Top Stories
ప్రధాన వార్తలు
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)
కూటమి అంటేనే ఎలపరమబ్బా....
అసలు చేయితగిలితేనే ఒప్పుకోని మనిషి కాలు తగిల్తే ఊరుకుంటుందా ? అసలే ఊరుకోదు... ఇల్లుపీకి పందిరిస్తుంది.. ఊరంతా గాయి గత్తర చేస్తుంది. బీజేపీ పరిస్థితి కూడా అలాగే ఉంది... మ్యానిఫెస్టోలో చంద్రబాబు బాటు పక్కనే తన ఫోటో ఉంచితేనే వద్దన్నా ప్రధాని మోడీ ఇప్పుడు చంద్రబాబు... పవన్ తో కలిసి ప్రచారం చేస్తారా? చేయనే చేయరు. వాస్తవానికి టీడీపీ జనసేన...బీజేపీల ఉమ్మడి మ్యానిఫెస్టో మొన్న విడుదల చేసారు. వాస్తవానికి మూడు పార్టీలు కలిసి ఉమ్మడిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నపుడు... సీట్లు కూడా పంచుకుని మరీ బరిలోకి దిగుతున్నపుడు మ్యానిఫెస్టోలో కూడా మూడుపార్టీల ఫోటోలు ఉండాలి.కానీ దీనికి బిజెపి పెద్దలు నో అన్నారని, అందుకే మోడీ పేరు, ఫోటో లేకుండానే కేవలం చంద్రబాబు, పవన్ ఫొటోలతో మ్యానిఫెస్టో విడుదల చేసారు.. ఆ మ్యానిఫెస్టోతో తమకు సంబంధం లేదని, దాని అమలు అనేది వాళ్లదే బాధ్యత అని బీజేపీ తేల్చేసింది. ఇక ఇప్పుడు ఎన్నికల ప్రచారం అనేది తుది అంకానికి చేరిన తరుణంలో మోడీ మరోమారు ఆంధ్రాలో ప్రచారానికి వస్తున్నారు. గతంలో వచ్చి పవన్, చంద్రబాబులతో కలిసి చిలకలూరిపేటలో బహిరంగ సభలో మాట్లాడారు. అప్పుడు కూడా మా ఎన్డీయేను గెలిపించండి అన్నారు తప్ప మాటవరసకు ఐన జగన్‌ను విమర్శించలేదు... బాబును నెత్తికి ఎత్తుకుని గెలిపించాలని ప్రజలను కోరలేదు. వాస్తవానికి బీజేపీ ఆంధ్రాలో ఆరు లోక్‌సభ ...పది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది.ఇప్పుడు మళ్ళీ మోదీ రెండోవిడత ప్రచారానికి వస్తున్నారు., ఇందులో భాగంగా 7, 8 తేదీల్లో ఏపీలో ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ వస్తున్నారు. ఏదో తేదీన పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పోటీ చేస్తున్న రాజమండ్రి నియియోజకవర్గంలో ని వేమగిరిలో బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు. ఆ తరువాత అదేరోజు సాయంత్రం సీఎం రమేష్ ఎంపీగా పోటీ చేస్తున్న అనకాపల్లి పరిధిలోని రాజుపాలెం సభలో పాల్గొంటారు. 8న సాయంత్రం కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్న రాజంపేట లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని పీలేరులో పాల్గొంటారు... ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు... అదేరోజు రాత్రి రాత్రి 7 గంటలకు విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకు రోడ్‌షో నిర్వహిస్తారు. ఇక్కడ విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారువాస్తవానికి ఈ కార్యక్రమాలకు కూటమి భాగస్వాములు అయిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ సైతం హాజరవ్వాలి... కానీ మోడీ తీరు, బిజెపి విధానం చూస్తుంటే అసలు వాళ్లతో మాట్లాడేందుకు సైతం ఇష్టపడుతున్నట్లు కనిపించడం లేదు.. ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో పొత్తుపెట్టుకున్నాం తప్ప మాకు వాళ్ళిద్దరంటేనే చిరాకు.. చూస్తుంటేనే ఎలపరం వస్తోంది అన్నట్లుగా ఉన్నారు.. అందుకే ఈ ప్రచార సభల్లో టీడీపీ, జనసేన నేతలు పాల్గొనే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది. మోడీ కూడా కేవలం తమ అభ్యర్థులు పోటీ చేస్తున్న చోటనే ప్రచారం చేసేలా టూర్ షెడ్యూల్ రూపొందించారు..-సిమ్మాదిరప్పన్న
బీఆర్ఎస్కు మరో షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక చెల్లదని కోర్టు తీర్పు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్‌కు ఊహించని షాక్ తగిలింది. విఠల్ ఎన్నికపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ఈ క్రమంలో ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక చెల్లదని కోర్టు తీర్పును వెల్లడించింది.కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా దండె విఠల్ ఎన్నికపై కాంగ్రెస్ నేత పాతిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే విఠల్‌కు రూ.50వేలు జరిమానా కూడా విధించింది.అయితే, 2022లో ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా దండె విఠల్ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో తాను నామినేషన్ విత్ డ్రా చేయలేదని.. తన సంతకాలు ఫోర్జరీ చేశారని రాజేశ్వర్ రెడ్డి ఎన్నికల అనంతరం పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పిటిషన్లో విఠల్ ఎన్నిక చెల్లదంటూ ప్రకటించాలని కోర్టును కోరారు. ఇదే సమయంలో ఫోర్జరీని తేల్చేందుకు పత్రాలను కేంద్ర ఫోరెన్సిక్ లేబొరేటరికీ పంపించాలని కోరారు. అనంతరం దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం.. విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ నేడు తీర్పు వెల్లడించింది. మరోవైపు.. విఠల్ లాయర్ అభ్యర్థనతో తీర్పును కోర్టు.. నాలుగు వారాలు సస్పెండ్ చేసింది.
గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
టీమిండియా తరఫున రెండు ప్రపంచకప్‌లు గెలిచిన జట్లలో భాగమైన గౌతం గంభీర్.. ఐపీఎల్‌లోనూ తనదైన ముద్ర వేశాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌కు చాలా కాలం పాటు ప్రాతినిథ్యం వహించిన ఈ మాజీ ఓపెనర్ ఎన్నో రికార్డులు సాధించాడు.అంతేకాదు కెప్టెన్‌గా కేకేఆర్‌ను రెండుసార్లు చాంపియన్‌గా నిలిపాడు. 2012, 2014 సీజన్లలో ట్రోఫీ గెలిచి సత్తా చాటాడు గంభీర్. ఆ తర్వాత ఢిల్లీ ఫ్రాంఛైజీకి మారినా కెరీర్ సాఫీగా సాగకపోవడంతో ఆటకు వీడ్కోలు పలికాడు గౌతీ.ఈ క్రమంలో గతేడాది లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా వ్యవహరించిన ఈ బీజేపీ ఎంపీ.. తాజా ఎడిషన్‌లో మళ్లీ కేకేఆర్ గూటికి చేరాడు. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని జట్టుకు మెంటార్‌గా ఉన్నాడు.ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడిన గౌతం గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్లో తనకు నిద్రలేని రాత్రులు మిగిల్చిన ఆటగాడి పేరు ఈ సందర్భంగా వెల్లడించాడు.‘‘క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ కాదు... ఐపీఎల్లో కెప్టెన్‌గా ఉన్నపుడు నన్ను భయపెట్టిన ఒకే ఒక్క బ్యాటర్ రోహిత్ శర్మ. అతడు బరిలో ఉన్నాడంటే ప్లాన్ ఏ, ప్లాన్ బీ, ప్లాన్ సీ కూడా సిద్ధం చేసి పెట్టుకోవాలి.ఎందుకంటే రోహిత్ శర్మను ఆపడం ఎవరితరం కాదు. అందుకే అతడి కోసం తప్ప మరే ఇతర బ్యాటర్ కోసం కూడా నేను ఇన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకోలేదు. ఒక్కోసారి రాత్రుళ్లు నిద్రపోకుండా మరీ వ్యూహాలు రచించిన సందర్భాలు ఉన్నాయి’’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు.కాగా ఐపీఎల్-2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో కేకేఆర్ శుక్రవారం తలపడనున్న తరుణంలో ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా ప్రస్తుత సీజన్లో కేకేఆర్ ఆడిన తొమ్మిదింట గెలిచి రెండో స్థానంలో ఉండగా.. ముంబై పదింట కేవలం మూడు గెలిచి తొమ్మిదో స్థానంలో కొట్టుమిట్టాడుతోంది.Game recognises game 🙌🏽"The only batsman I feared in IPL was @ImRo45", @GautamGambhir praises the Indian captain's batting prowess! 😳Will he lead #TeamIndia to glory in the #T20WorldCup2024?📺 | #MIvKKR | TODAY, 6:30 PM | #IPLOnStar pic.twitter.com/eEav5GbKG5— Star Sports (@StarSportsIndia) May 3, 2024
జరుగుతున్నది క్యాస్ట్ వార్ కాదు.. క్లాస్ వార్: సీఎం జగన్
సాక్షి, నరసాపురం: చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి ఒక్క మంచి పనైనా చేశారా అని ప్రశ్నించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలాగే, చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పథకమైనా గుర్తుకు వస్తుందా?. రాష్ట్రంలో జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదు.. క్లాస్ వార్ అని అన్నారు. కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ నరసాపురంలో రోడ్ షో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ కామెంట్స్..పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపే. చంద్రబాబుకు ఓటేస్తే చంద్రముఖిని తలుపు తట్టి లేపడమే. 14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు ఒక్క మంచి పని అయినా చేశారా?. టీడీపీ పాలనలో ఏనాడైనా ఇలాంటి పథకాలు అమలు చేశాడా?. చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేశానని చెప్పుకుంటారు. చంద్రబాబును నమ్మడమంటే కొండ చిలువ నోట్లు తలపెట్టినట్టే. మరో పది రోజల్లో కురుక్షేత్ర యుద్ధం జరుగబోతుంది. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటి భవిష్యత్ పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. మీ బిడ్డ పాలనలో అవ్వాతాతలకు ఇంటికే రూ.3వేల పెన్షన్. బాబు పాలనలో ఇంటికే పెన్షన్ వచ్చే పరిస్థితి ఏనాడైనా కనబడిందా?. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం, బైజూస్ కంటెంట్. ఇంగ్లీష్ మీడియంతో అడుగులు సీబీఎస్సీ నుంచి ఐబీ వరకు కనపడుతుంది. ఆరో తరగతి నుంచే క్లాస్‌రూమ్‌లో డిజిటల్ బోధన అందుతోంది. ప్రభుత్వ స్కూల్స్ విద్యార్ధులకు బైలింగువల్ టెక్ట్స్ బుక్స్. రాష్ట్రంలో ఉన్న 93 శాతం పిల్లలకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్. జగనన్న విద్యాదీనెన, వసతి దీవెన మీ బిడ్డ పాలనలోనే వచ్చింది. ప్రభుత్వ కాలేజీల్లో అంతర్జాతీయ విద్యా కోర్సులు తెచ్చాం. మీ బిడ్డ జగన్.. అక్కాచెల్లెమ్మలకు తోడుగా నిలబడ్డాడు. అక్కాచెల్లెమ్మలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దాం. ఆసరా, సున్నావడ్డీ, చేయూతతో అక్కాచెల్లెమ్మలను ఆదుకున్నాం. అక్కాచెల్లెమ్మల కోసం కాపు నేస్తం, ఈబీసీ నేస్తం తీసుకొచ్చాం. 31లక్షల ఇళ్లపట్టాలు అక్కాచెల్లెమ్మలకు ఇచ్చాం. రైతులకు పగటిపూటే తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. సకాలంలో ఇన్పుట్ సబ్సిబీ అందిస్తున్నాం. విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్నకు తోడుగా నిలిచాం. ప్రతీ రంగంలోనూ విప్లవం తీసుకువచ్చాం. పేదవాడి వైద్యం కోసం రూ.25లక్షల వరకు ఆరోగ్యశ్రీని విస్తరించాం. పేషంట్ విశ్రాంతి సమయంలోనూ ఆర్థిక సాయం అందించాం. ఆరోగ్య ఆసరా, ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్‌ల ద్వారా పేదవాడిని ఆదుకున్నాం. నాడు-నేడుతో ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మార్చాం. జగనన్న తోడు, జగనన్న చేదోడు ద్వారా చిరు వ్యాపారులకు సాయం అందించాం. గ్రామ సచివాలయాల ద్వారా గ్రామ స్వరాజ్యం తెచ్చాం. రూ.2లక్షల 70వేల కోట్లు నేరుగా పేదల ఖాతాల్లో వేశాం. రెండు లక్షల 31వేల ఉద్యోగాలిచ్చాం. చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా?. రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?. రూ.87వేల కోట్ల రుణాలు మాఫీ అన్నాడు.. చేశాడా?.డ్వాక్రా రుణాలు రద్దు చేస్తానన్నాడు.. చేశాడా?. రాష్ట్రంలో జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదు.. క్లాస్ వార్. మళ్లీ ఇదే కూటమి కొత్త కొత్త మోసాలతో వస్తోంది. ఇంటింటికి కేజీ బంగారం, బెంజ్ కారు ఇస్తారంట.. నమ్ముతారా?. వాలంటీర్ల సేవలు కొనసాగాలంటే రెండు బటన్లు ఫ్యాన్ గుర్తుకే నొక్కాలి. పేదవాడి భవిష్యత్ కోసం రెండు బటన్లు ఫ్యాన్ గుర్తుకే నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ, 25కు 25 ఎంపీ సీట్లు గెలవాల్సిందే. మంచి చేసిన ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ సింక్‌లోనే ఉండాలి అని కామెంట్స్ చేశారు.
భారత కంపెనీపై ‘టెస్లా’ ఫిర్యాదు.. ఏం జరిగిందంటే..
గురుగ్రామ్‌లోని టెస్లా పవర్ ఇండియా అనధికారికంగా తమ ట్రేడ్‌మార్క్‌ను వాడుకుంటోందని ఎలొన్‌మస్క్ ఆధ్వర్యంలోని టెస్లా ఇంక్ గురువారం దిల్లీ హైకోర్టులో ఫిర్యాదు చేసింది. టెస్లా పవర్.. టెస్లా ఇంక్ ట్రేడ్‌మార్క్‌ను ఉపయోగించకుండా చర్యలు తీసుకోవాలని సంస్థ తరఫు న్యాయవాది చందర్ లాల్ కోర్టును అభ్యర్థించారు.‘గురుగ్రామ్ ఆధారిత కంపెనీ టెస్లా పవర్ ఇండియా.. టెస్లా ఇంక్ ట్రేడ్‌మార్క్‌ను ఉపయోగించడం వల్ల వినియోగదారుల్లో గందరగోళం ఏర్పడుతోంది. కంపెనీ వ్యాపారాలపై కూడా దాని ప్రభావం పడుతోంది. టెస్లా పవర్ బ్యాటరీలకు సంబంధించిన ఫిర్యాదులను తమ వినియోగదారులు పొరపాటుగా టెస్లా ఇంక్‌తో లింక్ చేస్తున్నారు. ఆ ఫిర్యాదులను నేరుగా అమెరికన్ కంపెనీకి ఫార్వర్డ్ చేస్తున్నారు. టెస్లా పవర్ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీగా జాతీయ వార్తాపత్రికల్లో అమెరికన్ కంపెనీ లోగోతో ప్రచారం చేసింది. టెస్లా పవర్ ‘టెస్లా’ ట్రేడ్‌మార్క్ వినియోగానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలి’ అని చందర్లాల్ వాదనలు వినిపించారు.టెస్లా పవర్ ఈవీ బ్యాటరీలను ఉత్పత్తి చేయదని సంప్రదాయ వాహనాలు, ఇన్వర్టర్లలో ఉపయోగించే లెడ్ యాసిడ్ బ్యాటరీలను విక్రయిస్తుందని వాదించింది. ఈ సందర్భంగా కంపెనీ ఛైర్మన్ కవీందర్ ఖురానా మాట్లాడుతూ..తమ కంపెనీకి యూఎస్‌లో భాగస్వామ్య సంస్థ ఉందన్నారు. అయితే తాము ఎలాంటి ఈవీను తయారుచేయమని స్పష్టం చేశారు. ఈవీ మార్కెట్లోకి ప్రవేశించే ఉద్దేశం తమ కంపెనీకి లేదని ఖురానా చెప్పారు. తాము మరో సంస్థ ‘ఈ-అశ్వ’తో కలిసి ప్రకటన ఇచ్చినట్లు పేర్కొన్నారు. టెస్లా పవర్ బ్రాండెడ్ ఉత్పత్తుల విక్రయానికి ఈ కంపెనీతో వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందన్నారు.ఇదీ చదవండి: భారత్‌లో ఎలక్ట్రానిక్స్ తయారీ పెంచేలా ఏం చేస్తున్నారంటే..ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ అనిష్ దయాల్ టెస్లా పవర్‌కి నోటీసు జారీ చేశారు. తదుపరి విచారణను మే 22 తేదీకి వాయిదా వేశారు. టెస్లా ఇంక్‌ను పోలి ఉండే ట్రేడ్‌మార్క్‌తో ఎలాంటి ప్రచార ప్రకటనలను విడుదల చేయకూడదని ఆదేశించారు. అయితే, టెస్లా ఇంక్ ఈ కేసులో ఎలాంటి ఎమర్జెన్సీను ప్రదర్శించలేదని తెలిసింది. 2020 నుంచి ఇరు కంపెనీల మధ్య సంప్రదింపులు సాగుతున్నట్లు సమాచారం.
రాయ్‌బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
రాయ్‌బరేలీ, అమేథీ.. ప్రస్తుతం ఈ రెండు ఈ స్థానాలపైనే అందరి దృష్టి నెలకొంది. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా నిలిచిన స్థానాల్లో నేడు ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించడమే ఇందుకు కారణం..రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తుండగా.. అమేథీ నుంచి పార్టీ సినియర్ నేత కేఎల్ శర్మ బరిలో దిపింది కాంగ్రెస్ అధిష్టానం. తొలుత రాయ్‌బరేలీ నుంచి ప్రియాంకగాంధీ పోటీలో నిలుస్తారని వార్తలు వచ్చాయి. తన సిటింగ్ స్థానం వయనాడ్ నుంచి పోటీకి దిగిన రాహుల్.. అమేథీ నుంచి కూడా బరిలో ఉంటారని ప్రచారం జరిగింది. కానీ అలా జరగలేదు దీంతో ప్రియాంక గాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో ఎంట్రీపై సస్పెన్స్ నెలకొంది. కాగా ప్రియాంకను రాయ్‌బరేలీ లేదా అమేథీ నుంచి పోటీ చేయాలని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కోరినట్లు సమాచారం. కానీ అందుకు ఆమె అయిష్టత చూపినట్లు తెలుస్తోంది. అయితే ప్రియాంక నో చెప్పడానికి ఆమె సోదరుడు రాహుల్, తల్లి సోనియా గాంధే కారణంగా సంబంధిత వర్గాలు తెలిపాయి. గాంధీ కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు పార్లమెంటులో అడుగుపెట్టడం వల్ల.. వారసత్వ రాజకీయాల పేరుతో బీజేపీ చేస్తున్న ఆరోపణలు బలోపేతం చేసినట్లు అవుతుందని ప్రియాంక భావించినట్లు పార్టీ వర్గాల సమాచారం.చదవండి:Amethi: స్మృతి ఇరానీపై కేఎల్ శర్మ పోటీ.. ఎవరీయన?మరోవైపు ప్రియాంక నిర్ణయంపై ఓటర్లలో ప్రతికూల అభిప్రాయం ఏర్పడుతుందని పార్టీకి చెందిన నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఆమె లోక్‌సభ ఎన్నికలకు విస్త్రృత ప్రచారం చేస్తున్నారు. ప్రధాని మోదీ, కాంగ్రెస్‌పై చేస్తున్న విమర్శలను ఆమె గట్టిగా తిప్పికొడుతున్నారు. ముఖ్యంగా మోదీ వ్యాఖ్యలకు కౌంటర్లు ఇస్తున్నారు. ఈ క్రమంలో ఆమె ఎన్నికల్లో పోటీ చేస్తే కాంగ్రెస్‌కు లాభం చేకూరేదని భావిస్తున్నారు.వరుసగా మూడుసార్లు అమేథీ నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించిన రాహుల్.. 2019 ఎన్నికల్లో మాత్రం బీజేపీ నుంచి స్మృతి ఇరానీ చేతిలో ఓటమి చెందారు. కేరళలోని వయనాడు నుంచి ఎంపీగా గెలవడంతో పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఈసారి కూడా వయనాడ్ నుంచి మళ్లీ బరిలోకి దిగారు. దీంతోపాటు అమేథీ నుంచి పోటీ చేస్తారని అనుకుంటే రయ్బరేలీ నుంచి రంగంలోకి దిగి ట్విస్ట్ ఇచ్చారు.అమేథీ నుంచి గాంధీ కుటుంబానికి విధేయుడైన కిషోరీలాల్శర్మను ఎంపిక చేసింది పార్టీ. ఇంతకుముందు రాయ్‌బరేలీలో సోనియా గాంధీ ప్రతినిధిగా పనిచేసిన శర్మ మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. నేడు రాహుల్, శర్మ నామినేషన్ దాఖలు చేయనున్నారు. మే 20న అమేథీ, రాయ్‌బరేలీ లోక్‌సభ ఎన్నికల్లో ఐదో దశ పోలింగ్ జరగనుంది.రాయ్‌బరేలీలో బీజేపీకి చెందిన దినేష్ ప్రతాప్ సింగ్‌తో గాంధీ తలపడనున్నారు. అమేథీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో శర్మ పోటీపడనున్నారు. రాయ్‌బరేలీలో రాహుల్ అఖండ విజయం సాధిస్తారని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అమేథీలోమ అట్టడుగు వర్గాలకు చెందిన శర్మ తప్పక గెలుస్తారని చెబుతున్నారు.
AP Election Updates May 3rd: ఏపీ ఎన్నికల అప్డేట్స్
Andhra Pradesh Election Updates 3rd May..175కి 175 అసెంబ్లీ, 25కు 25 ఎంపీ స్థానాలు ఒక్కటి కూడా తగ్గడానికి వీల్లేదు: సీఎం జగన్ ట్వీట్వాలంటీర్లు మళ్లీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్తు మారాలన్నా, లంచాలు, వివక్షలేని పాలన కొనసాగాలన్నా ప్రతి ఒక్కరూ రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. 175కి 175 అసెంబ్లీ స్థానాలు, 25కి 25 ఎంపీ స్థానాలు ఒక్కటి కూడా తగ్గడానికి వీల్లేదు. వచ్చే ఎన్నికల్లో మన @YSRCParty అభ్యర్థులను… pic.twitter.com/srQcYkFPcd— YS Jagan Mohan Reddy (@ysjagan) May 3, 2024 3:40 PM, May 3rd, 2024కృష్ణాజిల్లా:మచిలీపట్నంలో వైఎస్సార్సీపీ అభ్యర్ధి పేర్ని కిట్టు ప్రచార కార్యక్రమంలో టీడీపీ, జనసేన అల్లరిమూకల దాడిదాడి ఘటన లో జనసేన నాయకుడు కర్రి మహేష్‌తో పాటు మరో ముగ్గురి పై అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు3:00 PM, May 3rd, 2024కృష్ణాజిల్లా :గన్నవరంలో టీడీపీకి మరో షాక్.గన్నవరం మండల టీడీపీ మహిళా విభాగం వైస్ ప్రెసిడెంట్ మోదుగుమూడి రాజేశ్వరితో పాటు మరో 30 మంది మహిళా కార్యకర్తలు వైసీపీలో చేరిక.పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన వల్లభనేని వంశీ.2:59 PM, May 3rd, 2024వైఎస్సార్సీపీలో చేరిన జనసేన గుంటూరు నగర అధ్యక్షుడునరసరావుపేట లోక్‌సభ స్థానంలోని పెదకూరపాడు నియోజకవర్గంలో సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభ సందర్భంగా వైఎస్సార్సీపీలో చేరిన జనసేన గుంటూరు నగర అధ్యక్షుడు నేరెళ్ళ సురేష్ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన నేరెళ్ల సురేష్2:58 PM, May 3rd, 2024కృష్ణాజిల్లాఅవనిగడ్డ మండలం పాతఎడ్లంకలో వైఎస్సార్సీపీ ఆత్మీయ సమావేశంపాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్ధి సింహాద్రి రమేష్ బాబు, కుమారుడు వికాస్ బాబుసమావేశానికి భారీగా హాజరైన గ్రామస్తులుసింహాద్రి రమేష్ బాబు ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీలో చేరిన పాత ఎడ్లంక గ్రామానికి చెందిన 100 కుటుంబాలువారికి వైఎస్సార్సీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు2:53 PM, May 3rd, 2024విజయవాడబెజవాడ బార్ అసోసియేషన్ లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఆత్మీయ సమావేశంతూర్పు, పశ్చిమ, సెంట్రల్ అభ్యర్థులు అవినాష్, ఆసిఫ్, వెల్లంపల్లికి మద్దతు తెలిపిన న్యాయవాదులుతమ సంక్షేమం కోసం సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాల పట్ల న్యాయవాదుల హర్షం2:51 PM, May 3rd, 2024తిరుపతి జిల్లా:పిచ్చాటూరు సచివాలయం పరిధిలో వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామాఎంపీడీఓ కార్యాలయానికి వాలంటీర్లు చేరుకొని తమ రాజీనామా పత్రాలను ఏఓ రాధా రాణికి సమర్పించారు.ప్రజలకు అంకిత భావంతో సేవలు అందిస్తున్న తమను తెలుగుదేశం, జనసేన పార్టీలు తమను కించపరిచే విధంగా మాట్లాడడం జీర్ణించుకోలేక తాము రాజీనామా నిర్ణయం తీసుకున్నాం..వాలంటీర్లుజగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడానికే తాము రాజీనామా చేస్తున్నట్లు ప్రకటననరసాపురం రోడ్ షోలో సీఎం జగన్ కామెంట్స్..1:00 PM, May 3rd, 2024పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపే. చంద్రబాబుకు ఓటేస్తే చంద్రముఖిని తలుపు తట్టి లేపడమే. 14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు ఒక్క మంచి పని అయినా చేశారా?. టీడీపీ పాలనలో ఏనాడైనా ఇలాంటి పథకాలు అమలు చేశాడా?. చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేశానని చెప్పుకుంటారు. చంద్రబాబును నమ్మడమంటే కొండ చిలువ నోట్లు తలపెట్టినట్టే.మరో పది రోజల్లో కురుక్షేత్ర యుద్ధం జరుగబోతుంది. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి భవిష్యత్ పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. మీ బిడ్డ పాలనలో అవ్వాతాతలకు ఇంటికే రూ.3వేల పెన్షన్. బాబు పాలనలో ఇంటికే పెన్షన్ వచ్చే పరిస్థితి ఏనాడైనా కనబడిందా?.ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం, బైజూస్ కంటెంట్. ఇంగ్లీష్ మీడియంతో అడుగులు సీబీఎస్సీ నుంచి ఐబీ వరకు కనపడుతుంది. ఆరో తరగతి నుంచే క్లాస్‌రూమ్‌లో డిజిటల్ బోధన అందుతోంది. ప్రభుత్వ స్కూల్స్ విద్యార్ధులకు బైలింగువల్ టెక్ట్స్ బుక్స్. రాష్ట్రంలో ఉన్న 93 శాతం పిల్లలకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్. జగనన్న విద్యాదీనెన, వసతి దీవెన మీ బిడ్డ పాలనలోనే వచ్చింది. ప్రభుత్వ కాలేజీల్లో అంతర్జాతీయ విద్యా కోర్సులు తెచ్చాం.మీ బిడ్డ జగన్.. అక్కాచెల్లెమ్మలకు తోడుగా నిలబడ్డాడు. అక్కాచెల్లెమ్మలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దాం. ఆసరా, సున్నావడ్డీ, చేయూతతో అక్కాచెల్లెమ్మలను ఆదుకున్నాం. అక్కాచెల్లెమ్మల కోసం కాపు నేస్తం, ఈబీసీ నేస్తం తీసుకొచ్చాం. 31లక్షల ఇళ్లపట్టాలు అక్కాచెల్లెమ్మలకు ఇచ్చాం. ప్రతీ రంగంలోనూ విప్లవం తీసుకువచ్చాం.రైతులకు పగటిపూటే తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. సకాలంలో ఇన్పుట్ సబ్సిబీ అందిస్తున్నాం. విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్నకు తోడుగా నిలిచాం.పేదవాడి వైద్యం కోసం రూ.25లక్షల వరకు ఆరోగ్యశ్రీని విస్తరించాం. పేషంట్ విశ్రాంతి సమయంలోనూ ఆర్థిక సాయం అందించాం. ఆరోగ్య ఆసరా, ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్‌ల ద్వారా పేదవాడిని ఆదుకున్నాం. నాడు-నేడుతో ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మార్చాం. జగనన్న తోడు, జగనన్న చేదోడు ద్వారా చిరు వ్యాపారులకు సాయం అందించాం. గ్రామ సచివాలయాల ద్వారా గ్రామ స్వరాజ్యం తెచ్చాం. రూ.2లక్షల 70వేల కోట్లు నేరుగా పేదల ఖాతాల్లో వేశాం. రెండు లక్షల 31వేల ఉద్యోగాలిచ్చాం. చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా?. రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?. రూ.87వేల కోట్ల రుణాలు మాఫీ అన్నాడు.. చేశాడా?.డ్వాక్రా రుణాలు రద్దు చేస్తానన్నాడు.. చేశాడా?. రాష్ట్రంలో జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదు.. క్లాస్ వార్. వారిద్దరి వల్లే పెన్షనర్లకు అవస్థలు: మల్లాది విష్ణు12:30 PM, May 3rd, 2024నేటి నుంచి స్టార్ క్యాంపెయినర్లతో ప్రచారానికి పార్టీ పిలుపునిచ్చిందిప్రభుత్వం అందించిన సంక్షేమాన్ని స్టార్ క్యాంపెయినర్లు రాష్ట్రమంతా ప్రచారం చేస్తారుఇంటివద్దకే పెన్షన్‌ను సీఎం జగన్ ఐదేళ్ల పాటు అందించారుచంద్రబాబు దుర్భుద్ధితో పెన్షన్లు అందకుండా చేశాడుఈరోజు పెన్షనర్లు బ్యాంకుల వద్ద నానా అవస్థలు పడుతున్నారుఈ పాపం చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ కుమార్‌లదే. వంగా గీత గెలుపు ఖాయం: నటి శ్యామల11:50 AM, May 3rd, 2024వైఎస్సార్సీపీ నాయకురాలు, సినీ నటి శ్యామలవంగా గీత గెలుపు ఖాయం అయిపోయింది.అంత ఇమేజ్ ఉన్న సినిమా స్టార్ అయితే పవన్ కళ్యాణ్ ఎందుకు మిగితా సినిమా వాళ్ళని తీసుకొస్తున్నారు.చాలా సీనియర్ నాయకురాలు వంగా గీత.ఆమెను ఓడించడం ఎవరి వల్ల కాదు.వంగా గీత ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు వచ్చారో అందరికీ తెలుసు.వంగా గీతకు భారీ మెజారిటీ కోసం నేను కూడా ప్రచారం చేస్తున్నాను.పిఠాపురం ప్రజలు అభివృద్ది చేసే వారికి ఓటు వేయండి.ఆ అభివృద్ది సీఎం జగన్, వంగా గీత వల్లనే సాధ్యం. టీడీపీ నేతల కారణంగానే వృద్దులకు ఇబ్బందులు..10:30 AM, May 3rd, 2024దేవినేని అవినాష్ కామెంట్స్..డివిజన్లోని ప్రతీ గడపలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వానికి బ్రహ్మరథం పడుతున్నారువైఎస్సార్‌సీపీకి ఓటు వేయడానికి సిద్ధం అని ప్రతీ మహిళా చెబుతున్నారుపెన్షన్ కోసం వృద్దుల ఇబ్బందులకు చంద్రబాబు కారణం కాదా?.టీడీపీ నేతల ఫిర్యాదు వలనే నేడు వృద్ధులకు ఇబ్బందులు.ఈనాడును అడ్డుపెట్టుకొని జగన్ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేయడమే టీడీపీ నేతల లక్ష్యంస్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నియోజకవర్గంలో ప్రచారానికి వస్తే ప్రజలు తిరగబడుతున్నారుప్రజలు ఏం తప్పు చేశారని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారుటీడీపీ హయాంలో నియోజకవర్గంలో ప్రతీ కాంట్రాక్టు ఎంఎల్ఏ తమ్ముడు రమేష్‌వే కాంట్రాక్టులుకరకట్ట ప్రాంతంలో కూడా కమ్యూనిటీ హాల్ కట్టింది జగన్ ప్రభుత్వమేరానున్న ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించండి 'జగన్ కోసం సిద్ధం' ప్రారంభం8:30 AM, May 3rd, 2024తాడేపల్లి :రాష్ట్ర వ్యాప్తంగా 'జగన్ కోసం సిద్ధం' ప్రారంభంఇంటింటికీ బూత్ స్థాయి కమిటీల విస్తృత ప్రచారంఐదేళ్లలో సీఎం జగన్ చేసిన మేలును మరోసారి ప్రజలకు వివరిస్తున్న పార్టీ శ్రేణులుపేదలే వైఎస్సార్సీపీ స్టార్ క్యాంపెయినర్లుఇప్పటికే 12 మంది స్టార్ క్యాంపెయినర్లను ఎంపిక చేసిన వైఎస్సార్‌సీపీవారితో కలిసి ఇంటింటికీ మేనిఫెస్టో తీసుకెళ్తున్న పార్టీ బూత్ కమిటీలుపవన్‌కు పిచ్చి పీక్స్‌లో..7:45 AM, May 3rd, 2024పదవి వస్తుందో రాదో అని పవన్‌కళ్యాణ్ నిర్వేదంయువత గుండెల్లో నిప్పంటించడానికే వచ్చా..వైఎస్సార్సీపీ గూండాలను మోకాళ్లపై కొట్టి కూర్చోబెడతా‘నాకు తిక్కరేగితే ముఖ్యమంత్రి అమ్మమొగుడూ గుర్తుకురాడు’ అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలువిశాఖ ఎన్నికల సభలో పవన్‌కళ్యాణ్ హిందూపురంలో రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్..7:25 AM, May 3rd, 2024హిందూపురంలో టీడీపీ నేతల దౌర్జన్యంవైఎస్ జగన్ పాటలు పెట్టారన్న కారణంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడిముగ్గురు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు గాయాలుఆసుపత్రికి తరలింపుటీడీపీ నేతల దౌర్జన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ నేతలు నేడు సీఎం జగన్ ఎన్నికల ప్రచారం ఇలా..7:10 AM, May 3rd, 2024మూడు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్న సీఎం జగన్‌ఉదయం 10 గంటలకు నరసాపురం లోక్‌సభ స్థానం పరిధిలో ప్రచార సభమధ్యాహ్నం 12:30 గంటలకు నరసరావుపేట లోక్‌సభ స్థానంలోని పెదకూరపాడు నియోజకవర్గంలో ప్రచార సభమధ్యాహ్నం మూడు గంటలకు ఒంగోలు లోక్‌సభ స్థానంలోని కనిగిరిలో ప్రచారం. దొరుకుతున్నవన్నీ ‘పచ్చ’ నోట్లే7:00 AM, May 3rd, 2024 కదిరి టీడీపీ అభ్యర్థి వాహనంలో రూ.2 కోట్ల సీజ్‌తూ.గోదావరిలో దొరికిన కట్టల మూలాలూ టీడీపీలోనేలెక్కలు చెప్పలేని డబ్బుతో దొరికిపోయిన మార్గదర్శిబాపట్ల దేశం అభ్యర్థి కంటైనర్లలో భారీగా నగదు పట్టివేతతిరుపతిలో చీరలతో పాటు నోట్లు పంచుతూ దొరికిన ఎల్లో ముఠాబరితెగించి మరీ డబ్బును వరదలా పారిస్తున్న చంద్రబాబుఏకంగా ఈ ఎన్నికల కోసం రూ.13 వేల కోట్లతో భారీ స్కెచ్‌అవినీతి సొమ్ముతో పాటు తన వర్గీయులు, ఎన్నారైల ద్వారా సమీకరణఅసెంబ్లీ సెగ్మెంట్‌కు రూ.75 కోట్ల చొప్పున పంచాలని వ్యూహంమార్గదర్శి, నారాయణ, టీడీపీ నేతల కంపెనీల ద్వారా క్షేత్ర స్థాయికిఓటుకు రూ.5 వేలు ఇవ్వటానికైనా వెనకాడొద్దని నేతలకు హుకుంపంచాయతీ నేతకు రూ.50 లక్షలు.. మండల స్థాయి నేతకు రూ.కోటినియోజకవర్గస్థాయి నేత అయితే రూ.3 కోట్లు; దీనికోసం ప్రత్యేక టీమ్‌పోలీసుల సోదాల్లో దొరికిన ‘పచ్చ’కట్టలు జస్ట్ శాంపిల్ మాత్రమే మోసాల బాబు మరో అబద్ధం..6:50 AM, May 3rd, 2024ప్రతి విద్యార్థికి ఏటా రూ.15 వేలు ఇస్తానంటున్న చంద్రబాబు 2023–24లో రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులు 71,77,637 మంది ఇంటర్ విద్యార్థులు మరో 10,52,221 మంది.. ఈ ఒక్క పథకానికే ఏటా రూ.1,234 వేల కోట్లు అవసరం ఇంత మొత్తం ఇవ్వడం అసాధ్యమంటున్న నిపుణులు ఇక జీఓ–117 రద్దుచేస్తే ప్రభుత్వ విద్య నిర్వీర్యం పాఠశాలల్లో విద్యార్థులకు ఇబ్బందులు తప్పవు ఉపాధ్యాయ పోస్టులను సైతం రద్దుచేసేందుకు ఆస్కారం ఎన్నికల ఏర్పాట్లపై సీఈవో ముఖేష్ కుమార్ మీనా ప్రెస్ మీట్6:40 AM, May 3rd, 2024 రాష్ట్ర వ్యాప్తంగా 4,13,33,702 ఓటర్లు ఉన్నారుపురుషులు- 2,02,74,144, మహిళలు-2,10,56,137దీనికి అదనంగా సర్వీస్ ఓటర్లు 68,185 మంది ఉన్నారురాష్ట్ర వ్యాప్తంగా 46,389 పోలింగ్ బూత్‌లు ఏర్పాటుమోడల్ కోడ్ ఆఫ్ కాండాక్ట్ లపై 864 ఎఫ్ఐఆర్లు నమోదు సీ విజిల్ కి 16,345 ఫిర్యాదులు వచ్చాయికొన్ని చోట్ల హింసాత్మక ఘటనల్లో ఇద్దరు మృతి చెందగా.. 6 మందికి గాయాలుఇప్పటి వరకు 203 కోట్లు విలువైన నగదు, మద్యం సీజ్రాష్ట్ర వ్యాప్తంగా 29,897 పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్.. దాదాపు 64% పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ చేయబోతున్నాం14 నియోజకవర్గాలలో అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్‌తో పాటు పోలింగ్ నిర్వహణకి సెంట్రల్ ఫోర్సెస్ఎండ వేడిమి అధికంగా ఉన్న కారణంగా టెంట్లు, కూలర్లు, తాగునీళ్లు, మెడికల్ కిట్ల వంటి ప్రత్యేక చర్యలు85 ఏళ్ల పైబడిన వృద్దులు, వికలాంగులు తదితరులు ఇంటి దగ్గర వినియోగించుకోవడానికి 7,28,484 మందిలో కేవలం 28,591మంది అంగీకరించారుహైకోర్టు తీర్పు తర్వాత ఏడు ఎంపీ, ఎనిమిది అసెంబ్లీ స్ధానాలలో గాజు గ్లాసు కేటాయించిన అభ్యర్ధులకి వేరే గుర్తులు కేటాయించవలసి వచ్చింది\విశాఖ ఎంపీ స్ధానానికి 33 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్న కారణంగా మూడు ఈవీఎం అవసరమవుతాయితిరుపతి, మంగళగిరిలలో మూడు బ్యాలెట్ యూనిట్లు..మరో 20 నియోజకవర్గాలలో రెండేసి బ్యాలెట్ యూనిట్లు అవసరమవుతున్నాయిఇందుకోసం బెంగుళూరు నుంచి ప్రత్యేకంగా 15 వేల ఈవీఎంలు తెప్పించాంరాష్ట్రంలో 50 మంది జనరల్ అబ్జర్వర్లు, 25 మంది పోలీస్ అబ్జర్వర్లు, 25 పార్లమెంటరీ వ్యయ పరిశీలకులు, అసెంబ్లీ స్ధానాలకి 50 వ్యయ పరిశీలకులు ఉన్నారుపోలీస్ శాఖ రిపోర్ట్ మేరకు 384 ఎమ్మెల్యే, 64 మంది ఎంపి అభ్యర్ధులకి ప్రత్యేక భద్రత కల్పించాంపెన్షన్ల పంపిణీపై కేంద్ర ఎన్నికలకమీషన్ మేరకు కొన్ని ఆదేశాలు జారీ చేశాంబ్యాంకు అకౌంట్లు ఉన్నవారికి డిబిటి ద్వారా....అకౌంట్లు లేని వారికి నేరుగా ఇంటి దగ్గరే పెన్షన్ పంపిణీ జరిగేలా చర్యలు తీసుకున్నాంపెన్షన్ల పంపిణీపై రాజకీయ పార్టీల ప్రచారాలపై నేను స్పందించలేనునామినేషన్ల ఉప సంహరణ తర్వాత తుది అభ్యర్థుల జాబితా సిద్ధం అయ్యిందిఅలాగే ఎన్నికల్లో ఓటు వేయనున్న ఓటర్ల తుది జాబితాను కూడా సిద్ధం చేశాంప్రస్తుతం 4 కోట్ల 14 లక్షల మంది ఓటర్లు ఉన్నారుగతంతో పోలిస్తే 5,94,631 మంది ఓటర్లు పెరిగారుఇక రాష్ట్ర వ్యాప్తంగా అదనం గా పోలింగ్ కేంద్రాలు కూడా పెరిగాయిమొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలు పోలింగ్ కోసం సిద్ధం చేశాంఅలాగే మోడల్ కోడ్ లో భాగం గా విస్తృత తనిఖీలు చేస్తున్నాంఇప్పటి వరకూ 203 కోట్ల రూపాయల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నాంఈసారి 29,897 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ చేస్తాంఅలాగే రాష్ట్రంలోని 14 నియోజక వర్గాల్లో 100శాతం వెబ్ కాస్టింగ్ చేయాలని నిర్ణయించాంమాచర్ల, పెదకూరపాడు ఒంగోలు, అల్లగడ్డ్ , తిరుపతి, చంద్రగిరి, విజయవాడ సెంట్రల్, పుంగనూరు, పలమనేరు, పీలేరు, రాయచోటి, తంబళ్ళపల్లి ల్లలో వంద శాతం వెబ్ కాస్టింగ్ చేస్తున్నాంప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్నాయిఅందుకే పోలింగ్ కేంద్రాల వద్ద నీడ ఉండేలా చర్యలు, మెడికల్ కిట్ లు, ఏర్పాటు చేస్తున్నాంరాష్ట్ర వ్యాప్తంగా 28 వేల మంది హోం ఓటింగ్‌కు సమ్మతి తెలిపారుజనసేన పోటీ చేస్తున్న లోక్ సభా నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు లో గాజు గ్లాసు గుర్తు ఇతరులకు కేటాయింపు లేదుఅలాగే శాసన సభ నియోజక వర్గాల పరిధిలో ఉన్న లోక్ సభ అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును ఎవరికీ ఇవ్వంఇప్పటికే కేటాయించిన 7 లోక్ సభ, 8 శాసన సభ నియోజక వర్గాల్లో గుర్తును మార్పు చేసి ఇతర అభ్యర్థులకు ఇచ్చాంఇవాళ్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హోం ఓటింగ్ మొదలు పెట్టాంపెరిగిన అభ్యర్థుల కారణంగా అదనంగా 15 వేల బ్యాలెట్ యూనిట్ లు అవసరం అయ్యాయి. వీటిని తెప్పించి జిల్లాకు పంపించాం చంద్రబాబు మేనిఫెస్టో అబద్దాల పుట్ట: సజ్జల రామకృష్ణారెడ్డి6:30 AM, May 3rd, 2024 చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో అబద్దాల పుట్ట అని ప్రజలకు తెలుసువైసీపీ బాధ్యతాయుతమైన పార్టీగా వ్యవహరిస్తోందిరాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకుని అమలు చేయగలిగినవే చెప్పాంకోవిడ్ సమయంలో ఆ రెండేళ్లు కూడా ఆగకుండా సంక్షేమం అమలు చేశాంజగన్ అమలు చేస్తున్న సంక్షేమంతో రాష్ట్రం శ్రీలంక అవుతుందని చంద్రబాబు అన్నారుఇప్పుడేమో మళ్ళీ అడ్డగోలుగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటున్నారుగతంలో రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అని చెప్పి నిలువునా మోసం చేశారునిరుద్యోగులకు రూ.3 వేలు, రైతులకు రూ.20 వేలు సహాయం అని మేనిఫెస్టోలో పెట్టారుకానీ అర్హత ఏంటో చెప్పలేదుఅంటే అసలు ఇచ్చే ఉద్దేశం ఉందా? లేదా?1999 లో కూడా కోటి మందికి ఉపాధి అని హామీ ఇచ్చారుకానీ అమలు చేయకుండా ఎగనామం పెట్టారుచంద్రబాబు హయాంలో ఎన్నికలకు రెండు నెలల ముందు వెయ్యి రూపాయలు చేశారుఅదికూడా సరిగా ఇచ్చారా అంటే అదీ లేదువృద్దులు, వికలాంగులకు ఏ ఇబ్బందీ లేకుండా జగన్ వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేశారుఇప్పుడు కోర్టుకు వెళ్లి, ఈసీకి ఫిర్యాదు చేసి వాలంటీర్లను అడ్డుకున్నారుచివరికి బ్యాంకులో పెన్షన్లు వేసేలా ఈసీ ద్వారా చేయించారుబ్యాంకుల దగ్గర పెన్షన్‌దారులు పడుతున్న ఇబ్బందులు చూస్తే బాధ కలుగుతోందిచంద్రబాబు పొరపాటున అధికారంలోకి వస్తే ఎలాంటి నరకం ఉంటుందో ముందే కనపడుతోందివృద్దులు, వికలాంగుల కష్టాలకు పూర్తి పాపం చంద్రబాబుదేవాలంటీర్ల వ్యవస్థను తొలగించి మళ్ళీ జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేస్తారు2019లో ప్రజలు చిత్తుగా ఓడించారన్న కోపం చంద్రబాబుకు ఉందిఅందుకే వారి జీవితాలతో చెలగాటమాడటానికి సిద్ధం అయ్యారుకూటమి మేనిఫెస్టోలో బీజేపీ ఫోటోలు ఎందుకు లేవు?అంటరానితనంగా ఎందుకు వ్యవహరించారు?సిక్కిం, అరుణాచలప్రదేశ్ లో కూటమి మేనిఫెస్టోలో మరి బీజేపీ, మోదీ బొమ్మలు ఎందుకు ఉన్నాయి?చంద్రబాబు హామీలు అమలు చేసేలా లేవని బీజేపీకి అర్థం అయిందిఅందుకే చంద్రబాబు మేనిఫెస్టోతో తమకు సంబంధం లేదని బీజేపీ తేల్చి చెప్పిందిల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద చంద్రబాబు విపరీతంగా అబద్దాలను ప్రచారం చేస్తున్నారుఆ యాక్టును బీజేపీ కేంద్ర ప్రభుత్వమే అమలు చేయాలని చూస్తోందిఆ చట్టం మీద అనుమానాలు ఉంటే దానికి బాధ్యత బీజేపీదేతప్పుడు ప్రచారాలు చేసే చంద్రబాబు అసలు రాజకీయాలకే అనర్హుడుచంద్రబాబు మేనిఫెస్టో బూతుపత్రంల్యాండ్ టైటిల్ యాక్టు మీద బీజేపీ వైఖరి ఏంటో చెప్పాలిబీజేపి రాష్ట్ర నాయకులు దీనిపై ఎందుకు మాట్లాడటం లేదు?చంద్రబాబు లెక్క ప్రకారం దేశంలోని భూములన్నీ మోదీ అమ్మకుంటున్నారా?దీనిపై బీజేపీ రాష్ట్ర, జాతీయ నేతలు క్లారిటీ ఇవ్వాలి
‘నాకు దక్కలేదు.. సంజూ భయ్యాను మాత్రం సెలక్ట్ చేశారు’
‘‘నేను చాలా విషయాల్లో మెరుగుపడాలి. ప్రస్తుతం నేను నా అత్యుత్తమ ఫామ్‌లో లేను. ఒకవేళ ఫామ్‌లో ఉండి ఉంటే గనుక కచ్చితంగా మ్యాచ్‌ను విజయంతో ముగించేవాడిని.నా తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటాను. అవి మళ్లీ పునరావృతం కాకుండా చూసుకుంటాను. ఇది నా అత్యుత్తమ ఇన్నింగ్సేనా అంటే కానేకాదు. ఒకవేళ సెంచరీ చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది.మ్యాచ్‌లో ఓడిపోయిన జట్టుగా మిగిలిపోవడం నిరాశకు గురిచేస్తుంది. ఈరోజు మ్యాచ్‌లో మేము ఆఖరి వరకు పోరాడగలిగాం. ఓటమిని తలచుకుంటూ కూర్చుంటే ముందుకు సాగలేం.రెండు- మూడు ఓవర్లలో చేసిన తప్పుల కారణంగా మ్యాచ్ రూపంలో భారీ మూల్యమే చెల్లించాం. టీ20 అంటేనే ఇలా ఉంటుంది. కాబట్టి తదుపరి మ్యాచ్‌పై దృష్టి సారించే క్రమంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతాం’’ అని రాజస్తాన్ రాయల్స్ యువ బ్యాటర్ రియాన్ పరాగ్ అన్నాడు.కాగా ఐపీఎల్-2024లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో రాజస్తాన్ గురువారం తలపడింది. ఉప్పల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ తొలుత బ్యాటింగ్ చేసింది.నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 201 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన రాజస్తాన్ విజయానికి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయింది. 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 200 పరుగులు మాత్రమే చేయగలిగింది.రియాన్ పరాగ్ ఇన్నింగ్స్ వృథాఆఖరి బంతికి రెండు పరుగులు అవసరమైన వేళ రైజర్స్ సీనియర్ భువనేశ్వర్ కుమార్ రోవ్‌మన్ పావెల్‌ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపడంతో రాజస్తాన్ కథ ముగిసిపోయింది.ఫలితంగా ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ కష్టాల్లో కూరకుపోయి ఉన్నవేళ.. 77 పరుగులతో రాణించిన రియాన్ పరాగ్ ఇన్నింగ్స్ వృథాగా పోయింది. ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం రియాన్ పరాగ్ మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.కాగా వరల్డ్‌కప్-2024కు ప్రకటించిన జట్టులో రిజర్వ్ ప్లేయర్‌గా అయినా పరాగ్‌కు చోటు దక్కుతుందని అతడి అభిమానులు ఆశపడ్డారు. అయితే, బీసీసీఐ మాత్రం 22 ఏళ్ల ఈ అసోం బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌కు అప్పుడే పిలుపునిచ్చేందుకు సిద్ధంగా లేనట్లు స్పష్టం చేసింది. సంజూ భయ్యాకు చోటు దక్కడం సంతోషంఈ నేపథ్యంలో రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. ‘‘గతేడాది అసలు నేను ఐపీఎల్ పోటీలోనే లేను. కానీ ఈసారి నా గురించి ఏవో వదంతులు కూడా వినిపిస్తున్నాయి. నా గురించి అందరూ చర్చించుకునే స్థాయికి వచ్చాను.నా గురించి గళం వినిపిస్తున్న వారికి ధన్యవాదాలు. అయితే, నేను మాత్రం ఇప్పుడే వాటి(టీమిండియాలో చోటు) గురించి ఆలోచించడం లేదు. మా జట్టు నుంచి వరల్డ్‌కప్ టీమ్‌లో చోటు దక్కించుకున్న వారికి అభినందనలు. ముఖ్యంగా సంజూ భయ్యాకు చోటు దక్కడం చాలా చాలా సంతోషంగా ఉంది’’ అని రియాన్ పరాగ్ పరిణతితో కూడిన వ్యాఖ్యలు చేశాడు.ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో 49 బంతుల్లో 77 పరుగులు చేసిన రియాన్ పరాగ్.. ఈ సీజన్లో 409 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఐపీఎల్-2024లో 400 పరుగుల మార్కు అందుకున్న తొలి అన్క్యాప్డ్ ప్లేయర్‌గా నిలిచాడు.చదవండి: SRH: కావ్యా మారన్ వైల్డ్ సెలబ్రేషన్స్.. వీడియో వైరల్
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్
ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన, భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్ల నుండి ప్రేరణ పొంది అద్భుతమైన మరియు వైవిధ్యమైన శ్రేణి సమకాలీన, రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్లు, కస్టమర్లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా, ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్, ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్లెట్లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్ 18కేరట్ మరియు 22కేరట్ బంగారంలో విస్తృతమైన శ్రేణి డిజైన్లతో, నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని సంపూర్ణం చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్లెట్లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.
తప్పక చదవండి
- రాయ్‌బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ‘శబరి’ మూవీ రివ్యూ
- వేసవిలో ఉసిరి తినడం మంచిదేనా..?
- ఆస్పత్రిలో లేడీ కమెడియన్.. కొడుకుని తలుచుకుని ఎమోషనల్
- పవన్, చంద్రబాబుకు ముద్రగడ చురకలు..
- వంగా గీతని ఓడించడం ఎవరి వల్ల కాదు.. పవన్‌పై నటి శ్యామల షాకింగ్ కామెంట్స్
- దొరుకుతున్నవన్నీ ‘పచ్చ’నోట్లే!
- బాబు మార్కు దందా.. బినామీలకే సంపద
- Black Salt Benefits : బ్లాక్ సాల్ట్‌తో ఇన్ని లాభాలా?
- టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు : డిప్యూటీ సీఎం నారాయణస్వామి
- శంషాబాద్: ఆపరేషన్ చిరుత సక్సెస్
- ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
సినిమా
ఆస్పత్రిలో లేడీ కమెడియన్.. కొడుకుని తలుచుకుని ఎమోషనల్
ప్రముఖ లేడీ కమెడియన్ భారతి సింగ్ ఆస్పత్రిలో చేరింది. త్వరలో సర్జరీ కూడా జరగనుందని చెప్పి, అభిమానులకు షాకిచ్చింది. అలానే తన రెండేళ్ల కొడుకుని చాలా మిస్ అవుతానని కన్నీళ్లు పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోని పోస్ట్ చేసింది. ఇంతకీ ఈమెకు ఏమైంది? వీడియోలో ఏం చెప్పింది?హిందీ షోల్లో యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న భారతి సింగ్.. నటుడు హర్ష్‌ని పెళ్లి చేసుకుంది. వీళ్లకు రెండేళ్ల కొడుకు ఉన్నాడు. ప్రస్తుతం యాంకరింగ్ చేస్తూనే మరోవైపు యూట్యూబ్ ఛానెల్లో వీడియోలతో ఎప్పటికప్పుడు ఫాలోవర్స్‌ని అలరిస్తూనే ఉన్నారు. అలాంటిది సడన్‌గా చేతికి సెలైన్ పెట్టుకుని భారతి సింగ్ కనిపించింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'పుష్ప' విలన్ హిట్ సినిమా.. తెలుగులో డైరెక్ట్ రిలీజ్)కొన్నాళ్ల క్రితం తనకు కడుపులో నొప్పిగా అనిపించిందని, అయితే పొట్టలో గ్యాస్ పెరిగిపోయిందని లైట్ తీసుకున్నానని కానీ భరించలేనంత పెయిన్ రావడంతో ఆస్పత్రిలో చేరినట్లు భారతి సింగ్ చెప్పుకొచ్చింది. వైద్య పరీక్షలు చేసిన తర్వాత పిత్తాశయంలో రాళ్లు ఉన్నట్లు తేలిందని పేర్కొంది. త్వరలో తనకు సర్జరీ చేస్తారని క్లారిటీ ఇచ్చింది.హాస్పిటల్లో ఉండటం వల్ల కొడుకుని చాలా మిస్ అవుతున్నానని భారతి సింగ్ చెప్పింది. ఈ క్రమంలోనే కాస్త ఎమోషనల్ అయింది. ఇకపోతే ఈమె త్వరగా కోలుకోవాలని వీడియో దిగువన ఫాలోవర్స్ కామెంట్స్ పెడుతున్నారు.(ఇదీ చదవండి: సినిమా అట్టర్ ఫ్లాప్.. కొత్తిల్లు కొన్న రజనీ కూతురు)
వాళ్లే కావాలని ఎఫైర్స్ అంటగట్టేవారు: స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్
బాలీవుడ్ భామ సోనాలి బింద్రే తెలుగువారికి సైతం సుపరిచితమే. మహేశ్ బాబు సరసన మురారి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ తర్వాత మెగాస్టార్ మూవీ ఇంద్ర, నాగార్జునతో మన్మధుడు చిత్రాలతో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. అయిత 2002లోనే నిర్మాత,వ్యాపార వేత్త అయినా గోల్డీబెల్ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సినిమాలు చేయడం పూర్తిగా తగ్గించేసింది. చివరిసారిగా 2022లో లవ్ యూ హమేశా చిత్రంలో కనిపించింది. 90ల్లో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ ఇటీవల ది బ్రోకెన్ న్యూస్ సీజన్-2తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా అప్పటి నిర్మాతలపై సంచలన కామెంట్స్ చేశారు.సోనాలి బింద్రే మాట్లాడుతూ.. '1994లో నేను ఇండస్ట్రీలోకి వచ్చా. ఇప్పటికంటే అప్పటి పరిస్థితులు చాలా డిఫరెంట్‌గా ఉండేవి. అప్పట్లో సహనటులతో నాపై ఎన్నో రూమర్స్ సృష్టించారు. కానీ వాటిల్లో ఒక్కటంటే ఒక్కటి నిజం లేదు. ఇప్పటికీ ఈ చెత్త ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. 1990ల్లో సినిమా నిర్మాతలే కావాలనే హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్స్ క్రియేట్ చేసేవారు. వాటిని మీడియాకు చెప్పేవాళ్లు. సినిమా ప్రమోషన్స్ కోసం ఈ విధంగా చేసేవారని తెలిసి ఆశ్చర్యపోయా' అని తెలిపారు.అయితే సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన తొలినాళ్లలో సన్నగా ఉన్నందుకు అవహేళన చేసేవారని సోనాలి బింద్రే తెలిపారు. ఆ రోజుల్లో హీరోయిన్లు కాస్తా బొద్దుగా ఉండేవారని పేర్కొన్నారు. నేను సన్నాగా విషయాన్ని కొందరు నిర్మాతలు మొహం మీదే చెప్పేవారని వెల్లడించింది. నేను అలాంటివాటిని పట్టించుకునే దాన్ని కాదని వివరించింది. అంతేకాదు.. ఇండస్ట్రీకి రావాలని ఎప్పుడూ అనుకోలేదని.. నటనలోనూ ఎలాంటి శిక్షణ తీసుకోలేదని.. అసలు స్టార్ హీరోయిన్గా అవుతానని ఊహించలేదని సోనాలి ఆ రోజులను మరోసారి గుర్తుకు తెచ్చుకుంది.
ఓటీటీలోకి 'పుష్ప' విలన్ హిట్ సినిమా.. తెలుగులో డైరెక్ట్ రిలీజ్
మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్.. హీరోగా ఎన్నో సినిమాలు చేశాడు. కానీ 'పుష్ప' విలన్‌గానే తెలుగు ప్రేక్షకులకు పరిచమయ్యాడు. ఎప్పటికప్పుడు డిఫరెంట్ మూవీస్‌తో హిట్స్ కొట్టే ఇతడు.. రీసెంట్‌గానే 'ఆవేశం' మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. దీన్ని తెలుగులోనూ రిలీజ్ చేస్తారనే టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు అవన్నీ కాదన్నట్లు నేరుగా ఓటీటీలోకి తీసుకురాబోతున్నారు. ఇంతకీ ఆ సంగతేంటి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవేంటంటే?)మలయాళంలో ఫహాద్ ఫాజిల్‌కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తున్నాడు. ఈ మధ్య 'ఆవేశం' అనే యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాతో వచ్చాడు. ఇందులో గ్యాంగస్టర్ రంగా అనే పాత్రలో అదరగొట్టేశాడు. ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు కూడా సొంతం చేసుకున్నాడు. అయితే దీన్ని డబ్ చేసి తెలుగులో రిలీజ్ చేస్తారేమో అని కొందరు ప్రేక్షకులు అనుకున్నారు. కానీ ఇప్పుడు డైరెక్ట్‌గా ఓటీటీ రిలీజ్ చేయబోతున్నారు.ఫహాద్ 'ఆవేశం' సినిమా థియేటర్లలో ఏప్రిల్ 11న రిలీజ్ కాగా.. ఇప్పుడు నెలలోనే ఓటీటీలోకి వచ్చేయబోతుంది. డిజిటల్ హక్కుల్ని దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్.. మే 9 నుంచి ఈ మూవీని స్ట్రీమింగ్ చేయబోతుందట. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఇది అందుబాటులోకి రానుందని సమాచారం. (ఇదీ చదవండి: ఎట్టకేలకు ఓటీటీలోకి 'మంజుమ్మల్ బాయ్స్'.. రిలీజ్ డేట్ ఇదే)
సుహాస్ ప్రసన్న వదనం.. మరో హిట్ పడినట్టేనా?
టైటిల్: ప్రసన్న వదనంనటీనటులు: సుహాస్, పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్, నందు, వైవా హర్ష, నితిన్ ప్రసన్న, సాయి శ్వేత, కుశాలిని తదితరులుడైరెక్టర్: అర్జున్ వైకేనిర్మాతలు: మణికంఠ జేఎస్, ప్రసాద్‌రెడ్డి టీఆర్‌సంగీతం: విజయ్ బుల్గానిన్సినిమాటోగ్రఫీ: ఎస్.చంద్రశేఖరన్‌ఎడిటింగ్: కార్తిక్ శ్రీనివాస్విడుదల తేదీ: 03-05-2024టాలీవుడ్లో యంగ్ హీరో సుహాస్ ప్రత్యేక శైలితో దూసుకెళ్తున్నారు. ఫ్యామిలీ డ్రామా, కలర్ ఫోటో, అంబాజీపేట మ్యారేజీ బ్యాండు లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో ప్రేక్షకులకి దగ్గరయ్యాడు. తాజాగా మరోసారి ప్రసన్న వదనం అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చారు. సుకుమార్ వద్ద పని చేసిన అర్జున్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఫేస్ అండ్ బ్లైండ్నెస్ కాన్సెప్ట్ ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది. మరి సరికొత్త కాన్సెప్ట్ వర్కవుట్ అయ్యిందా? కొత్త దర్శకుడితో సుహాస్ ఖాతాలో మరో హిట్ పడిందా? చూసేద్దాం పదండి. అసలు కథేంటంటే...ఓ ప్రమాదంలో తల్లితండ్రులను కోల్పోతాడు సూర్య(సుహాస్). అసలే కష్టాల్లో ఉన్న అతనికి మరో వింత డిజార్డర్ కూడా వస్తుంది. తలకి బలంగా గాయం కావడంతో ఫేస్ బ్లైండ్నెస్ డిజార్డర్ వస్తుంది. అంటే అతను ఎవరినీ గుర్తించలేడు. ఓ ఎఫ్ఎం స్టేషన్లో ఆర్జేగా పని చేస్తున్న సూర్య ఓ అర్ధరాత్రి దారుణమైన ఘటనను ప్రత్యక్షంగా చూస్తాడు. అమృత(సాయి శ్వేత)అనే అమ్మాయిని ఎవరో లారీ కింద తోసేస్తారు. అయితే ఈ ఘటనని ప్రత్యక్షంగా చూసిన సూర్య.. తనకి ఫేస్ బ్లైండ్నెస్ ఉండటం వల్ల ఆ వ్యక్తి ఎవరనేది గుర్తుపట్టలేడు. మరుసటి రోజే అది యాక్సిడెంట్ అని వార్తల్లో వస్తుంది. ఇది చూసిన సూర్య బాధితురాలికి న్యాయం చేయాలని భావించి పోలీసులకు ఫోన్ చేసి అసలు సంగతి చెబుతాడు. ఈ కేసుని ఏసీపీ వైదేహి(రాశి సింగ్) ఎస్ఐ( నితిన్ ప్రసన్న) చాలా సీరియస్‌గా తీసుకుంటారు. అసలు పోలీసులు నిందితున్ని పట్టుకున్నారా? దర్యాప్తులో ఎలాంటి నిజాలు రాబట్టారు? ఫేస్ బ్లైండ్‌నెస్‌తో సూర్య ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు ? అసలు అమృతని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది ? అనేది తెలియాలంటే వెండితెరపై చూడాల్సిందే.ఎలా సాగిందంటే.. ఇలాంటి ఫేస్ బ్లైండ్నెస్ కాన్సెప్ట్‌తో తెలుగులో ఇప్పటివరకూ సినిమాలు రాలేదు. సరికొత్త పాయింట్‌ను తీసుకున్న డైరెక్టర్ అర్జున్ ఆ పాయింట్‌ను అంతే కొత్తగా తెరపై చూపించే ప్రయత్నం చేశారు. అందులో సక్సెస్ అయ్యారు కూడా. సూర్య తల్లితండ్రులు ప్రమాదంలో చనిపోవడం.. సూర్యకి ఫేస్ బ్లైండ్ నెస్ రావడం.. ఆ తర్వాత అతను పడే ఇబ్బందులు, అధ్య(పాయల్ రాధకృష్ణ) రూపంలో ఓ క్యూట్ లవ్ స్టొరీతో కథను ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్లాడు. కథలోకి క్రైమ్ ఎలిమెంట్ వచ్చిన తరవాత వేగం పుంజుకుంటుంది. ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ మాత్రం నిజంగానే బ్లైండ్నెస్ వచ్చేలా చేస్తుంది. అంటే అంతలా సస్పెన్ష్ ఉంటుందన్నమాట.సెకండాఫ్‌కు వచ్చేసరికి కథను మరింత గ్రిప్పింగ్‌గా నడిపించారు డైరెక్టర్. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఆ ట్విస్ట్‌ను ఎవరూ ఊహించలేరు. కథను అంత పకడ్బందీగా రాసుకున్నాడు దర్శకుడు. క్లైమాక్స్ ఈ సినిమాకి మరో హైలెట్‌గా నిలిచింది. అప్పటివరకూ కాస్తా స్లో నేరేషన్ అనిపించినప్పటికీ ఈ కథకు ఇచ్చిన ముగింపు మాత్రం అదిరిపోయింది.ఎవరెలా చేశారంటే...సూర్య పాత్రలో సుహాస్ సహజంగా ఒదిగిపోయాడు .తనదైన నటనలో ఎమోషనల్ సీన్స్‌లో అదరగొట్టేశాడు. యాక్షన్ సీక్వెన్స్‌లోనూ సూపర్బ్ అనిపించాడు. పాయల్ తన అందంతో పాత్రలో ఒదిగిపోయింది. రాశి సింగ్, నితిన్ తమ పాత్రల పరిధి మేర నటించారు. హర్ష, సత్య కామెడీతో అదరగొట్టేశారు. ఓవరాల్‌గా నందుతో పాటు మిగిలిన నటీనటులు తమపాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికత విషయానికొస్తే.. విజయ్ బుల్గానిన్ నేపధ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ ఫరవాలేదు. కార్తిక్ శ్రీనివాస్ ఎడిటింగ్‌లో తన కత్తెరకు కాస్తా పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సంస్థ స్థాయికి తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. ఓవరాల్‌గా తొలి సినిమాతోనే దర్శకుడు అర్జున్ తన మార్క్ చూపించారు.
ఫొటోలు
అకాయ్ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్
Pragya Jaiswal: కలర్‌ఫుల్ డ్రెస్‌లో ప్రగ్యా జైస్వాల్ సమ్మర్ లుక్స్.. ఫోటోలు
Janhvi Kapoor Photos: షార్ట్ డ్రస్‌లో జాన్వీ కపూర్.. చూస్తే మతి పోతుందంతే! (ఫొటోలు)
Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Sonal Chauhan: వైట్ శారీలో బాలీవుడ్ భామ సోనాల్ చౌహాన్ హోయలు.. ఫోటోలు
బిజినెస్
ఎండ దెబ్బతో జేబుకు చిల్లులు! ఆందోళన కలిగిస్తున్న అంచనాలు
ఎండ దెబ్బతో జేబుకు చిల్లులు ఏంటి అనుకుంటున్నారా? దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ నుంచి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి మించి పెరుగుతున్నాయి. ఇవి ఇప్పట్లో తగ్గే అవకాశాల్లేవని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.మానవాళి ఆరోగ్యానికి హాని కలిగిస్తున్న ఈ తీవ్రమైన ఎండలు, ఉష్ణోగ్రతలు వ్యవసాయోత్పత్తిని గణనీయంగా ప్రభావితం చేయగలవని, దీంతో అధిక ద్రవ్యోల్బణానికి దారితీయవచ్చని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. వ్యవసాయ ఉత్పాదకత దెబ్బతిని ద్రవ్యోల్బణం 30-50 బేసిస్ పాయింట్లు పెరుగుతుందని సంకేతాలిస్తున్నారు. సాధారణ రుతుపవనాలు వచ్చే జూన్ వరకు ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.హీట్‌వేవ్ ప్రభావం పాడైపోయే ఆహార వస్తువులు, ముఖ్యంగా కూరగాయలపై ఎక్కువగా ఉంటుందని, ఇది ద్రవ్యోల్బణంపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుందని డీబీఎస్ గ్రూప్ రీసెర్చ్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీనియర్ ఎకనామిస్ట్ అయిన రాధికా రావు ది ఎకనామిక్ టైమ్స్‌తో అన్నారు. ద్రవ్యోల్బణం ప్రభావం 30-50 బేసిస్ పాయింట్ల మధ్య ఉండవచ్చని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న హీట్‌వేవ్ గ్రామీణ వ్యవసాయ ఆదాయం, ఆహార ద్రవ్యోల్బణం, సాధారణ ఆరోగ్య పరిస్థితులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని కేర్ఎడ్జ్ ముఖ్య ఆర్థికవేత్త రజనీ సిన్హా వివరించారు.గడిచిన మార్చిలో వినియోగదారుల ద్రవ్యోల్బణం 10 నెలల కనిష్ట స్థాయికి 4.9 శాతానికి తగ్గింది. కానీ ఆహార ద్రవ్యోల్బణం ఎక్కువగా 8.5 శాతం వద్ద ఉంది. ప్రధానంగా కూరగాయల ధరలు గణనీయంగా పెరగడం వల్ల ఇది 28 శాతం పెరిగింది. కూరగాయల ద్రవ్యోల్బణం వరుసగా ఐదు నెలలుగా రెండంకెల స్థాయిలోనే ఉంది. ఈ త్రైమాసికంలో సగటున 28 శాతం ఉండవచ్చని, అదనంగా, పండ్ల ధరలు కూడా పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. విపరీతమైన వాతావరణ పరిస్థితులలో సరుకు రవాణా సవాళ్లు అస్థిరతను పెంచుతాయని పిరమల్ గ్రూప్ చీఫ్ ఎకనామిస్ట్ దేబోపం చౌధురి అభిప్రాయపడ్డారు.
భారత్‌లో ఎలక్ట్రానిక్స్ తయారీ పెంచేలా ఏం చేస్తున్నారంటే..
భారత్‌లో ఎలక్ట్రానిక్స్ తయారీ పెంచేలా కంపెనీలను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా తమ అవసరాలు తీర్చేలా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులు చెప్పినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది.భారత్‌లో మరిన్ని డిజైన్లను రూపొందించడానికి యాపిల్ వంటి ఎలక్ట్రానిక్స్ తయారీదారులను ప్రోత్సహించే విధానాలను రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అందుకు తమ అవసరాలేమిటో గుర్తించి వాటిని తేర్చేలా కంపెనీలను, పరిశ్రమ వర్గాలను సంప్రదిస్తోంది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (మైటీ) ఇప్పటికే ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) వంటి పరిశ్రమ సంస్థలతో సమావేశాలను నిర్వహించింది. ఈ సంస్థలో యాపిల్ వంటి దిగ్గజ కంపెనీలు సభ్యులుగా ఉన్నాయి.ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీలకు ప్రోత్సాహకాలు అందించడంలో ఎదురయ్యే సాంకేతికపరమైన అంశాలను అధ్యయనం చేసేందుకు ఐటీ మంత్రిత్వ శాఖ కొన్ని ఐఐటీలను కూడా సంప్రదించిందని తెలిసింది. ఎలక్ట్రానిక్స్ సప్లై చెయిన్‌లో స్థానికంగా ఏ భాగాలు రూపొందించబడుతాయి.. ఎలా తయారు చేస్తారు.. దేశీయ విలువ జోడింపును పెంచడానికి ఎలాంటి విధానాలు పాటించాలి అనే అంశాలను గుర్తించడం దీని లక్ష్యం అని ఓ అధికారి తెలిపారు.ఇదీ చదవండి: తగ్గుతున్న ఐఫోన్ విక్రయాలు.. భారత్‌లో ఎలా ఉందంటే..ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కార్యాలయం, ఎలక్ట్రానిక్స్ & ఐటీ మంత్రిత్వ శాఖ తీసుకోబోతున్న ఈ నిర్ణయంతో ప్రపంచ మార్కెట్లో భారత్‌లో తయారవుతున్న ఉత్పత్తులకు గిరాకీ ఎర్పడనుందని ఐసీఈఏ చైర్మన్ పంకజ్ మొహింద్రూ తెలిపారు. గ్లోబల్ లీడ్ కంపెనీలు ఇన్నోవేషన్, డిజైన్, తయారీరంగంలో భారత్‌ను తమ హబ్‌గా ఎంచుకోవడానికి ప్రభుత్వం అనుకూలమైన పాలసీ ఫ్రేమ్‌వర్క్‌ను కలిగి ఉండాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
గరిష్ఠాలను చేరిన మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు శుక్రవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:17 సమయానికి నిఫ్టీ 124 పాయింట్లు లాభపడి 22,778కు చేరింది. సెన్సెక్స్ 430 పాయింట్లు ఎగబాకి 75,050 వద్ద ట్రేడవుతోంది. మార్కెట్ సూచీలు ఆల్‌టైమ్‌హైలో ట్రేడవుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇస్తారని అంచనాలు వస్తున్నాయి. దాంతో సూచీలు రికార్డుస్థాయిలో దూసుకుపోతున్నట్లు తెలుస్తుంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 105.3 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 83.64 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.58 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.91 శాతం లాభపడింది. నాస్డాక్ 1.51 శాతం ఎగబాకింది.ఏప్రిల్ నెలలో జీఎస్టీ వసూళ్లు గరిష్ఠ స్థాయిలో నమోదయ్యాయి. తయారీ సానుకూల గణాంకాలను విడుదల చేసింది. వీటి మద్దతుతో దేశీయ సూచీలు గురువారం లాభాల్లో ముగిశాయి. విదేశీ కొనుగోళ్లు మదుపర్ల సెంటిమెంట్‌ను పెంచాయి. మార్కెట్ అంచనాలకు అనుగుణంగా యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వరుసగా ఆరో సమావేశంలో కీలక వడ్డీరేట్లను 5.25-5.50 శాతం వద్ద స్థిరంగా ఉంచింది. ద్రవ్యోల్బణం రెండు శాతం చేరేంత వరకు వడ్డీరేట్లలో మార్పులు చేయడం సరికాదని భావిస్తున్నట్లు చెప్పారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
తగ్గిన ప్రపంచ నం1 కంపెనీ విక్రయాలు.. భారత్‌లో మాత్రం..
ప్రపంచ నం.1 కంపెనీ యాపిల్ ఐఫోన్ విక్రయాలు తగ్గుతున్నట్లు తెలిసింది. మార్చి 2024తో ముగిసిన త్రైమాసికంలో యాపిల్ ఐఫోన్ విక్రయాలు 10 శాతం తగ్గినట్లు కంపెనీ చెప్పింది. దాంతో కంపెనీ ఆదాయం 4 శాతం క్షీణించిందని చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్ కుక్ తెలిపారు.గడిచిన త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ విక్రయాలు తగ్గుతుంటే ఇండియాలో మాత్రం వీటికి ఆదరణ పెరుగుతుందని చెప్పారు. ఇండియాలో రికార్డు స్థాయిలో విక్రయాలు పెరిగినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇండియాలో యాపిల్ ఉత్పత్తులకు అద్భుతమైన మార్కెట్ ఉంది. భారత్‌లో స్థిరంగా రెండంకెల వృద్ధి నమోదవుతోంది. ఇక్కడ రికార్డుస్థాయిలో విక్రయాలు జరుగుతున్నాయి. ముందుగా కంపెనీ ఆశించినమేరకు అంచనాలను అధిగమిస్తున్నాం’ అని అన్నారు.యాపిల్ సంస్థ ముంబై, దిల్లీలో రెండు అవుట్లెట్లను ప్రారంభించిన విషయం తెలిసిందే. వీటిలో యాపిల్ అమ్మకాలు రోజురోజుకు పెరుగుతున్నట్లు తెలిసింది. ఈ స్టోర్లు ప్రారంభించిన నాటినుంచి నెలవారీ సగటు అమ్మకాలు స్థిరంగా రూ.16 కోట్లు-రూ.17 కోట్లుగా నమోదవుతున్నాయని కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: దిగ్గజ కంపెనీల మధ్య రూ.1.66లక్షల కోట్ల ఒప్పందం.. ఎందుకంటే..ముంబై స్టోర్ యాపిల్ బీకేసీ ఆదాయం దిల్లీ స్టోర్ యాపిల్ సాకెట్ కంటే కొంచెం అధికంగా నమోదవుతోంది. త్వరలో భారత్‌లో మరో మూడు స్టోర్లను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. పుణె, బెంగళూరుతోపాటు దిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో ఈ అవుట్లెట్లను ఏర్పాటు చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. అయితే గతేడాది జూన్‌లో వెలువడిన బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. యాపిల్ తన స్టోర్లను విస్తరించే ఆలోచన లేదని కథనాలు వెలువడ్డాయి. కానీ 2024లో సమకూరిన ఆదాయాల నేపథ్యంలో భారత్‌లో మరిన్ని స్టోర్లను విస్తరించాలని భావిస్తున్నట్లు తెలిసింది.
వీడియోలు
పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్
చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్
వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే
ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"
పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "
సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!
ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్
హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ
Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ
బాబు కుట్రలు..పెన్షన్ కష్టాలు