Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement
head

ప్రధాన వార్తలు

AP Elections 2024:  CM YS Jagan Speech At Bobbili Road Show
‘జగన్‌ను ప్రజలే రక్షించుకుంటారు’: బొబ్బిలి రోడ్‌షోలో సీఎం జగన్‌

విజయనగరం, సాక్షి: కుర్చీలు లాక్కోవడం, వెన్నుపోటు పొడవడం, మోసం చేయడం, మనషుల్ని చంపేయడం.. ఇదే చంద్రబాబు రాజకీయమని, అలాంటి చంద్రబాబుకి ఓటేయమని అడిగే అర్హత ఎక్కడ ఉందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలదీశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. బుధవారం ఉదయం బొబ్బిలి మెయిన్‌ రోడ్‌ సెంటర్‌లో నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొని సీఎం జగన్‌ ప్రసంగించారు.ఈ ఎన్నికల్లో జగన్‌కు ఓటేస్తే పథకాల కొనసాగింపు. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు. మళ్లీ మోసపోవడం ఖాయం.  ఈ ఎన్నికలు ఎమ్మెల్యే, ఎంపీలను ఎన్నుకునేందుకు వేసే ఓటు కాదు.. ఈ ఓటుతో మీ తలరాతలు మారుతాయి.  రాబోయే ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయించేవే ఈ ఎన్నికలు. పథకాల కొనసాగింపును నిర్ణయించేవి ఈ ఎన్నికలు....చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పాలన ఉంది. లంచాలు, వివక్ష లేకుండా నేరుగా సంక్షేమం అందించాం. ప్రతీ పేదవాడికి అండగా ఉంటూ వైద్యం అందించాం. రైతన్నకు చేయిపట్టుకుని సాయం అందించాం. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో జరగని సామాజిక న్యాయం కళ్లెదుటే కనిపిస్తోంది. ఈ 59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం.  డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాలో రూ.2 లక్షల 70 వేల కోట్లు అందించాం.  2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం... ఎన్టీఆర్‌ కుర్చీని లాక్కుని, సొంత పార్టీ అధ్యక్షుడ్ని కుట్రలతో చంపేసిన వ్యక్తి. వంగవీటి మోహన రంగాను కుట్రలతో చంపింది ఎవరు?. ఐఎస్‌ అధికారి రాఘవేంద్రను కుట్రలతో చంపించింది ఎవరు?. ఇప్పడు మీ బిడ్డను ప్రజల్లో ఓడించలేనని చంద్రబాబుకి అర్థం అయ్యింది. మోసపూరిత హామీలతో.. ఎన్నెన్ని మాటలు చెబుతున్నా ప్రజలెవరూ చంద్రబాబును నమ్మడం లేరు. జనం మోసపోవడానికి సిద్ధం లేరని చంద్రబాబుకి అర్థం అయ్యింది. ఈ జగన్‌ను చంపేస్తే ఏమౌతుంది అంటున్నారు. రాష్ట్ర రాజకీయాల్లోనే ఇది సిగ్గుచేటు పరిణామం.చంద్రబాబు మాటలు ఆయన దిగజారుడుతనాన్ని తెలియజేస్తున్నాయి. అయ్యా చంద్రబాబూ.. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్సార్‌, ఆ మహానేతకు వచ్చిన ప్రజాదరణను ఓర్వలేక అసెంబ్లీ సాక్షిగా ‘నువ్వు ఆ గాలిలోనే కలిసిపోతావ్’‌ అని అన్నమాటల్నినేను మరిచిపోలేను. నాడు నా తండ్రిని, నేడు నన్నూ.. ఈ ప్రజా క్షేత్రంలో ఎదుర్కొనలేక నువ్వు మాట్లాడే మాటలు.. నీ నేర ప్రవృత్తికి  అద్దం పడుతున్నాయి. బాబు మెంటల్‌ హెల్త్‌ ఏ స్థాయిలో ఉందో ప్రజలంతా అర్థం చేసుకోవాలి.కానీ, చంద్రబాబు అనుకుంటే జగన్‌ చనిపోడు.. జగన్‌ను ప్రజలే రక్షించుకుంటారు. అవ్వాతాలు, అక్కాచెల్లెమ్మల ప్రార్థనలు, దీవెనలే నాకు శ్రీరామరక్ష... ఎన్నికలయ్యాక చంద్రబాబు టీడీపీ మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేస్తారు. కానీ, మీ బిడ్డ ఈ జగన్‌ 58 నెలల పాలనలో 99 శాతం హామీలు అమలు చేశాడు. అయ్యా.. నువ్వు 14 ఏళ్లు సీఎంగా చేశావ్‌. మరి నీ పేరు చెబితే ఒక్క పేదవాడికి మంచి చేసినట్లు గుర్తుకు వస్తుందా?. 2014లో మేనిఫెస్టోతో చంద్రబాబు చేసిన మోసం గుర్తుందా?. ప్రధాన హామీల పేరుతో ఏ ఒక్క వర్గానికి చంద్రబాబు న్యాయం చేయలేదు. ఇప్పుడు మళ్లీ అదే కూటమి, అదే మోసపూరిత హామీలతో ప్రజల ముందుకు వస్తోంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి.వలంటీర్ల ద్వారా మళ్లీ సంక్షేమం కొనసాగాలన్నా, వైద్యం ఆరోగ్య సేవలు.. రాష్ట్ర అభివృద్ధి కొనసాగాలన్నా.. ఫ్యాన్‌ గుర్తును రెండుసార్లు నొక్కాలి. 175కి 175 ఎమ్మెల్యే స్థానాలు, 25 ఎంపీ స్థానాలు వైఎస్సార్‌సీపీకే రావాలి. దేశంలో ఎన్నడూ జరగని విధంగా, రాష్ట్రంలో మునుపెన్నడూ చూడని రీతిలో 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ స్థానాలు.. మొత్తం రెండొందల స్థానాలకు ఏకంగా 100 స్థానాలు.. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు పోటీకి దిగుతున్నారు. సామాజిక న్యాయం ఏ స్థాయికి వెళ్లిందో అర్థం చేసుకోండి.వైఎస్సార్‌సీపీ తరఫున బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎస్‌. వెంకట చిన అప్పలనాయుడు పోటీ చేస్తున్నారు. ఆయన్ని గెలిపించి సామాజిక న్యాయాన్ని గెలిపించాలి. విజయనగరం ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్‌లను గెలిపించాలని ఈ సందర్భంగా సీఎం జగన్‌ ప్రజలకు పిలుపు ఇచ్చారు.

Person Suicide Letter And Missing At Hanmakonda District
సీఐ, ఎస్‌ఐ వేధిస్తున్నారు.. సూసైడ్‌ లేఖ రాసి..

సాక్షి, హసన్‌పర్తి: తెలంగాణలో పోలీసుల వేధింపులే కారణమంటూ సూసైడ్‌ లేఖ రాసి పెట్టి ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన హన్మకొండ జిల్లాలో కలకలం సృష్టించింది.వివరాల ప్రకారం.. హన్మకొండ జిల్లా హసన్‌పర్తికి చెందిన ప్రశాంత్‌ కుమార్‌ అనే వ్యక్తి సూసైడ్‌ లేఖ రాసి పెట్టి అదృశ్యమయ్యాడు. ఈ సందర్భంగా ప్రశాంత్‌ సూసైడ్‌ లేఖలో.. తన చావుకు సీఐ, ఎస్‌ఐ కారణమని తెలిపాడు. సీఐ తన సెల్‌ఫోన్‌, వాచీ లాక్కుకొని తనను తీవ్రంగా కొట్టారని ప్రశాంత్‌ ఆరోపించారు. పోలీసులు సమస్యను పరిష్కరించకపోగా తీవ్రంగా కొట్టడంతో దెబ్బలు భరించలేక సూసైడ్ నోట్ రాసి అదృశ్యమయ్యాడు. అలాగే, తన దగ్గర అప్పు తీసుకున్న వారు తిరిగి ఇవ్వమంటే వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన చావుకు సీఐ, ఎస్ఐ కారణమంటూ.. సూసైడ్ నోట్ రాసి అదృశ్యమైన వ్యక్తిహన్మకొండ - పోలీసుల దెబ్బలు భరించలేక సూసైడ్ నోట్ రాసి, తన చావుకు హసన్ పర్తి సీఐ, ఎస్ఐ కారణమని అదృశ్యమైన వ్యక్తి.తన దగ్గర అప్పు తీసుకున్నవారు వేధిస్తున్నారని పోలీసులను ఆశ్రయిస్తే.. వారు తనను కొట్టారని ఆరోపణ. తన… pic.twitter.com/WFHGs1Qkea— Telugu Scribe (@TeluguScribe) May 1, 2024  Video Credit: Telugu Scribeఈ నేపథ్యంలో తన భర్తను కాపాడాలని హసన్‌పర్తి పోలీసులపై చర్యలు తీసుకోవాలని బాధితుడి భార్య శ్యామల హన్మకొండ సీపీకి ఫిర్యాదు చేశారు. పోలీసుల కారణంగా అవమాన భారంతో తన భర్త ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడని ఆమె తెలిపారు. ఇక, ఈ ఘటన గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

several Schools Send Children Home After Bomb Threat Emails in delhi
ఢిల్లీలో 100 స్కూళ్లకు బాంబు బెదింపులు.. స్పందించిన ఎల్జీ

ఢిల్లీ: ఢిల్లీ రాజధాని పరిధిలో బుధవారం  100 స్కూళ్లకు వచ్చిన బాంబు బెదిరింపుల ఘటనపై ఢిల్లీ ఎల్జీ  వీకే సక్సేనా స్పందించారు. బాంబు బెదిరింపుకు సంబంధించి వచ్చిన ఈ మెయిల్స్‌ను పోలీసులు ట్రేస్‌ చేసినట్లు వెల్లడించారు. ఈ విషయంలో​ పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని, బాంబు బెదిరింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ ప్రజలకు హామీ ఇస్తున్నామని ఎల్జీ తెలిపారు.కేంద్ర హోం శాఖ స్పందన..ఢిల్లీ స్కూళ్ల బాంబు మెయిల్ బెదిరింపు ఘటనపై కేంద్ర హోంశాఖ స్పందించింది. పాఠశాలలకు వచ్చినవి నకిలీ బెదిరింపు మెయిల్స్‌ అని స్పష్టం చేసింది. పలు పాఠశాలలను ఢిల్లీ పోలీసులు తనిఖీ చేశారని తెలిపింది. ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలలను స్కూళ్ల యాజమాన్యాలు మూసివేసినట్ల తెలిపారు.అంతకంటే ముందు.. బాంబు బెదిరింపులై ఢిల్లీ  మంత్రి అతిశీ స్పందించారు. ‘ఇవాళ ఉదయం కొన్ని స్కూళ్లులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు విద్యార్థులను స్కూళ్ల నుంచి ఖాళీ చేయించి తనిఖీలు చేశారు. అయితే పాఠశాలల్లో ఎటువంటి బాంబు లేవని పోలీసులు గుర్తించారు. మేము స్కూళ్లు, పోలీసులతో టచ్‌లో ఉన్నాం. పిల్లల తల్లిదండ్రులు, పాఠశాలల అధికారులు ఆందోళన పడొద్దు.  స్కూళ్ల అధికారులు కూడా తల్లిదండ్రులకు టచ్‌లో ఉ‍న్నారు’ అని మంత్రి అతిశీ ‘ఎక్స్‌’ వేదికగా తెలిపారు.Some schools have received bomb threats today morning. Students have been evacuated and those premises are being searched by Delhi Police. So far nothing has been found in any of the schools.We are in constant touch with the Police and the schools. Would request parents and…— Atishi (@AtishiAAP) May 1, 2024దేశ రాజధాని పరిధిలో బుధవారం ఉదయం ఒక్కసారిగా అలజడి రేగింది.  పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వెంటనే పిల్లలను బయటకు పంపించి తనీఖలు చేపట్టింది. మరో వైపు ఈ సమాచారం అందుకున్న తల్లిదండ్రులు ఆందోళనతో స్కూళ్ల వద్దకు  చేరుకున్నారు.ఇప్పటివరకు 100 పాఠశాలల్లో బాంబు ఉన్నట్లు ఈ మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. మయూర్ విహార్‌లోని మదర్ మేరీ స్కూల్, ద్వారకలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌, చాణిక్య పురిలోని సంస్కృతి స్కూల్, అమిటి సాకేత్ స్కూల్, నోయిడాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన బాంబ్ స్క్వార్డ్స్, పోలీసులు స్కూల్స్‌కు వద్దకు చేరుకొని వాటి ఖాళీ చేయించి తనిఖీలు చేశారు. అయితే ఇప్పటి వరకు తనిఖీలు చేసిన పాఠశాలల్లో ఎలాంటి బాంబు లేవని, వచ్చింది నకిలీ బాంబు మెయిల్‌గా పోలీసులు గుర్తించారు. బయట దేశం నుంచి వీపీఎన్‌ మోడ్‌లో బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. బాంబు బెందిరింపుల నేపథ్యంలో స్కూల్స్ నుంచి విద్యార్థులను తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకెళ్లారు. బాంబు బెదిరింపు ఈ మెయిల్స్‌పై ఢిల్లీ పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.  

Revanth Reddy Fires On Modi At Korutla Meeting Lok Sabha Elections
మాలో తెలంగాణ పౌరుషం ఉంది.. భయపడేది లేదు: సీఎం రేవంత్‌

సాక్షి, జగిత్యాల: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ దేశాన్ని అదానీ, అంబానీ, కార్పొరేట్‌ శక్తులకు అమ్ముతున్నారని ఆరోపించారు సీఎం రేవంత్‌ రెడ్డి. మోదీ హయాంలో దళితులు, బలహీన వర్గాలకు ఎలాంటి న్యాయం జరగలేదని మండిపడ్డారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే.. బీసీ జనగణన చేసి, వారికి న్యాయం చేస్తామని చెప్పారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్ర చేస్తున్నాయని విమర్శించారు. అందుకే 400 సీట్లు కావాలని బీజేపీ అడుగుతోందని దుయ్యబట్టారు.కోరుట్లలో కాంగ్రెస్‌ జనజాతర సభలో సీఎం రేవంత్‌ రెడ్డి ప్రసంగించారు. బీజేపీని ప్రశ్నిస్తే మోదీ, అమిత్‌ షా తనపై కేసు పెట్టారన్నారు. ఢిల్లీ పోలీసులను ఉపయోగించి మనల్ని భయపెట్టాలని చూస్తున్నారని పేర్కొన్నారు. కేసులకు రేవంత్‌ రెడ్డి భయపడడని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ అంటే రిజర్వేషన్లను రుద్దు చేయడమేనా అని ప్రశ్నించారు. తెలంగాణకు నీళ్లు ఇవ్వరు, నిధులు ఇవ్వని  వారు నేడు ఓట్లు ఎలా అడుగుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘కార్మికుల త్యాగాలు, పొరాటాల వలనే తెలంగాణ ఏర్పడింది. పార్లమెంటు ఎన్నికలు ప్రత్యేక పరిస్థితులలో జరుగుతున్నాయి. రాజ్యాంగంలో రిజర్వేషన్‌లు ఎత్తేసే కుట్ర జరుగుతుంది. 400 సీట్లు గెలిచి అదానీ, అంబానీలకు దోచిపెట్టాలని చూస్తున్నారు. కుల గణన చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేశాం. నేను బిజెపి ని ప్రశ్నిస్తే ఢిల్లీలో కేసు పెట్టారు.చదవండి: తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులుపదేళ్లు కేసీఆర్‌ ‌భయపెట్టాలని చూశాడు.కేసులు పెట్టినోళ్ళను అధికారంలో లేకుండా చేశాం. ఒక‌ ప్రధానిగా  నరేంద్ర మోదీ కనబడితే నమస్కరిస్తా. గుజరాత్ వాడిగా తెలంగాణకు వస్తున్నాడు. తెలంగాణకు వచ్చిన వాటిని రద్దు చేసిన వ్యక్తి మోదీ. కాంగ్రెస్ ‌ముక్త్ భారత్ అంటే రిజర్వేషన్ రద్దు చేయడమేనా? మెట్రో రైలుకి అనుమతులు ఇవ్వాలని అడిగితే స్పందనలేదు. నీటి‌ కేటాయింపులు‌‌ అడిగితే స్పందించలేదు. తెలంగాణ ఏర్పాటును‌ అగౌరపరిచిన వ్యక్తి నరేంద్ర మోదీ. ఆయన తన స్థాయిని మరచి ప్రవర్తిస్తున్నాడు.దలితులు,గిరిజనులు‌ ఇంకా చితికి పోవాలా. గుజరాత్ నుంిచి వచ్చి తెలంగాణలో పెత్తనం ఏంటి? గుజరాత్ అహాంకారానికి, తెలంగాణ అత్మగౌరవానికి జరుగుతున్న పోరాటం.మనకి విభేదాలు ఉన్న ఊరుకానొడు వస్తే తరిమికొట్టాలి. రేవంత్ రెడ్డి‌ని జైలులో వెయడానికేనా ప్రధాన మంత్రి ఉద్దేశమా. తెలంగాణ పౌరుషం మాలో‌ ఉంది...భయపడేది లేదు. నిజాం,రజాకార్లకు పట్టిన గతే బిజేపికి పట్టింది.పదవులకే వన్నె తెచ్చిన‌ వ్యక్తి ‌జీవన్ రెడ్డి. పదవులను ‌అడ్డం‌ పెట్టుకొని‌ జీవన్ రెడ్డి ఎప్పుడూ అక్రమంగా‌ సంపాదించలేదు. నిజామాబాదు ప్రాంతం వారికి‌ అండగా నిలబడడానికే జీవన్ రెడ్డి ఇక్కడి నుంచి పోటి చేస్తున్నారు. కొడంగల్ ఓటమి‌ నాకు‌ లాభం తెస్తే, జీవన్ రెడ్డి‌కి జగిత్యాల ఓటమి లాభం చేకూర్చుంది’ అని రేవంత్‌ పేర్కొన్నారు. రాజ్యాంగం రద్దుకు బీజేపీ చేస్తున్న కుట్రను సాయంత్రం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో వెల్లడిస్తానని తెలిపారు.

IPL 2024: Hardik Pandya And Other Mumbai Indians Fined For Slow Over Rate Against Lucknow Super Giants
వరుస ఓటములు ఎదుర్కొంటున్న హార్దిక్‌ సేనకు మరో బిగ్‌ షాక్‌

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో వరుస ఓటములు ఎదుర్కొంటున్న ముంబై ఇండియన్స్‌కు మరో భారీ షాక్‌ తగిలింది. నిన్న (ఏప్రిల్‌ 30) లక్నోతో మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేట్‌ మెయింటైన్‌ చేసినందుకు గాను కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా మ్యాచ్‌ ఫీజ్‌లో 24 లక్షల కోత పడింది. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ సహా జట్టు సభ్యులందరికి 6 లక్షల జరిమానా విధించారు. హార్దిక్‌ ఈ సీజన్‌లో రెండో సారి స్లో ఓవర్‌ రేట్‌కు కారుకుడు కావడంతో అతనికి భారీ జరిమానా పడింది.కాగా, లక్నో సూపర్‌ జెయింట్స్‌తో నిన్న జరిగిన లో స్కోరింగ్‌ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 4 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై.. లక్నో బౌలర్లు రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 144 పరుగులు మాత్రమే చేసింది.ఇషాన్‌ కిషన్‌ (32), నేహల్‌ వధేరా (46), టిమ్‌ డేవిడ్‌ (35 నాటౌట్‌) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రోహిత్‌ శర్మ (4), సూర్యకుమార్‌ (10), తిలక్‌ వర్మ (7), హార్దిక్‌ పాండ్యా (0), మొహమ్మద్‌ నబీ (1) విఫలమయ్యారు. లక్నో బౌలర్లలో మొహిసిన్‌ ఖాన్‌ 2 వికెట్లు పడగొట్టగా.. స్టోయినిస్‌, నవీన్‌ ఉల్‌ హక్‌, మయాంక్‌ యాదవ్‌, రవి బిష్ణోయ్‌ తలో వికెట్‌ పడగొట్టారు.145 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లక్నో.. ఆపసోపాలు పడి 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. స్టోయినిస్‌ (62) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ ఆడి లక్నోను గెలిపించాడు. రాహుల్‌ (28), దీపక్‌ హూడా (18), పూరన్‌ (14 నాటౌట్‌) రెండంకెల స్కోర్లు చేశారు. ముంబై బౌలర్లలో హార్దిక్‌ పాండ్యా 2 వికెట్లు పడగొట్టగా.. నువాన్‌ తుషార, గెరాల్డ్‌ కొయెట్జీ, నబీ తలో వికెట్‌ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో ఓటమితో ముంబై ప్లే ఆఫ్స్‌ అవకాశాలు గల్లంతు కాగా.. లక్నో ఈ సీజన్‌ ఆరో విజయం సాధించి, పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది.

Harish Kumar Comments Karishma Kapoor Saving His Life
ఆ హీరోయిన్ నన్ను మునిగిపోకుండా కాపాడింది: టాలీవుడ్ హీరో

సినిమా షూటింగ్ అంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయినా సరే ప్రమాదాలు జరుగుతుంటాయి. త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న సందర్భాలు కూడా ఉంటాయి. ఒకప్పుడు టాలీవుడ్ హీరో కమ్ నటుడు హరీశ్ కుమార్ ఇలాంటి ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు. హీరోయిన్ కరిష్మా కపూర్ తనని కాపాడిందని, లేదంటే చనిపోయేవాడిని అని చెప్పుకొచ్చాడు. ఇంతకీ అసలేం జరిగింది? హరీశ్ ఏం చెప్పాడు?1990ల్లో హీరోగా ఒక్కసారిగా క్రేజ్ తెచ్చుకున్న నటుడు హరీశ్ కుమార్. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. చాలా చిన్న వయసులోనే 'ప్రేమ్ ఖైదీ' మూవీతో హిందీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రంలో స్విమ్మింగ్ పూల్ సీన్ ఉంటుంది. అది షూట్ చేస్తున్న సమయంలో తాను త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నానని, అప్పటి విషయాల్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో హరీశ్ కుమార్ షేర్ చేసుకున్నాడు.(ఇదీ చదవండి: పవన్ కల్యాణ్‌కి షాక్.. సినిమా నుంచి స్టార్ డైరెక్టర్ తప్పుకొన్నాడా?)'కరిష్మా.. స్విమ్మింగ్ పూల్‌లో దూకుతుంది. ఆ తర్వాత నేను పూల్‌లో దూకి ఆమెని కాపాడతాను. సినిమాలో మీరు చూసిందైతే ఇదే. కానీ షూటింగ్‌లో మొత్తం రివర్స్‌లో జరిగింది. నాకు స్విమ్మింగ్ రాదు. దీంతో పూల్‌లో దూకిన కాసేపటికే నేను మునిగిపోయాను. నేను ప్రాంక్ చేస్తున్నానని అందరూ అనుకున్నారు. కానీ కరిష్మా నన్ను పట్టుకుంది. నేను ఆమె స్విమ్ సూట్‌ని పట్టుకున్నాను. అలా ఆ రోజు ప్రాణాలతో బయటపడ్డాను' అని నటుడు హరీశ్ కుమార్ చెప్పుకొచ్చాడు.హరీశ్ కుమార్.. తెలుగులో కొండవీటి సింహం, రౌడీ ఇన్‌స్పెక్టర్, పెళ్లాం చెబితే వినాలి, కొండపల్లి రత్తయ్య, గోకులంలో సీత తదితర చిత్రాల్లో నటించాడు. హిందీ, మలయాళంలోనూ పలు మూవీస్ చేశాడు. 2017 వరకు నటుడిగా పనిచేశాడు గానీ ఆ తర్వాత పెద్దగా బయట కనిపించట్లేదు.(ఇదీ చదవండి: మొటిమలకు సర్జరీ చేయించుకున్నారా? సాయిపల్లవి ఆన్సర్ ఇదే)

know your sim cards status in Govt website and will update
మీపేరుపై ఎన్ని సిమ్‌కార్డులున్నాయో తెలుసుకోండిలా..

ప్రస్తుతకాలంలో చాలామంది ఒకటికంటే ఎక్కువ ఫోన్లు వాడుతున్నారు. వాటిలో రెండు కంటే ఎక్కువ సిమ్‌కార్డులు వినియోగిస్తున్నారు. అయితే గతంలో మీపేరుతో ఎప్పుడో ఒకపుడు సిమ్‌కార్డులు తీసుకునే ఉంటారు. కేంద్రం నిబంధనల ప్రకారం ఒకరి పేరుమీద గరిష్ఠంగా 9 సిమ్‌కార్డులే ఉండాలి.ప్రభుత్వ వెబ్‌సైట్‌ సంచార్‌సాతి వెబ్‌సైట్‌ ద్వారా మీరు గతంలో తీసుకున్న నంబర్లు, ప్రస్తుతం వాడుతున్న సిమ్‌కార్డుల వివరాలు తెలుసుకోవచ్చు. దీనిద్వారా గతంలో తీసుకుని వినియోగంలోలేని సిమ్‌కార్డులను నేరుగా ఆన్‌లైన్‌లోనే బ్లాక్‌ చేసుకునే సౌకర్యం ఉంది. అది ఎలాగో తెలుసుకుందాం.బ్రౌజర్‌లో https://sancharsaathi.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.కింద సిటిజన్‌ సెంట్రిక్‌ సర్వీసెస్‌ కేటగిరీలో ‘Know Your Mobile Connections’ క్లిక్‌ చేయాలి. ఈ సర్వీస్‌ టెలికాం అనలిటిక్స్‌ ఫర్‌ ఫ్రాడ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ కన్జూమర్‌ ప్రొటెక్షన్‌(టీఏఎఫ్‌సీఓపీ) అందిస్తోంది.‘Know Your Mobile Connections’పై క్లిక్‌ చేసిన వెంటనే కొత్త విండో ఓపెనె అవుతుంది. అందులో ప్రస్తుతం వాడుతున్న మొబైల్‌నంబర్‌ను ఎంటర్‌ చేయాలి. కింద క్యాప్చా కోడ్‌ను ఇవ్వాలి. ‘వాలిడేట్‌ క్యాప్చా’ బటన్‌ ప్రెస్‌ చేయాలి.పైన ఇచ్చిన మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని కింద తెలిపిన బ్లాక్‌లో ఎంటర్‌చేసి లాగిన్‌ అవ్వాలి. మన పేరుతో ఏ నంబర్లు రిజిస్ట్రర్‌ అయ్యాయో వాటి వివరాలతో లిస్ట్‌ వస్తుంది.ఇదీ చదవండి:  రోజులో ఒకసారైనా ఓపెన్‌ చేసే ఈ యాప్‌ గురించి తెలుసా..?ఒకవేళ ఏదేని నంబర్‌ను నిలిపేయాలంటే పక్కనే ఆప్షన్లు ఉంటాయి. వాటిపై క్లిక్‌ చేసి సబ్మిట్‌ చేయాలి. చివరగా లాగ్‌అవుట్‌ చేయాలి.

BJP Key Announcement Over Muslim Reservations
చంద్రబాబు, పవన్‌కు పొలిటికల్‌ ట్విస్ట్‌.. బీజేపీ కీలక ప్రకటన!

సాక్షి, హైదరాబాద్‌: ఏపీలో ఎ​న్నికల వేళ కూటమిలో కొత్త ట్విస్ట్‌ చోటుచేసుకుంది. టీడీపీ, జనసేనకు బీజేపీ ఊహించని షాకిచ్చింది. ముస్లిం రిజర్వేషన్ల రద్దుపై బీజేపీ కట్టుబడి ఉంటుందని.. తెలుగుదేశం, జససేన ని​ర్ణయాలకు అనుకూలంగా ఉండలేమని బీజేపీ చెప్పకనే చెప్పేసింది.ఇక, ముస్లిం రిజర్వేషన్ల అంశంపై ఇప్పటికే డీప్‌ ఫేక్‌ వీడియోల వ్యవహారం సోషల్‌ మీడియా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ ముస్లిం రిజర్వేషన్లపై ట్విట్టర్‌ వేదికగా కీలక ప్రకటన చేసింది. ఈ సందర్భంగా కేంద్ర పార్టీ నిర్ణయాన్ని ఏపీ బీజేపీ మరోసారి పునర్ఘటించింది. ఈ క్రమంలో ముస్లిం రిజర్వేషన్ల రద్దుకే కట్టుబడి ఉన్నామని బీజేపీ స్పష్టం చేసింది. దీంతో.. టీడీపీ, జనసేన నిర్ణయాలకు తాము అనుకూలంగా లేమని బీజేపీ చెప్పకనే చెప్పేసింది. Truth: If BJP comes into power, we will make an end of the unconstitutional Muslim reservations. Meanwhile it's the right of SC, ST & OBC people of Telangana. We will ensure them that they get it. Therefore, We will end the Muslim Reservations.Fake Video: If BJP comes to power,… pic.twitter.com/4OxR8LP9Z9— BJP ANDHRA PRADESH (@BJP4Andhra) April 30, 2024బాబును నమ్మని బీజేపీ ఈ ఎన్నికల్లో మళ్లీ బీజేపీతో పొత్తుకు చంద్రబాబు వెంపర్లాడినప్పటికీ, ఆ పార్టీ జాతీయ నాయకత్వం తొలుత అంగీకరించలేదు. చంద్రబాబు ఢిల్లీలోని తన ఏజెంట్లు, బీజేపీలో ఉన్న తన అనుంగులు, ఇతరత్రా పైరవీలు చేశారు. అయినా బీజేపీ పెద్దలు ఆయన్ని నమ్మలేదు. ఢిల్లీలో రాత్రింబవళ్లు పడిగాపులు గాసి, కాళ్లా వేళ్లా పడి చిట్టచివరకు పొత్తు పెట్టుకోగలిగారు. బీజేపీ పొత్తయితే పెట్టుకొంది కానీ, చంద్రబాబును ఆ పార్టీ పెద్దలు నమ్మడంలేదన్న విషయం ప్రతి సందర్భంలోనూ బయటపడుతోంది. రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన గెలుపే అసాధ్యమైతే, మేనిఫెస్టో విషయంలోనూ మరోసారి అభాసుపాలు కాకూడదని బీజేపీ అధిష్ఠానం భావించింది. దీంతో ఈసారి మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి ఓ పరిశీలకుడిని మాత్రమే పంపి మమ అనిపించింది. కనీసం రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరి, పార్టీ రాష్ట్ర నాయకులు కూడా హాజరుకాలేదు.అంతేకాదు.. మేనిఫెస్టోలో కనీసం ప్రధాని మోదీ ఫొటోగానీ, కమలం గుర్తు గానీ ముద్రించేందుకు బీజేపీ పెద్దలు అంగీకరించలేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, హోంమంత్రి అమిత్‌షా, రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఫొటోలు ముద్రించేందుకు కూడా ఒప్పుకోలేదు. అయితే, చంద్రబాబు తెలివిగా మేనిఫెస్టో కాపీలపై మోదీ, ఇతర నాయకుల ఫొటోలు లేకుండా, కమలం గుర్తును మాత్రం వేయించారు. బీజేపీ దీనికీ అంగీకరించలేదు. దాన్ని మార్చాల్సిందేనని పరిశీలకుడు సిద్ధార్థనాథ్‌సింగ్‌ పట్టుబట్టారు. దీంతో మేనిఫెస్టో ముఖచిత్రంలో అప్పటికప్పుడు మార్పులు చేశారు.

May day international labour day 2024 special story
May Day Special Story: ఖరీదు కట్టే షరాబు లేడు

ప్రతి శ్రమకూ ఒక విలువ ఉంటుంది.పురుషుడు విలువ కలిగిన శ్రమే చేస్తాడు. అతడిది ఉద్యోగం.స్త్రీ విలువ కట్టని ఇంటి పని చేస్తుంది.ఆమెది చాకిరి.భారతదేశంలో స్త్రీ, పురుషుల్లో స్త్రీలుఅత్యధిక గంటలు ఏ ఖరీదూ లేనిఇంటి పనుల్లో మునిగి ఉంటున్నారనిసర్వేలు చెబుతున్నాయి.దేశ యంత్రాంగాలు అంతరాయంలేకుండా ముందుకు సాగడంలోఈ శ్రమ నిశ్శబ్ద ΄ాత్ర వహిస్తోంది.స్త్రీల శ్రమకు విలువ కట్టలేక΄ోతేకనీసం గౌరవం ఇవ్వడమైనా నేర్వాలి. ఇంతకు ముందు వివరించి చెప్పడం కొంత కష్టమయ్యేది. ఇప్పుడు అర్బన్‌ క్లాప్‌ వంటి సంస్థలు వచ్చాయి కనుక సులువు. అర్బన్‌ క్లాప్‌ వారికి బాత్‌రూమ్‌ల క్లీనింగ్‌ కోసం కాల్‌ చేస్తే వాళ్లు ఒక్కో బాత్‌రూమ్‌కు ఇంతని చార్జ్‌ చేస్తారు. ఇంట్లో రెండుంటే రెంటికీ చార్జ్‌ పడుతుంది. అదీ ఒకసారికి. అమ్మ వారంలో రెండు సార్లు, నెలలో ఏడెనిమిది సార్లు రెండు బాత్‌రూమ్‌లు కడుగుతుంది. ఆమెకు ఆ చార్జ్‌ మొత్తం ఇవ్వాలి లెక్క ప్రకారం. అలాగే కిచెన్‌ క్లీన్‌ చేయాలంటే కూడా ఒక చార్జ్‌ ఉంటుంది. అమ్మ రోజూ వంటిల్లు సర్దిసర్ది, ΄్లాట్‌ఫామ్‌ కడిగి, స్టవ్‌ రుద్ది క్లీన్‌ చేస్తుంది. ఆ చార్జ్‌ కూడా ఆమెకు ఇవ్వాలి. అమ్మ శ్రమకు కనీసం విలువ కట్టాలని కొన్ని సందర్భాలలో కోర్టులు కూడా అంటున్నాయి. కొన్ని సంస్థలు అమ్మ శ్రమను ఎలా విలువ కట్టవచ్చో కూడా చెబుతున్నాయి.1. ఆపర్చునిటీ కాస్ట్‌ మెథడ్‌: అంటే అమ్మ బయటకు వెళ్లి ఉద్యోగం చేస్తే నలభై వేలు వస్తాయనుకుంటే, ఆమె  ఆ ఉద్యోగం మానుకుని ఇంట్లో ఉండి΄ోతే ఆమె శ్రమ విలువను నెలకు నలభై వేలుగా గుర్తించాలి. (అమ్మ ఉద్యోగం చేసి కూడా అంత శ్రమా చేస్తుంటే నలభైకి మరో నలభై కలిపి ఇంటికి ఇస్తున్నట్టు).2. రీప్లేస్‌మెంట్‌ కాస్ట్‌ మెథడ్‌: ఇల్లు చిమ్మడం, బట్టలుతకడం, ఆరిన బట్టల్ని మడత పెట్టడం, ఇస్త్రీ చేయడం, మొక్కలకు నీళ్లు పోయడం, కూరగాయలు, సరుకులు తెచ్చుకోవడం, బిల్లులు కట్టడం, వంట చేయడం, ఇంటిని కనిపెట్టుకుని ఉండటం... వీటన్నింటినీ బయట వ్యక్తులతో సర్వీసుగా తీసుకుంటే (అర్బన్‌ క్లాప్‌ మాదిరిగా) ఎంత అవుతుందో లెక్కగట్టి అది అమ్మ చేసే పని శ్రమగా గుర్తించడం.3. ఇన్‌పుట్‌/అవుట్‌పుట్‌ కాస్ట్‌ మెథడ్‌: అలా కాకుండా ఈ పనులన్నింటికీ ఒక యోగ్యమైన ఉద్యోగిని పెట్టుకుంటే మార్కెట్‌ అంచనాను బట్టి ఎంత జీతం ఇవ్వాల్సి వస్తుందో అంత జీతం ఇవ్వడం.అవన్నీ సరే. కంటికి కనిపించే పనులకు కట్టే విలువ. కాని పిల్లవాడు స్కూల్లో పడి దెబ్బ తగిలించుకుని ఇంటికి వస్తే అమ్మ దగ్గరకు తీసుకుని, మందు రాసి, ధైర్యం చెప్పి, వాడి పక్కన కూచుని కబుర్లు చెపుతుందే... ఆ ప్రేమకు విలువ కట్టే షరాబు ఉన్నాడా? మే డే రోజున ప్రపంచ కార్మికురాలా ఏకం కండి అనే నినాదాలు వినిపిస్తుంటాయి. కాని ఇంటి పని చేస్తూ, అది ఎక్కువైనా చేస్తూ, కుటుంబమంతా ఆ పనిలో భాగం కావాలన్న సంగతిని చెప్పడానికి కూడా తటపటాయిస్తూ, అది వద్దనుకుంటే ఆ ఆప్షన్‌ లేక, తప్పించుకోవడానికి వీల్లేని ఆ పనిని చేస్తూ కూడా విలువ లేని పని చేస్తున్నామన్న న్యూనతను అనుభవిస్తూ తమ హక్కులు ఏమిటో తమకే తెలియని తల్లి, భార్య, కుమార్తె, చెల్లెళ్లను కార్మికులుగా గుర్తించాలని ఎవరూ అనుకోరు.స్త్రీల ఇంటి శ్రమ దేశంలోని యంత్రాంగం సజావుగా పనిచేయడంలో కీలకమైనది. వారు... దేశం కోసం పని చేసి రిటైరైన వృద్ధుల సేవలో ఉంటారు.  దేశానికి ఆదాయం తెచ్చిపెట్టే యువత సేవలో ఉంటారు. దేశానికి భవిష్యత్తులో అంది రావాల్సిన పిల్లల సేవలో ఉంటారు.  ‘కుటుంబం’ అనే బంధంలోకి వచ్చి కూతురిగా, కోడలిగా, భార్యగా వీరు ‘ప్రేమ’తో, ‘బాధ్యత’తో, ‘బంధం’తో ఈ సేవ చేస్తారు. అంత మాత్రం చేత ఈ సేవను నిరాకరించడానికి వీల్లేదు. శ్రమగా చూడక్కర్లేదని భావించకూడదు. ఇంత చేస్తున్నా ‘ఇంట్లో కూచుని ఏం చేస్తుంటావ్‌?’ అనే మాటను వాళ్లు పడాలా?ఉద్యోగం చేసినా చేయక΄ోయినా ఒక గృహిణి రోజుకు సగటున మూడున్నర గంటలు ఇంటి పని చేస్తుంటే పురుషుడు కేవలం గంటన్నర ఇంటి పని చేస్తున్నాడు.స్త్రీలు తమ ఇంటి పనిని ఒక్కరోజు మానేసి సహాయనిరాకరణ చేస్తే దేశం స్తంభిస్తుంది. అందుకే స్త్రీల శ్రమను గౌరవించే మే డే రోజున వారికి కృతజ్ఞతలు తెలియచేయాలి. విలువైన శ్రమ చేస్తున్నందుకు సమాజం వారికి హర్షధ్వానాలు తెలియచేయాలి.      

BJP Not involved At ap Alliance Manifesto Release Modi stamp missing
టచ్ మీ నాట్... దూరం జరగండమ్మా

మొత్తానికి రాష్ట్రంలో టీడీపీ సారధ్యంలో ఏర్పడిన ఎన్డీయే కూటమి మనసులు కలవని బలవంతపు కాపురం అని తేలిపోయింది. తప్పనిసరి తంతు తప్ప అందులో తమకేం పెద్ద పాత్ర లేదని బీజేపీ భావిస్తోంది. అందుకే మీ పాట్లేవో మీరు పడండి... అందులో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకండి నాయుడుగారు అని స్పష్టంగా చెబుతోంది. వాస్తవానికి టీడీపీ.. జనసేన... బీజేపీల కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టోను విడుదల చేసే కార్యక్రమానికి చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.దీనికి జాతీయ బీజేపీ నేత సిద్దార్థ నాథ్ సింగ్ సైతం ఢిల్లీ నుంచి వచ్చారు. అయితే ఆ మ్యానిఫెస్టో కాపీ మీద ఎక్కడా మోడీ ఫోటో లేదు. కేవలం చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రమే ఉన్నాయి. అంతేకాకుండా ఆ మ్యానిఫెస్టో కాపీని విడుదల చేసే సమయంలో వరుసగా ఈ ముగ్గురు నాయకులూ నిలబడి ఫోటోలకు.. పత్రికలకు ఫోజులిచ్చారు. అయితే ఆ సందర్భంగా ఆ కాపీని చేత్తో పట్టుకుని బాబు, పవన్ పక్కన నిలబడేందుకు సైతం సింగ్ విముఖత చూపించారు. ఎవరో వచ్చి ఆ కాపీని సింగ్‌కు ఇస్తుండగా అక్కర్లేదు.. అంటూ నేను దాన్ని తాకను అనేలా సంజ్ఞ చేసారు. ఆ తరువాత అయన మీడియాతో మాట్లాడుతూ ఈ మ్యానిఫెస్టో ఈ ఇద్దరిదే.. మా బీజెపికి ఏమీ సంబంధం లేదని చెప్పేసారు. అంతేకాకుండా రాష్ట్ర బిజెపి నుంచి సైతం ఈ కార్యక్రమానికి ఎవరూ.. ఆఖరుకు అధ్యక్షురాలు పురంధేశ్వరి సైతం హాజరు కాలేదు. దీంతో ఇది జస్ట్ పవన్... జనసేనల పొత్తు అని తేలిపోయింది.అసలేం జరిగింది ?గతంలో 2014 లో సైతం ఇలాగే మూడు పార్టీలు పొత్తులో ఎన్నికలకు వెళ్లాయి. అప్పుడు చంద్రబాబు దాదాపు ఆరువందల హామీలు ఇచ్చి.. ఆ తరువాత మాటతప్పి.. మ్యానిఫెస్టోను పార్టీ వెబ్‌సైట్‌ నుంచి మాయం చేసారు. ఇప్పుడు ఆ మ్యానిఫెస్టోను సీఎం వైఎస్ జగన్ బయటకు తీసి.. ఒక్కో హామీని ప్రజలకు గుర్తు చేస్తూ ఈ హామీ ఇచ్చారు. అమలు చేసారా అక్కా.. రుణమాఫీ చేసారా అన్నా.. పెన్షన్ ఇచ్చారా తాతా.. డ్వాక్రా రుణాలు మాఫీ చేసారా చెల్లి.. ఉద్యోగాలు ఇచ్చారా తమ్ముడూ.. చూడండి ఈ హామీలకు అప్పట్లో మోడీ.. పవన్ సైతం గ్యారెంటీలుగా ఉన్నారు. వాళ్ళ ఫోటోలు సైతం ఉన్నాయ్. మళ్ళీ అలాంటి వాళ్లకు ఓట్లెద్దామా అంటూ ఊరూరా ప్రచారం చేయడంతో.. చంద్రబాబు ఇచ్చే అమలుసాధ్యం కానీ హామీలవల్ల మేమెందుకు ప్రజలకు జవాబుదారీ కావాలి...? మేమెందుకు పరువుపోగొట్టుకోవాలని భావించిన బీజేపీ ఈసారి ఆ హామీల విషయంలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయద్దు నాయుడుగారు.. మీరు మీరు.. ఏదోలా తగలడండి అనేసింది. అంతేకాకుండా దానిమీద మోదీ ఫోటో సైతం వేసేందుకు కేంద్రం ఒప్పుకోలేదని తెలిసింది. అందుకే ఈసారి మ్యానిఫెస్టో మీద కేవలం.. చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రమే ఉన్నాయ్. మరోవైపు బాబు ఇస్తున్న హామీలకు మా కేంద్రానికి, బీజేపీకి ఎలాంటి బాధ్యత లేదని వాళ్ళు తేల్చేశారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్ల విషయంలో కూడా చంద్రబాబు తమను మోసం చేసినట్లు కేంద్రం గుర్తించింది. పీవీఎన్ మాధవ్, జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజు వంటివాళ్లకు టిక్కెట్లు ఇవ్వకుండా కేవలం టీడీపీ నాయకులనే బీజెపి నేతలుగా చూపించి టిక్కెట్లు ఇచ్చుకుని అసలైన బీజెపి నేతలను మోసం చేసారని అధిష్టానం గమనించింది. అంటే ఎన్ని చేసినా.. ఎంత చేసినా కుక్కతోక వంకరే అని.. చంద్రబాబులోని మోసపూరిత గుణం మారదని స్పష్టతకు వచ్చిన కేంద్రం.. అసలు ఈ దరిద్రమే మాకువద్దు. మీ చావు మీరు చావండి. మీ ఎన్నికలు.. మ్యానిఫెస్టోలో మాకు ఏమీ సంబంధం లేదని తేల్చేసింది.:::: సిమ్మాదిరప్పన్న 

తప్పక చదవండి

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement