Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

CM YS Jagan Powerful Speech At Machilipatnam
గతంలో ఎప్పుడైనా ఇంత మంచి జరిగిందా?: సీఎం జగన్‌

సాక్షి, కృష్ణా: ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి. ఎవరి భూములపై వారికే హక్కులు కల్పించడమే ఈ యాక్ట్‌ ఉద్ధేశమని తెలిపారు. భూ వివాదాలు పెరిగి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని.. వివాదాల పరిష్కారానికి కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి రాకూడదని పేర్కొన్నారు. ఎలాంటి వివాదం లేదని ప్రభుత్వం గ్యారంటీ ఇస్తూ.. సంస్కరణ తీసుకురావాలనేది మీ బిడ్డ ఆలోచన అని సీఎం జగన్‌ తెలిపారు. సర్వేలన్నీ పూర్తి చేసి రికార్డులన్నీ అప్‌డేట్‌ చేస్తున్నామని, రైతన్నలకు భూ హక్కు పత్రాలను పదిలంగా అందిస్తామని స్పష్టం చేశారు. మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన భారీ‌ బహిరంగ సభలో సీఎం జగన్‌ పాల్గొని ప్రసంగించారు. ఈ యాక్ట్‌ గొప్పదని టీడీపీ నేత పయ్యావులే అసెంబ్లీలో చెప్పాడని ప్రస్తావించారు. మంచి సంస్కరణను ఆపేందుకు బాబు కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంటికొచ్చే పెన్షన్‌ను అడ్డుకుంది చంద్రబాబేనని దుయ్యబట్టారు. బాబు తన మనిషి నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి అడ్డుకున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు కుట్రల వల్లే పెన్షర్లు అగచాట్లు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆన్‌ గోయింగ్‌ స్కీమ్స్‌ను కూడా చంద్రబాబు అడ్డుకుంటున్నాడని, లబ్దిదారులకు డబ్బులు వెళ్లకుండా కుట్రలు పన్నుతున్నాడని నిప్పులు చెరిగారు.సీఎం జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..ఈ ఎన్నికలు.. ఐదేళ్ల భవిష్యత్‌జగన్‌కు ఓటేస్తే..పథకాలు కొనసాగింపు, ఇంటింటా అభివృద్ధిపొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలు ముగింపేబాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లే తలపెట్టడమేచంద్రబాబును నమ్మితే మళ్లీ చంద్రముఖి నిద్ర లేస్తుంది.పేదల శత్రువులంతా ఒక్కటయ్యారుచంద్రబాబువి అన్నీ అబద్ధాలు, మోసాలు, కుట్రలే14 ఏళ్లో చంద్రబాబు ఒక్క మంచిపనైననా చేశాడా?చంద్రబాబు పేరు చెప్తే ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా?ఎన్నికలు వచ్చేసరికి బాబు దుష్ప్రచారాలు మొదలు పెట్టాడు2 లక్షల కోట్ల డ్రగ్స్‌ తీసుకొచ్చామని దుష్ప్రచారం చేశాడుఆ డ్రగ్స్‌ తీసుకొచ్చింది వదినమ్మ బంధువులేనని తేలింది.తమ వారేనని బయటకు రావడంతో బాబు కూటమి గప్‌చుప్‌59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం130 సార్లు బటన్‌ నొక్కి వివిధ పథకాల ద్వారా మంచి చేశాంపేదలకు నేరుగా రూ. 2 లక్షల 70 వేల కోట్లు అందించాం2 లక్షల 31 వేలకుపైగా ఉద్యోగాలిచ్చాంనాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చాంప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్‌ మీడియం తీసుకొచ్చాంప్రభుత్వ బడుల్లో 3వ తరగతి నుంచే టోఫెల్‌ క్లాసులుప్రభుత్వ స్కూళ్లలో 6వ తరగతి నుంచే డిజిటల్‌ బోధనవిద్యార్థులకు బైలింగువల్‌ టెక్ట్స్‌ బుక్స్‌, బైజూస్‌ కంటెంట్‌బడులు తెరిచే నాటికే విద్యాకానుక, గోరుముద్దఉన్నత చదువుల కోసం విద్యా దీవెన, వసతి దీవెనవిద్యారంగంలో మేం చేసిన అభివృద్ధి బాబు హయాంలో జరిగిందా?అక్కాచెల్లెమ్మల కోసం ఆసరా, సున్నావడ్డీ, చేయూతఅక్కాచెల్లెమ్మల కోసం కాపు నేస్తం, ఈబీసీ నేస్తంఅక్కాచెల్లెమ్మల పేరుపై 31 లక్షల ఇళ్ల పట్టాలిచ్చాంగతంలో ఎప్పుడైనా ఇంత మంచి జరిగిందా?అవ్వాతాతలకు ఇంటి వద్దకే రూ. 3 వేల పెన్షన్‌ఇంటి వద్దకే పౌరసేవలు, సంక్షేమ పథకాలుపెట్టుబడి సాయంతో రైతులకు అండగా నిలబడ్డాంరైతులకు పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాంసకాలంలో ఇన్‌పుట్‌ సబ్సిడీ అందిస్తున్నాంవిత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్నకు తోడుగా నిలిచాంజగనన్న చేదోడు ద్వారా చిరు వ్యాపారులకు ఆర్ధిక సాయంమత్స్యకార భరోసా, లా నేస్తం, వాహనమిత్ర ద్వారా ఆదుకున్నాంగతంలో ఎప్పుడైనా ఇంత మంచి కార్యక్రమాలూ చూశారామచిలీపట్నంలో మెడికల్‌ కాలేజ్‌ నిర్మాణం పూర్తి చేశాంబందర్‌లో రూ. 350 కోట్ల ఫిషింగ్‌ హార్బర్‌మచిలీపట్నం అభివృద్ధికి బాటలు వేసింది మీ బిడ్డ జగనే.రూ.5100 కోట్లతో పోర్టు నిర్మాణం జరుగుతుందిమచిలీపట్నంలో మెడికల్‌ కాలేజ్‌ నిర్మాణం పూర్తి చేశాంబందర్‌లో రూ. 350 కోట్ల ఫిషింగ్‌ హార్బర్‌గతంలో ఇంత మంచి ఎప్పుడైనా మీరు చూశారా?

Perni Nani Slams PV Ramesh Tweet On Land Titling Act
చంద్రబాబు కోసం ఇంతలా దిగజారాలా పీవీ రమేష్..?

సాక్షి, కృష్ణా: చంద్రబాబు కోసం ఇంతలా దిగజారాలా అంటూ రిటైర్డ్‌ ఐఏఎస్‌ పీవీ రమేష్‌పై‌ మాజీ మంత్రి పేర్నినాని ధ్వజమెత్తారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటి పచ్చ మీడియా సరిపోవన్నట్లు మాజీ ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులను కూడా చంద్రబాబు జత కట్టుకుంటున్నారని మంపడిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విపరీతమైన విషం చిమ్మి కుట్రతో అధికారంలోకి రావాలని చంద్రబాబు ఇలాంటి ప్రయత్నం చేస్తున్నాడని నిప్పులు చెరిగారు.మాజీ ఐఏఎస్‌ అధికారి పీవీ రమేష్‌ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ వల్ల తన పొలం మ్యుటేషన్‌ జరగట్లేదని చేసిన ట్వీట్‌ను ప్రస్తావించారు. పెద్ద పెద్ద చదువులు చదువున్న మీరు ఇంత అసహ్యంగా, దిగజారి మీరు ప్రవర్తించాలా?  అని ప్రశ్నించారు. పీవీ రమేష్‌ది కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం విన్నకోట గ్రామమమని తెలిపారు. ఈ గ్రామంలో తన తండ్రి పేరుపై ఉన్న పొలం తన పేరుపైకి మార్చడం లేదంటూ అన్యాయంగా, కిరాతకంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రమేష్‌ తండ్రి సుబ్బారావు మాస్టారుతో పాటు అదే గ్రామంలో ఉన్న ఇతర ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారుల కుటుంబాలు, స్థానికులు మొత్తం కలిసి 25 ఎకరాల భూమిని కొని చెరువును తవ్వారని చెప్పారు.25 మంది కలిసి 70 ఎకరాలు కొని దానిలో ఒక చెరువు తవ్వి లీజుకు ఇస్తూ వస్తున్నారన్నారు పేర్ని నాని. ఏడాది క్రితం రమేష్‌ తండ్రి సుబ్బారావు మరణించారని, ఆయన మరణించిన తర్వాత రమేష్‌ మ్యుటేషన్‌ కోసం దరఖాస్తు చేశారని, అప్పటి నుంచీ విచారణలు జరుగుతున్నాయని చెప్పారు. గాలంకి నాగేంద్ర అనే వ్యక్తి కూడా ఈ చెరువులో భాగస్వామి. ఆయనకు, రమేష్‌కు కోర్టులో కేసులు నడుస్తున్నాయని తెలిపారు.వివాదాల వల్లే..ఆ చెరువులో వీళ్లకి సంబంధించిన పొలం ఎంతో కొంత ఉంది.దీనికోసమే జనవరి నెలలో జాయింట్‌ కలెక్టర్, ఆర్డీవోలు అక్కడ విచారణ నిర్వహించారు. ఆ విచారణకు అందరు రైతుల్ని ఒరిజినల్‌ డాక్యుమెంట్లు తీసుకుని రమ్మని చెప్పారు. అయితే పీవీ రమేష్‌ మాత్రం తన గుమస్తాకు ఫోటోస్టాట్‌ కాపీలిచ్చి పంపారట. ఫోటోస్టాట్‌ కాదు..ఒరిజినల్స్‌ పంపండి అని చెప్పారు. ఆయన రాడు..సరే గుమస్తాను పంపినా ఒరిజినల్స్‌ కావాలి కదా?క్కడ ఉన్న వివాదాన్ని తీర్చడం కోసమే మూడు నెలలుగా ఆ చెరువును అధికారులు ఎండబెడుతున్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత సరిహద్దులు ఫిక్స్‌ చేసి ఎవరి భూమి వారికి ఇచ్చేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు.ఇంత కథ నడుస్తుంటే ఇంత విషం చిమ్మడం ధర్మమా పీవీ రమేష్‌?మీ వివాదానికి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధం ఏమిటి?అక్కడున్న రైతులందరికీ, మీకు తగాదా ఉండటం ఏంటి? అక్కడున్న ల్యాండ్‌ కన్నా మీరు అదనంగా లీజు పొందుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.ఎవరి పొలం ఎక్కడో కూడా తెలియని పరిస్థితి. చెరువు పూర్తిగా ఎండిపోయిన తర్వాత కదా కొలతలు వేసి ఎవరి హద్దు ఏంటో చెప్పేది?.ఎటువంటి వివాదం లేకపోతే, అది వ్యవసాయ భూమి అయి హద్దులు క్లియర్‌గా ఉంటే..ప్రభుత్వాన్ని విమర్శించినా ఒక అర్ధం ఉంది.  ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌కు మీ పొలానికి సంబంధం ఏంటి?చంద్రబాబు పంచన చేరి ఐఏఎస్‌ చదువుకుని పచ్చిగా రాజకీయాల కోసం దిగజారడం అవసరమా? చంద్రబాబు కోసం మీరు ఏ డాన్స్‌ కట్టమంటే ఆ డాన్స్‌ కడుతున్నారు. ఏ ట్వీట్‌ చేయమంటే ఆ ట్వీట్‌ చేస్తున్నారు. చంద్రబాబుకు అధికారం సంపాదించడం కోసం మీరు ఇలా తప్పుడు ప్రకటనలు చేసి జగన్‌గారి ప్రభుత్వంపై విషం చిమ్మడం దుర్మార్గమైన చర్య. మీరు విన్నకోట గ్రామం రండి.. అక్కడేం జరుగుతుందో చూడండి.మీ కోసమే.. ఆ వివాదం తేల్చడం కోసమే మూడు నెలలుగా వీఆర్వోలను కాపలా పెట్టి మరీ చెరువును కాళీ చేయిస్తున్నారు.పోలింగ్‌ అయిన తర్వాత వచ్చి సర్వే చేస్తామని రైతులకు, మీ గుమస్తాకి కూడా సమాచారం అందించారు. ఆ చెరువు మధ్యలోనే ఆవుల దొడ్డి కింద ఓ 3.5 ఎకరాల వివాదాస్పద భూమి కూడా ఉంది. మీతో ఉన్న ఆ 25 మంది రైతులు కూడా ఆ ఆవుల దొడ్డి భూమి మాదంటే మాది అని క్లెయిమ్‌ చేస్తున్నారు.ఇలాంటి చరిత్ర కలిగిన భూమిని మీ నాన్నగారు మీకు అప్పజెప్పారు.ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ వల్ల నాకు మ్యుటేషన్‌ అవ్వడం లేదని ఇంతగా దిగజారడం అవసరమా? ’ అని మండిపడ్డారు పేర్ని నాని. 

Sakshi Guest Column On CM YS Jagan Welfare Govt
సమాన అవకాశాల... విద్యా విప్లవం

భారతీయ సమాజంలో అసమానతలు అధికంగా ఉండటానికి ప్రధాన కారణం అవకాశాలు అందరికీ సమానంగా లేకపో వడం. ముఖ్యంగా మంచి విద్యను అభ్యసించే అవ కాశం కొందరికే ఉండటం. దీన్ని గమనించిన ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి కనివిని ఎరుగని రీతిలో విద్యావ్యవస్థ రూపురేఖలను మార్చేశారు. దీంతో ఎక్కడో కొండ కోనల్లో నివసించే ఆది వాసీ పిల్లలు సైతం పట్టణ ప్రాంత విద్యార్థులతో సమానంగా క్వాలిటీ ఎడ్యుకేషన్‌ అందిపుచ్చుకుంటు న్నారు. ఇదో విప్లవం. ఈ విప్లవ ఫలితాలు ఇప్పుడి ప్పుడే దృశ్యమానమవుతున్నాయి. కొండబారిడి గిరి జన గ్రామానికి చెందిన బాలిక మనస్విని ఐక్యరాజ్య సమితి దాకా వెళ్లడం ఇందుకు ఒక ఉదాహరణ.కొండబారిడి ఒక సవర ఆదివాసీ పల్లె. ఆరు దశాబ్దాల క్రితం ఇక్కడ వెంపటాపు సత్యం అనే బడి పంతులు భూమి కోసం, భుక్తి కోసం ఉద్యమించి సాయుధ విప్లవం సృష్టించాడు. నేడు అదే గ్రామంలో ఇపుడు చదువుల విప్లవం కూడా మొద లైంది. పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్నదే కొండ బారిడి. ఆ పల్లెకు చెందిన ఎస్‌. మనస్విని ఆంగ్లంలో అరుదైన ప్రతిభ చూపడంతో తనతో పాటు మరో 9 మంది విద్యార్థులను అమెరికాలోని ఐక్యరాజ్య సమితి ఆహ్వానించగా... అక్కడ ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్‌ సంస్థల సదస్సులో పాల్గొని వచ్చింది.‘ఏపీలో విద్యావ్యవస్థపై ఐక్యరాజ్య సమితిలో మాట్లాడాను. మన రాష్ట్రంలో అమలు చేస్తున్న విద్యావిధానం, ‘నాడు–నేడు’తో మా స్కూల్‌ స్వరూపమే మారిపోవడం గురించి వివరించాను. మన ప్రభుత్వం మాలాంటి పేదల చదువు కోసం చేస్తున్న కృషిని తెలుసుకొని వారు ఎంతో ఆశ్చర్య పోయారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను స్కూల్స్‌లో ఎలా ప్రవేశ పెడుతున్నారు? వాతావరణ మార్పుల ప్రభావం గురించి చెప్పాను. మారుమూల గిరిజన పల్లెకు చెందిన నాకు ఇదొక మరువలేని అనుభూతి’ అని సంతోషంగా చెప్పింది మనస్విని. సింగిల్‌ పేరెంట్‌కు చెందిన ఈ ఆదివాసీ బాలిక గుమ్మలక్ష్మిపురం, కేజీబీవీ స్కూల్‌లో 9వ తరగతి చదువుతోంది. సర్కారు బడుల్లో చదివే పేద పిల్లలకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య అందించాలనే తప నతో ఆధునిక విద్యాబోధన, మౌలిక వసతుల కల్పన కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ‘నాడు–నేడు’  కార్యక్రమంలో 44,512 ప్రభుత్వ బడులను బాగు చేసే కార్యక్రమాన్ని మూడు దశలుగా విభజించి ముందుకెళుతోంది. ‘అమ్మ ఒడి’ వంటి వినూత్న పథకాలు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్స్‌ను పెంచాయి. దాదాపు 2,47,000 మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ బడులకు మారడం ఇందుకు నిదర్శనం.అరకు నుండి డుంబ్రిగుడ వెళ్లేదారిలో జైపూర్‌ బస్‌స్టాప్‌ ఎదురుగా కొండల మధ్య ఇంద్రధను స్సులా మెరిసిపోతున్న కోట లాంటి రెసిడెన్షియల్‌ గిరిజన పాఠశాల దగ్గర ఆగాం. విశాలమైన ప్లేగ్రౌండ్‌లో ఆడుకుంటున్న తమ పిల్లలను చూడడా నికి వచ్చిన పేరెంట్స్‌ని పలకరించినపుడు...‘ప్రభుత్వం తన ఆలోచనలకు అనుగుణంగా చేపట్టిన పనులతో ఈ  ప్రభుత్వ స్కూళ్లు కార్పొరేట్‌ స్కూళ్లను మించి మారిపోయాయి. మా పాపను ఈ స్కూల్‌లో చేర్పించడానికి సీట్లు లేక చాలా కష్ట పడాల్సి వచ్చింది. ప్రభుత్వ ప్రయత్నం బాగుంద’ని అన్నారు. ‘గిరిజన గ్రామాల్లో బడులను ఏకపక్షంగా ఇంగ్లిష్‌ మీడియంలోకి మార్చడం లేదు. ప్రతిదీ పద్ధతి ప్రకారం, శాస్త్రీయ విధానంలో సాగుతోంది. ప్రతి పుస్తకాన్నీ బైలింగ్యువల్‌ పద్ధతిలో...  అంటే ఒక పేజీ ఇంగ్లిష్, పక్క పేజీ తెలుగులో ముద్రించారు . దీని వల్ల పిల్లలు తెలుగును మర్చిపోకుండా ఇంగ్లిషును నేర్చుకుంటున్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం వల్ల బడి మానేసే పిల్లల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింద’ని పార్వతీపురం మన్యం జిల్లా, చాపరాయి బిన్నిడి పాఠశాల ఉపాధ్యాయుడు వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా 40 వేల తరగతి గదుల్లో ఐఎఫ్‌బీలు ఏర్పాటు చేసినట్టు ఆమధ్య ఒక ఆంగ్ల ఛానెల్‌ జర్నలిస్టుకు ఇచ్చిన ఇంటర్యూలో సీఎం వై.ఎస్‌. జగన్‌ చెప్పినపుడు అవి విద్యార్థులకు ఎలా ఉపయోగపడుతున్నాయో తెలుసుకుందామని, గుమ్మలక్ష్మీపురం గ్రామంలోని ఒక స్కూల్‌కి వెళ్లాం. అక్కడ విద్యార్థులకు బైజూస్‌ కంటెంట్‌తో ఉన్న ట్యాబ్స్‌ ఇచ్చారు. ఆరో తరగతి నుంచి, ఆపై తరగ తుల్లోని ప్రతి క్లాస్‌రూమ్‌లో ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేశారు. గుండె పనిచేసే విధా నాన్ని డిజిటల్‌ స్క్రీన్‌ మీద విద్యార్థులకు టీచర్లు బోధించడం చూశాం. ఇలా ఒక ప్రణాళికా బద్ధంగా పాఠశాల విద్యా రంగంలో వినూత్న మార్పులు మొదలై టీచర్లలో నైపుణ్యం, సామర్థ్యం పెంపుకు కూడా సర్కారు కృషి చేస్తున్నది. ఏపీ విద్యారంగం సరికొత్త మార్పు దిశగా అడుగులు వేస్తోంది. ఇందువల్ల సమాన విద్యావ కాశాలకు నోచుకుంటున్నారు బడుగులు. ఇంతకంటే కావలసినదేముంది?శ్యాంమోహన్‌ వ్యాసకర్త కార్టూనిస్ట్, జర్నలిస్ట్‌మొబైల్‌: 94405 95858

Sakshi Editorial On Rahul Gandhi Rae Bareli
రాయ్‌బరేలీ వ్యూహం

ఎట్టకేలకు ఒక చర్చ ముగిసింది, మరో చర్చ మొదలైంది. కాంగ్రెస్‌ నేత, గాంధీ కుటుంబ వారసుడు రాహుల్‌ శుక్రవారం రాయ్‌బరేలీ స్థానం నుంచి నామినేషన్‌ దాఖలు చేయడంతో ఉత్తర ప్రదేశ్‌లో ఆయన పోటీ చేస్తారా, లేదా అన్న చర్చకు ఫుల్‌స్టాప్‌ పడింది. అదే సమయంలో 2019 ఎన్నికల్లో బీజేపీ నేత స్మృతీ ఇరానీ చేతుల్లో ఓటమి పాలైన అమేథీని కాకుండా, ఇటీవల రాజ్యసభకు వెళ్ళేంత వరకు తన తల్లి ప్రాతినిధ్యం వహించిన రాయ్‌బరేలీని ఆయన ఎన్నుకోవడంతో కొత్త చర్చ మొదలైంది. భారత రాజకీయాలకు గుండెకాయ లాంటి ఉత్తరప్రదేశ్‌ నుంచి మళ్ళీ పోటీ చేసేందుకు రాహుల్‌ తీసుకున్న నిర్ణయంపై అంచనాలున్నాయి, అనుమానాలూ ఉన్నాయి. ఈ పోటీతో ఎన్నికల వ్యూహంలోనూ, ఇటు విస్తృత రాజకీయ కథనంలోనూ కాంగ్రెస్‌ పార్టీ గట్టి మార్పు తెస్తున్నట్టు కనిపిస్తోంది. ఉత్తరాదిన పార్టీకి మళ్ళీ జవసత్వాలు అందించడానికి దీన్ని ఒక అవకాశంగా కాంగ్రెస్‌ భావిస్తోంది. అమేథీ స్థానంలో కాకున్నా కుటుంబానికి కలిసొచ్చిన రాయ్‌బరేలీని ఎంచుకోవడం ద్వారా యూపీ ఎన్నికల క్షేత్రంలో పార్టీకి రాహుల్‌ కొత్త ఉత్సాహం తెచ్చారనుకోవాలి. చిరకాలంగా గాంధీ కుటుంబ వారసులే పోటీ చేస్తున్న కంచుకోట లాంటి అమేథీ స్థానాన్ని... నియోజకవర్గం బాగోగులు చూసే మరో విధేయ నేత కేఎల్‌ శర్మకు కట్టబెట్టారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 20 ఎన్నికల్లో 17 సార్లు కాంగ్రెస్‌కే జై కొట్టిన స్థానం రాయ్‌బరేలీ. ప్రధాని ఇందిరాగాంధీ మొదలు పలువురు గాంధీ కుటుంబ సభ్యులకు పట్టం కట్టిన మరో కంచుకోట. అక్కడ పోటీ ద్వారా యూపీలో క్రియాశీలకంగా నిలవడమే కాక, తనపై బీజేపీ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు రాహుల్‌ వీలు చిక్కించుకున్నారు. అయితే, ఆఖరు నిమిషంలో ప్రకటించిన ఈ అభ్యర్థిత్వంతో అనేక సవాళ్ళూ తప్పవు. వాటిని ఎలా అధిగమించి, సంక్లిష్ట సామాజిక – రాజకీయ కోణాలున్న హిందీ హార్ట్‌ల్యాండ్‌లో పట్టు సాధిస్తారన్నది చూడాలి. ఆ రాష్ట్రంలో బీజేపీకి ఉన్నంత బలమైన ఎన్నికల యంత్రాంగం, పార్టీ వ్యవస్థ ప్రస్తుతం కాంగ్రెస్‌కు లేకపోవడం లోటు. వాటిని అధిగమించి, ప్రస్తుత ఉత్సాహాన్ని ఎన్నికల లబ్ధిగా ఎలా మలచగలుగుతారో వేచిచూడాలి. నిజానికి, క్రితంసారి ఉత్తరాదిన కాంగ్రెస్‌ ఊపు తగ్గినా దక్షిణాదిలో ఉనికి నిలిపిన కేరళలోని వయనాడ్‌ స్థానమంటే సహజంగానే రాహుల్‌కు ప్రత్యేక అభిమానం. అది ఆయన మాటల్లో, చేతల్లో కనిపిస్తూనే ఉంటుంది. దక్షిణాదిన హస్తం హవా కొనసాగేందుకు వయనాడ్‌ భావోద్వేగ బంధంగా ఉపకరిస్తుందని ఆయన ఆలోచన. అందుకే, ఈసారీ ఆయన అక్కడ నుంచి కూడా పోటీ చేశారు. వయనాడ్‌లో రాహుల్‌ స్థానికేతరుడనీ, యూపీలో గెలిస్తే ఈ స్థానాన్ని వదిలేస్తాడనీ ప్రత్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నందు వల్లే అక్కడ ఎన్నికలయ్యేంత వరకు తెలివిగా తన రాయ్‌బరేలీ అభ్యర్థిత్వాన్ని ప్రకటించలేదు. ఆఖరి వరకూ అమేథీ, రాయ్‌బరేలీలలో పోటీ అంశాన్ని సస్పెన్స్‌లోనే ఉంచుతూ, అధికార పార్టీని ఇరుకునపెట్టారు. బీజేపీ సైతం పోటీకి భయపడి రాహుల్‌ వెనుకంజ వేస్తున్నారన్న ప్రచారంతో ఒత్తిడి పెంచింది. ఆ ప్రచారాన్ని తిప్పికొడుతూ, ముఖాముఖి పోరుకు వెరవడం లేదని నిరూపించేందుకు రాహుల్‌కు ఈ రాయ్‌బరేలీ అభ్యర్థిత్వం ఉపకరించనుంది. హస్తం పార్టీకి రాయ్‌బరేలీ ఎంత అడ్డా అయినా, రాహుల్‌ పోటీలో రిస్కులూ ఉన్నాయి. యూపీలోని మొత్తం 80 లోక్‌సభా స్థానాల్లో క్రితంసారి 64 సీట్లు గెలిచిన బీజేపీ ఈసారి అంతకు మించి ఫలితాలు సాధించాలని చూస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆయన అలవాటైన స్థానం వదిలేసి, సాహసించారు. కానీ, ఆయన ఛరిష్మా, కాంగ్రెస్‌కు చిరకాలంగా ఉన్న స్థానిక సంబంధాలు పనికొస్తాయని భావిస్తున్నారు. అసలు అమేథీలో ప్రియాంక, రాయ్‌బరేలీలో రాహుల్‌ పోటీ చేయాలన్న ఆలోచనా ఒక దశలో జరిగింది. కానీ, ప్రతిపక్షం ఆరోపిస్తున్న వారసత్వ రాజకీయాలు, బంధుప్రీతికి ఊతమిచ్చినట్టు అవుతుందని దానికి స్వస్తి చెప్పారు. ఇక, అమేథీలో పోటీచేస్తున్న కేఎల్‌ శర్మ పంజాబ్‌ నుంచి వచ్చినవారైనప్పటికీ, ఇరుగుపొరుగు స్థానాలైన అమేథీ, రాయ్‌బరేలీల్లో గత 30 ఏళ్ళుగా పార్టీ తరఫున పనిచేస్తున్నారు. జనంతో, కార్యకర్తలతో సన్నిహిత సంబంధాలున్న ఆయన, స్టార్‌ అభ్యర్థి స్మృతీ ఇరానీపై గెలుస్తారని కాంగ్రెస్‌ ఆశ. 1977లో ఇందిరా గాంధీపై రాజ్‌నారాయణ్, గడచిన 2019లో రాహుల్‌పై స్మృతి గెలిచినట్టే, రేపు స్మృతిపై శర్మ గెలవకూడదని ఏమీ లేదు. అధిక సంఖ్యాక ప్రజల మద్దతే కీలకమైన ప్రజాస్వామ్యంలో ఏమైనా జరగవచ్చు. అసలు ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది సదరు వ్యక్తుల, పార్టీల నిర్ణయం. అయితే, దేశంలోని అనేక ప్రధాన సమస్యల కన్నా అమేథీ, రాయ్‌బరేలీలలో రాహుల్‌ పోటీ చేస్తారా, లేదా అన్నదే ముఖ్యమన్నట్టుగా జాతీయ టీవీ ఛానళ్ళు దీనిపైనే చర్చోపచర్చలు చేయడం విచిత్రం. 1952లో ఫిరోజ్‌ గాంధీ, తర్వాత ఇందిర, అటుపైన సోనియా, ఇప్పుడు రాహుల్‌ పోటీతో రాయ్‌బరేలీతో కాంగ్రెస్‌ బంధం అమేథీ కన్నా పాతది, పట్టున్నది. కానీ, ఇల్లలకగానే పండగ కాదు. సాక్షాత్తూ ప్రియాంక యూపీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నప్పటికీ గత అసెంబ్లీ ఎన్నికల్లో యూపీలో కాంగ్రెస్‌ 398 స్థానాల్లో పోటీ చేసినా, రెండంటే రెండింట్లో గెలిచింది. ఇప్పుడు లోక్‌సభకు 17 స్థానాల్లో బరిలో నిలిచింది. అభ్యర్థుల పేర్లు కూడా ఎవరికీ పెద్దగా తెలియదు. ఒకవేళ రేపు వయనాడ్, రాయ్‌బరేలీ – రెంటిలోనూ రాహుల్‌ గెలిస్తే, దేన్ని వదులుకోవాలన్నదీ చిక్కే. రాగల రోజుల్లో మరిన్ని విడతల పోలింగ్‌తో ఎన్నికల వేడి పెరిగాక కానీ, యూపీలో రాహుల్‌ పోటీ తాలూకు సిసలైన ప్రభావమేమిటో అర్థం కాదు. ఒకవేళ పాచిక పారి, రాయ్‌బరేలీలోనే కాక యూపీ అంతటా రాహుల్‌ ప్రభావం కనిపిస్తే రాజకీయాలు మళ్ళీ మలుపు తిరుగుతాయి. హస్తం పార్టీ ఆశ కూడా అదే! 

Lok sabha elections 2024: PM Narendra Modi, Amit Shah to Cast Vote in Ahmedabad
Lok Sabha Election 2024: మోదీ, షా కంచుకోటలో... కాంగ్రెస్‌కు పెనుసవాల్‌

దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో శుక్రవారం మూడో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. కీలకమైన రాష్ట్రం గుజరాత్‌లో మొత్తం స్థానాలకూ ఇదే విడతలో పోలింగ్‌ జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాల సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో గత రెండు ఎన్నికల్లోనూ బీజేపీ క్లీన్‌స్వీప్‌చేసింది. అదే ఊపులో ఈసారి హ్యాట్రిక్‌పై కన్నేసింది. లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ రాష్ట్రంలో అంతకంతకూ చిక్కిపోతున్న కాంగ్రెస్‌ ఈసారి ఆప్‌తో కలిసి ‘ఇండియా’ కూటమి కింద బీజేపీని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో గుజరాత్‌లోని కీలక లోక్‌సభ స్థానాలపై ఫోకస్‌...                  వదోదర... కొత్త ముఖాలు గుజరాత్‌లో మూడో అతి పెద్ద నగరమిది. ఇక్కడ వరుసగా రెండు ఎన్నికల్లో బంపర్‌ మెజారిటీతో గెలుపొందిన రంజన్‌బెన్‌ ధనంజయ్‌ భట్‌ను బీజేపీ అనూహ్యంగా పక్కనబెట్టింది. డాక్టర్‌ హేమంగ్‌ జోషీని పార్టీ బరిలో నిలిపింది. కాంగ్రెస్‌ తరఫున పధియార్‌ జస్పాల్‌సింగ్‌ మహేంద్రసింగ్‌ పోటీలో ఉన్నారు. వీరిద్దరూ కొత్తవారే కావడం విశేషం. ఈ సీటు 1998 నుంచి బీజేపీ గుప్పిట్లోనే ఉంది. మోదీ ఫ్యాక్టర్, అభివృద్ధి నినాదంతో మరోసారి నెగ్గుతామని కమలనాథులు ధీమాగా ఉన్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ 7 సెగ్మెంట్లలో 6 బీజేపీ ఖాతాలోనే పడ్డాయి. మిగతా చోట స్వతంత్ర అభ్యర్థి నెగ్గారు. 2014లో మోదీ లోక్‌సభ అరంగేట్రం వారణాసి, వదోదరల నుంచే జరగడం తెలిసిందే. ఇక్కడ ఆయనకు ఏకంగా 5.7 లక్షల మెజారిటీ లభించింది. వారణాసి నుంచి ఎంపీగా కొనసాగి వదోదరను వదులుకున్నారు. రాజ్‌కోట్‌... రూపాలాకు రాజ్‌పుత్‌ గండం గుజరాత్‌లో ఎదురే లేని కమలనాథులకు కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా కొత్త చిక్కులు తెచ్చిపెట్టారు. సిట్టింగ్‌ ఎంపీ మోహన్‌ కుందరియాను కాదని బీజేపీ ఆయనకు టికెటిచి్చంది. కానీ ‘మహారాజులు బ్రిటి‹Ùవారికి, విదేశీ పాలకులకు లొంగిపోయారని, వారితో విందువినోదాల్లో మునగడమే గాక వాళ్లకు తమ కుమార్తెలనిచ్చి పెళ్లిళ్లు చేశా’రని రాజ్‌పుత్‌లపై రూపాలా చేసిన వ్యాఖ్యలతో ఆ సామాజికవర్గం భగ్గుమంది. ఆయన్ను రాజ్‌కోట్‌ బరి నుంచి తప్పించాలని, లేదంటే ఓడించి తీరుతామని బీజేపీకి వారు అలి్టమేటమిచ్చారు! ఆందోళనలు కూడా చేశారు. రూపాలా పలుమార్లు క్షమాపణలు చెప్పినా వివాదం సద్దుమణగలేదు. ఇక్కడ కాంగ్రెస్‌ నుంచి పరేశ్‌బాయ్‌ ధనాని పోటీలో ఉన్నారు. రాజ్‌పుత్‌లు, పటీదార్లు, మధ్య ఎప్పటినుంచో వైరముంది. పటీదార్‌ సామాజికవర్గానికి చెందిన రూపాలా దానికిలా ఆజ్యం పోయడం తమకు కలిసొస్తుందని కాంగ్రెస్‌ ఆశలు పెట్టుకుంది.భావనగర్‌.. బరిలో ఆప్‌ ఈ స్థానంపై ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్నేసింది. కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా భావనగర్, బరుచ్‌లను ఆ పార్టీ దక్కించుకుంది. ఇక్కడ గట్టి పట్టున్న బీజేపీని ఢీకొట్టేందుకు ఉమేశ్‌బాయ్‌ నరన్‌బాయ్‌ మక్వానాను పోటీకి దించింది. బీజేపీ కూడా సిట్టింగ్‌ ఎంపీ భారతీబెన్‌ ధీరూబాయ్‌ శియాల్‌ను పక్కనబెట్టి నింబూబెన్‌ బంభానియాకు టికెటిచి్చంది. 1991 నుంచీ ఇక్కడ కాషాయ జెండానే ఎగురుతోంది. గత ఎన్నికల్లో భారతీబెన్‌కు 4.29 లక్షల మెజారిటీ లభించింది. ఈ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరు బీజేపీ చేతిలోనే ఉన్నాయి. మిగతా స్థానం ఆప్‌ది కావడం విశేషం. గత అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసి 5 సీట్లు నెగ్గిన ఆప్‌ లోక్‌సభ బరిలో బీజేపీకి సవాలు విసురుతోంది. మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్‌ను అక్రమంగా అరెస్టు చేశారంటూ ప్రచారంతో హోరెత్తిస్తోంది. కేజ్రీవాల్‌ భార్య సునీత కూడా ప్రచారానికి దిగారు.  పోర్‌బందర్‌.. మన్‌సుఖ్‌ అరంగేట్రం బీజేపీకి గట్టి పట్టున్న ఈ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తొలిసారి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. 2012 నుంచీ రాజ్యసభకు ఎన్నికవుతున్న ఆయన పోటీతో పోర్‌బందర్‌పై ఆసక్తి నెలకొంది. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రమేశ్‌బాయ్‌ ధడక్‌ చేతిలో 2.3 లక్షల ఓట్ల తేడాతో ఓడిన లలిత్‌ వసోయాకే కాంగ్రెస్‌ మళ్లీ టికెటిచి్చంది. ఈ స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో ఆరు బీజేపీ చేతిలోనే ఉన్నాయి. కుతియానాలో మాత్రం సమాజ్‌వాదీ పార్టీ గెలిచింది.  బనస్కాంత.. గెనీబెన్‌ సవాల్‌ ఉత్తర గుజరాత్‌లోని ఈ స్థానంలో బీజేపీకి గట్టి పోటీ ఎదురవుతోంది. ‘వావ్‌’ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గెనీబెన్‌ ఠాకోర్‌ను కాంగ్రెస్‌ బరిలోకి దించడమే అందుకు కారణం. దాంతో బీజేపీ కూడా సిట్టింగ్‌ ఎంపీ పర్వత్‌బాయ్‌ పటేల్‌ను కాదని ఇంజనీరింగ్‌ ప్రొఫెసర్‌ రేఖా బెన్‌ చౌదరి రూపంలో మహిళకే టికెటివ్వాల్సి వచ్చింది. ఆమెకు రాజకీయ అనుభవం లేదు. తొలిసారి ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. గుజరాత్‌లో ఇరు పారీ్టల నుంచీ మహిళలే రంగంలో ఉన్న ఏకైక సీటు కావడంతో బనస్కాంత అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. దీని పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నాలుగు చోట్ల గెలిచింది. అయితే గెనీబెన్‌ కమలం హవాలో కూడా విజయం సాధించి ‘వావ్‌’ అనిపించారు. రేఖాబెన్‌కు రాజకీయ అనుభవం లేకున్నా నియోజకవర్గంతో సత్సబంధాలున్నాయి. బనస్‌ డెయిరీ ఈ నియోజకవర్గంలోని 4.5 లక్షల మంది రైతుల నుంచి రోజూ పాలు సేకరిస్తుంది. దీని వ్యవస్థాపకుడు గల్బాబాయ్‌ చౌదరి మనుమరాలు రేఖ. ఆమె భర్త హితేశ్‌ చౌదరి బీజేపీ నాయకుడు. అయినా గెనీబెన్‌ వంటి బలమైన ప్రత్యరి్థపై రేఖ వంటి కొత్త ముఖాన్ని నిలబెట్టడంపై బీజేపీ కార్యకర్తల్లోనూ అసంతృప్తి నెలకొందని పార్టీ వర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి!గాంధీనగర్‌.. అద్వానీ కోటలో షా పాగా! ఒకప్పుడు కాంగ్రెస్‌ కంచుకోటైన ఈ నియోజకవర్గం 1989 నుంచి కమలనాథుల గుప్పిట్లోనే ఉంది. శంకర్‌ సింఘ్‌ వాఘేలా, అటల్‌ బిహారీ వాజ్‌పేయి, ఎల్‌కే అద్వానీ వంటి హేమాహేమీలకు నెలవైన ఈ స్థానంలో కేంద్ర హోం మంత్రి, బీజేపీ దిగ్గజం అమిత్‌ షా పాగా వేశారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా 5,57,014 ఓట్ల మెజారిటీతో విజయ ఢంకా మోగించారు. ఈసారి మెజారిటీ మరింత పెంచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయన్ను ఢీకొట్టేందుకు కాంగ్రెస్‌ అభ్యర్థులను వెతుక్కోవాల్సిన పరిస్థితి! చివరకు 62 ఏళ్ల సోనల్‌ పటేల్‌ను రంగంలోకి దించింది. ఆమె ఏఐసీసీ సెక్రటరీగా. ముంబై, పశి్చమ మహారాష్ట్ర ఇన్‌చార్జిగా ఉన్నారు. గిఫ్ట్‌ సిటీ అభివృద్ధి, గాంధీ సబర్మతి ఆశ్రమానికి మెరుగులు, అయోధ్య రామ మందిరం, మోదీ ఫ్యాక్టర్‌ తదితరాలతో తనకు తిరుగులేదని షా ధీమాతో ఉన్నారు. గాం«దీనగర్‌ పరిధిలోని మొత్తం 7 అసెంబ్లీ స్థానాలూ బీజేపీవే! సీఎం భూపేంద్ర పటేల్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న ఘట్లోడియా కూడా వాటిలో ఒకటి.– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

సోమవారం నిజామాబాద్‌లో నిర్వహించిన రోడ్‌షోలో మాట్లాడుతున్న బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌
‘రైతుబంధు’ వచ్చింది.. పిడికిలి బిగిస్తేనే! : కేసీఆర్‌

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: ఆరు గ్యారంటీల పేరిట కాంగ్రెస్‌ అరచేతిలో వైకుంఠం చూపిస్తోందని.. హామీలు అమలు చేయకుండా తప్పించుకోవాలని చూస్తోందని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. కేసీఆర్‌ పిడికిలి బిగించి నిలదీయడంతోనే.. కాంగ్రెస్‌ సర్కారుకు దెబ్బకు దెయ్యం వదిలి రైతుల ఖాతాల్లో రైతుబంధు (రైతు భరోసా) డబ్బులు వేసిందని చెప్పారు. ఇక రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ కోసం పిడికిలి బిగించి పోరాటం చేస్తామని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మెడలు వంచి హామీలన్నీ అమలు చేసేలా చేయాలంటే బీఆర్‌ఎస్‌ ఎంపీలు గెలవాల్సిందేనన్నారు. 12–14 సీట్లలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. సోమవారం నిజామాబాద్‌ జిల్లాలోని కమ్మర్‌పల్లి, మోర్తాడ్, ఆర్మూర్, నిజామాబాద్‌లలో కేసీఆర్‌ బస్సుయాత్ర నిర్వహించారు. నిజామాబాద్‌ నగరంలో రోడ్‌ షో నిర్వహించి.. నెహ్రూ పార్క్‌ వద్ద కార్నర్‌ మీటింగ్‌లో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..  ‘‘రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఐదు నెలలుగా ఆరు గ్యారంటీల పేరిట మోసం చేస్తూ వస్తోంది. అరచేతిలో వైకుంఠం చూపుతోంది. కాంగ్రెస్‌ అసమర్థ పాలన కారణంగా మళ్లీ రాష్ట్రంలో చేనేతల ఆత్మహత్యలు మొదలయ్యాయి. దేవుళ్ల కాడ ఒట్లు.. కేసీఆర్‌ మీద తిట్లు.. అనే పాలసీతో సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. అంతకుమించి చేస్తున్నదేమీ లేదు. రేవంత్‌ ప్రభుత్వం వచ్చాక ఫీజు రీయింబర్స్‌మెంట్, అంబేడ్కర్‌ ఓవర్సీస్, సీఎంఆర్‌ఎఫ్, కేసీఆర్‌ కిట్లు.. వంటివన్నీ ఆగిపోయాయి. కరెంటు సరిగా రావడం లేదు.. మిషన్‌ భగీరథ నీళ్లు రావడం లేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక పంటలన్నీ ఎండబెట్టింది. గోదావరి నీళ్లను మోదీ వేరే రాష్ట్రాలకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటే సీఎం రేవంత్‌ అడ్డుకోలేకపోతున్నారు. బీఆర్‌ఎస్‌కు అండగా నిలవాలి.. కేసీఆర్‌ పిడికిలి బిగించి నిలదీయడంతోనే దెబ్బకు దెయ్యం వదిలి రైతుబంధు డబ్బులు ఖాతాల్లో వేశారు. అయినా రైతుబంధుకు 5 ఎకరాలకే కటాఫ్‌ పెట్టడం ఏమిటి? 6, 7 ఎకరాలున్న రైతులు బతకొద్దా? ఇక రూ.2 లక్షల రుణమాఫీ కోసం పిడికిలి బిగించి పోరాటం చేస్తాం. కాంగ్రెస్‌ ప్రభుత్వం మెడలు వంచి ఆరు గ్యారంటీలు అమలు చేసేలా చేయాలంటే బీఆర్‌ఎస్‌ ఎంపీలు గెలవాల్సిందే. తెలంగాణ శక్తి, తెలంగాణ గళం, తెలంగాణ బలం బీఆర్‌ఎస్సే. 12–14 సీట్లలో బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలి. బీడీ కార్మికులకు పింఛన్లు ఇచ్చేది ఒక్క తెలంగాణలో మా త్రమే.  మోదీ పింఛన్లు ఇవ్వలేదు. బీడీ కార్మీకులంతా బీఆర్‌ఎస్‌కు అండగా నిలబడాలి. కేంద్రంలో వచ్చేది ప్రాంతీయ పార్టీల ప్రభుత్వమేబీజేపీకి 400 సీట్లు వస్తాయని మోదీ గొప్పగా చెప్తున్నారు. కానీ 200లోపే సీట్లు వస్తాయి. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు రావు. కేంద్రంలో వచ్చేది ప్రాంతీయ పార్టీల ప్రభుత్వమే. బీజేపీ, కాంగ్రెస్‌ రెండూ కుమ్మక్కయ్యాయి. అందుకే పరస్పరం బలహీన అభ్యర్థులను నిలబెట్టుకున్నాయి. సబ్‌కా సాథ్‌ సబ్‌కా వికాస్‌ అంటున్న నరేంద్ర మోదీ... దేశంలో 157 మెడికల్‌ కళాశాలలు ఇస్తే తెలంగాణకు ఒక్కటి కూడా ఎందుకు ఇవ్వలేదు? ఒక్క నవోదయ పాఠశాల సైతం ఇవ్వలేదేం? ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానన్న మోదీ.. ఏం చేశారు? తెలంగాణకు ఏమీ చేయని మోదీకి ఎందుకు ఓటెయ్యాలి? నేను ప్రాణాలకు తెగించి కొట్లాడి తెలంగాణ తెచ్చిన. యావత్‌ తెలంగాణకు కేసీఆర్‌ ఆత్మబంధువు. నేను కూడా హిందువునే. కానీ మత విద్వేషాలు రెచ్చగొట్టవద్దన్నదే నా అభిమతం. నేను ప్రధాని మోదీని నిలదీసినందుకే.. నా కుమార్తె కవితను జైల్లో పెట్టారు. అయినప్పటికీ లొంగిపోయే ప్రసక్తే లేదు. గులాబీ జెండాను గుండెలో పెట్టుకోవాలి యువత ఆవేశంగా ఓట్లు వేయకుండా ఆలో చించి ఓట్లేసి బీఆర్‌ఎస్‌ను గెలిపించాలి. విద్యు త్, రైతుబంధు సరిగా రావాలన్నా.. మన గోదావరి నీళ్లు మనకే దక్కాలన్నా.. పార్లమెంటులో తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడాలన్నా.. బీఆర్‌ఎస్‌ ఎంపీలు గెలవాలి. ప్రజల మంచి కోసం పేగులు తెగేదాకా కొట్లాడతాం. గులాబీ జెండాను గుండెల్లో పెట్టుకోవాలి..’’ అని కేసీఆర్‌ పిలుపునిచ్చారు.రాకేశ్‌ రెడ్డికి ఎమ్మెల్సీ బీఫాం ఇచ్చిన కేసీఆర్‌నిజామాబాద్‌ నాగారం: వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజక వర్గం నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏనుగుల రాకేశ్‌ రెడ్డికి బీఫాంను స్వయంగా పార్టీ అధినేత కేసీఆర్‌ సోమవారం రాత్రి నిజామాబాద్‌లో అందజేశారు. నగరంలో రోడ్‌ షో ముగిసిన అనంతరం కేసీఆర్‌ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా నివాసంలో బస చేశారు. ఈ సందర్భంగా బీఫాం అందజేసిన కేసీఆర్‌కు రాకేశ్‌ రెడ్డి పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కేఆర్‌ సురేశ్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, నాయకులు మహేశ్‌ బిగాల, రాజారాం యాదవ్‌ పాల్గొన్నారు.కేసీఆర్‌ వాహనాన్ని తనిఖీ చేసిన అధికారులుజగిత్యాల క్రైం: ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న కేసీఆర్‌.. సోమవారం సాయంత్రం జగిత్యాల నుంచి కోరుట్లకు వెళ్తుండగా చల్‌గల్‌ గ్రామశివారులో ఎన్నికల అధికారులు ఆయన బస్సును, ఇతర వాహనాలను తనిఖీ చేశారు. తనిఖీల్లో ఏమీ లభించలేదని వారు ప్రకటించారు.  

Gudivada Amarnath Reaction On Modi Meeting At Vizag
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్‌

సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు స్క్రిప్ట్‌ మొత్తం ప్రధాని నరేంద్ర మోదీ చదివారని మండిపడ్డారు మంత్రి గుడివాడ అమర్నాథ్‌. ఐదేళ్ల పాటు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై మాట్లాడని మోదీ ఇప్పుడు మాట్లాడడం వారి అమాయకత్వానికి నిదర్శనమని అన్నారు. మోదీ ఆరోపణలు ఖండిస్తున్నామని చెప్పారు. వైఎస్సార్‌సీపీ హయంలో జరిగిన అభివృద్ధి గతంలో ఎన్నడు జరగలేదని స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబుపై మోదీ తీవ్రమైన విమర్శలు చేశారని అమర్నాథ్‌ ప్రస్తావించారు. పోలవరాన్ని ఏటీఎం లా చంద్రబాబు మార్చుకున్నారని మోదీ విమర్శించారని గుర్తు చేశారు. బాబే కాదు మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారని మండిపడ్డారు. ఎన్నికల అవసరాల కోసం అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సెంటిమెంట్ ప్రకారం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెనక్కి తీసుకుంటారని ఆశించినట్లు చెప్పారు. స్టీల్ ప్లాంట్ ఊసు కూడా మోదీ ప్రస్తావించలేదని అన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మోదీ మాట్లాడితే పోటీ నుంచి తప్పుకుంటానని ప్రకటించినట్లు తెలిపారు. రాజకీయ అవసరాల కోసం వెళ్తున్న కూటమిని ప్రజలు ఓడించాలని పిలుపునిచ్చారు.‘చంద్రబాబు ప్రెస్టేషన్‌లో మాట్లాడుతున్నారు. తనకు అధికారం రాదని తెలిసి నోటికొచ్చినట్లు మాట్లాడుతూన్నారు. రాబోయే రోజుల్లో ఎవరికి ఎవరు మొగుడు అవుతారో చంద్రబాబుకు తెలుస్తుంది. ల్యాండ్ టైపింగ్ యాక్ట్‌ను అసెంబ్లీలో స్వాగతించింది టీడీపీ. రైల్వే జోన్‌కు సంబంధించి ఇప్పటికే భూములను అధికారులు అప్పగించారు. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అబద్ధాలు మాట్లాడ్డం తగదు’ అని పేర్కొన్నారు.చంద్రబాబు ఫ్రస్టేషన్‌లో మతి బ్రమించి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు వైవీ సుబ్బారెడ్డి. బాబు, పవన్ సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడుతున్నారని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయమని ఎన్డీఏ ప్రభుత్వమే చెప్పిందని గుర్తుచేశారు. హక్కు దారులకు మేలు చేయడానికే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేదలకు భూములు ఇచ్చేవాడే కాని లాక్కునే వాడు కాదని, అందుకే 31లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారని తెలిపారు.అమరావతి పేరుతో చంద్రబాబు భూములు లాక్కున్నారు. పేదలు ఎవరూ వీరి తప్పుడు ప్రచారన్ని నమ్మద్దు. పింఛన్లను అడ్డుకొని లబ్ధిదారుల మరణానికి కారణం అయ్యారు. కూటమిలో చేరిన తరువాత బీజేపీ తీరులో మార్పు వచ్చింది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పాలనపై కేంద్రం ఆధీనంలో ఉండే నీతి అయోగ్ ప్రశంసించింది. చంద్రబాబు, పవన్ ఇచ్చిన స్క్రిప్ట్ మోీదీ చదివారు.పోలవరంను ఏటీఏంలా వాడుకున్నారని నాడు మోదీ అన్నారు. పోలవరం ఆలస్యానికి చంద్రబాబే కారణం. పోలవరం నిర్మాణం పూర్తి చేస్తాం. బాబు విడుదల చేసిన మేనిఫెస్టోలో భాగస్వామ్యం ఉందని బీజేపీ ఎందుకు చెప్పలేకపోతుంది.? స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం కోసం వైఎస్సార్‌సీపీ కట్టుబడి ఉంది. ప్రధాని మాట్లాడలేదు సరే.. బాబు అయినా తన స్టాండ్ చెప్పాలి’ అని అన్నారు.

Suryakumar Yadav smashes century,  Mumbai Beat Srh by 7 wickets
సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్‌ఆర్‌హెచ్‌పై ముంబై విజయం

ఐపీఎల్‌-2024లో వ‌రుస ఓట‌ముల‌ను చవిచూసిన ముంబై ఇండియ‌న్స్ తిరిగి పుంజుకుంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ ఘన విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై కేవలం 3 వికెట్లు కోల్పోయి 17.2 ఓవర్లలో  చేధించింది.  కాగా లక్ష్య చేధనలో ముంబై 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో మిడిలార్డర్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. సూర్య తన హోం గ్రౌండ్‌లో విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లను ఊచకోత కోశాడు. ఓవైపు గాయంతో బాధపడుతూనే ముంబై ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. సూర్య కేవలం 51 బంతుల్లోనే 12 ఫోర్లు, 6 సిక్స్‌లతో 102 పరుగులతో ఆజేయంగా నిలిచి తన జట్టుకు అద్బుతమైన విజయాన్ని అందించాడు. అతడితో పాటు తిలక్‌ వర్మ(37నాటౌట్‌) పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌, మార్కో జానెసన్‌, కమ్మిన్స్‌ తలా వికెట్‌ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్‌కు దిగిన ఎస్‌ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లలో​ ఓపెనర్ ట్రావిస్ హెడ్‌(48) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ఆఖరిలో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 17 బంతులు ఎదుర్కొన్న కమ్మిన్స్ 2 సిక్స్‌లు, 2 ఫోర్లతో 35 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. వీరిద్దరితో పాటు నితీష్ రెడ్డి(20), జానెసన్(17) రాణించారు. ఇక ముంబై బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా, చావ్లా తలా మూడు వికెట్లు సాధించగా.. అన్షుల్ కాంబోజ్, బుమ్రా చెరో వికెట్ సాధించారు.

TDP Former Minister List of Irregularities: Andhra pradesh
అక్రమాలు కో‘కొల్లు’లు

విజయవాడ: కృష్ణాజిల్లాలోని తీరప్రాంత ముఖ్య పట్టణానికి ప్రాతినిధ్యం వహించిన ఆ టీడీపీ నేత అక్రమాలు కోకొల్లలు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంత్రి పదవీ వెలగబెట్టిన ఆయన హయాంలో ప్రజలు మౌలిక వసతులు లేక నరకం అనుభవించారు. గుక్కెడునీటికీ అంగలార్చారు. కానీ ఆయన మాత్రం భారీగా అక్రమాస్తులు మూటగట్టారు. మామ ద్వారా వసూళ్ల దందా సాగించారు. సెటిల్‌మెంట్లు చేశారు.  ప్రభుత్వ స్థలాలూ కాజేశారు. అవినీతి సొమ్ముతో విజయవాడతో పాటు తీరప్రాంత మండలాలు, హైదరాబాద్‌లలో రూ.కోట్ల విలువ చేసే స్థలాలు కొన్నారు.   ఎక్సైజ్‌లో భారీగా దోపిడీ ∗ ఎక్సైజ్‌ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో బదిలీలు, పదోన్నతుల ప్రక్రియలో భారీగా దండుకున్నారు. ఒక్కో బదిలీకి రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం. మంత్రిగా ఉన్న రెండేళ్లలోనే రూ.60 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు దోపిడీకి పాల్పడ్డారు. లిక్కర్‌ దందా నడిపారు.  ∗ భీమవరంలో భార్యాభర్తల మ్యూచువల్‌ బదిలీ కోసం దాదాపు రూ.40 లక్షలు తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.  ∗ ఎక్సైజ్‌ శాఖలో డిజిటలైజేషన్‌ నిమిత్తం కాంట్రాక్టర్‌ నుంచి రూ.5 కోట్లు నాటి ప్రభుత్వ పెద్దలకు అందాయి. ఆ కాంట్రాక్టర్‌ నుంచి మాజీ మంత్రి రూ.2 కోట్లు తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి.  ఎక్సైజ్‌ స్టేషన్ల నుంచి నెలవారీ మామూళ్లూ వసూలు చేశారని సమాచారం.  ∗ ఇసుక రవాణాలోనూ వసూళ్ల దందాకు పాల్పడ్డారు. ఈ తంతు మొత్తం మాజీ మంత్రి అనుచరుడు దగ్గరుండి నడిపించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆయన అండతో ముఖ్యపట్టణంలో తెలుగు తమ్ముళ్లు భూ కబ్జాలకు పాల్పడ్డారు. ప్లాట్లుగా వేసి స్థలాలు అమ్ముకున్నారు. రూ.కోట్లకు పడగలెత్తారు.  ∗ సొంత రైసు మిల్లును అడ్డుపెట్టుకుని ధాన్యం కొనుగోళ్లలో అక్రమ దందాకు పాల్పడ్డారు. రూ.3 కోట్ల వరకు ఇలా బొక్కేసినట్టు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలన్న డిమాండూ ప్రతిపక్షాల నుంచి వినిపించింది.  ∗ కరకట్ట, చల్లపల్లి బైపార్‌ రోడ్డు, విజయవాడ – మచిలీపట్నం హైవే నిర్మాణ పనులకు సంబంధించిన మట్టి (బుసక) సరఫరాలో నాలుగున్నరేళ్లలో రూ.వందల కోట్లు మింగారు.  పొక్లెయిన్‌ బుజ్జీని బినామీగా పెట్టి కథ నడిపించారు. నిబంధనలకు విరుద్ధంగా చెరువులు తవ్వి వచి్చన మట్టిని నిర్మాణాలకు విక్రయించి భారీగా సొమ్ము చేసుకున్నారు.   ∗  ప్రభుత్వ పథకాల మంజూరులోనూ భారీ వసూళ్లకు తెరతీశారు. సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీకి కమీషన్లు వసూలు చేసి తన కక్కుర్తి బుద్ధిని చాటుకున్నారు. రైతు రథం పంపిణీ,  అదనపు తరగతుల నిర్మాణాల్లోనూ గడ్డికరిచినట్టు ఆరోపణలు ఉన్నాయి.   ∗ బినామీల పేరుతో కాల్‌మనీ వ్యవహారం నడిపించి రూ.1.50 కోట్లు దండుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి.   ∗ రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని ఓ అభ్యర్థి వద్ద రూ.5 లక్షలు వసూలు చేశారని సమాచారం. ఉద్యోగం రాకపోవడంతో ఆ అభ్యర్థి ప్రశి్నస్తే రూ.3 లక్షలు బీసీ కార్పొరేషన్‌ ద్వారా లోన్‌ ఇప్పిస్తానని నచ్చజెప్పినట్లు సమాచారం. ∗ ముఖ్యపట్టణంలో డివైడర్‌ గ్రిల్‌ పనుల్లోనూ అవకతవకలకు పాల్పడ్డారు. బీచ్‌ ఫెస్టివల్, పోర్టు పనులు ప్రారంభం విషయంలో చంద్రబాబు పర్యటనలోనూ భారీగా వెనకేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మున్సిపల్‌ కార్యాలయ భవన నిర్మాణంలోనూ భారీగా కమీషన్లు దండుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.  ∗ ఒక్కో వాటర్‌ ట్యాంక్‌ రూ.5 కోట్లతో 7 ట్యాంకుల నిర్మాణం చేపట్టారు. ఒక్కో ట్యాంకుకు 10 శాతం చొప్పున రూ.3.50 కోట్లు దండుకున్నట్లు తెలిసింది. ∗ రైల్వే గేట్‌ నుంచి మంగినపూడి బీచ్‌ వరకు రూ.14 కోట్లతో చేపట్టిన రోడ్డు పనుల్లో 10 శాతం వాటా కింద రూ.1.40 కోట్లు వసూలు చేశారు. గుట్కా విక్రయదారుల వద్ద అక్రమ వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి.  ∗ జాతీయ తుపాను విపత్తుల నివారణ పథకం కింద రూ.36.45 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులతో మచిలీపట్నం నుంచి కృత్తివెన్ను మండల సమీపం వరకు 18.6 కిలోమీటర్ల మేర చేపట్టిన కరకట్ట నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలిచ్చారు. అనతి కాలంలో ఆ కరకట్ట బాగా దెబ్బతింది.   ∗ మంత్రి రాజకీయ గురువు కూడా ఈ అక్రమాల్లో భాగం పంచుకున్నారు. తన పరిశ్రమలో నకిలీ ఎరువులు తయారు చేసి, వాటిని రైతులకు కట్టబెట్టి రూ.లక్షలు కొల్లగొట్టారు. ఈ విషయం అప్పట్లో దుమారం రేపింది. విజిలెన్స్‌ అధికారులు దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి. హత్య సహా 25 కేసులు     ఈ మాజీ మంత్రి 2020 జూలై 27న మచిలీపట్నం చేపల మార్కెట్‌లో జరిగిన వైఎస్సార్‌ సీపీ నాయకుడు మోకా భాస్కరరావు హత్య కేసులో ఏ–4 నిందితుడిగా ఉన్నారు. క్రైం నంబర్‌ 192/2020తో  120 బీ, 302 ఐపీసీ 109 రెడ్‌ విత్‌ 34, 37 ఐపీసీ సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదైంది. ఆయన పరారు కావడంతో పోలీసు ప్రత్యేక బృందం గాలించి అదుపులోకి తీసుకుంది. రెండు నెలల పాటు రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఆయన రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. కేసు ఇప్పటికీ నడుస్తోంది. ఈయనపై 2009 నుంచి ఇప్పటి వరకు హత్య, ఎస్సీ, ఎస్టీ కేసులతోపాటు మొత్తం 25 కేసులు నమోదయ్యాయి. అందులో 12 కేసుల నుంచి తన పలుకుబడి ఉపమోగించి బయటపడ్డారు. మిగిలినవి విచారణ దశలో ఉన్నాయి.  

తనిష్క్ జ్యువెలరీ నెక్లెస్‌
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్

ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన,  భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్‌ల నుండి ప్రేరణ పొంది  అద్భుతమైన మరియు వైవిధ్యమైన  శ్రేణి సమకాలీన,  రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్‌లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్‌లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్‌లు,  కస్టమర్‌లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా,  ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్‌ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్‌ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్,  ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం  వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్‌లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్‌గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్‌లెట్‌లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్‌లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్‌లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్‌డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్‌లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్  18కేరట్  మరియు 22కేరట్  బంగారంలో విస్తృతమైన శ్రేణి  డిజైన్‌లతో,  నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని  సంపూర్ణం  చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్‌లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన  సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను  అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా  కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్‌లెట్‌లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.

తప్పక చదవండి

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement

ఫోటో స్టోరీస్

View all