Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

మధ్యాహ్నం 12 గంటలకు.. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో నిర్వహించిన సీఎం జగన్‌ ఎన్నికల ప్రచార సభకు మండుటెండను సైతం లెక్కచేయకుండా హాజరైన అశేష జనసందోహంలో ఓ భాగం
మీ భూమికి భద్రత.. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై బాబు దుష్ప్రచారం: సీఎం జగన్‌

సాక్షి, పుట్టపర్తి: ‘చంద్రబాబునాయుడు అవగాహన రాహిత్యంతో ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై అబద్ధాలు వల్లించడం సిగ్గుచేటు. జగన్‌ భూములు లాక్కుంటున్నాడంటూ దుష్ప్రచారం చేయడం ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. పేదలకు భూములిచ్చేది జగన్‌ అయితే.. లాక్కునేది చంద్రబాబు అనే విషయం అందరికీ తెలుసు. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌తో రైతులు ఎవరి చుట్టూ తిరగాల్సిన పని ఉండదు. భూ తగాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు వందేళ్ల తర్వాత భూముల రీ సర్వే చేపట్టాం. రైతుల భూముల భద్రతకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. ఎలాంటి వివాదం లేని టైటిల్స్‌ ప్రతి ఒక్కరి దగ్గరా ఉండాలన్నదే మీ బిడ్డ లక్ష్యం. అందుకనే టైటిల్‌ ఇన్సూరెన్స్‌ కూడా చేస్తున్నాం. రిజిస్ట్రేషన్‌ తర్వాత రైతులకే డాక్యుమెంట్లు అందజేస్తాం. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై అవగాహన లేకుండా చంద్రబాబు మాట్లాడటం దుర్మార్గం’ అని ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం శ్రీసత్య­సాయి జిల్లా హిందూపురంలోని అంబేడ్కర్‌ సర్కిల్‌­లో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్‌ మాట్లాడుతూ ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై ప్రచారంలో ఉన్న అపోహలను తొలగిస్తూ స్పష్టతనిచ్చారు.రిజిస్ట్రేషన్లపైనా చంద్రబాబు బురదరిజిస్ట్రేషన్లకు సంబంధించి కూడా చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్లు చేసేటప్పుడు ఫిజికల్‌ డాక్యుమెంట్లు ఇవ్వడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అయ్యా చంద్రబాబూ..! ఇప్పటివరకు ఏకంగా 9 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి. దేశ­వ్యాప్తంగా అమల­వుతున్న కార్డ్‌ 2 సాఫ్ట్‌వేర్‌ ద్వారా తొమ్మిది లక్షల రిజిస్ట్రేషన్లు చేయడమే కాకుండా ఆ తర్వాత డాక్యుమెంట్లు అన్నీ భూ యజ­మా­నులకే ఇచ్చాం.  దీన్ని మరింత సులభతరం చేస్తూ.. ఏ ఒక్కరికీ సమస్య ఉండకూడదని, పత్రాలు రాసుకునే­టప్పుడు తప్పులు ఉండకూడదని ఆ ఫార్మాట్‌ కూడా ఆన్‌లైన్‌లో అందు­బా­టులో ఉంచాం. ఎవరైనా అమ్మాలను­కున్నా, కొనాలనుకున్నా ఆ ఫార్మాట్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని వివరాలు నింపి డాక్యు­మెంట్లతో వెళితే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాల­యం­లో వేలి ముద్రలు లాంటి మిగతా ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్‌ పూర్తి అయిన తర్వాత ఫిజికల్‌ డాక్యుమెంట్లు రైతులకే ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతోందని చంద్రబాబు తెలుసుకోవాలి.  పెద్ద సంస్కరణ అవుతుంది..ఎన్నికల వేళ చంద్రబాబు యథేచ్ఛగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై అవగాహన లేకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. టీడీపీ నాయకులు ఐవీఆర్‌ఎస్‌ ద్వారా మీ ఇళ్లకు ఫోన్లు చేసి మీ భూములన్నీ జగన్‌ లాక్కుంటాడంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. ఇంత దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు అసలు మనిషేనా? మీ జగన్‌ భూములిచ్చేవాడే కానీ భూములు లాక్కునే వాడు కాదు. నీకు ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ అంటే తెలుసా చంద్రబాబూ? ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ అంటే భూముల మీద సంపూర్ణ హక్కులు ఎల్లవేళలా రైతన్నలకు ఉండేటట్లు చేయడమే. చంద్రబాబు అవగాహన లేకుండా మాట్లాడుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ యాక్ట్‌ రాబోయే రోజుల్లో పెద్ద సంస్కరణ అవుతుంది. ఈరోజు ఎక్కడ భూమి కొనుగోలు చేయాలన్నా వివాదాలు తలెత్తుతు­న్నాయి. విస్తీర్ణం తక్కువ ఉండటం, సబ్‌ డివి­జన్,  సర్వే జరగకపోవడం, రికార్డులు అప్‌డేట్‌ కాకపోవడం తదితర సమస్యలు ఉత్పన్నమవు­తున్నాయి. వీటన్నింటి కారణంగా భూ వివాదాలు పెరిగి రైతన్నలు, ప్రజలు కోర్టులు, అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.వివాదాలు లేకుండా.. టైటిల్‌ ఇన్సూరెన్స్‌రాబోయే రోజుల్లో ఏ రైతూ, ఏ ఒక్కరూ వాళ్ల భూములు కోసం ఎవరి చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండకూడదు. భూ వివాదాలకు సంబంధించి ఏ కోర్టుకూ వెళ్లాల్సిన అవసరం రాకూడదు. ఆ భూముల మీద వారికి సంపూ­ర్ణ హక్కులు కల్పిస్తూ వాటిపై ఏవైనా వివాదాలు ఉంటే ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది. ఆ భూముల మీద ఎలాంటి వివాదం లేదని గ్యారంటీ ఇస్తూ ఒక సంస్కరణ తేవాలన్నదే మీ జగన్‌ ఆలోచన. అందుకనే టైటిల్‌ ఇన్సూరెన్స్‌ కూడా చేస్తున్నాం. ఎలాంటి వివాదం లేని టైటిల్స్‌ ప్రతి ఒక్కరి దగ్గరా ఉండాలన్నదే మీ బిడ్డ లక్ష్యం. కానీ ఇది జరగాలంటే మొదట రాష్ట్రవ్యాప్తంగా జరుగు­తున్న సర్వే పూర్తి కావాలి. దేశంలో వందేళ్ల క్రితం ఆంగ్లేయుల హయాంలో భూముల సర్వే చేశారు. రైతుల కోసం ఈ రోజు మళ్లీ ప్రతి ఎకరా రీ సర్వే చేస్తున్నాం. 15 వేల మంది సర్వేయర్లను నియమించాం. ఉచితంగా సరిహద్దు రాళ్లను నాటి రికార్డులన్నీ అప్‌డేట్‌ చేస్తున్నాం. సబ్‌ డివిజన్‌ చేసి ఆ హక్కు పత్రా­లను పదిలంగా రైతన్నలకు అంద­చేస్తున్నాం. రాష్ట్రంలో 17 వేలకు పైగా రెవెన్యూ గ్రామాలకు­గానూ ఇప్పటివరకు 6 వేల రెవెన్యూ గ్రామాల్లో సర్వే పూర్తయ్యింది. మిగతా చోట్ల ఒకటిన్నర, రెండేళ్లలో సర్వే పూర్తవుతుంది. 

Sakshi Editorial On Andhra Pradesh Politics by Vardhelli Murali
తోడేళ్ళను తరిమే రోజు!

ఒక్కసారి మనం డెబ్బయ్యేళ్లు వెనక్కు వెళ్లాలి. వర్తమాన ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు మనల్ని ఆ జ్ఞాపకం వైపు బలవంతంగా నెడుతున్నాయి. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి 1953లో ఆంధ్ర రాష్ట్రం విడిపోయింది. తెలంగాణతో కలిసి ఇంకా ఆంధ్ర ప్రదేశ్‌గా అవతరించకముందు 1955లో శాసనసభకు మధ్యంతర ఎన్నికలు జరిగాయి. నాటి ఆంధ్ర రాష్ట్రం, నేటి ఆంధ్ర ప్రదేశ్‌ల భౌగోళిక స్వరూపం ఒక్కటే!ఆ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో కమ్యూనిస్టుల ప్రభంజనం కనిపించింది. అప్పటిదాకా ప్రపంచంలో ఎక్కడా కూడా కమ్యూనిస్టులు బ్యాలెట్‌ ద్వారా అధికారంలోకి వచ్చిన ఉదంతాలు లేవు. ఆ విషయంలో ఆంధ్ర రాష్ట్రం రికార్డు సృష్టించ బోతున్నదనే అంచనాలు వెలువడ్డాయి. ముఖ్యమంత్రిగా సుందరయ్య, హోంమంత్రిగా చండ్ర రాజేశ్వరరావు, ఆర్థిక మంత్రిగా మాకినేని బసవపున్నయ్య వగైరా పేర్లతో కేబినెట్‌ కూర్పుపై కూడా ప్రచారం జరిగింది. సరిగ్గా ఈ దశలోనే పెత్తందారీ ముఠా, వారి అజమాయిషీలోని మీడియా రంగప్రవేశం చేశాయి.అప్పట్లో దున్నేవానికే భూమి అనేది కమ్యూనిస్టుల నినాదం. ఆ మేరకు భూసంస్కరణలు అమలు చేస్తామని వారు వాగ్దానం చేశారు. ఇది చాలు పెత్తందార్లకు! వారి చేతుల్లో వున్న ‘ఆంధ్రపత్రిక’, ‘ఆంధ్రప్రభ’ వంటి ఆనాటి ప్రముఖ పత్రికలు ఆయుధాలు బయటకు తీశాయి. కమ్యూనిస్టులు గెలిస్తే రైతుల భూములను లాక్కుంటారు. కమ్యూనిస్టులు గెలిస్తే ప్రజల ఇళ్లలో ఉన్న డబ్బును, బంగారాన్ని ఎత్తుకుపోతారు. వృద్ధులు పని చేయలేరు కనుక వారిని ప్రత్యేక క్యాంపుల్లో పెడతారు లేదా చంపేస్తారు. రష్యాలో, చైనాలో ఇలాగే చేస్తున్నారు. చివరికి మీ భార్యల్ని కూడా జాతీయం చేస్తారు. కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్న మవుతుంది... ఈ రకమైన అభాండాలను అచ్చేసి అడ్డగోలుగా ప్రచారంలో పెట్టారు.ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేంత పబ్లిసిటీ దన్ను ఆనాడు కమ్యూనిస్టులకు లేదు. వాళ్లకున్నది ‘విశాలాంధ్ర’ ఒక్కటే. పార్టీ ముద్ర కారణంగా దానికీ పరిమితులున్నాయి. ఇటువంటి నిస్సహాయ స్థితిలోనే మహాకవి శ్రీశ్రీ గుండెలోంచి తన్నుకొచ్చిన ఆక్రోశం చాలామందికి గుర్తున్నది. ‘పెట్టుబడికీ కట్టుకథకూ పుట్టిన విషపుత్రిక ఆంధ్రపత్రిక’ అని ఈసడించుకున్నారు. నాటి ‘ఆంధ్రపత్రిక’,  ‘ఆంధ్రప్రభ’ల అరాచకాన్ని ఒక లక్షతో హెచ్చ వేస్తే నేటి ‘ఈనాడు’, ‘ఆంధ్రజ్యోతి’, ‘టీవీ5’, ‘ఏబీఎన్‌’, ‘ఈటీవీ’ల అరాచకం విలువెంతో తెలుస్తుంది. ఆ ప్రత్యేక సందర్భం తర్వాత∙నాటి పత్రికలు మళ్లీ తటస్థ స్థితికి చేరు కున్నాయి. కానీ మన యెల్లో మీడియా మాత్రం గత పదేళ్లుగా ఆదే యజ్ఞంలో తలమునకలై ఉన్నది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని పెత్తందారీ వర్గాల ప్రతినిధిగా, ప్రయోక్తగా, ప్రవక్తగా గడిచిన మూడు దశాబ్దాల్లో చంద్రబాబు ఇంతింతై అన్నట్టుగా ఇనుమడించడం మనకు తెలిసిన సంగతే. ఇదే కాలంలో మన యెల్లో మీడియా చంద్రబాబు తరఫున గ్రామ సింహాల పాత్రను పోషిస్తే, బదులుగా ఆయన వారికి సెక్యూరిటీ గార్డు పాత్రను పోషిస్తూ వస్తున్నారు. ఈ ముప్ప య్యేళ్లలో పధ్నాలుగేళ్లపాటు బాబు ముఖ్యమంత్రి పాత్రను పోషించారు. ఆయనకు వాలతుల్యుడనదగ్గ కిరణ్‌కుమార్‌ రెడ్డి కాంగ్రెస్‌ తరఫున నాలుగేళ్లు గద్దె మీద కూర్చున్నారు. రాష్ట్రంలోని పేదల అభ్యున్నతి కోసం, సాధికారత కోసం అమలైన కార్య క్రమాలన్నీ వీరి కాలం మినహా మిగిలిన సమయంలోనే జరగడం ఎవరైనా గమనించవచ్చు.ప్రజలందరికీ విద్య, వైద్యసేవలు అందజేయడం ప్రభుత్వ బాధ్యతగా నాగరిక సమాజం గుర్తిస్తున్నది. ఆ రంగాల్లో సేవలు ప్రభుత్వం బాధ్యత కాదని బాహాటంగా ప్రకటించి, వాటిని ప్రైవేట్‌ కార్పొరేట్‌ శక్తులకు నర్తనశాలగా మార్చిన అనాగరిక రాజకీయవేత్త చంద్రబాబు. ఫలితంగా ప్రభుత్వ బడులు కునారిల్లిపోయాయి. పేదలు, మధ్యతరగతి ప్రజలు తమ పిల్లల్ని ప్రైవేట్‌ బడులకు పంపి అప్పులపాలయ్యారు. నిరు పేదల బిడ్డలు చదువుకు దూరమయ్యారు. ఒక తరం పేద, మధ్యతరగతి వర్గాల కలలను కాటేసిన చరిత్ర చంద్రబాబుది. అలాగే ప్రైవేట్‌ వైద్యసేవల బలిపీఠాన్నెక్కి లక్షలాది కుటుంబాలు కృశించి, నశించిపోయాయి.వ్యవసాయం దండగనేది ఆయన చేసిన ఒక క్రూర పరిహాసం. ఫలితంగా రైతులు పిట్టల్లా రాలిపోవడం బాబు జమానాలోనే ప్రారంభమైంది. కల్తీ ఎరువులు, కల్తీ విత్తనాలు, నకిలీ మందులకు వ్యవసాయం వేదికైంది. రైతులను భూముల నుంచి వెళ్లగొట్టి వేల ఎకరాల భూములను కార్పొరేట్‌ శక్తులకు కైంకర్యం చేసే విధానాలను బాబు అవలంబించారు. ఈ క్రమంలోనే ఫిలిం సిటీ పేరుతో రామోజీ దాదాపు మూడువేల ఎకరాలు పోగేశారు. అన్నిరకాల భూచట్టాలూ రామోజీ భూదాహం ముందు చట్టుబండలయ్యాయి. వేలాది ఎకరాల్లో వ్యవసా యాన్ని అటకెక్కించి కార్పొరేట్‌ సంస్థలు కంచెలు వేసు కున్నాయి. పేదల జీవితాలను కాల్చుకుతింటున్న చంద్ర బాబులో పచ్చమీడియాకు ఓ విజనరీ కనిపించాడు.ఐదేళ్ల  కింద ఆంధ్రప్రదేశ్‌లో ఒక తేడా వచ్చింది. చంద్రబాబుకూ, యెల్లో మీడియాకూ అది చిన్న తేడా ఏమీ కాదు. యెల్లో ‘విజనరీ’ విధానాలను కొత్త ముఖ్య మంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తలకిందులు చేశారు. ప్రజలిచ్చిన అధికారం గుప్పెడుమంది పెత్తందార్ల కోసం కాదు, పురోగ మనం కోసం పోరాడుతున్న విశాల ప్రజానీకం కోసం అనేది ఆయన విధానం. జగన్‌మోహన్‌రెడ్డి విధానాలకు, మన పెత్తందారీ ఏజెంట్ల విధానాలకు ఘర్షణ ఏర్పడింది. పెత్తందార్ల కూటమి జగన్‌ ప్రభుత్వంపై యుద్ధాన్ని ప్రకటించింది. జగన్‌ ప్రభుత్వ విధానాల వల్ల ఊపిరి పీల్చుకున్న పేదవర్గాల ప్రజలు ఆయన వెనుక సైన్యంగా మోహరించారు. పేదలు – పెత్తందార్ల మధ్య మహాయుద్ధానికి ముహూర్తం ఖాయమైంది.ఈ అయిదేళ్ల కాలంలో జగన్‌ ప్రభుత్వంపై యెల్లో మీడియా సాగించిన దుష్ప్రచారం అన్ని రికార్డులనూ  బద్దలు కొట్టింది. గోబెల్స్‌ బతికి వుంటే సిగ్గుపడి ఉండేవాడు. శ్రీశ్రీ బతికి ఉంటే ఏమని కామెంట్‌ చేసేవాడో ఊహించుకోవలసిందే. తిమ్మిని బమ్మిగా, బమ్మిని తిమ్మిగా ప్రచారం చేయని రోజు ఈ అయిదే ళ్లలో ఒక్కటీ లేదు. అయినా ప్రజాభిప్రాయాన్ని యెల్లో మీడియా పెద్దగా ప్రభావితం చేయలేకపోతున్నది. దీంతో వారిలో నిస్పృహ ఆవరించింది. అన్ని విలువల్నీ వదిలేశారు. వస్త్రవిసర్జన చేసి దిగంబర వీధినర్తనం మొదలుపెట్టారు. పోలింగ్‌ పది రోజులుందనగా తయారుచేసిన రెండు వింత కథల మీద ప్రాణం పెట్టుకుని పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టారు. ఇందులో మొదటిది ఏమాత్రం క్రియేటివిటీ లేకుండా అల్లిన ఓ కట్టుకథ. ‘మీ భూమి మీది కాదు’ అనే పేరుతో ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ ‘బాధితుల’ కథనాలను ‘ఈనాడు’ అచ్చేసింది. చట్టం పేరులోనే దాని ప్రాముఖ్యత ఉన్నది. భూమిపై రైతుకున్న యాజమాన్య హక్కును గుర్తిస్తూ ప్రభుత్వం హామీ పడి ధ్రువీకరించే చట్టం. ఒకసారి ఈ చట్టం అమలులోకి వస్తే భూ వివాదాలు శాశ్వతంగా పరిష్కారమవుతాయి. దొంగ కాగితాలు సృష్టించి రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లిస్తే చార్మినార్‌కు కూడా సేల్‌ డీడ్‌ ఇచ్చే అధ్వాన్నమైన పరిస్థితులు ఎన్నిసార్లు ఎదురు కావడం లేదు? నకిలీ డాక్యుమెంట్లతో బ్యాంకులను కొల్లగొట్టే దళారీల వృత్తాంతాలు ఎన్ని బయటకు రావడంలేదు? ఎన్ని వేల భూతగాదాలు కోర్టు వ్యాజ్యాల్లో దశాబ్దాల తరబడి నలిగి పోవడం లేదు? గొడవలతో ఎంత రక్తం పారి ఉంటుంది? ఎన్ని హత్యలు జరిగి ఉంటాయి? ఇదిగో ఇటువంటి వివాదాలను పరిష్కరించే సమగ్ర హక్కులను యజమానికి కల్పించి, అందుకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేదే ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌. ఇందులో భాగంగా మొదట భూముల సమగ్ర సర్వే జరుగుతోంది. గ్రామ ప్రజల సమక్షంలో సరిహద్దులను నిర్ధారించి రైతుకు పాస్‌బుక్‌ ఇవ్వడం జరుగుతుంది. వందేళ్ల తర్వాత సర్వే జరిపి యాజమాన్య హక్కును గుర్తిస్తూ ప్రభుత్వం ఇస్తున్న పాస్‌బుక్‌ ఇది. ఆ హక్కుకు ప్రభుత్వం ఇస్తున్న గ్యారంటీకి గుర్తుగా సర్వే జరిగిన కాలపు ప్రభుత్వాధినేతగా ముఖ్యమంత్రి ఫోటోను కూడా పాస్‌బుక్‌పై ముద్రిస్తున్నారు. దీన్ని కూడా టీడీపీ – యెల్లో మీడియా వివాదం చేయడం చూస్తున్నాము.అన్ని గ్రామాల్లో సర్వే పూర్తిగా జరిగిన తర్వాత చట్టం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేసి, వాటిపై గ్రామసభల్లో చర్చలు జరిగిన తర్వాత తుది మార్గదర్శకాలు జారీ అవుతాయి. ఆ తర్వాతనే చట్టం అమల్లోకి వస్తుంది.ఇదంతా జరగడానికి ఇంకో ఏడాది పట్టవచ్చు. రెండేళ్లు పట్టవచ్చు. కేంద్ర ప్రభుత్వంలోని ‘నీతి ఆయోగ్‌’ సూచనలకు అనుగుణంగా ఈ చట్టం రూపకల్పన జరుగుతున్నది. అన్ని రాష్ట్రాల్లోనూ భూయజమానికి మేలు చేసే ఈ చట్టం వచ్చి తీరుతుంది. కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ను ముందుకు కదిలించింది. దీన్ని వ్యతిరేకిస్తున్న యెల్లో కూటమి పార్టీ ఎన్డీఏలో భాగంగా ఉన్నది. కానీ ఇంత వరకు ఈ చట్టంపై తమ అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వంతో ప్రస్తావించకపోవడం తెలుగుదేశం అవకాశవాద వైఖరికి పరాకాష్ఠ. పచ్చమీడియా కూడా ఈ చట్టంపై ఒక్క మాటయినా కేంద్రం ప్రస్తావన చేయకపోవడం వెనకనున్న రహస్యమేమిటి?ఇక శనివారం నాడు ‘ఈనాడు’ రాసిన ‘మీ భూమి మీది కాదు’ అనే కల్పిత కథ జర్నలిజం ప్రమాణాలను పాతాళంలోకి తొక్కేసింది. ఇందులో ముగ్గురు బాధితుల పేర్లు రాశారు.అందులో అమలాపురం సుబ్బారావు ఒకరు. ఆయన భూమి ఎక్కడో చెప్పలేదు. సర్వే నెంబర్‌ తెలియదు. ఆయన భూమి తనదంటూ ఎవరో అధికారులకు దరఖాస్తు చేసుకున్నారట! ఆయనెవరో చెప్పలేదు. ఎవరికి దరఖాస్తు చేశాడో చెప్పలేదు. రెండేళ్ల తర్వాత సుబ్బారావు స్పందించలేదంటూ దరఖాస్తు చేసుకున్న వారి పేరు మీద భూమిని రాసేశారట! ఇదంతా ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం మహత్యమట. అమల్లోకే రాని చట్టం రెండేళ్ల కిందనే పనిచేయడం ప్రారంభించిందని ‘ఈనాడు’ ఉవాచ!ఇక సాంబశివుడిది శ్రీకాకుళం జిల్లాలోని ఒక పల్లెనట! ఈ పల్లె పేరు చెబితే రామోజీ తల వెయ్యి ముక్కలవుతుంది కాబోలు. చెప్పలేదు! ఆయన భూమిని అమ్మడానికి వెళితే, ‘కొత్త రిజిస్టర్‌లో నీ పేరు లేద’ని అధికారులు చెప్పారట. అసలటు వంటి కొత్త రిజిస్టరు తమ దగ్గర ఏదీ లేదని అధికారులు ప్రకటించారు. గోవిందరెడ్డిది కర్నూలు జిల్లా. ఏ ఊరో చెప్పలేదు. ‘ఈనాడు’ ఆంధ్రా ఎడిషన్‌లోనే ఆయన గోవిందరెడ్డి. తెలంగాణ ఎడిషన్‌లో మాత్రం గోవిందయ్య. అంటే తెలంగాణకు వెళ్లిన ప్పుడల్లా ఆయన కులం తోకను కత్తిరించుకుంటాడు కాబోలు. ఆయన తన భూమిని తనఖా పెట్టాలనుకున్నాడట! బ్యాంకులో ఉండే డిస్ప్యూట్‌ రిజిస్టర్‌లో ఆయన పేరు ఉన్నదట! టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ దగ్గర క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ తెమ్మని బ్యాంకు వారు చెప్పారట. దాంతో గోవిందరెడ్డి ఉరఫ్‌ గోవిందయ్య ఆంధ్రాలో ఒకసారి, తెలంగాణలో ఒకసారి గొల్లుమన్నాడట! అసలు టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ అనే పోస్ట్‌ అమల్లోకే రాలేదు. డిస్ప్యూట్‌ రిజిస్టరూ లేదు. చదివేవాడు వెర్రి వాడయితే... రాసేవాడు రామోజీ!పెన్షన్ల వ్యవహారంపై తెలుగుదేశం – యెల్లో మీడియాలు నడిపిస్తున్న వ్యవహారంలో మరో వింతకథ. వలంటీర్‌ వ్యవస్థకే ఈ పెత్తందార్లు వ్యతిరేకం. తమ వ్యతిరేకతను వాళ్లు దాచుకోనూ లేదు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను రాష్ట్ర ప్రజలు గమనించారు. ఇంటి దగ్గరే ఒకటో తారీఖు పొద్దున్నే వలంటీర్లు గత ఐదేళ్లుగా పింఛన్లు అంద జేస్తున్నారు. దాంతో అవ్వాతాతలు, దివ్యాంగులు భరోసాతో బతుకుతున్నారు. వలంటీర్లు విధుల్లో పాల్గొనకుండా చూడాలని తెలుగుదేశం పార్టీ తరఫున వారి ఏజెంటు నిమ్మగడ్డ రమేశ్‌ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనికి యెల్లో మీడియా వంత పాడింది. దాంతో వలంటీర్లు పెన్షన్లు ఇవ్వకూడదని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది.ఈసీ సూచనల మేరకు ఏప్రిల్‌లో విలేజ్‌ సెక్రటేరియట్‌లలో పెన్షన్లు అందజేశారు. దీనిపై వృద్ధుల్లో వ్యతిరేకత వచ్చింది. గాభరాపడ్డ తెలుగుదేశం బృందం మళ్లీ నిమ్మగడ్డను పంపించి బ్యాంకు ఖాతాల్లో జమ చేయించాలని ఈసీకి దరఖాస్తు పెట్టారు. ఈసీ సూచనలకు అనుగుణంగా మే నెలలో బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్‌ చేశారు. ఇక వృద్ధుల బాధలు వర్ణనాతీతం. వారి శాపనార్థాలతో కంగారు పడిన యెల్లో ముఠా వృద్ధుల బాధలకు జగన్‌ ప్రభుత్వమే కారణమనే విష ప్రచారాన్ని మొదలుపెట్టింది. దొంగతనం చేసినవాడే ‘దొంగా దొంగా’ అని అరిచినట్టు! జగన్‌మోహన్‌రెడ్డి సభలకు మండుటెండల్లో కూడా వెల్లువెత్తుతున్న జనప్రవాహంతో కూటమి వణికిపోతున్నది. ఈ రెండు అంశాలపై అబద్ధాలను ప్రచారం చేసి గట్టెక్కాలన్న దింపుడు కల్లం ఆశ దానిలో కనిపిస్తున్నది.ఇంకో వారం రోజుల్లో పోలింగ్‌ జరగబోతున్నది. ఇది పేద వర్గాలకు అందివచ్చిన అద్భుతమైన అవకాశం. పేద బిడ్డల ఇంగ్లిష్‌ మీడియంను వ్యతిరేకిస్తున్న, వారి నాణ్యమైన చదువు లను వ్యతిరేకిస్తున్న పెత్తందార్లను చావచితక్కొట్టడానికి ఇదో అవకాశం. పేదల సాధికారతను, మహిళల సాధికారతను సహించలేకపోతున్న పెత్తందార్లను పరుగెత్తించడానికి ఇంకో వారం రోజుల్లో అమూల్యమైన అవకాశం ఉన్నది. బలహీన వర్గాలకు ఉన్నత పదవులు ఇస్తే, ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యే టిక్కెట్లు, ఎంపీ టిక్కెట్లు కేటాయిస్తే ఓర్వలేకపోతున్న పెత్తందార్లకు బుద్ధి చెప్పడానికి ఇదో గొప్ప అవకాశం. అబద్ధాలనూ, అభూత కల్పనలనూ, కట్టుకథలనూ ప్రచారంలో పెడుతూ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమే గాక సమాజంలో అశాంతిని రేకెత్తి స్తున్న పెత్తందారీ తోడేళ్లను తరిమి తరిమి కొట్టడానికి ఇంతకంటే మంచి అవకాశం ఏముంటుంది?వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com

AP Politics And Election Live Updates On May 5th
AP Election Updates May 5th: ఏపీ ఎన్నికల అప్‌డేట్స్‌

Andhra Pradesh Election Updates 5th May...10:59 AM, May 5th, 2024ల్యాండ్ టైట్లింగ్‌ యాక్ట్‌పై బాబు, పవన్ విష ప్రచారం: ఎమ్మెల్యే మల్లాది విష్ణుప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారుఐవీఆర్ఎల్ సర్వేలో తప్పుడు ప్రచారం చేస్తున్నారుమా ఫిర్యాదు పై ఈసీ స్పందించింది చర్యలకు సీఐడీకి సిఫారసు చేసిందిప్రజల భూమికి భద్రత కల్పించడమే ప్రభుత్వ ధ్యేయంసీఎం జగన్‌ను ఎదుర్కోలేక బాబు, పవన్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు తప్పుడు ప్రచారాలు ఆపకపోతే క్రిమినల్ చర్యలు తప్పవుల్యాండ్ టైటిల్ యాక్ట్ మేం తెచ్చింది కాదునీతి ఆయోగ్ ద్వారా కేంద్రమే అన్ని రాష్ట్రాలకు సూచించింది టీడీపీ, జనసేన నేతలు మాట్లాడుతుంటే ఏపీ బీజేపీ నేతలు ఏం చేస్తున్నారు?కేంద్రం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ బీజేపీ శాఖ ఎందుకు నోరుమూసుకుంది? ఏపీల  ప్రచారానికి వస్తున్న మోదీ, అమిత్ షా సభల్లో చెప్పాలి10:51 AM, May 5th, 2024ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలుల్యాండ్ టైట్లింగ్‌ యాక్ట్‌పై కొన్ని పార్టీలు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నాయిభూ రికార్డుల డిజిటలైజేషన్‌తో సమస్యల పరిష్కరించడానికి ఈ చట్టాన్ని తీసుకువస్తున్నారు.ల్యాండ్ టైట్లింగ్‌ యాక్ట్‌తో ప్రజల ఆస్తులు లాగేసుకుంటారంటూ కావాలనే కొన్ని పార్టీలు ప్రచారం చేస్తున్నాయిల్యాండ్ టైట్లింగ్‌ యాక్ట్ గురించి తెలియకపోతే మమ్మల్ని అడిగితే చెప్పేవాళ్లంఎన్నికల్లో మాతో భాగస్వామ్యం ఉన్న పార్టీలు ఇలా తప్పుడు ప్రచారం చేయడం మంచిది కాదుల్యాండ్ టైట్లింగ్‌ యాక్ట్ ఇతర రాష్ట్రాల్లో అమలవుతుందిఎలా అయినా గెలవాలన్న ఆలోచనతో ప్రజలను భయభ్రాంతులను చేయడం మంచిది కాదుఈ దుష్ప్రచారంపై ఎన్నికల కమిషన్ కూడా సీఐడీ దర్యాప్తు వేసిందిజనసేన, తెలుగుదేశం మేనిఫెస్టో మాకు సంబంధం లేదుచంద్రబాబు చెప్తున్నా సూపర్ సిక్స్ కోసం చాలా డబ్బులు కావాలిచంద్రబాబు చెబుతున్న సూపర్ సిక్స్ పథకాలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయిఆయన వాటిని అమలు చేయకపోతే ఆ నెపం మా పైకి వస్తుందిఅందుకే.. జనసేన, తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోతో మాకు సంబంధం లేదు8:56 AM, May 5th, 2024నేడు ఏపీకి అమిత్‌ షా, రాజ్‌నాథ్‌సింగ్‌ రాకశ్రీసత్యసా­యి జిల్లా ధర్మవరం పట్టణం బత్తలపల్లి రోడ్డులోని సీఎన్‌బీ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన ఎన్ని­క­ల ప్రచార బహిరంగ సభలో ప్రసంగించనున్న అమిత్‌షావైఎ­స్సా­ర్‌ జిల్లా జమ్మలమడుగు, కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో జరిగే ఎన్నికల ప్రచా­ర సభల్లో పాల్గొననున్న రాజ్‌నాథ్‌ సింగ్‌ 8:51 AM, May 5th, 2024అవన్నీ అపోహలేల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టంతో భూములకు మరింత రక్షణఈ చట్టం అమల్లోకి వస్తే భూములు, ఆస్తులకు ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుందిఅన్ని పత్రాలూ యజమానుల వద్దే ఉంటాయి.. ప్రభుత్వం వద్ద కేవలం రికార్డులేఈ చట్టం కోర్టు ద్వారాలు మూసేయదు.. కోర్టులకు వెళ్లే అవసరమే లేకుండా చేస్తుందిహక్కుల నిరూపణకు ఇప్పుడున్న చట్టాలు అంతిమ సాక్ష్యాలు కావుఅందుకే ఈ చట్టం అవసరమవుతోందిభూచట్టాల నిపుణుడు, నల్సార్‌ ప్రొఫెసర్‌ ఎం. సునీల్‌కుమార్‌7:37 AM, May 5th, 2024జనం.. జనం.. ప్రభంజనంసీఎం వైఎస్‌ జగన్‌ ఎన్నికల ప్రచార సభలకు పోటెత్తిన ప్రజానీకంహిందూపురంలో 43 డిగ్రీల ఎండనూ లెక్కచేయని జనంనియోజకవర్గ చరిత్రలో ఏ నాయకుడికి లేని రీతిలో బ్రహ్మరథంఈసారి హిందూపురం వైఎస్సార్‌సీపీదే అంటున్న రాజకీయ పరిశీలకులుపలమనేరులో వర్షాన్ని కూడా లెక్క చేయని ప్రజలునెల్లూరులో జననీరాజనం 7:25 AM, May 5th, 2024ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం వ్యవహారం.. టీడీపీపై ఈసీ కొరడాదుష్ప్రచారంపై సీఐడీ దర్యాప్తుప్రజలను భయాందోళనలకు గురిచేయడంపై ఈసీ సీరియస్‌ ఎన్నికల నిబంధనలకు పాతరేస్తున్నారని మండిపాటు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదుతో చర్యలు తీసుకున్న కమిషన్‌తక్షణం దీనిపై దర్యాప్తుచేసి నివేదిక ఇవ్వాలని ఆదేశం7:16 AM, May 5th, 2024కళ్లు గద్దెపై.. బుద్ధి భూమిలోల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై బరితెగించి అబద్ధాలులేని వ్యక్తులకు అన్యాయం జరిగిందంటూ రామోజీ ఆక్రోశం కల్పిత పాత్రలను సృష్టించి, ఏదో జరిగిపోయిందని ఆక్రందనరిజిస్టరే లేనపుడు అందులో కొందరి పేర్లు లేకపోవటం సాధ్యమా?చట్టం దేవుడెరుగు... చట్టానికి సంబంధించిన రూల్సే రాలేదని తెలీదా?రూల్స్‌ వచ్చాక.. వాటిపై సమగ్ర చర్చ జరిగిన తరవాతే తుది రూపుపైపెచ్చు రీసర్వే పూర్తయ్యాకే ఈ చట్టాన్ని అమలు చేయటం సాధ్యంఇప్పటికి 4 వేల గ్రామాల్లోనే రీ సర్వే పూర్తి.. ఇంకా 13 వేల గ్రామాల్లో పెండింగ్‌అది పూర్తయి.. రూల్స్‌ ఖరారయ్యాక కదా చట్టం అమలు గురించి మాట్లాడేది..అయినా అన్ని రాష్ట్రాలనూ అమలు చేయమంటున్నది కేంద్రమే కదా!అన్ని రాష్ట్రాలూ అమలు చేస్తేనే... ఇక్కడా చేస్తామని చెబుతున్న రాష్ట్రంమోదీ ముందు తల ఊపి.. బయట మాత్రం విష ప్రచారం చేస్తున్న బాబుబాబునెవరూ నమ్మటం లేదని గ్రహించి... మారీచుడి పాత్రలోకి రామోజీజనాన్ని భయపెట్టడానికి అబద్ధాలే అ్రస్తాలుగా మాయా యుద్ధంపోలింగ్‌ వరకూ ఈ ఒక్క అంశంమీదే మాట్లాడాలని ‘ఎల్లో’ తాఖీదుమిగతావన్నీ పక్కనబెట్టి విస్తృతంగా విష ప్రచారం చేస్తున్న పచ్చ మంద7:14 AM, May 5th, 2024బాబుకు భంగపాటు.. బెడిసికొట్టిన టీడీపీ అధినేత పన్నాగంబెడిసికొట్టిన టీడీపీ అధినేత పన్నాగంఓటర్లకు అరచేతిలో వైకుంఠం చూపించేందుకు కుతంత్రంలబ్ధిదారుల నమోదు పేరిట కుట్రఓటర్ల జాబితా వివరాల దుర్వినియోగంతీవ్రంగా స్పందించిన ఎన్నికల కమిషన్‌ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక7:12 AM, May 5th, 2024లాక్కునేవి కాదు..ఇచ్చే చేతులివి..నిషేధిత జాబితా నుంచి 35 లక్షల ఎకరాల తొలగింపుసీఎం జగన్‌ సంస్కరణలతో ‘రెవెన్యూ’లో సులభమైన పాలన  వందల ఏళ్ల నాటి చిక్కుముళ్లకు పరిష్కారంచుక్కల భూములు, సర్విస్‌ ఈనాం, షరతుల గల పట్టా భూములకు విముక్తి27.41 లక్షల ఎకరాల అసైన్డ్‌ భూములకు యాజమాన్య హక్కులులంక భూములకు అసైన్‌మెంట్‌ పట్టాలుకుప్పలు తెప్పలుగా ఉన్న రెవెన్యూ సమస్యలన్నింటికీ పరిష్కారంనిరుపేదలకు 46 వేల ఎకరాల భూముల పంపిణీ  శ్మశాన వాటికలు లేని దళిత వాడల కోసం 951 ఎకరాలుకొత్త రిజిస్ట్రేషన్ల విధానం.. ఆటో మ్యుటేషన్‌చరిత్ర సృష్టించిన 30.61 లక్షల ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్‌  రెవెన్యూ శాఖ స్వరూపాన్ని మార్చిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం  అసైన్డ్‌ భూములపై యాజమాన్య హక్కులు6:59 AM, May 5th, 2024మళ్లీ దోపిడీకి తెరపైకి..మాజీ ఎమ్మెల్యే అరాచకాలెన్నో!గోబెల్స్‌ ప్రచారంలో చంద్రబాబుకు తమ్ముడు   వక్ఫ్‌ ఆస్తులు చెరబట్టి దోచేసిన ఘనుడుటిప్పు షాపింగ్‌ కాంప్లెక్స్‌ కేటాయింపులో చేతివాటంప్రతి పనికీ రేటుగట్టి వసూలు చేసిన చరిత్ర  బెదిరింపులు, దౌర్జన్యాలు షరామామూలేఏకంగా పది క్రిమినల్‌ కేసులు 6:56 AM, May 5th, 2024మీ భూమికి భద్రత.. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై బాబు దుష్ప్రచారం: సీఎం జగన్‌చట్టంపై అవగాహన లేకుండా మాట్లాడటం సిగ్గుచేటుమీ భూములకు ప్రభుత్వం గ్యారంటీ..రిజిస్ట్రేషన్‌ తర్వాత రైతులకే డాక్యుమెంట్లుఅన్నదాతలు ఎవరి చుట్టూ తిరగాల్సిన పని ఉండదుభూ తగాదాలకు శాశ్వత పరిష్కారంగా వందేళ్ల తర్వాత రీసర్వేపేదలకు భూములిచ్చేది జగన్‌.. లాక్కునేది చంద్రబాబే

Konda Raghava Reddy Challenges Sunitha And Sharmila
సునీత, షర్మిలకు కొండా రాఘవరెడ్డి సవాల్‌

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: వైఎస్‌ వివేకా హత్య కేసులో ఛార్జ్‌షీట్‌ తీసుకుని రండి.. బహిరంగ చర్చకు సిద్ధమా.. ఎక్కడికైనా వస్తానంటూ సునీత, షర్మిలకు వైఎస్సార్‌టీపీ మాజీ నేత కొండా రాఘవరెడ్డి సవాల్‌ విసిరారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ నెల 11 లోపు తన సవాల్‌పై స్పందించాలన్నారు.‘‘షర్మిల స్పష్టంగా తెలుసుకుని వాస్తవాలు మాట్లాడాలి. నాడు షర్మిలను పాదయాత్ర చేయమని ఎవరూ అడగలేదు. వైఎస్‌ సోదరి విమలమ్మ మీ వెంట ఎందుకు లేరు?. వైఎస్‌ సోదరులు సైతం మీకు మద్దతు ఇవ్వడం లేదు. వివేకా మృతి తర్వాత ఎన్నిసార్లు ఆయన సమాధి వద్దకు వెళ్లారు’ అంటూ కొండా రాఘవరెడ్డి ప్రశ్నించారు.‘‘షర్మిల దుర్మార్గపు పనులు చేస్తున్నారు కాబట్టే.. కుటుంబం నుంచి కూడా ఆమెకు మద్దతు లేదు. రూ.వెయ్యి కోట్ల పని చేయనందుకే షర్మిల వ్యతిరేకంగా మారింది. వైఎస్‌ పేరును చెడ్డగొట్టడానికి షర్మిల కుట్రలు చేస్తోంది. సీఎం జగన్‌, పొన్నవోలుపై షర్మిల వ్యాఖ్యలు సరికాదు. షర్మిల ప్రచారానికి స్పందన లేక ఫ్రస్ట్రేషన్‌కు గురవుతుంది. బాబు, పవన్‌ స్క్రిప్ట్‌ షర్మిల చదువుతుంది. వైఎస్‌ విజయమ్మ మాట పెడచెవిన పెట్టినప్పుడే షర్మిల అంశం ముగిసింది’’ అని కొండా రాఘవరెడ్డి పేర్కొన్నారు.‘‘షర్మిల మోసాలు, అక్రమాలు బయట పెట్టడానికి నేను ఒక్కడిని చాలు. తెలంగాణలో షర్మిల వందల కుటుంబాలను మోసం చేశారు. జగన్‌, షర్మిల పెళ్లికి చంద్రబాబును వైఎస్‌ పిలిచారన్నది అబద్ధం. బాబు ఆడుతున్న ఆటలో షర్మిల పాచిక అయింది. వైఎస్‌ జగన్‌కు అద్ధం చూపడం దుర్మార్గం. ఒకసారి ఇంటికి వెళ్లి ఆ అద్ధంలో మీ ముఖం చూసుకోండి. తెలంగాణలో ఏం మాట్లాడారు. ఏపీలో మాట్లాడారో ఒకసారి చూసుకోండి. షర్మిలకు పిచ్చి ముదిరి నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది’’ అని కొండా రాఘవరెడ్డి మండిపడ్డారు. 

Canada PM Justin Trudeau Comments Over 3 Member Arrest
కెనడాలో భారతీయుల అరెస్ట్‌.. ప్రధాని ట్రూడో కీలక వ్యాఖ్యలు

అట్టావా: భారత్‌, కెనడా దేశాల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. తాజాగా హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసులో ముగ్గురు భారత వ్యక్తుల అరెస్ట్‌పై కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో స్పందిచారు. ఈ సందర్భంగా ట్రూడో.. తమ దేశ పౌరుల భద్రతకు కట్టుబడి ఉన్నామని కీలక వ్యాఖ్యలు చేశారు.కాగా, కెనడాలో శనివారం సిక్కు సంస్కృతి, వారసత్వాన్ని గుర్తుచేస్తూ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ట్రూడో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రూడో మాట్లాడుతూ..‘కెనడాలో చట్టబద్దమైన పాలన కొనసాగుతోంది. దేశపౌరుల రక్షణ, భద్రతకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. దేశంలో శక్తివంతమైన, స్వతంత్రతో కూడిన న్యాయవ్యవస్థ ఉంది. నిజ్జర్ హత్య తరువాత కెనడాలోని సిక్కు మతస్తులు అభద్రతకు లోనవుతున్నారు. హింస, వివక్షకు తావులేకుండా స్వేచ్ఛగా జీవించడం ప్రతీ కెనడా పౌరుడి హక్కు’ అంటూ కామెంట్స్‌ చేశారు.ఇక, అంతకుముందు ముగ్గురి అరెస్ట్‌పై భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.శంకర్‌ మాట్లాడుతూ..‘ఖలిస్థాన్‌ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యకు సంబంధించి జరుగుతున్న పరిణామాలు త్వరలో ఎన్నికలు జరగనున్న కెనడాలోని అంతర్గత రాజకీయాల కారణంగా తలెత్తుతున్నవేనని పేర్కొన్నారు. ఆ విషయాల్లో భారత్‌కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అలాగే, ఆ ముగ్గురికి ఏదో గ్యాంగ్‌ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై కెనడా పోలీసుల నుంచి సమాచారం కోసం వేచి చూస్తున్నాం. కానీ నేను గతంలో చెప్పినట్టు వాళ్లు కెనడాలో వ్యవస్థీకృత నేరాలను కొనసాగనిచ్చారు. అదే మాకు ఆందోళన కలిగిస్తోంది’ అంటూ వ్యాఖ్యలు చేశారు.

IPL 2024 RCB VS GT: Virat Kohli Becomes The First Indian To Complete 12500 Runs In T20 History
IPL 2024 GT VS RCB: విరాట్‌ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్‌గా..!

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో భాగంగా నిన్న (మే 4) జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి రెండు భారీ రికార్డులు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో 27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 42 పరుగులు చేసిన విరాట్‌.. పొట్టి క్రికెట్‌లో 12500 పరుగులు పూర్తి చేసిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. అలాగే ఐపీఎల్‌ గెలుపుల్లో అత్యధిక పరుగులు (4039) చేసిన బ్యాటర్‌గా.. నాలుగు వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.పొట్టి క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు..క్రిస్‌ గేల్‌ (14562)షోయబ్‌ మాలిక్‌ (13360)కీరన్‌ పోలార్డ్‌ (12900)విరాట్‌ కోహ్లి (12536)అలెక్స్‌ హేల్స్‌ (12319)విజయాల్లో (ఐపీఎల్‌) అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు..విరాట్‌ కోహ్లి (4039)శిఖర్‌ ధవన్‌ (3945)రోహిత్‌ శర్మ (3918)డేవిడ్‌ వార్నర్‌ (3710)సురేశ్‌ రైనా (3559)మ్యాచ్‌ విషయానికొస్తే.. విరాట్‌, డుప్లెసిస్‌ (23 బంతుల్లో 64; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో గుజరాత్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌.. ఆర్సీబీ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 19.3 ఓవర్లలో 147 పరుగులకే చాపచుట్టేసింది. గుజరాత్‌ ఇన్నింగ్స్‌లో షారుక్‌ ఖాన్‌ (37), డేవిడ్‌ మిల్లర్‌ (30), రాహుల్‌ తెవాతియా (35) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. మిగతా ప్లేయర్లంతా చేతులెత్తేశారు. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్‌, యశ్‌ దయాల్‌, విజయ్‌కుమార్‌ తలో 2 వికెట్లు పడగొట్టగా.. కర్ణ్‌ శర్మ, గ్రీన్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.అనంతరం 148 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ.. పవర్‌ ప్లేలో పట్టపగ్గాల్లేకుండా చెలరేగిపోయింది. తొలి ఆరు ఓవర్లలో 92 పరుగులు చేసిన ఆర్సీబీ.. ఆతర్వాత ఒక్కసారిగా పేకమేడలా కూలిపోయి ఆలౌటయ్యేలా కనిపించింది. అయితే దినేశ్‌ కార్తీక్‌ (21 నాటౌట్‌).. సప్నిల్‌ సింగ్‌ (15 నాటౌట్‌) సాయంతో ఆర్సీబీని విజయతీరాలకు చేర్చాడు. గుజరాత్‌ బౌలర్లలో జాషువ లిటిల్‌ 4 వికెట్లతో విజృంభించగా.. నూర్‌ అహ్మద్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో భారీ జంప్‌ కొట్టి చివరి స్థానం నుంచి ఏడో స్థానానికి ఎగబాకింది. ఈ ఓటమితో గుజరాత్‌ తొమ్మిదో స్థానానికి పడిపోయింది.

The Conjuring The Devil Made Me Do It Review In Telugu
వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్‌'..!

టైటిల్: ది కంజూరింగ్: ది డెవిల్ మేడ్‌ మీ డూ ఇట్‌నటీనటులు: వేరా ఫార్మిగా, పాట్రిక్ విల్సన్, సారా కేథరిన్ హుక్, జులియన్ హిలార్డ్, జాన్ నోబుల్, ఎజిన్ బొండురెంట్, రూయ్ ఓకోన్నూర్ తదితరులుదర్శకత్వం: మేఖేల్ చావ్స్నిర్మాణ సంస్థ: వార్నర్ బ్రదర్స్ఓటీటీ: అమెజాన్ ప్రైమ్హారర్‌ సినిమాలు అంటేనే క్రియేటివీటికి మారుపేరు. లేనిది ఉన్నట్లుగా ప్రేక్షకులను భయపెట్టేలా ఉంటాయి. కానీ ది కంజూరింగ్‌ మాత్రం అలాంటి హారర్‌ మూవీ కాదు. నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా వచ్చిన చిత్రం. అమెరికాలో జరిగిన ఓ హత్య ఆధారంగా రూపొందించారు. అసలు ఈ హత్య వెనుక ఉన్నది ఎవరు? దెయ్యమా? లేక మనుషులేనా? అన్నది తెలియాలంటే ది కంజూరింగ్ చూసేయాల్సిందే.హాలీవుడ్‌లో హారర్‌ సినిమాలకు కొదువే లేదు. గతంలో వచ్చిన అన్నా బెల్లె, ది నన్ వెన్నులో వణుకు పుట్టించే చిత్రాలే. మైఖేల్ చావ్స్ తెరకెక్కించిన ఈ హారర్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ కూడా అంతకుమించి ఉందనడంలో సందేహం లేదు. ఈ 21వ శతాబ్దంలో అత్యంత భయపెట్టే చిత్రాల్లో ది కంజూరింగ్‌ ఒకటని చెప్పొచ్చు. ఈ మూవీ చూశాక దెయ్యాలు కూడా చేతబడులు చేస్తాయా? అనే అనుమానం కచ్చితంగా వస్తుంది. అసలు దెయ్యం ఏంటి? చేతబడులు చేయడమేంటి? అనే డౌటానుమానం మొదలైందా? అయితే ఈ సినిమా చూస్తే కచ్చితంగా అర్థమవుతుంది. ఈ రియల్ క్రైమ్ థ్రిల్లర్ 1981 ప్రాంతంలో జరిగిన కథ. ఇందులో డేవిడ్‌ గ్లాట్జెల్, డెబ్బీ, ఆర్నె, లోరాయిన్, ఈడ్‌, క్యాస్టనర్, జూడీ వారెన్ పాత్రల చుట్టే కథ తిరుగుతుంది. మసాచుసెట్స్‌లోని ఓ ఫ్యామిలీలోని చిన్న పిల్లాడు(డేవిడ్ గ్లాట్జెల్‌)కి పట్టిన దెయ్యాన్ని విడిపించేందుకు భూతవైద్యుని వద్దకు వెళ్తారు. అదే క్రమంలో ఆ పిల్లాడిని విడిచిపెట్టిన ఆ దెయ్యం.. ఆర్నె అనే యువకుడి శరీరంలోకి వెళ్తుంది. ఆ తర్వాత దెయ్యం ఆవహించిన ఆర్నె తన యాజమానిని హత్య చేస్తాడు. దీంతో పోలీసులు ఆర్నెను అరెస్ట్‌ చేసి జైల్లో వేస్తారు. ఇలాంటి కేసు అమెరికాలోనే మొదటిదని న్యాయమూర్తి సైతం ఆశ్చర్యపోతారు. అదే క్రమంలో జైల్లో ఉన్న ఆర్నెను దెయ్యం తన అధీనంలోకి తెచ్చుకునేందుకు యత్నిస్తూనే ఉంటుంది. అయితే ఆ దెయ్యాన్ని నిలువరించేందుకు.. ఆర్నెను రక్షించేందుకు లోరాయిన్, ఈడ్‌ ప్రయత్నిస్తారు. కానీ ఆ క్రమంలోనే వారికి అసలు నిజం తెలుస్తుంది? అసలు లోరాయిన్, ఈడ్‌ ఎవరిని కలిశారు? వారికి తెలిసిన నిజమేంటి? ఆర్నెను వేధిస్తున్న దెయ్యం ఒకరా? ఇద్దరా? లేక ఆత్మనా అనే సస్పెన్ష్‌ చివరి వరకు ఆడియన్స్‌కు అర్థం కాదు.డిఫరెంట్‌ హారర్ థ్రిల్లర్ సినిమాలు అంటే ఇష్టపడేవారు ది కంజూరింగ్ ఎంచక్కా చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఈ చిత్రంలో దెయ్యం మనిషిని ఆవహించే సన్నివేశాలు మాత్రం ఒళ్లు గగుర్పొడ్చేలా ఉంటాయి. ప్రతి సీన్‌ నరాలు తెగే ఉత్కంఠను కలిగిస్తాయి. దెయ్యం ఆర్నెను తన అధీనంలోకి తెచ్చుకునే క్రమంలో వచ్చే దృశ్యాలు ఆడియన్స్‌ వెన్నులో వణుకు పుట్టిస్తాయి. ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో క్లైమాక్స్‌ సీన్స్‌ను డైరెక్టర్‌ మరింత రియలిస్టిక్‌గా చూపించారు. అంతే కాకుండా చివర్లో  ఓ బిగ్‌ ట్విస్ట్ ఉంటుంది. అదేంటనేది ది కంజూరింగ్ ది డెవిల్ మేడ్‌ మీ డూ ఇట్ చూడాల్సిందే. 2021లో వచ్చిన ఈ థ్రిలర్‌ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ చిత్రాన్ని చిన్నపిల్లల సమక్షంలో చూడవద్దని మనవి. 

EC Serious On TDP About Land Titling Act
ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం వ్యవహారం.. టీడీపీపై ఈసీ కొరడా

సాక్షి, అమరావతి:  ప్రజలను భయాందోళనకు గురి చేస్తూ తప్పుడు సమాచారంతో ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై తెలుగుదేశం పార్టీ చేస్తున్న దుష్ప్రచారం మీద ఎన్నికల సంఘం (ఈసీ) కొరడా ఝళిపించింది. విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఏప్రిల్‌ 29న ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన ఈసీ టీడీపీ దుష్ప్రచారంపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని, అలా తీసుకున్న చర్యలపై తక్షణం నివేదిక ఇవ్వాలని మంగళగిరి సీఐడీ (సైబర్‌ సెల్‌) అడిషనల్‌ డీజీకి అడిషనల్‌ చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ ఎంఎన్‌ హరీంధర ప్రసాద్‌ ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి వ్యతిరేకంగా తప్పుడు సమాచారంతో దురుద్దేశపూర్వకంగా లాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌తో పాటు సామాజిక మాధ్యమాల్లో టీడీపీ ప్రచారం చేస్తోందంటూ  వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది. ఇందుకు తగిన ఆధారాలనూ సమర్పించింది. వివిధ ప్రాంతాల నుంచి వేర్వేరు నెంబర్ల ఐవీఆర్‌ కాల్స్‌ వస్తున్నాయని.. వాటిని లిఫ్ట్‌ చేయగానే.. ‘వైఎస్‌ జగన్‌ అధికారంలోకొస్తే మీ భూములు మీ పేరు మీద ఉండవు, జగన్‌ కాజేస్తాడు, ఒరిజినల్స్‌ ఆయన దగ్గర ఉంచుకుంటాడు, మీకు జిరాక్స్‌ కాపీలు వస్తాయి, కాబట్టి జగన్‌కు ఓటు వేయకుండా తెలుగుదేశంకు ఓటు వేయండి’.. అంటూ రికార్డ్‌ మెసేజ్‌లు వస్తున్నట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. వీటికి సంబంధించిన వాయిస్‌ రికార్డులను వైఎస్సార్‌సీపీ ఈసీకి ఆధారాలుగా సమర్పించింది. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికల సంఘం ఆమోదంలేకుండా ఎలాంటి ప్రచారం చేయడానికి వీల్లేదని.. కానీ ఎటువంటి అనుమతుల్లేకుండా వివిధ చోట్ల నుంచి కాల్స్‌చేస్తూ ఇలా ప్రచారం చేయడం ఉల్లంఘన కిందకే వస్తుందని.. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీచేసింది. ఎన్నికల సమరంలో అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు ఉండేలా చూడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంటుందని, ఈ విధంగా చట్టాలపై తప్పుడు సమాచారంతో దుష్ప్రచారం చేస్తూ ప్రజల్లో భయాందోళనలను రేకెత్తిస్తున్న టీడీపీపై తక్షణం చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ తన ఫిర్యాదులో కోరింది   

Weekly Horoscope Telugu 05-05-2024 To 11-05-2024
Weekly Horoscope: ఈ రాశివారికి ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి

మేషంఅదనపు ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. సమస్యలు ఎదురైనా నేర్పుగా పరిష్కరించుకుంటారు. శ్రమకు ఫలితం దక్కుతుంది. ఆస్తి వ్యవహారాల్లో చికాకులు తొలగుతాయి. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారి చేయూతనందిస్తారు. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ప్రశంసలు. రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు. వారం చివరిలో మనశ్శాంతి లోపం. కుటుంబంలో ఒత్తిడులు.  ఎరుపు, బంగారురంగులు,  శివపంచాక్షరి పఠించండి.వృషభంకొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పరపతి పెరుగుతుంది. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. వాహనాలు, భూములు కొంటారు. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాల విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. కళారంగం వారికి  అన్నింటా విజయం. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో కలహాలు. నలుపు, ఆకుపచ్చరంగులు,  అన్నపూర్ణాష్టకం పఠించండి.మిథునంఆర్థిక పరిస్థితి మొదట్లోకొంత నిరాశ కలిగించినా అవసరాలకు డబ్బు అందుతుంది. పనులు నెమ్మదిగా సాగుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు రాగలవు. భూవివాదాలు తీరతాయి. ఆరోగ్యభంగం. వాహనసౌఖ్యం. నిరుద్యోగులకు ఉద్యోగలాభం.  వ్యాపారాలు అనుకున్న మేరకు లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. రాజకీయవర్గాలకు ముఖ్య సమాచారం. వారం చివరిలో ఒత్తిడులు. కుటుంబంలో సమస్యలు.  ఆకుపచ్చరంగు,లేత గులాబీరంగు, కనకధారా స్తోత్రం పఠించండి.కర్కాటకంపనుల్లో పురోగతి కనిపిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి.  గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. రుణాలు చేయాల్సి వస్తుంది. ఎరుపు, చాక్లెట్‌ రంగులు,  లక్ష్మీస్తోత్రాలు పఠించండి.సింహంముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. మీ అంచనాలు నిజమవుతాయి. ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. ఆస్తి వివాదాల పరిష్కారం.  ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు. ఉద్యోగులకు గందరగోళం నుండి విముక్తి. పారిశ్రామికవర్గాలకు కొన్ని సమస్యలు తీరతాయి. వారం ప్రారంభంలో మానసికఅశాంతి. కుటుంబంలో నిరాశ.   తెలుపు, చాక్లెట్‌æరంగులు,  రాఘవేంద్రస్తోత్రాలు పఠించండి.కన్యకొన్ని కార్యక్రమాలు నెమ్మదిగా సాగుతాయి. బంధువులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. మీలోని నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ఒక ప్రకటన నిరుద్యోగులు, విద్యార్థులను ఆకట్టుకుంటుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపార విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగులకు విధులు ప్రశాంతంగా సాగిపోతాయి. కళారంగం వారికి యోగదాయకమైన కాలం. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. గులాబీ, పసుపు రంగులు, శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.తులపనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. బంధువులు, మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. నిరుద్యోగుల కల ఫలిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం పొందుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు చిక్కులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు కార్యసిద్ధి. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబంలో కొత్త వివాదాలు. తెలుపు, చాక్లెట్‌ రంగులు,  నవగ్రహస్తోత్రాలు పఠించండి.వృశ్చికంకొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల సలహాలు పొందుతారు. ఆస్తి వివాదాల  పరిష్కారం. శుభకార్యాలకు హాజరవుతారు. మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. వాహనయోగం. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఈతిబాధలు తొలగుతాయి.  కళారంగం వారికి సన్మానాలు. వారం చివరిలో మానసిక ఆందోళన. కుటుంబంలో ఒత్తిడులు. ఆకుపచ్చ, తెలుపు రంగులు, ఆదిత్య హృదయం పఠించండి.ధనుస్సుఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆలయ దర్శనాలు. ఇంటాబయటా అనుకూలం. ఇంటర్వ్యూలు అందుతాయి. సోదరులు, సోదరీలతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ఆకస్మిక ప్రయాణాలు. అంచనాలలో పొరపాట్లు దొర్లుతాయి. ఆకుపచ్చ, తెలుపురంగులు,  శివాలయ దర్శనం మంచిది.మకరంఅనుకున్న పనులు సజావుగా సాగుతాయి. మీపై వచ్చిన అభియోగాల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పరపతి పెరుగుతుంది. గృహ, వాహనయోగాలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. పోటీపరీక్షల్లో విజయం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు విధులలో భారం తగ్గుతుంది. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో కుటుంబంలో ఒత్తిడులు. శ్రమాధిక్యం. నీలం, లేత పసుపు రంగులు.  నృసింహస్తోత్రాలు పఠించండి.కుంభంఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబ, ఆరోగ్య సమస్యలు  కొంత చికాకు పరుస్తాయి. బంధువులతో మాటపట్టింపులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి. ప్రత్యర్థుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలలో లాభాలు అంతగా ఉండవు. ఉద్యోగులకు  శ్రమాధిక్యం. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం.  నీలం, తెలుపు రంగులు,  గణేశ్‌ను పూజించండి.మీనంఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. ప్రత్యర్థులు అనుకూలురుగా మారతారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. పారిశ్రామికవర్గాలకు మరింత అనుకూల పరిస్థితులు. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆకుపచ్చ, తెలుపు రంగులు.  విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. 

Indian-origin astronaut Sunita Williams set for third space mission
సునీత ‘స్టార్‌ ట్రెక్‌’!

ముప్పై ఏళ్లు సాగిన అమెరికన్‌ స్పేస్‌ షటిల్స్‌ శకం 2011లో ముగిసింది. ఇక 1960ల నాటి సోవియట్‌ సోయజ్‌ కేప్సూల్‌ ఓ పాతబడ్డ డొక్కు వ్యోమనౌక. కొద్దిపాటి మార్పులతో ‘ఐదో తరం సోయజ్‌’తో నెట్టుకొస్తున్నా అదీ ని్రష్కమించే వేళయింది. సొంత నౌకల్లో వ్యోమగాముల్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపడానికి అమెరికా ఆర్థికంగా వెనకడుగు వేసింది. రష్యా సైతం స్పేస్‌ టూరిస్టులకు టికెట్లమ్మి ఆ సొమ్ముతో ‘ఐఎస్‌ఎస్‌ బండి’ నడుపుతోంది. ఈ నేపథ్యంలో మున్ముందు అంతరిక్ష కేంద్రానికి మానవసహిత యాత్రలు, పెట్టుబడులు, పరిశోధన, చంద్ర–అంగారక యాత్రలు... అన్నింట్లోనూ ప్రైవేటైజేషన్‌దే హవా కానుంది! ప్రైవేటు రంగమే రోదసిని ఏలబోతోంది. ప్రభుత్వరంగ పాత్ర క్రమంగా కేవలం ప్రోత్సాహం, సహకారం, కాస్తో కూస్తో నిధులకే పరిమితమవుతోంది. రెండు అధునాతన ప్రైవేటు వ్యోమనౌకలు (స్పేస్‌ కేప్సూల్స్‌) అంతరిక్షాన్ని అందుకోవడానికి సిద్ధమయ్యాయి. భూమికి 400 కిలోమీటర్ల ఎత్తున కక్ష్యలో పరిభ్రమిస్తున్న అంతరిక్ష కేంద్రానికి రాకెట్ల సాయంతో వ్యోమగాముల్ని తీసుకెళ్లనున్నాయి. ‘ఎక్స్‌’ బాస్‌ ఇలాన్‌ మస్క్‌ కంపెనీ ‘స్పేస్‌ ఎక్స్‌’ రూపొందించిన ‘క్రూ డ్రాగన్‌’ కేప్సూల్‌ ఇప్పటికే ఫాల్కన్‌ రాకెట్లతో అంతరిక్ష కేంద్రానికి రాకపోకలు సాగిస్తోంది. సరుకులతో పాటు వ్యోమగాములనూ చేరవేస్తోంది. ప్రపంచ అతి పెద్ద ఏరో స్పేస్‌ కంపెనీల్లో ఒకటైన ‘బోయింగ్‌’ కూడా తాజాగా ‘సీఎస్టీ–100 స్టార్‌లైనర్‌’ వ్యోమనౌకతో మే 6న తొలి మానవసహిత రోదసీ యాత్రతో రంగప్రవేశం చేస్తోంది. భారతీయ మూలాలున్న అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ ముచ్చటగా మూడోసారి అంతరిక్ష కేంద్రానికి పయనమవడం ఈ యాత్రలో మరో విశేషం... మన సునీత హ్యాట్రిక్‌! సునీతా విలియమ్స్‌. ఇండియన్‌ అమెరికన్‌ ఆస్ట్రోనాట్‌. ముద్దుపేరు సునీ. 11 ఏళ్ల విరామం అనంతరం 58 ఏళ్ల వయసులో మూడోసారి రోదసికి వెళ్లబోతున్నారు. అమెరికన్‌ నేవీ కెపె్టన్‌ (రిటైర్డ్‌) సునీతకు అనుభవమే మనోబలం. ఆమెను నాసా 1998లో వ్యోమగామిగా ఎంపిక చేసింది. సునీత తండ్రి ఇండియన్‌ అమెరికన్‌ దీపక్‌ పాండ్యాది ముంబై. తల్లి అర్సలిన్‌ బోనీ స్లోవేన్‌–అమెరికన్‌. సునీత 1965లో అమెరికాలో జని్మంచారు. యునైటెడ్‌ లాంచ్‌ అలయెన్స్‌ రాకెట్‌ ‘అట్లాస్‌–5’ శీర్షభాగంలో అమర్చిన బోయింగ్‌ ‘స్టార్‌లైనర్‌’ వ్యోమనౌకలో ఈ నెల 6న రాత్రి 10:34కు (భారత కాలమానం ప్రకారం 7వ తేదీ ఉదయం 8:04కు) ఫ్లోరిడాలోని కేప్‌ కెనవరల్‌ నుంచి సునీత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయల్దేరనున్నారు. నాసా వ్యోమగామి బుచ్‌ విల్మోర్‌ కూడా ఈ యాత్రలో పాల్గొంటారు. వీరిద్దరూ ఐఎస్‌ఎస్‌లో వారం గడిపి తిరిగొస్తారు. సునీత 2006 డిసెంబరు 9న తొలిసారి ఐఎస్‌ఎస్‌ కు వెళ్లారు. 2007 జూన్‌ 22 దాకా రోదసిలో గడిపారు. నాలుగు సార్లు స్పేస్‌ వాక్‌ చేసిన మహిళా వ్యోమగామిగా రికార్డు నెలకొల్పారు. రెండోసారి 2012 జులై 14 నుంచి 127 రోజులపాటు ఐఎస్‌ఎస్‌లో గడిపారు. మూడుసార్లు స్పేస్‌ వాక్‌ చేశారు. రెండు మిషన్లలో మొత్తం 50 గంటల 40 నిమిషాలు స్పేస్‌ వాక్‌ చేశారు.   బోయింగ్‌... గోయింగ్‌!  అమెరికా స్పేస్‌ షటిల్స్‌ కనుమరుగయ్యాక అంతరిక్ష యాత్రల కోసం రష్యా సోయజ్‌ రాకెట్‌–వ్యోమనౌకల శ్రేణిపైనే నాసా ఆధారపడింది. కానీ ఒక్కో వ్యోమగామికి రష్యా ఏకంగా రూ.700 కోట్లు చొప్పు న వసూలు చేస్తోంది. దాంతో వ్యోమనౌకల అభివృద్ధి కోసం నాసా 2014లో బోయింగ్‌కు 4.2 బిలియన్‌ డాలర్లు, (రూ.35 వేల కోట్లు), స్పేస్‌ ఎక్స్‌కు 2.6 బిలియన్‌ డాలర్ల (రూ.21,680 కోట్లు) కాంట్రాక్టులు కట్టబెట్టింది. స్పేస్‌ ఎక్స్‌ తన ‘క్రూ డ్రాగన్‌’ స్పేస్‌ కేప్సూల్‌లో 2020 నుంచే వ్యోమగాములను తీసుకెళ్తోంది. బోయింగ్‌ ‘క్రూ స్పేస్‌ ట్రాన్సో్పర్టేషన్‌ (సీఎస్టీ)–100 స్టార్‌ లైనర్‌’ మాత్రం వెనుకబడింది. ఎట్టకేలకు ఈ నెల 6న తొలి మానవసహిత ప్రయాణ పరీక్షకు సిద్ధమైంది. అంతరిక్ష కేంద్రంతో అనుసంధానం (డాకింగ్‌), భూమికి తిరుగు పయనం, స్టార్‌ లైనర్‌ వ్యవస్థల సామర్థ్యాన్ని ఈ పరీక్షలో పరిశీలిస్తారు. ఈ యాత్ర జయప్రదమైతే మానవసహిత అంతరిక్ష యాత్రలకు దానికి లైసెన్స్‌ లభిస్తుంది.  – జమ్ముల శ్రీకాంత్‌  

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all