Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

AP Election Results 2024: Is June 4th Doom Day For TDP Alliance?
ఏపీ జడ్జిమెంట్‌ డే.. కూటమిలో గుబులు

సార్వత్రిక ఎన్నికల సమరంలో.. ఇంకా గంటలే మిగిలి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు రేపు ఉదయం ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. తమ గెలుపు ఖాయమైందని వైఎస్సార్‌సీపీ.. లోపల ఓటమి భయం ఉన్నప్పటికీ పైగా మాత్రం తాము గెలిచి తీరతామని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రకటనలు పోటాపోటీగా ఇచ్చుకుంటున్నాయి. ఇటు ఏపీ ప్రజానీకం, అటు రాజకీయ శ్రేణులు ఉత్కంఠంగా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాయి.ఏపీ ఎన్నికల ఫలితాల వేళ కూటమికి ఓటమి భయం పట్టుకుంది. వాస్తవానికి సీఎం జగన్‌ నేతృత్వంలోని సంక్షేమ పాలన, ఆయన ఎన్నికల ప్రచారానికి దక్కిన స్పందన.. తమ సమావేశాలకు జనాదరణ కరువు కావడం చూశాక గెలుపు ఆశలు వదులుకుంది. ఈ ఎన్నికల్లో ఓడితే.. టీడీపీ, జనసేన, బీజేపీలది ప్యాకప్‌ పరిస్థితి. అందుకే గెలుపు కోసం ప్రతిపక్ష కూటమి ఎంతకైనా తెగించవచ్చని అధికార పక్షం భావిస్తోంది. గెలుపు ధీమా ప్రదర్శిస్తూనే.. ప్రత్యర్థుల కుట్రలను తిప్పి కొట్టేందుకు ప్రతీ క్షణం అప్రమత్తంగా ఉండాలని అభ్యర్థులకు, పోలింగ్‌ ఏజెంట్లకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు YSRCP కీలక నేతలు.ఎలక్షన్‌ నాటి హింసాత్మక ఘటనలు, పల్నాడు రీజియన్‌లో పలు చోట్ల రిగ్గింగ్‌ జరగడం, ఈసీ.. పోలీసులు ఎన్టీయే కూటమికి అనుకూలంగా వ్యవహరిస్తుండడంతో వైఎస్సార్‌సీపీ నేతలు అప్రమత్తం అయ్యారు. తమ పార్టీ తరఫున ఏజెంట్లగా నియమించినవారితో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. లెక్కింపు సమయంలో ఎంత అప్రమత్తంగా ఉండాలి.. అభ్యంతరం వ్యక్తం చేయాలంటే ఎవరిని సంప్రదించాలి.. ప్రతిపక్ష పార్టీల ఏజెంట్లు అడ్డంకులు సృష్టిస్తే ఏంచేయాలనే విషయమై తమ ఏజెంట్లకు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు.ఇదీ చదవండి: లెక్క ఏదైనా.. 'ఫ్యాన్‌' పక్కాఇంకోవైపు.. వైఎస్సార్‌సీపీకే ఎక్కువ విజయవకాశాలున్నట్లు మెజారిటీ సర్వేసంస్థలు వెల్లడించాయి. దీంతో ఆ పార్టీ అభ్యర్థులు, కార్యకర్తల్లో ఫలితాలకు ముందే జోష్‌ కనిపిస్తోంది. ఇక కూటమి అభ్యర్థులు మాత్రం మేమే వస్తామని గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. లోలోన భయం వెంటాడుతోంది. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల తర్వాత పందేలు కట్టడానికి కూడా టీడీపీ, జనసేన కార్యకర్తలు సాహసించడం లేదు.సామాన్య వర్గాల్లో ఉత్కంఠేబరిలో నిలిచివారు, అనుచరులు, రాజకీయ శ్రేణులు మాత్రమే కాదు.. సామాన్యుల్లోనూ ఇప్పుడు ఎన్నికల ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. తీర్పు తమదే అయినా.. ఓటర్‌ నాడి గందరగోళంగా ఉందనే అభిప్రాయాల నడుమ ఫలితం ఎలా ఉండబోతుందా? అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.ఏర్పాట్లు పూర్తి ఈసారి లెక్కింపునకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్‌ సెంటర్‌కు ఇరువైపులా రెండు కి.మీ. రెడ్‌ జోన్‌గా ప్రకటించారు. లెక్కింపు కేంద్రంలో ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్‌ వద్ద అభ్యర్థికి ఒక ఏజెంటు చొప్పున అనుమతిస్తారు. కౌంటింగ్‌ కేంద్రంలోకి ప్రవేశించే ఏజెంట్లకు బ్రీత్‌ ఎన్‌లైజర్‌తో ముందుగా పరీక్ష చేస్తారు. మద్యం తాగినట్లు తెలితే లోపలికి అనుమతించరు. తెల్లవారుజామున అయిదు గంటల నుంచే తనిఖీలు చేపట్టనున్నారు.కౌంటింగ్‌ ప్రక్రియకు హాజరయ్యే అభ్యర్థులు, అధికారులు, ఏజెంట్లు జిల్లా ఎన్నికల అధికారి జారీ చేసిన గుర్తింపు కార్డులు ధరించి తనిఖీల్లో చూపించాలి. కేంద్రంలోకి ఒక్కసారి ఏజెంట్‌ లోపలికి వెళితే పూర్తయ్యే వరకు బయటకు రావడానికి వీలు లేదు.మరోవైపు.. అభ్యర్థులు, ఏజెంట్లు తప్ప మిగిలిన ప్రజలెవరూ కౌంటింగ్‌ కేంద్రాల వద్ద గుమిగూడడానికి వీల్లేదు. అలాగే.. పోలింగ్‌ నాటి పరిస్థితుల దృష్ట్యా విజయోత్సవ ర్యాలీలకు కొన్నిచోట్ల అనుమతుల్లేవని పోలీసులుస్పష్టం చేస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. కేంద్రాల వద్ద మీడియా కమ్యూనికేషన్‌ కేంద్రం ఏర్పాటు చేశారు. రౌండ్లు వారీగా ఫలితాలు వెల్లడిస్తారు.ఏపీ ప్రజల తీర్పు ఎలా ఉండబోతోంది?.. రేపు ఉదయం 6గం. నుంచి మినిట్‌ టు మినిట్‌ అప్‌డేట్స్‌ మీ సాక్షిలో..

Sajjala On Postal Ballot EC Decision And Chandrababu Manage Politics
చంద్రబాబు అందరినీ భయపెడుతున్నారు: సజ్జల

గుంటూరు, సాక్షి: దేశమంతా ఒక నిబంధన.. ఏపీలో మరో నిబంధన. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో మాత్రమే పోస్టల్‌ బ్యాలెట్‌కు సంతకం ఉంటే చాలని నిబంధనలు పెట్టారని అసంతృప్తి వ్యక్తం చేశారు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. సోమవారం మధ్యాహ్నాం వైఎస్సార్‌సీపీ పార్టీ కేంద్రకార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆయన మండిపడ్డారు.‘‘చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్‌ చేస్తున్నారు. అందరినీ భయపెడుతున్నారు. అధికార యంత్రాంగాల పట్ల పట్టు సాధించే ప్రయత్నాలూ చేశారు అని సజ్జల అన్నారు. ప్రతిపక్షాలు కుట్రలకు పాల్పడొచ్చు. అందుకే కౌంటింగ్‌ సమయంలో అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్‌సీపీ శ్రేణులకు సూచించాం. కౌంటింగ్‌ పూర్తై డిక్లరేషన్‌ పూర్తయ్యే వరకు ఎవరూ బయటకి రావొద్దని చెప్పాం’’ అని సజ్జల మీడియాకు వివరించారు.జాతీయ స్థాయిలో ఇచ్చిన ఎగ్జిట్‌పోల్స్‌ అన్నీ తప్పే. చంద్రబాబుకి బీజేపీతో పొత్తు లేకుంటే అలాంటి ఫలితాలు ఇచ్చుండేవారే కాదు అని సజ్జల అన్నారు.

Count Down Starts For AP Election Results Live Updates
AP Election Update: కౌంటింగ్‌కు కొనసాగుతున్న కౌంట్‌డౌన్‌

