Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Jagan Kosam Siddham YSRCP Taking Manifesto To Every House
YSRCP మరో అడుగు.. ఇక ఇంటింటికీ మేనిఫెస్టో

గుంటూరు, సాక్షి: పోలింగ్‌ తేదీ దగ్గర పడుతుండడంతో.. ఏపీలో ఎన్నికల  ప్రచారం జోరందుకుంది. జనంలోకి చొచ్చుకుపోయేలా.. మరీ ముఖ్యంగా ప్రతిపక్ష కూటమికి వెన్నులో వణుకు పుట్టించేలా  ఉంటున్నాయి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రచార ప్రసంగాలు. మరోవైపు పార్టీ అధినేత ఆదేశాలనుసారం పార్టీ శ్రేణులు సైతం ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి.జగన్‌ కోసం సిద్ధం.. ఇదీ ఇప్పుడు వైఎస్సార్‌సీపీ చేపట్టిన కొత్త కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రతీ ఇంటికి వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో-2024ను చేరవేయడం లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా.. సీఎంగా జగన్‌ ఉంటేనే రాష్ట్రంలో సంక్షేమం కొనసాగుతుందని, పేదల భవిష్యత్తు మారుతుందని ప్రచారం చేయనుంది. ఇవాళ పార్టీ కీలక నేతలు ఈ కార్యక్రమం ప్రారంభించనున్నారు   మొదటి నుంచి తన ప్రసంగాల్లో, ఎన్నికల ప్రచారంలోనూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సంక్షేమం పొందిన సామాన్యులే తన స్టార్‌ క్యాంపెయినర్లంటూ సీఎం జగన్‌ చెబుతూ వస్తున్నారు. దీంతో ఆ సామాన్యుల్నే ఇప్పుడు జగన్‌ కోసం సిద్ధం కార్యక్రమంలో భాగం చేయబోతోంది పార్టీ.మేనిఫెస్టోను దాదాపుగా పూర్తి స్థాయిలో(99 శాతం పైనే) అమలు చేసింది వైఎ‍స్సార్‌సీపీనే కాబోలు!. అలవుగాని హామీలను ఇవ్వబోమని, చేయగలిగింది మాత్రమే చెబుతామని, చెప్పిందే చేస్తామని, ఏ మాత్రం అవకాశం ఉన్నా ఇంకా ఎక్కువే చేస్తామని మేనిఫెస్టో ప్రకటన సమయంలో సీఎం జగన్‌ స్పష్టం చేశారు. అంతేకాదు.. మేనిఫెస్టోను ఓ ప్రొగ్రెస్‌ రిపోర్టులాగా.. 58 నెలల కాలంలో ఎప్పటికప్పుడు చేసిన అభివృద్ధిని వివరిస్తూ వస్తున్నామంటూ పేర్కొన్నారాయన.  దీంతో ఈ హామీలనే జనాల్లోకి బలంగా తీసుకెళ్లాలని, తద్వారా మరోసారి ప్రజల ఆదరణ చురగొనాలని  వైఎస్సార్‌సీపీ భావిస్తోంది.

AP Politics And Election Live Updates May 2nd
AP Election Updates May 2nd: ఏపీ ఎన్నికల అప్‌డేట్స్‌

Andhra Pradesh Election Updates 2nd May..జనసేనకు ఈసీ ఝలక్‌1:45 PM, May 2nd, 2024ఏపీలో ఎన్నికల వేళ జనసేనకు హైకోర్టులో చుక్కెదురైంది. ఎన్నికల్లో గాజు గ్లాస్‌ గుర్తును రిజర్వ్‌ చేయలేమని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని హైకోర్టుకు ఈసీ వెల్లడించింది.గాజు గ్లాస్‌ గుర్తును తమకు మాత్రమే రిజర్వ్‌ చేసేలా ఈసీకి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో జనసేన పిటిషన్‌ దాఖలుఈ పిటిషన్‌పై నేడు విచారణ జరిగింది. ఏపీవ్యాప్తంగా గాజు గ్లాస్‌ గుర్తును రిజర్వ్‌ చేయలేమని ఎన్నికల సంఘం.. హైకోర్టుకు తెలిపింది. అలాగే, ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే మొదలైంది.ఈ సమయంలో వేరే వారికి ఇచ్చిన సింబల్‌ మార్చలేమని ఈసీ కోర్టుకు వెల్లడించింది.జనసేన పిటిషన్‌కు విచారణ అర్హత లేదని ఈసీ పేర్కొంది. ఇలా చేస్తే ఎన్నికలు జరిగే వరకు పిటిషన్లు వస్తూనే ఉంటాయని ఈసీ.. కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఇప్పటికే ఎలక్ట్రానిక్‌ బ్యాలెట్‌లను ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌కు పంపించినట్టు ఈసీ స్పష్టం చేసింది. అలాగే, జనసేన పార్టీ తెలిపిన అభ్యంతరాలపై బుధవారమే కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు కోర్టుకు ఈసీ పేర్కొంది.  బాబుపై అన్నా రాంబాబు ఫైర్‌12:30 PM, May 2nd, 2024ప్రకాశం జిల్లాచంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ మార్కాపురం అభ్యర్థి అన్నా రాంబాబు ఫైర్ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై చంద్రబాబు అనవసర అపోహలు సృష్టిస్తున్నాడుఅసలు లేని సమస్యను సృష్టించి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారుచంద్రబాబు మాటలను నమ్మే పరిస్థితిలో జనం లేరు.14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి ప్రజలకు ఏం చేశాడో చెప్పుకోలేని దుస్థితిలో చంద్రబాబు ఉన్నాడు.చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలి  టీడీపీ మేనిఫెసో ఒక అబద్ధం: కైలే అనిల్‌ కుమార్‌11:30 AM, May 2nd, 2024పామర్రు నియోజకవర్గం నిడుమోలులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే అభ్యర్ధి కైలే అనిల్ కుమార్అడుగడుగునా కైలేకు ఘనస్వాగతం పలుకుతున్న ప్రజలుకైలే అనిల్ కుమార్ కామెంట్స్‌..ప్రజలంతా సీఎం జగన్‌ పాలనే మళ్లీ కావాలనుకుంటున్నారుఎంతమంది కలిసి వచ్చినా ముఖ్యమంత్రి జగన్‌ను ఏమీ చేయలేరని ప్రజలు విశ్వసిస్తున్నారుటీడీపీ మేనిఫెసో ఒక అబద్ధంజగన్ మోనిఫెస్టో నమ్మకంతో కూడిన ఒక నిజంఅబద్ధం, మోసంతో ఏదోరకంగా అధికారంలోకి రావాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడుచంద్రబాబుపై బీజేపీకే నమ్మకం లేదుకలిసి ప్రయాణం చేస్తున్న బీజేపీనే నమ్మకపోతే.. ప్రజలు ఎలా నమ్ముతారుపామర్రులో నూటికి 99% శాతం ప్రజలకిచ్చిన వాగ్ధానాలు నెరవేర్చాంమరో అవకాశం ఇస్తే మరింతగా పామర్రు ప్రజలకు సేవచేస్తాపామర్రులో నేను.. మచిలీపట్నం ఎంపీగా సింహాద్రి చంద్రశేఖర్ అత్యధిక మెజార్టీతో గెలుస్తాం ‘జగన్‌ కోసం సిద్ధం’11:00 AM, May 2nd, 2024మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వైఎస్సార్‌సీపీ"జగన్ కోసం సిద్ధం" పేరుతో మరో ప్రచార కార్యక్రమంనేడు ప్రారంభించనున్న పార్టీ నేతలుమేనిఫెస్టోని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం  సిద్ధంపార్టీ స్టార్ క్యాంపెయినర్లతో కలిసి ఇంటిఇంటికీ మేనిఫెస్టో టీడీపీ నేతలకు దేవినేని అవినాష్ కౌంటర్‌10:00 AM, May 2nd, 202412వ డివిజన్‌ను 13 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసాముస్థానిక టీడీపీ ఎంఎల్ఏ ఇంటి ముందు రోడ్ కూడా జగన్ ప్రభుత్వమే వేసిందిడివిజన్‌లో 20 కోట్లతో  సంక్షేమం చేసాముప్రతీ గడపలో సీఎం జగన్‌కే మా ఓటు అని చెబుతున్నారుజగన్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే అడ్డుకోవటానికి సిగ్గులేదా?స్వప్రయోజనాలు తప్ప ప్రజా సమస్యలు గద్దెకి పట్టవుతూర్పు నియోజకవర్గం ఏమైనా మీ జాగీరా?.ఓటమి భయంతోనే దిగజారుడు రాజకీయాల చేయడం టీడీపీ నేతలకే దక్కిందిరెండుసార్లు ఎంఎల్ఏ ఒకసారి ఎంపీ అనుభవం అంటే ఇదేనా?రానున్న ఎన్నికలే గద్దెకు ఆఖరి ఎన్నికలుకాలనీల అభివృద్ధికి స్థానిక ప్రజల కాంట్రిబ్యూషన్ అడిగింది వాస్తవం కాదాప్రజానీకానికి మంచి చేస్తుంటే అడ్డుకోవడం దుర్మార్గంప్రజలు మీ చిల్లర చేష్టలు గమనిస్తున్నారుఇంకా పూర్తి స్థాయిలో వృద్దులకు, వితంతువులకు పెన్షన్ అందలేదు  నేటి నుంచి కృష్ణా జిల్లాలో హోమ్ ఓటింగ్..9:30 AM, May 2nd, 2024ఇంటివద్దనే ఓటు హక్కు వినియోగించుకోనున్న వయోవృద్ధులు ,దివ్యాంగులుహోమ్ ఓటింగ్ కోసం జిల్లా వ్యాప్తంగా 35 బృందాలు ఏర్పాటుగన్నవరం, పెనమలూరు, అవనిగడ్డ నియోజకవర్గాలలో 6 బృందాలు ఏర్పాటుపామర్రు నియోజకవర్గంలో 5 బృందాలు ఏర్పాటుమచిలీపట్నం, పెడన, గుడివాడ నియోజక వర్గాలలో 4 బృందాలు ఏర్పాటుఒక్కో హోమ్ ఓటింగ్ బృందంలో ఒక ప్రిసైడింగ్ అధికారి, ఒక సహాయ పోలింగ్ అధికారి, ఒక సూక్ష్మ పరిశీలకులు, ఒక వీడియో గ్రాఫర్,  పోలీస్ ఎస్కార్ట్ ఉండేలా చర్యలు ఉంటాయన్నారుహోమ్ ఓటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న 85 ఏళ్లు పైబడిన ఓటర్లు 9,114 మంది, దివ్యాంగులు 22,429 మంది  రెండు సార్లు జరుగనున్న హోమ్ ఓటింగ్ ప్రక్రియ  నేటి నుంచి మే 6 వరకూ ఒకసారిమే 7 నుంచి 8 వరకూ రెండోసారి హోమ్ ఓటింగ్‌కు అవకాశం మహాసేన రాజేష్‌కు ఘోర అవమానం..8:20 AM, May 2nd, 2024అవనిగడ్డలో టీడీపీ నేత మహాసేన రాజేష్‌కు అవమానంఎన్నికల ప్రచారానికి మహాసేన రాజేష్‌తో పాటు అంబటి రాయుడిని ఆహ్వానించిన జనసేన నాయకులుమోపిదేవి నుంచి అవనిగడ్డ వరకూ ర్యాలీ.. బహిరంగ సభ ఏర్పాటు చేసిన జనసేన నాయకులుమోపిదేవి కాలనీ అంబేద్కర్ విగ్రహం వద్ద స్వాగతం పలుకుతామని మహాసేన రాజేష్‌కు ఆహ్వానంమహాసేన రాజేష్ రాకుండానే అంబటి రాయుడితో కార్యక్రమం ప్రారంభించేసిన జనసేన నాయకులుతనను పిలిచి అవమానించడంతో జనసేన నేతల తీరుతో ఆగ్రహం వ్యక్తం చేసిన రాజేష్చల్లపల్లి నుంచి వెనుదిరిగిన మహాసేన రాజేష్జనసేన పార్టీలో దళితులపై వివక్ష మారలేదని తన అనుచరుల వద్ద వాపోయిన రాజేష్తన సీటు విషయంలో జనసేన చేసిన యాగీ మరిచిపోయి పొత్తు ధర్మం కోసం జనసేన తరుపున ప్రచారానికి వస్తే అవమానించారని  సన్నిహితుల వద్ద వాపోయిన రాజేష్ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వెనుతిరిగిన రాజేష్రాజేష్‌ను పిలిచి అవమానించారంటూ జనసేన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న దళిత సంఘాలు మధ్య తరగతికి మరింత భరోసా.. వైఎస్సార్‌సీపీ నవరత్నాలు ప్లస్‌ మేనిఫెస్టో7:45 AM, May 2nd, 2024వైఎస్సార్‌సీపీ నవరత్నాలు ప్లస్‌ మేనిఫెస్టోతో మరోసారి అండగా సీఎం జగన్‌పట్టణ ప్రాంతాల్లోని మధ్య ఆదాయ కుటుంబాలకు సరసమైన ధరలకే ఇళ్ల స్థలాలు123 పట్టణాల్లో ఎంఐజీ లే అవుట్ల అభివృద్ధిరూ.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలకు ఆరోగ్య భరోసారూ.25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సహాయంకాపు, ఈబీసీ నేస్తం ద్వారా ఒక్కో కుటుంబానికి ఐదేళ్లలో రూ.60 వేల సాయంప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు విదేశీ విద్యా దీవెనతో తోడ్పాటురూ.10 లక్షల వరకు రుణానికి కోర్సు ముగిసే వరకు పూర్తి వడ్డీ చెల్లింపుఆప్కాస్, ఆశ, అంగన్‌వాడీ, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు నవరత్న పథకాలుప్రభుత్వ ఉద్యోగులకు సొంత జిల్లాలోనే 60 శాతం ప్రభుత్వ ఖర్చుతో ఇంటి స్థలం ‘భృతి’.. అంతా భ్రాంతి.. నిరుద్యోగులపై చంద్రబాబు మాయా వల7:20 AM, May 2nd, 2024నిరుద్యోగులపై చంద్రబాబు మరోసారి మాయా వలజాబు రావాలంటే బాబు రావాలంటూ 2014 ఎన్నికల్లో ప్రచారంకరపత్రాలు వేసి ఊరూరా పంపిణీ ఇంటికో ఉద్యోగం.. లేదంటే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ.. అధికారంలోకి వచ్చాక నాలుగున్నరేళ్లపాటు ఆ ఊసేలేదుప్రతిపక్ష నేత అసెంబ్లీలో బాబును ఉక్కిరిబిక్కిరి చేస్తే అసలా పథకమే లేదన్న అచ్చెన్నఆ ఒత్తిడి తట్టుకోలేక 2017–18 బడ్జెట్‌లో నిరుద్యోగ భృతికి రూ.500 కోట్లు కేటాయింపుఅయినా అమలుచేయని చంద్రబాబు.. 2019 ఎన్నికలకు ఆరునెలల ముందు ముఖ్యమంత్రి యువ నేస్తం పేరుతో పథకంనెలకు రూ.1,000 చొప్పున ఇస్తామని ప్రకటనసవాలక్ష ఆంక్షలతో కేవలం 12 లక్షల మంది నిరుద్యోగులకు అర్హతకానీ, 2018 అక్టోబరులో కేవలం రూ.40 కోట్లు విడుదల చివరికి 1.62 లక్షల మంది మాత్రమే అర్హులని తేల్చిన బాబు1.70 కోట్ల నిరుద్యోగులను నిలువునా మోసం చేసిన బాబుఎన్నికలు రావడంతో మళ్లీ యువతకు గేలం.. నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి అంటూ మాయమాటలుబాబు గత చరిత్ర చూడండి.. ఆయన్ను నమ్మొద్దంటూ యువతకు విద్యావేత్తలు, మేధావులు హితవు వైఎస్సార్‌సీపీ ఓటు బ్యాంకును చీల్చడమే షర్మిల లక్ష్యం7:00 AM, May 2nd, 2024పాడేరు కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థితో మంతనాలతో స్పష్టీకరణచంద్రబాబు నాయుడుకు మేలు చేయడమే అజెండాఆడియో లీక్‌తో అడ్డంగా దొరికిపోయిన వైనంపాడేరు కాంగ్రెస్‌ టికెట్‌ తొలుత వంతల సుబ్బారావుకుఆ తర్వాత వైఎస్సార్‌సీపీ నుంచి వెళ్లిన బుల్లిబాబుకి కేటాయింపుపాడేరులో కాంగ్రెస్‌ రెబల్‌గా వంతల పోటీపోటీ నుంచి తప్పుకోవాలని వంతలను ఆదేశించిన షర్మిలవైఎస్సార్‌సీపీ ఓటు బ్యాంకు కోసమే తాను బాధ్యతలు తీసుకున్నట్లు వెల్లడి  పచ్చ మంద కుట్రలతో పెన్షన్‌దారులకు కష్టాలు.. 6:30 AM, May 2nd, 2024చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్‌దారులకు మరిన్ని కష్టాలుబ్యాంకుల చుట్టూ తిరుగుతున్న వృద్దులు, వికలాంగులువాలంటీర్ల ద్వారా పెన్షన్లను ఇవ్వడాన్ని అడ్డుకున్న చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ఎన్నికల సంఘం ఆదేశాలతో బ్యాంకు ఖాతాలో పెన్షన్ వేసిన ప్రభుత్వండబ్బులు డ్రా చేసుకోవటానికి పెన్షన్‌దారుల అవస్థలునిన్న అన్నమయ్య, నంద్యాల జిల్లాల్లో పెన్షన్ కోసం వెళ్లి వడదెబ్బతో ఇద్దరు మృతిగత నెలలో 39 మంది వృద్దులు మృతిఇంటికే వచ్చే పెన్షన్ ను అడ్డుకున్న చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ వైఖరిపై మండిపడుతున్న పెన్షన్‌దారులు

AP Pensioners facing Distribution Problems Infront of banks
ఏపీలో బ్యాంకుల వద్ద పెన్షన్‌దారుల కష్టాలు

గుంటూరు, సాక్షి: రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్‌దారులు కష్టాలు పడుతున్నారు. మండుటెండలో బ్యాంకుల ఎదుట వృద్దులు, వికలాంగులు క్యూ కట్టారు. చంద్రబాబు అండ్‌ కో బ్యాచ్‌ చేసిన కుట్రలకు ఈసీ వలంటీర్లను పెన్షన్లు పంపిణీ చేయనీయకుండా అడ్డుకున్న సంగతి తెలిసిందే.  చంద్రబాబు క్షుద్రరాజకీయం పెన్షనర్ల పాలిట శాపంగా మారింది. గత నెలలో పెన్షన్‌ కష్టాల కారణంగా 30 మందికి పైగా మృతిచెందడం చూశాం. తాజాగా అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.లక్కిరెడ్డిపల్లి మండలం కాకుళారం గ్రామం పిచ్చిగుంటపల్లెకు చెందిన ముద్రగడ సుబ్బన్న (80) అనే వృద్ధుడు మృతి చెందాడు. పింఛను డబ్బు కోసం రాయచోటిలోని కెనరా బ్యాంకుకు వెళ్లిన సుబ్బన్న.. బ్యాంకు ఎదుట నిలబడి ఉండగానే కింద పడిపోయాడు. దీంతో స్థానికులు గుర్తించి లేపే లోపు సుబ్బన్న మృతి చెందాడు. కుటుంబీకులకు సమాచారం ఇవ్వడంతో బంధువులు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. గ్రామస్తులు వృద్ధుడి మృతి విషయం అధికారులకు తెలియజేశారు.Heartbreaking to see pensioners in Andhra Pradesh struggling after Chandra Babu's removal of the volunteer system. These are the very people who've contributed their entire lives to the state's growth. pic.twitter.com/buLKhTihU9— Let's X OTT GLOBAL (@LetsXOtt) May 2, 2024 చంద్రబాబు కుట్రలకు పెన్షన్‌దారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇంటింటి పంపిణీని చంద్రబాబు అండ్‌ కో అడ్డుకుంది. ఎన్నికల సంఘం ఆదేశాలతో 49 లక్షల మందికి బ్యాంకు అకౌంట్లలో ప్రభుత్వం నగదు జమ చేసింది.Pensioners reaching banks for withdrawal #PensionersVsTDP pic.twitter.com/Y55Sov3J0I— Suma Tiyyagura (Manvitha) (@SumaTiyyaguraa) May 2, 2024వాటిని తీసుకునేందుకు వృద్దుల క్యూలో నిలబడలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎండవేడికి తాళలేక వృద్ధులు నీరసించిపోతున్నారు. ఏలూరు బ్యాంకుల వద్ద వృద్ధులు పెన్షన్‌ క కోసం పడిగాపులు కాస్తున్నారు. నెల్లూరు జిల్లాలో  పెన్షన్లు తీసుకోవడానికి వృద్ధులు, వికలాంగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.  కొందరి అకౌంట్లు పని చేయని పరిస్థితి నెలకొంది.Enough is enough! @JaiTDP must answer for their mistreatment of pensioners. Join the call for accountability! #PensionersVsTDP pic.twitter.com/uRPpHOOnSW— Prabal (@Prabal8_) May 2, 2024చంద్రబాబు తెచ్చిన తంటాతో పెన్షనర్ల అవస్థలు పడుతున్నారు. చంద్రబాబు ఫిర్యాదుతో పెన్షన్ల పంపిణీ వాలంటీర్లు నుండి దూరం అయింది. ఇంటింటికీ పెన్షన్ పంపిణీని చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ అడ్డుకున్నారు. ఈసీ ఆదేశాలతో పెన్షన్ మొత్తాన్ని బ్యాంకు ఖాతాల్లో  అధికారులు జమ చేశారు.బ్యాంకుల వద్ద డబ్బులు తీసుకోవడానికి పెన్షనర్ల పాట్లు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకుల వద్ద పెన్షనర్ల క్యూ లైన్లతో నిల్చొని  ఇబ్బందులు పడుతున్నారు.

IPL 2024: SRH To Take On RR Today At Uppal Stadium, Hyderabad
ఐపీఎల్‌లో ఇవాళ (మే 2) కొదమ సింహాల సమరం

ఐపీఎల్‌లో ఇవాళ (మే 2) బిగ్‌ ఫైట్‌ జరుగనుంది. విధ్వంసకర వీరులతో నిండిన సన్‌రైజర్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లు హైదరాబాద్‌ వేదికగా అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇరు జట్లలో భారీ హిట్టర్లు ఉండటంతో ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.ప్రస్తుతం రాజస్థాన్‌ రాయల్స్‌ 9 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా.. సన్‌రైజర్స్‌ 9 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించి ఐదో స్థానంలో కొనసాగుతుంది. ప్రస్తుత సీజన్‌లో తిరుగులేని విజయాలతో దూసుకుపోతున్న రాజస్థాన్‌ అనధికారికంగా ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ ఖరారు చేసుకోగా.. సన్‌రైజర్స్‌ ప్లే ఆఫ్స్‌ రేసులో ప్రధాన పోటీదారుగా నిలిచింది.హెడ్‌ టు హెడ్‌ రికార్డుల విషయానికొస్తే.. ఐపీఎల్‌లో ఇరు జట్లు ఇప్పటివరకు 18 మ్యాచ​్‌ల్లో ఎదురెదురుపడగా.. చెరి 9 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి.  ఈ సీజన్‌లో రాజస్థాన్‌ ఒక్క గుజరాత్‌ చేతుల్లో మాత్రమే ఓడి మాంచి జోష్‌లో ఉండగా.. సన్‌రైజర్స్‌ కొన్ని మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లు సాధిస్తూ మరికొన్ని మ్యాచ్‌ల్లో తక్కువ స్కోర్లకే చేతులెత్తేస్తూ అటుఇటు కాకుండా ఉంది.తుది జట్లు (అంచనా)..సన్‌రైజర్స్‌: అభిషేక్ శర్మ, ట్రవిస్ హెడ్, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్‌కీపర్‌), నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్‌), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి నటరాజన్. [ఇంపాక్ట్ ప్లేయర్‌: అన్మోల్‌ప్రీత్ సింగ్/మయాంక్ మార్కండే]రాజస్థాన్‌ రాయల్స్‌: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్‌/వికెట్‌కీపర్‌), రియాన్ పరాగ్, షిమ్రోన్‌ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్. [ఇంపాక్ట్ ప్లేయర్‌: రోవ్‌మన్ పావెల్]

J&J subsidiary proposing paying Rs 54,000 cr over 25 years for cancer allegations
బేబీ పౌడర్‌తో అండాశయ క్యాన్సర్‌.. పరిష్కారానికి రూ.54వేలకోట్లు

జాన్సన్ అండ్‌ జాన్సన్ ప్రొడక్ట్‌లపై తీవ్ర దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. కంపెనీ అనుబంధ సంస్థ తయారుచేస్తున్న బేబీ పౌడర్‌లోని టాల్కమ్‌ స్త్రీల అండాశయ క్యాన్సర్‌కు కారణమవుతుందని ఇటీవల ఆరోపణలు వచ్చాయి. వాటిని పరిష్కరించడానికి 25 ఏళ్ల వ్యవధికిగాను కంపెనీ సుమారు 6.48 బిలియన్‌ డాలర్లు(రూ.54వేలకోట్లు) చెల్లించడానికి సిద్ధమైంది.స్త్రీల పరిశుభ్రత కోసం కంపెనీ తయారుచేస్తున్న టాల్కమ్ పౌడర్ ఉపయోగించడం ద్వారా ఊపిరితిత్తులు, ఇతర అవయవాలపై దాడిచేసే మీసోథెలియోమా, అండాశయ క్యాన్సర్‌ వస్తుందని ఆరోపణలు వచ్చాయి. అందుకు సంబంధించి కోర్టులో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. తమ ఉత్పత్తుల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని, కోర్టులో దాఖలైన వ్యాజ్యాల్లో ఏమాత్రం నిజం లేదని కంపెనీ స్పష్టం చేసింది.ఇదీ చదవండి: గూగుల్‌లో మళ్లీ లే ఆఫ్స్‌.. ఎందుకో తెలుసా..బుధవారం అనుబంధ సంస్థ పునర్నిర్మాణానికి 75% మంది వాటాదార్లు సానుకూలంగా ఓటు వేస్తే ప్రీప్యాకేజ్డ్‌ చాప్టర్‌ 11 దివాలాకు దాఖలు చేయొచ్చని కంపెనీ తెలిపింది. మెసోథెలియోమాకు సంబంధించిన పెండింగ్‌లో ఉన్న వ్యాజ్యాలను రిఆర్గనైజేషన్‌ ప్లాన్ వెలుపల పరిష్కరిస్తామని పేర్కొంది. 

Rajamouli Comments On Jr NTR Friendship
నా బెస్ట్‌ ఫ్రెండ్స్‌ లిస్ట్‌లో వారిద్దరే ఉన్నారు.. ఎన్టీఆర్‌ లేడు: రాజమౌళి

ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో సత్యదేవ్, అతీరా రాజ్‌ జంటగా నటించిన చిత్రం ‘కృష్ణమ్మ’. వీవీ గోపాలకృష్ణ దర్శకత్వంలో అరుణాచల క్రియేషన్స్‌పై కృష్ణ కొమ్మాలపాటి నిర్మించిన ఈ చిత్రం మే 10న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించింది. అందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజమౌళి జూనియర్‌ ఎన్టీఆర్‌ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.ఈ కార్యక్రమంలో రాజమౌళి మాట్లాడుతుండగా.. పరిశ్రమలో మీకున్న ముఖ్య స్నేహితులు ఎవరనీ యాంకర్‌ ప్రశ్నించగా.. ఆ సమయంలో తారక్‌ పేరు చెబుతాడని ప్రేక్షకులు భావించి  అందరూ ఎన్టీఆర్‌ అంటూ కేకలు వేశారు. కానీ, రాజమౌళి మాత్రం అందుకు విభిన్నంగా ఇలా సమాధానం చెప్పాడు. 'టాలీవుడ్‌లో నాకు ఇద్దరు అత్యంత ముఖ్యమైన స్నేహితులు‌ ఉన్నారు. ప్రముఖ నిర్మాతలు శోభు యార్లగడ్డ, సాయి కొర్రపాటి. వారితో బాహుబలి, ఈగ వంటి చిత్రాలను నిర్మించిన విషయం తెలిసిందే. ఇకపోతే ఎన్టీఆర్‌ నాకు తమ్ముడితో సమానం. స్నేహితుడు కాదు. తారక్‌తో నా మొదటి సినిమా 'స్టూడెంట్‌ నెం.1' ఛాన్స్‌ రావడానికి కారణం రచయిత పృథ్వీతేజ. అని ఆయన గుర్తుచేసుకున్నారు. స్టూడెంట్‌ నెం.1 తర్వాత తారక్‌- జక్కన్న కాంబినేషన్‌లో సింహాద్రి, యమదొంగ, ఆర్ఆర్‌ఆర్‌ చిత్రాలు వచ్చాయి. అన్నీ కూడా సూపర్‌ హిట్‌ సాధించాయి.‘కృష్ణమ్మ’ సినిమా గురించి  రాజమౌళి మాట్లాడుతూ.. సినిమా టైటిల్‌ నాతో పాటు అందర్నీ ఆకర్షించిందంటే కారణం కొరటాల శివగారు సమర్పించడమే. ఆయన సమర్పిస్తున్న తొలి సినిమాతోనే పెద్ద విజయం  అందుకోవాలని కోరుకుంటున్నాను. ఈ మూవీ టీజర్, ట్రైలర్‌ చూస్తే సినిమాని కచ్చితంగా థియేటర్లోనే చూడాలనిపించేలా తీశాడు  గోపాలకృష్ణ. కాలభైరవని చూస్తుంటే గర్వంగా ఉంది. ‘కృష్ణమ్మ’ టీమ్‌కి ఆల్‌ ది బెస్ట్‌’’ అన్నారు. ఈ చిత్రం మే 10న విడుదల కానుంది. 

Man Gives Triple Talaq to Wife in Moving Train
నడుస్తున్న రైలులో భార్యకు ట్రిపుల్‌ తలాక్‌!

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహాద్‌లో ట్రిపుల్‌ తలాక్‌ కేసు వెలుగులోకి వచ్చింది. కదులుతున్న రైలులో ఒక యువకుడు తన భార్యకు ట్రిపుల్ తలాక్ ఇచ్చాడు. ఈ క్రమంలో భార్యపై దాడిచేసి, రైలు నుంచి దూకి పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను వేడుకున్నారు.బాధితురాలు పుఖ్రాయాన్ పోలీస్ స్టేషన్‌లో భర్తపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఆమె భర్తతో సహా నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అదనపు కట్నం డిమాండ్‌ చేస్తూ తన భర్త విడాకులు ఇచ్చాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.ఈ  ఉదంతం గురించి భోగానిపూర్ పోలీసు అధికారి మాట్లాడుతూ బాధితురాలు రాజస్థాన్‌కు చెందిన మహిళ అని, నఫీజుల్ హసన్ కుమారుడు మహమ్మద్ అసద్‌ ఆమెను వివాహం చేసుకున్నాడని తెలిపారు. ఆ తరువాత నుంచి భర్త మహ్మద్‌ అసద్‌ అత్తామామలు తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. తాజాగా భర్త తనకు ట్రిపుల్‌ తలాక్‌ చెప్పాడని ఆమె తెలిపారు. 

TDP Chandrababu Fake Promise To Unemployed Youth
‘భృతి’.. అంతా భ్రాంతి.. నిరుద్యోగులపై చంద్రబాబు మాయా వల

సాక్షి, అమరావతి:  ‘‘జాబు రావాలంటే బాబు రావాలి.. తమ్ముళ్లూ మీ కలలు సాకా­రం చేయబోతున్నా.. ఇంటికొక ఉద్యోగం ఇస్తా.. ఉద్యో­గం ఇవ్వకపోతే ఉపాధి కల్పిస్తా.. మీరేమీ చదువుకోకపోయినా నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.2 వేలిస్తా’’..  ఈ హామీ గుర్తుందా? 2014 ఎన్నికల్లో చంద్రబాబు సంతకంతో కూడిన కరపత్రాన్ని తెలుగుదేశం పార్టీ ఊరూరా పంచుతూ ప్రచారం చేసింది. సీన్‌ కట్‌చేస్తే ఆ ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. చెప్పినట్లుగా నిరుద్యోగులకు ఇచ్చిన హామీ అమలుచేశారా అంటే అనేకానేక హామీల్లాగే అదీ బాబు అటకెక్కించేశారు. ఇప్పుడు మళ్లీ అలాంటి హామీతోనే ఆయన మరోసారి యువతకు వల విసురుతున్నారు. ఆయన మాయలో పడొద్దని.. భవిష్య­త్తును నాశనం చేసుకోవద్దని మేధావులు, విద్యావేత్తలు యువతకు సూచిస్తున్నారు.  నిరుద్యోగ భృతి ఇవ్వబోమన్న అచ్చెన్న.. ఇక అధికారంలోకి వచ్చాక నాలుగున్నరేళ్ల పాటు చంద్రబాబు ఆ ఊసే ఎత్తలేదు. కానీ, నాటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మాత్రం సందర్భం వచ్చిన ప్రతీసారి ఈ అంశంపై చంద్రబాబు సర్కారును నిలదీస్తూనే ఉన్నారు. నిరుద్యోగ భృతి చెల్లిస్తానని యువతకు మాటిచ్చి ఎలా విస్మరిస్తారంటూ ఉక్కిరిబిక్కిరి చేశారు. ఈ ఒత్తిడి తట్టుకోలేక వైఎస్సార్‌సీపీ సభ్యుల ప్రశ్నకు నిరుద్యోగ భృతి అనే పథకమేలేదని, ఈ ప్రశ్న ఉత్పన్నమే కాదంటూ నాటి కార్మిక శాఖ మంత్రి అచ్చన్నాయుడు అసెంబ్లీలో అసలు విషయాన్ని కుండబద్దలు కొట్టారు. శిక్షణనిచ్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని, నిరుద్యోగ భృతి ఇవ్వబోమని, బాబు వస్తే జాబు వస్తుందనే నినాదంతో ఎన్నికల్లో వెళ్లిన మాట వాస్తవమేనని ఆయన చెప్పారు. అయినా, నిరుద్యోగ భృతిపై అసెంబ్లీలో జగన్‌ పట్టువిడవకుండా ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతుండడంతో 2017–18లో బడ్జెట్‌లో టీడీపీ ప్రభుత్వం కంటితుడుపుగా రూ.500 కోట్లు కేటాయించింది. దీనిపై జగన్‌ మండిపడుతూ.. జాబు రావాలంటే బాబు రావాలని, జాబు ఇవ్వకపోతే ఇంటికో ఉద్యోగం ఇస్తానంటూ ఎన్నికల ముందు ఇంటింటా ప్రచారం చేసి ఇప్పుడు గొప్పగా రూ.500 కోట్లు కేటాయించామని చెప్పడం నిరుద్యోగులను నిలువునా మోసం చేయడమేనని ఉతికి ఆరేశారు. అంతేకాక.. రాష్ట్రంలో 1.75 కోట్ల కుటుంబాలున్నాయని, ఒక్కో కుటుంబానికి నెలకు రెండువేల చొప్పున భృతి ఇవ్వాలని.. ఇందుకు నెలకు రూ.3,500 కోట్లు అవసరమని, అలాగే ఏడాదికి రూ.40 వేల కోట్లు అవసరమైతే రూ.500 కోట్లు ఏ మూలకు సరిపోతాయంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని వైఎస్‌ జగన్‌ చీల్చిచెండాడారు.  ఉన్న ఉద్యోగాలకు బాబు ఎసరు.. ఇలా నిరుద్యోగ భృతి ఇస్తానంటూ నాలుగున్నరేళ్ల పాటు ఎగమనామం పెట్టి ఎన్నికల ముందు ఆర్నెల్లపాటు యువతను మోసం చేయడానికి కంటితుడుపు చర్యగా ముఖ్యమంత్రి యువనేస్తం పేరుతో చంద్రబాబు ఎత్తుగడ వేశారు. కానీ, నిరుద్యోగ భృతి ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకపోగా ఆరోగ్య మిత్రలను, ఫీల్డ్‌ అసిస్టెంట్లను, గోపాల మిత్రలను ఉద్యోగాల నుంచి చంద్రబాబు తొలగించారు. దీంతో.. మళ్లీ ఇప్పుడు ఎన్నికల ముందు యువతను, నిరుద్యోగులను మోసం చేయడానికి చంద్రబాబు కుయుక్తులు, మోసపూరిత ప్రకటనలతో వస్తున్నారు తస్మాత్‌ జాగ్రత్త నిరుద్యోగులూ.. అంటూ మేధావులు, విద్యావేత్తలు యువతను అప్రమత్తం చేస్తున్నారు. నిరుద్యోగ భృతిపై 2014 ఎన్నికల ముందు ఇంటింటా ప్రచారం చేసి అధికారం దక్కాక ఎలా మోసం చేశారో అచ్చు అలాగే చంద్రబాబు మళ్లీ యువతకు నెలకు రూ.3వేలు నిరుద్యోగ భృతి అంటూ అరచేతిలో వైకుంఠం చూపెడుతున్నారని.. చంద్రబాబు వలలో పడి మరోసారి మోసపోవద్దని వారు సూచిస్తున్నారు.వైఎస్‌ జగన్‌ ఒత్తిడితో.. ఎన్నికలకు ఆర్నెల్ల ముందు.. ఇక 2017–18లో రూ.500 కోట్లు కేటాయించినప్పటికీ చంద్రబాబు పైసా ఖర్చు పెట్టలేదు. ప్రతిపక్ష నేత జగన్‌ తన ఒత్తిడి కొనసాగిస్తుండడంతో ఇక 2019 ఎన్నికలకు ఆర్నెల్ల ముందు నాలుగు నెలల కోసం నిరుద్యోగ భృతి కాదు ముఖ్యమంత్రి యువనేస్తం పేరుతో నిరుద్యోగులకు నెలకు రూ.1,000 ఇస్తామని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు విధివిధానాల రూపకల్పనకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటుచేసింది. ఈ ఉపసంఘం సవాలక్ష ఆంక్షలు విధించి నిరుద్యోగ భృతి ఇచ్చే వారి సంఖ్యను భారీగా కుదించింది.  ⇒ టెన్త్, ఇంటర్‌ చదివిన వారు అనర్హులని ఆంక్షలు విధించింది.  ⇒ 22 ఏళ్ల నుంచి 35 ఏళ్లలోపు వారు డిగ్రీ చదివిన వారికే భృతి వర్తిస్తుందని, దారిద్య్ర రేఖకు దిగువనున్న వారు.. తెల్ల రేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డు, ఓటరు ఐడీ కార్డు పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలని షరతులు విధించింది.  ⇒ దీంతో వచ్చిన దరఖాస్తుల్లో 12 లక్షల మందికి పైగా నిరుద్యోగ భృతికి అర్హులుగా తేల్చింది.  ⇒ ఆ తరువాత అది పది లక్షలు, మళ్లీ మళ్లీ వడపోత తర్వాత 2.10 లక్షల మందే అర్హులంటూ వెల్లడించి మళ్లీ దానిని 1.62 లక్షలకు కుదించింది.  ⇒ అనంతరం 2018 అక్టోబరులో కేవలం రూ.40 కోట్లు విడుదల చేసి ఈ–కేవైసీ మెలిక పెట్టింది.  ⇒ అలాగే, ప్రతినెలా వేలిముద్ర వేస్తేనే నిరుద్యోగ భృతి అంటూ ఆంక్షలు పెట్టుకుంటూ పోయి ఎన్నికల వరకు తాత్సారం చేశారు. 

Election Commission Key Comments Over Janasena Glass Tumbler
AP High Court: జనసేనకు ఈసీ ఝలక్‌

సాక్షి, గుంటూరు: ఏపీలో ఎన్నికల వేళ జనసేనకు హైకోర్టులో చుక్కెదురైంది. ఎన్నికల్లో గాజు గ్లాస్‌ గుర్తును రిజర్వ్‌ చేయలేమని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని హైకోర్టుకు ఈసీ వెల్లడించింది.కాగా, ఎన్నికల్లో గాజు గ్లాస్‌ గుర్తును తమకు మాత్రమే రిజర్వ్‌ చేసేలా ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో జనసేన పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై నేడు విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఏపీవ్యాప్తంగా గాజు గ్లాస్‌ గుర్తును రిజర్వ్‌ చేయలేమని ఎన్నికల సంఘం.. హైకోర్టుకు తెలిపింది. అలాగే, ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే మొదలైందని, ఈ సమయంలో వేరే వారికి ఇచ్చిన సింబల్‌ మార్చలేమని ఈసీ.. కోర్టుకు వెల్లడించింది.ఇదే సమయంలో జనసేన పిటిషన్‌కు విచారణ అర్హత లేదని ఈసీ పేర్కొంది. ఇలా చేస్తే ఎన్నికలు జరిగే వరకు పిటిషన్లు వస్తూనే ఉంటాయని ఈసీ.. కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఇప్పటికే ఎలక్ట్రానిక్‌ బ్యాలెట్‌లను ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌కు పంపించినట్టు ఈసీ స్పష్టం చేసింది. అలాగే, జనసేన పార్టీ తెలిపిన అభ్యంతరాలపై బుధవారమే కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు కోర్టుకు ఈసీ తెలిపింది.   

Rowdy Sheeter Laxman Enters Into GHMC Mayor Vijayalakshmi's House
GHMC: మేయర్‌ విజయలక్ష్మి ఇంట్లో చొరబడిన రౌడీషీటర్‌..

సాక్షి, హైదరాబాద్‌: జీహెచ్ఎంసీ మేయర్  గద్వాల విజయలక్ష్మి ఇంట్లోకి ఓ రౌడీ షీటర్‌ చొరబడటం తీవ్ర కలకలం సృష్టించింది. సదరు వ్యక్తి నేరుగా మేయర్‌ గదిలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా సిబ్బంది అడ్డుకున్నారు. అనంతరం, పోలీసులు మేయర్‌ ఇంటికి వచ్చిన రౌడీ షీటర్‌ను అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూసుఫ్‌గూడకు చెందిన రౌడీ షీటర్‌ లక్ష్మణ్‌ మంగళవారం మేయర్‌ విజయలక్ష్మి ఇంట్లోకి చొరబడ్డాడు. నేరుగా వచ్చి ఆమె వ్యక్తిగత గదిలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా ఆమె సిబ్బంది అడ్డుకున్నారు. సిబ్బంది వారించినా అతను పట్టించుకోలేదు. దీంతో, అతడిని సిబ్బంది అడ్డుకుని బంజారాహిల్స్‌ పోలీసులకు సమాచారం అందించారు. ఇక, ఆ సమయంలో మేయర్‌ ఇంట్లో లేరు.వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. లక్ష్మణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు పోలీసు స్టేషన్‌కు తరలించారు. అయితే, లక్ష్మణ్‌కు మతిస్థిమితం సరిగా లేనట్టు పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉండగా.. లక్ష్మణ్‌ గత రెండు రోజులుగా మేయర్‌ ఇంటి చుట్టే తిరిగినట్టు పోలీసులు తెలిపారు.

తప్పక చదవండి

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement


ఫోటో స్టోరీస్

View all