Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Information About How To Cast Vote
మీ ఓటు పడిందా? ఇలా కన్మర్ఫ్‌ చేస్కోండి

AP Assembly Elections 2024 Voting Live Updates And Highlights Telugu
AP Elections 2024 Polling: ఏపీ పోలింగ్‌ డే అప్‌డేట్స్‌

AP Elections 2024 Polling Updatesఏపీ ఎన్నికలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు..

Elections 2024: Sakshi Selfie Challange Updates
ఓటేయండి.. సెల్ఫీ పంపండి

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ, అలాగే తెలంగాణలోనూ లోక్‌సభ స్థానాలకు ఎన్నికలకు పోలింగ్‌ జరుగుతోంది. తమ రాష్ట్రం కోసం, తమ భవిష్యత్తు కోసం ప్రజాస్వామ్యంలో ప్రజలంతా సవ్యంగా ఓటు హక్కు ఉపయోగించుకోవాలని ఎన్నికల సంఘాలు కోరుతున్నాయి. అలాగే.. సాక్షి సైతం తన వంతుగా ఓటర్లను చైతన్యం చేస్తోంది. ఈ క్రమంలోనే సెల్ఫీ ఛాలెంజ్‌ను నిర్వహిస్తోంది. మీరు చేయాల్సిందల్లా ఓటేసిన తర్వాత మీ స్మార్ట్‌ఫోన్‌తో సెల్ఫీ తీసుకుని ఈ నంబర్‌కు (9182729310) మీ వివరాలతో వాట్సాప్‌ చేయడమే. అందులోంచి నాణ్యత ఉన్న ఫోటోలను ఎంపిక చేసి సాక్షి. కామ్‌లో పోస్ట్‌ చేయడం జరుగుతుంది. ‘‘నా ఉనికి ఓటుతోనే.., నా ఓటు వజ్రాయుధం’’ అని మీరు సందేశం ఇస్తే.. మీ బాధ్యతను చూపించి మరో నలుగురిని ఓటేసేలా ప్రజాస్వామ్య పరిరక్షణకు మా ప్రయత్నం చేస్తాం.‌

Lok sabha elections 2024: 4th phase polling updates In Telugu
Lok sabha elections 2024: ప్రారంభమైన నాలుగో విడత పోలింగ్‌

Updatesప్రారంభమైన నాలుగో విడత పోలింగ్‌పది రాష్ట్రాల్లో 96 ఎంపీ సీట్లకు పోలింగ్‌ ప్రారంభమైంది.క్యూలైన్‌లో నిల్చున్న ఓటర్లుVoting for the fourth phase of #LokSabhaElections2024 begins. Polling being held in 96 constituencies across 10 states and Union Territories (UTs) today. 1717 candidates in fray. pic.twitter.com/GXFjsWMsdQ— ANI (@ANI) May 13, 2024 తెలంగాణతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన మాక్ పోలింగ్రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్ సభ17 పార్లమెంటు స్థానాలకు బరిలో నిలిచిన 525 మంది అభ్యర్థులుఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ స్థానాల్లో సాయంత్రం 4 గంటలకే ముగియనున్న పోలింగ్పోలింగ్ పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా సెలవు ప్రకటించిన ప్రభుత్వంతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 525 మంది అభ్యర్థులు, 475మంది పురుషులు, 50 మంది మహిళా అభ్యర్థులుఎన్నికల విధుల్లో 2లక్షల 80వేల మంది సిబ్బంది విధుల నిర్వహణ160 కేంద్ర కంపెనీల CAPF బలగాలతో బందోబస్తుఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి 20వేల మంది పోలీస్ బలగాలురాష్ట్ర వ్యాప్తంగా 3కోట్ల 32లక్షల 32వేల మంది ఓటర్లుపురుష ఓటర్లు - 1కోటి 65లక్షల 28వేలు, 1కోటి 67లక్షల మహిళా ఓటర్లు18-19 ఏళ్ల వయసు కలిగిన యువ ఓటర్లు 9లక్షల 20వేలు, వికలాంగులు 5లక్షల 27వేలుతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 35వేల 808 పోలింగ్ కేంద్రాలుఅత్యధికంగా మల్కాజ్గిరిలో 3226 పోలింగ్ కేంద్రాలు1లక్ష 9వేల 941 బ్యాలెట్ యూనిట్లు, 44906 కంట్రోల్ యూనిట్లుతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 9900 ఉన్నట్లు గుర్తించిన ఈసీజూన్ 4వ తేదిన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు#WATCH | Hyderabad, Telangana: Mock polling begins at the Jubilee Hills Public School polling booth nos. 163, 164 and 165 from Secundrabad Lok Sabha Constituency. BJP's G Kishan Reddy, Congress' Danam Nagender and BRS' T. Padma Rao Goud are contesting elections from here. G… pic.twitter.com/Q50qyruJ3B— ANI (@ANI) May 13, 2024 లోక్‌సభ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నాలుగో విడత పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. పది రాష్ట్రాల్లో 96 ఎంపీ సీట్లకు ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. 1717 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ప్రతి పార్లమెంటులో సగటున 18 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 1.92 లక్షల పోలింగ్ కేంద్రాల్లో 17.7 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 85 ఏళ్లు దాటిన ఓటర్లు12.49 లక్షలు ఉండగా, 19.99 లక్షల మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నారు. ఏపీలో 175 అసెంబ్లీ సీట్లు, ఒడిశాలో 25 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి.తెలంగాణలో పోలింగ్ సమయం పెంచడంతో ఉదయం ఏడు నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ ప్రక్రియలో 19 లక్షల మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రక్రియలో 364 మంది అబ్జర్వర్లను నియమించారు. 1016 అంతర్రాష్ట్ర సరిహద్దులు, 121 అంతర్జాతీయ సరిహద్దులలో ఈసీ నిఘా ఏర్పాటు చేసింది. పోలింగ్ కేంద్రాల వద్ద నీళ్లు, షెడ్, టాయిలెట్స్, ర్యాంప్స్ ఏర్పాటు చేశారు.

TDP and Janasena and BJP alliance will be shocked again
పెత్తందారులకు మళ్లీ షాకే!

సాక్షి, అమరావతి : పెత్తందార్లకు మళ్లీ షాక్‌ ఇచ్చేందుకు పేదలు, దిగువ మధ్య తరగతి ప్రజలంతా సిద్ధమయ్యారు. ఇంటింటా అభివృద్ధి కొనసాగాలని.. రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నారు. మళ్లీ జగన్‌ వస్తేనే సంక్షేమాభివృద్ధి పథకాలు కొనసాగుతాయని బలంగా నమ్ముతున్నారు. సాధికారత కోసం ఎన్నికల మహా సంగ్రామంలో కీలక ఘట్టమైన పోలింగ్‌ ప్రక్రియలో ఫ్యాన్‌ గుర్తుపై రెండు బటన్‌లు నొక్కి ఓట్లేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించేందుకు పేదలంతా సిద్ధమయ్యారు.గత ఎన్నికల్లో 50 శాతం ఓట్లు.. 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థులను గెలిపించి, వైఎస్సార్‌సీపీకి ప్రజలు చారిత్రక విజయాన్ని అందించారు. 2019 మే 30న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. తొలి ఏడాదిలోనే 95 శాతం హామీలు అమలు చేసి ఎన్నికల మేనిఫెస్టోకు సరైన నిర్వచనం చెప్పారు. 59 నెలల్లో 99 శాతం హామీలు అమలు చేశారు. ఎలాంటి వివక్ష చూపకుండా, లంచాలకు తావులేకుండా.. అర్హతే ప్రామాణికంగా అందరికీ సంక్షేమ పథకాలు అందించారు.సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో పేదల ఖాతాల్లో రూ.2.70 లక్షల కోట్లు జమ చేశారు. నాన్‌ డీబీటీ పథకాల ద్వారా మరో రూ.1.79 లక్షల కోట్ల ప్రయోజనాన్ని చేకూర్చారు. డీబీటీ, నాన్‌ డీబీటీ కలిపి పేదలకు మొత్తం రూ.4.49 లక్షల కోట్ల లబ్ధి చేకూరింది. వాటిని సది్వనియోగం చేసుకున్న పేదలు.. జీవనోపాధులను మెరుగుపర్చుకుని తమ కాళ్లపై తాము నిలబడగలుగుతున్నారు. రాష్ట్రంలో పేదరికం చంద్రబాబు హయాంలో 11.77 శాతం ఉంటే.. 2022–23 నాటికి అది 4.19 శాతానికి తగ్గడమే అందుకు నిదర్శనం. సాధికారత కోసం పేదలంతా సిద్ధం విభజన తర్వాత 2014 ఎన్నికల్లో వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని.. ఇంటికో ఉద్యోగం లేదా నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తానంటూ 650కిపైగా హామీలు ఇచ్చిన చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేసింది. 2019 ఎన్నికల్లో వేరుపడిన ఆ పార్టీలు ఇప్పుడు మళ్లీ కూటమిగా ఏర్పడి పోటీ చేస్తూ అలవికాని హామీలు ఇచ్చాయి.ఆ హామీల అమలు సాధ్యం కాదని నిర్ధారణకు వచ్చిన బీజేపీ.. టీడీపీ కూటమి మేనిఫెస్టోను ముట్టుకోవడానికి కూడా వెనుకంజ వేసింది. సీఎం జగన్‌ గత ఎన్నికల తరహాలోనే అమలు చేయదగిన హామీలతోనే కేవలం రెండే రెండు పేజీలతో మేనిఫెస్టోను విడుదల చేశారు. కూటమికి ఇక్కడ సారథ్యం వహిస్తున్న చంద్రబాబు.. చెప్పిన మాటపై నిలబడడని, మోసం చేస్తారనే అభిప్రాయం ప్రజల్లో బలంగా నాటుకు పోయింది. చెప్పిన హామీలన్నీ అమలు చేసిన సీఎం జగన్‌ నాయకత్వంపై ప్రజల్లో నమ్మకం కుదిరింది. దీంతో సాధికారత కోసం మళ్లీ జగనే రావాలని పేదలంతా బలంగా కోరుకుంటున్నారు. భవిష్యత్తు మరింత గొప్పగా మార్చుకునేందుకు..⇒ రాష్ట్రంలో 70 శాతం ప్రజల జీవనాధారం వ్యవసాయం. సీఎం జగన్‌ గ్రామాల్లో ఆర్బీకే (రైతు భరోసా కేంద్రాలు)లను ఏర్పాటు చేసి, విత్తు నుంచి విక్రయం దాకా రైతుల చేయిపట్టి నడిపిస్తున్నారు. రైతు భరోసా ద్వారా పెట్టుబడి సహాయం.. ఆర్బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందిస్తున్నారు. రైతులపై ఎలాంటి భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకాన్ని తెచ్చారు. పండించిన పంటల ఉత్పత్తులను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తున్నారు. ప్రకృతి విపత్తుల వల్ల పంట నష్టపోతే.. ఆ సీజన్‌ ముగిసేలోగా పరిహారాన్ని అందించి రైతులకు దన్నుగా నిలుస్తున్నారు. తద్వారా వ్యవసాయాన్ని పండుగగా మార్చారు. ⇒ గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలు సొంత ఊళ్లోనే సులభంగా అన్ని పనులను చక్కబెట్టుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ వైద్య ఖర్చుల పరిమితిని రూ.25 లక్షలకు పెంచడం.. జగనన్న సురక్ష, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్‌ విధానం ద్వారా ప్రజల ఆరోగ్యానికి సీఎం జగన్‌ భరోసా కల్పించారు. పునర్‌ వ్యవస్థీకరణ ద్వారా 26 జిల్లాలను ఏర్పాటు చేశారు. ⇒వైఎస్సార్‌ చేయూత, ఆసారాతో మహిళలకు సీఎం జగన్‌ అండగా నిలిచారు. ఆ పథకాల ద్వారా అందించిన ఆర్థిక సాయంతో⇒‘పేదలంటే మారుమూల పల్లెల్లో, పట్టణాల్లోని మురికి వాడల్లోనే ఉండాలి.. పెత్తందారుల ఇళ్లలో పనులు చేస్తూ, వాళ్లు తినగా మిగిలింది తింటూ బతకాలి.. పిల్లలను స్కూల్‌ లెవల్‌ వరకు తెలుగు మీడియంలో మాత్రమే చదివించాలి.. ఇంగ్లిష్‌ మీడియంలో చదివించాలనే ఆలోచనే రాకూడదు.. టెన్త్‌ తర్వాత పెత్తందారుల ఫ్యాక్టరీలో ప్యాకింగ్‌ విభాగంలో, లోడింగ్‌.. అన్‌లోడింగ్‌ సెక్షన్‌లో, సెక్యూరిటీ గార్డులుగా పెట్టుకోమని బతిమిలాడాలి..అమరావతిలో పేదలనే వారు అసలు ఉండకూడదు.. ఎన్నో ఏళ్లుగా ఇలా కొనసాగుతోంటే ఈ సీఎం జగన్‌ వచ్చాక, ఆ పరిస్థితి మార్చేస్తున్నారు.. సీఎం ఇలా చేస్తే మేము చూస్తూ ఊరుకుంటామా.. కోర్టుల్లో కేసులేశాం.. లేని వివాదాలు సృష్టించాం.. భయాందోళనలు పెంచేశాం.. డబ్బు సంచులతో ఎన్‌ఆర్‌ఐలను దింపాం.. పనోళ్లను పనోళ్లుగా ఉంచకుండా పేదరికాన్ని తగ్గించేస్తే మేమంతా ఏమైపోవాలి?’ అని చంద్రబాబు ఆయన పెత్తందారుల గ్యాంగ్‌ ఊగిపోతోంది. ⇒ ఈనాడు రామోజీ పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్ని మందులు వాడినా హిస్టీరియా తగ్గడం లేదు. రాత్రిళ్లు ఉన్నట్లుండి లేచి కూర్చుంటున్నారట. అదిగో జగన్‌.. జగన్‌.. మళ్లీ వస్తున్నాడు అంటూ కలవరిస్తున్నారట! తప్పకుండా ఆయన కల నెరవేరుతుంది. పేదరికంపై, పేదలపై, దిగువ మధ్యతరగతి వర్గాలపై విషం నింపుకున్న ఈ పెత్తందారులు ఫలానా మంచి పని చేశామని ఒక్కటంటే ఒక్కటి చెప్పుకోలేని దుస్థితిలో నిస్సిగ్గుగా మంచి చేస్తున్న ప్రభుత్వంపై దుర్మార్గంగా నిందలు వేస్తున్నారు. దు్రష్పచారాలు చేస్తున్నారు. వీరందరి వలువలూడదీసి తరమడానికి ఓటర్లంతా సిద్ధంగా ఉన్నారు. ఊరూరా అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు బారులు తీరి కనిపిస్తున్నారు. ఆ రెండు బటన్లు ఎప్పుడెప్పుడు నొక్కుదామా అని వేచి చూస్తున్నారు.

Telangana Lok Sabha Elections 2024
Hyderabad: వీరు తమ ఓటు తాము వేసుకోలేరు

హైదరాబాద్: గ్రేటర్‌పరిధిలోని నాలుగు పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న ప్రధాన పారీ్టల అభ్యర్థుల్లో కొందరు తమ ఓటును తమకు వేసుకోలేని పరిస్థితి ఉంది. హైదరాబాద్‌ ఏఐఎంఐఎం అభ్యర్థి అసదుద్దీ¯న్‌ ఒవైసీ రాజేంద్రనగర్‌ పరిధిలోని శా్రస్తిపురంలో నివాసం ఉంటున్నారు. ఈ ప్రాంతం చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం కిందకు వస్తుంది. హైదరాబాద్‌ బీజేపీ అభ్యర్థి మాధవీలత నివాసం ఈస్ట్‌ మారేడుపల్లిలోని మహేంద్రహిల్స్‌లో ఉంది. ఈ ప్రాంతం మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. హైదరాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి మహ్మద్‌ సమీర్‌ నివాసం జూబ్లీహిల్స్‌లో ఉంది. అది సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తోంది. చేవెళ్ల బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ కుత్బుల్లాపూర్‌లో నివాసం ఉంటున్నారు. అది మల్కాజిగిరి లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తుంది. మల్కాజిగిరి కాంగ్రెస్‌ అభ్యర్థి పట్నం సునీతామహేందర్‌రెడ్డికి తాండూరులో ఓటుంది. ఆ ప్రాంతం చేవేళ్ల లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. వీరందరూ తమ ఓటును తాము వేసుకోకుండా ఇతరులకు వేయాల్సిన పరిస్థితి ఉంది.

CM YS Jagan Will Win In Election says 22 national media surveys
వన్స్‌ మోర్‌.. 22 జాతీయ మీడియా సర్వేల్లోనూ ‘ఫ్యాన్‌’కే పట్టం

సాక్షి, అమరావతి: గత 59 నెలలుగా సుపరి­పాలనతో ఇంటింటి ప్రగతి, సమ్మిళిత అభివృద్ధిని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సాక్షాత్కారం చేశారు. సుపరి­పాలన.. ఇంటింటి అభివృద్ధి.. సుస్థి­రాభివృద్ధి మరింత ఉద్ధృతంగా కొనసాగాలంటే మళ్లీ వైఎస్‌ జగనే రావాలని ప్రజలు బలంగా కోరుకుంటు­న్నారు. ఫ్యాన్‌ గుర్తుపై రెండు బటన్లు నొక్కి ఓట్లేసి వైఎస్సార్‌­సీపీకి మరోసారి అఖండ విజయాన్ని అందించేందుకు సిద్ధ­మయ్యారు. సిద్ధం సభలు, మేమంతా సిద్ధం బస్సు యాత్ర, ఎన్నికల ప్రచార సభల్లో సీఎం జగన్‌కు జనం బ్రహ్మరథం పట్టడం.. టీడీపీ–­జనసేన–­బీజేపీ కూట­మి సభ­లకు ప్రజాస్పందన లేకపోవడాన్ని బట్టి వైఎస్సార్‌­సీపీ మరోసారి ఘన విజయం సాధించడం తథ్య­మని రాజకీయ పరి­శీలకులు తేల్చిచెబు­తు­న్నారు. జాతీయ మీడియా సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్వ­హించిన 22కుపైగా సర్వే­ల్లోనూ వైఎస్సార్‌­సీపీ తిరిగి అఖండ విజయం సాధి­స్తుందని వెల్లడైంది. సీఎం జగన్‌ సుపరిపాలనపై సాను­­కూల పవనాలు ప్రచండంగా వీస్తుండడంతో అనుకూల (పాజిటివ్‌) ఓటు­తో వైఎస్సార్‌సీపీ మరో­సారి చారి­త్రక విజయం సాధించడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇంటింటి భవిష్యత్తు మరింత గొప్పగా మారాలంటే..గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో సీఎం జగన్‌ 99 శాతం అమలు చేశారు. సంక్షేమ పథకాల ద్వారా పేదల ఖాతాల్లోకి డీబీటీ రూపంలో రూ.2.70 లక్షల కోట్లు నేరుగా జమ చేశారు. నాన్‌ డీబీటీ రూపంలో మరో రూ.1.79 లక్షల కోట్ల మేర ప్రయోజనాన్ని చేకూ­ర్చా­రు. వాటిని సద్వినియోగం చేసుకున్న ప్రజలు తమ జీవనోపాధులను మెరుగుపర్చుకు­న్నారు. బాబు హ­యాంలో 2018–19లో రాష్ట్రంలో పేద­రికం 11.77 శాతం ఉంటే 2022–23 నాటికి సీఎం జగన్‌ పాల­నలో 4.19 శాతానికి తగ్గడమే అందుకు నిదర్శనం. మళ్లీ జగన్‌ వస్తేనే ఇంటింటి భవి­ష్యత్తు మరింతగా మారుతుందని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. సాగు మరింత లాభసాటిగా మారాలంటే..సీఎం జగన్‌ విప్లవాత్మక సంస్కరణలతో వ్యవసాయ రంగాన్ని చక్కదిద్దారు. గ్రామాల్లో వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తు నుంచి విక్రయం వర­కూ రైతన్నలను చేయిపట్టుకుని నడిపిస్తున్నారు. రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయం, సున్నా వడ్డీకే పంట రుణాలు, ఉచిత పంటల బీమా అందిస్తున్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తూ, విపత్తుల వల్ల పంట నష్టపోతే ఆ సీజన్‌ ముగిసేలోగా రైతులకు పరిహారం అందిస్తున్నారు. వ్యవసాయాన్ని లాభ­సా­టి­గా మార్చారు. బాబు హయాంలో వ్యవసాయ రంగంలో రాష్ట్ర వృద్ధి రేటు 2018–19లో 8.3 శాతంతో దేశంలో 12వ స్థానంలో ఉంటే 2023–24 నాటికి 13 శాతానికి వృద్ధి రేటు పెరిగింది. వ్యవసాయ వృద్ధి రేటులో ఏపీ ఆరో స్థానంలో నిలిచింది. మళ్లీ జగన్‌ వ­స్తేనే వ్యవసాయం మరింత లాభసాటిగా మారు­తుందని రైతన్నలు, కౌలు రైతులు విశ్వసిస్తున్నారు. విద్యా ప్రమాణాలు మరింత ఉన్నతంగా మారాలంటే..ప్రభుత్వ పాఠశాలలను నాడు–నేడు ద్వారా కార్పొరేట్‌ స్థాయికి అభివృద్ధి చేసిన సీఎం జగన్‌ పేదింటి బిడ్డలకు ఇంగ్లీషు మీడియం బోధన అందుబాటులోకి తెచ్చారు. సీబీఎస్‌ఈ సిలబస్‌ తీసు­కొచ్చారు. అమ్మ ఒడి, విద్యా కానుక, గోరుముద్ద లాంటి పథకాలతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా­ర్థుల సగటు నమోదు నిష్పత్తి రేటు వంద శాతానికి చేరుకుంది. మూడో తరగతి నుంచే విద్యార్థులకు టోఫెల్‌ శిక్షణ ఇస్తున్నారు. 2025–26 నుంచి ఐబీ (ఇంటర్నేషనల్‌ బాకలారియేట్‌) సిలబస్‌ ప్రవేశ­పెట్టనున్నారు. ప్రస్తుతం ఒకటో తరగతి చదువు­తున్న విద్యార్థులు 2035 నాటికి పదో తరగతి పరీక్షలు ఐబీ సిలబస్‌తో రాయనున్నారు. హార్వర్డ్, స్టాన్‌ఫర్డ్, కేంబ్రిడ్జి, ఎంఐటీ భాగస్వామ్యంతో ఆన్‌­లైన్‌ సర్టిఫైడ్‌ కోర్సులను అందిస్తున్నారు. ఉన్నత ప్రమాణాలతో చదువులు పూర్తి చేసుకుని బయ­టకు వచ్చిన మన విద్యార్థులకు ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్‌ సంస్థలు ఉద్యోగాలు ఇచ్చేందుకు పోటీ పడే వాతావరణాన్ని కల్పిస్తున్నారు. మళ్లీ జగన్‌ వస్తేనే విద్యా సంస్కరణలు కొనసాగి ఉన్నత విద్యా ప్రమాణాలతో తమ పిల్లల భవిత బాగుంటుందని తల్లితండ్రులు బలంగా భావిస్తున్నారు. వైద్యరంగంలో సంస్కరణలు కొనసాగాలంటే..వైద్య రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చి సీఎం జగన్‌ వైద్య సేవలను పేదల చెంతకు చేర్చారు. ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఉచితంగా చికిత్సలు పేద, మధ్య తరగతికి అందుతు­న్నాయి. విస్తరించిన ఆరోగ్యశ్రీతో రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తూ ప్రజారోగ్యానికి భరోసా కల్పించారు. ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ఆరోగ్యాంధ్రప్రదేశ్‌ దిశగా అడుగులు పడ్డాయి. నాడు–నేడు ద్వారా ప్రభుత్వా­సుపత్రులను బలోపేతం చేయడంతో పాటు 17 కొత్త మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇవన్నీ కొనసాగి నాణ్యమైన వైద్యం ఉచితంగా పేదలకు, మధ్య తరగతికి అందాలంటే మళ్లీ ఇదే ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు.సుస్థిరాభివృద్ధి దిశగా రాష్ట్రం దూసుకెళ్లాలంటే..విభజిత ఆంధ్రప్రదేశ్‌ను 2014–19 మధ్య అవినీతి పాలనతో చంద్రబాబు అధోగతి పాలు చేశారు. సీఎం జగన్‌ అధికారం చేపట్టాక ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ రాష్ట్రాన్ని సుస్థిరాభివృద్ధి వైపు నడిపించారు. రాష్ట్ర అప్పులు కాంపౌండెడ్‌ యాన్యువల్‌ గ్రోత్‌ రేట్‌(సీఏజీఆర్‌) చంద్రబాబు హయాంలో 2014–19 మధ్య 21.87 శాతం ఉంటే.. సీఎం జగన్‌ హయాంలో 12.13 శాతానికి తగ్గింది. దేశ జీడీపీలో మన వాటా చంద్రబాబు హయాంలో 4.47 శాతం ఉండగా సీఎం జగన్‌ హయాంలో 4.83 శాతానికి పెరిగింది. దేశ జీడీపీలో రాష్ట్ర జీ­ఎస్‌డీపీ చంద్రబాబు హయాంలో 2018–19లో 11 శాతం ఉంటే.. సీఎం జగన్‌ హయాంలో 2023–24 నాటికి 16.2 శాతానికి పెరిగింది. దేశ జీడీపీలో అత్యధిక జీఎస్‌డీపీ వాటా ఉన్న రాష్ట్రాల్లో ఏపీది నాలుగో స్థానం కావడం గమ­నార్హం. బాబు హ­యాంలో ఏపీ 14వ స్థానంలో ఉండేది. ఇక తలసరి ఆదాయం చంద్రబాబు హయాంలో 2018–19లో రూ.1,54,031 మాత్రమే ఉంటే 2023–24 నాటికి ఏకంగా రూ.2,19,518కి పెరిగింది. మళ్లీ జగన్‌ వస్తేనే రాష్ట్రం సుస్థిరాభివృద్ధి వైపు దూసుకెళుతుందని ప్రజలు బలంగా నమ్ముతున్నారు.ఉద్యోగ, ఉపాధి విప్లవం మరింత గొప్పగా కొనసాగాలంటే..పారదర్శక పారిశ్రామిక విధానంతో సులభతర వాణిజ్యం(ఈజ్‌ ఆప్‌ డూయింగ్‌ బిజినెస్‌)లో సీఎం జగన్‌ ఏటా రాష్ట్రాన్ని దేశంలో నంబర్‌ వన్‌ స్థానంలో నిలిపారు. విశాఖలో 2023 మార్చిలో నిర్వహించిన గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌లో రూ.13,08,887 కోట్లతో పెట్టుబడి పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఒ­ప్పందాలు చేసుకున్నారు. పరిశ్రమలు ఏర్పాటు చే­స్తూ 59 నెలల్లో రూ.3,02,085 కోట్ల పెట్టుబడి పె­ట్టారు. ఎంఎస్‌ఎంఈలకు పోత్సాహకాలు ఇవ్వ­డంతో వాటి సంఖ్య 1.9 లక్షల నుంచి 7 ల­క్షలకు పెరి­గింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 58.22 లక్షల మంది ఉపాధి పొందారు. మళ్లీ జగన్‌ వస్తేనే భారీ పరిశ్రమలు వస్తాయని, ఉపాధి అవకా­శాలు భారీగా ఉంటాయని యువత బలంగా విశ్వసిస్తోంది.మహాస్వప్నం సాకారం కావాలంటే..విశాఖపట్నం సమీపంలో రూ.5 వేల కోట్లతో భోగాపురం గ్రీన్‌ ఫీల్డ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టును సీఎం జగన్‌ నిర్మిస్తున్నారు. ఒకవైపు విదేశీ వర్సిటీల నుంచి ప్రతిష్టాత్మక కోర్సులు పూర్తి చేసిన రాష్ట్ర యువత.. బలమైన గ్రోత్‌ ఇంజిన్‌ లాంటి విశాఖ నగరం.. ఐకానిక్‌ బిల్డింగ్‌లు.. పెద్ద ఎత్తున వచ్చే ఐటీ, ఇతర పరిశ్రమలు.. కోస్తా తీరమంతటా విరాజిల్లేలా ‘బ్లూ’ ఎకానమీని ఆవిష్కరించడానికి సీఎం జగన్‌ నడుం బిగించారు. మళ్లీ జగన్‌ వస్తేనే ఆ మహాస్వప్నం సాకారమై రాష్ట్రం అన్ని రంగాల్లో దేశంలో అగ్రగామిగా నిలుస్తుందని సామన్యుల నుంచి మేధావుల వరకూ బలంగా విశ్వసిస్తున్నారు. రాష్ట్రం రూపురేఖలు సమూలంగా మారాలంటే..సువిశాలమైన 974 కి.మీ.ల పొడవైన తీర ప్రాంతం రాష్ట్రం సొంతం. తీరం మన బలం అంటూ ప్రగల్భాలు పలికిన చంద్రబాబు దాన్ని ఎన్నడూ ఉపయోగించుకోవాలనే ఆలోచన చేయలేదు. సీఎం జగన్‌ రూ.16,500 కోట్లతో నాలుగు పోర్టులు­(కాకినాడ గేట్‌వే, మూలపేట, రామా­య­­పట్నం, మచిలీపట్నం) నిర్మిస్తున్నారు. పది ఫిషింగ్‌ హార్బర్లు, ఆరు ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లను నెలకొల్పుతున్నారు. ఇవన్నీ పూర్తయితే పోర్టు ఆధారిత పరిశ్రమలు స్థాపించేందుకు దిగ్గ­జాలు క్యూ కట్టడం ఖాయం. రామా­య­పట్నం పోర్టు వద్ద ఇండోసోల్‌ పరిశ్రమ అప్పు­డే ఉత్ప­త్తులను ప్రారంభించడమే అందుకు నిదర్శనం. మళ్లీ జగన్‌ వస్తేనే పోర్టు ఆధారిత పరిశ్రమలు వస్తాయని, రాష్ట్రం రూపురేఖలు సమూలంగా మారుతాయని యువత బలంగా నమ్ముతోంది.

Chandrababu Pawan Both videos viral on social media about reservations
కూటమి మాట.. రిజర్వేషన్లు రద్దు..

సాక్షి, అమరావతి: మైనారిటీలు, ఎస్సీలు, ఎస్టీలు, పేద వర్గాలకు రిజర్వేషన్లు అవసరం లేదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కుండబద్ధలు కొట్టారు! జాతీయ న్యూస్‌ ఏజెన్సీ ఏఎన్‌ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రిజర్వేషన్లపై తన వ్యతిరేకతను బహిర్గతం చేసిన చంద్రబాబు వాటిని రద్దు చేయాలని అభిప్రాయపడ్డారు! ‘ఎస్సీ, ఎస్టీలు, ఇతర కొన్ని వర్గాలకు ఏడు దశాబ్దాలుగా రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. మరి వాళ్లు ఏమైనా బాగుపడ్డారా?’ అని చంద్రబాబు ప్రశ్నించారు. వారికి రిజర్వేషన్లు అవసరం లేదన్నట్లుగా మాట్లాడారు. ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ చెబుతుండగా ఎన్డీఏతో పొత్తులో ఉన్న చంద్రబాబు మాత్రం ఇప్పటివరకు మభ్యపెట్టేలా మాట్లాడారు. పోలింగ్‌కు ముందు చంద్రబాబు తన ముసుగు తొలగించి ముస్లింలకు రిజర్వేషన్లు అవసరం లేదని స్పష్టం చేయడంతో ఆ వర్గాలు ఆవేదనతో రగిలిపోతున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి అధికారం ఇస్తే ఏపీలో ముస్లింలకు అమలవుతున్న 4 శాతం రిజర్వేషన్లు రద్దు కావడం ఖాయమని చంద్రబాబు వ్యాఖ్యలతో స్పష్టమవుతోంది. చంద్రబాబు ప్రతి సందర్భంలోనూ పేదల పట్ల తన వ్యతిరేకతను చాటుకున్నారు. ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని వారి పుట్టుకనే అవమానించిన వ్యక్తి చంద్రబాబు. బీసీల తోకలు కత్తిరిస్తానని బెదిరించిన చరిత్ర కూడా ఆయనదే. చంద్రబాబు నరనరానా కులోన్మాదం జీర్ణించుకుపోయిందనేందుకు దళితులు, ముస్లింలు, బీసీలకు వ్యతిరేకంగా పలు సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. తాజాగా ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలకు రిజర్వేషన్లు అవసరం లేదంటూ వారి పట్ల తన వ్యతిరేకతను చాటుకున్నారు. ఆయన మాట్లాడిన వీడియో వైరల్‌ కావడంతో అది ఫేక్‌ అంటూ ఎప్పటి మాదిరిగానే గొంతు సవరించుకున్నారు.నైపుణ్య శిక్షణ చాలన్న పవన్‌చంద్రబాబు పార్ట్‌నర్‌ పవన్‌ కళ్యాణ్‌ కూడా రిజర్వేషన్లపై తన వ్యతిరేకతను చాటుకున్నారు. దేశంలో చాలా కులాలు, ఉప కులాలు ఉన్నాయని, అందరూ రిజర్వేషన్లు అడుగుతారని, కానీ అందరికీ ఇవ్వలేమని ఇటీవల ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్‌ పేర్కొన్నారు. అర్హతను బట్టి అవకాశాలు రావాలని, అందుకు నైపుణ్య శిక్షణ ఇప్పిస్తే సరిపోతుందన్నారు. రిజర్వేషన్ల ద్వారా అందరికీ అవకాశాలు ఇవ్వలేమని, తన కులం వాళ్లు కూడా రిజర్వేషన్లు అడుగుతున్నారని, కానీ ఇవ్వలేమని స్పష్టం చేశారు. చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ తమ వ్యాఖ్యల ద్వారా పేద వర్గాలకు ఇచ్చే రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని తేల్చి చెప్పారు.

Chandrababu and Lokesh lied as affidavit witnesse
అవినీతి సొమ్ముకు హెరిటేజ్‌ ముసుగు

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఎందుకిన్ని మోసాలు? బతుకంతా అబద్ధా­లేనా? మేనిఫెస్టో సరే.. అఫిడవిట్లో కూడా అబద్ధా­లేనా? తరచి చూస్తే తండ్రీ కొడుకులు చంద్రబాబు నాయుడు... లోకేశ్‌ నాయుడు ఇద్దరూ ఇప్పుడే కాదు... 2019లోనూ అబద్ధాల అఫిడవిట్లే వేశారు. 2019లో హెరిటేజ్‌ షేర్‌ విలువ రూ.260.81 ఉండగా... అఫిడవిట్లో మాత్రం ఏకంగా రూ.511.90 ఉన్నట్టుగా చూపించారు. పైపెచ్చు వీళ్లకు ఉన్నవి ఒకటీరెండూ షేర్లు కాదు. 2019లో చంద్రబాబుకు 1,06,61,652 షేర్లు... లోకేశ్‌ నాయుడికి 4,73,800 షేర్లు ఉన్నాయి. అప్పట్లో వీటి వాస్తవ విలువ చంద్రబాబుది రూ.278 కోట్ల పైచిలుకు కాగా... లోకేశ్‌ది రూ.12.40 కోట్లు. కానీ చంద్ర­బాబు తన షేర్ల విలువను ఏకంగా రూ.545 కోట్లు­గా చూపించారు. తానేమీ తక్కువ తినలేదన్నట్లు లోకేశ్‌ కూడా తన షేర్ల విలువను రూ.24.25 కోట్లు­గా చూపించారు. అంటే ఇద్దరూ కలిసి తమ హెరి­టేజ్‌ షేర్ల విలువను దాదాపు రూ.279 కోట్లు ఎక్కు­వగా చూపించారు. ఇదంతా ఎందుకో తెలుసా?ఐటీ కళ్లు కప్పడానికి ముసుగు...నిజానికి 2014 నుంచి 2019 వరకూ చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నారు. ఆ సమయంలో ఆయన స్కిల్‌ డెవల­ప్‌­మెంట్‌ కుంభకోణం సహా పలు కుంభకోణాలకు తెరతీశారు. ఈ స్కాముల్లో చాలా నిధులు రకరకాల మార్గాల్లో మళ్లీ తన దగ్గరికే రప్పించుకున్నారు. ఈ సొమ్ముతో ఆస్తులు పెంచుకున్నా... అవేవీ రికార్డుల్లో కనపడకుండా జాగ్రత్త పడ్డారు. చాలా ఆస్తుల్ని బినామీల పేరిట పెట్టారు. అయితే షాపుర్జీ పల్లోంజీ సహా కొన్ని కంపెనీల నుంచి తీసుకున్న డబ్బులు నేరుగా చంద్రబాబు ఖాతాల్లోకే రావటంతో దానికి ఐటీ శాఖ నోటీసులు కూడా జారీ చేసింది.ఆ నోటీ­సులకు జవాబిచ్చేటపుడు కూడా... నాకు నోటీసు­లిచ్చే అధికారం మీకు లేదంటూ బుకాయించడం... అదే కారణంతో కోర్టులో సవాల్‌ చేయటం తప్ప ఆదా­యానికి సంబంధించిన సమాధానాలేవీ ఇవ్వ­లేదు. అయితే ఆ డబ్బులు పెరిగిన ఆస్తుల్లో, తన బ్యాంకు ఖాతాల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉండటంతో వాటికి ఈ హెరిటేజ్‌ ముసుగు వేసినట్లుగా నిపు­ణు­లు చెబుతున్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో అధికారి­కంగా అన్ని ఆస్తులు ఎలా పెరిగాయనే ప్రశ్న వస్తుంది కాబట్టి... హెరిటేజ్‌ షేర్లకు అంత విలువ లేకపో­యినా వాటి పేరిట చూపిస్తే సరిపో­తుందని ఈ ప­న్నా­­గం పన్నినట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.ఈ సారి అఫిడవిట్లో షేర్ల సంఖ్య పెంచేసి మరో అక్రమం...ఇలాంటి తప్పుల్ని, మోసాల్ని సహించలేమంటూ 2019 ఎన్నికల్లో జనం బాబుకు బుద్ధి చెప్పి ఓడించటం అందరికీ తెలిసిందే. కాకపోతే మళ్లీ ఈ సారి ఎన్నికల్లో మునుపటిలాగే షేరు విలువను ఎక్కువ చేసి చూపిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని అనుకు­న్నారో ఏమో... షేర్ల సంఖ్యను పెంచి చూపించారు. అప్పట్లో ఉన్న షేర్ల సంఖ్య 1,06,61,652 కాగా... ఇపుడా షేర్ల సంఖ్య ఏకంగా 2,26,11,525కు పెరిగినట్లు చంద్రబాబు చూపించారు.అంటే రెట్టింపుకన్నా ఎక్కువన్న మాట. అప్పట్లో వీటి మొత్తం విలువను రూ.545 కోట్లుగా చూపించిన చంద్ర­బాబు... ఇప్పుడు 2,26,11,525 షేర్లను ఒక్కొ­క్కటీ రూ.337.85గా చూపిస్తూ... హెరిటేజ్‌లోని తన షేర్ల విలువ రూ.. 767.44 కోట్లుగా పేర్కొన్నారు. లోకేశ్‌ కూడా తన షేర్లు 4,73,800 నుంచి 1,00,37,453కు పెరిగినట్లుగా... వాటి విలువ రూ.337.85 చొప్పున రూ.339 కోట్లుగా చూపించారు.బోనస్, స్ప్లిట్‌.. ఏమీ లేకుండానేనిజానికి 2019 తరువాత హెరిటేజ్‌ షేర్ల విభజన జరగలేదు. అంటే ఒక షేరును విభజించి రెండుగా చేయటమో ఏదో జరిగితే తప్ప చంద్రబాబు నాయుడి షేర్లు అలా రెట్టింపయ్యే అవకాశం లేదు. పోనీ బోనస్‌ షేర్లను జారీ చేశారా అంటే... అది కూడా లేదు. ఈ రెండూ కాకుండా ఈ మధ్యలో చంద్రబాబు ఎవరి వద్దనుంచైనా హెరిటేజ్‌ షేర్లను కొనుగోలు చేశారా అంటే... అది కూడా లేదు. మరి ఎలా పెరిగాయి? 2019లో హెరిటేజ్‌ షేర్లకు లేని విలువను ఉన్నట్టుగా చూపించి వాటిని ఏకంగా రూ.545 కోట్లుగా పేర్కొన్న చంద్రబాబు... ఇప్పుడు వాటి విలువ రూ.337 ప్రకారం కోటి షేర్లుగా చూపిస్తే మొత్తం విలువను రూ.337 కోట్లుగా చూపించాలి. అంటే ఐదేళ్లలో హెరిటేజ్‌ షేర్ల విలువను తగ్గినట్లు చూపించాలి. ఇది కంపెనీకి కూడా ఇబ్బందికరంగా మారవచ్చని, తన 2019 అఫిడవిట్‌ బాగోతం బయటపడే అవకాశం ఉందని భావించి... ఈ సారి కూడా అబద్ధం చెప్పి ఉండొచ్చనేది ఆర్థిక నిపుణుల అంచనా. తండ్రి బాటలోనే లోకేశ్‌ కూడా తన షేర్ల సంఖ్యను అమాంతం పెంచేసి... 4 లక్షల షేర్లను కోటి షేర్లుగా చూపించారని, ఇదంతా అవినీతి సొమ్ముకు అధికారిక ముసుగు వేయటానికేనని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే కంపెనీలో ప్రమోటర్ల వాటా అప్పుడు ఎంత ఉందో ఇప్పుడూ అంతే ఉంది. మరి వాటా పెరగకుండా షేర్ల సంఖ్య పెరగటం ఎలా సాధ్యం? నిజానికి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తప్పుడు అఫిడవిట్లను సమర్పించడం చట్టరీత్యా నేరం. ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు అఫిడవిట్లు సమ­ర్పిస్తే.... సెక్షన్‌ 125 ఏ ప్రకారం... అభ్యర్థిపై విచారణ జరపవచ్చని కొన్ని కేసుల్లో కోర్టులు స్పష్టంగా తీర్పునిచ్చాయి కూడా.

తనిష్క్ జ్యువెలరీ నెక్లెస్‌
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్

ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన, భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్‌ల నుండి ప్రేరణ పొంది అద్భుతమైన మరియు వైవిధ్యమైన శ్రేణి సమకాలీన, రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్‌లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్‌లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్‌లు, కస్టమర్‌లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా, ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్‌ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్‌ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్, ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్‌లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్‌గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్‌లెట్‌లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్‌లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్‌లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్‌డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్‌లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్ 18కేరట్ మరియు 22కేరట్ బంగారంలో విస్తృతమైన శ్రేణి డిజైన్‌లతో, నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని సంపూర్ణం చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్‌లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్‌లెట్‌లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement

ఫోటో స్టోరీస్

View all