AP Elections Counting Count Down2:15 PM, 3rd June, 2024ఏపీలో ఈసీ కొత్త నిబంధన ఎందుకు?: సజ్జలదేశమంతా ఒక నిబంధన, ఏపీలో మరో నిబంధనదేశంలో ఎక్కడాలేని నిబంధనలు ఏపీలో మాత్రమే పెట్టారు.అధికార యంత్రాంగంపై చంద్రబాబు పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు.చంద్రబాబు అందరినీ భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.బాబు వ్యవస్థలను మేనేజ్‌ చేస్తున్నారు.ఏపీలో మాత్రమే పోస్టల్‌ బ్యాలెట్‌కు సంతాకం ఉంటే చాలనే నిబంధన పెట్టారు.కౌంటింగ్‌ సమయంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి.చంద్రబాబుకు బీజేపీతో పొత్తు లేకుంటే కరెక్ట్‌ ఎగ్జిట్‌పోల్స్‌ వచ్చేవి. 1:50 PM, 3rd June, 2024గీత దాటితే తాట తీస్తాం: డీజీపీ హరీష్‌ గుప్తా వార్నింగ్‌అమరావతి..డీజీపీ కార్యాలయం ప్రకటనకౌంటింగ్ నేపథ్యంలో సోషల్ మీడియాపై పోలీసు శాఖ ఫోకస్రెచ్చగొట్టే పోస్టులపై వ్యాఖ్యలపై సీరియస్ అయిన ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాడీజీపీ హరీష్‌ గుప్తా కామెంట్స్‌..గీత దాటితే తాట తీస్తాం.సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవు.కౌంటింగ్ తర్వాత మీ అంతు చూస్తామంటూ సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థి శిబిరాలకు సవాలు విసురుతున్నారువ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ ఉద్రిక్తలు సృష్టిస్తున్నారుఅలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవుIT act కింద కేసులు నమోదు చేస్తాం రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం.PD ACT ప్రయోగించడం వంటి కఠిన చర్యలు తప్పవు..పోస్టులు ఎవరి ప్రోద్భలంతో పెడుతున్నారో వారిపై కూడా విచారణ చేస్తాం.రెచ్చగొట్టే పోస్టులను, ఫోటోలను, వీడియోలను వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకోవడం, షేర్ చేయడం నిషిద్ధం.గ్రూప్ అడ్మిన్లు అలెర్ట్‌గా ఉండాలి.సోషల్ మీడియా పోస్టులపై పోలీస్ శాఖ నిరంతర నిఘా ఉంటుంది. 1:30 PM, 3rd June, 2024కౌంటింగ్‌కు ఏ‍ర్పాట్లు పూర్తి: సీఈవో మీనాఅమరావతి..రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కామెంట్స్‌..రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభంపార్లమెంటుకు 454 మంది, అసెంబ్లీకి 2387 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారుఅన్ని జిల్లాల్లో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయిముందుగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభమవుతుంది8.30కి ఈవీఎం కౌంటింగ్ ప్రారంభమవుతుందిపోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లేని చోట ఈవీఎంల కౌంటింగ్ 8 గంటలకే ప్రారంభం అవుతుందిపార్లమెంట్ సెగ్మెంట్ల ఈవీఎం కౌంటింగ్ ఎనిమిది గంటలకే ప్రారంభంకౌంటింగ్ కోసం 196 మంది అబ్జర్వర్లను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది 1:00 PM, 3rd June, 2024విజయోత్సవ ర్యాలీలకి అనుమతి లేదు: ఎస్పీ నయీమ్ కృష్ణా జిల్లా ఎస్పీ నయీమ్ అద్మీ ఆస్మి కామెంట్స్..కృష్ణా జిల్లాలో పోలింగ్ ప్రశాంతం జరిగింది. పెనమలూరులో చిన్న చిన్న గొడవలు జరిగాయి.ప్రస్తుతం అంతా ప్రశాంతంగా ఉంది.విజయోత్సవ ర్యాలీలకి అనుమతి లేదు .144 సెక్షన్ అమలులో ఉంది.రాజకీయ నాయకులు ఎన్నికల నిబంధనలు పాటించాలి.50 చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశాం.133 గ్రామాల్లో పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేసాం.70 కేసులు నమోదు చేశాం.40 కేసుల్లో చార్జ్ షీట్స్ కూడా వేశాం.కౌంటింగ్ నేపథ్యంలో ప్రజలు గుంపులుగా ఉండకూడదు.స్పెషల్ ఫోర్స్ ని రంగంలోకి దింపాం.సమస్యాత్మక ప్రాంతాల్లో అదనంగా పోలీసులను మోహరించాం.చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు. 12:45 PM, 3rd June, 2024ఎగ్జిట్‌పోల్స్‌ను ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదు: వైవీ సుబ్బారెడ్డివిశాఖ..వైస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కామెంట్స్‌..పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో అప్రమత్తంగా ఉండాలి.ఏజెంట్లు నిర్ణీత సమయం కంటే ముందుగానే కౌంటింగ్ సెంటర్లకు చేరుకోవాలి.ఎగ్జిట్‌పోల్స్‌ను ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదు.సర్వేల గురించి ఎవరూ ఆలోచించవద్దు.మహిళలు, వృద్ధులు మళ్లీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డే సీఎం కావాలని కోరుకున్నారు.వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు అన్ని నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నారు. 11:59 AM, 3rd June, 2024పిన్నెల్లిపై కొనసాగుతున్న కుట్రలుమాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై సుప్రీం కోర్టు ఆంక్షలుకౌంటింగ్‌ రోజు పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లొద్దని, పరిసర ప్రాంతాల్లో కనిపించవద్దని ఆదేశంపిన్నెల్లిని ఇరకాటం పెట్టేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్న పచ్చ బ్యాచ్‌ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో పిన్నెల్లికి ముందస్తు బెయిల్‌అనుకూల పోలీసులతో పిన్నెల్లిపై మూడు అక్రమ కేసులుకోర్టు ఆదేశాలతో ఆ కేసుల్లోనూ ఊరట పొందిన పిన్నెల్లితాజాగా తమ నేతలతో సుప్రీంలో కేసులు వేయించిన టీడీపీటీడీపీ పోలింగ్ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు వేసిన పిటిషన్‌పై సుప్రీం తాజా ఆదేశాలుఈ నెల 6న ఈ కేసు పరిష్కరించాలని ఏపీ హైకోర్టును సూచించిన సుప్రీం 11:30 AM, 3rd June, 2024పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపులో అప్రమత్తత అవసరం: వైవీ సుబ్బారెడ్డివిశాఖ:వైఎస్సార్‌సీపీ కౌంటింగ్ ఏజెంట్లతో జూమ్ మీటింగ్ నిర్వహించిన ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి.కౌంటింగ్ ప్రక్రియలో అనుసరించాల్సిన విధానాలపై పలు సూచనలు చేసిన వైవీ సుబ్బారెడ్డి.పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో అప్రమత్తంగా ఉండాలి.ఏజెంట్లు నిర్ణీత సమయం కంటే ముందుగానే కౌంటింగ్ సెంటర్లకు చేరుకోవాలని సూచన. 10:40 AM, 3rd June, 2024వైఎస్సార్‌సీపీదే విజయం: అబ్బయ్య చౌదరిఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి కామెంట్స్‌ఎగ్జిట్‌పోల్స్‌ సర్వేలన్నీ వైఎస్సార్‌సీపీదే విజయమని తేల్చేశాయి. సంబరాలు చేసుకునేంటుకు వైఎస్సార్‌సీపీ శ్రేణులన్నీ సిద్ధంగా ఉండాలి. జూన్ 4న సాయంత్రానికి జగనన్న 2.O సిద్ధం!ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ వైయస్‌ఆర్‌సీపీదే విజయమని ఇప్పటికే తేల్చేశాయి-ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి#YSRCPWinningBig#YSJaganAgain#ExitPoll pic.twitter.com/8osnnXHvSf— YSR Congress Party (@YSRCParty) June 3, 2024 10:15 AM, 3rd June, 2024YSRCP పిటిషన్‌కు సుప్రీం గ్రీన్‌ సిగ్నల్‌నేడు సుప్రీంకోర్టులో ఏపీలో పోస్టల్ బ్యాలెట్ వివాదం కేసు విచారణవిచారణ జరుపనున్న జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనంజాబితాలో 44వ ఐటమ్ గా లిస్ట్ అయిన కేసురేపు కౌంటింగ్ నేపథ్యంలో సత్వరమే విచారణ చేపట్టాలని కోరిన వైఎస్ఆర్సిపీఆ అభ్యర్థనకు అంగీకరించి నేడే విచారణ జరపాలని నిర్ణయించిన సుప్రీంకోర్టుఏపీలో ఈసీ పోస్టల్ బ్యాలెట్ ఉత్తర్వులను సుప్రీం కోర్టులో సవాల్ చేసిన వైఎస్ఆర్సిపీ అధికారిక సీల్, హోదా లేకుండా స్పెసిమెన్ సిగ్నేచర్ తో పోస్టల్ బ్యాలెట్ ను ఆమోదించాలన్న ఈసీ ఉత్తర్వులను సుప్రీంలో సవాల్ చేసిన వైఎస్సార్‌సీపీఎన్నికల సంఘం ప్రస్తుతం అమల్లో ఉన్న నియమ, నిబంధనలే కొనసాగించాలని కోరిన వైఎస్సార్‌సీపీపోస్టల్ బ్యాలెట్ పై హైకోర్టు ఉత్తర్వులను కొట్టేయాలని పిటిషన్కేవలం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే సడలింపు ఉత్తర్వులు ఇవ్వడాన్ని ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ9:43 AM, 3rd June, 2024విజయవాడలో కౌంటింగ్‌కు సర్వం సిద్ధంవిజయవాడ పార్లామెంట్ పరిధిలో ఓట్ల లెక్కింపుకి సర్వం సిద్దంసాయంత్రం 5 గంటల లోపు కౌంటింగ్ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేలా ప్రణాళికఇబ్రహీంపట్నంలోని నోవా కళాశాలలో తిరువూరు, విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్, నందిగామ నియోజకవర్గాల కౌంటింగ్నిమ్రా కళాశాలలో విజయవాడ తూర్పు, మైలవరం, జగ్గయ్యపేట నియోజకవర్గాలకి కౌంటింగ్పోస్టల్ బ్యాలెట్, ఇవిఎం కౌంటింగ్ లకి ప్రత్యేక ఏర్పాట్లుఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రతీ రౌండ్ కి 14 టేబుళ్లు ఏర్పాటుఏడు అసెంబ్లీ, పార్లమెంట్ కి కలిపి 198 టేబుళ్లు ఏర్పాటు17596 పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుకి 14 టేబుళ్లు ఏర్పాటురెండు రౌండ్లలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయ్యేలా చర్యలుపోస్టల్‌ బ్యాలెట్ ఒక్కొక్క రౌండ్ లెక్కింపుకి మూడు గంటల సమయం పట్టే అవకాశంఈవీఎం ఒక్కొక్కరౌండ్ కి 25 నిమిషాల నుంచి అరగంట సమయం పడుతుందని అంచనాఏడు అసెంబ్లీలకి పోలింగ్ బూత్ ల ఆధారంగా 16 నుంచి 22 రౌండ్లలో లెక్కింపుకౌంటింగ్ కేంద్రాల లోపలికి మొబైల్ ఫోన్ లకి అనుమతి లేదుసీసీ టీవీ కెమెరాల నిఘాలో కౌంటింగ్ ప్రక్రియ8:30 AM, 3rd June, 2024నేడు సుప్రీంకోర్టు ముందుకు పోస్టల్‌ బ్యాలెట్‌ కేసు..ఢిల్లీ:నేడు సుప్రీంకోర్టు ముందుకు ఏపీలో పోస్టల్ బ్యాలెట్ వివాదం కేసుఏపీలో ఈసీ పోస్టల్ బ్యాలెట్ ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన వైఎస్సార్‌సీపీఅధికారిక సీల్, హోదా లేకుండా స్పెసిమెన్ సిగ్నేచర్‌తో పోస్టల్ బ్యాలెట్‌ను ఆమోదించాలన్నఈసీ ఉత్తర్వులను సుప్రీంలో సవాల్ చేసిన వైఎస్సార్‌సీపీనేడు త్వరగా విచారణ చేపట్టాలని మెన్షన్ చేయనున్న వైఎస్సార్‌సీపీ తరఫు న్యాయవాదిఎన్నికల సంఘం ప్రస్తుతం అమల్లో ఉన్న నియమ, నిబంధనలే కొనసాగించాలని కోరిన వైఎస్సార్‌సీపీపోస్టల్ బ్యాలెట్ పై హైకోర్టు ఉత్తర్వులను కొట్టేయాలని పిటిషన్కేవలం ఆంధ్రప్రదేశ్‌లోని ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వడాన్ని ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ 8:15 AM, 3rd June, 2024నేడు ఈసీ మీడియా సమావేశం..ఢిల్లీ:నేడు మ.12.30కు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశంరేపు దేశవ్యాప్తంగా కౌంటింగ్ నేపథ్యంలో సమావేశం 8:00 AM, 3rd June, 2024కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్‌ షురూ..ఏపీలో ఎన్నికల కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభంమరో 24 గంటల్లో కౌంటింగ్‌ ప్రారంభం కానుంది.కౌంటింగ్‌కు అధికారులు విస్తృత ఏర్పాట్లు.ముందుగా పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు.కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేసిన ఈసీసమస్యాత్మక ప్రాంతాలపై పోలీసుల ఫోకస్‌మాచర్ల, పల్నాడులో 144 సెక్షన్‌ఎన్నికల్లో ఘర్షణలకు పాల్పడిన వారిపై స్పెషల్‌ ఫోకస్‌ముందస్తు జాగ్రత్తగా పలు చోట్ల కర్ఫ్యూ విధించిన పోలీసులు మధ్యాహ్నం ఒంటి గంటకు సీఈవో ముఖేష్‌కుమార్‌ మీనా ప్రెస్‌మీట్‌నేడు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం అనంతలో కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తిఅనంతపురం:ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తిఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ రెండు పార్లమెంటు స్థానాలకు ఎన్నికలుఅనంతపురం, హిందూపురం ప్రాంతాల్లో మూడు కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులుకౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలు మోహరింపు144 సెక్షన్, 30 యాక్ట్ అమలుఆరు వేల మంది బైండోవర్400 మందిపై రౌడీషీట్లురేపు ఉదయం 8 గంటలకు ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం.. మధ్యాహ్నానికి ఫలితాలుతిరుపతిలో ఏర్పాట్లు పూర్తి..తిరుపతితిరుపతి పార్లమెంట్ స్థానంతోపాటు, జిల్లా ఏడు అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన జిల్లా ఎన్నికల అధికారులురేపు ఉదయం ఏడు గంటలకు స్ట్రాంగ్ రూమ్‌ను నలుగురు అబ్జర్వర్లు, పోటీలో ఉన్న అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్ల సమక్షంలో తెరుస్తారుఉదయం ఎనిమిది గంటకు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభం,8.30 నిమిషాలకు ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభంకౌంటింగ్ కేంద్రం వద్ద 164 సీసీ కెమెరాలు ఏర్పాటు, మూడు అంచెల భద్రత144 సెక్షన్ అమలులో ఉంది,2 కంపెనీలు సీఐఎస్‌ఎఫ్‌ బలగాలు జిల్లాకు కేటాయింపుకౌంటింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్ అనుమతి లేదుఎన్నికల ఫలితాలు తర్వాత ఎలాంటి ర్యాలీ, బాణాసంచా పేల్చరాదు ఏజెంట్లే కీలకంఉదయం 6 గంటలకే కౌంటింగ్‌ కేంద్రాలకు వెళ్లాలి ప్రభుత్వ గుర్తింపు కార్డు, ఏజెంట్‌ నియామక పత్రం ఉండాలి ఫారం 17 సీ తప్పకుండా వెంట తీసుకెళ్లాలి అభ్యంతరాలను కచ్చితంగా లిఖితపూర్వకంగా తెలిపిధ్రువీకరణ తీసుకోవాలి తుది ఫలితం ప్రకటించే దాకా హాల్‌ విడిచి వెళ్లకూడదు కౌంటింగ్‌ ప్రక్రియ మొత్తం రికార్డు ప్రత్యర్థులు కవ్వించినా సంయమనంతో వ్యవహరించాలి అవాంతరాలను ఉపేక్షించొద్దు: ముఖేష్‌కుమార్‌ మీనారాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా కామెంట్స్‌..ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఆటంకాలు కలిగించే వారిని నిర్దాక్షిణ్యంగా బయటకు పంపండిపోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు విషయంలో ఈసీఐ ఆదేశాలను పాటించండిఫలితాల ప్రకటనకు సంబంధించిన ఫారం–21సి/21ఇ లు మరుసటి రోజే ఈసీఐకి చేరాలి లెక్క ఏదైనా.. ‘ఫ్యాన్‌’ పక్కాఅసెంబ్లీ ఎన్నికలపై మెజార్టీ జాతీయ, రాష్ట్ర మీడియా సంస్థల ఎగ్జిట్‌ పోల్స్‌ స్పష్టీకరణదేశ వ్యాప్త యంత్రాంగం ఉన్న టైమ్స్, దైనిక్‌ భాస్కర్‌ గ్రూప్‌ల ఎగ్జిట్‌ పోల్స్‌దీ అదే మాట50 శాతం ఓట్లతో 14 లోక్‌సభ సీట్లు వైఎస్సార్‌సీపీవేనన్న టైమ్స్‌నౌ–ఈటీజీ రీసెర్చ్‌50 శాతం కంటే ఎక్కువ ఓట్లతో 15–17 లోక్‌సభ సీట్లు వైఎస్సార్‌సీపీ గెలుస్తుందన్న దైనిక్‌ భాస్కర్‌(డీబీ)రాష్ట్ర మీడియా, సెఫాలజిస్టులు, సర్వే సంస్థలు చేసిన 32 ఎగ్జిట్‌ పోల్స్‌లో 24 పోల్స్‌ వైఎస్సార్‌సీపీ వైపేబీజేపీ భజన చేసే ఇండియాటుడే గ్రూప్, ఎన్‌డీటీవీ, జీన్యూస్‌ల ఎగ్జిట్‌ పోల్స్‌లో మాత్రం భిన్నంగా వెల్లడి‘ఈనాడు’తో భాగస్వామ్యం ఉన్న సీఎన్‌ఎన్‌ న్యూస్‌–18 ఎగ్జిట్‌ పోల్స్‌దీ అదే దారి2021లో బెంగాల్లో, 2023లో రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో తప్పులో కాలేసిన ఇండియాటుడే ఎగ్జిట్‌పోల్స్‌తాజా ఎగ్జిట్‌పోల్స్‌లో కనీసం వైఎస్సార్‌సీపీ గుర్తును కూడా ఫ్యాన్‌కు బదులు చీపురుగా చూపిన సంస్థగుర్తు తెలియకుండా, క్షేత్రస్థాయి స్థితిగతులు తెలుసుకోకుండా చేసిన సర్వే అని చెబుతున్న పరిశీలకులుతాను ఏపీలో పర్యటించినప్పుడు సర్వేలో పేర్కొన్న పరిస్థితులు లేవని విభేదించిన జర్నలిస్టు రాజ్‌దీప్‌ మహిళలు, గ్రామీణ ఓటర్లు వైఎస్సార్‌సీపీవైపే ఉన్నారని అదే చానెల్లో సర్వే నిర్వాహకుడితో వ్యాఖ్యలుబీజేపీ నినాదమైన ‘400’ సీట్లకు ఆ పార్టీని తీసుకెళ్లటమే లక్ష్యంగా కొన్ని జాతీయ సంస్థల ఎగ్జిట్‌పోల్స్‌రాజస్థాన్, హిమాచల్, హరియాణాలో ఉన్న స్థానాల కంటే అధిక స్థానాల్లో ఎన్‌డీఏ గెలుస్తుందని వెల్లడిరాజధాని, స్కిల్‌ స్కామ్‌లో చంద్రబాబును అరెస్టు చేయడం వల్లే కూటమి గెలుస్తోందంటూ వ్యాఖ్యలుకానీ.. ఎన్నికల ప్రచారంలో ఏ పార్టీ కూడా రాజధాని అంశాన్ని ప్రధాన ప్రచార అస్త్రంగా చేసుకోని తీరుబాబును అరెస్టు చేసినప్పుడు రాష్ట్రంలో చిన్నపాటి బంద్‌లు, నిరసనలు కూడా జరిగిన దాఖలాల్లేవుహైదరాబాద్‌లో ‘ఐటీ గ్రూప్‌’ పేరిట కూపన్లిచ్చి మరీ నిరసన చేయించిన ఒక సామాజిక వర్గం వ్యక్తులువాస్తవానికి రాష్ట్రంలో అన్నివర్గాలకూ మేలు చేసే పాలనతో పటిష్ఠంగా నిలబడ్డ వైఎస్సార్‌సీపీతమ కుటుంబాలు బాగుపడ్డాయనే భావనతో ఆ పార్టీ వెనక అంతే బలంగా నిలబడ్డ ప్రజలుఇవన్నీ వైఎస్సార్‌సీపీని స్పష్టంగా విజయంవైపు తీసుకెళుతున్నాయని తేల్చిన సర్వే సంస్థలుసెఫాలజిస్టులపై బెదిరింపులకు దిగిన చంద్రబాబు, నారా లోకేశ్‌

CEC Rajiv Kumar Comments Over Election Counting Process
సీనియర్‌ సిటిజన్లు, మహిళలకు సెల్యూట్‌: ఈసీ

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం చరిత్రలోనే అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. ఓటర్లకు స్టాండింగ్‌ ఒవేషన్‌(లేచి చప్పట్లు కొట్టడం) ఇచ్చారు ఈసీ సభ్యులు. రేపు ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో ఇవాళ సీఈసీ రాజీవ్‌కుమార్‌ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా.. ‘దేశంలో జరిగిన ఎన్నికల్లో ఓటు వేసిన సీనియర్‌ సిటిజన్స్‌, మహిళలకు తాము సెల్యూట్‌ చేస్తున్నామని కేంద్రం ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్‌ కుమార్‌ చెప్పారు. ఈ క్రమంలో ప్రెస్‌మీట్‌లోనే ఆయన ఓటర్లకు స్టాండింగ్‌ ఓయేషన్‌ ఇచ్చారు. #WATCH | Delhi | Election Commission of India gives a standing ovation to all voters who took part in Lok Sabha elections 2024 pic.twitter.com/iwIfNd58LV— ANI (@ANI) June 3, 2024 ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో మొత్తం 642 మిలియన్ల ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏడు విడతలుగా పోలింగ్‌ విజయవంతంగా జరిగింది. రికార్డు స్థాయిలో ఓటర్లు ఓటు వేశారు. ఓటింగ్‌లో భారత్‌ వరల్డ్‌ రికార్డు సృష్టించింది. ప్రపంచంలోనే మన దేశంలో 31 కోట్ల మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మన దేశంలో ఓటేసిన వారి సంఖ్య.. జీ-7 దేశాల జనాభాకు ఒకటిన్నర రేట్లు ఎక్కువ. జమ్మూ కశ్మీర్‌లో నాలుగు దశాబ్ధాల్లో జరగనంత పోలింగ్‌ జరిగింది. #WATCH | Delhi | "This is one of the General Elections where we have not seen violence. This required two years of preparation," says CEC Rajiv Kumar on Lok Sabha elections. pic.twitter.com/HL8o0aQvAz— ANI (@ANI) June 3, 2024 పోలింగ్‌ సందర్భంగా ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్‌ ప్రశాంతంగా జరిగిందన్నారు. కేవలం రెండు రాష్ట్రా‍ల్లోనే 39 ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. అక్కడే రీపోలింగ్‌ అవసరముందన్నారు. 27 రాష్ట్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించాల్సిన అవసరం లేదన్నారు. మరోవైపు రేపు దేశవ్యాప్తంగా కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశామని, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని చెప్పారాయన.

YSRCP Suspended MLC Raghu Raju From party
ఎమ్మెల్సీ ఇందుకురి రఘురాజు పై అనర్హత వేటు

సాక్షి, అమరావతి: రాజకీయ ద్రోహానికి పాల్పడిన ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై అనర్హత వేటు పడింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీపై వైఎస్సార్‌సీపీ అనర్హత వేటు వేసింది. ఈ మేరకు సోమవారం శాసనమండలి చైర్మన్‌ మోషేన్‌ రాజు ఉత్తర్వులు జారీ చేశారు.లోకేశ్‌ సహా టీడీపీ నాయకులతో అంటకాగుతున్న రఘురాజు తెరచాటు, వెన్నుపోటు రాజకీయా గుట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టీడీపీతో కుమ్మకై ఎస్‌.కోటలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావును, విశాఖ లోక్‌సభ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మిని ఓడించేందుకు పన్నిన కుతంత్రాలు తేటతెల్లమయ్యాయి. ఈ నేపథ్యంలో రఘురాజుపై చర్యలు తీసుకోవాలని శాసనమండలిలో వైఎస్సార్‌సీపీ విప్‌ పాలవలస విక్రాంత్‌ ఇప్పటికే ఫిర్యాదు చేశారు. దీనిపై వివరణ ఇచ్చేందుకు ఈ నెల 27న రావాలని మండలి చైర్మన్‌ మోషేన్‌ రాజు తాఖీదులు పంపినా రఘురాజు డుమ్మా కొట్టేశారు. ఈనెల 31న ఆఖరిసారిగా మరో అవకాశం ఇవ్వగా విచారణ నుంచి తప్పించుకునేందుకు ఆసుపత్రి డ్రామా ఆడారు. ఈ క్రమంలో తాజాగా రఘురాజుపై సస్పెన్షన్‌ వేటు వేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది.

Dont Even Want To Watch The T20 WC: Riyan Parag Shocking Comments Viral
ఇలా అయితే.. టీమిండియాలో ఛాన్స్‌ రానేరాదు!

సూటిగా.. సుత్తి లేకుండా మాట్లాడటం తనకు అలవాటు అంటున్నాడు రాజస్తాన్‌ రాయల్స్‌ యువ క్రికెటర్‌ రియాన్‌ పరాగ్‌. టీ20 ప్రపంచకప్‌-2024కు ఎంపిక చేసిన జట్టులో తనకు స్థానం లేదని.. కాబట్టి మ్యాచ్‌లు చూసి సమయం వృథా చేసుకోవాల్సిన అవసరం తనకు లేదంటున్నాడు.కాగా అసోం ఆల్‌రౌండర్‌ రియాన్‌ పరాగ్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో గత ఐదేళ్లుగా రాజస్తాన్‌ ఫ్రాంఛైజీ తరఫున ఆడుతున్నాడు. క్యాష్‌రిచ్‌ లీగ్‌ కెరీర్‌ ఆరంభంలో సరిగ్గా ఆడకపోయినా మేనేజ్‌మెంట్‌ అతడికి వరుస అవకాశాలు ఇచ్చింది. అయినప్పటికీ సద్వినియోగం చేసుకోలేక విమర్శల పాలయ్యాడు.ఈ క్రమంలో ఒకానొక సమయంలో జట్టులో స్థానం కోల్పోయిన రియాన్‌ పరాగ్‌.. దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటి తనను తాను నిరూపించుకున్నాడు. అదే జోరును ఐపీఎల్‌-2024లోనూ కొనసాగించి.. విమర్శకులకు బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు.తాజా ఐపీఎల్‌ ఎడిషన్‌లో 14 ఇన్నింగ్స్‌ ఆడిన ఈ బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌.. ఏకంగా 573 పరుగులతో దుమ్ములేపాడు. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో విరాట్‌ కోహ్లి(741), రుతురాజ్‌ గైక్వాడ్‌(583) తర్వాతి స్థానంలో నిలిచాడు.ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్‌-2024 ద్వారా రియాన్‌ పరాగ్‌ టీమిండియా తరఫున అరంగేట్రం చేయడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, ఈ 22 ఏళ్ల బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ను సెలక్టర్లు పరగణనలోకి తీసుకోలేదు. అనుభవం లేని రియాన్‌ పరాగ్‌ను కనీసం స్టాండ్‌బై ప్లేయర్‌గా కూడా ఎంపిక చేయలేదు.ఈ నేపథ్యంలో రియాన్‌ పరాగ్‌ స్పందిస్తూ.. ఏదో ఒక రోజు సెలక్టర్లు తనను టీమిండియాకు ఎంపిక చేయక తప్పదని.. ఇది తాను అహంభావంతో కాకుండా ఆత్మవిశ్వాసంతో చెప్తున్నానంటూ ఇటీవల వ్యాఖ్యానించాడు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈసారి వరల్డ్‌కప్‌ టోర్నీని చూడాలనే ఆసక్తి తనకు ఏమాత్రం లేదంటూ కుండబద్దలు కొట్టాడు.టీమిండియాకు మద్దతుగా నిలిచే ‘భారత్‌ ఆర్మీ’తో రియాన్‌ మాట్లాడుతున్న క్రమంలో.. ఈసారి వరల్డ్‌కప్‌ సెమీ ఫైనలిస్టులు ఎవరు అనుకుంటున్నారనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వడం అంటే పక్షపాత ధోరణితో మాట్లాడినట్లే అవుతుంది.నిజానికి నేను ఈసారి అసలు వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ చూడాలనే అనుకోవడం లేదు. ఫైనల్లో ఎవరు గెలిచారు? ట్రోఫీ ఎవరు అందుకున్నారని మాత్రమే చూస్తాను. ఒకవేళ నేను ప్రపంచకప్‌ టోర్నీలో గనుక ఆడుతూ ఉన్నట్లయితే.. కచ్చితంగా ఈ టాప్‌-4 వగైరాల గురించి పట్టించుకునేవాడిని’’ అని రియాన్‌ పరాగ్‌ చెప్పుకొచ్చాడు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుండగా.. నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ‘‘రియాన్‌ పరాగ్‌ మరో ఇషాన్‌ కిషన్‌ లేదా శ్రేయస్‌ అయ్యర్‌ అవడం ఖాయం. ఇలాంటి ఆటిట్యూడ్‌ ఉంటే నీకు ఛాన్సులెలా వస్తాయి? ఓవరాక్షన్‌ స్టార్‌ అనే బిరుదు సార్థక​ం చేసుకోవాలని పట్టుదలగా ఉన్నావా ఏంటి?’’ అని విమర్శిస్తున్నారు.కాగా బీసీసీఐ ఆదేశాలను ధిక్కరించారనే కారణంతో ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌లను సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ నుంచి తప్పిస్తూ ఇటీవల బోర్డు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

harish rao fires on cm revanth reddy over formation day add
జై తెలంగాణ ఎక్కడ?.. సీఎం రేవంత్‌పై హరీష్‌రావు ఫైర్‌

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రానికి అత్యంత అవసరమని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించే గొంతుక అని తెలిపారు. సోమవారం హరీశ్‌రావు మీడియాతో మట్లాడారు. ‘రాష్ట్ర ప్రయోజనాల కాపాడాలంటే మాజీ సీఎం కేసీఆర్‌ శ్రీరామ రక్ష. ప్రభుత్వం ఇచ్చిన యాడ్‌లో జై తెలంగాణ పదం లేదు. తెలంగాణ హక్కులు కాపాడే పార్టీ బీఆర్ఎస్. రేవంత్ రెడ్డి ఏనాడూ జై తెలంగాణ అనలేదు. సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికీ తెలంగాణ ఉద్యమ కారుడు కాలేడు. రేవంత్ రెడ్డి ఉద్యమ ద్రోహి అవుతాడు తప్ప ఉద్యమ కారుడు కాదు. ఉద్యమం కోసం ఎన్నిసార్లు అయినా మేం జైలుకి వెళ్ళాం’ అని అన్నారు.

Today Gold and Silver Price [June 3, 2024]
పసిడి ప్రియులకు శుభవార్త!.. మళ్ళీ తగ్గిన బంగారం, వెండి ధరలు

జూన్ 1 నుంచి తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు.. ఈ రోజు (జూన్ 3) కూడా స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. కాబట్టి నేడు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.66100 (22 క్యారెట్స్), రూ.72110 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 400, రూ. 440 తగ్గాయి.చెన్నైలో కూడా బంగారం ధరలు రూ. 440 నుంచి రూ. 480 వరకు తగ్గాయి. కాబట్టి 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 66660 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 72720 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే.. నిన్నటి ధరల కంటే ఈ రోజు ధరలు కొంత తగ్గినట్లు స్పష్టంగా అర్థమవుతోంది.దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66250 (10 గ్రా), 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72260 (10 గ్రా) వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 400, రూ. 440 తగ్గినట్లు తెలుస్తోంది.వెండి ధరలుదేశంలో బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా గత నాలుగు రోజుల నుంచి తగ్గుతూనే ఉన్నాయి. ఈ రోజు ఒక కేజీ వెండి ధర రూ. 700 తగ్గింది. కాబట్టి రూ. 93500 వద్ద ఉన్న వెండి రూ. 92800లకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

Kalki 2898 AD Movie Team Send Bujji Toy to Ram Charan, Upasana Daughter Klin Kaara
ఉపాసన ఇంటికి చేరిన బుజ్జి.. క్లీంకార కోసం స్పెషల్‌ గిఫ్ట్‌

సలార్‌తో బాక్సాఫీస్‌ బద్దలు కొట్టిన ప్రభాస్‌.. కల్కి 2898 ఏడీ చిత్రంతో మరోసారి రికార్డులు తిరగరాసేందుకు సిద్ధమవుతున్నాడు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొణె, కమల్‌ హాసన్‌, దిశా పటానీ ముఖ్య పాత్రలు పోషించారు. జూన్ 27న ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.ఉపాసన ఇంటికి బుజ్జిఅయితే సినిమా రిలీజ్‌కు ముందే బుజ్జి అండ్‌ భైరవ అనే యానిమేషన్‌ సిరీస్‌ లాంచ్‌ చేశారు. ఇందులో బుజ్జి, భైరవ పాత్రలను పరిచయం చేశారు. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో రిలీజైన ఈ సిరీస్‌కు మంచి స్పందన లభిస్తోంది. తాజాగా బుజ్జి ఉపాసన ఇంటికి చేరింది. అదెలాగంటారా? కల్కి 2898 ఏడీ చిత్రయూనిట్‌ బుజ్జిని పోలి ఉన్న చిన్న బొమ్మను, పాత్రల స్టిక్కర్స్‌ను రామ్‌చరణ్‌- ఉపాసనల కూతురు క్లీంకారకు బహుమతిగా ఇచ్చింది. చిత్రయూనిట్‌కు థ్యాంక్స్‌వాటితో క్లీంకార ఆడుకుంటున్న ఫోటోను ఉప్సీ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేసింది. అయితే కూతురు ముఖం కనిపించకుండా ఆ ఫోటో తీసింది. తనకు ఈ బహుమతి పంపినందుకు హీరో ప్రభాస్‌, దర్శకుడు నాగ్‌ అశ్విన్‌, నిర్మాతలు స్వప్న దత్‌, ప్రింయాక దత్‌లకు కృతజ్ఞతలు తెలియజేసింది.చదవండి: Bujji And Bhairava Review: యానిమేటెడ్‌ సిరీస్‌ ఎలా ఉందంటే..

Study Said Rich People Are Genetically At Greater Risk Of Cancer
ఆ వ్యాధి ధనవంతులకే వస్తుందా?

ధనవంతులకే పెద్ద వ్యాధులు వస్తాయి అని పూర్వం అనుకునేవారు. డబ్బుతో వైద్యం కొనవచ్చునని, కావాల్సిన ఆహార పదార్థాలు తెప్పించుకు తినగలరని తద్వారా ఎలాంటి వ్యాధినైనా వారు తట్టుకోగలరని అంచనా. అలాగే కొన్ని రకాల వ్యాధులు వారికి మాత్రమే వస్తాయన్న అపోహ కూడా ఉండేది. కానీ ఇప్పుడూ శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో అదే నిజమని తేలింది. ముఖ్యంగా ప్రాణంతక వ్యాధి అయిన కేన్సర్‌ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఎవరికి అధికమో సవివరంగా వెల్లడించారు పరిశోధకులు. అవేంటో చూద్దామా..!ఫిన్లాండ్‌లోని హెల్సింకీ విశ్వవిద్యాలయం నిర్వంహించిన సరికొత్త అధ్యయనం ప్రకారం... మనకొచ్చే వ్యాధులకూ, సామాజిక, ఆర్థిక పరిస్థితికీ మధ‍్య సంబంధం ఉంది. మరీ ముఖ్యంగా కేన్సర్‌ విషయంలో. ఈ ప్రాణాంతక వ్యాధి పేదల కంటే సంపన్నులకు వచ్చే అవకాశాలు ఎక్కువని వీరు తేల్చారు. ముఖ్యంగా ధనవంతులలో రొమ్ము, ప్రొస్టేట్‌, వంటి ఇతర రకాల కేన్సర్‌ వచ్చే జన్యుపరమైన ప్రమాదం ఎక్కవగా ఉందని పరిశోధన పేర్కొంది. తక్కువ సంపాదన కలవారు డిప్రెషన్‌కి గురై ఆల్కహాల్‌కి బానిసవ్వడంతో ఊపిరితిత్తుల కేన్సర్‌ తోపాటు మధుమేహం, ఆర్థరైటిస్‌ల వంటి వ్యాధులు జన్యుపరంగా వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఎక్కువ ఆదాయాలు ఆర్జించే సంపన్న దేశాల్లో సర్వసాధారణంగా వచ్చే 19 వ్యాధుల గురించి పేర్కొంది. ఉన్నత విద్యావంతులైన మహిళల్లో రోమ్ము కేన్సర్‌కి సంబంధించిన జన్యు ప్రమాదం గురించి ముందుగానే వైద్యులని సంప్రదించడం, చికిత్స తీసుకోవడం వంటివి చేస్తారు. ముఖ్యంగా తక్కువ జన్యు ప్రమాదం లేదా తక్కువ విద్య ఉన్న మహిళలు కంటే వీరే అధికంగా ఆస్పత్రులను సందర్శించడం జరుగుతుందని పరిశోధన పేర్కొంది. అందుకోసం శాస్త్రవేత్తల బృందం సుమారు 80 ఏళ్ల వయసుగల దాదాపు రెండు లక్షలకు పైగా ఫిన్లాండ్‌ పౌరుల ఆరోగ్య డేటాని సేకరించారు. దానిలో వారి సామాజిక పరిస్థితితో లింక్‌అప్‌ అయ్యి ఉన్న జన్యుసంబంధాన్ని ట్రాక్‌ చేశారు. అయితే ఇలా వ్యాధుల వచ్చే ప్రమాదం జెండర్‌ పరంగా చూస్తే ఆడ, మగలో మద్య చాలా తేడా ఉందని, ఇది వారి వయసు మీద ఆధారపడి ఉంటుందని డాక్టర్‌ హగెన్‌ బీక్‌ చెప్పారు. ఇక్కడ వ్యాధి ప్రమాదానికి సంబధించిన జన్యు అంచనా అనేది సామాజిక ఆర్థిక నేపథ్యంపై ఆధారపడి ఉంటుందని పరిశోధనలో వెల్లడయ్యింది. ఇక్కడ ఒక వ్యక్తిలో జన్యు సమాచారం అనేది జీవితకాలంలో మారదు. వయసు రీత్యా లేదా పరిస్థితులు మారినప్పుడూ వచ్చే వ్యాధుల ప్రమాదం కారణంగా జన్యుప్రభావం మారుతుందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఒక నిర్థిష్ట వృత్తితో లింక్‌ అయ్యే వ్యాధి ప్రమాదాల గురించి అర్థం చేసుకోవడానికి వివిధ​ పరిశోధనలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు.(చదవండి: ఎద్దులు కాపలాకాస్తున్న సమాధి..ఏకంగా రెండువేల..!)

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement