట్టి.. ఎరువుల వ్యాపారం, చిట్‌ఫండ్స్, పచ్చళ్లు, మీడియా వంటి ఎన్నో రంగాలకు విస్తరించారు. రామోజీరావు ఏపీలోని కృష్ణా జిల్లా పెదపారుపూడి గ్రామంలో 1936 నవంబరు 16న జని్మంచారు. ఆయన తండ్రి వెంకట సుబ్బారావు రైతు. తల్లి వెంకట సుబ్బమ్మ గృహిణి. పెదపారుపూడి, గుడివాడలలో పాఠశాల విద్య, ఇంటర్, డిగ్రీ (బీఎస్సీ) గుడివాడలోనే పూర్తి చేశారు. 1961 ఆగస్టు 19న పెనమలూరుకు చెందిన తాతినేని వెంకట సుబ్బయ్య, వాణీదేవిల రెండో కుమార్తె రమాదేవితో రామోజీరావుకు వివాహం జరిగింది. మొదట యాడ్‌ ఏజెన్సీలో చేరి..: బీఎస్సీ పూర్తిచేసిన రామోజీరావు.. తన కుటుంబం చేసే వ్యవసాయానికే పరిమితం కాకుండా వ్యాపార రంగంలోకి రావాలని నిర్ణయించుకున్నారు. అడ్వర్టైజింగ్‌ రంగం వైపు ఆసక్తి కలగడంతో.. ఢిల్లీ వెళ్లి ఓ అడ్వరై్టజింగ్‌ ఏజెన్సీలో చేరారు. అక్కడ మూడేళ్లు పనిచేశాక హైదరాబాద్‌కు వచ్చారు. 1962 అక్టోబర్‌లో హైదరాబాద్‌లో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ సంస్థను, 1965లో కిరణ్‌ యాడ్స్‌ పేరిట అడ్వర్టైజ్‌మెంట్‌ ఏజెన్సీని ప్రారంభించారు. తర్వాత ఇతర వ్యాపారాలవైపు దృష్టి సారించారు. 1967–1969 మధ్య వసుంధర ఫెర్టిలైజర్స్‌ పేరిట ఎరువుల వ్యాపారం చేశారు. ఆ సమయంలోనే వ్యవసాయ సమాచారంతో కూడిన అన్నదాత పత్రికను ప్రారంభించారు.1970లో ఇమేజెస్‌ ఔట్‌డోర్‌ యాడ్‌ ఏజెన్సీని, విశాఖలో డాలి్ఫన్‌ హోటల్‌ను ప్రారంభించారు. అప్పటికే పత్రికారంగంపై ఆసక్తి ఉన్న ఆయన.. విశాఖపట్నం కేంద్రంగా ఈనాడు పత్రికకు శ్రీకారం చుట్టారు. స్థానిక వార్తలకు ప్రాధాన్యమివ్వటం, గ్రామాల్లోనూ ఏజెంట్లను ఏర్పాటు చేసుకోవడం, వేగంగా పంపిణీ చేయడం ద్వారా పత్రికను పాఠకులకు చేరువ చేశారు. ఎల్రక్టానిక్‌ మీడియాతోనూ..: పాత్రికేయ రంగంలో మార్పులను ముందుగానే గుర్తించిన రామోజీరావు.. మొదట్లో వినోదం ప్రధానాంశంగా ఈటీవీ చానల్‌ను ప్రారంభించారు. తర్వాత పూర్తి న్యూస్‌ చానల్‌ ఈటీవీ2ను ప్రారంభించారు. రాష్ట్రం విడిపోయినప్పుడు ఏపీ, తెలంగాణలకు విడివిడి న్యూస్‌ చానళ్లను ఏర్పాటు చేశారు. ఇక ‘ప్రియ’పేరిట రామోజీ ప్రారంభించిన పచ్చళ్ల వ్యాపారం కూడా సక్సెస్‌ అయింది. వివిధ రంగాల్లో రామోజీ సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2016లో పద్మవిభూషణ్‌తో సత్కరించింది. రామయ్య నుంచి రామోజీగా మార్చుకుని..: రామోజీరావు తాత పేరు రామయ్య. ఆయన వ్యవసాయం చేసేవారు. రామోజీ జని్మంచడానికి కొన్నిరోజుల ముందు రామయ్య మరణించారు. దీంతో తాత పేరే మనవడికి పెట్టారు. కానీ రామయ్య అనే పేరు పాతదిగా అనిపించడంతో.. ఆయన తన పేరును రామోజీగా మార్చుకున్నారని చెబుతారు. తెల్ల వ్రస్తాలంటే మక్కువ..: రామోజీరావు ఎప్పుడు చూసినా తెలుపు రంగు వస్త్రధారణతోనే కనిపిస్తారు. ఆయనకు తెలుపు రంగు వ్రస్తాలంటే ప్రత్యేక మక్కువే దీనికి కారణమని చెబుతారు. వదులుగా ఉండే తెలుపు రంగు హాఫ్‌హ్యాండ్స్‌ షర్టు, అదే రంగు ప్యాంటు, మ్యాచింగ్‌గా తెలుపు రంగు షూస్‌ ధరించేవారు. ఎప్పుడైనా ప్రత్యేక సందర్భాల్లో తప్ప ఎప్పుడూ తెలుపు వస్త్రధారణతో ఉండేవారు.పత్రికారంగానికి ఎనలేని సేవలందించారురామోజీరావు మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందివైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌సాక్షి, అమరావతి: రామోజీరావు మర­ణం దిగ్భ్రాంతికి గురిచేసిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలి­పారు. ‘తెలుగు పత్రికారంగానికి దశాబ్దా­లుగా ఆయన ఎన­లేని సేవలందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ­న్నాను. రామోజీరావు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియ­జేస్తున్నాను’ అని వైఎస్‌ జగన్‌ సామాజిక మాధ్యమం ఎక్స్‌(ట్విట్టర్‌)లో శనివారం పోస్టు చేశారు.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement